Sri Venkateswara University
-
ఘనంగా శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం
-
నేడు శ్రీవెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం 7వ స్నాతకోత్సవం
-
117 బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ
సాక్షి, అమరావతి: శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీతో పాటు వర్సిటీ పరిధిలోని కళాశాలల్లో బోధన విభాగంలో ఖాళీగా ఉన్న 117 బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. సుమారు 8 ఏళ్ల తర్వాత ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు కేటాయించిన ఈ పోస్టుల భర్తీకి ఇటీవలే యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 47 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 70 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులున్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి వెటర్నరీ సైన్స్‌లో 40, ఫిషరీస్ సైన్స్‌లో 4, డెయిరీ సైన్స్‌లో 2, వ్యవసాయ విభాగంలో ఒక పోస్టు ఉన్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి వెటర్నరీ సైన్స్‌లో 64, ఫిషరీస్ సైన్స్‌లో 4, డెయిరీ సైన్స్‌లో 2 పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 22వ తేదీ సాయంత్రం 4.30 గంటలలోగా ది రిజిస్ట్రార్, శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, డాక్టర్ వైఎస్సార్ భవన్, తిరుపతి–517502 చిరునామాకు దరఖాస్తులు పంపాలని యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ వి.పద్మనాభరెడ్డి చెప్పారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎస్వివియూ.ఈడీయూ.ఇన్‌లో చూడాలని ఆయన సూచించారు. -
ఎస్వీయూలో విషాదం..
సాక్షి, తిరుపతి: నగరంలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ (ఎస్వీయూ)లో విషాదం చోటుచేసుకుంది. ఎస్సీయూలో చదువుతున్న విద్యార్థి ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. డైరీ కాలేజీకి చెందిన హాస్టల్ విష్ణువర్ధన్ అనే విద్యార్థి ఉరేసుకొని ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. విష్ణువర్ధన్ బలవన్మరణానికి పాల్పడటంతో తోటి విద్యార్థుల్లో విసాదం నెలకొంది. -
ఎందుకంత ప్రేమ!
ఆ ఐదేళ్లు ఆయన ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగింది. ఔట్సోర్సింగ్ పేరుతో రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు, విద్యా సంస్థల్లో ఉద్యోగుల వేతనాల్లో కోతపెట్టారు. చంద్రబాబునాయుడు బంధువునంటూ అధికారులు, కాంట్రాక్టు ఉద్యోగులను వేధింపులకు గురిచేశారనేఆరోపణలు వెల్లువెత్తినా గత ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రస్తుతం కాంట్రాక్టు గడువు ముగిసినా ఎస్వీయూ అధికారులు ఆయన ఔట్సోర్సింగ్ ఏజెన్సీని కొనసాగిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. సాక్షి, చిత్తూరు: శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీలో 2016లో ఔట్సోర్సింగ్ సేవలు ప్రారంభమయ్యాయి. మొదట సెక్యూరిటీ సిబ్బందితో ఈ సేవలను అప్పటి వీసీ దామోదరం ప్రారంభించారు. 65 మంది సెక్యూరిటీ సిబ్బందిని నియమించారు. అనంతరం ఇంజినీరింగ్, శానిటేషన్ విభాగాలకు ఈ సేవలు విస్తరించాయి. ప్రస్తుతం సెక్యూరిటీ విభాగంలో 25 మంది, శానిటేషన్‌లో 69 మంది, ఇతర శాఖల్లో ఐదుగురు పనిచేస్తున్నారు. వీరంతా మాజీ సీఎం చంద్రబాబునాయుడుకు సమీప బంధువైన భాస్కర్‌నాయుడుకు చెందిన పద్మావతి హాస్పిటాలటీ అండ్ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ సరీ్వసు పేరిట ఎస్వీయూలో పనిచేస్తున్నారు. వీరికి చెల్లించాల్సిన వేతనాల్లో ఒక్కో ఉద్యోగి నుంచి రూ.3వేల నుంచి రూ.4వేలు నొక్కేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఎస్వీ యూలో ఔట్ సోర్సింగ్ సేవలు అందిస్తున్న పద్మావతి హాస్పిటాలిటీ సంస్థకు ఇచ్చిన అను మతి ఈ ఏడాది జూన్ 30వ తేదీతో ముగిసింది. అయితే ఎస్వీయూ అధికారులు కొందరు అనధికారికంగా ఆ ఏజెన్సీకే అనుమతి ఇచ్చి కొనసాగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. రూ.13, 600 చెల్లించాల్సిన సెక్యూరిటీ సిబ్బందికి రూ.9 వేలు చెల్లిస్తున్నట్లు తెలిసింది. స్వీపర్లకు నెలకు రూ.9వేలు చెల్లించాల్సి ఉంటే రూ.7వేలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నట్లు బాధితులు బోరుమంటున్నారు. ఐదుగురు ఆఫీ సు సిబ్బందికి రూ.12,600 వేతనం ఇవ్వాల్సి ఉండగా రూ.9,600 చెల్లిస్తున్నారు. ఇంకా వెట ర్నరీ వర్సిటీలో 100 మంది ఔట్సోర్సింగ్ కింద పనిచేస్తుంటే వారి వేతనంలోనూ కోత విధిస్తు న్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరోపణలున్నా.. మాజీ సీఎం చంద్రబాబు బంధువునని చెప్పుకుంటూ భాస్కర్‌నాయుడు ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ప్రారంభించి ఉద్యోగులకు సరిగా వేతనాలు చెల్లించడం లేదని, పీఎఫ్, ఈఎస్ఐ చెల్లింపులు లేవని అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్వీయూనుంచి అధిక మొత్తంలో నిధులు పొంది, ఉద్యోగులకు అరకొర ఇస్తున్నారన్న విమర్శలున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ఎన్నికల ముందు నిర్వహించిన బహిరంగ సభల్లో భాస్కర్‌నాయుడు దోపిడీపై ధ్వజమెత్తిన సందర్భాలున్నాయి. అటువంటి ఔట్సోర్సింగ్ ఏజెన్సీ కాంట్రాక్టు గడువు ముగిసినా ఎస్వీయూ అధికారులు ఎందుకు కొనసాగిస్తున్నారని ఉద్యోగులు ప్రశి్నస్తున్నారు. వారం లోపు పూర్తి ఎస్వీయూలో నూతన ఔట్ సోర్సింగ్ ఏజెన్సీని వారం లోపు పూర్తి చేస్తాం. ఇన్చార్జ్ వీసీ ఆదేశాల మేరకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే నూతన ఏజెన్సీ సేవలు అందుబాటులోకి తెస్తాం. అప్పటివరకు ప్రసుత్తం ఔట్ సోర్సింగ్ విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా తాతాలి్కక ఏర్పాట్లు చేశాం. – ప్రొఫెసర్ పీ. శ్రీధర్‌రెడ్డి, ఎస్వీయూ రిజిస్ట్రార్ -
మహిళా వర్సిటీలో తెల్ల ఏనుగులు
సాక్షి, తిరుపతి : పారదర్శక పాలన, జవాబుదారీతనం, నిజాయితీతో ప్రజలకు పాలన అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ శాఖల్లో పనిచేసే రిటైర్డ్ ఉద్యోగులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 18వ తేదీన 2323 జీవోను విడుదల చేసింది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే రిటైర్డ్ ఉద్యోగులను తొలగించాలని, వారి స్థానంలో యువతకు అవకాశాలు కల్పించాలని జీవోలో పేర్కొంది. టీటీడీ విద్యా సంస్థలు, ఎస్వీయూ ఈ జీవోను వెంటనే అమలు చేశాయి. మహిళా వర్సిటీలో మాత్రం ఇంతవరకు అమలుకు నోచుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ శాఖల్లో వివిధ ప్రాతిపదికన పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులను తొలగించాలన్న ప్రభుత్వ జీఓ మేరకు టీటీడీ 194 మంది రిటైర్డ్ ఉద్యోగులను వెంటనే తొలగించింది. టీటీడీ విద్యా సంస్థల్లో పనిచేసి, ఉద్యోగ విరమణ తర్వాత మళ్లీ కొనసాగుతున్న రిటైర్డ్ ఉద్యోగులను తొలగించారు. టీటీడీ జూనియర్ కళాశాలల్లో అతిథి అధ్యాపకులుగా పనిచేస్తున్న రిటైర్డ్ అధ్యాపకులను తప్పించారు. డిగ్రీ కళాశాలల్లో పనిచేసే 56 మందిని ఇంటికి పంపారు. ఎస్వీ యూనివర్సిటీలో ఉద్యోగ విరమణ అనంతరం వివిధ పేర్లతో చేరి పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులను తాజా జీఓ ప్రకారం తొలగించారు. ఐదుగురు ఉద్యోగులను తొలగిస్తూ ఈ నెల 5న ఎస్వీయూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని యూనివర్సిటీలు, ఇతర సంస్థలు జీఓను పక్కాగా అమలు చేశాయి. పట్టించుకోని మహిళా వర్సిటీ ప్రభుత్వం తాజాగా ఇచ్చిన జీఓ 2323ను శ్రీపద్మావతి మహిళా వర్సిటీ ఏమాత్రమూ పట్టించుకోలేదు. వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో నలుగురు అధ్యాపకులు, ఇతర విభాగాల్లో మరో ఇద్దరు, టెక్నికల్ విభాగం, ఇతర శాఖలలోకలిపి 15 మంది నిబంధలకు విరుద్ధంగా పనిచేస్తున్నారు. వీరికి నెలకు రూ.45 వేల నుంచి రూ.75 వేల వరకు వేతనాలు చెల్లిస్తున్నారు. ఈ ఉద్యోగుల వల్ల వర్సిటీపై నెలకు రూ.10 లక్షల వరకు, ఏడాదికి కోటి రూపాయలకు పైగా భారం పడుతోంది. అంతేకాకుండా యువతకు అవకాశాలు రాకుండా రిటైర్డ్ అ«ధ్యాపకుల వల్ల నష్టం కలుగుతోంది. ప్రభుత్వ జీఓను అమలు చేయకపోగా రిటైర్డ్ ఉద్యోగులను తొలగించాల్సిన అవసరం లేదని మొండిగా వ్యవహరిస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగులను తొలగించాలని వైఎస్సార్ విద్యార్థి విభాగం ఈ నెల 6న వినతిపత్రం సమరి్పంచింది. అయినప్పటికీ వర్సిటీ అధికారులు స్పందించలేదు. తెల్ల ఏనుగుల్లా.. మహిళా వర్సిటీలో రిటైర్డ్ అధ్యాపకులు తెల్ల ఏనుగుల్లా మారారు. వారి స్థానంలో యువతకు రెట్టింపు స్థానంలో అవకాశాలు ఇవ్వవచ్చు. అయినప్పటికీ రిటైర్డ్ ఉద్యోగులను కొనసాగిస్తుండటం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు స్పందించి జీఓ 2323ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. నిబంధనలకు విరుద్ధంగా.. శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్‌గా రిటైర్డ్ ప్రొఫెసర్‌ను నియమించుకున్నారు. నిబంధనల మేరకు 65 దాటిన అధ్యాపకులకు నిర్ణయాలు తీసుకునే పదవులు ఇవ్వరాదు. ఇక్కడ డైరెక్టర్‌గా పనిచేసే ప్రొఫెసర్‌కు 65 సంవత్సరాలు దాటినా కొనసాగిస్తున్నారు. నిత్యం అధికారుల కార్యాలయాల చుట్టూ తిరుగుతూ వారిని పొగడడమే ఆయన పనిగా పెట్టుకున్నారని గుసగుసలున్నాయి. తమకు అన్ని విధాలా అనుకూలంగా ఉండడంతో ఆయనను నిబంధనలకు విరుద్ధంగా పదవిలో కొనసాగిస్తున్నట్లు విమర్శలున్నాయి. -
నేనే రాణి–నేనే మంత్రి
సాక్షి టాస్క్‌ఫోర్స్: ఆరు దశాబ్దాల చరిత్ర ఉన్న తిరుపతిలోని ఎస్వీయూలో ఒక మహిళకు ఉన్నత పదవి దక్కింది. అయితే ఆ అరుదైన అవకాశం పొందిన ఆ అధికారి అనతి కాలంలోనే తన ప్రవర్తన, అహంకారం, అధికార దర్పంతో వర్శిటీ ప్రతిష్ట మసకబారేలా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె అధికార పార్టీ మాజీ ఎమ్మెల్యే కోడలు కావడం, ఆర్థిక, సామాజిక, రాజకీయ బలం తోడు కావడంతో ఎస్వీయూలో ఆమెకు ఎదురులేకుండా పోయింది. అనేక ఆరోపణల నడుమ మాజీ రిజిస్ట్రార్ దేవరాజులు పదవి కోల్పోవడంతో 2017లో అప్పటి వీసీ దామోదరం హోంసైన్స్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆర్కే అనురాధకు రిజిస్ట్రార్ పదవిని కట్టబెట్టారు. ఆమె రిజిస్ట్రార్ అయిన తొలిరోజుల్లో బాగా పని చేసినా అనంతరం పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దొడ్డిదారిన అందలం... శ్రీ వెంకటేశ్వరా యూనివర్శిటీ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్ ఆర్కే అనురాధ 2007లో హోంసైన్స్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. 2006లో ఎస్వీయూలో విడుదలైన అధ్యాపక పోస్టుల భర్తీకి ఆమె అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు. వాస్తవంగా ఈ పోస్టుకు దరఖాస్తు చేయాలంటే సంబంధిత సబ్జెక్ట్‌లో ఎంఎస్సీ, పీహెచ్‌డీతో పాటు 5 సంవత్సరాల బోధన అనుభవం ఉండాలి. ఈ సర్వీసు రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసి ఉంటేనే చెల్లుబాటు అవుతుంది. అయితే ఆమె ఎస్వీయూ, మహిళా వర్శిటీలో తాత్కాలికంగా పనిచేసిన బోధన అనుభవానికి సంబంధించి నకిలీ సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకున్నారని, ఈ నియామకాలకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన (స్క్రూటినీ)లో ఆమె దరఖాస్తును తిరస్కరిస్తున్నట్లు రాశారు. అయితే ఆమె చేసిన ఫైరవీలు ఫలించడంతో అదే దరఖాస్తుపై ఎలిజిబుల్ అని రాశారని అంతే కాకుండా దీనికి జతపరచిన బోధన అనుభవం సర్టిఫికెట్లో తేదీ లేకుండా జారీ చేశారు. ఈ ధృవ పత్రాలతో నేరుగా అసోసియేట్ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. 2013లో ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందటంతో పాటు 2017 నవంబర్ 30న ఎస్వీయూ రిజిస్ట్రార్‌గా నియమితులయ్యారు. ఆంతా ఆమె ఇష్టమే... ఎస్వీయూ రిజిస్ట్రార్ అనురాధ వీసీలను, వారి ఆదేశాలను పాటించకుండా, వారు ఆమోదించిన ఫైళ్లను పక్కన పెట్టి తన ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఆమె రిజిస్ట్రార్ అయ్యాక ఇద్దరు వీసీలు మారారు. ప్రొఫెసర్ దామోదరం వీసీగా ఉన్న సమయంలో ఉద్యోగుల బదిలీల ఫైళ్లను పక్కన పెట్టి అమలు చేయలేదు. ఆయన ఆమోదించిన రసాయన శాస్త్ర విభాగాధిపతి ఫైల్‌ను పెండింగ్‌లో ఉంచి నూతన వీసీ వచ్చాక తన సామాజిక వర్గ ప్రొఫెసర్‌కు ఆ పోస్టు కట్టబెట్టారు. రాజీవ్ గాంధి కాన్పరెన్స్ హాల్ నిర్మాణ టెండర్ల ఫైల్‌ను వీసీ ఓకే చేసినా ఇప్పటికీ అమలుచేయలేదు. అంబేడ్కర్ గ్లోబల్ లా కళాశాలకు శాశ్వత అనుబందానికి సంబంధించిన ఫైల్ వీసీ దామోదరం ఆమోదించినప్పటికీ .. రిజిస్ట్రార్ నేటికీ ఉత్తర్వులు ఇవ్వలేదు. ఇన్చార్జ్ వీసీగా జానకి రామయ్య హయాంలో ఉద్యోగి ఫైల్ ట్యాంపరింగ్ కేసులో ఆయన వేసిన విచారణ కమిటీ ఇచ్చిన ఫైల్‌ను తొక్కిపెట్టారు. సైకాలజీ విభాగాధిపతిగా ప్రొఫెసర్ శ్రీకాంత్ రెడ్డికి ఇవ్వకుండా ఇతరులకు ఇచ్చారు. వివాదాస్పద నిర్ణయాలు... ఎస్వీయూ రిజిస్ట్రార్‌గా తన 18 నెలల పాలనలో పలు వివాదస్పద నిర్ణయాలను తీసుకున్నారు. అకడమిక్ స్టాప్ కళాశాలలో అసోసియేట్‌గా పనిచేస్తున్న కోదండరామిరెడ్డికి ప్రొఫెసర్‌గా పదోన్నతి ఇవ్వలేదు. అదే విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న వెంకటరమణకు మాత్రం పదోన్నతి కల్పించారు. ఏడుగురు టైం స్కేల్ ఉద్యోగులను తొలగిస్తూ గత నెలలో 22న ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఉద్యోగుల ఆందోళనతో వీసీ ఈ ఉత్తర్వులు రద్దు చేశారు. ఆంత్రొపాలజీ విభాగంలో ఒక అధ్యాపకుడికి 13 సంవత్సరాలు, అడల్ట్ ఎడ్యుకేషన్ విభాగంలో మరో అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు 6 సంవత్సరాలు పాత సర్వీసు కలిపారు. ఈ వ్యవహారంలో ఫైల్ ట్యాంపరింగ్ చేసిన ఉద్యోగిపై చర్యలు తీసుకోలేదు. ఎన్ఎంఆర్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఎంటీఎస్ ఇవ్వాలని ప్రభుత్వం జీఓ ఇచ్చినా అమలు చేయలేదు. అంతే కాకుండా వీరిని వచ్చే ఏడాదికి కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఉన్నత విద్యాశాఖ ఇటీవల రిజిస్ట్రార్ల సమావేశంలో ఆదేశించినా అమలు చేయలేదు. తన స్వంత సామాజిక వర్గానికి చెందిన కొందరు అధ్యాపకులకు పెద్ద ఎత్తున మేలు చేశారన్న విమర్శలు ఉన్నాయి. పట్టించుకోని వీసీ ఎస్వీయూ రిజిస్ట్రార్ అనురాధ వ్యవహారంలో అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ ప్రస్తుత వీసీ రాజేంద్రప్రసాద్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంతే కాకుండా ఆమె ఎక్కువ సమయం వీసీ చాంబర్లోనే తిష్ట వేస్తుండటంతో చాలా మంది తమ సమస్యలు చెప్పుకోలేక పోతున్నారు. వీసీని నిర్ణయాలు తీసుకోకుండా పెత్తనం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. సమాచారహక్కు చట్టంతో రహస్యం బట్టబయలు... ఎస్వీయూ రిజిస్ట్రార్ నియామకంపై కొందరు విద్యార్థి నాయకులు సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరడంతో అమె అడ్డదారి నియామకం బయట పడింది. దీనిపై ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థి సంఘ నాయకులు గత నెల 30న అమరావతిలో సీఎంను కలిసి ఫిర్యాదు చేశారు. అంతకు ముందు వారు ఎస్వీయూ వీసీ రాజేంద్రప్రసాద్‌తో పాటు ఉన్నత విద్యామండలిలోని ముఖ్య అధికారులను కలసి ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటి వరకు ఆమెపై చర్యలు తీసుకోలేదు. స్పందించని రిజిస్ట్రార్ ఎస్వీయూలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై రిజిస్ట్రార్ అనురాధను వివరణ కోరేందుకు సాక్షి ప్రయత్నించింది. అయితే ఆమె ఫోన్ తీయలేదు. వేరొక నెంబర్ నుంచి ఫోన్ చేసి సాక్షి రిపోర్టర్‌ను మాట్లాడుతున్నాను అని చెబుతుండగానే ఆమె ఫోన్ కట్ చేసేశారు. -
ఎస్వీ యూనివర్సిటీలో చిరుత కలకలం
-
వెటర్నరీలో అక్రమ పదోన్నతులు!
యూనివర్సిటీ క్యాంపస్ : శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో 2012లో చేపట్టిన అధ్యాపక పదోన్నతులు వివాదస్పదంగా మారాయి. తనకు కావాల్సిన వారికి మేలు చేకూర్చేందుకు అప్పటి వీసీ నిబంధనలకు వ్యతిరేకంగా చేసిన పదోన్నతులు ఇపుడు వర్సిటీలోని పలువురి పీఠాలు కదిలించేలా ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఆరేళ్ల తరువాత ఒక ప్రొఫెసర్ ఫిర్యాదు చేయడంతో గవర్నర్ విచారణకు ఆదేశించారు. వర్సిటీ దీనిపై ఒక కమిటీ వేసి విచారణ చేపట్టింది. ఈ అంశాన్ని పాలకమండలిలో చర్చకు పెట్టగా, ఇప్పుడు ఈ పదోన్నతులపై రాద్దాంతరం చేయవద్దని, బోర్డుకు తెలియకుండా ఏమీ చేయవద్దని పాలకమండలి వీసీకి సూచించింది. ఈ వ్యవహారం మొత్తం వర్సిటీలో తీవ్ర వివాదస్పదమవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా.. అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేసే అధ్యాపకుడు కెరీర్ అడ్వాన్స్డ్ స్కీమ్(సీఏఎస్) కింద పదోన్నతి పొందాలంటే 9,000 ఏజీపీతో మూడు సంవత్సరాల బోధన అనుభవం ఉండాలి. 2012 అక్టోబర్‌లో ఉమ్మడి ఏపీగా ఉన్న సమయంలో అప్పటి వీసీ సీఏఎస్ కింద పదోన్నతులు కల్పించారు. నిబంధనల ప్రకారం మూడు సంవత్సరాల సర్వీసు పూర్తయిన వారికి ప్రొఫెసర్‌గా పదోన్నతి కల్పించాలి. అయితే ఈ నిబంధన పాటించలేదు. దీన్ని ప్రశ్నించినవారిని సంతృప్తిపరచడానికి మరో 20 మందికి తగినంత సర్వీసు లేకపోయినా పదోన్నతి ఇచ్చారు. ఇక్కడికి వరకు అంతా బాగానే ఉంది. ఏపీ విడిపోయాక, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కూడా విడిపోయింది. తెలంగాణలో పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. ఆస్తులు, పోస్టులు పంచుకున్నారు. దొడ్డిదారిన పదోన్నతి పొందిన వారిలో 11 మంది తెలంగాణకు, 10 మంది ఏపీకి వచ్చారు. అక్రమ పదోన్నతులపై ఓ ప్రొఫెసర్ రెండు నెలల క్రితం గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లిన ఓ అధ్యాపకుడికి తక్కువ సర్వీసుతో పదోన్నతి కల్పించారని, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో అధ్యాపకుల పదోన్నతులు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయిని అందులో పేర్కొన్నారు. ఆరు సంవత్సరాల తర్వాత ఈ పదోన్నతులపై ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ గవర్నర్ ఈ అంశంపై విచారణకు ఆదేశించారు. గవర్నర్ ఆదేశాల మేరకు వెటర్నరీ వీసీ హరిబాబు రహస్యంగా ఓ కమిటీ వేసి విచారణ జరిపించారు. విచారణ అనంతరం గవర్నర్‌కు వీసీ నివేదిక పంపినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో పలువురు పెద్దలు ఉన్నట్లు తెలిసింది. గత నెలలో 17వ తేదీ నిర్వహించిన పాలకమండలి సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. పాలక మండలి సభ్యులు వీసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకమండలికి తెలియకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. దీంతో ప్రస్తుతానికి ఈ అంశం సద్దుమణిగింది. అయినప్పటికీ భవిష్యత్‌లో ఈ వ్యవహారం ఎంత వరకు వెళుతుందోనని అధ్యాపకులు, అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. మొత్తం మీద ఒక వ్యక్తికి మేలు చేసేందుకు ఓ మాజీ అధికారి చేసిన అక్రమాలు ఆరేళ్ల తర్వాత తెరపైకి వచ్చాయి. వర్సిటీలో అక్రమ పదోన్నతుల వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి. -
నేటి నుంచి సైన్స్ కాంగ్రెస్
► తిరుపతి ఎస్వీయూలో ప్రారంభించనున్న ప్రధాని ►నోబెల్ పురస్కార గ్రహీతలతో భేటీ ► ఐదురోజుల పాటు సదస్సులు ► ఆకట్టుకుంటున్న ‘ప్రైడ్ ఆఫ్ ఇండియా’ తిరుపతి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ప్రతిష్టాత్మక భారతీయ విజ్ఞాన సమ్మేళ నం (సైన్స్ కాంగ్రెస్)కు సర్వం సిద్ధమైంది. మంగళవారం నుంచి శనివారం వరకూ తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాల యం ప్రాంగణంలో జరిగే ఈ 104వ సమ్మేళనాన్ని నేడు ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. తర్వాత నోబెల్ పురస్కార గ్రహీతలతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, గవర్నర్ నరసింహన్, కేంద్ర, రాష్ట్రమంత్రులు హాజరవుతున్నారు. కార్యక్రమం అనంతరం ప్రధాని తిరుమలలో శ్రీవారిని దర్శించుకుంటారు. స్వల్ప విశ్రాంతి తర్వాత తిరుగు ప్రయాణమవుతారు. ప్రధాని రాక సందర్భంగా తిరుమల ఆలయంలో మంగళవారం వీఐపీ దర్శనం రద్దు చేశారు. ప్రధాని కోసం ప్రత్యేకంగా ఉత్తరాది వంటకాలు సిద్ధం చేశారు. ఎస్వీయూలో సైంటిస్ట్‌ల సందడి.. సైన్స్ కాంగ్రెస్ నిర్వహించే శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో ఎటుచూసినా శాస్త్రవేత్తలతో కళకళలాడుతోంది. నోబెల్ పురస్కార గ్రహీతలతో పాటు దేశ విదేశాల నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు, యంగ్ అచీవర్ అవార్డు విజేతలు, ప్రతిభా అవార్డులను గెల్చుకున్న విద్యార్థులు వర్సిటీ ప్రాంగణంలో సందడి చేస్తున్నారు. విద్య, వైద్యం, పారిశ్రామిక, పరిశోధనా రంగాలకు చెందిన వేలాది మంది ప్రముఖులతో ఎస్వీయూ క్యాంపస్ కొత్త రూపును సంతరించుకుంది. ఎస్వీయూ క్యాంపస్‌లో ఫ్రైడ్ ఆఫ్ ఇండియా పేరిట ఏర్పాటు చేసిన మెగా సైన్స్ ఎగ్జిబిషన్ విద్యార్థులు, సందర్శకులను ఆకట్టుకుంటోంది. డీఆర్డీవో, ఐఎస్ఎస్ఆర్, ఇస్రో, షార్లతో పాటు హెచ్ఏఎల్, బీడీఎల్, వంటి భారత ప్రభుత్వ రంగ సంస్థల తయారీ ఎగ్జిబిట్లు తరలి వచ్చాయి. వ్యవసాయ, ఉద్యాన, ఫిషరీస్, డెయిరీ రంగాల్లో సాధించిన పురోగతిని తెలియజేసే టెక్నాలజీని కూడా అందుబాటులో ఉంచారు. ఢిల్లీ నుంచే నిఘా దేశ విదేశీ ప్రముఖులు హాజరవుతున్న విజ్ఞాన సమ్మేళనానికి భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. కేంద్ర ఇంటిలిజెన్ప్ బ్యూరో (ఐబీ) అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తిరుపతి పట్టణాన్ని పరిశీలిస్తోంది. ఇందుకోసం అత్యంత వేగంతో పనిచేసే ఇంటర్నెట్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు ఐబీ సీనియర్ అధికారి ఒకరు సాక్షికి తెలిపారు. ప్రధాన ప్రాంతాల్లో హై ఫ్రీక్వెన్సీ జూమ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని ఢిల్లీలోని ఐబీ కార్యాలయానికి అనుసంధానం చేశామని, ఒక్కో కెమెరా రెండు కిలోమీటర్ల పరిధిని గమనిస్తుందని అధికారులు తెలిపారు. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధుల ఆధార్, ఇతర ఫోటో గుర్తింపు కార్డులను నిఘా విభాగం సాఫ్ట్‌వేర్‌కు లింక్ చేశారు. దాదాపు 6,500 మంది పోలీసులను భద్రత కోసం ఉపయోగిస్తున్నారు. కేంద్ర నిఘా వర్గాల సూచనలను పాటిస్తూ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని రాయలసీమ రేంజ్ ఐజీ శ్రీధర్‌రావు తెలిపారు. డీఐజీ ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో అర్బన్ ఎస్పీ జయలక్ష్మి, ఇద్దరు ఐపీఎస్‌లు, 30 మంది డీఎస్పీలు భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఇక తిరుపతిలోని స్టార్హోటళ్లన్నీసైన్స్ కాంగ్రెస్ ప్రతినిధులు, సందర్శకులతో కిటకిటలా డుతున్నాయి. స్వదేశీ పరిజ్ఞానమే ప్రధానం స్వదేశీ పరిజ్ఞానాన్ని మరింత మెరుగు పర్చుకునే దృఢ సంకల్పంతో భారత్ ముందడుగు వేస్తోంది. దీనికోసం ఇండి యన్ న్స్ కాంగ్రెస్ అసోసియేషన్ కృషిచేస్తోంది. 1914లో కల కత్తా కేంద్రంగా ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ప్రారం భమైంది. ప్రపంచ దేశాల్లోని శాస్త్రవేత్తలందరినీ ఒకే వేదికపై తీసుకొచ్చి పరిశోధనా రంగాల్లో సాధించిన పురోగతిని పరస్ప రం సమీక్షించుకునేలా ఏర్పాట్లు చేసింది. 2013లో శత వసంతాల వేడుకను కోల్ కతాలోనే నిర్వహించారు. గత సమ్మేళ నాన్ని మైసూర్లో నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రత్యేకతలివీ... ♦ ఈసారి సదస్సుకు 12,000 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. ♦ మొత్తం 32 ప్లీనరీలు, సబ్ సెక్షన్స్ ♦ 1,100 మంది వలంటీర్లు సేవలందించేందుకు సిద్ధమయ్యారు. ♦ ఈఏడాది శిశు, మహిళా కాంగ్రెస్ సదస్సులనూ నిర్వహిస్తున్నారు. ♦ ఏడెకరాల్లో భారీ సైన్స్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. ♦ ప్రతినిధులందరికీ టూరిజం శాఖ పర్యాటక ప్రదేశాలను చూపిస్తుంది. ♦ సైన్స్ టెక్నాలజీ రంగాల్లో నిష్ణాతులైన వారిని సత్కరించనున్నారు. హాజరవుతున్న నోబెల్ గ్రహీతలు... 1. ప్రొ.విలియం ఈమోర్నర్(యూఎస్ఏ) 2. ప్రొ.టకాకి కజిత (జపాన్) 3. ప్రొ.సెర్జ్ హరోచి (ఫ్రాన్స్) 4. ప్రొ.జీన్ టిరోలి (ఫ్రాన్స్ ) 5. ప్రొ.అడా ఇ యెనాత్ (ఇజ్రాయెల్) 6. ప్రొ.మహ్మద్ యూనస్ (బంగ్లాదేశ్) -
గుడ్ సైన్స్
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రేపు తిరుపతిలో ప్రారంభం అవుతున్న 104వ ‘ఇండియన్ సైన్స్ కాంగ్రెస్’ లో భాగంగా.. జనవరి 4వ తేదీన మహిళా సైన్స్ కాంగ్రెస్ జరుగుతోంది. సైన్స్‌లో నోబెల్ గ్రహీతలు, సైన్స్ శాస్త్రవేత్తలు, సైన్స్ పరిశోధకులు, సైన్స్ ప్రొఫెసర్లు హాజరవుతున్న ఈ మహిళా కాంగ్రెస్‌లో జాతీయ అభివృద్ధిలో మహిళా సైంటిస్టుల పాత్ర; శాస్త్ర, సాంకేతిక రంగాలలో మహిళలకు గల అవకాశాలు అనే అంశాలపై ప్రసంగాలు ఉంటాయి. ఈ సందర్భంగా సాక్షి ‘ఫ్యామిలీ’... ముగ్గురు ఇస్రో మహిళా శాస్త్రవేత్తల ఉద్యోగ జీవితంలోని స్ఫూర్తిదాయకమైన సందర్భాలను మీకు అందిస్తోంది. థ్రిల్స్ : నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అనూరాధ ఇస్రోలో సీనియర్ మోస్ట్ ఆఫీసర్. భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తున అంతరిక్షంలోకి సమాచార ఉపగ్రహాలను పంపించడంలో ఎక్స్పర్ట్. 34 ఏళ్లుగా ఇస్రోలో ఉన్నారు. తొమ్మిదేళ్ల వయసులో తొలిసారి స్పేస్ గురించి ఈ అమ్మాయికి సందేహాలు తలెత్తాయి. ‘అపోలో’ లాంచ్ అవుతున్న సమయం అది. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడి మీదకు దిగేశాడని భూమ్మీదకు వార్త వచ్చేసింది! అప్పట్లో టీవీ లేదు. పేరెంట్స్, టీచర్స్ చెప్పుకుంటుంటే వినింది అనూరాధ. ఒక్కసారిగా ఎగై్జట్ అయింది. మనిషేంటీ? చంద్రుడి పైకి వెళ్లడం ఏంటి?! గుండెలోంచి ఏదో ఫీలింగ్ తన్నుకొచ్చింది. మనిషి చంద్రుడిపై అడుగుపెట్టిన ఆ దృశ్యాన్ని ఊహించుకుంటూ కన్నడంలో చిన్న కవిత రాసింది. ఇప్పుడు ఆమె ఇస్రో లోని మహిళా సైంటిస్టులకు ఓ రోల్ మోడల్. ‘ఆడవాళ్లకు, సైన్స్కూ సెట్ కాదు’ అనే మాట వినిపిస్తే అనూరాధ అపరకాళి అయిపోతారు! జ్ఞాపకం ఉంచుకోవలసినదేదీ అనూరాధకు ఇష్టమైన సబ్జెక్టు కాదు. లాజిక్ ఉంటే ఇష్టపడతారు. లాజిక్ ఉన్నప్పుడే మర్చిపోవడం, జ్ఞాపకం పెట్టుకోవడం ఉండదు కదా. అందుకే ఆమెకు లాజిక్ చుట్టూ అల్లుకుని ఉండే సైన్స్ మీద అంత ప్రేమ. అనూరాధ ఒక మాట అంటారు.. ‘‘భారతదేశంలోని ఏ అమ్మాయినైనా అడిగి చూడండి, మేథ్స్ తన ఫేవరేట్ సబ్జెక్ట్ అని చెబుతుంది’’ అని. ఆమె అలా అనడం ఎంతో ఇన్స్పైరింగ్గా ఉంటుంది. 1982లో అనూరాధ ఇస్రోలో చేరారు. అప్పుడు కొద్ది మంది మహిళలు మాత్రమే ఉండేవారు. ఇంజినీరింగ్ విభాగంలోనైతే మరీ తక్కువ. ఆమె బ్యాచ్‌లో ఐదుగురు మహిళా ఇంజినీర్లు ఉండేవారు. ప్రస్తుతం ఇస్రోలోని 16 వేల మంది ఉద్యోగులలో 20 నుంచి 25 శాతం మందికి పైగా మహిళలే. ‘‘అందుకే మహిళగా మేము ప్రత్యేక గుర్తింపును కోల్పోయాం’’ అని నవ్వుతారు అనూరాధ. కొన్నిసార్లయితే తను మహిళనన్న విషయమే మర్చిపోతారట అనూరాధ. ఇస్రోలో నియామకాలు, పదోన్నతుల విధానాలు అన్నీ ‘మనకెంత వచ్చు, మనమేం చెయ్యగలం’ అనే రెండు ప్రధాన అంశాలను బట్టే ఉంటాయి తప్ప, జెండర్‌ని బట్టి కాదు అని చెబుతున్నప్పుడు ఆమె సగర్వమైన ఎక్స్ప్రెషన్ ఇస్తారు. సైన్స్‌లో కానీ, ఇంకెక్కడైనా కానీ ఎంత ఎక్కువమంది ఉద్యోగినులు ఉంటే అంత ఎక్కువగా మన అమ్మాయిలు స్ఫూర్తి పొందుతారని అనూరాధ బలంగా విశ్వసిస్తున్నారు. అనూరాధ టి.కె. జియోశాట్ ప్రోగ్రామ్ డైరెక్టర్, ఇస్రో శాటిలైట్ సెంటర్ స్క్రీన్ ప్లే : చందమామ రీతూకి నచ్చిన నగరం.. గగనం! పాలపుంతల్లోంచి వచ్చిన పిల్లలా ఎప్పుడూ నింగిలోకే చూస్తుండేది. పుట్టింది లక్నో. ఆమె ఊహలు పుట్టి పెరిగింది ఆకాశంలో. పగలంతా చుక్కలు ఏం చేస్తుంటాయి? చంద్రుడలా ఎందుకు చిక్కిపోతాడు? మళ్లీ ఎందుకలా బొద్దుగా జాబిల్లిలా మారిపోతాడు? ఆకాశంలో ఏముంది? ఆ వెనుక ఇంకా ఏముందీ? ఇవీ.. ఐదూ పదేళ్ల రీతూ ఆలోచనలు. సమాధానాల కోసం సైన్స్ స్టూడెంట్ అయింది. ఫిజిక్స్, మేథ్స్, కెమిస్ట్రీ. అయితే రీతూ డౌట్స్ తీర్చడానికి వాటి శక్తి సరిపోలేదు. న్యూస్ పేపర్లను ముందేసుకునేది! ‘నాసా’ వార్త కనిపిస్తే కట్ చేసి పెట్టుకునేది. రేడియోలో ‘ఇస్రో’ మాటొస్తే చేస్తున్న పని వదిలేసి, రెండు చెవులూ ట్యూన్ చేసుకునేది. స్పేస్ ఆమె శ్వాస. స్పేస్ సైన్స్ ఆమె చూపు! పోస్ట్‌గ్రాడ్యుయేషన్ అయింది. చుట్టూ ఉన్న ఉద్యోగాలను వదిలేసి, ఎక్కడో దూరంగా క్రిస్మస్ చెట్టుకున్న నక్షత్రం లాంటి ఇస్రోలో జాబ్‌కు అప్లై చేసింది. ఇంటర్వూ్య బోర్డులో ఆమె కనబరిచిన విజ్ఞానం, ఆమెలో కనిపించిన జిజ్ఞాస బోర్డు సభ్యుల్ని ఇంప్రెస్ చేశాయి. ‘కంగ్రాచ్యులేషన్స్ మిస్ రీటా. యూ ఆర్ సెలక్టెడ్’! ఎక్కడో విశ్వాంతరాళం నుంచి విన్నట్టున్న అభినందన. ఆ క్షణం నుంచి తనో స్పేస్ సైంటిస్ట్! టార్గెట్‌ను విజయవంతంగా పూర్తి చేసుకొచ్చిన అంతరిక్ష నౌకలా ఇంట్లో ల్యాండ్ అయింది రీతూ. రీతూ పుట్టింది ఎప్పుడైనా కావచ్చు. ఇస్రోలో పుట్టి ఇప్పటికి 18 ఏళ్లు. అదే ఆమెకు లెక్క. మార్స్ మిషన్ సహా, ప్రతి ప్రాజెక్టులోనూ ఆమె వంతు ఉంది. టీమ్ వర్క్ భాగస్వామిగా ఆమె సంతకం ఉంది. 2012లో మార్స్ మిషన్ మొదలైంది. 18 నెలల్లో మార్స్‌ని అంగారక గ్రహం మీదకి పంపాలి. చాలా తక్కువ టైమ్. అప్పటికింకా గ్రహాంతర బృహత్కార్యాలను చేపట్టిన అనుభవం ఇస్రోకి లేదు. మార్స్ మిషనే మొదటిది. పేరైతే ఫిక్స్ అయింది.. ‘మంగళ్యాన్’. అది సక్సెస్ అయితేనే పేరు! ఛాలెంజ్ ఉన్నప్పుడు టెన్షన్ ఉంటుంది. రీతూలోనూ టెన్షన్ మొదలైంది. రీతూ, మిగతా సైంటిస్టులు రోజంతా ఇంజినీర్లతో కలిసి కూర్చోవాలి. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలీదు. శని, ఆదివారాలు కూడా తాత్కాలికంగా రద్దయిపోయాయి. నో.. ఫ్యామిలీ. ఓన్లీ ఇస్రో ఈజ్ ద ఫ్యామిలీ. రీతూకి ఇద్దరు చిన్నపిల్లలు. వాళ్లను చూసుకునేదెవరు? మొదట్లో సతమతమైంది. తర్వాత సర్దుకుంది. ‘నేనున్నాను’ అన్నాడు భర్త. ‘మేం లేమా?’ అన్నారు అక్కాచెల్లెళ్లు. అలా పద్దెనిమిది నెలల పాటు భవబంధాలను తెంపేసుకున్నారు రీతూ! భూమ్మీద పనిచేస్తున్నట్లు లేదు ఆమెకు. ఆకాశంలోకి వెళ్లిపోయి, అక్కడేదో దేవుడు అప్పగించిన పనిని చేస్తున్నట్లుగా ఉంది. పనే దైవం అయినప్పుడు, శాస్త్రవేత్తలకు కూడా దేవుడుంటాడా అనే ప్రశ్నే రాదు. రీతూ కొడుక్కి 11 ఏళ్లు. కూతురుకి 5 ఏళ్లు. ఎంత నాన్న చేసినా, ఎంత చిన్నమ్మలు చేసినా అమ్మ ఉండాల్సిందే. రీతూ డ్యూటీ నుంచి రాగానే పిల్లలు మీద పడిపోయేవారు. కదలనిచ్చేవారు కాదు. స్కూల్లో ఏం జరిగిందో అప్పటికప్పుడు ఆ తల్లి వినవలసిందే. అన్నీ అమ్మతో చెప్పుకుంటే వాళ్లకెంత సంతోషంగా ఉండేదో, రీతూకీ అంత రిలీఫ్‌గా ఉండేది. అలా చూస్తే మార్స్ మిషన్ సక్సెస్‌లో రీతూ పిల్లల పార్ట్ కూడా ఉందనుకోవాలి! తల్లికి ముద్దు ముద్దు మాటలతో రిలీఫ్‌ని ఇచ్చి, ఆమెను తిరిగి ఉత్సాహంగా పనికి పంపింది వాళ్లే కాబట్టి. ‘‘మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అంటారు కదా! మార్స్ సక్సెస్ అయింది కాబట్టి ఇక మీదట ఉమెన్ ఫ్రమ్ మార్స్ అనొచ్చా’’ అని ఇటీవల బి.బి.సి. జర్నలిస్టు గీతా పాండే రీతూను అడిగారు. అప్పుడు రీతూ ఏం చెప్పారో తెలుసా? ‘‘ఐ యామ్ ఎ ఉమన్ ఫ్రమ్ ఎర్త్’’ అన్నారు! ‘‘ఒక అద్భుతమైన అవకాశాన్ని పొందిన మహిళను’’ అని చెప్పారు! రీతూ కరిధాల్ డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్, మార్స్ ఆర్బిటర్ మిషన్ ఫిక్షన్ : స్టార్ టెక్ రీతూ.. రాత్రిపూట ఆకాశాన్ని చూసి ఇన్స్పైర్ అయితే, నందిని.. టీవీలో ‘స్టార్ టెక్’ ప్రోగ్రామ్ చూసి సైన్స్ మీద ఇష్టం పెంచుకున్నారు. నందినీ వాళ్లమ్మ మేథ్స్ టీచర్. నాన్న ఇంజినీర్. ఆయనకు ఫిజిక్స్ అంటే ప్రాణం. కుటుంబ సభ్యులంతా కూర్చొని సైన్స్ ఫిక్షన్ ప్రోగ్రామ్ స్టార్ టెక్‌ను చూస్తుండేవారు... కలిసి నక్షత్రాలను చూస్తున్నట్లు! అప్పుడైతే నందిని ఏం అనుకోలేదు. సైంటిస్ట్ అయిపోవాలని. పెద్దయ్యాక అనుకోకుండా ‘ఇస్రో’లో చేరిపోయారు! ‘హౌ లక్కీ కదా’ అనుకుంటారట ఇప్పుడు. ఇరవై ఏళ్ల క్రితం నందిని.. చెయ్యడమే ఇస్రోకి అప్లై చేశారు. ఫస్ట్ అప్లికేషన్. అదే ఇప్పటి వరకు ఫస్ట్ ఉద్యోగం. ఇన్నేళ్ల ఆమె కెరియర్లోని అద్భుతం.. మార్స్ మిషన్కి పనిచేయడం. నందిని దృష్టిలో మార్స్ మిషన్ ఇస్రో కోసం మాత్రమే కాదు. ఇండియా కోసం, ప్రపంచం కోసం కూడా. మాక్కూడా కొంత ‘స్పేస్’ ఇవ్వండి అని విదేశాలు సైతం ఇండియా వైపు చూసేలా చేసిన మార్స్ మిషన్‌లో తన వంతు కృషి కూడా ఉంది కదా అని ఆలోచిస్తే నందినికి అంతరిక్ష విహారం చేసినట్లుగా ఉంటుందట! చిన్నప్పుడు పిల్లలందరం ఆకాశం గురించి మాట్లాడుకుంటాం కదా. అలా ప్రపంచ దేశాలన్నీ ఇస్రో గురించి గొప్పగా చెప్పుకోవాలని, ఇస్రోలో ఏం జరుగుతోందో తెలుసుకోడానికి ఉవ్విళ్లూరుతూ ఉండాలని నందిని ఆశ. మార్స్ మిషన్ సక్సెస్‌ని ఇస్రో సైంటిస్టుగా బాగా ఎంజాయ్ చేస్తున్నారు నందిని. ‘బెంగళూరులో మా ఆఫీస్‌కి వచ్చిపోతున్నప్పుడు చూడాలి మమ్మల్ని. ఎంత రికగ్నిషనో చెప్పలేను’ అని నవ్వేస్తారు నందిని. థ్రిల్లింగ్ ఉంటుందట.. అందరూ తమను అలా అభినందనగా చూడ్డం. ఇప్పుడు మోదీజీ ఆమెకు ఇంకొక థ్రిల్లింగ్ ఇచ్చారు. రెండు వేల రూపాయల నోటు మీద మార్స్ మంగళ్యాణ్ శాటిలైట్‌ను ముద్రించడం ఇస్రో ఉద్యోగులుగా తమకు దక్కిన గౌరవంగా నందిని భావిస్తున్నారు. మార్స్ మిషన్ ప్రారంభంలో నందిని, ఆమె సహోద్యోగులు రోజూ 10 గంటలు పనిచేసేవారు. లాంచ్ డేట్ దగ్గర పడడంతో ఆ పది గంటలు పద్నాలుగు గంటలు అయ్యాయి. ఉదయాన్నే ఆఫీసుకు వచ్చేవారు. రాత్రి బాగా పొద్దుపోయేవరకు అక్కడే ఉండేవారు. ఒక్కోసారి రెండోరోజు మధ్యాహ్నం మాత్రమే ఇంటికి వెళ్లేందుకు కుదిరేది. అదీ కాసేపు నిద్రపోడానికి . లేచాక టైమ్ చూసుకోవడం, మళ్లీ ఆఫీసుకు పరుగెత్తడం. ప్రాజెక్టులో ఊహించని విధంగా ఏవో సమస్యలు తలెత్తేవి. వాటికి కారణాలు కనుక్కోవడం, పరిష్కారాలు కనిపెట్టడం.. ఇంకో ప్రాజెక్టు నెత్తికి ఎత్తుకున్నంత పని. వీటన్నిటినీ నందిని నెగ్గుకొచ్చారు కానీ, కూతురి ఎగ్జామ్స్‌కి తను దగ్గర లేకపోవడమే ఇప్పటికీ ఆమెకు గుర్తుకొస్తుంటుంది. మార్స్ మిషన్ పనులు డెడ్‌లైన్‌కి సరిగ్గా మధ్యలో ఉన్నప్పుడు.. నందిని కూతురికి స్కూల్ ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేశాయి. మంచి కాలేజీలో సీటు రావాలంటే మంచి మార్కులు రావాలి. పక్కనే ఉండి, కూతురికి కావలసినవన్నీ అమర్చిపెడుతూ, ఆమెను చదివించాలని నందినికి ఉండేది కానీ, అలా వీలుకాదని కూడా ఆమెకు తెలుసు. అయినప్పటికీ దొరికిన కొద్ది టైమ్‌లోనే ఆమె కూతురితో ఉన్నారు. ఇంటికీ, ఆఫీసుకీ మధ్య ఒక షటిల్‌లా తిరిగారు. కూతురితో పాటు ఉదయం నాలుగింటికే లేచేవారు నందిని. ఆమె చదువుతున్నంతసేపూ తోడుగా కూర్చొనేవారు. ఇప్పుడు అవన్నీ తలచుకుంటుంటే చాలా సంతోషంగా ఉంటుందట. కూతురికి మంచి మార్కులు వచ్చాయి. మేథ్స్‌లో అయితే నూటికి నూరు! ఇప్పుడా అమ్మాయి మెడిసిన్‌కి ప్రిపేర్ అవుతోంది. ‘‘అయితే మిమ్మల్ని ఇప్పుడు మార్స్ ఉమన్ అనొచ్చా?’’ అని గీతా పాండే అడిగినప్పుడు నందిని కూడా రీతూ చెప్పిన సమాధానమే చెప్పారు. ‘‘నా కాళ్లు భూమి మీదే ఉన్నాయి. మనలోని అత్యుత్తమమైనది బయటికి రావాలంటే మనం డౌన్ టు ఎర్త్ ఉండాలి’’ అన్నారు. ‘‘మార్స్ మిషన్ ఒక అడుగు మాత్రమే. ఇంకా వెయ్యడానికి చాలా అడుగులు ఉన్నాయి’’ అని కూడా నందిని అన్నారు. నందినీ హరినాథ్ డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్, మార్స్ ఆర్బిటర్ మిషన్ -
ఈ ప్రశ్నకు బదులేది?
►ఎస్వీయూ అధికారుల వైఖరి మారదా? ► వరుస తప్పులతో విద్యార్థులకు అవస్థలు ► సెకండియర్ పరీక్షలకు మారిపోయిన ప్రశ్నపత్రం ►పరీక్ష రద్దు యోచనలో అధికారులు చిత్తూరు ఎడ్యుకేషన్/తిరుపతి సిటీ: శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సెకండ్ ఇయర్ తెలుగు ప్రశ్న పత్రానికి బదులుగా విద్యార్థులకు ఫస్ట్ ఇయర్‌కు చెందిన తెలుగు ప్రశ్న పత్రాన్ని ఇచ్చిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. ప్రశ్న పత్రం చూసుకున్న విద్యార్థులు ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. వెంటనే ఎగ్జామ్ సెంటర్లలో ఉన్న ఇన్విజిలేటర్ల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో శనివారం పరీక్ష రాసిన జిల్లాలోని 20వేల మందికి పైగా విద్యార్థుల జీవితం ప్రశ్నార్థకంగా మారింది. పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 9గంటలకు విద్యార్థులకు థర్డ్ సెమిస్టర్ అని పొందుపరిచిన ప్రశ్నపత్రాన్ని సెకండియర్ విద్యార్థులకు ఇచ్చారు. అందులోని ప్రశ్నలన్నీ ఫస్టియర్‌కు చెందిన రెండో సెమిస్టర్ ప్రశ్నలు ఉండడంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. వెంటనే ఇన్విజిలేటర్ల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోరుుంది. డిగ్రీ థర్డ్ సెమీస్టర్ తెలుగు ప్రశ్నాపత్రానికి బదులు సెకండ్ సెమీస్టర్ ప్రశ్నలు ఇవ్వటంతో శనివారం జరిగిన థర్డ్ సెమిస్టర్ తెలుగు పరీక్షను రద్దు చేసే యోచనలో వర్సిటీ అధికారులు ఉన్నారు. సోమవారం వీసీ, రిజిస్ట్రార్ ఇతర అధికారులు సమావేశమై పరీక్షను రద్దు చేయాలా ? వద్దా అనే నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఎస్వీయూ అధికారుల తీరులో మార్పులేదు ప్రశ్నపత్రాల పంపిణీలో వర్సిటీ పరీక్షల విభాగం అధికారులు, ఉన్నతాధికారుల నిర్లక్ష్యం బట్ట బయలైంది. అది జరిగి రెండురోజులు కూడా కాకముందే మళ్లీ ఇలాంటి తంతే సాగడంతో ఎస్వీయూ అధికారుల్లో బాధ్యతారాహిత్యం కనిపిస్తోంది. అధికారుల తప్పిదం వల్ల వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. -
ఎస్వీయూలో 9 నుంచి వెబ్ కౌన్సెలింగ్
తొలిసారిగా పీజీ అడ్మిషన్లలో అమలు తిరుపతి సిటీ: శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో పీజీ కోర్సుల ప్రవేశానికి తొలిసారిగా వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఇప్పటివరకు ఇంజనీరింగ్, ఎంబీఎ, ఎంసీఏ, లా, మెడికల్, బీఈడీ కోర్సులకు పరిమితమైన వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియను ఎస్వీయూలో తొలిసారిగా పీజీ కోర్సులకు సైతం ప్రవేశపెట్టా రు. ఈనెల 9వ తేది నుంచి 13వ తేది వరకు ఎస్వీయూ డైరక్టరేట్ ఆడ్మిషన్ల కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి అయిన మరుసటి రోజు నుంచి అభ్యర్థులు ఆన్లైన్లో లాగిన్అయ్యి తమకు కావాల్సిన కోర్సులను వెబ్ ఆప్షన్ల ద్వారా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 16 లేదా 17 తేదీల్లో సీట్ల కేటాయింపు జరుగుతుంది. అభ్యర్థులు వెబ్ ఆప్షన్ల ఆధారంగా ఎస్వీయూ అధికారులు సీట్లను కేటాయిస్తారు. సర్టిఫికెట్ల పరిశీలన ఇలా.. 9వ తేదీన కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టులు, 10న కామర్స్, 11న మ్యా థమెటిక్స్, స్టాటిస్టిక్స్, బాటనీ, కంప్యూటర్ సైన్స్,12న జూవాలజీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇంగ్లీష్, జనరల్ టెస్ట్, ఆక్వాకల్చరల్ సబ్జెక్టులు, 13న బయో కెమిస్ట్రీ, ఫుడ్ టెక్నాలజీ, హోమ్ సైన్స్, ఎడ్యుకేషన్, తెలు గు, హిస్టరీ, సైకాలజీ, జీయాలజీ, సోషియల్ వర్క్, ఎకానమిక్స్, ఆంత్రోపాలజీ, ఎన్విరాన్మెంట్ సైన్స్, హిందీ, సీప్ స్టడీస్, ఫెర్మామింగ్ ఆర్ట్స్, సంస్కృతం, సోషియాలజీ, తమిళ్, ఉర్దూ, వైరాల జీ, ఉమెన్ స్టడీస్, టూరిజం సబ్జెక్టుల అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. ప్రత్యేక కేటగిరి అభ్యర్థుల సర్టిఫికెట్లను మొదటి విడతలోనే పరిశీలించి సీట్లను కేటాయించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. -
ఎస్వీయూ పరిశోధకుడి లోగోకు అంతర్జాతీయ గుర్తింపు
ఎస్వీయూనివర్సిటీ వృక్షశాస్త్ర విభాగంలో పరిశోధనలు చేస్తున్న మిట్టా మహింద్రనాథ్ రూపొందించిన జీవవైవిధ్య లోగోకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. కన్వెన్షన్ ఆఫ్ బయలాజికల్ డైవర్సిటీ (సీబీటీ) వెబ్సైట్లో ఈయన రూపొందించిన లోగోను వాడుకున్నారు. ఈ మేరకు సీబీటీ తన వెబ్సైట్లో ప్రకటన చేసింది. మే22న అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘ప్రజా జీవన మరియు జీవనోపాధి సంరక్షణ’ అనే ప్రధాన స్రవంతితో మహింద్రనాథ్ లోగో రూపొందించారు. ఈ లోగోను సీబీటీ తన వెబ్సైట్లో ఉంచింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో రూపొందించిన లోగోల్లో మహింద్రనాథ్ రూపొందించిన లోగో 9 వ స్థానంలో నిలువగా, భారతీయ భాషల్లో బెంగాళీ తర్వాత స్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా సీబీటీ జీవవైవిధ్య పరిరక్షణకు దోహదం చేస్తోంది. వివిధ దేశాల్లో ప్రాంతీయ జీవ వైవిధ్య సంస్థలతో అనుసంధానమై సదస్సులు నిర్వహిస్తుంది. ప్రతి సంవత్సరం మే22న అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు నిర్వహిస్తోంది. అంతేకాకుండా ప్రతి యేడాది వివిధ అంశాలను ప్రధాన స్రవంతిగా రూపొందిస్తోంది. ఈ యేడాది జరుగుతున్న సదస్సుకు మహింద్రనాథ్ లోగోకు స్థానం దక్కడంపై పలువురు అధ్యాపకులు, పరిశోధకులు మహింద్రనాథ్‌ను అభినందిస్తున్నారు. ఈయన వృక్షశాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొపెసర్ కె. మాధవశెట్టి పర్యవేక్షణలో పరిశోధన చేస్తున్నారు. -
విశ్వవిద్యాలయమా? టీడీపీ కార్యాలయమా?
► ఎస్వీయూలో నారా లోకేష్ జన్మదిన వేడుకలపై విద్యార్థుల నిరసన ► వీసీ టీడీపీ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని ఆరోపణ చిత్తూరు: ఎస్వీయూ వీసీ దామోదరం టీడీపీ ఏజెంట్లా వ్యవహరిస్తూ యూనివర్సిటీని పార్టీ కార్యాలయంగా మార్చారని విద్యార్థులు నిరసన వ్యక్తంచేశారు. శనివారం ఎస్వీయూలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించగా, వీసీ దామోదరం హాజరై కేక్ కట్ చేయడం, రిజిస్ట్రార్ దేవరాజులు, రెక్టార్ ఎం.భాస్కర్ పాల్గొనడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ విద్యార్థి సంఘం ఆదివారం ఎస్వీయూ పరిపాలన భవనం ఎదుట ఆందోళన నిర్వహించింది. వీసీ, రిజిస్ట్రార్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. వారిని తొలగించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు వి.హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల్లో రాజకీయ కార్యక్రమాలకు అనుమతి లేదంటూ గత సెప్టెంబర్‌లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అలాంటప్పుడు ఎలాంటి ప్రభుత్వ పదవి లేని నారా లోకేష్ జన్మదిన వేడుకలకు అ నుమతి ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నించారు. విశ్వవిద్యాలయంలో రాజకీయ జోక్యం ఉండదని వీసీ దామోదరం బాధ్యతలు స్వీకరించిన రోజు ప్రకటించారని, అయితే ఆయనే స్వయంగా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. అధికార పార్టీ కార్యక్రమాలను ఆయనే దగ్గర ఉండి చేయిస్తున్నారని ఆరోపించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయం తి శనివారమే అయినప్పటికీ ఆయనకు నివాళి అర్పించకపోవడం దారుణమన్నారు. వీసీ, రిజిస్ట్రా ర్ వ్యవహార తీరుపై గవర్నర్, లోకాయుక్తకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. నాయకులు హేమంత్‌యాదవ్, మురళీధర్, కిషోర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, తేజేష్‌రెడ్డి,ప్రదీప్, హేమంత్‌రెడ్డి, మదన్, సంతోష్‌రెడ్డి, మౌలాలీ, సంతోష్ పాల్గొన్నారు. -
ఎస్వీ యూనివర్సిటీలో చోరీ..
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చోరీ జరిగింది. యూనివర్సిటీలోని దూర విద్యావిభాగం గది తలుపులు పగలగొట్టి అందులో ఉన్న రెండు కంప్యూటర్ మానిటర్లు, రెండు సీపీయూలు ఎత్తుకెళ్లారు. తలుపులు పగల గొట్టి ఉండటం గమనించిన స్థానికులు సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంగ్లీష్ ప్రొఫెసర్ చాంబర్ ముట్టడించిన విద్యార్థులు
తిరుపతి : శ్రీవెంకటేశ్వర యూనిర్శిటీలోని విధులు నిర్వర్తిస్తున్న ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఎం. నరేంద్రపై సస్పెన్షన్ వేటు వేయాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం తిరుపతిలోని యూనివర్శిటీలో ప్రొ ఎం నరేంద్ర చాంబర్‌ను విద్యార్థులు ముట్టడించారు. ఆయనకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. పీజీ విద్యార్థినులపై ప్రొఫెసర్ నరేంద్ర లైంగిక వేధింపులు గురి చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు ప్రొ.నరేంద్ర వైఖరిపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం విద్యార్థులు నరేంద్ర చాంబర్‌ను ముట్టడించారు. -
ర్యాగింగ్‌పై ఆరా తీసిన ఎస్వీయూ రిజిస్ట్రార్
తిరుపతి : ఎస్వీ యూనివర్సిటీలో ర్యాగింగ్ ఘటనపై రిజిస్ట్రార్ దేవరాజుల నాయుడు మంగళవారం ఆరా తీశారు. ఈ ఘటనపై విచారణ చేసి బాధ్యులపూ చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. బాలుర హాస్టల్లోని డి-బ్లాక్‌లో నిన్న ర్యాగింగ్ జరిగిన విషయం తెలిసిందే. మొదటి ఫ్లోర్‌లోని సీనియర్ల గదిలోకి జూనియర్లను పిలిపించి ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. పరిచయం పేరిట సీనియర్ విద్యార్థులు ....నృత్యాలు చేయాలంటూ జూనియర్లను ర్యాగింగ్ చేసిన విషయం తెలిసిందే. -
'పిలుస్తుంటే రావడం లేదు.. ఏం బలుపా'
యూనివర్సిటీ క్యాంపస్: ఎస్వీ యూనివర్సిటీలో ర్యాగింగ్ భూతం మళ్లీ జడలు విప్పుకుంది. బాలుర హాస్టల్లోని డి-బ్లాక్‌లో సోమవారం ర్యాగింగ్ చోటుచేసుకుంది. మొదటి ఫ్లోర్‌లోని సీనియర్ల గదిలోకి జూనియర్లను పిలిపించి ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. ‘ఏంటి గెట్క్లాస్లకు వారం నుంచి పిలుస్తుంటే రావడం లేదు. ఏం బలుపా’ అని ఒక సీనియర్ విద్యార్థి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏంటి సీనియర్లకు విష్ చేయడం లేదు’ ‘మీకు క్యాంపస్‌లో ఉండాలని లేదా’ అంటూ మరో సీనియర్ హుకుం జారీ చేశాడు. ఎంబీఏ అయ్యాక ఏమి చేస్తావని సీనియర్ అడిగిన ప్రశ్నకు మొక్కల బిజినెస్ అని చెప్పిన జూనియర్‌ను క్యాంపస్‌లో ఎన్ని మొక్కలు ఉన్నాయో లెక్కించాలని ఆర్డర్ వేశారు. మందుల వ్యాపారం అని చెప్పిన వారికి క్యాంపస్‌లో ఎంతమందికి రోగాలున్నాయో కనుక్కొని చెప్పాలని’ హుకుం జారీ చేశారు. సినిమా అంటే ఇష్టమని చెప్పిన వారితో డ్యాన్స్ చేయించారు. ఇలా సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్ చేశారు. ఎస్వీయూ లో గతనెల 13 నుంచి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో కొత్తగా చేరిన వారికి తరగతులు మొదలయ్యాయి. డి-బ్లాక్‌లో గ్రౌండ్‌ఫ్లోర్‌లో జూనియర్లకు, మొదటిఫ్లోర్‌లో సీనియర్లకు గదులు కేటాయించారు. కొత్త విద్యార్థులు వచ్చాక ర్యాగింగ్ జరిగే అవకాశమున్నా నిరోధానికి అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. సోమవారం మధ్యాహ్నం 2 నుంచి 5గంటల వరకు, రాత్రి 8 నుంచి 2 గంటల వరకు సీనియర్ విద్యార్థులు తమ గదులకు పిలిపించుకుని ఇంటరాక్షన్ పేరిట వికృత చేష్టలకు పాల్పడుతున్నట్లు కొందరు జూనియర్లు సాక్షికి తెలియజేశారు. జూనియర్ల సమావేశం: సీనియర్ల ఆగడాలతో మనస్తాపానికి గురైన జూనియర్లు ఎస్వీయూలో ఆడిటోరియం వద్ద సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు. సీనియర్లు పెడుతున్న ఇబ్బందులపై తీవ్రంగా చర్చించారు. మరో రెండు రోజులు చూసి సీనియర్ల ప్రవర్తన మారకపోతే పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. నాలుగు సంవత్సరాల క్రితం ఇదే బ్లాక్‌లో ర్యాగింగ్ చేస్తున్న విద్యార్థులను పోలీసులు పట్టుకున్న విషయం విదితమే. మరోసారి ఇలాంటి ఘటన జరగకముందే అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. -
చిత్తూరుపై శీతకన్ను!
సాక్షి, చిత్తూరు: జిల్లాలో తిరుపతి, చిత్తూరు రెండు కార్పొరేషన్లు. వీటిలో పాతికేళ్ల కిందట నుంచే తిరుపతి అభివృద్ధి చెందుతోంది. అప్పటికే శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, రుయా ఆస్పత్రి, ఎస్వీ మెడికల్ కాలేజీతో పాటు పలు రంగాల్లో అభివృద్ధి బాటలో పయనించింది. ఏడుకొండలవాడి సన్నిధి కావడంతో తిరుపతి అభివృద్ధి వేగంగా జరుగుతోంది. పాతికేళ్లకు...ఇప్పటికీ తిరుపతిలో ఎంతో తేడా ఉంది ! కానీ జిల్లా కేంద్రమైన చిత్తూరు మాత్రం అప్పటికి ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా అభివృద్ధిలో చాలా వెనుకబడి ఉంది. చిత్తూరుకు కార్పొరేషన్ హోదా దక్కడం మినహా పరిశ్రమలు, విద్యాసంస్థల ఏర్పాటుకు ప్రభుత్వాలు ఊతం ఇవ్వలేకపోయాయి. దశాబ్దాలుగా చిత్తూరు నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రజాప్రజాప్రతినిధులూ నగర మంచినీటి సమస్య తీర్చలేకపోయారు. కొత్తరాష్ట్రంలో కూడా పాత ఆలోచనలే నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ జిల్లా నుంచే ప్రాతి నిథ్యం వహిస్తున్నారు. ఇటీవల రాజధాని ప్రకటన నేపథ్యంలో 13జిల్లాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక ప్రకటించారు. అందులో చిత్తూరు జిల్లాకు సంబంధించి తిరుపతి ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కుప్పంలో కొత్తగా ఏయిర్పోర్టు స్థాపిస్తామన్నారు. ఏర్పేడులో ఎన్ఐఎంజెడ్, ఐఐటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్), తిరుపతికి మెట్రోరైలు, తిరుపతి మెగా సిటీ, ఐటీ హబ్‌గా తిరుపతి, మెగా ఫుడ్‌పార్క్, హార్టికల్చర్ జోన్, ఆధ్యాత్మిక టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తిరుపతి, దాని చుట్టపక్కల ప్రాంతాల్లోనే అభివృద్ధి కేంద్రీకృతమయ్యేలా ప్రభుత్వం పరిశ్రమలు, విద్యా సంస్థల ఏర్పాటుకు ఉపక్రమించారనేది స్పష్టంగా తెలుస్తోంది. చిత్తూరు అభివృద్ధికి ఊతం ఇచ్చేందుకు ఒక్కటైనా..? వ్యవసాయంపై ఆధారపడి జీవించే రైతు కుటుంబాలు ఎక్కువగా ఉన్నప్పటికీ అందు కు అనువైన పరిస్థితులు ఇక్కడ లేవు. తాగునీటితోపాటు సాగునీటికి తీవ్రంగా ఇబ్బందు లు పడుతున్నారు. ఈ క్రమంలో చిత్తూరు కేంద్రంగా విద్యాసంస్థలు, పరిశ్రమల ఏర్పాటు జరగాలని ఇక్కడి వాసులు కాంక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రకటించిన అభివృద్ధి ప్రణాళికలో చిత్తూరు కేంద్రంగా ఒక్కటి కూడా లేకపోవడం ఇక్కడి వారిని తీవ్రంగా బాధిస్తోంది. పోనీ స్థల సమస్య ఏదైనా ఉందా అంటే అదీ లేదు... చుట్టుపక్కల ప్రభుత్వ భూములు అధికంగా ఉన్నాయి. ప్రజాప్రతినిధుల నిర్లిప్తత ప్రధాన కారణం! చిత్తూరు అభివృద్ధి కోసం చిత్తూరు, చుట్టు పక్కల నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు కూడా గట్టిగా వాణి వినిపించలేకపోయారు. పరిశ్రమలు, విద్యాసంస్థల ఏర్పాటుకు ప్రభుత్వంతో పోరాడలేకపోయారు. ఆ ప్రయత్నం కూడా చేయలేకపోయారు. ఎంపీ శివప్రసాద్ ఏదైనా ప్రభుత్వం కార్యక్రమం ఉంటే ప్రోటోకాల్ ప్రకారం కనిపించాలి కాబట్టి రావడం మినహా చిత్తూరు అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. తన పార్లమెంట్ పరిధిలో ఒక్క పరిశ్రమ, విద్యాసంస్థను కేంద్రం నుంచి రాబట్టలేకపోయారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గీర్వాణి, మేయర్ కఠారి అనురాధ, ఎమ్మెల్యే డీఏ సత్యప్రభ కూడా ఈ విషయంలో చొరవ చూపలేకపోయారు. అయితే చిత్తూరుకు మెడికల్ కాలేజీ కావాలని సత్యప్రభ గట్టిగా సీఎంతో పోరాడారు. దీంతోనే ప్రైవేటుగా అపోలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇది మినహా అభివృద్ధిలో అందరూ విఫలమయ్యారనే స్పష్టమవుతోంది. -
వార్షిక క్రీడలకు ఎస్వీయూ సన్నద్ధం
తిరుపతి స్పోర్ట్స్ : శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీయూ) 2014-15 వార్షిక క్రీడాపోటీలకు సన్నద్ధమవుతోంది. ఈ మేరకు ఎస్వీయూ పరిధిలోని అంతర కళాశాలల క్రీడాపోటీల వేదికలను స్పోర్ట్స్ కమిటీ ప్రకటించింది. ఎస్వీయూ ఫిజికల్ డిపార్టుమెంట్లో బుధవారం ఎస్వీయూ స్పోర్ట్స్ కమిటీ సమావేశం అయింది. కమిటీ చైర్మన్ అయిన వీసీ రాజేంద్ర అధ్యక్షతన జరిగిన ఈ కమిటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2014-15 వార్షిక క్రీడాపోటీల నిర్వహణ, వేదికల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. ఎస్వీయూ పరిధిలోని అంతర కళాశాలల పురుషుల గేమ్స్‌ను ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించాలని నిర్ణయించా రు. అందులో వాలీబాల్, హాకీ, హ్యాండ్‌బాల్, టెన్నిస్, ఫుట్‌బాల్, టేబుల్ టెన్నిస్ ఉన్నాయి. పుత్తూరు శేషాచల వెంకటసుబ్బయ్య కళాశాల క్రీడామైదానంలో బాల్ బ్యాడ్మింటన్, కబడ్డీ, కోకో నిర్వహించనున్నారు. శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ మహిళల డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో పురుషులకు షటిల్ బ్యాడ్మింటన్, చెస్, బాస్కెట్‌బాల్ పోటీలు నిర్వహిస్తారు. అంతర కళాశాలల బోధనా సిబ్బంది (పురుషులు) క్రీడలు వాల్మీకిపురంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్నారు. మహిళలకు ఎస్పీడబ్ల్యూలో... ఎస్వీయూ అంతర కళాశాలల పరిధిలోని మిహ ళలకు తిరుపతి ఎస్పీడబ్ల్యూ డిగ్రీ, పీజీ కళాశాలలో గేమ్స్ నిర్వహించనున్నారు. పురుషులు, మహిళలకు వేర్వేరుగా అథ్లెటిక్ పోటీలను ఎస్పీడబ్ల్యూ కళాశాలలోనే నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. దీంతో పాటు ఎస్వీయూ పరిధిలోని అంతర కళాశాలల బోధన(మహిళలు) సిబ్బందికి ఇక్కడే అన్ని రకాల క్రీడా పోటీలు నిర్వహిస్తారు. స్పోర్ట్స్ స్కాలర్ షిప్ రూ.4 వేలకు పెంపు యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో చదువుతూ క్రీడల్లో విశేషంగా రాణిస్తున్న పురుషులు 300 మంది, మహిళలు 200 మందికి ఎస్వీయూ ప్రతి ఏటా ‘స్పోర్ట్స్ మెరిట్ స్కాలర్షిప్’ కల్పిస్తోంది. ఈ ఏడాది నుంచి ఈ స్కాలర్షిప్ను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతూ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. 1987లో ముద్రించిన ‘ఎస్వీయూ స్పోర్ట్స్ రూల్స్’ బుక్ స్థానంలో నూతన నిబంధనలతో బుక్‌ను తీసుకు రానున్నారు. ఈ ఏడాది ఎస్వీయూ వార్షిక క్రీడల నిర్వహణకు రూ.32 లక్షల బడ్జెట్‌ను కేటాయించినట్టు వీసీ రాజేంద్ర తెలిపారు. గత ఏడాది రూ.28 లక్షలు కేటాయించామన్నారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ దేవరాజులు నాయుడు, స్పోర్ట్స్ కమిటీ కార్యదర్శి, ఫిజికల్ డెరైక్టర్ శివశంకర్‌రెడ్డి, సభ్యులు ఉషారాణి (ఎస్పీడబ్ల్యూ), క్రిష్టఫర్ (ఎస్వీ ఆర్ట్స్), సత్యనారాయణ (శ్రీకాళహస్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాల), రాబర్ట్ (పీవీకేఎన్, చిత్తూరు), నళిని (చిత్తూరు), ఎస్వీయూ అసిస్టెంట్ పీడీలు అవల్దార్ గిరిధర్, నాగమణి, పెన్నా భాస్కర్, చంద్రశేఖర్‌రాజు, మాధవ్‌రెడ్డి పాల్గొన్నారు. -
పరిశోధనలకు నిలయం
ఎస్వీయూ వైరాలజీ విభాగంతో ప్రతిష్టాత్మక పరిశోధన సంస్థల ఒప్పందాలు పరిశోధనా సంస్థలో ఉద్యోగాలు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని వైరాలజీ విభాగం నాణ్యమైన పరిశోధనలకు కేరాఫ్‌గా నిలుస్తోంది. ఈ విభాగానికి పలు ప్రతిష్టాత్మక సంస్థలు పరిశోధనల కోసం నిధులు కేటాయించాయి. ఎన్నో ఉపయోగకరమైన పరిశోధనలు జరుగుతున్నాయి. మొక్కలు, పంటలకు సోకే వైరస్లు, వాటి నిర్ధారణ, వైరస్ల నివారణకు అవసరమైన ఔషధాలు కనుగొనడం.. మనుషుల్లో ఉన్న వైరస్‌లను గుర్తించడానికి, అందుకు కావాల్సిన పరికరాలు.. తదితర అంశాలపై ఇక్కడ పరిశోధనలు సాగుతున్నాయి. మనుషులకు సోకే చికున్‌గున్యా, మెదడువాపు వ్యాధి, డెంగీ జ్వరం తదితర వ్యాధి నిర్ధారణ పరీక్షలకు సంబంధించి కూడా ఇక్కడ పరిశోధనలు చేస్తున్నారు. ఇక్కడి ప్రయోగశాలలో రూపొందించిన వైరస్ నిర్ధారణ కిట్లను ఎస్వీయూ ఆరోగ్యకేంద్రం, స్విమ్స్‌లో వాడుతుండడం విశేషం. యూనివర్సిటీ క్యాంపస్: ఎస్వీ యూనివర్సిటీ వైరాలజీ విభాగంలో పీజీ కోర్సులతో పాటు ఎంఫిల్, పీహెచ్డీ కోర్సులు నిర్వహిస్తున్నారు. 1987లో వృక్షశాస్త్ర పరిశోధనలకు ఓ విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. మనదేశంలో ఎమ్మెస్సీ వైరాలజీని అందించే ఏకైక విశ్వవిద్యాలయం ఎస్వీయూనే. 1987లో ఏర్పా టైన ఈ విభాగంలో తొలిసారి సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టిన ఘనత ఈ విభాగానిదే. ఈ విభాగంలో ఎమ్మెస్సీలో 18 మందికి ప్రవేశం కల్పిస్తారు. 12 సీట్లు రెగ్యులర్ కోటాలో, 6 సీట్లు సెల్ఫ్ సపోర్టింగ్ కేటగిరీలో ఉన్నాయి. ప్రస్తుతం ఎమ్మెస్సీ మొదటి సంవత్సరంలో 9 మంది, ద్వితీయ సంవత్సరంలో 5 మంది పీజీ చేస్తున్నారు. ఐదుగురు అధ్యాపకులు వీరికి బోధిస్తున్నారు. పరిశోధకులే అధికం ఎమ్మెస్సీ వైరాలజీ చదివే వారికన్నా పరిశోధనలు చేసేవారే ఇక్కడ అధికంగా ఉన్నారు. 14 మంది పీజీ చేస్తుంటే, 30 మంది పరిశోధనలు చేస్తున్నారు. సెల్ఫ్ సపోర్టింగ్ కేటగిరీకి 34,545 రూపాయలు, రెగ్యులర్ కేటగిరీకి రూ.9,545 ఫీజు చెల్లించాల్సి ఉంది. ప్రతికూలతలు పరిశోధన సంస్థల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండే వైరాలజీ విద్యార్థులు పీజీ చేసిన వెంటనే ఉద్యోగాలు వచ్చే అవకాశం తక్కువగా ఉంది. జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ పోస్టులకు వీరు అర్హులు కారు. అందువల్ల పీజీ కోర్సుల్లో ఎక్కువ మంది చేరడంలేదు. ఇటీవల కాలంలో ఇంటర్‌స్థాయిలో బయాలజీ చేసేవారి సంఖ్య తగ్గడం వల్ల కూడా పీజీ చేరేవారి సంఖ్య తక్కువనే చెప్పాలి. పరిశోధనల్లో పురోగతి ఈ విభాగంలో పంటలకు సోకే వైరస్లు, మొక్కల్లో వ్యాపించే వైరస్లు, వాటివల్ల కలిగే ప్రభావం తదితరాలపై పరిశోధనలు చేస్తున్నారు. చికున్‌గున్యా, డెంగీ, మెదడు వాపు వ్యాధి కలిగించే వైరస్లు, స్క్రబ్‌టైఫస్ వైరస్, లెప్టోస్పైరోసిస్ వైరస్‌లపై పరిశోధనలు జరుగుతున్నాయి. మస్రస్ వెటర్నరీ కళాశాలతో కలిపి గాలి కుంటువ్యాధి, పశువులు, పక్షుల్లో వచ్చే వ్యాధులకు టీకా మందుల తయారీపై పరిశోధనలు జరుగుతున్నాయి. సూక్ష్మజీవుల్లో ఉండే ఎంజైమ్‌లు, పారిశ్రామికపరంగా ఏంచేయవచ్చు అనే అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయి. సర్వికల్ క్యాన్సర్ నిర్ధారణ, వ్యాధి నివారణకు అవసరమైన కిట్ల తయారీపై పరిశోధనలు చేస్తున్నారు. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో)ఆధ్వర్యంలో రెండు కోట్ల రూపాయల పరిశోధన జరుగుతున్నాయి. సైనికులకు వచ్చే వ్యాధులు, క లిగే వైరస్‌లపై ఈ పరిశోధన జరుగుతోంది. ఇందుకు అవసరమైన వ్యాక్సిన్ల కోసం 40 లక్షల రూపాయలతో మరో పరిశోధనా ప్రాజెక్టు పురోగతిలో ఉంది. ఈ పరిశోధనలో భాగంగా ముందుగా కోతులపై ప్రయోగాలు చేస్తారు. అనంతరం పరిశ్రమలకు ఇచ్చి పరిశోధనలను ముందుకు తీసుకెళుతారు. ప్లేస్మెంట్ ఎమ్మెస్సీ వైరాలజీ విద్యార్థులకు గతంలో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించేవారు. బెంగళూరులోని బయోకాన్, నాగార్జున ఫర్టిలైజర్స్, మ్యాట్రిక్స్, పార్మా క ంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. గత ఏడాది 15 మంది ఉద్యోగాలు పొందారు. ఉపాధి అవకాశాలకు కొదవ లేదు వైరాలజీ విభాగంలో పరిశోధనలు పూర్తి చేసినవారికి ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్సెన్సైస్ (ఎయిమ్స్)లో 12 మంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ(ఎన్ఇఈ)లో కీలక స్థానాల్లో నలుగురు పనిచేస్తున్నారు. వైద్య, వ్యవసాయ, పశువైద్య రంగాల్లో ఈ కోర్సుకు ప్రాధాన్యత ఉంది. ఆయా రంగాల్లో ఉపాధి అవకాశాలున్నాయి. పరిశోధనలకు ప్రోత్సాహం వైరాలజీలో పరిశోధనలు చేసేవారికి యూరోపియన్ కమిషన్ ఎరాస్ మం డస్ అనే పథకం కింద పరిశోధ నలను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ఐదుగురు పరిశోధనల కోసం యూరఫ్ వెళ్లారు. అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన ఆర్కిషి ఆచంటి వైరాలజీ విభాగానికి విచ్చేసి నెలరోజులుగా పరిశోధన లు చేస్తోంది. వైరాలజీ విభాగంలో వసతులు బాగున్నాయని ఆమె చెప్పారు. పరిశోధనలు చేస్తే ప్రయోజనం వైరాలజీ విభాగంలో పీజీ చేసినందువల్ల పెద్దగా ఉద్యోగాలు లభించవు. అయితే పరిశోధనలు పూర్తిచేసి ఏదైనా పరిశోధన సంస్థలకు వెళితే మాత్రం చక్కటి ఉపాధి పొందవచ్చు. వైరాలజీ పీజీ, పీహెచ్‌డీలు చేసినవారికి జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ పోస్టులకు అర్హత కల్పించాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపుతాం. - ప్రొఫెసర్ డీవీఆర్ సాయిగోపాల్, వైరాలజీ విభాగాధిపతి -
టీడీఎల్పీ నేత ఎన్నికకు ఏర్పాట్లు
ఎస్వీయూ సెనేట్ హాల్, మహతి ఆడిటోరియాన్ని పరిశీలిస్తున్న అధికారులు {పజాప్రతినిధుల భద్రతపై పోలీసుల కన్ను సాక్షి, తిరుపతి : తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష నేత ఎన్నికకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికైన సభ్యులతో జూన్ నాలుగో తేదీన తిరుపతిలో సమావేశం ఏర్పాటు చేయాలని అధినేత ఎన్.చంద్రబాబునాయుడు వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ మేరకు సమావేశం ఏర్పాటుకు అనువైన ప్రదేశం ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు వచ్చాయి. దీంతో ఆయన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ సెనేట్ హాల్, మహతి ఆడిటోరియంను పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆ మేరకు యూనివర్సిటీ వైఎస్ చాన్సలర్ ఆదేశాలతో శుక్రవారం సెనేట్ హాల్, మహతి ఆడిటోరియాన్ని అధికారులు పరిశీలించారు. ఈ రెండు చోట్ల అనువైన వాతావరణం ఉన్నట్టు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినప్పటికీ భద్రత దృష్ట్యా పోలీసు ఉన్నతాధికారుల సూచనలు కూడా తీసుకున్న తరువాతనే సమావేశం ఎక్కడ జరిగేది నిర్ణయిస్తారు. ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో అధికారులు రెండు చోట్ల అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతున్నారు. సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు పార్టీ ముఖ్యులు హాజరయ్యే అవకాశాలు ఉండటంతో పోలీసులు భద్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతేకాకుండా ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతున్న తరుణంలో తిరుపతిలో పోలీసు నిఘా ఎక్కువ చేశారు. కాగా ఎస్వీయూనివర్సిటీ పరిసర ప్రాంతాలను అందంగా తీర్చిదిద్దేందుకు కార్పొరేషన్ అధికారులు సిద్ధమవుతున్నారు. -
ఉన్నత విద్యకు పీజీ మార్గాలెన్నో...
డిగ్రీ తర్వాత విద్యా పరంగా ఎన్నో కోర్సులు.. మరెన్నో అవకాశాలు.. ఆయా అవకాశాలను యుక్తితో అందుకోవడం ద్వారా కెరీర్ ప్రస్థానాన్ని విజయవంతం చేసుకోవచ్చు.. అందుకు చక్కని వేదికలు.. పోస్ట్‌గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సులు.. ఇవి డిగ్రీలో చదివిన సబ్జెక్ట్‌లో సంపూర్ణ అవగాహనను పెంచుకోవడంతోపాటు.. సదరు అంశంలో నిష్ణాతులుగా రూపొందడానికి తోడ్పాటునందిస్తాయి.. రాష్ట్రంలోని ప్రముఖ యూనివర్సిటీలు వచ్చే విద్యా సంవత్సరానికి పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం నోటిఫికేషన్లు విడుదల చేశాయి.. వీటిలో విజయం సాధించడం ద్వారా మేధో వికాసానికి వేదికలుగా నిలిచే వర్సిటీ క్యాంపస్ కాలేజీల్లో అడుగుపెట్టడంతోపాటు.. చక్కని భవిష్యత్‌కు బాటలు వేసుకోవచ్చు.. ఈ నేపథ్యంలో ఆయా నోటిఫికేషన్ల వివరాలు.. గతంలో మాదిరిగా కేవలం సంప్రదాయ సబ్జెక్ట్‌లకే పరిమితం కాకుండా.. జాబ్ మార్కెట్ డిమాండ్, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందించే ఎన్నో నూతన స్పెషలైజేషన్స్‌తో కూడిన కోర్సులను వివిధ యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్నాయి. వీటిల్లో ప్రవేశం పొందడం ద్వారా కెరీర్లో త్వరగా స్థిరపడొచ్చు. అంతేకాకుండా కొన్ని యూనివర్సిటీలు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులను కూడా అందిస్తున్నాయి. పీజీ కోర్సులకు అర్హత: సంబంధిత అనుబంధ కోర్సుల్లో డిగ్రీ. ఇంటిగ్రేటెడ్ కోర్సులకు: ఇంటర్మీడియెట్/డిగ్రీ. శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి ఆఫర్ చేస్తున్న కోర్సులు: వివిధ విభాగాల్లో ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్, ఎంఈడీ, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంఎస్సీ టెక్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ:ఏప్రిల్ 28,2014 దరఖాస్తుల అప్‌లోడ్‌కు చివరి తేదీ: ఏప్రిల్ 30, 2014 పింట్ అవుట్ కాపీల స్వీకరణకు చివరి తేదీ: మే 3, 2014 పవేశ పరీక్షలు: మే 24 నుంచి 31 వరకు వివరాలకు: : http://svudoa.sssolutions.co.in ఆదికవి నన్నయ యూనివర్సిటీ-రాజమండ్రి ఆఫర్ చేస్తున్న కోర్సులు: ఎంఎస్సీ (బోటనీ, కెమిస్ట్రీ, జువాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, జియాలజీ-పెట్రోలియం ఎక్స్‌ప్లోరేషన్). ఎంఏ (తెలుగు, ఎకనామిక్స్, ఇంగ్లిష్, హిస్టరీ, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, సోషల్ వర్క్). దరఖాస్తు విధానం:వెబ్సైట్ నుంచి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోవాలి. రాత పరీక్షలు ప్రారంభం: మే 5, 2014. వివరాలకు: www.nannayauniversity.info శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ-అనంతపురం ఆఫర్ చేస్తున్న కోర్సులు: ఎంఏ (ఎకనామిక్స్, సోషియాలజీ, అప్లయిడ్ ఎకనామిక్స్, అడల్ట్ ఎడ్యుకేషన్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇంగ్లిష్, హిందీ, హిస్టరీ, తెలుగు), ఎంఎస్‌డబ్ల్యూ, ఎంఎస్సీ (స్టాటిస్టిక్స్, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బోటనీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, అప్లయిడ్ మ్యాథమెటిక్స్, మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ, పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సెరికల్చర్, జువాలజీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, జాగ్రఫి, జియాలజీ), ఎంకామ్, ఎంఈడీ, ఎంపీఈడీ. దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 22, 2014 రాత పరీక్షలు: మే 19 నుంచి 29 వరకు వివరాలకు: www.skupgcet.org ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ ప్రవేశాల కోసం ఏయూసెట్, ఏయూఈఈటీ అనే రెండు రకాల పరీక్షలను నిర్వహిస్తుంది. ఏయూసెట్ ద్వారా ఆఫర్ చేస్తున్న కోర్సులు: ఎంఎస్సీ, ఎంఏ, ఎంకామ్, ఎంహెచ్ఆర్ఎం, ఎంజేఎంసీ, ఎంఎల్ఐఎస్సీ, ఎంపీఈడీ, ఎంఈడీ, ఎంటెక్, ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్-జియాలజీ, ఎంఏ ఇంటిగ్రేటెడ్-ఎకనామిక్స్. ఏయూఈఈటీ ద్వారా ఆఫర్ చేస్తున్న కోర్సులు: ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ కోర్సులు: బీటెక్+ఎంటెక్/ఎంబీఏ (సీఎస్ఎస్ఈ, కంప్యూటర్ సైన్స్ అండ్ నెట్వర్కింగ్, సివిల్, మెకానికల్, ఈఈఈ, ఈసీఈ, కెమికల్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ), ట్విన్నింగ్ ప్రోగ్రాములు (బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీర్-ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీరింగ్, బీటెక్ ఎలక్ట్రో మెకానికల్/కెమికల్/ఎలక్ట్రానిక్స్). ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 15, 2014 రూ. 1000 లేట్ ఫీజుతో దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 22, 2014 వివరాలకు: www.audoa.in కాకతీయ యూనివర్సిటీ-వరంగల్ ఆఫర్ చేస్తున్న కోర్సులు: ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంహెచ్ఆర్ఎం, ఎంటీఎం, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంసీజే, ఎంఎల్ఐఎస్సీ, పీజీ డిప్లొమా ఇన్ సెరికల్చర్/క్లినికల్ బయోకెమిస్ట్రీ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ (కెమిస్ట్రీ/బయోటెక్నాలజీ/ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ), ఎంఎస్సీ (నానో సైన్స్/ నానోటెక్నాలజీ) దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 16, 2014 (రూ. 500 లేట్ ఫీజుతో ఏప్రిల్ 22, రూ.1000 లేట్ ఫీజుతో ఏప్రిల్ 26) రాత పరీక్షలు ప్రారంభం: మే 2 నుంచి వివరాలకు: www.kakatiya.ac.in యోగివేమన యూనివర్సిటీ-కడప ఆఫర్ చేస్తున్న కోర్సులు: ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ(బయోటెక్నాలజీ అండ్ బయోఇన్ఫర్మాటిక్స్, ఎర్త్ సైన్స్) పీజీ డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ ఎంఎస్సీ (బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బోటనీ-ప్లాంట్‌సైన్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, జెనెటిక్స్ అండ్ జెనోమిక్స్, మైక్రోబయాలజీ, ఫిజిక్స్, మెటీరియల్ సైన్స్ అండ్ నానోటెక్నాలజీ, మ్యాథమెటిక్స్, జియాలజీ, సైకాలజీ, జువాలజీ-యానిమల్ సైన్స్). ఎంకామ్, ఎంఈడీ, ఎంఏ (తెలుగు, ఎకన మిక్స్, ఇంగ్లిష్, హిస్టరీ అండ్ ఆర్కియాలజీ, పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్), ఎంపీఈడీ, ఎంసీజే క మ్యూనికేషన్ అండ్ జర్నలిజం. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 25, 2014 రూ.500 లేట్ ఫీజుతో రిజిస్ట్రేషన్:ఏప్రిల్ 26-మే 3, 2014 (దరఖాస్తుల అప్‌లోడ్‌కు చివరి తేదీ: మే 8) వివరాలకు: www.yogivemanauniversity.ac.in ఓయూ సెట్-2014 ఆఫర్ చేస్తున్న కోర్సులు: ఉస్మానియా యూనివర్సిటీతోపాటు తెలంగాణ, మహాత్మగాంధీ, పాలమూరు విశ్వవిద్యాలయాల్లో వివిధ పీజీ, పీజీ డిప్లొమా, ఐదేళ్ల పీజీ కోర్సుల్లో ప్రవేశం. వివిధ కోర్సుల్లో కలిపి మొత్తం సీట్ల సంఖ్య: 18,625 దరఖాస్తు: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫీజును ఏపీఆన్‌లైన్, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డిబిట్ కార్డుల ద్వారా చెల్లించవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ: మే 9, 2014. రూ.250 అపరాధ రుసుముతో: మే 16, 2014 ప్రవేశ పరీక్షలు: మే 30 నుంచి ప్రారంభం వివరాలకు: www.ouadmission.com www.osmania.ac.in కృష్ణా యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్న కోర్సులు: ఎంఏ, ఎంఎస్సీ, పీజీ డిప్లొమా ఇన్ ఈ-బ్యాంకింగ్, ఎంఈడీ, ఎంహెచ్ఆర్ఎం, ఎంకామ్. దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 18, 2014 రూ. 500 అపరాధ రుసుంతో: ఏప్రిల్ 20, 2014 రాత పరీక్ష తేదీ: ఏప్రిల్ 25, 2014 వివరాలకు: www.krishnauniversity.ac.in విజయం ఇలా అన్ని యూనివర్సిటీలు రాత పరీక్ష ఆధారంగానే ప్రవేశం కల్పిస్తున్నాయి. అధిక శాతం యూనివర్సిటీలు రాత పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తాయి. ఆయా యూనివర్సిటీలను బట్టి రాత పరీక్ష సిలబస్‌లో వ్యత్యాసం ఉంటుంది. ఆయా పరీక్షల్లో అడిగే ప్రశ్నలు డిగ్రీ సిలబస్ ఆధారంగానే ఉంటాయి. కొన్ని ప్రశ్నలు అవగాహనను పరీక్షించే విధంగా ఆప్లికేషన్ మెథడ్‌లో ఉంటే మరికొన్ని జ్ఞాపకశక్త్తిని పరీక్షించేలా ఉంటాయి. ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించిన అకడమిక్ పుస్తకాలను రిఫర్ చేయడం మంచిది. గత ప్రశ్నపత్రాలను విధిగా ప్రాక్టీస్ చేయాలి. మ్యాథమెటిక్స్, సెన్సైస్ విద్యార్థులు సూత్రాలు, సిద్ధాంతాలు, కెమికల్ ఈక్వేషన్స్‌ను ఎక్కువగా గుర్తుంచుకోవాలి. మిగతా విద్యార్థులు ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి ముఖ్యాంశాలను చదవాలి. డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాసి ఉంటారు కాబట్టి డిగ్రీ మొదటి, రెండో సంవత్సరం అంశాలపై అధికంగా దృష్టి సారించాలి. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం-తిరుపతి ఆఫర్ చేస్తున్న కోర్సులు: ఎంఎస్సీ(అప్లయిడ్ మ్యాథమెటిక్స్, అప్లయిడ్ మైక్రోబయాలజీ, మైక్రోబియల్ టెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, జనరల్ బయోటెక్నాలజీ, బోటనీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్). ఎంఏ (ఎకనామిక్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, తెలుగు లాంగ్వేజ్ లిటరేచర్ అండ్ ట్రాన్స్లేషన్, ఉమెన్స్ స్టడీస్, పబ్లిక్ రిలేషన్స్). ఎంఏ-మ్యూజిక్, బీఈడీ-స్పెషల్ ఎడ్యుకేషన్, ఎంసీజే, ఎంఈడీ-స్పెషల్ ఎడ్యుకేషన్, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంపీఈడీ, ఎంకామ్. దరఖాస్తుకు చివరి తేదీ: మే 10, 2014 రాత పరీక్ష: మే 25, 2014 వివరాలకు: రాయలసీమ యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్న కోర్సులు: ఎంఎస్సీ(బోటనీ, కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, జువాలజీ, ఓఆర్ అండ్ ఎస్‌క్యూసీ-స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ), ఎంఏ(తెలుగు, ఇంగ్లిష్, ఎకనమిక్స్), ఎంకామ్, ఎంఈడీ. దరఖాస్తు: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 21, 2014 రూ. 500 అపరాధ రుసుంతో రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: ఏప్రిల్ 22 నుంచి 25 వరకు, దరఖాస్తు అప్‌లోడ్‌కు చివరి తేదీ: ఏప్రిల్ 29, 2014 వివరాలకు: www.rayalaseemauniversity.ac.in -
కాసులుంటే క్లాసులు తీసుకోవచ్చు!
తల్లిదండ్రుల తర్వాత సమాజంలో గురువుకే ఎక్కువ ప్రాముఖ్యమిస్తారు. ఒకప్పుడు గురువుల ఎంపిక పారదర్శకంగా జరిగేది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. డబ్బు, కులం, హోదా ఉంటే చాలు అనర్హులనైనా అందలం ఎక్కించేస్తున్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఇదే పరిస్థితి దాపురించింది. అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాకముందే పైరవీలు సాగిస్తున్నారు. కాసులుంటే చాలు.. క్లాసులు తీసుకోవచ్చని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. దీన్ని పసిగట్టిన విద్యార్థులు శనివారం కదం తొక్కారు. యూనివర్సిటీక్యాంపస్, న్యూస్‌లైన్: రాయలసీమలో ఎస్వీ యూనివర్సిటీకి ఎనలేని పేరు ప్రతిష్టలు ఉన్నాయి. శ్రీనివాసుడి సన్నిధిలో ఉన్న ఈ విశ్వవిద్యాలయంలో చదివితే చదువుతో పాటు ఉన్నత పదవులు అలంకరించవచ్చని అందరూ భావిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ నానాటికీ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. అయితే అధ్యాపకుల కొరత వల్ల చదువులు కుంటుపడుతూ వచ్చాయి. దీన్ని గుర్తించిన ప్రభుత్వం ఇటీవల యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న 268 అధ్యాపక పోస్టులను భర్తీ చేసేందుకు ముందుకొచ్చింది. వీటి కోసం ‘కాసు’క్కూర్చున్న కొందరు అమాత్యులు తమదైన శైలిలో అధికారులపై ఒత్తిడి తెచ్చి నోటిఫికేషన్ విడుదల కాకముందే పోస్టులను కైవసం చేసుకోవాలని భావించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే సంబంధిత అధికారులపై ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. కులం, డబ్బు, హోదాల ప్రాతిపదికన భర్తీ చేసేందుకు సంబంధిత యూనివర్సిటీ అధికారులు పావులు కదపడంతో విషయం విద్యార్థుల దాకా వెళ్లింది. శనివారం వివిధ విద్యార్థి సంఘాల నాయకులు కదం తొక్కారు. అన్నమయ్య భవన్ ఎదుట ఆందోళనలు చేపట్టారు. అధ్యాపక పోస్టుల భర్తీలో అవినీతి,అక్రమాలు చోటు చేసుకుంటున్నాయంటూ వీసీ, రిజిస్ట్రార్‌పై మండిపడ్డారు. విద్యార్థుల మధ్య కుల చిచ్చురేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. అధ్యాపక పోస్టుల భర్తీ పారదర్శకంగా చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.