Supriya Sule
-
టార్గెట్ కాంగ్రెస్.. మమత రాజకీయం ఫలించేనా?
ముంబై: ప్రతిపక్ష ఇండియా కూటమిలో లుకలుకలు బయటపడుతున్నాయి. కూటమి పార్టీలకు పరస్పరం పొసగడం లేదు. ఈ నేపథ్యంలో కూటమి భవిష్యత్తు గురించి కొత్త చర్చ మొదలైంది. కూటమిలో అతి పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ తీరు పట్ల మిత్రపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. దీంతో, కూటమి నాయకత్వం మార్చాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో బెంగాల్ సీఎం మమతపై ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు చేశారు.ఎంపీ సుప్రియా సూలే తాజాగా మాట్లాడుతూ.. ఇండియా కూటమి బాధ్యతలు మమతా బెనర్జీ తీసుకుంటే మంచిదే. మమతా బెనర్జీ ఇండియా కూటమిలోనే ఉన్నారు. శక్తివంతమైన ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి పెద్ద పాత్ర ఉంది. అలాగే, బాధ్యత కూడా ఉంది. కాబట్టి మమత.. మరింత బాధ్యత తీసుకోవాలనుకుంటున్నారు. ఇది మంచి పరిణామం అని చెప్పుకొచ్చారు.మరోవైపు.. శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బెంగాల్లో బీజేపీకి అధికారం ఇవ్వకుండా మమతా బెనర్జీ పాలన కొనసాగిస్తున్నారు. మంచి సంక్షేమ పథకాలను అమలు చేసిన విజయవంతమైన మోడల్‌ను చూపించారు. ఆమె ఎన్నికల అనుభవం, పోరాట పటిమతో మోదీ సైతం తేలిపోయారు. ఇండియా కూటమి బాధ్యతలు ఆమె తీసుకోవడం మంచి పరిణామమే అవుతుంది. మా సీనియర్ నాయకులు కలిసి నిర్ణయం తీసుకుంటారు అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్ వరుస పరాజయాలను చవిచూడటం, ఒంటరిగా పోటీ చేయడంపై పలు పార్టీల నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పొత్తు ధర్మం పాటించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా మమత మాట్లాడుతూ..‘ఇండియా కూటమి తీరు సరిగా లేదు. కూటమి సారథ్య బాధ్యతలకు సిద్ధం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా, కూటమి అధినేతగా కొనసాగడం కష్టమేమీ కాదు. ఆ సామర్థ్యం నాకుంది. విపక్షాలను ఒక్కతాటిపైకి తెచ్చి కూటమి ఏర్పాటు చేశా. ప్రస్తుత సారథులు దాన్ని సమర్థంగా నడిపించగలరో లేదో వాళ్లే చెప్పాలి. లేదంటే ప్రత్యామ్నాయం చూడాలి. అందరినీ కలుపుకొని ముందుకెళ్లాలన్నదే నా సూచన అని చెప్పారు. అయితే, ఇండియా కూటమిలో మమతా బెనర్జీకి ఇప్పటికే పలు పార్టీల నేతలు మద్దతుగా నిలిచారు. దీంతో, మమతకే బాధ్యతలు ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు.. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ఎదురు నిలిచి మమత విజయాలు సాధించడం కూడా ఆమె నాయకత్వానికి బలం చేకూరుస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ను టార్గెట్ చేసి.. ఇండియా కూటమిలో మమత రాజకీయం ఎలా ఉండనుంది అనేది ఆసక్తికరంగా మారింది. కూటమిలో మెజార్టీ నేతలు ఆమె నాయకత్వాన్ని అంగీకరిస్తారా అనే చర్చ నడుస్తోంది. -
మహారాష్ట్రలో వేల కోట్ల బిట్‌కాయిన్ స్కాం కలకలం.. సుప్రీం కీలక ఆదేశాలు
ముంబై : మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రూ.6,600 కోట్ల బిట్ కాయిన్ స్కాం కలకలం రేపుతోంది. ఈ స్కాంలో పలువురి రాజకీయ నాయకుల హస్తం ఉందంటూ పలు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు సైతం కేసు విచారణ చేపట్టేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో సీబీఐ రంగంలోకి దిగింది. అయితే, ఈ బిట్ కాయిన్ స్కాంలో మహరాష్ట్ర కాంగ్రెస్, ఎన్సీపీ(ఎస్పీ)కి చెందిన పేర్లు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన జరిగిన లావాదేవీల్లో మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే, ఎన్సీపీ (ఎస్పీ)ఎంపీ సుప్రియా సూలే బిట్కాయిన్లను ఉపయోగించారంటూ మాజీ పోలీసు అధికారి రవీంద్ర పాటిల్ సంచలన ఆరోపణలు చేశారు.అందుకు ఊతం ఇచ్చేలా మహరాష్ట్ర పోలింగ్‌కు ఒక రోజు ముందు అంటే నిన్న (నవంబర్19) బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ సుధాన్షు త్రివేది ప్రెస్మీట్లో ఆధారాల్ని బహిర్ఘతం చేశారు. వాటిలో కాల్ రికార్డింగ్‌లు, వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్లు ఉన్నాయి. తాను బహిర్ఘతం చేసిన ఆధారాల్లో ఒక ఆడియో క్లిప్‌లో సుప్రియా సూలే వాయిస్ బయటికి వచ్చిందని ఆరోపించారు. అంతేకాదు, మహరాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సైతం ఆ ఆడియోలో ఉన్నది తన చెల్లెలు సుప్రియా సూలే వాయిస్ అని ధృవీకరించడం సంచలనం రేపుతోంది.కాగా, బిట్ కాయిన్ స్కాంపై విచారణ చేపట్టేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. పూర్తి స్థాయి విచారణ తర్వాత ఈ బిట్ కాయిన్ స్కాం ఏ మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది. -
సుప్రియా సూలేపై క్రిప్టోకరెన్సీ ఆరోపణలు.. కొట్టిపారేసిన ఎంపీ
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రతిపక్ష ఎంపీ సుప్రియా సూలేపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. క్రిప్టోకరెన్సీ కుంభకోణంలో ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) చీఫ్ శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే, మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే ప్రమేయం ఉన్నట్లు బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది ఆరోపించారు. అయితే బీజేపీ ఆరోపణలను ఎంపీ సుప్రియా సూలే బుధవారం తోసిపుచ్చారు. బీజేపీ ఎంపీ విలేకరుల సమావేశంలో ప్లే చేసిన ఆడియో క్లిప్‌లో ఉన్న వాయిస్ తనది కాదని, అవన్నీ కిలీవని పేర్కొన్నారు.కాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు సుప్రియా సూలే, మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే, మాజీ పోలీస్ కమిషనర్ ఓ డీలర్‌తో కలిసి అక్రమ బిట్‌కాయిన్ లావాదేవీలకు పాల్పడిందని బీజేపీ ఆరోపించింది. ఈ మేరకు బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది విలేకరుల సమావేశంలో కొన్ని ఆడియో క్లిప్‌లను ప్లే చేశారు. క్రిప్టో కరెన్సీ కుంభకోణంలో వీరికి ప్రమేయం ఉందని, ఎన్నికల ప్రచారానికి నిధుల కోసం ఇద్దరు నేతలు బిట్‌కాయిన్ మానిప్యులేషన్‌ను ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. క్రిప్టోకరెన్సీ లావాదేవీల ద్వారా లభించిన నగదును మహారాష్ట్రలో ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో వినియోగిస్తున్నారని పాటిల్ ఆరోపించారు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి అవకతవకలు జరిగాయని ఆయన అన్నారు.#WATCH | Baramati: On allegations against her and Nana Patole, NCP-SCP MP Supriya Sule says "Yesterday, all these voice recordings were sent to me by the media. The first thing I did was to call the Commissioner of Pune and tell him that some fake videos were running and I wanted… pic.twitter.com/vhoNS3vxLr— ANI (@ANI) November 20, 2024బుధవారం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటు వేసిన సుప్రియా సూలే.. బీజేపీ ఆరోపణలపై స్పందించారు. ‘అది నా వాయిస్ కాదు. ఆ వాయిస్ నోట్స్, మెసేజ్‌లన్నీ నకిలీవి’ అని స్పష్టం చేశారు.. ఆమె మాట్లాడుతూ.. ఇది తన వాయిస్ లేదా నానా పటోలేది కాదని తెలిపారు. తన పేరు మీద నకిలీ వాయస్ సృష్టించారని, దీనికి వెనక ఉన్నవారిని పోలీసులు పట్టుకుంటారని తెలిపారు.‘నేను బిట్‌కాయిన్, క్రిప్టో కరెన్సీకి వ్యతిరేకంగా మాట్లాడాను. దాని గురించి తీవ్రమైన సమస్యలను లేవనెత్తిన వ్యక్తిని నేను. వాటికి (బీజేపీ) సమాధానం ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను పూర్తి పారదర్శకతను విశ్వసించే వ్యక్తిని కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను. బీజేపీ అడిగిన ఏ ప్రశ్నకైనా సమాధానం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దీనిపై పుణె కమిషనర్‌కు ఈ ఆడియోలు, వీడియోలు పంపించి.. సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశాను. మహారాష్ట్ర పోలీసులపై నాకు నమ్మకం ఉంది. రుజువు లేకుండా ఆరోపణల ఆధారంగా అరెస్టు చేయరని భావిస్తున్నానని తెలిపారు.సుధాన్షు త్రివేదికి పరువు నష్టం నోటీసులు పంపినట్లు తెలిపారు.. ‘నా లాయర్ల ద్వారా సుధాన్షు త్రివేదికి క్రిమినల్ పరువు నష్టం నోటీసులు పంపాను. సుధాన్షు త్రివేదిి ఏ ఊరిలో కావాలన్నా, ఏ ఛానెల్లో కావాలన్నా, ఏ సమయంలో కావాలన్నా, ఎక్కడికి పిలిచినా నేను వచ్చి సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాను. నేను లేదు, అబద్ధాలు, ఆరోపణలన్నీ అబద్ధం అని సమాధానం ఇస్తాను’ అని ఆమె అన్నారు. -
‘ఢిల్లీకి వెళ్లడం ఇష్టంలేని అజిత్ దాదా మాత్రమే తెలుసు’
ముంబై: తన సోదరుడు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తరచూ ఢిల్లీకి పర్యటించటంపై ఎన్సీపీ( ఎస్పీ) నాయకురాలు సుప్రియా సూలే వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లడానికి ఇష్టపడని తన సోదరుడు గుర్తుకువస్తున్నారని అన్నారు. నవంబర్ 20న జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్సీపీ అధినేత అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్ మంగళవారం న్యూఢిల్లీకి వెళ్లారు. అజిత్ పవార్ తరచూ ఢిల్లీకి వెళ్లటంపై మీడియా అడిగిన ప్రశ్నకు సుప్రియా సూలే స్పందించారు.‘‘ఢిల్లీకి వెళ్లడానికి ఎప్పుడూ ఇష్టపడని అజిత్ దాదా మాత్రమే నాకు గుర్తున్నారు. కొన్ని నెలలు నేను ఆయనతో టచ్‌లో లేను. ఆయన ఢిల్లీకి ఎందుకు వెళ్లారో నాకు తెలియదు. ఆయన ఢిల్లీకి ఎందుకు వచ్చారో నేను సమాధానం చెప్పలేను’’ అని అన్నారు.మరోవైపు.. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహాయుతి కూటమి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకానికి సంబంధించిన ఒప్పందం దాదాపు ఖరారు చేసినట్లు అజిత్ పవార్ మంగళవారం తెలిపారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుత కూటమి సీట్ల పంపకం కొలిక్కి వచ్చింది. బీజేపీ 152-155 సీట్లు, శివసేన (షిండే) 78-80 సీట్లు, ఎన్సీపీ( అజిత్ పవార్)కు 52 నుంచి 54 సీట్లలో పోటీచేసేలా ఒప్పందానికి వచ్చినట్లు తెలిసింది. బీజేపీ ఇప్పటికే 99 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. శివసేన( షిండే) 45 మందితో మంగళవారం తొలి జాబితా విడుదల చేసింది. -
అజిత్‌పవార్‌పై సుప్రియాసూలే ఆసక్తికర వ్యాఖ్యలు
ముంబయి: ఎన్సీపీ పగ్గాలు తన కజిన్ అజిత్ పవార్‌కు ఇచ్చేందుకు పార్టీ సిద్ధమైనప్పటికీ ఆయన తమను వీడి వెళ్లారని, ఇబ్బందులకు గురిచేశారని ఎంపీ సుప్రియాసూలే అన్నారు. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో సూలే ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘అడిగితే అన్ని ఇచ్చేవాళ్లం. ఎన్సీపీ లీడర్‌ను చేసే వాళ్లం. కానీ ఆయన ఏదో ఊహించుకుని పార్టీవీడి వెళ్లారు. మా జీవితాలను ఇబ్బందుల పాలు చేశారు. ఇది వారసత్వ సమస్య కానేకాదు. ఎన్సీపీకి నాయకత్వం వహించేందుకు నేను ఆయనకు పోటీ రాలేదు. ఇది కేలం కూటమి సమస్య. ఆయన బీజేపీ, శివసేన కూటమితో వెళ్లాలనుకున్నందున వెళ్లిపోయారు’అని సూలే వివరించారు. ఈ విషయంలో అజిత్ పవార్‌తో తాను బహిరంగ చర్చకు సిద్ధమని సూలే సవాల్ విసిరారు. కాగా, శరద్‌పవార్ నేతృత్వంలో నడుస్తున్న ఎన్సీపీలోని ఎక్కువ మంది ఎమ్మెల్యేలతో వేరు కుంపటి పెట్టుకున్న అజిత్ పవార్ బీజేపీ, శివసేన ప్రభుత్వంలో చేరి డిప్యూటీ సీఎం అయిన విషయం తెలిసిందే. తర్వాతి పరిణామాల్లో అసలైన ఎన్సీపీని కూడా అజిత్ పవార్ కైవశం చేసుకున్నారు. -
తండ్రికి వెన్నుపోటు పొడవడం తగదు : డిప్యూటీ సీఎం
మీ రాజకీయ లబ్ధి కోసం తండ్రికి వెన్నుపోటు పొడవడం తగదు అంటూ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ మరోసారి ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు.మహరాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల ప్రచారంలో భాగంగా అజిత్ పవార్ జన సమ్మాన్ యాత్ర నిర్వహిస్తున్నారు. ఆ యాత్రలో..రాష్ట్ర మంత్రి ధర్మారావు బాబా ఆత్రం, ఆయన కుమార్తె భాగ్యశ్రీ గురించి మాట్లాడారు. భాగ్యశ్రీ తండ్రి ప్రత్యర్ధి పార్టీ శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పి)లోకి వెళ్తున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అంతేకాదు తండ్రి ధర్మారావు బాబా ఆత్రంపై కుమార్తె భాగ్యశ్రీ పోటీ చేస్తుందన్న ప్రచారం మొదలైంది. ఆ ప్రచారంపై అజిత్ పవార్ స్పందించారు. ‘ తండ్రిపై కుమార్తె పోటీ చేయడం ఎంత వరకు కరెక్ట్. కూతురిని తన తండ్రి కంటే ఎక్కువగా ఎవరూ ప్రేమించరు. పెళ్లి చేసుకుని భాగ్యశ్రీ బెల్గాం వెళ్లినప్పటికీ..గడ్చిరోలిలో ఆమెకు (తండ్రి ఆత్రం) అండగా నిలిచి జిల్లా పరిషత్ అధ్యక్షురాలిని చేశారు. ఇప్పుడు మీరు (భాగ్యశ్రీ) మీ తండ్రికి వెన్నుపోటు పొడిచి ఆయన మీదే పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. మీ నిర్ణయం సరైందేనా? అని ప్రశ్నించారు. ‘ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మీరు మీ తండ్రికి మద్దతు ఇవ్వండి. అతనిని గెలిపించండి. ఎందుకంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే సామర్థ్యం , సంకల్పం ఆయనకు మాత్రమే ఉంది. కుటుంబంలో చీలికలు రావడాన్ని సమాజం అంగీకరించదు. నా విషయంలోనూ ఇదే జరిగింది. లోక్ సభ ఎన్నికల్లో బారామతి స్థానం నుంచి తన సోదరి సుప్రియ సూలేపై తన భార్య సునేత్ర పవార్‌ను పోటీకి దింపి ఉండాల్సింది కాదు. నేను తప్పు చేశా. చేసిన తప్పును ఇప్పుడు ఒప్పుకుంటున్నా’ అని అన్నారు.అజిత్ పవార్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇది రెండో సారి. కొద్ది రోజుల క్రితం ఇలాగే మాట్లాడారు. ఇటీవల మహరాష్ట్ర లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో శరద్ పవార్ తన అనుభవాన్ని రంగరించి, తన వర్గం ఎన్సీపీ (ఎస్పీ) పోటీ చేసిన 10 సీట్లలో ఎనిమిది స్థానాలను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు. అయితే, ఆ ఎన్నికల్లో బారామతి లోక్‌సభ స్థానం నుంచి శరద్ పవార్ ఎన్సీపీ తరుఫున సుప్రీయా సూలే బరిలో దిగగా..అదే స్థానంలో సుప్రియా సూలేపై అజిత్ పవార్ ఎన్సీపీ తరుఫున ఆయన భార్య సునేత్ర పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత సునేత్ర రాజ్యసభకు నామినేట్ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో అజిత్ పవార్ పార్టీ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతుండగా.. మహరాష్ట్ర అధికార కూటమి నుంచి అజిత్ పవార్‌ను బీజేపీ పక్కన పెట్టేస్తుందంటూ వ్యక్తమవుతున్న అభిప్రాయాల నడుమ అజిత్ పవార్ ఇలా మాట్లాడుతుండడం గమనార్హం. -
బంధాలు, బిజినెస్ ఒకటి కాదు.. అజిత్ పవార్‌కు సోదరి కౌంటర్
ఎన్సీపీ(శరద్చంద్ర పవార్) ఎంపీ సుప్రియా సూలే.. తన సోదరుడు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో రాష్ట్రప్రభుత్వానికి తమ ప్రియమైన సోదరీమణులను గుర్తుకు రాలేదు కానీ.. అసెంబ్లీ ఎన్నికల వేళ వారి ప్రేమ పొంగిపొర్లుతుందని సెటైర్లు వేశారు.కాగా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బారామతి స్థానం నుంచి సోదరి సుప్రియా సోలే మీద పోటీకి తన భార్య సునేత్ర పవార్‌ను నిలబెట్టినందుకు బాధపడుతున్నట్లు అజిత్ పవార్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు సుప్రియా తన సోదరుడికి కౌంటర్ ఇచ్చింది.ఆమె మాట్లాడుతూ.. బంధాలు, వ్యాపారం మధ్య తేడాను మన సోదరులు గుర్తించలేకపోతున్నారు. ఎవరూ కూడా బంధాల మధ్యలోకి డబ్బును తీసుకురాకూడదు. అదే విధంగా వ్యాపారంలోకి సంబంధాలను లాగకూడదు. అయితే మా సోదరుడు దీనిని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాడు. ఇది మాకు చాలా బాధ కలిగిస్తోంది.’ అని అన్నారు.అంతేగాక రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల పట్ల నిజమైన ప్రేమ లేదని, ఎన్నికల లబ్ధి కోసం సంక్షేమ పథకాలను సాధనాలుగా వాడుకుంటుందని విమర్శించారు.‘ఈ ప్రభుత్వం ఏం చేసిన ఓట్ల కోసమే. మంచిఉద్దేశ్యంతో ఏం చేయదు. ఇదీ లోక్‌సభ ఎన్నికల ప్రభావం. రెండేళ్ల క్రితం అక్కాచెల్లెళ్లపై ఎవ్వరూ అభిమానం చూపలేదు. ఇది కేవలం లోక్‌సభ ఎన్నికల ప్రభావం మాత్రమే’ నని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలోని ‘లడ్కీ బహిన్’ స్కీమ్‌ను ఉద్ధేశించి చేసినట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి వల్లనే మహిళలకు నెలకు రూ.1,500 ఇచ్చే ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని దుయ్యబట్టారు -
సుప్రియపై భార్యను నిలబెట్టి తప్పు చేశా: అజిత్ పవార్
ముంబై: కుటంబాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలను ఇంటి వరకు రానివ్వకూడదని ఆయన అన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బారామతి స్థానం నుంచి తన భార్యను, సోదరి సుప్రియా సులేకు వ్యతిరేకంగా నెలబెట్టి తప్పు చేశానని పేర్కొన్నారు,.రాష్ట్రవ్యాప్తంగా 'జన్ సమ్మాన్ యాత్ర' చేపట్టిన ఉన్న అజిత్ పవార్ ఒక మరాఠీ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో సునేత్రాను(అజిత్ భార్య) పోటీ చేయించాలనే నిర్ణయం ఎన్సీపీ పార్లమెంటరీ బోర్డు తీసుకున్న నిర్ణయమని అన్నారు."నేను నా సోదరీమణులందరినీ ప్రేమిస్తాను. రాజకీయాలను ఇంట్లో వరకు రానివ్వకూడదు. నా సోదరిపై సునేత్రను పోటీకి దింపి నేను తప్పు చేశాను. ఇది జరిగి ఉండకూడదు. కానీ పార్లమెంటరీ బోర్డు (ఎన్సీపీ) ఈ నిర్ణయం తీసుకుంది. అది తప్పు అని ఇప్పుడు నేను భావిస్తున్నాను’ అని అజిత్ పవార్ అన్నారు.కాగా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అజిత్ పవార్ భార్య సునేత్రపై సుప్రియా సూలే 1.5 లక్షల ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. బారామతి స్థానం నుంచి వరుసగా నాలుగోసారి ఆమె గెలుపొందారు. సుప్రియా సూలే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె. ఇదిలా ఉండగా ఎంపీ ఎన్నికల్లో ఓటమి తర్వాతత సునేత్ర పవార్ జూన్ 18న రాజ్యసభకు ఎన్నికయ్యారు. -
నా ఫోన్ హ్యాక్ అయింది: ఎంపీ సుప్రియా సూలే
ముంబై: ఎన్సీపీ( శరద్ పవార్) ఎంపీ సుప్రియా సూలే తన మొబైల్ ఫోన్, వాట్సాప్ హ్యాక్ అయినట్లు తెలిపారు. ఆదివారం ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని ఆమె వెల్లడించారు. ‘అర్జెట్: నా మొబైల్ ఫోన్, వాట్సాప్ హ్యాక్ అయింది. దయచేసి బారామతి ప్రజలు ఎవరూ నాకు కాల్స్ లేదా సందేశాలు చేయోద్దు’. నేను మొబైల్ హ్యాక్‌కు సంబంధించి పోలీసు స్టేషన్‌కు వెళ్లి సాయం కోరాను’ అని తెలిపారు. మరోవైపు.. ప్రహార్ జనశక్తి పార్టీ (పీజేపీ) అధ్యక్షుడు, అధికార మహాయుతి మిత్రపక్షం ఎమ్మెల్యే ఓంప్రకాష్ అలియాస్ బచ్చు కడు శనివారం పూణెలో ఎన్సీపీ( శరద్ పవర్ వర్గం) చీఫ్ శరద్ పవార్‌ను కలిశారు.శరద్ పవార్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికార మహాయుతితో ఉండాలా.. లేదా కూటమి నుంచి వైదొలుగాలా? అనే విషయంఐ సెప్టెంబర్ 1న నిర్ణయం తీసుకుంటానని అన్నారు. దీనిపై ఎంపీ సుప్రియా సూలే స్పందిస్తూ.. దివ్యాంగుల రాజకీయ సిద్ధాంతాలు భిన్నమైనప్పటికీ వారి పక్షాన కడు కృషి చేశారని కొనియాడారు. అదేవిధంగా రాష్ట్రాభివృద్ధికి అందరూ ఏకం కావాలని ఆమె కోరారు. -
‘హిందీయేతర ప్రసంగాలపై వివక్ష’.. ఖండించిన సంసద్ టీవీ
ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలను ప్రసారం చేసే ‘సంసద్ టీవీ’ హిందీలో మాట్లాడని ఎంపీలపై వివక్ష చూపుతోందని ఎన్సీపీ( శరద్ పవార్) ఎంపీ సుప్రియా సూలే సోమవారం ఆరోపణలు చేశారు. ఆమె చేసిన ఆరోపణలపై తాజాగా సంసద్ టీవీ స్పందించింది.‘ఎంపీ సుప్రియా సూలే చేసిన ఆరోపణలు సత్యం లేదు. పార్లమెంట్ కార్యకలాపాలను ఎంపీలు మాట్లాడిన భాషలోనే ప్రసారం చేస్తున్నాం. అయితే వినేవారి సౌలభ్యం కోసం హిందీ, ఇంగ్లీష్, ఇతర ప్రాంతీయ భాషల్లో వినే ఆప్షన్ కల్పించాం. ఎంపీలు కూడా సభలో కూర్చొని.. పార్లమెంట్ కార్యకలాపాలను వినవచ్చు’అని ‘ఎక్స్’లో పేర్కొంది.సోమవారం పార్లమెంట్ సమావేశాల ప్రరంభం అయ్యాయి. ఈ సందర్భంగా పార్లమెంట్ కార్యకలాపాల ప్రచారంలో సంసద్ టీవీ హిందీ మాట్లాడని ఎంపీలపై వివక్ష చూపుతోందని ‘ఎక్స్’ వేదికగా ఆరోపణలు చేశారు.‘పార్లమెంట్ సమావేశాల్లో లోక్‌సభ తొలి సెషన్లోనే సంసంద్ టీవీ ఇంగ్లీష్, ప్రాంతీయ భాషల్లో మాట్లాడే ఎంపీల ప్రసంగాలను హిందీ వాయిస్ ఓవర్ ఇస్తోంది. ఇలాంటి భయంకరమైన చర్యలకు సంసద్ టీవీ పాల్పడుతోంది. సంసద్ టీవీ హిందీలో ప్రసంగించని ఎంపీలపై వివక్ష చూపుతోంది. ఇతర భాషలతో పోల్చితే.. ఒక భాషకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ఇలా చేయటం భారత సమాఖ్యవాదాన్ని సవాల్ చేయటమే...ప్రాంతీయ, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడే ఎంపీల ప్రసంగాలకు హిందీ వాయిస్ ఓవర్ ఇవ్వటం, సెన్సార్షిప్ విధించటం వల్ల హిందీ మాట్లాడనివారి హక్కులను కాలరాయటమే. ప్రభుత్వం వెంటనే ఇలా ప్రసారం చేయటాన్ని నిలిపివేయాలి. ఇది పూర్తి వివక్ష, సమాఖ్యవాద వ్యతిరేక విధానం’అని ఆరోపణలు చేశారు.2023లో కూడా సంసద్ టీవీపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ మాట్లాడే క్రమంలో అధిక శాతం స్పీకర్‌ను చూపించారని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ విమర్శలు గుప్పించారు. ఉద్దేశపూర్వంగా విపక్షాల స్క్రీన్ టైంను సంసద్ టీవీ తగ్గించి ప్రసారం చేసినట్లు ఆరోపణులు చేశారు. -
పూణే కారు ప్రమాదంలో ఊహించని ట్విస్ట్
పూణే: పుణేలో విలాసవంతమైన పోర్షే కారు ప్రమాదం కేసులో ఇప్పటికే పలు ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరో ఊహించని ట్విస్ట్ బయటకు వచ్చింది. కారు ప్రమాదానికి గురైన సమయంలో కారు నడిపింది తన కొడుకు కాదని.. కారును నడిపింది తమ డ్రైవర్ అని మైనర్ బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్ పేర్కొన్నారు. దీంతో, ఈ కేసు మరో మలుపు తిరిగింది.కాగా, పూణేలో ఓ మైనర్ మద్యం మత్తులో ఫుల్ స్పీడ్‌లో పోర్షే కారును నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి ఓ బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. కాగా, పోర్శే కారును మైనర్(17) నడిపాడని ఇప్పటివరకు పోలీసులు భావించారు. అతడిపైనే కేసు నమోదైంది. ప్రస్తుతం జువైనైల్ సెంటర్‌కు మైనర్‌ను తరలించారు. కాగా, ఈ ప్రమాదం జరిగినప్పుడు కారును నడిపింది తమ డ్రైవర్ అని మైనర్ బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్ పేర్కొన్నారు. #Pune Porsche Car accident case: Accused Vishal patil, pub owner and driver shifted to jail after interrogation #porsche #porschecaraccidentinpune #pune #punecity #punenews #agrwal #kalyaninagar #accidentcase #accused #news #theupdatejuntionhttps://t.co/jGhBOiql24 pic.twitter.com/ep6fpeE5I2— The Update Junction (@TUJunction) May 23, 2024 ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్న మైనర్ బాలుడి స్నేహితులు ఇద్దరు కూడా కారును డ్రైవరే నడిపాడని తెలిపారు. ప్రమాద సమయంలో తానే కారును నడిపానని డ్రైవర్ కూడా పోలీసుల ముందు అంగీకరించాడు. దీంతో కేసు కొత్త మలుపు తీసుకుంది. అయితే, కేసు నుంచి మైనర్‌ను తప్పించేందుకే డ్రైవర్‌ను ఇరికిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు.. నిందితుడు వేదాంత్ అగర్వాల్ కన్నీరు పెడుతున్న వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై నిందితుడి తల్లి శివానీ అగర్వాల్ స్పందించారు. ఈ సందర్భంగా తన కుమారుడిని రక్షించాలని కన్నీరుపెట్టుకున్నారు. కాగా, ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ఇది ఫేక్ వీడియో అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడికి కఠిన విధించాలని డిమాండ్ చేస్తున్నారు. PUNE PORSCHE CAR ACCIDENT A FAKE RAP VIDEO has been circulating online, claiming to be accused minor Vedant AggarwalNow, his mother, Shivani Aggarwal, has put out a clarification video seeking protection for her son(Use headphones - very strong language) pic.twitter.com/8iLh2Cq0Ku— Arnaz Hathiram (@ArnazHathiram) May 24, 2024 ఇక, ఈ ఘటనపై ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే స్పందించారు. ఈ సందర్భంగా సుప్రియా సూలే మాట్లాడుతూ.. మైనర్‌కు మద్యం సరఫరా చేయడంతో పుణేలో డ్రంకెన్ డ్రైవ్ కారణంగా ఘోర ప్రమాదం జరిగింది. డ్రగ్స్ స్వాధీనం, మైనర్లకు మద్యం సరఫరాలు, డ్రంకెన్ డ్రైవ్ జరుగుతుంటే మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది. పోలీసులపై ఒత్తిడి తెస్తున్నది ఎవరు?. మహారాష్ట్ర ప్రభుత్వం రాజకీయ పార్టీలను, కుటుంబాలను చీల్చడంలో నిమగ్నమైందని విమర్శించారు. పుణే ఘటనకు బాధ్యులు ఎవరని ఏక్నాథ్ షిండే సర్కార్‌ను ఆమె ప్రశ్నించారు. దీంతో, ఆ ఘటన రాజకీయంగా కూడా హాట్ టాపిక్‌గా మారింది. -
ఈవీఎంల భద్రతపై సుప్రియా సూలే సంచలన ట్వీట్
ముంబై: లోక్‌సభ ఎన్నికల వేళ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెసిన్(ఈవీఎం)ల భద్రతపై ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే సంచలన ఆరోపణలు చేశారు. తాను పోటీచేసిన బారామతి నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్లో సీసీ కెమెరాలు సోమవారం ఉదయం 45 నిమిషాల పాటు నిలిచిపోయాయని తెలిపారు.దీనికి సంబంధించి ఆమె సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్టు చేశారు. సీసీటీవీ కెమెరాలు ఆగిపోవడం పూర్తి అనుమానాస్పద ఘటన అని సూలే పేర్కొన్నారు.‘బారామతి ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్ సీసీ కెమెరాలు సోమవారం ఉదయం పనిచేయలేదు. ఇది పూర్తి భద్రతా ఉల్లంఘనా చర్య. దీనిపై ఎన్నికల అధికారులను సంప్రదిస్తే వారి నుంచి సంతృప్త సమాధానాలేవీ రాలేదు.దీనికి తోడు సీసీకెమెరాలు రిపేర్ చేసే టెక్నీషియన్ కూడా ఆ ప్రాంతంలో అందుబాటులో లేడు’అని సూలే తెలిపారు. -
బారామతిలో అలాంటి పనులు పనిచేయవు: అజిత్ పవార్
మహారాష్ట్రలో కీలకమై బారామతి పార్లమెంట్ స్థానంలో పవార్ వర్సెస్ పవార్ పోటీ నెలకొంది. మూడో దశలో మే 7(మంగళవారం) బారామతిలో పోలింగ్ జరగనుంది. ఆదివారంతో ఇక్కడ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నేపథ్యంలో పూణె జిల్లాలోని బారామతిలో నిర్వహించిన ఓ ర్యాలీలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ‘వికాస్ పురుష్’అంటూ ప్రశంసలు కురిపించారు. అదే విధంగా ఇటీవల తన మేనల్లుడు రోహిత్ పవార్‌పై విమర్శలు చేశారు. సిట్టింగ్ ఎంపీ, ఎన్సీపీ (శరద్ చంద్ర పవార్) అభ్యర్థి సుప్రియా సూలే తరఫున ప్రచారం చేస్తూ రోహిత్ పవార్ భావోద్వేగానికి గురైన విషయాన్ని ప్రస్తావించారు.‘నీ భావోద్వేగాలతో కొంతమంది ఆడుకుంటారని చెప్పాను. కానీ, అలాంటి పనులు బారామతిలో పని చేయవు. విమర్శలు చేయడానికి ప్రయత్నం చేయను. అభివృద్ధి కోసం నిరంతరం పని చేయటానికే నా తొలి ప్రాధన్యం. ఇప్పటివరకు చాలా ప్రచార ర్యాలీలో పాల్గొన్నా. కానీ, ఇంత పెద్దసంఖ్యలో అభిమానులు, జనాలను చూడలేదు. ఇదంతా చూస్తే.. మన గెలుపు ఖాయమని అర్థమవుతోంది. రాజకీయాలు నేర్పింది నేనే అని చెప్పే రోహిత్.. ఇప్పడు నాపై విమర్శలు చేస్తున్నాడు. అయినా నేను వాటిని పట్టించుకోను. అభివృద్ధి కోసం పనిచేయటమే నా తొలి ప్రాధాన్యం’ అని అజిత్ పవార్ అన్నారు. అదేవిధంగా ‘ప్రధాని మోదీ భారత దేశానికి వికాస్ పురుష్. ఈ లోక్‌సభ ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. బారామతి గత 15ఏళ్లగా ఎటువంటి నిధులు పొందలేదు. కానీ, ప్రస్తుతం 2499 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు నిధలు అనుమతులు పొందాయి’ అని అజిత్ పవార్ వెల్లడించారు. ఇక.. ఇటీవల సుప్రియా సూలేకు మద్దతుగా ఓ ర్యాలీలో పాల్గొన్న రోహిత్ ప్రవార్ ప్రసంగిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘‘పార్టీ రెండుగా చీలినప్పుడు నేను పార్టీ కార్యకర్తలతో కలిసి శరద్ పవార్‌ను కలిశాను. మేము, కుటుంబం అండగా ఉంటామని తెలిపాను’’ అని ఒకింత భావోద్వేగంతో మాట్లాడారు. -
వదినకు రూ.35 లక్షలు బాకీ.. ప్రత్యర్థుల రుణానుబంధం!
