కేజ్రీవాల్‌ను సీఎంగా తొలగించలేం: ఢిల్లీ హైకోర్టు

Delhi HC Rejects PIL For Removal Of Arvind Kejriwal From CM Post - Sakshi

ఢిల్లీ, సాక్షి: ఆప్‌ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. లిక్కర్‌ స్కాం కేసులో అరెస్టైన ఆయన్ని సీఎం పదవి నుంచి తొలగించాలని ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అయితే.. ఢిల్లీ హైకోర్టు గురువారం ఆ పిల్‌ను కొట్టేసింది.

కేజ్రీవాల్‌ను సీఎంగా తొలగించలేమని.. అలాగే జైలు నుంచి కేజ్రీవాల్‌ పాలన నడిపించడాన్ని కూడా తాము అడ్డుకోలేమని ఉన్నత న్యాయస్థానం పిటిషనర్‌కు తెలిపింది. ఈ మేరకు చీఫ్‌ జస్టిస్‌ మన్మోహన్‌(తాత్కాలిక), జస్టిస్‌ మన్‌మీత్‌ ప్రీతం సింగ్‌ అరోరా నేతృత్వంలోని ధ్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. 

ఆర్థిక కుంభకోణంలో నేరారోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి  సీఎం పదవిలో కొనసాగేందుకు అనర్హుడంటూ ఢిల్లీకి చెందిన రైతు, సామాజిక వేత్త సుర్జిత్‌సింగ్‌ యాదవ్‌ ఈ పిటిషన్‌ వేశారు.

Election 2024

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top