ఒక్క నిమ్మకాయ ఖరీదు రూ.50 వేలు, స్పెషల్‌ ఏంటంటే?

Nine Lemons Sold Rs 2 36 Lakh in Tamil Nadu - Sakshi

అసలే ఎండాకాలం నిమ్మకాయలకు మంచి డిమాండ్ ఉంది. మార్కెట్లో కూడా నిమ్మకాయల ధరలు వేడిగానే ఉన్నాయి. ఒక నిమ్మకాయ పది రూపాయలంటేనే కొనుగోలుదారుడు ఓ అడుగు వెనక్కి వేస్తాడు. కానీ తమిళనాడులో మాత్రం తొమ్మిది నిమ్మకాయలు ఏకంగా రూ.2.36 లక్షలకు అమ్ముడయ్యాయి. ఇంత ధరకు అమ్ముడు పోవడానికి కారణం ఏంటనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని మురుగన్ (సుబ్రమణ్య స్వామి) దేవాలయ నిర్వాహకులు ఉతిరమ్ పండుగ సందర్భంగా నిమ్మకాయలను వేలం వేస్తారు. సంతానం కోసం ప్రయత్నిస్తున్న జంటలు ఈ పండుగ సందర్భంగా ఆలయాన్ని సందర్శించి వేలంలో నిమ్మకాయలను కొనుగోలు చేస్తారు. ఇందులో తొమ్మిది నిమ్మకాయలు రూ.2.36 లక్షలకు అమ్ముడయ్యాయి.

తొమ్మిది రోజుల పండుగలో మొదటి రోజున బల్లెముపై ఉన్న నిమ్మకాయ అన్నింటికంటే శక్తివంతమైనదని భక్తులు విశ్వసిస్తారు. ఈ నిమ్మకాయను ఈ సంవత్సరం ఒక జంట రూ.50,500 కి కొనుగోలు చేశారు. ఆ తరువాత కూడా ఆయాల ఉత్సవాల్లో ప్రతి రోజు పూజారులు దేవుడి బల్లెంపై ఒక నిమ్మకాయను ఉంచి పూజిస్తారు. 

కేవలం బిడ్డలను కనాలని చూస్తున్న వారికే మాత్రమే కాదు, వ్యాపారవేత్తలు కూడా ఈ నిమ్మకాయల కోసం పోటీ పడతారని స్థానిక చెబుతున్నారు. దేవాలయాల్లోని నిమ్మకాలయలను భారీ ధరకు వేలంలో విక్రయించడం ఇదేమీ కొత్త కాదు. 2018లో కూడా తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో టెంపుల్ ఫెస్ట్‌లో భాగంగా ఒక నిమ్మకాయను 7600 రూపాయలకు విక్రయించారు.

Election 2024

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top