Pakistan
-
ఆప్ఘనిస్తాన్ టార్గెట్‌గా పాక్ దాడులు.. 15 మంది మృతి
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌ను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్(Pakistan) వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల కారణంగా దాదాపు 15 మంది మరణించినట్టు తెలుస్తోంది. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్టు సమాచారం. ఈనేపథ్యంలో పాక్, ఆప్ఘన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.ఆఫ్ఘనిస్థాన్‌లోని(Afghanistan) పక్టికా ప్రావిన్స్‌లో ఉన్న బర్మాల్ జిల్లాపై మంగళవారం అర్ధరాత్రి పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది. లామన్‌తో సహా ఏడు గ్రామాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఈ దాడుల్లో 15 మంది మృతిచెందగా పలువురు గాయపడినట్టు సమాచారం. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించినట్టు అక్కడి మీడియా ఖమా నివేదించింది. ఈ బాంబు పేలుళ్లకు పాకిస్తాన్ జెట్ విమానాలే కారణమని స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి. పాక్ వైమానిక దాడులు తీవ్రమైన పౌర ప్రాణనష్టం, విస్తృత విధ్వంసానికి కారణమయ్యాయి. దాడుల కారణంగా ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.మరోవైపు.. బర్మాల్, పక్టికాపై జరిగిన వైమానిక దాడికి(Air Strike) ప్రతీకారం తీర్చుకుంటామని తాలిబాన్ రక్షణ మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆప్ఘన్ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం తమ చట్టబద్ధమైన హక్కు అని పేర్కొంది. పాక్ వైమానిక దాడులను ఖండించింది. పాక్ లక్ష్యంగా దాడులు చేసిన వారిలో వజీరిస్థానీ శరణార్థులు కూడా ఉన్నారని తెలిపింది.Aftermath of precision airstrikes conducted by the Pakistan Air Force, eliminating over 40+ TTP terrorists and crippling militant infrastructure in Paktika province Afghanistan.A significant step taken by Pakistan Armed forces in counter-terrorism efforts reaffirming their… pic.twitter.com/x6AZgOx5JB— Global Defense Agency (@Defense_GDA) December 24, 2024ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ మధ్య ఉద్రికత్తలు పెరిగాయి. అయితే, తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP)కు చెందిన ఉగ్రవాదులకు ఆఫ్ఘన్ తాలిబాన్ ఆశ్రయం కల్పిస్తోందని పాకిస్తాన్ ఆరోపించింది. ఈ క్రమంలో దాడులకు చేసినట్టు తెలుస్తోంది. ఇక, పాకిస్తాన్ అధికారులు అధికారికంగా వైమానిక దాడిని ధృవీకరించ లేదు. సరిహద్దుకు సమీపంలో ఉన్న తాలిబాన్ రహస్య స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు సైనిక సన్నిహిత భద్రతా వర్గాలు సూచించాయి. -
తల్లి కాబోతున్న సీమా హైదర్
ఢిల్లీ : ఆన్లైన్ గేమ్‌లో పరిచయమైన వ్యక్తి కోసం పాకిస్థాన్ నుంచి అక్రమంగా భారత్‌కు వచ్చిన సీమా హైదర్ తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించారు. తన భర్త సచిన్ మీనాతో కలిసి సీమా హైదర్ బేబీ బంప్‌తో వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఈ ఏడాది జులైలో పబ్జీ (pubg) వీడియోగేమ్‌లో గ్రేటర్ నోయిడా నివాసి సచిన్ మీనాతో ప్రేమలో పడింది. సచిన్ మీనాకు దూరంగా ఉండలేక తన నలుగురు పిల్లలతో సహా పాక్ సరిహద్దును దాటి నేపాల్ మీదుగా భారత్‌లోకి అక్రమంగా అడుగుపెట్టిన సీమా హైదర్ ఉదంతంలో ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి.పాక్ నుంచి భారత్‌కు వచ్చిన హైదర్ ఆరోపణలు,కోర్టు కేసుల్ని ఎదుర్కొన్నారు. ఆ తర్వాత నేపాల్‌లోని పశుపతినాథ్ ఆలయంలో మతం మార్చుకుని సచిన్‌ను వివాహం చేసుకున్నారు. తన మొదటి భర్త సంతానంతో పుట్టిన నలుగురు పిల్లల పేర్లు మార్చారు. నలుగురు పిల్లలతో కలిసి రెండో భర్త సచిన్ మీనాతో కలిసి గ్రేటర్ నోయిడాలో నివసిస్తున్నారు. తాజాగా, త్వరలో తాను పండంటి బిడ్డకు జన్మనిస్తున్నట్లు ఓ వీడియోను విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది. -
హ్యాట్రిక్ డకౌట్స్.. పాక్ ఓపెనర్ చెత్త రికార్డులు
అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ దారుణ ప్రదర్శన కొనసాగుతుంది. షఫీక్ ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో ఏడు సార్లు డకౌట్లు అయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్లో సింగిల్ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక డకౌట్లు అయిన ఓపెనర్ల జాబితాలో షఫీక్ క్రిస్ గేల్, ఉపుల్ తరంగతో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక డకౌట్లు అయిన చెత్త రికార్డు హెర్షల్ గిబ్స్ (2002, 8 సార్లు), తిలకరత్నే దిల్షన్ (2012, 8 సార్లు) పేరిట ఉంది.హ్యాట్రిక్ డకౌట్స్సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో అబుల్లా షఫీక్ గోల్డన్ డకౌటయ్యాడు. ఈ మ్యాచ్‌లో షఫీక్ తానెదుర్కొన్న తొలి బంతికే వికెట్ పారేసుకున్నాడు. వన్డేల్లో షఫీక్ ఇది వరుసగా మూడో డకౌట్. సౌతాఫ్రికాతో జరిగిన తొలి రెండు వన్డేల్లో కూడా షఫీక్ డకౌటయ్యాడు.చరిత్రలో మొదటి ఓపెనర్‌గా చెత్త రికార్డుతాజా డకౌట్‌తో షఫీక్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. మూడు మ్యాచ్‌ల ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో హ్యాట్రిక్ డకౌట్లను నమోదు చేసిన మొదటి ఓపెనర్‌గా రికార్డుల్లోకెక్కాడు. న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్ గప్తిల్ కూడా ఓ ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో హ్యాట్రిక్ డకౌట్లు నమోదు చేశాడు. అయితే శ్రీలంకతో జరిగిన ఆ సిరీస్ ఏడు మ్యాచ్‌ల వన్డే సిరీస్. టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ కూడా వన్డేల్లో హ్యాట్రిక్ డకౌట్లు నమోదు చేశాడు. గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో స్కై ఈ అపప్రదను మూటగట్టుకున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. వర్షం కారణంగా టాస్ అలస్యమైంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచకుంది. ఇన్నింగ్స్ రెండో బంతికే షఫీక్ ఔటయ్యాడు. 3.1 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 10/1గా ఉంది. ఈ దశలో వర్షం మళ్లీ మొదలుకావడంతో మ్యాచ్‌కు అంతర్జాయం కలిగింది. వర్షం ముగిసిన మ్యాచ్ మళ్లీ ప్రారంభమైంది. మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు. 4 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 16/1గా ఉంది. సైమ్ అయూబ్ (6), బాబర్ ఆజమ్ (10) క్రీజ్‌లో ఉన్నారు. షఫీక్ వికెట్ రబాడకు దక్కింది.కాగా, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను పాక్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. వన్డే సిరీస్‌కు ముందు జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను సౌతాఫ్రికా 2-0 తేడాతో గెలుచుకుంది. 3 టీ20లు, మూడు వన్డేలు, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం పాకిస్తాన్ జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది. ఇరు జట్ల మధ్య డిసెంబర్ 26 నుంచి తొలి టెస్ట్ మొదలవుతుంది. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి రెండో టెస్ట్ జరుగుతుంది. -
ఐసీసీ వేదికపై మరోసారి తలపడనున్న భారత్, పాకిస్థాన్
-
పాకిస్తాన్‌కు షాకిచ్చిన అమెరికా..