పుణె: బారామతి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు సంబంధించిన ఆసక్తికర విషయం వెల్లడైంది. ఇక్కడి నుంచి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరత్ పవార్) అభ్యర్థి సుప్రియా సూలే తన వదిన, ప్రస్తుత ఎన్నికలలో తన ప్రత్యర్థి సునేత్రా పవార్‌కు రూ. 35 లక్షలు బాకీ ఉన్నారు. అలాగే మేనల్లుడు పార్థ్ పవార్‌కు రూ. 20 లక్షలు అప్పున్నారు. తాజాగా ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లో వివిధ సంస్థలు, వ్యక్తులకు చెల్లించాల్సిన అప్పుల వివరాలను సుప్రియా సూలే పేర్కొన్నారు. అదే రోజున ఆమె ప్రత్యర్థి, ఎన్సీపీ అజిత్ వర్గం అభ్యర్థి సునేత్ర పవార్ సమర్పించిన అఫిడవిట్లో కూడా ఈ వివరాలు ప్రతిబింబించాయి. సుప్రియా సూలేకి రూ.35 లక్షలు, ఆమె తల్లి, శరద్ పవార్ సతీమణి అయిన ప్రతిభా పవార్‌కి రూ.50 లక్షలు రుణం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఎలక్షన్ అఫిడవిట్ల ప్రకారం... సుప్రియా సూలే ఆస్తుల విలువ రూ.43.51 కోట్లు కాగా, ఆమె భర్త మొత్తం ఆస్తులు రూ.131 కోట్లుగా ఉన్నాయి. ఇక సునేత్ర పవార్ రూ. 70.95 కోట్ల విలువైన మొత్తం సంపదను వెల్లడించగా, ఆమె భర్త, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ రూ.50.40 కోట్ల ఆస్తులను కలిగి ఉన్నారు. సుప్రియా సూలే వ్యాపారవేత్త సదానంద్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
సుప్రియా సులే ఆల్‌రౌండర్
శరద్ పవార్ వంటి రాజకీయ దిగ్గజానికి ఏకైక సంతానం. గారాలపట్టి. అలా తండ్రి నీడలోనే రాజకీయాల్లో ప్రవేశించినా తొందర్లోనే బలమైన నాయకురాలిగా ఎదిగి తనదైన ముద్ర వేశారు సుప్రియా సులే. బారామతి ఎంపీ, ఎన్సీపీ (ఎస్పీ) వర్కింగ్ ప్రెసిడెంట్. కానీ తాను సాధారణ పార్టీ కార్యకర్తనే అని గర్వంగా చెప్పుకుంటారు. అంతకుముందు జర్నలిస్టుగా సామాజిక సమస్యలపై లోతైన అవగాహన పెంచుకున్నారు. ఊపిరి సలపని రాజకీయాల నడుమ కూడా కుటుంబానికి చాలా ప్రాధాన్యమిస్తారు. ఆల్‌రౌండర్ గా అన్ని పాత్రలకూ సమ న్యాయం చేస్తుంటారు. ఉత్తమ పార్లమెంటేరియన్ పుట్టిందే రాజకీయ కుటుంబం. దాంతో చిన్నప్పట్నుంచే రాజకీయ వ్యవహారాలపై సుప్రియకు లోతైన అవగాహన ఉంది. అయినా తొలుత రాజకీయాలను కెరీర్‌గా ఎంచుకోలేదు. కొంతకాలం జర్నలిస్టుగా చేశారు. పెళ్లి తర్వాత పదేళ్లు విదేశాల్లోనే ఉన్నారు. తండ్రి, మామ అనారోగ్యం బారిన పడటంతో తిరిగొచ్చారు. 2006లో రాజకీయ రంగప్రవేశం చేసి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బారామతి లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తండ్రి రాజ్యసభకు వెళ్లడంతో 2009 ఎన్నికల్లో అక్కడ బరిలో దిగారు 3 లక్షల పై చిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014, 2019 ఎన్నికల్లోనూ నెగ్గి బారామతిని బలమైన కోటగా మార్చుకున్నారు. ఎన్సీపీలో చీలిక నేపథ్యంలో ఈసారి మాత్రం వదిన సునేత్ర నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఉమన్ ఆఫ్ ద డెకేడ్... ఇన్‌స్టా, ఎక్స్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే కొద్దిమంది నేతల్లో సుప్రియ ఒకరు. స్వయం సహాయక సంఘాలతో కలిసి పని చేశారు. గిరిజనులు, ఆదివాసీల కోసం పాఠశాలల నిర్మాణానికి, వికలాంగుల హక్కుల సాధనకు కృషి చేశారు. మహిళల సమస్యలపై నిత్యం గొంతెత్తుతుంటారు. భ్రూణహత్యలు, వరకట్న వ్యవస్థపై పలు ఉద్యమాలు జరిపారు. మహిళా సాధికారతకు పోరాటం, సామాజిక సేవకు ప్రతిష్టాత్మక ‘ముంబై ఉమన్ ఆఫ్ ద డెకేడ్’ అవార్డు అందుకున్నారు. పలుమార్లు ఉత్తమ పార్లమెంటేరియన్‌గా నిలిచారు. నేల విడిచి సాము చేయొద్దని... రాజకీయాలు, కుటుంబం మధ్య సుప్రియ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. బంధుత్వానికి చాలా విలువిస్తారు. “్ఙమా అమ్మ బలమైన వ్యక్తి. నాన్న కంటే గట్టిది. నాన్న పబ్లిక్ లైఫ్‌ను ఎక్కువగా ఇష్టపడతారు. అమ్మ అజ్ఞాతాన్ని ప్రేమిస్తుంది. జీవన పోరాటంలో మాకెప్పుడూ అండగా నిలుస్తూ వచి్చంది. రాజకీయాలు, సామాజిక సవాళ్లను అధిగమించడమెలాగో నాన్న చూపితే, ఎప్పుడూ నేలవిడిచి సాము చేయొద్దని అమ్మ నేరి్పంది. అందుకే కుటుంబం పట్ల నేను బాధ్యతగా ఉంటా. ఎంపీగా ప్రజల సమస్యలను చర్చిస్తున్నప్పుడు కూడా.. కొడుకు చదువు, కూతురు పుట్టినరోజు కేక్ ఎలా ఉండాలి వంటిని నా మనసులో మెదులుతూ ఉంటాయి’’ అంటారామె. సుప్రియకు నచ్చే నేత సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి. పార్టీ, సిద్ధాంతాల పట్ల ఆయన నిబద్ధత తనకు ప్రేరణనిస్తాయంటారు. పార్లమెంటేరియన్లుగా దివంగత అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్లనూ బాగా ఇష్టపడతారు. ప్రేమ వివాహం చిరునవ్వుతో వెలిగే బక్కపలుచని ముఖం. మాటల్లో మృదుత్వంతో ఇట్టే ఆకట్టుకునే సుప్రియ 1969 జూన్ 30న జన్మించారు. బర్కిలీలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో నీటి కాలుష్యంపై అధ్యయనం చేశారు. ఓ దినపత్రికలో జర్నలిస్టుగా చేస్తుండగా ఫ్యామిలీ ఫ్రెండ్ ఇంట్లో సదానంద్ బాలచంద్ర సులేతో జరిగిన పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. వారికిద్దరు పిల్లలు. -
వదిన-మరదళ్ల సమరం : ‘బారామతి నేను.. నేను బారామతి’ని
ముంబై : మహారాష్ట్రలో సార్వత్రిక ఎన్నికల పోరులో వదిన-మరదళ్ల సమరం ఆసక్తిని రేపుతోంది. అజిత్ పవార్ తిరుగుబాటుతో రెండు ముక్కలైన ఎన్సీపీకి కంచుకోటగా ఉన్న బారామతి లోక్‌సభ స్థానం నుంచి శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ బరిలో నిలిచారు. వారిలో సుప్రియా సూలే తరుపున ఎన్నికల ప్రచారం చేస్తున్న శరద్ పవర్ ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తుంటే.. భార్య సునేత్ర పవార్ తరుపున అజిత్ పవార్ ప్రచారంతో ప్రజా మద్దతు తమకే ఉందని నిరూపించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ‘బారామతి అంటే నేను.. నేనే బారామతి’ ఈ తరుణంలో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, ఏ వ్యక్తికి వ్యతిరేకంగా కాదని చెప్పారు. అంతేకాదు తాను బారామతిలో పుట్టి పెరిగానని, దాని మట్టితో కనెక్ట్ అయ్యానని అన్నారు. ‘బారామతి అంటే నేను.. నేనే బారామతి’ అని పేర్కొన్నారు. శరద్ పవార్ అంతం కోసం ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్ని ‘ప్రతీకార పోరాటం’గా మార్చారంటూ సుప్రియా సూలే మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్‌పై మండిపడ్డారు. పాటిల్ గత వారం బారామతికి వచ్చి ఈ యుద్ధం శరద్ పవార్‌ను అంతం చేయడం కోసమే అని వ్యాఖ్యానించారు. అభివృద్ది గురించి మాట్లాడితే ప్రజలు ఇష్టపడతారు. ఇలా మాట్లాడితే ఎలా? ఈ తరహా వ్యాఖ్యలతో పాటిల్ వ్యక్తిగత ఎన్నికలుగా మార్చారని చెప్పుకొచ్చారు. బారామతి మట్టికి రుణపడి ఉంటాం. 2009 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బారామతి సీటుతో తనకు ఉన్న అనుబంధం గురించి అడిగిన ప్రశ్నకు సులే మాట్లాడుతూ.. ‘బారామతి నేను, నేను బారామతిని.నేను ఇక్కడే పుట్టి పెరిగాను. ఈ రోజు నేను, నా కుటుంబం అంతా బారామతి మట్టికి రుణపడి ఉంటామని భావోద్వేగానికి గురయ్యారు. నా అనుకున్న వాళ్లు దూరమైతే అజిత్ పవార్ అభ్యర్ధిగా బరిలో దిగడంపై.. మన అనుకున్నవాళ్లు దూరమైనప్పుడు బాధగానే ఉంటుంది. నాక్కూడా అలాగే ఉంది. నేను బంధాలు, వ్యక్తులకు విలువ ఇస్తాను. కానీ నేను చేస్తున్న ఈ రాజకీయాలు మాత్రం కుటుంబం కోసం ప్రజలకు సేవ చేయడం కోసమేనంటూ ఎన్నికల ప్రచారంలో వడివడిగా అడుగులు ముందుకు వేశారు. -
‘బీజేపీవి చెత్త రాజకీయాలు’.. సుప్రియా సూలే ఫైర్
ముంబై: బారామతి లోక్‌సభ స్థానం విషయంలో బీజేపీ తమపై కుట్ర చేస్తోందని ఎన్సీపీ(శరద్ చంద్ర పవార్) ఎంపీ సుప్రియా సూలే మండిపడ్డారు. ముఖ్యంగా తన వదిన సునేత్ర పవార్‌ను బారామతి బరిలోకి దించి ఎన్సీపీ( శరద్ చంద్ర పవార్) చీఫ్ శరద్ పవార్ రాజకీయంగా ఉన్న పేరును అంతం చేయాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోందని దుయ్యబట్టారు. ‘నా పోరాటం ఒక వ్యక్తిగా వ్యతిరేకంగా కాదు. వారి(బీజేపీ) ఆలోచనలు, విధానాలుపై మాత్రమే. నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి18 ఏళ్లు అవుతోంది. ఇప్పటివరకు ఒక్క వ్యక్తి కూడా నేను వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయలేదు. సునేత్ర పవార్ తను పెద్దన్న భార్య అని.. అంటే తల్లితో సమానం’ అని అన్నారు. ‘బీజేపీవి చెత్త రాజకీయాలు, సునేత్ర పవార్ మా పెద్దన్న భార్య. మరాఠీ కుటుంబంలో అన్న భార్యకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. మాకు ఆమె తల్లితో సమానం. మాలో మాకు శత్రుత్వం పెంచడానికి సునేత్రను బారామతి బరిలో దింపుతున్నారు. ఈ నిర్ణయం వెనక బీజేపీ హస్తం ఉంది. ఎన్సీపీ(శరద్ పవార్) చీఫ్ శరద్‌పవార్ పేరును రాజకీయంగా దెబ్బతీయాలని బీజేపీ కుట్ర చేస్తోంది. బారామతి నియోజకవర్గం అభివృద్ధి గురించి బీజేపీ ఆలోచించదు’ అని సుప్రియా సూలే మండిపడ్డారు. అధికారికంగా బారామతి స్థానంలో మహారాష్ట్ర బీజేపీ కూటమి నుంచి సునేత్ర పవార్‌ను బరిలోకి దింపిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సునేత్ర పవార్ కృతజ్ఞతలు తెలిపారు. ‘ఈ రోజు నాకు చాలా గొప్ప రోజు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ధన్యవాదాలు’ అని అన్నారు. -
Lok sabha elections 2024: బారామతిలో ప‘వార్’
ముంబై: మహారాష్ట్రలోని బారామతి లోక్‌సభ స్థానంలో ఈసారి ఎన్నికలు రంజుగా మారుతున్నాయి. ఇక్కడ వదిన మరదళ్ల పోరు తప్పదని తేలిపోయింది. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నుంచి మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ అభ్యరి్థత్వాన్ని శనివారం ఖరారు చేశారు. ఇక్కడ ఎన్సీపీ(శరద్ పవార్) నుంచి శరద్ పవార్ కుమార్తె, అజిత్ పవార్‌కు సోదరి వరుసయ్యే సుప్రియా సూలే మరోసారి బరిలోకి దిగబోతున్నారు. బారామతిలో పవార్ కుటుంబానికి గట్టి పట్టుంది. దాదాపు సమానమైన అంగబలం, అర్థబలం కలిగిన వదిన మరదళ్లలో విజయం ఎవరిని వరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. బారామతి నుంచి పోటీ చేయడానికి అవకాశం దక్కడం పట్ల సునేత్ర పవార్ ఆనందం వ్యక్తం చేశారు. ఇది తనకు లక్కీ డే అని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోపాటు శివసేన, బీజేపీ, ఎన్సీపీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. తన సామర్థ్యంపై విశ్వాసం ఉంచి ఎన్నికల్లో పోటీకి అవకాశం కలి్పంచారని పేర్కొన్నారు. -
‘బీజేపీది రాజకీయం కాదు.. ప్రజాస్వామ్య హత్య’
ముంబై: బీజేపీలోకి చేరేవాళ్లంతా.. ఆ పార్టీ మీద ప్రేమతో చేరటం లేదని ఎన్సీపీ (శరద్ చంద్ర పవార్) పార్టీ ఎంపీ సుప్రీయా సూలే అన్నారు. ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్, సీబీఐ, ఈడీ కారణంగా బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడారు. బారామతి నియోజకర్గంలో తనపై పోటీగా ఎవరు నిలబడతారనే విషయం ఇంకా తెలియదన్నారు. అధికారికంగా ప్రకటన వెలువడలేదని చెప్పారు. ‘దేశంలో ప్రజాస్వాయ్యం హత్యకు గురువుతోంది. బీజేపీలో ఎవరూ ప్రేమతో చేరటం లేదు. ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్, సీబీఐ, ఈడీ వల్ల చేరుతున్నారు. బీజేపీ ఆశోక్ చవాన్‌పై ఒత్తిడి తెచ్చి.. పార్టీలోకి చేర్చుకుంది. బీజేపీ.. పార్టీలను ఎలా ముక్కలు చేస్తోందో తెలుస్తోంది. ఇది రాజకీయం కాదు.. ప్రజాస్వామ్య హత్య’ అని సుప్రీయా సూలే మండిపడ్డారు. ఇక గత ఎన్నికలతో పోల్చితే ఈసారి భిన్నంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎన్సీపీ రెండుగా చీలిపోయిన విషయం తెలిసిందే. ఇక.. ఎన్సీపీని చీల్చిన అజిత్ పవార్.. బీజేపీ, శివసేన (ఏక్నాథ్ షిండే) కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. అయితే కీలకమైన బారామతి లోక్‌సభ స్థానంలో పవార్ వర్సెస్ పవార్‌గా పోటీ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ సతీమణి పర్యావరణ కార్యకర్త సునేత్ర పవార్ బారామతి బరిలో దిగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. బారిమతిలో ఈసారి కూడా తానే విజయం సాధిస్తానని సుప్రీయా సూలే ఆశాభావం వ్యక్తం చేశారు. ‘బారామతి నియోజకవర్గ ప్రజలకు నేను చేసిన పనులు అందరికీ తెలుసు. నాపై ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు’ అని సుప్రీయా సూలే స్పష్టం చేశారు. బారామతి లోక్‌సభ స్థానం నుంచి ఆమె 2009 నుంచి మూడుసార్లు ఎంపీగా గెలుపొందారు. బారామతి పార్లమెంట్ స్థానం ఎన్సీపీ (శరత్ చంద్ర పవార్) చీఫ్ శరత్ పవార్ కుటుంబానికి కంచుకోట. -
వదినా, మరదళ్ల పోరులో గెలుపెవరిదో?
త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో సొంత కుటుంబ సభ్యులే ప్రత్యర్ధులుగా మారి కయ్యానికి కాలుదువ్వనున్నారు. ముఖాముఖీ తలపడనున్నారు. గత 55 సంవత్సరాలుగా కుటుంబం హవా కొనసాగుతుండగా..రాజకీయ వైరంతో కుటుంబ సభ్యులే ఒకరిపై ఒకరు పోటీ పడనున్నారు. మరి ఈ ఎన్నికల పోరులో ప్రత్యర్ధులైన వదినా, మరదళ్లలో గెలుపెవరిదో ఎన్సీపీని చీల్చి బీజేపీ ప్రభుత్వంలో చేరి డిప్యూటీ సీఎం పదవి చేపట్టిన అజిత్ పవర్..తన భార్యను రాజకీయ అరంగ్రేటం చేయిస్తున్నారు. అందులోనూ దిగ్గజ నేత, తన బాబాయ్ ఎన్సీపీ అధినేత శరద్‌పవర్ కుమార్తె, సిట్టింగ్ ఎంపీ సుప్రీయా సూలే ప్రాతినిధ్యం వహిస్తున్న బారామతి నుంచే బరిలో దింపుతున్నారు? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్రలోని మహాయుతి (బీజేపీ, శివసేన-షిండే వర్గం, ఎన్సీపీ-అజిత్‌పవార్ వర్గం)ల మధ్య లోక్‌సభ సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఎన్సీపీ-అజిత్ పవర్ వర్గ కార్యకర్తలు బలమైన నియోజకవర్గాల నుండి పోటీ చేయాలని అభిప్రాయపడ్డారు అని పార్టీ రాష్ట్ర యూనిట్ చీఫ్ సునీల్ తట్కరే అన్నారు. బారామతిలో అధికార కూటమి నుంచి పోటీ చేసేందుకు ఎన్సీపీ సిద్ధంగా ఉంది. కూటమి తుది నిర్ణయం తీసుకున్న తర్వాత సునేత్ర పవార్ బారామతి నుండి పార్టీ అభ్యర్థి పోటీ చేస్తారని అన్నారు. 2009 నుంచి ప్రస్తుతం బారామతి లోక్‌సభ నుంచి గెలుస్తూ వస్తున్న శరద్ పవర్ కుమార్తె సుప్రీయా సూలే ప్రత్యర్ధిగా సునేత్ర పవార్ అవుతారు. పెదనాన్న కొడుకైన అజిత్.. సుప్రియాకు అన్నయ్య అవుతారు. ఆ లెక్కనా వదినా, మరదళ్ల పోరులో గెలుపెవరిదో చూడాలి మరి! బాబాయితో మనస్పర్థలు ఎందుకు? అజిత్ పవార్ తండ్రి అనంతరావు పవార్. ఈయన ప్రముఖ సినీ దర్శకుడు శాంతారారం వద్ద పని చేశారు. అయినా.. అజిత్ సినిమా రంగంవైపు మళ్లలేదు. రాజకీయాల్లో ఉన్న బాబాయ్ శరద్ పవార్ మార్గాన్ని ఎంచుకున్నారు. తన సొంత పట్టణమైన బారామతి నుంచి తొలిసారిగా 1991లో లోక్‌సభకు ఎన్నికయ్యారు.అప్పటి నుంచి రాజకీయాల్లో కొనసాగతూ వచ్చారు. కానీ శరద్ పవర్ కుమార్తె సుప్రియా సూలే రాకతో అజిత్ పవర్ రాజకీయం మొత్తం మారిపోయింది. అంతా తానై శరద్ పవార్‌కు మగపిల్లలు లేరు. ఏకైక కుమార్తె సుప్రియా సూలే వివాహం చేసుకొని సింగపూర్‌లో స్థిరపడ్డారు. 2009 నుంచి బారామతి స్థానం లోక్‌సభ స్థానం నుంచి ఆమె ఎంపీగా గెలిచినా..ఢిల్లీకే పరిమితమయ్యారు. ఆమె రాష్ట్ర రాజకీయాల్లోకి రారని శరద్ పవార్ పలు సందర్భాల్లో చెప్పారు. దాంతో శరద్ రాజకీయ వారసుడు అజిత్ అని అందరూ భావించారు. పార్టీలోనూ ఆయనకు గౌరవం కూడా లభించింది. బాబాయ్‌పై తిరుగుబాటు అయితే, 2019లో జరిగిన వరుస పరిణామాలతో బాబాయి, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌పై అజిత్ పవార్ తిరుగుబాటు ప్రకటించారు. నాటి ఎన్నికల తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో బీజేపీకి మద్దతు పలికి డిప్యూటీ సీఎం అయ్యారు. కాగా, త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో శరద్ పవార్ కుమార్తె సుప్రీయా సూలేను ఓడించాలనే ఉద్దేశంతో తన భార్య సునేత్రతో పోటీ చేయించేందుకు సిద్ధమయ్యారు అజిత్ పవర్ -
ఇప్పటివరకూ సలహాలే.. ఇకపై.. లోక్‌సభ బరిలో డిప్యూటీ సీఎం సతీమణి
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) సతీమణి సునేత్ర పవార్‌ను బారామతి లోక్‌సభ స్థానం నుంచి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) బరిలో నిలిపింది. పార్టీ ఆమెను అభ్యర్థిగా ప్రకటించిన తరువాత నిర్వహించిన కార్యక్రమంలో సునేత్ర పవార్ మాట్లాడుతూ ప్రజల మద్దతు కోరారు. "మీరు ( బారామతి లోక్‌సభ నియోజకవర్గ ప్రజలు ) మాకు మద్దతు ఇస్తే, మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం" అని సునేత్ర అన్నారు. తన భర్త అజిత్ పవార్ చేసిన అభివృద్ధి పనులను ప్రస్తావించారు. వాటి పట్ల గర్వపడుతున్నట్లు చెప్పారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తానూ తన వంతు ప్రయత్నం చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు "దాదా" ( అజిత్ పవార్‌ను మద్దతుదారులు ఇలా పిలుస్తారు) ప్రజల కోసం పనిచేస్తున్నారని, ఆయనకు ప్రజల సమస్యలు తెలియజేయడం వరకే తన పాత్ర ఉండేదని ఆమె చెప్పారు. "నా పేరు బారామతికి అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో మీరు మాకు అవకాశం ఇస్తే, మేమిద్దరం ( అజిత్ పవార్, సునేత్ర పవార్ ) మీ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం" అన్నారు. ఆడపడుచు స్థానంలోకి అన్న భార్య.. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ కార్యకర్తలు, మద్దతుదారులతో సమావేశమవుతుండటంతో సునేత్రా పవార్ అభ్యర్థిత్వంపై గత కొన్ని వారాలుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా, లోక్‌సభ ఎన్నికలకు అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మొదటి అభ్యర్థి సునేత్రా పవార్ . బారామతి సీటు ప్రస్తుతం అజిత్ పవార్ సోదరి, శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సుప్రియా సూలే (Supriya Sule) చేతిలో ఉంది. సూలే 2009 నుండి బారామతి ఎంపీగా ఉన్నారు. శరద్ పవార్ 1996 నుండి 2009 వరకు ఆ స్థానాన్ని పవార్ కుటుంబానికి బలమైన కోటగా పరిగణించారు. -
Maharashtra Politics: బారామతిలో ప‘వార్’!
ఎన్సీపీ పార్టీని చీల్చి బీజేపీ ప్రభుత్వంలో చేరి ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టిన అజిత్ పవార్.. తన భార్యను రాజకీయ అరంగేట్రం చేయిస్తున్నారా? అందులోనూ దిగ్గజ నేత శరద్‌పవార్ కుమార్తె, సిట్టింగ్ ఎంపీ సుప్రియా సూలే ప్రాతినిధ్యం వహిస్తున్న‘బారామతి’ నుంచే బరిలో దింపుతున్నారా? అంటే ఎన్సీపీ వర్గాలు అవుననే అంటున్నాయి. ఈ వార్తలను బలం చేకూరుస్తూ ఇప్పటికే కొన్ని చోట్ల ‘బారామతి ఎంపీ సునేత్రా పవార్’ అంటూ భారీ హోర్డింగ్‌లనూ పెట్టేశారు. ఇక అధికారికంగా ప్రకటించడమే తరువాయి అనే పుకార్లు బారామతి నియోజకవర్గంలో షికార్లుచేస్తున్నాయి. అసలు సునేత్రా పేరు తెరమీదకు ఎందుకొచి్చంది? అనే ప్రశ్నకు ఆమె భర్త అజిత్ వ్యాఖ్యల్లో సమాధానం దొరుకుతుంది. శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో డెప్యూటీ సీఎం అజిత్ పవార్ భావోద్వేగంతో చేసిన ప్రసంగం ఈ వార్తలకు బలం చేకూర్చింది. బారామతి లోక్‌సభ స్థానం నుంచి ఎవరిని నిలపబోతున్నారో ఆయన స్పష్టంగా చెప్పకపోయినా.. ‘ ఈసారి బారామతిలో కొత్త అభ్యరి్థని నిలుపుతాం. తొలిసారి పోటీచేస్తున్న అభ్యరి్థ.. మన భవిష్యత్ తరాల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా పనిచేయగలరు. కొందరు ‘పాత’ భావోద్వేగాలతో ఓటేయాలని మిమ్మల్ని అడుగుతారు. పట్టించుకోకండి. జరగబోయే నిరంతర అభివృద్ధిని మాత్రమే దృష్టిలో పెట్టుకోండి. మొదటిసారి పోటీచేస్తున్నా ఆశీర్వదించండి. అభివృద్ధిని గెలిపించండి’ అని పిలుపునిచ్చారు. వెంటనే భార్య సునేత్రనే ఆయన రంగంలోకి దింపబోతున్నారని భావించిన ఎన్సీపీ పార్టీ వర్గాలు ఆ నియోజకవర్గం ప్రధాన కూడళ్లలో భారీ హోర్డింగ్‌లు పెట్టేశాయి. కాబోయే ఎంపీ సునేత్రా పవార్ అని రాసి ఉన్న ప్లెక్సీలతో బారామతిలో అప్పుడే ఎన్నికల కోలాహలం మొదలైంది. శరద్‌పవార్ కుటుంబానికి కంచుకోట ఈ నియోజకవర్గం. ఇక్కడ ఎన్సీపీ దిగ్గజ నేత శరదపవార్ కూతురు సుప్రియా సూలే సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్నారు. 2009 ఏడాది నుంచి అప్రతిహతంగా ఆమె జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆమెను ఢీకొట్టాలంటే తమ కుటుంబానికే చెందిన మహిళా అభ్యర్థి అయితేనే ఎన్నికల రణరంగంలో నెగ్గుకు రాగలరని అజిత్ పవార్ భావిస్తున్నారు. అందుకే భార్యను బరిలో నిలుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్సీపీ పార్టీని అజిత్ పవార్ చీలి్చన నేపథ్యంలో పార్టీ ఓటర్లు సైతం రెండు వర్గాలుగా చీలే అవకాశముంది. అప్పుడు సుప్రియా, సునేత్రలలో ఎవరు గెలుపు తలుపు తట్టగలరో వేచి చూడాల్సిందే. ఎవరీ సునేత్రా? అజిత్ భార్యగా తప్పితే రాజకీయ వర్గాల్లో ఎవరికీ తెలియని పేరు సునేత్ర. ఆమె చాలా సంవత్సరాలుగా సామాజిక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. శరద్‌పవార్‌కు ఒకప్పటి సన్నిహిత నేత, మాజీ మంత్రి పద్మసిన్హా పాటిల్ చెల్లెలే ఈమె. ప్రత్యక్ష రాజకీయాలు ఈమెకు కొత్త. ఎని్వరాన్‌మెంట్ ఫోరమ్ ఆఫ్ ఇండియా పేరిట ఒక ఎన్జీవోను సునేత్ర నడుపుతున్నారు. సేంద్రీయ వ్యవసాయం, సేంద్రీయ ఎరువుల వినియోగాన్ని ఈమె అమితంగా ప్రోత్సహిస్తున్నారు. పర్యావరణహిత గ్రామాల స్థాపనకు కృషిచేస్తున్నారు. ప్రముఖ విద్యాసంస్థ ‘విద్యా ప్రతిష్ఠాన్’కు ట్రస్టీగా ఉన్నారు. ఫ్రాన్స్‌లోని మేథో సంస్థ వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్íÙప్ ఫోరమ్‌లో 2011 నుంచి భాగస్వామిగా కొనసాగుతున్నారు. అయితే ఈమె మెల్లిగా ప్రచారకార్యక్రమాలు మొదలెట్టినట్లు తెలుస్తోంది. 2019లో సుప్రియాపై పోటీచేసి ఓడిపోయిన బీజేపీ మహిళా అభ్యర్థి కంచన్ రాహుల్ కౌల్‌ను ఈవారమే కలిసి చర్చించారని వార్తలొచ్చాయి. అజిత్, సునేత్రలకు ఇద్దరు కుమారులు. జై పవార్, పార్థపవార్. 2019లో మావాల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి పార్థపవార్ ఓటమిని చవిచూశారు. కంచుకోట బారామతి పవార్ల కుటుంబానికి పుణె జిల్లాలోని బారామతి పెట్టనికోట. గత 55 సంవత్సరాలుగా ఇక్కడ వీరిదే హవా. తొలిసారిగా మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో 1967లో బారామతి ఎమ్మెల్యే నియోజకవర్గం నుంచి పోటీచేసి శరద్‌పవార్ గెలిచారు. తర్వాత 1972, 1978, 1980, 1985, 1990 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే స్థానంలో ఘన విజయం సాధించారు. ఇదే బారామతి లోక్‌సభ స్థానం నుంచీ శరద్‌పవార్ 1984, 1996, 1999, 2004 ఎన్నికల్లో విజయఢంకా మోగించారు. అజిత్ పవార్ సైతం 1991లో ఇదే లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడి నుంచి అజిత్ ఏకంగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం బారామతి ఎమ్మెల్యే అజితే. 2009 నుంచి సుప్రియా సూలే ఇక్కడ ఎంపీగా గెలుస్తూ వస్తున్నారు. ఇక్కడ ఈసారి సునేత్రను దింపితే స్పష్టంగా ‘పవర్’ప్లే మొదలైనట్లే. పెదనాన్న కొడుకైన అజిత్.. సుప్రియాకు అన్నయ్య అవుతారు. ఆ లెక్కన వదినా, మరదళ్ల పోరులో గెలుపెవరిదో చూడాలి మరి! – సాక్షి, నేషనల్ డెస్క్ -
కచ్చితంగా గౌరవప్రదంగా బదులిస్తారు! సుప్రియా సూలే
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి ఎన్నికల సంఘం(ఈసీఐ) షోకాజ్ నోటీసులు పంపిన సంగతి తెలిసింది. దీనిపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) ఎంపీ సుప్రియా సులే స్పందించారు. ఈ మేరకు సూలే మాట్లాడుతూ..రాహుల్ గాంధీ గొప్ప పోరాట యోధుడని. ఆయన మోదీపై చేసిన వ్యాఖ్యలకు నిజాయితీగా, గౌరప్రదంగా తగిన సమాధానం ఇవ్వగలరని ధీమాగా చెప్పారు. ఇలాంటి వాటికి రాహుల్ భయపడడు. ఎందుకంటే? బీజేపీ అతని కుటుంబం గురించి ఎలా మాట్లాడిందో అందరికీ తెలుసు. అందుకు సంబంధించిన ఎన్నో ఉదాహారణలు ఉన్నాయన్నారు. రాహుల్ తాతా, మహోన్నత వ్యక్తి నెహ్రూ నుంచి ఎవ్వరిని వదలకుండా ఎలా కుటుంబ సభ్యులందర్నీ కించరపరిచారో అందరూ విన్నారు. కాబట్టి రాహుల్ అందుకు కౌంటర్‌గా ఏదైనా మాట్లాడితే.. బీజేపీ ఎందుకు పెడబొబ్బలు పెట్టుకుంటోంది అని మండిపడ్డారు సూలే. అతడి కుటుంబంలోని వ్యక్తులందర్నీ పేరుపేరున అవమానిస్తూ మాట్లాడటం తప్పుగాదా? అని బీజీపీని నిందించారు. ఇదిలా ఉండగా, రాహుల్ గాంధీ రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లా బయాతులో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పనౌటీ, పిక్‌పాకెట్ వంటి పదాలతో అవమానించాడని బీజేపీ ఈసీఐకి ఫిర్యాదు చేసింది. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తిని అలాంటి పదాలతో దూషించడం.. ఎన్నికల ప్రవర్తన నియావళి(మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ))ని ఉల్లంఘించడమేనని ఈసీఐకి ఫిర్యాదు చేసింది బీజేపి. ఈ నేపథ్యంలోనే ఈసీఐ గురువారం రాహుల్‌కి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీస్‌లో ఎన్నికల సంఘం(ఈసీఐ) రాహుల్ తనపై వచ్చిన ఆరోపణలకు ఇంకా ఎందుకు స్పందించలేదో వివరణ ఇవ్వాలని కోరింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ))ని ఉల్లంఘనల ఆరోపణలకు ప్రతిస్పందనగా ఎలాంటి చర్యలు ప్రారంభించకపోవడానికి గల కారణాలను కుడా వెల్లడించాలని పేర్కొంది. అలాగే రాహుల్‌ని తన వివరణను ఈ నెల 25న 18 గంట్లలోపు సమాధానం ఇవ్వకపోతే తగిన చర్యలు తీసుకుంటామని లేఖలో పేర్కొంది ఈసీఐ. (చదవండి: రగులుతున్న 'పనౌటీ' వివాదం!తెరపైకి నాడు ఇందీరా గాంధీ చేసిన పని..) -
రాజకీయ విభేదాలు.. దీపావళి వేడుకల్లో అజిత్ పవార్, సుప్రియా సూలే
ముంబై: రాజకీయ విభేదాల నడుమ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎంపీ సుప్రియా సూలే, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పూణె జిల్లాలోని బారామతిలో 'భౌ బీజ్' (భాయ్ దూజ్) వేడుకలను జరుపుకున్నారు. అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్, వారి కుమారులు పార్థ్ పవార్, జే పవార్‌తో పాటు మిగిలిన పవార్ కుటుంబ సభ్యులు సమావేశమయ్యారు. ప్రతి ఏడాది పవార్ కుటుంబ సభ్యులు దీపావళి సందర్భంగా భాయ్ దూజ్ వేడుకలు జరుపుకుంటారు. భాయ్ దూజ్ వేడుకలు అన్న చెల్లెల్ల మధ్య బంధాన్ని మరింత బలంగా మారుస్తాయని పేర్కొంటూ సుప్రియా సూలే ట్విట్టర్ వేదికగా ఆ ఫొటోలను పంచుకున్నారు. రాజకీయ మనస్పర్ధల మధ్య ఈసారి వేడుకలు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఉన్నాయా? అని సుప్రియా సూలేను అడిగినప్పుడు.. 'వృత్తిపరమైన జీవితం, వ్యక్తిగత జీవితం రెండూ భిన్నమైన విషయాలు. ప్రతి సంవత్సరం మాదిరిగానే మేము భాయ్ దూజ్ పండుగను జరుపుకోవడానికి అజిత్ పవార్ నివాసానికి వెళ్లాము. వ్యక్తిగతమైన కక్షలు ఎవరితోనూ ఉండవు' అని అమె అన్నారు. ఈ ఏడాది ఎన్సీపీ నుంచి విడిపోయి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంతో అజిత్ పవార్ చేతులు కలిపారు. అటు నుంచి ఎన్సీపీలో శరద్ పవార్‌కు అజిత్ పవార్‌కు మధ్య విభేదాలు నడుస్తున్నాయి. ఈ పరిణామాల తర్వాత శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే, అజిత్ పవార్‌తో కలిసి దీపావళి పండగ వేళ వేడుక చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదీ చదవండి: బీజేపీకి 20 ఏళ్ల కంచుకోట.. ఈసారి కష్టమేనా? -
ట్రిపుల్ ఇంజిన్ సర్కార్‌లో ట్రబుల్ షురూ: సుప్రియా సూలే
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇద్దరే ఢిల్లీ పర్యటనకు వెళ్లడం అంతకుముందు జరిగిన కేబినెట్ సమావేశాలకు అజిత్ పవార్ గైర్హాజరవడంతో ప్రతిపక్షాలు ట్రిపుల్ ఇంజిన్ సర్కారుపై విమర్శనాస్త్రాలు సాధించాయి. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశానికి ఎన్సీపీ రెబెల్ అజిత్ పవార్ హాజరు కాకపోగా ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఢిల్లీ పర్యటనలో కూడా ఆయన కనిపించకపోవడంతో ప్రతిపక్షాలు ట్రిపుల్ ఇంజిన్ సర్కారుకు ట్రబుల్ మొదలైందని చెబుతున్నాయి. ఎన్సీపీ రెబెల్ మంత్రులకి జిల్లా సహాయక మంత్రులుగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో అజిత్ పవార్ మరోసారి అలకపాన్పు ఎక్కినట్టు తెలుస్తోంది. బీజేపీకి చెందిన చంద్రకాంత్ పాటిల్‌కు పూణే జిల్లా సహాయక మంత్రిగాను దిలీప్ వాల్సే పాటిల్‌కు బుల్దానా జిల్లా, హాసన్ ముష్రిఫ్‌కు కొల్హాపూర్ జిల్లా, ధనుంజయ్ ముండేను బీడ్ జిల్లాకు సహాయక మంత్రులుగా ప్రకటించింది షిండే ప్రభుత్వం. తనవారికి మంత్రి పదవులు దక్కనందునే అజిత్ పవార్ బీజేపీ-శివసేన ప్రభుత్వ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నరని అంటున్నారు ప్రతిపక్ష నాయకులు విజయ్ వాడెట్టివార్. ఇదిలా ఉండగా ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే మాత్రం అజిత్ పవార్ వర్గంపై ఘాటు విమర్శలు చేశారు. ట్రిపుల్ ఇంజిన్ సర్కారు ఏర్పడి మూడు నెలలైనా కాలేదు అప్పుడే ట్రబుల్ మొదలయిందన్నారు.నిరాశలో ఉన్న వర్గం ఉపముఖ్యమంత్రి ఫడ్నవీస్ కు తమ అసంతృప్తిని తెలిపినట్టు సమాచారం అందింది. హనీమూన్‌కు వెళ్లి మూడు నెలలైనా కాలేదు అప్పుడే ప్రభుత్వంలో ముసలం మొదలైందని వార్త్లు వస్తున్నాయి. అసలు ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తున్నారని ప్రశ్నించారు. ఎన్సీపీ తిరుగువర్గంలో మరో ఎమ్మెల్యే ఛగన్ భుజ్‌బల్ మాత్రం అజిత్ పవార్ గొంతు ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారని కేబినెట్ సమావేశాలకు ఎలా హాజరవుతారని, ఢిల్లీ పర్యటనకు ఎలా వెళతారని ప్రశ్నిస్తూనే రాజకీయంగా మాకు ఎటువంటి సమస్యలు లేవని తెలిపారు. ఇది కూడా చదవండి: కుల్గామ్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం -
ఎన్సీపీ పార్టీ గుర్తు ఆయనకే సొంతం
ముంబై: ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తమ పార్టీ గుర్తు ఎవరికీ ధారాదత్తం చేసేది లేదని పార్టీ గుర్తు మా వద్దే ఉంటుందని తేల్చి చెప్పారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఓ సమావేశం అనంతరం ఎన్సీపీ ఎంపీ సుప్రియ సూలే మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. మా పార్టీలో ఎలాంటి విభేదాలు లేవు, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరికీ తెలుసు ఎన్సీపీ అంటే శరద్ పవార్.. శరద్ పవార్ అంటే ఎన్సీపీ అని. అలాగే మహారాష్ట్రలో ఎన్సీపీ అంటే జయంత్ పాటిల్ అని కూడా అందరికీ తెలుసన్నారు. 25 ఏళ్ల క్రితం శరద్ పవార్ ఎన్సీపీ పార్టీని స్థాపించారని ఈ పార్టీ గుర్తు ఎప్పటికీ ఆయనతోనే ఉంటుందని ఎవరికీ ఇచ్చేది లేదన్నారు. ఈ ఏడాది జులై ప్రారంభంలో ఎన్సీపీలో చీలిక తీసుకొస్తూ అజిత్ పవార్ అధికార బీజేపీ-శివసేన కూటమితో చేతులు కలిపిన విషయం తెలిసిందే. కానీ ఆయన అంతకుముందే జూన్ 30న ఎన్సీపీ పార్టీ తనదేనంటూ ఆ గుర్తు తమ వర్గానికే కేటాయించాల్సిందిగా కోరుతూ ఎలక్షన్ కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేశారు. అజిత్ పవార్ సమర్పించిన పిటిషన్‌తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు. ఎమ్మెల్సీల అఫిడవిట్లు కూడా ఎన్నికల కమిషన్‌కు సమర్పించారు. దీంతో ఎన్నికల కమిషన్ కూడా పార్టీలో చీలిక వచ్చిందన్న విషయాన్ని అంగీకరిస్తూ అక్టోబర్ 6న విచారణకు హాజరు కావాల్సిందిగా ఇరుపక్షాలకు నోటీసులిచ్చింది. ఇది కూడా చదవండి: పొత్తుల విషయంలో మాయావతి కీలక వ్యాఖ్యలు -
మా నాన్నను అవమానిస్తే ఊరుకునేది లేదు
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో దశాబ్దాలుగా చక్రం తిప్పుతూ వస్తోన్న ఎన్సీపీలో చీలిక తీసుకొచ్చిన అజిత్ పవార్ రాజకీయ నాయకుల వయసు ప్రస్తావన తీసుకొచ్చి వినూత్న వాదనకు తెరతీశారు. వయసు మీదపడ్డ శరద్ పవార్ ను తప్పుకుని కొత్తనీరుకి దారినివ్వాల్సిందిగా చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే ఘాటుగా సమాధానమిచ్చారు ఎన్సీపీ తిరుగుబాటు వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ బీజేపీ పార్టీ అనుసరిస్తున్న విధానాలు మార్గదర్శకమని, 75 ఏళ్ళు దాటిన రాజకీయ నాయకులు రాజకీయాల్లో కొనసాగడం ఆ పార్టీలో ఉండదని చెబుతూ ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషి లను ఉదహరించారు. ప్రస్తుతం మీ వయసు 83.. కాబట్టి ఇంక చాలు రిటైర్మెంట్ ప్రకటించండి.. మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తే మేము మీ దీర్గాయుష్షును కోరుకుంటామని.. అలా చేయడం వలన కొత్త తరం కొత్త ఉత్సాహంతో పనిచేస్తుందని అన్నారు. #WATCH | Maharashtra Deputy CM Ajit Pawar says, "You portrayed me as a villain in front of everyone. I still have deep respect for him (Sharad Pawar)...But you tell me, IAS officers retire at 60...even in politics - BJP leaders retire at 75. You can see the example of LK Advani… pic.twitter.com/T2XqCzEH89 — ANI (@ANI) July 5, 2023 అజిత్ పవార్ చేసిన ఈ వ్యాఖ్యలకు ఎంపీ, ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే స్పందిస్తూ.. ‘‘అమితాబ్ బచ్చన్ వయసు 82 ఏళ్ళు.. ఇప్పటికీ ఆయన ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారు. మీకోపం మాపైనే కదా. కాబట్టి మమ్మల్ని తిట్టినా సహిస్తాం. కానీ మా నాన్నగారిని అమర్యాదగా మాట్లాడితే మాత్రం సహించబోమని అన్నారు. ఎదుటివారి వయసు పెరిగింది మమ్మల్ని ఆశీర్వదించమని అడిగే ముందు అసలెందుకు ఆశీర్వదించాలని ప్రశ్నించుకోవాలి. రతన్ టాటా సాహెబ్ కంటే కేవలం మూడేళ్లే పెద్దవారు. అయినా దేశంలో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపించడంలేదా అని అడిగారు. అవినీతిని పెంచి పోషిస్తున్న బీజేపీ ప్రభుత్వంపైనే మా పోరాటం. అసలైన ఎన్సీపీ పార్టీ శరద్ పవార్ తోనే ఉందని మా గుర్తు మాతోనే ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. #WATCH | "Disrespect us, but not our father (Sharad Pawar). This fight is against the BJP government. BJP is the most corrupt party in the country," says NCP Working President Supriya Sule, in Mumbai. pic.twitter.com/BxrUYpU6WI — ANI (@ANI) July 5, 2023 ఇది కూడా చదవండి: 22 కేజీల గంజాయి తిన్న ఎలుకలు.. తప్పించుకున్న స్మగ్లర్లు -
అజిత్ పవార్ ఏది కోరితే అదిస్తాం..
ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత అజిత్ పవార్ తనను ప్రతిపక్ష నాయకుడి పాత్ర నుండి తప్పించమని పార్టీ అధిష్టానాన్ని కోరిన విషయం తెలిసిందే. అందుకు ప్రతిస్పందిస్తూ ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లో ఒకరైన సుప్రియా సూలే ఆయనకు ఎలా కావాలంటే అలా చేద్దాం కానీ అది నా చేతుల్లో లేదు, పార్టీ నిర్ణయించాలని అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్సీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్ లను నియమించారు ఆ పార్టీ సీనియర్ నేత శరద్ పవార్. అదే సమయంలో పార్టీ తరపున ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వహిస్తోన్న అజిత్ పవార్ ను నిర్లక్ష్యం చేశారనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి. అయితే ఆరోజునే ఈ విషయాన్ని సూటిగా ప్రశ్నించగా నేను సంతృప్తికరంగానే ఉన్నానని, ఇప్పటికే నాపై అనేక బాధ్యతలు ఉన్నాయని చెప్పిన ఆయన మెల్లగా అలగడం ప్రారంభించారు. ప్రతిపక్ష నాయకుడిగా పనిచేయాలన్న కోరిక నాకు లేదు. పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారని నేనా బాధ్యతలను స్వీకరించాను. కానీ ప్రస్తుతానికైతే నన్ను ప్రతిపక్ష నాయకుడిగా తప్పించి మరేదైనా బాధ్యతను అప్పగిస్తే పూర్తి స్థాయి న్యాయం చేయగలుగుతానని పార్టీ అధిష్టానాన్ని కోరారు. దీనిపై స్పందిస్తూ ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే.. ఆయన ఎలా కోరితే అలా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాకపోతే అది నా ఒక్కరి చేతుల్లో లేదు. పార్టీ కార్యవర్గం అంతా చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ఒక సోదరిగా ఆయన ఏది కోరితే అది జరగాలనే కోరుకుంటానని అన్నారు. ఇది కూడా చదవండి: మణిపూర్ అల్లర్లు: అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చిన అమిత్ షా -
పవార్ ‘పవర్’ గేమ్..!.. ఎన్సీపీలో చీలికలు తెస్తుందా ?
ఒకప్పుడు శరద్ పవార్ వారసుడిగా అజిత్ పవార్‌నే చూసేవారు. పార్టీలో సెకండ్ పొజిషన్‌ను అనుభవించారు. వివాదరహితుగా పేరు తెచ్చుకున్నారు. కొన్నాళ్ల క్రితం బీజేపీలో దూకడానికి అజిత్ పవార్ ఎమ్మెల్యేలతో కలిసి మంతనాలు సాగిస్తుస్నారన్న ఊహాగానాలు వచ్చాయి. ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంటూ ముంబై నగర వీధుల్లో పోస్టర్లు వెలిశాయి. రాజకీయాల్లో తలపండిన శరద్ పవార్ ఇవన్నీ పార్టీకి ముప్పు తెస్తాయని భావించి అత్యంత నాటకీయంగా ఎన్సీపీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి తాను వైదొలుగుతున్నట్టు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఆ తర్వాత కార్యకర్తలు, ఇతర నాయకులు పట్టుబట్టడంతో ఉద్వేగ భరిత వాతావరణంలో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని పార్టీపై ఎప్పటికీ పట్టు తనదేనన్న సంకేతాలను అజిత్ పవార్‌కు పంపారు. ఇది జరిగిన కొద్ది వారాలకే శరద్ పవార్ తన కుమార్తెకే నేరుగా పార్టీ పగ్గాలు అప్పగించి మరో పవర్ గేమ్ మొదలు పెట్టారు. సుప్రియకు పార్టీ బాధ్యతలు అప్పగించడంపై తనకెలాంటి అసంతృప్తి లేదని అజిత్ పవార్ బయటకి చెబుతున్నప్పటికీ ఆయన రాష్ట్రంలో మరో ఏక్నాథ్ షిండేలా మారే అవకాశాలున్నాయన్న చర్చ జరుగుతోంది. అజిత్ పవార్ పార్టీని చీలుస్తారా లేదా అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీలో ఎన్సీపీకి 53 మంది సభ్యుల బలం ఉంది. అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్ కలిసి ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కొనే వ్యూహరచన చేయడంతో శరద్ పవార్ వ్యూహాత్మకంగా అజిత్‌ను బలహీనపరచడం కోసం పటేల్‌కు కార్యనిర్వాహక అధ్యక్ష పదవి ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే త్వరలోనే అజిత్ పవార్ తీసుకునే నిర్ణయాలు మహారాష్ట రాజకీయాల్లోనే కీలకమైన మార్పులు తీసుకువస్తాయని రాజకీయ విశ్లేషకుడు విజయ్ క్రోమర్ వ్యాఖ్యనించారు. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత అజిత్ పవార్ ఎన్సీపీపై చేసిన తిరుగుబాటు విఫలమైంది. బీజేపీ నేత ఫడ్నవీస్ సీఎంగా, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ఏర్పాటైన ప్రభుత్వం మూడు రోజుల్లోనే కూలిపోయిన విష యం తెలిసిందే. కొందరు ఈ ఉదంతాన్ని ఉదాహరణగా చూపిస్తూ ముఖ్యమంత్రి కావాలన్న అజిత్ పవార్ కల నెరవేరాలంటే ఎన్సీపీలో ఉంటేనే సాధ్యపడుతుందని, బీజేపీతో చేతులు కలిపితే సాధ్యం కాదన్న విషయం ఆయనకీ తెలుసునని అంటున్నారు. మొత్తమ్మీద అజిత్ పవార్ వేసే అడుగులే ఆయన భవిష్యత్, ఎన్సీపీ భవిష్యత్‌ని నిర్దేశించడంతో పాటు వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్ని కూడా శాసించబోతున్నాయి. సుప్రియ ఎదుట సవాళ్లు.! సుప్రియ సూలే గత 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఒక ఎంపీగా ఆమె జాతీయ రాజకీయాల్లోనే కీలక పాత్ర పోషించారు. అజిత్ పవార్ మాదిరిగా ఆమెకి రాష్ట్ర రాజకీయాల్లో పట్టు లేదు. నాయకత్వ లక్షణాలు కూడా ఇప్పటివరకు ఎక్కడా ప్రదర్శించే అవకాశం రాలేదు. వచ్చే ఏడాది అత్యంత కీలకమైన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టిక్కెట్ల పంపిణీ, పార్టీలో అసమ్మతుల బుజ్జగింపు, ఎన్నికల్లో వ్యూహరచనలు వంటివన్నీ ఆమె ఎలా నిర్వహించగలరనే సందేహాలైతే ఉన్నాయి. సుప్రియ నియామకంతో పార్టీకి ఒక అర్బన్ ఇమేజ్ వచ్చిందేమో కానీ, అజిత్ పవార్ మాదిరిగా గ్రామాల్లోకి చొచ్చుకుపోయి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే సామర్థ్యం లేదు. అయితే తండ్రి మాదిరిగానే సుప్రియకు ఎలాంటి సంక్షోభాన్నయినా తట్టుకునే నిలబడే సామర్థ్యం ఉందన్న వాదనలూ వినిపిస్తున్నాయి. అజిత్ పవార్ క్రౌడ్ పుల్లర్ అజిత్ పవార్ తన చిన్నాన్న శరద్ పవార్ అడుగు జాడల్లో నడుస్తూ 1982లో తన 20 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. చక్కెర సహకార సంఘాల ఎన్నికల్లో పోటీ చేసి నెగ్గారు. 1991లో తొలిసారిగా ఎన్సీపీ తరఫున బారామతి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత పవార్ కోసం ఆ సీటుని వదులుకొని మహారాష్ట్ర అసెంబ్లీకి పోటీ చేశారు. అప్పట్నుంచి రాష్ట్ర రాజకీయాలకే పరిమితమయ్యారు. బారామతి అసెంబ్లీ సీటు నుంచి ఓటమి లేకుండా ఎన్నికవుతూనే ఉన్నారు. 2012, 2014లో ఉప ముఖ్యమంత్రిగా పని చేసి పాలనలోనూ తన సామర్థ్యాన్ని ప్రదర్శించారు. కార్యకర్తల్ని ప్రేమగా పలకరించడం, నాయకులతో మంతనాలు, తాను చెప్పదలచుకున్నదేదో సూటిగా స్పష్టంగా చెప్పడం, గ్రామాల్లో ఉన్న పట్టు వంటివెన్నో ఆయనను క్రౌడ్ పుల్లర్‌గా మార్చాయి. –సాక్షి, నేషనల్ డెస్క్ -
శరద్ పవార్ నిర్ణయంపై అజిత్ అసంతృప్తి.. స్పందించిన సుప్రియా సూలే
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తాజా నిర్ణయంపై అజిత్ పవార్ అసంతృప్తి ఉన్నారంటూ వస్తున్న వార్తలపై పార్టీకి కొత్తగా నియమితులైన వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సులే స్పందించారు. తన పదవి పట్ల అజిత్ పవార్ సంతోషంగా లేరన్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. అవన్నీ పుకార్లేనని బారామతి ఎంపీ కొట్టిపారేశారు. కాగా జూన్ 10న ఎన్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పార్టీ చీఫ్ శరద్ పవార్ తన అన్న కొడుకు అజిత్ పవార్‌కు షాక్ ఇస్తూ కూతురు సుప్రియా సూలేకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి అజిత్ పవార్ కూడా హాజరయ్యారు. ఆయన ఎదుటే ఈ ప్రకటన వెలువడింది. ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లు సూప్రియా సూలేతోపాటు సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ ప్రఫుల్ పటేళ్లను ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించారు. మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఝార్ఖండ్, గోవాతోపాటు పార్టీ రాజ్యసభ వ్యవహారాలను ప్రఫుల్ పటేల్ చూస్తారు. కూతురికి లోక్‌సభ, పార్టీ వ్యవహారాలతోపాటు మహిళలు, యువత, విద్యార్థి విభాగాలు, మహారాష్ట్ర, హరియాణా, పంజాబ్ ఇంచార్జ్‌గా బాధ్యతలు అప్పజెప్పారు. అయితే మహారాష్ట్ర వ్యవహరాలను ఇప్పటికీ వరకు అజిత్ పవార్ చూసుకుంటున్నారు. తాజాగా సుప్రియా సూలేకు అ భాద్యతలు ఇవ్వడంతో అజిత్‌ను పక్కకు పెట్టినట్లు అయ్యింది. బంధుప్రీతితోనే బాధ్యతలు! ఇక పార్టీ వ్యవహారాల విషయంలో అన్న కొడుకు, ముఖ్యనేత అజిత్ పవార్‌ను పక్కన పెట్టడం హాట్‌టాపిక్‌గా మారింది. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. పవార్ నిర్ణయం అజిత్‌ను పక్కకు పెట్టిన్నట్లు కనిపిస్తుందని, ఎన్సీపీలో విభేదాలు బయపడ్డాయని మండిపడుతున్నాయి. కేవలం బంధుప్రీతితోనే సుప్రియా సూలేకు కీలక బాధ్యతలు అప్పగించారని ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్షాల ఆరోపణలపై సుప్రియా సులే స్పందించారు. అవన్నీ కేవలం పుకార్లేనని కొట్టిపారేశారు. आपल्या बारामती लोकसभा मतदारसंघातील न्हावी ता. इंदापूर येथे गावभेट उपक्रमाअंतर्गत भेट देऊन ग्रामस्थांशी संवाद साधला. याप्रसंगी राष्ट्रवादी काँग्रेसचे इंदापूर तालुकाध्यक्ष हनुमंत कोकाटे, सचिन सपकाळ, अतुल झगडे, प्रताप पाटील, प्रवीण माने, विजय शिंदे, रेहना मुलाणी यांच्यासह… pic.twitter.com/3TvsguW44H— Supriya Sule (@supriya_sule) June 12, 2023 అజిత్‌ను బీజేపీ టార్గెట్ చేసింది అజిత్ పవార్ సంతోషంగా లేరని ఎవరూ చెప్పారు? ఎవరైనా అతన్ని అడిగారా? ఈ విషయంలో వస్తున్న వార్తలన్నీ గాసిప్స్ మాత్రమే. దాదా అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా ఉన్నారు. ఆయన స్థానం ముఖ్యమంత్రితో సమానం. అజిత్ పవార్‌ను టార్గెట్ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. కొన్నిసార్లు నన్ను టార్గెట్ చేస్తోంది’ మండిపడ్డారు. బంధుప్రీతి’ లేని పార్టీ ఏదీ? అదే విధంగా వారసత్వ రాజకీయాలపై ఆమె ఘాటుగా స్పందించారు.‘ అవును బంధుప్రీతి రాజకీయాలు ఉన్నాయి. ‘బంధుప్రీతి’ లేని పార్టీ ఏదైనా ఉందా? శరద్ పవార్ కూతురిని అయినందుకు చాలా గర్వపడుతున్నాను. బంధు ప్రీతి గురించి మాట్లాడినప్పుడు పని తీరు గురించి, ప్రతిభ గురించి ఎందుకు మాట్లాడరు. నేను సంసద్ రత్న అవార్డు కూడా అందుకున్నాను. అయితే నాకు ఆ అవార్డు పార్లమెంట్లో చేసిన కృషికి దక్కింది. శరద్ పవార్ కూతుర్ని కావడం వల్ల కాదు’ అని పేర్కొన్నారు. అజిత్ పవార్ ఏమన్నారంటే.. అంతకుముందు ఆదివారం ఆమె పుణెలో పార్టీ కార్యకర్తలను కలుసుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెండ్‌గా ఎన్నికైనందుకు ఎన్సీపీ శ్రేణులు ఆమెను సత్కరించారు. ఈ సందర్భంగా సుప్రియా సూలే పుణెలోని గాంధీ భవన్లో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. ఇక శరద్ పవార్ నిర్ణయంపై తాను సంతోషంగా ఉన్నట్లు అజిత్ పవార్ సైతం వెల్లడించారు. దీనిపై తాను అసంతృప్తితో ఉన్నట్లు వస్తున్న ప్రచారాలన్నీ పుకార్లేనని తెలిపారు. అప్పుడే నిర్ణయం తీసుకున్నాం.. ‘పార్టీ తనకు ఏ బాధ్యతలు అప్పజెప్పకపోవడంతో నేను సంతోషంగా లేనంటూ కొన్ని వార్త కథనాలు వెలువడుతున్నాయి. అవన్నీ అబద్ధాలే. శరద్ పవార్ రాజీనామా చేసిన సమయంలో కమిటీ ఏర్పడింది. అరోజే రెండు నిర్ణయాలు తీసుకున్నాం. శరద్ పవార్ తన రాజీనామాను వెనక్కి తీసుకోవడం ఒకటి.. సుప్రియా సూలేను వర్కింగ్ ప్రెసిడెంట్ నియమించాలని కమిటీ ఏర్పడినప్పుడే సూచించాం. అయితే మిగిలిన కమిటీ సభ్యులు శరద్ పవార్‌ను ఒప్పించి రాజీనామా ఉపసంహరించుకోవడంపై దృష్టి సారించాలని చెప్పారు’ అని అజిత్ పవార్ విలేకరులతో అన్నారు. శరద్ పవార్ గత నెలలో పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే మే 5న ఎన్సీపీ కమిటీ శరద్రా జీనామాను తిరస్కరిస్తూ తీర్మానం చేయసింది.అలాగే తను స్థాపించిన పార్టీకి నాయకత్వం వహించాల్సిందిగా అభ్యర్థించడంతో ఆయన తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. మళ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. -
Sharad Pawar: శరద్ పవార్ రాజీనామాను తిరస్కరించిన ఎన్సీపీ కమిటీ
ముంబై: శరద్ పవార్ రాజీనామా ప్రకటనతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో రాజుకున్న దుమారం మరింత తీవ్రమవుతోంది. తదుపరి ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు ఎవరన్నది ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో పార్టీ అధినేతగా తన వారసుడిని ఎంపిక చేసేందుకు శరద్ పవార్ ఒక కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ శుక్రవారం సమావేశం అయ్యింది. రద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, సోదరుడి కుమారుడు అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్‌బల్ తదితరులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. దక్షిణ ముంబైలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో శరద్‌పవార్ రాజీనామా నిర్ణయాన్ని ఎన్సీపీ కమిటీ తిరస్కరించింది. ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగాలని పార్టీ ప్యానెల్ శరద్‌ను కోరింది. కాగా దేశమంతా శరద్ పవార్ ప్రభావం ఉంది ఆ పార్టీ సినియర్ నేత ప్రఫుల్ పటేల్ వ్యాఖ్యానించారు. ఆయన రాజీనామా చేస్తానంటే మేం ఊరుకోమని అన్నారు. 2024 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తున్న శరద్ పవార్‌కు నేడు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీల నేతలు ఫోన్ చేసి అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలన్న నిర్ణయంపై చర్చించారు. జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, డీఎంకే నేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, సీపీఎం నేత సీతారాం ఏచూరి, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సంజయ్ సింగ్, సీపీఐకి చెందిన డి రాజా తదితరులు ఎన్సీపీ అధినేతతో మాట్లాడారు. చదవండి: Video: పాక్ మంత్రికి నమస్కారంతో స్వాగతం పలికిన జైశంకర్ కాగా 24 ఏళ్ళుగా ఎన్సీపీకి పెద్ద దిక్కూ అయిన శరద్ పవార్ తన సొంత పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించి షాక్‌కు గురిచేసిన విషయం తెలిసిందే. తన ఆత్మకథ రెండో ముద్రణ ఆవిష్కరణ వేదికగా శరద్ చేసిన ఆకస్మిక ప్రకటన కొందరిని కన్నీరు పెట్టించింది. పవార్ రాజీనామాను వెనక్కి తీసుకోవాలంటూ అభిమానులు, కార్యకర్తలు భారీగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. శరద్ పవార్ ఎన్సీపీ చీఫ్‌కు రాజీనామా ప్రకటించడంతో పార్టీ జాతీయ కార్యదర్శి సహా మరికొందరునేతలు కూడా తమ పదవుల నుంచి తప్పుకుంటున్నారు. ఈ పరిణామాల మధ్య కొద్ది గంటల వ్యవధిలోనే తన నిర్ణయంపై పునరాలోచిస్తానని ఇందుకు రెండు, మూడు రోజుల సమయం కావాలని శరద్ కోరారు. కాగా ఎన్సీపీ నేత, శరద్ సోదరుడి కుమార్ అజిత్‌పవార్ బీజేపీలో చేరనున్నట్లు కొన్ని వారాలుగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. పైకి ఆ వాదనను అజిత్ సహా అందరూ కొట్టిపారేసినా, శరద్ హఠాత్ ప్రకటనతో మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఈ క్రమంలో అజిత్‌ను కాషాయ పార్టీలోకి వెళ్లనివ్వకుండా ఆపేందుకు ఎన్సీపీలో చీలిక ఏర్పడకుడదనే ఉద్దేశ్యంతో శరద్ ఈ నిర్ణయం తీసుకుఒని ఉంటారని భావిస్తున్నారు. చదవండి: కలబురిగిలో నువ్వా.. నేనా! హైదరాబాద్ కన్నడనాట తీవ్ర పోటీ -
శరద్ పవార్ రాజీనామా: తదుపరి ఎన్సీపీ చీఫ్‌గా సూలేనా?.. అజిత్ పవార్?
సాక్షి, ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శరద్ పవార్ జాతీయాధ్యక్ష పదవికి రాజీనామా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన తదుపరి చీఫ్‌గా ఎవరు నియమిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఐతే తదుపరి వారుసుడిని ఎంపిక చేసేందుకు పవార్ ఏర్పాటు చేసిన కమిటీ ముంబైలోని పార్టీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశం అవుతుందని ఎన్పీపీ వర్గాలు తెలిపాయి. ఈ కమిటీ సభ్యుల్లో కమిటీ సభ్యుల్లో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, ఆయన మేనల్లుడు అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్‌బల్ తదితరులు ఉన్నారు. ఐతే పార్టీ జాతీయాధ్యక్షుడిగా పవార్ స్థానంలో కూతురు సుప్రియా సూలే ముందున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మహారాష్ట్ర చీఫ్‌గా అజిత్ పవార్ ఉంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు చగ్గన్ భుజ్‌బల్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ..ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ అధ్యక్షుడిగా కొనసాగేందుకు ఇష్టపడినట్లయితే.. అజిత్ పవార్ రాష్ట్రాన్ని చూసుకుంటారని, సుప్రియా సూలే జాతీయ రాజకీయాలను చూసుకుంటారని చెప్పారు. అలాగే పార్టీ మద్దతుదారులు, కార్యకర్తల విజ్ఞప్తుల మేరకు పవార్ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవడానికి అంగీకరించారని ఎన్సీపీ పార్టీ సీనియర్ నాయకుడు ప్రఫుల్ పటేల్ చెప్పడం విశేషం. అంతేగాదు శరద్ పవార్ పదవికి రాజీనామా చేసే ప్రకటనపై తుది నిర్ణయం వెలువడేంత వరకు ఆయన వారసుడిగా పార్టీ చీఫ్‌ని ఎంపిక చేసే ప్రశ్నే లేదని పటేల్ తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో పవార్ నిర్ణయానికి నిరసనగా పార్టీ నేతలు మూకుమ్ముడిగా రాజీనామాలు చేయడం మానుకోవాలని అన్నారు. పార్టీ పవార్ నిర్ణయాన్ని మార్చుకునేలా ఒప్పించేందుకు యత్నిస్తోంది, కాబట్టి కార్యకర్తలంతా కొంచెం ఓపిక పట్టాలని చెప్పారు. ఇదిలా ఉండగా..అజిత్ పవార్ పార్టీని చీల్చి, అధినేతగా బాధ్యతలు చేపట్టాలని యోచిస్తున్నారనే ఊహాగానాల మధ్య శరద్ పవార్ ఈ అనూహ్య చర్య తీసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీలో తిరుగుబాటు తలెత్తకుండా ఉండేలా ఎన్సీపీ సీనియర్ నాయకుడు శరద్ పవార్ వేసిన ఎత్తుగడగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కాగా, శరద్ పవార్ మాత్రం కొత్తతరం పార్టీకి మార్గనిర్దేశం చేయాల్సిన సమయం ఆసన్నమైందని , అత్యాశ ఉండకూదని చెబుతూ..జాతీయాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. (చదవండి: శరద్ పవార్ ఆత్మకథలో ఆసక్తికర విషయం.. మోదీకి అప్పుడే చెప్పా అది కుదరని!) -
మహా చాణక్యం
అన్నట్టే అయింది. పదిహేను రోజుల్లో రెండు రాజకీయ ప్రకంపనలు సంభవిస్తాయని జాతీయవాద కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ కుమార్తె – ఎంపీ అయిన సుప్రియా సులే రెండు వారాల క్రితం అన్నట్టే మొదటి ప్రకంపన మంగళవారం ఎదురైంది. రాజకీయ కురువృద్ధుడూ, 24 ఏళ్ళుగా ఎన్సీపీకి పెద్ద దిక్కూ అయిన శరద్ పవార్ తన సొంత పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగుతున్నట్టు రాజకీయ బాంబు పేల్చారు. చుట్టూ పార్టీ నేతలు ఉండగా, ఆత్మకథ రెండో ముద్రణ ఆవిష్కరణ వేదికగా శరద్ చేసిన ఆకస్మిక ప్రకటన కొందరిని కన్నీరు పెట్టించింది. మనసు మార్చుకొమ్మంటూ మరికొందరు ప్రాథేయపడేలా చేసింది. అనేక నాటకీయ పరిణామాల మధ్య కొద్ది గంటల వ్యవధిలోనే పునరాలోచనకు తనకు రెండు, మూడు రోజుల సమయం కావాలని శరద్ అంగీకరించేలా చేసింది. అనూహ్య నిర్ణయాలతో అవతలివారిని ఆత్మరక్షణలో పడేయడంలో ఆరితేరిన ఈ అపర చాణక్యుడి తాజా నిర్ణయానికి కారణాలు, పర్యవసానాలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. జాతీయస్థాయి ప్రతిపాదిత ప్రతిపక్ష కూటమిలోనూ మల్లగుల్లాలు సాగుతున్నాయి. అయిదున్నర దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న 82 ఏళ్ళ శరద్ భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకొనే రకం కాదు. ఆలోచన నిండిన ఆచరణవాది. అందుకే, ఆయన తాజా ఎత్తుగడ ఆసక్తికరం. నాలుగు విడతల మాజీ డిప్యూటీ సీఎం, శరద్ అన్న కుమారుడైన అజిత్ పవార్ సీఎం పదవిపై కన్నేశారనీ, చివరకు బీజేపీ అండతో కోరిక నెరవేర్చుకునేలా పావులు కదుపుతున్నారనీ కొన్ని వారాలుగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. పైకి ఆ వాదనను అజిత్ సహా అందరూ కొట్టిపారేసినా, శరద్ హఠాత్ ప్రకటనతో ఒక్కొక్క పొర తొలగిపోతోంది. ఆ మధ్య ఎన్సీపీ ఎమ్మెల్యేలు బీజేపీతో జట్టు కట్టనున్నారని తెలిసిన వెంటనే శరద్ అదేమీ పట్టనట్టుగా దర్యాప్తు సంస్థల సమన్లను ఎదుర్కొనలేనివారు పార్టీ వదలిపోవచ్చంటూ ముందరి కాళ్ళకు బంధం వేశారు. తాజాగా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా ద్వారా, ఒకరకంగా బీజేపీ అండతో అజిత్ సీఎం పీఠాన్ని అధిష్ఠించడానికి మార్గం సుగమం చేస్తూనే, కార్యకర్తలపై పట్టు బిగించారు. నిజానికి, ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ శిందేల మధ్య శివసేన రెండుగా చీలి, కథ కోర్టుకెక్కిన ‘సేన వర్సెస్ సేన’ కేసులో సర్వోన్నత న్యాయస్థానం రాజ్యాంగ ధర్మాసనం ఏ క్షణంలోనైనా తీర్పు ప్రకటించవచ్చు. వచ్చే తీర్పును బట్టి ఏం జరగవచ్చు, అప్పుడేం చేయాలని రాజకీయ పార్టీలన్నీ ఇప్పటికే లెక్కలు వేసుకుంటున్నాయి. ఉద్ధవ్‌పై తిరుగుబాటు చేసి, ముందుగా జట్టు కట్టిన ఏక్నాథ్ సహా 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటును సుప్రీం సమర్థిస్తే, సమీకరణాలు మారతాయి. ఆ పరిస్థితుల్లో సీఎం ఏక్నాథ్ అనర్హుడవడంతో పాటు ప్రస్తుత బీజేపీ – ఏక్నాథ్ శిందే ప్రభుత్వం మైనారిటీలో పడిపోతుంది. అప్పుడిక కొత్త మిత్రపక్షంగా అజిత్‌ను కలుపుకోవాలన్నది బీజేపీ వ్యూహం. దానికి తగ్గట్టే ఎన్సీపీని చీల్చి, శరద్‌కు రాజకీయ వారసుడిగా బీజేపీతో అజిత్ చేతులు కలుపుతారని గుప్పు మంది. అనివార్యతను అర్థం చేసుకున్న శరద్ గతంలో ఎన్టీఆర్, ములాయమ్ సింగ్‌ల లాగా వార సత్వ పోరులో బలికావడం ఇష్టం లేక వ్యూహాత్మకంగా రాజీనామా అస్త్రం సంధించినట్టుంది. శరద్ రాజీనామాపై ఇతరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికీ, వయసు, ఆరోగ్యరీత్యా శరద్ నిర్ణయాన్ని గౌరవించాలనీ, ఆయన రాజీనామాను వెనక్కి తీసుకోరనీ భవిష్యత్తు గురించి మాట్లాడు తున్నది ఒక్క అజితే. దీన్నిబట్టి సూక్ష్మం గ్రహించవచ్చు. రక్తసంబంధీకులతో శరద్ తన నిర్ణయాన్ని ముందే చర్చించారట. బాబాయ్ ప్రకటన తర్వాతా తొణకని, బెణకని అబ్బాయ్ అజిత్ అందరిలా రాజీనామా ఉపసంహరణకు అభ్యర్థించకపోగా, ‘ఏదో ఒకరోజు ఇది జరగాల్సిందేగా’ అనడం పవర్ పాలిటిక్స్‌కు పరాకాష్ఠ. సీఎం కావాలన్న అజిత్ ఆశతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ లను కీలుబొమ్మలుగా ఆడిస్తూ, ప్రత్యర్థులను వేధించే బీజేపీ ఘనచరితా దీనికి కారణమే. దర్యాప్తు సంస్థలు వెంటాడుతున్న ఎన్సీపీ నేతలు ప్రఫుల్ పటేల్ వగైరా సైతం శరద్‌తో అనివార్యత చర్చించి, ఒప్పించారట. ఎమ్మెల్యేలు బీజేపీతో నెయ్యానికి తొందరపడుతున్న వేళ ఈ సుదీర్ఘ లౌకిక రాజకీయ వాది పార్టీని కాపాడుకుంటూనే, తన చేతికి మరక అంటని రీతిలో తాజా వ్యూహానికి తెర తీశారు. మిగిలిన మూడేళ్ళ రాజ్యసభ సభ్యత్వంలోనూ బాధ్యతలేమీ తీసుకోకుండా, దేశం కోసం, మహారాష్ట్ర కోసం పనిచేస్తానని శరద్ ఉప్పందించారు. అంటే, రేపు ఒకవేళ అజిత్ సారథ్యంలో ఎన్సీపీ కాషాయపార్టీతో అంటకాగినా పార్టీ వైఖరికి తాను కట్టుబడట్లేదని అనేందుకు ఆత్మరక్షణ సిద్ధం చేసుకున్నారు. ప్రతిపక్షాలేవీ తనను తప్పుబట్టే వీలు లేకుండా చూసుకున్నారు. పార్టీ అధినేత ఎంపిక బాధ్యతను పైకి 15 మంది సభ్యుల కమిటీకి అప్పగించినా, ఢిల్లీలో చక్రం తిప్పుతున్న కుమార్తె సుప్రియకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు, సీఎం అభ్యర్థిగా అజిత్‌కు మహారాష్ట్ర కిరీటం కట్టబెడతారని కథనం. శరద్ రాజీనామాతో ఇప్పటికే పార్టీ జాతీయ కార్యదర్శి సహా పలువురు పక్కకు తప్పుకున్నారు. ఈ పరిణామాలతో ఎన్సీపీకి, మహారాష్ట్రలో మహావికాస్ ఆఘాడీ కూటమికి జరిగే నష్టం మాటేమో కానీ జాతీయస్థాయిలో కాంగ్రెస్‌కే మరింత కష్టం, నష్టం. ప్రతిపక్ష ఐక్యతపైనా, మాజీ కాంగ్రెస్ వాది శరద్ వ్యూహరచనపైనా హస్తం పార్టీ ఆశలు నీరుగారతాయి. 2024 ఎన్నికల వేళ బీజేపీకి ఇది లాభదాయకమే. అయితే, అజిత్‌కు దోవ ఇస్తున్నట్టు ఇస్తూనే, పార్టీపై పట్టు చూపుతున్న శరద్ పవార్ అంత తొందరగా కాడి కింద పడేస్తారా? ఇంతకీ, ముందుగానే జోస్యం చెప్పిన సుప్రియ పేర్కొన్న ఆ రెండో ప్రకంపన ఏమిటి? వేచి చూడాల్సిందే. -
పవార్ రాజీనామా.. సుప్రియా సూలే ఆసక్తికరమైన వీడియో
సాక్షి, ముంబై: రాజకీయ కురువృద్ధుడు, విపక్షాల ముఖ్యనేత శరద్ పవార్ తన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. శరద్ పవార్ చేసిన షాకింగ్ ప్రకటనపై పలు పార్టీ కార్యకర్తలు, నాయకులు వ్యతిరేకించడమే గాక ఆయనను కొనసాగించమని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయనని కూడా చెప్పారు. ఆయన ఇలా ప్రకటించగానే ఎన్సీపీ క్యాడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. రాజీనామా చేయొద్దంటూ కార్యకర్తలు, రాజకీయ నాయకులు నిరసనలు చేశారు. కానీ ఆయన రాజీనామా చేసేందుకే మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఆయన కూతురు సుప్రియా సూలేకు ఒక వ్యక్తి నుంచి తన తండ్రి విషయమై ఆశ్చర్యకరమైన రీతిలో ఆభ్యర్థన వచ్చింది. ఈ మేరకు మార్నింగ్ వాక్కు వచ్చిన సుప్రియాను కలిసిన పారిశుధ్య కార్మికుడు ఆయన(శరద్ పవార్) తన నిర్ణయాన్ని పునరాలోచించమంటూ అభ్యర్థించాడు. ఈ సంభాషణను ఆమె తన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత సుప్రియా అతడితో సెల్ఫీని తీసుకుని, నగరంలోని రోడ్లను శుభ్రంగా ఉంచినందుకు ధన్యవాదాలని అతనికి చెప్పారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ..కేవలం 15 రోజుల్లో రెండు రాజకీయ ప్రకంపనాలు జరిగాయన్న ప్రకాశ్ అంబేద్కర్ వ్యాఖ్యపై స్పందించారు. ఔను ఢిల్లీలో ఒకటి, మహారాష్ట్రలో ఒకటి అని ఎన్సీపీ సీనియర్ ఎంపీ సుప్రియా సూలే అన్నారు. మాజీ ఉపముఖ్య మంత్రి అజిత్ పవర్ బీజేపీతో కలిసి వేడెక్కిస్తున్న రాజకీయాలకు చెక్ పెట్టేలా శరద్ పవర్ అనూహ్యాంగా రాజీనామా ప్రకటించారు. కాగా, కేంద్ర రక్షణ, వ్యవసాయ మంత్రిగా పనిచేసిన శరద్ పవార్ దేశంలోని అగ్ర ప్రతిపక్ష నాయకులలో ఆయన ఒకరు. పైగా మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ వంటి పార్టీలనే ఏకతాటిపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. (చదవండి: ఎన్సీపీ చీఫ్ పదవికి శరద్ పవార్ రాజీనామా.. అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు..) -
ఎంపీ సుప్రియా సూలే చీరకు అంటుకున్న నిప్పు
ముంబై: ఎన్సీసీ ఎంపీ సుప్రియా సూలేకు పెను ప్రమాదం తప్పింది. మహారాష్ట్ర పుణెలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె చీరకు నిప్పంటుకుంది. ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేస్తుండగా.. అక్కడున్న దీపం ఆమె చీరకు అంటుకుని మంట వచ్చింది. అయితే ఈ ఘటనలో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. మంటను వెంటనే ఆర్పేయడంతో పెను ప్రమాదం తప్పింది. పుణెలో శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. सुप्रिया की साड़ी में लगी आग पुणे में एक कार्यक्रम के दौरान एनसीपी नेता और सांसद सुप्रिया सुले जब शिवाजी की प्रतिमा पर हार चढ़ा रही थी तो उनकी साड़ी दिए कि लौ के बीच आ गयी और साड़ी में आग पकड़ लग गयी फिलहाल सुप्रिया सुरक्षित है pic.twitter.com/juGQjkTswO — Rajiv Singh (@indiatvrajiv) January 15, 2023 చదవండి: రాష్ట్రపతి ముర్ము ఆశీస్సుల కోసం ప్రయత్నించింది.. విషయం తెలియక సస్పెన్షన్‌కు గురైంది! -
గార్బా డ్యాన్స్‌తో అదరగొట్టిన ఎంపీ సుప్రియా సూలే.. వీడియో వైరల్
దేవీ నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా వైభవంగా కొనసాగుతున్నాయి. ఆడపచులు సంప్రదాయ నృత్యాలతో సంబరాలు జరుపుకుంటున్నారు. ఈక్రమంలోనే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తనయ, బారామతి ఎంపీ సుప్రియా సూలే గార్బా, దాండియా ఆటలతో అలరించారు. మహారాష్ట్ర ఇందాపూర్‌లోని లఖెవాడి ప్రాంతంలో ఆమె స్థానికులతో కలిసి బుధవారం గార్బా నృత్యం చేశారు. చేతుల్లో చెక్క కోలలు పట్టుకుని దాండియా ఆడారు. లోవెయాత్రి సినిమాలోని చొగడా పాటకు ఆమె ఆడిపాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. (చదవండి: తల్లి గర్భంలోనే రుచుల మక్కువ) కాగా, గుజరాత్ ప్రాంతంలో గార్బా, దాండియా నృత్యాలు సంప్రదాయంగా ఉన్నాయి. దేవి నవరాత్రుల్లో వీటిని పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఇతర ప్రాంతాల్లో సైతం వీటికి ఈ మధ్య కాలంలో ప్రాధాన్యం పెరిగింది. ఇదిలాఉండగా.. ముంబైలోని ప్రఖ్యాత మెరైన్ డ్రైవ్‌లో బుధవారం యువతీయువకులు భారీ స్థాయిలో సెలబ్రేట్ చేసుకున్న గార్బా నృత్యానికి సంబంధించిన దృశ్యాలు సైతం వైరల్‌గా మారాయి. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహింద్రా వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. నవరాత్రి ఉత్సవ వేడుకలకు ముంబై ప్రసిద్ధి అని క్యాప్షన్ జత చేశారు. (చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. గాయపడిన చిన్నారిని చూసి కన్నీరు పెట్టుకున్న మహిళా అధికారి) -
గార్బా డ్యాన్స్‌తో అదరగొట్టిన ఎన్సీపీ చీఫ్ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే..
-
మహిళా రిజర్వేషన్ బిల్లుపై... శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు
పూణే: లోక్‌సభ, శాసన సభల్లో మహిళల రిజర్వేషన్ విషయమై కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించే విషయంలో ఉత్తర భారతదేశం సానుకూలంగా లేదని, వాళ్లు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. ఈ మేరకు శనివారం పూణే డాక్టర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తన కుమార్తె లోక్‌సభ సభ్యురాలు సుప్రియా సూలేతో పాల్గొని ఇచ్చిన ఇంటర్వ్యూలో శరద్ పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలోనూ అన్ని రాష్ట్రాల శాసన సభల్లోనూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఉండాలని రూపొందించిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఇంకా ఆమోదం పొందాల్సి ఉంది. ఈ విషయలో దేశం ఇంకా మానసికంగా సిద్ధంగా లేనట్టుంది అని శరద్ పవర్‌ని మీడియా ప్రశ్నించగా...దీనికి ఆయన సమాధామిస్తూ...తాను కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్నప్పటి నుంచి పార్లమెంట్లో ఈ అంశంపై మాట్లాడుతున్నానని పవార్ అన్నారు. ముఖ్యంగా అందుకు ఉత్తర భారతదేశం సుముఖంగా లేదని స్పష్టం చేశారు. తాను ఒకసారి ఈ అంశంపై ప్రసంగిస్తుంటే తమ పార్టీకి చెందిన మెజార్టీ ఎంపీలు లేచి వెళ్లిపోయారని చెప్పారు. ముఖ్యంగా తమ పార్టీకి చెందిన వారే దీన్ని జీర్ణించుకోలేకపోత్నురని తనకు అప్పుడే స్పష్టమైందని అన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తూనే ఉండాలని శరద్‌పవార్ అన్నారు. అంతేగాదు తాను మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ..జిల్లా పరిషిత్, పంచాయితీ సమితి వంటి స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టానని, మొదట్లో వ్యతిరేకించిన తర్వాత ప్రజలే దానిని ఆమోదించారని చెప్పుకొచ్చారు. (చదవండి: యడ్డి తనయుడిపై లోకాయుక్తాలో కేసు) -
చపాతీలు చేయడం నేర్చుకోండి: బీజేపీకి ఎన్సీపీ ఘాటు రిప్లై
సాక్షి, ముంబై: రాజకీయాలు చేయడానికి బదులు ఇంటికెళ్లి వంట చేసుకోండి అని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేను ఉద్దేశిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) తీవ్రంగా మండిపడింది. ఎన్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు విద్యా చవాన్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. రాజకీయాలకు బదులుగా చంద్రకాంత్ పాటిల్ చపాతీలు చేయడం నేర్చుకోవాలని, ఇంటికెళ్లి ఆయన భార్యకు సాయపడతారని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్ల అంశంపై బీజేపీ బుధవారం ముంబైలో నిర్వహించిన ఆందోళనలో సుప్రియా సూలేపై చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఇటీవల మధ్యప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు రిజర్వేషన్లను అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో..ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఢిల్లీ పర్యటించినప్పుడు సుప్రియా సూలే ఆయన వద్దకు వెళ్లి కలిశారని, స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్లను సుప్రీం కోర్టు అనుమతించేందుకు ఏం చేశారని మాత్రం ఆయనను అడగలేకపోయారని విమర్శిస్తూ పాటిల్ సుప్రియాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై విద్యా చవాన్ స్పందిస్తూ చంద్రకాంత్ పాటిల్ మనుస్మృతిని బలంగా నమ్ముతారని తెలుసని అయితే ఈ విషయంలో మేం ఇక ఏమాత్రం మౌనంగా ఉండదలుచుకోలేదని హెచ్చరించారు. చదవండి: లైంగిక ఆరోపణలు.. మనస్తాపంతో మాజీ మంత్రి ఆత్మహత్య -
మహిళా ఎంపీపై బీజేపీ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు
మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎంపీ సుప్రియా సూలేపై అనుచిత వ్యాఖ్యలు చేసి పాటిల్ వివాదంలో పడ్డారు. ఆయన వ్యాఖ్యలపై ఎన్సీపీ నేతలు మండిపడుతున్నారు. వివరాల ప్రకారం.. స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఓబీసీలకు రాజకీయ రిజర్వేషన్లపై స్టే విధించడంతో గత కొన్ని నెలలుగా మహారాష్ట్రలో పాలిటిక్స్ వేడెక్కాయి. ఓబీసీ రిజర్వేషన్ల కోసం న్యాయస్థానాల్లో జరిగిన పోరాటంలో ఉద్దవ్ థాక్రే సర్కార్ ఓడిపోయిందని బీజేపీ ఆరోపిస్తుండగా, కేంద్రమే సరైన డేటాను అందించడం లేదని మహారాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమర్తె, ఎంపీ సుప్రియా సూలే మాట్లాడుతూ.. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌కు ఓబీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు నుంచి ఎలా ఉపశమనం లభించిందని ప్రశ్నిస్తూ.. ‘‘ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీకి వచ్చి ‘ఎవరినో’ కలిశారు.. అకస్మాత్తుగా ఏం జరిగిందో తెలియడం లేదు. మరో రెండు రోజుల్లో ఓబీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది’’ అని తెలిపారు. ఆమె వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో ఓబీసీ రిజర్వేషన్ అంశంలో రాష్ట్ర ప్రభుత్వంపై నిరసనకు నేతృత్వం వహిస్తున్న పాటిల్.. ‘మీకు రాజకీయాలు అర్థం కాకపోతే ఇంటికి వెళ్లి వంట చేసుకోండి’ అని సూలేను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పాటిల్ వ్యాఖ్యలపై సుప్రియా సూలే భర్త సదానంద్ సూలే స్పందించారు. పాటిల్ మాటలను ఖండిస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. ‘‘ నా భార్యను చూసి గర్వపడుతున్నాను. ఆమె ఒక గృహిణి, తల్లి. అలాగే.. సక్సెస్ఫుల్ పొలిటీషియన్. బీజేపీ నేతలు స్త్రీ ద్వేషులు. వీలైనప్పుడల్లా స్త్రీలను వారు కించపరుస్తారనే ఉంటారు. భారతదేశంలోని అనేక మంది కష్టపడి పనిచేసే, ప్రతిభావంతులైన మహిళలలో నా భార్య కూడా ఒకరు. చంద్రకాంత్ పాటిల్ మాటలు మహిళలందరికీ అవమానకరమే.’’ అని మండిపడ్డారు. ఇది కూడా చదవండి: అసెంబ్లీలో అఖిలేష్ నోట అసభ్యకరమైన పదాలు.. సీఎం యోగి రియాక్షన్ ఇది -
సారూ శశిథరూర్ అదేం పని.. సోషల్ మీడియాలో ట్రోలింగ్
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ నాయకులు ఎక్కడున్నా, ఏం చేసినా కెమెరాలు వారిపై ఫోకస్ పెడుతూనే ఉంటాయి. సభ జరుగుతుండగా కొందరు నేతలు నిద్రపోవడం, ఇంకేదైనా చేయడం చూస్తుంటాం. తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అలాంటి ఓ ఘటనతో సోషల్ మీడియా ట్రెండింగ్‌లో నిలిచారు. లోక్‌సభలో ఆయన ఎన్సీపీ ఎంపీ సుప్రియాసూలేతో మాట్లాడటమే ఇందుకు కారణం. దీనిపై సోషల్‌మీడియాలో సరదా మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై లోక్‌సభలో జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతుండగా.. శశిథరూర్ ఎన్సీపీ ఎంపీ సుప్రియాసూలేతో మాట్లాడుతూ కనిపించారు. ముందు సీటులో ఆమె కూర్చొని ఉండగా.. శశిథరూర్ వెనుక సీట్లో బల్లపై తల ఆనించి పడుకుని నవ్వుతూ కాసేపు ముచ్చటించారు. ఓ వైపు ఫరూక్ అబ్దుల్లా సీరియస్‌గా ప్రసంగిస్తుండగా శశిథరూర్ ఫన్నీగా ఆమెతో మాట్లాడారు. It was a great speech by Farooq Abdullah. Must listen for everyone. @ShashiTharoor pic.twitter.com/STQe0yulxG — Farrago Abdullah (@abdullah_0mar) April 6, 2022 దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఫర్రగో అబ్దుల్లా అనే వ్యక్తి తన ట్విట్టర్లో అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాట బీజీఎంతో శశిథరూర్ వీడియోను ఎడిట్ చేసి పోస్ట్ చేశాడు. మరో నెటిజన్.. శశిథరూర్ అంటే ఫైర్ కాదు.. ఫ్లవర్ అంటూ ఫన్నీ కామెంట్ చేశాడు. -
ఒకే వేదికపై ఇద్దరు ఎంపీలు.. హుషారైన స్టెప్పులతో రచ్చ..
సాక్షి, ముంబై(మహారాష్ట్ర): ప్రతి ఒక్కరు తమ జీవితంలో వివాహ వేడుకను గొప్పగా జరుపుకోవాలనుకుంటారు. దీనిలో భాగంగా.. మెహందీ,సంగీత్ వంటి అనేక కార్యక్రమాలను వేడుకగా నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమాలకు బంధువులు, స్నేహితులు హజరై డ్యాన్స్‌లు చేస్తుంటారు. పెళ్లివేడుకలలో చేసిన డ్యాన్స్‌కు సంబంధించి ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా, పెళ్లి వేడుక డ్యాన్స్‌కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహారాష్ట్ర శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కుమార్తె పూర్వాన్షి వివాహం సోమవారం ముంబైలోని ప్రముఖ హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి అనేక మంది రాజకీయ నాయకులు, ప్రముఖులు హజరయ్యారు. ఎన్సీపీ ఎంపీ సుప్రీయా సులే కూడా తమ కుటుంబంతో కలిసి వివాహ వేడుకకు హజరయ్యారు. పెళ్లి వేడుకలో భాగంగా.. సంగీత్ కార్యక్రమం జరిగింది. దీనిలో ఎంపీ సంజయ్‌రౌత్.. ఎన్సీపీ ఎంపీ సుప్రీయాతో కలిసి డ్యాన్స్ చేశారు. వీరిద్దరు కలిసి చక్కగా స్టెప్పులు వేసి.. వివాహ వేడుకకు హజరైన అతిథులను ఉల్లాసపరిచారు. దీంతో అక్కడ ఉన్నవారు కూడా వీరితో పాటు కలిసి హుషారైన స్టెప్పులు వేశారు. ఎంపీ సుప్రీయా సులే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె . పూర్వాన్షి రౌత్‌కు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన మల్హార్ నర్వేకర్‌తో వైభవంగా వివాహం జరిగింది. ఈయన తండ్రి రాజేష్ నర్వేకర్ ఒక సివిల్ సర్వీసెస్ అధికారి. ప్రస్తుతం ఇద్దరు ఎంపీలు చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. -
కక్షసాధింపు రాజకీయాలు: కాంగ్రెస్ నేత ఫైర్
న్యూఢిల్లీ: కక్షసాధింపు రాజకీయాల్లో భాగంగానే ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేపై ఆస్తుల గురించి వివాదం సృష్టించాలని చూస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు పవాన్ ఖేరా మండిపడ్డారు. కేంద్ర సంస్థలైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ ఎప్పుడో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయానని, ఈ సంస్థల ద్వారా ఎన్డీయే సర్కారు ఇష్టారీతిన అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. కాగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె, సుప్రియా సూలే 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి బారామతి నియోజకవర్గం నుంచి ఎంపీ గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల అఫిడవిట్లో తన భర్తకు సంబంధించిన ఆస్తులను పేర్కొనలేదన్న అంశం తాజాగా తెరమీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం, ఈ విషయంపై లోతుగా దర్యాప్తు చేపట్టాల్సిందిగా ఆదాయపన్ను శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. దీంతో రంగంలోకి దిగిన ఐటీ అధికారులు, సుప్రియా సూలేను వివరణ ఇవ్వాల్సిందిగా కోరగా, షేర్‌హోల్డింగ్ కంపెనీలకు సంబంధించిన వివరాలు నమోదు చేయలేదని, అయితే ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. చదవండి: కరోనా వ్యాక్సిన్‌పై దేశం మొత్తానికి సమాన హక్కులు! -
‘మిలటరీ క్రమశిక్షణతో లాక్డౌన్ సడలించండి’
ముంబాయి: ఎన్సీపీ ఎంపీ సుప్రియ సూలే మహారాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. ఆర్థిక వ్యవస్థను గాడీలో పెట్టాలంటే దశల వారీగా లాక్‌డౌన్‌ను సడలించాలన్నారు. ఈ విషయం గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా ఆలోచించాలని కోరారు. కరోనా ప్రభావం లేని, తక్కువగా ఉన్న ప్రాంతాలలో లాక్‌డౌన్‌ను సడలించాలని, అయితే అక్కడ కరోనా విజృంభించకుండా ఉండేందుకు మిలిటరీ రూల్స్‌ని పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని, అలాంటి నిర్ణయాన్ని తొందరపాటుతో తీసుకోలేమన్నారు. అయితే సామాజిక దూరాన్ని అందరూ కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటూ మిలిటరీ క్రమశిక్షణను అమలు చేయగలిగితే కరోనా వ్యాప్తిని లాక్డౌన్ సడలించినప్పటికీ అరికట్టవచ్చన్నారు. (వైన్ షాపులు తెరవండి.. ఖజానా నింపుకోండి) లాక్డౌన్ సడలింపులకు సంబంధించి కేంద్రం కొన్ని మార్గదర్శకాలు ఇవ్వాలన్నారు. దుకాణదారులు, చిన్న చిన్న పరిశ్రమల వారు, చిరువ్యాపారులు కరోనా వల్ల తీవ్రంగా నష్టపోయారన్నారు. అటువంటి వారు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ప్రస్తుత పరిస్థితులను ఎలా అధిగమించాలో ఆలోచించాలన్నారు. తాను ఇది సరదా కోసం చెప్పడం లేదన్న ఆమె, కొన్ని నిబంధనాలు, మార్గదర్శకాలు పాటించడం ద్వారా ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి వీలవుతుందన్నారు. ఇంట్లో ఉంటే మన సమస్యలు తీరవని అందుకోసం పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. అయితే కొన్ని దేశాల్లో లాక్డౌన్ ఎత్తివేసిన తరువాత కరోనా కేసులు సంఖ్య విపరీతంగా పెరిగిందని అలాంటి సమస్యలు మన దేశంలో రాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సూలే సూచించారు. (కరోనా ఎఫెక్ట్ : వణుకుతున్న మహారాష్ట్ర) మహారాష్ట్రలో ఉద్ధవ్‌ఠాక్రే ప్రభుత్వం కరోనా కట్టడికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తోందన్నారు. ఇలాంటి సమయంలో కూడా ప్రతిపక్షాలు కావాలని విమర్శలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం తగదని సూచించారు. ప్రజలెవరూ సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్‌ని నమ్మవద్దని సూలే విజ్ఞప్తి చేశారు. అధికారులు ప్రజలకు వండ్డిన భోజంన పెట్టడం కంటే వారికి నిత్యవసర సరుకులు అందిస్తే బాగుంటుందన్నారు. అదేవిధంగా విద్యార్ధులందరూ లాక్డౌన్ సమయంలో ఇంట్లో ఉండి వారి పరీక్షలకు సంబంధించి చదువుకోవడం ఉత్తమమన్నారు. లాక్‌డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం మే3 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. -
‘మహా వివక్షపై సుప్రియా ఫైర్’
సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాది ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మహారాష్ట్ర శకటాలను తొలగించడంపై పాలక శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి నేతలు మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్ తర్వాత తిరస్కరణకు గురైన మరో విపక్ష రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. తమ ప్రభుత్వంపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని కూటమి నేతలు ఆరోపించారు. మహారాష్ట్ర పట్ల కేంద్రం పక్షపాత వైఖరిని ప్రదర్శించిందని దీనిపై మోదీ సర్కార్ వివరణ ఇవ్వాలని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కుమార్తె, ఆ పార్టీ నేత సుప్రియా సూలే డిమాండ్ చేశారు. దేశమంతటా జరిగే ఈ వేడుకలో అన్ని రాష్ట్రాలకూ కేంద్రం ప్రాతినిథ్యం ఇవ్వాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పక్షపాతం చూపుతూ విపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల పట్ల సవతి తల్లి ప్రేమ చూపుతోందని ఆమె దుయ్యబట్టారు. గణతంత్ర వేడుకల నుంచి మహా శకటాన్ని తిరస్కరిస్తూ కేంద్రం వివక్ష చూపడాన్ని తప్పుపట్టారు. రెండు రాష్ట్రాల ప్రతిపాదనలను మీరు (కేంద్రం) ఎందుకు తిరస్కరించారో వివరణ ఇవ్వాలని, దీనిపై మహారాష్ట్ర సీఎం దర్యాప్తు జరిపించాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కోరారు. -
నేను ఉల్లిగడ్డలు పెద్దగా తినను!
న్యూఢిల్లీ: సాధారణంగా ఉల్లిగడ్డలు కొస్తే కన్నీళ్లు వస్తాయి. కానీ, ఇప్పుడు ఉల్లిని కొనాలంటే సామాన్య, మధ్యతరగతి ప్రజలకు కన్నీళ్లు తప్పడం లేదు. దేశవ్యాప్తంగా ఉల్లిపాయ ధర అమాంతం పెరిగిపోయింది. ఎక్కడ చూసినా ఉల్లి సామాన్యుడికి అందుబాటులోకి వచ్చే అవకాశమే కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఉల్లి సెగ తాజాగా పార్లమెంటును తాకింది. లోక్‌సభలో ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలె ఈ అంశాన్ని లేవనెత్తారు. ఉల్లిధరలపై ఆమె కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ.. ఉల్లి ధరలను తగ్గించడానికి కేంద్రం తీసుకున్న చర్యలను సభకు వివరించారు. అయితే, ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ.. తమది ఉల్లిపాయలు ఎక్కువగా తినే కుటుంబం కాదని చెప్పుకొచ్చారు. ‘నేను ఉల్లి, వెల్లుల్లి పెద్దగా తినను. ఉల్లిపాయలను పెద్దగా ఉపయోగించని కుటుంబం నుంచి నేను వచ్చాను’ అని ఆమె వివరించారు. ఉల్లి ధరలు అమాంతం ఎందుకు పెరిగిపోయాయని సూప్రియా సూలె కేంద్రాన్ని ప్రశ్నించారు. మరోవైపు చిన్న, సన్నకారు ఉల్లి రైతులను కూడా కేంద్రం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
మోదీ ఆఫర్ ఇచ్చారు.. నేనే వద్దన్నా!
ముంబై: ప్రధాని మోదీ కలిసి పనిచేద్దామంటూ ఇచ్చిన ఆహ్వానాన్ని తానే తిరస్కరించానని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తెలిపారు. రాష్ట్రపతి పదవిని తనకు ప్రధాని ఇవ్వజూపారన్న వార్తలను పవార్ కొట్టిపారేశారు. ఓ మరాఠా టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన. గత నెలలో ప్రధాని మోదీతో భేటీ, అనంతర రాజకీయ పరిణామాలకు సంబంధించి పలు విషయాలు వెల్లడించారు. ‘కలిసి పనిచేద్దామంటూ మోదీ నన్ను అడిగారు. మన మధ్య వ్యక్తిగత సంబంధాలు చాలా బాగున్నాయి. వాటిని అలాగే కొనసాగనివ్వండి. కానీ, కలిసి పనిచేయడం మాత్రం కుదరదు అని ప్రధానికి తెలిపా’నన్నారు. ఆ భేటీలో తనకు రాష్ట్రపతి పదవి ఇవ్వజూపారంటూ వచ్చిన వార్తలపై ఆయన స్పందిస్తూ..‘అలాంటిదేమీ లేదు. కానీ, నా కుమార్తె సుప్రియా సూలేకు కేబినెట్లో చోటు కల్పిస్తామని చెప్పారు’అని పవార్ వివరించారు. దేవేంద్ర ఫడ్నవీస్‌తో అనూహ్యంగా చేతులు కలిపినందుకే అజిత్ పవార్‌కు ఉద్ధవ్ ఠాక్రే కేబినెట్లో స్థానం కల్పించలేదన్నారు. ‘అజిత్ ప్లేటు ఫిరాయించిన విషయం తెలియగానే మొట్టమొదటగా ఉద్ధవ్ ఠాక్రేకు ఫోన్ చేశా. అజిత్ అలా చేసి ఉండకూడదు.. నాపై నమ్మకముంచండి.. ఆ తిరుగుబాటును అణిచివేస్తానని ఠాక్రేకు తెలిపా’అని చెప్పారు. ‘అజిత్‌కు ఎన్సీపీ మద్దతు లేదని తెలియగానే అతడి వెంట ఉన్న ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెరిగిపోయింది. అందుకే వెంటనే వచ్చేశారు’అని వివరించారు. ‘ఫడ్నవీస్ పక్షంను వీడి రావాలంటూ నా కుటుంబ సభ్యులు ఎవరైనా అజిత్‌ను కోరిన విషయం నాకు తెలియదు. కానీ, అజిత్ చేసింది తప్పని అంతా భావించారు’ అని తెలిపారు. ‘నువ్వు క్షమించరాని పని చేశావు. దీనికి ఫలితం ఎవరైనా సరే అనుభవించాల్సిందే. నువ్వు అందుకు మినహాయింపు కాదు’అని అజిత్‌కు చెప్పానన్నారు. -
సుప్రియా సూలే భావోద్వేగ పోస్టు
ముంబై : మరికొద్ది గంటల్లో మహారాష్ట్రలో ‘మహా వికాస్ అఘాడి’ కూటమి ప్రభుత్వం కొలువు తీరనుంది. గత వారం రోజులుగా ‘మహా’ రాజకీయంలో ఎన్నో మలుపులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆయన కుమార్తె సుప్రియా సూలే, శివసేన నేత సంజయ్ రౌత్, చాకచాక్యంగా పావులు కదిపి కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. దీంతో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి అభ్యర్థిగా ఉద్దవ్ ఠాక్రే గురువారం సాయంత్రం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా సుప్రియా సూలే ట్విటర్లో భావోద్వేగంతో కూడిన సందేశాన్ని ఉంచారు. ఉద్దవ్ ఠాక్రే తల్లిదండ్రులైన బాల్ ఠాక్రే, మీనాతాయ్ ఠాక్రే(మా సాహెబ్) లతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. వారు ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయినా.. ఈ రోజు మాత్రం ఇక్కడే ఉంటారని అన్నారు. బాలా సాహెబ్, మా సాహెబ్‌లు తనను ఎంతో ప్రేమగా చూసుకునేవారని ఆమె తెలిపారు. నా జీవితంలో వారి పాత్ర ఎంతో ప్రత్యేకమైనదని.. వారి జ్ఞాపకాలు ఎప్పుడూ గుర్తుండిపోతాయని తెలిపారు. కాగా, మొన్నటివరకు పవార్, ఠాక్రే కుటుంబాలు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ.. వారి కుటుంబాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే. -
సుప్రియ చాణక్యం సూపర్!
సాక్షి, ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితి తొలగిపోయే సమయం ఆసన్నమైంది. ఊహించని మలుపులతో నెల రోజులుగా ‘మహా’ పొలిటికల్ ఎపిసోడ్ థిల్లర్ సినిమాను తలపించింది. అపర చాణక్యుడు శరద్ పవార్ సెంటిమెంట్‌తో ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో మహా వికాస్ కూటమి ప్రభుత్వం కొలువుతీరబోతోంది. కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి శివసేన నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో శరద్ పవార్‌ది ప్రధాన పాత్ర అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ‘మహా’ పర్వంలో పవార్ కుమార్తె సుప్రియా సూలే కూడా తన వంతు పాత్రను సమర్థవంతంగా పోషించి తండ్రి తనయ అనిపించుకున్నారు. ఎన్సీపీని చీల్చడానికి సోదరుడు అజిత్ పవార్ ప్రయత్నించినప్పుడు ఆమె స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. రాజకీయాల కంటే బంధాలే ముఖ్యమని నచ్చజెప్పి అజిత్‌ను తిరిగి పార్టీలోకి తీసుకురావడంతో సుప్రియ చూపిన చాకచాక్యాన్ని మెచ్చుకోవాల్సిందే. అంతేకాదు తమ పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా చూసుకోవడంలోనూ ఆమె ప్రదర్శించిన హుందాతనం ప్రశంసనీయం. ఎమ్మెల్యేలందరినీ పేరు పేరునా ఆప్యాయంగా పలకరిస్తూ ఐక్యతను నూరిపోశారు. ఎన్సీపీ ఎమ్మెల్యేలు ప్రత్యర్థుల కుట్రలో పడకుండా తండ్రి పవార్‌తో ఆమె కూడా అనుక్షణం అప్రమత్తంగా ఉండి మంత్రాంగం నడిపించారు. ఇక బుధవారం మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశం సందర్భంగా సుప్రియ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పార్టీలోకి తిరిగి వచ్చిన సోదరుడు అజిత్ పవార్‌ను ఆత్మీయ ఆలింగం చేసుకుని స్వాగతం పలికారు. అసెంబ్లీకి వచ్చిన తమ పార్టీ ఎమ్మెల్యేందరినీ దగ్గరుండి మరీ స్వాగతించారు. కరచాలనం చేసి, వెన్ను తడుతూ శాసనసభ్యులందరినీ ప్రోత్సహించారు. తమ పార్టీని చీల్చేందుకు ప్రయత్నించిన మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కూడా అంతే అభిమానంతో స్వాగతించి అందరి మన్ననలను చూరగొన్నారు. లోక్‌సభ సభ్యురాలిగా జాతీయ రాజకీయాల్లో రాణిస్తూనే మహారాష్ట్రలో తనదైన ముద్ర వేసిన సుప్రియ.. తండ్రిని మించిన తనయ అనిపించుకుంటారని ఆమెను దగ్గరగా చూసిన వారు అభిప్రాయపడుతున్నారు. మహారాష్ట్రలో తలెత్తిన రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించడంలో ఆమె పాత్ర ఎనలేనిదని ప్రశంసలు కురిపిస్తున్నారు. (చదవండి: శరద్ పవార్ క్షమించేశారు!!) -
శరద్ పవార్ క్షమించేశారు!!
ముంబై: ఎన్సీపీ రెబల్ నేత, శరద్ పవార్ అన్న కొడుకు అజిత్ పవార్ ఎట్టకేలకు మౌనం వీడారు. తాను ఇప్పటికీ ఎన్సీపీలోనే ఉన్నానని, ఎన్సీపీతోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. ‘నేను పార్టీని ఎప్పుడూ వీడలేదు. నేను ఎన్సీపీలోనే ఉన్నాను. ఎన్సీపీలోనే కొనసాగుతాను. నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారా? అలాంటిదేమీ లేదు కదా. మీడియా నా విషయంలో తప్పుగా కథనాలు రాసింది. వాటిపై సరైన సమయంలో స్పందిస్తాను’ అని అజిత్ బుధవారం మీడియాకు తెలిపారు. సోదరుడిని ఆలింగనం చేసుకున్న సుప్రియా పార్టీ అధినేత శరద్ పవార్‌కు వ్యతిరేకంగా అజిత్ పవార్ తిరుగుబాటు లేవనెత్తిన సంగతి తెలిసిందే. శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు శరద్ సిద్ధమవుతుండగా అనూహ్యంగా చివరినిమిషంలో అజిత్ ప్లేటు ఫిరాయించి బీజేపీతో చేతులు కలిపారు. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతునిస్తున్నట్టు గవర్నర్‌కు లేఖ ఇచ్చి.. డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. అనంతర పరిణామాల్లో ఎన్సీపీ ఎమ్మెల్యేలు శరద్ పవార్‌కే పూర్తి అండగా నిలువడం.. తన వర్గం ఎమ్మెల్యేలు కూడా ఆయనకు హ్యాండ్ ఇవ్వడంతో అజిత్ వెనుకకు తగ్గారు. డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో బీజేపీ ప్రభుత్వం కూడా దిగిపోయింది. ఈ నేపథ్యంలో అజిత్ తిరిగి ఎన్సీపీ గూటికే చేరుకున్నారు. ఈ తిరుగుబాటు విషయంలో పవార్ కుటుంబంలో తలెత్తిన విభేదాలు కూడా సమసిపోయినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ వద్ద సోదరుడు అజిత్‌ను సుప్రియా సూలె ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని స్వాగతం పలికారు. తద్వారా తమ మధ్య విభేదాలు లేవని చాటారు. చదవండి: అజిత్‌కు ఆత్మీయ స్వాగతం పలికిన సుప్రియా క్షమించేసిన శరద్ పవార్! తిరుగుబాటు లేవనెత్తి బీజేపీకి సపోర్ట్ చేసిన అజిత్ పవార్‌ను పార్టీ అధినేత శరద్ పవార్ క్షమించేశారట. ఈ విషయాన్ని ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్ మీడియాతో తెలిపారు. ‘చివర్లో అజిత్ తన తప్పు తాను తెలుసుకున్నారు. తప్పు చేసినట్టు అంగీకరించారు. ఇది కుటుంబ వ్యవహారం. పవార్ సాహిబ్ అజిత్‌ను క్షమించారు. ఆయన పార్టీలోనే ఉన్నారు. పార్టీలో ఆయన స్థానం ఏమాత్రం మారలేదు’ అని నవాబ్ మాలిక్ క్లారిటీ ఇచ్చారు. -
అజిత్‌కు ఆత్మీయ స్వాగతం పలికిన సుప్రియా
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీలో బుధవారం నూతన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం నేపథ్యంలో అసెంబ్లీ వద్ద కోలాహలం నెలకొంది. ముందుగానే అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్న ఎన్సీపీ నేత సుప్రియా సూలె పలువురు నేతలకు సాదర స్వాగతం పలికారు. మొదట శివసేన ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రేకు ఆమె స్వాగతం పలికారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆదిత్య ఠాక్రే అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకోవడంతో ఆయనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని స్వాగతం పలికారు. ఆ తర్వాత ఎన్సీపీ సీనియర్ నేత, తన సోదరుడు అజిత్ పవార్ వచ్చారు. అజిత్‌ను కూడా ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటూ స్వాగతం పలికారు. పార్టీ అధినేత శరద్ పవార్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి బీజేపీతో చేతులు కలిపిన అజిత్ పవార్ చివరినిమిషంలో మనస్సు మార్చుకొని తిరిగి ఎన్సీపీ గూటికి చేరుకున్న సంగతి తెలిసిందే. మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, నేతలు అసెంబ్లీకి చేరుకున్నారు. ఫడ్నవిస్‌తో మర్యాదపూర్వకంగా సుప్రియా సూలె కరచాలనం చేశారు. ఈ సందర్భంగా సుప్రియా సూలె మాట్లాడుతూ.. తమ సంకీర్ణ ప్రభుత్వం మీద ఎన్నో బాధ్యతలు ఉన్నాయని, మహారాష్ట్ర ప్రజలంతా తమకు అండగా నిలబడ్డారని అన్నారు. చదవండి: ఉద్దవ్ ఠాక్రేకే పీఠం.. -
‘మహా’ సెంటిమెంట్..
ముంబై: భారతీయులకు సెంటిమెంట్ ఎక్కువ అన్నది ఎవరు కాదనలేని వాస్తవం. అందుకే మనోళ్లను సెంటిమెంటల్ ఫూల్స్ అని వెక్కిరిస్తుంటారు. సెంటిమెంట్‌కు ఆయింట్మెంట్ కూడా లేదని సరదాగా అంటుంటారు. ఈ మాటకేమో గానీ సెంటిమెంట్‌తో రాజకీయాల్లోనూ ‘మహ’ బాగా నెగ్గుకురావొచ్చని తాజాగా నిరూపితమైంది. మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న తీవ్ర సంక్షోభం ఒక్క సెంటిమెంట్ సీన్‌తో సమసిపోయిందంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. వ్యూహాలు-ప్రతివ్యూహాలు, ఎత్తులు-పైఎత్తులతో నెలరోజులుగా వేడెక్కిన మరాఠ రాజకీయాలు చివరకు సెంటిమెంట్ సీన్‌తో కొలిక్కి వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన కలిసి రాకపోవడంతో బీజేపీ తెలివిగా ఎన్సీపీ శాసనసభా పక్షనేతగా ఉన్న అజిత్ పవార్‌ను తనవైపు తిప్పుకుంది. ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టి ఎన్సీపీలో చీలిక తేవాలని కుట్ర చేసింది. వెంటనే అప్రమత్తమైన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా మంత్రాంగం నడిపారు. అజిత్ పవార్‌ను శాసనసభా పక్షనేత పదవి నుంచి తొలగించి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. తనతో పాటు మిత్రపక్షాల ద్వారా అజిత్‌ను వెనక్కి పిలిచారు. ఇన్ని చేసినా అజిత్ పవార్ కమళ దండును వదిలి వెనక్కు రాలేదు. ఈలోగా మూడు రోజులు గడిచిపోయాయి. తన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ‘పెద్దాయన’ తన సతీమణి ప్రతిభ పవార్‌తో అజిత్‌కు రాయబారం పంపారు. బీజేపీ ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి పదవిని వదిలిపెట్టి వస్తే పవార్ పరివారంలో కలతలు సమసిపోతాయని, శివసేన కూటమి ప్రభుత్వంలో తిరిగి డిప్యూటీ సీఎం పదవి వస్తుందని అజిత్‌ను స్వయంగా కలిసి చిన్నమ్మ బుజ్జగించారు. చెల్లెలు సుప్రియా సూలే కూడా అన్నయ్యకు నచ్చజెప్పారు. వీరిద్దరి మాటలతో మెత్తబడ్డ అజిత్ వెంటనే బీజేపీ ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేసి సొంతగూటికి తిరిగి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో కామెంట్లు పోటెత్తున్నాయి. సినిమాల్లోనే కాదు సెంటిమెంట్ సీన్ ఎక్కడైనా పండుతుందని మరోసారి రుజువైందని నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. (రంగంలోకి దిగిన శరద్ పవార్ భార్య) -
‘మహా’ మహిళ..మూడో కంటికి తెలియదు
‘గేమ్ 145’. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ అది. ఈ గేమ్ ఫలితం.. ‘పార్టీ, ఫ్యామిలీ రెండూ చీలిపోయాయి’ అని సోషల్ మీడియాలో సుప్రియా సూలే పోస్ట్! తన తండ్రి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌ను తన పెదనాన్న కొడుకు అజిత్ పవార్ వెన్నుపోటు పొడిచాడని సుప్రియా సూలే ఆరోపణ. అజిత్ పవార్ నిర్ణయాన్ని దుయ్య బడుతూ, అతడి అవకాశవాదంపై నిప్పులు చెరగడంతో తాజాగా వార్తల్లోకి వచ్చిన సుప్రియా సూలేని ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన రాజకీయేతర, మహిళా ఉద్యమ అంశాలు అనేకం ఉన్నాయి. సుప్రియ దక్షిణాదికి తెలిసింది ఎన్సీపీ నాయకుడు శరద్‌పవార్ కూతురిగా మాత్రమే. యాభై ఏళ్ల సుప్రియా సూలే మహారాష్ట్రలోని బారామతి పార్లమెంట్ సభ్యురాలు. మహిళల సాధికారత, ఆదివాసీల హక్కుల కోసం ఆమె నిరంతరం తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఉన్నత విద్యావంతురాలు, నిరాడంబరంగా ఉంటారు. 2011లో ఆడశిశువుల గర్భస్థ హత్యలకు నిరసనగా ఉద్యమించారు. ఆమె చేసిన సామాజిక సేవకు గుర్తుగా ఆల్ లేడీస్ లీగ్ నుంచి ‘ముంబయి ఉమెన్ ఆఫ్ ద డికేడ్ అచీవర్స్’ అవార్డు అందుకున్నారు. మూడో కంటికి తెలియదు సుప్రియా సూలే తల్లిదండ్రులు శరద్‌పవార్, ప్రతిభాతాయి. సుప్రియ పూనాలో పుట్టారు. ముంబయిలోని జై హింద్ కాలేజ్‌లో మైక్రో బయాలజీలో బీఎస్సీ చేశారు. భర్త సదానంద బాలచంద్ర సూలే మల్టీ నేషనల్ కంపెనీలకు ఐటీ కన్సల్టెంట్. పెళ్లి తర్వాత ఈ దంపతులు కాలిఫోర్నియాకు వెళ్లిపోయారు. సుప్రియ అక్కడ బర్కిలీ యూనివర్సిటీలో వాటర్ పొల్యూషన్ మీద పీజీ చేశారు. ఆ తర్వాత కొన్నేళ్లు సింగపూర్, ఇండోనేసియాల్లో ఉద్యోగం చేసి ఇండియాకి వచ్చారు. ఆమెకి ఒక కొడుకు విజయ్, కూతురు రేవతి. ఇంత వరకు ఆమె జీవితం మూడో కంటికి తెలియకుండా గడిచిపోయింది. తొలి అడుగు రాజ్యసభలో ఇండియాకి వచ్చిన తరవాత సుప్రియా సూలే ముంబయిలోని నెహ్రూ సెంటర్ కమిటీలో ట్రస్టీగా చురుగ్గా సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఈ క్రమంలో 2006లో రాజ్యసభకు జరిగిన ఎన్నికల సందర్భంగా సుప్రియ జీవితం మలుపు తీసుకుంది. సుప్రియను రాజ్యసభకు నామినేట్ చేయాలన్న తన ఆలోచనను శరద్ పవార్ పార్టీ సమావేశంలో ప్రతిపాదించారు. శరద్ పవార్ నోటి వెంట సుప్రియ పేరు వినగానే పార్టీ శ్రేణుల కనుబొమలు ఆశ్చర్యంతో పైకి లేచాయి. శరద్ పవార్ రాజకీయ వారసత్వం ఎవరికి దక్కబోతోంది.. అని భ్రుకుటులు ముడివడ్డాయి. ఇప్పటి వరకు అజిత్ పవారే వారసుడు అనుకున్న వాళ్లలో అజిత్ కలకాలం ఆ సెకండ్ పొజిషన్లో ఉండలేక పోవచ్చు అని కూడా అనుకున్నారు. సుప్రియ మాత్రం రాజ్యసభ స్థానానికి నామినేషన్ వేసిన క్షణం నుంచి క్రియాశీలక రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించారు. పార్టీ వ్యవహారాలకంటే కూడా ఆమె గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి మీదనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. ఆదివాసీలు నివసించే ప్రదేశాల్లో ఆ పిల్లల కోసం స్కూళ్ల స్థాపన, నిర్వహణ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. మహిళా సాధికారత కోసం రాష్ట్రవ్యాప్తంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌ల ఏర్పాటులో పని చేశారు. ఆమె స్వయంగా ‘యశస్విని ఉమెన్స్ గ్రూప్’ నిర్వహిస్తున్నారు. ఆదివాసీల పిల్లల్లో పోషకాహారలోపాన్ని నివారించడానికి ఆమె పెద్ద ప్రయత్నమే చేశారు. ఇందుకోసం పార్టీలకతీతంగా స్థానిక నాయకత్వాన్ని కలుపుకుని పనిచేశారు. గిరిజన గురుకుల పాఠశాలల్లో (ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్స్) వసతుల కల్పన కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేశారు. ఒక రాజకీయ నాయకురాలిగా కంటే సామాజిక కార్యకర్తగానే సేవలందించారు సుప్రియ. తండ్రి స్థానం నుంచి ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ఉండగానే 2009లో లోక్‌సభకు ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో అప్పటి వరకు తండ్రి శరద్‌పవార్ ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన బారామతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు సుప్రియ. అప్పటి నుంచి వరుసగా మూడు ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. మోదీ హవా దేశాన్ని ఒకే తీరుగా నడిపించిన ఎన్నికల్లో కూడా సుప్రియ తన గెలుపు తానే శాసించగలిగారు. ఆమె తండ్రి వారసత్వంగా రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటికీ, నామమాత్రపు పాత్రగా మిగిలిపోలేదు. తలకెత్తుకున్న బాధ్యతకు నూటికి నూరుశాతం న్యాయం చేయాలనే దీక్ష ఉన్న వ్యక్తి. పార్లమెంట్ సభ్యురాలిగా ఆమెకు 96 శాతం అటెండెన్స్ ఉంది. ఆమె 136 డిబేట్లలో పాల్గొన్నారు. పదకొండు వందలకు పైగా ప్రశ్నలను సంధించారు. ఇరవై ప్రైవేట్ బిల్లులను ప్రవేశ పెట్టారు. సామాజిక మార్పు కోసం లోక్‌సభకు ఎన్నికైన తర్వాత సుప్రియ రాష్ట్రవ్యాప్తంగా మహిళా చైతన్య ఉద్యమాన్ని చేపట్టారు. గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలిసి అబార్షన్ చేయించుకోవడం అనేది సామాజిక రుగ్మతగా మారిపోయిందని ఆవేదన చెందేవారామె. ఈ పరిస్థితిని సమూలంగా నివారించడానికి కంకణం కట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రజలను చైతన్యవంతం చేశారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుని కడుపులో ఉన్నది ఆడపిల్ల అయితే అబార్షన్ చేయించుకోవడం మీద తీవ్రంగా గళమెత్తారు సుప్రియ. ‘ఆడపిల్లను పుట్టనివ్వండి’ అని రాష్ట్రమంతా పాదయాత్రలు, కాలేజీల్లో సభలు– సమావేశాలతోపాటు విద్యార్థుల్లో ఈ టాపిక్ మీద వక్తృత్వ, వ్యాస రచన పోటీలు నిర్వహించారు. మొత్తం రెండు వేల కాలేజీలను సందర్శించారు. సుప్రియ ఈ కార్యక్రమాన్ని సావిత్రిబాయి పూలే సొంతూరు నాయిగావ్ నుంచి ప్రారంభించారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి ఐదు వందల మంది బాలికలు నాయిగావ్కి వచ్చి కవాతులో పాల్గొన్నారు. పూనాలో మూడు రోజుల పాటు జరిగిన కార్యక్రమంలో మూడు వేల మంది బాలికలు పాల్గొన్నారు. మహారాష్ట్ర ప్రోగ్రెసివ్ స్టేట్‌గా మారాలని, ఆ మార్పులో అందరూ భాగస్వాములు కావాలని సుప్రియ పిలుపునిచ్చారు. ఈ ఉద్యమంలో మహిళలే కాదు మగవాళ్లు కూడా పాల్గొనాలని చెప్పారామె. ఈ సందర్భంగా ఆమె డాక్టర్ల మీద పెద్ద బాధ్యతనే పెట్టారు. ‘లింగ నిర్ధారణ పరీక్షలు చేయను’ అని ఎవరికి వారు స్వీయ క్రమశిక్షణ పాటించాలని డాక్టర్లను కోరారు. వివాదాల మబ్బు తెరలు సుప్రియ ఒక ప్రజాప్రతినిధిగా, సామాజిక కార్యకర్తగా తనకు తానుగా ఏర్పరుచుకున్న ఒక సామ్రాజ్యం ఐపీఎల్ వివాదం మబ్బు తెరలా ఆవరించింది. సుప్రియ భర్త సదానంద సూలే తండ్రి బీ ఆర్ సూలే మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్‌గా రిటైర్ అయ్యారు. ‘‘ఆయన 1992 నుంచి సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్‌కి చైర్మన్ అనే విషయం ప్రపంచానికి తెలుసు, ఇందులో దాపరికం ఏమీ లేదని పదిశాతం వాటా సదానంద సూలేకి అతడి తండ్రి నుంచి వారసత్వంగా వచ్చింది. ఆయనకు వయసు మీద పడడంతో మల్టీ స్క్రీన్ మీడియా (ఒకప్పటి సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్) బాధ్యతను తన భర్త చేపట్టారు’’ చెప్పారామె. ‘‘మాకు క్రికెట్ అంటే ఇష్టం. నేను, నా భర్త, పిల్లలు, మా కుటుంబంలో అందరమూ క్రికెట్‌ను చాలా ఇష్టంగా చూస్తాం. అయితే ఐపీఎల్ బిడ్స్ విషయంలో మా కుటుంబానికి కానీ, నా భర్తకు కానీ ఎటువంటి ప్రమేయం లేదు. మేమెప్పుడూ వీటికి దూరంగానే ఉంటున్నాం’’ అని చెప్పారు. యువతుల్లో చైతన్యం కోసం మహిళా సాధికారత సాధించిన సమాజం ప్రగతిబాటలో నడుస్తుంది. వరకట్నం, ఆడపిల్లల పట్ల వివక్ష వంటి జాడ్యాలను వదిలించుకున్నప్పుడే రాష్ట్రం అభ్యుదయ పథంలో నడుస్తుందంటారు సుప్రియ. యువతుల్లో రాజకీయ చైతన్యం కలిగించడానికి 2012లో ‘రాష్ట్రవాది యువతి కాంగ్రెస్’ను స్థాపించి, యువతులను రాజకీయరంగంలోకి ఆహ్వానించారు. ‘‘ప్రజలు రాజకీయాల పట్ల, ఇప్పుడు ఉన్న వ్యవస్థ మీద విశ్వాసాన్ని మాత్రమే కోల్పోతున్నారు, ఆశావహ దృక్పథాన్ని కోల్పోవడం లేదు’’ కాబట్టి వివేచన పరులైన యువతులు చదువుకుని సమాజాన్ని నడిపించాలంటారు సుప్రియ. – వాకా మంజులారెడ్డి -
బ్రేకింగ్ న్యూస్ ఏమో కానీ.. : సుప్రియా సూలే
ముంబై/న్యూఢిల్లీ : మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ అన్న కుమారుడు అజిత్ పవార్ రాత్రికి రాత్రి బీజేపీతో చేతులు కలిపి మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుకి కారణమయ్యాడు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై శరద్‌పవార్ కుమార్తె సుప్రియా సూలే సోషల్ మీడియా వేదికగా వరుస పోస్ట్‌లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె చేసిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. మహారాష్ట్రలో జరుగుతున్న నాటకీయ పరిణామాలను కవర్ చేయడానికి మీడియా ప్రతినిధులు చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో శరద్ పవార్ వెళ్తున్న కారును వెంబడించిన మీడియా ప్రతినిధులు.. ప్రమాదకర రీతిలో వీడియో చిత్రీకరించారు. ఓ వ్యక్తి బైక్ నడుపుతుండగా.. వెనకాల ఉన్న వ్యక్తి వీడియో చిత్రీకరిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను షేర్ చేసిన సుప్రియా.. ‘మీరు చేస్తున్నది బ్రేకింగ్ న్యూస్ కోసమని తెలుసు.. కానీ కాస్త జాగ్రత్త తీసుకోండి. నేను ఆ బైక్ డ్రైవర్, కెమెరామెన్ గురించి ఆందోళన పడుతున్నాన’ని పేర్కొన్నారు. బంధుత్వాలు ముఖ్యమని నమ్ముతాను.. అజిత్ పవార్ బీజేపీకి మద్దతుగా నిలిచి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడాన్ని ఉద్దేశించి సుప్రియా తన వాట్సాప్ స్టేటస్‌లో పలు పోస్ట్‌లను ఉంచారు. కుటుంబం, పార్టీలో చీలిక వచ్చిందని పేర్కొన్న ఆమె.. తాను జీవితంలో ఇంత దారుణంగా మోసపోతానని అనుకోలేదని అన్నారు. తాము అతన్ని నమ్మినందుకు, ప్రేమించినందుకు.. తిరిగి తమకు ఏమి లభించిందో చూడండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే.. ‘అధికారం వస్తుంది.. పోతుంది. కానీ బంధుత్వాలు ముఖ్యమని నేను నమ్ముతాను’, ‘ గుడ్ మార్నింగ్.. విలువలే చివరకు విజయం సాధిస్తాయి. నిజాయితీ, శ్రమ ఎప్పటికీ వృథా కాదు.. ఈ మార్గం చాలా కష్టమైనదైనప్పటికీ దీర్ఘకాలం నిలిచిపోతుంది’ అంటూ కూడా ఆమె పోస్ట్ చేశారు. కాగా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటీ నుంచి ప్రభుత్వ ఏర్పాటుపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. అధికార పంపిణీ విషయంలో శివసేన, బీజేపీల మధ్య పోరు నెలకొంది. ఈ నేపథ్యంలో శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీతో మంతనాలు జరిపింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు గడువు ముగియడంతో గవర్నర్.. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. ఈ క్రమంలో శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు తీవ్రంగా యత్నించింది. ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఓ నిర్ణయానికి వచ్చింది. శనివారం రోజున గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరేందుకు సిద్ధమైంది. కానీ, బీజేపీ తెరవెనక మంతనాలు జరపడంతో.. రాత్రికి రాత్రే మహా రాజకీయంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఎన్సీపీ నేత అజిత్ పవార్ బీజేపీ మద్దతుగా నిలువడంతో.. గవర్నర్ దేవేంద్ర ఫడ్నవిస్‌చే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. అయితే బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన, ఎన్సీపీలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీనిపై సుప్రీం కీలక ఆదేశాలు జారీచేసింది. దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్షను వెంటనే ఎదుర్కోవాల్సిన అవసరం లేదని, ఎప్పడు చేపట్టాలో సోమవారం తమ నిర్ణయం తెలుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. -
‘అజిత్‌తో అన్ని బంధాలు తెగిపోయాయి’
ముంబై : అజిత్ పవార్ ఎన్సీపీని మోసం చేసి నమ్మకద్రోహిగా మిగిలిపోయారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అజిత్ పవార్ నిర్ణయం పార్టీతో పాటు తమ కుటుంబంలోనూ చీలిక తెచ్చిందని పేర్కొన్నారు. ఇకపై తన తండ్రి అజిత్‌తో కలిసి పనిచేసే అవకాశమే లేదని స్పష్టం చేశారు. ‘ఇంకెవరిని నమ్మాలో అర్థం కావడం లేదు. నా జీవితంలో ఎన్నడూ ఇంతగా మోసపోలేదు. తనకు అండగా నిలబడ్డాను. ప్రేమించాను. కానీ నాకు తిరిగి ఏం లభించిందో చూడండి’ అని తన కజిన్ అజిత్ పవార్‌ను ఉద్దేశించి సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు పెట్టారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ శనివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. శివసేన, కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని శరద్ పవార్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఈ అనూహ్య పరిణామం చోటుచేసుకోవడంతో మహా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. (పవార్‌కు అజిత్ వెన్నుపోటు!) ఈ నేపథ్యంలో సుప్రియా సూలే శనివారం మీడియాతో మాట్లాడుతూ... ఎన్సీపీని వీడి నేతలంతా బీజేపీలో చేరిన సమయంలో తమ కార్యకర్తలంతా పార్టీకి అండగా నిలిచారన్నారు. అయితే అజిత్ పవార్ మాత్రం వారి నమ్మకాన్ని వమ్ముచేస్తూ బీజేపీతో చేతులు కలిపి తమకు షాకిచ్చారని వాపోయారు. ఇకపై ఆయనతో తమకు ఎటువంటి సంబంధాలు ఉండబోవన్నారు. కాగా బారమతి ఎంపీగా గెలుపొందిన సుప్రియ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారం నిర్వహించారు. బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని... ఇతర పార్టీ నాయకులను భయపెట్టి లొంగదీసుకుంటుందంటూ దూకుడుగా ప్రచారం నిర్వహించారు. ప్రస్తుతం తన కజిన్ అజిత్ ఈ విధంగా బీజేపీకి మద్దతు ప్రకటించడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.(మహా ట్విస్ట్: శరద్ పవార్ స్పందన) -
సుప్రియాను వేధించిన ట్యాక్సీ డ్రైవర్
ముంబై : ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కుమార్తె, బారామతి ఎంపీ సుప్రియా సులేకు శుక్రవారం ముంబైలోని దాదర్ స్టేషన్లో వింత అనుభవం ఎదురైంది. ట్యాక్సీ కావాలా అంటూ ఓ వ్యక్తి దాదర్ స్టేషన్లో ఏకంగా ట్రైన్‌లోకి ఎంటరై తమను వేధించాడని ఆమె ట్వీట్ చేశారు. కుల్జీత్ సింగ్ మల్హోత్రా అనే వ్యక్తి తన రైల్వే బోగీలోకి వచ్చి ట్యాక్సీ సర్వీస్ గురించి ప్రచారం చేసుకున్నాడని, తనకు ట్యాకీఅవసరం లేదని చెప్పినా వినిపించుకోకుండా తన వెంటపడుతూ తనతో ఫోటో కూడా తీసుకున్నాడని ఆమె దాదర్ స్టేషన్లో రైల్వే అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ ఫిర్యాదుతో మల్హోత్రాను అదుపులోకి తీసుకున్న అధికారులు నిందితుడికి జరిమానా విధించారు. రైల్వే అధికారులు ఈ ఘటనపై దృష్టిసారించి ప్రయాణీకులకు ఇలాంటి అనుభవం మరోసారి ఎదురవకుండా చర్యలు తీసుకోవాలని, ఆటో డ్రైవర్లు తమ సేవలపై ప్రచారం చేసుకునేందుకు అనుమతి ఉంటే రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో అందుకు అనుమతించరాదని, ట్యాక్సీ స్టాండ్స్‌కే వాటిని పరిమితం చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. ట్యాక్సీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని అతనికి జరిమానా విధించామని రైల్వే పోలీసులు వివరించగా వారికి సుప్రియా ధన్యవాదాలు తెలిపారు. ఏ ఒక్కరి వల్ల రైల్వే ప్రయాణీకులకు అసౌకర్యం వాటిల్లరాదని ఆమె పేర్కొన్నారు. -
రాహుల్‌కి సుప్రియా సూలే ‘గ్రీన్ ఛాలెంజ్’
సాక్షి, హైదరాబాద్: పచ్చదనం పెంచే లక్ష్యంతో మొదలుపెట్టిన గ్రీన్ ఛాలెంజ్ కొత్త పుంతలు తొక్కుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాందీని చేరింది. గ్రీన్ ఛాలెంజ్ మొక్కల లక్ష్యం రెండు కోట్లకు చేరిన సందర్భంగా మరోసారి మొక్కనాటిన టీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్, మరో నలుగురికి మొక్కలు నాటే ఛాలెంజ్ విసిరారు. వైఎస్సార్ సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, సినీనటుడు అఖిల్ అక్కినేని, జీఎమ్మార్ అధినేత మల్లికార్జున్‌రావులను మొక్కలు నాటాల్సిందిగా సంతోష్ కోరారు. వెంటనే దీనిని అంగీకరిస్తూ అఖిల్, మిథున్‌రెడ్డి, మల్లిఖార్జున్‌రావు ట్విట్టర్లో పోస్టు పెట్టారు. మల్లిఖార్జునరావు స్వయంగా మొక్కను నాటి హరితహారంపై తన ఆకాంక్షను వెల్లడించారు. అమెరికా పర్యటనలో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నానని, తిరిగిరాగానే మొక్కలు నాటుతానంటూ, తన తరపున మరో ముగ్గురిని నామినేట్ చేశారు. అందులో మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే కూడా ఉన్నారు. మిథున్‌రెడ్డి ఛాలెంజ్‌ను స్వీకరించిన సుప్రియా ఇవాళ తన నియోజకవర్గం పరిధిలోని జిల్లా పరిషత్ స్కూల్లో మొక్కలు నాటారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని తాను నామినేట్ చేస్తున్నట్లు సుప్రియ ట్వీట్ చేశారు. ఈవిధంగా గ్రీన్ ఛాలెంజ్ కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీని చేరింది. -
బరిలో కోటీశ్వరులు
లోక్‌సభ 2019 ఎన్నికలకు తొలి దశ పోలింగ్ మొదలైంది. మొత్తం ఏడు దశల్లో 545 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. వివిధ దశల్లో జరగబోయే పోలింగ్‌కు సంబంధించి ఇప్పటికే అనేక మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రెండుచోట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు నామినేషన్లు దాఖలు చేసిన ప్రముఖుల అఫిడవిట్లలో.. ఆస్తులు, అప్పులు, స్థిర చరాస్తులు, భూముల వివరాలు ఇలా ఉన్నాయి. ములాయంసింగ్ యాదవ్ (సమాజ్‌వాదీ పార్టీ) పోటీ చేస్తున్న స్థానం: మణిపురి ప్రకటించిన ఆస్తులు: రూ.20.54 కోట్లు 2014లో ఆస్తులు: రూ.15.95 కోట్లు స్థిరాస్తులు: రూ.16.21 కోట్లు (2014: రూ.12.54 కోట్లు) చరాస్తులు: రూ.4.33 కోట్లు (2014: రూ.3.41 కోట్లు) పెట్టుబడులు: రూ.50.09 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్: రూ.40.13 లక్షలు (ములాయంసింగ్ యాదవ్: రూ.11.25 లక్షలు, భార్య పేరిట: 28.88 లక్షలు) అప్పులు: రూ.2.2 కోట్లు క్రిమినల్ కేసులు: లక్నోలో ఒక కేసు అధీనంలోని భూమి: రూ.7.89 కోట్ల విలువైన 10.77 ఎకరాలు, 5,000, 5,974 చ.అ. ప్లాట్లు, 16,010, 3,230 చ.అ. వైశాల్యం గల రెండు ఇళ్లు. అమిత్ షా (బీజేపీ జాతీయ అధ్యక్షుడు) పోటీ చేస్తున్న స్థానం: గాంధీనగర్ ప్రకటించిన ఆస్తులు: రూ.30.81 కోట్లు స్థిరాస్తులు: రూ.15.29 కోట్లు చరాస్తులు: రూ.23.51 కోట్లు పెట్టుబడులు: రూ.21.95 కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్: రూ.37.61 లక్షలు అప్పులు: రూ.47.69 లక్షలు క్రిమినల్ కేసులు: పశ్చిమ బెంగాల్, బిహార్‌లో రెండు చొప్పున మొత్తం నాలుగు అధీనంలోని భూమి: 22 ఎకరాల పొలం, 3,511, 59,890 చ.అ. వ్యవసాయేతర ప్లాట్లు రెండు. సుప్రియా సూలే (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) పోటీ చేస్తున్న స్థానం: బారామతి ప్రకటించిన ఆస్తులు: రూ.140.88 కోట్లు 2014లో ఆస్తులు: రూ.116.46 కోట్లు స్థిరాస్తులు: రూ.22.55 కోట్లు (2014: రూ.17.47 కోట్లు) చరాస్తులు: రూ.118.33 కోట్లు (2014: రూ.98.99 కోట్లు) పెట్టుబడులు: రూ.97.86 కోట్లు (రూ.16.74 సుప్రియా సూలే పేరిట, రూ. 81.12 కోట్లు భర్త సదానంద సూలే పేరిట) చేతిలో ఉన్న నగదు: రూ. 94,320 (సుప్రియ పేరిట: రూ.28,770, భర్త సదానంద్: పేరిట రూ.23,050, కుమార్తె రేవతి పేరిట రూ.28,900, కొడుకు విజయ్ పేరిట రూ.13,600) అప్పులు: రూ.55 లక్షలు క్రిమినల్ కేసులు: లేవు అధీనంలోని భూమి: రూ.2.7 కోట్ల విలువైన 16.7 ఎకరాలు. రూ.1.03 కోట్ల విలువైన వ్యవసాయేతర భూమి 1.77 ఎకరాలు. 2765, 2541 చ.అ. విస్తీర్ణంలో ఉన్న రెండు ఇళ్లు. భర్త సదానంద్ పేరుతో 4,442 చ.అ. ఇల్లు మరొకటి). నితిన్ గడ్కరీ (బీజేపీ) పోటీ చేస్తున్న స్థానం: నాగ్‌పూర్ ప్రకటించిన ఆస్తులు: రూ.25.12 కోట్లు 2014లో ఆస్తులు: రూ.28.04 కోట్లు స్థిరాస్తులు: రూ.69.38 లక్షలు చరాస్తులు: రూ.91.99 లక్షలు పెట్టుబడులు: రూ.3.55 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్: రూ.8.99 లక్షలు, భార్య పేరిట రూ.11 లక్షలు) ∙అప్పులు: రూ.1.57 కోట్లు ∙క్రిమినల్ కేసులు: లేవు ∙అధీనంలోని భూమి: నాగ్‌పూర్‌లోని ధపేవాడలో 29 ఎకరాలు. ఇందులో 15 ఎకరాలు భార్య పేరుతో, 14.60 ఎకరాలు కుటుంబ ఉమ్మడి ఆస్తిగా నమోదైంది. నాగ్‌పూర్‌లోని మహల్ ప్రాంతంలో పూర్వీకుల ఇల్లు, ముంబైలోని ఎమ్మెల్యే సొసైటీలో ఒక ఫ్లాట్. ఊర్మిళ మటోండ్కర్ (కాంగ్రెస్ పార్టీ) పోటీ చేస్తున్న స్థానం: ముంబై నార్త్ ప్రకటించిన ఆస్తులు: రూ.68.88 కోట్లు స్థిరాస్తులు: రూ.41.24 కోట్లు చరాస్తులు: రూ.27.64 కోట్లు క్రిమినల్ కేసులు: లేవు ప్రియా దత్ (కాంగ్రెస్ పార్టీ) పోటీ చేస్తున్న స్థానం: ముంబై నార్త్ సెంట్రల్ స్థిరాస్తులు: రూ.72 కోట్లు (2014: రూ.60.30 కోట్లు) చరాస్తులు: రూ.24.20 కోట్లు (2014: రూ.6 కోట్లు) పెట్టుబడులు: రూ.55.50 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్:రూ.8.05 కోట్లు అప్పులు: రూ.3.5 కోట్లు క్రిమినల్ కేసులు: లేవు డింపుల్‌యాదవ్ (సమాజ్‌వాదీ పార్టీ) పోటీ చేస్తున్న స్థానం: కనౌజ్ ప్రకటించిన ఆస్తులు: రూ.37.78 కోట్లు 2014లో ఆస్తులు: రూ.28.04 కోట్లు స్థిరాస్తులు: రూ..26.20 కోట్లు (2014: రూ.21.71 కోట్లు) చరాస్తులు: రూ.11.58 కోట్లు (2014: రూ.6.33 కోట్లు) పెట్టుబడులు: రూ.55.50 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్: రూ.8.05 కోట్లు అప్పులు: రూ.14.26 లక్షలు క్రిమినల్ కేసులు: లేవు అధీనంలోని భూమి: రూ.8.39 కోట్ల విలువైన 18.74 ఎకరాలు, 925.36 చదరపు అడుగుల ప్లాట్. రెండు ఇళ్లు. రాహుల్ గాంధీ (కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు) పోటీ చేస్తున్న స్థానం: వయనాడ్ (కేరళ) ప్రకటించిన ఆస్తులు: రూ.15.88 కోట్లు 2014లో ఆస్తులు: రూ.9.4 కోట్లు స్థిరాస్తులు: రూ.10.08 కోట్లు (2014: రూ.1.32 కోట్లు) చరాస్తులు: రూ.5.80 కోట్లు (2014: రూ.8.07 కోట్లు) ∙అప్పులు:రూ.72 లక్షలు క్రిమినల్ కేసులు: 5 (పరువు నష్టం దావాలు నాలుగు ఉన్నాయి. నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన కేసు మరొకటి నమోదై ఉంది) -
కన్నీకి న్యాయం జరిగింది.. చాలా ఆనందంగా ఉంది!
సాక్షి, న్యూఢిల్లీ: దేశాన్ని కుదిపేసిన 2జీ కుంభకోణంలో ఢిల్లీ సీబీఐ కోర్టు సంచలన తీర్పున్నిచింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న కేంద్ర టెలికం మాజీ మంత్రి ఏ రాజా, డీఎంకే నాయకురాలు కనిమొళి సహా నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ న్యాయస్థానం గురువారం తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై డీఎంకే, కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. యూపీఏ సర్కారు ఏ తప్పూ చేయలేదనే విషయాన్ని ఈ తీర్పు చాటుతుందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అటు ఏ రాజా, కనిమొళి సన్నిహితులు కూడా ఈ తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. కనిమొళి సన్నిహితురాలు, ఎన్సీపీ నాయకురాలు సుప్రియా సులే 2జీ తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. 'నా స్నేహితురాలైన కన్నీకి న్యాయం జరిగినందుకు ఆనందంగా ఉంది' అంటూ ఆమె ఫొటో పెట్టి సులే ట్వీట్ చేశారు. ఇక, 2జీ తీర్పు అనంతరం కనిమొళి మీడియాతో మాట్లాడుతూ.. తన తప్పులేకపోయినా తనపై కేసు నమోదుచేశారని, కలైంజర్ టీవీలో తాను మైనారిటీ వాటాదారును మాత్రమేనని ఆమె అన్నారు. తీర్పు అనంతరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో మాట్లాడానని, సత్యమే గెలిచిందని ఆయన అన్నారని చెప్పారు. So happy for my friend kanni.. justice done🙏🏽🙏🏽🙏🏽😀 @KanimozhiDMK pic.twitter.com/NffxsIE1ww — Supriya Sule (@supriya_sule) 21 December 2017 -
మహిళా ఎంపీపై అభ్యంతరకర ట్వీట్లు, కేసు నమోదు
థానే : ఎన్సీపీ ఎంపీ సుప్రియ సూలేకి వ్యతిరేకంగా మైక్రో-బ్లాగింగ్ సైటులో అభ్యంతరకర ట్వీట్లు పోస్టు చేయడంతో ఓ ట్విట్టర్ యూజర్‌పై కేసు నమోదైంది. ఎన్సీపీ ఎంఎల్ఏ జితేంద్ర అవధ్ద్ నమోదుచేసిన ఫిర్యాదు మేరకు వర్తక్ నగర్ పోలీసు స్టేషన్లో కేసు రిజిస్ట్రర్ అయింది. ఎన్సీపీ నేత సుప్రియ సూలేపై ఓ ట్విట్టర్ యూజర్ అభ్యంతరకర పోస్టులు చేసినట్టు పోలీసు అధికారులు చెప్పారు. ఐపీసీ సెక్షన్స్ 354(డీ), 509(పదం, సంజ్ఞ లేదా చట్టం ద్వారా ఉద్దేశ్యపూర్వకంగా ఒక మహిళ వినయాన్ని అవమానపరచడం), 500(పరువునష్టం), ఐటీ యాక్ట్ సెక్షన్ 67 కింద ఈ విషయంపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఆమె ట్విట్టర్ అకౌంట్‌పై నిందితుడు అభ్యంతరకర ట్వీట్లను పోస్టు చేసినట్టు ఫిర్యాదులో అవద్ద్ చెప్పారు. సూలేకి వ్యతిరేకంగా చేసిన ఈ ట్వీట్ల వల్ల ఎన్సీపీ నేతల మనోభావాలు దెబ్బతిన్నాయని లిజిస్లేటర్ పేర్కొన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌కు సూలే కూతురు. ప్రస్తుతం ఆమె మహారాష్ట్రలోని బారమతి నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎంపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
సెల్ఫీతో నిరసన
సాక్షి, ముంబై : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత సుప్రియా సూలే.. ట్విటర్ వేదికగా సెల్ఫీలతో మహారాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. ముంబైలోని ప్రధాన రహదారుల్లో ఎక్కడ గుంతలు కనిపిస్తే అక్కడ ఆగి.. వాటితో ఒక సెల్ఫీ తీసుకుని ట్విటర్లో పోస్ట్ చేస్తున్నారు. ముంబై వాసులే కాకుండా మొత్తం మహారాష్ట్ర వాసులంతా.. ఇలా రహదారులపై ఎక్కడ గోతులు కనిపించినా.. సెల్ఫీలు తీసుకుని ట్విటర్, ఫేస్బుక్లో పోస్ట్ చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ముందుగా ఆమె.. ముంబైలోని ప్రధాన రహదారిపై కనిపించిన గోతులతో సెల్ఫీ తీసుకుని ఆమె ట్విటర్, ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఆమె పోస్ట్‌లకు ప్రజల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. మహరాష్ట్ర వాసుల కూడా ఇదే విధంగా ట్విటర్లో ఫొటోల మీదఫొటోలు పోస్ట్ చేస్తున్నారు. ఈ పోస్టులపై మహారాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వేగంగా స్పందించింది. రహదారి గుంతలను వెంటనే పూడ్చివేస్తూ.. పీడబ్ల్యూడీ వారు కూడా ట్విటర్లో ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు. మహారాష్ట్ర పీడబ్ల్యూడీ మంత్రి చంద్రకాంత్ పాటిల్ మాట్లాడుతూ.. సుప్రియా సూలేపై అద్భుతంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. ప్రజా సమస్యలపై ఆమె తీసుకుంటున్న చొరవను అభినందించారు. #Selfiewithpotholes at Katraj-Undri bypass & Bopdev ghat.@ChDadaPatil pic.twitter.com/IKUdOriSz5 — Supriya Sule (@supriya_sule) 1 November 2017 I want to thank every citizen and @supriya_sule tai for lending their support to #PotholeMuktMaha via Selfie with Potholes. (1/3) — Chandrakant Patil (@ChDadaPatil) 1 November 2017 -
మిస్త్రీ.. కుటుంబాన్ని త్యాగం చేశారు: మహిళా ఎంపీ
టాటా గ్రూపును బలోపేతం చేయడానికి, ఆ సంస్థలను లాభాల బాట పట్టించడానికి సైరస్ మిస్త్రీ ఎంతగానో కష్టపడ్డారని, అందుకోసం ఆయన తన కుటుంబ జీవితాన్నికూడా త్యాగం చేశారని మిస్త్రీ కుటుంబానికి స్నేహితురాలు, మహిళా ఎంపీ సుప్రియా సూలే అన్నారు. ఆయన పనితీరు బాగోలేదని చెప్పడం సరికాదని ఆమె అన్నారు. సైరస్ మిస్త్రీ, ఆయన భార్య రోహికా చాగ్లా ఇద్దరూ తనకు మంచి మిత్రులని ఆమె చెప్పారు. టాటా గ్రూపు చైర్మన్‌గా ఉన్న సైరస్ మిస్త్రీ (48)ని సోమవారం సాయంత్రం మార్కెట్లు ముగిసిన తర్వాత హఠాత్తుగా ఆ పదవి నుంచి తొలగించి, ఆయన స్థానంలో మళ్లీ రతన్ టాటాను నియమించిన విషయం తెలిసిందే. టాటా గ్రూపులో అతిపెద్ద స్టేక్‌హోల్డర్లలో ఒకటైన షాపూర్జీ పల్లోంజీ గ్రూపునకు చెందిన సైరస్ పల్లోంజీ మిస్త్రీని తొలగించడానికి ప్రధాన కారణం ఆయన పనితీరు బాగోకపోవడమేనని చెప్పారు. అయితే, సైరస్ మిస్త్రీ తన కుటుంబ వ్యాపారాలను కూడా విజయవంతంగా నడిపిస్తున్నారని ప్రముఖ మరాఠా నాయకుడైన శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే అన్నారు. టాటా గ్రూపు సంస్థలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఆయన చాలా కష్టపడ్డారని తెలిపారు. -
ఎంపీ సుప్రియా చెప్పిన రహస్యం
ఒపీనియన్స్ చేంజ్ చేసుకుంటేగానీ పొలిటీషియన్ కానేరడోయ్ అంటాడు గిరీశం. ప్రస్తుతం గొడవలొచ్చే ప్రకటనలిస్తే తప్ప రాజకీయవేత్తలు కారోయ్ అనొచ్చు. వివాదాస్పద ప్రకటనతో దృష్టి ఆకర్షించిన ప్రస్తుత ఎంపీ సుప్రియా సూలే- ఎన్సీపీ నేత, శరద్‌పవార్ కుమార్తె. నాసిక్‌లో ఈ మధ్య ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఓ దేవరహస్యం చెప్పారామె. పార్లమెంటులో వక్త మీద కాక, మిగిలిన వారి మీద కూడా అప్పుడప్పుడు కెమేరా తిరుగుతుంది. గంభీరంగా కనిపించినంత మాత్రాన వారేదో తీవ్ర సమస్య గురించి మథనపడుతున్నారని అనుకోనక్కరలేదంటారు సూలే. ఆ మధ్య తాను ఒక తమిళ మహిళా ఎంపీ పక్కన కూర్చుని ఉండగా కెమేరా తమ వైపు తిరిగిందని, తాము ఆ క్షణంలో ఏదో మాట్లాడుకుంటున్నా, అది చెన్నైని ముంచెత్తిన వరదల సంగతి మాత్రం కాదని సూలే చెప్పారు. మరేమిటి? ‘ఈ చీర బాగుంది ఎక్కడ తీసుకున్నారు?’ అని మాత్రమే అడిగాను అన్నారు సూలే. పార్లమెంటులో 50 శాతం సీట్లు మహిళలకు కేటాయిస్తే వారు బ్యూటీ పార్లర్ల గురించీ, ఫేషియల్సూ, చీరల గురించే చర్చించుకుంటారంటూ కొందరు పురుష ఎంపీలు తరువాత తనను ఆట పట్టించారని కూడా సూలే చెప్పారు. -
మా మధ్య విభేదాలు లేవు
ముంబై : బీజేపీ ప్రభుత్వానికి మద్దతు విషయంలో తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని ఎన్సీపీ నాయకురాలు సుప్రియాసూలే స్పష్టం చేశారు. గురువారం ఆమె స్థానిక పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ విషయంలో పార్టీ వైఖరిపై తనకు పరిమితులున్నాయనే ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు. అయితే బీజేపీ ప్రభుత్వానికి మద్దతు పలకడంపై తమ పార్టీ నాయకుడు జయంత్‌పాటిల్ ఇటీవల అలీబాగ్‌లో జరిగిన సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం వాస్తవమేనన్నారు. వాస్తవానికి భావి కార్యాచరణపై చర్చిం చేందుకే అక్కడ సమావేశాన్ని నిర్వహించామన్నారు. రాష్ట్రంలో పార్టీని ఏవిధంగా బలోపేతం చేయాలనే అంశంపై ఆ సమావేశంలో చర్చించామన్నారు. -
