సంస్కృతాంధ్రాల వారధి ఆచార్య శ్రీహరి | Famous writer Acharya srihari | Sakshi
Sakshi News home page

సంస్కృతాంధ్రాల వారధి ఆచార్య శ్రీహరి

Published Fri, Feb 6 2015 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 8:50 PM

సంస్కృతంలో, తెలుగులో ఉపమానా లకీ, వర్ణనలకీ లోటులేదు. కానీ సంస్కృ తానికీ, తెలుగు భాషకూ ఉన్న అనుబం ధం గురించి చెప్పడానికి ఏ ఉపమా నమూ చాలదు.

సంస్కృతంలో, తెలుగులో ఉపమానా లకీ, వర్ణనలకీ లోటులేదు. కానీ సంస్కృ తానికీ, తెలుగు భాషకూ ఉన్న అనుబం ధం గురించి చెప్పడానికి ఏ ఉపమా నమూ చాలదు. ఈ రెండు భాషల కోసం కొన్ని దశాబ్దాలుగా శ్రమిస్తున్న పండి తుడు ఆచార్య రవ్వా శ్రీహరి. రచనా ప్రక్రియలో మాత్రం తెలుగు రచనలకు పెద్దపీట వేసి 50 వరకు గ్రంథాలను వెలు వరించారు. సంస్కృతంలో 25 పుస్తకాలు రచించారు. నల్ల గొండ జిల్లా, వెల్వర్తికి చెందిన ఒక సామాన్య కుటుంబం నుం చి వచ్చిన శ్రీహరి కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయం ఉపకుల పతి స్థానం వరకు ప్రయాణించిన ప్రతిభాశాలి. పరిశోధన, సృజన, విమర్శ, అనువాదం, నిఘంటు నిర్మాణం వంటి రం గాల మీద తనదైన ముద్రవేశారు.  లఘు సిద్ధాంత కౌముది, అలబ్ధ కావ్య పద ముక్తావళి, సాహితీ నీరాజనం, తెలుగు కవు ల సంస్కృతానుకరణలు, వాడుకలో అప్రయోగాలు వంటి పుస్తకాలు (తెలుగు) రాశారాయన. సంస్కృతంలో ప్రపంచ పది, మాతృగీతం,  సంస్కృత వైజయంతి (వ్యాస సంపుటి) వంటివాటిని వెలువరించారు. మాండలికాల మీద శ్రీహరి కృషి వెలకట్టలేనిది. తెలంగాణ మాండలి కాలు, ఆరె భాషా నిఘంటువు, నల్లగొం డ జిల్లా ప్రజల భాష, శ్రీహరి నిఘం టువు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి.  ఆయన రూపొందించిన సంస్కృత న్యాయదీపిక ఒక అద్భుత రచన. సం స్కృత సూక్తి రత్నాకరం కూడా అలాంటి ఉత్తమ గ్రంథమే. మహాకవి గుర్రం జాషువా ‘పిరదౌసి’, తైలపాయికా పేరుతో ‘గబ్బిలం’ కావ్యాలను సంస్కృతంలోకి అనువదించారు. వేమన శతకాన్ని కూడా సంస్కృతంలోకి అనువదించి మహో పకారం చేశారు. సంకీర్తనాచార్యుడు అన్నమాచార్య మీద శ్రీహరి కొత్త వెలుగును ప్రసరింపచేశారు. అన్నమాచార్య సూక్తి సుధ, అన్నమయ్య భాషా వైభవం, అన్నమయ్య పదకో శము ఇందుకు తార్కాణం. ఆచార్య శ్రీహరితో పాటు పుర స్కారాన్ని అందుకుంటున్న యువకవి, అవధాని తాతా సందీప్. రాజమండ్రికి చెందిన సందీప్ కాలేజీ విద్యార్థి.
 
 (నేడు నోరి 115 జయంతి సందర్భంగా
 ఆచార్య శ్రీహరి, తాతా సందీప్ హైదరాబాద్‌లో పురస్కారాలు అందుకుంటున్న సందర్భంగా)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement