అందరికీ అభివృద్ధే లక్ష్యం: యూపీ సీఎం
గోరఖ్‌పూర్: కుల, మత, లింగ భేదాలు లేకుండా అందరికీ అభివృద్ధి ఫలాలు అందేలా చూస్తామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి అన్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేశాక తొలిసారి సొంత పట్టణం గోరఖ్‌పూర్‌లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ప్రసంగిస్తూ... ఎవరినీ సంతృప్తి పరచాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. యూపీ ఎన్నికల గెలుపు సంబరాల్లో అత్యుత్సాహం వద్దని, ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని బీజేపీ శ్రేణులకు సూచించారు.
అలా చేస్తే శాంతి భద్రతలకు అరాచక శక్తులు విఘాతం కలిగించే అవకాశముందన్నారు. అమ్మాయిలతో అబ్బాయిలు కలిసి కనిపిస్తే యాంటీ రోమియో స్క్వాడ్‌లు ఇబ్బంది పెడుతు న్నాయన్న విమర్శలపై స్పందిస్తూ.. అమా యకుల్ని వేధించవచ్చని పోలీసుల్ని ఆదేశిం చామని చెప్పారు. ఈవ్‌టీజర్ల వల్ల స్కూళ్లు, కాలేజీలకు వెళ్లలేకపోతున్నామంటూ ఎందరో అమ్మాయిలు తనకు ఫోన్ చేశారని, అందుకే స్క్వాడ్‌లు ఏర్పాటు చేశామన్నారు.