Uday
-
చెట్టు చెట్టుకో కథ.. తెలంగాణలోని 9 చారిత్రక వృక్షాలివీ..
సాక్షి, హైదరాబాద్: వరదల నుంచి 150 మంది ప్రాణాలను కాపాడిన చెట్టు ఒకటి.. కొబ్బరికాయ ముడుపు కడితే వీసాలు ప్రసాదించేది మరో చెట్టు.. చేతులెత్తి మొక్కితే మొండి రోగాలను కూడా నయం చేస్తుందని భక్తులు నమ్మేది ఇంకో చెట్టు.. దోపిడీ దొంగల్ని పట్టించిన మరొక చెట్టు.. ఇలా రాష్ట్రంలో దేనికవే ప్రత్యేకమైన 9 పురాతన వృక్షాలున్నాయి. ఈ చెట్ల పరిరక్షణ కోసం పాటుపడుతున్న స్వచ్ఛంద సంస్థ ‘వట’ ఫౌండేషన్.. ఆయా వృక్షాలకు వారసత్వ సంపద గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దేశంలోని పురాతన చెట్ల చరిత్రను డాక్యుమెంట్ చేయాలనే లక్ష్యంతో ‘వట’ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఉదయ్ కృష్ణ ఇప్పటివరకు 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో సుమారు 27 వేల కి.మీ. ప్రయాణించారు. అతి పురాతన చెట్లను గుర్తించి, వాటిని గూగుల్ ఎర్త్ ప్రో మ్యాప్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 150 వృక్షాలను మ్యాపింగ్ చేశారు. మనుగడ కోల్పోయే దశలో ఉన్న వృక్షాలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద సంస్థలు దత్తత తీసుకోవాలని కోరారు.తెలంగాణలోని 9 చారిత్రక వృక్షాలివీ..దొంగల్ని పట్టించిన బావోబాబ్..హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో 600 ఏళ్ల నాటి పురాతన బావోబాబ్ చెట్టు ఉంది. గోల్కొండ కోట గోడను ఆనుకొని ఉన్న ఈ వృక్షపు కాండం ఒక రహస్య గది మాదిరిగా ఉంటుంది. ఇందులో 20 మంది దాక్కునేంత కుహరం ఉంది. దీంతో దొంగలు పగటి పూట ఈ రహస్య గదిలో దాక్కొని రాత్రి సమయంలో కోట పరిసర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడేవారు. ఒకరోజు దొంగలు వంట చేస్తుండగా చెట్టు వెనక నుంచి పొగలు రావడం స్థానికులు గమనించారు. ఈ విషయాన్ని సైనికులకు తెలపడంతోదొంగల గుట్టురట్టయింది.వరదల నుంచి కాపాడిన చింత..ఉస్మానియా ఆసుపత్రిలో చింత చెట్టు ఉంది. 1908, సెప్టెంబర్ 28న మూసీ నది వరదలు నగరాన్ని ముంచెత్తాయి. దాదాపు 30 వేల మంది మరణించారు. ఆ సమయంలో ప్రాణాలు రక్షించుకునేందుకు 150 మంది ప్రజలు ఈ చింత చెట్టు ఎక్కి రెండు రోజుల పాటు కొమ్మలపైనే ఉన్నారు. ప్రతీ ఏడాది నవంబర్ 30న హాస్పిటల్ డేను ఈ చెట్టు కిందే ఆసుపత్రి సిబ్బందిజరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.చెట్టుకు రాఖీ..నాగర్‌కర్నూల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలోని చీమ చింత చెట్టు భారీ వర్షానికి నేల కూలింది. 2017లో స్కూల్ యాజమాన్యంతో కలిసి ‘వట’ ఫౌండేషన్ దీనికి తిరిగి జీవం పోసింది. భారీ క్రేన్ సహాయంతో ఆ చెట్టును తిరిగి భూమిలో పాతారు. అప్పటినుంచి ఏటా జూన్ 28న విద్యార్థులు, టీచర్లందరూ ఆ చెట్టకు రాఖీ కడుతూ పండగ చేసుకోవడం ఆనవాయితీగా మారింది.వేయి ఉరుల మర్రి నిర్మల్‌లోని వేయి ఉరుల మర్రికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో రామ్‌జీ గోండు నాయకత్వంలో స్వయంపాలన ప్రకటించుకున్న గిరిజనులను బ్రిటిష్ పాలకులు దారుణంగా అణచివేశారు. రామ్‌జీ గోండును, అతని వేయి మంది సైన్యాన్ని పట్టుకొని ఈ మర్రి చెట్టుకు1860 ఏప్రిల్ 9న అందరినీ ఒకేసారి ఉరి తీసినట్లు జాన పధ కథల్లో చెబుతుంటారు. అందుకే ఈ చెట్టును ‘వెయ్యి ఉరుల మర్రి’గా పిలుస్తుంటారు. అయితే కాలక్రమేణా ఈ వృక్షం నరికివేతకు గురి కావడంతో ఇక్కడ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు.రోగాలు మాన్పించే వృక్షం..చేవెళ్లలోని దామరిగిద్దలోఉన్న చింత చెట్టు 600 ఏళ్ల నాటిది.ఈ పురాతన చింత చెట్టుకు ఒక బొరియఉంటుంది. అనారోగ్యంతో ఉన్న పిల్లలుఈ బొరియ గుండా వెళితే రోగం నయమవుతుందని గ్రామస్తుల విశ్వాసం.పర్యాటక పిల్లలమర్రి..మహబూబ్‌నగర్‌లోని పిల్లలమర్రి సుమారు 800 ఏళ్ల నాటి భారీ వృక్షం. ఒకప్పుడు 4 ఎకరాల్లో విస్తరించి ఉండేది. కానీ, ఆక్రమణ కారణంగా ప్రస్తుతం 2.5 ఎకరాలకు పరిమితమైపోయింది. ఈ చెట్టును చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. భారీ కొమ్మలతో విశాలంగా విస్తరించి ఉండటంతో ఈ ప్రాంతానికే పిల్లల మర్రి అనే పేరు వచ్చింది. వేల కొద్ది మర్రి ఊడల కారణంగా ప్రధాన కాండం ఏదో స్పష్టంగా గుర్తించలేం.వీసాలు ప్రసాదించే మర్రి హిమాయత్‌సాగర్‌లోని చిలుకూరు బాలాజీ ఆలయం ఎలాగైతే వీసా గాడ్‌కు పేరు గాంచిందో.. నిజామాబాద్ జిల్లా ముప్కాల్‌లోని మర్రి చెట్టు కూడా వీసాల చెట్టుగా గుర్తింపు పొందింది. విదేశాలకు వెళ్లే విద్యార్థులు, కార్మికులు ఎరుపు లేదా తెలుపు రంగు గుడ్డలో కొబ్బరికాయ కట్టి ఈ చెట్టుకు ముడుపు కడితే వీసా వస్తుందని స్థానికుల విశ్వాసం. అయితే వడగళ్ల వర్షం కారణంగా ఈ భారీ వృక్షం నెలకొరిగింది. చుట్టుపక్కల నివాసితులకు ముప్పుగా మారడంతో గ్రామస్తులు వృక్షంలోని ఎక్కువ భాగాన్ని నరికివేశారు. కేవలం 15 అడుగుల వరకు విస్తరించి ఉన్న భారీ కాండం మాత్రమే ఇప్పుడు మిగిలి ఉంది. జహీరాబాద్‌లోని గొట్టిగారిపల్లి గ్రామంలోని చెరువు పక్కన ఉన్న మర్రి చెట్టు, నిజామాబాద్‌లోని ఆర్గుల్ గ్రామంలోనిఒక కొండపై ఉన్న మూడు పురాతన చింత చెట్లు కూడావందల ఏళ్ల నాటి వృక్షాలే. చారిత్రక గుర్తింపుతో ఆయావృక్షాలు పర్యాటకలను ఆకర్షిస్తున్నాయి. -
జనసేన ఎంపీ ఏకపక్ష ధోరణిపై టీడీపీలో అసంతృప్తి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమి నేతలు ఆధి పత్యం కోసం బస్తీమే సవాల్ అంటున్నారు. కాకినాడ నగరంలో కూటమి నిట్టనిలువునా చీలిపోయింది. జనసేన, టీడీపీ నేతలు ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలుగా విడిపోయి ప్రతి చిన్నదానికి తన్నుకుంటున్నారు. అధికారుల బదిలీ కోసం మొదలైన ఆధిపత్య పోరు మద్యం, బాణసంచా షాపులు దక్కించుకునే వరకు దారి తీసింది. ఒక వర్గానికి వచ్చిన షాపులను మరో వర్గం లాగేసుకునే ప్రయత్నాలతో ఇరువర్గాలు రోడ్డెక్కి రచ్చరచ్చ చేస్తు న్నాయి. జనసేన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, టీడీపీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఆర్డీఓ బదిలీ వ్యవహారంలో రాజుకున్న అగ్గి ఇటీవల కాకినాడ ఆర్డీఓ బదిలీ వ్యవహారంలో ఇరువురి మధ్య సఖ్యత చెడిందంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాగా ఉన్నప్పటి నుంచి కాకినాడలో వివిధ హోదాల్లో పనిచేసిన మల్లిబాబును ఆర్డీఓగా తీసుకురావాలనేది ఎంపీ ఉదయ్ ఆలోచన. ఇక్కడ జెడ్పీ సీఈఓగా పనిచేసిన సత్యనారాయణను ఆర్డీఓగా నియమిస్తామని కొండబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఒప్పందాలు కూడా జరిగాయి. ఆర్టీఓ బదిలీల్లో ఎంపీ పెత్తనం ఏమిటంటూ ఎమ్మెల్యే వర్గీయులు విమర్శలకు దిగారు. చివరకు ఈ బదిలీ వ్యవహారం ఎంపీ, ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఎంపీ సిఫారసు చేసిన మల్లిబాబు ఆర్డీఓగా నియమితులయ్యారు. ఇది చాలదు అన్నట్టుగా ఒకప్పుడు సిటీ ఎమ్మెల్యే కొండబాబుకు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన టీడీపీ సిటీ అధ్యక్షుడు నున్న దొరబాబు ఆ శిబిరం నుంచి బయటకు వచ్చేసి ఎంపీ శ్రీనివాస్ శిబిరంలో చేరారు. ఎమ్మెల్యే కొండబాబు వ్యవహారాలను అతని సోదరుడు సత్యనారాయణ సమన్వయం చేసుకునేవారు. సత్యనారాయణతో పాటు దొరబాబు కూడా కలిసే ఉండేవారు. అటువంటిది వీరిద్దరి మధ్య వచ్చిన పొరపొచ్చాలతో దొరబాబు ఎమ్మెల్యే శిబిరం నుంచి బయటకు వచ్చేశారు. సరిగ్గా అదే సమయంలో జనసేన రూపంలో కాకినాడ ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ గెలుపొందడంతో దొరబాబు ఆ శిబిరంలో చేరి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య వైషమ్యాలు పెరుగుతూ వచ్చి చివరకు మద్యం, బాణసంచా షాపు ల వ్యవహారంలో పట్టుదలతో తారా స్థాయికి చేరుకుని రోడ్డెక్కే వరకు వెళ్లాయనేది పరిశీలకుల మాట. ముక్కున వేలేసుకుంటున్న జనం కాకినాడ సంజయ్‌నగర్‌లో ఒక మద్యం దుకాణాన్ని డ్రాలో తెలంగాణాలోని సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన కౌకుట్ల జీవన్‌రెడ్డి అనే కాంట్రాక్టర్ దక్కించుకున్నారు. షాపు ఏర్పాటు కోసం లీజు అగ్రిమెంట్ చేసుకుని పనులు మొదలుపెట్టేసరికి ఎమ్మెల్యే కొండబాబు ముఖ్య అనుచరుడు, నగర టీడీపీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, అతని అనుచరగణం అడ్డుతగిలారు. ఇంతకీ షాపు దక్కించుకున్న లీజుదారుడు ఎంపీ శ్రీనివాస్‌కు సహచరుడు.అదే కారణంతో ఎమ్మెల్యే కొండబాబు తన అనుచరులను రెచ్చగొట్టి దౌర్జన్యంగా మద్యం షాపును లాగేసుకునేందుకు ప్రయతి్నంచారని ఎంపీ వర్గం ఆరోపిస్తోంది. ఇది చినికిచినికి గాలివానగా మారి పోలీసుల వరకు వెళ్లింది. ఈ రెండు వర్గాల మధ్య ఈ వివాదం కొనసాగుతుండగానే తాజాగా కాకినాడ మెయిన్‌రోడ్డులో బాణసంచా షాపు ఏర్పాటు కోసం ఎమ్మెల్యే కొండబాబు వర్గం ప్రయత్నించింది. ఎప్పుడూ జనంతో రద్దీగా ఉండే మెయిన్‌రోడ్డులో మందుగుండు షాపు ఇచ్చిన దాఖలాలు లేవని, ప్రమాదకరమనే కారణంతో అధికారులు అనుమతి ఇవ్వలేదు.మద్యం దుకాణం విషయంలో గొడవ చేసినందుకు ప్రతీకారంగా ఎంపీ కావాలనే మందుగుండు షాపునకు అను మతి రాకుండా అడ్డుకున్నారని ఎమ్మెల్యే వర్గీయులు ఆరోపిస్తూ సోమవారం రాత్రి రోడ్డెక్కడం అటు జనసేన, ఇటు టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మా రింది. ఏదో ప్రజా సమస్యల కోసం పోరాటాలు చేసినట్టు వ్యక్తిగత లాభాపేక్ష కోసం నిర్వహించే మ ద్యం, బాణసంచా షాపుల కోసం రోడ్డెక్కుతారా అంటూ టీడీపీ నేతల తీరుతో ప్రజలు ముక్కున వేలేసు కుంటున్నారు. గతంలో ఎప్పుడూ ఏ పార్టీ ఇలా దిగజారుడు రాజకీయాలకు పాల్పడలేదని ఆక్షేపిస్తున్నారు. ఎంపీని ఏకాకిని చేసే వ్యూహం జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ వివిధ కారణాలతో కాకినాడ ఎంపీ శ్రీనివాస్‌ను ఇటీవల కాలంలో దూరం పెట్టారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఎంపీ కూటమిలోని ఎమ్మెల్యేలను కనీసం పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా పోతున్నారని ఆయా నియోజవకర్గాల నేతలు ఆగ్రహంతో ఇప్పటికే పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదులు చేశారని కూటమి నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమిలో ఎంపీ శ్రీనివాస్‌ను ఏకాకిని చేసే వ్యూహంలో భాగంగానే టీడీపీ నేతలు తెర వెనుక ఉండి కొండబాబును నడిపిస్తున్నారనే చర్చ నడుస్తోంది. -
పిఠాపురం ముంపుకు ప్రభుత్వమే కారణం ఎమ్మెల్యే, ఎంపీలు ఎక్కడ ?
-
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం చూసి స్టోరీ రాసుకున్నా: ఉదయ్ శెట్టి
‘భయం, అత్యాశ, కుట్ర అనేవి ప్రతి మనిషిలో ఉంటాయి. అయితే కొందరిలో కొంత మరికొందరిలో ఎక్కువగా ఉంటాయి. ఈ మూడు లక్షణాలు కొందరు మనుషులను ఎలాంటి పరిస్థితుల వైపు తీసుకెళ్లాయి అనేది "గం..గం..గణేశా"లో ఆసక్తికరంగా తెరకెక్కించాం’ అన్నారు డైరెక్టర్ ఉదయ్ శెట్టి. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘గం..గం..గణేశా’. ఆనంద్ దేవరకొండ హీరో. సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. రేపు(మే 31) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు ఉదయ్ శెట్టి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. → నేను విజయేంద్రప్రసాద్ గారి టీమ్ లో రైటర్ గా వర్క్ చేసేవాడిని. ఒకసారి హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నాను. ఆ టైమ్ లో ఈ స్టోరీ లైన్ ఫ్లాష్ అయ్యింది. నా ఫ్రెండ్, దర్శకుడు అనుదీప్ కేవీ ద్వారా ఆనంద్ దేవరకొండ టీమ్ కు ఈ స్క్రిప్ట్ సినాప్సిస్ పంపించాను. ఆ సాయంత్రమే నాకు ఫోన్ వచ్చింది. వచ్చి ఒకసారి కలవండి అని. నేను వెళ్లి స్క్రిప్ట్ గురించి వాళ్లకున్న డౌట్స్ క్లియర్ చేశాను. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ చేద్దామని ఆనంద్ చెప్పారు. అలా "గం..గం..గణేశా" జర్నీ బిగిన్ అయ్యింది.→ వినాయకుడి విగ్రహం చుట్టూ తిరిగే కథ ఇది. ఆ విగ్రహం సంపాదించుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటాడు. ఈ సినిమాలో అన్నీ గ్రే క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక హీరోయిన్ ని మాత్రం మంచి క్యారెక్టర్ లో చూపిస్తున్నాం. మరో హీరోయిన్ నెగిటివ్ గా బిహేవ్ చేస్తుంది. అయితే తను బ్యాడ్ కాదు పరిస్థితుల వల్ల అలా ప్రవర్తించాల్సివస్తుంది.→ ఇటీవల మా మూవీ ప్రివ్యూ చూసిన వాళ్లు వెన్నెల కిషోర్ క్యారెక్టర్ ఇంకాస్త సేపు ఉంటే బాగుండేది అన్నారు. వాళ్లకు అంతగా నచ్చింది. ఇందులో స్పెషల్ గా లవ్ స్టోరి అంటూ ఉండదు. కథ జర్నీలో భాగంగా ఇద్దరు హీరోయిన్స్ వస్తారు. వాళ్లకు కీ రోల్స్ ఉన్నాయి. బాగా నయన్ సారిక, ప్రగతి శ్రీ వాస్తవ బాగా పర్ ఫార్మ్ చేశారు.→ "గం..గం..గణేశా" సినిమాలో స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. కథలో నేను నమ్మిన ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ను అలాగే హోల్డ్ చేస్తూ స్క్రీన్ ప్లే సాగుతుంది. ఈ సినిమా మరో రెండేళ్లకు తెరపైకి తీసుకొచ్చినా కొత్తగా ఉంటుంది. అలాంటి స్క్రీన్ ప్లే కుదిరింది.→ "గం..గం..గణేశా" మేకింగ్ టైమ్ లో ఆనంద్ చాలా సపోర్ట్ చేశాడు. నేను అనుకున్న క్యారెక్టర్ లో బాగా పర్ ఫార్మ్ చేశాడు. ఎడిట్ టేబుల్ మీద ఆనంద్ పర్ ఫార్మెన్స్ చూస్తున్నప్పుడు హ్యాపీగా అనిపించింది. డైలాగ్ డెలివరీ, టైమింగ్, రియాక్షన్స్ చాలా బాగా చేశాడు. ఈ సినిమాకు ఆయన పర్ ఫార్మెన్స్ హైలైట్ అవుతుంది. కమర్షియల్ హీరోకు ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఆయన క్యారెక్టర్ లో కనిపిస్తాయి.→ నేను పూరి జగన్నాథ గారిని చూసి ఇన్స్ పైర్ అయ్యాను. అయితే రాజమౌళి గారి సినిమాల్లోని డ్రామా చాలా ఇష్టం. మనకు సినిమా చూసేప్పుడు డ్రామా మన మనసులకు రీచ్ అవుతుంది. అలాంటి యాక్షన్ డ్రామా మూవీస్ చేయాలని ఉంది. నా నెక్ట్ మూవీ యాక్షన్ డ్రామాగానే ఉంటుంది. -
చెలరేగిన భారత బౌలర్లు.. 100 పరుగులకే ఆలౌట్.. ఘన విజయం
ICC Under 19 World Cup 2024- India U19 won by 201 runs: ఐసీసీ అండర్ 19 ప్రపంచకప్-2024లో యువ టీమిండియా ఘన విజయం సాధించింది. ఐర్లాండ్‌ను ఏకంగా 201 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. సమిష్టి ప్రదర్శనతో ఈ మేరకు భారీ గెలుపు నమోదు చేసింది. సౌతాఫ్రికాలోని బ్లూమ్ఫౌంటేన్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు ఆదర్శ్ సింగ్ 17, అర్షిన్ కులకర్ణి 32 పరుగులు చేయగా.. వన్‌డౌన్ బ్యాటర్ ముషీర్ ఖాన్ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ 106 బంతుల్లో 118 పరుగులు సాధించాడు. ఇక ముషీర్‌తో పాటు కెప్టెన్ ఉదయ్ సహారన్ 75 పరుగులతో రాణించాడు. మిగతా వాళ్లలో వికెట్ కీపర్ అరవెల్లి అవినాష్ రావు 22, సచిన్ ధ్యాస్ 21(నాటౌట్) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. భారీ లక్ష్యం విధించి ముషీర్, ఉదయ్ ఇన్నింగ్స్ కారణంగా యవ భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి ఏకంగా 301 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఐరిష్ జట్టును భారత బౌలర్లు ఓ ఆటాడుకున్నారు. ఓపెనర్లలో జోర్డాన్ నీల్(11)ను స్పిన్నర్ సౌమీ పాండే పెవిలియన్‌కు పంపి శుభారంభం అందించగా.. పేసర్ నమన్ తివారి ఐరిష్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. నమన్ తివారి దెబ్బకు ఓపెనర్ రియాన్ హంటర్(13)ను అవుట్ చేసిన నమన్.. మిడిలార్డర్‌ను కకావికలం చేశాడు. అతడి దెబ్బకు ఐర్లాండ్ స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోగా.. సౌమీ పాండే సైతం మరోసారి విజృంభించాడు. ఈ నేపథ్యంలో 29.4 ఓవర్లలోనే ఐర్లాండ్ కథ ముగిసింది. బ్యాటర్లంతా చేతులెత్తేయడంతో వంద పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ ఏకంగా 201 రన్స్ తేడాతో జయభేరి మోగించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అతడే భారత బౌలర్లలో నమన్ తివారికి అత్యధికంగా నాలుగు, సౌమీ పాండేకు మూడు వికెట్లు దక్కగా.. ధనుశ్ గౌడ, మురుగన్ అభిషేక్, ఉదయ్ సహారన్ తలా ఓ వికెట్ పడగొట్టారు. ఇక భారత్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించిన సెంచరీ వీరుడు ముషీర్ ఖాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కాగా ఈ ఐసీసీ ఈవెంట్ తాజా ఎడిషన్‌లో భారత్‌కు ఇది రెండో విజయం. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 84 పరుగుల తేడాతో సహారన్ సేన చిత్తు చేసింది. ఇక తాజా విజయంతో గ్రూప్-ఏ టాపర్‌గా నిలిచింది యువ భారత జట్టు. చదవండి: INDA& U19 WC: ఒకేరోజు అటు అన్న.. ఇటు తమ్ముడు సెంచరీలతో ఇరగదీశారు! Another huge win, this time by 201 runs, has consolidated India’s position at the top of the Group A table 👏 Match Highlights 🎥 #U19WorldCup pic.twitter.com/U1LucpWNcI — ICC (@ICC) January 25, 2024 -
సెంచరీతో అదగరొట్టిన టీమిండియా కెప్టెన్.. దక్షిణాఫ్రికా చిత్తు
దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న ట్రై సిరీస్‌లో భారత అండర్-19 జట్టు తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. జోహన్స్‌బర్గ్ వేదికగా ఆతిథ్య సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ సిరీస్‌లో టీమిండియాకు ఇది వరుసగా నాలుగో విజయం. ఈ గెలుపుతో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ప్రోటీస్ నిర్ణీత 50 ఓవర్లలో 256 పరుగులకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్టోల్క్(69) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో ముషీర్ ఖాన్ ఐదు వికెట్లతో అదరగొట్టాడు. అతడితో పాటు నమాన్ తివారీ 3 వికెట్లు, అభిషేక్, మురగన్ తలా వికెట్ సాధించారు. అనంతరం 257 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 48.4 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టీమిండియా కెప్టెన్ ఉదయ్ సహ్రాన్(112) సెంచరీతో చెలరేగగా.. ప్రియాన్షు మౌలియా(76) పరుగులతో రాణించాడు. ఇక జనవరి 10న జరగనున్న ఫైనల్లో దక్షిణాఫ్రికా లేదా అఫ్గానిస్తాన్ జట్టుతో టీమిండియా తలపడనుంది. -
హైదరాబాదీ క్రికెటర్లకు గోల్డెన్ ఛాన్స్.. ప్రపంచకప్ జట్టులో చోటు
U19 World Cup 2024 India Squad: అండర్–19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో పాల్గొనే భారత జట్టులో ఇద్దరు తెలుగు క్రికెటర్లు చోటు దక్కించుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన అరవెల్లి అవినాశ్ రావు, మురుగన్ అభిషేక్ ఐసీసీ ఈవెంట్లో భాగమయ్యే ఛాన్స్ కొట్టేవారు. కాగా వికెట్ కీపర్ అవినాశ్, ఆఫ్‌స్పిన్ ఆల్‌రౌండర్ అభిషేక్.. ఈ ఇద్దరూ కూడా ఆసియా కప్‌లో భారత్ ఆడిన 3 మ్యాచ్‌లలోనూ బరిలోకి దిగారు. కాగా అండర్–19 వరల్డ్‌కప్ టోర్నమెంట్లో పాల్గొనే యువ ఆటగాళ్ల పేర్లను బీసీసీఐ జూనియర్ సెలక్షన్ కమిటీ మంగళవారం ప్రకటించింది. ప్రస్తుతం దుబాయ్‌లో అండర్–19 ఆసియా కప్‌లో పాల్గొంటున్న జట్టునే.. ఒక్క మార్పూ లేకుండా ఈ మెగా టోర్నీ కోసం కూడా ఎంపిక చేయడం విశేషం. ఇక 15 మంది సభ్యుల ఈ ప్రపంచకప్ జట్టుకు పంజాబ్‌కు చెందిన ఉదయ్ సహరన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అతడికి డిప్యూటీగా సౌమీ కుమార్ పాండే వైస్ కెప్టెన్‌గా అవకాశం దక్కించుకున్నాడు. కాగా దక్షిణాఫ్రికా వేదికగా జనవరి 19 నుంచి ఫిబ్రవరి 11 వరకు వరల్డ్‌కప్‌ను నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనే భారత జట్టు: ఉదయ్ సహారన్ (కెప్టెన్), సౌమీ కుమార్ (వైస్ కెప్టెన్), అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్, రుద్రమయూర్ పటేల్, సచిన్, ప్రియాన్షు, ముషీర్ ఖాన్, అవినాశ్ రావు, మురుగన్ అభిషేక్, ఇనేశ్ మహాజన్, ధనుశ్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబాని, నమన్ తివారి. చదవండి: U19 Asia Cup 2023: ఏడు వికెట్లతో చెలరేగిన పేసర్.. భారత్ ఘన విజయం -
Ind vs Pak: మెగా క్రికెట్ టోర్నీ షెడ్యూల్ విడుదల.. భారత్- పాక్ మ్యాచ్ ఆరోజే
దాయాదులు భారత్- పాకిస్తాన్ మరోసారి మెగా క్రికెట్ టోర్నీలో పోటీ పడనున్నాయి. ఆసియా మెన్స్ అండర్-19 వన్డే కప్‌లో భాగంగా డిసెంబరు 10న ముఖాముఖి తలపడనున్నాయి. దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్ ఇందుకు వేదిక కానుంది. కాగా అండర్-19 మెన్స్ ఆసియా కప్-2023కి సంబంధించిన షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్ మండలి శనివారం విడుదల చేసింది. దుబాయ్‌లో వన్డే ఫార్మాట్లో నిర్వహించనున్న ఈ టోర్నీకి శుక్రవారం(డిసెంబరు 8) తెరలేవనుంది. గ్రూప్-ఏలో భాగమైన భారత్- అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌తో ఈ ఈవెంట్ ఆరంభం కానుంది. అదే రోజు మరో మ్యాచ్‌లో పాకిస్తాన్- నేపాల్‌తో తలపడనుంది. గ్రూప్ దశలో మ్యాచ్‌లన్నీ ఐసీసీ అకాడమీ గ్రౌండ్, ఐసీసీ అకాడమీ గ్రౌండ్-2లో జరుగనున్నాయి. అయితే, డిసెంబరు 17నాటి ఫైనల్‌కు మాత్రం దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదిక కానుంది. ఇక మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు ఆరంభం కానున్నాయి. కాగా ఆసియా అండర్-19 కప్‌లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొననున్నాయి. గ్రూప్-ఏలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ సహా పాకిస్తాన్, నేపాల్, అఫ్గనిస్తాన్ పోటీ పడనుండగా.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, జపాన్, యూఏఈ తలపడనున్నాయి. భారత జట్టు కెప్టెన్‌గా ఉదయ్ సహారన్ ఉదయ్ సహారన్ (కెప్టెన్), సౌమి కుమార్ పాండే (వైస్ కెప్టెన్), అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ దాస్, ప్రియాన్షు మొలియా, ముషీర్ ఖాన్, ధనుష్ గౌడ, అవినాష్ రావు (వికెట్ కీపర్), ఎం అభిషేక్, ఇన్నేష్ మహాజన్ (వికెట్ కీపర్), ఆర్ధ్య శుక్లా, రాజ్ లింబాని, నమన్ తివారీ. ట్రావెలింగ్ రిజర్వ్స్: ప్రేమ్ దేవ్కర్, అన్ష్ గోసాయి, మహ్మద్ అమన్. నాన్ ట్రావెలింగ్ రిజర్వులు: దిగ్విజయ్ పాటిల్, జయంత్ గోయత్, పి.విఘ్నేష్, కిరణ్ చోర్మాలే. -
టికెట్టు కోసం తండ్రీకొడుకులు పోటీ.. అందోలు బీజేపీ టికెట్‌పై ఉత్కంఠ!
సాక్షి, మెదక్: అందోలు నియోజకవర్గ బీజేపీ టికెట్టు కోసం తండ్రీకొడుకులు పోటీ పడడం స్థానికంగా చర్చనీయాంశమైంది. మొదటి నుంచి కుటుంబ సభ్యులను రాజకీయాలకు దూరంగా ఉంచే మాజీ మంత్రి బాబూమోహన్ టికెట్ల కేటాయింపు సమయంలో కుమారుడు ఉదయ్బాబూమోహన్ పేరు తెరపైకి రావడాన్ని ఆయన్ వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో చేరి.. ► అందోలు ఎమ్మెల్యేగా 1998లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొంది, 1999 సాధారణ ఎన్నికల్లో తిరిగి రెండోసారి టీడీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికై నియోజకవర్గంలో పట్టు సాధించారు. 2004, 2009 ఎన్నికల్లో మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహా చేతిలో బాబూమోహన్ ఓడిపోయారు. ► రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో బాబూమోహన్ బీఆర్ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ► 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్‌ను నిరాకరించడంతో బీజేపీ పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ► ప్రస్తుతం 2023 ఎన్నికల్లో బీజేపీ 52 మంది అభ్యర్థులతో ప్రకటించిన జాబితాలో బాబూమోహన్ పేరు లేదు. ఆయన కుమారుడు ఉదయ్బాబూమోహన్ పేరును పార్టీ అధిష్టానం పరిశీలిస్తున్నందని, అందుకే మొదటి జాబితాలో అవకాశం దలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ► ఉదయ్బాబూ మోహన్ పేరును బీజేపీ తరఫున కేటాయిస్తున్నట్లు ప్రముఖ టీవీల్లో ప్రచారం కావడంతో నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు. రెండు మాసాల క్రితం పార్టీ సీనియర్ నాయకుడు జితేందర్‌రెడ్డి అందోలు టికెట్‌ను ఉదయ్‌బాబుకు ఇద్దామని బాబూమోహన్‌తో అన్నట్లు పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నారు. ► అప్పటి నుంచి ఉదయ్‌బాబును నియోజకవర్గానికి దూరంగా ఉంచేందుకు బాబూమోహన్ ప్రయత్నిస్తున్నట్లు నాయకులు చెబుతున్నారు. అందోలు బీజేపీ టికెట్‌ను మా జీ జెడ్పీ చైర్మన్ బాలయ్య కూడా ఆశిస్తున్న విషయం తెలిసిందే. ► అందోలు టికెట్ తనకే కేటాయించాలని పార్టీ అధిష్టానవర్గంపై బాబూమోహన్ ఒత్తిడి తెస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ టికెట్‌పై తండ్రీకొడుకుల మధ్యే పంచాయితీ ఏర్పడే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. -
భయం.. అత్యాశ.. కుట్ర
ఆనంద్ దేవరకొండ హీరోగా ఉదయ్ శెట్టి దర్శకత్వం వహించిన చిత్రం ‘గం..గం.. గణేశా’. కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ని రిలీజ్ చేశారు. ఈ వేడుకలో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘భయం, అత్యాశ, కుట్ర అంశాల చుట్టూ ఈ సినిమా కథనం సాగుతుంది. ‘బేబీ’ తో ఆడియన్స్ ఎంత ఎమోషనల్ అయ్యారో, ‘గం..గం..గణేశా’ చిత్రంతో అంత ఎంటర్టైన్ అవుతారు. ఉదయ్ కథ, విజన్‌ను నమ్మి ఈ సినిమా చేశాను’’ అన్నారు. ‘‘ఈ సినిమా విజయంపై మాకు పూర్తి నమ్మకం ఉంది’’ అన్నారు వంశీ కారుమంచి. ‘ప్రేక్షకులకు నచ్చే చిత్రం ఇది’’ అన్నారు ఈ చిత్ర సహనిర్మాత అనురాగ్ పర్వతనేని. -
యూకే లేబర్ పార్టీ లాంగ్‌లిస్ట్‌లో ఉదయ్
సాక్షి, హైదరాబాద్: యూకే పార్లమెంటు ఎన్నికల్లో లేబర్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న హైదరాబాద్ మూలాలుగల తెలుగు వ్యక్తి ఉదయ్ నాగరాజు తాజాగా ఆ పార్టీ వడపోత అనంతరం రూపొందించిన ఆశావహుల జాబితాలో చోటు సంపాదించారు. మిల్టన్ కీన్స్ నార్త్ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిత్వాన్ని ఉదయ్ ఆశిస్తున్నారు. యూకే పార్లమెంటరీ ప్రక్రియలో భాగంగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వందలాది మంది వ్యక్తులు తొలుత తాము అభ్యర్తిత్వం కోరకుంటున్న పార్టీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులను వడపోసి ముగ్గురు లేదా నలుగురిని ఎంపిక చేసి లాంగ్‌లిస్ట్ రూపొందిస్తారు. వారిలో ఒకరిని పార్టీ స్థానిక సభ్యులు ఎన్నుకుంటారు. ఆ అభ్యర్థే పార్టీ తరఫున అధికారికంగా పార్లమెంటరీ అభ్యర్థి అవుతారు. రాజకీయ అనుభవం, గెలుపు అవకాశాలు, ప్రజాసేవ పట్ల నిబద్ధత తదితరాల ఆధారంగా లాంగ్ లిస్ట్‌ను లేబర్ పార్టీ రూపొందించగా ఉదయ్ అందులో చోటు సంపాదించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, రాజ్యసభ మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావుకు దగ్గరి బంధువైన ఉదయ్ నాగరాజు.. అంతర్జాతీయ వక్తగా, లేబర్ పార్టీ విధాన నాయకుడిగా మేథో విభాగాన్ని నడిపిస్తున్నారు. ఇదీ చదవండి: UK political crisis: రిషి, బోరిస్ నువ్వా, నేనా? -
రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఊరట.. రూ.10,200 కోట్ల రుణాలకు ఓకే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. గతంలో నిలుపుదల చేసిన రూ.10,200 కోట్ల రుణాలను తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల ఆర్థిక పునర్వ్యవస్థీకరణ కోసం కేంద్రం ప్రవేశపెట్టిన ఉజ్వల్ డిస్కం అస్యూరెన్స్ యోజన (ఉదయ్) పథకంలో రాష్ట్ర ప్రభుత్వం 2017 జనవరిలో చేరింది. ఈ పథకం కింద రాష్ట్ర డిస్కంలకు సంబంధించిన 75 శాతం రుణాలను టేకోవర్ చేసుకోవడానికి సమ్మతి తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం, డిస్కంలతో రాష్ట్ర ప్రభుత్వం త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఒప్పందం మేరకు రాష్ట్ర ప్రభుత్వం డిస్కంల రుణాలను టేకోవర్ చేసుకోకపోవడంతో అప్పట్లో కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది.75 శాతం డిస్కంల రుణాలకు సరిపడా రూ.10,200 కోట్ల ఎఫ్ఆర్బీఎం రుణాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోకుండా కోత విధించింది. ఫలించిన తాజా చర్చలు తాజాగా సీఎం కేసీఆర్‌తో పాటు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ..రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, రాష్ట్ర ఆర్థిక, నీటిపారుదల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కె.రామకృష్ణారావు, రజత్‌కుమార్, ఇతర అధికారుల బృందం బుధవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిని కలిసి నిలిచిపోయిన వివిధ రుణాలకు సంబంధించిన అంశంపై చర్చలు జరిపింది. ఉదయ్ రుణాలు టేకో వర్ చేసుకోనందుకు గతంలో కోత విధించిన రాష్ట్ర రుణాలకు తిరిగి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. 2017–21 మధ్య కాలానికి సంబంధించిన డిస్కంల నష్టాలు రూ.8,925 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేసుకుంటూ గత నెలలో ఉత్తర్వులు జారీ చేసినట్టు వివరించింది. అలాగే నీటిపారుదల ప్రాజెక్టులు, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి.. ఆర్ఈసీ, పీఎఫ్సీ నుంచి ఒప్పందాల మేరకు రావాల్సిన రుణాల విడుదలకు సైతం అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో గతంలో నిలుపుదల చేసిన రూ.10,200 కోట్ల రుణాలను తీసుకోవడానికి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి తక్షణమే అనుమతిచ్చారు. ఈ మేరకు లేఖను సైతం అందజేశారు. అయితే ఇటీవల నిలిపివేసిన ఆర్ఈసీ, పీఎఫ్సీ రుణాలపై మాత్రం స్పష్టమైన హామీ ఇవ్వలేదని తెలిసింది. కస్టమ్ మిల్లింగ్ గడువు పొడిగింపు ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) అవసరాల కోసం కస్టమ్ మిల్లింగ్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 2021–22లో ఎఫ్‌సీఐకి బకాయిపడిన 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇచ్చేందుకు తాజాగా కేంద్ర ప్రభుత్వం గడువు పొడిగించింది. కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండేను.. సీఎస్ సోమేశ్‌కుమార్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ బుధవారం ఢిల్లీలో కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేయగా, ఆయన సానుకూలంగా స్పందించారు. బీజేపీపై పోరుకు సీఎం దిశానిర్దేశం! – ఎంపీలతో కేసీఆర్ చర్చలు సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తాజా రాజకీయ పరిణామాలపై పలువురు టీఆర్ఎస్ ఎంపీలతో బుధవారం చర్చలు జరిపారని తెలిసింది. పార్లమెంట్లో జరుగుతున్న ఆందోళనలపై ఆరా తీసిన సీఎం.. ఒంటెత్తు పోకడలతో వ్యవహరిస్తున్న అధికార బీజేపీపై రాబోయే రోజుల్లో పోరాటాన్ని ఏ విధంగా ఉధృతం చేయాలన్న అంశాలపై దిశానిర్దేశం చేశారని సమాచారం. మరోవైపు రాష్ట్ర ఆర్థిక అంశాలపై సీఎస్ సోమేశ్‌కుమార్ సహా ఇతర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమాలోచనలు జరిపారు. -
ఉదయ్ మృతికి నారాయణ యాజమాన్యానిదే బాధ్యత
సాక్షి, హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన నారాయణ కళాశాల విద్యార్థుల కుటుంబసభ్యులు... యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజేంద్రనగర్‌లో స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు గాయపడిన విషయం తెలిసిందే. వీరంతా మాదాపూర్‌లో నారాయణ క్యాంపస్‌లో మెడిసిన్‌కి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటూ హాస్టల్లో ఉంటున్నారు. అయితే ఫ్రెండ్ బర్త్‌డేకి పర్మిషన్ తీసుకోకుండానే గోడ దూకి బయటకు వెళ్లారు. ఈ క్రమంలో రాజేంద్రనగర్ నుంచి తిరిగి వస్తుండగా ఆరంఘర్ చౌరస్తా సమీపంలో వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తరుణ్, ఉదయ్ సంఘటనా స్థలంలోనే చనిపోయారు. ఇక గాయపడినవారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషయంగా ఉంది. చదవండి: విషాదం: ఫ్రెండ్ బర్త్‌డే పార్టీకి... గోడ దూకి... మరోవైపు కేసు నమోదు చేసిన పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం తరుణ్, ఉదయ్ మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కుమారుడి మరణవార్తను తెలుసుకున్న ఉదయ్ కుటుంబసభ్యులు ఉస్మానియాకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. తన సోదరుడి మృతికి ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలంటూ మృతుడి సోదరుడు కాలేజీ ఉద్యోగిని నిలదీశాడు. అనుమతి లేకుండా విద్యార్థులు బయటకు వెళుతుంటే యాజమాన్యం నిద్రపోతుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే విద్యార్థులు కుటుంబసభ్యులకు సమాధానం చెప్పలేక నారాయణ కాలేజీ ఉద్యోగి అక్కడ నుంచి పరారయ్యాడు. మృతుడు ఉదయ్ స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి మండలం గుండుమాల్. ఇక తరుణ్ స్వస్థలం బెంగళూరు కాగా, కుటుంబం బోయినపల్లిలో నివాసం ఉంటోంది. కాలేజీ యాజమాన్యంపై నమ్మకంతో తమ పిల్లలను చేరిస్తే వారికి బాధ్యత ఉండదా అని ఉదయ్ మేనత్త మండిపడ్డారు. ఉదయ్ మృతికి నారాయణ కాలేజీ యాజమాన్యం బాధ్యత వహించాలన్నారు. కాగా తొమ్మిది మంది హాస్టల్ విద్యార్థులు అదృశ్యం అయ్యారంటూ నారాయణ కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
అర్ధరాత్రి బాల్కనీ దూకి..
