
నేను పప్పా.. అవినీతిపరుడినా!
పప్పు కామెంట్స్‌పై మంత్రి నారా లోకేష్ స్పందించారు.
ఏదో ఒకటి తేల్చండన్న మంత్రి లోకేశ్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షాలు తనను పప్పు, అవినీతిపరుడని విమర్శిస్తున్నాయని, ఇందులో తాను ఏదో తేల్చి చెప్పాలని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు. మంగళవారం వెలగపూడి సచివాలయం వద్ద ఆయన మీడియాతో ముచ్చటించారు.
తనపై ఎంత దుష్ప్రచారం చేసినా తాను మాత్రం పని చేసి చూపిస్తున్నానన్నారు. మంత్రి పదవి చేపట్టిన నెల రోజుల్లో 1650 ఐటీ ఉద్యోగాలు సృష్టించానన్నారు. అమెరికా పర్యటనకు తాను వెళ్లడంలేదని జీఓ ఎందుకిచ్చారో తెలియదన్నారు.
చదవండి: అమెరికా పర్యటనకు లోకేశ్ దూరం..