గగనతలంలో తప్పిన పెను ప్రమాదం
లండన్ :
జర్మనీ గగనతలంలో జెట్‌ఎయిర్‌వేస్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ముంబై నుంచి లండన్ బయలుదేరిన బోయింగ్777 విమానానికి ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో రంగంలోకి దిగిన జర్మనీ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన రెండు ఫైటర్ జెట్‌లు బోయింగ్777 విమానానికి ఎస్కార్ట్‌గా వచ్చాయి. అనంతరం కొద్దిసేపటికి ఏటీసీతో సంబంధాలు పునరుద్ధరించారు. చివరకు క్షేమంగా లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో విమానం సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది.
అయితే మూడు రోజుల కిందట జరిగిన ఈ సంఘటనకు సంబధించి వీడియో ఫూటేజీ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. రెండు జర్మనీకి చెందిన ఫైటర్ జెట్‌లు బోయింగ్777 విమానానికి ఎస్కార్టుగా వచ్చిన దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 335 మంది ప్రయాణికులతో పాటూ 15 మంది సిబ్బంది ఉన్నారు.