చిన్నమ్మ రాత్రంతా ఉపవాసమే | sasikala overnight fasting | Sakshi
Sakshi News home page

చిన్నమ్మ రాత్రంతా ఉపవాసమే

Published Fri, Feb 17 2017 1:26 AM | Last Updated on Tue, Sep 5 2017 3:53 AM

చిన్నమ్మ  రాత్రంతా ఉపవాసమే

చిన్నమ్మ రాత్రంతా ఉపవాసమే

బెంగళూరు సెంట్రల్‌జైల్లో ఇదీ చిన్నమ్మ జీవితం
 

బెంగళూరు: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ జైలులో తొలిరోజు రాత్రి ఏమీ తినకుండా గడిపారు. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఆమె బుధవారం బెంగళూరు పరప్పన అగ్రహార జైలుకు చేరిన విషయం తెలిసిందే. మొదటిరోజు రాత్రి ఏమీ తినకుండానే ఉన్నారు. నిబంధనల ప్రకారం నేలపై చాప, దిండు వేసుకుని రగ్గు కప్పుకుని పడుకున్నారు. గురువారం తెల్లవారుజామున 5:30 గంటలకే మేలుకుని కాలకృత్యాలు ముగించి ఇళవరసితో కలిసి కొద్దిసేపు జైలులోనే పచార్లు చేశారు. ఉదయం 6:30 గంటలకు వెజిటబుల్‌ పలావ్‌ తిన్నాక, జైలు గ్రంథాలయంలో ఇంగ్లీషు, తమిళ దినపత్రికలు చదివారు. కొద్దిసేపు బ్యారెక్‌లో విశ్రాంతి తీసుకున్నారు.

సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో టీ తాగారు. అటుపై ఇళవరసితో పాటు సహఖైదీలతో మాట్లాడారు. ఆమెను కలిసేందుకు తమిళనాడులోని పలు జిల్లాల నుంచి వచ్చిన ద్వితీయశ్రేణి నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, అభిమానులను పోలీసులు అనుమతించలేదు. శశికళను కలవడానికి తమిళనాడు నూతన ముఖ్యమంత్రి ఎడపాడి కే.పళనిస్వామి శుక్రవారం ఉదయం ఇక్కడకు వస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement