
'జగన్ సీఎం కావాలని ప్రజలంతా ఎదురుచూస్తున్నారు'
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రజలంతా ఎదురు చూస్తున్నారని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా తొలుత మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ హయాంలోనే ఉదయగిరి నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. వెనుకబడిన ప్రాతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలంటే వైఎస్ జగన్ అధికారంలోకి రావాల్సిందేనని అన్నారు. అనంతరం మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ రుణమాఫీ లాంటి అబద్ధపు హామీలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ధ్వజమెత్తారు. కరువు, చంద్రబాబు కవల పిల్లలని, చంద్రబాబు అధికారంలోకి వస్తే ప్రజలు ఇబ్బందులు పడాల్సిందేనని దుయ్యబట్టారు. ప్రస్తుతం ప్రజలంతా వైఎస్ జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారని చెప్పారు.