చీలిపోనున్న సమాజ్ వాదీ పార్టీ?
చీలిపోనున్న సమాజ్ వాదీ పార్టీ?
Published Fri, Dec 30 2016 8:55 AM | Last Updated on Sat, Aug 25 2018 4:30 PM
లక్నో: సమాజ్ వాదీ పార్టీ రెండుగా చీలిపోనుందా?. తాజా పరిణామాలు ఈ విషయాన్నే సూచిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ అభ్యర్ధుల్లో ముఖ్యమంత్రి అఖిలేశ్ వర్గానికి చెందిన వారికి మొండిచేయి ఎదురవడంతో ఆయన వారందరిని రెబెల్స్ గా బరిలోకి దిగాలని కోరారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్ధుల్లో 325 మంది పేర్లను ములాయం సింగ్, ఆయన సోదరుడు శివపాల్ యాదవ్ లు బుధవారం విడుదల చేసిన విషయం తెలిసిందే.
ములాయం విడుదల చేసిన లిస్టులో ప్రస్తుత మంత్రులు అరవింద్ సింగ్ గోప్, పవన్ పాండే, రామ్ గోవింద్ చౌదరిలకు కూడా స్ధానం దక్కలేదు. దీంతో గురువారం తన అనునూయులతో సమావేశమైన అఖిలేశ్ పార్టీ అభ్యర్ధులుగా ఎంపిక కానీ నాయకులందరూ రెబల్స్ గా బరిలోకి దిగాలని పేర్కొన్నారు. పార్టీ టిక్కెట్లు దక్కనివారిలో అత్యధికులు ప్రస్తుత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా పని చేస్తున్నవారే. కాగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో సమాజ్ వాదీ పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే 78 స్ధానాల్లో అభ్యర్ధులను ములాయం ప్రకటించకుండా వదిలేశారనే ప్రచారం జరుగుతోంది.
Advertisement