IlayaRaja
-
ఇళయరాజాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సారీ చెప్పిన దర్శకుడు
సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilayaraja)పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ మిస్కిన్ క్షమాపణలు చెప్పాడు. బాటిల్ రాధ సినిమా ఈవెంట్లో మిస్కిన్ మాట్లాడుతూ.. తాను పెద్ద తాగుబోతునని చెప్పాడు. ఎన్నో సమస్యలకు మందు పరిష్కారమని చెప్పాడు. ఇళయరాజా సంగీతం వల్ల ఎందరో మద్యానికి అలవాటుపడ్డారన్నాడు. ఇళయరాజాపై ఈయన చేసిన కామెంట్లు వివాదాస్పదమవడంతో నేడు సారీ చెప్పాడు. తాను సరదాగా అన్న వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్నారని పేర్కొన్నాడు.చులకనగా మాట్లాడటం కరెక్ట్ కాదుతాజాగా ఈ వివాదంపై తమిళ హీరో విశాల్ (Vishal) స్పందించాడు. అందరూ ఆరాధించే ఇళయరాజాను అగౌరవపర్చడం ఏమాత్రం సమంజసం కాదన్నాడు. ఆయన సంగీతం వల్ల ఎంతోమంది డిప్రెషన్ నుంచి బయటపడ్డారని తెలిపాడు. అలాంటి మహనీయుడు గురించి, ఆయన సంగీతం గురించి చులకనగా మాట్లాడటం కరెక్ట్ కాదని హెచ్చరించాడు. విశాల్-మిస్కిన్ కాంబోలో 2017లో వచ్చిన తుప్పరివాలన్(తెలుగులో డిటెక్టివ్) పెద్ద హిట్ అయింది.చేదు అనుభవం బయటపెట్టిన దర్శకుడుఇకపోతే మిస్కిన్ తాజాగా బాటిల్ రాధ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టాడు. 2013లో ఒనాయుమ్ ఆట్టుకుట్టియుమ్ సినిమా తీశాను. కొందరు ఈ మూవీ టెలివిజన్ రైట్స్ హక్కులు కొనేందుకు నన్ను సంప్రదించారు. ఓ బడా దర్శకుడు నాకు ఫోన్ చేసి ఈ సినిమా తాను కొంటానని, అందుకోసం పెద్ద మొత్తంలో డబ్బిస్తానంటూ ఓ చోటుకు రమ్మన్నాడు.(చదవండి: ఈ వారం ఓటీటీలో 18 చిత్రాలు.. ఆ రెండు స్పెషల్!)సగం కంటే తక్కువకే ఇచ్చేయమన్నారుసరేనని అతడు చెప్పిన ప్రదేశానికి వెళ్లాను. నన్ను ఓ పెద్ద గదిలో కూర్చోబెట్టారు. ఆ గదిలో 20 మంది ఉన్నారు. రూ.75 లక్షలకే డిజిటల్ రైట్స్ ఇవ్వమని అడిగారు. ఎంతో కష్టపడి తీశాను సర్.. ఇది చాలా మంచి సినిమా.. కనీసం రూ.2 కోట్లు ఇవ్వండి అని కోరాను. కానీ వాళ్లు మాత్రం నా మాట వినలేదు. అంత డబ్బు ఇవ్వలేం.. మేము అడిగినదానికే డీల్ కుదిర్చేయ్ అని బలవంతం చేశారు. బెదిరించి బలవంతంగా సంతకంకాసేపటికి వాళ్లందరూ గూండాలని అర్థమైంది. నన్ను బెదిరించి పత్రాలపై సంతకం తీసుకున్నారు. వాళ్లు చెప్పినట్లు రూ.75 లక్షలే ఇచ్చారు. ఇదంతా వెనకుండి నడిపించిన వ్యక్తి ఇండస్ట్రీలో పేరు మోసిన డైరెక్టర్. నా సినిమాను ఇప్పటివరకు వారి ఛానల్లో 80 సార్లు వేసి ఉంటారు. అది టీవీలో కూడా హిట్టయింది అని చెప్పుకొచ్చాడు.చెప్పు విసురుతానని..ఇళయరాజాపై వ్యాఖ్యల గురించి స్పందిస్తూ.. కొన్నిరకాల వివాదాలు నిర్మాతలను ఇబ్బందిపెడతాయి. అందుకే నా వల్ల ఏ సమస్యా ఉండకూడదని సారీ చెప్తున్నాను. అయితే నా వ్యాఖ్యలు విన్న నా స్నేహితుడు నాపై చెప్పు విసురుతానన్నాడు. నా చెప్పు సైజ్ 8.. కాబట్టి ఒకటికి బదులుగా రెండు విసరమని చెప్పాను. అతడికి కూడా క్షమాపణలు చెప్పాను. ఆరోజు సరదాగా అన్న మాటల్ని చాలాదూరం తీసుకెళ్తున్నారు. అందుకే సారీ చెప్తున్నా అన్నాడు మిస్కిన్.చదవండి: క్యాన్సర్‌తో పోరాటం.. అన్నీ వదిలేసి నటికి సపర్యలు చేస్తున్న ప్రియుడు -
నా కూతురు పోయాకే చేదు నిజం తెలుసుకున్నా.. ఇళయరాజా ఎమోషనల్
కళ్లముందు కూతుర్ని కోల్పోవడం కంటే విషాదం మరొకటి ఉంటుందా? ఆ కడుపుకోతను సంగీత జ్ఞాని ఇళయరాజా అనుభవిస్తున్నాడు. గతేడాది జనవరి 25న ఆయన కూతురు, గాయని, సంగీత దర్శకురాలు భవతారిణి క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూసింది. ఆమె మొదటి వర్ధంతి సందర్భంగా కూతుర్ని తలుచుకుని ఇళయారాజా భావోద్వేగానికి లోనయ్యాడు.నిర్లక్ష్యం చేశా..ఇళయరాజా (Ilayaraja) మాట్లాడుతూ.. నేను ఎంతగానో ప్రేమించే నా కూతురు దూరమై ఏడాదవుతోంది. తను మాతో లేదన్న బాధ ఇప్పటికీ నన్ను వేధిస్తోంది. తను నాపై ఎంత ప్రేమ కురిపించేది.. ఎంత ఆప్యాయత చూపించేదన్న విషయం తనను కోల్పోయాకే తెలుసుకున్నాను. నా జీవితమంతా సంగీతానికే ధారపోశాను. ఈ క్రమంలో నా కుటుంబాన్ని పట్టించుకోలేదు. పిల్లల్ని నిర్లక్ష్యం చేశాను. వారికి ఎక్కువ సమయం కేటాయించలేకపోయాను. ఈ చేదు నిజం నన్ను కుంగదీస్తోంది.సంగీతంతో స్వాంతనసంగీతం ఎంతోమందికి ఓదార్పునిస్తుందంటారు. ఇలాంటి క్లిష్ట సమయంలో అదే సంగీతం నాకూ కొంత స్వాంతన కలిగిస్తోంది. ఫిబ్రవరి 12న నా కూతురి పుట్టినరోజు. ఆరోజు నా కూతురికి నివాళిగా ఓ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాను. నా సన్నిహితులను, ఇండస్ట్రీ మిత్రులను అందరినీ ఈ ప్రోగ్రామ్‌కు ఆహ్వానిస్తాను. నా కూతురు ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. (చదవండి:సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత)సింగర్‌గా భవతారిణిఇళయరాజాకు కూతురు భవతారిణితో పాటు కార్తీక్ రాజా, యువన్ శంకర్ రాజా అని ఇద్దరు కుమారులు సంతానం. మలయాళ త్రీడీ ‘మై డియర్ కుట్టి చాత్తాన్’ (1984) గాయనిగా భవతారణికి తొలి చిత్రం. ప్రభుదేవా హీరోగా నటించిన ‘రాసయ్య’ (1995) మూవీ ద్వారా సింగర్‌గా తమిళ చిత్రపరిశ్రమకు పరిచయమైంది. ‘భారతి’ (2000) చిత్రంలోని ‘మైలు పోల పొన్ను..’ పాటకు గాను జాతీయ ఉత్తమ గాయనిగా కేంద్ర ప్రభుత్వ అవార్డు అందుకుంది. తెలుగులోనూ పలు పాటలు పాడింది. ‘గుండెల్లో గోదారి’ సినిమాలో ‘నన్ను నీతో..’ అనే పాటను ఆలపించింది.మ్యూజిక్ డైరెక్టర్‌గానూ..‘మిత్ర్: మై ఫ్రెండ్’తో సంగీత దర్శకురాలిగా మారారు భవతారణి. సల్మాన్ ఖాన్, అభిషేక్ బచ్చన్, శిల్పాశెట్టి ముఖ్య తారలుగా వచ్చిన హిందీ చిత్రం ‘ఫిర్ మిలేంగే’ (2004) సినిమాకు ఓ సంగీత దర్శకురాలిగా చేశారు. హిందీలో ఇదే తన తొలి సినిమా. దాదాపు పాతిక చిత్రాల్లో సాంగ్స్ పాడగా పది సినిమాలకు సంగీత దర్శకురాలిగా పని చేసింది. శబరిరాజ్ అనే వ్యక్తితో భవతారణి వివాహం జరిగింది.. కానీ, వీరికి సంతానం లేదు.చదవండి: వెంకటేశ్ 'సంక్రాంతికి వస్తున్నాం'.. 12 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే? -
ఇళయరాజాకు అవమానం? వీడియో వైరల్
దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజాకు అవమానమే ఇది. ఎందుకంటే ఈ రోజు (డిసెంబర్ 16) నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతంది. ఒక్కోచోట ఒక్కో ఆచారమున్నట్లే తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయంలో పెళ్లి కాని యువతలతో పాటు చాలామంది ప్రత్యేక పూజలు జరుపుకొంటారు. ఈ మాసం తొలిరోజున ఆండాళ్, తిరుప్పావై పట్టు వస్త్రాలు ధరించి రంగమన్నార్ స్వామితో దర్శనమిచ్చారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు)ఈ క్రమంలోనే ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా.. ఆండాళ్‌ని దర్శించుకునేందుకు వేకునజామునే ఆలయానికి వచ్చారు. స్వామివారి దర్శనం చేసుకునేందుకు ఆండాళ్ గర్భగుడి ముందున్న మండపంలోకి ప్రవేశించే సమయంలో.. అక్కడే ఉన్న జీయర్ ఈయనని అడ్డుకున్నారు. దీంతో గర్భగుడి బయటే నిలబడి ఇళయరాజా పూజా చేసుకున్నారు.అయితే శ్రీ విల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయ అర్థ మండపంలోకి ఇళయరాజాను రానివ్వకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎన్నో పాటల్లో స్వామిని కీర్తించిన సంగీత విద్వాంసుడికి దక్కిన గౌరవం ఇదేనా అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ విన్నర్‌గా నిఖిల్.. ప్రైజ్‌మనీతోపాటు ఏం సాధించాడంటే?)SHOCKING: Ilaiyaraaja denied entry✖️ to Sanctum Sanctorum and asked to get out by the priests at Srivilliputhur Andal Temple🛕 pic.twitter.com/Aii7GQPg6k— Manobala Vijayabalan (@ManobalaV) December 16, 2024 -
ఇళయరాజా బయోపిక్‌పై నీలినీడలు?
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా జీవిత చరిత్రను తెరకెక్కించడానికి సన్నాహాలు జరిగిన విషయం తెలిసిందే. వెయ్యికి పైగా చిత్రాలకు సంగీతాన్ని, 7 వేలకు పైగా పాటలకు బాణీలు కట్టిన మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా ఎనలేని గుర్తింపు పొందారు. ఆయన బయోపిక్ తెరకెక్కనున్న వార్త, సంగీత ప్రియుల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. సంగీత ప్రపంచంలో ఇళయరాజా ఒక లెజెండ్.. ఆయన బయోపిక్‌లో నటుడు ధనుష్ నటించడానికి సమ్మతించడం కూడా మంచి క్రేజ్‌ను తీసుకొచ్చింది. దీన్ని ఇంతకు ముందు ధనుష్ కథానాయకుడిగా నటించిన కెప్టెన్ మిల్లర్ చిత్రం ఫేమ్ అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వం వహించడానికి సిద్ధం అయ్యారు. ఓ బాలీవుడ్ సంస్థ దీన్ని నిర్మించడానికి ముందుకు వచ్చింది. అదేవిధంగా ఈ చిత్ర పరిచయ కార్యక్రమాన్ని చాలా రోజుల క్రితమే చైన్నెలో నిర్వహించారు. అందులో సంగీత దర్శకుడు ఇళయరాజా, నటుడు కమలహాసన్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. త్వరలోనే చిత్ర షూటింగ్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. అలాంటిది ఇప్పటివరకు ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కాలేదు. అదేవిధంగా నటుడు ధనుష్ కథానాయకుడిగా ,దర్శకుడుగా తన చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇళయరాజా బయోపిక్‌పై నీలినీడలు పడుతున్నాయి. ఈ చిత్ర నిర్మాణానికి బాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ సెట్ కాదని అభిప్రాయాన్ని యూనిట్ వర్గాలు పేర్కొన్నట్లు సమాచారం. దీంతో ఈ చిత్ర షూటింగ్ ఆదిలోనే ఆగిపోతుందా? లేక వేరే సంస్థ దీని నిర్మాణ బాధ్యతలను చేపడుతుందా? అనేది వేచి చూడాల్సి ఉంది. -
ఇళయరాజా గారితో తిట్లు తినేవాడిని ..
-
ఇళయరాజాకు 'మంజుమ్మెల్ బాయ్స్' ఎంత డబ్బు చెల్లించారు..?
'మంజుమ్మెల్ బాయ్స్' సినిమా రికార్డ్ కలెక్షన్లతో సూపర్ హిట్ అందుకుంది. రూ. 200 కోట్లు కలెక్షన్స్ రాబట్టి మలయాళ ఇండస్ట్రీలో ఆల్‌టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమాలోని ఒక పాట వివాదం తెచ్చిపెట్టింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా 'మంజుమ్మెల్ బాయ్స్' చిత్ర నిర్మాతకు లీగల్ నోటీసులు కూడా పంపిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక పాటను కమల్ నటించిన 90ల నాటి 'గుణ' చిత్రం నుంచి వాడారంటూ ఆ నోటీసుల్లో ఇళయరాజా పేర్కొన్నారు.ఈ నోటీసులకు 'మంజుమ్మెల్ బాయ్స్' చిత్ర నిర్మాత షాన్ ఆంటోనీ స్పందించారు. సరైన అనుమతి పొందిన తర్వాతే పాటను ఉపయోగించామని ఆయన చెప్పుకొచ్చారు. ఆ సాంగ్‌కు సంబంధించ కాపీరైట్ కలిగిన రెండు మ్యూజిక్ కంపెనీలను సంప్రదించి వారి నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే పాటను వాడామని స్పష్టత ఇచ్చారు.ఈ వివాదంలో ఇళయరాజా రూ.2 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేశారని, సమస్యను పరిష్కరించేందుకు 'మంజుమ్మెల్ బాయ్స్' నిర్మాత రూ.60 లక్షలు ఇచ్చారని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయమై ఇళయరాజా తరపు న్యాయవాది శరవణన్‌ను సంప్రదించగా, ఆయన ఈ సమాచారాన్ని ఖండించారు. నిర్మాత వైపు నుంచి ఇళయరాజాకు ఎలాంటి డబ్బులు అందలేదని ఆయన చెప్పారు. అనంతరం తాము నోటీసు పంపామని తెలిపారు.ఈ విషయమై మంజుమల్ బాయ్స్ యూనిట్ కూగా రియాక్ట్ అయింది. సంగీత దర్శకుడు ఇళయరాజాకు పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదని వారు తెలిపారు. మా సినిమాలో ఉపయోగించిన 'కణ్మణి అన్బోడు వాలంతన్' పాటకు మ్యూజిక్ మాస్టర్ ఆడియో నుంచి పొందామని వారు వివరించారు. అదేవిధంగా శ్రీదేవి మ్యూజిక్ కార్పొరేషన్ అనే సంస్థ నుంచి తెలుగు పాటను పొందినట్లు తెలిపారు. మరి ఇప్పటి వరకు ఇళయరాజాకి తాము ఎలాంటి పరిహారం ఇవ్వలేదని పేర్కొన్నారు. -
ఈ పాట నా చెల్లెలు కోసం అంటూ యువన్ శంకర్ రాజా ఎమోషనల్
సౌత్ ఇండియా స్టార్ హీరో విజయ్ నటించిన గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) చిత్రం నుంచి రెండో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో దివంగత సింగర్ భవతారిణి వాయిస్ కోసం ఏఐ టెక్నాలజీ ఉపయోగించారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రంలో నటుడు ప్రశాంత్, ప్రభుదేవా, అజ్మల్, స్నేహా, లైలా, మీనాక్షీ చౌదరి వంటి పలువురు ప్రముఖులు ముఖ్యపాత్రలు పోషించారు. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. కాగా దీనికి యువన్‌శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.తాజాగా విడుదలైన రెండో సాంగ్ గురించి యువన్‌శంకర్ రాజా ఎమోషనల్ అయ్యారు. ఈ పాట తనకెంతో ప్రత్యేకమంటూ తన ఎక్స్ పేజీలో ఒక పోస్ట్ చేశారు. 'మొదటి పాటలాగే ఈ పాటను కూడా విజయ్ పాడారు. కానీ ఇందులో నా సోదరి దివంగత భవతారిణి వాయిస్ కూడా ఉంది. ఈ పాట నాకు చాలా ప్రత్యేకమైనది. ఈ అనుభూతిని వర్ణించడానికి నా వద్ద మాటలు కూడా లేవు. బెంగళూరులో ఈ పాటను నేను మొదట కంపోజ్ చేస్తున్నప్పుడు.. దీనికి నా సోదరి వాయిస్ అయితే బాగుంటుందని భావించాను. ఆమెతోనే ఈ పాటను పాడించాలని బలంగా కోరుకున్నాను. ఆమె ఆరోగ్యం బాగుపడి ఆసుపత్రి నుంచి రాగానే రికార్డ్ చేయవచ్చు అనుకున్నాను. కానీ, అదే సమయంలో ఒక గంట తర్వాత ఆమె ఇక లేదనే వార్త వచ్చింది. అప్పుడు నా గుండె ముక్కలైంది. నేను ఆమె వాయిస్‌ని ఇలా ఏఐ టెక్నాలజీ ద్వారా ఉపయోగిస్తానని ఎప్పుడూ ఊహించలేదు. ఆమె వాయిస్‌ను మరోసారి వినిపించేలా కష్టపడిన నా సంగీత బృందానికి, ఇందులో భాగమైన వ్యక్తులందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఇది నాకు చాలా చేదు తీపి క్షణం.' అని యువన్‌శంకర్ రాజా ఎమోషనల్ అయ్యారు.ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా వారుసురాలు, గాయనీ, సంగీతదర్శకురాలు భవతారిణి కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమెకు ఇద్దరు సోదరులు యువన్ శంకర్‌రాజా, కార్తిక్ రాజాలాగే భవతారణి కూడా తండ్రి ఇళయరాజా వారసత్వాన్ని కొనసాగించారు. మ్యూజిక్ డైరెక్టర్‌గానే కాకుండా సింగర్‌గా కూడా తనదైన ముద్ర ఆమె వేశారు. తాజాగా విజయ్ సినిమాలో ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ఆమె వాయిస్‌ను మరోసారి అభిమానులకు అందించారు యువన్‌శంకర్ రాజా. సెప్టెంబరు 5న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది. -
ఇళయరాజా ముందు ధనుష్ భారీ డిమాండ్
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా జీవితం వెండితెరపైకి రానుంది. ధనుష్ లీడ్ రోల్లో నటిస్తున్న ‘ఇళయరాజా’ షూటింగ్ కార్యక్రమాన్ని కొద్దిరోజుల క్రితమే ప్రారంభించారు. ఈ మూవీకి అరుణ్మాథేశ్వరన్ దర్శకుడు. కనెక్ట్ మీడియా, పీకే ప్రైమ్ ప్రొడక్షన్, మెర్క్యూరీ మూవీస్ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. అయితే, ఈ సినిమాకు హీరో ధనుష్ భారీ రెమ్యునరేషన్ అందుకున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.ధనుష్ నటించిన 'కెప్టెన్ మిల్లర్' చిత్రం పట్ల భిన్న అభిప్రాయాలు వచ్చినప్పటికీ సినిమాపై మంచి టాక్ వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించినంతగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.అయితే, ధనుష్ మాత్రం తన పారితోషికాన్ని తగ్గించకుండా మరింత పెంచాడని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా తర్వాత తెలుగులో డైరెక్ట్ సినిమా ఒకటి ఆయన తీస్తున్న విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో 'కుబేర' కోసం నాగార్జున, ధనుష్ కలిసి ఇందులో నటిస్తున్నారు. ఇదే వరుసలో రాయన్, ఇళయరాజా బయోపిక్ ఉంది. అయితే, ధనుష్ రెమ్యునరేషన్ భారీగా పెంచాడని తెలుస్తోంది. ఇళయరాజా సినిమా కోసం రూ. 50 కోట్ల రెమ్యునరేషన్ అడిగారని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది. అయితే, సినిమా కోసం కేవలం 50 రోజులకు మించి కాల్షిట్స్ ఇవ్వలేనని కూడా ఆయన ముందే చెప్పారట. ధనుష్ పారితోషికం రోజుకు కోటి రూపాయలకు పెరిగిందని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా రజనీకాంత్, విజయ్, అజిత్ వంటి ప్రముఖ నటులు 100 కోట్ల రూపాయలకు పైగా పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. అయితే వారు ఒక్కో సినిమాకు కనీసం 70 రోజులకు పైగా కేటాయిస్తారని టాక్ ఉంది. -
కూతుర్ని కోల్పోయా.. అందుకే బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవట్లేదు: ఇళయరాజా
ఇళయరాజా సంగీతం గలగల పారే గంగా ప్రవాహం. ప్రతి మనిషికి ఉత్సాహం. అలసిన మనసులకు ఆహ్లాదం. ఇళయరాజా 1943 జూన్ 3వ తేదీన జన్మించారు. ఇప్పుడీ సంగీత పిపాసి వయసు 81 సంవత్సరాలు. ఇప్పటికీ సంగీతమే ఇళయరాజా ప్రపంచం. 1000 కి పైగా చిత్రాలు, 4,500కు పైగా పాటలు.. అందుకే అందరూ ఇతన్ని సంగీత జ్ఞాని అంటారు. ఇన్నేళ్లలో ఎన్నో జాతీయ, రాష్ట్రీయ అవార్డులు ఈయనను వరించాయి.81వ బర్త్‌డే..అలాంటి సంగీత రారాజు ఇళయరాజా 81వ జన్మదినోత్సవం సందర్భంగా కమల్ హాసన్ సహా అనేకమంది ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులైతే ఈయనను చూడడానికి స్థానిక టీనగర్‌లోని ఇళయరాజా రికార్డింగ్ స్టూడియోకు పోటెత్తారు. ఆయనతో ఫొటోలు దిగడానికి బారులు తీరారు. ఇళయరాజా ఎంతో సహనంతో వచ్చిన అభిమానులందరినీ సంతోషపరిచేందుకు వారితో చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలు దిగడం విశేషం. సెలబ్రేట్ చేసుకోవడం లేదుఆయన మీడియాతో మాట్లాడుతూ పుట్టినరోజు సందర్భంగా మీరే తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారని, తాను మాత్రం తన కుమార్తెను కోల్పోవడం వల్ల ఎలాంటి పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం లేదని పేర్కొన్నారు. అయితే ఇదంతా మీ కోసమే కానీ తన కోసం కాదని ఇళయరాజా తెలిపారు. కాగా ఇళయరాజా కూతురు, గాయని, సంగీత దర్శకురాలు భవతారిణి క్యాన్సర్‌తో పోరాడుతూ జనవరిలో కన్నుమూశారు.చదవండి: ప్రకృతి ఒడిలో ఒకప్పటి హీరో కొత్తిల్లు.. 'నీకంత డబ్బు ఎక్కడిది?' -
ఇళయరాజా కూతురి చివరి సాంగ్ విడుదల
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా వారుసురాలు, గాయనీ, సంగీతదర్శకురాలు భవతారిణి కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. కాగా ఆమె చివరిగా అరియమల, పుయలిల్ ఒరు ధోనీ చిత్రాలకు సంగీతాన్ని అందించారు. అయితే, అరియమల అనే చిత్రంలో ఆమె ఒక పాటను ఆలపించారు. ఆ సాంగ్ అనంతరం భవతారిణి మరణించారు. తాజాగా ఆ చిత్ర మేకర్స్ పాటను విడుదల చేశారు.దర్శకుడు జేమ్స్ యువన్ దర్శకత్వంలో ఆర్ఎస్ కార్తీక్ హీరోగా నటిస్తున్న చిత్రం 'అరియమల'. ఈ చిత్రంలో మనీషా కథానాయికగా నటిస్తుండగా, మరిముత్తు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో దివంగత ప్లేబ్యాక్ సింగర్ ఇళయరాజా కుమార్తె భవతారిణి పాడిన 'అతిపూవా పోలా' అనే రొమాంటిక్ మెలోడియస్ సాంగ్ ప్రస్తుతం విడుదలైంది. నెట్టింట ఆ సాంగ్ తెగ వైరల్ అవుతుంది. తెలుగు ఆడియన్స్‌ను కూడా ఆ సాంగ్ మెప్పించేలా ఉంది. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రంలోని లిరికల్ సాంగ్ ఇప్పుడు విడుదలై అభిమానుల హృదయాలను ఉర్రూతలూగించింది. ముఖ్యంగా భవతారిణి వాయిస్‌ని మిస్ అవుతున్నామని అభిమానులు అంటున్నారు. సోదరులు యువన్ శంకర్‌రాజా, కార్తిక్ రాజాలాగే భవతారణి కూడా తండ్రి ఇళయరాజా వారసత్వాన్ని కొనసాగించారు. మ్యూజిక్ డైరెక్టర్‌గానే కాకుండా సింగర్‌గా కూడా తనదైన ముద్ర వేశారు. తెలుగులో కూడా ఆమె ఒక పాట ఆలపించారు.. 'నను నీతో నిను నాతో కలిపింది గోదారి' (గుండెల్లో గోదారి) చిత్రంతో తెలుగు వారిని కూడా మెప్పించారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె శ్రీలంకలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటూ మరణించారని సమాచారం. -
హిట్ సినిమా మేకర్స్‌కు ఇళయరాజా నోటీసులు
మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా తాజాగా మరో సినిమా యూనిట్‌కు నోటీసులు జారీ చేశారు. తను సంగీతం అందించిన పాటును అనుమతిలేకుండా ఉపయోగించుకున్నారని ఆయన నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఆయన పాటలను ఉపయోగించుకున్న పలు సినిమాలకు సంబంధించిన మేకర్స్‌కు కూడా నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.ఈ ఏడాదిలో మలయాళం నుచి విడుదలైన 'మంజుమ్మల్ బాయ్స్' సూపర్ హిట్ కొట్టింది. తెలుగు,తమిళ్లో కూడా మంచి విజయాన్ని అందుకుంది. అయితే 1991లో ఇళయరాజా- కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చిన గుణ చిత్రంలోని 'కణ్మణి అన్బోడు' పాటను ఈ చిత్రంలో ఉపయోగించారు. అయితే, తమ అనుమతి లేకుండా ఈ పాటను వాడుకున్నందుకు మంజుమ్మల్ బాయ్స్ చిత్ర నిర్మాణ సంస్థకు సంగీత స్వరకర్త ఇళయరాజా తరపున న్యాయవాది శరవణన్ నోటీసు పంపారు.కాపీరైట్ చట్టం ప్రకారం ఈ పాటకు పూర్తి హక్కులు ఇళయరాజాకు చెందినవని, అలాంటి సమయంలో పాటను ఉపయోగించుకోవడానికి హక్కులు పొందాలంటే.. వినియోగానికి తగిన పరిహారం చెల్లించాలని నోటీసులో పేర్కొనబడింది. లేకుంటే కాపీరైట్‌ను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లుగా చట్టపరమైన, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని నోటీసులో హెచ్చరించింది. రజనీకాంత్ నటిస్తున్న 'కూలి' చిత్రం టైటిల్ టీజర్లో తన సంగీతాన్ని అనుమతిలేకుండా వాడినట్టు సన్ పిక్చర్స్‌కు కూడా ఇళయరాజా నోటీసు పంపారు. -
ఆ పని నాది కాదు.. వైరముత్తుకు కౌంటర్ ఇచ్చిన ఇళయరాజా!
తమిళసినిమా: ఇతరుల గురించి పట్టించుకోవడం తన పని కాదని, అంత తీరిక కూడా తనకు లేదని, తన పనిని తాను సక్రమంగా చేసుకుంటున్నానని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా పేర్కొన్నారు. ఇటీవల ఈయన పేరు నిత్యం వార్తల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఇళయరాజా సంగీతాన్ని అందించిన పాటకు కాపీ రైట్స్ కోరుతున్న విషయం విధితమే. ఈ వ్యవహారం కోర్టులో ఉంది. ఇటీవల తన అనుమతి లేకుండా తన సంగీతాన్ని కాపీ కొట్టారంటూ సన్ పిక్చర్స్ సంస్థకు నోటీసులు కూడా జారీ చేశారు. అసలు సంగీతం గొప్పదా? సాహిత్యం గొప్పదా? అనే ప్రశ్నకు గీతరచయిత వైరముత్తు తెర లేపారు. ఇలాంటి పరిస్ధితుల్లో ఇళయరాజా గురువారం ఒక వీడియోను తన సామాజిక మాధ్యమం ద్వారా విడుదల చేశారు. అందులో ఇటీవల తన గురించి ఏవేమో వార్తలు వస్తున్నట్లు వింటున్నానన్నారు. అయితే వాటి గురించి పట్టించుకునే సమయం తనకు లేదని, అలాంటి వాటిపై దృష్టి పెట్టడం తన పని కాదన్నారు. తన పని తాను సక్రమంగా చేసుకుంటున్నానని, చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూనే, ఇతర కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నానని, అయినప్పటికీ 35 రోజుల్లో సింపోనీ రాసి పూర్తిచేసినట్లు చెప్పారు. ఇది సంతోషకరమైన విషయం అని పేర్కొన్నారు. ఇళయరాజా జూలై 14న భారీ సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్థానిక నందనంలోని వీఎంసీఏ గ్రౌండ్లో జరగనున్న ఈ సంగీత విభావరిలో ఇళయరాజా కనీసం 50 నుంచి 60 పాటలు పాడే అవకాశం ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు. pic.twitter.com/6Bkj59HOhi— Ilaiyaraaja (@ilaiyaraaja) May 16, 2024 -
అది జరగాలని కోరుకుంటున్నా.. రజనీకాంత్‌పై ధనుష్ కామెంట్
కోలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయికి ఎదిగిన నటుడు ధనుష్. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా రాణిస్తున్న ఈయన తాజాగా సంగీతజ్ఞాని ఇళయరాజా బయోపిక్‌లో నటిస్తున్నారు. కెప్టెన్ మిల్లర్ చిత్రం ఫేమ్ అరుణ్ మాధేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కనెక్ట్ మీడియా, పీకే ప్రైమ్ ప్రొడక్షన్, మెర్కురీ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుక, ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చైన్నెలోని ఓ హోటల్లో తాజాగా జరిగింది. ఇందులో నటుడు కమల్‌హాసన్, దర్శకుడు భారతీరాజా, వెట్రిమారన్, ఆర్వీ ఉదయకుమార్ మొదలగు పలువురు సినీ ప్రముఖులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటుడు ధనుష్ మాట్లాడుతూ భావనను బట్టే జీవి తం అంటారన్నారు. దాన్ని తాను నమ్ముతానన్నారు. పలువురు రాత్రుల్లో నిద్ర పట్టకపోతే ఇళయరాజా పాటలను వింటూ నిద్రపోతారన్నారు. అయితే తాను పలు రాత్రుళ్లు ఇళయరాజాగా నటిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ నిద్ర లేకుండా గడిపానన్నారు. తాను ఇద్దరి బయోపిక్‌లలో నటించాలని ఆశ పడ్డానని, అందులో ఒకరు రజనీకాంత్ కాగా, మరొకరు ఇళయరాజా అనీ అన్నారు. అందులో ఇళయరాజా బయోపిక్‌లో నటించే కల నెరవేరుతోందని అన్నారు. ఈ అవకాశం తనకు రావడం గర్వంగా ఉందన్నారు. ఇళయరాజా సంగీతమే తనకు అండ అని, ఇది అందరికీ తెలుసని పేర్కొన్నారు. ఈ చిత్రంలో నటించడం ఛాలెంజ్, ప్రెజర్ అని అంటున్నారని, నిజానికి అలాంటిదేమీ లేదని, జాలీగా నటించడమేనని ధనుష్ పేర్కొన్నారు. అదేవిధంగా విడుదలై చిత్ర పాటల రికార్డింగ్ సమయంలో తనను పాడమని ఇళయరాజా చెప్పినప్పుడు మీరు ఇక్కడే ఉంటారా? అని అడిగానన్నారు. అందుకాయన తాను ఎప్పుడు మీతో లేకుండా ఉండాను అని పేర్కొన్నట్లు తెలిపారు. కాగా ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని, నీరవ్‌షా ఛాయాగ్రహణం అందిస్తున్నారు. -
Ilaiyaraaja Biopic:వెండితెరకి ఇళయరాజా జీవితం
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా జీవితం వెండితెరపైకి వస్తోంది. ధనుష్ లీడ్ రోల్లో నటిస్తున్న ‘ఇళయరాజా’ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ మూవీకి అరుణ్మాథేశ్వరన్ దర్శకుడు. కనెక్ట్ మీడియా, పీకే ప్రైమ్ ప్రొడక్షన్, మెర్క్యూరీ మూవీస్ సమర్పణలో రూ΄÷ందుతున్న ‘ఇళయరాజా’ షూటింగ్ బుధవారం చెన్నైలో ప్రారంభమైంది. ఈ వేడుకకి ఇళయరాజా, హీరోలు కమల్‌హాసన్, ధనుష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇళయరాజాతో తమకున్న అనుబంధాన్ని కమల్‌హాసన్, ధనుష్ పంచుకున్నారు. కాగా ఈ మూవీ ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కాగా ఈ మూవీకి ఇళయరాజా సంగీతం అందిస్తారని కోలీవుడ్ టాక్. -
మాజీ అల్లుడితో రజినీకాంత్.. ఆ దిగ్గజం బయోపిక్ కోసమే?
సాధారణంగా స్టార్ హీరోలు ఇద్దరు కలిసి నటిస్తే పెద్ద విషయమేం కాదు. కానీ ముగ్గురు ప్రముఖ హీరోలు ఒకే మూవీలో కలిసి నటిస్తే మాత్రం విశేషమని చెప్పొచ్చు. ఇలాంటిదే త్వరలో తమిళ చిత్రసీమలో జరగబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ధనుష్ 'రాయన్' సినిమాతో బిజీగా ఉన్నాడు. హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తున్నాడు. దీని తర్వాత దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా బయోపిక్‌లో టైటిల్ రోల్ చేయబోతున్నాడు. (ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా) ఇప్పటి జనరేషన్‌కి తెలియకపోవచ్చు గానీ 90ల్లో సినిమాలు చూసిన వాళ్లకు ఇళయరాజా పాటల్లోనే మ్యాజిక్ ఏంటనేది తెలుస్తుంది. దక్షిణాదిలో స్టార్ హీరోల సినిమాలకు సంగీతమందించిన ఈయన.. దశాబ్దాల పాటు గుర్తుండిపోయే పాటలు ఇచ్చారు. ఇప్పుడు ఈయన జీవితాన్నే సినిమాగా తీయబోతున్నారు. ఇందులోనే కమల్ హాసన్-రజినీకాంత్ అతిథి పాత్రల్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. రజినీకాంత్ కూతురు ఐశ్వర్యని గతంలో పెళ్లి చేసుకున్న ధనుష్.. కొన్నేళ్ల క్రితం విడాకులు ఇచ్చేశాడు. దీంతో రజినీకాంత్‌కి ఇతడు మాజీ అల్లుడు అయిపోయాడు. అయినా సరే ఇప్పుడు రజినీకాంత్.. ధనుష్ సినిమాలో కనిపించబోతున్నాడనే వార్త ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. బహుశా ఇళయరాజా బయోపిక్ కావడం వల్లే ఒప్పుకొని ఉంటాడని నెటిజన్స్ అనుకుంటున్నారు. ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవి ఖరీదైన కొత్త వాచ్.. రేటు తెలిస్తే మైండ్ బ్లాకే) -
ఇళయరాజా కూతురు భవతారిణి చివరి చిత్రం ఇదే..
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా వారుసురాలు, గాయనీ, సంగీతదర్శకురాలు భవతారిణి కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో కన్నుమూశారు. కాగా ఆమె చివరిగా సంగీతాన్ని అందించిన తమిళ చిత్రం 'పుయలిల్ ఒరు ధోనీ' త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈశన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నూతన తారలు విష్ణుప్రకాశ్, అర్చనాసింగ్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్ర వివరాలను మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో దర్శకుడు వెల్లడిస్తూ.. మహిళల గొంతుకగా ఈ చిత్రం ఉంటుందన్నారు. తాను కథను సిద్ధం చేసుకున్నప్పుడే భవతారిణే దీనికి సంగీతాన్ని అందించాలని నిర్ణయించుకున్నానన్నారు. చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసిన తరువాత భవతారిణిని కలిసి చిత్రాన్ని చూపించానన్నారు. చిత్రం నచ్చడంతో ఆమె సంగీతాన్ని అందించడానికి అంగీకరించినట్లు చెప్పారు. ఇందులో రెండు పాటలు ఉంటాయని, రెండింటినీ గీత రచయిత స్నేహన్ రాశారని చెప్పారు. ఈ పాటలకు భవతారిణి చాలా వేగంగా సంగీతాన్ని సమకూర్చారన్నారు. ఇందులో ఓ పాటను సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ ,మానసీ కలిసి పాడారని, మరో పాటను సంగీత దర్శకుడు కార్తీక్‌రాజా పాడారని చెప్పారు. రెండు పాటలు చాలా బాగా వచ్చాయని, ఇవి సంగీత ప్రియులకు కచ్చితంగా నచ్చుతాయన్నారు. నేపథ్య సంగీతాన్ని చాలా బాగా రూపొందించారని, త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న ఈ పుయలిల్ ఒరు ధోని చిత్ర విజయాన్ని సంగీతదర్శకురాలు భవతారిణికి అంకితం చేస్తామని దర్శకుడు చెప్పారు. -
ఇళయరాజా కుమార్తె, సంగీత దర్శకురాలు భవతారణి కన్నుమూత
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన కుమార్తె, గాయని భవతారణి రాజా (47) కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధ పడుతూ గురువారం రాత్రి శ్రీలంకలో కన్నుమూశారు. నేడు ఆమె భౌతికకాయాన్ని చెన్నైకు తీసుకురానున్నారు. శుక్రవారమే అంత్యక్రియలు జరుగుతాయని తెలిసింది. ఇళయరాజాకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో కార్తీక్ రాజా, యువన్ శంకర్ రాజా సంగీత దర్శకులు. కుమార్తె భవతారణ సంగీత దర్శకురాలిగా, గాయనిగా రాణిస్తున్నారు. మలయాళ త్రీడీ ‘మై డియర్ కుట్టి చాత్తాన్’ (1984) గాయనిగా భవతారణికి తొలి చిత్రం. ప్రభుదేవా హీరోగా నటించిన ‘రాసయ్య’ (1995) చిత్రం ద్వారా గాయనిగా కోలీవుడ్‌కి పరిచయమయ్యారు భవతారణి. అదే విధంగా ‘భారతి’ (2000) చిత్రంలోని ‘మైలు పోల పొన్ను..’ అనే పాటకు గాను జాతీయ ఉత్తమ గాయనిగా కేంద్ర ప్రభుత్వ అవార్డును అందుకున్నారామె. తెలుగులోనూ పలు పాటలు పాడారు. తండ్రి, సోదరుల సంగీత దర్శకత్వంలో అనేక పాటలను పాడారు భవతారణి. దాదాపు పాతిక చిత్రాల్లో పాటలు పాడారు. తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం ‘గుండెల్లో గోదారి’ సినిమాలో ‘నన్ను నీతో..’ పాటను పాడారామె. మెలోడీ పాటలతో సంగీత అభిమానుల హృదయాలలో చోటు దక్కించుకున్నారు. 2002లో నటి రేవతి దర్శకురాలిగా తెరకెక్కించిన తొలి చిత్రం ‘మిత్ర్: మై ఫ్రెండ్’తో సంగీత దర్శకురాలిగా మారారు భవతారణి. సల్మాన్ ఖాన్, అభిషేక్ బచ్చన్, శిల్పాశెట్టి ముఖ్య తారలుగా వచ్చిన హిందీ చిత్రం ‘ఫిర్ మిలేంగే’ (2004) సినిమాకు ఓ సంగీత దర్శకురాలిగా చేశారు. హిందీలో ఆమెకు ఇది తొలి చిత్రం. తెలుగులో ‘అవునా’(2003), కన్నడలో ‘గీయా గీయా’ (2005) సినిమాలకు సంగీతం అందించారు భవతారణి. దాదాపు పది చిత్రాలకు సంగీతదర్శకురాలిగా చేశారు. అడ్వరై్టజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆర్. శబరిరాజ్‌తో భవతారణి వివాహం జరిగింది. వీరికి సంతానం లేరు. భవతారిణి మృతి పట్ల పలువురు చిత్రరంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
రెహమాన్, ఇళయరాజాలకు అవార్డులు.. ఆ సినిమాలకే
గత 14 ఏళ్ల నుంచి నార్వే చిత్రోత్సవారాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తమిళంలో ఉత్తమ చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల్ని ఎంపిక చేసి ప్రతి ఏడాది అవార్డులు ఇస్తుంటారు. అలా ఈ సారి కూడా 20 చిత్రాలకు చెందిన యాక్టర్స్, టెక్నీషియన్స్‌కి పురస్కారాలు అందజేయనున్నారు. అయితే వీరిలో దిగ్గజ సంగీత దర్శకులు ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ కూడా ఉండటం విశేషం. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి రానున్న 21 సినిమాలు) జనవరి 25న 15వ నార్వే చిత్రోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఉత్తమ చిత్రం 'చిత్తా' (నిర్మాత సిద్ధార్థ్), ఉత్తమ నటుడు సూరి (విడుదలై –1), ఉత్తమ నటి ప్రీతి అస్రాని (అయోతి), ఉత్తమ దర్శకుడు మారి సెల్వరాజ్ (మామన్నన్), ఉత్తమ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (మామన్నన్, పొన్నియిన్ సెల్వన్–2), ఉత్తమ నిర్మాణ సంస్థ కేజే గణేష్ (చిత్రం యాత్తిసై ), ఉత్తమ ప్రతినాయకుడు ఫాహద్ ఫాజిల్ (మామన్నన్), ఉత్తమ సహాయ నటుడు (లేట్) పూరాము (చిత్రం కిడా), ఉత్తమ సహాయ నటి అబర్ణతి (ఇరుగపట్రు), ఉత్తమ గాయకుడు ఇళయరాజా (విడుదలై –1) ఉత్తమ గాయని శ్వేతామోహన్ (వాత్తి) అవార్డులు గెలుచుకున్నారు. (ఇదీ చదవండి: 'సలార్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది) -
వాటి గురించి ఆలోచించడం మానేశా
‘‘నన్ను అందరూ ‘ఇసైజ్ఞాని’ అని పిలుస్తుంటారు. నిజం చెప్పాలంటే ఆ పేరుకు నేను అర్హుడినా? అని ఆలోచిస్తే నాకే ప్రశ్నార్థకంగా ఉంటుంది’’ అని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా అన్నారు. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ వేడుకలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘నాకు భాష, సాహిత్యంపై అంత పరిజ్ఞానం లేదు. కర్ణాటక సంగీతాన్ని ఔపోసన పట్టలేదు. కానీ, ప్రజలు నన్ను ఇసైజ్ఞాని అని పిలుస్తున్నారు. కానీ, నేను ‘ఇసైజ్ఞాని’ అనుకోవడం లేదు. నా గర్వాన్ని చిన్న వయసులోనే వదిలేశా. అన్నతో కలిసి నేను కచేరీలకు వెళ్లే సమయంలో హార్మోనియం వాయిస్తుంటే ప్రేక్షకులు చప్పట్లుకొడుతూ అభినందించేవారు. ఆ సమయంలో ఎంతో గర్వంగా ఉండేది. అయితే ఆ అభినందనలు నాకు కాదు.. నేను సృష్టించే బాణీలకు వస్తున్నాయని తెలుసుకున్నా. మనకు ఏ విషయంతో సంబంధం లేదని గ్రహించాను. అందుకే కీర్తి ప్రతిష్టల గురించి ఆలోచించడం మానేశాను’’ అని పేర్కొన్నారు. -
విజయ్ సినిమాలో అదిరిపోయే సర్ప్రైజ్లు..
సంగీతజ్ఞాని ఇళయరాజా, దళపతి విజయ్ 23 ఏళ్ల తరువాత కలిశారు.. చాలా ఆసక్తిగా ఉంది కదూ. ఆ కథేంటో చూద్దాం. విజయ్ తాజాగా నటిస్తున్న తన 68 చిత్రానికి ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే పేరును ఇటీవలే ఖరారు చేశారు. హాలీవుడ్ చిత్రాల తరహాలో ఆంగ్లంలో ఉన్న ఈ టైటిల్‌పై సర్వత్రా చర్చ జరుగుతోంది. అదే విధంగా ఈ చిత్రంలో పలు ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకోవడం విశేషం. ముఖ్యంగా ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం చేయడంతో పాటు భారీ తారాగణం ఉండబోతుంది. మీనాక్షి చౌదరి, స్నేహ, లైలా, మైక్ మోహన్, ప్రశాంత్, ప్రభుదేవా, వైభవ్, ప్రేమ్‌జీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వెంకట్‌ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. తాజా షెడ్యూల్ కోసం యూనిట్ వర్గాలు శ్రీలంక బయలుదేరనున్నాయి. కాగా ఇళయరాజా సోదరుడు, వెంకట్‌ప్రభు తండ్రి, సంగీత దర్శకుడు, గీత రచయిత, దర్శకనటుడు గంగై అమరన్ ఈ చిత్రం కోసం ఒక పాట రాయడం విశేషం. మరో విశేషం ఏమిటంటే ఈ పాటను నటుడు విజయ్, సంగీత దర్శకుడు ఇళయరాజా కలిసి పాడారన్నది తాజా సమాచారం. వీరిద్దరూ కలిసి 1995లో రాజావిన్ పార్వైయిల్, 1997లో కాదలుక్కు మరియాదై, 2000 సంవత్సరంలో కన్నుక్కుల్ నిలవు, 2001లో ఫ్రెండ్స్ చిత్రాల్లో కలిసి పని చేశారు. తాజాగా ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చిత్రంలో కలిసి పాడడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. చదవండి: ఓటీటీలో ఆ సూపర్ హిట్ ప్రీక్వెల్.. మీరు చూశారా? -
ఇళయరాజా బయోపిక్‌లో ధనుష్
సంగీత జ్ఞాని ఇళయరాజా జీవితం వెండితెరపైకి రానుంది. ఇందులో ధనుష్ ఓ ప్రధాన పాత్రలో నటించనున్నారు. మెర్క్యూరీ గ్రూప్, కనెక్ట్ మీడియా సంస్థలు ఈ బయోపిక్‌ను నిర్మించనున్నాయి. వచ్చే ఏడాది అక్టోబరులో ఈ చిత్రం షూటింగ్ప్రారంభించి, 2025 ఏడాది మధ్యలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా మెర్క్యూరీ గ్రూప్ సీఈవో, ఎండీ శ్రీరామ్ భక్తి శరణ్ మాట్లాడుతూ –‘ప్రాంంతీయ కథలతో సినిమాలు తీస్తే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. అందుకే లోకల్,ప్రాంతీయ కథలను అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘రాబోయే రెండు దశాబ్దాల్లో భారతీయ వినోద పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుంది. ప్రపంచ వినోద పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన మెర్క్యూరి సంస్థతో మెగా బడ్జెట్ సినిమాలను నిర్మించడానికి వారితో చేతులు కలపడం మాకు సంతోషంగా ఉంది’’ అని కనెక్ట్ మీడియా ప్రతినిధి వరుణ్ మాథుర్ అన్నారు. -
ఇళయరాజాగా ధనుష్..!
నటుడు ధనుష్, సంగీత దర్శకుడు ఇళయరాజాగా మారనున్నారా అన్న ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. బహుభాషా నటుడిగా రాణిస్తున్న ధనుష్ తమిళంతో పాటు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అంత బిజీలోనూ ప్రస్తుతం మెగాఫోన్ పట్టి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హీరోగానూ నటిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇది ఈయన నటిస్తున్న 50వ చిత్రం కావడం విశేషం. దీంతో పాటు తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న 51వ చిత్రంలోనూ నటిస్తున్నారు. కాగా ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇది పీరియడ్ కథాంశంతో తెరకెక్కుతున్న కథా చిత్రం. కాగా సంగీత దర్శకుడు ఇళయరాజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. మెలోడి మాస్టర్. తన సంగీతంతో గుక్కపట్టి ఏడ్చే పసిపిల్లలను కూడా చిరునవ్వులతో కేరింతలు కొట్టించే శక్తి ఈయన సంగీతంలో ఉందనడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. నాలుగు దశాబ్దాలకు పైగా సంగీత ప్రియులను అలరిస్తున్న ఇళయరాజా 1000 చిత్రాలకు పైగా సంగీతాన్ని అందించి అసాధారణ రికార్డును సాధించారు. కాగా సంగీత మేధావి బయోపిక్ చిత్రంగా తెరకెక్కనున్నట్లు, దీనిని ఆయనే నిర్మించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ తరువాత ఆ ఊసే లేదు. అలాంటిది ఇప్పుడు మళ్లీ ఇళయరాజా బయోపిక్ గురించి చర్చ జరుగుతోంది. ఈ చిత్రంలో ఇళయరాజాగా ధనుష్ నటించడానికి సిద్ధం అవుతున్నట్లు టాక్. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ చిత్రం 2024లో సెట్‌పైకి వెళ్లనుందని, 2025లో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
షేన్ వాట్సన్ ఇళయరాజా పాట
ఒక ఇంటర్య్వూలో ‘డూ యూ హ్యావ్ ఎనీ స్పెషల్ టాలెంట్స్?’ అనే ప్రశ్నకు సమాధానంగా గిటారు చేతిలోకి తీసుకున్నాడు ఆస్ట్రేలియన్ క్రికెటర్ షేన్ వాట్సన్. ఆంగ్ల పాట ట్యూన్ ఏదో ప్లే చేస్తాడు అని మనం అనుకునేలోపే ఇళయరాజా పాట ‘ఎన్ ఇనియ పొన్నిలావే’ కొంచెం ప్లే చేసి ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
ఇళయరాజాతో నా అనుబంధం: రాజేంద్ర ప్రసాద్
-
ఆరోజు ఇళయరాజా విషయంలో నన్ను చాలా తప్పు పట్టారు
-
ఆ విషయంలో నా భార్యకి కూడా టైం కేటాయించను
-
నా సంగీత జీవితంలో తెలుగు భాష చాలా గొప్పది
-
SP బాలసుబ్రహ్మణ్యం తో సహా ఏ సింగర్ ని మెచ్చుకోలేదు..నా జీవితంలో..!
-
నా సంగీత జీవితానికి ముగింపు లేదు: ఇళయరాజా
-
కెరీర్ బిగినింగ్ లో గిటారిస్ట్ గా పనిచేశాను
-
నేను పాడొద్దు అంటూ ఇళయరాజా గారు నిషేధం చేశారు
-
సాక్షి అగర్వాల్ కొత్త మూవీ .. సరికొత్త కాన్సెప్ట్‌తో!
సాక్షి అగర్వాల్ రాజా రాణి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టిన హీరోయిన్ సాక్షి అగర్వాల్. ఆ తర్వాత తమిళం, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించింది. తాజాగా సాక్షి అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం సారా. ఈ మూవీ షూటింగ్ వినాయక చవితి సందర్భంగా చైన్నెలోని ఇళయరాజా రికార్డింగ్ స్టూడియోలో ప్రారంభించారు. విజయ్ విశ్వ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో యోగిబాబు, రోబో శంకర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఆర్.విజయలక్ష్మి, చెల్లమ్మాళ్ గురుస్వామి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రజిత్ కన్నా దర్శకత్వం వహిస్తున్నారు. కార్తీక్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలకు సంగీత దర్శకుడు ఇళయరాజా ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. (ఇది చదవండి: చంద్రబాబు అరెస్ట్.. స్టార్ హీరో సంబరాలు!) తనకి అవకాశాన్ని కల్పించిన దర్శకుడికి సాక్షి అగర్వాల్ ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రం సరికొత్త అనుభవాన్నిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కార్తీక్‌రాజా సంగీత దర్శకత్వంలో నటించడం గర్వంగా ఉందని నటుడు విజయ్ విశ్వ పేర్కొన్నారు. చిత్ర దర్శకకుడు వివరాలను తెలుపుతూ క్లిష్టమైన పరిస్థితుల్లో ఒక యువతి తన కోసం అన్ని వదులుకొని వచ్చిన ప్రేమికుడిని కాపాడుతుందా? లేక తన కోసం త్యాగం చేసిన స్నేహితుడిని కాపాడుతుందా? అన్న ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రమని తెలిపారు. హీరోయిన్ ఇతివృత్తంతో యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రేక్షకులకు కచ్చితంగా మంచి అనుభూతిని కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. -
31 ఏళ్ల తర్వాత వారిద్దరి కాంబోలో మరో సినిమా!
తమిళ సినిమా: లెజెండరీ దర్శకుడ భారతీరాజా, సంగీత దర్శకుడు ఇళయరాజా 31 ఏళ్ల తర్వాత మళ్లీ ఒక చిత్రంలో కలిసి పని చేయడం విశేషం. వీరి కాంబినేషన్లో చివరిగా నాడోడి తెండ్రల్ చిత్రం వచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకు దర్శకుడు సుశీంద్రన్ తన వెన్నెల ప్రొడక్షనన్స్ పతాకంపై నిర్మిస్తున్న మార్గళి తింగల్ చిత్రంతో ఈ మ్యాజిక్ జరిగింది. ఈ చిత్రం ద్వారా దర్శకుడు భారతీరాజా వారసుడు, నటుడు మనోజ్ భారతీరాజా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన తాజ్ మహల్ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించిన మనోజ్ మెగా ఫోన్ పట్టి తొలి ప్రయత్నంలోనే తన తండ్రిని డైరెక్ట్ చేయడం విశేషం. భారతీరాజా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో పలువురు నూతన నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. దీని గురించి దర్శకుడు సుశీంద్రన్ తెలుపుతూ నటుడు మనోజ్ భారతీరాజాను తన చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అదనపు బలం అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా ఇటీవల ఈ చిత్రం పాటల రికార్డింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలి చిత్రంతోనే తన తండ్రి భారతీరాజాను డైరెక్ట్ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందని మనోజ్ పేర్కొన్నారు. -
ఇళయరాజా బయోపిక్.. ఛాన్స్ కొట్టేసిన ఆ స్టార్ హీరో
ఇళయరాజా.. ఈ పేరు సంగీతానికి చిరునామా. చాలా భాషల్లో పనిచేసిన సంగీతజ్ఞాని. ఈయనలో అద్భుత గాయకుడు, గీతరచయిత ఉన్నారు. మాస్ట్రో ఇళయరాజాది సంగీతంలో సింపోని చేసిన ఘనత. ఇప్పటికే 1400 చిత్రాలకు పైగా పనిచేసి చరిత్ర సృష్టించారు. అలాంటిది ఈయన జీవిత చరిత్రని సినిమా తీస్తే.. అవును మీరు విన్నది నిజమే. ఇప్పుడీ ఈ ఆలోచన బాలీవుడ్ ప్రముఖ దర్శకుడికి వచ్చింది. (ఇదీ చదవండి: నా మనసులో ఉన్నది అతడే.. ఆల్రెడీ పెళ్లి!: రష్మిక) హిందీలో పలు చిత్రాలు తీసి ప్రేక్షకుల్ని అలరిస్తున్న డైరెక్టర్ బాల్కీ.. ఇప్పటికే హీరో ధనుష్‌తో 'షమితాబ్' సినిమా తీశారు. ఇందులో బిగ్‌బీ అమితాబ్ కూడా నటించారు. అలానే బాల్కీతో నటుడు ధనుష్‌కు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఈ క్రమంలోనే సంగీత దర్శకుడు ఇళయరాజాగా ధనుష్‌ని చూడాలని బాల్కీ ఆశపడుతున్నారు. ఇళయరాజా బయోపిక్ తీయాలనుకుంటున్నా, ఇది తన డ్రీమ్ అని రీసెంట్గా ఓ మీటింగ్‌లో చెప్పుకొచ్చారు. ఇందులో ఇళయరాజాగా నటుడు ధనుష్‌తో యాక్ట్ చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ధనుష్ కూడా మంచి సింగర్, లిరిక్ రైటర్, డైరెక్టర్, నిర్మాత అన్న విషయం తెలిసిందే. అలానే ఇళయరాజాగా నటించేందుకు ధనుష్ ఆసక్తితో ఉన్నట్లు సమాచారం. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: ఓటీటీల్లోకి ఈ శుక్రవారం 18 మూవీస్) -
ఇళయరాజా గారిని చూస్తే ఇప్పటికి భయం..
-
ప్రేమమ్ దర్శకుడు కొత్త సినిమా, హిట్ కోసం వెయిటింగ్!
దర్శకుడు ఆల్ఫోన్స్ పుత్రన్ 2015లో తెరకెక్కించిన సూపర్ హిట్ మలయాళ చిత్రం ప్రేమమ్. ఈ ఒక్క చిత్రంతో నటుడు నివీన్ బాలి, సాయిపల్లవి, మడోనా సెబాస్టియన్, అనుపమ పరమేశ్వరన్‌లకు మంచి సినీ జీవితం ఇచ్చాడు ఆల్ఫోన్స్. అంతకుముందు ఇతడు తమిళంలో నేరం అనే సక్సెస్ఫుల్ చిత్రాన్ని చేశారు. ప్రేమమ్ చిత్రం తరువాత చాలా గ్యాప్ తీసుకుని గత ఏడాది పృథ్వీరాజ్, నయనతార జంటగా గోల్డ్ అనే చిత్రాన్ని రూపొందించారు. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. తాజాగా దర్శకుడు ఆల్ఫోన్స్ పుత్రన్ మరో చిత్రానికి సిద్ధమయ్యారు. దీనికి గిఫ్ట్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ చితత్రానికి ఆయన కథ, కథనం మాటలు ఎడిటింగ్, కలర్ గ్రేడింగ్, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించడం విశేషం. రోమియో పిక్చర్స్ పతాకంపై రాహుల్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నృత్య దర్శకుడు శాండి, నటి కోవైసరళ, సహానా సర్వేశ్, నటి మహాలక్ష్మి, సంపత్‌రాజ్, రాహుల్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సంగీతజ్ఞాని ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. వైవిధ్యభరితమైన ప్రేమ కథతో తెరకెక్కిస్తున్న ఇందులో 7 పాటలు ఉండబోతున్నాయట. గిఫ్ట్ చిత్రం ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటోందని యూనిట్ వర్గాలు తెలిపాయి. చదవండి: టాప్ హీరోతో ఒకే ప్లేట్లో భోజనం చేసిన స్నేహితులు -
ఇళయారాజా బర్త్‌డే.. ఇంటికి వెళ్లి మరీ విష్ చేసిన తమిళనాడు సీఎం
సంగీతాన్ని నవరసాల్లో నాట్యం చేయించే రారాజు ఇళయరాజా. సంగీతానికి రాళ్లను కరిగించే శక్తి ఉంటుందంటారు. ఇళయరాజా సంగీతంలో అంత మాధుర్యం ఉంటుంది. 80 వసంతాల ఇళయరాజా నేటికీ సంగీత రారాజుగానే కొనసాగుతున్నారు. శుక్రవారం ఆయన 80వ పుట్టినరోజు. ఇది సంగీతానికే జన్మదినం అన్నంతగా సంగీత ప్రియులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఈ సంగీత జ్ఞానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వయంగా ఇళయరాజా ఇంటికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు అందించి శాలువాతో సత్కరించారు. స్టాలిన్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో.. తొలిపొద్దు మధురంగా మారడానికి, ప్రయాణాలు సుఖవంతం కావడానికి, ఆనందమయం కావడానికి, కష్టాలు గాలిలో కలిసిపోవడానికి, రాత్రులు ప్రశాంతమయం కావడానికి కారణం సంగీత జ్ఞాని ఇళయరాజానే. ఆయన మన హృదయాలను రంజింపజేస్తున్నారు. తమిళ చిత్ర సీమకు మాత్రమే కాకుండా సంగీత ప్రపంచానికే ఆయన ఒక విప్లవం. అందుకే కరుణానిధి ఆయనను సంగీత జ్ఞాని అని కొనియాడారు. ఆయన సంగీతానికి మైమరచిపోయే అభిమానుల్లో ఒకరినైన నేను ఆ గొప్ప కళాకారుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపడానికి ఆనందిస్తున్నాను. మా హృదయాల్లో కోట కట్టి, జెండా నాటిన మీరు ఎప్పటికీ రాజానే, శతాధిక వసంతాలు దాటిన ఇళయరాజానే‘ అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. నటుడు కమల్ హాసన్ సైతం ఇళయారాజాకు ట్విటర్లో విష్ చేశారు. ‘సినీ సంగీతం 8 దశాబ్దాలు అధిగమించి సంతోషంగా కొనసాగుతోంది. ఇళయరాజా అనే ఐదు అక్షరాలు భారతీయ సినీ సంగీతంలో అపూర్వస్వరాలు అనేంతగా తన సంగీత సింహాసనాన్ని ఏర్పరచుకున్న తన ప్రియమైన, అన్నయ్య ఇళయరాజాకు హ్యాప్ బర్త్‌డే' అని పేర్కొన్నారు. చదవండి: విషమంగా పంచ్ ప్రసాద్ ఆరోగ్యం -
నా కొడుక్కి 17 ఏళ్లు, ఓ రోజు సడన్‌గా నా దగ్గరకు వచ్చి: కేటీఆర్
'మ్యూజిక్ స్కూల్ సినిమా డైరెక్టర్, నిర్మాత పాపారావు బియ్యాల నాకు మంచి మిత్రుడు, తెలంగాణ ఉద్యమం అప్పుడు ఇక్కడే పని చేశారు. పాపారావు సినిమా తీశారనగానే చాలా ఆశ్చర్యపోయా. పేరెంట్స్ తమ పిల్లలు ఇంజనీర్, లేదంటే డాక్టర్ కావాలనుకుంటున్న ధోరణిని సినిమాలో చూపించారు. మనకు కావాల్సింది ఇంజనీర్లు మాత్రమే కాదు ఆర్టిస్టులు కూడా' అన్నారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. శ్రియ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మ్యూజిక్ స్కూల్. శర్మన్ జోషి, ప్రకాశ్ రాజ్, నటి లీలా సామ్సన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ నెల 12న విడుదల కానుంది. శనివారంనాడు హైదరాబాద్‌లో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 'నా కొడుక్కి 17 సంవత్సరాలు. మూడు నెలల కిందట సడన్‌గా ఒక రోజు నా దగ్గరకు వచ్చి ఓ సాంగ్ పాడాను, రిలీజ్ చేస్తున్నా అని చెప్పడంతో ఆశ్చర్యపోయా. చాలామందిలో హిడెన్ టాలెంట్ ఉంటుంది. మనం వాటిని తొక్కేయకుండా ఎంకరేజ్ చేయాలి. ఇళయరాజా గారు తెలంగాణలో మ్యూజిక్ ఇండస్ట్రీ పెట్టాలి' అన్నారు. ఇళయరాజా మాట్లాడుతూ.. 'మ్యూజిక్ ఉంటే వైలెన్స్ ఉండదు, చీటింగ్ ఉండదు. మ్యూజిక్ ఉంటే లక్ష్మి ఉంటుంది, సరస్వతి ఉంటుంది. కేటీఆర్ చెప్పినట్టు మ్యూజిక్ యూనివర్సిటీ వస్తే ఇక్కడ 200 మంది ఇళయరాజాలు తయారు అవుతారు. దేశం మొత్తం కూడా ఇక్కడ పర్ఫామెన్స్ ఇస్తారు' అని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రియ, దిల్ రాజు, జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. -
ఇళయరాజా కుటుంబంలో తీవ్ర విషాదం
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఇళయరాజా అన్నయ్య కొడుకు పావలర్ శివన్ (60) మంగళవారం గుండెపోటుతో కన్నుమూశారు. ఇళయరాజా అన్నయ్య పేరు పావలర్ వరదరాజన్. ఈయన గాయకుడు, గీత రచయిత, సంగీత దర్శకుడు, నాటక రచయిత.. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆరంభ కాలంలో ఇళయరాజా ఎదుగుదలలో ఈయన పాత్ర ఉంది. పావలర్ వరదరాజన్ 1973లో కన్నుమూశారు. ఈయన ఇద్దరు కొడుకులు ఒకరు 2020లో కిడ్నీ సమస్య కారణంగా మరణించారు. కాగా మరో కొడుకు పావలర్ శివన్. ఈయన గిటార్ వాయిద్య కళాకారుడు. ఇళయారాజా సంగీత బృందంలోనే కొనసాగుతూ వచ్చారు. పావలర్ శివన్ రెండు మూడు చిత్రాలకు సంగీత దర్శకుడుగా కూడా పని చేశారు. ఈయన కుటుంబ సభ్యులతో కలిసి పాండిచ్చేరిలో నివసిస్తున్నారు. కాగా మంగళవారం వేకువజామున అనూహ్యంగా గుండెపోటు కారణంగా మంచంపై నుంచి కిందకి పడిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన మృతికి సంగీత దర్శకులు, పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. చదవండి: కమల్, వాణి గురించి చెప్పినా శ్రీవిద్య వినలేదు, పాపం! -
ఇళయరాజా అరుదైన ఫొటోలు.. చూశారా
-
మాస్ట్రో ఇళయరాజాకు ఘనంగా సన్మానం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో "ట్రిబ్యూట్ టు ఇళయరాజా " మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించారు. ఆదివారం ఇళయరాజా లైవ్ కన్సర్ట్ జరగనున్న నేపథ్యంలో శనివారం "ట్రిబ్యూట్ టు ఇళయరాజా" ఈవెంట్ సాయంత్రం 6:30 నుంచి 10.00 గంటల వరకు రెడ్ కార్పెట్ ఈవెంట్ కార్యక్రమం కొనసాగింది. హైదరాబాద్ టాకీస్ వారి ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ జరిగింది. ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన సినిమాలలోని అలనాటి మధురమైన పాటలను ఆయన ముందే గాయనీ గాయకులు వీనులవిందుగా ఆలపించారు. ఇళయరాజా పాటలు శ్రోతలను ఉర్రూతలూగించాయి. అనంతరం ఇళయరాజాకు సన్మానం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితుల ఆశీర్వచనాలతో సత్కరించారు. ప్రముఖ దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు, గాయనీగాయకులు ఇళయరాజాను శాలువాతో సన్మానించారు. దర్శకుడు కోదండరామిరెడ్డి, నిర్మాత అశ్వినీదత్, సంగీత దర్శకులు మణిశర్మ, ఆర్.పీ.పట్నాయక్, పాటల రచయిత హరి రామజోగయ్య శాస్త్రి, నిర్మాత సి.కళ్యాణ్, నటుడు మురళీమోహన్, ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్, గాయని సునీత, నటుడు రఘుబాబులు ఇళయరాజాను సన్మానించారు. ఇళయరాజా 80 ఏళ్ల వయసులోకి అడుగుపెడుతున్న సందర్బంగా 80 ఏళ్ల లోగోను ప్రముఖ రచయితా విజయేంద్రప్రసాద్ రిమోట్‌తో ఆవిష్కరించారు. కమ్మని సంగీతం..ఎంత విన్నా...వినాలనిపించే సాహిత్యం ఇళయరాజా పాటల్లో ఉంటుందని అని సినీ ప్రముఖులు కొనియాడారు. -
హైదరాబాద్: ట్రాఫిక్ అలర్ట్.. ఆ రూట్లలో వెళ్లకపోవడమే మంచిది!
సాక్షి,గచ్చిబౌలి(హైదరాబాద్): గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపు, భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా లైవ్ కన్సర్ట్కు 17,520 మంది హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందన్నారు. లింగంపల్లి నుంచి గచ్చిబౌలి జంక్షన్‌కు వచ్చే వాహనాలను హెచ్‌సీయూ బస్ డిపో వద్ద ఎస్ఎంఆర్ వినయ్సిటీ, మసీద్‌బండ, బొటానికల్ గార్డెన్, గచ్చిబౌలి వైపు వెళ్లాల్సి ఉంటుంది. గచ్చిబౌలి సర్కిల్ నుంచి లింగంపల్లికి వెళ్లే వాహనాలు బొటానికల్ గార్డెన్, మసీద్‌బండ, హెచ్‌సీయూ బస్ డిపో వైపు వెళ్లాల్సి ఉంటుందన్నారు. రాయదుర్గం నుంచి లింగంపల్లి వైపు వచ్చే వాహనాలను ట్రిపుల్ ఐటీ జంక్షన్ నుంచి గోపీచంద్ అకాడమీ, విప్రో సర్కిల్, క్యూసిటీ, గోపన్‌పల్లి, నల్లగండ్ల ఫ్లై ఓవర్ నుంచి వెళ్లాలన్నారు. లింగంపల్లి నుంచి గచ్చిబౌలి జంక్షన్, గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వైపు భారీ వాహనాల రాకపోకలపై నిషేధం విధించినట్లు పేర్కొన్నారు. ట్రక్కులు, లారీలు, వాటర్ ట్యాంకర్లు, డీసీఎంలు, ఆర్ఎంసీ వాహనాలపై ఆంక్షలు ఉంటాయన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు. చదవండి: లవర్ విషయంలో ఇంజనీరింగ్ విద్యార్థుల మధ్య గొడవ.. మందు తాగుదామని రూమ్‌కి పిలిచి దారుణంగా.. -
సంగీతం నా కన్నబిడ్డతో సమానం: ఇళయరాజా
సాక్షి, సిటీబ్యూరో: సంగీతం పట్ల తనకు సొంత బిడ్డల్ని తీర్చిదిద్దే క్రమంలో ఉండే శ్రద్ధతో సమానం అని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా అన్నారు. మంగళవారం నగరంలోని టీ హబ్ ఫేజ్– 2లో తన అభిమానులు నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇళయరాజా మాట్లాడుతూ.. ఓ తల్లి తన పిల్లలకు ఆహారం అందించే ముందు తాను రుచి చూసి ఎలా అందిస్తుందో.. అలాగే తన ఫ్యాన్స్‌కు సంగీతాన్ని ఇస్తానన్నారు. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ సంగీతకారుడికి తెలియాల్సింది టెక్నాలజీ కాదని టెక్నిక్ అని స్పష్టం చేశారు. చదవండి: ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన సునీత -
శివాజీ గణేషన్‌ను ఇండస్ట్రీ పట్టించుకోలేదు: ఇళయరాజా షాకింగ్ కామెంట్స్
సాక్షి, చెన్నై: దివంగత నటుడు శివాజీ గణేషన్‌ను చిత్ర పరిశ్రమ, ప్రభుత్వం తగిన రీతిలో సత్కరించలేదని సంగీత దర్శకుడు ఇళయరాజా అన్నారు. ప్రముఖ రచయిత మరుదు మోహన్ నటుడు శివాజీ గణేషన్ గురించి రాసిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం చెన్నైలో జరిగింది. దర్శకుడు భారతి రాజా, కే.భాగ్యరాజ్, సంగీత దర్శకుడు ఇళయరాజా, రచయిత ముత్తులింగం, నటుడు ప్రభు, రాంకుమార్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేదికపై ఇళయరాజా మాట్లాడుతూ.. శివాజీ గణేషన్ నుంచి తాను నేర్చుకున్న అనేక విషయాల్లో కాలం ఒకటని పేర్కొన్నారు. క్రమశిక్షణలో ఆయనకు మించిన వారు మరొకరు ఉండరన్నారు. తన కారు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు స్టూడియో ముందు ఆగుతుందన్నారు. ఒకసారి తాను ఆలస్యంగా రావడంతో ఏమిటి రాసా నువ్వు కూడానా అని శివాజీ గణేషన్ తనను అడిగారన్నారు. రికార్డింగ్ స్టూడియోలో ఆయన తన అనువాభవాలను పంచుకునే వారని చెప్పారు. ఒకసారి సినీ పరిశ్రమ తరపున శివాజీ గణేషన్‌కు అభినందన సభ జరిగిందన్నారు. ఆయనకు ఒక కానుక అందించాలని నిర్ణయించామన్నారు. అందుకు తగిన నగదును పరిశ్రమ వర్గాల నుంచి వసూలు చేసినట్లు చెప్పారు. నటీనటులు తినే భోజనంలో ప్రతి బియ్యం గింజ పైనా శివాజీ గణేషన్ పేరు ఉంటుందన్నారు. దీంతో ఆయనకు ప్రదానం చేసే జ్ఞాపికపై ఎవరి పేర్లు ఉండరాదని, దానికి అయ్యే ఖర్చును తానే ఇస్తానని చెప్పానన్నారు. ఆ విషయం తెలిసి శివాజీ గణేషన్ ఎవరిని మరిచినా ఇళయరాజాను మరవకూడదని అన్నారన్నారు. శివాజీని సినిమా పెద్దలు గాని, ఏ ప్రభుత్వం తగిన విధంగా సత్కరించలేదని, అయితే వ్యక్తిగతంగా ఎవరైనా చేశారంటే అది ఈ ఇళయ రాజానే అని పేర్కొన్నారు. చదవండి: మొత్తం బిగ్‌బాస్ ద్వారా రేవంత్ ఎంత సంపాదించాడో తెలుసా? అందుకే సీతారామంకు తెలుగు వారిని తీసుకోలేదు: హను రాఘవపూడి -
7 గంటలపాటు ఎయిర్‌పోర్ట్‌లో ఇళయరాజా పడిగాపులు
ఇటీవలే రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టిన సంగీత జ్ఞాని ఇళయరాజా ఎప్పటిలానే తన చిత్రాలతో, సంగీత కచేరీలతో బిజీగా ఉంటున్నారు. తాజాగా అంగేరి దేశంలో నిర్వహించనున్న సంగీత కచేరిలో పాల్గొనేందుకు దుబాయ్‌కి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం వేకువ జామున రెండు గంటలకు విమానం చెన్నై నుంచి దుబాయ్‌కి బయలుదేరనుండటంతో ఇళయరాజా అంతకుముందే చెన్నై విమానాశ్రయం చేరుకున్నారు. అయితే శనివారం రాత్రి వర్షం కారణంగా విమానయానాలకు అంతరాయం కలిగింది. ముఖ్యంగా ఇతర దేశాల నుంచి చెన్నైకు రావాల్సిన విమానాలు బెంగుళూరు, హైదరాబాద్ తదితర విమానాశ్రయంలో ల్యాండ్ కావలసిన పరిస్థితి. అదే విధంగా ఇళయరాజా పయనించాలని దుబాయ్‌కి వెళ్లే విమానం బయలుదేరడంలో చిక్కులు ఏర్పడ్డాయి. దుబాయ్‌కి వెళ్లే విమానం కొంత ఆలస్యంగా చెన్నైకు చేరుకుంది. అయితే రన్‌వేలో నీరు చేరుకోవడంతో విమానం బయలుదేరడానికి మరో మూడు గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆ తరువాత ఆకాశం మేఘాలు కమ్ముకోవడంతో మరో రెండు గంటలు అంతరాయం ఏర్పడింది. ఇలా ఏడు గంటల పాటు ఇళయరాజా చెన్నై విమానాశ్రయంలోనే ఉండిపోయారు. చదవండి: పబ్లిక్‌గా నటికి ముద్దులు.. అమ్మ చూస్తే ఏమంటుందోనంటున్న నటుడు డేటింగ్ చేసిన వ్యక్తే భర్తగా.. రెండోసారి పిల్లల్ని కనాలంటేనే భయం.. -
ఆటా వేడుకలు: ముచ్చటగా మూడు రోజులు సందడే సందడి
వాషింగ్టన్ డీసీ వేదికగా జరగబోతున్న 17వ అమెరికన్ తెలుగు అసొసియేషన్ మహాసభలు ఘనంగా జరగనున్నాయి. ఈ మేరకు తన వేడుకలకు రంగం చేసింది. మొత్తం మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో ఏ రోజు ప్రత్యేకత దానికే ఉంది. ఆ వివరాలు.. జులై 1 మొదటి రోజు కన్వెన్షన్ సెంటర్లోని గ్రాండ్ లాబీలో వెల్కం రిసెప్షన్‌తో వేడుకలు ప్రారంభమవుతాయి. ప్రముఖ గేయరచయిత చంద్రబోస్ స్వరపరిచిన ప్రారంభోత్సవ గీతాన్ని గాయకులు కొమాండూరి రామాచారి ఆలపిస్తారు. అదే సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వేర్వేరు రంగాల్లో అత్యుత్తమ సేవలందించిన తెలుగు ప్రముఖులకు అమెరికన్ తెలుగు అసొసియేషన్ అవార్డులందించనుంది. బాంకెట్ వేడుకల్లో సింగర్ రామ్ మిరియాల స్పెషల్ మ్యూజిక్ నైట్‌తో అలరించబోతున్నారు. జులై 2 రెండో రోజు ఉదయం నుంచే ఆటా పరేడ్ ప్రారంభం అవుతుంది. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా కళా ప్రదర్శనలకు ఏర్పాట్లు చేశారు. ఇదే రోజు ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, యోగా గురు పద్మ విభూషణ్ సద్గురు జగ్గీ వాసుదేవన్ అతిథులతో మాట్లాడనున్నారు. అలాగే ఆటా కన్వెన్షన్‌లో భాగంగా హార్ట్ఫుల్నెస్ సంస్థ రామచంద్రమిషన్ వేడుకలు నిర్వహించనున్నారు. ఇప్పటికే 75 ఏళ్లు పూర్తి చేసుకున్న రామచంద్రమిషన్ డైమండ్ జూబ్లీ సెలబ్రెషన్స్ నిర్వహిస్తారు. రెండో రోజు సాయంత్రం సంగీత దర్శకులు ఎస్.థమన్ నేతృత్వంలో విభావరి ఏర్పాటు చేశారు. జులై 3 మూడో రోజు ఉదయం తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి కళ్యాణం నిర్వహించనున్నారు. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి అమెరికా చేరుకున్నారు. శ్రీనివాసుడి కళ్యాణంలో భాగంగా ప్రముఖ నేపథ్య గాయకులు పద్మశ్రీ శోభారాజు, నిహాల్ కొండూరి ఆధ్యాత్మిక సంగీతంతో ఆహూతులను భక్తి పరవశ్యంలోకి తీసుకెళ్లనున్నారు. అదే రోజు సాయంత్రం గ్రాండ్ ఫినాలేలో భాగంగా ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా సంగీత విభావరి ఏర్పాటు చేశారు. ముగింపు వేడుకల్లో భాగంగా ఇళయరాజా తన 32 మంది ట్రూప్‌తో అతిథులను అలరించనున్నారు. దీంతో పాటు ఆహుతుల కోసం ప్రత్యేక ఎగ్జిబిషన్లు, వివిధ రకాల స్టాళ్లు, వేర్వేరు ఫుడ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆటా నిర్వహిస్తున్న ఈ ప్రపంచ తెలుగు మహాసభలకు వచ్చిన అతిథులు.. ఎప్పటికీ మరిచిపోలేని విధంగా వేడుకలను డిజైన్ చేశారు. ఒకే వేదికపై అభివృద్ధి, సంస్కృతి, కళలు, ప్రజా సంబంధాలు, సెమినార్లు, వివాహా వేదికలు, మాటా ముచ్చట్లు.. చెప్పుకుంటూ పోతే.. మూడు రోజులు వాషింగ్టన్ డిసిలో పండగ వాతావరణం ఏర్పాటు కానుంది. ఆటా వేదికగా ఆట-పాట భారతీయులకు క్రికెట్ అంటే ఎంత అభిమానమో అందరికీ తెలుసు. అందుకే ఆటా నిర్వాహకులు ఇద్దరు లెజెండ్ క్రికెట్ క్రీడాకారులను ఈ కన్వెన్షన్‌కు తీసుకొస్తున్నారు. టాప్ క్లాస్‌తో సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడిన సునీల్ గవాస్కర్, సిక్సర్ల మెరుపులతో అలరించే వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్.. యూత్ క్రికెట్ సరదాగా ఆడబోతున్నారు. అలాగే మరో లెజెండరీ ఆటగాడు కపిల్ దేవ్ కూడా కనువిందు చేయబోతున్నాడు. ఆటా సెలబ్రిటీ గోల్ఫ్ టోర్నమెంట్లో భాగంగా కపిల్ దేవ్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, అమెరికన్ ప్రొఫెషనల్ గోల్ఫర్ సాహిత్ రెడ్డి తీగల ఆటా వేడుకల్లో సందడి చేయనున్నారు. ఈ వేడుకలకు టాలీవుడ్ నుంచి పెద్ద ఎత్తున సినీతారలు విచ్చేస్తున్నారు. హీరోలు అడవి శేషు, డైరెక్టర్లు శేఖర్ కమ్ముల, అర్జున్‌రెడ్డి ఫేం సందీప్ వంగా, హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, నివేదా థామస్, డాన్స్ డైరెక్టర్ శేఖర్ మాస్టర్, వీజే సన్నీ, సింగర్ రాం మిరియాల, సింగర్ మంగ్లీ.. ఇంకా పలువురు ప్రముఖులు వేడుకలకు వస్తున్నారు. సాహితీ వేత్తలు జొన్నవిత్తుల రాంజోగయ్య శాస్త్రి, సీనియర్ నటులు తనికెళ్ల భరణి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ అష్టవధానంతో అలరించబోతున్నారు. - వాషింగ్టన్ డీసీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
ఇళయ మారుతం
ఇటీవల విడుదలైన ‘అంబేడ్కర్ అండ్ మోదీ– రిఫార్మర్స్ ఐడియాస్, పెర్ఫార్మర్స్ ఇంప్లిమెంటేషన్ అనే పుస్తకానికి రాసిన ‘ముందుమాట’ లో ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా మోదీని అంబేడ్కర్‌తో పోల్చి తాజా వార్తల్లోకి వచ్చారు. ‘‘దేశాభివృద్ధి, పరిశ్రమల రంగం, సామాజిక న్యాయం, మహిళాభ్యున్నతి వంటి వాటికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అంబేద్కర్ ఆలోచనలను అనుసంధానం చేసే అంశాలకు అధ్యయనంలా ఈ పుస్తకం ఉంది. ప్రధాని మోదీ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ‘మేక్ ఇన్ ఇండియా’ ఎన్నో రికార్డులను సృష్టించింది. సామాజిక న్యాయం కోసం ప్రధాని మోదీ అనేక చట్టాలను అమలుచేస్తున్నారు. ప్రధాని మోదీకి, అంబేడ్కర్‌కు అనేక విషయాల్లో పోలికలు ఉన్నాయి’’ అని ఇళయరాజా ఆ ముందుమాటలో రాశారు. ఇళయరాజా స్వాతంత్య్రానికి పూర్వం 1943 లో తమిళనాడులోని పన్నైపురంలో జూన్ 2న జన్మించారు. దళిత కుటుంబం నుంచి వచ్చిన ఇళయరాజా స్వయంకృషితో ఎదిగిన మహోజ్వల సంగీతకారులలో ఒకరిగా గుర్తింపు పొందారు. -
Ilayaraja: వివాదంలో ఇళయరాజా.. మోదీపై కీలక వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై : సంగీత దర్శకుడు ఇళయరాజా వివాదాల్లో చిక్కుకున్నారు. ఇళయరాజా.. ప్రధాని మోదీ గురించి రాసిన ఒక పుస్తకానికి ముందు మాట రాశారు. ఇందులో మోదీని డాక్టర్ అంబేడ్కర్‌తో పోల్చారు. ఇదే ఇప్పుడు వివాదానికి దారి తీసింది. ఇళయరాజా వ్యాఖ్యలను కొందరు ఖండిస్తున్నారు. ఇళయరాజా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, ఎంపీ పదవి కోసమే మోదీ భజన చేస్తున్నారని విమర్శి స్తున్నారు. ఈ విషయంపై ఇళయరాజా సోదరుడు, బీజేపీ సభ్యుడు గంగై అమరన్ స్పందిస్తూ.. అందరిలాగే ఇళయరాజా కూడా తన భావాలను వ్యక్తం చేశానని చెప్పారన్నారు. తన మాటల్లో తప్పు లేదనీ, అందుకు ఎలాంటి విమర్శలు ఎదురైనా తాను ఎదుర్కొంటానన్నారని, అదేవిధంగా తాను బీజేపీలో చేరలేదని, తనకు ఎలాంటి పదవులు అవసరం లేదని చెప్పారని స్పష్టం చేశారు. ఇళయరాజా వ్యాఖ్యలపై ఆయన కొడుకు, సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా స్పందిస్తూ.. కరుప్పు ద్రవిడన్ గర్వించదగ్గ తమిళన్ అని తన ట్విట్టర్లో పేర్కొన్నారు. -
ఆయన కోరారు.. ఈయన ఓకే అన్నారు..
సాక్షి, చెన్నై: సంగీతజ్ఞాని ఇళయరాజా, ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్ దుబాయ్‌లో కలిశారు. ఈ సందర్భంగా ఇళయరాజా ముందు ఏఆర్ రెహమాన్ తన కోరికను వ్యక్తం చేశారు. అంతే వెంటనే ఇళయరాజా కూడా పచ్చజెండా ఊపేశారు. ఆ ముచ్చటేంటో చూద్దాం.. సంగీత దర్శకుడు ఇళయరాజా ఇటీవల దుబాయ్ ఎక్స్పో కార్యక్రమంలో భారీ సంగీత విభావరిని నిర్వహించారు. ఈ కార్యక్రమం ఈనెల 5వ తేదీన ముగిసింది. దీంతో ఆయన అక్కడ ఏఆర్ రెహమాన్‌కు చెందిన ఫిర్ధోస్ రికార్డింగ్ స్టూడియోకు వెళ్లారు. ఇళయరాజాను.. రెహమాన్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారిద్దరూ కలిసి దిగిన ఫొటోను రెహమాన్ తన ట్విట్టర్లో పోస్ట్ చేసి మ్యాస్ట్రో ఇళయరాజాను ఫిర్ధోస్ స్టూడియోస్‌కు ఆహ్వానించడం సంతోషంగా ఉందని, భవిష్యత్‌లో ఆయన తమ స్టూడియోలో రికార్డింగ్ చేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన పోస్ట్‌కు స్పందించిన ఇళయరాజా త్వరలోనే దుబాయ్‌లోని ఏఆర్ రెహమాన్ స్టూడియోలో రికార్డింగ్ నిర్వహిస్తానని ట్విట్టర్ ద్వారా బదులిచ్చారు. Such a pleasure welcoming the Maestro @ilaiyaraaja to our Firdaus Studio... Hope he composes something amazing for our @FirdausOrch to play in the future! pic.twitter.com/oam4TJPL63 — A.R.Rahman (@arrahman) March 6, 2022 -
ఇళయరాజాకు అనుకూలంగా తీర్పు, వారందరికి షాక్!
సంగీత దర్శకుడు ఇళయరాజా పిటిషన్‌పై ఎకో, అగీ ఆడియో సంస్థలకు చెన్నై హైకోర్టు షాక్ ఇచ్చింది. వివరాలు.. ఇళయరాజా సంగీతంలో రూపొందిన పాటలను సీడీ, క్యాసెట్ రూపంలో విక్రయించడానికి ఎకో, అగి రికార్డింగ్ కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే ఒప్పందం కాలం ముగిసినా రెన్యువల్ చేయకుండా ఆ సంస్థలు తన పాటలను విక్రయిస్తుండడంతో ఇళయరాజా ఆ సంస్థలపై 2017లో మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ ఎకో, అగి ఆడియో సంస్థలకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో ఇళయరాజా మరోసారి అప్పీలు చేశారు. ఈ పిటిషన్ విచారించిన ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. అందులో ఒప్పంద కాలం పూర్తి అయిన తరువాత ఇళయరాజా పాటలను ఎకో, అగి రికార్డింగ్ సంస్థలు వాణిజ్యం చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఆడియో సంస్థలు బదులు పిటిషన్ వేసుకోవచ్చని పేర్కొంది. తదుపరి విచారణను మార్చి 31వ తేదికి వాయిదా వేసింది. కాగా చాలా కాలంగా మనస్పర్థల కారణంగా దూరంగా ఉన్న ఇళయరాజా, ఆయన సోదరుడు గంగై అమరన్ ఇటీవల అనూహ్యంగా కలుసుకోవడం విశేషం. -
అంతరిక్షంలో మారుమోగనున్న ఇళయరాజా సంగీతం
ప్రముఖ సంగీత సందర్శకుడు ఇళయరాజా సంగీతం అంతరిక్షంలోనూ మారుమోగనుంది. అవును ఇది నిజం. తమిళనాడుకు చెందిన ఓ విద్యార్థుల బృందం అత్యంత చిన్న శాటిలైట్ తయారు చేస్తోంది. దీనిని భారతదేశ 75వ స్వతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ ఆగస్టు 15న నాసా సహకారంతో అంతరిక్షంలోకి పంపనున్నారు. విశేషమేమిటంటే ఈ శాటిలైట్‌లో.. మనదేశం గొప్పతనాన్ని తెలియజేస్తూ గీత రచయిత స్వనంద్ కిర్కిరే రాసిన హిందీ పాటను వినిపించనున్నారు. కాగా ఈపాటకు ఇళయరాజా బాణీలు కట్టడానికి అంగీకరించడం, తమిళ వెర్షన్‌ను ఆలపించడానికి కూడా సిద్ధమవుతున్నట్లు తెలిసింది. అలా ఇళయరాజా సంగీతం ఆకాశ తరంగాలను మీటనుంది. -
నా కల నెరవేరింది: దర్శకుడు
తన కల ఇప్పటికి.. నెరవేరిందని దర్శకుడు సుశీగణేషన్ అన్నారు. ఇంతకుముందు పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈయన తాజాగా స్వీయ దర్శకత్వంలో 4వీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం వంజం తీర్తాయడా. 1980 ప్రాంతంలో మదురైలో జరిగిన యదార్థ ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. కాగా ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించడం విశేషం. దీని గురించి దర్శకుడు తెలుపుతూ తాను దర్శకత్వం వహించిన తొలి చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించాలని ఆశించానన్నారు. అయితే అది జరగకపోయినా ఇన్నాళ్లకు తాను సొంతంగా నిర్మిస్తున్న చిత్రం ద్వారా ఆ కల నెరవేరడం సంతోషంగా ఉందన్నారు. వంజం తీర్తాయడా చిత్రంలో సంగీతం ఒక పాత్రలా ఆద్యంతం ముఖ్య భూమిక పోషిస్తుందన్నారు. -
Ilaiyaraaja: రూమర్స్‌కు చెక్ పెట్టిన ఇళయరాజా
-
ఆ ఇద్దరి బయోపిక్స్‌లో నటిస్తా: ధనుష్
అక్షయ్ కుమార్, ధనుష్, సారా అలీఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ చిత్రం ‘ఆత్రంగి రే’. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 24 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ప్రముఖ హిందీ షోలో పాల్గొన్న ధనుష్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ‘బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోన్న ఈ సమయంలో మీరు ఎవరు బయోపిక్స్‌లో నటిస్తారు?’ అనే ప్రశ్నకు ధనుష్ బదులిస్తూ– ‘‘రజనీకాంత్, ఇళయరాజగార్లంటే ఎంతో ఇష్టం.. ఎనలేని అభిమానం. అవకాశం వస్తే వారిద్దరి బయోపిక్స్‌లో నటించాలని ఉంది’’ అని పేర్కొన్నారు. తమిళంలో దాదాపు అరడజను సినిమాలకు కమిటైన ధనుష్ తెలుగులో శేఖర్ కమ్ముల, వెంకీ అట్లూరి దర్శకత్వాల్లో నటించేందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే. -
మనసుకు బాధగా ఉంది మిత్రమా: ఇళయరాజా భావోద్వేగం
Ilayaraja Condolence To Sirivennela Sitarama Sastry: సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి హఠాన్మరణం దేశవ్యాప్తంగా ఉన్న సాహితీప్రియులను, చలన చిత్ర పరిశ్రమలను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. పండితుల నుంచి సామాన్యుల వరకు సిరివెన్నెల సాహిత్యం ప్రభావితం చేయగా.. ఆయన మరణాన్ని ఎవరూ జీర్ణించుకోలేకున్నారు. ఇప్పటికే సినీ, రాజకీయా ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. కాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సిరివెన్నెల మృతిపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయనతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. చదవండి: సిరివెన్నెలను వరించిన 11 నంది అవార్డులు.. ఆ పాటలు ఇవే.. కాగా ఇళయరాజా, సిరివెన్నెలు దశాబ్దాల పాటు పనిచేశారు. ఇళయరాజా స్వరాలకు సిరివెన్నెల సాహిత్యం తోడై అద్భుతం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. దీంతో ఇళయరాజా మిత్రుడు సిరి వెన్నెలకు పదాలతో నీరాజనం తెలిపారు. ‘మా ఇద్దరి కలయికలో ఎన్నో పాటలు ప్రాణం పోసుకున్నాయని చెప్పారు. ఆయన పాటల పదముద్రలు తన హార్మోనియం మెట్లపై నాట్యం చేశాయని తెలిపారు. సినిమా పాటల్లో సైతం కవితాత్మని, కళాత్మకతని అందించి తనదైన ముద్రతో అర్థవంతమైన, సమర్థవంతమైన పాటలను అందించారని చెప్పారు. శ్రీ వేటూరి సహాయకుడిగా వచ్చి...అతి తక్కువ కాలంలో..శిఖర స్థాయికి చేరుకున్న సరస్వతీ పుత్రుడు... చదవండి: కళావెన్నెల, కళాతపస్విల బంధం.. వారి అంతరంగం మీకోసం సీతారాముడు పాటతో ప్రయాణం చేస్తాడు.. పాటతో అంతర్యుద్ధం చేస్తాడు.. పాటలో అంతర్మథనం చెందుతాడు.. పాటని ప్రేమిస్తాడు.. పాటతో రమిస్తాడు.. పాటని శాసిస్తాడు.. పాటని పాలిస్తాడు.. పాట నిస్తాడు.... ‘మన భావుకతకి భాషను అద్ది. మనకు తెల్సిన పాటలా చెవుల్లోకి ఒంపుతాడు... అందుకే సీతారాముడి పాటలు ఎప్పటికీ గుర్తుంటాయి.. తన సాహిత్యం నాతో ఆనంద తాండవం చేయించాయి. నాతో శివ తాండవం చేయించాయి.. ‘వేటూరి’ నాకు తెలుగు సాహిత్యం మీద ప్రేమను పెంచితే... ‘సీతారాముడు’ నాకు తెలుగు సాహిత్యం మీద గౌరవాన్ని పెంచాడు.. ధన్యోస్మి మిత్రమా..! ఇంత త్వరగా సెలవంటూ శివైక్యం చెందడం మనస్సుకు బాధగా ఉంది.. పాటకోసమే బ్రతికావు,బ్రతికినంత కాలం పాటలే రాశావు....ఆ ఈశ్వరుడు నీకు సద్గతిని ప్రసాదించాలని కోరుకుంటున్నా’ అంటూ ఇళయరాజా సిరివెన్నెలకు అంతిమ వీడ్కోలు తెలిపారు. కాగా మహాప్రస్థానంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు ఈ రోజు(బుధవారం) మధ్యాహ్నం 2:26 గంటలకు ముగిశాయి. హిందూ సాంప్రదాయాల ప్రకారం వేద పండితులు అంతక్రియల పక్రియ జరిపారు. ఫిల్మ్ ఛాంబర్ నుంచి మహా ప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగింది. అంతిమ యాత్రలో పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు సహా అభిమానులు పాల్గొన్నారు. -
Son Of India: ‘జయ జయ మహావీర’ సాంగ్ వచ్చేసింది
డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ సంస్థలు నిర్మించాయి. తాజాగా సినిమా నుంచి తొలి పాటను విడుదల చేశారు. ‘జయ జయ మహావీర..’ అంటూ సాగే ఈ పాటని ప్రముఖ సింగర్ రాహుల్ నంబియార్ ఆలపించగా, మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. 11వ శతాబ్దపు ప్రసిద్ధ రఘువీర గద్యాన్ని పాట రూపంలో మలిచారు సంగీత దర్శకుడు ఇళయరాజా. ఈ పాటను బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ షేర్ చేస్తూ ‘భారతీయ సినిమా పరిశ్రమలోని ఇద్దరు దిగ్గజాలు .. ప్రముఖ తెలుగు నటుడు ఎం మోహన్ బాబు, మాస్ట్రో ఇళయరాజా కలిసి రాముడి శౌర్యానికి నివాళులర్పించిన ‘రఘువీరా గద్యం’లోని సాంగ్ ‘జయ జయ మహావీర’ సాంగ్. ఆల్ ది బెస్ట్’ అంటూ ట్వీట్ చేశారు. -
ప్రముఖ చిత్రకారుడు ఇళయరాజా మృతి
చెన్నై: కరోనాతో చిత్రకారుడు ఇళయరాజా ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఈయన వయసు 43 ఏళ్లు. కుంభకోణం సమీపంలోని సెంబియవరంబిల్ అనే గ్రామానికి చెందిన ఇళయరాజా చిత్రకారుడిగా మంచి పేరుగాంచారు. కరోనా వ్యాధి సోకడంతో ఇళయరాజా ఇటీవల చెన్నై, ఎగ్మోర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఈయన మృతికి సీఎం స్టాలిన్, నటుడు దర్శకుడు పార్తిబన్, పా.రంజిత్ సంతాపం వ్యక్తం చేశారు. -
ఇళయరాజా సోదరుడికి సతీవియోగం
తమిళ సినిమా: సీనియర్ సంగీత దర్శకుడు గంగై అమరన్ భార్య మణిమేఖలై ఆదివారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు. ఈమె వయసు 69 ఏళ్లు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుడే గంగై అమరన్. సినీ దర్శకుడు, సంగీత దర్శకుడు, గాయకుడు, పాటల రచయిత అయిన గంగై అమరన్, మణిమేఖలై దంపతుల కొడుకులు దర్శకుడు వెంకట్‌ప్రభు, సంగీత దర్శకుడు, నటుడు ప్రేమ్‌జీ. కాగా వీరి తల్లి మణిమేఖలై ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమెను చెన్నై లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఆమె తుదిశ్వాస విడిచారు. ఈమె మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కాగా కోలీవుడ్‌లో కరోనా మరణాలు ఆగడం లేదు. తాజాగా ఈ మహమ్మారి నటుడు జోకర్ తులసి, దర్శకుడు దయాళన్‌ను బలితీసుకుంది. చదవండి: కంటెస్టెంట్లకే షాక్: బిగ్‌బాస్ షో క్యాన్సిల్ -
మనవరాలికి సంగీత పాఠాలు
ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా తన మనవరాలికి సంగీత పాఠాలు నేర్పిస్తున్నారు. ఇళయరాజా తనయుడు యువన్‌శంకర్ రాజా కుమార్తె జియా యువన్ ఇటీవల తాత దగ్గర పియానో నేర్చుకుంటున్న వీడియో చాలామందిని ఆకట్టుకుంది. పియానోతో సరిగమలు ఎలా పలికించాలో మనవరాలికి నేర్పుతున్న దృశ్యాన్ని వీడియో తీసి, సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు యువన్. ఈ వీడియో చూసిన శ్రుతీహాసన్ , విజయ్ ఏసుదాసు, శ్వేతాపండిట్ వంటి వారు ‘చాలా బాగుంది’ అంటూ జియాని అభినందిస్తూ కామెంట్లు పెట్టారు. కాగా ఇళయరాజా ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ‘రంగమార్తాండ’ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో బ్రహ్మానందం, రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆ సంగతలా ఉంచితే.. ఇళయరాజా వారసులుగా కుమారులు కస్తూరి రాజా, యువన్ శంకర్ రాజా, కుమార్తె భవతారిణి కూడా సంగీతప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఈ ముగ్గురూ సంగీతదర్శకులుగానే కాదు పాటలు కూడా పాడతారు. మరి.. ఇప్పుడు మనవరాలికి కూడా స్వరాలు నేర్పిస్తున్నారంటే ఇళయరాజా కుటుంబం నుంచి మరో మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ వచ్చే అవకాశం ఉందని ఊహించవచ్చు. -
శాశ్వతంగా తప్పుకున్న ఇళయరాజా
సాక్షి, చెన్నై: ప్రసాద్ స్టూడియో యాజమాన్యం, సంగీత దర్శకుడు ఇళయరాజా మధ్య కొన్నేళ్లుగా నడుస్తున్న వివాదానికి సోమవారం తెరపడింది. ఇళయరాజా కోసం ప్రసాద్ స్టూడియో యాజమాన్యం 1976లో ప్రత్యేక రికార్డింగ్ స్టూడియో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కొన్నేళ్ల క్రితం ఇరుపక్షాల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో ఖాళీ చేయాలని స్టూడియో యాజమాన్యం ఇళయరాజాను కోరింది. ఇందుకు ఇళయరాజా నిరాకరించారు. ఈ వివాదంపై రెండేళ్లుగా మద్రాసు హైకోర్టులో వాదోపవాదాలు నడుస్తున్నాయి. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని న్యాయస్థానం సూచించింది. అయితే స్టూడియోలోని తన సంగీత పరికరాలు, అవార్డులను తీసుకునేందుకు, ధ్యానం చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ఇళయరాజా న్యాయస్థానంలో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ప్రతిపాదనను మొదట వ్యతిరేకించిన స్టూడియో యాజమాన్యం ఆ తరువాత కొన్ని షరతులతో అంగీకరించింది. ఏదో ఒక రోజు ఉదయం 9 నుంచి సాయత్రం 4 గంటల వరకు ధ్యానం చేసుకుని సంగీత పరికరాలు తీసుకెళ్లేందుకు అనుమతించాలని యాజమాన్యాన్ని కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ఇళయరాజా సోమవారం ఉదయం ప్రసాద్ స్టూడియోకు వస్తారని ప్రకటన విడుదలైంది. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇళయరాజా, స్టూడియో తరఫు న్యాయవాదులు వచ్చారు. పరికరాలు తీసుకెళ్లేందుకు ఇళయరాజా రాకుండా సహాయకులను పంపారు. అయితే ఇళయరాజా వినియోగించే రికార్డింగ్ థియేటర్ తలుపులు పగులగొట్టి అందులోని పరికరాలను మరో గదిలోకి తరలించి ఉండడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ సమాచారాన్ని అందుకున్న ఇళయరాజ తీవ్ర మనస్తాపానికి గురై స్టూడియోకి రాలేదని ఆయన పీఆర్వో మీడియాకు తెలిపారు. వీడియోలో అన్ని దృశ్యాలు చిత్రీకరిస్తుండగా గట్టి పోలీసు బందోబస్తు మధ్య ఇళయరాజా సహాయకులే సామగ్రిని తీసుకెళ్లారు. (చదవండి: తానే సీఎం అభ్యర్థి అంటున్న కమల్ హాసన్) -
ఇళయరాజాకు ఎందుకు అనుమతివ్వరు
చెన్నై:సుమారు 40 ఏళ్లకుపైగా తన చిత్రాలకు సంబంధించిన సంగీత కార్యక్రమాలు నిర్వహించిన ప్రసాద్ స్టూడియోలో ఒకరోజు ఇళయరాజాకు ధ్యానం చేసుకోవడానికి ఎందుకు అవకాశం ఇవ్వరని మద్రాసు హైకోర్టు ప్రసాద్ స్టూడియో నిర్వాహకులను ప్రశ్నించింది. సాలిగ్రామంలోని ప్రసాద్ స్టూడియోలో ఇళయరాజా కోసం నాలుగు దశాబ్దాల క్రితం ఒక రూమును ప్రత్యేకంగా కేటాయించారు. ఆ గదిలోనే ఇళయరాజా తన చిత్రాలకు సంగీత కార్యక్రమాలు నిర్వహించేవారు. అయితే గత ఏడాది ఆ గదిని వేరే కార్యక్రమానికి కేటాయించడంతో ఇళయరాజాని ఖాళీ చేయాల్సిందిగా స్టూడియో అధినేతలు ఒత్తిడి చేశారు. దీంతో ఇళయరాజా హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును సోమవారానికి వాయిదా వేశారు. -
చెన్నై: ఇళయరాజా, ఎల్వీప్రసాద్ స్టూడియో వివాదం
-
నన్ను బెదిరిస్తున్నారు : ఇళయరాజా
సాక్షి,చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా-ప్రసాద్ స్టూడియో వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఎల్వీ ప్రసాద్ మనవడు సాయి ప్రసాద్‌పై లయ రాజా తాజాగా మరో కేసు నమోదు చేశారు. సాయి, అతని మనుషులు తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని, తద్వారా తన స్టూడియోను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఇళయరాజా ఆరోపించారు. ఈ మేరకు ఆయన మేనేజర్ జాఫర్ ఫిర్యాదు దాఖలు చేశారు. ('ఇళయరాజా కేసును రెండు వారాల్లో ముగించండి') ప్రసాద్ స్టూడియోలోని తన సూట్లోకి ప్రవేశించి మరీ సంగీత వాయిద్యాలు, నోట్లు, ఇతర పరికరాలను ధ్వంసం చేశారని చెన్నై కమిషనర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో ఇళయరాజా పేర్కొన్నారు. అంతేకాదు తన విలువైన వస్తువులను అధిక మొత్తానికి విక్రయించుకున్నారని కూడా ఆరోపించారు. సాయి, అతని అనుచరులపై శాశ్వత ఆంక్షలు విధించాలని కోరుతూ సిటీ సివిల్ కోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసినట్లు వివరించారు. ఈ కేసు పెండింగ్‌లో ఉండగానే తనపై దౌర్జన్యం చేసి, బలవంతంగా స్టూడియోను లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారన్నారు. అందుకే స్టూడియోలో తన కార్యక్రమాలకు అడ్డొస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో సాయి ప్రసాద్, అతని అనుచరులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఇళయరాజా డిమాండ్ చేశారు. కాగా చెన్నైలోని ప్రసాద్ స్టూడియోస్ స్థాపకుడు ఎల్వీ ప్రసాద్, ఇళయరాజాపై గౌరవంతో ప్రత్యేక గది ఉన్న స్టూడియో స్థలాన్ని బహుమతిగా ఇచ్చారు. ఇక్కడున్న రికార్డింగ్ స్టూడియోలోనే గత 40 సంవత్సరాలకు పైగా ఆయన తన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే ఎల్వీ ప్రసాద్ కుమారుడు రమేష్ ప్రసాద్ ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరం చెప్పకపోగా, మనవడు సాయి ప్రసాద్ మాత్రం స్టూడియోను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. Veteran music composer #Ilaiyaraaja filed a complaint against Sai Prasad for tampering his musical instruments, notes and valuables by unlawfully entering into his recording studio #PrasadStudios pic.twitter.com/1LyAntffNL — Rajasekar (@sekartweets) July 31, 2020 -
'ఇళయరాజా కేసును రెండు వారాల్లో ముగించండి'
సాక్షి, పెరంబూరు: సంగీతదర్శకుడు ఇళయరాజా కేసు విచారణను రెండు వారాల్లోకి ముగించాలని చెన్నై మధ్యవర్తిత్వ కోర్టుకు మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇళయరాజా స్థానికి సాలిగ్రామంలోని ప్రసాద్ స్టూడియోలో తన చిత్రాలకు సంగీతాన్ని అందిస్తున్నారు. గత 42 ఏళ్లుగా అదే స్టూడియోలో తన సంగీత కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఇళయరాజాను ఇటీవల ఆ స్టూడియో అధినేత ఖాళీ చేయాల్సిందిగా చెప్పారు. అకస్మాత్తుగా ఖాళీ చేయమనడంతో ఇళయరాజా అందుకు అంగీకరించలేదు. ఈ విషయంలో దర్శకుడు భారతీరాజా, అమీర్, ఆర్కే.సెల్వమణి, కే.భాగ్యరాజ్ వంటి వారు ఇళయరాజా తరఫున ప్రసాద్స్టూడియో అధినేతతో చర్చలు జరిపే ప్రయత్నం చేశారు. అయితే అవి ఫలించలేదు. చదవండి: కమల్ థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు ముమ్మరం దీంతో ఇళయరాజా కోర్టును ఆశ్రయించారు. 17వ సహాయ నగర మధ్యర్తిత్వ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈయన పిటీషన్‌ను విచారించిన కోర్టు సామరస్య చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని ఆదేశించింది. సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇళయరాజా మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తన పిటిషన్లో ప్రసాద్‌ల్యాబ్‌లో తాను 42 ఏళ్లుగా సంగీత వాయిద్యాలతో పని చేస్తున్నానన్నారు. అక్కడ వెయ్యికి పైగా చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చానని, 6 వేలకు పైగా పాటలకు సంగీతాన్ని అందించానని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా తన చిత్రాల సంగీత పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఇకపై కూడా అదే స్టూడియోలో ప్రశాంతంగా తనను పని చేసుకునేలా ఆదేశించాలని కోరారు. తనను ప్రసాద్‌ల్యాబ్ నుంచి బయటకు పంపాలన్న వాదనపై స్టే విధించాలని కోరారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం మద్రాసు హైకోర్టు విచారణ జరిపింది. న్యాయమూర్తి భారతీదాస్ సమక్షంలో విచారణ జరిగింది. ఇళయరాజా పిటిషన్‌పై విచారణను రెండు వారాల్లో ముగించాలని 17వ సహాయ నగర మధ్యవర్తిత్వ కోర్టుకు ఆదేశాలు జారీ చేశారు. చదవండి: అనుష్క విషయంలో ఇదీ వదంతేనా? -
‘ఇళయరాజా నాకు తల్లి,తండ్రి’
తన చిత్రాలు కత్తిపై నడకలానే ఉంటాయి అని దర్శకుడు మిష్కిన్ పేర్కొన్నారు. నిజం చెప్పాలంటే ఇతర దర్శకులు చిత్రాలకు భిన్నంగానే ఈయన చిత్రాలు ఉంటాయి. అంతేకాదు మిష్కన్ మాటలు, చేతలు అలానే ఉంటాయి. తొలి నుంచి తనదైన శైలితోనే చిత్రాలు తెరకెకిక్కస్తున్న ఈయన ఆ మధ్య పిశాచు, తుప్పరివాలన్ వంటి చిత్రాలు సక్సెస్ అయ్యాయి. తాజాగా ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటి నిత్యామీనన్, అదితిరావ్ నాయికలుగా తెరకెక్కించిన చిత్రం సైకో. ఈ చిత్రం ప్రారంభం నుంచి విడుదలకు ముందు, ఆ తరువాత కూడా సంచలనంగా మారింది. సైకో చిత్రం గత నెల 24న తెరపైకి వచ్చింది. అయితే చిత్రానికి మాత్రం మిశ్రమ స్పందననే వస్తోంది. ఉదయనిది స్టాలిన్‌తో మిష్కిన్ కానీ టాక్‌కు సంబంధం లేకుండా థియేటర్లలో రెండో వారంలోకి చేరుకుంది. సాధారణంగా ఒక వారం పూర్తిగా చిత్రం థియేటర్లలో ఉంటేనే సక్సెస్ అనుకుంటున్న రోజులివి. కాబట్టి సైకో చిత్ర యూనిట్ సక్సెస్ సంతోషంలో ఉన్నారు. ఈ ఆనందాన్ని శుక్రవారం మీడియాతో పంచుకున్నారు కూడా. స్థానిక ప్రసాద్‌ల్యాబ్‌లో సైకో చిత్ర సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మిష్కిన్ మాట్లాడుతూ సంగీతదర్శకుడు ఇళయరాజా తనకు తల్లిదండ్రులు మాదిరని అన్నారు. ఆయన అందించిన సంగీతం, పాటలు సైకో చిత్ర విజయానికి కారణంగా పేర్కొన్నారు. అందుకే ఈ చిత్ర విజయాన్ని ఆయనకు సమర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇకపోతే సైకో చిత్ర షూటింగ్ పూర్తి అయిన తరువాత నటుడు ఉదయనిదిస్టాలిన్ను తన తల్లి కడుపున పుట్టిన తన తమ్ముడుగా భావిస్తున్నానని చెప్పారు. నిజం చెప్పాలంటే తాను ఆయన చిత్రాలేవీ చూడలేదన్నారు. సైకో 2 చిత్రం చేస్తారా? అని అడుగుతున్నారని, తన జీవిత కాలంలో ఎప్పుడైనా ఉదయనిధిస్టాలిన్ తనతో చిత్రం చేయమని కోరితే చేయడానికి సిద్ధం అని అన్నారు. ఇకపోతే సైకో చిత్రం గురించి రకరకాల విమర్శలు వస్తున్నాయని, అయితే ఇది చెడ్డ చిత్రం కాదని అన్నారు. తన చిత్రాలన్నీ కత్తిపై నడిచినట్లే ఉంటాయన్నారు. చదవండి: అమ్మకు కీర్తి తెచ్చిన పాత్రలో కీర్తి ‘అమలాపాల్-విజయ్ విడిపోడానికి ధనుషే కారణం!’ -