ఓటేసి.. సెల్ఫీ తీసుకున్న సుప్రియ
మహారాష్ట్ర ఎన్నికల్లో పోలింగ్ జోరుగా సాగుతోంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆయన కుమార్తె సుప్రియా సూలే, బీజేపీ ప్రధాన అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవిస్.. ఇలా పలువురు ప్రముఖులు ఉదయాన్నే తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. సుప్రియా సూలే తాను ఓటు వేయడమే కాక.. బయటకు వచ్చిన తర్వాత వేలికి ఇంకు గుర్తు చూపిస్తూ మరికొందరు మహిళా నేతలతో కలిసి సెల్ఫీ తీసుకున్నారు. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఏ పార్టీల మధ్యా పొత్తులు లేకపోవడంతో బీజేపీ, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ.. అన్నీ విడివిడిగానే పోటీ చేస్తున్నాయి. -
ఐదుగురే ‘మహా’రాణులు
ముంబై: రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల బరిలో దిగిన 58 మంది మహిళల్లో కేవలం ఐదుగురు మాత్రమే విజయం సాధించారు. అయితే గతసారితో పొల్చుకుంటే ఈసారి అతివల సంఖ్య మరో రెండుకు పెరిగింది. భారత ఎన్నికల కమిషన్ విడుదల చేసిన లెక్కల ప్రకారం...రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలకు మొత్తం 897 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. వీరిలో 58 మంది మహిళలు ఉన్నారు. ఉత్తర మధ్య ముంబై నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిని పూనమ్ మహాజన్, బారామతి నుంచి ఎన్సీపీ అభ్యర్థి సుప్రియా సూలే, నందూర్బార్ నుంచి బీజేపీ అభ్యర్థి హీనా గావిత్, రవేర్ నుంచి బీజేపీ అభ్యర్థి రక్షా ఖడ్సే, యావత్మల్-వాషీమ్ స్థానం నుంచి శివసేనకు చెందిన భావనా గావ్లీ విజయం సాధించారు . వీరిలో నలుగురు మహిళలు ప్రముఖ రాజకీయ కుటుంబానికే చెం దినవారే కావడం విశేషం. దివంగత బీజేపీ నేత ప్రమోద్ మహాజన్ కుమార్తె పూనమ్ మహాజన్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, రాష్ట్ర మాజీ మంత్రి విజయ్ కుమార్ గవిత్ కుమార్తె హీనా గావిత్, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఏక్నాథ్ ఖడ్సే కోడలు రక్షా ఖడ్సే ప్రత్యర్థులపై మంచి విజయాలు నమోదుచేశారు. పదోసారి గెలిచి రికార్డు సృష్టిద్దామనుకున్న కాంగ్రెస్ అభ్యర్థి మాణిక్‌రావ్ గవిత్‌ను హీనా గవిత్ ఓడించి సంచలనం సృష్టించారు. శాతాల వారీగా లెక్కిస్తే ఈ ఎన్నికల్లో 6.46 శాతం మంది మహిళలు బరిలోకి దిగితే 0.55 శాతం మందిని విజయం వరించింది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో 55 మంది మహిళలు బరిలోకి దిగగా కేవలం ముగ్గురు మాత్రమే గెలిచారు. యావత్మల్-వాషీమ్ లోక్‌సభ స్థానం నుంచి భావన గావ్లీ(శివసేన), ఉత్తర మధ్య ముంబై నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాదత్, బారామతి నుంచి ఎన్సీపీ అభ్యర్థి సుప్రియా సూలే విజయదుంధుబి మోగించారు. అన్ని అసెంబ్లీలతో పాటు లోక్‌సభలో 33 శాతం సీట్లు అతివలకు కేటాయించడానికి సంబంధించిన మహిళా బిల్లు ఇంకా పార్లమెంట్లో పెండింగ్‌లోనే ఉంది. అయితే ఈ బిల్లును 2010, మార్చి తొమ్మిదిన రాజ్యసభ ఆమోదించింది. -
'మామ కూతురికి ఓటేయకపోతే మటాషే'
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ కి, వివాదాలకు చాలా దగ్గరి సంబంధం. ఆయన నోరు విప్పితే చాలు కాంట్రవర్సీ అయివుతుంది. తాజాగా ఎన్నికల వేళ మహారాష్ట్రలో ఓటర్లను ఆయన బెదిరించారు. తమ పార్టీకి ఓటేయకపోతే ఊరికి నీటి సరఫరా ఉండదని ఆయన వార్నింగ్ ఇచ్చారు. మహారాష్ట్రలోని బారామతి నియోజకవర్గం నుంచి అజిత్ పవార్ మామ, నేషనలిస్ట్ కాంగ్రెస్ అధినేత శరద్ పవార్ కూతురు సుప్రియా సులే పోటీ చేస్తున్నారు. ఆమెకు మద్దతుగా ప్రచారం చేస్తూ మసల్ వాడీ అనే గ్రామంలో అజిత్ స్థానికులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన సుప్రియా సులేకి ఓటు వేయకపోతే ఊరికి నీటి సరఫరా నిలిపివేస్తామని బెదిరించారు. అంతే కాదు. 'ఎవరు ఏ పార్టీకి ఓటేశారో మాకు తెలిసిపోతుంది. ఈ ఈవీఎంలు ఆ విషయాన్ని చెప్పాస్తాయి. మాకు ఓటేయకపోతే గ్రామానికి నీరుండదు,' అని ఆయన అన్నారు. ఈ వ్రసంగాన్ని ఎవరో రహస్యంగా సెల్ ఫోన్ ద్వారా షూట్ చేసి బయటపెట్టారు. ఇప్పుడు అది హల్ చల్ చేస్తూండటంతో శివసేన, బిజెపిలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి, పవార్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విడియోలో ఒక స్థానిక యువకుడు ఊరికి నియమితంగా నీరు సరఫరా చేయాలని, గతంలో వాగ్దానాలు ఏమయ్యాయని అడిగితే అతడిని బయటకు పంపించేయడం కనిపిస్తుంది. ఎన్నికల సంఘం దీనిపై ఇప్పటి వరకూ స్పందించలేదు. గతేడాది అజిత్ పవార్ కరువు ప్రాంతాలలో ప్రసంగిస్తూ డ్యాములు, రిజర్వాయర్లు నిండాలంటే నేను వాటిల్లో మూత్ర విసర్జన చేసి నింపాలా అని రైతులను ప్రశ్నించారు. అప్పట్లో ఇది పెద్ద సంచలనం రేపింది. -
ఓటేసిన షిండే, సుప్రియా సూలే
సార్వత్రిక ఎన్నికల ఐదో విడత పోలింగ్ జోరుగా సాగుతోంది. ప్రముఖులు, రాజకీయ దిగ్గజాలు ఉదయాన్నే ఓటేశారు. కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే మహారాష్ట్రలోని షోలాపూర్ నియోజకవర్గంలో ఉదయాన్నే తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. అలాగే, బారామతి నియోజకవర్గంలో కేంద్ర మంత్రి శరద్ పవార్ కుమార్తె సుప్రియా సులే, కర్ణాటక షిమోగాలో బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఓటేశారు. ఛత్తీస్‌గఢ్ రాజ్‌నంద్‌గావ్‌లో రమణ్ సింగ్ కుమారుడు అభిషేక్ సింగ్ సతీసమేతంగా వచ్చి ఓటేశారు. ఐదో విడతలో భాగంగా బీహార్ -7, ఛత్తీస్‌గఢ్-3, జమ్మూకాశ్మీర్-1, జార్ఖండ్-6, కర్ణాటక-28, మణిపూర్-1, మధ్యప్రదేశ్-10, మహారాష్ట్ర-19, ఒడిశా-11, రాజస్థాన్-20, ఉత్తర్‌ప్రదేశ్-11, పశ్చిమబెంగాల్-4 స్థానాల్లో ఎన్నికలు గురువారం జరుగుతున్నాయి. -
రెండో దశ ప్రచార హోరు
షిండే, ఆశోక్ చవాన్, గోపీనాథ్ ముండే, సుప్రియా సూలే సాక్షి, ముంబై: పశ్చిమ, ఉత్తర మహారాష్ట్రలతోపాటు మరాఠ్వాడలో లోక్‌సభ ఎన్నికల ప్రచారాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఎండవేడిమిని సైతం లెక్క చేయకుండా ఉదయం నుంచి రాత్రి వరకు బహిరంగసభలు, రోడ్ షోలు, పాదయాత్రలు, వీధి సభలు, ఇంటింటి ప్రచారాలతో రాజకీయ నేతలు బిజీగా ఉంటున్నారు. ఈ నెల 17వ తేదీన జరగనున్న రెండో దశ ఎన్నికల్లో భాగంగా 19 లోక్‌సభ నియోజకవర్గాలకు జరిగే పోలింగ్‌లో గెలుపే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. బరిలో 352 మంది... రెండో దశలో 352 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే, మాజీ సీఎం అశోక్ చవాన్, బీజేపీ నాయకుడు గోపీనాథ్ ముండే, శరద్ పవార్ కుమార్తె సుప్రీయా సూలే తమ అదృష్టాన్ని మరోమారు పరీక్షించుకుంటున్నారు. ఈసారి కూడా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్-ఎన్సీపీ ప్రజాస్వామ్య కూటమి, శివసేన-బీజేపీ, ఆర్పీఐ, స్వాభిమాని షేత్కారీ పార్టీల మహాకూటమి మధ్యే ప్రధాన పోటీ జరిగే అవకాశం కనబడుతోంది. అయితే పలు నియోజకవర్గాల్లో ఆప్, ఎస్పీ, బీఎస్పీ, ఎమ్మెన్నెస్‌లతోపాటు ఇతర పార్టీలు కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. పశ్చిమ మహారాష్ట్రలో .... పశ్చిమ మహారాష్ట్రలో మొత్తం 10 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. వీటిలో మరాఠా సమాజానికి చెందిన వారి ప్రాబల్యమే ఎక్కువగా ఉంది. పశ్చిమ మహారాష్ట్రలో సుశీల్‌కుమార్ షిండే, అనీల్ శిరోలే, సుప్రియా సూలే, విజయసింగ్ మోహితే పాటిల్, రాజు శెట్టి, రాహుల్ నార్వేకర్, విశ్వజీత్ కదం మొదలగు ప్రముఖ అభ్యర్థులు బరిలో ఉన్నారు. పశ్చిమ మహారాష్ట్రలో ఎన్సీపీకి మంచి పట్టున్నా, 2009 లోక్‌సభ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. గత ఎన్నికల్లో ఏడు స్థానాల్లో పోటీ చేసిన ఎన్సీపీ కేవలం మూడు స్థానాల్లోనే విజయం సాధించింది. అదే మిత్రపక్షమైన కాంగ్రెస్ మూడు స్థానాల్లో పోటీ చేసి మూడింటిని గెలిచింది. దీంతో ఈసారి ఎన్సీపీ ఆరు, కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇక మహాకూటమి గురించి చెప్పాలంటే పశ్చిమ మహారాష్ట్రలో పెద్దగా ప్రభావం లేదు. అయితే స్వాభిమాని షేత్కారీ పార్టీతో జతకట్టడంతో లాభం చేకూరనుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 2009 ఎన్నికల్లో బీజేపీ పశ్చిమ మహారాష్ట్ర నుంచి ఖాతా కూడా తెరవలేకపోయింది. మిత్రపక్షమైన శివసేన ఐదు స్థానాల్లో పోటీ చేసి మూడింటిలో విజయం సాధించింది. ఒక స్థానాన్ని స్వాభిమాని పార్టీ నాయకుడు రాజు శెట్టి విజయం సాధించగా, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు. అయితే ఈసారి ఓటరు నాడి ఎటువైపు ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది. మరాఠ్వాడాలో... మరాఠ్వాడాలో మొత్తం ఎనిమిది లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. జాల్నా, ఔరంగాబాద్ మినహా మిగతా ఆరు లోక్‌సభ స్థానాలకు రెండో దశలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇక్కడ కూడా ప్రధాన పోటీ మహాకూటమి, ప్రజాస్వామ్య కూటమిల మధ్యనే జరగనుంది. ఇక్కడి నుంచి గోపీనాథ్ ముండే, అశోక్ చవాన్, పత్మసింగ్ పాటిల్ మొదలగు ప్రముఖ నాయకులు బరిలో ఉన్నారు. 2009 ఎన్నికలను పరిశీలిస్తే మరాఠ్వాడాలోని ఎనిమిది స్థానాల్లో ఐదు కాషాయకూటమి, మూడు ప్రజాస్వామ్య కూటమి దక్కించుకుంది. ఈసారి నరేంద్ర మోడీని ప్రధాని చేయాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీ నేత గోపీనాథ్ ముండే మరాఠ్వాడాపై ప్రత్యేక దృష్టి సారించారు. మరోవైపు మాజీ సీఎం ఆశోక్ చవాన్ మరాఠ్వాడాలో కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఉత్తర మహారాష్ట్ర, కోంకణ్‌లో... ఉత్తర మహారాష్ట్రలో మొత్తం పది లోక్‌సభ స్థానాలున్నాయి. అయితే రెండో దశలో కేవలం రెండు నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 12 లోక్‌సభ స్థానాలున్న కోంకణ్‌లో రత్నగిరి-సింధుదుర్గా లోక్‌సభ సీటుకు మాత్రమే ఈ నెల 17న పోలింగ్ జరగనుంది. కోంకణ్లోని రత్నగిరిలో కాంగ్రెస్ నేత నారాయణ రాణే కుమారుడు నీలేష్ రాణే బరిలో ఉన్నారు. మిత్రపక్షమైన ఎన్సీపీ స్థానిక నాయకులు, రాణే వర్గీయుల్లో విభేదాలున్నాయి. ఈసారి నీలేష్రాణేకు గట్టి పోటీ ఎదురుకానుందని తెలుస్తోంది. నీలేష్ రాణే కోసం తాము ప్రచారం చేయమని ఎన్సీపీ స్థానిక నాయకులు స్పష్టం చేశారు. రెండో దశ ఎన్నికల్లో హోరాహోరీ పోరు తప్పదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. -
ఎన్సీపీ కంచుకోట బారామతి
బారామతి పేరు చెబితే ఎవరికైనా ముందుగుర్తుకొచ్చేది కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్. ఈ స్థానం నాలుగు దశాబ్దాలుగా ఎన్సీపీ అధీనంలోనే ఉంది. 2009 దాకా శరద్‌పవార్ దీనికి ప్రాతినిధ్యం వహించారు. 2009 ఎన్నికల్లో ఆయన కుమార్తె సుప్రియాసూలే ఇక్కడినుంచే పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ తిరిగి ఆమె ఇక్కడి నుంచే బరిలోకి దిగారు. పుణే సిటీ, న్యూస్‌లైన్: బారామతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని దౌండ్, ఇందాపూర్, బారామతి, పురందరి, బోర్, ఖడక్వాస్లా శాసనసభ స్థానాలు ఎన్సీపీకి కంచుకోటగా ఉన్నాయి. శరద్‌పవార్ స్వస్థలం కావడంతో ఈ నియోజకవర్గం గత 40 సంవత్సరాల నుంచి ఆ పార్టీ అధీనంలోనే ఉంది. 2009 ఎన్నికల్లో పవార్ కూతురు సుప్రియా సూలే 4.22 లక్షల ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి పృథ్వీరాజ్‌పై విజయఢంకా మోగించారు. ఈ ఎన్నికల్లో ఆమెకు పోటీగా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి సురేష్ కోపడే, కాషాయకూటమి ఉమ్మడి అభ్యర్థి మహాదేవ్ జాన్కర్ బరిలో ఉన్నారు. అధికార కాంగ్రెస్, ఎన్సీపీ కూటమిపై అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ ఈ నియోజకవర్గంలో మాత్రం ఎన్సీపీ పాగా వేయడం ఖాయమని పలువురు భావిస్తున్నారు. ఇతర తాలూకాలతో పోలిస్తే బారామతి ఎంతో అభివృద్ధి చెందింది. టెక్స్టైల్స్, ఆటోమొబైల్ తదితర రంగాలతోపాటు సహకార సంస్థలు, చక్కెర కర్మాగారాలు ఇక్కడ ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఉత్తంనగర్, ఎన్.డి.నగర్, గిరి నగర్ తదితర ప్రాంతాల్లోని తెలుగు ప్రజల అభిప్రాయాలను ‘న్యూస్‌లైన్’ సేకరించింది. వసతులు కల్పిస్తేనే ఓటు ఈ ప్రాంతంలో రహదార్లను అభివృద్ధి చేయాలి. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలి. పేదలకు కనీస వసతులు కల్పించాలి. అందుకు కృషి చేసిన నాయకులకే ఓటేస్తాం. - మల్లికార్జున్‌రెడ్డి నిజాయితీపరులు కావాలి రాజకీయ వ్యవస్థలో మార్పులు రావాలి. నామినేషన్ల సమయంలో అభ్యర్థులు ప్రకటించిన ఆస్తులపై సీబీఐ ద్వారా దర్యాప్తు చేయించాలి. తప్పుడు వివరాలు వెల్లడించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలా అయితేనే వారిలో మార్పురాదు. అప్పుడే మన నాయకులు నిజాయితీగా పరిపాలిస్తారు. నిజాయితీతో కూడిన పాలన అందించిన నాయకులకే పట్టం కడతాం. - వెంకటస్వామి నిజాయితీపరుడికే ఓటు రోజురోజుకూ రాజకీయాలు మలినమవుతున్నాయి. ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడే రాజకీయాల్లో మార్పు వస్తుంది. నిజాయితీపరుడికే నా ఓటు. తెలిసినవారందరికీ ఇదే విషయం చెబుతా. - నరసింహారెడ్డి -
సుప్రియ ప్రచార వ్యయం రూ. 26 లక్షలు
పింప్రి, న్యూస్‌లైన్: బారామతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్సీపీ తరఫున బరిలోకి దిగిన సుప్రియాసూలే 15 రోజుల వ్యయం అక్షరాలా రూ. 26 లక్షలు. వాస్తవానికి ఎన్నికల ప్రచారానికి ఎన్నికల సంఘం విధించిన పరిమితి రూ. 70 లక్షలు. అంతకుమించి ఖర్చుచేస్తే అభ్యర్థిత్వాన్ని రద్దు చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుంది. అభ్యర్థులుు తమ ప్రచార వ్యయాన్ని కచ్చితంగా ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంటుంది. జిల్లాలో పలు లోక్‌సభ నియోజకవర్గాల బరిలోకి దిగిన ఆయా అభ్యర్థులు గత 15 రోజుల ఖర్చులను ఎన్నికల సంఘానికి అందజేశారు. ఇందుకు సంబంధించి సంబంధిత అధికారులు అందజేసిన వివరాలిలా ఉన్నాయి. బారామతి నుంచి బరిలోకి దిగిన సుప్రియా సూలే (ఎన్సీపీ) రూ. 26,01,959, మహాదేవ్ జాణకర్ (మహాకూటమి) 11,78,700, సురేష్ కోవడే (ఆమ్ ఆద్మీ) రూ. 16,82,599లు ఖర్చు చేశారు. మావల్ నుండి....రాహుల్ నార్వేకర్ (ఎన్సీపీ)రూ. 17,82,977, శ్రీరంగ భరణ్ (శివసేన) రూ. 13,69,169, లక్ష్మణ్ జగతాప్ (శేత్కారీ కామ్‌గార్ పార్టీ)-రూ. 9,32,128, మారుతి (ఆమ్ ఆద్మీ)-రూ. 2,12,332లు వెచ్చించారు. ఇక పుణే స్థానం నుంచి బరిలోకి దిగిన విశ్వజిత్ కదమ్ (కాంగ్రెస్) రూ. 14,13,847, అనిల్ శిరోలే (బీజేపీ)రూ. 4,40,231, దీపక్ పాయ్గుడే (ఎమ్మెన్నెస్) రూ. 2,07,640, అరుణ్ భాటియా (స్వతంత్ర) రూ. 1217,367, సుభాష్ నారే (ఆమ్ ఆద్మీ పార్టీ) రూ. 4,85,530లు వెచ్చించారు. ఇక శిరూర్ స్థానం నుంచి బరిలోకి దిగిన. శివాజీరావ్ ఆడల్‌రావ్ పాటిల్ (శివసేన) రూ. 16,15,337, దేవ్దత్త నికమ్ (ఎన్సీపీ) రూ. 3,47,251, అశోక్ ఖండేభరాడ్ (ఎమ్మెన్నెస్) రూ.1,98,375 చొప్పున ఖర్చు చేశారు. -
బారామతి రైతు భగ్గు
పింప్రి, న్యూస్‌లైన్: వడగండ్ల వానల వల్ల నష్టపోయిన తమను ఏ పార్టీ లేదా ప్రభుత్వమూ పట్టించుకోకపోవడంపై బారామతి రైతులు మండిపడుతున్నారు. ఇటువంటి నాయకులవల్ల ఒరిగేదేమీ లేదని భావించిన వీరంతా ఓటింగ్‌కు దూరంగా ఉండాలని యోచిస్తున్నారు. కాగా దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన బారామతి పార్లమెంటు నియోజక వర్గంలో 1967వ సంవత్సరం నుంచి శరద్ పవార్‌కు పేరు ప్రతిష్టలు తెచ్చి పెట్టింది. బారామతి నియోజకవర్గం ఓటర్లు 1967 నుంచి లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో శరద్ పవార్, అజిత్ పవార్, సుప్రియా సూలేలకు పట్టం కడుతూ వస్తున్నారు. నియోజక వర్గంలోని ఇతర తాలూకాలతో పోల్చితే బారామతి తాలూకా బాగా అభివృద్ధి చెందింది. ఈ తాలూకాలో టెక్స్టైల్, ఆటోమొబైల్ రంగాలతోపాటు సహకార సంస్థలు, చక్కెర కర్మాగారాలు, వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, బైపాస్ మార్గాలు... ఇలా అన్ని రంగాల్లో ప్రగతిపథంలో దూసుకుపోతోంది. ఈ నేపథ ్యంలో ఓటర్లు ఇక్కడినుంచి బరిలోకి దిగిన శరద్‌పవార్ లేదా ఇతర కుటుంబసభ్యులను ఆదరిస్తూనే ఉన్నారు. అయితే ఇటీవలి కాలంలో పరిస్థితుల్లో కొంతమార్పు గోచరిస్తోంది. ఇటీవల వడగండ్ల వానలు పడడంతో రైతాంగం భారీగా నష్టపోయింది. అయినప్పటికీ వారికి ఇప్పటిదాకా పరిహారం అందనేలేదు. దీంతో ఈసారి ఈ నియోజవర్గం నుంచి బరిలోకి దిగిన సుప్రియాసూలే గెలుపు నల్లేరుపై నడక కాకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు తాగు నీటి సమస్య కూడా తీవ్రస్థాయిలో ఉంది. దీంతో ఇక్కడి ప్రజలు ఈ విషయమై రాజకీయ నాయకులను నిలదీస్తున్నారు. తాలూకాలోని 22 గ్రామాలకు చెందిన ప్రజలు తాగునీటి కోసం నిరాహారదీక్షలు, ఆందోళనలు కూడా చేశారు. అయినప్పటికీ ఏ రాజకీయ పార్టీగానీ, లేదా రాష్ట్ర ప్రభుత్వంగానీ ఈ సమస్యకు తగు పరిష్కార మార్గం చూపడంలో విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ఓటర్లు ఈ ఎన్నికలపై అంత ఆసక్తి చూపడం లేదు. ఇదిలా వుండగా తాలూకాలో అనేక సహకార సంస్థలున్నాయి. అయితే చెరకు పండించే రైతుకు గిట్టుబాటు ధర కలగానే మిగిలిపోయింది. దీంతో గిట్టుబాటు ధరకోసం పలు రైతు సంఘాలు భారీ ఆందోళనలకు దిగాయి. అయినప్పటికీ ఎటువంటి ఫలితమూ దక్కలేదు. దీంతో స్థానిక చెరకు రైతులు... ఎన్నికలు, రాజకీయ నాయకులంటేనే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఓటెయ్యకూడదనే యోచనలో ఉన్నారు. ఇంకా పెరిగిన ధరలు, అవినీతి తదితరాలు కూడా వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఒకప్పుడు రాజకీయ నాయకులకు భారీగా స్వాగతం పలుకుతుండగా ఇప్పుడు పట్టించుకునేవారే కరువవుతున్నారు. -
నోరు జాగ్రత్త
ముంబై: ‘మా నాయకుడిపై విమర్శలు చేయడం కాదు.. దమ్ముంటే బారామతి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి సుప్రియ సులేపై పోటీ చేసి నెగ్గు.. నీ బలం ఏంటో తెలుస్తుంది.. సీనియర్ నాయకుడైన శరద్‌పవార్‌పై విమర్శలు చేసే స్థాయి నీకు లేదు..’ అంటూ శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రేపై సోమవారం ఎన్సీపీ నేతలు నిప్పులు చెరిగారు. శిరూర్‌లో ఆదివారం జరిగిన ఒక ర్యాలీలో ఉద్ధవ్ మాట్లాడుతూ ‘ఇక్కడ నుంచి కేంద్రమంత్రి, ఎన్సీపీ నేత శరద్ పవార్ పోటీచేసినా డిపాజిట్లు దక్కవు..’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఎన్సీపీ నాయకులు ,కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఒక సీనియర్ నాయకుడైన పవార్‌పై వ్యాఖ్యలు చేసేటప్పుడు భాషను అదుపులో పెట్టుకోవాలి. ఇకపై తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయనని ఇప్పటికే శరద్‌పవార్ ప్రకటించారు. అలాంటి నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు..’ అని ఎన్సీపీ రాష్ర్ట అధ్యక్షుడు భాస్కర్ జాదవ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జితేంద్ర అహ్వాద్ విమర్శలు గుప్పించారు. ‘ఉద్ధవ్‌కు దమ్ముంటే.. బారామతి నుంచి సుప్రియా సులేపై పోటీ చేయాలి..లేదా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మాపైనైనా పోటీచేసి గెలవాలి..’ అంటూ సవాలు విసిరారు. ‘ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబడితే పార్టీ కార్యకర్తల కష్టసుఖాలు తెలుస్తాయి.. మాతోశ్రీలో కూర్చుని కబుర్లు చెప్పడం కాదు..’ అంటూ జాదవ్ ఎద్దేవా చేశారు. ఒకప్పుడు శివసేన కార్యకర్త అయిన జాదవ్ ఆ తర్వాత పార్టీ నాయకత్వంతో విభేదించి ఎన్సీపీలో చేరారు. కాగా, శివసైనికులకు అవసరమైన ఉత్తేజపూరిత నాయకత్వాన్ని అందించడంలో ఉద్ధవ్ విఫలమయ్యాడని జాదవ్ విమర్శించారు. ‘శివసేన నాయకులు, కార్యకర్తల నుంచి అనుచిత ప్రవర్తన ఆశించడం తప్పే.. ఎందుకంటే వారు తమ పార్టీలోని సీనియర్ నాయకులకు గాని, మహిళలకు గాని ఎటువంటి మర్యాద నివ్వరు..’అంటూ గత ఏడాది దసరా ర్యాలీలో ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి, లోక్‌సభ స్పీకర్ అయిన మనోహర్ జోషికి వ్యతిరేకంగా నినాదాలు చేయించడం, మాజీ మేయర్ సుభా రావుల్, కార్పొరేటర్ శీతల్ మాత్రేపై ఆ పార్టీ కార్యకర్తల అనుచిత ప్రవర్తనలను ఉదహరించారు. కాగా, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీచేసేందుకు ఆరుగురు శివసేన ఎంపీలు ఆసక్తి చూపుతున్నారని భాస్కర్ జాదవ్ అన్నారు. అయితే వారి పేర్లను మాత్రం ఆయన వెల్లడించలేదు. జితేంద్ర అహ్వాద్ మాట్లాడుతూ..‘ఉద్ధవ్ ఠాక్రే సీఎం అవుదామని కలలు కంటున్నాడు.. అది అసాధ్యం..ఇంట్లో కూర్చుని రాజకీయాలు చేయడం తప్ప ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనే దమ్ము, ధైర్యం ఆయనకు లేవు..’ అంటూ విమర్శించారు. ‘నీకు శరద్ పవార్ వంటి సీనియర్ నేతను విమర్శించే హక్కులేదు.. ఆయన 50 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు..22 సార్లు ఎన్నికల్లో గెలిచారు. అటువంటి వ్యక్తి గురించి మాట్లాడుటప్పుడు నోరు అదుపులో ఉంచుకోవాలి..’ అంటూ నిప్పులు చెరిగారు.‘ అసలు నీకు ధైర్యముంటే.. నాపై ముంబై-కావ్లా నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలువు..’ అంటూ సవాలు విసిరారు.