అప్పుడు చాలా భయమేసింది: సన్నీ లియోన్ | Went head on with one of my biggest fears singing out loud: Sunny Leone | Sakshi
Sakshi News home page

అప్పుడు చాలా భయమేసింది: సన్నీ లియోన్

Published Mon, Jul 4 2016 7:07 PM | Last Updated on Mon, Sep 4 2017 4:07 AM

అప్పుడు చాలా భయమేసింది: సన్నీ లియోన్

అప్పుడు చాలా భయమేసింది: సన్నీ లియోన్

ముంబై: బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ మరో కొత్త అవతారం ఎత్తింది. ఇప్పటి వరకు స్కిన్ షోకే పరిమితమైన అందాల భామ ఇప్పుడు సింగర్ గా మారింది. తొలిసారిగా గొంతు సవరించుకుని పాట అందుకుంది. మైక్ ముందు బుద్ధిగా నించుని తాను పాట పాడుతున్న ఫొటోను ట్విటర్ లో పెట్టింది. మైక్ ముందు గట్టిగా పాట పాడడానికి చాలా భయపడ్డానని, నెల రోజుల పాటు రిహార్సిల్ చేశానని వెల్లడించింది. తన పాట అందరికీ నచ్చుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.

'వన్ నైట్' సినిమాలో చివరిసారిగా కనిపించిన సన్నీ లియోన్ ప్రస్తుతం యూత్ రియాలిటీ షో 'ఎంటీవీ స్ల్పిట్స్ విల్లా సీజన్ ౯'కు హోస్ట్ గా చేస్తోంది. షారూఖ్ ఖాన్ తాజా చిత్రం 'రాయిస్' సినిమాలో ఐటెం పాట కోసం సన్నీ లియోన్ ను సంప్రదించినట్టు సమాచారం. 1980 దశకంలో హిట్టైన 'ఖుర్బానీ' సినిమాలోని లైలా ఓ లైలా' రీమిక్స్ పాటలో సన్నీ లియోన్ ను నటింపజేయాలని చూస్తున్నారు. ఈ సాంగ్ ఒరిజినల్ వెర్షన్ లో ఫిరోజ్ ఖాన్, జీనత్ అమన్ నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement