అఖిలేశ్ ఇంటికి క్యూకట్టిన ఎమ్మెల్యేలు
లక్నో: అధికార సమాజ్‌వాదీ పార్టీ నుంచి సీఎం అఖిలేశ్ యాదవ్ బహిష్కరణకు గురైన తర్వాత ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. లక్నోలోని సీఎం నివాసం వద్దకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని అఖిలేశ్‌కు మద్దతుగా, ములాయం, శివపాల్ యాదవ్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పార్టీలో అఖిలేశ్ వర్గీయులుగా పేరుపడిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా సీఎం ఇంటికి క్యూ కట్టారు.
( చదవండి : ములాయం కుటుంబంలో ఏం జరిగింది?)
సీఎం అఖిలేశ్.. తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలతో శనివారం కీలక భేటీ నిర్వహిస్తారని తెలిసింది. అంతకు ముందే, అంటే, నేటి రాత్రి అఖిలేశ్ మీడియాతో మాట్లాడే అవకాశాలున్నాయి. క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డారనే ఆరోపణలతో అఖిలేశ్‌ను పార్టీ చీఫ్ ములాయం ఆరేళ్లు సస్పెండ్ చేశారు. పార్టీకి నష్టం చేసేవిధంగా వ్యవహరించిన రాంగోపాల్ యాదవ్‌పైనా ములాయం వేటువేశారు. జనవరి 1న భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని రాంగోపాల్ ప్రకటించారు. అఖిలేశ్ ఏం చెయ్యబోతున్నారనేది ప్రస్తుతానికి సస్సెన్స్.
(చదవండి : 1న అఖిలేశ్ వర్గం భారీ సభ.. )