సాక్షి, అత్తాపూర్ : వేగంగా దూసుకొచ్చిన సఫారీ కారు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడటంతో ఇద్దరు విద్యార్థులు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌ష్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి జరిగింది. కారులో పది మంది ప్రయాణిస్తుండగా మిగతా ఏడుగురు పరారయ్యారు. పోలీసులు తెలిపిన మేరకు.. అయ్యప్ప సొసైటీ నారాయణ క్యాంపస్‌లో కోచింగ్ తీసుకునే హనుమదీశ్వర్(19), గణేష్(19), తరుణ్(19), శషాంక్గౌడ్(19), భాను(19), అభివరణ్(19), భాస్కర్(19) వరుణ్(19)లు స్నేహితులు. గురువారం రాత్రి అందరూ కలిసి హాస్టల్ నుంచి బయటకు వచ్చారు. అనంతరం కొంపల్లిలో ఉండే గణేష్ ఇంటికి వెళ్లి అక్కడ వాళ్ళ బాబాయ్ కారు సఫారీని తీసుకొని రాత్రి 12:30 గంటలకు శంషాబాద్ వైపు వచ్చారు. తరువాత ఇంటికి బయలు దేరారు. హనుమదీశ్వర్ కారును వేగంగా నడిపాడు. కారు పీవీ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 221 వద్దకు రాగానే ఒక్కసారిగా పల్టీకొట్టింది. కారులో ముందు కూర్చున ఉదయ్, తరుణ్‌లకు బలమెన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మరో విద్యార్థి శషాంక్కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటన జరగగానే మిగతా విద్యార్థులు అందరూ పరారయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన ఉదయ్‌ది మహబూబ్‌నగర్ మద్దూర్ మండలం, తరుణ్‌ది ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస అని పోలీసులు తెలిపారు. కారు తీసుకెళ్లారిలా.. గణేష్ గురువారం రాత్రి 9:30 గంటల సమయంలో కొంపల్లిలో ఉండే తన చెల్లెలు గాయత్రికి ఫోన్‌చేశాడు. తాను గంటలోపు వస్తానని సఫారి కారు తాళం కావాలని అడిగాడు. ఇంటి ముందు ఉన్న పూల చెట్టు తొట్టిలో కారు తాళం వేయాలని చెప్పాడు. దీంతో గాయత్రి పూలతొట్టిలో తాళం వేసి ఉంచింది. గణేష్ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా కారు తీసుకువెళ్ళినట్లు గణేష్ బాబాయి కృష్ణ విలేకరులకు తెలిపాడు. అసలు విషయం అందరూ నిద్రిస్తున్న వేళ అర్ధరాత్రి హాస్టల్లో ఉండాల్సిన విద్యార్థులు బర్త్ డేకు వెళ్లేందుకు పక్కా స్కెచ్ వేశారు. ఐదుగురు వార్డెన్లు నిద్రపోగానే 9 మంది విద్యార్థులు బాల్కనీ నుంచి కిటికి గోడ పైకి వచ్చి కిందికి దిగారు. కారులో శంషాబాద్‌కు బర్త్ డే కోసం వెళ్లారు. తెల్లవారు జామున వారు వేసిన స్కెచ్ బెడిసికొట్టింది. ఆరాంఘర్ చౌరస్తా వద్ద కారు అదుపుతప్పి పల్టీ కొట్టడంతో ఇద్దరు చనిపోగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మాదాపూర్ సర్వే ఆఫ్ ఇండియా లేఅవుట్లోని వర్మ క్యాంపస్‌లో మెడిసన్ లాంగ్ టర్మ్ విద్యార్థి గణేష్ కుత్బుల్లాపూర్‌లోని ఇంటికి వెళతానని తల్లిదండ్రులతో మాట్లాడించి అనుమతి తీసుకొని వెళ్లాడు. అర్థరాత్రి బర్త్ డేకు వెళ్లేందుకు ఇంట్లోని సఫారీ కారును తీసుకొని వచ్చి అయ్యప్ప సొసైటీలో వేచి ఉన్నాడు. రూమ్‌లలో ఉన్న విద్యార్థులు యశ్వంత్, తరుణ్, శంకర్ గౌడ్, భాను, భాస్కర్, వరుణ్‌లు మొదటి అంతస్తులోని బాల్కానీలో బీమ్ పైకి ఎక్కి అక్కడి నుంచి కిటికి పైకి వెళ్ళారు. పక్షులు రాకుండా ఏర్పాటు చేసిన నెట్‌ను తొలగించి కిందికి దిగారు. గురువారం అర్థరాత్రి 12.40 గంటలకు పక్కన నిర్మాణంలో ఉన్న భవనం ముందు నుంచి నడుచుకుంటూ వెళుతున్నట్లు రికార్డ్ అయ్యింది. అక్కడి నుంచి వైఎస్ఆర్ విగ్రహం వద్దకు నడుచుకుంటూ వెళ్లారు. గణేష్ తప్ప మిగతా విద్యార్థులంతా గురువారం రాత్రి 8 గంటల నుంచి 10.30 గంటల వరకు స్టడీ అవర్‌లో ఉన్నారు. 11.30 గంటలకు వార్డెన్ రాములు అటెండెన్స్ తీసుకున్నాడు. 11.45 గంటలకు లైట్లు ఆపి అంతా పడుకున్నారు. వర్మ క్యాంపస్‌లో రాత్రి సమయంలోను ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి, వార్డెన్ రాములుతో పాటు జూనియర్ లెక్చరర్లు కరీం, యోగీష్, మురళీ తదితరులు ఉన్నారు. శుక్రవారం తెల్లవారు జామున చేవెళ్ల ఎస్ఐ వెంకటేష్ ఫోన్ చేసి రోడ్డు ప్రమాదంలో మీ విద్యార్థులు ఇద్దరు చనిపోయారని చెప్పడంతో విషయం తెలిసిందని నారాయణ కాలేజ్ డీజీఎం శ్రీధర్‌రెడ్డి తెలిపారు. 3.30 గంటలకు ఉస్మానియా ఆస్పత్రిలో డాక్టర్‌గా విధులు నిర్వహించేమా పూర్య విద్యార్థి ఫోన్ చేసి ఇద్దరు చనిపోయారని, ఒకరు గాయపడ్డారని చెప్పినట్లు తెలిపారు. హస్టల్ ముందు వైపు సీసీ కెమెరాలు ఉండడం, డోర్ లాక్ చేసి ఉండటంతో బాల్కనీ నుంచి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. బాల్కనీలో గ్రిల్ ఏర్పాటు చేసి ఉంటే విద్యార్థులు బయటకు వెళ్లే అవకాశం ఉండేదికాదు. హాస్టల్లో రాత్రి సమయంలో సెక్యూరిటీ గార్డులు ఉంటే విద్యార్థులు బయటకు వెళ్లే అవకాశం ఉండేది కాదు. -
విశాఖకు ఇది శుభోదయం
సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు కూత పెట్టింది. పరుగు ప్రారంభించింది. అతి తక్కువ సమయం, తక్కువ చార్జీలు, మెరుగైన సౌకర్యాలు వంటి ప్రత్యేకతలు కలిగిన ఈ రైలు సర్వీసు దేశంలోనే రెండోది. గురువారం ఉదయం 11.30 గంటలకు రైల్వేస్టేషన్లో జరిగిన కార్యక్రమంలో రైల్వేశాఖ సహాయ మంత్రి సురేష్ చెన్నబసప్ప అంగాడి జెండా ఊపి ఈ సర్వీసును లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి చెందిన పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామన్నారు. అలాగే వాల్తేర్ డివిజన్‌ను యథాతథంగా కొనసాగించాలన్న డిమాండ్ పరిశీలనలో ఉందన్న మంత్రి వెల్లడించారు. సాక్షి, తాటిచెట్లపాలెం(విశాఖ): ‘విశాఖవాసులకు ఇది శుభోదయం.. ఎంతకాలంగానో ఎదురు చూస్తున్న సమయం . అతి తక్కువ ప్రయాణ సమయం, ఏసీ, డైనింగ్ వంటి అత్యాధునిక సదుపాయాలు ఈ రైలు సర్వీసు దేశంలోనే రెండోది’ అన్నారు రైల్వే శాఖ సహాయమంత్రి సురేష్ చెన్నబసప్ప. విశాఖ రైల్వేస్టేషన్లో గురువారం దీనిని ప్రత్యేక రైలుగా ఆయన ప్రారంభించారు. అతిథులు, డీఆర్ఎం, ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ రైలుకు జెండా ఊపి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఇటువంటి ప్రత్యేక రైళ్లను బిజీ రూట్లలో మాత్రమే నడుపుతామని, విశాఖ ప్రజలకు దీని అవసరం ఉండటంతో ఉదయ్‌ను ఏపీకి కేటాయించామన్నారు. రైల్వేలో ఆ మూడింటికి ప్రాధాన్యం మోదీ ప్రభుత్వం రైల్వేలో మూడు అంశాలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తోందన్నారు. మొదటిది ప్రయాణికుల భద్రత, రెండోది పరిశుభ్రత, మూడోది సమయపాలన అని తెలిపారు. ఈ మూడింటిని రైల్వే కచ్చితంగా అమలు చేస్తోందన్నారు. ఉదయ్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న రైల్వే సహాయ మంత్రి సురేష్ చెన్నబసప్ప, డీఆర్ఎం శ్రీవాస్తవ, ఎంపీలు జీవీఎల్, ఎంవీవీ తీరిన విశాఖ వాసుల చిరకాల కోరిక విశాఖవాసుల చిరకాల కోరిక విజయవాడకు విశాఖ నుండి డైరెక్ట్ రైలు నడపడం. నేడు ఉదయ్ ప్రారంభంతో ఈ కోరిక తీరిందని వాల్తేర్ డివిజన్ డీఆర్ఎం చేతన్‌కుమార్ శ్రీ వాస్తవ అన్నారు. రైల్వేస్టేషన్లో ఉదయ్ ప్రారంభం సందర్భంగా డీఆర్ఎం మాట్లాడారు. ఉదయ్ సర్వీస్ ప్రారంభంతో విశాఖవాసులకు విజయవాడ ప్రయాణం చాలా అనుకూలంగా మా రిందన్నారు. నగరవాసులు విజయవాడలో తమ పనులు చూసుకుని తిరిగి రాత్రికి నగరానికి చేరుకునే విధంగా ఈ టైంటేబుల్ ఉం దని తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్సీలు పి.వి.ఎన్.మాధవ్, పాకలపాటి రఘువర్మ, దువ్వారపు రామారావు, మాజీ ఎంపీ కె.హరిబాబు, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు, రైల్వే ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తిరుగుప్రయాణం ఫుల్ విశాఖ నుంచి గురువారం ప్రారంభమైన ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు తిరుగు ప్రయాణంలో విజయవాడ నుండి పూర్తి ఆక్యుపెన్సీతో వచ్చినట్లు తెలిసింది. విశాఖ నుంచి కూడా ప్రకటించిన అతి కొద్ది సమయంలోనే సీట్లు చాలావరకు నిండిపోయాయి. విజయవాడ నుంచి కూడా అన్ని కోచ్‌లు ఫుల్‌గా వచ్చాయి. డివిజన్ విషయంలో మాకు చేతనైనంత చేస్తాం విశాఖకు ప్రత్యేక జోన్ కేటాయింపు పెద్ద వరమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. డివిజన్ విషయంలో చేతనైనంత సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. విశాఖ అందాలు అద్భుతం విశాఖ నగర సౌందర్యానికి ముగ్ధులైన ఆయన అనంతరం స్టేషన్ నిర్వహణ చూసి డీఆర్ఎం చేతన్‌కుమార్‌ను ప్రశంసించారు. విశాఖ రైల్వేస్టేషన్ ఎంతో అందంగా ఉందని, స్టేషన్‌ను ఇలా ఉంచడంలో డీఆర్ఎం, సిబ్బంది పనితీరు అభినందనీయమన్నారు. విశాఖలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని తెలిపారు. త్వరలోనే రెండో విస్టాడోమ్ కోచ్‌ను కూడా సమకూర్చనున్నట్లు తెలిపారు. -
5.30 గంటల్లో విశాఖ నుంచి బెజవాడకు..
సాక్షి, విశాఖ: ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు పట్టాలెక్కింది. విశాఖ నుంచి విజయవాడకు నడిచే డబుల్ డెక్కర్ ఏసీ రైలును.. రైల్వే సహాయ మంత్రి సురేష్ చన్నబసప్ప అంగడి అధికారికంగా గురువారం ప్రారంభించారు. ఉదయం 11.30 గంటలకు విశాఖ రైల్వేస్టేషన్ ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంపై రైలుకు పచ్చజెండా ఊపి ఆరంభించారు. గురువారం ఒక రోజు స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌గా ఇది నడుస్తుంది. శుక్రవారం నుంచి రెగ్యులర్ రైలుగా వారానికి ఐదురోజులు (ఆది, గురువారం తప్ప) పరుగులు తీయనుంది. ఎన్నో ప్రత్యేకతలతో ప్రారంభమైన ఉదయ్ రైలుకు విశాఖ నుంచి విజయవాడకు టిక్కెట్ ధర 525 రూపాయిలగా నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు ఎంవివి సత్యనారాయణ, గొట్టేడి మాధవి, జీవీఎల్ నర్సింహారావు, రఘురామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. విశాఖలో పచ్చజెండా ఊపి ఉదయ్‌ను ప్రారంభించిన రైల్వే సహాయ మంత్రి సురేష్ చన్నబసప్ప అంగడి పూర్తిగా 9 ఏసీ బోగీలతో నడిచే ఈ ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు విశాఖ నుంచి అయిదున్నర గంటల్లో విజయవాడ చేరుకుంటుంది. 22701/22702 ట్రైన్ నంబర్‌గా విశాఖ నుంచి విజయవాడకు వారానికి 5 రోజుల పాటు ఈ రైలు నడుస్తుంది. అన్ని కోచ్‌లలో డిస్క్ బ్రేక్‌లతో పాటు ఫెయిల్యూర్ ఇండికేషన్ బ్రేకింగ్ సిస్టమ్ ఏర్పాటు ఉంది. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో సీటింగ్ ఏర్పాటుతో పాటు ప్రయాణ వేగం, తదుపరి స్టేషన్ వివరాలు తెలిపేందుకు ప్రతి కోచ్‌లో ఆరు డిస్ ప్లే మానిటర్లు ఏర్పాటు సదుపాయం ఉంటుంది. కోచ్‌ల్లో ఆటోమేటిక్ టీ, కాఫీ వెండింగ్ మిషన్లు అందుబాటులో ఉంటాయి. ప్రతి మూడో కోచ్ తర్వాత పాంట్రీ, డైనింగ్ సౌకర్యాలు ఉంటాయి. ఇక చిన్న పొగ వచ్చినా వెంటన సమాచారం అందేలా కోచ్‌లలో వెస్ డా యంత్రాల అమరిక ఉంటుంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సురేష్ అంగడి మాట్లాడుతూ... ప్రయాణికుల భధ్రత, రైళ్ల సమయపాలనపై అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని...త్వరలోనే ప్రారంభమవుతుందన్నారు. వాల్తేరు డివిజన్ కొనసాగించాలని ఏపీఎంపిలు కేంద్రాన్ని కోరారని...పరిశీలనలో ఉందన్నారు. ప్రధానిగా మోదీ వచ్చిన తర్వాత రైల్వేశాఖ ద్వారా ప్రయాణికులకి మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. రైల్వేల ఆధునీకరణపై కూడా తమ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. భారతదేశంలోనే విశాఖ స్వచ్చతకు మారుపేరుగా వుందని కొనియాడారు. ఇప్పటికే లక్షకోట్ల రూపాయలను అభివృద్ధికి వెచ్చించామని....నిధులను పెంచేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్సింహారావు మాట్లాడుతూ...విశాఖ- విజయవాడ అత్యంత రద్దీ ఉన్న రూట్లో ఉదయ్ ఎక్స్ ప్రెస్ నూతన రైలును ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. జోన్ ఏర్పాటైన తర్వాత హెడ్ క్వార్టర్‌గా విశాఖ నుంచి కొత్త రైళ్ల ప్రారంభించడానికి అనేక అవకాశాలున్నాయని తెలిపారు. ఉదయ్ ఎక్స్‌ప్రెస్ దేశంలోనే రెండోదని, కోయంబత్తూరు - బెంగళూరు మధ్య గత ఏడాది ప్రారంభమైందని అన్నారు. రాజకీయాలతో రైల్వేని ముడిపెట్టకూడదుని...విశాఖ రైల్వే జోన్‌పై టీడీపీ అనవసర రాద్దాంతం చేస్తోందని విమర్శించారు. వాల్తేరు డివిజన్ ఏర్పాటుపై తాము కూడా ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రారంభోత్సవం రోజు: విశాఖ–విజయవాడ (02701) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ విశాఖలో ఉదయం 11.30గంటలకు బయల్దేరి సాయంత్రం 4.50గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (02702) ఎక్స్‌ప్రెస్‌గా విజయవాడలో సాయంత్రం 5.30గంటలకు బయల్దేరి రాత్రి 11గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఉదయ్ ఎక్స్‌ప్రెస్ హాల్టులు..: ఉదయ్ డబుల్ డెక్కర్ రానూ..పోనూ దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలు 9 ఏసీ డబుల్ డెక్కర్ కోచ్‌లు, 2–మోటార్ పవర్‌కార్‌లతో నడుస్తుంది. ఎంవీవీ తొలి విజయం కాగా విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ శ్రమకు ఫలితం దక్కింది. ఉదయ్ డబుల్ డెక్కర్ విశాఖకు రప్పించి ఎంవీవీ తొలి విజయం సాధించారు. విశాఖ –విజయవాడ మధ్య నానాటికీ పెరుగుతున్న రద్దీ దృష్ట్యా ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు అవసరం ఉందని పట్టుబట్టి మరీ సాధించారు. రైల్వే శాఖ మంత్రి సురేష్ చెన్నబసప్పను కలిసి డబుల్ డెక్కర్ రైలు ఆవశ్యకతను వివరించారు. సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి డబుల్ డెక్కర్ రైలు నడపడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉదయ్ ఇవాళ పట్టాలెక్కింది. -
రేపు విశాఖ-విజయవాడ ఉదయ్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నం-విజయవాడ మధ్య ప్రతిష్టాత్మకమైన డబుల్ డెక్కర్ ఉదయ్ ఎక్ర్‌ప్రెస్ సర్వీసులు గురువారం లాంఛనంగా ప్రారంభమవుతాయని, శుక్రవారం నుంచి ఈ సర్వీసులు పూర్తిస్థాయిలో పట్టాలెక్కనున్నాయని భారత రైల్వే శాఖ వెల్లడించింది. విశాఖ-విజయవాడ మధ్య వారంలో ఐదురోజులపాటు డబుల్ డెక్కర్ ఎయిర్ కండిషన్డ్ యాత్రీ ఎక్స్‌ప్రెస్(ఉదయ్)ను నడపనున్నట్టు తెలిపింది. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో రైల్వేశాఖ సహాయ మంత్రి సురేశ్ చెన్నబసప్ప అంగడి గురువారం లాంఛనంగా ఉదయ్‌ను ప్రారంభిస్తారని తెలిపింది. ప్రారంభోత్సవరం సందర్భంగా 02701 నంబర్ ఉయద్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం నుంచి విజయవాడ బయలుదేరుతుందని, ఈ రైలు కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయని పేర్కొంది. 2701 నంబర్ ఉయద్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 11.30లకు విశాఖ నుంచి బయలుదేరి.. సాయంత్రం 4.50 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. రిటర్న్ డైరెక్షన్లో 2207 నంబర్ ఉదయ్ ఎక్స్‌ప్రెస్ సాయంత్రం 5.30 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి.. రాత్రి 11 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. ప్రతి సోమవారం, మంగళవారం, బుధవారం, శుక్రవారం, శనివారం 22071 నంబర్ ఉదయ్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 5.45 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి.. ఉదయం 11.15 గంటలకు విజయవాడ చేరుతుంది. రిటర్న్ డైరెక్షన్లో ప్రతి సోమవారం, మంగళవారం, బుధవారం, శుక్రవారం, శనివారం 22702 నంబర్ ఉదయ్ ఎక్స్‌ప్రెస్ సాయంత్రం 5.30 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి.. రాత్రి 11 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. -
26న ఉదయ్ రైలు ప్రారంభం?
సాక్షి, విశాఖపట్నం: రెండు నెలలుగా ఊరిస్తున్న ఉత్కృష్ట డబుల్ డెక్కర్ ఎయిర్ కండిషన్డ్ యాత్రీ ఎక్స్‌ప్రెస్(ఉదయ్) ఎట్టకేలకు పట్టాలెక్కనుంది. ఈ నెల 26వ తేదీన కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి చేతుల మీదుగా ఉదయ్ సర్వీసు ప్రారంభమయ్యే అవకాశం ఉందని వాల్తేరు డివిజన్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. 26వ తేదీ ఉదయం 10 నుంచి 11 గంటల ప్రాంతంలో విశాఖపట్నం రైల్వే స్టేషన్లో లాంఛనంగా ప్రారంభించనున్నట్లు సమాచారం. 27వ తేదీ నుంచి ముందుగా ప్రకటించినట్లుగానే 22701/22702 ట్రైన్ నంబర్‌గా విశాఖ నుంచి విజయవాడకు ఉదయ్ నడవనుందని తెలిసింది. వారానికి 5 రోజుల పాటు ఈ రైలు పరుగులు తీయనుంది. ఆదివారం, గురువారం మినహాయించి సోమ, మంగళ, బుధ, శుక్ర, శనివారాల్లో విశాఖ నుంచి ఉదయం 5.45 గంటలకు ఈ డబుల్ డెక్కర్ రైలు బయలుదేరి 10.50కి విజయవాడ చేరుకోనుంది. అదేవిధంగా విజయవాడ నుంచి సాయంత్రం 5.45కి బయలుదేరి రాత్రి 11 గంటలకు విశాఖ చేరుకుంటుంది. దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం స్టేషన్లలో స్టాపేజ్ హాల్ట్‌లు ఇచ్చారు. తొమ్మిది ఏసీ డబుల్ డెక్కర్ కోచ్‌లు, రెండు మోటర్ పవర్ కార్లతో ఉదయ్ రైలు నడవనుందని వాల్తేరు డివిజన్ అధికారులు తెలిపారు. వాస్తవానికి ఆగస్టు 26వ తేదీన ఉదయ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేశారు. అయితే.. కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ మరణించడంతో ఈ రైలు ప్రారంభాన్ని వాయిదావేశారు. అప్పటి నుంచి రైలు ఎప్పుడు ప్రారంభమవుతుందోనని విశాఖ, విజయవాడ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. -
ఉదయ్ ముహూర్తం కుదిరింది
సాక్షి, విశాఖపట్నం : ఉదయ్ రైలు పట్టాలెక్కేందుకు సర్వం సన్నద్ధమైంది. ఈ నెల 27న తొలి సర్వీసు విశాఖపట్నం నుంచి ప్రారంభం కానుంది. ఇటీవలే.. విశాఖలోని మర్రిపాలెం కోచింగ్ కాంప్లెక్స్ నుంచి కోరుకొండ వరకు ట్రయల్ రన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పటికే బయలుదేరే వేళలు ఖరారు చేసిన వాల్తేరు డివిజన్ రైల్వే అధికారులు.. తాజాగా ప్లాట్‌ఫామ్‌లను కూడా కేటాయించారు. 22701/22702 ట్రైన్ నంబర్‌గా విశాఖ నుంచి విజయవాడకు ఉదయ్ నడవనుంది. వారానికి 5 రోజుల పాటు ఈ రైలు పరుగులు తీయనుంది. ఆదివారం, గురువారం మినహాయించి సోమ, మంగళ, బుధ, శుక్ర, శనివారాల్లో విశాఖ నుంచి ఉదయం 5.45 గంటలకు ఈ డబుల్ డెక్కర్ రైలు బయలుదేరి 10.50కి విజయవాడ చేరుకోనున్న ఈ రైలు(22701)కు ఆరో నంబర్ ప్లాట్‌ఫామ్ కేటాయించారు. అదేవిధంగా విజయవాడ నుంచి సాయంత్రం 5.45కి బయలుదేరి రాత్రి 11 గంటలకు విశాఖ చేరుకోనున్న రైలు(22702)కి ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్ కేటాయించారు. ప్రయాణానికి అనుకూలం.. విశాఖపట్నం నుంచి రాష్ట్ర రాజధాని నగరం విజయవాడకు రద్దీ ఎక్కువగా ఉంది. ఉదయ్ పేరుతో కేటాయించిన డబుల్ డెక్కర్ రైలు(ట్రైన్ నం. 22701/22702)ని వాల్తేరు డివిజన్ నుంచి భువనేశ్వర్‌కు తరలించేందుకు ఈస్ట్ కోస్ట్ అధికారులు ప్రయత్నాలు చేశారు. ఈ ట్రైన్ నిర్వహణకు సరైన సిబ్బంది వాల్తేరు డివిజన్లో లేరనే సాకు చూపిస్తూ.. ఉదయ్ రైలుని తరలించేందుకు కుయుక్తులు పన్నారు. కానీ.. జిల్లా వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్రంతో పోరాడటంతో విశాఖ నుంచే కొనసాగించాలని నిర్ణయించారు. దీంతో ఉదయ్‌ను నడిపేందుకు అవసరమైన సిబ్బందిని ఈస్ట్ కోస్ట్ కేటాయించింది. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో నడవనున్న ఈ రైలుకి అవసరమైన సిబ్బందిని సంసిద్ధుల్ని చేసేందుకు డివిజన్‌కు చెందిన ఏడుగురు సిబ్బందిని పంజాబ్‌లోని కపుర్తలా కోచ్ ఫ్యాక్టరీలో శిక్షణ అందించారు. వివిధ స్టేషన్ల నుంచి విశాఖ మీదుగా వెళ్తున్న రైళ్లతో పాటు విశాఖ నుంచి బయలుదేరే ట్రైన్లు కలిపి మొత్తం రోజుకు 107 వరకు అందుబాటులో ఉన్నాయి. పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని ఉదయ్‌ని కేటాయించారు. ఈ ట్రైన్ సర్వీసు ప్రారంభమైతే, రద్దీ విపరీతంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. విశాఖ నుంచి విజయవాడకు వ్యాపారులు, ఉద్యోగులు భారీ సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. అలాంటి వారందరి ప్రయాణానికి ఈ డబుల్ డెక్కర్ ట్రైన్ అనువైందిగా భావిస్తున్నారు. కేంద్ర సహాయమంత్రి చేతుల మీదుగా... ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు ప్రారంభోత్సవానికి రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి హాజరవుతారని రైల్వే వర్గాలు తెలిపాయి. 26వ తేదీన విశాఖకు రానున్న మంత్రి సురేష్, 27 ఉదయం 5.45కి ఉదయ్ తొలి సర్వీసుని ప్రారంభించనున్నట్లు సమాచారం. అయితే ఈ పర్యటన వాయిదా పడే అవకాశాలున్నాయని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేకలివీ... ఉదయ్ డబుల్ డెక్కర్ ట్రైన్ అయినా అనేక ప్రత్యేకతలతో కూడుకున్నది. 2 పవర్ కార్లు, 8 డబుల్ డెక్కర్ ఛైర్ కార్స్ ఉన్నాయి. అన్ని కోచ్‌లనూ సాన్రాక్ (సెంటర్ బఫర్ కప్లర్స్తో) అనుసంధానం చెయ్యడం వల్ల ప్రయాణ సమయంలో ఎలాంటి జర్క్‌లు ఉండవు అన్ని కోచ్‌ల్లో డిస్క్ బ్రేక్‌లతో పాటు ఫెయిల్యూర్ ఇండికేషన్ బ్రేకింగ్ సిస్టమ్‌ని ఏర్పాటు చేశారు. దీని వల్ల ఏ చిన్న సమస్య తలెత్తినా వెంటనే సమాచారం అందుతుంది. ప్రతి కోచ్‌లోనూ రెండు బయో టాయిలెట్స్ ఉన్నాయి. సబ్బులు కూడా అందుబాటులో ఉంచనున్నారు. తదుపరి స్టేషన్ వివరాలు, ప్రయాణం వేగం.. ఇతర వివరాలు ప్రయాణికులకు తెలిపేందుకు ప్రతి కోచ్‌లోనూ 6 డిస్ప్లే మానిటర్స్ ఉన్నాయి. చిన్న పొగ వచ్చినా.. వెంటనే సమాచారం అందేలా అన్ని కోచ్‌లలోనూ వెస్‌డా యంత్రాలు అమర్చారు ఇందులో ఏర్పాటు చేసిన సీటింగ్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ వంటివి అమర్చారు. ప్రయాణీకులకు వినోదం కోసం ఎల్సీడీ స్క్రీన్లు, వైఫై సౌకర్యంతో పాటు జీపీఎస్ ఆధారిత పాసింజర్ సమాచార వ్యవస్థ ఏర్పాటు చేశారు. ప్రతి మూడో కోచ్ తర్వాత పాంట్రీ, డైనింగ్ ఏరియా ఏర్పాటు చేశారు. ఆటోమేటిక్ ఫుడ్, టీ, కాఫీ వెండింగ్ మెషీన్లున్నాయి. స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారుచేసిన ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు అమర్చారు. 6 కోచ్‌లు 120 సీటింగ్ సామర్థ్యంతోనూ, మిగిలినవి పాంట్రీతో కూడిన కోచ్‌లుగా 104 సీటింగ్ సామర్ధ్యంతో ఉన్నాయి. -
‘ఉదయ్’ వచ్చేసింది..
ఉదయ్ పట్టాలెక్కింది. వాల్తేరు డివిజన్ అధికారులు నిర్వహించిన ట్రయల్ రన్లో ఫస్ట్ క్లాస్‌లో పాసైంది. ఉదయం 9.55 గంటలకు బయలుదేరిన ఈ డబుల్ డెక్కర్ ట్రైన్ 11.45 గంటలకు కోరుకొండ స్టేషన్‌కు చేరుకుంది. మరో వారం రోజుల్లో ఉదయ్ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. రాకపోకల వేళలు ఖరారైనప్పటికీ విజయవాడ డివిజన్ నుంచి టైమ్ స్లాట్ రాకపోవడంతో ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం, తాటిచెట్లపాలెం: 27 రోజుల సుదీర్ఘ కాలయాపన తర్వాత ఉత్కృష్ట డబుల్ డెక్కర్ ఎయిర్ కండిషన్డ్ యాత్రీ ఎక్స్‌ప్రెస్(ఉదయ్) ట్రయల్ రన్ జరిగింది. విశాఖపట్నం నుంచి విజయవాడకు కొత్త రైలుకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ట్రయల్ రన్ నిర్వహించారు. తొలుత ట్రయల్ రన్ నిర్వహించకుండా నేరుగా ప్రారంభించేందుకు వాల్తేరు డివిజన్ అధికారులు సన్నాహాలు చేశారు. ఉదయ్‌కు సంబంధించి 18 డబుల్ డెక్కర్ కోచ్‌లు, 4 పవర్ కార్లు వచ్చాయి. ఇందులో 9 కోచ్‌లను, 2 పవర్ కార్లను రెండు వారాల క్రితం చెన్నై పంపించారు. ఈ కోచ్‌లు విశాఖ–విజయవాడ మార్గంలోనే పంపించడంతో దాన్నే ట్రయల్ రన్‌గా తొలుత భావించారు. కానీ ఉన్నతాధికారులు మాత్రం కచ్చితంగా ట్రయల్ రన్ నిర్వహించాలని ఆదేశించడంతో మంగళవారం ఉదయం మర్రిపాలెంలోని కోచింగ్ కాంప్లెక్స్ నుంచి ట్రయల్ నిర్వహించారు. తొలుత విజయనగరం వరకు పంపించాలని భావించినా చివరి నిమిషంలో కోరుకొండ వరకూ మాత్రమే ఉదయ్ రైలు నడిపారు. ట్రయల్ రన్ ఇలా.... ఉదయం 9.55 గంటలకు మర్రిపాలెం కోచింగ్ కాంప్లెక్స్ నుంచి ఉదయ్ డబుల్ డెక్కర్ బయలుదేరింది. ఈ ట్రయల్ రన్‌ను ఈస్ట్ కోస్ట్ రైల్వే చీఫ్ ఇంజినీర్, డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజినీర్, కోచ్ డిపో ఆఫీసర్ పర్యవేక్షించారు. 11.45 గంటలకు కోరుకొండ చేరుకుంది. కోరుకొండ నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు తిరుగు ప్రయాణమై.. 3.30 గంటలకు మర్రిపాలెం కోచింగ్ కాంప్లెక్స్‌కు చేరుకుంది. ట్రయల్ రన్లో ఎక్కడా ఎలాంటి అవరోధాలు ఎదురవ్వలేదని అధికారులు తెలిపారు. ఇంకా కుదరని ముహూర్తం.. వాల్తేరు డివిజన్ నుంచి ప్రతిష్టాత్మకంగా నడవనున్న ఉదయ్ రైలు పట్టాలెక్కే సుమహూర్తం ఇంకా కుదరలేదు. ఏ సమయంలో నడపాలన్న వేళల్ని వాల్తేరు రైల్వే అధికారులు ధృవీకరించినా.. ఎప్పటి నుంచి సర్వీస్ ప్రారంభించాలన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. విజయవాడ డివిజన్ నుంచి తేదీ ఇంకా ఖరారు చెయ్యకపోవడం వల్లే.. ఆలస్యమవుతోందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఆ డివిజన్ నుంచి స్పష్టమైన ప్రకటన మరో వారం రోజుల్లో వచ్చేస్తుందని వాల్తేరు అధికారులు భావిస్తున్నారు. పది రోజుల్లోపే ఉదయ్ పట్టాలపై పరుగులు పెట్టే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని చెబుతున్నారు. 22701/22702 ట్రైన్ నంబర్‌గా విశాఖ నుంచి విజయవాడకు ఉదయ్ నడపనున్నారు. వారానికి 5 రోజుల పాటు ఈ రైలు పరుగులు తీయనుంది. ఆది, గురువారాలు మినహాయించి సోమ, మంగళ, బుధ, శుక్ర, శనివారాల్లో విశాఖ నుంచి ఉదయం 5.45 గంటలకు ఈ డబుల్ డెక్కర్ రైలు బయలుదేరి 10.50 గంటలకు విజయవాడ చేరుకోనుంది. అదేవిధంగా విజయవాడ నుంచి సాయంత్రం 5.45కి బయలుదేరి రాత్రి 11 గంటలకు విశాఖ చేరుకోనుంది. ట్రయల్ రన్ విజయవంతంపై హర్షం.. ఉదయ్ సర్వీసు ప్రారంభమైతే, రద్దీ విపరీతంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. విశాఖ నుంచి విజయవాడకు వ్యాపారులు, ఉద్యోగులు భారీ సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. అ లాంటి వారందరికీ ఈ డబుల్ డెక్కర్ సరైన ట్రైన్‌గా భావిస్తున్నారు. త్వరగా ఉదయ్ సర్వీసు ప్రా రంభించాలని విశాఖ ప్రజలు ట్రయల్ రన్ విజయవంతం కావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
విశాఖలోనే ఉదయ్ రైలు..
విశాఖకు మంజూరైన మరో రైలును భువనేశ్వర్‌కు తన్నుకుపోయేందుకు జరిగిన యత్నాలు విఫలమయ్యాయి. ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు చాన్నాళ్ల క్రితమే విశాఖకు మంజూరైనా దాన్ని తీసుకురావడంలో నాన్చుడు ధోరణి అవలంభించిన తూర్పుకోస్తా రైల్వే ఉన్నతాధికారులు.. ఎట్టకేలకు విశాఖకు వచ్చిన రైలును కూడా తమ జోన్ ప్రధాన కేంద్రం భువనేశ్వర్‌కు తరలించేందుకు చేసిన యత్నాలకు రైల్వే శాఖ బ్రేక్ వేసింది. ఆ రైలు విశాఖకే కేటాయించినట్లు విస్పష్టంగా ప్రకటించిన రైల్వే మంత్రి పీయూష్ గోయల్.. దాన్ని విశాఖ, విజయవాడల మధ్య నడపనున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయం వల్ల విశాఖ నుంచి రాష్ట్ర రాజధానికి మరో రైలు సౌకర్యం ఏర్పడుతుంది. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి. దాంతో ఇప్పుడున్న రైళ్లన్నీ నిత్యం కిటకిటలాడుతుంటాయి. డబుల్ డెక్కర్ పట్టాలపైకెక్కితే రద్దీని కొంతవరకు తట్టుకునే అవకాశం ఏర్పడుతుంది. సాక్షి, విశాఖపట్నం: ఎట్టకేలకు ఉదయ్ రైలు విశాఖలోనే పట్టాలెక్కనుంది. దీన్ని భువనేశ్వర్‌కు తరలించేందుకు ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్ పెద్దలు ప్రయత్నాలు చేసినా.. వాల్తేరు నుంచే సేవలందిస్తుందని కేంద్ర రైల్వే మంత్రి స్పష్టం చేశారు. విశాఖ నుంచి విజయవాడకు దీన్ని నడిపేందుకు రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆగస్టు 15 తర్వాత ఈ రైలు పట్టాలెక్కనుంది. ఎన్నో అవరోధాలు నిత్యం రద్దీగా ఉండే విశాఖ–విజయవాడల మధ్య కొత్త రైలుకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా అనేక అవరోధాలు ఎదురయ్యాయి. ఉదయ్ పేరుతో కేటాయించిన డబుల్ డెక్కర్ రైలు(ట్రైన్ నం. 22701/22702)ను విశాఖకు తీసుకురావడంలోనూ అనేక ఇబ్బందులు సృష్టించారు. గత నెల 17న విశాఖకు చేరుకున్నప్పటికీ ఇంత వరకూ ట్రయల్ రన్ కూడా నిర్వహించలేదు. ఈ రైలును విశాఖ నుంచి విజయవాడకు నడపాలని నిర్దేశించినప్పటికీ దాన్ని వాల్తేరు డివిజన్ నుంచి భువనేశ్వర్‌కు తరలించేందుకు ఈస్ట్‌కోస్ట్ అధికారులు ప్రయత్నాలు చేశారు. వాల్తేర్‌లో సరైన నిర్వహణ సిబ్బంది లేరనే సాకు చూపిస్తూ రైలును తరలించేందుకు కుయుక్తులు పన్నారు. కానీ జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్రంతో పోరాడటంతో విశాఖ నుంచే కొనసాగించాలని నిర్ణయించారు. దీంతో ఉదయ్‌ను నడిపేందుకు అవసరమైన సిబ్బందిని ఈస్ట్ కోస్ట్ రైల్వే కేటాయించింది. వారంలో 5 రోజులు సర్వీసు విశాఖ మీదుగా వెళ్తున్న రైళ్లతో పాటు ఇక్కడి నుంచి బయలుదేరేవి కలిపి మొత్తం 107 రైళ్లు విజయవాడ వెళ్లేందుకు అందుబాటులో ఉన్నాయి. అయినా రద్దీ తగ్గకపోవడంతో మరో రైలు నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. విశాఖకు మంజూరైన ఉదయ్ డబుల్ డెక్కర్ రైలును విశాఖ–విజయవాడ మధ్య నడపనున్నట్లు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తాజాగా ప్రకటించారు. ప్రస్తుతం విశాఖపట్నం నుంచి తిరుపతి కి ఓ డబుల్ డెక్కర్ రైలు నడుస్తోంది. ఉదయ్ కూడా ప్రారంభమైతే విశాఖ నుంచి రెండు డబుల్ డెక్కర్లు చక్కర్లు కొట్టనున్నాయి. ప్రస్తుతానికి ఉదయ్ వారానికి 5 రోజుల పాటు నడుస్తుందని అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న రైళ్లలో విశాఖ నుంచి విజయవాడకు థర్డ్ ఏసీకి రూ.645 చార్జీ వసూలు చేస్తున్నారు. డబుల్ డెక్కర్‌లో అన్ని బోగీల్లో చైర్‌కార్ సీట్లే ఉంటాయి కాబట్టి చార్జీ రూ.525 మాత్రమే ఉంటుంది. ట్రయల్ రన్ లేకుండానే.... ఇప్పటికే విశాఖ నుంచి తిరుపతికి డబుల్ డెక్కర్ నడుస్తున్నందున ఉదయ్‌కు ట్రయల్ రన్ నిర్వహించాల్సిన అవసరం లేదని వాల్తేర్ డివిజన్ అధికారులు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు వివరించారు. ఈ రైలులో 18 డబుల్ డెక్కర్ కోచ్‌లు, 4 పవర్ కార్లు ఉన్నాయి. వీటిలో 9 కోచ్‌లను, 2 పవర్ కార్లను చెన్నై పంపించారు. వీటిని విశాఖ–విజయవాడ మార్గంలోనే పంపించడంతో.. దాన్నే ట్రయల్ రన్‌గా భావిస్తున్నట్లు తెలుస్తోంది. వాటిని తరలించే సమయంలో ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకపోవడంతో మళ్లీ ప్రత్యేకంగా ట్రయల్ రన్ లేకుండా.. ఆగస్టు 15 తర్వాత గానీ, ఈ నెల చివరి వారంలో గానీ ఉదయ్ పట్టాలపైకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి ఆదరణ బాగుంటుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. -
'ఉదయ్'రాగం వినిపించబోతుంది
సాక్షి, విశాఖపట్నం : విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ శ్రమకు ఫలితం దక్కింది.ఉదయ్ డబుల్ డెక్కర్ విశాఖకు రప్పించి ఎంవీవీ తొలి విజయం సాధించారు. విశాఖ –విజయవాడ మధ్య నానాటికీ పెరుగుతున్న రద్దీ దృష్ట్యా ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు అవసరం ఉందని పట్టుబట్టి మరీ సాధించారు. గత నెల 18న రైల్వే శాఖ మంత్రి సురేష్ చెన్నబసప్పను కలిసి డబుల్ డెక్కర్ రైలు ఆవశ్యకతను వివరించారు. సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి డబుల్ డెక్కర్ రైలు నడపడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.దీంతో విశాఖ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో ఎంవీవీ ఇదే తరహాలో కీలక పాత్ర పోషించాలని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ విషయం దేశంలో ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను మూడింటిని నడపనున్నట్టు గత కేంద్ర రైల్వే మంత్రి ప్రకటించారు. అందులో ఒక ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు విశాఖ–విజయవాడ మధ్య నడపనున్నట్లు వెల్ల డించారు. అప్పటి నుంచి ఉదయ్ రావడం కనపడలేదు కదా..కేంద్ర రైల్వే మంత్రులను కోరినవారే కరువయ్యారు. విశాఖ–విజయవాడ మధ్య మరింత రద్దీ పెరుగుతున్న కారణంగా ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు అవసరం పెరిగింది. అయినా గత టీడీపీ ఎంపీలు ఏనాడు విశాఖ–విజయవాడల మధ్య రద్దీపై స్పందించిన పాపనపోలేదు. చివరకి విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రోద్బలంతో ఎట్టకేలకు విశాఖకు ఉదయ్ డబుల్‌డెక్కర్ వచ్చింది. ఇది విశాఖ– విజయవాడల మధ్య 350 కిలోమీటర్ల దూరం ప్రయాణించనుంది. ఉదయ్ రైలులో ప్రత్యేక ఆధునిక సాంకేతిక సదుపాయాలు ఉంటాయి. స్క్రీన్ల ద్వారా వచ్చే స్టేషన్లు ముందే తెలుసుకునే సౌకర్యం ఉంటుంది. అయితే ఇది పట్టాలెక్కడానికి మరికొంత సమయం పట్టేలా కనిపిస్తోంది. ట్రయల్ రన్ ఎప్పుడనేది త్వరలో వెల్లడిస్తామని వాల్తేర్ అధికారులు చెబుతున్నారు. -
పల్లెటూరి ప్రేమకథ
నూతన నటుడు ఉదయ్ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘గుర్తుకొస్తున్నాయి’. ట్వింకిల్ అగర్వాల్ కథానాయికగా నటì స్తున్నారు. రాజేష్ సి.హెచ్ దర్శకత్వంలో బంగార్రాజు నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి వ్యాపారవేత్త శ్రీనివాస్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత సాయి వెంకట్ క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా రాజేష్ సి.హెచ్ మాట్లాడుతూ– ‘‘చాలా సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన నేను తొలిసారి దర్శకత్వం వహిస్తున్నాను. 1980 నాటి గ్రామీణ నేపథ్యంలో జరిగే టీనేజ్ లవ్ స్టోరీ ఇది. స్కూల్ డేస్‌లో పిల్లలు ఎలా ఉండేవారు? అప్పట్లో ఆటలు ఎలా ఉండేవి? ఆ పిల్లల మధ్య ప్రేమ ఎలా చిగురించేది... వంటి విషయాలు మా చిత్రంలో ఉంటాయి’’ అన్నారు. ‘‘నేను చేసిన షార్ట్ ఫిలిమ్స్ చూసిన బంగార్రాజుగారు ఈ చిత్రంలో ‘నువ్వే హీరో’ అనడంతో షాక్ అయ్యాను. టీనేజ్‌లో జరిగే సింపుల్ అండ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇది’’ అన్నారు ఉదయ్. ‘‘మే 1న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. సింగిల్ షెడ్యూల్లో చిత్రీకరణ పూర్తి చేస్తాం’’ అన్నారు బంగార్రాజు. ‘‘తెలుగులో ఇది నా తొలి చిత్రం’’ అన్నారు ట్వింకిల్ అగర్వాల్. ఈ కార్యక్రమంలో సహ నిర్మాత ముత్యాల దుర్గాప్రసాద్, కెమెరామే¯Œ: శివ.కె, సంగీత దర్శకుడు మార్క్ ప్రశాంత్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: జీవీవీ సత్యనారాయణ. -
సిటీ కుర్రాడు.. బాక్సింగ్‌లో ఎదిగాడు
గచ్చిబౌలి: ఓ తాపీ మేస్త్రీ కొడుకు అంతర్జాతీయ క్రీడాకారుడిగా ఎదిగాడు. అంతేకాదు.. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఎన్నో పతకాలను సైతం సాధించొక్చాడు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినా వెనుదిరగక దాతల సాయంతో ముందుకెళుతున్నాడు సుగునూరు ఉదయ్ సాగర్. కిక్ బాక్సింగ్‌లో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఈవెంట్లోనూ ఉదయ్ సాగర్ పతకం సాధించడం విశేషం. పదో తరగతిలో ఉండగా కిక్ బాక్సింగ్‌పై మక్కువ పెంచుకున్న ఇతడు ఒలింపిక్స్ లక్ష్యంగా ముందుకెళుతున్నాడు. ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకు టర్కీలోని అంటాలియాలో జరిగిన 4వ ఇంటర్నేషనల్ యూరోపియన్ చాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున పాల్గొన్న ఒకే ఒక్క క్రీడాకారుడు ఉదయ్ కావడం గమనార్హం. అంతేకాదు.. ఈ పోటీల్లో పాల్గొన్న 22 దేశాలను తలదన్ని సూపర్ హెవీ వెయిట్ విభాగంలో కాంస్య పతకం సాధించాడు. ఇది కాకుండా జాతీయ స్థాయిలో ఏడు బంగారు పతకాలు, రెండు రజత పతకాలు సాధించి కిక్ బాక్సింగ్‌లో తనకు ఎదరులేదని నిరూపిస్తున్నాడు. కుటుంబ నేపథ్యం ఇదీ వనపర్తి జిల్లా కేంద్రంలోని టీచర్స్‌కాలనీకి చెందిన ఉదయ్ సాగర్ తండ్రి సుగునరు రాము తాపీమేస్త్రి, తల్లి అరుణ గృహిణి. తండ్రి సంపాదనతోనే కుటుంబ పోషణ అధారపడి ఉంది. ఇంటర్ చదువుతుండగా వనపర్తిలోని కరాటే శేఖర్ వద్ద కిక్ బాక్సింగ్ శిక్షణ పొందాడు. ప్రస్తుతం ఉదయ్ తల్లిదండ్రులతో కలిసి మియాపూర్‌లోని ప్రగతి ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్నాడు. కిక్ నుంచి బాక్సింగ్ వైపు.. ఇప్పటి వరకు కిక్ బాక్సింగ్‌కు ఒలింపిక్‌లో అవకాశం కల్పించలేదు. వచ్చే 2024లో జరిగే క్రీడల్లోనూ కిక్ బాక్సింగ్‌కు చోటు దక్కుతుందనేది అనుమానమే. దీంతో ఉదయ్ కొంత కాలంగా బాక్సింగ్‌లోనూ శిక్షణ తీసుకుంటున్నాడు. ఎయిర్‌ఫోర్స్ రిటైర్డ్ ఆఫీసర్ చిరంజీవి వద్ద బాక్సింగ్‌లో శిక్షణ, మెళకువలు నేర్చుకుంటున్నాడు. ఒలింపిక్స్ పతకమే లక్ష్యం ఒలింపిక్స్‌లో కిక్ బాక్సింగ్‌కు చోటు కల్పిస్తే పతకం సాధించడమే నా లక్ష్యం. బాక్సింగ్‌లో ఒలింపిక్ మెడల్ సాధించిన విజేందర్ సింగ్ నాకు స్పూర్తి. రోజు నాలుగు గంటల పాటు ప్రాక్టీస్ చేస్తాను. ఒక్కో ఈవెంట్‌కు వెళ్లాలంటే కనీసం రూ.30 వేలు ఖర్చవుతుంది. శిరీష ఎస్టేట్స్ నిర్వాహకులు రఘునాథ్ యాదవ్ ఆర్థిక సాయం అందిస్తున్నారు. – ఉదయ్ సాగర్ సాధించిన పతకాలు ఇవే.. ♦ తొలిసారి 2013లో యాకూత్పురాలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకంసాధించాడు. ♦ 2015లో నగరంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకం ♦ వైజాగ్‌లో జరిగిన జాతీయ పోటీల్లో89 కిలోల విభాగంలో కాంస్య పతకం ♦ 2015 ఆగస్టులో కోల్‌కతాలో జరిగిన జాతీయ పోటీల్లో 90 కిలోల విభాగంలో రజత పతకం ♦ 2017 జనవరిలో ఢిల్లీలో జరిగిన నేషనల్ఫెడరేషన్ కప్‌లో బంగారు పతకం ♦ ఏప్రిల్‌లో మహారాష్ట్ర, సెప్టెంబర్లోచత్తీస్ఘడ్లో జరిగిన జాతీయ పోటీల్లో బంగారు పతకాలు ♦ 2018 ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన జాతీయ పోటీల్లో బంగారు పతకం. ఆగస్టులో సీనియర్ కిక్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో బగారు పతకం. -
ఎలా బయటపడ్డారు?
అమర్, ప్రదీప్ వర్మ, ఉదయ్, అభి, సి.టి, ఖాదర్, లక్ష్మీ, శృతి, కావ్య, దేవి, వీణ, జాస్మిన్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘చెడ్డీ గ్యాంగ్’. ఇందులో శ్రీనివాస రెడ్డి కీలక పాత్ర పోషించారు. కనగాల రమేష్ చౌదరి దర్శకత్వంలో విక్కి రాజ్ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధమైంది. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. రమేష్ మాట్లాడుతూ– ‘‘దాదాపు 32ఏళ్లుగా అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్‌గా చిత్రపరిశ్రమలో పని చేసిన నేను దర్శకునిగా తెరకెక్కించిన తొలి చిత్రమిది. సాఫ్ట్వేర్ కంపెనీలో బాగా పనిచేసే ఓ పది మంది ఉద్యోగులను ఆ కంపెనీ ఎండీ కేరళ టూర్‌కి పంపిస్తాడు. కేరళ అడవుల్లో జరుగుతున్న కోయవారి జాతరకు వెళ్లిన ఆ పదిమంది అక్కడే ఇరుక్కుపోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితుల నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎలా బయటపడ్డారనేది చిత్రకథాంశం. మలేసియాలో తీసిన క్లైమాక్స్ ఓ హైలైట్. దాదాపు 125 రోజుల పాటు రెండు షెడ్యూల్స్‌లో ఈ సినిమాను తెరకెక్కించాం. బాలీవుడ్ బ్యూటీ స్నేహా కపూర్ చేసిన స్పెషల్ సాంగ్ అదనపు ఆకర్షణ’’ అన్నారు. ఈ సినిమాకు ప్రదీప్ వర్మ సంగీతం అందించారు. -
రైల్వే శాఖ తొలి వినూత్న ప్రయోగం
సాక్షి, న్యూఢిల్లీః రైలు ప్రయాణీకుల సౌకర్యార్ధం, రైల్వే శాఖ ఒక వినూత్న పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. రైళ్లలో ప్రయాణించేటప్పుడు కాఫీ, టీ తదితర వాటికోసం పడుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టేలా ఆటోమేటిక్ వెండింగ్ మెషీన్లను దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. ఈ మేరకు రైల్వే శాఖ ట్విటర్లో ఒక వీడియోను షేర్ చేసింది. ట్యాబ్లెట్ ఆధారంగా ఈ ఆటోమేటిక్ వెండింగ్ మెషీన్లు ప్రయాణికులకు సేవలను అందించనున్నాయని రైల్వే శాఖ సహాయ మంత్రి రాజేన్ గోహైన్ తెలిపారు. తద్వారా రైలు ప్రయాణికులు తమకు అవసరమైన బిస్కెట్లు, చాక్లెట్లు, చిప్స్ వంటి తినుబండారాలు, శీతల పానీయాలు, కాపీ, టీ, ప్రూట్ జ్యూస్ లను ఈ వెండింగ్ మెషిన్ ద్వారా పొందవచ్చని చెప్పారు. ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా కోయంబత్తూరు-బెంగుళూరు మధ్య నడిచే ఉదయ్ (UDAY ఉత్కృష్ట్ డబుల్ డెకర్ ఎయిర్ కండిషన్డ్ యాత్రి) ఎక్స్ ప్రెస్ లోని మూడు బోగీల్లో ఏర్పాటు చేశారు. ప్రయాణికులు వెండింగ్ మెషిన్ వద్ద వున్న టాబ్లెట్ తో కాఫీ, టీ సహా తమకు కావాల్సిన పదార్ధాలను ఎంపిక చేసుకుని వాటికి సరిపడా నగదు చెల్లించాలి. ప్రస్తుతం నగదు చెల్లింపుదారులకు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో వుంది. First ever food vending machine in running train installed in- Coimbatore - Bengaluru UDAY Express over Southern Railway pic.twitter.com/1C2ezhxNiT — Ministry of Railways (@RailMinIndia) June 9, 2018 -
బడ్జెట్ ధరలో ఇంటెక్స్ ‘ఉదయ్’
సాక్షి, ముంబై: దేశీయ మొబైల్ తయారీదారు ఇంటెక్స్ ఒక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ప్రారంభించింది. ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఫీచర్‌తో ‘ఉదయ్’ అనే ఈ సరికొత్త డివైస్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. 7,999 రూపాయల బడ్జెట్ ధరలో దీన్ని కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. ఈ ఫోన్‌ను విక్రయించేందుకు వివిధ రిటైల్ అవులెలెట్లతో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నట్టు ఇంటెక్స్ ప్రకటించింది. అంతేకాదు రిలయన్స్ జియో ద్వారా 2,200 రూపాయల దాకా క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ప్రస్తుత, కొత్త జియో కస్టమర్లకు ఇది వర్తిస్తుంది. రూ.198 లేదా రూ.299 ప్లాన్ల రీచార్జ్ (44) లపై 50 రూపాయల విలువైన 44 క్యాష్‌బ్యాక్ వోచర్లను మై జియో యాప్ ద్వారా పొందవచ్చు. ఇంటెక్స్ ఉదయ్ ఫీచర్లు 5.2 అంగుళాల హెచ్డీ స్క్రీన్ 1280 × 720 పిక్సల్ రిజుల్యూషన్ ఆండ్రాయిడ్ 7 ఆపరేటింగ్ సిస్టం 1.3 గిగాహెట్జ్ క్వాడ్ కోర్ మీడియా టెక్ ప్రాసెసర్ 3 జీబీ ర్యామ్ 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ వరకు విస్తరించుకునే సదుపాయం 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా విత్ ఆటోఫోకస్ అండ్ ఫ్లాష్ 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 2800 ఎంఏహెచ్ బ్యాటరీ -
ఉదయ్ లేదా!
సాక్షి, విశాఖపట్నం: ‘ఉదయ్’.. (ఉత్కృష్ట్ డబుల్ డెక్కర్ ఏసీ యాత్రి) మధ్య తరగతి వారికి అందుబాటులో ఉండేందుకు ఉద్దేశించిన డబుల్ డెక్కర్ రైలు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే విశాఖ–విజయవాడల మధ్య దీనిని ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించి రెండేళ్లయింది. ఈ ట్రైన్‌కు 22701 నంబరును కూడా ప్రకటించారు. ఏడాదిలోగా ‘ఉదయ్’ను పట్టాలెక్కిస్తామని అప్పటి రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు చెప్పారు. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లోనూ దీనిపై ప్రకటన వెలువడుతుందని అంతా ఆశించారు. ప్చ్.. కనీసం దాని ప్రస్తావనే తేవడం మానేశారు. దీంతో దీని రాక ఎప్పుడన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్న ఈ ‘ఉదయ్’ డబుల్ డెక్కర్ రైలు పట్టాలెక్కితే విశాఖ–విజయవాడల మధ్య రాకపోకలు సాగించే వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. చార్జీలు తక్కువ.. ఈ ఏసీ రైలులో టిక్కెట్ చార్జీలు కూడా అందుబాటులోనే ఉంటాయి. ఎక్స్‌ప్రెస్ రైలు థర్డ్ ఏసీకంటే తక్కువ, స్లీపర్ చార్జీలుకంటే కాస్త ఎక్కువగా ఉండనున్నాయి. విశాఖపట్నం నుంచి విజయవాడకు స్లీపర్ క్లాస్ టిక్కెట్టు రూ.240, థర్డ్ ఏసీ టిక్కెట్టు రూ.560 ఉంది. అంటే ఈ లెక్కన ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు టిక్కెట్ చార్జీ రూ.400 వరకు ఉండవచ్చని తెలుస్తోంది. ఎందుకు ఆలస్యం? ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రైలుకు అవసరమైన బోగీల తయారీలో జాప్యం జరుగుతోందని, అందువల్లే దీనిని ప్రారంభించడానికి ఆలస్యమవుతోందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఈ డబుల్ డెక్కర్ బోగీల నిర్మాణం పంజాబ్‌లోని కపుర్తలా కోచ్ తయారీ కేంద్రంలో జరుగుతోంది. కోచ్‌లు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాక తొలుత ఉత్తర రైల్వేలో ప్రయోగాత్మకంగా నడుపుతారు. ఈ ఉదయ్ డబుల్ డెక్కర్ బోగీలను కూడా ఆ రైల్వేలోనే ప్రయోగాత్మకంగా నడిపి చూసి సంతృప్తి చెందాక తూర్పు కోస్తా రైల్వేకు అప్పగిస్తారు. ఆ తర్వాత అధికారికంగా ఈ రైలును ప్రారంభిస్తారు. ఇప్పటికే విశాఖ–తిరుపతిల మధ్య ఒక డబుల్ డెక్కర్ రైలు నడుస్తోంది. -
దిల్వాలా
ఆటో చూడు ఆటో చూడు.... మనసున్న మనిషిని చూడు... నిస్వార్థ సేవను చూడు... మానవత్వపు మార్గం చూడు.... మంచిని పెంచె పనిని చూడు... జాదవ్ భాయ్ ఘనతను చూడు... ఆ ఆటో గొప్పను చూడు.... అతడిలా మంచిని పెంచరా... అతని మార్గం అందరికీ మేలురా... ‘నీ గాంధీగిరితో ఇంట్లోవాళ్లను చంపేస్తావా? చూడు ఏమైందో? స్కూల్ ఫీజు కట్టలేదని వాడి ఫైనల్ రిజల్ట్స్ ఏంటో చెప్పలేదు టీచర్లు’ అరుస్తోంది భార్య. ‘ఒరేయ్.. రెక్కాడితే కాని డొక్కాడని మనకెందుకురా ఈ ఉచితసేవా కార్యక్రమాలు? నీ సంపాదన మీదే మేమంత ఆధారపడ్డాం.. కాస్త చూసుకో.. బాధ్యతగా నడుచుకో’ సలహా లాంటి హెచ్చరిక నాన్న నుంచి. అసహనంతో ఇంట్లోంచి బయటపడ్డాడు. ఊరంతా ఆటో తిప్పుతున్నాడు. ఆలోచనల్లో పడ్డాడు.‘నేనేమైనా తప్పు చేస్తున్నానా? నా అలవాటుతో ఇంట్లోవాళ్లను బాధ పెడ్తున్నానా? ఇంటిని నడిపే బాధ్యత తన మీద ఉన్నప్పుడు ఇంట్లో వాళ్లను కష్టపెట్టకూడదు కదా. నా తత్వానికి నా కొడుకు ఎందుకు బలి కావాలి? తప్పు నాదేనా? ఎవరికి వాళ్లు ఇలా బంధాలు, బాధ్యతలు అనుకుంటూ వాటికి బందీ అయితే మంచి ఎలా బతుకుతుంది? ఎవరో ఒకరు కష్టపడితేనే కదా.. పది మంది బాగుపడేది. లేదు... నేనే తప్పూ చేయట్లేదు. ఇంకో కష్టం చేసైనా సరే పిల్లాడి ఫీజు కడ్తాను. అంతే కాని నా దారి మార్చుకునేది లేదు’ అంతర్మధనంలోంచి గట్టి నిర్ణయమే తీసుకున్నాడు. ఇంతకీ ఆయన ఎవరు? ఓ సాదాసీదా ఆటోవాలా! పేరు ఉదయ్‌సిన్హ్ రమణ్‌లాల్ జాదవ్. ఊరు గుజరాత్‌లోని అహ్మదాబాద్. మరి ఇంట్లో వాళ్లు అభ్యంతర పెట్టేంత పని ఈయన ఏం చేస్తున్నాడు? ఏంలేదు.. మీటర్ వేయకుండా బేరం చేయకుండా ఆటో నడుపుతుంటాడు. గమ్యం చేర్చాక ‘మీకు తోచినంత ఇవ్వండి’ అంటాడు చిరునవ్వుతో! అదీ కూడా తర్వాత ఎక్కే ప్యాసెంజర్స్ కోసమే అని విన్నవిస్తాడు. అంటే వీళ్ల ప్రయాణం ఉచితంగానే సాగినట్టన్నమాట. దయగల మహాత్ములు వచ్చిన దూరం కంటే ఎక్కువే డబ్బులు ఇవ్వచ్చు. కొంతమంది బొటాబొటి కట్టొచ్చు. ఇంకొంత మంది తక్కువే ఇవ్వచ్చు. చాలా మంది అసలు ఇవ్వకపోనూ వచ్చు. అయినా సరే అతడిది అదే ధోరణి. అదీగాక ఈ ఆటోవాలా పేదవాళ్లకు, వికలాంగులకు ఫ్రీ సర్వీస్ ఇస్తుంటాడు. అలా ఆయన అనుసరిస్తున్న గాంధీమార్గం వల్ల ఇంటి ఖర్చులకు సరిపడా కాసులు రావడం లేదు. భారం అంతా ఇంటిని చక్కదిద్దుతున్న ఉదయ్‌సిన్హ్ భార్య మీద పడుతుంటుంది. కాని మంచి పనికి మొదట కష్టం ఎదురు కావచ్చు. తర్వాత విజయమే వరిస్తుంది. ఎక్కడి నుంచి స్ఫూర్తి పొందాడు? అహ్మదాబాద్‌లో పేదవాళ్ల కోసం ‘మానవ్ సాద్నా’ అనే ఓ ఎన్జీవో పని చేస్తుంటుంది. కుల, మతభావాలకు అతీతంగా పేదవాళ్లకు అన్నం పెడ్తుంటుంది. బయట ఎంత కొట్టుకుంటున్నా ఆకలయ్యే సరికి జనం ఈ మానవ్ సాద్నా అనే ఒకే చూరుకిందకు రావడం అన్ని మరిచి పోయి కడుపు నింపుకోవడం చూసి ఆశ్చర్యపోయేవాడు ఉదయ్ సిన్హ్. వీళ్లందరినీ ఇలా ఒక్కటి చేస్తున్న మానవ్ సా«ద్నా వలంటీర్ల ప్రయత్నానికి ముగ్ధుడయ్యి తనూ వారితో కలిశాడు. చేరాడు. రెండేళ్లు పనిచేశాడు. ఆ తత్వాన్ని ఒంటబట్టించుకున్నాడు. బయటకు వచ్చాక అక్కడ నేర్చుకున్న సంస్కారాన్ని కార్యరూపంలో పెట్టాలనుకుని ‘అహ్మదాబాద్ నొ ఆటోరిక్షావాలో’ (పే ఇట్.. ఫార్వర్డ్) పేరుతో ఆటో స్టార్ట్ చేశాడు. అదే తోచినంత ఇచ్చే కాన్సెప్ట్ ఆటో. ఎక్కిన ప్యాసెంజర్ తర్వాత ఎక్కబోయే ప్యాసెంజర్ డబ్బులు కట్టాలన్నమాట. గమ్మం చేరాక ప్రయాణికులు దిగగానే హార్ట్‌షేప్‌లో ఉన్న మెనూకార్డ్ లాంటి కార్డ్ ఇస్తాడు. ‘ఆదరంగా ఇవ్వండి’ అని చెప్తాడు. అతని ఆటో వెనక పెద్ద పెద్ద అక్షరాలతో ‘పే ఫ్రమ్ యువర్ హార్ట్’ అని రాసి ఉంటుంది. ఏమీ ఇవ్వలేని వాళ్లు మనసారా నవ్వితే చాలని ఆరాటపడ్తాడు ఉదయ్. అయితే అతను ఈ సర్వీస్ మొదలుపెట్టినప్పుడు ఎవరూ అంతగా పట్టించుకోలేదు. కాని రాను రానూ ఈ కాన్సెప్ట్ అందరిలోకి వెళ్లి ఉదయ్సిన్హ్కి డిమాండ్ పెరిగే సరికి తోటి ఆటోవాలాలు అతని మీద పెద్ద పోరాటానికే దిగారు. నవ్వు చెడిందే కాక మా గిరాకీ చెడగొడ్తున్నావ్ అంటూ. అయినా ఉదయ్ తన ఆటోకి బ్రేక్ వేయలేదు. చివరకు తోటి ఆటోవాలాలే నెమ్మదిగా తగ్గి అడ్డుఅదుపు లేకుండా తిరుగుతున్న మీటర్‌ను క్రమపద్ధతికి మార్చారు. ‘ఉదయ్ భాయ్లా పెద్ద మనసు మాకు లేదులే కాని నిజాయితీగా పని చేయాలని మాత్రం అనుకున్నాం’ అని చెప్తారు ఆ ఆటోవాలాలు. ఉదయ్ సిన్హ్ నిజంగానే గ్రేట్. అమితాబ్ ఎక్కిన ఆటో ఉదయ్‌సిన్హ్ సర్వీస్ ఊసు ఆ మీడియా ఈ మీడియా ద్వారా దేశమంతా ప్రచారమైంది. ముంబైలో ఉన్న అమితాబ్‌కి, చేతన్భగత్కీ తెలిసింది. అతనిని కలుసుకోవడం కోసం ఈ ఇద్దరూ అహ్మదాబాద్ వచ్చి అతని ఆటో ఎక్కి ఊరంతా తిరిగారు. అతని కుటుంబాన్ని కలుసుకున్నారు. తోచినంత డబ్బిచ్చారు. అతని గాంధీగిరిని చూసి కళ్లెర్ర చేసిన ఆయన భార్య ఇప్పుడేం చేస్తుందో తెలుసా? ‘మావారు చేస్తున్న పని చాలా ఆలస్యంగా అర్థమైంది. ఆయన్ని చూసి నాకూ ఏదో ఒకటి చేయాలనిపించింది. అందుకే మా ఆయన ఆటోలో ఎక్కే పేద ప్రయాణికుల కోసం ఢోక్లా, లస్సీ తయారు చేసి ఆటోలో పెడ్తాను’ అంటుంది. ఉదయ్ వాళ్ల నాన్న ఆకలిగొన్న పశువులకు దాణా వేస్తుంటాడు. ఇలా తన కుటుంబాన్ని, చుట్టుపక్కల వాళ్లకూ స్ఫూర్తి పంచుతున్న ఉదయ్‌సిన్హ్ రమణ్లాల్ను రెడ్ ఎఫ్.ఎమ్ ‘బడే దిల్వాలే’ పురస్కారాన్ని, రోటరీ క్లబ్ కూడా సేవా అవార్డ్‌ను ఇచ్చి సత్కరించింది. తన సేవకు బరోడా మేనేజ్మెంట్ అవార్డ్‌నూ అందుకున్నాడు ఉదయ్‌సిన్హ్. ‘ఎవరికి వాళ్లు నేనేమై పోవాలి అనుకుంటే ఏదీ ముందుకు కదలదు. ఎదుటి వ్యక్తికి సహాయపడ్డమనేది చెప్తే వచ్చేది కాదు.. అది మనలో సహజసిద్ధంగా ఉండాలి’ అంటాడు మనసున్న ఆటోవాలా ఉదయ్‌సిన్హ్ రమణ్‌లాల్ జాదవ్. -
ఏడాదిలో అందరికీ విద్యుత్ అసాధ్యం
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని ప్రతి ఇంటికి 2018, డిసెంబర్ నెలాఖరుకల్లా కేంద్ర సౌభాగ్య పథకం కింద విద్యుత్ సౌకర్యం కల్పించడమేకాకుండా 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సౌకర్యం అందిస్తామని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ఇటీవల ప్రకటించారు. దేశంలోని ప్రతి ఇంటికి విద్యుత్ సౌకర్యం కల్పించడం అంటే ముందుగా దేశంలోని విద్యుత్ సౌకర్యం లేని నాలుగు కోట్ల ఇళ్లకు విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలి. ఆ తర్వాత వారికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలి. దేశంలోని మెట్రోపాలిటన్ నగరాలే విద్యుత్ కోతను ఎదుర్కొంటున్న నేటి పరిస్థితుల్లో మంత్రి ఆర్కే సింగ్ చేసిన ప్రకటనను అమలు చేయడం సాధ్యమయ్యే పనేనా?! ముంబైలోని శివారు ప్రాంతాలు, నవీ ముంబై, థానె ప్రాంతాల్లో ప్రస్తుతం రోజుకు మూడు గంటలు విద్యుత్ కోత ఉంటున్న విషయం తెల్సిందే. ఆ రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంటులకు ఎక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ ఈ పరిస్థితి కొనసాగుతోంది. మిగులు విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా ఈ కొరతను అధిగమించవచ్చని కేంద్రం భావిస్తోంది. అసలు ఎందుకు విద్యుత్ ప్లాంట్లు మిగులు విద్యుత్ ఉత్పత్తి చేయలేక పోతున్నాయనే విషయాన్ని లోతుగా పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వస్తాయి. ఈ అంశాలను అర్థం చేసుకోవాలంటే ముందుగా విద్యుత్ ఉత్పత్తిదారులు లేదా జనరేటర్ల నుంచి వినియోగదారుల వద్దకు విద్యుత్ సరఫరా ఎలా జరుగుతుందో, ఆ చైనా ఎలా పనిచేస్తుందో ముందుగా పరిశీలించాల్సి ఉంటుంది. విద్యుత్ ఉత్పత్తిదారుల నుంచి చౌక రేటును విద్యుత్‌ను కొనుగోలు చేసి, దాన్ని వినియోగదారుడికి సరసమైన ధరకు అందించడం విద్యుత్ పంపిణీ కంపెనీల బాధ్యత. ఈ కంపెనీలను డిస్కామ్లని పిలుస్తాం. సాంకేతిక, ఇతర సమస్యల కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్ర నష్టం జరుగుతోంది. విద్యుత్ ఉత్పత్తిదారుడి నుంచి వినియోగదారుడి వద్దకు విద్యుత్‌ను తీసుకరావడంలో నష్టం వాటిల్లుతోంది. కొన్ని రాష్ట్రాల ఈ నష్టం 30 శాతం వరకు ఉండడంతో చాలా డిస్కామ్‌లు తీవ్ర నష్టాల్లో నడుస్తున్నాయి. 2015, మార్చి నాటి అంచనాల ప్రకారం భారత్‌లోని డిస్కామ్‌ల నష్టాలు 3.8 లక్షల కోట్ల రూపాయలకు చేరుకొని వాటి మొత్తం అప్పులు 4.3 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఈ కంపెనీలు ఈ అప్పులపై 14 నుంచి 15 శాతం వరకు వడ్డీలు చెల్లిస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా చాలా డిస్కామ్‌లు విద్యుత్ టారిఫ్‌లను పెంచలేకపోతున్నాయి. నష్టాలను భర్తీ చేసుకోలేక పోతున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దడం కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2015లో ‘ఉజ్వల్ డిస్కామ్ హామీ యోజన’ పథకాన్ని తీసుకొచ్చింది. దీన్ని ఉదయ్ అని కూడా వ్యవహరిస్తారు. ఈ పథకం కింద డిస్కామ్‌ల నష్టాల్లో 75 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని, ఇందులో భాగంగా మొదటి సంవత్సరం 50 శాతం అప్పులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని, రెండో సంవత్సరం మిగతా 25 శాతం అప్పులను చెల్లించాలని కేంద్రం ఆదేశించింది. భవిష్యత్తులో అప్పులు పెరగకుండా విద్యుత్ టారిఫ్‌లను పెంచాలని కూడా కోరింది. అలాగే విద్యుత్ సరఫరాలో నష్టాన్ని సాంకేతికంగా, వాణిజ్యపరంగా కూడా 2019, మార్చి నాటికి 15 శాతానికి కట్టడి చేయాలని కూడా సూచించింది. అందుకు ట్రాన్స్ఫార్మర్లను అప్‌గ్రేడ్ చేయాలని, స్మార్ట్ మీటర్లను తీసుకరావాలని కోరింది. కేంద్రం ఈ ఉదయ్ స్కీమ్‌ను తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో ఎక్కువ విద్యుత్‌ను వినియోగించే పది రాష్ట్రాల్లో కేవలం మూడు రాష్ట్రాలు మాత్రమే విద్యుత్ టారిఫ్‌లను పెంచాయి. మిగతా ఏడు రాష్ట్రాల పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారయింది. కేంద్రం ప్రకటించిన ఉదయ్ స్కీమ్‌లోకి 2016, జూలై నాటికి 14 రాష్ట్రాలు చేరినప్పటికీ మూడు రాష్ట్రాల డిస్కామ్‌ల పరిస్థితే మెరగుపడింది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల డిస్కామ్‌ల పరిస్థితి దారుణంగా ఉంది. ప్రస్తుత అంచనాల ప్రకారం కూడా డిస్కామ్‌లు 2.3 లక్షల కోట్ల రూపాయల నష్టాలను ఎదుర్కొంటున్నాయి. వీటిని భర్తీ చేసుకునేందుకు డిస్కామ్‌లు విద్యుత్ టారిఫ్‌లను పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించడం లేదు. గుజరాత్లో బీజేపీయే అధికారంలో ఉన్నప్పటికీ రానున్న అసెంబ్లీ ఎన్నికలను దష్టిలో పెట్టుకొని టారిఫ్‌లను పెంచలేదు. అలాగే మరో కారణంగా తెలంగాణ ప్రభుత్వం పెంచేందుకు అనుమతివ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్ కొనుగోలు పెంచి నష్టాలను కూడగట్టుకోవడం కన్నా తక్కువ విద్యుత్‌ను కొనుగోలు చేయడం, తక్కువ విద్యుత్‌ను సరఫరా చేయడం ఉత్తమమని డిస్కామ్‌లు భావిస్తున్నాయి. ఫలితంగా విద్యుత్ కోతలు ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 2018, డిసెంబర్ నాటికి ప్రతి ఇంటికి కరెంట్ ఇవ్వాలనే లక్ష్యం నెరవేరాలంటే ఎంత కష్టం, ఎంత నష్టం ? -
టార్చ్‌లైట్‌లో వేశ్యగా సదా
తమిళసినిమా: ఇప్పుడు వేశ్య పాత్రలో నటించడానికి టాప్ హీరోయిన్లు కూడా రెడీ అంటున్నారు. నటి అనుష్క, శ్రియ, చార్మి ఇలా చాలా మంది నటీమణులు నటించేశారు. అలాంటిది పలువురు హీరోయిన్లు నో అన్న వేశ్య పాత్రలో నేను రెడీ అందట నటి సదా. మరి ఆ పాత్రలో ఎంత మసాలా ఉంటుందో. ఈ అమ్మడు ఇంతకు ముందు కోలీవుడ్‌లో క్రేజీ నాయకిగా రాణించిందన్నది తెలిసిందే. జయం చిత్రంతో దిగుమతి అయిన సదా ఆ తరువాత అజిత్‌తో తిరుపతి, మాధవన్‌కు జంటగా ఎదిరి ఇలా చాలా చిత్రాల్లో నటించింది. స్టార్ దర్శకుడు శంకర్ కూడా విక్రమ్ సరసన అనియన్ చిత్రంలో నటి సదానే నాయకిగా ఎంచుకున్నారన్నది గమనార్హం. అలాంటి నటి ఆ తరువాత కనిపించకుండా పోయింది. ఇటీవల తరచూ టీవీ షోల్లో కనిపిస్తున్న సదాకు కోలీవుడ్‌లో ఒక అవకాశం వచ్చింది. టార్చ్‌లైట్ అనే చిత్రంలో వేశ్యగా నటిస్తోందట. ఇంతకు ముందు విజయ్ హీరోగా తమిళన్ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన అబ్దుల్ మజీద్ తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం టార్చ్‌లైట్.దీని గురించి దర్శకుడు తెలుపుతూ ఏ అమ్మాయి అయినా కోరి పడుపు వృత్తికి దిగదన్నారు. పరిస్థితుల ప్రభావం, మోసాలకు గురయ్యో ఆ వృత్తిలోకి నెట్టబడతారన్నారు. అలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలన్న అవగాహనను కలిగించే ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రం టార్చ్‌లైట్ అని చెప్పారు. ఈ కథను చాలామంది నటీమణులకు చెప్పగా నటించడానికి నిరాకరించారని, తమ ఇమేజ్ దెబ్బతింటుందని భయపడ్డారని చెప్పారు. చివరికి నటి సదాను వెతుక్కుంటూ వెళ్లి కథ చెప్పగా ఇలాంటి కథా చిత్రాలు సమాజానికి చాలా అవసరం అని, తాను తప్పకుండా నటిస్తానని అన్నారని తెలిపారు. సదా వేశ్యగా ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ టార్చ్‌లైట్ చిత్రంలో ఉదయ్ అనే నూతన నటుడు హీరోగానూ అతనికి జంటగా రిత్విక హీరోయిన్‌గానూ నటిస్తోందని చెప్పారు. చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోందని దర్శకుడు తెలిపారు. -
ఇంకా దొరకని అనిల్ ఆచూకీ
ఉదయ్ మృతదేహం వెలికితీత ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం పూర్తి కుటుంబ సభ్యులకు అప్పగింత మృతదేహం బెంగళూరులోని స్వగృహానికి తరలింపు మిన్నంటిన రోదనలు పార్థివదేహానికి నేడు అంత్యక్రియలు నిర్మాత సుందర్‌గౌడ, నటుడు దునియా విజయ్, రవివర్మ, దర్శకుడు నాగశేఖరపై తాత్కాలిక నిషేధం బెంగళూరు: మాస్తిగుడి సినిమా చిత్రీకరణ సమయంలో తిప్పగొండనహళ్లి చెరువులో గల్లంతైన అనిల్ కోసం బుధవారం రాత్రి పొద్దుపోయే వరకూ గాలించినా ప్రయోజనం లేకపోరుుంది. అరుునా అగ్నిమాపకశాఖ సిబ్బందితో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నిపుణులు అక్కడే ఉండి గురువారం కూడా గాలింపును కొనసాగించనున్నారు. ఇదిలా ఉండగా మంగళవారం రాత్రి పొద్దుపోరుున తర్వాత చెరువులో గుర్తించిన ఉదయ్‌రాఘవ మృత దేహాన్ని బుధవారం వెలికితీశారు. మృత దేహంపై అక్కడక్కడ చేపలు కొరికిన గుర్తులు కూడా ఉన్నారుు. మృతదేహాన్ని చూడటంతోనే అక్కడే ఉన్న కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటారుు. ఇంట్లో ఉన్న ఉదయ్‌రాఘవ తల్లి కౌసల్య సృహ తప్పి పడిపోయారు. ఇదిలా ఉండగా ఉదయ్ మృత దేహానికి చెరువు వద్దనే పోస్ట్‌మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రత్యేక అంబులెన్సలో నగరంలోని యడియూరు వద్ద ఉన్న ఉదయ్ స్వగృహానికి తీసుకువచ్చి ప్రజల సందర్శనార్థం ఉంచారు. తమ ఆప్తుడిని చివరి సారిగా చూడటం కోసం కోలారు, తుమకూరు నుంచి కూడా చాలా మంది యడియూరుకు చేరుకున్నారు. దీంతో కొంత ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఉదయ్ అంత్యక్రియలు స్థానిక బనశంకరి హిందూ స్మశాన వాటిలో గురువారం నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణరుుంచారు. ఇదిలా ఉండగా గురువారం సాయంత్రంలోపు అనిల్ ఆచూకి కూడా లభించనుందని అధికారులు చెబుతున్నారు. స్థానికంగా ఉంటున్న యల్లయ్య చెరువు వద్దకు వెళ్లి కనిపించలేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. తాత్కాలిక నిషేధం.. నిర్మాతసుందరగౌడ, నటుడు దునియా విజయ్‌తో పాటు స్టంట్‌మాస్టర్ రవివర్మ, దర్శకుడు నాగశేఖర పై తాత్కాలిక నిషేదం విధించినట్లు కర్ణాటక వాణిజ్య మండలి అధ్యక్షుడు గోవిందు స్పష్టం చేశారు. తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకూ వీరు కర్ణాటకతో పాటు తమిళనాడు, తెలుగుతో సహా మరే ఇతర చలనచిత్రాల్లో కార్యకలాపాలు నిర్వహించరాదని ’మండలి’ తీర్మానించిందన్నారు. బెంగళూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తిప్పగొండనహళ్లి ఘటనతో కన్నడ చలనచిత్ర రంగం తలవంపులకు గురైందన్నారు. ఘటనకు కారణమని భావిస్తున్న పై నలుగురిపై తాత్కాలిక నిషేదం విధిస్తున్నామన్నారు. ప్రస్తుతం జరగాల్సిన కొన్ని కార్యక్రమాల తర్వాత నిషేదం విధించిన ముగ్గురితో పాటు పదాధికారులను ఒకచోట చేర్చి ఘటనపై మరోసారి చర్చించిన తర్వాత దోషులుగా తేలిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవాన్న విషయం ప్రకటిస్తామన్నారు. కాగా, స్నేహితుల కోసం దునియా విజయ్ మూడు రోజులుగా తిప్పగొండనహళ్లి వద్దనే ఉంటూ గాలింస్తుడటాన్ని యావత్ కన్నడ చలనచిత్ర రంగం ప్రశంసిస్తోందని గోవిందు పేర్కొన్నారు. కన్నడ చలనచిత్ర రంగం తీసుకున్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని అనిల్ గాలింపు చర్యల్లో పాల్గొంటున్న దునియా విజయ్ మీడియాతో పేర్కొన్నారు. -
‘ఉదయ్’లోకి తెలంగాణ
► డిస్కంలను నష్టాల నుంచి గట్టెక్కించేందుకే: కేసీఆర్ ► కేంద్ర విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ ► రోజువారీ కరెంటు వాడకం తెలిపేలా యాప్‌లు సాక్షి, హైదరాబాద్: విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లను నష్టాల ఊబి నుంచి గట్టెక్కించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ఉదయ్ పథకంలో తెలంగాణ భాగస్వామి అవుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. డిస్కంల అప్పులను తీర్చడం ద్వారా వాటిపై ఆర్థికభారాన్ని తగ్గిస్తామన్నారు. ఇందుకోసం నిధులు సమీకరించుకోవడానికి ఎఫ్ఆర్బీఎం మినహాయింపులివ్వడం సానుకూలాంశమని అభిప్రాయపడ్డారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ గురువారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఉదయ్ పథకంలో చేరాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేయగా సీఎం సానుకూలంగా స్పందించారు. దీన్‌దయాళ్ పథకంలో ఎక్కువ నిధులివ్వడంతో పాటు తెలంగాణ విద్యుదుత్పత్తి ప్లాంట్లకు అవసరమైన బొగ్గును కేటాయించడానికి కూడా గోయల్ అంగీకరించారు. ఉదయ్‌లో చేరాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర అధికారులు మళ్లీ సమావేశమై ఒప్పందంపై సంతకాలు చేయాలని కేసీఆర్ కోరారు. ఇంటింటికీ ఎల్ఈడీ బల్బులు ఎల్ఈడీ లైట్ల వాడకంపైనా గోయల్, సీఎం మధ్య చర్చ జరిగింది. తెలంగాణలో 26 నగర పంచాయతీలు, 12 మున్సిపాల్టీల పరిధిలో ఇప్పటికే ఎల్ఈడీ లైట్లు వినియోగిస్తున్నట్టు కేసీఆర్ చెప్పారు. విద్యుత్ వాడకం బాగా తగ్గుతుంది గనుక ఇంటింటా ఎల్ఈడీ బల్బులుండేలా ప్రోత్సహిస్తామన్నారు. బల్బుల ధరలు బాగా తగ్గుతున్నందున ఈఈసీఎల్తో సంప్రదించి ఒప్పందాలు కుదుర్చుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. తెలంగాణలో 22 లక్షల పంపుసెట్లున్నాయని, వాటికే ఎక్కువ కరెంటు వినియోగమవుతుందన్నారు. తక్కువ కరెంటును వాడేవి, ఇంటినుంచే నిర్వహించుకునే పంపుసెట్లొచ్చాయని, తెలంగాణలో వాటిని విరివిగా వాడాలని మంత్రి సూచించారు. దశలవారీగా పంపుసెట్ల మార్పుకు కేంద్రం నుంచి సాయమందిస్తామని హామీ ఇచ్చారు. తక్కువ విద్యుత్ వాడే ఫైవ్ స్టార్ ఫ్యాన్ల వాడకాన్ని ప్రోత్సహించాలని సూచించారు. విద్యుత్ వాడకందారులు ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వపరంగా సహకరించాలని ఇరువురూ నిర్ణయించారు. వినియోగదారులు రోజూవారీగా తామెంత కరెంటు వాడిందీ తెలుసుకునేలా యాప్‌లు రూపొందిస్తామని కేసీఆర్ వెల్లడించారు. బొగ్గు గనులు ఉన్నచోటే ప్లాంట్లు బొగ్గు గనులున్న చోటే విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తే మేలని గోయల్‌కు సీఎం సూచిం చారు. వాటికి స్థానిక గనుల నుంచి బొగ్గు సరఫరా చేయాలని కోరారు. తెలంగాణలోని ప్లాం ట్లకు స్థానిక గనుల నుంచే బొగ్గు సరఫరా చేస్తే రవాణా భారం తగ్గుతుందన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్యలను అధిగమించడంతో పాటు మున్ముందు తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు తీసుకుంటున్న చర్యలను మంత్రికి వివరించారు. తెలంగాణ ప్రభుత్వ విద్యుదుత్పత్తి ప్రణాళికలు, సౌర విద్యుదుత్పత్తికి తీసుకుంటున్న చర్యల పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో మంత్రి జగదీశ్‌రెడ్డ్డి తదితరులున్నారు. -
బాలుడి కిడ్నాప్ కథ విషాదాంతం
విశాఖపట్టణం: విశాఖ జిల్లా అనకాపల్లిలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి అపహరణకు గురైన ఉదయ్‌ను కిడ్నాపర్లు అత్యంత దారుణంగా హత్య చేశారు. ఆదివారం ఉదయం కొప్పాడ బ్రిడ్జి కింద బాలుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని గరవపాలెంకు చెందిన ఉదయ్(8)గా పోలీసులు గుర్తించారు. శుక్రవారం రాత్రి దుండగులు ఉదయ్ తండ్రి శ్రీనివాస్‌కు ఫోన్ చేసి రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేయడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. బాలుడి ఇంటి సమీపంలో ఉండే నలుగురు నిందితులు ఉదయ్‌ను కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆకతాయిలు హేమంత్, మనోజ్, రాజుతో పాటు మరో వ్యక్తి బాలుడిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసినట్లు పోలీసులు ఓ నిర్థారణకు వచ్చారు. అందులో భాగంగా శనివారం రాత్రి ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు హేమంత్, మనోజ్ లను అదుపులోకి తీసుకున్నారు. వారి దర్యాప్తులో ఉదయ్ క్షేమంగానే ఉన్నట్టు తెలిపినట్లు సమాచారం. మిగతా ఇద్దరు నిందితులు బాలుడిని తీసుకువస్తున్నట్టు చెప్పడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైనట్టేనని పోలీసులు భావిస్తున్న తరుణంలో... అనూహ్యంగా కొప్పాక రైల్వే బ్రిడ్జి కింద బాలుడు శవమై కనిపించాడు. దీంతో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. హత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. రాజుతో పాటు మరో నిందితుడు శనివారం రాత్రి హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. వారి కోసం గాలింపు చర్యలను చేపట్టారు. -
హీరో ఉదయ్ కిరణ్‌ను కస్టడీకి ఇవ్వండి
హైదరాబాద్: 'ఫేస్ బుక్' సినిమా హీరో యువనటుడు నేమూరి ఉదయ్ కిరణ్‌ను రెండ్రోజులు కస్టడీకి ఇవ్వాలని జూబ్లీహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటలో ఓవర్ ద మూన్ పబ్‌లోకి అనుమతించడం లేదని ఆగ్రహంతో అద్దాలు ధ్వంసం చేసి పబ్‌లోకి వెళ్లి .. నగ్నంగా నృత్యాలు చేసిన కేసులో ఉదయ్ అరెస్టైన విషయం తెలిసిందే. ఈ నెల 23వ తేదీన రాత్రి ఓవర్ ద మూన్ పబ్‌కి వచ్చిన ఉదయ్‌కిరణ్‌ను గతంలో జరిగిన గొడవలు దృష్టిలో పెట్టుకొని బౌన్సర్లు అనుమతించలేదు. దీంతో అద్దాలు పగలగొట్టి కుర్చీలు ఎత్తివేసి భీభత్సం సృష్టించాడు. అంతటితో ఆగకుండా పబ్ లో బట్టలు విప్పేసి నగ్నంగా డ్యాన్స్ చేసి కలకలం సృష్టించాడు. ఈ ఘటనలో రిమాండ్‌కు తరలించిన ఉదయ్‌కిరణ్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు తమ కస్టడీకి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
సంపులో పడి చిన్నారి మృతి
హైదరాబాద్: ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తు సంపులో పడి మృతిచెందాడు. ఈ సంఘటన నగరంలోని కాటేదాన్ వెంకటేశ్వర కాలనీలో ఆదివారం చోటుచేసుకుంది. తల్లి దండ్రులు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఉదయ్(4) ఇంటి ముందు ఆడుకుంటూ వెళ్లి సంపులో పడ్డాడు. ఈ ఘటన ఎవరు గుర్తించకపోవడంతో.. నీట మునిగి మృతిచెందాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
టార్గెట్.. ఆర్కే!
నక్సల్స్ అగ్రనేతలే లక్ష్యంగా ఆపరేషన్ ఆల్ ఔట్! తప్పించుకున్న ఆర్కే, ఉదయ్ ఉద్రిక్తంగా ఏవోబీ సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/మల్కన్‌గిరి/పాడేరు: ఆంధ్రప్రదేశ్-ఒడిశా పోలీసుల ముట్టడి నుంచి అగ్రనేతలు అక్కిరాజు హరగోపాల్ (ఆర్కే), ఉదయ్ తప్పించుకున్నారా! పోలీసువర్గాలు అవుననే చెబుతున్నాయి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆర్కేతోపాటు మల్కన్‌గిరి జిల్లా కమిటీ కార్యదర్శి ఉదయ్, ఇతర నేతలే లక్ష్యంగా సమాచారంతోనే ‘ఆపరేషన్ ఆల్ ఔట్’ చేపట్టారు. ఒడిశాలోని బేజంగి అడవుల్లో సోమవారం జరిగిన ఎదురుకాల్పుల నుంచి ఆర్కే, ఉదయ్‌లతోపాటు మరికొందరు అగ్ర నేతలు అంతకుముందే తప్పించుకున్నట్లు తెలుస్తోంది. వారి కోసం ఏపీ-ఒడిశాలకు చెందిన 500మంది పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. ఆర్కే ఏవోబీలోని బేజంగి అటవీప్రాంతానికి వస్తున్నట్లు పోలీసులకు నవంబర్లోనే పక్కా సమాచారం అందింది. జనవరి మొదటి రెండు వారాల్లో అక్కడ మావోయిస్టులు ప్లీనరీ నిర్వహించనున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఆర్కేతోపాటు మరికొందరు కీలక నేతలు కూడా ఈ ప్లీనరీకి హాజరువతారని సమాచారాన్ని ధ్రువీకరించుకున్నారు. ఒకేసారి అగ్రనేతలందర్ని తుడిచిపెట్టేస్తే మావోయిస్టు పార్టీని కోలుకోలేని రీతిలో దెబ్బతీయొచ్చని అత్యున్నతస్థాయిలో నిర్ణయించారు. ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ పోలీసులు ‘ఆపరేషన్ ఆల్ ఔట్’కు రూపకల్పన చేశాయి. రెండు నెలలుగా మావోయిస్టులు ఏవోబీలో ప్లీనరీకి ఏర్పాట్లు చేస్తున్నా పోలీసు బలగాలు వ్యూహాత్మకం మౌనం వహించాయి. విశాఖపట్నం జిల్లా ఏస్పీ కోయ ప్రవీణ్, ఒడిశాలోని మల్కనగిరి జిల్లా ఎస్పీ మహాపాత్రో కొన్ని రోజుల క్రితం బేజంగి అడవిలో వేర్వేరుగా హెలికాఫ్టర్లలో ఏరియల్ సర్వే నిర్వహించినట్లు తెలిసింది. అగ్రనేతలతోసహా 200మంది మావోయిస్టులు ప్లీనరీకి హాజరుకానున్నట్లు పోలీసులు అంచనాకు వచ్చారు. దాంతో ఏపీ గ్రేహౌండ్స్, ఒడిశా స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ దళాలతోపాటు బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ రంగంలోకి దిగాయి. శనివారం బేజంగి అడవిలో నిర్దేశిత ప్రాంతం దిశగా బలగాలు శనివారం బయలుదేరాయి. పశ్చిమ దిశ నుంచి ఒడిశా పోలీసులస్పెషల్ ఆపరేషన్ గ్రూప్‌కుచెందిన 200మంది కదలగా... మరో 200మందితో కూడిన ఏపీ గ్రేహౌండ్స్ బలగాలు తూర్పు నుంచి చుట్టుముట్టాయి. ఆదివారం రాత్రికి ఒడిశాలోని పనాసపట్టు, విశాఖపట్నం జిల్లా ముంచంగిపుట్టుకు సమీపంలోని పులజలమ మధ్య ఉన్న కొండప్రాంతానికి అటువైపు ఒడిశా బలగాలు, ఇటువైపు ఏపీ బలగాలు మోహరించాయి. సోమవారం తెల్లవారుజామున ఒడిశా పోలీసులు, నక్సల్స్‌కు మధ్య రెండుసార్లు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో దాదాపు ఐదుగురు నక్సల్స్ చనిపోయి ఉంటారని ఒడిశా పోలీసులు ఏపీ పోలీసులకు సమాచారం అందించాయి. మధ్యాహ్నం తరువాత ఇరురాష్ట్రాల పోలీసు బలగాలు ఆ ప్రాంతానికి మెల్లగా చేరుకున్నాయి. కానీ ఎక్కడా మావోల మృతదేహాలు కనిపించ లేదు. నక్సల్స్ నేతలు అడవి నుంచి రెండురోజుల క్రితమే వెళ్లిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆర్కే, ఉదయ్‌లతోపాటు మావోయిస్టులు రెండు రోజుల్లో ఎంతోదూరం వెళ్లి ఉండరని ఉద్దేశంతో పోలీసు బలగాలు బేజంగి అటవీప్రాంతంలో కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి. కాగా, మల్కన్‌గిరి జిల్లా ఖొరాయిగుడకు చెందిన జొగ్గా కావని, జొగ్గా మాడ్కామి అనే ఇద్దరు గిరిజనులను ఇన్ఫార్మర్లన్న నెపంతో ఆదివారం నక్సల్స్ హత్య చేశారు. -
ఐఐటీలో మెరుపులు
ఐఐటీ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్ పరీక్షలో జిల్లా విద్యార్థులు మెరిశారు. కర్నూలు నగరానికి చెందిన ఉదయ్ 11వ ర్యాంక్, మంత్రాలయానికి చెందిన రఘువీర్ 16వ ర్యాంకుసాధించారు. మరికొందరు విద్యార్థులు మెరుగైన ర్యాంకులతో సత్తాచాటారు. కర్నూలు(విద్య) : ఐఐటీ విద్యాసంస్థల్లో జాతీయ స్థాయిలో నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్ పరీక్షలో కర్నూలు జిల్లా విద్యార్థులు మెరిశారు. 11, 16 ర్యాంకులను సాధించి విజయకేతనం ఎగురవేశారు. కర్నూలు నగరంలోని ఆదిత్య టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకులు డాక్టర్ తిరుపాల్‌రెడ్డి, డాక్టర్ ఉమాదేవి కుమారుడైన ఉదయ్.. పాఠశాల విద్యను స్థానిక ఎ.క్యాంపులోని మాంటిస్సోరి పాఠశాలలో అభ్యసించాడు. పదో తరగతిలో 10కి 10 పాయింట్లు సాధించాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని నారాయణ శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ మీడియట్ ఎంపీసీ గ్రూపులో 982 మార్కులు, ఎంసెట్‌లో 64వ ర్యాంకు, జేఈఈ మెయిన్స్‌లో 330 మార్కులు సాధించాడు. గురువారం విడుదలైన జేఈఈ అడ్వాన్స్‌లోనూ ఆ విద్యార్థి జాతీయ స్థాయిలో సత్తాచాటి ఓపెన్ కేటగిరిలో 11వ ర్యాంకు సాధించాడు. గత ఏడాది ఇతని సోదరుడు వెంకట ఆదిత్య సైతం 44వ ర్యాంకు సాధించి ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ కోర్సులో చేరాడు. ఇప్పుడు తమ్ముడు ఉదయ్ సైతం ముంబయి ఐఐటీలో చేరి కంప్యూటర్ సైన్స్ కోర్సులో చేరతానని చెప్పాడు. తరగతి గదిలో చెప్పిన అంశాలను ఎప్పటికప్పుడు చదువుకోవడం, పాత ప్రశ్నపత్రాలు, కళాశాల యాజమాన్యం ఇచ్చిన మెటీరియల్‌ను అభ్యసించడం వల్లే ఈ ర్యాంకు సాధ్యమైందని ఉదయ్ చెప్పాడు. వాస్తవంగా తనకు 50లోపు ర్యాంకు వస్తుందని భావించానని, కానీ 11వ ర్యాంకు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. కాగా డాక్టర్ తిరుపాల్‌రెడ్డి, డాక్టర్ ఉమాదేవి మాట్లాడుతూ.. గత ఏడాది పెద్ద కుమారుడు, ఇప్పుడు చిన్నకుమారుడు ఐఐటీలో అత్యున్నత ర్యాంకులు సాధించడం ఆనందంగా ఉందన్నారు. మొదటి నుంచి ఇద్దరూ పట్టుదల, ప్రణాళికతో పాటు ర్యాంకు సాధించాలన్న కసితో చదివేవారని వారు పేర్కొన్నారు. వెంకట విశ్వతేజకు 264వ ర్యాంకు కర్నూలు నగరంలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఎంపీసీ పూర్తి చేసిన కానాల వెంకటవిశ్వతేజకు జేఈఈ అడ్వాన్స్ పరీక్షలో ఎస్సీ 264వ ర్యాంకు(ఎస్సీ కేటగిరి) సాధించాడు. ఈయన తండ్రి ఎ. వెంకటేశ్వర్లు, తల్లి కె.ఎ. లక్ష్మి. వీరు వడ్డేగేరిలో నివాసముంటున్నారు. తండ్రి హెడ్‌పోస్టాఫీసులో క్లర్క్‌గా పనిచేస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. రెండో కుమారుడు కె. వెంకట విశ్వతేజ ఒకటి నుంచి ఏడో తరగతి వరకు సెయింట్ మెరీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో, 8 నుంచి 10 వరకు లిటిల్‌బర్డ్స్ హైస్కూల్లో చదివాడు. పది పరీక్షలు రాస్తుండగా అతనికి టైఫాయిడ్ జ్వరం వచ్చినా పరీక్షలు రాసి 8.3 గ్రేడ్ పాయింట్లు సాధించాడు. అనంతరం నగరంలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ మీడియట్ చేరి 949 మార్కులు సాధించాడు. ఐఐటీ సాధిస్తానన్న నమ్మకంతో ఎంసెట్ పరీక్ష కూడా రాయలేదు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అతను ఎస్సీ కేటగిరిలో 264 మార్కులు సాధించి సత్తా చాటాడు. ముంబై ఐఐటీలో ఏరోనాటికల్ లేదా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేయాలని ఉందని విశ్వతేజ చెప్పాడు. కాగా శ్రీ చైతన్య కళాశాలకే చెందిన విద్యార్థులు ఇ. సాత్విక్ శ్రీనివాస్ 1,049,బి. వంశీరాజ్ 1180, ఎ. చాణిక్యనాగ్ 2197 ర్యాంకులను ఎస్సీ కేటగిరిలో సాధించారు. అనంతపురం ఎడ్యుకేషన్ : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ప్రవేశ పరీక్షలో రఘువీర్ మెరిశాడు. జాతీయ స్థాయిలో ఓబీసీ కేటగిరీలో 16వ ర్యాంకు, జనరల్ కేటగిరీలో 195వ ర్యాంకు సాధించాడు. వివరాల్లోకి వెళితే.. రఘువీర్ తండ్రి ఉప్పర నరసింగప్ప పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్. తల్లి పార్వతి గృహిణి. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రచ్చుమర్రి స్వగ్రామం. తండ్రి నరసింగప్ప ఉద్యోగరీత్యా అనంతపురం జిల్లాలో చాలాకాలం పని చేశారు. సబ్ ఇన్స్పెక్టర్గా పని చేస్తూ ఇక్కడే సర్కిల్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా పుంగనూరులో పని చేస్తున్నారు. నరసింగప్ప దంపతుల కుమార్తె ఉషశ్రీ ప్రస్తుతం హైదరాబాద్‌లోని గీతం యూనివర్సిటీలో బీటెక్ నాల్గో సంవత్సరం చదువుతోంది. కుమారుడు ఉప్పర రఘువీర్ ప్రాథమిక విద్య గోరంట్ల, గుంతకల్లు, ఉన్నత విద్య అనంతపురం, హైదరాబాద్‌లో సాగింది. 8వ తరగతిలో నిర్వహించిన ప్రతిభా పరీక్షలో మంచి ర్యాంకు సాధించడంతో ఎలాంటి ఫీజు లేకుండా హైదరాబాద్‌లో టాలెంట్ స్కూల్లో 9 నుంచి 10వ తరగతి వరకు చదివాడు. పదో తరగతిలోనూ మంచి మార్కులు సాధించడంతో ఇం టర్మీడియట్ చైతన్య, నారాయణ కళాశాలలో ఉచిత సీటు పొందాడు. ఎంసెట్‌లో కూడా 66వ ర్యాంకు సాధించాడు. తనకు తల్లిదండ్రు లు ప్రోత్సాహంతోనే తాను ఐఐటీలో మంచి ర్యాం కు సాధించగలిగానని రఘువీర్ తెలి పాడు. ఓపెన్ కేటగిరిలో దీపికకు 1041వ ర్యాంకు కర్నూలు నగరంలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఎంపీసీ పూర్తి చేసిన పుప్పాల దీపిక జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో ఓపెన్ కేటగిరిలో 1,041 ర్యాంకు సాధించి సత్తా చాటింది. స్థానిక గాయత్రి ఎస్టేట్ కాలనికి చెందిన ఆమె ఆరు వరకు స్థానిక ఎ.క్యాంపులోని మాంటిస్సోరి పాఠశాలలో, 7 నుంచి 10వ తరగతి వరకు ఆర్‌ఎంకే ప్లాజాలోని నారాయణ ఈ టెక్నో స్కూల్లో చదివారు. అనంతరం నారాయణ కళాశాలలో ఇంటర్ మీడియట్లో చేరి ఎంపీసీలో 982 మార్కులు, ఎంసెట్‌లో 131 మార్కులతో రాష్ట్రస్థాయిలో 471వ ర్యాంకు కైవసం చేసుకున్నారు. ఇప్పుడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లోనూ ఆమె 1,041 ర్యాంకుతో సత్తాచాటారు. ఆమెతో పాటు ఇదే కళాశాలలో చదివిన ఎం. కళ్యాణి 1631(ఎస్సీ), పీవీఎస్ చాణక్య 1871(ఓబీసీ), వి. హరికృష్ణ 2114, కె. కుబేర్ 2596(ఓబీసీ), కె. వంశీకృష్ణ 3180(ఓపెన్), శశిధర్ వాల్తాటి 3381(ఎస్సీ), కె సుదీర్ 3487(ఎస్సీ), ఎస్. దివ్య మౌని 3613(ఎస్సీ), ఎస్జి అమిత్‌కుమార్ 3814(ఓబీసీ), విక్రమ్‌కుమార్ చౌదరి 4540(ఓబీసీ), డి. మనోజ్ కుమార్ 5571(ఓబీసీ) ర్యాంకులు సాధించారు. -
తెర వెనుక నేర వేషాలు
రూ.10 కోట్లకు కుచ్చుటోపీ పెట్టిన టీవీ ఆర్టిస్ట్ విజయరాణి హత్యాయత్నం కేసులో చిక్కిన సినీనటుడు రెహమాన్ డ్రగ్స్ కేసులో అరెస్టైన హీరో ఉదయ్ సాక్షి, సిటీబ్యూరో : తెరపై వివిధ క్యారెక్టర్లలో జీవిస్తున్న నటీనటులలో కొందరు తెరవెనుక మాత్రం నేర ‘వేషాలు’ వే స్తున్నారు. వారం రోజుల వ్యవధిలో ముగ్గురు ఆర్టిస్టులు నేరాలకు పాల్పడటమే దీనికి నిదర్శనం. నేరబాట పట్టిన వారిలో ఒకరు టీవీ ఆర్టిస్టు విజయరాణి, మరొకరు సినీ ఆర్టిస్టు అబ్దుల్ రహమాన్, మూ డో వ్యక్తి వర్ధమాన నటుడు ఉదయ్ ఉన్నారు. వీరు ఒక్కొక్కరూ ఒక్కో రీతిలో నేరానికి పాల్పడ్డారు. డ్రగ్స్ కేసులో... తాజాగా వర్థమాన నటుడు ఉదయ్ కిరణ్ డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కడం కలకలం రేపింది. గతంలోనూ డ్రగ్స్ సరఫరా, కొనుగోలు వ్యవహారాల్లో సినీనటులు పట్టుబడిన ఉదంతాలున్నాయి. సినీ పరిశ్రమలోని కొందరు మాదక ద్రవ్యాల ముఠాలతో సంబంధాలు నెరపడం ఆందోళన కలిగిస్తోంది. హత్యాయత్నం కేసులో.... రక్తచరిత్ర సినిమాలో విలన్‌గా నటించిన అబ్దుల్ రెహమాన్ వారం క్రితం పట్టపగలు అందరిముందు ఓ వ్యక్తిని కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. పరారీలో ఉన్న రెహమాన్‌ను అరెస్టు చేసినట్టు డీసీపీ వి.సత్యనారాయణ సోమవారం వెల్లడించారు. బంజారాహిల్స్‌లో నివాసముంటున్న రెహమాన్ ఇంటి యజమానురాలితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలి మరిది, చింతల్‌బస్తీకి చెందిన మహ్మద్ ఫయాజ్ తన స్నేహితులతో కలిసి పక్షం రోజుల క్రితం రెహమాన్‌పై దాడి చేశాడు. దీంతో ఫయాజ్‌పై కక్ష పెంచుకున్న రెహమాన్ ఈనెల 18న చాచానెహ్రూపార్క్ వద్ద ఒంటరిగా ఉన్న అతడిని కత్తితో పొడిచి పారిపోయాడు. సకాలంలో ఫయాజ్ను ఆసుపత్రికి తరలించడంతో బతికిబట్టకట్టాడు. నగలు కూడా... చిట్టీల రాణి ఉదంతంలో సోమవారం మరికొందరు బాధితులు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించి తమ గోడు చె ప్పుకున్నారు. చిట్టీలు, అధిక వడ్డీ పేరుతో విజయరాణి తమ తోటి టీవీ ఆర్టిస్టుల వద్ద రూ.10 కోట్ల వరకు వసూలు చేసి పా రిపోయిందని మాత్రమే ఇప్పటి వరకు అందరికీ తెలుసు. అయితే, తాజాగా మరో ఉదంతం వె లుగు చూసింది. తన కుమారుడు సినీ హీరో అ వుతున్నాడని చెప్పి విజయరాణి తనకు తెలిసిన 20 మంది నుంచి బంగారు నగలు తీసుకుంది. మొత్తం కేజీ బంగారం తీసుకొని ఉడాయించిం ది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయిం చారు. కాగా, రాణిని త్వరగా అరెస్టు చేసి బాధితులను ఆదుకోవాలని దర్శక, నిర్మాత తమ్మినేని భరద్వాజ డీసీపీ పాలరాజును కలిసి కోరారు. అలాగే దర్శకుడు దాసరి నారాయణరావు కూడా నగర పోలీసు కమిషనర్‌కు ఫోన్ చేసి బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దొరక్కుంటే కేసు సీఐడీకి అప్పగిస్తాం : డీజీపీ నిందితురాలు విజయరాణి రెండుమూడు రో జు ల్లో దొరక్కుంటే సీసీఎస్ దర్యాప్తు చేస్తున్న ఈకేసును సీఐడీకి అప్పగిస్తానని డీజీపీ బి.ప్రసాదరావు టీవీ ఆర్టిస్టులకు హామీ ఇచ్చారు. న్యాయం చేయాలని బాధిత ఆర్టిస్టులు సోమవారం డీజీపీ ని కలవగా ఆయన ఈ విధంగా స్పందించారు. -
శవమై వస్తివా బిడ్డా..
ఎల్కతుర్తి, న్యూస్‌లైన్: భయపడిందే నిజమైంది. ఘోరం జరిగిపోయింది. ఆడుతుండగా అదృశ్యమైన బాలుడు నాలుగు రోజుల తర్వాత చెరువులో శవమై తేలాడు. ఈయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మండలకేంద్రానికి చెందిన బొజ్జ లావణ్య-గణేశ్ దంపతుల ఏకైక కుమారుడు బొజ్జ కార్తీక్(13). గురువారం తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లగా కార్తీక్ ఆడుకుంటున్నాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు కార్తీక్ కోసం వెతికినా ఆచూకీ దొరకలేదు. ఠాణాలో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. నాలుగురోజులుగా తల్లిదండ్రులు నరకయాతన అనుభవించారు. క్షణమొక యుగంలా కుమారుడి కోసం కళ్లల్లో వత్తులేసుకుని నిరీక్షించారు. కాలుకు బట్టకట్టకుండా తిరిగారు. కానీ విగతజీవుడిగా కొడుకు కన్పించేసరికి హతాశులయ్యారు. ఎల్కతుర్తి పక్కగ్రామం చింతలపల్లి ఊర చెరువులో కార్తీక్ శవమై తేలాడు. తమ కుమారుడిది హత్యేనని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఎప్పుడూ ఇల్లు విడిచి వెళ్లేవాడు కాదని, నీళ్లంటే భయమని.. చెరువువైపు వెళ్లాలంటేనే జంకుతాడని రోదిస్తూ చెప్పారు. ఎవరో తమ బిడ్డను పొట్టనబెట్టుకున్నారని శాపనార్థాలు పెట్టారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. మృతిపై అనుమానాలు చింతలపల్లి చెరువులో కొన్ని రోజుల క్రి తం ఎల్కతుర్తికి చెందిన ముదిరాజ్ కుల స్తులు చేపలు పట్టారు. కార్తీక్‌ది అదే సా మాజికవర్గం. ఆ బాలుడూ చేపలు పట్టేం దుకు వెళ్లి ఉంటాడని పలువురు అనుమానిస్తున్నారు. ఆ చెరువులోకి ఒక్కడే వెళ్లా డా? లేక ఎవరైనా స్నేహితులతో వెళ్లా డా? అనే సందేహాలూ వ్యక్తమవుతున్నా యి. చెరువులో ప్రమాదవశాత్తు పడ్డాడా? ఎవరైనా తోసేశారా? అనేది తేలాల్సి ఉంది. చెరువులో పడి మృతిచెం దితే నీళ్లు మింగి శరీరం ఉబ్బిపోయి ఉండేది. కానీ మృతదేహం అలా లేదు. చెరువు కట్టపై 2 జతల చెప్పులు కూడా అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ విషయమై ‘న్యూస్‌లైన్’ ప్రొబిషనరీ ఎస్సై ఉదయ్‌ను సంప్రదించగా ‘ప్రమాదవశా త్తు జరిగి ఉంటుం ది. అన్ని విషయాలు పోస్టుమార్టం తర్వాత తెలుస్తాయి’అన్నారు. -
హెచ్‌సీయూ విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ విజయం
=తొలిసారిగా అధ్యక్షురాలిగా మహిళ =రెండు స్థానాల్లో ఏబీవీపీ, ఒక స్థానంలో యూడీఏ కూటమి విజయం =ఫలితాలపై తిరస్కరణ ఓటు ప్రభావం సెంట్రల్ యూనివర్సిటీ, న్యూస్‌లైన్: హెచ్‌సీయూ విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ మరోమారు విజయం కేతనం ఎగురవేసింది. కీలకమైన మూడు పదవుల్లో జెండా ఎగురవేసింది. 34 సంవత్సరాల హెచ్‌సీయూ విద్యార్థి సంఘ ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఓ మహిళ అధ్యక్ష పదవికి ఎన్నికైంది. ఎన్నికల్లో 4,626 ఓట్లకుగాను 3738 ఓట్లు పోలయ్యాయి. ఎస్ఎఫ్ఐ అధ్యక్ష అభ్యర్థి శిరీష 1197 ఓట్లు సాధించి సమీప అభ్యర్థి ఉదయ్‌పై 79 ఓట్ల తేడాతో విజయం సాధించింది. మహబూబ్‌నగర్‌కు చెందిన వి. శిరీష యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ ఎంఏ(ఎకనామిక్స్) చదువుతోంది. ప్రధాన కార్యదర్శిగా ఎస్ఎఫ్ఐ అభ్యర్థి సందీప్‌కుమార్ 1174 ఓట్లు, సంయుక్త కార్యదర్శిగా ఎస్ఎఫ్ఐ అభ్యర్థి ఆదిత్య హరీష్ 1283 ఓట్లతో విజయం సాధించారు. సాంస్కృతిక కార్యదర్శిగా ఏబీవీపీకి చెందిన స్వాతి వీఎం 1272 ఓట్లతో, క్రీడల కార్యదర్శిగా ఏబీవీపీ అభ్యర్థి కృష్ణచైతన్య 1221 ఓట్లతో విజయం సాధించారు. యునెటైడ్ డెమొక్రటిక్ అలయన్స్(యూడీఏ) కూటమికి చెందిన మణికంఠ ఉపాధ్యక్షులుగా 1189 ఓట్లతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ, ఎన్ఎస్యూఐలు ఒంటరిగా పోటీ చేయగా.. ఏఎస్ఏ, టీఎస్ఏ, టీఎస్ఎఫ్, ఎంఎస్ఎఫ్, బీఎస్ఎఫ్ సంఘాలు యూడీఏ పేరిట బరిలో నిలిచాయి. తొలిసారిగా నమోదైన తిరస్కరణ ఓట్లు ఫలితాలపై తిరస్కరణ ఓట్లు ప్రభావం చూపాయి. ఆరు పదవుల్లో తిరస్కరణ ఓట్ల కారణంగానే మెజార్టీ గణనీయంగా తగ్గింది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరిస్తూ దేశంలోనే తొలిసారిగా హెచ్‌సీయూ విద్యార్థి సంఘ ఎన్నికల్లో తిరస్కరణ ఓటు విధానాన్ని వర్సిటీ అధికారులు అమలు చేశారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకున్నారు. మొత్తం పోలైన 3738 ఓట్లలో అధ్యక్ష పదవికి 87, ఉపాధ్యక్ష పదవికి 146, ప్రధాన కార్యదర్శికి 137, సంయుక్త కార్యదర్శికి 200, సాంస్కృతిక కార్యదర్శికి 172, క్రీడల కార్యదర్శికి 167 తిరస్కరణ ఓట్లు నమోదు కావడం ఇందుకు నిదర్శనం. తమకు నచ్చని అభ్యర్థులకు తిరస్కరణ ఓటు వారి విజయంపై ప్రభావాన్ని చూపింది. గర్వంగా ఉంది హెచ్‌సీయూ విద్యార్థి సంఘ ఎన్నికల్లో నన్ను తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నుకోవడం పట్ల గర్వంగా ఉంది. దీని ద్వారా విద్యార్థినుల సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. 34 సంవత్సరాల హెచ్‌సీయూ చరిత్రలో నాకు గౌరవం దక్కడం చాలా సంతోషాన్ని ఇస్తోంది. - శిరీష, హెచ్‌సీయూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు