ఏ టైమ్ లోనైనా గవర్నర్ నుంచి పిలుపు! | Governor can call us anytime: Ratnaswami | Sakshi
Sakshi News home page

ఏ టైమ్ లోనైనా గవర్నర్ నుంచి పిలుపు!

Published Fri, Feb 10 2017 3:35 PM | Last Updated on Thu, May 24 2018 12:05 PM

ఏ టైమ్ లోనైనా గవర్నర్ నుంచి పిలుపు! - Sakshi

ఏ టైమ్ లోనైనా గవర్నర్ నుంచి పిలుపు!

చెన్నై: తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ తమనే ఆహ్వానిస్తారని శశికళ నటరాజన్ మద్దతుదారులు విశ్వాసంతో ఉన్నారు. గవర్నర్ నుంచి తమకు ఏ సమయంలోనైనా పిలుపు రావొచ్చని, అందుకే తామంతా ఒకేచోట ఉన్నామన్నా శశికళ మద్దతుదారుడు రత్నస్వామి తెలిపారు. తాము ఎమ్మెల్యేలను బంధించలేదని ఆయన చెప్పారు. మహబలిపురంలో వద్ద గోల్డెన్ బే రిసార్ట్ లో ఎమ్మెల్యేలను ఉంచారు. రిసార్ట్ లో 130 ఎమ్మెల్యేలు లేరని శశి అనుయాయులు అంటున్నారు. ఎమ్మెల్యేలు ఎవరి స్థావరాల్లో వారు ఉన్నారని చెబుతున్నారు. పన్నీరు సెల్వం వర్గీయులు మాత్రం ఎమ్మెల్యేలను బంధించారని ఆరోపిస్తున్నారు.

మరోవైపు గోల్డెన్ బే రిసార్ట్ వద్ద కాపాల ఉన్న బౌన్సర్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. లోపలకు వెళ్లకుండా మీడియా ప్రతినిధులను అడ్డుకుంటున్నారు. లోపలకు ఎవరినీ అనుమతించబోమని తెగేసి చెప్పారు. మీడియా ప్రతినిధులతో వాగ్వాదానికి దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement