Trisha Krishnan
-
విశ్వంభర గ్రాఫిక్స్ వర్క్‌పై 'బన్ని' నిర్మాత కామెంట్లు
చిరంజీవి- వశిష్ఠ సినిమా విశ్వంభర గ్లింప్స్ విడుదల సమయంలో గ్రాఫిక్స్ వర్క్స్‌పై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ ఖర్చుతో నిర్మిస్తోంది. దాదాపు రూ. 200 కోట్లకు పైగా ఖర్చు చేశారని సమాచారం. టీజర్ విడుదల తర్వాత గ్రాఫిక్స్ సరిగ్గా లేకపోవడంతో భారీగా ట్రోల్స్ వచ్చాయి. దీంతో ఈ సంక్రాంతికి రావాల్సిన సినిమా ఆలస్యం అవుతూ వస్తోంది. అయతే, తాజాగా విశ్వంభర గ్రాఫిక్స్ గురించి వశిష్ఠ తండ్రి సత్యనారాయణ రెడ్డి మల్లిడి పలు వ్యాఖ్యలు చేశారు.దర్శకుడు వశిష్ఠ అసలు పేరు మల్లిడి వెంకట నారాయణ రెడ్డి అని తెలిసిందే.. ఆయన తండ్రి నిర్మాతగా టాలీవుడ్లో ఢీ (మంచు విష్ణు), బన్ని (అల్లు అర్జున్), భగీరథ (రవితేజ) వంటి చిత్రాలు నిర్మించారు. అయితే, తాజాగా వశిష్ఠ తండ్రి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విశ్వంభర గ్రాఫిక్స్ వర్క్ గురించి ఇలా చెప్పుకొచ్చారు. 'విశ్వంభర సినిమా షూటింగ్ కొంత పూర్తి అయిన తర్వాత గ్రాఫిక్స్ కోసం ఫుటేజ్ ఇచ్చారు. వీఎఫ్ఎక్స్ టీమ్ వారు మూడు నెలల్లోనే పూర్తి చేసి ఇస్తాం అన్నారు. కానీ, పెద్ద సినిమా కావడంతో ఆరు నెలలు టైమ్ తీసుకోమని మేకర్స్ సూచించారు. అలా లెక్కలు వేసుకుని 2025 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు తేదీ ప్రకటించారు. కానీ, తొమ్మిది నెలలు గడిచినా వారు గ్రాఫిక్స్ పని పూర్తి చేయలేకపోయారు. విడుదల తేదీ దగ్గరకు రావడంతో అలా టీజర్‌ను వదిలారు. ఆర్టిఫిషయల్ టెక్నాలజీ ఉపయోగించుకుని టీజర్‌ను క్రియేట్ చేశారు. అది గ్రాఫిక్స్ వర్క్ ఏంత మాత్రం కాదు. ప్రేక్షకుల నుంచి విమర్శలు రావడంతో గ్రాఫిక్స్ టీమ్‌లో భయం మొదలైంది. తర్వాత VFX నాణ్యతలో ఎలాంటి ఇబ్బందులు రాలేదు. త్వరలో విశ్వంభర నుంచి మరో టీజర్‌తో పాటు ట్రైలర్ రావచ్చు. అందులో అసలైన వీఎఫ్ఎక్స్ పనితీరు ఎలా ఉందో మీరందరూ చూస్తారు. అందరికీ తప్పకుండా నచ్చుతుంది.' అని ఆయన అన్నారు.విశ్వంభర టీజర్ విడుదల కాగానే మెగాస్టార్ అభిమానులు కూడా.. VFX వర్క్ బాగాలేదని విమర్శించారు. హాలీవుడ్ చిత్రాల నుండి సన్నివేశాలను కాపీ చేశారనే ఆరోపణలు వచ్చాయి. దెయ్యాల కోట చూపిస్తున్నారా అంటూ.. పాన్ ఇండియా రేంజ్ సినిమా అంటే ఎలా ఉండాలని తప్పబట్టారు. నాసిరకమైన విజువల్స్, గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ అంటూ ట్రోలింగ్ చేశారు. దీంతో విశ్వంభర విడుదలను వాయిదా వేశారు. ఫ్యాన్స్ కూడా వాయిదా పడటమే బెటర్ అని అనుకున్నారు. ఆ తప్పులు అన్నీ సరిచేసుకుని జులై 24న థియేటర్లలోకి విశ్వంభర రానున్నట్లు సమాచారం."Whatever you saw in the Vishwambhara teaser was AI-generated graphics, not the original CG. It won't be in the movie."- Producer Satyanarayana Reddy #Chiranjeevi #Vishwambhara pic.twitter.com/mgnGgLFpBr— Whynot Cinemas (@whynotcinemass_) April 12, 2025 -
పిరికిపందల్లారా.. ఒళ్లంతా విషం నింపుకుని ఎలా బతుకుతున్నార్రా?: త్రిష
సెలబ్రిటీలను ట్రోల్ (Trolling) చేయడం ఈ మధ్య చాలామందికి ఆటవిడుపుగా మారింది. వారేం చేసినా, చేయకపోయినా.. ప్రతి చిన్నదానికి విమర్శిస్తూనే ఉన్నారు. తాజాగా ఈ ట్రోలింగ్ బ్యాచ్ హీరోయిన్ త్రిష మీద పడ్డారట! ఈమె కథానాయికగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలో ఆమె పాత్ర చూసి కొందరు యావరేజ్‌గా ఉందని పెదవి విరిచారు.అర్థం కావట్లే..అక్కడితో ఆగకుండా తనపై విద్వేషపూరిత కామెంట్లు చేశారు. అవన్నీ చూసి భరించలేకపోయింది త్రిష (Trisha Krishnan). ఇన్స్టాగ్రామ్ వేదికగా ట్రోలర్స్‌కు గడ్డి పెట్టే ప్రయత్నం చేసింది. కొందరు మనుషులకు ఒళ్లంతా విషమే! మీకు నిద్రెలా పడుతుంది? ఇంత హాయిగా ఎలా బతుకుతున్నారో నాకర్థం కావడం లేదు. ఎంతసేపూ సోషల్ మీడియాకు వచ్చి అర్థంపర్థం లేని పనులు చేస్తూ అడ్డదిడ్డంగా పోస్టులు పెట్టమే మీ పనా? అవతలివారిని విమర్శిస్తేగానీ మీకు రోజు గడవదా? మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా భయమేస్తోంది. మీ చుట్టూ ఉన్నవాళ్లు ఎలా బతుకుతున్నారో? ఏంటో? పిరికిపందల్లారా.. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను అని ఇన్స్టాగ్రామ్ స్టోరీ వేదికగా అసహనం వ్యక్తం చేసింది.సినిమా..గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా విషయానికి వస్తే.. అజిత్ హీరోగా నటించిన ఈ సినిమాలో అర్జున్ దాస్, ప్రసన్న, కార్తికేయ దేవ్, ప్రభు, ప్రియ ప్రకాశ్ వారియర్, సునీల్, రాహుల్ దేవ్, రెడిన్ కింగ్స్లీ కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మించింది. జీవీ ప్రకాశ్ సంగీతం అందించాడు. అజిత్‌తో ఇది త్రిషకు ఆరో సినిమా కావడం విశేషం. గతంలో వీరి కాంబినేషన్లో జి, కిరీడం, మంకత, ఎన్నై అరిందల్, విదాముయర్చి సినిమాలు వచ్చాయి.చదవండి: గుండు గీయించుకున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా? -
ఎప్పుడూ ప్రేమే గెలుస్తుంది.. త్రిష పోస్ట్‌కు అర్థమేంటో?
త్రిష (Trisha Krishnan).. తెలుగులోనే కాదు తమిళంలోనూ టాప్ హీరోయిన్. ఈమధ్య తన హవా కాస్త తగ్గింది కానీ ఒకప్పుడు ఆమె తెరపై కనిపిస్తే విజిల్స్ పడాల్సిందే! గత కొన్నేళ్లుగా సినిమాల సంఖ్య తగ్గించేసిన ఈ బ్యూటీ ఈ ఏడాది మాత్రం చేతి నిండా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. ఆమె నటించిన ఐడెంటిటీ, విడాముయర్చి ఇప్పటికే రిలీజయ్యాయి. ప్రస్తుతం గుడ్ బ్యాడ్ అగ్లీ, థగ్ లైఫ్, విశ్వంభర, రామ్.. సహా సూర్య 45వ సినిమాలో నటిస్తోంది.ప్రేమదే విజయంతాజాగా త్రిష ఇన్‌స్టాగ్రామ్‌లో చేతి ఉంగరాన్ని చూపిస్తూ ఓ ఫోటో షేర్ చేసింది. దీనికి 'ప్రేమ ఎప్పుడూ గెలుస్తుంది' అన్న క్యాప్షన్‌ను జోడించింది. ఆ ఫోటోలో త్రిష ఆకుపచ్చ చీర ధరించి ఉంది. ముక్కుపుడక, మల్లెపూలతో సాంప్రదాయంగా ముస్తాబైంది. చెవికమ్మలకు మ్యాచ్ అయ్యే ఉంగరం ధరించింది. ఇది చూసిన కొందరు ఎంగేజ్మెంట్ జరిగిందా? లేదా పెళ్లికి రెడీ అని హింట్ ఇస్తుందా? అని ఆరా తీస్తున్నారు.పెళ్లికి గ్రీన్ సిగ్నల్?తమిళ హీరో విజయ్‌తో త్రిష ప్రేమలో ఉన్నట్లు కొన్నేళ్లుగా పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో వీరిద్దరూ జీవితాంతం కలిసుందామని ఏదైనా నిర్ణయం తీసుకున్నారా? అని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే త్రిష.. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అల్లరి బుల్లోడు, అతడు, పౌర్ణమి, సైనికుడు, స్టాలిన్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, బుజ్జిగాడు, నమో వెంకటేశా.. వంటి పలు చిత్రాలతో తెలుగువారి మనసులో స్థానం సంపాదించుకుంది. View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) చదవండి: చరణ్ బర్త్‌డే వేడుకల్లో నాగార్జున.. కనిపించని అల్లు ఫ్యామిలీ -
నభా నాభి అందాలు.. సాయిపల్లవి రెట్రో లుక్!
నాభి అందాలతో క్యూట్ పోజుల్లో నభా నటేశ్బ్లాక్ ఔట్ ఫిట్ తో పిచ్చెక్కిస్తున్న రష్మికచాన్నాళ్ల తర్వాత ఫొటో పోస్ట్ చేసిన సాయిపల్లవిమార్చి ఫొటో డంప్ బయటపెట్టిన ఆలియా భట్చీరలో వయ్యారాలు ఒలకబోస్తున్న రీతూ చౌదరిహాట్ డ్యాన్స్ తో రచ్చలేపిన ఊర్వశి రౌతేలామక్కా వెళ్లిపోయిన హీరోయిన్ హెబ్బా పటేల్ View this post on Instagram A post shared by Izzy⭐️Krishnan (@izzykrishnan) View this post on Instagram A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Manju Warrier (@manju.warrier) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Shriya Sharma (@shriyasharma9) -
500 మంది డ్యాన్సర్లతో త్రిష మాస్ జాతర సాంగ్
కోలీవుడ్ నటుడు సూర్య, నటి త్రిష మాస్ జాతర సాంగ్‌తో తెరపై దుమ్ము రేపటానికి సిద్ధమవుతున్నారు. అంతేకాదు ఈ పాటలో 500 మంది డాన్సర్లు పాల్గొనబోతున్నారు. ఇది ఏచిత్రం కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. సూర్య తన 45వ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్లో నిర్మిస్తోంది. నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఇందులో ఆయన ప్రతి నాయకుడిగానూ నటిస్తున్నట్లు సమాచారం. కాగా నటి త్రిష నాయకిగా నటిస్తున్న ఇందులో నటి శ్వాసిక , ఇందిరస్, యోగిబాబు, షివాద, సుప్రీత్‌రెడ్డి, నట్టి నటరాజ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాగా ఇందులో నటుడు సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలిసింది. అందులో ఒకటి న్యాయవాది పాత్ర అని సమాచారం. అదేవిధంగా ఇది న్యాయస్థానంలో జరిగే కేసు నేపథ్యంగా సాగే వైవిద్య భరిత కథా చిత్రంగా ఉంటుందని తెలిసింది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. తదుపరి చెన్నైలోని ఈ సీ ఆర్‌రోడ్‌లో వేసిన భారీ సెట్లో ఈ చిత్రానికి సంబంధించిన ఒక మాస్ జాతర పాటను చిత్రీకరించడానికి యూనిట్ సన్నద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. దీనికి సాయి అభయంకర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈయన ఫోక్ సంగీత బాణీలు కట్టిన ఈ మాస్ జాతర పాటలో సూర్య, త్రిషలతో పాటు 50 మంది డాన్సర్లు నటించబోతున్నట్లు తెలిసింది. దీనికి శోభి మాస్టర్ నృత్య దర్శకత్వం వహించనున్నారని యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. ఈ ఒక్క పాట కోసమే కోట్లు ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. నటుడు సూర్య నటించిన రెట్రో మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పూర్తి చేసిన విషయం తెలిసిందే. నటి పూజా హెగ్డే కథానాయకిగా నటించిన ఈ చిత్రం మే 1న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. -
ఈ బ్యూటీకి వయసే అవ్వదేమో స్టన్నింగ్ లుక్స్‌తో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టే త్రిష ఫోటోలు
-
అజిత్ 'పట్టుదల' HD మూవీ స్టిల్స్
-
హిట్ సినిమా.. వారంలోనే ఓటీటీలో తెలుగు వర్షన్
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్(Tovino Thomas), త్రిష(Trisha) కాంబినేషన్లో తెరకెక్కిన ఐడెంటిటీ(Identity Movie) సినిమా నేడు తెలుగులో విడుదలైంది. భారీ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ ప్రకటన కూడా అధికారికంగా వెలువడింది. వినయ్ రాయ్, మందిరా బేడి ప్రధాన పాత్రలలో కనిపించిన ఈ చిత్రాన్ని అఖిల్ బాయ్, అనాస్ ఖాన్ తెరకెక్కించారు. రాజు మల్లియాత్, సీజే రాయ్ నిర్మించారు. మలయాళంలో జనవరి 2న విడుదలైన ఈ చిత్రం అక్కడ మంచి కలెక్షన్స్ రాబట్టింది.'ఐడెంటిటీ' సినిమా ఓటీటీ రైట్స్‌ను జీ5 దక్కించుకుంది. అయితే, ఈ చిత్రం ఇప్పటికే మలయాళ వర్షన్ విడుదలై చాలారోజు అయింది. దీంతో తాజాగా ఓటీటీ విడుదలపై ప్రకటన చేశారు. అయితే, తెలుగులోనూ ఈరోజే (జనవరి 24) రిలీజ్ అయింది. ఇంతలోనే మరో వారం రోజుల్లోనే ఓటీటీలోకి అడుగుపెడుతుండటం విశేషం. జనవరి 31న జీ5లో మలయాళ, తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి రానుందని ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర యూనిట్ ఒక పోస్టర్‌ను పంచుకుంది.ఐడెంటిటీ చిత్రంలో స్కెచ్ ఆర్టిస్టుగా టొవినో థామస్ నటించారు. ఓ క్రైమ్‌ను చూసి త్రిష... నేరస్తుడిని పట్టుకునే క్రమంలో టొవినో థామస్‌తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె చెబుతున్న ఆధారాలతో అతను ఎవరి స్కెచ్ వేశారు అనేది చాలా ఆసక్తిగా సినిమా ఉంటుంది. సంచలనం సృష్టించిన ఒక మర్డర్ కేసును ఓ పోలీస్ ఆఫీసర్, స్కెచ్ ఆర్టిస్ట్ కలిసి ఎలా సాల్వ్ చేశారు అనే కథతో ఈ చిత్రం ఉంటుంది. సంక్రాంతికి ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. కానీ, టాలీవుడ్లో ఎక్కువ సినిమాలు ఉండటంవల్ల అవకాశం లేకుండాపోయింది. అందుకే ఈనెల 24వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారు ఐడెంటిటీకి ఫిదా అవుతారు. -
త్రిష,టొవినో యాక్షన్ థ్రిల్లర్ సినిమా తెలుగులో విడుదల
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్(Tovino Thomas), త్రిష(Trisha) కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఐడెంటిటీ(Identity Movie) చిత్రం తెలుగులోనూ విడుదల కానుంది. ఈమేరకు తాజాగా తెలుగు వర్షన్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. భారీ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో వినయ్ రాయ్, మందిరా బేడి ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. అఖిల్ బాయ్, అనాస్ ఖాన్ ఈ మూవీని తెరకెక్కించారు. రాజు మల్లియాత్, సీజే రాయ్ నిర్మించారు. మలయాళంలో జనవరి 2న విడుదలైన ఈ చిత్రం తెలుగులో జనవరి 24న రిలీజ్ కానుంది.ఉత్కంఠగా సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను ఆకట్టు కునేలా ఉందని ఇప్పటికే మలయాళ రివ్యూలు తేల్చేశాయి. దీంతో సుమారు రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఐఎండీబీ రేటింగ్‌లో కూడా 9 వరకు ఉంది. దీంతో టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఈ చిత్రంపై మక్కువ చూపారు. అయితే, మాక్స్ శ్రీనివాస్ మామిడాల సమర్పణలో శ్రీ వేదాక్షర మూవీస్ చింతపల్లి రామారావు ఈ చిత్రాన్ని తెలుగులో కూడా ‘ఐడెంటిటీ’ టైటిల్‌తోనే రిలీజ్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: నేనూ మనిషినే కదా.. నా ముందు ఇలాంటి పని చేయకండి: సాయిపల్లవి)ఐడెంటిటీ చిత్రంలో స్కెచ్ ఆర్టిస్టుగా టొవినో థామస్ నటించారు. ఓ క్రైమ్‌ను చూసి త్రిష... నేరస్తుడిని పట్టుకునే క్రమంలో టొవినో థామస్‌తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె చెబుతున్న ఆధారాలతో అతను ఎవరి స్కెచ్ వేశారు అనేది చాలా ఆసక్తిగా సినిమా ఉంటుంది. సంచలనం సృష్టించిన ఒక మర్డర్ కేసును ఓ పోలీస్ ఆఫీసర్, స్కెచ్ ఆర్టిస్ట్ కలిసి ఎలా సాల్వ్ చేశారు అనే కథతో ఈ చిత్రం ఉంటుంది. సంక్రాంతికి ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. కానీ, టాలీవుడ్లో ఎక్కువ సినిమాలు ఉండటంవల్ల అవకాశం లేకుండాపోయింది. అందుకే ఈనెల 24వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారు ఐడెంటిటీకి ఫిదా అవుతారు.టొవినో థామస్ నటించిన ఏఆర్ఎం మూవీ గతేడాది సెప్టెంబర్ 12న థియేటర్లలో రిలీజైంది. సుమారు రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.120 కోట్లకుపైగా వసూలు చేసింది. ఆయన కెరీర్లో ఈ చిత్రం ఓ ల్యాండ్‌మార్క్ అని చెప్పవచ్చు. ఇప్పుడీ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. -
'96' సినిమా సీక్వెల్.. సింగపూర్, మలేషియా నుంచి కథ
ప్రస్థుతం చిత్రపరిశ్రమలో సీక్వెల్ నడుస్తోందని చెప్పవచ్చు. అయితే అన్ని చిత్రాల సీక్వెల్స్ హిట్ అవుతాయని గ్యారంటీ లేదు. బాహుబలి,పుష్ప వంటి కొన్ని చిత్రాల సీక్వెల్స్ మాత్రమే విజయం సాధించాయి. ఇండియన్–2, విడుదల-2 వంటి చిత్రాలు ఆశించిన ఫలితాలు పొందలేక పోయాయి. కాగా 2018లో తమిళ్లో విడుదలైన 96 చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. విజయ్‌సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ చిత్రానికి ప్రేమ్‌కుమార్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఇది పాఠశాల ప్రేమ కథా చిత్రంగా రూపొందింది. విదేశాల్లో ఉన్న త్రిష పాఠశాల స్నేహితులను కలవడానికి చైన్నెకి వస్తుంది. అప్పుడు తన చిన్ననాటి ప్రేమికుడు కూడా విజయ్‌సేతుపతి కూడా వస్తాడు. వారి మధ్య జరిగే మూగ ప్రేమే 96 చిత్ర కథ. కాగా ఏడేళ్ల తర్వాత ఈ చిత్ర సీక్వెల్‌కు దర్శకుడు ప్రేమ్‌కుమార్ సిద్ధం అవుతున్నారు. ఈయన ఇటీవల కార్తీ, అరవింద్‌స్వామి ప్రధాన పాత్రలు పోషించిన 'సత్యం సుందరం' చిత్రాన్ని తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. ఈ చిత్రం విడుదల సమయంలోనే 96 చిత్రానికి సీక్వెల్ చేస్తానని చెప్పారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిసింది. ఈ చిత్రాన్ని వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ నిర్మించనున్నారని సమాచారం. ఈ చిత్ర కథ సింగపూర్, మలేషియాల్లో జరిగే విధంగా ఉంటుందని దర్శకుడు ప్రేమ్‌కుమార్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తొలి భాగంలో త్రిష విదేశాల నుంచి చైన్నెకి వచ్చినట్లు చూపించిన విషయం తెలిసిందే. దీంతో రెండవ భాగం విదేశాల్లో జరుగుతుందని దర్శకుడు ఈసందర్భంగా చెప్పారు. అదేవిధంగా 96 చిత్ర కథను ప్రేమ ఇతివృత్తంతో రూపొందించగా, దాని సీక్వెల్ ప్రేమతో పాటు కుటుంబసమస్యలు, భావోద్రేకాలు వంటి అంశాలతో ఉంటుందని చెప్పారు. దీనికి సంబంధించిన అధికార ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
ఆలయంలో త్రిష పూజలు.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
నెటిజన్లకు ఎక్కువగా కంటెంట్స్ ఇచ్చే నటీమణుల్లో త్రిష ఒకరు అని చెప్పవచ్చు. కారణం వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఈ చైన్నె బ్యూటీ ఎప్పుడు చర్చనీయాంశమే. వృత్తిపరంగా చూస్తే 22 ఏళ్లు పూర్తి చేసింది. తన కెరీర్లో ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొని, జయపజయాలను చవిచూసి ఇప్పటికీ అగ్రకథానాయకి స్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నారు. అంతేకాకుండా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో స్టార్ హీరోల సరసన నటించడానికి ఏకై క ఆప్షన్‌గా వెలుగొందుతున్నారు. ఇక వ్యక్తిగతంగా త్రిష ఎప్పుడు సంచలనమే. ప్రేమ వ్యవహారంలో ఈమె గురించి పలు రకాల వార్తలు ప్రచారమవుతుంటాయి. అదేవిధంగా ఇంతకుముందే త్రిష పెళ్లి నిశ్చితార్థం వరకు వెళ్లి ఆగిపోయింది. 41 ఏళ్ల పరువాల ఈ భామ ఇప్పటికీ అవివాహితే అన్నది గమనార్హం. నటుడు విజయ్‌తో ఈమెను కలుపుతూ చాలాకాలంగా వదంతులు సామాజిక మాధ్యమాల్లో అవుతున్నాయి. తాజాగా నటి కీర్తి సురేష్ వివాహానికి నటుడు విజయ్, త్రిష చైన్నె నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లినట్లు ప్రచారం హోరెత్తుతోంది. అయితే నటి త్రిష ఇలాంటి విషయాలను పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు. కాగా ప్రస్తుతం అరడజనుకు పైగా చిత్రాల్లో నటిస్తున్న ఈమె తాజాగా సూర్య కథానాయకుడిగా నటిస్తున్న ఆయన 45వ చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నటి త్రిష కోయంబత్తూరులోని ప్రసిద్ధిగాంచిన మరుదమలై మురుగన్(కుమారస్వామి) ఆలయానికి వెళ్లి స్వామి దర్శనం చేసుకుని, విశేష పూజలు నిర్వహించారు. అక్కడ ఆమెను చూసిన ఇతర భక్తులు సాధారణ ప్రజలు ఆమెతో ఫొటో తీసుకోవడానికి గుమిగూడారు. వారందరితో ఫొటోలు దిగిన త్రిష అక్కడి నుంచి బయల్దేరి వచ్చేశారు. ఆ ఫొటోలు, వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే నటి త్రిష దైవ దర్శనం చేసుకోవడంపై కూడా నెటిజన్లు ఇప్పుడు ఆరాలు తీస్తున్నారు. View this post on Instagram A post shared by NTC Talks (@ntctalks) -
ట్రెండింగ్‌లో #JusticeforSangeetha.. అంతా త్రిష వల్లే?
ఆన్‌స్క్రీన్‌పై సూపర్ హిట్ అనిపించే జోడీలు కొన్ని ఉంటాయి. విజయ్ - త్రిష కూడా ఈ జాబితాలోకే వస్తారు. అయితే రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లో కూడా వీరు జంటగానే ఉంటారంటూ ఎప్పటినుంచో రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా వీరిద్దరూ ఓ ప్రైవేట్ జెట్‌లో కలిసి ప్రయాణించడంతో ఈ రూమర్లకు మరింత బలం చేకూరినట్లైంది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవగా జస్టిస్ ఫర్ సంగీత అన్న హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.భార్యకు దూరంగా విజయ్?సంగీత మరెవరో కాదు, విజయ్ భార్య. వీరిద్దరూ 1999లో పెళ్లి చేసుకోగా జేసన్ సంజయ్, దివ్య సాష అని ఇద్దరు సంతానం. గతేడాది విజయ్- సంగీత మధ్య పొరపచ్చాలు వచ్చాయని ప్రచారం జరిగింది. విజయ్ సినిమా ఈవెంట్లలోనూ కనిపించకపోవడంతో దూరం పెరిగిందని అంతా అనుకున్నారు. అయితే సంగీత వెకేషన్లో ఉండటం వల్లే విజయ్ మూవీ ఈవెంట్లకు హాజరు కాలేదన్నది మరో వాదన.ట్రెండింగ్‌లో విజయ్ -త్రిషఇప్పుడేకంగా వీరు కలిసి ట్రావెల్ చేస్తుండటంతో నెటిజన్లు విజయ్-త్రిష వ్యక్తిగత జీవితాల్లో ఏదైనా నిర్ణయం తీసుకోబోతున్నారా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు మాత్రం.. ఏదైనా సినిమా కోసం కలిసి వెళ్తున్నారనుకోవచ్చు కదా అని కామెంట్లు చేస్తున్నారు.Co-stars or power couple? Vijay and Trisha spotted boarding a private jet together. The industry is talking!#JusticeforSangeetha#AlluArjun #Delhi #AlluArjunArrest pic.twitter.com/q0NT6DQMB3— Roshan meena (@1f8be1a6f3fe4ad) December 13, 2024Exclusive footage of Vijay and Trisha sparks buzz! 🛩️👀 Work or something more? 🔥 #JusticeforSangeetha #TrishaKrishnan #ThalapathyVijay𓃵 pic.twitter.com/no2kkMUzuH— Rahul Kumar Pandey (@raaahulpandey) December 13, 2024చదవండి: Allu Arjun Arrest: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ -
హీరో సూర్య 45వ చిత్రం ప్రారంభం..హీరోయిన్గా త్రిష (ఫొటోలు)
-
20 ఏళ్ల తర్వాత సూర్యతో మరోసారి ఛాన్స్ కొట్టేసిన గోల్డెన్ బ్యూటీ
సూర్య హీరోగా నటిస్తున్న కొత్త సినిమాలో సౌత్ ఇండియా సెన్సేషనల్ హీరోయిన్ భాగం కానుంది. ఈమేరకు నెట్టింట వార్తలు భారీగానే ట్రెండ్ అవుతున్నాయి. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిదే. సూర్య కెరీర్లో 45వ సినిమాగా రానున్న ఈ మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించనున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌లో సుమారు 20 ఏళ్ల తర్వాత సూర్యతో త్రిష మళ్లీ కనిపించనున్నారు.కోలీవుడ్‌లో త్రిష,సూర్య ఇద్దరూ కలిసి 3 చిత్రాల్లో నటించారు. మౌనం పెసియాధే (2002),యువ (2004),ఆరు (2005) వంటి చిత్రాల్లో వారు కలిసి నటించారు. పొన్నియన్ సెల్వన్ సినిమా నుంచి త్రిష స్పీడ్ పెంచింది. వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇప్పుడు సూర్యతో కలిసి నటించేందుకు 20 ఏళ్ల తర్వాత మరోసారి ఛాన్స్ రావడంతో ఆమె ఓకే చెప్పేశారట. ఈ ప్రాజెక్ట్‌లో నటించేందుకు ఇప్పటికే ఆమె డీల్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.ఈ చిత్రం ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉంది. త్రిష ఇప్పటికే ఒప్పుకున్న సినిమా షెడ్యూల్స్ ఉండటంతో ఆమె బిజీగా ఉన్నారు. దీంతో డిసెంబర్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభించే ఛాన్స్ ఉంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'సూర్య 45' అనే వర్కింగ్ టైటిల్‌ను ప్రస్తుతానికి ప్రకటించారు. కంగువా సినిమా భారీ డిజాస్టర్ కావడంతో దర్శకుడు ఆర్జే బాలాజీపై తీవ్రమైన ఒత్తడి పెరగనుంది. ఈ సినిమాకు సంగీతం ఏఆర్ రెహమాన్ అందిస్తుండగా.. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. -
అడ్డు గడులలో నెం. 52
పేపర్లో మన ఊరి పేరు కనిపిస్తేనే ఆసక్తిగా చూస్తాం కదా, అలాంటిది ఏకంగా మన పేరే పేపర్లో వస్తే? ఊరంతా తిరిగి ఆ సంతోషాన్ని తలా ఇంత పంచి పెడతాం. త్రిష కూడా మొన్న ఆదివారం (3 నవంబర్) అటువంటి సంతోషంలోనే తేలియాడారు. పైగా ఆమె పేరు వచ్చింది ఇంటర్నేషనల్ పేపర్లో. అది కూడా ప్రసిద్ధ ‘న్యూయార్క్ టైమ్స్’ మేగజీన్ లో! ఫిల్మ్ న్యూస్ కేటగిరీలో ఆమె పేరు వచ్చుంటే.. సినీ స్టార్ కనుక రాసి ఉంటారని అనుకోవచ్చు. కానీ త్రిష పేరు ప్రస్తావనకు వచ్చింది న్యూయార్క్ టైమ్స్ 1942 నుంచీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ వస్తున్న ‘క్రాస్‌వర్డ్ పజిల్’లో! పజిల్లో నిలువు గడులు, అడ్డు గడులు ఉంటాయి కదా, అడ్డు గడులలోని 52 వ ‘క్లూ’గా ‘యాక్ట్రెస్ కృష్ణన్ ఆఫ్ సౌత్ ఇండియన్ సినిమా’ ఎవరు అని అడిగారు. ఇంకెవరు? త్రిషనే! ఆమె పూర్తి పేరు త్రిషా కృష్ణన్ . ఇకనేం.. 52 అడ్డులోని ఆరు గడులను టి.ఆర్.ఐ.ఎస్.హెచ్.ఎ. అని తన పేరుతో నింపి, ఆ పజిల్ స్క్రీన్ షాట్‌ను ఇన్ స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశారు త్రిష. ‘‘నా పేరు న్యూయార్క్ టైమ్స్‌లో వచ్చిందహో’’.. అంటూ ‘‘ఒకే బై, షోయింగ్ పూర్తయింది’’ అని ఓ సరదా కామెంట్ కూడా ఆ పోస్ట్‌కి జత చేశారు. ఈ సంతోషం అక్కడితో ఆగలేదు. సమంతా కూడా షేర్ చేసుకున్నారు. ‘‘నువ్వు క్వీన్ త్రిషా’’ అన్నారు. అందుకు త్రిషా ‘‘ఆ.. సామ్.. మనిద్దరం ఒకటే’’ అని రిప్లయ్ ఇచ్చారు. అవును, వీళ్లిద్దరూ ఒకటే. చిన్న చిన్న సంతోషాలకు కేరింతలు కొట్టే చిన్న పిల్లల మనసున్న సెలబ్రిటీలు. -
నేను మనుషులను పట్టించుకోను: త్రిష
అందాల భామ నటి త్రిష. నాలుగు పదుల పరువాల సంచలన నటి ఇప్పటికీ అవివాహితనే అన్నది తెలిసిందే. కథానాయకిగా సెంచరీలు కొట్టినా పెళ్లికి మాత్రం దూరంగా ఉంటూ సోలో లైఫే సో బెటర్ అనేలా నడుపుతున్నారు. అయితే చాలా కాలం క్రితమే చైన్నె బ్యూటీ పెళ్లికి సిద్ధమయ్యారు. ఒక నిర్మాత, వ్యాపారవేత్తతో వివాహ నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే అది కారణాలు ఏమైనా పెళ్లి పీటలు ఎక్కలేదు అప్పటినుంచి త్రిష నటనపైనే దృష్టి సారిస్తున్నారు. అంతేకాకుండా జీవితంలో పెళ్లి అనేది ముఖ్యమే అంటూ అందుకు సమయం వచ్చినప్పుడు వివాహం చేసుకుంటానని చెబుతూ వస్తున్నారు. అదే విధంగా ఈ అమ్మాయి గురించి ప్రేమ వదంతులు చాలానే దొర్లాయి. కాగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే త్రిష తాజాగా అసలు మనుషులతో పనిఏంటి అనే విధంగా తన ఎక్స్ మీడియాలో ఓ టీట్ చేశారు. అందులో తాను మనుషులను దూరంగా పెడతానని, శునకాలను ప్రేమిస్తానని అయితే నా శునకాలు మాత్రం ఇతర శునకాలను పక్కన పెడుతూ మనుషులను ప్రేమిస్తాయన్నారు. కాబట్టి మనమంతా కలిసి ప్రేమైక సమాజాన్ని స్థాపిద్దాం అని త్రిష పేర్కొన్నారు. ఈమె ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదేవిధంగా త్రిష గురించి మరో విషయం కూడా సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఈమె తన అభిమాన నటుడు విజయ్ అని చాలాసార్లు పేర్కొన్నారు. కాగా విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. దీంతో త్రిష ఆయన పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరిగింది. కాగా నటుడు విజయ్ ఆదివారం ఆయన తొలిసారిగా మహానాడు కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. దీంతో ఈ కార్యక్రమంలో నటి త్రిష పాల్గొంటారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే ఆమె మహానాడులో పాల్గొనక పోవడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
25 ఏళ్ల నాటి ఫోటో షేర్ చేసిన స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?
కళామతల్లిని నమ్మినవారిని ఎన్నటికీ చేయి విడువదు. ఇందుకు ఉదాహరణ నటి త్రిష. సుమారు 25 ఏళ్లుగా ఈ బ్యూటీ చెక్కు చెదరని అందాలతో కథానాయకిగా రాణిస్తున్నారు. మధ్యలో చిన్న ఆటుపోటులకు గురైనా త్రిష సినిమా కెరీర్ అధికంగా ఉన్నత స్థాయిలోనే కొనసాగుతోంది. తొలుత తమిళంలో నాయకిగా రాణించినా, ఆ తరువాత ఆమె క్రేజ్ తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ భాషల వరకూ చేరింది. అలా ఈ ఐదు భాషల్లోనూ ప్రముఖ స్టార్స్‌తో జత కట్టి అగ్రకథానాయకిగా వెలిగి పోతున్నారు. ఇదీ చదవండి: అర్థరాత్రి ఆస్పత్రిలో చేరిన రజనీకాంత్నిజం చెప్పాలంటే పొన్నియిన్ సెల్వన్ చిత్రంతో దర్శకుడు మణిరత్నం త్రిషకు మంచి రీఎంట్రీ ఇచ్చారనే చెప్పాలి. ఈ నాలుగు పదుల పరువాల భామ ఇప్పుడు నటుడు అజిత్ సరసన విడాముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలతో పాటు కమలహాసన్‌తో కలిసి థగ్‌లైఫ్ చిత్రంలో నటిస్తున్నారు. అదేవిధంగా తెలుగులో చిరంజీవికి జంటగా ఒక చిత్రం, మలయాళంలో మోహన్‌లాల్, టోవినో థామస్‌తో రెండు చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. త్రిష మొదట్లో అందాల పోటీల్లో పాల్గొని మిస్ చెన్నై కిరీటాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే. ఆమె ఆ కిరీటాన్ని 1999లో గెలుచుకున్నారు. అది జరిగి 25 ఏళ్ల గడిచిన సందర్భంగా ఆ మధురమైన స్మృతులను తలచుకుంటూ తన ఇన్‌స్ట్రాగామ్‌లో ఆ ఫొటోలను పోస్ట్ చేశారు. అందులో తన జీవితాన్ని మార్చిన రోజు అది అని పేర్కొన్నారు. -
విజయ్ చివరి సినిమా! థియేటర్లో త్రిష
స్టార్ హీరో సినిమా రిలీజవుతుందంటే అభిమానులు థియేటర్లకు క్యూ కడతారు. అలాంటిది దళపతి విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టేముందు చేసిన చివరి చిత్రం 'గోట్' నేడు ప్రేక్షకుల ముందుకు రావడంతో అటు సోషల్ మీడియాలో ఇటు థియేటర్ల వద్ద సందడి నెలకొంది. హీరోయిన్ త్రిష సైతం ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేసింది. నిర్మాత అర్చన కలపతితో కలిసి చెన్నైలోని ఓ థియేటర్లో గోట్ వీక్షించింది.గెస్ట్ రోల్ఇకపోతే గోట్ సినిమాలో త్రిష అతిథి పాత్రలో మెరిసింది. ఓ పాటలో విజయ్‌తో కలిసి స్టెప్పులేసింది. కాగా వీరి జంటకు పెద్ద ఫ్యాన్సే ఉన్నారు. 2004లో గిల్లి మూవీలో విజయ్- త్రిష జంటగా నటించారు. ఈ జోడీ అభిమానులకు తెగ నచ్చేసింది. తిరుపాచి, ఆతి, కురువి చిత్రాల్లోనూ ఈ కాంబినేషన్ రిపీట్ అయింది. ఇటీవల వచ్చిన లియో మూవీలోనూ విజయ్‌తో కలిసి యాక్ట్ చేసింది. ఇప్పుడు గోట్లో ఓ పాటలో మెరిసింది. Engada Andha Yellow SareeBTS of #Trisha From #Matta Song#TheGreatestAllTime #TheGOAT pic.twitter.com/iUUxJ52xAq— RINKU (@RinkuRv03012001) September 5, 2024చదవండి: గోట్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
భారీ బడ్జెట్ సినిమా నుంచి 'త్రిష' ఫస్ట్ లుక్ రిలీజ్
నటుడు అజిత్ కథానాయకుడిగా నటి స్తున్న తాజా చిత్రం 'విడాముయర్చి'. నటి త్రిష నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్లో నిర్మి స్తోంది. తరచూ వార్తల్లో ఉంటున్న చిత్రం నుంచి తాజాగా త్రిష ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.మొదట ఈ చిత్రానికి విఘ్నేశ్‌శివన్ దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ, దర్శకుడు మగిళ్ తిరుమే ణి చెప్పిన కథ నచ్చడంతో అజిత్ ఆయన దర్శకత్వంలో నటించడానికి ఓకే చెప్పారు. ఎక్కువ భాగం విదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న విడాముయర్చి చిత్రంపై అంచనాలు మాత్రం భారీ స్థాయిలోనే ఉన్నాయి. తాజాగా విడుదలైన త్రిష ఫస్ట్ లుక్‌లో చాలా బ్యూటీఫుల్‌గా ఉంది. ఓ రెస్టారెంట్లో త్రిషతో పాటు అజిత్ ఉన్న ఫోటోను మేకర్స్ పంచుకున్నారు. ఇందులో అజిత్‌కు సతీమణిగా ఆమె కనిపించనుంది.కాగా చిత్రాన్ని దీపావళికి విడుదల చేయనున్నారు. ఇంతకుముందు దీపావళికి విడుదలైన ఈయన చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్‌ను వారు కొనసాగిస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే అదిరిపోయే యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రంగా తెరకెక్కుతున్న దీని వ్యాపారం హాట్ హాట్‌గా జరుగుతున్నట్లు ప్రచారం. కర్ణాటకలో విడాముయర్చి చిత్రం వ్యాపారం రజనీకాంత్, విజయ్‌ల చిత్రాలను మించి పోయినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. #VidaaMuyarchi 🌟🧿#EffortsNeverFail pic.twitter.com/mTvEtUHuEN— Trish (@trishtrashers) July 19, 2024 -
అందానికే అసూయ పుట్టించే బ్యూటీ క్వీన్ (ఫోటోలు)
-
'అమ్మోరు తల్లి'గా వచ్చేస్తున్న త్రిష
నయనతార 'అమ్మోరు తల్లి'గా ప్రేక్షకులను మెప్పించింది. ఆర్.జె.బాలాజీ, శరవణన్ డైరక్టర్స్‌గా తొలి సినిమాగా 'అమ్మోరు తల్లి'ని తెరకెక్కించారు. తమిళంలో 'మూకుత్తి అమ్మన్'గా తెరకెక్కిన సినిమాకు ఇది డబ్బింగ్. 2020లో డిస్నీ+హాట్‌స్టార్‌లో డైరెక్ట్‌గా విడుదల అయింది. ఆ సమయంలో ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది. దీంతో ఈ సినిమాకు మరో సీక్వెల్ తీయాలని మేకర్స్ ప్లాన్ చేశారు.భక్తి పేరుతో దొంగ బాబాలు చేస్తున్న మోసాల చుట్టూ అల్లుకున్న కథాంశంతో రూపొందిన చిత్రమే అమ్మోరు తల్లి. ఇందులో ముక్కుపుడక అమ్మోరుగా నయన్ మెప్పించింది. అయితే, సీక్వెల్‌గా తెరకెక్కబోతున్న చిత్రంలో త్రిషకు ఆ ఛాన్స్ దక్కినట్లు కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ఈ పాత్రలో త్రిష అభినయం అయితే బాగుంటుందని చిత్ర వర్గాలు ఇప్పటికే పరోక్షంగా చెబుతున్నాయి. త్రిష ఈ పాత్ర ఒప్పుకుంటే మాత్రం ఆమెకు ఇలాంటి సినిమా ఇదే మొదటిది అవుతుంది. ప్రస్తుతం త్రిష వరుస సినిమాలతో బిజీగా ఉంది. విశ్వంభర,థగ్‌లైఫ్, రామ్ వంటి చిత్రాల షూటింగ్ పనుల్లో ఆమె ఉంది. -
15 ఏళ్ల తర్వాత మళ్లీ అక్కడ అడుగుపెడుతున్న త్రిష
సౌత్ ఇండియాలో ప్రస్తుతం అగ్ర కథానాయకిగా రాణిస్తున్న త్రిష. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం అంటూ ఏక కాలంలో పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. అయితే, తాజాగా మరోసారి బాలీవుడ్లో రీఎంట్రీకి సిద్ధ అయినట్లు తెలుస్తోంది. త్రిష 2010లో కట్టా మీఠా అనే చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్‌కు జంటగా త్రిష నటించింది. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో త్రిష కూడా ఇక అటు వైపు దృష్టి సారించలేదు. అలాంటిది సుమారు 15 ఏళ్ల తరువాత మరోసారి ఈ భామకు బాలీవుడ్ అవకాశం తలుపు తట్టినట్లు తెలుస్తోంది. ఇందులో నటుడు సల్మాన్‌ఖాన్ సరసన న టించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. కాగా 40 ఏళ్లను పూర్తి చేసుకుని 41వ సంతంలోకి అడుగు పెట్టిన త్రిష ఇప్పటికీ అవివాహితే. కాగా ఇటీవల ఈమె ఆధ్యాత్మికంపై దృష్టి మళ్లించినట్లు స్పష్టం అవుతోంది. ఇందుకు కారణం గత ఏడాది త్రిష తన పుట్టిన రోజును షిరిడీలో జరుపుకున్నా రు. కాగా ఈ ఏడాది నటుడు విజయ్ చెన్నైలో నిర్మించిన సాయిబాబా మందిరంలో చేసుకున్నారు. ఆ ఫొటోలను ఆమె సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కాగా త్రిష సాయిబాబా భక్తురాలిగా మారినట్లు తెలుస్తోంది. ఇకపోతే తనకు పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ఎక్స్ మీడియా ద్వారా ఆమె ధన్యవాదాలు తెలిపారు. -
Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
సినిమా ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి.. సుమారు 25ఎళ్లుగా లైమ్‌లైట్‌లో ఒక హీరోయిన్ కొనసాగడమంటే అంత సులభం కాదు. నేడు కొందరు హీరోయిన్లు అలా వచ్చి, ఇలా వెళ్లిపోతున్నారు. తమలో ఎంతో అందంతో పాటు టాలెంట్ దాగి ఉన్నా కూడా సరైనా అవకాశాలు లేక తమ సినిమా కెరియర్‌కు ఫుల్స్టాప్ పెట్టేస్తున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెడుతూ నాటి నుంచి నేటి తరం హీరోలతో కూడా పోటీ పడుతూ ఏమాత్రం తగ్గకుండా రెండు దశాబ్ధాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. తమిళం తెలుగు హిందీ కన్నడం భాషల్లో ఇప్పటికీ తిరుగులేని హీరోయిన్గా రాణిస్తున్న త్రిష నేడు (మే4న) 41వ పుట్టినరోజు వేడుకను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా త్రిష గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.చెన్నై మహానరంలో కృష్ణన్, ఉమా దంపతులకు 1983లో జన్మించిన త్రిష. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) చదువుకున్నారు. తన చదువు పూర్తయిన తర్వాత మోడలింగ్ వైపు అడుగులు వేశారు. అలా 1999 మిస్ చెన్నై పోటీలో విన్నర్‌గా తనేంటో చాటిచెప్పింది. అలా అదే ఏడాదిలో 'జోడి' (తమిళ్) సినిమాతో తెరంగేట్రం చేశారు. అందులో హీరోయిన్ సిమ్రన్‌కు స్నేహితురాలిగా నటించారు. ఈ సినిమా హిట్ కావడంతో త్రిషకు కూడా సరైన గుర్తింపు వచ్చింది. అలా సౌత్ ఇండియాలోని అందరి దృష్టిని ఆమె ఆకర్షించారు. ఈ క్రేజ్‌తో సూర్యతో హీరోయిన్గా నటించే ఛాన్స్ ఆమెకు 'మౌనం పెసియదే' తొలిసారిగా వరించింది. అక్కడి నుంచి 'నీ మనసు నాకు తెలుసు' తో టాలీవుడ్లో అడుగుపెట్టారు. ఇందులోని ఒక సాంగ్‌తో తెలుగు ప్రేక్షకులకు త్రిష బాగా కనెక్ట్ అయ్యారు.వర్షంతో మార్పు2004లో ప్రభాస్‌తో 'వర్షం' సినిమాలో త్రిష హీరోయిన్గా నటించింది. ఈ సినిమా త్రిష కెరీర్‌నే మార్చేసింది. శైలజ అలియాస్ శైలు పాత్రలో కనిపించిన త్రిష ప్రేక్షకులను మాయ చేశారు. అలా తన అందంతో అందరినీ వర్షంలో తడిసేలా చేశారు. ఈ క్రమంలో నువ్వొస్తానంటే నేనొద్దంటానా,అతడు,ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, కృష్ణ,బుజ్జిగాడు వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారు. సౌత్ ఇండియాలోనే టాప్ హీరోయిన్ల లిస్ట్‌లో త్రిష చేరిపోయారు.త్రిషకు బాగా నచ్చే హీరోలుతెలుగులో సీనియర్ హీరోల నుంచి కొత్త హీరోల వరకు అందరితోనూ నటించే అవకాశం ఆమె దక్కింది. స్టార్‌డమ్‌ని పట్టించుకోను అని చెబుతున్న త్రిష కొత్త హీరోలతో కూడా కలిసి నటించారు. నటిగా కెరీర్ ఆరంభించి ఇన్నేళ్లవుతున్నా అవకాశాలు అందుకోవడంలో త్రిష ముందు వరుసలోనే ఉంటున్నారు. అందుకు ఉదాహరణ రీసెంట్గా లియో సినిమాలో మెప్పించిన త్రిష, ప్రస్తుతం చిరంజీవి, అజిత్, విజయ్ వంటి స్టార్ హీరోలతో నటిస్తూనే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో కూడా బిజీగా ఉంటున్నారు. త్రిషకు బాగా నచ్చే హీరోలు కమల్ హాసన్, వెంకటేశ్, ఆమీర్ ఖాన్. ఇదే విషయం ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. హీరోయిన్స్‌లలో సిమ్రన్, ఏంజలినా జోలి అంటే ఆమెకు చాలా ఇష్టం.త్రిషపై ఉన్న వివాదాలుఇన్నేళ్ల పాటు త్రిష హీరోయిన్గా ఉన్నా కూడా ఆమెపై పెద్దగా వివాదాలు చుట్టముట్టలేదు. రూమర్స్ విషయంలో కూడా కాస్త తక్కువేనని చెప్పవచ్చు.2016లో ఒకసారి తమిళుల సంప్రదాయమైన జల్లికట్టుకు వ్యతిరేకంగా ఆమె ట్వీట్ చేయడంతో అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. దీంతో ఫైనల్‌గా కమల్‌హాసన్ ఎంట్రీ ఇచ్చి ఆ గొడవకు ఫుల్స్టాప్ పెట్టేశారు. ఆమెను బాధపెట్టొద్దని ఆయన తమిళ ప్రజలను కోరారు. త్రిష వ్యక్తిగతం గురించి కూడా ప్రచారం జరిగింది.ఓ వ్యాపారవేత్తతో నిశ్చితార్థం అయ్యాక పెళ్లికి నో చెప్పిందని గతంలో త్రిష గురించి ప్రచారం జరిగింది. కానీ, ఆమె కుంగిపోలేదు. అది నా వ్యక్తిగత విషయమని చెప్పిన త్రిష వాటన్నింటినీ అధిగమించి సినిమాలపైనే తన దారిని మార్చుకుంది. అయితే, తన వివాహం గురించి ఇప్పటికీ కూడా పలు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎప్పటికైనా ప్రేమ వివాహమే చేసుకుంటానని త్రిష ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 41 ఏళ్ల ఈ బ్యూటీగా ఆ ఘడియలు ఎప్పుడు వస్తాయో చూడాలి.కోట్ల రూపాయల ఆస్తులుహీరోయిన్గానే కాకుండా వివిధ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా త్రిష ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఒక్కొ సినిమాకు సుమారు. రూ. 12 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ప్రచారం ఉంది. సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం త్రిషకు చెన్నైలో రూ. 15 కోట్లు విలువ చేసే విలాసవంతమైన ఇల్లు ఉంది. హైదరాబాద్‌లో కూడా త్రిషకు రూ. 8 కోట్ల విలువ చేసే ఇల్లు ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లో కొన్నిప్లాట్స్ కూడా త్రిషకు ఉన్నాయని సమాచారం. రూ. 5 కోట్ల వరకు విలువ చేసే పలు లగ్జరీ కార్లు ఆమె వద్ద ఉన్నాయట. ఇలా తన 25 ఏళ్ల సినీ కెరియర్లో ఇప్పటి వరకు సుమారుగా రూ. 120 కోట్లకు పైగానే ఆస్తులు కూడాబెట్టినట్లు తెలుస్తోంది. -
Trisha Krishnan : త్రిష పుట్టినరోజు స్పెషల్.. ప్రత్యేకమైన ఫోటోలు వైరల్
-
స్టార్ హీరోలతో జోడి కడుతున్న త్రిష
-
చిరుతో 'విశ్వంభర'.. త్రిష డబుల్ ధమాకా?
హీరోయిన్ త్రిష తెలుగు ప్రేక్షకు లకు డబుల్ ధమాకా ఇవ్వనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘విశ్వంభర’. 2006లో విడుదలైన ‘స్టాలిన్’ సినిమా తర్వాత రెండోసారి ‘విశ్వంభర’ కోసం జోడీ కట్టారు చిరంజీవి–త్రిష. కొన్నేళ్ల తర్వాత చిరంజీవి నటిస్తున్న పూర్తి స్థాయి సోషియో ఫ్యాంటసీ కాన్సెప్ట్ చిత్రమిది. ఇందులోని గ్రాఫిక్స్ ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయని టాక్. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయంపై విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ మూవీలో త్రిష ద్విపాత్రాభినయం చేయనున్నారని టాక్. ఆమెపాత్రకు కథలో చాలాప్రాధాన్యం ఉందట.. అందుకే డబుల్ రోల్ చేస్తున్నారని భోగట్టా. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. యూవీ క్రియేషన్స్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమా 2025 సంక్రాంతికి విడుదల కానున్న విషయం తెలిసిందే. -
త్రిష,చిరంజీవి కేసు విషయంలో మన్సూర్ అలీఖాన్‌కు ఊరట
కోలీవుడ్ నటుడు,రాజకీయ నాయకుడు మన్సూర్ అలీఖాన్‌కు న్యాయస్థానంలో ఊరట లభించింది. కొన్ని రోజుల క్రితం నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆమె తీవ్రంగా ఖండించారు. అయితే నటి త్రిషకు మహిళా కమిషన్ సభ్యులు అండగా నిలిచి, చైన్నె పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నటుడు మన్సూర్ అలీఖాన్‌పై ఫిర్యాదు చేశారు. అలాగే త్రిషకు టాలీవుడ్ నటుడు చిరంజీవి మద్దతు పలికారు. వారిద్దరూ మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దీంతో తన వ్యాఖ్యలను పూర్తిగా వినకుండా తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా నటి త్రిష, కుష్బూ, చిరంజీవి ప్రవర్తించారంటూ నటుడు మన్సూర్ అలీఖాన్ చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈయన పిటిషన్ విచారించిన న్యాయస్థానం నిజానికి నటి త్రిషనే మీపై పిటీషన్ దాఖలు చేయాలని మందలించడంతోపాటు కోర్టు సమయాన్ని వృథా చేసినందుకుగాను నటుడు మన్సూర్ అలీఖాన్‌కు రూ.లక్ష జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని చైన్నె, అడయార్ క్యాన్సర్ ఆస్పత్రికి అందించాలని ఆదేశించింది. అయితే తనపై విధించిన జరిమానాలు రద్దు చేయాలంటూ నటుడు మన్సూర్ చైన్నె హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఆయనపై విధించిన రూ.లక్ష జరిమానాను రద్దు చేస్తూ, ఈ కేసును కూడా కొట్టివేయాలని సింగిల్ బెంచ్‌ను ఆదేశించింది. -
ఆ ముగ్గురు అన్నయ్యలకు ధన్యవాదాలు: త్రిష
త్రిష జీవితంలో సమస్యలు అనేవి కొత్తేమీ కాదు. ఈమె ఒక్కో స్టేజ్‌లో ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూనే ఉన్నారు. వాటిని ఎదురొడ్డి ముందుకు సాగుతున్నారు. ఆ మధ్య వరుస ఫ్లాప్‌లతో కెరీర్ పరంగా ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ చైన్నె సుందరి ఇటీవల పొన్నియిన్ సెల్వన్ చిత్రంతో సెకెండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. ఆ తరువాత లియో చిత్రంలో విజయ్‌తో జతకట్టి కమర్షియల్ హిట్‌ను అందుకున్నారు. ప్రస్తుతం అజిత్ సరసన విడాముయర్చి చిత్రం, కమలహాసన్‌కు జంటగా థగ్స్ లైఫ్ వంటి భారీ క్రేజీ చిత్రాల్లో నటిస్తూ అగ్రకథానాయకిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. (ఇదీ చదవండి: జయలలిత ఆస్తుల వేలం.. కోర్టుకు చెల్లించాల్సిన డబ్బు ఎంత..?) తాజాగా టాలీవుడ్‌లోనూ రీఎంట్రీ ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో వ్యక్తి గత ఆరోపణలకు గురవుతున్నారు. అన్నాడీఎంకే బహిష్కరణ కార్యనిర్వాహకుడు ఏవీ రాజు త్రిషను అప్రతిష్ట పాలు చేసే విధంగా ఆమె పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది త్రిషను మానసిక క్షోభకు గురి చేసిన విషయం తెలిసిందే. కూవత్తూర్ సంఘటన సమయంలో నటుడు, రాజకీయ నాయకుడు కరుణాస్, నటి త్రిషతో పాటు మరికొందరిని గెస్ట్ హౌస్‌కి పంపారన్నదే ఏవీ.రాజు వేసిన నింద. దీన్ని తీవ్రంగా ఖండించిన త్రిష అతనిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. ఈ వ్యవహారంలో పలువురు సినీ ప్రముఖులు త్రిషకు అండగా నిలిచారు. ముఖ్యంగా దర్శకుడు చేరన్, సముద్రఖని, నాజర్ త్రిషపై ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. దీనికి స్పందించిన త్రిష తనకు సపోర్ట్‌గా నిలిచిన ఆ ముగ్గురు అన్నయ్యలకు ధన్యవాదాలు అంటూ ఆమె పేర్కొన్నారు. -
త్రిషపై మరోసారి అలాంటి కామెంట్స్.. ఇంతటి నీచానికి దిగుజారుతారా?
గతేడాది లియోతో సూపర్ హిట్ కొట్టిన భామ త్రిష. విజయ్ సరసన హీరోయిన్గా నటించి బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకుంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ చిత్రంలో ఓ పాత్ర పోషించిన నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన కామెంట్స్ పెద్దఎత్తున వివాదస్పదమయ్యాయి. ఏకంగా కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై పలువురు సినీతారలు మండిపడ్డారు. అయితే తాజాగా అన్నాడీఎంకే మాజీ లీడర్ ఏవీ రాజు చేసిన అసభ్యకర కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. త్రిషపై ఆయన మాట్లాడిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన అభిమానులు, నెటిజన్స్ అతనిపై మండిపడుతున్నారు. తక్షణమే అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో త్రిషకు పలువురు అండగా నిలుస్తున్నారు. త్రిషను ఉద్దేశించి ఏవీ రాజు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున వైరలవుతోంది. (ఇది చదవండి: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఫైనల్‌గా వివరణ ఇచ్చిన మన్సూర్!) తాజాగా ఈ విషయంపై హీరోయిన్ త్రిష స్పందించింది. ఫేమస్ కావడం కోసం ఏంతటి నీచానికైనా దిగజారిపోయే జీవితాలు అవీ.. పదే పదే ఇలాంటి నీచమైన మనుషులను చూస్తుంటే చాలా అసహ్యంగా ఉంది. దీనిపై త్వరలోనే న్యాయపరంగా కఠిన చర్యలు తీసుకుంటానని తెలిపింది. దీనిపై మా లీగల్ డిపార్ట్మెంట్ తదుపరి చర్యలు తీసుకుంటుందని ట్విటర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ టాపిక్ కోలీవుడ్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా.. త్రిష ప్రస్తుతం మెగాస్టార్ సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అసలేం జరిగిందంటే.. గతంలో ఓ ఎమ్మెల్యే డబ్బులిచ్చి త్రిషను రిసార్ట్‌కు తీసుకొచ్చారని ఇటీవలే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఏవీ రాజు కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇది చూసిన పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా త్రిషపై అసభ్యంగా మాట్లాడిన ఏవీ రాజును అరెస్ట్ చేయాలని నటుడు, దర్శకుడు చేరన్ డిమాండ్ చేశారు. ఇలాంటి వారిపై నటీనటుల సంఘం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా బహిరంగంగా సినీ పరిశ్రమలోని సభ్యులను కించపరిచేలా మాట్లాడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. WTF this Trisha should file legal action against him,nowdays these guys are behaving very cheaply #Trisha | #TrishaKrishnan pic.twitter.com/Ip1ZClB8xS — Sekar 𝕏 (@itzSekar) February 20, 2024 It's disgusting to repeatedly see low lives and despicable human beings who will stoop down to any level to gain https://t.co/dcxBo5K7vL assured,necessary and severe action will be taken.Anything that needs to be said and done henceforth will be from my legal department. — Trish (@trishtrashers) February 20, 2024 வன்மையாக கண்டிக்கிறேன்.. எந்த ஆதரமுமின்றி பொது வெளியில் திரைத்துறையினர் பற்றி பெயர் சொல்லி அவதூறு கிளப்பிய இவரை சட்டமும் காவல்துறையும் உரிய நடவடிக்கை எடுக்க வேண்டும்... @VishalKOfficial @Karthi_Offl நடிகர் சங்கம் இதற்கு தகுந்த பதிலும் நடவடிக்கையும் எடுக்கும் என நம்புகிறேன் https://t.co/fRNYxH5DAV — Cheran (@directorcheran) February 20, 2024 Shocked & disgusted by the behaviour of Ex AIADMK functionary A. V. Raju for making unwarranted , baseless, loose and completely false allegations about Trisha. It is 2024; we talk about women empowerment & equality - why drag an unrelated person into personal mud slinging. There… — Aditi Ravindranath (@aditi1231) February 20, 2024 -
'విశ్వంభర'లో అడుగు పెట్టిన టాప్ హీరోయిన్.. వీడియో వైరల్
మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' చిత్రం షూటింగ్ ప్రారంభం అయింది. చాలారోజుల నుంచే ఈ చిత్రానికి సంబంధించిన పలు సీన్స్ చిత్రీకరిస్తున్నారు డైరెక్టర్ వశిష్ఠ. తాజాగా ఈ బిగ్ ప్రాజెక్ట్‌లోకి మెగాస్టార్ చిరంజీవితో పాటు త్రిష కూడా అడుగుపెట్టింది. అందుకు సంబంధించిన వీడియోను సోషల్‌మీడియాలో చిరు పోస్ట్ చేశారు. చాలా రోజుల నుంచి విశ్వంభర చిత్రంలో త్రిష నటించబోతున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసింది. తాజాగా ఈ విషయంపై మెగాస్టార్ నుంచి ఇలా అధికారికంగా ప్రకటన రావడం జరిగింది. గతంలో వీరిద్దరూ స్టాలిన్ చిత్రంలో కనిపించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని టాక్ వస్తుంది. ఇందులో అనుష్క, హనీ రోజ్ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా త్రిష కూడా తన ఎక్స్ పేజీలో ఒక పోస్ట్ చేసింది. '18 ఏళ్ల తర్వాత మెగాస్టార్‌తో మళ్లీ కలవడం ఎంతో సంతోషంగా ఉంది. ఇదీ నాకు ఎంతో గొప్ప గౌరవం. చిరు సార్ నాకు హృదయపూర్వక స్వాగతం పలికినందుకు చాలా ధన్యవాదాలు.' అని తెలిపింది. సంక్రాంతి కానుకగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించింది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం ఎమ్ఎమ్ కీరవాణి అందిస్తున్నారు. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విశ్వంభర విడుదల కానుంది. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) What an honour it is to reunite with the one and only MEGASTAR after 18 years.Thank you so much for the warmest welcome Chiru sir❤️@KChiruTweets https://t.co/PSrJ4O7LEW — Trish (@trishtrashers) February 5, 2024 -
అజిత్‌తో ఇబ్బంది పడుతున్న త్రిష
అతివృష్టి, అనావృష్టి అన్నచందంగా ఉంది నటి త్రిష పరిస్థితి. దక్షిణాది చిత్ర పరిశ్రమను ఏలుతున్న ఈ చైన్నె బ్యూటీ. మొదట సహాయనటిగా సినీ రంగప్రవేశం చేసి ఆ తర్వాత తమిళం, తెలుగు భాషల్లో క్రేజీ కథానాయకిగా సత్తా చాటుకుంటున్నారు. ఒకానొక సమయంలో లేడీ ఓరియెంట్ కథా చిత్రాల్లో నటించిన ఈమెకు ఆ తరహా చిత్రాలు అచ్చి రాలేదు. అంతేకాదు అలాంటి చిత్రాలు అపజయాలను చవిచూడడంతో త్రిష కెరీర్ డౌన్ అయిపోయింది. అలా అవకాశాలే లేక ఇంట్లో కూర్చున్న ఈ బ్యూటీకి నాలుగు పదుల వయసు మీద పడ్డ తర్వాత ఇటీవల పొన్నియిన్ సెల్వన్ చిత్రంతో దర్శకుడు మణిరత్నం నటిగా పునర్ జన్మను ఇచ్చారనే చెప్పాలి. అలా త్రిష మళ్లీ పీక్‌లోకి వచ్చారు. ఆ తర్వాత విజయ్‌తో జతకట్టిన లియో చిత్రం మంచి వసూళ్లు సాధించింది. ప్రస్తుతం అజిత్ సరసన విడాముయర్చి, కమలహాసన్‌కు జంటగా థక్స్‌లైఫ్ చిత్రాల్లో నటిస్తున్నారు. అదేవిధంగా చాలా గ్యాప్ తర్వాత తెలుగులో చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటించే అవకాశం వచ్చినదన్నది తాజా సమాచారం. ఈమె ఇంతకుముందు స్టాలిన్ చిత్రంలో చిరంజీవితో జత కట్టారన్నది గమనార్హం. ఇలా వరుసగా అవకాశాలు వెల్లువెత్తడంతో త్రిష పరిస్థితి అతివృష్టిగా మారింది. ఎందుకు ప్రధాన కారణం అజిత్ సరసన నటిస్తున్న విడాముయర్చి చిత్రం అని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ చిత్ర షూటింగ్ అనుకున్న ప్రకారం జరగకపోవడంతో త్రిషకు తలనొప్పిగా మారిందట. ఇతర చిత్రాలకు కేటాయించిన కాల్షీట్స్కు ఆటంకం కలుగుతోందని త్రిష వాపోతున్నారట. ఏమిట్రా బాబు ఇలాంటి పరిస్థితి బాగున్న సమస్యే, బాగా లేకపోయినా సమస్యేనా అంటూ త్రిష టెన్షన్ అవుతున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
స్టార్ హీరో మూవీ.. త్రిష స్థానంలో సమంత?
హీరోయిన్ సమంత మళ్లీ రిఫ్రెష్ అవుతున్నారు. 2010లో ఏ మాయ చేసావె సినిమాతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది సామ్. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకోవడంతో తనకు బోలెడన్ని అవకాశాలు వచ్చాయి. అలా జూనియర్ ఎన్టీఆర్‌తో బృందావనం, మహేశ్ బాబు సరసన దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, రాజమౌళి దర్శకత్వంలో ఈగ వంటి పలు సినిమాలు బ్లాక్‌బస్టర్‌గా నిలిచి సామ్‌ను అగ్రస్థానంలో నిలబెట్టాయి. లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనూ.. అదేవిధంగా తమిళంలోనూ విజయ్, సూర్య, ధనుష్, విజయ్‌సేతుపతి వంటి స్టార్ హీరోల సరసన నటించిన క్రేజీ హీరోయిన్గా మారారు. వీటితో పాటు కొన్ని లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాలలోనూ నటించి సక్సెస్ అయ్యారు. ఇలా స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న సమంత జీవితంలో ఒక్క కుదుపు.. అదే మయోసైటిస్.. ఈ అరుదైన వ్యాధి వల్ల సమంత కొంత మానసిక వేదనకు గురయ్యారు. వైద్య చికిత్స కారణంగా కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి! ది బుల్ సినిమాలో సామ్? అయితే ఆమె ఇప్పటికీ అభిమానులకు మాత్రం దూరం కాలేదు. సమంత చివరిగా నటించిన చిత్రం ఖుషీ. అదేవిధంగా హిందీలోనూ ది ఫ్యామిలీ మెన్–2, సిటాడాల్ అనే వెబ్ సిరీస్‌లలో నటించారు. ప్రస్తుతం చైన్నె స్టోరీస్ అనే ఆంగ్ల చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఈమెకు బాలీవుడ్ నుంచి మరోసారి పిలుపు వచ్చినట్లు సమాచారం. తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ దర్శకత్వం వహిస్తున్న హిందీ చిత్రంలో సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా నటించనున్నారు. దీనికి ది బుల్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇందులో మొదట త్రిషను హీరోయిన్గా తీసుకోవాలని భావించినట్లు ప్రచారం జరిగింది. ఈసారైనా నిజమవుతుందా? కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఆ పాత్రలో సమంతను నటింపచేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పుష్ప చిత్రంలోని ఊ అంటావా మావా ఉఊ అంటావా అనే ఐటమ్ సాంగ్‌లో సమంత నటన బాలీవుడ్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. దీంతో సల్మాన్‌ఖాన్‌కు జంటగా ఈ బ్యూటీని నటింపచేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. ఆ మధ్య కూడా సల్మాన్ సినిమాలో సమంత నటించనుందంటూ వార్తలు రాగా అవి ఉట్టి పుకార్లేనని కొట్టిపారేసిందీ బ్యూటీ. మరి ఈసారి జరుగుతున్న ప్రచారం ఎంతవరకు నిజమో చూడాలి! చదవండి: Yatra 2 Teaser: ఆకట్టుకుంటున్న 'యాత్ర 2' టీజర్ -
రెండు దశాబ్దాలు దాటినా తగ్గేదెలా అంటున్న త్రిష
కథానాయికగా రెండు దశాబ్దాలకు పైగా రాణించడం అంత సులభం కాదు. ఈ విషయంలో నటి త్రిష అచీవ్ చేశారనే చెప్పాలి. ప్రశంసలు, విమర్శలు, వ్యతిరేకత, ప్రేమ విఫలం ఇలా అన్నిటిని ఎదురొడ్డిన ఈ చైన్నె చిన్నది 21 ఏళ్లుగా అగ్ర కథానాయికగా రాణిస్తోంది. మొదట్లో జోడి వంటి చిత్రాల్లో సహాయక నటిగా చేశారు. 2002లో అమీర్ దర్శకత్వంలో సూర్య కథానాయకుడిగా నటించిన మౌనం పేసియదే చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో వరుసగా అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. అలా విక్రమ్ సరసన సామి, విజయ్‌కు జంటగా గిల్లి సూర్యతో ఆరు వంటి చిత్రాల విజయాలు త్రిషను స్టార్ హీరోయిన్ను చేశాయి. ఆ తర్వాత తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లోనూ అవకాశాలు ఈ బ్యూటీని వెతుక్కుంటూ వచ్చాయి. ముఖ్యంగా తమిళం తర్వాత తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలు ఈమె ఖాతాలో చేరాయి. మధ్యలో కొన్ని లేడి ఓరియంటెడ్ కథా చిత్రాల్లో నటించిన అవి త్రిషను నిరాశపరిచాయనే చెప్పాలి. అలాంటి పరిస్థితుల్లో త్రిష కెరియర్ ఒడిదుడుకులను ఎదుర్కొంది. అయితే ఇటీవల పొన్నియిన్ సెల్వన్ చిత్రం ఒక్కసారిగా ఆమెకు పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టింది. దీంతో మళ్లీ విజయ్, అజిత్ వంటి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు తలుపు తట్టాయి. అలా విజయ్‌కు జంటగా నటించిన లియో చిత్రం కమర్షియల్‌గా హిట్ అయింది. ప్రస్తుతం అజిత్ సరసన విడాముయర్చి చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి కమల్ హాసన్ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కనున్న థగ్స్ లైఫ్ చిత్రంలోని త్రషనే కథానాయికిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలా నటిగా 21 ఏళ్లు పూర్తి చేసుకున్నా అభినయంలో తన అభిమానులను అలరించడంలో త్రిష తగ్గేదెలా అంటున్నారు. అందుకే ఈమె నటిగా 21 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక వీడియోలు విడుదల చేశారు. అందుకు నటి త్రిష వారికి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. -
Trisha Krishnan: ఇండస్ట్రీలో 21 ఏళ్లు పూర్తి చేసుకున్న త్రిష (ఫొటోలు)
-
చిరంజీవికి జోడీగా సీనియర్ హీరోయిన్‌కే ఛాన్స్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. మెగా 156గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'విశ్వంభర' అనే పేరు ఖారారు చేయనున్నారు. ఈ చిత్రాన్ని ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా... యు.వి.క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. షూటింగ్ ప్రారంభమే పోరాట ఘట్టాలతో మొదలైంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే తెలంగాణ ఎన్నికల్లో ఓటేసేందుకని చిరంజీవి ఇటీవల విరామం తీసుకుని హైదరాబాద్ వచ్చారు. ఈ సినిమా ప్రత్యేకమైన ఓ ఊహా ప్రపంచం నేపథ్యంలో సాగనుంది. చిరంజీవి సరసన పలువురు కథానాయికలు నటించే అవకాశాలున్నాయి. నిజానికి ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి ఒక్కరే హీరోయిన్ అని గతంలోనే బయటకు వచ్చింది. కానీ ఇప్పుడు తెరపైకి త్రిష పేరు బయటకు వచ్చింది. అనుష్క శెట్టి ఆశించిన స్థాయిలో బరువు తగ్గకపోవడంతో ఆ ఛాన్స్ త్రిషకు దక్కినట్లు తెలుస్తోంది. పొన్నియన్ సెల్వన్,లియో వంటి చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్లో త్రిషకు కూడా గుర్తింపు ఉంది. కానీ చాలా రోజుల నుంచి ఆమె టాలీవుడ్లో కూడా రీ ఎంట్రీ ఇవ్వాలని ఎదురు చూస్తుంది. మెగాస్టార్ చిత్రంతో వస్తున్న ఈ అవకాశాన్ని ఆమె ఉపయోగించుకోవాలని చూస్తుందట. అప్పట్లో, త్రిష, చిరంజీవి కాంబినేషన్లో స్టాలిన్ చిత్రం ద్వారా మెప్పించారు. తర్వాత ఆచార్య సినిమాతో మరోసారి ఆచార్య సినిమాలో వీరిద్దరూ కలిసి నటించనున్నారనే వార్తలు వచ్చాయి. కానీ క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా త్రిష స్థానంలో కాజల్ అగర్వాల్‌ని తీసుకున్నారు. ఏది ఏమైనా చిరు సినిమాలోకి త్రిష ఎంట్రీకి సంబంధించి అఫీషియల్ అప్ డేట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే. మెగా 156లో విజువల్ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యం ఎక్కువగా ఉంది. ఈ సినిమాలో చిన్నారుల్ని అలరించే అంశాలు పుష్కలంగా ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమా కోసం చిరంజీవి ప్రత్యేకంగా సన్నద్ధమవుతున్నారు. ఎం.ఎం. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. ఛోటా కె.నాయుడు ఛాయాగ్రాహకుడు. -
అన్నంత పని చేసిన మన్సూర్ అలీఖాన్
తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ శుక్రవారం నటి త్రిష కృష్ణన్, నటి, రాజకీయ నాయకురాలు కుష్బూ సుందర్, నటుడు చిరంజీవిపై మద్రాస్ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. కోటి నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్లో కోరారు. మన్సూర్ అలీఖాన్ వీడియో మొత్తం చూడకుండా తన పరువుకు భంగం కలిగించారని ఆరోపించారు. ఈ కేసు డిసెంబర్ 11వ తేదీ సోమవారం మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సతీష్ కుమార్ ధర్మాసనం ముందు విచారణకు రానుంది. నటి త్రిష కృష్ణన్‌పై మన్సూర్ ఖాన్ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనను నటి త్రిష కృష్ణన్, LEO డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, మాళవిక మోహనన్, చిరంజీవి, మరికొందరు నటీనటులతో పాటు తమిళ నటుల సంఘాలు తీవ్రంగా ఖండించాయి. దీని తర్వాత నటి, పొలిటీషియన్, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు కుష్బూ తమిళనాడు డీజీపీకి ఫిర్యాదు చేశారు. అలీఖాన్‌పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డీజీపీకి రాసిన లేఖలో కోరారు. దీంతో చెన్నై థౌజండ్ లైట్ పోలీసులు మన్సూర్ అలీఖాన్‌పై రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. (ఇదీ చదవండి: 'యానిమల్' సినిమా చూసి నా కూతురు ఏడ్చేసింది.. కాంగ్రెస్ ఎంపీ ఫైర్) ఫిర్యాదు దాఖలైన సమయంలో, మన్సూర్ అలీఖాన్ చెన్నై హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయన బెయిల్‌ను కోర్టు తిరస్కరించింది. మరోవైపు, మన్సూర్ అలీఖాన్ ప్రకటనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో త్రిషకు మన్సూర్ క్షమాపణలు చెప్పాడు. ఆయన క్షమాపణలను కూడా త్రిష అంగీకరించింది. త్రిష Vs మన్సూర్ మధ్య ఏం జరిగిందంటే నటుడు మన్సూర్ అలీఖాన్ కొద్దిరోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో పాల్గొని హీరోయిన్ త్రిషపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. గతంలో తాను ఎన్నో రేప్ సీన్లలో నటించానని, 'లియో'లో కూడా అలాంటి ఛాన్స్ త్రిషతో కూడా ఉంటుందని భావించినట్లు వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. కానీ లియో సినిమాలో అలాంటి సీన్ లేకపోవడంతో తనకు బాధ కలిగిందన్నాడు. దీంతో ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో త్రిష కూడా మన్సూర్‌పై ఫైర్ అయింది. ఇలాంటి వారితో ఒక్క సినిమాలో కూడా నటించనందుకు సంతోషంగా ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో త్రిషకు మెగా స్టార్ చిరంజీవి, నితిన్, రోజా, రాధిక, సింగర్ చిన్మయి,లోకేశ్ కనగరాజ్,కుష్బూ నిలిచారు. -
యానిమల్ చిత్రంపై త్రిష పోస్ట్.. నెటిజన్ల దెబ్బకు తొలగింపు
టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇటీవల విడుదల చేసిన చిత్రం యానిమల్. రణ్‌బీర్ కపూర్- రష్మిక కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నప్పటికీ మరికొందరు మాత్రం ఈ చిత్రంలో హింసాత్మక, స్త్రీ ద్వేషపూరితమైన కంటెంట్ ఉందంటూ విస్తృతంగా విమర్శించబడింది. యానిమల్‌లో యాక్షన్ సన్నివేశాల్లో రణబీర్ కపూర్, బాబీ డియోల్ అదరగొట్టారని చెప్పవచ్చు. అయితే ఈ చిత్రంలో ఎక్కువగా లైంగిక, గృహ హింసకు సంబంధించిన సీన్లు ఎక్కువగా ఉన్నాయంటూ తీవ్ర ప్రతిఘటనను ఈ చిత్రం ఎదుర్కొంది. (ఇదీ చదవండి: రేవంత్ రెడ్డి ఫోటో షేర్ చేస్తే ఇంతలా వేధిస్తారా..నన్ను వదిలేయండి: సుప్రిత) ఈ నేపథ్యంలో నటి త్రిష కృష్ణన్ ఇటీవల యానిమల్ చిత్రాన్ని సోషల్ మీడియాలో సమీక్షించి, దానిని 'కల్ట్'గా అభివర్ణిస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే ఇది నెటిజన్లకు పెద్దగా నచ్చలేదు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై త్రిష చేసిన కామెంట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ సినిమాపై 'కల్ట్... Pppppppaaaaaahhhhhh.' అని తన ఎక్స్ పేజీలో రాసింది. అయితే త్రిష కామెంట్‌పై సోషల్ మీడియాలో పలువురు తప్పుబట్టారు. దీంతో ఆమె తన పోస్ట్‌ను తొలగించింది. అయినప్పటికీ, నెటిజన్లు మాత్రం దానిని స్క్రీన్‌షాట్‌ను తీశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. Trisha's review on #Animal. Deleted the story now..!! pic.twitter.com/hDuwecUAps — AB George (@AbGeorge_) December 3, 2023 లియో చిత్రంలో త్రిషతో 'బెడ్రూమ్ సీన్' లేకపోవడంతో నిరాశ చెందాననని మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యాలు చేసిన విషయం తెలిసిందే. అతను గతంలో ఇతర మహిళా నటీనటులతో అనేక 'రేప్ సన్నివేశాలలో' తన ప్రమేయం గురించి గొప్పగా చెప్పుకున్నాడు. అతని ప్రకటనపై త్రిష స్పందిస్తూ తన అసమ్మతిని ట్వీట్ చేసి భవిష్యత్తులో అతనితో కలిసి పనిచేయడానికి నిరాకరిస్తున్నట్లు ప్రకటించింది. పలువురు ప్రముఖులు కూడా త్రిషకు మద్దతుగా నిలిచారు. అయితే సందీప్ రెడ్డి వంగా యానిమల్ సినిమాపై త్రిష ప్రశంసలు కురిపించడంతో మరోసారి ఇంటర్నెట్ దద్దరిల్లింది. గృహ హింస, లైంగిక హింసను కలిగి ఉన్న సినిమాని త్రిష మెచ్చుకున్నారని చాలా మంది విమర్శించారు. అయితే, మరికొందరు త్రిషను సమర్థించారు. యానిమల్‌లో ఎక్కువగా బోల్డ్, హింసకు సంబంధించిన సీన్లే ఉన్నాయి. అలాంటి సినిమాను త్రిష ఎందుకు మెచ్చుకున్నారు. ఈ సినిమాను కొందరు పురుషులు కూడా విమర్శిస్తున్నారు.. అలాంటిది త్రిష ఎందుకు హైప్ చేస్తున్నారని ఒక నెటిజన్ పేర్కొన్నాడు. ఒకవైపు మన్సూర్ వ్యాఖ్యలను ఆమె ఖండిస్తూనే మరోవైపు మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించే చిత్రానికి మద్దతిస్తున్నట్లు మరోక నెటిజన్ తెలిపాడు. అయితే, కొంతమంది త్రిషకు మద్దతుగా కామెంట్ చేశారు. మన్సూర్ అలీ ఖాన్‌తో ఆమెకు ఉన్న వివాదాన్ని తీసుకొచ్చి యానిమల్ చిత్రంపై ఆమెకు ఉన్న అభిప్రాయాన్ని పోల్చకూడదని వాదించారు. Trisha's review on #Animal. Deleted the story now..!! pic.twitter.com/hDuwecUAps — AB George (@AbGeorge_) December 3, 2023 Trisha praised #Animal movie and wokes started bullying her with hate Tweets. 😐 — . (@Midz13) December 3, 2023 Trisha’s comment on Animal does not invalidate that she does not like what happened to her. Her being verbally harassed matters and holds value regardless of her being a misogynist. — Lakshita Shankar (@lakshitposts) December 3, 2023 Trisha praised #Animal movie and wokes started bullying her with hate Tweets. 😐 — . (@Midz13) December 3, 2023 -
త్రిషపై నటుడి అనుచిత వ్యాఖ్యలు.. హీరోయిన్ ఇలా చేసిందేంటి?
స్టార్ హీరోయిన్ త్రిషపై నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యల గురించి సోషల్ మీడియాలో రచ్చ జరుగుతూనే ఉంది. ఈ వ్యవహారంలో మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలను పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. మహిళా కమిషన్.. మన్సూర్‌పై రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి సమన్లు జారీ చేశారు. మన్సూర్ పోలీసుల ఎదుట విచారణకు హాజరై వివరణ ఇచ్చారు. ఈ కేసు విషయంలో ముందస్తు బెయిల్ కోసం మద్రాసు హైకోర్టును సైతం ఆశ్రయించారు. అయితే అక్కడ నటుడికి చుక్కెదురైంది. దీంతో మన్సూర్ త్రిషకు క్షమాపణ చెప్పారు. ఆ తర్వాత మాత్రం తన మాటలను వక్రీకరించారంటూ తానెవరికీ సారీ చెప్పలేదని బుకాయించాడు. అంతేకాదు త్రిషతో పాటు ఆమె మద్దతుగా నిలబడ్డ కుష్బూ, టాలీవుడ్ చిరంజీవిపై పరువు నష్టం దావా వేస్తానని మాట్లాడారు. ఈ వ్యవహారం పక్కన పెడితే పోలీసులు మన్సూర్ అలీఖాన్ విషయంలో త్రిషను విచారించడానికి ఆమెకు లేఖ రాశారు. అందుకు త్రిష స్పందిస్తూ శుక్రవారంనాడు పోలీసులకు తిరిగి లేఖ రాశారు. అందులో మన్సూర్ అలీ ఖాన్ తనకు క్షమాపణ చెప్పారని ఆయనపై చర్యలు తీసుకోవద్దని పేర్కొన్నారు. మరి ఈ వ్యవహారం మున్ముందు ఎటు మలుపులు తిరుగుతుందో చూడాలి! చదవండి: శివాజీ ప్రవర్తన వల్ల బాధపడ్డా.. ఆ నొప్పితో బాధపడుతున్న అమర్.. అందుకే టాస్క్‌లు.. -
జాబిలమ్మలా మెరిసిపోతున్న త్రిష.... చూశారంటే మైమరిచిపోవాల్సిందే! (ఫోటోలు)
-
త్రిషకు చిరంజీవి మద్ధతు.. అసలు కారణం ఇదా..?
బురదలో రాయి వేస్తే ఏమౌతుంది..? ఆ బురద మనకే అంటుతుంది అనేలా ఉంది కోలీవుడ్‌లో మన్సూర్ వివాదం. మొదట హీరోయిన్ త్రిషపై ఆయన చేసిన అసభ్య కామెంట్లతో మొదలైన గొడవ టాలీవుడ్‌పై కూడా ప్రభావం చూపింది. త్రిషకు మద్ధతుగా మెగాస్టార్ చిరంజీవి నిలిచిన పాపానికి తిరిగి అతనిపైన చెత్త మాటలు విసిరాడు మన్సూర్. త్రిష, ఖుష్భూ, చిరంజీవిలపై పరువు నష్టం దావా వేస్తానంటూ ప్రకటించిన మన్సూర్ అంతటితో ఆపలేదు. తనది వక్రబుద్ధి అన్న చిరంజీవి గతంలో పార్టీ పెట్టి వేల కోట్లు దండుకున్నాడని, కనీసం పేదలకు కూడా ఎలాంటి సాయం చేయలేదని ఆరోపించాడు. అంతే కాకుండా రీయూనియన్ పేరుతో అలనాటి హీరోయిన్లతో పార్టీలు చేసుకోవడం వంటి మాటలు విసిరాడు. సౌత్ ఇండియాలో 1980-1990 దశకంలో రానించిన హీరో,హీరోయిన్లతో చిరంజీవి రీయూనియన్ అవుతున్నాడు. కానీ దీనిని మన్సూర్ తప్పుగా క్రియేట్ చేశాడు. ఇదంతా కేవలం పబ్లిసిటీ కోసమే మన్సూర్ చేశాడనేది చెన్నై ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. అందుకే ఆయన రోజుకో మాట మాట్లాడుతున్నాడని చెప్పుకొచ్చింది. త్రిషకు చిరంజీవి సపోర్ట్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఏమిటని చాలా మంది మదిలో ఉన్న ప్రశ్న... మెగాస్టార్- వశిష్ట కాంబోలో విశ్వంభర చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో త్రిష ఒక హీరోయిన్గా తీసుకున్నారని టాక్ ఉంది. అందుకే త్రిష కోసం సపోర్టుగా చిరంజీవి నిలిచారని సమాచారం. చాలా వరకు వివాదాలకు దూరంగా ఉండే చిరు.. త్రిష కారణంగా అవసరంలేని మాటలు పడుతున్నాడు. అంతేకాకుండా ఆధారాల్లేని ఆరోపణలు ఎదర్కొవాల్సి వస్తుంది. ఈ అంశంపై మన్సూర్ పట్ల చిరంజీవి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. -
త్రిష, చిరంజీవిపై కేసు.. మళ్లీ రచ్చ చేస్తున్న మన్సూర్..!
తమిళ చిత్రసీమలో ప్రముఖ నటుడు మన్సూర్ అలీఖాన్ కొద్దిరోజుల క్రితం జరిగిన మీడియా సమావేశంలో నటి త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీని తరువాత, నటి త్రిష తన సోషల్ మీడియా పేజీలో మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలను తప్పుబట్టింది. 'మహిళలను కించపరిచే విధంగా మన్సూర్ అలీఖాన్ మాట్లాడాడు. ఆయనతో మళ్లీ నటించను. అతనిపై చర్యలు తీసుకోవాలని పోస్ట్ చేశారు. దీని తరువాత, నటి ఖుష్బూ, చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో నటుడు మన్సూర్ అలీ ఖాన్‌పై తమ నిరసనను వ్యక్తం చేశారు. (ఇదీ చదవండి: నటుడు నరేశ్‌కు దక్కిన అరుదైన గౌరవం.. లెఫ్టినెంట్ కల్నల్‌గా గుర్తింపు) అయితే తానేమీ తప్పుగా మాట్లాడలేదని మన్సూర్ అలీఖాన్ వివరణ ఇచ్చారు. మరోవైపు నటుడు మన్సూర్ అలీఖాన్‌పై కేసు నమోదు చేయాలని తమిళనాడు డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ ఫిర్యాదు లేఖ పంపింది. దీంతో చెన్నై పోలీసులు మన్సూర్ అలీఖాన్‌పై రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. నటుడు మన్సూర్ అలీఖాన్ అదృశ్యమయ్యారనే వార్తల నేపథ్యంలో, దానిని ఖండిస్తూ ఆడియోను విడుదల చేశారు. అనంతరం నవంబర్ 23న మన్సూర్ అలీఖాన్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంలో, త్రిష గురించి మాట్లాడినందుకు క్షమాపణలు చెబుతూ మన్సూర్ అలీఖాన్ ఒక ప్రకటన విడుదల చేశాడు. ఆ ప్రకటనలో, 'నా తోటి నటి త్రిష, దయచేసి నన్ను క్షమించండి' అని చెప్పాడు. ఈ నేపథ్యంలో నటి త్రిష తన సోషల్ మీడియా పేజీలో 'తప్పు చేయడం మానవుడి సహజం, క్షమించడం అనేది దైవం చూసుకుంటుంది' అని పోస్ట్ చేసింది.దీంతో ఈ గొడవ ముగిసింది అనుకుంటే.. తాజాగా మళ్లీ మన్సూర్ తెరపైకి వచ్చాడు. ఆ ముగ్గురిపై కేసు ఖుష్బు, త్రిష, చిరంజీవిలపై పరువునష్టం, పరిహారం, క్రిమినల్, సివిల్ దావా, ముందస్తు అల్లర్లు, నగరంలో 10 రోజులపాటు ప్రజా శాంతికి విఘాతం కలిగించడం, ఇతరులను రెచ్చగొట్టడం వంటి అన్ని కేటగిరీల కింద కేసు నమోదు చేయబోతున్నట్లు నటుడు మన్సూర్ అలీఖాన్ ప్రకటించారు. తన లాయర్ గురు ధనంజయన్ ద్వారా రేపు కోర్టులో కేసు వేయబోతున్నట్లు తెలిపారు. వారి ముగ్గురికి నోటీసులు జారీ చేస్తానని ఆయన ప్రకటించాడు. (ఇదీ చదవండి: బిగ్ బాస్ వల్ల రచ్చ.. వనిత విజయ్‌కుమార్‌పై దాడి) నవంబర్ 11న విలేకరుల సమావేశంలో తాను మాట్లాడిన ‘నిజమైన వీడియో’ని వారికి పంపించానని మన్సూర్ తెలిపాడు. సరిగ్గా వారం తర్వాత నవంబర్ 19న జరిగిన ఈ వీడియోనే తన ప్రసంగానికి ముందు, తర్వాత కొందరు ఎడిట్ చేసి త్రిషను అసభ్యకరంగా మాట్లాడినట్లు చిత్రీకరించారన్నారు. ఈ కేసులో తాను నిజమైన వీడియోను పంపానని, మరికొన్ని ఆధారాలతో రేపు కేసు నమోదు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. ముగిసిపోయిన గొడవను మళ్లీ మన్సూర్ తెరపైకి తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు. -
త్రిష చుట్టూ మన్సూర్ వివాదం.. విచారణకు రెడీ అవుతున్న పోలీసులు
వారం రోజులుగా పెద్ద వివాదానికి దారి తీసిన ఘటన ఏదైనా ఉందంటే అది నటుడు మన్సూర్ అలీఖాన్ నటి త్రిషపై చేసిన అనుచిత వ్యాఖ్యల అంశమే. ఈ వ్యవహారంలో పలువురు సినీ తారలు త్రిషకు మద్దతుగా నిలిస్తే కొందరు రాజకీయ నాయకులు మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోరాదంటూ ఆయనకు సపోర్ట్ చేశారు. ఇక మహిళా కమిషన్ ఈ వివాదంలో కలుగ చేసుకోవడంతో పరిణామాలు తీవ్ర రూపం దాల్చాయి. ఆ కమిషన్ నిర్వాహకులు మన్సూర్ అలీ ఖాన్ పై డీజీపీకి ఫిర్యాదు చేయడం సమన్లు, విచారణ, కోర్టు పిటిషన్లు వెంట వెంటనే జరిగి పోయాయి. వ్యవహారం ముదిరి పాకాన పడటంతో మన్సూర్ అలీ ఖాన్ తన పంతాన్ని పక్కన పెట్టి త్రిషమ్మా క్షమించమ్మా అంటూ ఆమె ప్రసన్నం అయ్యేలా మాట్లాడారు. దీంతో త్రిష శాంతి కాముకురాలిగా తప్పులు చేయడం మానవ లక్షణం. క్షమించడం దైవీకం అంటూ పెద్ద పెద్ద డైలాగ్‌తో ఓ స్టేట్మెంట్ ఇచ్చేసింది. దీంతో ఈ వివాదం సమసి పోయినట్లేనా? అంటే అది ప్రశ్నార్థకంగా మారుతోంది. కారణం మన్సూర్ అలీ ఖాన్ కోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురికావడమే. ఇప్పుడు ఈ వ్యవహారంలో పోలీసులు నటి త్రిషను విచారించడానికి సిద్ధం అవుతున్నారు. మరి దీనికి ఎక్కడ ఎండ్ కార్డ్ పడుతుందో అనే చర్చ సాగుతోంది. -
త్రిషను క్షమాపణ కోరిన మన్సూర్.. రక్తపాతం లేని యుద్ధం అంటూ..!
కోలీవుడ్‌లో హీరోయిన్ త్రిష గురించి సినీ నటుడు మన్సూర్ అలీఖాన్ మాట్లాడడం వివాదాస్పదమైంది. దీనిపై త్రిష, చిరంజీవి, లోకేష్ కనగరాజ్, మాళవిక మోహనన్ తదితరులు తీవ్రంగా విమర్శించారు. ఇలా చాలామంది నటీనటులు మన్సూర్ అలీఖాన్‌ను తప్పుబట్టారు. అయితే తాను తప్పుగా మాట్లాడలేదని మన్సూర్ అన్నారు. మరోవైపు మన్సూర్ అలీఖాన్‌పై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ తమిళనాడు డీజీపీకి ఫిర్యాదు చేసింది. ఈమేరకు ఆయనకు నోటీసులు కూడా జారీ అయ్యాయి. దీని ఆధారంగా నిన్న(నవంబర్23) ఉదయం 11 గంటలకు స్వయంగా హాజరు కావాలని మన్సూర్ అలీఖాన్‌కు సమన్లు పంపారు. అయితే ముందస్తు బెయిల్ కోసం మన్సూర్ అలీఖాన్ చెన్నై ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నేడు నవంబర్ 24న విచారణకు వస్తానని ఆయన చెప్పాడు. కానీ తాజాగా ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఆయన ఉపసంహరించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే త్రిషకు మన్సూర్ అలీఖాన్ క్షమాపణలు చెప్పాడు. కొన్నిరోజులుగా కొనసాగుతున్న ఈ కేసులో ఫైనల్‌గా త్రిషకు మన్సూర్ అలీ ఖాన్ క్షమాపణలు చెప్పడంతో ఈ గొడవ ఇంతటితో క్లోజ్ కానుంది. అతను ప్రచురించిన ప్రకటనలో ఇలా పేర్కొన్నాడు. 'నేను కత్తి లేకుండా ఒక వారం పాటు యుద్దం చేశాను. ఈ వార్‌లో రక్తపాతం లేకుండానే నేను గెలిచాను! నాకు అండగా నిలిచిన నాయకులు, నటీనటులు, పాత్రికేయులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నన్ను తప్పుపట్టిన వ్యక్తులకు వినయపూర్వకమైన నమస్కారములు. నా వ్యాఖ్యలతో త్రిష మనసుకు బాధ కలిగించాయి. అందుకు క్షమాపణ చెబుతున్నా. ఇంతటితో ఈ కళింగ యుద్ధం ముగిసింది. అప్పుడు లక్షలాది మంది చనిపోవడంతో, సామ్రాట్ అశోకుడి గుండె నుంచి రక్తం ఏరులైపారింది. దీంతో ఆయన అహింసను స్వీకరించాడు. ఇక్కడ నేను కూడా అహింస మార్గం వైపే నిలబడ్డాను.' అని మన్సూర్ తెలిపాడు. -
మన్సూర్ అలీఖాన్‌కు సమన్లు.. నేడు విచారణ
కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీఖాన్‌కు థౌజండ్ లైట్స్ పోలీసులు సమన్లు జారీ చేశారు. గురువారం తమ విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. వివరాలు.. సినీ నటి త్రిష గురించి నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. జాతీయ మహిళా కమిషన్ ఫిర్యాదుతో డీజీపీ శంకర్‌జివ్వాల్ ఆదేశాల మేరకు మన్సూర్‌పై రెండు సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఆయన్ని విచారించేందుకు థౌజండ్ లైట్స్ పోలీసులు సిద్ధమయ్యారు. విచారణకు రావాలని ఆదేశిస్తూ ఆయనకు సమన్లు పంపించారు. ఇదిలా ఉండగా మన్సూర్ అలీఖాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసే క్రమంలో నటి ఖుష్భు ‘చేరి’(స్లం) భాష గురించి తనకు తెలియదని, తాను మాట్లడలేనని ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ చేరి భాష మద్దతు దారులు కుష్భుకు వ్యతిరేకంగా గళాన్ని విప్పే పనిలో పడ్డాడు. దర్శకుడు పా రంజిత్ , నటి గాయత్రి రఘురాం కుష్భు వ్యాఖ్యలను ఖండించారు. ఆమె బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో కుష్భుకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాలలో స్వరాన్ని పెంచిన వాళ్లు ఎక్కువే. మన్సూర్ వ్యవహారంలో ఆగమేఘాలపై స్పందించిన కుష్భు మణిపూర్ వ్యవహారంలో ఎందుకు స్పందించ లేదని ప్రశ్నించడం గమనార్హం. -
నటి త్రిషకు మద్దతుగా నిలిచిన సినీ సెలబ్రిటీలు
-
త్రిషతో వివాదం.. మన్సూర్ అలీఖాన్‌పై రెడ్ కార్డ్.. రియాక్ట్ అయిన నితిన్
కోలీవుడ్‌లో నటి త్రిష, నటుడు మన్సూర్ అలీ ఖాన్ వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. త్రిష గురించి నటుడు మన్సూర్ అలీఖాన్ ఒక భేటీలో అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నటి త్రిష తీవ్రంగా స్పందించారు. ఆమెకు నటి కుష్బూ, మాళవిక నాయర్, లియో చిత్ర దర్శకుడు లోకేష్ కనకరాజ్, దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం నిర్వాహకులు మద్దతుగా నిలిచారు. త్రిషకు మన్సూర్ అలీ ఖాన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ఈ వ్యవహారంపై స్పందించిన మన్సూర్ అలీ ఖాన్ తాను సరదాగా అన్నానని, దాన్ని వివాదాస్పదం చేయవద్దని కోరారు. తనపై రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అయితే త్రిషకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దక్షిణ భారత నటీనటుల సంఘం కోరితే తాను వివరణ ఇవ్వడానికి సిద్ధం ఉన్నానని అన్నారు. దీంతో ఆయనపై మూకుమ్మడి ఒత్తిడి వస్తోంది. (ఇదీ చదవండి: విజయకాంత్ ఆరోగ్యంపై వివరణ ఇచ్చిన తమిళనాడు మంత్రి) మన్సూర్ అలీఖాన్‌పై దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం ఆయనపై రెడ్ కార్డ్ వేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కాగా ఈ వ్యవహారం జాతీయ మహిళా కమిషన్ వరకు వెళ్లింది. త్రిష గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనపై 509 బీ సెక్షన్ కింద కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి కమిషన్ ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం ఎంత వరకు వెళుతుందో చూడాలి. అహంకారపూరిత వ్యాఖ్యలకు చోటులేదు: నితిన్ 'త్రిషపై మన్సూర్ అలీ ఖాన్ చేసిన నీచమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి అహంకారపూరిత వ్యాఖ్యలకు ఇండస్ట్రీలో చోటులేదు. ఇలా మహిళలపై నీచమైన వ్యాఖ్యలు చేసే వారిపై పోరాడలని, మహిళలకు మద్దతుగా నిలబడాలని సినీ ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను' అని నితిన్ తన ట్విటర్ వేదికగా ట్వీట్ చేశాడు. గతంలో 'అల్లరి బుల్లోడు' చిత్రంలో త్రిష, నితిన్ కలిసి నటించిన విషయం తెలిసిందే. త్రిషకు కోలీవుడ్‌లో మాత్రమే కాదు టాలీవుడ్లో కూడా సపోర్ట్ దొరుకుతుంది. -
విజయ్ 'లియో' ఓటీటీ విడుదల తేదీని ప్రకటించిన నెట్‌ఫ్లిక్స్
విజయ్- లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో లియో సినిమా తెరకెక్కింది. అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ఈ సినిమా విడుదలైంది. టాలీవుడ్లో యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కోలీవుడ్‌లో మాత్రం హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 600 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి.. విజయ్ కెరియర్లో మరో హిట్ సినిమాగా నిలిచింది. విడుదలకు ముందు నుంచే ఎన్నో వివాదాలను ఎదుర్కొన్న ఈ చిత్రం నిత్యం వార్తల్లో నిలిచింది. అలాగే కోలీవుడ్‌లో తొలిరోజు తెల్లవారుజామున ప్రదర్శనలకు కూడా ప్రభుత్వం అనుమతులివ్వలేదు. వీటన్నింటి మధ్య కూడా ఈ చిత్రం రికార్డులు సృష్టించడంతో లియో మేకర్స్ గ్రాండ్‌గా అభిమానుల మధ్య విజయోత్సవ వేడుకను కూడా జరుపుకున్నారు. తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడుదల విషయంలో అధికారిక ప్రకటన వచ్చేసింది. నవంబర్ 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో లియో స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించారు. తెలుగు,తమిళ్,కన్నడ,మలయాళం,హిందీ భాషలలో ఈ చిత్రం అందుబాటులోకి వస్తుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు లియో చిత్రాన్ని చూడని ప్రేక్షకులు ఈ నెల 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు. కథేంటి? పార్తిబన్(విజయ్).. భార్య పిల్లలతో కలిసి హిమాచల్ ప్రదేశ్‌లో ఉంటాడు. కాఫీ షాప్ నడుపుతుంటాడు. ఆ షాప్‌కి వచ్చిన కొందరు రౌడీలు.. తన కూతుర్ని చంపేస్తానని బెదిరిస్తారు. దీంతో వాళ్లని చంపేస్తాడు. మరోవైపు ఆంటోనీ దాస్ (సంజయ్ దత్).. పార్తిబన్ దగ్గరకొచ్చి తాను తండ్రినని చెప్తాడు. నువ్వు పార్తిబన్ కాదు.. లియో దాస్ అని అంటాడు. ఇంతకీ పార్తిబన్ ఎవరు? లియో ఎవరు? అసలు వీళ్లిద్దరికీ సంబంధం ఏంటనేది సినిమా కథ -
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఫైనల్‌గా వివరణ ఇచ్చిన మన్సూర్!
దక్షిణాది నటుడు మన్సూర్ అలీ ఖాన్ తాజాగా 'లియో' చిత్రంలో కనిపించాడు. అందులో ఆయనతో పాటు నటించిన హీరోయిన్ త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం చేశాడు. ఈ విషయంపై ఇప్పటికే త్రిషతో పాటు తమిళనాడులోని చాలామంది ప్రముఖులు రియాక్ట్ అయ్యారు. మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో తాజాగా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. మన్సూర్ అలీ ఖాన్ క్లారిఫికేషన్: నటుడు మన్సూర్ అలీ ఖాన్ ఈ వివాదం గురించి తన సోషల్ మీడియాలో ఇలా తెలిపాడు. తన మాటలను తప్పుగా చూపించినందుకు నటుడు తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. నటి త్రిష కృష్ణన్‌ను మెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే తాను ఆ వ్యాఖ్యలు చేశానని మీడియా సమావేశంలో అన్నారు.. లియోలో నటి త్రిష కృష్ణన్ పాత్రను 'పర్వతాన్ని ఎత్తుకున్న హనుమాన్'తో పోల్చారు. సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకం. ఆమెకు కాంప్లిమెంట్స్ ఇచ్చాను. 'దురదృష్టవశాత్తూ, ఆ స్టేట్మెంట్ తీసివేయబడింది. కొన్ని స్టేట్మెంట్లు మాత్రమే ఆక్కడ ఎడిట్ చేసి ఎవరో కావాలనే వైరల్ చేశారు. త్రిషపై తనకెంతో మంచి అభిప్రాయం ఉందన్నారు. ఆమెను గౌరవిస్తున్నానని చెప్పారు. సరదాగా చెప్పిన వ్యాఖ్యలపై ఇలాంటి దుమారం రేగుతుందనుకోలేదు. తాను ఎవరినో, ఎలాంటి వాడినో అందరికీ తెలుసు. అంటూ మన్సూర్ అలీ ఖాన్ తమిళంలో ఇలా రాశారు. 'నా మాటలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. తప్పుగా చూపించి నాపై రాజకీయాలు చేస్తున్నారు. నా సినిమాల గమనాన్ని ప్రభావితం చేసేందుకే ఇలా చేస్తున్నారు. స్త్రీల పట్ల నాకెంతో గౌరవం ఉంది. నేను గతంలో చాలా మంది నటీమణులతో పనిచేశాను. నేనెప్పుడూ ఎవరితోనూ అసభ్యకరంగా ప్రవర్తించలేదు.' అని తెలిపాడు. ఏం జరిగిందంటే..? కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీఖాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో ‘లియో’ సినిమాలో త్రిషతో ఓ సీన్ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. నేను గతంలో ఎన్నో చిత్రాల్లో రేప్ సీన్లలో నటించాను. ‘లియో’లో కూడా త్రిషతోనూ అలాంటి సీన్ ఉంటుందని అనుకున్నా. కానీ అలాంటి సీన్ లేకపోవడంతో చాలా బాధగా అనిపించింది.' అని మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలు చేశాడు. మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో సినీ పరిశ్రమ నుంచి తీవ్ర అసంతృప్తి వచ్చింది. నటి ఖుష్బూ సుందర్, దర్శకుడు లోకేష్ కనకరాజ్, గాయని చిన్మయి శ్రీపాద తదితరులు ఆయన ప్రకటనను తీవ్రంగా ఖండించారు. View this post on Instagram A post shared by Mansoor Ali Khan (@mansoor_alikhan_offl) -
నయనతారను బీట్ చేసిన త్రిష
నటి త్రిష పాన్ ఇండియా నటిగా ఎప్పుడో మారారు. తమిళం, తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో నటించిన త్రిష అగ్రకథానాయకిగా రాణిస్తున్నారు. ఈ బ్యూటీకి నాలుగు పదుల వయసు మీద పడుతోంది. ఇప్పటికీ అవివాహితగానే ఉన్నారు. అయితే చాలా కాలం క్రితమే నిర్మాత, వ్యాపారవేత్త అరుణ్ మణియన్‌తో పెళ్లి, నిశ్చతార్థం వరకూ వెళ్లి ఆగిపోయింది. ఆ తరువాత త్రిష ఎప్పుడు పెళ్లి గురించి అడిగినా అందుకు సమయం వచ్చినప్పుడు చేసుకుంటానంటూ చెబుతూ వస్తున్నారు. కాగా ఈ మధ్య నటిగా చాలా డల్ అయ్యారు. తను నటించిన చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవడంతో మార్కెట్‌ను కోల్పోయే పరిస్థితికి చేరుకున్నారు. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాలు ఈ బ్యూటీకి అసలు అచ్చిరాలేదు. అలాంటి సమయంలో త్రిషకు దర్శకుడు మణిరత్నం ఆపద్భాందవుడుగా నిలిచారు. పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో అవకాశం కల్పించారు. అందులో యువరాణి కుందవైగా నటించి అందరి ప్రశంసలను అందుకున్నారు. పొన్నియిన్‌సెల్వన్ పార్టు 1, 2 చిత్రాలు విజయవంతం కావడంతో ఆ చిత్రంతో ఎక్కువగా లబ్ధి పొందింది నటి త్రిషనే అని చెప్పవచ్చు. ఈ చిత్రం రెండు భాగాలకు కలిపి త్రిష తీసుకున్న పారితోషికం రూ.2 కోట్లు అని సమాచారం. ఆ చిత్రం విజయంతో త్రిష తన పారితోషికాన్ని రూ.3 కోట్లకు పెంచినట్లు టాక్. కాగా ఇటీవల విజయ్‌కు జంటగా నటించిన లియో చిత్రానికి రూ.5 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ఆమె నటించడానికి కారణం విజయే అనే ప్రచారం జరిగింది. ఇంతకుముందు విజయ్‌తో గిల్లీ, తిరుపాచ్చి, కురువి చిత్రాల్లో నటించిన త్రిష లియో చిత్రంలో నాలుగోసారి నటించారు. నటుడు విజయ్‌తో 15 ఏళ్ల తరువాత నటించిన చిత్రం ఇది. ఈ చిత్రం హిట్ కావడంతో ఈమెకు భారీ అవకాశాలు వస్తున్నాయి. తాజాగా అజిత్‌కు జంటగా విడాముయర్చి చిత్రంలో నటిస్తున్నారు. తర్వాత కమలహాసన్‌కు జంటగా థక్స్ లైఫ్ చిత్రంలో నటించనున్నారు. లియో చిత్రం తరువాత త్రిష తన పారితోషికాన్ని ఏకంగా రూ.12 కోట్లకు పెంచినట్లు తాజాగా జరుగుతున్న చర్చ. అయితే దీని గురించి అధికారిక సమాచారం లేదన్నది గమనార్హం. అయితే ఈ చైన్నె భామ ఇప్పుడు రూ.10 కోట్లకు తక్కువ పారితోషికం తీసుకోవడం లేదన్న మాట గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటివరకూ నయనతారనే దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటిగా పేరుపొందారు. ఇప్పుడు ఈమెను త్రిష బీట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో నిజం ఎంత అనేది త్రిషనే చెప్పాలి. -
అదృష్టం అంటే త్రిషదే.. పట్టుకుందల్లా బంగారమే!
ఏ విషయానికైనా ప్రతిభ మాత్రమే ఉంటే చాలదు, కాస్తంత అదృష్టం కూడా ఉండాలి అని పెద్దలు అంటుంటారు. త్రిష విషయంలో ఇప్పుడదే జరుగుతోంది. 20 ఏళ్ల క్రితం జోడీ అనే చిత్రంలో నటి సిమ్రాన్‌కు స్నేహితురాలిగా ఒకటి రెండు సన్నివేశాల్లో కనిపించిన త్రిష అగ్ర కథానాయకిగా రాణిస్తుందని బహుశా ఆమె కూడా అనుకుని ఉండదు. అలాంటిది సామి, గిల్లి వంటి చిత్రాలు త్రిషను స్టార్ హీరోయిన్గా నిలబెట్టాయి. అలా తమిళంతోపాటు తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో కథానాయికగా నటించింది. గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిన మణిరత్నం అయితే ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వచ్చి బెడిసి కొట్టిన ఘటన త్రిష కెరీర్ పై బలంగానే పడిందని చెప్పక తప్పదు. ఇప్పటివరకు ఈమె అవివాహిత గానే ఉండడం గమనార్హం. ఇక లేడీ ఓరియంటెడ్ కథా చిత్రాలు త్రిషకు అచ్చి రాలేదు. అలాంటిది త్రిషకు దర్శకుడు మణిరత్నం గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు. పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో అవకాశం కల్పించారు. అందులో యువరాణి కుందవైగా నటించి అందరి ప్రశంసలు అందుకుంది. అలా పొన్నియిన్ సెల్వన్ చిత్రం రెండు భాగాలు హిట్ కావడంతో త్రిష పేరు మరోసారి మారుమోగింది. అన్నీ మంచి శకునములే.. ఆ తర్వాత అన్నీ మంచి శకునములే అన్నట్టుగా వరుసగా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు వరిస్తున్నాయి. ఇటీవల విజయ్ సరసన నటించిన లియో చిత్రం కూడా అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. అజిత్‌కు జంటగా విడాముయర్చి చిత్రంలో నటిస్తోంది. తదుపరి కమల్ హాసన్ సరసన నటించే లక్కీ ఛాన్స్ దక్కించుకుంది. మణిరత్నం ఈమెకు మరోసారి ఛాన్స్ ఇచ్చారు.. కమల్ హాసన్ 224వ చిత్రంలో ఈమెనే ఎంపిక చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. అలా మరో మల్టీ స్టారర్ చిత్రంలో నటించే మెగా అదృష్టం ఈ చైన్నె సుందరిని వరించింది. ఇలా ఇప్పుడు త్రిష టైం నడుస్తోందన్నమాట. చదవండి: భార్యతో విడాకులు తీసుకున్న స్టార్ సింగర్! -
నా కెరియర్లో ఎక్కువగా విజయ్‌తోనే పయనించా: త్రిష
కోలీవుడ్‌లో ఇప్పుడు మంచి రైజింగ్‌లో ఉన్న నటి త్రిష. ఈ బ్యూటీ వయసు 40 ఏళ్లు. నటిగా 25 ఏళ్లకు దగ్గర్లో ఉన్నారు. అయినప్పటికీ అగ్ర కథానాయకిగా రాణిస్తున్నారు. ఇప్పటికీ అవివాహితగా ఉన్న ఈమె ప్రముఖ నటులకు జంటగా భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవల విజయ్‌కు జంటగా నటించిన లియో చిత్రం విడుదలై అనూహ్య వసూళ్లు సాధిస్తోంది. కాగా బుధవారం రాత్రి చైన్నెలో జరిగిన లియో చిత్ర విజయోత్సవ వేడుకలో పాల్గొన్న త్రిష మాట్లాడుతూ ఈ చిత్ర కథను దర్శకుడు రెండున్నర గంటల పాటు ఆయన చెప్పిన తీరు తనను ఆశ్చర్యానికి గురి చేసింది అన్నారు. లోకేశ్ కనకరాజ్ అప్పుడు ఏం చెప్పారో దాన్ని తెరపై ఆవిష్కరించారని చెప్పారు. ఈ చిత్రంలో విజయ్ సరసన నటించడం మరిచిపోలేని అనుభవంగా పేర్కొన్నారు. స్కూల్లో చదువుకున్న వారు కొన్నేళ్ల తర్వాత కలిస్తే ఎలా ఉంటుందో అలాంటి అనుభూతిని తాను అనుభవిస్తున్నట్లు చెప్పారు. తన కెరీర్లో తాను ఎక్కువగా పయనించింది విజయ్‌తో అని తెలిపారు. విజయ్ నెమ్మదితనమే ఆయన విజయానికి కారణంగా పేర్కొన్నారు. తనను కలిసే వారు.. స్నేహితులు మళ్లీ విజయ్‌కు జంటగా ఎప్పుడు నటిస్తారు అని పదేపదే అడుగుతుండే వారన్నారు. అది ఇన్నాళ్లకు జరిగిందని, లియో చిత్రంలో విజయ్ తాను మళ్లీ జతకట్టామని చెప్పారు. 15 ఏళ్ల తర్వాత కూడా తమ జంట వర్కౌట్ అయిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. నటీమనులకు ఉత్తాన్న పతనాలు ఉంటాయని, అయినప్పటికీ అన్నివేళలా సంతోషంగా ఉండాలన్నారు. తాను అలా ఉండటం వల్లే తన స్థానాన్ని నిలబెట్టుకుంటూ వచ్చానని త్రిష పేర్కొన్నారు. -
లియో కొత్తగా మళ్లీ వస్తున్నాడు.. వారికి మాత్రమే ఎంట్రీ.. ఎందుకంటే?
కోలీవుడ్ హీరో ‘లియో’ సినిమా అక్టోబర్ 19న భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల మధ్యకు వచ్చింది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్, త్రిష జంటగా నటించిన ఈ చిత్రం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. సినిమా మిక్స్డ్ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా రూ. 500 కోట్ల మార్క్‌ను దాటినట్లు తెలుస్తోంది. LCU లో భాగంగా ఖైదీ, విక్రమ్ లాంటి సినిమాలు బ్లాక్‌బస్టర్ కొట్టాయి. లియో కూడా తమిళ్ వర్సెన్ బాగానే సక్సెస్ అయింది. కానీ తెలుగు ప్రేక్షకులకు అంతగా రీచ్ కాలేదని చెప్పవచ్చు. లియో సినిమాకు సెన్సార్ వారు సుమరు 15కు పైగా కట్స్ ఇచ్చారు. ఆ సమయంలో ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ ఇచ్చారు. సెన్సార్ వారు కట్ చేసిన సీన్లు ఉండుంటే ఇంకా బాగుండేది అని విజయ్ ఫ్యాన్స్ ఇప్పటికే పలుమార్లు లియో మేకర్స్‌ను కోరారు. దీంతో లోకేష్ టీమ్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. అభిమానుల కోరుకున్నట్లుగా నవంబర్ 3 నుంచి జీరో కట్స్‌తో లియో సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. కానీ ఈ సినిమా కేవలం 18 ఏళ్లు పూర్తిగా నిండిన వారి కోసం మాత్రమేని షరతు పెట్టారు. కాబట్టి నవంబర్ 3 నుంచి చిన్నపిల్లలతో ఈ సినిమాకు వెళ్తే అనుమతి ఉండదని వారు తెలిపారు. దీనికి ప్రధాన కారణం ఎక్కువగా రక్తపాతం ఉన్న సీన్లు మళ్లీ ఈ సినిమాలో చేర్చుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా జంతు నరబలులు లాంటి సీన్లు ఉన్నాయట... వాటిని మొదట సెన్సార్ వారు అంగీకరించలేదు. ప్రస్తుతం వాటిని ప్రసారం చేయాలంటే A సర్టిఫికెట్ తప్పనిసరి అయింది. ఇప్పుడు ఎలాంటి కట్స్ లేకుండా నవంబర్ 3 నుంచి ఆడియన్స్ ముందుకు రానుంది లియో. కాబట్టి మళ్లీ చూడాలంటే పిల్లలతో కాకుండా 18 ఏళ్లు నిండిన వారు థియేటర్‌కు వెళ్లవచ్చు. By popular demand, #LEO uncut (strictly for ages 18+) is coming to @cineworld cinemas from Friday. The first Tamil film in UK to release with an 18 classification.. 💣🔪🔥🧨🩸 Round two, are you ready? Ticket sales open TOMORROW! 🤜 pic.twitter.com/DfF0FpgkbO — Ahimsa Entertainment (@ahimsafilms) October 31, 2023 -
లియోకు నో సెలబ్రేషన్స్.. ఆ వేడుక జరుగుతుందా?
విడుదలకు ముందు నుంచే వివాదాల్లో చిక్కుకున్న చిత్రం లియో. కారణం విజయ్ హీరోగా నటించడమే? అనే చర్చ జరిగింది. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించాలని నిర్మాతలు భావించారు. అయితే కారణాలేమైనా చివరి క్షణంలో ఆ కార్యక్రమాన్ని రద్దు చేశారు. విజయ్ కథానాయకుడిగా లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో 7 స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన భారీ చిత్రం లియో. త్రిష, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్, దర్శకుడు గౌతమ్ మీనన్, మిష్కిన్ తదతర భారీ తారాగణం నటించిన ఈ చిత్రం ఈనెల 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కాగా ఈ చిత్రం వారంలోనే రూ.461 కోట్లు వసూలు చేసినట్లు నిర్మాత అధికారికంగా వెల్లడించారు. దీంతో లియో చిత్ర విజయోత్సవాన్ని నవంబర్ ఒకటో తేదీన చైన్నెలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో భారీఎత్తున నిర్వహించ తలపెట్టారు. ఇందుకోసం పోలీస్ బందోబస్తు కోరుతూ నిర్మాత ఆ శాఖాధికారులకు లేఖ రాశారు.ఆ లేఖపై పోలీస్ అధికారులు పలు ప్రశ్నలు స్పందిస్తూ నిర్మాతకు తిరిగి లేఖ పంపారు. ముఖ్యంగా లియో చిత్రం విజయోత్సవానికి వచ్చే సినీ ప్రముఖులు ఎందరు?, అభిమానులు ఎందరు? కార్యక్రమాన్ని ఎన్ని గంటల ప్రారంభించి, ఎన్ని గంటలకు ముగిస్తారు? నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఎన్ని కుర్చీలు ఉంటాయి? స్టేడియం నిర్వాహకులు అనుమతి పొందారా? దానికి సంబంధించిన పూర్తి వివరాలను చర్చించిన తరువాతే పోలీస్ బందోబస్తుపై నిర్ణయం తీసుకుంటామని ఆ లేఖలో పేర్కొన్నారు. దీంతో లియో చిత్రం విజయోత్సవ వేడుక జరుగుతుందా? అని విజయ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. -
40 ఏళ్ల బ్యూటీ.. లిప్‌లాక్ సీన్.. ఇంకా అవుట్ కాలేదు..!
హీరోయిన్గా రెండు దశాబ్దాల పాటు కొనసాగడం అంటే ఆషామాషీ కాదు. అది కూడా అగ్రస్థానంలో అది దక్షిణాది సినిమాలో ఒక్క త్రిషకే దక్కిందని చెప్పేయొచ్చు. జోడి అనే తమిళ చిత్రంలో కథానాయకి సిమ్రాన్‌కు స్నేహితురాలిగా రెండు మూడు సన్నివేశాల్లో తళుక్కుమన్న త్రిష దక్షిణాదిలో స్టార్ హీరోలందరి సరసన నటించింది. స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంటుందని అప్పట్లో ఎవరూ ఊహించి ఉండరు. (ఇది చదవండి: ఆ హీరోతో మాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న మిస్ శెట్టి!) అలాంటి త్రిష ఒక్కో చిత్రంతో కన్నడ, హిందూ సినీ అభిమానులను పలకరిస్తుందని కూడా అనుకొని ఉండరు. ముఖ్యంగా తమిళంలో రజనీకాంత్ కమలహాసన్, విజయ్, అజిత్, ధనుష్ వంటి స్టార్ హీరోల సరసన నటించి తన ప్రత్యేకతను చాటుకుంది. అలా 40 ఏళ్ల బ్యూటీ నేటికీ నాటౌట్‌గా నిలిచి హీరోయిన్గా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇటీవలే మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో విక్రమ్, జయంరవి, కార్తీ, ప్రభు, ప్రకాష్‌రాజ్, బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్వారాయ్ వంటి దిగ్గజాలతో కలిసి నటించి యువరాణి కుందవైగా అందం, అభినయంతో తనదే పైచేయిగా అనిపించుకున్నారు. అంతే ఆ తర్వాత త్రిషకు క్రేజీ అవకాశాలు వరుస కడుతున్నాయి. తాజాగా విజయ్ సరసన నటించిన లియో చిత్రం ఇటీవల విడుదలై వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కాగా లియో చిత్రంలో నటుడు విజయ్‌తో లిప్‌లాక్ సన్నివేశంలో నటించి అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చారు. కాగా ఈ చిత్ర ఒక వారం వసూళ్లను నిర్మాత అధికారికంగా విడుదల చేశారు. అది చూసిన త్రిష పోలా అదిరిపోలా అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. (ఇది చదవండి: టైగర్-3 ట్రైలర్.. ఆ ఒక్క ఫైట్ సీన్‌కు అన్ని రోజులు పట్టిందా? ) ఈ సందర్భంగా ఆమె లియో చిత్రంలో నటించిన కొన్ని ఫొటోలను వీడియోను సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. త్రిష ప్రస్తుతం మరో స్టార్ నటుడు అజిత్ సరసన విడాముయర్చి చిత్రంలో నాయకిగా నటిస్తున్నారు. Appadi Podu🔥 pic.twitter.com/5eMWC4LRqU — Trish (@trishtrashers) October 26, 2023 -
Thalapathy Vijay's Leo: దళపతి విజయ్ ‘లియో’ మూవీ స్టిల్స్ (ఫొటోలు)
-
సౌత్‌లో ఈ హీరోయిన్ల రెమ్యునరేషన్ ఎంతంటే.. టాప్‌లో ఎవరో తెలుసా?
సినీరంగంలో ఒక వ్యక్తికి 60 ఏళ్లు వచ్చినా తనదైన మార్కెట్‌తో దూసుకుపోతుంటారు. వారు ఇద్దరు పిల్లలకు తండ్రి అయినా కూడా సినిమా ఛాన్స్‌లు వస్తుంటాయి. ఈ విషయాన్ని స్వయంగా సినీరంగంలో పనిచేసే వారే చాలాసార్లు చెప్తుంటారు. సినిమాల్లో మగవాళ్లలా నటీమణులు కనీసం 40, 50 ఏళ్లు కూడా ఉండలేరు. ఒకవేళ ఉన్నా సపోర్టింగ్ రోల్స్‌లలో నటించేందుకు సిద్ధంగా ఉండాలి. ఒకవేళ వారు పెళ్లి చేసుకుంటే సినిమాల్లో మార్కెట్ పడిపోతుంది. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం కొన్ని సంవత్సరాలుగా నిరంతరం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హీరోయిన్లుగా ఇంకా తమ సత్తా చాటుతున్నారు. త్రిష, నయనతార వంటి నటీమణులను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వీరిద్దరూ 20 ఏళ్లకు పైగా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అంతేకానీ సపోర్టింగ్ రోల్స్ లో నటించడం లేదు. అనేక భారీ బడ్జెట్, పాన్-ఇండియన్ చిత్రాలలో ఇటీవలి కాలంలో హీరోలతో సమానంగా వారు కూడా రెరమ్యునరేషన్ పొందుతున్నారు. వీళ్లు రూ. 10 నుంచి 11 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటారని టాక్. ఒక సినిమాకు రూ. 10 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకున్న తొలి దక్షిణ భారత నటిగా నయనతారకు గుర్తింపు ఉంది. అయితే ఇప్పుడు సౌత్ ఇండియాలో నయనతార కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే నటి మరోకరు ఉన్నారు. ఆమె మరెవరో కాదు నటి త్రిష. ప్రస్తుతం సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటి త్రిష. ప్రస్తుతం నయనతార పారితోషికం కంటే త్రిష ఎక్కువ తీసుకుంటున్నట్లు టాక్. దీనికి ప్రధాన కారణం త్రిష నటనా ప్రావీణ్యంతో పాటు.. 40 ఏళ్లు దాటినా యూత్ ఫుల్ అందం అని చెప్పవచ్చు. తాజాగా మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో నటించినందుకు త్రిష 12 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదే విషయం గూగుల్ కూడా తెలుపుతుంది. త్రిషకు ఇంత భారీ మొత్తం చెల్లించేందుకు నిర్మాతలు కూడా ముందుకొచ్చారని తెలుస్తోంది. దీంతో సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటి త్రిష అని పరిగణనలోకి తీసుకుంటే, నయనతార రెమ్యూనరేషన్ పెద్దగా తగ్గలేదు. జవాన్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నయనతార ఈ సినిమా కోసం 11 కోట్ల పారితోషికం తీసుకుందట. రెమ్యునరేషన్ పరంగా అనుష్క శెట్టి మూడో స్థానంలో నిలిచింది. ఆమె పారితోషికం రూ.6 కోట్లు. అనుష్క ప్రస్తుతం తెలుగు, మలయాళ చిత్రాల్లో నటిస్తోంది. సమంత రూ.6 నుంచి 8 కోట్లు ఒక సినిమాతో సంపాదిస్తున్నట్లు సమాచారం. ఇటీవల విడుదలైన యశోద, శకుంతలం, ఖుషి చిత్రాల తర్వాత సమంత ప్రస్తుతం సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. పూజా హెగ్డే సౌత్ ఇండియన్ బిజీ నటీమణులలో ఒకరు. పూజా హెగ్డే ఒక్కో సినిమాకు రెండున్నర కోట్ల నుంచి ఏడు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. రష్మిక మందన ఒక్కో సినిమాకు రూ. 4 నుంచి 7 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న రష్మిక ప్రస్తుతం హిందీ, తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ బిజీగా ఉంది. జైలర్ ద్వారా మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చిన మిల్కీ బ్యూటీ తమన్నా.. రూ. 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటోంది. కాజల్ అగర్వాల్ ఒక సినిమా కోసం ఒకటిన్నర నుంచి నాలుగు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. నటి ఏడాది క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. నటి రకుల్ ప్రీత్ సింగ్ ఒక్కో సినిమాకు 1.5 నుంచి 3.5 కోట్లు పారితోషికం తీసుకుంటుందట. నివేదికల ప్రకారం, కీర్తి సురేష్ ఒక సినిమాకు రూ.2.5 నుంచి 4 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నారట. మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్‌కు సరైన హిట్ దక్కలేదు. -
పెళ్లి వార్తలపై త్రిష బోల్డ్ ట్వీట్
తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథానాయికగా ఇప్పటికీ వరుస సినిమాలతో సౌత్ ఇండియాలో సందడి చేస్తున్న నటి త్రిష. వయసు పెరుగుతున్న కొద్దీ తరగని అందంతో యువతను మంత్రముగ్ధులను చేస్తోంది. 20 ఏళ్లకు పైగా చిత్రసీమలో తన నట ప్రస్థానం దిగ్విజయంగా కొనసాగుతోంది. తాజాగా త్రిష మలయాళ నిర్మాతను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నటి త్రిష స్పందించింది. చేతినిండా సౌత్ ఇండియాలోని అగ్ర హీరోలతో క్రేజీ ప్రాజెక్ట్‌లతో ఆమె దూసుకుపోతున్న సమయంలో తనపై పెళ్లి పుకారు దావానలంలా వ్యాపిస్తున్న వేళ, దానికి ముగింపు పలుకుతూ త్రిష చేసిన బోల్డ్ ట్వీట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. (ఇదీ చదవండి: డ్రగ్స్ కేసులో నవదీప్‌కు ఊహించని షాకిచ్చిన పోలీసులు) ప్రియమైన 'మీరు మీతో పాటు ఉన్న మీ బృందం ఎవరో మీకు తెలుసు. శాంతంగా ఉండండి. ఇంతటితో ఈ పుకార్లు ఆపండి. చీర్స్! అంటూ తనదైన స్టైల్లో త్రిష తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసింది. గత కొన్ని రోజులుగా హీరో విజయ్‌కి చెందిన లియో సినిమా ప్రమోషన్ కీప్ కామ్‌గా ప్రమోట్ అవుతుండటంతో, నటి త్రిష కూడా అదే పదాలను ఉపయోగించి ఈ ట్వీట్ చేయడం మరింత చర్చనీయాంశమైంది. ఇది విజయ్, అతని బృందానికి వార్నింగ్? ఇస్తున్నావ్ కదా అని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. (ఇదీ చదవండి: పెళ్లి ముందు వరకు నాకు ఆ విషయం తెలియదు: అనసూయ) వరుసగా విజయ్, అజిత్ సినిమాల్లో త్రిష రొమాన్స్ చేయనుంది. ఇది ఎవరికో నచ్చకనే ఆమెపై ఇలాంటి కుట్రలు చేస్తూ.. పుకార్లు పుట్టిస్తున్నారని ప్రచారం జరగుతుంది. గత కొన్ని నెలలుగా త్రిషపై అనేక రూమర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న తరుణంలో ఓపిక పట్టిన నటి త్రిష ఇప్పుడు ఎవరినో ఒకరి టీమ్‌ను తను గుర్తించిన తర్వాతే ఇలా రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది. DEAR “YOU KNOW WHO YOU ARE AND YOUR TEAM”, “KEEP CALM AND STOP RUMOURING” CHEERS! — Trish (@trishtrashers) September 21, 2023 -
తమిళ్ సైమా విజేతలు వీరే.. బెస్ట్ హీరో, హీరోయిన్ ఎవరంటే?
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) 2023 తమిళం, మలయాళ సినిమాలలో తమ సత్తా చాటిన నటీనటులకు సెప్టెంబర్ 16న అవార్డులు ప్రదానం చేశారు. ఇప్పటికే తెలుగు,కన్నడ సినిమాలకు చెందిన అవార్డులు కార్యక్రమం పూర్తి అయిన విషయం తెలిసిందే. దీంతో సైమా అవార్డ్స్ 2023 వేడుక ముగిసింది. తమిళ్ నుంచి విక్రమ్ సినిమాకు గాను కమల్ హాసన్‌కు ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. ఈ సారి త్రిష,అనిరుధ్, కీర్తి సురేష్, మణిరత్నం,మాధవన్ వంటి సూపర్ స్టార్స్‌కు అవార్డ్స్ దక్కాయి. తమిళ చిత్ర సీమలో సైమా విజేతలు.. వారి వివరాలు * ఉత్తమ చిత్రం (తమిళం): (పొన్నియిన్ సెల్వన్ - 1) * ఉత్తమ దర్శకుడు (తమిళం): లోకేష్ కనగరాజ్ (విక్రమ్) * ఉత్తమ నటుడు (తమిళం): కమల్ హాసన్ (విక్రమ్) * ఉత్తమ నటి (తమిళం): త్రిష కృష్ణన్ (పొన్నియిన్ సెల్వన్ -1) * ఉత్తమ నటుడు (క్రిటిక్స్): ఆర్ మాధవన్ (రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్) * ఉత్తమ నటి (క్రిటిక్స్): కీర్తి సురేష్ (సాని కాయిదం) తెలుగులో చిన్ని * ఉత్తమ సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ (విక్రమ్) * ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : రవి వర్మన్ (పొన్నియిన్ సెల్వన్-1) * ఉత్తమ సహాయ నటి : వాసంతి (విక్రమ్) ఏజెంట్ టీనా * ఉత్తమ సహాయ నటుడు (తమిళం): కాళీ వెంకట్ (గార్గి) * ఉత్తమ విలన్: ఎస్.జె.సూర్య (డాన్) * ఉత్తమ హాస్యనటుడు: యోగి బాబు (లవ్ టుడే) * ఉత్తమ గాయకుడు : కమల్ హాసన్ (విక్రమ్) పాతాళ పాతాల * ఉత్తమ గేయ రచయిత: ఇళంగో కృష్ణన్ (పొన్నియిన్ సెల్వన్ - 1) * ఉత్తమ నూతన నిర్మాత : గౌతం రామచంద్రన్ (గార్గి) * ఉత్తమ నూతన దర్శకుడు: ఆర్ మాధవన్ (రాకెట్రీ-ది నంబి ఎఫెక్ట్) * ఉత్తమ నూతన నటుడు: ప్రదీప్ రంగనాథన్ (లవ్ టుడే) * ఉత్తమ నూతన నటి: అదితి శంకర్ (విరుమాన్) * ఎక్స్ట్రార్డినరీ అచీవ్మెంట్ అవార్డు : మణిరత్నం * ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్ : తోట తరణి (పొన్నియిన్ సెల్వన్ - 1) (ఇదీ చదవండి: శ్రావణ భార్గవికి రెండో పెళ్లి.. హల్దీ ఫంక్షన్ ఫోటోలు వైరల్) -
20 ఏళ్ల క్రితం జరిగిన యదార్థ ఘటన ఆధారంగా త్రిష సినిమా
పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో యువరాణి కుందవైగా నటి త్రిష సత్తాచాటారు. అయితే ఆ తరువాత నటించిన హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రం రాంగీ చిత్రం ఆమెను నిరాశపరిచింది. కాగా తాజాగా త్రిష నటించిన ది రోడ్ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఏఏఏ సినిమా సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి అరుణ్ వశీకరన్ కథ, దర్శకత్వం బాధితులను నిర్వహించారు. (ఇదీ చదవండి: లిప్‌లాక్ సీన్‌కు త్రిష ఓకే చెబితే.. హీరోనే వద్దన్నాడు.. కారణం ఇదే!) నటుడు సంతోష్ ప్రతాప్ షబీర్, నటి మియా జార్జ్, షబీర్ వేల రామమూర్తి ఎం ఎస్ భాస్కర్, వివేక్ ప్రసన్న తదితరులు ముఖ్యపాత్ర పోషించిన ఈ చిత్రానికి శ్యామ్ సి ఎస్ సంగీతాన్ని, వెంకటేష్ జీకే చాయాగ్రహణం అందించారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది గత 20 ఏళ్ల క్రితం మదురైలో జరిగిన యదార్థ ఘటన ఆధారంగా రూపొందించిన చిత్రమని చెప్పారు. ఇందులో నటి త్రిష ఏడేళ్ల పాపకు తల్లిగా, జర్నలిస్టుగా నటించారని చెప్పారు. తనకు అన్యాయం చేసిన వారిపై త్రిష ఎలా పగ తీర్చుకున్నార నేదే ఈ చిత్రీ కథ అని చెప్పారు. కాగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ది రోడ్ చిత్రాన్ని అక్టోబర్ 6వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారిక పూర్వకంగా వెల్లడించారు. కాగా అదే విధంగా అక్టోబర్ 19వ తేదీన విజయ్, త్రిష జంటగా నటించిన చిత్రం తెరపైకి రానున్నది. మొత్తం మీద త్రిష నటించిన చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ ఒకే నెలలో తెరపైకి రానున్నాయన్న మాట. కాగా త్రిష ప్రస్తుతం విజయ్‌తో నటిస్తున్న లియో చిత్రాన్ని పూర్తి చేసి తెలుగు, మలయాళం భాషల్లో ఒక్కో చిత్రం చేస్తున్నారు. -
లిప్‌లాక్ సీన్‌కు త్రిష ఓకే చెబితే.. హీరోనే వద్దన్నాడు.. కారణం ఇదే!
సౌత్ సినీ ప్రపంచంలో త్రిష ఒక అద్భుతమైన తార. సుదీర్ఘ విరామం తర్వాత త్రిష మళ్లీ మళ్లీ యాక్టివ్‌గా మారింది. త్రిష చివరిగా తెరపైకి వచ్చిన సినిమా పొన్నియిన్ సెల్వన్. సిరీస్‌లోని రెండు చిత్రాలలో త్రిష తన నటనతో ప్రశంసలు అందుకుంది. త్రిష- విజయ సేతుపతి జంటగా నటించిన 96 సినిమా ఇటీవలి కాలంలో వచ్చిన ఉత్తమ రొమాంటిక్ చిత్రాలలో ఒకటిగా చోటు దక్కించుకుంది. ఆ తర్వాత ఈ సినిమా తెలుగు, కన్నడ భాషల్లోకి రీమేక్ చేయబడింది. ఈ సినిమా ద్వారా రామ్ పాత్రలో విజయ్ సేతుపతి నటించగా జానుగా త్రిష ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్రిష- విజయ్ సేతుపతి తమ నటనతో రామ్- జానుగా గుర్తింపు పొందారు. తమిళ్లో వచ్చిన ఈ సినిమాను చూసిన వారెవరూ వారిద్దరి పాత్రల్ని ఎప్పటికీ మరిచిపోరని చెప్పవచ్చు. (ఇదీ చదవండి: కోలీవుడ్‌ను నమ్మి క్లీన్ బోల్డ్ అయిన 5 మంది స్టార్ క్రికెట్ ఆటగాళ్లు) సినిమా క్లైమాక్స్ సీన్లో అత్యంత హృదయాన్ని హత్తుకునే సన్నివేశం ఉంటుంది. ఇద్దరూ ఒకరికొకరు వీడ్కోలు పలికిన సన్నివేశం ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో మెదులుతూనే ఉంది. ఎయిర్‌పోర్ట్‌లో ఆ సీన్‌ని పరిశీలిస్తే.. త్రిష, విజయ్ సేతుపతిలు ముద్దుల సీన్ లేకుండా కనిపించారు. బదులుగా, వారు తమ ముఖాలపై చేతులు ఉంచారు. అయితే స్క్రిప్ట్ ప్రకారం విజయ్ సేతుపతి, త్రిష ఈ సన్నివేశంలో లిప్ లాక్ సీన్ చేయాల్సి ఉంది. అందుకు త్రిష కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే సినిమాలో మాత్రం ఈ సీన్ మారిపోయింది. దానికి కారణం విజయ్ సేతుపతి. ఈ సినిమాలో కిస్సింగ్ సీన్స్ చేయడానికి విజయ్ సేతుపతి సంకోచించాడు. ఆ సీన్ చేయడానికి ఆయన అంగీకరించలేదు. ఎందుకంటే విజయ్ సేతుపతి తన సినిమాల్లో ముద్దుల సన్నివేశాలు చేయడు. ఇదే విషయాన్ని ఆయన డైరెక్టర్లకు ముందే చెబుతాడట. సేతుపతిలాగే అజిత్, సూర్య, శివకార్తికేయన్ వంటి నటులు కూడా లిప్ లాక్ సీన్స్ చేయడానికి నిరాకరించే నటులే. పొన్నియిన్ సెల్వన్ సిరీస్ తర్వాత విజయ్‌తో త్రిష నటిస్తున్న చిత్రం లియో కాగా విజయ్ సేతుపతి బాలీవుడ్ చిత్రం జవాన్ విజయంతో దూసుకుపోతున్నాడు. -
అతను అలా ప్రవర్తించినా త్రిష భరించింది.. ఎందుకంటే: సినీ నటి
తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథానాయికగా ఇప్పటికీ వరుస సినిమాలతో హీరోయిన్ త్రిష బిజీగా ఉన్నారు. 40 ఏళ్ల వయసు దాటినా తరగని అందంతో యువతను మంత్రముగ్ధులను చేస్తోంది. ఆమె కీలక పాత్రలో నటించిన 'పొన్నియిన్ సెల్వన్-2'తో మరోసారి తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. ప్రస్తుతం కోలీవుడ్ టాప్ హీరో విజయ్ సినిమాకు ఆమె ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవితో కూడా మరోసారి కనిపించనుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఆమె చేతిలో అజిత్ సినిమాతో పాటు సౌత్ ఇండస్ట్రీ నుంచి అరడజనుకు పైగా ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఇదిలా ఉంటే త్రిష గురించి ప్రముఖ తమిళ నటి, బిగ్‌బాస్ ఫేం మీరా మీథున్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. త్రిష గురించి మీరా మీథున్ కామెంట్స్ కోలీవుడ్‌లో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీరా మిథున్.. హీరోయిన్ త్రిష గురించి ఇలా చెప్పింది. 'త్రిష నటిస్తున్న ఓ సినిమాలో నేను కూడా చిన్న పాత్రలో నటించాను.. అప్పుడు సెట్లో ఓ ప్రముఖ నటుడు త్రిషను తాకకూడని చోట పదేపదే టచ్ చేశాడు. అది నాకు ఏమాత్రం నచ్చలేదు. ఆ సందర్భంలో త్రిష కూడా ఇబ్బంది పడింది. ఎందుకంటే ఇలాంటి చర్య త్రిషకి కూడా ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ కోపం వచ్చి అరుస్తే సినిమా అవకాశం పోతుందని మౌనం వహించింది. ఇండస్ట్రీలో ఓ ప్రముఖ హీరోయిన్‌కే ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. నాలాంటి సాధారణ నటీమణుల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి.' అని మీరా తెలిపింది. (ఇదీ చదవండి: అందరిలా నేనెందుకు ఆనందంగా లేనంటే: టాప్ హీరోయిన్) మీరా మిథున్ ఇదివరకే నటి త్రిషపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. త్రిషకు కుల పిచ్చి ఉందని దాంతో చాలా సినిమా అవకాశాలు కోల్పోయానని మీరా ఫైర్ అయింది. మళ్లీ ఇప్పుడు త్రిష గురించి ఇలాంటి కామెంట్లు చేయడంతో కోలీవుడ్‌లో వైరల్ అవుతున్నాయి. త్రిషను టచ్ చేసిన ఆ ప్రముఖ నటుడి పేరును ఆమె రివీల్ చేయలేదు. మరీ ఆమె చేసిన వ్యాఖ్యల్లో నిజం ఎంతవరకు ఉందో తెలియాల్సి ఉంది. -
40 ఏళ్ల వయసులో పెళ్లిపై దృష్టి పెట్టిన త్రిష..
తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథానాయికగా ఇప్పటికీ వరుస సినిమాలతో సౌత్ ఇండియాలో సందడి చేస్తున్న నటి త్రిష. వయసు పెరుగుతున్న కొద్దీ తరగని అందంతో యువతను మంత్రముగ్ధులను చేస్తోంది. ఆమె కీలక పాత్రలో నటించిన 'పొన్నియిన్ సెల్వన్' నుంచి వచ్చిన రెండు భాగాలు కూడా ప్రేక్షకులను అలరించాయి. మొదట 'లేస.. లేసా' అనే తమిళ చిత్రంతో కథానాయకిగా పరిచయమైన ఈ సంచలన నటి అక్కడ 'సామి' చిత్రంతో కమర్షియల్ సినిమాల హీరోయిన్ లిస్టులో చేరిపోయారు. (ఇదీ చదవండి: మాపై ట్రోల్స్ చేస్తుంది ఆ 'స్నేక్' బ్యాచ్‌నే: మంచు విష్ణు) ఆ తర్వాత వరుసగా సౌత్ ఇండియా అన్ని భాషల్లో నటిస్తూ అగ్ర నటి స్థాయికి ఎదిగారు. అలా 20 ఏళ్ల తన నట ప్రస్థానం దిగ్విజయంగా కొనసాగుతోంది. మణిరత్నం దర్శకత్వంలో 'పొన్నియిన్ సెల్వన్'లో యువరాణి కుందవైగా కనిపించి మరోసారి తన సత్తాను చాటిన త్రిష సమీప కాలంలో తన 40వ పుట్టినరోజు వేడుకలను స్నేహితులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు . కాగా నటిగా కెరియర్ సక్సెస్ బాటలో పయనిస్తున్న వ్యక్తిగత జీవితం మాత్రం ఇప్పటికీ ఆమెను త్రిషపై ప్రేమ వదంతులు చాలానే దొర్లుతున్నాయి. ఒకసారి ఈమె పెళ్లి విషయంలో నిశ్చితార్థం వరకు వెళ్లి ఆపై ముందుకు సాగలేదు. ఇదీ చదవండి: చిరంజీవిని అలా అంటుంటే చాలా బాధగా ఉంది: ప్రముఖ హీరో) ఇటీవల ఒక భేటీలో ఈమె పెళ్లి బంధంపై స్పందిస్తూ తన స్నేహితులు కొందరు పెళ్లి చేసుకుని కొద్ది ఏళ్లకే విడాకులు గురించి మాట్లాడుకోవడం తన చెవికి చేరిందన్నారు. అందుకే తనతో జీవితాంతం సంతోషంగా కలిసి పయనించే వ్యక్తి తారసపడితేనే పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. కాగా త్రిష ఇటీవల తన ఇన్ స్ట్రాగామ్‌లో వరుసగా తాను పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఆమెకు పెళ్లిపై దృష్టి మళ్లినట్లుందా..? అంటూ నెటిజన్లు ఆట పట్టిస్తున్నారు. కాగా ప్రస్తుతం త్రిష నటుడు విజయ్ సరసన లియో చిత్రంలో నటించారు. సుమారు 14 ఏళ్ల తర్వాత విజయ్, త్రిష కలిసి నటించిన చిత్రం ఇది. తాజాగా అజిత్‌తో విడాముయిర్చి చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. -
త్రిషకు మరో అవకాశం ఇచ్చిన సూపర్ హిట్ డైరెక్టర్
నాలుగుపదుల వయస్సులోనూ త్రిషకు అవకాశాలు వెల్లవెత్తుతున్నాయి. పొన్నియిన్ సెల్వన్ చిత్రానికి ముందు అపజయాలతో కొట్టుమిట్టాడుతున్న ఈ చైన్నె సుందరికి మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ చిత్రంతో బిగ్ బ్రేక్ ఇచ్చారు. దీనిని రెండు భాగాలుగా త్రిష అందాలను మెరుగుపరచడమే కాకుండా అమెలోని అద్భుతమైన అభినయాన్ని బయటకు తీశారు. (ఇదీ చదవండి: 'మేమిద్దరం ఎలాంటోళ్లమంటే.. ఆ హీరోయిన్ థైస్ చూసేందుకు కారులో వెళ్లాం') ఆ చిత్రంలోని ఘటనకు ప్రశంసల వర్షం కురిపించుకున్న త్రిష ఆ తరువాత అవకాశాల జోరులో మునిగితేలుతున్నారు. ప్రస్తుతం విజయ్ సరసన లియో చిత్రంలో నటించిన ఈ బ్యూటీ తదుపరి అజిత్ కథానాయకుడిగా నటించనున్న విడాముయిర్చి చిత్రంలో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు సుదీర్ఘ విరామం తరువాత తెలుగులో చిరంజీవితో జతకట్టే అవకాశం వరించింది. మరికొన్ని నూతన అవకాశాలు ఈ అమ్మడి కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో త్రిషకు దర్శకుడు మణిరత్నం నుంచి మరో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన మెద్రాస్ టాకీస్ పతాకంపై చిత్రాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ఆయన నిర్మించే చిత్రంలో త్రిషను కథానాయకిగా ఎంపిక చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
మళ్లీ ఒక రౌండ్ కొడుతున్న త్రిష...
సౌత్ ఇండియా సినీ పరిశ్రమలో లక్కీ హీరోయిన్ ఎవరంటే మొదటగా త్రిష పేరునే చెప్పాలి. నటిగా ఈమె వయసు 20 ఏళ్లు. పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నా, నటిగా మాత్రం ఈమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అపజయాలతో సతమతమవుతున్నప్పుడల్లా ఒక మంచి విజయం వచ్చి ఈమెను మళ్లీ పూర్వ వైభవానికి తీసుకెళ్తోంది. ఇటీవల పొన్నియిన్ సెల్వన్ చిత్రం విషయంలో కూడా ఇదే జరిగింది. అంతకుముందు వరుసగా ప్లాపులు వెంటాడుతున్న త్రిషకు.. ఈ చిత్రంతో ఒక్కసారిగా మళ్లీ టాప్‌లోకి దూసుకొచ్చింది. ఇప్పుడు మళ్లీ దక్షిణాది చిత్రాలలో ఒక రౌండ్ కొడుతోంది. (ఇదీ చదవండి: Salaar: అల్లు అరవింద్ బిగ్ ప్లాన్.. ఇది జరుగుతుందా?) ప్రస్తుతం తమిళంలో విజయ్ సరసన లియో చిత్రంలో నటిస్తున్న త్రిష త్వరలో ప్రారంభం కానున్న అజిత్ చిత్రంలోనూ ఈమెనే నాయకి అనే ప్రచారం జరుగుతుంది. కాగా తెలుగులో చాలా గ్యాప్ తర్వాత మరోసారి చిరంజీవితో జతకట్టే అవకాశం త్రిషను వరించింది. అదేవిధంగా మలయాళంలోను మరో అవకాశం తలుపు తట్టిందనే ప్రచారం జరుగుతోంది. త్రిష చాలా కాలం క్రితం హే జూడ్ అనే మలయాళ చిత్రంలో నటించింది. (ఇదీ చదవండి: స్టార్ హీరో తనయుడి వేధింపులు? స్పందించిన బేబమ్మ) ఆ తర్వాత మోహన్ లాల్‌కు జంటగా రామ్ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం ప్రారంభమై మూడేళ్లు గడిచిన ఇంకా పూర్తికాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో త్రిషను తాజాగా మరో అవకాశం వరించిందని సమాచారం. ఈమెను నటుడు టోవినో థామస్ సరసన నటింపజేయడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఈ చిత్రం త్వరలో సెట్ పైకి వెళ్లనుందని సమాచారం. -
త్రిష VS శ్రీలీల ఫుల్ డిమాండ్
-
త్రిషకు వరుస ఛాన్సులు.. ఈసారి ఏకంగా ధనుష్‌తో జోడీ!
కోలీవుడ్‌లో స్టార్ హీరోలకు హీరోయిన్ త్రిష ఒక్కరే ఆప్షన్‌గా మారారా? ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది. ఇంతకు ముందు ప్లాపుల్లో కూరుకుపోయిన ఈ చెన్నై చిన్నది ఒక్క హిట్ కోసం ఎదురు చూశారు. ఆ సమయంలో దర్శకుడు మణిరత్నం ఆపద్భాందవుడిగా మారారు. పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో యువరాణి కుందవై పాత్రలో నటించే అవకాశం కల్పించారు. ఆ అవకాశాన్ని త్రిష చాలా బాగా సద్వినియోగం చేసుకున్నారనే చెప్పాలి. దీంతో ఇప్పుడు కోలీవుడ్‌లో ఈమె జపమే వినిపిస్తోంది. కమల్ హాసన్, విజయ్, అజిత్, తాజాగా ధనుష్‌కు కూడా త్రిషనే ఏకైక ఆప్షన్‌గా కనిపిస్తోంది. ప్రస్తుతం విజయ్‌కు జంటగా లియో చిత్రంలో నటిస్తున్న ఈ భామ తర్వాత అజిత్ సరసన విడా ముయర్చి చిత్రంలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ తరువాత కమల్ హాసన్ 234వ చిత్రంలోనూ ఈ అమ్మడే నాయకి అనే టాక్ వినిపిస్తోంది. కాగా తాజాగా ధనుష్ సరసన మరోసారి జతకట్టే అవకాశం ఈ బ్యూటీ తలుపు తట్టినట్లు సమాచారం. ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ చిత్రంలో నటిస్తున్న ధనుష్ తర్వాత స్వీయ దర్శకత్వంలో భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనున్న ఇందులో ముఖ్యపాత్రల్లో ఎస్జే.సూర్య, సందీప్ కిషన్, విష్ణు విశాల్, కాళిదాస్ జయరామ్, నటి దుషారా విజయన్ నటించనున్నట్లు ప్రచారంలో ఉంది. తాజాగా ఇందులో ధనుష్‌కు జంటగా త్రిషను నటింపచేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తెలిపింది. ఈమె ఇంతకు ముందు కొడి చిత్రంలో ధనుష్‌కు జతగా నటించారన్నది గమనార్హం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కాగా ఈ భారీ చిత్రానికి ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందించనున్నారు. చదవండి: అలా చేయడంతో అందరూ ప్రెగ్నెన్సీ అనుకున్నారు: హీరోయిన్ -
వీడియో: కొత్త కథతో వస్తున్న 'త్రిష'..
-
Trisha Krishnan: రోజురోజుకూ మరింత గ్లామర్ పెంచుతున్న త్రిష
Trisha Krishnan: రోజురోజుకూ మరింత గ్లామర్ పెంచుతున్న త్రిష -
త్రిష కృష్ణన్ Vs నయనతార
-
పొన్నియిన్ సెల్వన్-2లోని ఫస్ట్ సాంగ్ విన్నారా?
ఆగనందే.. ‘ఆగనందే ఆగనందే.. మోవి నవ్వుతోందే.. మోవి నవ్వే.. మోవి నవ్వే.. మోము నవ్వుతోందే.. మోము నవ్వే.. మోము నవ్వే.. మాను నవ్వుతోందే’ అని పాడుతున్నారు యువరాణి కుందై. ప్రియుడు వల్లవరాయన్ వందియ దేవన్ కోసమే ఈ పాట. విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష తదితర భారీ తారాగణంతో మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ‘పొన్నియిన్ సెల్వన్2’లోని పాట ఇది. చోళ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కుందవైగా త్రిష, వందియ దేవన్‌గా కార్తీ నటించారు. ఈ ఇద్దరి మధ్య సాగే ‘ఆగనందే ఆగనందే మోవి నవ్వుతోందే..’ పాట పూర్తి లిరికల్ వీడియోను సోమవారం విడుదల చేశారు. ఏఆర్ రెహమాన్ స్వరపరచిన ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించగా శక్తి శ్రీ గోపాలన్ పాడారు. ‘పొన్నియిన్‌సెల్వన్’కి సీక్వెల్‌గా రూపొందిన రెండో భాగం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏప్రిల్ 28న విడుదల కానుంది. -
గమ్యం చేరని ప్రేమ.. బ్రేకప్ చెప్పుకున్న హీరోహీరోయిన్స్..
'నే తొలిసారిగా కలగన్నదీ నిన్నే కదా..', 'ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్థిని..', 'నువ్వూనేను జంట.. టాక్ ఆఫ్ ద టౌను అంట..', 'అహ నా పెళ్లి అంట, ఓహొ నా పెళ్లి అంట.. నీకునాకు పెళ్లంట టాంటాంటాం..', 'ఏకాకై వెళుతున్నా.. పిలవద్దే పోమ్మాపో..' ఈ ఐదు పాటలతో ఏం చెప్పబోతున్నామో మీకీపాటికే అర్థమైపోయుంటుంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా కొందరు తొలిచూపులోనే లవ్‌లో పడతారు. మరికొందరు అవతలి వారి చూపుల్లో, మాటల్లో మ్యాజిక్ వెతుక్కుని మరీ ప్రేమలో పడిపోతుంటారు. ఆ కొంటెచూపులు, ప్రేమవలపులు బానే ఉంటాయేమో కానీ అటుపక్కవారిని ఒప్పించాలిగా. ప్రేమ అనే పరీక్షలో కొందరు ఈజీగా మరికొందరు ఆలస్యంగా పాస్ అవుతుంటారు. కానీ కొద్దిమంది మాత్రమే ఫెయిల్ అవుతుంటారు. ఆ తర్వాత వారు నిద్రలోనూ ఒకరిగురించి ఒకరు కలవరించడం మొదలవుతుంది. పెళ్లి అంటూ నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారు. ఇంతలోనే కొందరికి అది ప్రేమ కాదని అర్థమై బ్రేకప్ చెప్పుకుంటారు. మరికొందరు ఎంగేజ్మెంట్ దాకా వెళ్లి మరీ దాన్ని క్యాన్సిల్ చేసుకుంటారు. సినీపరిశ్రమలో లవ్ బ్రేకప్, ఎంగేజ్మెంట్ రద్దు చేసుకున్న తారలెవరో ఓసారి చూసేద్దాం.. రష్మిక మందన్నా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్గా ఎదిగింది. కిరిక్ పార్టీ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ అదే సినిమాలో హీరోగా నటించిన రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. వీరిద్దరూ ఉంగరాలు కూడా మార్చుకున్నారు. కానీ ఏడడుగులు వేసేలోపే ఎవరిదారి వారు చూసుకున్నారు. మెహరీన్ హీరోయిన్ మెహరీన్ యువ రాజకీయ నాయకుడు భవ్య భిష్ణోయ్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరగడమే కాక ఫోటోషూట్లు కూడా చేసుకున్నారు. గ్రాండ్‌గా ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ అంతలోనే అభిప్రాయబేధాలు రావడంతో పెళ్లి క్యాన్సిల్ అయింది. అఖిల్ అక్కినేని అఖిల్ శ్రియ భూపాల్‌ను ప్రేమించాడు. ఆమె కూడా అతడి ప్రేమకు పచ్చజెండా ఊపింది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డాక తాము అడ్డు చెప్పేదేముందనుకున్న పెద్దలు పెళ్లి చేస్తామన్నారు. ఎంతో వైభవంగా నిశ్చితార్థం కూడా జరిపారు. కానీ వీరి పెళ్లి కూడా మధ్యలోనే ఆగిపోయింది. త్రిష హీరోయిన్ త్రిష వ్యాపారవేత్త వరుణ్ మానియన్‌తో ప్రేమలో పడింది. ఇద్దరూ ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. కానీ పెళ్లికి ముందే ఇద్దరూ విడిపోయారు. నయనతార మొదట శింబుతో తర్వాత ప్రభుదేవాతో ప్రేమాయణం నడిపిందంటూ ప్రచారం జరిగింది. కానీ తర్వాత విఘ్నేశ్ శివన్‌ను ప్రేమించి పెళ్లాడింది. ఇలియానా ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూతో బ్రేకప్ చెప్పింది. మరోవైపు సమంత, నాగచైతన్యలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, కానీ విడిపోయారు. మంచు మనోజ్- ప్రణతి వివాహబంధం కూడా ఎంతోకాలం కొనసాగలేదు. అల్లు శిరీష్, అడివి శేష్, సందీప్ కిషన్, విశ్వక్సేన్.. ఇలా చెప్పుకుంటూ పోతే లవ్ బ్రేకప్ అయినవాళ్లు చాలామందే ఉన్నారు! చదవండి: నాన్న చివరి కోరిక నెరవేర్చే క్రమంలో అమ్మ చనిపోయింది: ఘంటసాల తనయుడు -
Vijay67: లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో విజయ్ కొత్త చిత్రం ప్రారంభం (ఫొటోలు)
-
త్రిష కాశ్మీర్ పర్యటన అందుకేనా?
తెలుగు, తమిళం భాషలో అగ్ర కథానాయకిగా రాణించిన నటి త్రిష. ఒక దశలో లేడీ ఓరియంటెడ్ స్థాయికి ఎదిగిన ఈ బ్యూటీ ఆ తరహా చిత్రాలు ఆశించిన విజయాలను సాధించకపోవడంతో కెరీర్ డౌన్ ఫాల్ అయ్యింది. అలా వరుస అపజయాలతో సతమతమవుతున్న త్రిష పొన్నియిన్ సెల్వన్ చిత్రంతో లైమ్ లైట్లోకి వచ్చారు. దీంతో కొత్తగా అవకాశాలు తలుపు తడుతున్నాయి. తాజాగా విజయ్ సరసన కొత్త చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారు. ఇది విజయ్‌కి 67వ చిత్రం. మానగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్ వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ఇది. అదే విధంగా మాస్టర్ వంటి హిట్ చిత్రం తర్వాత విజయ్, లోకేష్ కనకరాజ్‌ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ చిత్రం. జనవరి 2వ తేదీ నుంచి చెన్నైలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని 7స్క్రీన్ స్టూడియో పతాకంపై ఎస్.ఎస్.లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. విజయ్ డాన్‌గా నటించనున్నట్లు, ఏడు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ నటులు ముఖ్య పాత్రలు పోషించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో ఒక పాత్రను యాక్షన్ కింగ్ అర్జున్ నటించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలను చిత్ర వర్గాలు సోమవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించారు. దీనికి అనిరుద్ సంగీతాన్ని, మనోజ్ పరమహంస చాయాగ్రహణంను అందిస్తున్నారు. కాగా ఇందులో త్రిష కథానాయకగా నటిస్తున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. కాగా చిత్రం షూటింగ్ తదుపరి కాశ్మీర్లో జరగనున్నట్లు, ఇందులో పాల్గొనడానికి త్రిష మంగళవారం ఉదయం కాశ్మీర్‌కు బయలుదేరినట్లు సమాచారం. చెన్నై విమానాశ్రయం నుంచి ఈమె వెళ్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
త్రిషను ఆడేసుకుంటున్న నెటిజన్లు
నాలుగు పదుల వయసులోనూ అందంతో అలరిస్తోన్న హీరోయిన్స్‌లో త్రిష ఒకరు. ఇటీవలే పొన్నియన్ సెల్వన్‌లో కుందవై పాత్రతో ఆకట్టుకున్న ఆమె రాంగీ సినిమాలో యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టింది. ప్రస్తుతం ఆమె విజయ్ 67, అజిత్ 62వ చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది. కెరీర్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఏ ఫుడ్ ఇష్టమన్న ప్రశ్నకు సౌత్ ఇండియన్ హోమ్ ఫుడ్.. అందులోనూ బ్రాహ్మణుల ఇంటి భోజనం నాకెంతో ఇష్టం అని చెప్పింది. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. ఏ ఫుడ్ ఇష్టమన్న ప్రశ్నకు మధ్యలో కులాన్ని తీసుకురావడం అవసరమా?, నీ కులాన్ని నొక్కి చెప్పి బిల్డప్ ఇవ్వడమెందుకో? అని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. మరికొందరేమో తనకు అనిపించింది చెప్పడంలో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. ప్రతిదానికీ సెలబ్రిటీలను విమర్శించడమే పనైపోయిందని తిట్టిపోస్తున్నారు త్రిష ఫ్యాన్స్. చదవండి: కోపమొస్తే తల్లి అని కూడా చూడను, తిట్టేస్తా ఎన్టీఆర్ కనుబొమ్మ కూడా నటిస్తుంది: రాజమౌళి -
కాంగ్రెస్‌లోకి చేరుతుందంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన త్రిష
స్టార్ హీరోయిన్ త్రిష పొలిటికల్ ఎంట్రీపై గత కొన్నిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఆమె కాంగ్రెస్ పార్టీలోకి చేరుతుందంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇదివరకే ఈ విషయంపై త్రిష తల్లి ఉమా కృష్ణన్ క్లారిటీ ఇచ్చినా రూమర్స్‌కి తెరపడలేదు. పొన్నియిన్ సెల్వన్ తర్వాత వరుస అవకాశాలు వస్తున్నా ఆపర్స్‌ను తిరస్కరిస్తుండటంతో త్వరలోనే ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇస్తుందంటూ వార్తలు ఊపందుకున్నాయి. తాజాగా ఈ వార్తలపై త్రిష స్పందించింది. ప్రస్తుతానికి తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని తేల్చి చెప్పింది. కాంగ్రెస్‌లో చేరుతున్నానని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, అయినా సోషల్ మీడియాలో వస్తున్న రూమరర్లపై స్పందించాల్సిన అవసరం తనకు లేదని తేల్చి చెప్పింది. ఇప్పుడు తన ఫోకస్ అంతా సినిమాలపైనే ఉందని పేర్కొంది. ఇదిలా ఉంటే త్రిష నటింఇచన రాంగీ సినిమా త్వరలోనే విడుదల కానుంది. -
ఇండస్ట్రీలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న త్రిష.. ఇప్పటికీ అదే క్రేజ్
సినీ రంగంలో 70 ఏళ్ల హీరోలు కూడా 20 ఏళ్ల హీరోయిన్లతో డ్యూయెట్లు పాడుతుంటారు. అయితే హీరోయిన్లకు 30 ఏళ్లు దాటినా, వివాహం చేసుకున్నా పక్కన పెట్టేస్తారు. ఆ తర్వాత వారికి అక్క, వదిన, అమ్మ పాత్రలు ఇస్తుంటారు. అయితే ఇటీవల ఆ పరిస్థితి మారిందని చెప్పాలి. 30 ఏళ్లు దాటినా, వివాహం చేసుకున్నా పాపులారిటీ కలిగిన హీరోయిన్లకు అవకాశాలు వస్తున్నాయి. నటి త్రిష ఈ కోవకు చెందినదే. ఈ చెన్నై బ్యూటీ నటిగానే 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2002 సంవత్సరంలో మౌనం పేసి యది చిత్రంలో సూర్యకు జంటగా హీరోయిన్గా పరిచయం అయింది. ఆ తర్వాత తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ క్రేజీ కథానాయికగా రాణిస్తోంది. ఇటీవల ఈమె నటించిన పొన్నియన్ సెల్వన్ చిత్రంలోని కుందవై పాత్రకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం మలయాళంలో మోహన్‌లాల్‌కు జంటగా రామ్ అనే చిత్రంలో నటిస్తోంది. ఇక తమిళంలో త్రిష నటించిన గర్జనై, చతురంగ వేటై, రాంగీ చిత్రాలు విడుదల కావాల్సి ఉన్నాయి. తాజాగా ది రోడ్ అనే హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రంలో నటిస్తోంది. కాగా నటిగా రెండు శతాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా త్రిష తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపే విధంగా ‘ప్రియమైన త్రిషయర్స్ మనలో నేనూ ఒకరిగా ఉండగలగడం గర్వంగా ఉంది. మనకు ఎప్పటికీ కృతజ్ఞతలు. మన ఉన్నతికి మీరు చేసే అన్నింటికీ ధన్యవాదాలు’. అంటూ త్రిష తననూ అభిమానులతో కలుపుకుని ట్విట్టర్లో పేర్కొంది. -
త్రిష పారితోషికం డబుల్.. ఒక్కో సినిమాకు ఎన్నికోట్లో తెలుసా?
అదృష్టం ఎవరిని ఎప్పుడు? ఎలా? వరిస్తుందో చెప్పలేం. అదృష్టం కలిసొస్తే ప్రతిభ అనేది రెండోది అవుతుంది. ముఖ్యంగా సినీ రంగంలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. నటి త్రిష తమిళం, తెలుగు భాషల్లో నటించిన తొలి చిత్రాలే విజయవంతం అయ్యాయి. దీంతో అదృష్టవంతురాలు అని రుజువు చేసుకుంది. ప్రతిభను పక్కన పెడితే తన అందచందాలతో చాలాకాలం క్రేజీ కథానాయకిగా రాణించింది. లేడీ ఓరియంట్ కథా చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత త్రిష అదృష్టం కాస్త పక్కదారి పట్టింది. ఈమె నటించిన హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలేవీ విజయం సాధించలేదు. అదే సమయంలో వ్యక్తిగతంగానూ ఒడిదుడుకులు ఎదుర్కొంది. అది ఆమె కెరీర్‌పై ప్రభావం పడింది. అయితే ఇటీవల దర్శకుడు మణిరత్నం త్రిష గ్రహణం విడిపించేలా పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో నటించే అవకాశాన్ని కల్పించారు. ఆ చిత్రం ఘన విజయం సాధించింది. భారీ తారాగణం మధ్య ఆమె పోషించిన కుందవై పాత్రకు ప్రశంసలు అందుకుంది. అంతే త్రిషకు మళ్లీ పూర్వ వైభవం మొదలైంది. మళ్లీ అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. అదే విధంగా పలు కారణాలతో నిలిచిపోయిన చిత్రాల్లోనూ కదలికలు మొదలవుతున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోలతో జతకట్టే అవకాశాలు త్రిష తలుపు తడుతున్నాయి. అలా అజిత్ తాజా చిత్రంలోనూ, విజయ్ తదుపరి చిత్రంలోనూ ఈ ఎవర్ గ్రీన్ బ్యూటీ నటించడానికి సిద్ధమవుతోంది. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏమిటంటే త్రిష పొన్నియిన్ సెల్వన్ పార్టు 1, 2 చిత్రాలకు కలిపి రూ.2 కోట్లు పారితోషికం అందుకుంది. తాజాగా ఆమె తన పారితోషికాన్ని పెంచేసిందనే ప్రచారం ఇప్పటికే సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. కాగా విజయ్ 67వ చిత్రాన్ని నిర్మాత లలిత్‌కుమార్ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో కథానాయకిగా నటించనున్న త్రిష రూ.3 కోట్లు అడిగినట్లు సమాచారం. అయితే నిజమెంతో తెలియదు గాని నటుడు విజయ్ ఆమెను రూ.4 కోట్లు అడగమని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్న సామెత ప్రకారం హీరోనే చెబితే హీరోయిన్ చెలరేగిపోదూ! నిర్మాత ఇవ్వకపోయినా! -
త్రిష పారితోషికం డబుల్.. ఒక్కో సినిమాకు ఎన్నికోట్లో తెలుసా?
ఒక సక్సెస్ వస్తే హీరో హీరోయిన్లు ముందుగా చేసే పని పారితోషికం పెంచడమే. ఇక ఈ విషయంలో నటి త్రిష ఫాస్ట్‌గా ఉంటుందని చెప్పవచ్చు. అందుకు ఉదాహరణ తాజా పరిణామాలే. 40వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఈ భామ 23 ఏళ్లుగా కథానాయికగా నటిస్తున్నారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో నటించి బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్నారు. అలాగే పలు విజయవంతమైన చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఈ అమ్మడు నటించిన హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాలు ఒకటి కూడా సక్సెస్ కాలేదు. అంతేకాదు ఈమె సరైన హిట్ చూసి ఐదేళ్లు దాటింది. 2018 తర్వాత త్రిష నటించిన ఒక చిత్రం కూడా సక్సెస్ కాలేదు. దీంతో త్రిషకు పే డౌట్ నటి అనే ముద్రవేశారు. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు మణిరత్నం పుణ్యమా అంటూ సక్సెస్‌తో పాటు మంచి పేరు వచ్చేశాయి. అవును పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో యువరాణి కుందవైగా నటి త్రిష చాలా హుందాగా నటించారు. దీంతో ఈమెకు ప్రశంసల జల్లు కురిసింది. గత కొంతకాలంగా నత్తనడక నడుస్తున్న త్రిష సినీ కెరీర్ ఇప్పుడు జెట్ స్పీడ్‌లో పరిగెడుతోంది. భారీ అవకాశాలు త్రిష తలుపు తడుతున్నాయి. ఇంకేముంది ఈ బ్యూటీ ఒకసారిగా పారితోషికం పెంచేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటివరకు రూ.కోటిన్నర దాటని పారితోషికాన్ని ఇప్పుడు డబుల్ చేసినట్లు సినీవర్గాల టాక్. ప్రస్తుతం ఈమె నటిస్తున్నది రోడ్ చిత్రం త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. కాగా త్వరలో దళపతి విజయ్‌కి జంటగా ఒక చిత్రంలోనూ, అజిత్ సరసన ఒక చిత్రంలోని నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. చదవండి: (సమంత 'మయోసైటిస్' వ్యాధిపై కీర్తి సురేష్ కామెంట్స్ వైరల్) -
‘పొన్నియిన్ సెల్వన్’ప్రీ రిలీజ్ వేడుకలో హీరోయిన్ త్రిష (ఫొటోలు)
-
త్రిష రాజకీయ ఎంట్రీపై స్పందించిన హీరోయిన్ తల్లి!
హీరోయిన్ త్రిష రాజకీయాల్లోకి రానుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతుందని, అందుకు ఓ స్టార్ వెనకుండి సాయం చేస్తున్నాడంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ వార్తపై తాజాగా త్రిష తల్లి ఉమ కృష్ణన్ స్పందించింది. త్రిష రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టం చేసింది. అంతేకాక, ప్రస్తుతం తను సినిమాల మీద ఫుల్ ఫోకస్ పెట్టిందని, పలు భాషల్లో సినిమాలు చేసేందుకు సమాయత్తమవుతోందని చెప్పుకొచ్చింది. మరోవైపు త్రిష కూడా ఇలాంటి రూమర్లు ఎక్కడినుంచి వస్తాయని అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తనకు పాలిటిక్స్‌లోకి వెళ్లాలనే ఆలోచనే లేదని సమాధానమిచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే త్రిష చివరగా పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటించింది. ఈ మూవీ సెప్టెంబర్ 30న రిలీజ్ కానుంది. చదవండి: ఆమె పార్టీకి బలం అవుతుందని నేను అనుకోవడం లేదు: మాజీ అధ్యక్షుడు ఓటీటీలో రాజ్‌కుమార్ రావు హిట్, స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడే! -
నా ఫ్యాషన్ సీక్రేట్ అదే.. షాపింగ్‌పై చాలా కంట్రోల్‌గా ఉంటా..: త్రిష
ఆచి తూచి అడుగులు వేయకుంటే.. బోల్తా కొట్టడం ఎవరికైనా తప్పదు. కెరీర్లో అలాంటి జాగ్రత్తలు పాటించింది కాబట్టే.. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి రెండు దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ స్టార్ హీరోయిన్‌గానే కొనసాగుతోంది త్రిష. ఆ ప్రేక్షకాదరణకు ఆమె అభినయంతో పాటు అందమూ ఓ కారణమే. ఆ అందానికి అద్దం పడుతున్న ఫ్యాషన్ బ్రాండ్స్ ఇవే.. సబ్యసాచి.. పేరుకే ఇండియన్ బ్రాండ్ కానీ, ఇంటర్నేషనల్ బ్రాండ్ కంటే గొప్పది, ఖరీదైనది. దాదాపు బాలీవుడ్ సెలబ్రిటీస్ పెళ్లిళ్లు అన్నీ సబ్యసాచి కలెక్షన్స్‌తోనే జరుగుతాయి. వాటిల్లో విరాట్ కొహ్లీ, అనుష్కశర్మల పెళ్లి బట్టలు ఫేమస్. కనీసం ఒక్కసారైనా సబ్యసాచి డిజైన్ వేర్ ధరించాలని, సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు ఏంతోమంది ఆశపడుతుంటారు. ఆ బ్రాండ్‌కున్న వాల్యూ అలాంటిది. ఈ మధ్యనే మధ్యతరగతి మహిళల కోసం రూ. పదివేల చీరను డిజైన్ చేశారు. ఇదే ఈ బ్రాండ్ చీపెస్ట్ చీర. సుమారు లక్ష చీరలను సిద్ధం చేస్తే, రెండు రోజుల్లోనే మొత్తం కొనుగోలు చేశారు. పదివేల చీరైనా, పదినిమిషాల్లో అమ్ముడైపోతుంది. ఇదంతా సబ్యసాచి ముఖర్జీ డిజైన్ మహత్యం. బెంగాలీ కుటుంబ నేపధ్యం నుండి వచ్చిన సబ్యసాచి కెరీర్ ఆరంభించిన అనతి కాలంలోనే ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్‌గా ఎదిగాడు. 1999లో తన పేరునే ఓ బ్రాండ్ హౌస్‌గా మార్చి, మరింత పాపులర్ అయ్యాడు. అందమైన ఆభరణాలు కూడా ‘సబ్యసాచి’ స్టోర్స్‌లో లభిస్తాయి. ఇండియాలోని ప్రముఖ నగరాలతోపాటు అమెరికా, లండన్‌లోనూ స్టోర్స్ ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనూ సబ్యసాచి డిజైన్స్‌ను కొనుగోలు చేయొచ్చు. చీర బ్రాండ్: సబ్యసాచి ధర: రూ. 1,79,500 మంజుల జ్యూయెల్స్... ఒక సమస్యను ఎదుర్కొనే సమయంలోనే మన ప్రతిభ బయట పడుతుందంటారు. ఈ మాట మంజుల విషయంలో అక్షరాల నిజం. కుటుంబం గడవటం కోసం భర్తతో కలసి మైనింగ్ పరిశ్రమలో పనిచేసి, బంగారంతోపాటు తనలోని ప్రతిభను కూడా వెలికి తీసింది మంజుల. అప్పటివరకూ బంగారం అంటే ఇష్టం మ్రాతమే. ఆ ఇష్టాన్ని ఆసక్తిగానూ.. ఆ తర్వాత ఉపాధి అవకాశంగానూ మార్చుకుంది. జెమాలజీలో పీజీ చేసి, ఆభరణాల రూపకల్పన నేర్చుకుంది. మొదట బంధువులు, తెలిసిన వారి వివాహాది శుభకార్యాలకు డిజైన్ చేసింది. వాటికి మంచి పేరు రావడంతో 2010లో ‘మంజుల జ్యూయెల్స్’ సంస్థ స్థాపించింది. ప్రస్తుతం పలు సినిమాలతో పాటు, చాలామంది సెలబ్రిటీలకు కూడా మంజుల తన డిజైన్స్‌ను అందిస్తోంది. ధర ఆభరణాల నాణ్యత, డిజైన్ ఆధారంగా ఉంటుంది. హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్‌గా ఉన్న మంజుల జ్యూయెల్స్ను ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. జ్యూయెలరీ బ్రాండ్: మంజుల జ్యూయెల్స్ ధర: ఆభరణాల నాణ్యత, డిజైన్‌పై ఆధారపడి ఉంటుంది. - దీపిక కొండి చదవండి: దుస్తులకు లింగ భేదం ఏంటీ..! స్కూల్‌కి స్కర్టులతోనే వస్తాం!! -
పెళ్లి పీటలు ఎక్కనున్న శింబు, త్రిష?
దక్షిణాది భాషలన్నింటిలోనూ కథానాయకిగా నటించి స్టార్ హీరోయిన్గా పేరు తెచుకున్నారు త్రిష క్రిష్ణన్. ఆ తర్వాత కొన్ని చిత్రాలు వరుస ప్లాపులు అవ్వడంతో వెనకబడిన త్రిష మళ్లీ 96, పేట చిత్రాల విజయం ఆమెకు మళ్లీ క్రేజ్ తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం త్రిష చేతి నిండా బోలేడు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. నటుడు శింబు, త్రిష కలిసి తమిళ చిత్రం ‘విన్నైతాండి వరువాయ’లో (తెలుగులో ఏమాయ చేశావే) నటించారు. ఈ సినిమా సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం గతంతో సామాజిక మాద్యమాల్లో జోరుగా సాగిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత తామిద్దరం మంచి స్నేహితులమని ఈ జంట స్పష్టం చేశారు. చదవండి: ఉన్నట్టుండి పోస్టులన్నీ డిలీట్, ఎందుకబ్బా? అయితే ఇటీవల శింబు ఈ ఏడాది డిసెంబర్లో శుభవార్త చెబుతానంటూ సోషల్ మీడియాలో ప్రకటించాడు. దీంతో వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారని, తొందరలోనే పెళ్లి కబురు చెప్పనున్నారని అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. కానీ అది రియల్ లైఫ్ లేక రీల్ లైఫ్‌కు చెందిన విషయమా అని శింబు క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఈ ఏడాది తమిళ నిర్మాత మండలి ఎన్నికల్లో శింబు తండ్రి టి. రాజేందర్ పోటీ చేస్తున్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందులో ఓ జర్నలిస్టు ‘మీ కుమారుడు శింబు.. త్రిషతో ఏడడుగులు వేయబోతున్నారా’ అని ప్రశ్నించారు. అయితే దీనికి అవును, కాదని ఏ సమాధానం చెప్పకుండా రాజేందర్ ఈ ప్రశ్నను దాటేశారు. దీంతో త్వరలో శింబు- త్రిష పెళ్లి పీటలు ఎక్కనున్నారని మరోసారి సినీ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఈ వదంతులు కాస్తా నిజమే అయితే శింబు, త్రిష అభిమానులు పండగ చేసుకోనున్నారు. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. చదవండి: వెబ్ సిరీస్‌లో త్రిష.. -
ఉన్నట్టుండి పోస్టులన్నీ డిలీట్, ఎందుకబ్బా?
హీరోయిన్ త్రిషా కృష్ణన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన వృత్తిగత, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటారు. అయితే, ఉన్నట్టుండి ఆమె తాజాగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి చాలా పోస్టులను తొలగించారు. దీంతో ఆమె ఎందుకు పాత పోస్టులను డిలీట్ చేశారని అభిమానులు ఆలోచనలో పడ్డారు. కాగా, కొన్ని రోజులు పాటు ట్విటర్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలకు దూరంగా ఉంటాని జూన్‌లో ప్రకటించారు. కానీ, పాత పోస్టులు డిలీట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. ప్రస్తుతం త్రిష ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కేవలం ఏడు పోస్టులు కనిపిస్తున్నాయి. ఇళయదళపతి విజయ్‌తో నటించిన ‘గిల్లి’ మూవీలోని కొన్ని సీన్స్‌తో కూడి వీడియోనే ఆమె చివరి పోస్టు. పోస్టుల డిలీట్ విషయంలో అభిమానులు నిరాశకు గురవగా.. త్రిష మాత్రం ఇంతవరకూ స్పందించలేదు. ఇక సినిమాల విషయానికి వస్తే.. త్రిష చివరిగా గౌతమ్ మీనన్ తెరకెక్కించిన షార్ట్ ఫిల్మ్ కనిపించారు. ఈ షార్ట్ ఫిల్మ్ శింబు హీరోగా నటించిన ‘విన్నైతండి వరువాయ’కు సీక్వెల్. అదే విధంగా విక్రమ్, ఐశ్వర్యారాయ్, కార్తీ, ‘జయం’ రవి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చారిత్మ్రాతక చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలో త్రిష ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. తమిళ నవల ‘పొన్నియిన్ సెల్వన్’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. కరోనా వల్ల అన్ని సినిమాల్లానే ఈ సినిమా చిత్రీకరణ కూడా ఆగిపోయింది. View this post on Instagram Dang🔥Loved this😂 #Ghilli A post shared by Trish (@trishakrishnan) on Aug 16, 2020 at 2:28am PDT -
Trisha Birthday : త్రిష కృష్ణన్ బర్త్‌డే స్పెషల్ ఫొటోలు
-
త్రిష పెళ్లి ఫిక్స్ అయ్యిందా..?
నటి త్రిష పెళ్లి ఫిక్స్ అయిందా? కొద్ది రోజులుగా సినీ వర్గాల్లో జరుగుతున్న ఆసక్తికరమైన చర్చ ఇదే. అందుకు కారణం ఈమె పెళ్లి చేసుకోబోతున్నారని ఓ చానల్లో ప్రచారం జరగడమే. నటుడు శింబు, త్రిషల మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఈ విషయాన్ని వాళ్లు చాలాసార్లు బహిరంగంగానే వెల్లడించారు. ఆమె ప్రేమ పెళ్లి గురించి చాలా ప్రచారం జరిగింది. దక్షిణాది భాషలన్నింటిలోనూ కథానాయకిగా నటించిన త్రిష బాలివుడ్‌లోనూ ఒక చిత్రం చేసింది. అయితే ఆ చిత్రం నిరాశపరచడంతో త్రిష ఇక అటువైపు కన్నెత్తి చూడలేదు. అదే విధంగా దక్షిణాదిలోనూ ఆ మధ్య కొన్ని చిత్రాల వరుస ప్లాపులతో కాస్త వెనకబడిపోయింది. అలాంటి 96, పేట చిత్రాల విజయం త్రిషకు మళ్లీ క్రేజ్ తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఈ అమ్మడు పూర్తిగా తమిళ చిత్రాలపైనే దృష్టి సారిస్తోంది. తెలుగులో చిరంజీవి సరసన నటించే అవకాశాన్ని తనే వదలుకున్న ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. త్రిషకు టాలీవుడ్ నటుడు రానా మధ్య ప్రేమ వ్యవహారం సాగిందనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై అభిమానులు త్రిషను సామాజిక మాధ్యమాల్లో రకరకాలుగా ప్రశ్నించడంతో బదులు చెప్పలేక ఇటీవల తన ట్విట్టర్ నుంచి వైదొలగారు. ఇటీవల ఆమె ట్విట్టర్ అకౌంట్ ప్రారంభించారు. ఇకపోతే చాలా కాలం క్రితం త్రిష ఒక సినీ నిర్మాత, వ్యాపారవేత్తతో నిశ్చతార్థం చేసుకున్నారని సమాచారం. తాజాగా నటుడు శింబు, త్రిష పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం సామాజిక మాద్యమాల్లో జోరుగా సాగుతోంది. దీని గురించి శింబు, త్రిష స్పందించలేదు. శింబు, త్రిష పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అభిమానులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరూ విన్నైతాండి వరువాయా చిత్రంలో నటించారు. అదే చిత్రం తెలుగు రీమేక్ ఏ మాయచేసావే చిత్రంలో నటుడు నాగచైతన్య, సమంత కలసి నటించారు. ఈ చిత్ర షూటింగ్ సమయంలో ఏర్పడిన ప్రేమ పెళ్లికి దారి తీసిన విషయం తెలిసిందే. అదే విధంగా శింబు త్రిష పెళ్లి చేసుకుంటే బాగుంటుందన్న లాజిక్‌ను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. -
వైరల్: ట్రెండింగ్ పాటకు త్రిష స్టెప్పులు
-
వైరల్: ట్రెండింగ్ పాటకు త్రిష స్టెప్పులు
సౌత్ స్టార్ త్రిష కృష్ణన్ తన అందం, అభినయంతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకున్నారు. దాదాపు అన్ని భాషల అగ్రహీరోల సరసన నటించి ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక త్రిషకు సినిమాల పరంగానే కాకుండా సోషల్ మీడియాలోనూ అమితమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవలే టిక్‌టాక్‌లో కూడా మెంబర్ అయ్యారు. ర్యాప్ సాంగ్ ‘సేవేజ్’కు త్రిష టిక్‌టాక్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా త్రిష మరో పాటకు పెదాలు కలిపి ఆడిపాడారు. అమెరికన్ సింగర్ కేష పాడిన ట్రెండింగ్ కన్నిబాల్ పాటకు తనదైన శైలిలో స్టెప్పులు వేశారు ఈ వీడియోలో త్రిష తన లుక్స్‌తో పిచ్చి క్యూట్‌గా కనిపిస్తున్నారు. (‘నీలో ఏమాత్రం మార్పు లేదు’) ఈ పాటకు త్రిష డ్యాన్స్ చూసిన ఆమె అభిమానులు రెడ్ అండ్ బ్లాక్ కలర్ షర్టులో అదిరిపోయిందంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో విక్రమ్, ఐశ్వర్య రాయ్, జయం రవి, కార్తి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం కిట్టి పరమపాదమ్ విలయట్టు, గార్జనై, రాంగి, షుగర్, రామ్, పొన్నియిన్ సెల్వన్ వంటి చాలా సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. కాగా త్రిష చివరగా 2019లో రజనీకాంత్ ప్రధాన పాత్రలో వచ్చిన హిట్ మూవీ 'పేటా'లో కనిపిచారు. (టిక్‌టాక్‌లో త్రిష.. ‘సేవేజ్’ పాటకు స్టెప్పులు) -
‘నీలో ఏమాత్రం మార్పు లేదు’
హీరోయిన్ త్రిష తనదైన నటనతో దక్షిణాదిలో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న విషయం తెలిసిందే. తన అందం, అభినయంతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేశారు త్రిష. ఇక పలు అగ్రహీరోల సరసన నటించి ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. అలాంటి త్రిష నేడు (మే4) 37 వసతంలోకి ఆడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ట్వీటర్ వేదికగా త్రిషకు బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు. (టిక్‌టాక్‌లో త్రిష.. ‘సేవేజ్’ పాటకు స్టెప్పులు) ‘హ్యాపి బర్త్‌డే డియర్. ఎల్లప్పుడు నువ్వు బలంగా, సానుకూలంగా ఉండాలి’ అని సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా త్రిష, కీర్తి సురేష్‌లతో దిగిన ఫొటోను ఆమె ట్విటర్లో పోస్ట్ చేశారు. మరో నటి కుష్బూ కూడా త్రిషకు.. బర్త్ డే విషెస్ చెప్పారు. ‘ఇప్పటికీ నీలో ఏ మాత్రం మార్పు లేదు. అదే సంతోషం, మంచి మనసు కలిగి ఉన్నావు. నీకు సంతోషం, ప్రేమ, ఆరోగ్యం కలగాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే గతేడాది రజినీకాంత్ పేట చిత్రంలో కనిపించారు. అంతకు ముందు తమిళ చిత్రం ‘96’లో జానకి దేవి పాత్రలో ఆమె అద్భుతమైన నటనను కనబరిచారు. ప్రస్తుతం పలు తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారు. Happy birthday dear @trishtrashers be strong and positive as always . Love to you hope to catch up with you soon ❤️❤️❤️❤️❤️❤️ pic.twitter.com/IAnaNwPGce — Radikaa Sarathkumar (@realradikaa) May 4, 2020 Hey Pretty woman. The best part about you is you haven’t changed a bit.. you are still the same old chirpy, happy, a beautiful soul. May you be showered with love, happiness, health n wealth in abundance.. Happy birthday dear @trishtrashers ❤️❤️❤️🎂🎂🎂🎂💖💖💖💖🤗 pic.twitter.com/RResLCP0Vt — KhushbuSundar ❤️ (@khushsundar) May 3, 2020 -
త్రిష డ్యాన్స్‌కు ఫిదా
-
టిక్‌టాక్‌లో త్రిష.. ‘సేవేజ్’ పాటకు స్టెప్పులు
చెన్నై: లాక్డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన దేశవాసులు సోషల్ మీడియా వేదికగా తమలోని కళను బయటపెడుతుండగా.. ఇక నటీనటులు కూడా అదే తోవలో నడుస్తున్నారు. తాజాగా దక్షిణాది టాప్ హీరోయిన్లలో ఒకరైన త్రిష కృష్ణన్ టిక్‌టాక్‌లో మెంబర్ అయ్యారు. ఫన్నీ వీడియోలు పోస్టు చేస్తూ సరదాగా గడుపుతున్నారు. ఫేమస్ ర్యాప్ సాంగ్ ‘సేవేజ్’కు త్రిష టిక్‌టాక్ చేశారు. ఆమె డ్యాన్స్‌కు ఫిదా అయిన అభిమానుల సంఘం ఒకటి ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. కాగా, 1999లో మిస్ మద్రాస్‌గా ఎంపికైన త్రిష తెలుగు, తమిళ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా నటిగా 18 ఏళ్లు పూర్తి చేసుకున్న త్రిష కెరీర్‌కు ఇప్పటి వరకూ డోకా లేదు. మధ్యలో అపజయాలతో వెనుకబడినా, 96 చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. (చదవండి: వాళ్ల మాట వినను!) (ఇద్దరు హీరోలతో వీడియో కాల్ మాట్లాడిన త్రిష) -
త్రిషా.. పెళ్లి చేసుకుందాం: చార్మి
చెన్నై చంద్రం త్రిషా పుట్టిన రోజు సందర్భంగా అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే రోటీన్ భిన్నంగా చార్మీ ఓ డిఫరెంట్ మెసేజ్‌తో త్రిషకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘బేబీ నిన్ను ఎప్పుటికీ ప్రేమిస్తుంటాను. నువ్వు నా ప్రతిపాదన ఎప్పుడు అంగీకరిస్తావా అని ఎదురుచూస్తున్నా. పెళ్లి చేసేసుకుందాం! ఇప్పుడు ఇది చట్టబద్ధం కూడా’ అంటూ ట్వీట్ చేశారు. గతంలోనూ చార్మి ఇదే రకమైన ట్వీట్ చేశారు. అప్పుడు పెళ్లికి నేను సిద్ధమే అంటూ త్రిష రిప్లై కూడా ఇచ్చారు. దాదాపు ఒకే సమయంలో స్టార్ హీరోయిన్స్‌గా వెలుగొందిన ఈ ఇద్దరు భామలు మంచి స్నేహితులు. త్రిష ఇప్పటికీ హీరోయిన్గా కొనసాగుతుండగా, చార్మి మాత్రం యాక్టింగ్‌కు దాదాపు గుడ్ బై చెప్పేసి సినీ నిర్మాణం మీద దృష్టి పెట్టారు. దర్శకుడు పూరి జగన్నాథ్‌తో కలిసి పీసీ కనెక్ట్ సంస్థలో సినిమాలు నిర్మిస్తోన్నారు. Baby I love u today n forever 😘 Am on my knees waiting for u to accept my proposal 💍 let’s get married😛😛 ( now toh it’s legally allowed also 😛 ) #happybirthday @trishtrashers 😘😘😘😘 pic.twitter.com/e2F3Zn3Dp3 — Charmme Kaur (@Charmmeofficial) 4 May 2019 -
ఇది పార్టీ టైమ్ బాస్
సినిమా: పార్టీ ఎక్కడుంటే అక్కడ నటి త్రిష ఉంటుందనే టాక్ కోలీవుడ్‌లో ఉంది. ఇక నటుడు శింబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంచలనాలకు కేంద్ర బిందువు ఆయన. అలాంటి శింబు చాలా కాలం తరువాత సెక్క సివందవానం చిత్ర విజయంతో ఫామ్‌లోకి వచ్చాడు. ఇక సుందర్.సీ దర్శకత్వంలో నటించిన వందా రాజావాదాన్ వరువేన్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబుతోంది. ఇలా శింబు మంచి జోష్‌లో ఉన్న తరుణంలో నూతన సంవత్సరం రావడంతో ఈ అకేషన్‌ను ఆయన తన అత్యంత సన్నిహితులతో సెలబ్రేషన్ చేసుకున్నారు. శింబు పార్టీ అంటే చెన్నై చిన్నది పాల్గొనకుండా ఉంటుందా? అసలే హిట్ పెయిర్. ఇంకా చిరకాల మిత్రులు. ఇదిలాఉండగా శింబు, త్రిష జంటగా నటించిన విన్నైతాండి వరువాయా చిత్రం వీరిద్దకి కేరీర్లోనూ ఒక మైలురాయిగా నిలిచే చిత్రం. కాగా నూతన సంవత్సరం సందర్భంగా నటుడు శింబు చెన్నైలోని తన ఇంట్లో ఇచ్చిన పార్టీలో నటి త్రిషతో పాటు సోనియాఅగర్వాల్, మేఘాఆకాశ్, గాయత్రి రఘురాం, నటుడు శాంతను భార్య కీర్తీ, నటుడు కార్తీ, మహత్, దర్శకుడు సుందర్.సీ, వెంకట్‌ప్రభు తదితరులు పాల్గొన్నారు. కాగా నడిగర్ సంఘం ఎన్నికల సమయంలో కార్తీ, శింబు వ్యతిరేక వర్గంలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో విమర్శలు, ప్రతి విమర్శలు జరిగాయి. ఆ తరువాత వీరిద్దరూ పాత విషయాలను మరచిపోయి మంచి మిత్రులైపోయారు. -
వివాదాల్లో చెన్నై చిన్నది
సినిమా: అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా.. మంచి టీజింగ్ సాంగ్ గుర్తుందా? ఆ పాట గురించి ఇప్పుడెందుకు అంటారా? సంచలన నటి త్రిష అలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. వినోదానికి పోయిందో, లేక ప్రచారాన్ని కోరుకుందో గానీ, అది కాస్తా బెడిసికొట్టి ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది. ఈ అమ్మడు తరచూ విదేశాలు చుట్టొస్తున్న విషయం తెలిసిందే. అలా ఇటీవల దుబాయ్‌కు రౌండ్ వేసింది. అక్కడ ఒక అందమైన ఈత కొలను (స్మిమ్మింగ్ పూల్)లో చక్కగా ఈదేసింది. పనిలో పనిగా అదే కొలనులో చక్కగా విన్యాసాలు చేస్తున్న డాల్ఫిన్లను చూడగానే అమ్మడు తెగ ముచ్చట పడిపోయింది. అంతటిలో ఆగితే ఆమె త్రిష ఎందుకవతుంది. అందులో ఒక డాల్ఫిన్ తెగ ముద్దొచ్చేస్తుంటే, ఆగలేక దాన్ని సమీపించి పట్టుకుని ముద్దెట్టేసింది. అంతే ఆ డాల్ఫిన్‌కు కూడా త్రిషను చూడగానే ప్రేమ పుట్టుకొచ్చినట్టుంది. అదీ ఈ సుందరి బుగ్గపై చుంబనాలు పెట్టేసింది. లేదా త్రిషనే దానితో ముద్దు పెట్టించుకుని ఉండవచ్చు. ఏదైతేనేమీ త్రిష, డాల్ఫిన్ల ముద్దు ముచ్చట్ల ప్రహసనం ఒక రేంజ్లో జరిగిపోయింది. అక్కడితో ఆగలేదు. ఇంత చేసి డాల్ఫిన్‌తో తన ముద్దు ముచ్చట్లను ప్రపంచానికి తెలిపి ప్రచారం పొందాలి కదా! అవును ఆ దృశ్యాలను ఈ చెన్నై చిన్నది తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అంతే అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇక్కడి వరకూ త్రిష బాగానే ఎంజాయ్ చేసింది. ఆమె అభిమానులు సూపర్ అంటూ తెగ లైక్ చేసేస్తున్నారు. ఇంకేంటి అంతా బాగానే ఉందిగా, త్రిషకు మంచి ఫ్రీ ప్రచారం లభించిందిగా అనేగా మీ ప్రశ్న. రండి చూద్దాం. త్రిష పెటా అనే జీవ ప్రాణుల సంరక్షణ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే వివాదాల్లో పడేసింది. అలాంటి పెటా సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండి డాల్ఫిన్ లాంటి జల జీవాలను హింసిస్తుందా అంటూ జీవ ప్రాణుల సంరక్షణ సంస్థకు చెందిన వారు త్రిషపై మండిపడుతున్నారు. స్వేచ్ఛగా జీవించే డాల్ఫిన్లతో తన సరదాలు తీర్చుకోవడం? అసలు వాటి స్వేచ్ఛను హరించే హక్కు త్రిషకు ఎవరిచ్చారు? అంటూ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా నిర్వాహకురాలు పరిదా తంబల్ నటి త్రిష చర్యలను తీవ్రంగా విమర్శించారు. సముద్రంలో జీవించే ప్రాణులైన డాల్ఫిన్లు కాలక్షేప ఈత కొలనుల్లో ఎలా సహజమైన పరిస్థితి అమరుతుంది? అని ప్రశ్నించారు. అసలు డాల్ఫిన్లకు మనుషుల అలవాట్లను ఎందుకు నేర్పించాలి? వాటిని వాటి మానాన జీవించనీయండి అని ఆవేశంగా అన్నారు. దీంతో ఒక పక్క అభిమానులు డాల్ఫిన్లలో తన ముద్దు దృశ్యాలను చూసి చాలా క్యూట్‌గా ఉన్నాయని మెచ్చుకుంటుంటే మరో పక్క విమర్శకులేంటి తనపై దాడి చేస్తున్నారు? అని త్రిష తల పట్టుకుందట. ఈ అమ్మడిప్పుడు రజనీకాంత్‌కు జంటగా పేట చిత్రంలో నటిస్తోంది. -
ఖుషీ ఖుఫీగా..
తమిళసినిమా: సంచలన తారల్లో నటి త్రిష ఒకరన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌తో ప్రేమ, పెళ్లి దాకా వెళ్లి అంతటితోనే ఆగిపోయి నటనపైనే దృష్టిసారిస్తున్న ఈ బ్యూటీ. అదే విధంగా మూడు పదులు దాటినా కథానాయకిగా రాణిస్తున్న త్రిష కమర్శియల్ చిత్రాల నాయకిగానూ, హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల నాయకిగానూ రాణిస్తోంది. అలా నయనతార, అనుష్కల బాటలో పయనిస్తున్న త్రిషను నాయకి చిత్రం నిరాశపరచింది. మరో విషయం ఏమిటంటే హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రం అయిన నాయకి ఫ్లాప్ అయినా, మరిన్ని ఆ తరహా చిత్రాలు ఆమెను వరించడం విశేషమే. అలా మోహిని, గర్జన వంటి చిత్రాలతో యాక్షన్ సన్నివేశాల్లో దుమ్మురేపడానికి త్రిష సిద్ధమైంది. ఈ అమ్మడిని తెరపై చూసి చాలా కాలమే అయ్యింది. కొడి చిత్రం తరువాత తమిళ తెరపై కనిపించలేదు. అలాగని అవకాశాలు లేవని కాదు. చేతి నిండా చిత్రాలు ఉన్నాయి. హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాలు మోహిని, గర్జన, అరవిందస్వామికి జంటగా చతురంగవేట్టై 2, విజయ్‌సేతుపతి సరసన 96, 1818 అనే మరో విభిన్న కథా చిత్రం అంటూ బిజీబిజీగా నటించేస్తోంది. అయితే చిత్ర నిర్మాణంలో జాప్యం వంటి పలు కారణాల వల్ల త్రిష చిత్రాల విడుదలలో ఆలస్యం జరుగుతోందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బ్యూటీ నటించిన మోహిని, గర్జన, 96 చిత్రాలు వరుసగా తెరపైకి రావడానికి సిద్ధం అవుతున్నాయన్నాయని సమాచారం. దీంతో త్రిష కూడా ఖుషీ అవుతోందట. ఈ విషయం ఆమె అభిమానులను మరింత ఖుషీ పరిచేదే అవుతుందిగా! -
ఆ మాటలు విని నవ్వుకుంటాం!
తమిళసినిమా: సినిమాను, వదంతులను వేరు చేయలేం. ఏదైనా వేదికపై ఒక నటి, నటుడు కాస్త చనువుగా మాట్లాడుతూ కనిపించారంటే చాలు ఆ ఇద్దరి గురించి వదంతుల పర్వం మొదలవుతుంది. ప్రేమలో మునిగితేలుతున్నారు, పెళ్లి చేసుకోబోతున్నారు లాంటి గాసిప్స్ వైరల్ అవుతాయి. అయితే నిప్పు లేనిదే పొగ రాదన్న నానుడిని పక్కన పెడితే ఇలాంటి వదంతులను కొందరు ఎంజాయ్ చేస్తారు. మరి కొందరు వేదన చెందుతారు. ఇంకొందరు అస్సలు పట్టించుకోరు. అలాంటి వదంతులు నటి రకుల్ వైపు దూసుకొస్తున్నాయి. మరి అమ్మడు ఈ మూడింటిలో ఏ కోవకు చెందిందో చూద్దాం. ఇంతకు ముందు వరకూ ఈ అమ్మడిపై పెద్దగా వదంతులు ప్రచారం కాలేదు. తాజాగా రకుల్ చుట్టూ అలాంటివి ముసురు కుంటున్నాయి. టాలీవుడ్ యువ నటుడు రానాతో చెట్టాపట్టాల్ అంటూ గుసగుసలు మొదలయ్యాయి. రానాపై ఇలాంటి వదంతులు రావడం ఇదేం కొత్త కాదు. ఆ మధ్య నటి త్రిషతో కలుపుతూ చాలా హాట్‌గానే ప్రచారం జరిగింది. అయితే అదంతా అసత్య ప్రచారం అంటూ ఇద్దరూ కొట్టిపారేశారు. మరో విషయం ఏమిటంటే తన గురించి ప్రచారం అయ్యే గాసిప్స్ గురించి రానానే సరదాగా చెబుతుంటారు.ఇలాంటి వాటిని ఆయన చాలా స్పోర్టివ్‌గా తీసుకుంటారు కూడా. కారణం అవన్నీ వదంతులు కావడమేనంటారాయన. ప్రేక్షకులు మాత్రం ఇలాంటివన్నీ ఆసక్తిగా గమనిస్తుంటారు. అలాంటిది తన గురించి వైరల్ అవుతున్న వదంతుల గురించి నటి రకుల్‌ప్రీత్‌సింగ్ ఏమంటుందో చూద్దాం. రానా తాను చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చింది. అలా తమ గ్రూప్‌లో 20 మంది ఉన్నామని చెప్పింది. అందులో పెళ్లి కానివారు చాలా తక్కువ మంది ఉన్నామని, అలాంటి వారందరం సన్నిహితంగా ఉంటామని పేర్కొంది. రానాతో తనను కలుపుతూ జరుగుతున్న ప్రచారం గురించి తామిద్దం నవ్వుకుంటామని చెప్పింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళం, తెలుగు, హింది భాషలో నటిస్తూ బిజీగా ఉంది. తమిళంలో సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్యతో రొమాన్స్ చేస్తున్న రకుల్‌ప్రీత్‌సింగ్ త్వరలో ఆయన తమ్ముడు కార్తీతో «ధీరన్ అధికారం ఒండ్రు చిత్రం తరువాత రెండోసారి జత కట్టడానికి రెడీ అవుతోంది. -
నాకా హక్కు ఉంది
తమిళసినిమా: నాకా హక్కు ఉంది అంటోంది చెన్నై చిన్నది నటి త్రిష. సంచలనాలకు కేంద్రబిందువుగా పేరొందిన నటీమణుల్లో ముందుండే ఈ బ్యూటీ సమీపకాలంలో కాస్త సైలెంట్ అయ్యిందనుకుంటున్న సమయంలో అలా ఉండడం నా వల్లకాదు అన్నట్లుగా మళ్లీ వివాదాల్లోకి వచ్చేసింది. విక్రమ్, త్రిష నటించిన సామి చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. హరి దర్శకత్వం వహించిన ఆ చిత్రానికి తాజాగా సీక్వెల్ తెరకెక్కుతోంది. ఇందులో విక్రమ్‌కు జంటగా నటి త్రిష, కీర్తీసురేశ్లను నాయికలుగా ఎంపిక చేశారు. ఇంతకు ముందు విక్రమ్‌తో ఇరుముగన్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన శిబు తమీన్ ఈ సామి–2ను రూపొందిస్తున్నారు. చిత్రం షూటింగ్‌కు రెడీ అవుతున్న సమయంలో అనూహ్యంగా త్రిష మీతో నాకు సెట్ కాలేదంటూ వైదొలిగింది. దీంతో షాక్‌కు గురైన చిత్ర నిర్మాత, నిర్మాతల మండలిలో త్రిషపై ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో వివరణ కోరుతూ నిర్మాతల మండలి త్రిషకు నోటీసులు జారీ చేసింది. చిత్రంలో నటి కీర్తీసురేశ్ ప్రాముఖ్యత ఉన్నట్టు, ఆమె కంటే తనకు సన్నివేశాలు తక్కువగా ఉన్నాయని, అందుకే చిత్రం నుంచి తప్పుకున్నట్లు త్రిష పేర్కొన్నట్లు ప్రచారం జరిగింది. అయితే అసలు కారణం అదికాదట. సోమవారం నిర్మాతల మండలి నోటీస్‌కు బదులిచ్చిన త్రిష అందులో పేర్కొంటూ తాను సామి– 2 చిత్రంలో ఒక్క సన్నివేశంలో కూడా నటించలేదని, అందువల్ల ఆ చిత్రం నుంచి వైదొలిగే హక్కు తనకు ఉందని అంది. అంతే కాదు తాను తీసుకున్న అడ్వాన్స్‌ను తిరిగి ఇచ్చేస్తానని, వ్యక్తిగత కారణాల వల్లే తాను సామి–2 చిత్రం నుంచి తప్పుకున్నట్లు వివరణ ఇచ్చిందట. అయితే త్రిష వివరణకు నిర్మాతల మండలి సంతృప్తి చెందిందో లేదో తెలియదుగానీ, సామి–2 చిత్రంలో ఆమెను నటింపజేయడానికి సామరస్య చర్చలు మాత్రం జరుగుతున్నాయని సమాచారం. -
బం చిక్ బం చెయ్యి యోగా
బం చిక్ బం యోగా శునకానికి కూడా మంచిదేగా..ఏమిటీ పాట అనుకుంటున్నారా? ఇది చెన్నై చిన్నది త్రిష ఆలోచన అండీ. శునకాలంటే నటి త్రిషకు ఎనలేని ప్రేమ అన్న విషయం తెలిసిందే. ఎక్కడనైనా శునకం దీన స్థితిలో కనిపిస్తే చాలు వెంటనే దాన్ని తన వెంట తీసుకొచ్చి పెంచేసుకుంటారీ బ్యూటీ. అలా చాలా శునకాలనే పెంచుకుంటున్నారు. అంతే కాదు తన అభిమానులకు ఇలాంటి సలహానే ఇస్తుంటారు. కాగా పెటా సంస్థకు ప్రచారకర్తగానూ పని చేసిన త్రిషకు ఈ మధ్య జల్లికట్టు పోరాట వ్యవహారంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుండడంతో తనకూ పెటాకు ఎలాంటి సంబంధం లేదంటూ ఏకంగా ట్విట్టర్ నుంచే వైదొలిగిన విషయం తెలిసిందే. ఆ తరువాత కొంత కాలానికి మళ్లీ ట్విట్టర్‌ను ఓపెన్ చేసిన త్రిష యోగాసనాలు మనుషులకే కాదు శునకాలకు అవసరం అనేలా వాటికి ఆసనాలు నేర్పిస్తున్నారు. తాజాగా తన పెట్టీ డాగ్ ‘క్యాడ్బెరీ’కి యోగాసనాలు నేర్పిస్తున్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో వెల్లడిచేశారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్రిష యోగాలో నిపుణురాలు. ఆ యోగాలను తన పెట్టీ శునకాలకు నేర్పిస్తున్నారట. తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన క్యాడ్బరీ డాగ్‌కు నేర్పిస్తున్న యోగాసనానికి అప్‌వర్డ్ డాగీ ఆసన అని పేరు పెట్టారు. ఏమిటీ త్రిష శునక ప్రేమ ఎంత గాఢమో అనిపిస్తుందా‘ -
జోడీ కుదిరింది
ఓ పదేళ్ల క్రితం అందంగా ఉన్న కుర్రాళ్లను అరవింద్ స్వామిలా ఉన్నావనేవారు. ‘దళపతి’, ‘రోజా’, ‘బొంబాయి’ వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారాయన. ఆ తర్వాత వ్యాపారంపై దృష్టి సారించిన అరవింద్ స్వామి దశాబ్దం తర్వాత మణిరత్నం ‘కడలి’తో రీ-ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ‘తని ఒరువన్’లో విలన్‌గా అందర్నీ మెప్పించారు. ఆ సినిమా తెలుగు రీమేక్ రామ్‌చరణ్ ‘ధృవ’లోనూ ఆయనే విలన్‌గా నటిస్తున్నారు. ఇప్పుడు అరవింద్ స్వామి హీరోగా రీ-ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ‘సదురంగ వెట్టై’ అనే తమిళ సినిమా సీక్వెల్లో ఆయన హీరోగా నటించనున్నారు. అరవింద్ స్వామికి జోడీగా త్రిషను ఎంపిక చేశారు. 2014లో విడుదలైన ‘సదురంగ వెట్టై’తో హెచ్.వినోద్ దర్శకుడిగా పరిచయమయ్యారు. సీక్వెల్‌కి ఆయనే కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ‘సలీమ్’ ఫేమ్ నిర్మల్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. టెక్నాలజీ ఉపయోగించి ఓ ఘరానా మోసగాడు ఏం చేశాడనే కథాంశంతో ఈ థ్రిల్లర్ మూవీ తెరకెక్కనుందట. త్వరలో షూటింగ్ మొదలు కానుంది. -
ఈ సినిమాలో ఆమే రియల్ హీరో
చెన్నై: హర్రర్, కామెడీ సినిమా నాయకికి రియల్ హీరో త్రిష అని దర్శకుడు గోవి అన్నాడు. ఈ సినిమా శుక్రవారం విడుదలకానుంది. నాయకిలో రెండు ముఖ్యమైన మగ పాత్రలు ఉన్నా, సినిమాకు త్రిషే రియల్ హీరో అని గోవి చెప్పాడు. ఈ ప్రాజెక్టు కోసం త్రిష చాలా కష్టపడిందని, ఇందులో రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తుందని తెలిపాడు. ఈ సినిమాలో 98 శాతం కామెడీ, 2 శాతం హర్రర్ ఉంటుందని చెప్పాడు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను నిర్మించినట్టు గోవి తెలిపాడు. ఈ సినిమాలో గణేశ్ వెంకటరామన్, జయప్రకాశ్, సత్యం రాజేశ్, బ్రహ్మానందం తదితరులు నటించారు. -
క్వీన్ త్రిషేనా?
క్వీన్‌గా మారే అవకాశం సంచలన నటి త్రిషనే వరించనుందా? అన్న ప్రశ్నకు చిత్ర వర్గాల నుంచి సానుకూల సమాచారమే వస్తోంది. క్వీన్ చిత్రం 2014లో బాలీవుడ్లో ఒక సంచలనం. నటి కంగనా రనౌత్‌ను స్టార్‌ను చేసిన చిత్రం. ఆమె పాత్రలో నటించాలని చాలా మంది దక్షిణాది టాప్ హీరోయిన్లు ఆశించిన చిత్రం. అలాంటి చిత్ర దక్షిణాది భాషల రీమేక్ హక్కులను సీనియర్ నటుడు,దర్శక నిర్మాత త్యాగరాజన్ సొంతం చేసుకున్నారు. విశేషం ఏమిటంటే ఈ సంచలన చిత్రానికి ఇద్దరు ప్రముఖ నటీమణులు తెరవెనుక పనిచేయనుండడం. అందులో ఒకరు సుహాసిని మణిరత్నం. తను ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు. ఇక మరో సీనియర్ నటీమణి రేవతి మెగాఫోన్ పట్టనున్నారు. వీరిద్దరు ఇంతకు ముందు దర్శకత్వం వహించిన ప్రతిభావంతులేనన్నది గమనార్హం. ఈ చిత్రంలో క్వీన్ అయ్యేది ఎవరన్న విషయం చాలా కాలంగా జరుగుతున్న చర్చ. చాలా మంది అగ్రనాయికలతో చర్చలు జరిగినట్లు సమాచారం. తాజాగా నటి త్రిష పేరు తెరపైకి వచ్చింది. క్వీన్ చిత్ర రీమేక్‌లో నాయకిగా నటించే విషయమై అందాల భామ త్రిషలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. త్రిష ప్రస్తుతం చేస్తున్న చిత్రాలన్నీ కథానాయకి ప్రధాన చిత్రాలే. తాజాగా క్వీన్ చిత్రం కూడా ఈ బ్యూటీ ఖాతాలోకి చేరే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాల బోగట్టా. -
'నాయకీ'కి పుట్టిన రోజు శుభాకాంక్షలు
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ పుట్టిన రోజు సందర్భంగా పలువురు టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి దశాబ్దం పూర్తి చేసుకున్న త్రిష తెలుగు, తమిళ్‌తో పాటు బాలీవుడ్ లోనూ నటించింది. ఇటీవల కెరీర్లో లాంగ్ గ్యాప్ తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన త్రిష ప్రస్తుతం వరుస సినిమాలతో మంచి ఫాంలో ఉంది. 33 వ ఏట అడుగుపెడుతున్న ఈ ముద్దుగుమ్మకు ఛార్మీ, పూరి జగన్నాథ్, హన్సిక, తాప్సీ, జయం రవి, సిద్దార్థ్, రాధిక లాంటి సౌత్ స్టార్స్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం త్రిష ప్రధాన పాత్రలో నటిస్తున్న నాయకీ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్‌కు రెడీ అవుతుండగా, మరో మూడు చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. Happiest Bday my partner in crime @trishtrashers -
త్రిష పై నెటిజన్ల ఆగ్రహం
చెన్నై సుందరి త్రిష నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు. ఈమె మూగజీవాల ప్రేమికురాలన్న విషయం తెలిసిందే. అలాంటి మూగ ప్రాణుల సంరక్షణ సంస్థ పేటాకు తన వంతు సేవలను అందిస్తున్న త్రిష దీనికి ప్రచారకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ ఏ మూగ జీవి బాధింపునకు గురైనా వెంటనే స్పందిస్తుంటారు. అదే విధంగా ఇటీవల ఉత్తరాఖండ్‌లో రాజకీయ వాదుల గొడవల్లో ఒక గుర్రం తీవ్రంగా గాయపడింది. కాంగ్రెస్ పాలిత ప్రాంతమైన ఆ రాష్ట్రంలో బీజేపీ పార్టీ శాసన సభ్యుడు ముసోరి గణేశ్ జోషీ నేతృత్వంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. దాన్ని అడ్డుకున్న పోలీసులు గుర్రాలపై వచ్చారు. ఆగ్రహంతో ఊగిపోయిన బీజేపీ శాసన సభ్యుడు ముసోరి గణేశ్ జోషి పోలీసు నుంచి లాఠి లాక్కుని గుర్రాన్ని చితక బాదారు. ఆ సంఘటన దృశ్యాలు మీడియాలో హల్చల్ చేశాయి. అవి చూసిన నటి త్రిష తీవ్రంగా స్పందించారు. గుర్రాన్ని రక్తం కళ్ల చూసిన ఆ శాసన సభ్యుడిని ఉద్దేశిస్తూ మిమ్మల్ని నరకంలో కాల్చాలి అని తన ట్విట్టర్లో పేర్కొన్నారు. దీనికి కొందరు త్రిషకు మద్దతు పలికినా మరి కొందరు ఆరోపణలు గుప్పించడం గమనార్హం. గుర్రం కాలికి తగిలిన దెబ్బలపై స్పందించిన త్రిష కులమతాల పేరుతో జరుగుతున్న హత్యలపై గొంతెత్తడం లేదు అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. ఆ మధ్య జల్లికట్టుపై త్రిష నోరు మెదపలేదేం అంటూ చురకలు వేస్తున్నారు. మరొకరైతే ఇలాంటి ఖండన వల్ల త్రిషకు మూగ జీవాల సంరక్షణ సంస్థ నుంచి మంచి ఆదాయం అందుతోందని ఆరోపించారు. అయితే ఆమె మానవతా దృక్పథాన్నా అభినందించేవారు లేక పోలేదు. మరి ఈ చెన్నై సుందరి నెటిజన్ల ఆరోపణలకు ఎలా బదులిస్తారో చూడాలి. -
'చీకటిరాజ్యం' ట్రైలర్ విడుదల
-
చీకటిరాజ్యం ట్రైలర్ విడుదల
కమల్‌హాసన్, త్రిష జంటగా నటిస్తున్న చీకటిరాజ్యం సినిమా ట్రైలర్ విడుదలైంది. 'తూంగవనం' పేరుతో తమిళంలోను, చీకటిరాజ్యంగా తెలుగులోను వస్తున్న ఈ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి. త్రిషకు ఇది 50వ సినిమా కావడంతో పలువురు సినీ జనాలు కూడా త్రిషను ట్విట్టర్లో అభినందనలతో ముంచెత్తారు. అందులోనూ త్రిషను ఈ సినిమాలో డీగ్లామరస్ పాత్రలో చూపించడం, కమల్, త్రిషల మధ్య ఫైటింగ్‌తో కూడిన పోస్టర్ కూడా విడుదల కావడం.. ఇలాంటి విశేషాలు ఉన్న నేపథ్యంలో ట్రైలర్ కోసం కూడా అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. కమల్‌కు సన్నిహితుడైన రాజేశ్ ఎం సెల్వ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కూడా ఓ ముఖ్యపాత్రలో నటించాడు. సినిమా ట్రైలర్ లింకును త్రిష ట్వీట్ చేసింది. CheekatiRajyam trailer http://t.co/4iK7NIC6wP — Trisha Krishnan (@trishtrashers) September 16, 2015 -
ఆహా అనుష్క.. ఓహో త్రిష!
బాహుబలి రెండో భాగం షూటింగ్ ప్రారంభం కావడానికి ఇంకా కాస్త సమయం ఉన్నట్టుంది.. అందుకే దర్శకుడు రాజమౌళి మిగిలిన సినిమాలు ఎలా ఉన్నాయో, వాటిలో ఎవరెవరు ఎలా చేస్తున్నారో బాగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం సైజ్ జీరో సినిమాలో డీ గ్లామరస్‌గా, లావుగా కనిపిస్తున్న అనుష్కను, నాయకి సినిమాలో ఒక చేత్తో కత్తి పట్టుకున్న త్రిషను ఆయన పొగడ్తల్లో ముంచెత్తారు. ప్రస్తుతం రెండు సినిమాలు బాగా ఆసక్తికరంగా అనిపిస్తున్నాయని రాజమౌళి ట్వీట్ చేశారు. ఆ రెండు సినిమాల పోస్టర్లు చూస్తుంటేనే ఆసక్తి కలుగుతోందన్నారు. సైజ్ జీరో సినిమాలో స్వీటీ (అనుష్క) చాలా చక్కగా ఉందని చెప్పారు. ఇక నాయకి సినిమాలో త్రిష అయితే.. ముఖంలో చిరునవ్వులు చిందిస్తూ, కుడిచేత్తో కత్తి, ఎడమ చేత్తో పూజాసామగ్రి పట్టుకుని వెళ్తున్న గెటప్ కూడా చాలా బాగుందని వ్యాఖ్యానించారు. నాయకి పోస్టర్ గురించి రాజమౌళి అంతటి దర్శకుడు ట్వీట్ చేయడంతో.. ఆ చిత్ర దర్శకుడు గోవి గోవర్ధన్ ఎంతగానో మురిసిపోయారు. ఆయనకు కృతజ్ఞతలు చెప్పారు. Two films are creating lot of curiosity with posters itself. One is size zero..Sweety is so adorable… -
కృషి ఉంటే... త్రిషలా ఉండొచ్చు!
త్రిష గురించి సింపుల్‌గా చెప్పాలంటే... థర్టీన్ ఇయర్స్ ఇండస్ట్రీ... థర్టీ టూ ఇయర్స్ ఏజ్..! కానీ త్రిష మాగ్నెట్లాగా యూత్ హార్ట్స్ని గుంజుకుంటూనే ఉన్నారు. చూసీ చూసీ మనకు బోర్ లేదు. చేసి చేసీ తనకూ బోర్ రాలేదు. త్రిషలో ఏదో మేజిక్ ఉంది. ఆమె ఒంటి మీద వయసు వాలడం ఆగిపోయిందా? ఆ గ్లామర్... ఆ ఫ్రెష్‌నెస్... ఆ ఫిట్నెస్... ఎలా మెయింటెయిన్ చేయగలుగుతున్నారామె. త్రిష దగ్గరే ఆ సీక్రెట్స్ తెలుసుకుందామా... ఫిట్నెస్ ‘స్ట్రెచింగ్’ ఎక్సర్సైజులు శరీరానికి మంచివి అంటారు త్రిష. ప్రతి రోజూ ఉదయం ఆమె యోగా చేస్తారు. రకరకాల ఆసనాలు చేస్తుంటారు. వాటిలో ఏది చేసినా చేయకపోయినా స్ట్రెచింగ్ ఆసనాలు మాత్రం కంపల్సరీ చేయాల్సిందే. కార్డియో ఎక్సర్‌సైజ్‌తో పాటు మరికొన్ని వ్యాయామాలు కూడా చేస్తారామె. బాగా ఖాళీ దొరికితే స్విమ్మింగ్ చేస్తారు. ఈత వల్ల శరీరాకృతి బాగుంటుందని చెబుతారు త్రిష. ఇన్నేళ్లల్లో శరీరాకృతిలో మార్పు రాకపోవడానికి కారణం తాను చేసే యోగా, వ్యాయామాలని చెబుతారు. వ్యాయామాలు శరీరానికి బాగుంటాయి. యోగా అయితే శరీరంతో పాటు మనసు ప్రశాంతంగా ఉండటానికి ఉపకరిస్తుందని అంటున్నారు త్రిష. డైట్ ఉదయం త్రిష డైట్ గ్రీన్ టీతో మొదలవుతుంది. అల్పాహారం మాత్రం భారీగా తీసుకుంటారు. పరోటాలు, ఆమ్లెట్స్.. ఇలా ఏది అనిపిస్తే అది తింటారు. కడుపు నిండా లాగించేస్తారు. బ్రేక్‌ఫాస్ట్ ఎంత హెవీగా తీసుకుంటే... అంత మంచిది. రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటూ, మన పనులు మనం సునాయాసంగా చేసుకోగలుగుతాం అంటారు త్రిష. బ్రేక్‌ఫాస్ట్‌కీ, లంచ్‌కీ మధ్య చిరుతిండి తినరు. ఎక్కువగా నీళ్లు, పండ్ల రసాలు తాగుతారు. ముఖ్యంగా నిమ్మ, బత్తాయి... ఇలా ‘విటమన్ సి’ మెండుగా ఉన్న పండ్లు తీసుకుంటారు. లంచ్, డిన్నర్‌కి ఏది ఇష్టం అనిపిస్తే అది తింటారు. ఇంత సన్నగా ఉంటారు కాబట్టి, కఠినమైన ఆహార నియమాలు పాటిస్తారనుకుంటే పొరపాటు. నచ్చినవాటిని మితంగా తింటారు. త్రిషకు సీ ఫుడ్ చాలా ఇష్టం. తన డైట్లో అవి కంపల్సరీగా ఉండేలా చూసుకుంటారు. రోజూ ఆరేడు గంటలు నిద్రపోతారు. మేకప్ అందంగా లేనివాళ్లను అందంగా, అందంగా ఉన్నవాళ్లని మరింత అందంగా చూపించే సత్తా మేకప్‌కి ఉంది. త్రిష అందంగానే ఉంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెరపై మరింత అందంగా కనిపించడం కోసం లైట్‌గా మేకప్ చేసుకుంటారు. త్రిషకు హెచ్డి (హై డెఫినిషన్) మేకప్ అంటే ఇష్టం. ఎక్కువగా అదే వాడతారు. ఐ లైనర్, మస్కరా, లిప్ కలర్.. డే టైమ్‌లో అయితే ఇవన్నీ లైట్‌గా ఉండేలా చూసుకుంటారు. నైట్ టైమ్ మాత్రం ముదురు రంగులు వాడతారు. సినిమాల్లో పాత్రలకు తగ్గట్టుగా మేకప్ చేసుకుంటారు. స్టయిలింగ్ త్రిషకు ఇండియన్, వెస్ట్రన్.. రెండు రకాల దుస్తులు ఇష్టం. మోడ్రన్ డ్రెస్సుల్లో ఎంత బాగుంటారో చీరల్లోనూ అంతే అందంగా ఉంటారామె. కంటికి నచ్చినవల్లా కాకుండా ఒంటికి నప్పేవి కొనుక్కుంటారు. హెయిర్ స్టయిల్ విషయానికొస్తే... జుత్తుని ఫ్రీగా వదిలేయడం త్రిషకు ఇష్టం. కానీ, వేసుకున్న డ్రెస్‌కి అనుగుణంగా హెయిర్ స్టయిల్ ఉండాలి. అందుకని ఆ డ్రెస్‌కి తగ్గట్టు, తన ఫేస్‌కి సూట్ అయ్యే హెయిర్ స్టయిల్ చేసుకుంటారు. త్రిషకు టాటూలంటే ఇష్టం. సినిమాల్లో పాత్ర డిమాండ్ మేరకు మాత్రమే కాదు.. పర్సనల్‌గా కూడా టాటూ వేయించుకుంటారు. ఫైనల్‌గా త్రిష ఏం చెబుతారంటే... మనం అనారోగ్యం బారిన పడటానికి ముఖ్య కారణం ఒత్తిడి అని, ఎంత ఒత్తిడికి గురి చేసే విషయాన్నయినా తేలికగా తీసుకోవడం అలవాటు చేసుకుంటే బాగుంటుందని అంటున్నారు. పాజిటివ్ థింకింగ్ చాలా అవసరం అని కూడా చెబుతున్నారు. త్రిష దాదాపు పాజిటివ్‌గానే ఉంటారట. వయసు పెరుగుతున్నా తరుగుతున్నట్లు కనిపించడానికి అదో కారణం అని చెప్పొచ్చు. -
కాబోయే దంపతుల్లో కలతలా?
ఇద్దరు సెలబ్రిటీలు ప్రేమించుకుని పెళ్లి నిశ్చితార్థం కార్యక్రమం కూడా జరుపుకుని నాలుగు నెలలు దాటినా వివాహ తేదీని నిర్ణయించుకోకపోవడంతో ఆ జంటపై సహజంగానే రకరకాల ప్రచారాలు జరుగుతుంటాయి. ప్రస్తుతం నటి త్రిష, వ్యాపారవేత్త, నిర్మాత వరుణ్మనియన్ల గురించి అలాంటి ప్రచారమే కోలీవుడ్‌లో హల్చల్ చేస్తోంది. దక్షిణ భారత చిత్ర పరిశ్రమల ప్రముఖ కథానాయకి నటి త్రిష. ఈ రంగంలో పుష్కరకాలం పూర్తి చేసుకున్న హీరోయిన్ ఆమె. యువ సినీ నిర్మాత, ప్రముఖ వ్యాపారవేత్త వరుణ్‌మణియన్. వీరిద్దరి మధ్య ప్రేమ అనూహ్యంగా వెలుగులోకి వచ్చింది. అంతే ఆశ్చర్యంగా వివాహ నిశ్చితార్థం వరకు వెళ్లింది. ఆ వేడుక సందర్భంగా చిత్ర ప్రముఖులకు నక్షత్ర హోటల్లో బ్రహ్మాండమైన పార్టీని ఇచ్చారీ జంట. ఇక ఇరువర్గాల కుటుంబీకులు కలిసి పెళ్లికి మంచి ముహుర్తం నిర్ణయిస్తారని చెప్పారు. వరుణ్‌మణియన్, త్రిష వివాహ నిశ్చితార్థం ఈ ఏడాది జనవరిలో జరిగింది. మార్చిలో వివాహం తంతు జరుగుతుందనే ప్రచారం జరిగింది. దీంతో త్రిష నటనకు స్వస్తి చెబుతారని, కాదు ఆమె వివాహానంతరం నటనను కొనసాగిస్తారంటూ పలు రకాల ప్రచారాలు దుమ్మురేపాయి. అయితే వీరి నిశ్చితార్థం జరిగి నాలుగు నెలలు అయ్యింది. ఇప్పటి వరకు పెళ్లి తేదీ ఖరారు కాలేదుకదా ఊసే లేదు. మనస్పర్థలా: ఇలాంటి పరిస్థితిలో త్రిష, వరుణ్ మణియన్‌ల గురించి చాలా వదంతులు ప్రచారంలో కొచ్చాయి. అందులో త్రిష, వరుణ్‌మణియన్‌ల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయన్నది ఒకటి. వీరిద్దరు సోషల్ నెట్‌వర్క్సులో తరచూ తమ అభిప్రాయాలను పంచుకునేవారు. అలాంటిది గత నెల నుంచి ఆ సంప్రదాయాన్ని కొనసాగించడం లేదట. మరో విషయం ఏమిటంటే నిశ్చితార్థంలో వరుణ్‌మణియన్ తొడిగిన ఉంగరం త్రిషే వేలికిప్పుడు కనిపించడం లేదట. మరో విషయం వరుణ్‌మనియన్ నిర్మించనున్న తాజా చిత్రంలో మొదట నటించడానికి అంగీకరించిన త్రిష ఆ తరువాత ఆ చిత్రం నుంచి వైదొలిగారనే ప్రచారం హోరెత్తింది. ఇలాంటి పరిస్థితిలో వరుణ్‌మణియన్, త్రిషల మధ్య అభిప్రాయబేధాలు పొడచూపిన విషయం నిజమేనని వారి సన్నిహిత వర్గాల సమాచారం. అవకాశాలు వెల్లువ : త్రిషకు వరుణ్‌మణియన్‌తో వివాహ నిశ్చితార్థానికి ముందు పెద్దగా చిత్రాలు లేవు. అంతకుముందు అంగీకరించిన చిత్రాలను పూర్తి చేసి పెళ్లికి సిద్ధం అవ్వాలని ఆమె నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ తరువాత త్రిష నటించిన ఎన్నై అరిందాల్ చిత్రం విడుదలైన హిట్ అవ్వడంతో పాటు ఆమెకు మంచి పేరు వచ్చింది. మేనేజర్ గిరిధర్ నిర్మిస్తున్నారు. త్రిష చిత్రాలు మీద చిత్రాలు అంగీకరించడంతో ఆమె పెళ్లి గురించి రకరకాల వదంతులు ప్రచారం అవుతున్నట్లు ఒక ఆంగ్ల పత్రిక కథనం రాసింది. అయితే ఈ వ్యవహారం గురించి ఇటు త్రిషగాని, అటు వరుణ్‌మణియన్‌గాని నోరు మెదపక పోవడం గమనార్హం. -
ఇది... త్రిష ప్రేమ పురాణం..!
‘‘ప్రేమ లేదనీ....ప్రేమించరాదనీ ’’ అని మహాకవి ఆత్రేయ ‘అభినందన’ చిత్రంలో ప్రేమ గురించి తనదైన శైలిలో రాశారు. మళ్లీ అదే సినిమాలో ‘‘ప్రేమ ఎంత మధురం...ప్రియురాలు అంత కఠినం’’ అన్నారు. ఇలా ప్రేమ గురించి మంచీ, చెడూ ఏది చెప్పినా వినడానికి మాత్రం హాయిగా ఉంటుంది. ప్రేమకు ఉన్న మహత్తు అలాంటిది. అసలు ఈ ప్రపంచంలో ప్రేమ గురించి మాట్లాడనివాళ్లు ఎవరూ ఉండరేమో! ప్రేమను ఒక్కొక్కరు ఒక్కో రకంగా విశ్లేషిస్తారు. పెళ్లిలో ఏడడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్న త్రిష మాత్రం... ‘ప్రేమ చాలా మధురం’ అంటారు. ప్రేమ గురించి ట్విట్టర్లో త్రిష స్పందిస్తూ -‘‘ప్రేమలో అసూయ, ద్వేషం, విషాదం, ఒంటరితనం, ఎడబాటు, సంతోషం - అన్నీ ఉంటాయి. ఈ బంధంలో ఉన్నప్పుడు బాధ, సంతోషం ఏదైనాసరే దానికి కారణం ప్రేమే అని చాలామంది అనుకుంటారు. అది పొరపాటు. ప్రేమ ఎప్పుడూ బాధపెట్టదు. వాస్తవానికి ప్రేమ ఎన్నడూ ఎవర్నీ బాధపెట్టదు. మనసుకైన గాయాలు మానడానికి ప్రేమ కన్నా మించిన మంచి మందు లేదు. ఈ ప్రపంచంలో ఉన్న బాధలన్నింటినీ పోగొట్టే శక్తి ప్రేమకు ఉంది. బాధ నుంచి బయటపడేసి మళ్లీ మామూలు స్థితికి తీసుకొచ్చే అద్భుతమైన ఆయుధం ప్రేమ’’ అన్నారు. -
జయ్‌తో ఓకే
యువ నటుడు జయ్‌తో జత కట్టడానికి నటి త్రిష సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రాన్ని సుశాంత్ ప్రసాద్ గోవిందరాజ్‌తో కలిసి ఆమెకు కాబోయే భర్త వరుణ్ మణియన్ నిర్మించనున్నారు. మొదట ఈ చిత్రం నుంచి త్రిష వైదొలగినట్లు ప్రచారం జరిగింది. కానీ ఈ చిత్రంలో జయ్, త్రిష హీరోహీరోయిన్లని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. విశాల్ హీరోగా తీరాద విళైయాట్టు పిళ్లై, సమర్ చిత్రాలను తెరకెక్కించిన తిరు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. త్రిష ఇటు హోమ్లీ పాత్రల్ని అటు గ్లామర్ పాత్రల్ని సమర్థవంతంగా పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఎన్నై అరిందాల్ చిత్రంలో చక్కని అభినయాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ చిత్రం ఆమె ఆలా అందంగా కూడా కనిపించారనే అభినదనలు అందుకుంటున్నారు. త్రిష గ్రామీణ పాత్రల్లో నటించి చాలా కాలమైంది. తిరు దర్శకత్వం వహించనున్న తాజా చిత్రంలో చిన్న టౌన్‌కు చెందిన యువతిగా నటనకు అవకాశం వున్న పాత్రలో నటించనున్నారట. అప్పట్లో విక్రమ్ సరసన సామి చిత్రంలో ఇన్నోసెంట్ యువతిగా చక్కని అభినయాన్ని ప్రదర్శించారు. అలాంటి విభిన్న పాత్రలో త్రిష నటించనున్నట్లు చిత్ర నిర్మాతలు వెల్లడించారు. ఈ చిత్ర షూటింగ్ మార్చిలో చెన్నై కుంభకోణంలో జరుగుతుందన్నారు. ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని, రిచర్డ్ ఎం.నాథన్ ఛాయాగ్రహణం అందించనున్నారు. -
ఈ నెల 23న త్రిష ఎంగేజ్మెంట్
-
అవును.. త్రిష నిశ్చితార్థం ఖరారైంది!!
-
ఈ నెల 23న వరుణ్‌తో నా ఎంగేజిమెంట్: త్రిష
తన పెళ్లి విషయంలో ఇన్నాళ్లూ దోబూచులాడిన త్రిష.. ఎట్టకేలకు ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పింది. జనవరి 23వ తేదీన వరుణ్‌తో తన నిశ్చితార్థం జరగనున్నట్లు ట్విట్టర్లో తెలిపింది. కేవలం తమ రెండు కుటుంబాలు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరవుతాయని తన అభిమానులు, స్నేహితులకు తెలిపింది. అయితే తమ పెళ్లి ముహూర్తం ఇంకా ఖరారు కాలేదని, అందువల్ల దాని గురించి ఊహాగానాలు వద్దని కోరింది. ముహూర్తం ఖరారు కాగానే ఎప్పటిలాగే తానే స్వయంగా ఆ విషయాన్ని వెల్లడిస్తానని త్రిష చెప్పింది. సినిమాలు వదిలిపెట్టాలన్న ఉద్దేశం ఏదీ తనకు లేదని, వాస్తవానికి రెండు కొత్త సినిమాలను కూడా తాను ఒప్పుకొంటున్నానని, 2015లో మరికొన్ని సినిమాలు విడుదల కానున్నాయని కూడా ట్విట్టర్ సందేశాలలో త్రిష చెప్పింది. To my fans n friends from d media,I will be getting engaged to Varun on the 23 of Jan in a very private ceremony between our families — Trisha Krishnan (@trishtrashers) January 7, 2015 Pls dont speculate about my wedding date as we have not fixed it as yet. And as always you will hear it from me first when we do. — Trisha Krishnan (@trishtrashers) January 7, 2015 I have no intentions of quitting films.Infact will be signing two new films soon and looking forward to four of my releases in 2015. — Trisha Krishnan (@trishtrashers) January 7, 2015 -
నిశ్చితార్థం నిజమే
నటి త్రిష మరోసారి తన చాతుర్యం ప్రదర్శించారు. ఈ చెన్నై చిన్నదానికి ఇటీవల ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత వరుణ్‌మణియన్‌తో నిశ్చితార్థం జరిగిందని మీడియా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. వరుణ్‌మణియన్‌తో త్రిష సన్నిహితంగా వున్న ఫొటోలతో సహా, ఆధారాలు చూపుతూ పత్రికలు, సోషల్ నెట్వర్క్స్ ప్రచారం చేశాయి. అయినా ఈ ప్రచారంలో నిజం లేదని త్రిష, ఆమె తల్లి ఉమ నమ్మించే ప్రయత్నం చేశారు. దీంతో ఈ వ్యవహారం కాస్త సద్దుమణిగింది. అయితే త్రిషకు మాత్రం రావలసిన రెండు చిత్రాలు వెనక్కు వెళ్లిపోయూరుు. ప్రస్తుతం అజిత్ సరసన నటించిన ఎన్నై అరిందాల్, జయం రవితో నటించిన భూలోకం చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఇకపోతే ఇప్పటికే అంగీకరించిన ఒకటి, రెండు చిత్రాల మినహా త్రిషకు కొత్త అవకాశాలేవీ కను చూపు మేరలో లేవు. దీంతో అమ్మడు పెళ్లికి సిద్ధం అయినట్లున్నారు. ఎవరేమనుకుంటే నా కేంటి అని తెగించి బాయ్‌ఫ్రెండ్ వరుణ్‌మణియన్‌తో పాటు స్నేహితులతో కలిసి పర్సనల్ టూర్ అంటూ ఇటీవల ఢిల్లీకి చెక్కేశారు. అక్కడ అందమైన ప్రదేశాలను బాయ్‌ఫ్రెండ్‌తో చుట్టేసి యమజాలీగా ఎంజాయ్ చేశారు. అంతేకాదు ప్రేమికులకు చిహ్నం అయిన ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను వరుణ్ మణియన్‌తో కలిసి సందర్శించారు. ఈ విహారయాత్రకు త్రిష బృందాన్ని ప్రత్యేక విమానంలో వరుణ్ తీసుకె ళ్లటం విశేషం. దీనికి ఖర్చు కొన్ని లక్షల్లో ఉంటుందట. తన ప్రేమ, నిశ్చితార్థం గురించి ప్రచారం జరిగిపోయింది కాబట్టి ఎలాగు కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు లేవని భావించారో ఏమో త్రిష ఈ విహార యాత్రలో తన బాయ్‌ఫ్రెండ్, స్నేహితులతో దిగిన ఫొటోలను, తానే స్వయంగా ట్విట్టర్లో పోస్టు చేశారు. ఈ ఫొటో ఒక పక్క మీడియాలో సంచలనం కలిగిస్తుంటే త్రిష తల్లి ఉమ మాత్రం నెమ్మదిగా తన కూతురు తాజ్‌మహల్‌ను సందర్శించడానికి ఆగ్రా వెళ్లిన విషయం నిజమేనని అంగీకరించారు. త్రిషతోపాటు ఆమె స్నేహితురాలు వెళ్లారని, తమకు ఇక్కడ చాలా పనులుండటం వలన వెళ్లలేకపోయానని తెలిపారు. అయితే త్రిష పెళ్లి గురించి రకరకాల ప్రచారం జరుగుతోందని, కానీ ఈ ఏడాది త్రిష పెళ్లి ఉండదని, భగవంతుడు దయతలిస్తే వచ్చే ఏడాది త్రిష వివాహం జరుగుతుంద ంటున్నారు. ఇంతకీ ఆమెకిక్కడ అంతగా ఊపిరాడనంత పనులేమిటో బహుశా పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోయారేమోనని కోలీవుడ్ గుసగుసలాడుకుంటోంది. -
త్రిష పెళ్లికి రంగం సిద్ధం?
-
రాణా.. త్రిషల మధ్య ఆ రాగిణి ఎవరు?
ఎన్నాళ్ల నుంచో స్నేహంగా ఉంటున్న రాణా.. త్రిషలు ఎందుకు విడిపోయారు? వాళ్లిద్దరి మధ్య విభేదాలకు కారణం ఎవరు? అనధికారికంగా వస్తున్న కథనాల ప్రకారం, కన్నడ సుందరి రాగిణీ ద్వివేది కారణంగానే ఇలా జరిగిందని వినిపిస్తోంది. బాహుబలిలో నటిస్తున్న రాణా గతంలో రాగిణితో కలిసి ఉన్నట్లుగా ఉన్న ఫొటోలు సైతం కొన్ని వెబ్సైట్లలో దర్శనమిచ్చాయి. అయితే, రాగిణి మాత్రం.. ఇవన్నీ ఒట్టి వదంతులేనని రాగిణి చెబుతోంది. ఏదో అవార్డు కార్యక్రమానికి జరిగిన రిహార్సల్స్‌లో తాము పాల్గొన్న ఫొటోను తీసుకుని ఇలా అంటగట్టేస్తున్నారని రాగిణి వాపోయింది. అసలు రాణాతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసింది. ఈ వ్యవహారాలపై రాణా కూడా తీవ్రంగానే స్పందించాడు. ఏదో ఒక ఫొటో తీసేసుకుని.. దాన్నుంచి వార్తలు వండటం చాలా దారుణమైన విషయమని తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. త్రిష, రాణా కలిసి ఇటీవల సైమా అవార్డుల కార్యక్రమంలో కనిపించారు. -
సినిమా తరువాతే వివాహం
ముందు సినిమా తరువాతే పెళ్లి అంటున్నారు చిరునవ్వుల చిన్నది నటి త్రిష. ఈమెలో ప్రత్యేకత ఏమిటంటే సినిమాకు పరిచయం అయినప్పడు నవనవలాడుతూ ఎంత అందంగా ఉన్నారో నేటికీ మాయని అందాన్ని మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. నటిగా దశాబ్ద కాలం దాటినా నేటికీ హీరోయిన్గా తన స్థానాన్ని పదిల పరచుకుంటున్నారు. తమిళం, తెలుగు, హిందీ అంటూ ఒక రౌండ్ కొట్టొచ్చిన త్రిష తాజాగా కన్నడ సినిమాకు పరిచయం అవ్వ డం ఆమె క్రేజ్‌కు నిదర్శనం. కన్నడంలో పునిత్ రాజ్‌కుమార్ సరసన నటిస్తున్న ఈ సుందరి ఆ చిత్ర షూటింగ్ కోసం స్పెయిన్ వెళ్లి ఇటీవలే చెన్నైకి తిరిగొచ్చారు. త్వరలో సెల్వరాఘవన్ దర్శకత్వంలో శింబుకు జంటగా నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ ముద్దుగుమ్మ ఇంతకు ముందు ఆయన దర్శకత్వంలో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అనే తెలుగు చిత్రంలో నటించారు. అదే విధంగా శింబు సరసన ఇప్పటికే విన్నై తాండి వరువాయో చిత్రంలో నటించారు. ఈ రెండు చిత్రాలు సక్సెస్ అయ్యాయి. దీంతో ఈ ముగ్గురి కాంబినేషన్లో తెరకెక్కనున్న తాజా చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడటం సహజమే. పారిశ్రామికవేత్త వరుణ్ మణియన్ నిర్మించనున్న ఈ చిత్రం గురించి త్రిష మాట్లాడుతూ తన అభిమాన దర్శకుల్లో సెల్వరాఘవన్ ఒకరన్నారు. అలాంటి దర్శకుడితో మరోసారి కలసి పని చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. సెల్వరాఘవన్ నెల క్రితం ఈ చిత్ర కథ చెప్పారన్నారు. కథ చాలా నాలెడ్జీగా ఉందనిపించిందని అన్నారు. దశాబ్దం దాటినా హీరోయిన్గా వరుస అవకాశాలు వరిస్తున్నాయి. మరి పెళ్లి సంగతేమిటన్న ప్రశ్నకు తనకు సినిమానే ఫస్ట్ అని మ్యారేజ్ తరువాత అని త్రిష పేర్కొనడం విశేషం. -
ఇక ముందు ఓ లెక్క!
నీట్, హాట్.. ఈ రెండు రకాల పాత్రల్లోనూ చక్కగా ఒదిగిపోతారు త్రిష. అందుకే సినిమాల్లోకొచ్చి పదేళ్లు పైనే అయినా ఆమెకు క్రేజ్ తగ్గలేదు. అయితే, ఇప్పటివరకు ఓ లెక్క.. ఇకముందు ఓ లెక్క అన్నట్లుగా ఉంది త్రిష వ్యవహారం. రెండు డ్యూయెట్లు, ఐదు పది సీన్ల తరహా పాత్రలకు దూరంగా ఉండాలనుకుంటున్నారు. ఒకవేళ సినిమాలో తన పాత్రకు ఐదే సీన్లున్నా.. అవి ఎంతో శక్తిమంతంగా ఉండాలని, కథకు కీలకంగా ఉంటే చేస్తానని త్రిష పేర్కొన్నారు. పర్టిక్యులర్‌గా ఏదైనా పాత్ర చేయాలని ఉందా? అనే ప్రశ్నకు - ‘‘అలా ఏం లేదు. ప్రతి ఆర్టిస్ట్‌కి ఓ దాహం ఉంటుంది. నటనకు అవకాశం ఉన్న పాత్ర చేసిన ప్రతిసారీ ఆ దాహం తీరుతుంది. ఆ విధంగా చూస్తే, నాకు చాలాసార్లు ఆ సంతృప్తి లభించింది. ఎన్ని పాత్రలు చేసినా ఇంకా చేయడానికి చాలా మిగిలి ఉంటాయి. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా.. అవసరమైతే డీ-గ్లామరస్‌గా కనిపించాలని డిమాండ్ చేసే పాత్రలకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నా. ఒకవేళ ఆర్ట్ మూవీ అయినా సరే రెడీ’’ అంటున్నారు. -
నేను అంగీకరించలేదు
నటి త్రిష దశ తిరిగింది. ఇది కోలీవుడ్ వర్గాలంటున్న మాట. ఆమె దశ ఇప్పుడు తిరగడమేమిటి గత దశాబ్ద్దకాలంగా హీరోయిన్గా మనగలుగుతుంటేను అంటారా? ఆ విషయం నిజమే అయినా ఈ మధ్య విజయాలు దోబూచులాడటంతో కాస్త వెనుకపడ్డారు. ప్రస్తుతం జయం రవితో నటిస్తున్న భూలోకం, ద్విభాషా చిత్రం రమ్ మాత్రమే ఈ బ్యూటీ చేతిలో ఉన్నాయి. తాజా గా కన్నడ చిత్ర పరిశ్రమలోకి రంగప్రవేశం చేశారు. అక్కడామె పునీత్ రాజ్‌కుమార్‌తో రొమాన్స్ చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌తో ప్రస్తుతం త్రిష బిజీగా ఉన్నారు. ఇది హిట్ అయితే అక్కడ ఒక రౌండ్ చుట్టేసే అవకాశం ఉందంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. తమిళంలో త్రిష నటించిన ఎండ్రెండ్రుం పున్నగై చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో కోలీవుడ్లోను ఈ చెన్నై సుందరికి అవకాశాలు తలుపు తడుతున్నాయట. తాజాగా అజిత్ సరసన నటించే అవకాశం వచ్చిందని సమాచారం. వీరం తరువాత అజిత్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా గౌతమ్ మీనన్ త్రిషను ఎంపిక చేసినట్లు కోలీవుడ్ టాక్. అయితే ఈ విషయాన్ని నటి త్రిష ఖండించారు. అజిత్ సరసన తాను నటించడం లేదని, ఆ చిత్రం కోసం తననెవరూ సంప్రదించలేదని స్పష్టం చేశారు. అయితే కొత్త అవకాశాలు మాత్రం చాలా వస్తున్నాయని ప్రస్తుతానికి ఏ చిత్రాన్ని అంగీకరించలేదని త్రిష పేర్కొన్నారు. -
సల్మాన్‌ఖాన్ తో పెళ్లికి నేను రెడీ...
‘పెళ్లి ప్రతిపాదన తెస్తే... సినీ స్టార్స్‌లో ఎవర్ని ఓకే చేస్తారు?’ అని త్రిషను అడిగితే, ‘సల్మాన్‌ఖాన్’ అని తడుముకోకుండా సమాధానమిచ్చేశారు. దేశంలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో సల్లూభాయ్ ఒకరు అని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అయితే... త్రిష మనసులో కూడా ఈ కండలవీరుడే ఉన్నాడని తెలుసుకొని అక్కడున్నవారందరూ కాస్తంత ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇటీవలే జీవాతో ఆమె నటించిన ‘ఎడ్రెన్డమ్ పున్నాగై’ చిత్రం విడుదలై త్రిషకు మంచి పేరు తెచ్చిపెట్టింది. తమిళంలో త్రిషకు మళ్లీ పూర్వవైభవం తెచ్చిపెట్టిందీ సినిమా. ఇప్పుడు కోలీవుడ్‌లో ఎక్కడ చూసినా ఆ సినిమాలో త్రిష నటన గురించే చెప్పుకుంటున్నారు. ఈ విజయంతో త్రిష కెరీర్ మళ్లీ ఊపందుకుంది. దీంతో ఆమె పెళ్లిపై వినిపిస్తున్న వార్తలకు పుల్‌స్టాప్ పడ్డట్టే అని అందరూ అనుకుంటున్న సమయంలో సల్మాన్‌పై తన మనోగతాన్ని వ్యక్తం చేసి మళ్లీ చర్చకు తెరతీశారు త్రిష. ‘‘సల్మాన్ ఒప్పుకుంటే తనను పెళ్లాడటానికి నేను రెడీ’ అని సీరియస్‌గా త్రిష ఇచ్చిన సమాధాన ం సల్లూభాయ్‌పై తనకున్న ప్రేమను బహిర్గతం చేస్తోంది కదూ!