రేపు కేసీఆర్ ఏం చేస్తారో తెలుసా?
హైదరాబాద్: రేపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభంకాబోతున్నాయి. ఈసారి చాలా ఘనంగా వేడుకలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే రాష్ట్రంలోని క్షేత్ర స్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకు ఉన్న అధికారులను ఆదేశించారు. అన్ని చోట్ల మిఠాయి పంపకాలు జరగనున్నాయి. ఎక్కడికక్కడ జెండా ఎగురవేత కార్యక్రమం కూడా జరగనుంది. ఎంతో ఆడంబరంగా జరిగే ఈ ఉత్సవాల సందర్భంగా కేసీఆర్ ఏ సమయంలో ఎక్కడ ఉంటారో ఒకసారి పరిశీలిస్తే..
ఉదయం 9.20: బేగంపేటలోని సీఎం నివాసం నుంచి బయలుదేరుతారు
ఉదయం 9.30: గన్ పార్క్ లోని తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పిస్తారు.
ఉదయం 9.40: అమర వీరుల స్తూపం వద్ద నుంచి వెళతారు.
ఉదయం 9.45: లుంబినీ పార్క్ సమీపంలోని తెలంగాణ అమరులు స్తూపం వద్దకు చేరుకొని అమరుల స్మారక స్థలి నిర్మాణానికి శంఖుస్థాపన
ఉదయం 10.05: అమరుల స్తూపం వద్ద నుంచి వెళ్లిపోతారు
ఉదయం 10.10: సంజీవయ్య పార్క్ కు చేరుకొని జాతీయ జెండా ఆవిష్కరిస్తారు
ఉదయం 10.25: సంజీవయ్య పార్క్ నుంచి బయలుదేరుతారు
ఉదయం 10.30: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ కు చేరుకుంటారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించే కవాతును వీక్షిస్తారు.
ఉదయం 11.40: పరేడ్ గ్రౌండ్ నుంచి వెళ్లిపోతారు.
మధ్యాహ్నం 12.05: హైటెక్ సిటీలోని హెచ్ఐసీసీలో నిర్వహించే ప్రత్యేక సమావేశానికి హాజరవుతారు.
మధ్యాహ్నం భోజనం
మధ్యాహ్నం 1:40: హెచ్ఐసీసీ నుంచి వెళ్లిపోతారు
మధ్యాహ్నం 2.00: తిరిగి బేగంపేటలోని అధికారిక నివాసానికి చేరుకుంటారు.