సస్పెన్స్‌కు తెరదించిన సిద్ధు | Navjot Singh Sidhu Ends Suspense, to Formally Join Congress on January 9 | Sakshi
Sakshi News home page

సస్పెన్స్‌కు తెరదించిన సిద్ధు

Published Sat, Jan 7 2017 7:26 PM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM

సస్పెన్స్‌కు తెరదించిన సిద్ధు - Sakshi

సస్పెన్స్‌కు తెరదించిన సిద్ధు

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్‌, మాజీ ఎంపీ నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్దు ఎట్టకేలకు తన రాజకీయ భవితవ్యంపై సస్పెన్స్కు తెరదించారు. ఈ నెల 9న ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు.

గతేడాది సెప్టెంబర్‌ 14న సిద్ధు బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సిద్ధు బాటలోనే బీజేపీని వీడిన ఆయన భార్య, ఎమ్మెల్యే నవజ్యోత్‌ కౌర్‌ సిద్దు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సిద్ధు కూడా కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం వచ్చినా కార్యరూపం దాల్చలేదు. ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరుతారని కూడా వార్తలు వచ్చాయి. చివరకు కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న సిద్ధు ముహూర్తాన్ని ఖరారు చేశారు. త్వరలో పంజాబ్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement