బ్రెడ్డు తింటే కేన్సర్ ఫ్రీ! | Cancer Free with bread! | Sakshi
Sakshi News home page

బ్రెడ్డు తింటే కేన్సర్ ఫ్రీ!

Published Tue, May 24 2016 7:00 AM | Last Updated on Mon, Sep 4 2017 12:46 AM

బ్రెడ్డు తింటే కేన్సర్ ఫ్రీ!

బ్రెడ్డు తింటే కేన్సర్ ఫ్రీ!

- ప్రముఖ రెస్టారెంట్ల బ్రెడ్ ఉత్పత్తుల్లో కేన్సర్ కారకాలు
- సీఎస్‌ఈ పరిశీలనలో వెల్లడి
 
 న్యూఢిల్లీ: భారత మార్కెట్లో ప్రముఖ సంస్థలు అందిస్తున్న బ్రెడ్ సంబంధ ఆహార పదార్థాల్లో కేన్సర్ కారకాలు ఉన్నట్లు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్‌ఈ) పరీక్షల్లో తేలింది. బ్రిటానియా, కేఎఫ్‌సీ, పిజ్జాహట్, డొమినోస్, మెక్‌డొనాల్డ్స్, సబ్‌వే, స్లైస్ ఆఫ్ ఇటలీ వంటి అనేక ఫుడ్ చైన్ రెస్టారెంట్లు అందిస్తున్న  ఆహార పదార్థాల్లో పొటాషియం బ్రొమేట్, పొటాషియం అయొడేట్‌లు ఉన్నట్లు సీఎస్‌ఈ సోమవారం విడుదల చేసిన నివేదిక ద్వారా తెలిసింది. ఢిల్లీలోని అన్ని ప్రముఖ రెస్టారెంట్లు, బ్రాండ్ల ఆహార ఉత్పత్తులను సీఎస్‌ఈ పరిశీలించింది. ప్యాక్ చేసిన బ్రెడ్లు, బ్రెడ్డుతో తయారైన పావ్‌లు, బన్‌లు, బర్గర్‌లు, పిజ్జాలు వంటి 38 నమూనాలను సీఎస్‌ఈ పరీక్షించింది.

వీటిలో 84 శాతం  పదార్థాల్లో కేన్సర్ కారక రసాయనాలు ఉన్నాయని పేర్కొంది. ఈ రసాయనాలను అనేక దేశాలు ఇప్పటికే నిషేధించాయి. కానీ భారత్‌లో నిషేధం లేదు.  బ్రిటానియా, కేఎఫ్‌సీ, డొమినోస్, మెక్‌డొనాల్డ్స్, సబ్‌వేలు ఈ హానికర పదార్థాలను తాము వాడడం లేదన్నాయి.  నమూనాలను తమ పొల్యూషన్ మానిటరింగ్ ల్యాబోరేటరీ (పీఎంఎల్)లో పరీక్షించిన అనంతరం, బయటి ప్రయోగశాలల్లో కూడా పరిశీలించాకే ఈ నివేదిక విడుదల చేశామని సీఎస్‌ఈ ఉప డెరైక్టర్ జనరల్ చంద్రభూషణ్ తెలిపారు. 38 నమూనాలను పరీక్షించగా 32 ఉత్పత్తుల్లో 1.15 నుంచి 22.54 పీపీఎం వరకు పొటాషియం బ్రొమేట్,పొటాషియం అయొడేట్‌లు ఉన్నట్లు తేలిందన్నారు. కాగా, సీఎస్‌ఈ నివేదికలోని అంశాలపై విచారణ జరిపినివేదిక ఇవ్వాలని  ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement