'నక్షత్రం' విలన్ గా తనీష్? | Guess who is playing Krishna Vamsi's villain | Sakshi
Sakshi News home page

'నక్షత్రం' విలన్ గా యువ నటుడు?

Published Fri, Aug 12 2016 5:57 PM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

'నక్షత్రం' విలన్ గా తనీష్? - Sakshi

'నక్షత్రం' విలన్ గా తనీష్?

యువ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న తాజా ప్రాజెక్టు 'నక్షత్రం'. ఈ సినిమాకు సంబంధించిన వార్తలు రోజు రోజుకి ప్రేక్షకుల్లోఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్గా గెస్ట్ రోల్లో నటిస్తున్నారని ఇప్పటికే తెలిపిన కృష్ణవంశీ.. విలన్ పాత్ర చిత్రీకరణలో కూడా వైవిధ్యతను చూపించే ప్రయత్నంలో ఉన్నారు.

కథానాయకుడిగా అదృష్టాన్ని పరీక్షించుకున్న యువ నటుడు తనీష్ ఈ చిత్రంలో విలన్గా కనిపించే అవకాశాలున్నాయట.అయితే అది ఫుల్ లెన్త్ పాత్రా లేక గెస్ట్ అప్పీరియన్స్గానా అనే విషయం కృష్ణవంశీనే తేల్చాల్సి ఉంది. కాజల్, రెజీనా, సాయి ధరమ్ తేజ్ లాంటి స్టార్లు నటిస్తుండటంతో 'నక్షత్రం' సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ సినిమాతో కృష్ణవంశీ తిరిగి సక్సెస్ ట్రాక్ అందుకుంటారని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement