లవ్ అంటే...లాస్
లవ్ అంటే...లాస్
Published Mon, Feb 17 2014 1:27 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 AM
ప్రస్తుతం దక్షిణ సినిమాను ఏలుతున్న హీరోయిన్లలో నటి సమంత ఒకరు. ఈ చెన్నై చిన్నది టాలీవుడ్‌లో తన హవా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కోలీవుడ్‌లోను స్టార్ హీరోలు సూర్య, విజయ్‌లతో రొమాన్స్ చేస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అయితే అసలు విషయం ఏమిటంటే ఈ బ్యూటీకి నిర్మాతలు కొన్ని షరతులు విధించారట. వాటిలో ముఖ్యంగా ప్రేమ మాట ఎత్తితే 15 కోట్లు లాస్ అవుతావని హెచ్చరించారట. దీంతో తన లవర్ సిద్ధార్థ్ విషయంలో చాలా మౌనం పాటిస్తోందట. సిద్ధార్థ్, సమంతల ప్రేమ వ్యవహారం ఆ మధ్య కలకలం పుట్టించిన విషయం తెలిసిందే.
ఒక సమయంలో ఔను మేము ప్రేమించుకుంటున్నాం అంటూ ఈ ప్రేమ జంట ప్రకటించడంతో సమంతతో చిత్రాలు నిర్మిస్తున్న నిర్మాతలు, ఆమె సరసన నటిస్తున్న హీరోలు షాక్‌కు గురయ్యారు. ఆ తరువాత సమంతను ఎంపిక చేసిన కొందరు నిర్మాతలు సున్నితంగానే ఆమెను తొలగించారు కూడా. ప్రస్తుతం నిర్మాణంలో వున్న నిర్మాతలు మాత్రం మరోసారి ప్రేమ అని బహిరంగంగా అన్నావంటే 15 కోట్లు వరకు లాస్ అవుతావంటూ హెచ్చరించారట. ప్రస్తుతం ఈమె ఒక చిత్రానికి కోటి వరకు తీసుకుంటున్నారు. మరో మూడేళ్ల వరకు అవకాశాలు చేతిలో వున్నాయి. ఈ లెక్క ప్రకారం ప్రేమ, దోమ అంటే ఈ చిత్రాలన్నీ వెనక్కు పోతాయని హెచ్చరించడంతో సమంత ఆలోచనల్లో పడిందట.
అంతేకాదు ప్రేమ వ్యవహారంలో దూకుడు తగ్గించిందట. ఇటీవల సిద్ధార్థ్‌తో కలసి వాణిజ్య ప్రకటనల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ షూటింగ్ పూర్తి కాగానే సాయంత్రం వేళల్లో సిద్ధార్థ్‌తోనే గడిపిందట. అయితే ప్రేమికుల రోజు సందర్భంగా పలువురు తమ ప్రేమ గురించి బహిరంగంగా వెల్లడించినా ఈ అమ్మడు మాత్రం తన లవ్ గురించి నోరు మెదపలేదట. ఆ సమయంలో నిర్మాతలు హెచ్చరికలు గుర్తొచ్చి ఉంటాయేమో లేక మౌనంగానే తన పేరు ను పెంచుకుంటూ పోవాలని భావించిందోననే గుసగుసలు కోలీవుడ్‌లో వినిపిస్తున్నాయి.
Advertisement
Advertisement