ఆదాయపన్ను రేట్లు ఇలా.. | salaried employees given sops in income tax rates by arun jaitley | Sakshi
Sakshi News home page

ఆదాయపన్ను రేట్లు ఇలా..

Published Wed, Feb 1 2017 12:54 PM | Last Updated on Thu, Sep 27 2018 4:27 PM

ఆదాయపన్ను రేట్లు ఇలా.. - Sakshi

ఆదాయపన్ను రేట్లు ఇలా..

పెద్ద నోట్ల రద్దు, తదనంతర పరిణామాలలో భాగంగా వేతన జీవులకు ఆదాయపన్ను విషయంలో మంచి  ఊరట లభించింది. ఆదాయపన్ను రేటును అరుణ్‌ జైట్లీ స్వల్పంగా సవరించారు. 2.5 లక్షల వరకు ఉన్న పరిమితిని యథాతథంగానే ఉంచినా, 2.5 లక్షల నుంచి 5లక్షల వరకు 5% పన్ను మాత్రమే విధిస్తామన్నారు. ఇంతకుముందు ఇది 10 శాతంగా ఉండేది.  అయితే, ఆదాయం 5 లక్షలు దాటిన తర్వాతి పన్ను వివరాలను మాత్రం ప్రకటించలేదు. దాంతో అధికాదాయ వర్గాలకు ఆదాయపన్ను యథాతథంగా ఉండొచ్చని భావిస్తున్నారు. 50 లక్షల నుంచి 1 కోటి ఆదాయం ఉన్నవారికి పన్నుపై 10 శాతం సర్ చార్జి విధిస్తామని మాత్రం జైట్లీ చెప్పారు. 
 
ప్రస్తుత ఆదాయపన్ను 
వార్షికాదాయం                     పన్ను
2.5 లక్షల వరకు                  లేదు
2.5-5 లక్షల వరకు                5%
 
 
2016 నాటి ఆదాయపన్ను శ్లాబ్‌లు..
 
వార్షికాదాయం                    పన్ను
2.5 లక్షల వరకు                 లేదు
2.5-5 లక్షల వరకు              10%
5-10 లక్షల వరకు                20%
10 లక్షల పైన                      30%

(సంబంధిత వార్తలు..)

గృహ రంగానికి గుడ్న్యూస్
పేదలకు కేంద్ర బడ్జెట్‌లో వరాలు!


బడ్జెట్లో పది ప్రాధాన్యతాంశాలు ఇవే..


ఐఆర్‌సీటీసీ టికెట్ల మీద భారీ వరాలు


తడబడి.. పొరపడి.. సవరించిన జైట్లీ

బడ్జెట్ లో రైల్వే హైలెట్స్...

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement