బాబును మనిషిగా గుర్తించడం లేదు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘‘టీడీపీ అధినేత చంద్రబాబు తీరును, మాటలను చూస్తున్నవారంతా ఆయన్ను మనిషిగానే గుర్తించడం లేదు. ఎవరినైనా తిట్టాలనుకుంటే.. మనిషివా? చంద్రబాబువా? అని తిడ్తున్నరు’’ అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామారావు విమర్శించారు. ఆయన శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ అంటే తెలుగు దళారుల పార్టీగా మారిందని దుయ్యబట్టారు. రాష్ట్రపతిని కలవడానికి బాబు ఒంటరిగా ఎందుకు పోయినట్టు? రాష్ట్రపతితో రహస్యంగా జరిపిన మంతనాలేమిటీ? అని ప్రశ్నించారు. రెండు ప్రాంతాలకు న్యాయం కావాలని అడగడానికి చంద్రబాబు నిజంగానే పోతే ఆయా ప్రాంతాల నాయకులను ఎందుకు వెంట తీసుకుపోలేదని నిలదీశారు.