అలనాటి నటి కనకం కన్నుమూత | Yesteryear actress Kanakam passed away | Sakshi
Sakshi News home page

అలనాటి నటి కనకం కన్నుమూత

Published Tue, Jul 21 2015 10:14 AM | Last Updated on Wed, Apr 3 2019 8:58 PM

అలనాటి నటి కనకం కన్నుమూత - Sakshi

అలనాటి నటి కనకం కన్నుమూత

విజయవాడ: అలనాటి ప్రముఖ నటి టి.కనకం (88) అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. విజయవాడలో చికిత్స పొందుతూ ఆమె మంగళవారం కన్నుమూశారు. ఖర్గపూరులో జన్మించిన కనకం చిన్పపుడు ఆకాశవాణి బాలల కార్యక్రమంలో తన గొంతు వినిపించింది. ఆ తర్వాత 'నాయకురాలు' అనే నాటకం ద్వారా రంగస్థల ప్రవేశం చేసి తనలోని నటనను నిరూపించుకుంది.

అనంతరం సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె ఎన్టీఆర్, ఏఎన్ఆర్ , శోభన్ బాబు, కృష్ఱ వంటి గొప్ప నటులతో నటించింది. 'కీలుగుర్రం', పాతాళభైరవి, గృహప్రవేశం, షావుకారు, రక్షరేఖ, గుణసందరి కథ, భక్త ప్రహ్లాద, లేత మనసులు వంటి సినిమాలలో ఆమె నటించారు. సినీ రంగంలో సేవలందిన వారికి ప్రభుత్వం అందించే ఎన్టీఆర్ ఆర్ట్ అవార్డ్ ను 2004  సంవత్సరానికి గాను కనకం అందుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement