ప్రశాంత్‌ కిషోర్‌ను పరిచయం చేసిన వైఎస్‌ జగన్‌ | YS Jagan introduces prasanth kishore to party cadre in ysrcp plenary | Sakshi
Sakshi News home page

ప్రశాంత్‌ కిషోర్‌ మనతో ఉన్నారు: వైఎస్‌ జగన్‌

Published Sun, Jul 9 2017 4:36 PM | Last Updated on Wed, Jul 25 2018 4:45 PM

YS Jagan introduces prasanth kishore to party cadre in ysrcp plenary

గుంటూరు : ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశాలకు ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ హాజరయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ సందర్భంగా ఆయనను పార్టీ శ్రేణులకు పరిచయం చేశారు. పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ  ఏర్పాటులో కీలకపాత్ర వహించిన ప్రశాంత్‌ కిషోర్‌ను పరిచయం చేస్తూ రానున్న ఎన్నికల నేపథ్యంలో  పార్టీ కోసం ప్రశాంత్‌ కిషోర్‌  సహకారం అందించనున్నారని  తెలిపారు. అందరం కలిసికట్టుగా పార్టీ విజయం కోసం.... శ్రమిద్దామని పిలుపునిచ్చారు.

2014 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీని ప్రధానమంత్రి పదవిలో కూర్చోబెట్టడంలో ప్రశాంత్‌ కిషోర్‌ క్రియాశీలక పాత్ర పోషించారన్నారు. అలాగే బిహార్‌లో నితీశ్‌ కుమార్‌ సీఎం గద్దెనెక్కడానికి, పంజాబ్‌లో విజయం సాధించి కెప్టెన్‌ అమరీంద్ర సింగ్‌ ముఖ్యమంత్రి కావడానికి కూడా ప్రశాంత్‌ కిషోర్‌ కృషి ఉందన్నారు. అయితే ఒక్క ఉత్తరప్రదేశ్‌ లో మాత్రం ఎన్నికల ఫలితాలు అటూ ఇటూగా అయ్యాయని, అయితే అందుకు కారణాలు కూడా అందరికీ తెలుసునని వైఎస్‌ జగన్‌ అన్నారు. ఇప్పుడు ప్రశాంత్‌ కిషోర్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతో ఉంటారని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement