తమన్నా 'కొత్త' సినిమా చూస్తారా?
'బాహుబలి- ది బిగినింగ్' ద్వారా బాలీవుడ్లో తన స్థానాన్ని పదిలం చేసుకున్న 'మిల్కీ బ్యూటీ' తమన్నాభాటియా.. ఎవ్వరూ ఊహించని విధంగా పొట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. 'చింగ్స్ సీక్రెట్' ఆహార ఉత్పత్తుల సంస్థ ప్రమోషన్ కోసం ఆమె నటించిన 'రణ్ వీర్ చింగ్ రిటర్న్స్' యాడ్ ఫిలిం శుక్రవారం సాయంత్రం ఆన్ లైన్ లో విడుదలైంది. రణ్ వీర్ సింగ్ హీరోగా, రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ యాడ్ ఫిలిం.. సాధారణ మాస్ మసాలా సినిమా కంటే గ్రాండ్ గా తెరకెక్కించారు.
ఆహార సంక్షోభంలో చిక్కుకున్న ప్రపంచాన్ని 'చింగ్స్ సీక్రెట్' ఉత్పత్తుల ద్వారా ఆదుకునే రాజు.. రణ్వీర్చింగ్గా హీరో రణ్వీర్ ఆకట్టుకున్నాడు. ఒకానొక రాజ్యాధినేత్రిగా తమన్నా అదరగొట్టింది. ఐదున్నర నిమిషాల నిడివి గల ఈ షార్ట్ ఫిలింలో రణ్ వీర్, తమన్నాల మధ్య రొమాంటిక్ సీన్లు, పాటలనూ చొప్పించారు. 'రణ్ వీర్ చింగ్ రిటర్న్స్' విడుదల సందర్భంగా శుక్రవారం ముంబైలో హీరో, హీరోయిన్, దర్శకుడు హంగామా చేశారు. తమన్నా ఆన్ లైన్ లో తన అభిమానులతో ముచ్చటించింది. నిమిషనిమిషానికీ వీక్షకుల సంఖ్య పెరిగిపోతున్న 'రణ్ వీర్ చింగ్ రిటర్న్స్' వీడియో మీకోసం..