ఇళయరాజా బయోపిక్‌ను తెరకెక్కిస్తా
చెన్నై ,పెరంబూరు: ఇళయరాజా బయోపిక్ తెరకెక్కనుంది. ఇటీవల జెండ్రీల బయోపిక్ చిత్రాల ట్రెండ్ నడుస్తోందని చెప్పవచ్చు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మాజీ ప్రధాని పీవీ.నరసింహరావు బయోపిక్‌ల నుంచి, క్రికెట్ కీడాకారులు, సినీ ప్రముఖుల బయోపిక్‌లు చిత్రాలుగా తెరకెక్కి వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ప్రస్తుతం దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌తో రెండు చిత్రాలు రూపొందుతున్నాయి. నటుడు సూర్య నటిస్తున్న సూరనై పోట్రు చిత్రం కూడా బడ్జెట్లో విమానాన్ని తయారు చేసిన జీఆర్.గోపీనాథ్ జీవిత చరిత్రే నన్నది గమనార్హం. రాజా ది జర్నీ సంగీతరంగంలో ఎంతో కీర్తి సాధించిన సంగీతజ్ఞాని ఇళయరాజా బయోపిక్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం. దీన్ని ఆయన కొడుకు, సంగీత దర్శకుడు యువన్‌శంకర్ రాజా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని ఆయనే ఒక భేటీలో స్వయంగా వెల్లడించారు. తన తండ్రి ఇళయరాజా బయోపిక్‌ను తెరకెక్కించాలన్న ఆలోచన ఉందని, దానికి తానే దర్శకత్వం వహిస్తానని చెప్పారు. దీనికి దాజా ది జర్నీ అనే టైటిల్ బాగుంటుందని అన్నారు. నటుడు ధనుష్ కరెక్ట్ ఇళయరాజా పాత్రను పోషించడానికి నటుడు ధనుష్ కరెక్ట్ అని చెప్పారు. మరి ఇళయరాజా పాత్రలో నటించడానికి నటుడు ఆయన అంగీకరిస్తారా? అన్నది ఆసక్తిగా మారింది. మొత్తం మీద ఎన్నో జాతీయ, రాష్ట్ర అవార్డులను అందుకుని సంగీతరంగంలో రారాజుగా రాణిస్తున్న ఇళయరాజా బయోపిక్ సినిమాగా తెరకెక్కనుందన్న మాట. -
ఇళయారాజాకు మరో అరుదైన పురస్కారం
సాక్షి, చెన్నై: ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజాకు మరో అరుదైన గౌరవ దక్కింది. కేరళ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘హరివరాసనం’ పురస్కారాన్ని ఆయనకు ప్రకటించింది. వచ్చే నెల 15వ తేదీన శబరిమలైలో ఇళయరాజాకు పురస్కారాన్ని ప్రదానం చేయనుంది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలకు సంగీతం అందించి.. ఎన్నో అద్భుతమైన పాటలు అందించి మ్యూజిక్ మేస్ట్రోగా పేరొందిన ఇళయరాజా.. ఇప్పటికే ఎన్నో పురస్కారాలు, సత్కారాలు పొందారు. భారత ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. అయితే, శబరిమల కొండపై నెలకొన్న అయ్యప్పను మేలుకొలిపే ‘హరివరాసనం’ పాటను ఎంతో భక్తితన్వయత్వంపై ఇళయరాజా పాడటం.. విశేషమైన ప్రాచుర్యం పొందింది. అయ్యప్ప భక్తులు నిత్యం వినే పాటగా ఇది ప్రశంసలు అందుకుంది. ఈ నేపథ్యంలో ఇళయరాజకు హరివరాసనం పురస్కారం దక్కడం, శబరిమలలో దానిని అందుకోబోవడం అరుదైన విశేషమని చెప్పాలి. -
డిటెక్టివ్ రిటర్న్స్
విశాల్ మళ్లీ డిటెక్టివ్ అయ్యారు. 2017లో ఓసారి ‘డిటెక్టివ్’గా మనకు కనిపించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ‘డిటెక్టివ్’ సినిమా సీక్వెల్ చేస్తున్నారు. తొలి భాగానికి దర్శకత్వం వహించిన మిస్కిన్ దర్శకత్వంలోనే మలి భాగం కూడా తెరకెక్కుతోంది. ఈ సినిమా చిత్రీకరణ లండన్‌లోని బ్రిస్టల్‌లో ప్రారంభమైంది. అక్కడ దాదాపు 40 రోజుల పాటు ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుందని తెలిసింది. ఈ సినిమాతో ఆశ్య హీరోయిన్గా పరిచయం కాబోతున్నారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. విశాల్ ‘యాక్షన్’ సుందర్. సి దర్శకత్వంలో విశాల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘యాక్షన్’. ఈ చిత్రంలో తమన్నా కథానాయికగా నటించారు. ‘యాక్షన్’ చిత్రాన్ని ఈ నెల 15న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. -
ఆయన పాట లేకుండా నేను లేను : ఎస్పీబీ
సాక్షి, హైదరాబాద్ : తానొక గడ్డిమొలక లాంటివాడినని, ఇళయరాజా పాట లేకుండా తాను ఉండలేనని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. తన పాటల విషయంలో రాయల్టీ కట్టాలంటూ అప్పట్లో ఇళయరాజా పేర్కొన్న సంగతి తెలిసిందే. తన అనుమతి లేనిదే తాను స్వరపర్చిన పాటలను పాడకూడదని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి దూరంగా ఉన్న ఈ మిత్రద్వయం కొన్ని రోజుల క్రితమే మళ్లీ కలిసిపోయారు. నవంబర్ 30న చిత్ర, ఏసుదాసులతో కలిసి నిర్వహించబోయే సంగీత విభావరి కార్యక్రమానికి సంబంధించి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీబీ మాట్లాడుతూ.. ఇళయరాజాతో తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని ఎస్పీబీ తెలిపారు. రాయల్టీ విషయంలో ఏవో చిన్న బేధాభిప్రాయాలు వచ్చాయన్నారు. సోషల్‌మీడియా ఎంత సహకారో అంత మహమ్మారి అని పేర్కొన్నారు. త్వరలోనే ఆయనతో పాటల కార్యక్రమం ఉంటుందని ప్రకటించారు. తనతో ఇళయరాజాకు ఎలాంటి సమస్య ఉండదని అన్నారు. -
ఆది పినిశెట్టి ‘క్లాప్’మూవీ ప్రారంభమైంది
-
స్టార్ స్టార్ సూపర్ స్టార్ ఇళయరాజా
-
నా పాట నీ నోట పలకాల బాలు
ఇళయరాజా– యస్పీ బాలసుబ్రహ్మణ్యంలది ఎవర్గ్రీన్ కాంబినేషన్. రాజా కంపోజిషన్‌లో బాలు అద్భుతమైన పాటలెన్నో పాడారు. సంగీతప్రియుల మ్యూజిక్ కలెక్షన్లో ఎవర్గ్రీన్ ఆల్బమ్స్‌లో నిలిచిపోయారు. అయితే ఈ మధ్య రాయల్టీ విషయంలో వీరిద్దరి మధ్య చిన్న గ్యాప్ వచ్చింది. ‘నేను స్వరపరిచిన పాటలెక్కడ పాడినా నాకు రాయల్టీ చెల్లించాలంటూ’ రాజా కొన్నేళ్లుగా సంచలన స్టేట్మెంట్స్ జారీ చేస్తూ వచ్చారు. దానికి ‘రాజా పాట పాడకుండా నన్నెవ్వరూ ఆపలేరని’ యస్పీబీ కూడా చెప్పారు. అది వీరి మధ్య చిన్న గ్యాప్‌కు కారణం అయింది. ఇటీవలే ఇళయరాజా, యస్పీబీ మళ్లీ కలసిన ఫొటోలు బయటకు వచ్చాయి. తాజాగా విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కుతున్న ‘తమిళరసన్’ చిత్రానికి ఇళయరాజా సంగీత దర్శకుడు. ఇందులో ఓ పాటను యస్పీబీ ఆలపించారు. ఇటీవలే ఆ పాటను రికార్డ్ చేయించారు. ఇవాళ చెన్నైలో జరగబోయే ఇళయరాజా కన్సెర్ట్‌లో యస్పీబీ పాడనున్నారని తెలిసింది. ట్యూన్‌కి, టోన్‌కి మళ్లీ నేస్తం కుదిరింది. సో.. మళ్లీ మరెన్నో మ్యూజికల్ హిట్స్ సంగీతాభిమానులకు ఇవ్వడానికి ఈ కాంబినేషన్ నిశ్చయించుకుందని అనుకోవచ్చు. -
ఇళయరాజా సంగీతం.. ఎస్పీబీ గాత్రం
ఇళయరాజా సంగీతంలో గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎన్నో అధ్బుతమైన పాటలను పాడారు. ఆ పాటలన్నీ ఎప్పటికీ నిలిచిపోతాయి. వృత్తిపరంగానే కాకుండా, వ్యక్తిగతంగానూ ఇళయరాజా-ఎస్పీబీ ఎంతో స్నేహంగా ఉంటారు. అయితే గతంలో ఇళయరాజా తన పాటలకు రాయల్టి ఇవ్వాలని, అలా అయితేనే తన పాటలను వేదికలపై పాడాలని రచ్చ చేశారు. ఆ వివాదం తరువాత వీరిద్దరి మధ్య కాస్త దూరం పెరిగింది. అయితే తాజాగా వీరిద్దరు మళ్లీ కలిశారని, ఒకే వేదికపై కలవనున్నారని అంతేకాకుండా లైవ్ కాన్సెర్ట్‌లో బాలు పాడతారని తెలిపారు. అయితే తాజాగా ఇళయరాజా మ్యూజిక్ డైరెక్షన్లో రాబోతోన్న ‘తమిళసరన్’( ‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోని హీరో) అనే చిత్రంలో బాలు ఓ పాటను కూడా పాడుతున్నారు. ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన కంపోజిషన్ జరుగుతుండగా.. తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
నా పాటలను వాడుకున్న వాళ్లు మగతనం లేనివారే
పెరంబూరు: సంగీత దర్శకుడు ఇళయరాజా మరోసారి వివాదాల్లో చిక్కున్నారు. సంగీతజ్ఞానిగా వాసికెక్కిన ఆయన తరుచూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో తన పేరును తానే తగ్గించుకుంటున్నారనే వాదన సినీ వర్గాలో వినిపిస్తోంది. సంగీత దర్శకుడిగా ఖ్యాతిగాంచిన ఇళయరాజా ఆ మధ్య తన పాటల రాయల్టీ వ్యవహారంలో కోర్టుకెక్కి అభాసుపాలయ్యారు. తన పాటలను ఎవరు, ఎలాంటి కార్యక్రమంలో వాడుకున్నా అందుకు తగిన రాయల్టీని తనకు చెల్లించాలంటూ పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో కొన్ని రికార్డింగ్ కంపెనీలపై ఆయన కోర్టులో దాఖలు చేసిన పిటీషన్లు కొట్టివేతకు గురయ్యాయి. పాటల కచేరీల్లోనూ తన పాటలను పాడరాదన్న విషయంలో ఇళయరాజాకు, గాయకుడు ఎస్పీ.బాలసుబ్రమణ్యంకు మధ్య పెద్ద మరస్పర్ధలకే దారి తీసింది. అవి ఇటీవలే సమసిపోయి, త్వరలో మళ్లీ ఇద్దరూ ఒకే వేదికపై కలవనున్నారనుకోండి. అసలు ఇళయరాజా సంగీతాన్ని అందించినందుకు పారితోషికం ఇస్తున్నామని, మళ్లీ పాటలకు రాయల్టీ ఏమిటని నిర్మాత కే.రాజన్ ప్రశ్నించడంతో పాటు ఆయన చర్యల్ని తప్పు పట్టారు. నిజానికి డబ్చు ఖర్చు పెట్టి, సంగీత దర్శకుడికి పారితోషికం చెల్లించిన నిర్మాతకు పాటల రాయల్టీలో భాగం ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. అదే విధంగా మరి కొందరు నిర్మాతలు కూడా ఇళయరాజా పాటలపై రాయల్టీ అడగడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక తాజాగా ఇళయరాజా చేసిన అనుచిత వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. విజయ్‌సేతుపతి, త్రిష జంటగా నటించిన 96 చిత్రం ఇటీవల తెరపైకి వచ్చి సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం ఇప్పుడు తెలుగు, కన్నడ భాషల్లోనూ రీమేక్ కానుంది. కాగా 96 చిత్రంలో ఇళయరాజా సంగీతాన్ని అందించిన పాత చిత్రాల్లోని పాటలను పొందుపరిచారు. అదే విధంగా ఇటీవల తెరపైకి వచ్చిన మెహందీ సర్కస్ చిత్రంలోనూ ఇళయరాజా పాత పాటలను పొందుపరిచారు. ఈ వ్యవహారంపై స్పందించిన ఇళయరాజా ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ తాను సంగీతాన్ని సమకూర్చిన పాటలను కొత్త చిత్రాల్లో వాడుకున్న వాళ్లు మగతనం లేనివారే అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఇళయరాజా వ్యాఖ్యలకు 96 చిత్ర వర్గాలు గట్టిగానే బదులిచ్చారు. తమ చిత్రంలో వాడిని ప్రతి పాటకు రాయల్టీ చెల్లించినట్లు వారు తెలిపారు. కాగా ఇళయరాజా వైఖరిని నెటిజన్లు మాత్రం ఎండగడుతున్నారు. ఇళయరాజా తన సంకుచిత మనస్తత్వాన్ని వీడాలంటూ ఏకేస్తున్నారు. ఆయన ఇంతకు ముందు చాలా చిత్రాల్లో పాత చిత్రాల్లోని పాటలను వాడుకున్న సందర్భాలు ఉన్నాయని, అప్పుడు ఆయన మగతనం లేనివాడా? అని ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు ఏఆర్.రెహ్మాన్‌కు ఇళయరాజాకు మధ్య ఉన్న వ్యత్యాసం ఇదేనని విమర్శలు గుప్పిస్తున్నారు. -
ట్యూన్ టోన్ కలిసెన్
కొన్ని కాంబినేషన్లు భలే కుదురుతాయి. అందులో ఎవర్గ్రీన్ కాంబినేషన్ అంటే ఇళయరాజా – యస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒకటి. రాజా కంపోజిషన్‌లో యస్పీబీ క్లాసిక్ సాంగ్స్ పాడారు. రాజా ట్యూన్, యస్పీబీ టోన్ అద్భుతః అనుకున్నారు ప్రేక్షకులు. అయితే ఈ బ్యూటిఫుల్ కాంబినేషన్‌కు ఆ మధ్య చిన్న గ్యాప్ వచ్చింది. ‘నా పాటలను నా అనుమతి లేకుండా ఏ వేదిక మీద పాడినా నాకు రాయల్టీ ఇవ్వాలి’ అని ఇళయరాజా స్టేట్మెంట్ జారీ చేశారు. ‘రాజా పాటలు పాడకుండా నన్నెవ్వరూ ఆపలేరు’ అని యస్పీబీ అన్నారు. ఈ వివాదం అలా సాగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ యుద్ధాన్ని ముగించారట. చిన్న ఆలింగనంతో అలకలకు స్వస్తి చెప్పారు. వీరిద్దరూ కలిసున్న ఫొటోలను యస్పీబీ తనయుడు యస్పీ చరణ్ షేర్ చేశారు. వచ్చే నెలలో ఇళయరాజా బర్త్‌డే (జూన్ 2) సందర్భంగా జరగబోయే లైవ్ కాన్సెర్ట్‌లో ఈ ఇద్దరూ కలసి పెర్ఫామ్ చేయబోతారని తెలిసింది. ఇది సంగీతప్రియులకు నిజంగా శుభవార్తే. -
జూన్ 4న తీర్పు
చెన్నై ,పెరంబూరు: సంగీతదర్శకుడు ఇళయరాజా కాపీరైట్స్ పిటిషన్‌పై తుది తీర్పును జూన్ 4న వెల్లడించనున్నట్లు మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి తెలిపారు. సుమారు 1000కి పైగా చిత్రాలకు సంగీతం అందించిన ఇళయరాజా 4,500కు పైగా పాటలకు స్వరపరచారు. ఈయన తన పాటలను తన అనుమతి లేకుండా, కాపీరైట్స్ పొందకుండా సంగీత కచేరీలు వంటి పలు కార్యక్రమాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. కాపీరైట్స్ చట్టం ప్రకారం తన పాటలను వాడుకోవడానికి తనకు సొమ్ము చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ విధంగా 2014లో మలేషియాకు చెందిన అగ్ని మ్యూజిక్, ఏకో రికార్డింగ్, గిరి వర్ధక సంస్థలపై కాపీరైట్స్ కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఏకో సంస్థ నిర్వాహకులు మద్రాసు హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. అందులో ఇళయరాజా పారితోషికం తీసుకునే సంగీతాన్ని అందిస్తున్నారని, కాబట్టి ఆయనకు కాపీరైట్స్ ఉండవని, చిత్ర నిర్మాతలకే ఆ రైట్స్ ఉంటాయని వాదించారు. దీంతో ఇళయరాజా కేసును కోర్టు కొట్టివేసింది. దీంతో నిర్మాతలు ఇప్పుడు పాటలకు సంబంధించి కాపీ చట్టం ప్రకారం తమకు వాటా ఉంటుందని కోరుతున్నారు. కాగా ఏకో సంస్థ దాఖలు చేసిన పిటిష¯న్పై విచారించిన న్యాయస్థానం ఇళయరాజా పిటిషన్‌ను కొట్టివేసినా, ఇతర రికార్డింగ్ సంస్థలపై కేసు విచారణలోనే ఉంది. ఇప్పుడీ కేసుపై తుది తీర్పును జూన్ 4న వెల్లడించనున్నట్లు న్యాయమూర్తి అనితా సుమంత్ తెలిపారు. బుధవారం నుంచి వేసవి సెలవులు మొదలు కావడంతో ఇప్పుడు తీర్పును వెల్లడించలేమని న్యాయమూర్తి పేర్కొన్నారు. -
రాజకీయనాయకులు దేన్నీ వదిలి పెట్టరు..
పెరంబూరు: ఇది ఎన్నికల సమయం. రాజకీయనాయకులకు ప్రజలు గుర్తుకొచ్చేది ఇప్పుడే. వారి కష్టాలు, సమస్యలు అన్నీ తెలిసేదీ సమయంలోనే. పేద, గొప్ప అన్న తారతమ్యం లేకుండా పత్రి వారికి దండం పెడతారు. వారిని ఓట్లుగా మార్చుకోవడానికి ఏఏ అవకాశాలు ఉన్నాయో అన్నింటి పైనా దృష్టి పెడతారు. తమకు ఉపయోగ పడుతుందంటే వాడుకోవడానికి రాజకీయనాయకులు దేన్నీ వదిలి పెట్టరు. అవునండి మరి రాజకీయ నాయకులండి. ఇదంతా తెలిసిన సోదేగా అంటారా! రాజకీయపార్టీలు సినిమా గ్లామర్‌ను తెగ వాడేసుకుంటున్నారు. ఇదీ కొత్త విషమేమీ కాదు. సినిమా వాళ్లు కూడా రాజకీయ ప్రాపకం కోసం ఎగబడుతున్నారు ఇందులోనూ వింతేమీ లేదు. అయితే రాజకీయాలకు అతీతంగా ఉండాలనుకునేవారు కొందరుంటారు. వారిని వాడేసుకోవాలనుకుంటున్నారు. ఉదాహరణకు భారతీయ సినీరంగంలో సంగీతరారాజుగా వాసికెక్కిన ఇళయరాజా రాజకీయాల జోలికి పోయిన పాపాన పోలేదు. అయితే ఆయన్ని తమకు ఓట్లు రాబట్టుకోవడానికి పెట్టుబడిగా వాడేసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇళయరాజా వర్గమే పేర్కొన్నారు. అంతేకాదు ఇళయరాజా పేరును కొన్ని రాజకీయ పార్టీలు ఈ ఎన్నికల్లో లబ్ధిపొందే విధంగా వాడుకుంటున్నారని, అలా ఆయన పేరును గానీ, ఫొటోలను గానీ వాడుకోరాదని హెచ్చరిస్తూ ఒక ప్రకటన కూడా చేశారు. సాధారణంగానే తనకు సంబంధించి తన అనుమతి లేకుండా ఏం చేసినా ఈ సంగీతజ్ఞాని ఒప్పుకోరు. అవసరం అయితే చట్టాన్ని ఆశ్రయించడానికైనా సిద్ధపడతారు. అయినా అనుమతి లేకుండా అలా ఇతర ప్రముఖులు పేర్లను వాడుకోవడం తప్పు కదా! ఎలా ఇలాంటి చర్యలకు పాల్పడతారండి. రాజకీయనాయకులు కదంది! అంతేనండి. -
సంగీతంలో నాకెవరు సాటి!
సంగీతంపై తనతో చర్చించేంత ప్రతిభావంతుడు ఇంకా తారస పడలేదని సంగీత దర్శకుడు ఇళయరాజా అన్నారు. 75వ వసంతంలోకి అడుగు పెట్టిన ఈయనకు పలువురు అభినందన సభలను, సత్కారాలను నిర్వహిస్తున్నారు. ఇటీవలే సినీ నిర్మాతల మండలి ఘనంగా సన్మానించిన విషయం తెలిసిందే. పలు కళాశాలల్లో ఇళయరాజా జన్మదిన కార్యక్రమాలను నిర్వహిస్తూ సన్మానిస్తున్నారు. మంగళవారం విరుదునగర్‌లోని సెంధిల్ కుమర్ నాడార్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఇళయరాజా మాట్లాడుతూ విరుదునగర్‌లో తాను కాలు పెట్టని ప్రాంతమే లేదన్నారు. 1969లో మాసట్ర మనం అనే నాటకానికి సంగీ తాన్ని అందించడానికి తొలిసారిగా హార్మోనియంతో వచ్చానని తెలిపారు. అలా తనకు, తన హార్మోనియంకు పరిచయం అయిన ప్రాంతం విరుదునగర్ అని పేర్కొన్నారు. కామరాజర్ పథకంతో విద్యార్థులకు తాను చెప్పేదొక్కటే. అనవసర ఆలోచనలతో కాలాన్ని వృథా చేసుకోవద్దని హితవు పలికారు. బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని తన సంగీతంతో ఆశీర్వదిస్తున్నానన్నారు. ముఖ్యంగా మిమ్మల్ని ఎవరితోనూ పోల్చుకోవద్దని చెప్పారు. తనకు చదువు అంటే ఆసక్తి మక్కువనీ, అప్పట్లో కామరాజర్ ప్రవేశపెట్టిన మధ్యాహ్నం ఆహారం పథకంతో 6 నుంచి 8 వ తరగతి వరకూ చదువుకున్నానని ఇళయరాజా గుర్తు చేసుకున్నారు. విద్యార్థల ప్రశ్నలకు ఇళయరాజా బుదులిచ్చారు. అపూర్వసహోదరగళ్ చిత్రంలోని పుదుమాయ్ పిళ్లైక్కు నల్ల యోగమడా పాట ఎలా రూపొందిందన్న ఒక విద్యార్థిని ప్రశ్నకు ఆయన బదులిస్తూ, అది ఎంజీఆర్ పాటలు మాదిరిగా ఉండాలని నటుడు కమలహాసన్ కోరారన్నారు. అందుకే నాన్ పార్తదిలే అవళ్ ఒరుత్తిౖయెదాన్ నల్ల అళగి యన్భేన్ పాట బాణీలో అపూర్వ సహోదర్‌గళ్ చిత్రంలోని పాటను రూపొందించినట్లు తెలిపారు. సాహిత్యం, నాటక పుస్తకాలు ఉన్నాయి గానీ, సంగీతం గురించి పుస్తకాలు లేవు మీరు సంగీతం గురించి పుస్తకాలు రాయవచ్చుగా అన్న ప్రశ్నకు బదులిస్తూ సంగీతానికీ పుస్తకాలు ఉన్నాయనీ, అయితే అవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయనీ చెప్పారు. సంగీతానికి సంబంధించి ఏ ఏ పుస్తకాలు ఉండేవో తాను సంగీతాన్ని అందించిన ఒళియిన్ ఓసై చిత్రంలో చెప్పాననీ అన్నారు. ఇకపోతే సంగీతం గురించి తనతో పాటు కూర్చుని చర్చించే ప్రతిభావంతుడు తనకింకా తారస పడలేదనీ, ఇలా అనడంతో తాను గర్విష్టినని కొందరు అనుకుంటారనీ, మరి కొందరు తన నుంచి దూరం అవుతున్నారనీ అన్నారు.అదే విధంగా సంగీతం గురించి పుస్తకం రాయాలన్న ఆలోచన తనకింత వరకూ రాలేదనీ పేర్కొన్నారు.అయినా పుస్తకాలు చదవడం ద్వారా సంగీతాన్ని అర్ధం చేసుకోవడమో, నేర్చుకోవడమో సాధ్యం కాదని ఇళయరాజా అన్నారు. -
అసహనం వ్యక్తం చేసిన ఇళయరాజా!
పెరంబూరు: నటుడు రజనీకాంత్, కేంద్ర మంత్రి పక్కన కూర్చునేందుకు విముఖత చూపారా? ప్రస్తుతం ఇదే అంశం చర్చనీయంశంగా మీడియాలో వైరల్ అవుతోంది. సంగీతజ్ఞాని ఇళయరాజా 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన్ని నిర్మాతల మండలి ఘనంగా సత్కరించింది. శని, ఆదివారాల్లో నందనంలోని వైఎంసీఏ మైదానంలో జరిగిన ఈ బ్రహ్మండ సంగీత కార్యక్రమంలో ఆదివారం సూపర్‌స్టార్ రజనీకాంత్, కమల్‌హాసన్, కేంద్ర మంత్రి పొన్.రాధాకృష్ణన్, సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్, సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ముందుగా నటుడు రజనీకాంత్ విశ్చేశారు. ఆ తరువాత వచ్చిన కేంద్ర మంత్రి పొన్.రాధాకృష్ణన్ రజనీకాంత్‌ను చూసి చిరునవ్వుతో ఆయన పక్కన కూర్చోవడానికి వచ్చారు. ఆ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించడానికి నిశ్చల ఛాయాగ్రహకులు, వారి మధ్య సంభాషణలను సేకరించడానికి విలేకరులు వారి వైపు వేగంగా రావడం మొదలెట్టారు. దీంతో రజనీకాంత్ కాస్త ఇబ్బందిగా ఫీలయ్యారు. ఈ లోగానే కార్య నిర్వాహకులు రజనీకాంత్‌ను వేదికపైకి ఆహ్వానించడంతో అబ్బా.. తప్పించుకున్నాం రా బాబూ అన్నంత రిలీఫ్ అయినట్లు కనిపించింది. రజనీ మాట్లాడిన తరువాత నటుడు కమల్‌హాసన్ రావడంతో ఆయన పక్కన కూర్చున్నారు. ఇదంతా గమనిస్తున్న మీడియా రజనీకాంత్, కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ పక్కన కూర్చోవడానికి విముఖత చూపారా? అన్న ప్రచారానికి తెరలేపింది. కానరాని ప్రముఖులు: ఇళయరాజా 75 వసంతాల వేడుకకు చిత్ర పరిశ్రమ ప్రముఖులు పలువురు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. నటుడు విజయ్, అజిత్, సూర్య, ధనుష్, జీవా, ఎస్జే.సూర్య, జీవీ ప్రకాశ్‌కుమార్, అరుణ్‌విజయ్, అధర్వ, సతీష్, సంతానం, శశికుమార్, సముద్రఖని, సూరి, యోగిబాబు, ప్రకాశ్‌రాజ్, సమంత, హన్సిక, కాజల్, అంజలి, అమలాపాల్, దర్శకుడు భారతీరాజా, రామ్, రంజిత్, పాండిరాజ్, అట్లీ, విఘ్నేశ్‌శివన్, సంగీత దర్శకుడు అనిరుధ్, తమన్, శ్యామ్.సీఎస్, గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, యేసుదాస్, హరిహరన్, శంకర్‌మహదేవన్, గాయని పి.సుశీల, జానకి, సైంధవి, ప్రముఖ నిర్మాత ఏవీఎం.శరవణన్, కలైపులి ఎస్.థాను వంటి ప్రముఖులు అభినందన సభకు దూరంగా ఉన్నారు. దీంతో కార్యక్రమ నిర్వహణలో కొన్ని లోటుపాట్లు జరిగాయన్నది వాస్తవం. అందరినీ కలుపుకునిపోవడంలో నిర్మాతల మండలి విఫలమైందనే అంశం వినిపిస్తోంది. వారికీ ధన్యవాదాలు ఆదివారం జరిగిన వేడుకలో చివరిగా సంగీతజ్ఞాని మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కొందరు ఎంతగా కృషి చేశారో, ఆపడానికి మరికొందరు అంతగా శ్రమించారన్నారు. వారికీ, వీరికీ అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. ఆపడానికి ప్రయత్నించిన వారికి ధన్యవాదాలు ఎందుకో అనుకోవచ్చని, వారు అలా చేయడం వల్లే ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి ఈ కార్యక్రమాన్ని నిషేధించరాదని తీర్పు ఇచ్చారన్నారు. న్యాయస్థానమే అండగా ఉంది కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యహరించిన నటి సుహాసిని మాట్లాడుతూ.. తాను ఇంటి నుంచి ఇళయరాజా వేడుకకు బయలుదేరుతున్న సమయంలో ఇంటి పనిమనిషి వచ్చి, సంగీతజ్ఞాని సన్మాన కార్యక్రమానికి న్యాయమూర్తే అండగా నిలిచారు. సంతోషంగా వెళ్లి రండమ్మా అని చెప్పిందన్న విషయాన్ని ప్రస్తావించారు. అంతగా పోరాడిన గెలిచిన నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌ను అభినందిస్తున్నానని అన్నారు. నటి రోహిణీ ప్రశ్నిస్తూ దర్శకుడు శంకర్‌తో మీరు చేసే చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్నారు. వారి ఆశ ఎప్పుడు నెరవేరుతుందని ఇళయరాజాను ప్రశ్నించడంతో ఆయన కాస్త చిరాకు పడ్డారు. అవన్నీ ఇప్పుడెందుకమ్మా? దర్శకులు ఏ సంగీత దర్శకుడితే కంఫర్టుబుల్‌గా ఉంటే వారితో పని చేయించుకుంటారు అని అన్నారు. ఏదేమైనా విశాల్ ముందు నుంచి చెబుతున్నట్లు గానే ఇళయరాజాకు అభినందన సభను చరిత్రలో గుర్తుండిపోయేటట్లు నిర్వహించి చూపించారు. అదేవిధంగా ఒక సంగీత పుత్రుడి అభినందన కార్యక్రమం అశేష సంగీత ప్రియులను ఆనందడోలికల్లో ముంచెత్తిందన్నది నిజం. -
సంగీతంలో రాజాగారే నాకు స్ఫూర్తి
సంగీత జ్ఞాని ఇళయరాజా 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘ఇళయరాజా 75’ పేరుతో గత శని, ఆదివారాల్లో చెన్నైలో ఘనంగా వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకను తమిళ నిర్మాతల మండలి నిర్వహించింది. ఈ వేడుకలోని హైలెట్స్... ► ఇళయరాజాగారితో ఉన్న అనుబంధం గురించి రెహమాన్ మాట్లాడుతూ – ‘‘నేను రాజాగారి దగ్గర పని చేసిన రోజులు నాకింకా గుర్తున్నాయి. ‘మూండ్రామ్ పిరై’ (వసంత కోకిల) సినిమాకు రాజాసార్ టీమ్‌లో జాయిన్ అయ్యాను. రాజాగారు రికార్డింగ్ స్టూడియోలోకి ప్రవేశిస్తుంటే ,హెడ్ మాస్టర్ క్లాస్‌రూమ్‌లోకి వస్తున్న భావన కలిగేది. ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. సంగీతంలో రాజాగారే నాకు స్ఫూర్తి’’ అన్నారు. ► ఈ కార్యక్రమానికి సీనియర్ నటి, మణిరత్నం భార్య సుహాసిని యాంకర్‌గా వ్యవహరించారు. ‘రెహమాన్ మిమ్మల్ని గురువు అన్నారు. దాని గురించి ఏదైనా పంచుకుంటారా? అని ఇళయరాజాని ఆమె అడగ్గా– ‘‘రెహమాన్ తన తండ్రి దగ్గర కంటే నా దగ్గరే ఎక్కువ ఉన్నాడు. కరెక్టే కదా (రెహమాన్ వైపు చూస్తూ). దానికి రెహమాన్ అవును అన్నారు. ‘ఈ విషయాలన్నీ నువ్వు (రెహమాన్) చెప్పాలి’ అని సరదాగా పేర్కొన్నారు. మరో యాంకర్‌గా వ్యవహరించిన నటి కస్తూరి.. రెహమాన్ కంపోజ్ చేసిన ఏదైనా పాటను పాడమని అడగ్గా ఇళయరాజా ‘మౌనరాగం’ చిత్రంలోని ‘మండ్రం వంద తెండ్రులుక్కు.’ అనే పాటను ఆలపించారు. అదే సమయంలో కీబోర్డ్ దగ్గర ట్యూన్ చేస్తున్న రెహమాన్.. సంగీతజ్ఞాని పాట వింటూ ఆగిపోయారు. ‘ఏమైంది? ట్యూన్ సరిగ్గా గుర్తులేదా? ’ అంటూ రాజా చమత్కరించారు. ► రజనీకాంత్ మాట్లాడుతూ – ‘‘ఇళయరాజా స్వయంభూలింగం. ధోతి ధరించకముందు వరకూ సార్ అని పిలిచేవాణ్ని. ఆ తర్వాత నుంచి స్వామి అంటున్నాను. రాజాగారు కూడా నన్ను అలానే పిలుస్తారు. నాకంటే కమల్‌కు మంచి సంగీతాన్ని అందించారు’’ అని రజనీ అంటుండగా, ఇళయరాజా అందుకుంటూ ‘కమల్‌హాసనేమో మీకు మంచి మ్యూజిక్ ఇచ్చాను అంటుంటారు. నాకు యాక్టర్ ఎవరన్నది కాదు. ఏ పాటకైనా నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను’’ అన్నారు. ► కమల్ హాసన్ ఆయన కుమార్తె శ్రుతీహాసన్ స్టేజ్ మీద మూడు పాటలు పాడి, ఇళయరాజాతో ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకున్నారు. ‘‘నేను రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్నప్పుడు రాజాగారు సలహాలిచ్చారు’’ అన్నారు కమల్. ► ‘‘సంగీతానికి ఒకరే రాజు. ఆయనే ఇళయరాజా. లాంగ్‌డ్రైవ్‌లకు వెళ్తున్నప్పుడు బండిలో పెట్రోల్ ఉందా లేదా అని చూసుకోవడం కంటే ముందు ఇళయరాజా పాటలున్నాయా? లేదా ? అని చెక్ చేసుకుంటారు. ఇలాంటి లెజెండ్స్‌ను సన్మానించుకోవడం మా బాధ్యత. ఇండస్ట్రీలోని వాళ్లకోసం ఇండస్ట్రీ వాళ్లం ఈవెంట్స్ చేయడంలో తప్పు లేదనుకుంటున్నాను. ఈ వేడుక చరిత్రలో మిగిలిపోతుంది. అలాగే దీన్ని వ్యతిరేకించినవాళ్లు కూడా చరిత్రలో ఉంటారు’’ అని పేర్కొన్నారు నిర్మాతల మండలి అధ్యక్షుడు, హీరో విశాల్. రెహమాన్, ఇళయరాజా శ్రుతీహాసన్, కమల్‌హాసన్ కమల్, రజనీ