Arunachal: అరుణాచల్‌లో బీజేపీకి తొలి విజయం?.. ఐదుగురు ఐదుగురు ఏకగ్రీవం?

Arunachal BJP Candidates to Win Unopposed - Sakshi

అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీజేపీకి సానుకూల వాతావరణం ఏర్పడింది. ముఖ్యమంత్రి పెమా ఖండూ సహా ఐదుగురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావచ్చని సమాచారం. 

మార్చి 26, బుధవారం నామినేషన్‌కు చివరి తేదీ అని, అయితే  రాష్ట్రంలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఇతర పార్టీల అభ్యర్థులెవరూ  నామినేషన్ దాఖలు చేయలేదని ఓ అధికారి తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని రెండు లోక్‌సభ,  60 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 19న ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ బుధవారం సాయంత్రంతో ముగిసినట్లు అధికారి తెలిపారు. 

గురువారం నామినేషన్ పత్రాల పరిశీలన జరుగుతుందని, మార్చి 30 వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చన్నారు. గురువారం నామినేషన్ పత్రాల పరిశీలన తర్వాత ఆ ఐదుగురు బీజేపీ అభ్యర్థులు ఏకపక్షంగా గెలుస్తారా లేదా అనేది నిర్ణయిస్తామని జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ లైకెన్ కోయు మీడియాకు తెలిపారు. రాష్ట్రంలోని 60 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 197 మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు. 

అరుణాచల్ ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి పెమా ఖండూ, ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్‌తో సహా ఐదుగురు అభ్యర్థులు ఎన్నికలలో ఏకగ్రీవంగా గెలిచారని బీజేపీ పేర్కొంది. వీరు పోటీ చేస్తున్న చోట నుంచి చివరి రోజు వరకు ఇతర పార్టీల అభ్యర్థులెవరూ నామినేషన్ దాఖలు చేయలేదని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి తేజీ నేచా పేర్కొన్నారు. 

Election 2024

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top