వాషింగ్టన్: దాయాది దేశం పాకిస్తాన్‌కు అగ్ర రాజ్యం అమెరికా బిగ్ షాకిచ్చింది. పాక్‌కు చెందిన నాలుగు మిస్సైల్స్ సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ క్రమంలో పాకిస్తాన్ క్షిపణులపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. దీర్ఘశ్రేణి క్షిపణి టెక్నాలజీ మిస్సైల్స్ తయారుచేయడం తమకు సైతం అమెరికాకు కూడా ముప్పే అంటూ చెప్పుకొచ్చింది.దీర్ఘశ్రేణి క్షిపణి టెక్నాలజీ వ్యాప్తికి సహకరిస్తున్నాయంటూ పాక్‌కు చెందిన నాలుగు సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా ఆంక్షల విషయంపై అమెరికా డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ జోన్ ఫైనర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాక్ దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను అభివృద్ధి చేయడం అమెరికాతో సహా దక్షిణాసియా దేశాలకు పెద్ద ముప్పు. అందుకే ఆ దేశానికి చెందిన నాలుగు సంస్థలపై ఆంక్షలు విధించడం జరిగింది. 2021లో ఆఫ్గనిస్థాన్ నుంచి అమెరికా దళాలు వైదొలిగిన తర్వాత పాకిస్తాన్‌తో ఒకప్పటి సంబంధాలు లేవు అని చెప్పుకొచ్చారు.ఇక, దీర్ఘశ్రేణి క్షిపణి టెక్నాలజీకి సంబంధించి అమెరికా ఆంక్షలు విధించిన జాబితాలో పాక్ ప్రభుత్వరంగానికి చెందిన నేషనల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్ (ఎన్డీసీ) కూడా ఉండటం గమనార్హం. దీంతోపాటు అక్తర్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అఫిలియేట్స్ ఇంటర్నేషనల్, రాక్‌సైడ్ ఎంటర్ప్రైజెస్ కూడా జాబితాలో ఉన్నాయి. ఈ మూడు కంపెనీలు కరాచీ కేంద్రంగా పని చేస్తున్నాయి.మరోవైపు.. తమ సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించడంపై పాక్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఆంక్షలు కేవలం పక్షపాతంతో కూడుకున్నవే అని ఘాటు విమర్శలు చేసింది పాక్ ప్రభుత్వం. సైనికపరమైన అసమానతలను సృష్టిస్తే ప్రాంతీయంగా అస్థిరత తలెత్తుతుందని అధికారులు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో భారత్‌పై పాక్ ఆరోపణలు చేసింది. బైడెన్ ప్రభుత్వం భారత్‌తో సన్నిహితంగా ఉన్న కారణంగానే ఇలాంటి నిర్ణయం తీసుకుందని కామెంట్స్ చేసింది. -
సౌతాఫ్రికాతో రెండో వన్డే.. ధోని రికార్డుపై కన్నేసిన బాబర్ ఆజమ్
కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికా, పాకిస్తాన్ జట్ల మధ్య ఇవాళ (డిసెంబర్ 19) రెండో వన్డే మ్యాచ్ జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో పాక్‌కు శుభారంభం లభించింది. పార్ల్ వేదికగా జరిగిన తొలి వన్డేలో పాక్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీనికి ముందు జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను సౌతాఫ్రికా 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో మూడో టీ20 వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. పాక్ క్రికెట్ జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ల కోసం సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది.ధోని రికార్డుపై కన్నేసిన బాబర్ ఆజమ్గత కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్న పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్, టీమిండియా మాజీ సారధి ఎంఎస్ ధోని పేరిట ఉన్న ఓ లాంగ్ స్టాండింగ్ బ్యాటింగ్ రికార్డుపై కన్నేశాడు. SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో బాబర్ అన్ని ఫార్మాట్లలో కలిపి ఏడు సెంచరీలు, 31 హాఫ్ సెంచరీల సాయంతో 4732 పరుగులు చేశాడు. మరోవైపు ధోని SENA దేశాల్లో 38 హాఫ్ సెంచరీ సాయంతో 5273 పరుగులు చేశాడు. SENA దేశాల్లో ధోని, బాబర్ ప్రస్తుతం 38 యాభై ప్లస్ స్కోర్లు కలిగి ఉన్నారు. సౌతాఫ్రికాతో జరిగే రెండో వన్డేలో బాబర్ మరో హాఫ్ సెంచరీ చేస్తే.. SENA దేశాల్లో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఎంఎస్ ధోనిని అధిగమిస్తాడు.తొలి వన్డేలో పాక్ ఘన విజయంతొలి వన్డేలో అఘా సల్మాన్ ఆల్‌రౌండర్ షో, సైమ్ అయూబ్ సూపర్ సెంచరీతో కదంతొక్కడంతో సౌతాఫ్రికాపై పాక్ ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో పాక్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి వన్డేలో బాబర్ ఆజమ్ 23 పరుగులు చేసి ఓట్నీల్ బార్ట్‌మన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో బాబర్‌కు శుభారంభం లభించినా భారీ స్కోర్ చేయలేకపోయాడు. బాబర్ గత కొంతకాలంగా ఫార్మాట్లకతీతంగా దారుణంగా విఫలమవుతున్నాడు. అతను హాఫ్ సెంచరీ మార్కు తాకి కూడా చాన్నాళ్లవుతుంది. -
భారత్ ‘ఖో ఖో’ కూత పాక్‌తో షురూ
న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరిగే ప్రప్రథమ ఖోఖో ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. భారత్ ఆతిథ్యమిచ్చే ఈ గ్రామీణ క్రీడ మెగా ఈవెంట్లో పురుషుల విభాగంలో చిరకాల ప్రత్యర్థుల మధ్య జనవరి 13న జరిగే తొలి మ్యాచ్‌తో ప్రపంచకప్‌కు తెరలేవనుంది. 13 నుంచి 19 వరకు జరిగే ఈ ఈవెంట్లో 24 దేశాలకు చెందిన జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో 21 పురుషుల జట్లు, 20 మహిళా జట్లు బరిలోకి దిగుతాయి. భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే పోటీకి ముందుగా అట్టహాసంగా ప్రారంబోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రపంచకప్ సీఈఓ విక్రమ్ దేవ్ డోగ్రా తెలిపారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘13 నుంచి 16వ తేదీ వరకు లీగ్ దశ మ్యాచ్‌లు జరుగుతాయి. 17న నాలుగు క్వార్టర్ ఫైనల్స్ పోటీలు నిర్వహిస్తాం. మరుసటి రోజే (18) సెమీఫైనల్స్, ఇరు విభాగాల్లో 19న జరిగే ఫైనల్స్‌తో టోర్నీ ముగుస్తుంది’ అని అన్నారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంతో పాటు గ్రేటర్ నోయిడాలోని ఇండోర్ స్టేడియంలో మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ టోర్నీ కోసం జవహర్లాల్ స్టేడియంలో ప్రస్తుతం భారత పురుషులు, మహిళా జట్ల ప్రాబబుల్స్‌కు శిబిరాన్ని నిర్వహిస్తున్నామని ఇందులో నుంచి తుది జట్లను త్వరలోనే ప్రకటిస్తామని భారత ఖోఖో సమాఖ్య (కేకేఎఫ్ఐ) అధ్యక్షుడు సుధాన్షు మిట్టల్ చెప్పారు. బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ఈ మెగా ఈవెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. 615 మంది ప్లేయర్లు, 125 మంది సహాయ సిబ్బందికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. -
వికటించిన స్నేహం చిగురించేనా?
అంతర్జాతీయ పరిణామాలెప్పుడూ స్థిరంగా ఉండవు. నిన్న మొన్నటి వరకు భారత్ నుంచి పెద్ద ఎత్తున సహాయ సహకారాలు పొందిన పొరుగుదేశంబంగ్లాదేశ్లో మారిన అంతర్గత రాజకీయ పరిస్థితులు భారత్‌కు ఆందోళనకరంగా మారాయి. అక్కడి హిందువులపై దాడులు జరగడం వికటించిన స్నేహానికి నిదర్శనం. పాకిస్తాన్ నుంచి తమ దేశానికి రావడానికి ఉన్న వీసా నిబంధనను కూడా బంగ్లాదేశ్ సడలించింది. దేశ ద్వారాలను బార్లా తెర వడం వల్ల ఉగ్ర మూకలు స్థిర నివాసం ఏర్పరచుకొనే ప్రమాదం ఉంది.భద్రతాపరంగా ఇది కూడా భారత్‌కు ఆందోళనకరమే. స్వతంత్ర దేశంగాబంగ్లాదేశ్ ఏర్పడటంలో భారత్ పోషించిన పాత్ర చరిత్రాత్మకం. అలాంటి బంధమున్న దేశంతో తగిన విధంగా స్పందించి పరిస్థితులను చక్కబెట్టాలి.బంగ్లాదేశ్‌లో ఆగస్ట్ మాసంలో జరిగిన రాజకీయ విపరిణామాల కారణంగా ఆ దేశ ప్రధాని షేక్ హసీనా కట్టుబట్టలతో దేశం నుంచి పారిపోయి భారత్‌లో తలదాచుకొంటున్నారు. అప్పటినుంచీ భారత్, బంగ్లాదేశ్ మధ్య దాదాపు 5 దశాబ్దాల పాటు కొనసాగుతూ వచ్చిన స్నేహ సంబంధాలు ఒక్కసారిగా దెబ్బతిన్నట్లయ్యింది. 1971లో పాకిస్తాన్‌తో యుద్ధం చేసి, స్థానిక ప్రజల ఆకాంక్షల మేరకు ఓ స్వతంత్ర దేశంగా బంగ్లాదేశ్ ఏర్పడటంలో భారత్ పోషించిన పాత్ర చారిత్రాత్మకం.అందుకు భారత్ ఎంతో త్యాగం చేసింది. ఆ తర్వాత కూడా బంగ్లాదేశ్ పునర్ నిర్మాణంలో అన్ని రకాల సహాయ సహకారాలు అందించింది. తమకు స్వేచ్ఛను కల్పించినందుకు బంగ్లాదేశీయులకు సైతం భారత్ పట్ల గౌరవాభిమానాలు నిన్నమొన్నటి వరకు అవిచ్ఛిన్నంగా కొన సాగాయి.మారిన పరిస్థితులుఇరు దేశాల మధ్య చక్కటి స్నేహ సంబంధాలు కొనసాగుతున్న తరుణంలో... బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న పరిణామాలతో పరిస్థి తులు తలకిందులయ్యాయి. 17 కోట్ల జనాభా కలిగిన బంగ్లాదేశ్‌లో దాదాపు కోటిన్నరకు పైగా హిందువులు ఉన్నారు. బౌద్ధులు, క్రైస్తవులు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. గత 4 నెలలుగా బంగ్లా దేశ్‌లోని హిందూ ఆలయాలు, హిందువులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరుగుతున్నాయి. ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఏర్పాటైన మధ్యంతర ప్రభుత్వం ఈ దాడులను నిరోధించకపోవడం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. బంగ్లాదేశ్‌లో చోటు చేసుకొంటున్న పరిణామాలపై విదేశీ (ఇండియా) మీడియా వక్రభాష్యం చెబుతోందంటూ యూనస్ ఈ హింసను సమర్థించుకోవటానికి తాపత్రయపడుతున్నారు. పొరుగునున్న బంగ్లాదేశ్ ఒక్కసారిగా ప్రత్యర్థిగా మారడాన్ని భారత్ నిశితంగానే పరిశీలిస్తోంది. పార్లమెంట్లో అధికార బీజేపీ సభ్యులు ఈ అంశంపై తమ ఆందోళనను వ్యక్తం చేశారు. శ్రీకృష్ణుడి జన్మస్థానమైన మ«థురకు ప్రాతినిధ్యం వహిస్తున్న సినీ నటి హేమ మాలిని హిందువులపై జరుగుతున్న దాడులను ఎత్తిచూపడంతో పాటు, సాధువు చిన్మయి కృష్ణదాస్‌ను అరెస్ట్ చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు.ఆశ్చర్యకరంగా, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులతో తమకు సంబంధమే లేనట్టు వ్యవహరిస్తోంది. బంగ్లాదేశ్‌తో 2,216 కిలోమీటర్ల సరిహద్దును పంచుకొంటున్న పశ్చిమ బెంగాల్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ సైతం... ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించడం లేదు. ఆ ద్వేషమే భారత్ వ్యతిరేకతకు కారణంప్రధాన ప్రతిపక్షాలన్నీ బహిష్కరించిన జాతీయ ఎన్నికలలో ఈ ఏడాది గెలిచిన షేక్ హసీనా మూడవ పర్యాయం ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత కొన్ని వర్గాల ప్రజల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకొన్నాయి. ప్రజాభిప్రాయాన్ని ప్రతిఫలించని ఆ ఎన్నికలలో హసీనా గెలుపును మెజారిటీ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని హసీనా, ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న అవామీ లీగ్ పార్టీ ప్రముఖులు పెద్ద ఎత్తున అధికార దుర్విని యోగానికీ, అవినీతికీ పాల్పడ్డారన్న క్రోధంతో ప్రజలు ఉన్నారు. పైగా, దేశంలో నిరుద్యోగం పెరుగుతుండగా స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబాలకు చెందిన వారికి ఉద్యోగాలలో రిజర్వేషన్లుఅందించాలన్న హసీనా ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల కోపం అగ్గి మీద గుగ్గిలం చల్లినట్లయింది. ఒక దశలో దేశాభివృద్ధి రేటులో ఆసియాలోనే అగ్రగామిగా ఉన్న తమ దేశం క్రమంగా హసీనా పరివారం అవినీతి, అసమర్థత కారణంగా పాతాళానికి పడిపోయిందన్న ఆగ్రహమూ ఏర్పడింది. ఈ అంశాలు బంగ్లా ‘యువత’ను వీధుల్లోకొచ్చి ఉద్యమించేందుకు పురిగొల్పాయి. సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించకుండా ఉద్యమకారుల్ని అణచివేయడానికి ప్రభుత్వం సిద్ధపడటంతో పరిస్థితి చేయిదాటింది. యువత తిరుగుబాటు చేసి ప్రధాని నివాసాన్ని ముట్టడించి పాల్పడిన విధ్వంసాన్ని యావత్ ప్రపంచం చూసి నివ్వెరపోయింది. సకాలంలో షేక్ హసీనా, ఆమె సోదరి ఇద్దరూ తప్పించుకొని భారత్ చేరుకోవడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చిన భారత్‌ను బంగ్లాదేశీయులు తప్పుపడుతున్నారు. భారత్‌పై వారు గుడ్డి వ్యతిరేకత ప్రదర్శించడానికి అదే కారణమని చెప్పాలి. ఆ వ్యతిరేకత కాస్తా హిందువుల పట్ల ద్వేష భావంగా రూపాంతరంచెందింది. దాంతో ఉద్యమకారులు హసీనా నివాసంపై దాడి చేశాక దేశంలోని హిందువులపైన, హిందువుల ప్రార్థనా మందిరాలపైన విరుచుకుపడి విధ్వంసం సృష్టించారు. దేశం విడిచిన షేక్ హసీనాకు అమెరికా, బ్రిటన్, జర్మనీ వంటి దేశాలు ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించగా, భారత్ మాత్రం సాదరంగా ఆహ్వానించి ఆమెకు అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. హసీనా ప్రభుత్వం స్థానంలో మహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం ఎంతవరకూ వెళ్లిందంటే బంగ్లాదేశ్ జాతి పితగా పిలిచే షేక్ హసీనా తండ్రి ముజీబుర్ రహమాన్ చిహ్నాలను తొలగిస్తోంది. కరెన్సీ నోట్లపై ఆయన బొమ్మ ఉన్నందున, పాత కరెన్సీని తొలగించి దాని స్థానంలో ఆయన బొమ్మ లేకుండా కొత్త కరెన్సీని మరో 6 నెలల్లో చలామణీలోకి తెస్తోంది. కొత్తగా ముద్రించే కరెన్సీ నోట్ల మీద హసీనాపై చేపట్టిన తిరుగుబాటు చిత్రాలను ముద్రించనున్నట్లుబంగ్లా సెంట్రల్ బ్యాంకు ప్రకటించడం సంచలనం కలిగించింది.పాక్‌తో సన్నిహితంగా బంగ్లా పాకిస్తాన్ నుంచి తమ దేశానికి రావడానికి ఉన్న వీసా నిబంధనను బంగ్లాదేశ్ సడలించినట్లుగా వార్తలొచ్చాయి. ఇదొక అనూహ్య పరిణామం. ఒకవిధంగా, బంగ్లాదేశ్ తన కన్నును తానే పొడుచు కొన్నట్లు భావించాలి. పాకిస్తాన్‌తో స్నేహ సంబంధాలను నెరపు కోవడాన్ని ఎవ్వరూ తప్పుపట్టరు. కానీ, తమ దేశ ద్వారాలను బార్లా తెరవడం వల్ల ఉగ్రవాద మూకలు దేశంలోకి ప్రవేశించి స్థిర నివాసం ఏర్పరచుకొనే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్, భారత సరిహద్దుల వెంబడి 3 బెటాలియన్ల రక్షణ దళాలను (బీఎస్ఎఫ్) మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది.నిజానికి గత నాలుగైదు నెలలుగా భారత్ దౌత్యపరంగా అనేక దేశాలకు మరింత చేరువైంది. చైనా అండ చూసుకొని తోక జాడించాలనుకొన్న ‘మాల్దీవులు’ మళ్లీ తప్పు సరిదిద్దుకొని భారత్‌కు స్నేహహస్తం చాచింది. ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ మాసంలో రష్యా, ఆ తర్వాత నైజీరియా, బ్రెజిల్, గయానా దేశాలలో పర్యటించి ఆ దేశాలతో గల ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్ఠం చేశారు. మరోపక్క రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆఫ్రికా దేశాలలో పర్యటించడం వల్ల ఆ దేశాలతో భారత్ వ్యాపార, వాణిజ్య సంబంధాలు విస్తరించాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. నేడు ప్రపంచంలోనే భారత్ ఓ బలీయమైన దేశంగా, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, పాలస్తీనా–ఇజ్రాయెల్ యుద్ధాలను నిలువరించగలిగిన సామర్థ్యం గల దేశంగా పరిగణించబడుతున్న తరుణంలో చిరకాల మిత్రదేశం బంగ్లాదేశ్‌తో వైరం ఏర్పడటం ఆందోళనకరమే. 142 కోట్ల ప్రజల భద్రతకే కాదు, ప్రపంచ వ్యాప్తంగా 200 దేశాల్లో ఉన్న భారతీయుల భద్రతకు పూచీ పడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. బంగ్లాదేశ్‌లో ఉన్న లక్షలాది మంది హిందువుల మనుగడ ప్రశ్నార్థకం కాకముందే భారత ప్రభుత్వం తగు విధంగా స్పందించి వారి పూర్తి రక్షణకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది.- వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, శాసనమండలి సభ్యులు- డా‘‘ ఉమ్మారెడ్డివెంకటేశ్వర్లు -
SA VS PAK 1st ODI: రాణించిన క్లాసెన్
పార్ల్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి వన్డేలో సౌతాఫ్రికా స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (97 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 86 పరుగులు) రాణించడంతో సౌతాఫ్రికా ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో టోనీ డి జోర్జి (33), ర్యాన్ రికెల్టన్ (36), ఎయిడెన్ మార్క్రమ్ (35), మార్కో జన్సెన్ (10), కగిసో రబాడ (11), ఓట్నీల్ బార్ట్‌మన్ (10 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. రస్సీ వాన్ డెర్ డస్సెన్ (8), ట్రిస్టన్ స్టబ్స్ (1), అండైల్ ఫెహ్లుక్వాయో (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.ఓపెనర్లు జోర్జి, రికెల్టన్ తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించడంతో సౌతాఫ్రికా ఓ దశలో భారీ స్కోర్ చేసేలా కనిపించింది. అయితే ఇక్కడే పాక్ స్పిన్నర్ సల్మాన్ అఘా సఫారీ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. అఘా 18 పరుగుల వ్యవధిలో జోర్జి, రికెల్టన్, డస్సెన్, స్టబ్స్ వికెట్లు పడగొట్టాడు. ఈ దశలో మార్క్రమ్.. కొద్దిసేపు క్లాసెన్‌తో కలిసి క్రీజ్‌లో నిలదొక్కుకున్నాడు. మార్క్రమ్ ఔటయ్యాక జన్సెన్ సాయంతో క్లాసెన్ సెంచరీ దిశగా సాగాడు. అయితే సఫారీలను ఈ సారి షాహీన్ అఫ్రిది ఇబ్బందుల్లోకి నెట్టాడు. సెంచరీకి చేరువలో ఉండగా అఫ్రిది క్లాసెన్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు.ఆఖర్లో టెయిలెండర్లు ఒక్కో పరుగు పోగు చేయడంతో సౌతాఫ్రికా 239 పరుగులు చేయగలిగింది. పాక్ బౌలర్లలో సల్మాన్ అఘా 4, అబ్రార్ అహ్మద్ 2, షాహీన్ అఫ్రిది, సైమ్ అయూబ్ తలో వికెట్ పడగొట్టారు. -
నటి నిమ్రా ఖాన్ క్రాష్ డైట్: ఇది ఆరోగ్యకరమేనా...?
34 ఏళ్ల పాకిస్తాన్ నటి నిమ్రా ఖాన్ హాస్య ధారావాహిక కిస్ దిన్ మేరా వియా హొవేగాలో చిన్న పాత్రతో యాక్టింగ్ వృత్తిని ప్రారంభించింది. అలా నెమ్మదిగా మెహెర్బాన్, ఉరాన్, ఖూబ్ సీరత్, మే జీనా చాహ్తీ హూన్ వంటి ప్రముఖ టెలివిజన్ సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆమె ఇటీవల చాలా తక్కువ వ్యవధిలో స్లిమ్‌గా మారి అందర్నీ ఆశ్చర్యపరిచింది. తాను ఇంతలా బరువు ఎలా తగ్గిందో కూడా వివరించింది. దీంతో ఒక్కసారిగా అందరిలో ఇలా.. వేగవంతంగా బరువు తగ్గించే పద్ధతులు మంచివేనా..? అనే సందేహం మెదిలింది. అయితే ఈ విధానంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో సవివరంగా చూద్దామా..!.పాక్ నటి ఇమ్రా ఖాన్ తన వెయిట్ లాస్ జర్నీ గురించి ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది. తాను క్రాస్డైట్తో కేవలం ఏడు రోజుల్లోనే ఎనిమిది కిలోలు బరువు తగ్గినట్లు తెలిపింది. అలాగే తాను ఈ డైట్‌ని ఎలా ఫాలో అయ్యిందో కూడా వివరించింది. బరువు తగ్గడానికి సరైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడమే గాక నిబద్ధతతో డైట్ ఫాలో కావాలని చెప్పుకొచ్చింది. తాను ఆహారంలో కేవలం తెల్లసొన, యాపిల్స్, గ్రీన్ టీ, వెజిటబుల్ జ్యూస్‌లు మాత్రమే తీసుకుని, పూర్తిగా కార్బోహైడ్రేట్లను నివారించానని తెలిపింది. ఇలా.. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇదే దినచర్య అని పేర్కొంది. అందువల్లే కేవలం ఏడు రోజుల్లోనే ఎనిమిది కిలోలు బరువు తగ్గినట్లు వెల్లడించింది ఈ ముద్దుగుమ్మ. అలాగే తేనె, నిమ్మకాయ, చియా గింజలు కలిపిన గోరువెచ్చని నీటితో ప్రతిరోజూ ప్రారంభించాలని చెప్పింది. అయితే ఇది ఏడు రోజుల డైట్ ప్లాన్ అని..చాలావరకు అందరూ మూడు రోజులు స్ట్రిట్‌గా ఫాలోఅయ్యి, ఆ తర్వాత మధ్యలోనే స్కిప్ చేసేస్తుంటడంతో మంచి ఫలితాలు పొందలేకపోతుంటారని చెప్పుకొచ్చింది. బరువు తగ్గడానికి ఇది సరైనదేనా..?నటి నిమ్రా డైట్ ప్లాన్ త్వరితగతిన ఫలితాలు ఇచ్చినప్పటికీ.. బరువు నిర్వహణకు ఇది సరైన ఆరోగ్య విధానం కాదని చెబుతున్నారు నిపుణుల. ఇలాంటి క్రాష్ డైట్లు తరుచుగా కొవ్వు తగ్గడం కంటే..శరీరంలోని నీటి శాతాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. దీంతో హర్మోన్ల అసమతుల్యత, జుట్టు రాలడం, చర్మ సమస్యలు వంటి దుష్ప్రభావాలనకు దారితీసే ప్రమాదం ఉందన్నారు.అలాగే ఎప్పుడైనా కార్బోహైడ్రేట్స్ ఆహారంలో చేర్చే ప్రయత్నం చేస్తే.. విపరీతమైన బరువు పెరిగే ప్రమాదం కూడా లేకపోలేదని హెచ్చరించారు. ముఖ్యంగా హర్మోన్ల మార్పులు, పిత్తాశయ రాళ్లు, మానసిక కల్లోలం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. మంచి ఫలితాల కోసం నిధానంగా బరువు తగ్గించే ఆరోగ్యకరమైన వెయిట్ లాస్ డైట్లు మంచివని అన్నారు. వీటితో గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించడమే గాక ఇతర వ్యాధుల బారిన పడకుండా ఉండేలా రోగ నిరోధకశక్తి వృద్ధి చెందే అవకాశం ఉంటుందని చెప్పారు.(చదవండి: బ్రెస్ట్ కేన్సర్: తొలిదశ గుర్తింపే అతిపెద్ద సవాలుగా..!) -
22 ఏళ్లగా పాక్‌లో చిక్కుకుపోయి.. హమీదా బానో భారత్ ఎలా చేరుకున్నదంటే..
పాక్‌లో ఉంటున్న భారతీయులు పలు ఆంక్షల మధ్య దుర్భర జీవితం సాగిస్తున్నారనే వార్తలను మనం తరచూ వింటుంటాం. అనుకోని రీతిలో పాక్‌లో చిక్కుకుపోయిన ఒక భారతీయ మహిళ అక్కడ పలు అవస్థలను ఎదుర్కొంది. ఎప్పుడెప్పడు తన స్వదేశానికి వెళదామా అని ఎదురు చూసింది. ఎట్టకేలకు ఆమె ఆశ నెరవేరింది.ముంబైలోని కుర్లా నివాసి హమీదా బానో(70) 22 ఏళ్లక్రితం తనకు తెలియకుండా పాకిస్తాన్లోకి అడుగుపెట్టింది. అయితే ఎప్పటికైనా భారత్ తిరిగి వెళ్లాలనే ఆమె ఆశ నిరంతరం సజీవంగానే ఉంది. తాజాగా ఆమె పంజాబ్‌లోని అట్టారీ సరిహద్దు మీదుగా భారత్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. సరిహద్దుల్లో ఆమెకు అమృత్‌సర్‌లోని ఫోక్లోర్ రీసెర్చ్ అకాడమీ అధ్యక్షుడు రమేష్ యాదవ్ ఆమెకు స్వాగతం పలికారు. 2002లో హమీదా బానో దుబాయ్‌లో వంటమనిషిగా ఉద్యోగం చేసేందుకు ఒక ముంబై ఏజెంట్‌ను సంప్రదించింది. అయితే ఆ ఏజెంట్ ఆమెను దుబాయ్‌కి బదులుగా పాకిస్తాన్‌కు పంపాడు. హమీదా బానో తాను పాకిస్తాన్‌కు చేరుకున్నానని తెలియగానే కంగారుపడిపోయింది. భయం కారణంగా ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. పోలీసులకు కూడా తెలియజేయలేదు.ముంబైలో ఉంటున్న హమీదా బానో కుటుంబ సభ్యులు ఆమె ఎక్కడికి వెళ్లిందో తెలియక ఆందోళనకు గురయ్యారు. హమీదా పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని హైదరాబాద్‌లో ఉంటూ తినుబండారాలు అమ్ముతూ జీవిస్తూ వచ్చింది. తదనంతరకాలంలో ఆమెకు కరాచీలోని ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతను పెళ్లికి ప్రపోజ్ చేయడంతో అందుకు అంగీకరించింది. వీరి వైవాహిక జీవితం సవ్యంగానే సాగింది. అయితే హమీదా బానో భర్త కరోనా సమయంలో మృతిచెందాడు.పాకిస్తాన్లో హమీదా బానో ఒక మదర్సా బయట కూర్చుని తినుబండారాలు అమ్ముతుండేది. ఆమె దగ్గరకి చాక్లెట్లు కొనుక్కునేందుకు వచ్చిన ఒక బాలుడు తన చదువు పూర్తయ్యాక ఒక టీవీ ఛానల్లో ఉద్యోగం సంపాదించాడు. ఒక రోజు అతను హమీదాను ఇంటర్యూ చేశాడు. ఇది అతను పనిచేస్తున్న టీవీలో టెలికాస్ట్ అయ్యింది. అది వైరల్‌గా మారింది.ముంబైలో ఉంటున్న హమీదా పిల్లలు యాస్మీన్, ప్రవీణ్ ఈ వీడియో చూశారు. ఇదేసమయంలో ఈ వీడియో పాకిస్తాన్ అధికారుల దృష్టికి కూడా వచ్చింది. దీంతో వారు ప్రభుత్వాన్ని సంప్రదించి హమీదాను భారత్‌కు పంపేందుకు ప్రయత్నించారు. ఈ వార్త పాకిస్తాన్‌లోని పలు టెలివిజన్ చానళ్లలో ప్రసారమయ్యింది. దాదాపు 22 ఏళ్ల తర్వాత హమీదా బానో తన స్వస్థలమైన ముంబైకి చేరుకున్నారు. ఆమెను చూసిన కుటుంబసభ్యులు ఈ సమయంలో భావోద్వేగానికి గురయ్యారు.ఇది కూడా చదవండి: Year Ender 2024: ప్రధాని మోదీ పర్యటించిన దేశాలివే.. మీరూ ట్రిప్‌కు ప్లాన్ చేసుకోవచ్చు -
Vijay Diwas: ‘చనిపోయానని ఇంటికి టెలిగ్రాం పంపారు’: నాటి సైనికుని అనుభవం..
అది 1971, డిసెంబర్ 16.. భారతదేశ చరిత్ర పుటల్లో గర్వకారణంగా నిలిచిన రోజు. ఆ రోజున భారతదేశం యుద్ధంలో పాకిస్తాన్‌కు ఘోరమైన ఓటమి ఎలా ఉంటుందో చూపింది. నాటి యుద్ధంలో సుమారు 3,900 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందగా, 9,851 మంది గాయపడ్డారు. యుద్ధం అనంతరం 93 వేల మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోయారు. ఈ నేపధ్యంలోనే తూర్పు పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా, బంగ్లాదేశ్‌గా ఆవిర్భవించింది.నాటి యుద్ధంలో బీహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన పలువురు వీర సైనికులు పాకిస్తాన్ సేనను ధైర్యంగా ఎదుర్కొని, వారిని మట్టికరిపించారు. ప్రతీయేటా డిసెంబర్ 16 రాగానే.. నాటి యుద్ధంలో పాల్గొని, పాక్ సైనికులను ఓడించిన వీర జవాన్లకు నాటి జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి.నాటి యుద్ధంలో పాల్గొన్న ఒక సైనికుడు మీడియాతో మాట్లాడుతూ ‘నేను యుద్ధం ప్రారంభమైనప్పుడు లక్నోలో వైర్లెస్ ఆపరేటర్‌గా పని చేశాను. నాడు నన్ను బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు పంపారు. అక్కడ మా ఎనిమిది మంది సైనికుల బృందం పాకిస్తాన్ సైనికుల కాన్వాయ్‌పై మెరుపుదాడి చేసింది. ఈ దాడిలో పలువురు పాకిస్తానీ సైనికులు మరణించారు. అప్పుడు జరిగిన కాల్పుల్లో మేము స్పృహ కోల్పోయాం. నేను చనిపోయానని సైన్యం భావించి, మా ఇంటికి టెలిగ్రామ్ పంపింది. అయితే ఆ తర్వాత నేను స్పృహలోకి రాగానే, నేను బతికే ఉన్నానంటూ మా ఇంటిలోనివారికి సైన్యం తిరిగి మరో సందేశం పంపింది’ అని తెలిపారు.మరో సైనికుడు తన యుద్ధ అనుభవాలను మీడియాతో పంచుకుంటూ ‘యుద్ధం జరుగుతున్న సమయంలో నేను ఢాకాలో ఉన్నాను. రాత్రంతా వైర్లెస్ బ్యాటరీని ఛార్జ్ చేసేవాడిని. కరెంటు లేకపోవడంతో జనరేటర్‌తో పని చేయాల్సి వచ్చేది. ఆ సమయంలో మేము నిత్యం అప్రమత్తంగా ఉన్నాం. పాకిస్తాన్ సైనికులు ఎప్పుడైనా దాడి చేయవచ్చనే భావనతో ఉండేవాళ్లం’ అని తెలిపారు. నాడు భారత సైనికులు ప్రదర్శించిన ధైర్యం అందరికీ ఎనలేని స్ఫూర్తినిస్తుంది. నాటి యుద్ధంలో పాల్గొని వీరమరణం పొందిన సైనికులకు ప్రతి ఏటా డిసెంబర్ 16న దేశవ్యాప్తంగా నివాళులు అర్పిస్తారు.ఇది కూడా చదవండి: Mahakumbh 2025: లక్షలాది రుద్రాక్షలు ధరించి ప్రయాగ్‌రాజ్‌కు.. -
పాకిస్తానీల కళ్లన్నీ భారత్‌పైనే.. గూగుల్‌లో ఏం వెతికారంటే..
వివిధ దేశాలలో ప్రజల దృష్టిని ఆకర్షించిన అత్యంత ప్రజాదరణ పొందిన సెర్చ్ ట్రెండ్స్, భిన్న అంశాలను వెల్లడిస్తూ గూగుల్ (Google) ప్రతి సంవత్సరం తన "ఇయర్ ఇన్ సెర్చ్" నివేదికను ఆవిష్కరిస్తుంది. ఇందులో వార్తలు, క్రీడా ఈవెంట్ల దగ్గర నుండి సెలబ్రిటీలు, సినిమాలు, టీవీ షోలు, సందేహాలు వంటివెన్నో ఉంటాయి.ఈ క్రమంలోనే గూగుల్ ఇటీవల పాకిస్తాన్‌కు సంబంధించిన “ఇయర్ ఇన్ సెర్చ్ 2024”ని విడుదల చేసింది. ఏడాది పొడవునా పాకిస్తాన్ ప్రజలు గూగుల్ ఏం వెతికారు..కీలక పోకడలు, అంశాలను హైలైట్ చేస్తూ విభిన్న రంగాలలో జాతీయ ఆసక్తిని ఆకర్షించిన వాటిపై ఒక సంగ్రహావలోకనం ఈ నివేదిక అందిస్తుంది.గూగుల్ పాకిస్తాన్ 2024 సంవత్సరాంతపు జాబితాలో క్రికెట్, వ్యక్తులు, సినిమాలు&నాటకాలు, హౌ-టు సందేహాలు, వంటకాలు, టెక్నాలజీ వంటి ఆరు కేటగిరీల్లో అత్యధిక సెర్చ్ చేసిన టాప్ 10 అంశాలు ఉన్నాయి. అయితే యాదృచ్ఛికంగా వీటిలో భారత్ గురించి లేదా దానికి సంబంధించిన కొన్ని విషయాలు ఉన్నాయి. భారతీయ వ్యాపారవేత్తలు, సోనీ, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో భారతీయ షోలు, టీ20 ప్రపంచ కప్ సిరీస్‌లో భారత జట్టు క్రికెట్ మ్యాచ్‌లు వీటిలో ఉన్నాయి.పాకిస్థానీల ఆసక్తులు ఇవే..క్రికెట్లో పాకిస్థాన్‌లో అత్యధికంగా శోధించిన ఐదు గేమ్‌లు భారత్ ఆడిన మ్యాచ్‌లే. వీటిలో టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్‌ల మధ్య పోరు ఒకటి. ఇది కాకుండా అత్యధికంగా సెర్చ్ చేసిన ఇతర మ్యాచ్‌లలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, ఇండియా వర్సెస్ ఇంగ్లండ్, ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్‌లు ఉన్నాయి.ఇక వ్యక్తుల విషయానికి వస్తే.. 'పీపుల్ లిస్ట్ ఫర్ పాకిస్థాన్'లో భారత్‌కు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఉన్నారు.సినిమాలు & నాటకాల జాబితాలో అత్యధికంగా భారతీయ టీవీ షోలు, నాలుగు బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. హీరామండి, ట్వల్త్ ఫెయిల్, మీర్జాపూర్ సీజన్ 3, బిగ్ బాస్ 17 పాకిస్తానీలు అత్యధికంగా సెర్చ్ చేసిన టీవీ షోలు కాగా యానిమల్, స్త్రీ 2, భూల్ భులైయా 3, డంకీ 2024లో అత్యధికంగా గూగుల్ చేసిన బాలీవుడ్ సినిమాలు. -
ముచ్చటగా మూడో క్రికెటర్.. పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్
పాకిస్తాన్ క్రికెట్లో రిటైర్మెంట్ల పర్వం కొనసాగుతోంది. తాజాగా మరో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఇర్ఫాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. తన సహచరులు ఇమాద్ వసీం, మహ్మద్ అమీర్ రిటైర్మెంట్ ప్రకటించిన కొన్ని గంటలలోపే ఇర్ఫాన్ కూడా తన నిర్ణయాన్ని వెల్లడించడం గమనార్హం. దీంతో 36 గంటల వ్యవధిలో రిటైరైన మూడో పాకిస్తాన్ క్రికెటర్‌గా నిలిచాడు. ఇర్ఫాన్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించాడు. "అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. నా ఈ ప్రయాణంలో మద్దతుగా నిలిచిన నా సహచరులకు, కోచ్‌లకు ధన్యవాదాలు. పాకిస్తాన్ క్రికెట్‌తో నాకు ఎన్నో మరపురాని జ్ఞాపకాలు ఉన్నాయి. పాకిస్తాన్‌కు అత్యున్నత స్ధాయిలో ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను" అని ఇర్ఫాన్ ఎక్స్లోరాసుకొచ్చాడు. ఇర్ఫాన్ 2010లో పాకిస్తాన్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు.4 టెస్టులు, 60 వన్డేలు, 22 టీ20ల్లో పాక్ జట్టుకు ఇర్ఫాన్ ప్రాతినిథ్యం వహించాడు. ఓవరాల్‌గా 86 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన 4.91 ఎకానమీ రేటుతో 83 వికెట్లు తీసుకున్నాడు. ఇర్ఫాన్ చివరగా 2019లో పాక్ తరుపున ఆడాడు.చదవండి: భారత్‌తో మూడో టెస్టు: ట్రవిస్ హెడ్ వరల్డ్ రికార్డు.. సరికొత్త చరిత్ర -
పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాకింగ్ నిర్ణయం
పాకిస్తాన్ వెటరన్ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీం షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపాడు. ఇమాద్ సోషల్‌మీడియా వేదికగా తన రిటైర్మెంట్ సందేశాన్ని పంపాడు.దేశానికి ప్రాతినిధ్యం వహించడం తనకు దక్కిన గొప్ప గౌరవమని అందులో పేర్కొన్నాడు. పాకిస్తాన్‌కు ఆడుతున్న ప్రతి క్షణం మరచిపోలేనిదని అన్నాడు. అభిమానుల ప్రేమ మరియు వారి తిరుగులేని మద్దతుకు ధన్యవాదాలు తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా దేశవాలీ మరియు ఫ్రాంచైజీ క్రికెట్లో ఆడటం కొనసాగిస్తానని వెల్లడించాడు.35 ఏళ్ల ఇమాద్ 2015లో పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఇమాద్‌కు టీ20 స్పెషలిస్ట్‌గా పేరుంది. ఇమాద్ పాక్ తరఫున 55 వన్డేలు, 75 టీ20లు ఆడాడు. వన్డేల్లో 986 పరుగులు, 44 వికెట్లు.. టీ20ల్లో 554 పరుగులు, 73 వికెట్లు తీశాడు. ఇమాద్ ప్రపంచవ్యాప్తంగా వివిధ ఫ్రాంచైజీలకు అడుతున్నాడు. ఇమాద్ 2019లో పాక్ వన్డే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇమాద్ 2023లోనే అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే 2024 టీ20 వరల్డ్‌కప్ కోసం అతను తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. -
పాకిస్తాన్ హెడ్‌కోచ్‌గా మాజీ ఫాస్ట్ బౌలర్..
పాకిస్తాన్ క్రికెట్లో మరోసారి ముసలం నెలకొంది. పాక్ టెస్ట్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్ బాధ్యతల నుంచి జాసన్ గిలెస్పీ తప్పుకున్నాడు. బోర్డుతో విబేధాల కారణంగానే ఆసీస్ దిగ్గజం ఈ సంచలనం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గిలెస్పీ స్ధానాన్ని 24 గంటల వ్యవధిలోనే పాక్ క్రికెట్ బోర్డు భర్తీ చేసింది.తమ రెడ్ బాల్ క్రికెట్ జట్టు తత్కాలిక హెడ్ కోచ్‌గా జావేద్‌ను పీసీబీ నియమించింది. "దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ నుంచి పాక్ రెడ్ బాల్ క్రికెట్ జట్టు హెడ్‌కోచ్‌గా జావెద్ తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడని" పీసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ పర్యటలో భాగంగా ఆతిథ్య జట్టుతో పాక్ మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది.అదే కారణమా?కాగా హెడ్ కోచ్ గ్యారీ గ్యారీ కిరస్టెన్ వైదొలిగిన అనంతరం హెడ్ కోచ్‌గా జాసన్ గిలెస్పీని పీసీబీ నియమించింది. అయితే దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ నేపథ్యంలో కోచింగ్ బృందం నుంచి అసిస్టెంట్ కోచ్ టిమ్ నీల్సన్‌ను పీసీబీ తప్పించింది. అతడి కాంట్రాక్ట్‌ను పొడిగించేందుకు పీసీబీ సముఖత చూపలేదు.ఈ క్రమంలో పీసీబీ నిర్ణయంపై గిలెస్పీ అసహనం వ్యక్తం చేశాడని, అందుకే తన పదవికి రాజీనామా చేశాడని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కాగా గిలెస్పీ-నీల్సన్ నేతృత్వంలోనే ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను పాక్ సొంతం చేసుకుంది.చదవండి: ఫాస్టెస్ట్ సెంచరీ.. వెస్టిండీస్ బ్యాటర్ ప్రపంచ రికార్డు -
పాకిస్తాన్ క్రికెట్లో ఆసక్తికర పరిణామం
పాకిస్తాన్ క్రికెట్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆ జట్టు రెడ్ బాల్ (టెస్ట్) కోచ్ జేసన్ గిల్లెస్పీ జట్టుతో పాటు సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లేది లేదని తేల్చి చెప్పాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో చోటు చేసుకుంటున్న పరిణామాలే గిల్లెస్పీ నిర్ణయానికి కారణమని తెలుస్తుంది.పీసీబీ ఇటీవల తీసుకున్న కొన్ని నిర్ణయాలతో గిల్లెస్పీ కలత చెందాడని సమాచారం. గిల్లెస్పీ ఇవాళ (డిసెంబర్ 12) పాక్ టెస్ట్ జట్టుతో కలిసి దుబాయ్ మీదుగా దక్షిణాఫ్రికాకు వెళ్లాల్సి ఉంది. అయితే పాక్ జట్టు ప్రయాణించిన విమానంలో గిల్లెస్పీ జాడ కనబడలేదు. దీంతో ఆయన తన రాజీనామాను పీసీబీకి పంపినట్లు ప్రచారం జరుగతుంది. ఈ అంశంపై పీసీబీ వైపు నుంచి ఎలాంటి సమాచారం లేదు.గిల్లెస్పీ ఈ ఏడాది ప్రారంభంలో పాక్ టెస్ట్ జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. గిల్లెస్పీ-పీసీబీ మధ్య రెండేళ్లకు ఒప్పందం కుదిరింది. గిల్లెస్పీ ఆథ్వర్యంలో పాక్ స్వదేశంలో బంగ్లాదేశ్ చేతిలో టెస్ట్ సిరీస్ కోల్పోయింది. అయితే బంగ్లా సిరీస్ తర్వాత పాక్ స్వదేశంలోనే ఇంగ్లండ్‌పై సంచలన విజయం సాధించింది. ఇంగ్లండ్ సిరీస్ సందర్భంగా పీసీబీ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాల పట్ల గిల్లెస్పీ అసంతృప్తిగా ఉన్నాడని తెలుస్తుంది.పాక్ వైట్ బాల్ కోచ్‌గా గ్యారీ కిర్‌స్టన్ నిష్క్రమించిన కొద్ది రోజుల్లోనే గిల్లెస్పీ వ్యవహారం చోటు చేసుకుంది. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో గిల్లెస్పీతో పాటు కిర్‌స్టన్ పాక్ హెడ్ కోచ్‌లుగా నియమించబడ్డారు. పాక్ జట్టుకు ఇద్దరు విదేశీ కోచ్‌లు ఆరు నెలలు కూడా నిలదొక్కుకోలేకవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గిల్లెస్పీ గైర్హాజరీలో పాక్ రెడ్ బాల్ టీమ్ తాత్కాలిక బాధ్యతలను కూడా ఆకిబ్ జావిదే మొయవచ్చు. జావిద్ ఛాంపియన్స్ ట్రోఫీ వరకు పాక్ తాత్కాలిక వైట్ బాల్ కోచ్‌గా నియమించబడ్డ విషయం తెలిసిందే.ప్రస్తుతం పాక్ పరిమిత ఓవర్ల జట్లు సౌతాఫ్రికాలో పర్యటిస్తున్నాయి. టీ20, వన్డే సిరీస్‌ల అనంతరం పాక్ సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. రెండు టెస్టులు సెంచూరియన్ (డిసెంబర్ 26 నుంచి), కేప్ టౌన్ (జనవరి 3 నుంచి) వేదికలుగా జరుగనున్నాయి. -
పాక్‌లో ఇండియన్ సినిమాల కోసం ఆరాటం.. ఏకంగా!
చుట్టమల్లే చుట్టేసి వెళ్లిపోయినట్లుంది 2024. మొన్నే ప్రారంభమైందనుకునేలోపే గుడ్‌బై చెప్పేందుకు రెడీ అయిపోయింది. కానీ ఈ ఏడాది ఎప్పటిలాగే బోలెడన్ని సినిమాలు రిలీజయ్యాయి. అందులో బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకున్న చిత్రాలతో పాటు మనసులు కదిలించే కథలు కూడా ఉన్నాయి. అయితే మన సినిమాలు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవల్లో ప్రాచుర్యం ఉందాయి. అందుకు ఇదే బెస్ట ఎగ్జాంపుల్.టాప్ 10లో ఎనిమిది మనవే!పాకిస్తాన్లో ఈ ఏడాది ఎక్కువ మంది సెర్చ్ చేసిన సినిమా/వెబ్ సిరీస్‌ల జాబితాను గూగుల్ రిలీజ్ చేసింది. ఆశ్చర్యంగా టాప్ 10లో ఎనిమిది మన భారతీయ చిత్రాలే కాగా రెండు మాత్రమే పాక్ దేశానికి సంబంధించినవి. హీరామండి వెబ్ సిరీస్ మొదటి స్థానంలో ఉండగా 12th ఫెయిల్ రెండో స్థానంలో ఉంది. యానిమల్, మీర్జాపూర్ 3(వెబ్ సిరీస్), స్త్రీ 2 తర్వాతి మూడు స్థానాల్లో ఉన్నాయి.బిగ్‌బాస్‌కూ క్రేజ్ఆరవ స్థానంలో పాక్ సినిమా ఇష్క్ ముర్షీద్ చోటు దక్కించుకుంది. తర్వాత మళ్లీ ఇండియన్ సినిమాలు, షోలే హవా చాటాయి. ఏడో స్థానంలో భూల్ భులయ్యా 3, ఎనిమిదో స్థానంలో డంకీ, తొమ్మిదో స్థానంలో హిందీ బిగ్‌బాస్ 17వ సీజన్ పాగా వేశాయి. చివరగా పాక్ డ్రామా కభీ హమ్ కభీ తుమ్ పదో స్థానంలో నిలిచింది.చదవండి: తొలి స్థానంలో స్త్రీ2... రెండో స్థానంలో కల్కి 2898 ఏడీ -
గుండె తరుక్కుపోయే ఘటన: పాపం ఆ చిట్టితల్లి ..!
కొన్ని ఘటనలు అత్యంత పాశవికంగా ఉంటాయి. మనుషులేనా..? అనే భయం కలుగుతుంటుంది. అదికూడా అభం శుభం తెలియని చిన్నారులు పట్ల ఇంత హేయంగా ప్రవర్తించడమా..! అనే జుగుప్సకరమైన బాధకలుగుతుంటుంది. అచ్చం అలాంటి గుండె తరుక్కుపోయే ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. ఆ చిట్టి తల్లికి పదేళ్లకే నిండు నూరేళ్లు నిండిపోయాయి. కంటిపాపలా కాచుకోవాల్సిన తండ్రి చేతిలోనే హతమవుతానని ఊహించి ఉండదు పాపం. పదేళ్ల సారా షరీఫ్ ఇంగ్లండ్‌లో తన ఇంటిలోనే విగతజీవిగా కనిపించింది. ఒళ్లంతా తీవ్రమైన గాయాలతో మృతి చెంది ఉంది. చనిపోవడానికి ముందు దారుణమైన వేధింపులకు గురై ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. వారి అనుమానమే నిజమయ్యింది. చనిపోయినప్పుడు ఆ చిన్నారి ఒంటిపై మానవ పంటి గాయాలతో సహా మొత్తం 70 గాయలు ఉన్నట్లు పోస్ట్‌మార్టంలో వెల్లడయ్యింది. అలాగే మెడ, వెన్నుముకతో సహ మొత్తం 25 చోట్ల ఎముకలు విరిగినట్లు నివేదక పేర్కొంది. నా కెరీర్లో ఇలాంటి కేసు చూడలేదుపోలీసులు సైతం ఈ ఘటన చూసి తమ 30 ఏళ్ల కెరీర్లో ఇంతటి దారుణమైన కేసుని చూడలేదన్నారు. ఈ కేసుని సీరియస్‌గా తీసుకున్న డిటెక్టివ్ చీఫ్ ఇన్స్పెక్టర్ క్రెయిగ్ ఎమ్మెర్సన్ ఈ కేసుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడమే గాక ఈ ఘటనతో సంబంధం ఉన్న నిందితులందర్నీ అరెస్టు చేశారు. ఈ కేసులో అత్యంత బాధకరమైన విషయం ఏమిటంటే కన్నతండ్రే ఆ చిన్నారిని ఇంత ఘోరమైన బాధలకు గురిచేయడమే. ఆమె బాల్యమంత భరించలేని బాధలతోనే గడిచింది. యావత్తు ప్రపంచం ఉలిక్కిపడింది..అక్కడితో ఆగక ఆ కిరాతక తండ్రి తన భార్యతో కలిసి ఆ చిన్నారిని దారుణంగా హతమార్చాడు. ఇందులో ఆ చిన్నారి మేనమామ ప్రమేయం కూడా ఉన్నట్లు తేలడంతో అతడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సారా ఉదంతంతో ఒక్కసారిగా యావత్ ప్రపంచంలో పిల్లల సంరక్షణ ఏ స్థితిలో ఉందనే భయాందోళన రేకెత్తించింది. ఈ ఘటనతో పిల్లలు సంరక్షణకు సంబంధించిన సంస్కరణలకు పిలుపునిచ్చారు సామాజికవేత్తలు. నిజానికి ఇంగ్లాండ్‌లాంటి దేశంలో పిల్లల సంరక్షణకు సంబంధించి కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అయినా కూడా ఆ చిన్నారి కథ విషాదంతో ముగిసిపోయే వరకు వెలుగులోకి రాలేదు. కాగా, ఈ కేసులో పోలీసులకు దొరికిన కీలక ఆధారం నిందితుడు ఉర్ఫాన్ షరీష్ స్వయంగా నా కూమార్తెను కొట్టి చంపానని చేతితో వ్రాసిన నోట్. అయితే విచారణలో మాత్రం బుకాయించే ప్రయంత్న చేశాడు, కానీ పోలీసులు తమదైన శైలిలో విచారించేటప్పటికీ..తన భార్యతో కలిసి ఈ నేరం చేసినట్లు ఉర్ఫాన్ ఒప్పుకున్నాడు.తీసుకోవాల్సిన చర్యలు..ఇలాంటి ఘటనలు వేధింపులకు గురవ్వుతున్న చిన్నారులు భద్రత గురించే గాక కర్కశంగా ప్రవర్తించే తల్లిదండ్రులకు ఎలా బుద్ధి చెప్పాలో తెలియజెప్పుతోంది. వాస్తవానికి ఇలాంటి ఘటనలు అంతతేలిగ్గా బయటకురావు. అలాగే చుట్టుపక్కల వాళ్లు లేదా ఎవ్వరైనా ధైర్యం చేసి..ఇలాంటి కేసు గురించి పోలీసుల దృష్టికొచ్చేలా చేయడం అనేది అంత ఈజీ కాదు. ఇవి అత్యంత సున్నితమైన కేసులు. ఈ విషయంలో చిన్నారుల భద్రత, సంక్షేమానికి సంబంధించి..ప్రభుత్వం హెల్ప్లైన్లు, కౌన్సిలింగ్ సెంటర్లతో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ విధంగా ఏ చిన్నారి బలవ్వకుండా ప్రభుత్వం, సమాజం చొరవ చూపితేగానీ..ఇలాంటి ఘటనలు పునరావృతం కావని అంటున్నారు విశ్లేషకులు.(చదవండి: సైంటిస్ట్ జంట రూటే సెపరేటు! ఏముంది వెడ్డింగ్ కార్డ్..!) -
సౌతాఫ్రికాకు బిగ్ షాక్
సౌతాఫ్రికా, పాకిస్తాన్ జట్ల మధ్య ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతుంది. ఈ సిరీస్ జరుగుతుండగా సౌతాఫ్రికాకు భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు ప్రధాన పేసర్ అన్రిచ్ నోర్జే టీ20 సిరీస్‌తో పాటు తదుపరి జరిగే వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్‌కు కూడా నోర్జే దూరంగా ఉన్నాడు. నోర్జే ఎడమకాలి బొటనవేలు ప్రాక్చర్ అయినట్లు స్కానింగ్‌లో తేలింది. పాక్‌తో టీ20 సిరీస్‌కు నోర్జే ప్రత్యామ్నాయంగా అన్క్యాప్డ్ ఆల్‌రౌండర్ డయ్యాన్ గేలిమ్ ఎంపికయ్యాడు. గేలిమ్ తన 60 మ్యాచ్‌ల టీ20 కెరీర్లో 46 వికెట్లు పడగొట్టాడు.కాగా, నోర్జే ఈ ఏడాది జూన్‌లో జరిగిన టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో చివరిసారి సౌతాఫ్రికా జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఆ వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికా రన్నరప్‌గా నిలిచింది. ఈ మెగా టోర్నీలో నోర్జే సౌతాఫ్రికా తరఫున లీడింగ్ వికెట్ టేకర్‌గా (15 వికెట్లు) ఉన్నాడు. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కారణంగా నోర్జే జాతీయ కాంట్రాక్ట్ నుంచి కూడా తప్పుకున్నాడు.సౌతాఫ్రికాను పట్టి పీడిస్తున్న గాయాలుప్రస్తుతం సౌతాఫ్రికా జట్టును గాయాల సమస్య వేధిస్తుంది. నోర్జే గాయపడిన అనంతరం సౌతాఫ్రికా క్యాజ్యువల్స్ (బౌలర్లు) సంఖ్య ఐదుకు చేరింది. నోర్జేకు ముందు గెరాల్డ్ కొయెట్జీ, నండ్రే బర్గర్, లుంగి ఎంగిడి, వియాన్ ముల్దర్ గాయాల బారిన పడ్డారు. ప్రస్తుతానికి వీరంతా జట్టుకు దూరంగా ఉంటున్నారు.ఇదిలా ఉంటే, మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం పాకిస్తాన్ జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇరు జట్ల మధ్య తొలుత టీ20 సిరీస్ మొదలైంది. డిసెంబర్ 10న జరిగిన తొలి టీ20లో పాకిస్తాన్‌పై సౌతాఫ్రికా 11 పరుగుల తేడాతో గెలుపొందింది. కిల్లర్ మిల్లర్ ఊచకోత (82), జార్జ్ లిండే ఆల్‌రౌండ్ షో (48, 4/21) కారణంగా ఈ మ్యాచ్‌లో పాక్‌పై సౌతాఫ్రికా సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. -
శత్రువుతో స్నేహం.. ఇండియాకు ద్రోహం.. బంగ్లాదేశ్ ఎందుకిలా?
-
SA Vs PAK: డేవిడ్ మిల్లర్ ఊచకోత.. ఉత్కంఠ పోరులో ఓడిన పాకిస్తాన్
స్వదేశంలో పాకిస్తాన్‌తో టీ20 సిరీస్‌ను దక్షిణాఫ్రికా విజయంతో ఆరంభించింది. డర్బన్ వేదికగా జరిగిన తొలి టీ20లో 11 పరుగుల తేడాతో పాక్‌పై సౌతాఫ్రికా విజయం సాధించింది. 184 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేయగల్గింది. ఓ దశలో కెప్టెన్ రిజ్వాన్ క్రీజులో ఉన్నప్పుడు పాకిస్తాన్ సునాయసంగా లక్ష్యాన్ని అందుకుంటుందని అంతా భావించారు.కానీ ఆఖరి ఓవర్లో రిజ్వాన్ ఔట్ కావడం, ఇతరుల నుంచి అతడికి సపోర్ట్ లభించకపోవడంతో పాక్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. చివరి ఓవర్లో పాక్ విజయానికి 19 పరుగుల అవసరమవ్వగా.. సఫారీ యువ పేసర్ మఫాక కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు.పాక్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్(62 బంతుల్లో 74, 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. అయూబ్(31) పరుగులతో పర్వాలేదన్పించాడు. బాబర్ ఆజం(0)తో సహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ప్రోటీస్ బౌలర్లలో జార్జ్ లిండీ 4 వికెట్లు పడగొట్టగా.. మఫాక రెండు, సీమ్లేన్, బార్ట్‌మన్ తలా వికెట్ సాధించారు.డేవిడ్ మిల్లర్ ఊచకోత..ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. ప్రోటీస్ టాపర్డర్ విఫలమైనప్పటికి.. మిడిలార్డర్ బ్యాట్ డేవిడ్ మిల్లర్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 40 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లతో 82 పరుగులు చేసి ఔటయ్యాడు.అతడితో పాటు జార్జ్ లిండే(24 బంతుల్లో 48, 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, అర్బర్ ఆహ్మద్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. అబ్బాస్ అఫ్రిది రెండు వికెట్లు సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య మూడో డిసెంబర్ 13న సెంచూరియన్ వేదికగా జరగనుంది.చదవండి: సిరాజ్‌ను సీనియర్లే నియంత్రించాలి: ఆసీస్ మాజీ కెప్టెన్ -
సౌతాఫ్రికాతో తొలి టీ20.. బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిది రీ ఎంట్రీ
సౌతాఫ్రికాలో పాకిస్తాన్ పర్యటన ఇవాల్టి (డిసెంబర్ 10) నుంచి మొదలవుతుంది. డర్బన్ వేదికగా ఇరు జట్లు ఇవాళ తొలి టీ20లో తలపడతాయి. ఈ మ్యాచ్ కోసం పాకిస్తాన్ తుది జట్టును కాసేపటి కిందే ప్రకటించారు. జింబాబ్వే టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న స్టార్ ఆటగాళ్లు షాహీన్ అఫ్రిది, బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్ ఈ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నారు.జింబాబ్వే టీ20 సిరీస్ పాక్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన సల్మాన్ అలీ అఘాను ఈ మ్యాచ్ నుంచి తప్పించారు. గత కొన్ని సిరీస్‌లుగా అఘా దారుణంగా విఫలమవుతున్నాడు. జింబాబ్వే పర్యటనలో రాణించిన తయ్యబ్ తాహిర్ మిడిలార్డర్లో కీలకపాత్ర పోషించనున్నాడు. మిడిలార్డర్లో ఉస్మాన్ ఖాన్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్ చోటు దక్కించుకున్నారు.సౌతాఫ్రికాతో తొలి మ్యాచ్‌లో ఎవరు ఓపెనింగ్ చేస్తారన్నది సందిగ్దంగా మారింది. జింబాబ్వే పర్యటనలో సత్తా చాటిన సైమ్ అయూబ్‌ను ఓపెనర్‌గా పంపిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్ ఓపెనర్లుగా బరిలోకి దిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మొహమ్మద్ అబ్బాస్ అఫ్రిది ఆల్‌రౌండర్ పాత్ర పోషిస్తూ ఏడో స్థానంలో బరిలోకి దిగుతాడు.అబ్బాస్ అఫ్రిదితో పాటు షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్ పేస్ విభాగంలో ఉంటారు. స్పిన్నర్లు సూఫియాన్ ముఖీమ్, అబ్రార్ అహ్మద్ బరిలోకి దిగనున్నారు. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 9:30 గంటలకు ప్రారంభమవుతుంది. సౌతాఫ్రికాతో తొలి టీ20కి పాక్ తుది జట్టు..మొహమ్మద్ రిజ్వాన్ (కెప్టెన్ అండ్ వికెట్‌కీపర్), బాబర్ ఆజమ్, సైమ్ అయూబ్, ఉస్మాన్ ఖాన్, తయ్యబ్ తాహిర్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, మొహమ్మద్ అబ్బాస్ అఫ్రిది, షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్, సూఫియాన్ ముఖీమ్, అబ్రార్ అహ్మద్ -
పాక్‌లో తొలి హిందూ పోలీసు అధికారిగా రాజేందర్ మేఘ్వార్
న్యూఢిల్లీ: మన దాయాది దేశం పాకిస్తాన్లో హిందువులపైన, హిందూ ఆలయాలపైన దశాబ్దాలుగా దాడులు జరుగుతున్న విషయం విదితమే. ఇటువంటి తరుణంలో హిందువులు అక్కడి ప్రభుత్వంలో, ఇతర హోదాల్లో ఉండటం అనేది గగనమే. అయితే పాక్‌లో తొలిసారిగా సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, అక్కడి పోలీస్ సర్వీసెస్‌కు రాజేందర్ మేఘ్వార్ అనే హిందువు ఎంపికయ్యారు.దీంతో పాకిస్తాన్లో తొలి హిందూ ఏఎస్పీగా రాజేందర్ మేఘ్వార్ చరిత్ర సృష్టించారు. ఈ నేపధ్యంలో రాజేందర్ మేఘ్వార్ భారత్‌లోనూ వార్తల్లో నిలిచారు. రాజేందర్ తాను పాక్‌లో మైనార్టీల సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్ గుల్బర్గ్‌లోని ఫైసలాబాద్ పోలీస్‌శాఖలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా రాజేందర్ నియమితులయ్యారు. సింధ్ ప్రావిన్స్ పరిధిలోని బాడిన్కు చెందిన రాజేందర్ మేఘ్వార్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే తన చిరకాల కల నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. పోలీస్ శాఖలో పనిచేస్తేనే సమాజంలో అట్టడుగు స్థాయి ప్రజల సమస్యలు సులభంగా తెలుస్తాయని, అప్పుడే వాటిని పరిష్కరించగలనని రాజేందర్ మేఘ్వార్ తెలిపారు.ఒక పోలీసు అధికారిగా తన పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు మైనారిటీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాజేందర్ పేర్కొన్నారు. రాజేందర్ మేఘ్వార్ రాకతో పాక్‌లోని మరికొందరు హిందూ యువకులు కూడా పోలీస్ సర్వీసుల్లో చేరే అవకాశం ఉంటుందని పలువురు అంటున్నారు. కాగా రాజేందర్ మేఘ్వార్‌తోపాటు మైనారిటీ వర్గానికి చెందిన రూపమతి అనే మహిళ కూడా సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. రహీమ్ యార్ ఖాన్‌కు చెందిన ఆమె తాను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో చేరనున్నానని పేర్కొన్నారు. తాను పాకిస్తాన్ సాధిస్తున్న అభివృద్ధిని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: India-Syria Ties: అసద్ పతనంతో భారత్-సిరియా దోస్తీ ఏంకానుంది? -
భారత్‌తో కుస్తీ.. పాక్‌తో దోస్తీ.. మారిన బంగ్లాదేశ్ వైఖరి?
న్యూఢిల్లీ: ఒకప్పుడు భారత్‌తో మంచి మిత్రత్వం కలిగిన బంగ్లాదేశ్ ఇప్పుడు భారత్‌కు బద్ధ శత్రువుగా మారడమే కాకుండా పాకిస్తాన్‌తో సాన్నిహిత్యాన్ని పెంచుకుంటోంది. నాడు హిందువులపై ఆదరణచూపిన బంగ్లాదేశ్ ఇప్పుడు హిందువులను, ముఖ్యంగా భారతీయులను ద్వేషించడం మొదలుపెట్టింది.మహ్మద్ యూనస్ అధికారాన్ని చేపట్టాక..బంగ్లాదేశ్‌లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ అధికారాన్ని చేపట్టినప్పటి నుండి ఆ దేశం ఛాందసవాద మార్గంలో ప్రయాణిస్తోంది. అక్కడి ముస్లింలు ఇప్పుడు భారతీయులతో స్నేహ భావాన్ని మరిచిపోయారు. హిందువులపై నిరంతరం దాడులకు పాల్పడుతున్నారు. హిందూ దేవాలయాలను కూల్చివేస్తున్నారు. విగ్రహాలను తగులబెడుతున్నారు. ఇంతేకాదు హిందువులను నరికివేస్తామంటూ కూడా బెదిరిస్తున్నారు.హిందువులకు బెదిరింపులుబంగ్లాదేశ్లో ఇస్కాన్ ఆలయాన్ని, భక్తులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. హిందువులను బహిరంగంగా బెదిరిస్తున్నారు. ఇస్కాన్‌ను లక్ష్యంగా చేసుకున్న ఒక ఛాందసవాదికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతను ఇస్కాన్‌పై నిషేధం విధించాలని ఆ వీడియోలో బహిరంగంగా డిమాండ్ చేశాడు. ప్రభుత్వం అలా చేయని పక్షంలో హింసాత్మక దాడులకు దిగుతామని బెదించాడు. ఈ వీడియోను షేర్ చేసిన ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ రాధారమణ్ దాస్ మాట్లాడుతూ ఈ ప్రసంగం ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదని, బంగ్లాదేశ్ అంతటా ఈ తరహా విద్వేషాలే చెలరేగుతున్నాయన్నారు. ఇలాంటివారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఢాకా వీధుల్లో ప్రదర్శనబంగ్లాదేశ్లోని ముస్లింలు తాజాగా ఢాకా వీధుల్లో భారత్‌కు వ్యతిరేకంగా భారీ ప్రదర్శన నిర్వహించారు. పోలీసుల రక్షణలో ఆందోళనకారులు భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాడికల్ ఇస్లామిక్ సంస్థలకు చెందిన మిలిటెంట్లు ఐఎస్ఐఎస్ జెండాలను ప్రదర్శించారు. అక్కడి భారత పౌరులను చంపేస్తామంటూ నినదించారు. ఈ నేపధ్యంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య బీటింగ్ రిట్రీట్ను నిలిపివేశారు.పరాకాష్టకు మత అసహనంబంగ్లాదేశ్లోని ఛాందసవాదులు ఇస్కాన్ దేవాలయాలను ఒకదాని తర్వాత ఒకటిగా కూల్చివేసి, విగ్రహాలను దహనం చేస్తున్నారు. తాజాగా ఢాకాలోని ఇస్కాన్ సెంటర్‌కు దుండగులు నిప్పు పెట్టారు. ఈ మత అసహన ఘటనలు అంతర్జాతీయ స్థాయిలో బంగ్లాదేశ్ ప్రతిష్టను ప్రభావితం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా శుక్రవారం భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ డిసెంబరు 9న ఢాకాలో పర్యటిస్తారని తెలిపారు.పాక్‌కు చేరువవుతున్న బంగ్లాదేశ్ ఒకవైపు భారత్- బంగ్లాదేశ్ మధ్య పరస్పరం సంబంధాలు క్షీణిస్తున్న తరుణంలో మహ్మద్ యూనస్ ప్రభుత్వం పాకిస్తాన్‌కు దగ్గరవుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా పాకిస్తాన్- బంగ్లాదేశ్‌లు ఇరు దేశాల పౌరులకు వీసా నిబంధనలలో వివిధ సడలింపులను ఇచ్చాయి. అలాగే బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా, కరాచీ నుండి ఒక కార్గో షిప్ గత నెలలో బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ నౌకాశ్రయానికి చేరుకుంది. ఇరు దేశాల మధ్య తొలిసారిగా సముద్ర రవాణా సంబంధాల ఏర్పడ్దాయి. వచ్చే ఏడాది నుంచి ఇస్లామాబాద్- ఢాకా మధ్య ఎయిర్ కనెక్టివిటీ కూడా ప్రారంభమవుతుందని బంగ్లాదేశ్‌లోని పాకిస్తాన్ హైకమిషనర్ సయ్యద్ అహ్మద్ మరూఫ్ సమయ్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.క్షీణించిన భారత్- బంగ్లా సంబంధాలుషేక్ హసీనాను అధికారం నుండి తొలగించి, మొహమ్మద్ యూనస్ అధికారం చేపట్టిన తర్వాత, బంగ్లాదేశ్‌లోని హిందువులతో సహా ఇతర మైనారిటీల భద్రతపై భారత్ పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు భారత్ ఆందోళనలను బంగ్లాదేశ్ తోసిపుచ్చింది. భారత్ తన అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని బంగ్లాదేశ్ ఆరోపిస్తోంది. భారతదేశంతో బంగ్లాదేశ్‌కు సాంస్కృతిక సంబంధాలు కూడా ఉన్నాయి. బంగ్లాదేశ్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి వచ్చి చదువుకుంటుంటారు. గత 15 ఏళ్లుగా బంగ్లాదేశ్ ప్రజలు భారతదేశానికి వచ్చేందుకు సులభంగా వీసా పొందేవారు. అయితే గత ఆగస్టు నుండి బంగ్లాదేశ్‌లో వీసా విషయంలో నిబంధనలు పెరిగాయి.ఇది కూడా చదవండి: రానున్నది తాతల కాలం.. 2050 నాటికి వృద్ధ జనాభా మూడింతలు