Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Sakshi Editorial On Chandrababu Alliance Govt By Vardhelli Murali1
గ్రేట్‌ ఆంధ్రా మ్యాజిక్‌ షో!

పీసీ సర్కార్‌ ఇంద్రజాలం గొప్పదా... ఏపీ సర్కార్‌ ఇంద్ర జాలం గొప్పదా? పీసీ సర్కార్‌ మ్యాజిక్‌ ట్రిక్స్‌ ఈ దేశ ప్రజలను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తేవని విన్నాము. ఏపీ సర్కార్‌ ట్రిక్స్‌ మాత్రం ప్రజలను షాక్‌ మీద షాక్‌కు గురిచేస్తున్నాయి. అది... స్టేజ్‌ షో. అంతా మ్యాజిక్‌ అనే సంగతి ముందుగానే తెలుసు! కానీ, ఇది... జనజీవితంతో ఆటాడుకోవడం! మోసపోతున్నా మని ముందుగా ప్రజలకు తెలియదు. క్రమంగా అనుభవంలోకి వస్తుంది. ఎన్నికలకు ముందు ఇంటింటికీ ఓ వైకుంఠాన్ని వాగ్దానం చేసిన మ్యానిఫెస్టో కూడా మ్యాజిక్‌ షోలో భాగమని అప్పుడు అర్థం కాలేదు. మెజీషియన్‌ దాన్ని తన టోపీలో పడే శారు. ఇప్పుడా టోపీలోంచి కుందేళ్లు, కుక్కపిల్లలు వగైరాలే వస్తున్నాయి. మ్యానిఫెస్టో మాయమైంది.ఇంద్రజాల విద్యలతో జనాన్ని ఆహ్లాదపరచాలని, హామీల సంగతిని మరిపింపజేయాలని చంద్రబాబు సర్కార్‌ ప్రయాస పడుతున్నది. అందులో భాగంగా ఆయన నాలుగు రోజులకో కొత్త ట్రిక్కును నేర్చుకొస్తున్నారు. వేదికల మీద వాటిని ప్రదర్శి స్తున్నారు. కీలకమైన మూడు అంశాల్లో వాస్తవాలకు గంతలు కట్టడానికి, ప్రజలను భ్రమల్లో ముంచెత్తడానికి శతవిధాలైన విన్యాసాలను ఆయన ప్రదర్శిస్తున్నారు. ఇందులో మొదటి అంశం – అభివృద్ధి అనే పదానికి తననే నిర్వచనంగా చెప్పు కోవడం, అభివృద్ధికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా తనను తాను ప్రమోట్‌ చేసుకోవడం! కానీ, వాస్తవ పరిస్థితి? ఈ పది మాసాల కాలంలోనే అప్పుల్లో రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రికార్డులను బద్దలు కొట్టింది. ప్రజల కొనుగోలుశక్తి దారుణంగా పడిపోయింది. పన్నుల వసూళ్లు మందగించాయి. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు తిరోగమన పథంలోకి వెళ్లాయి. రైతు కుటుంబాలు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నాయి. ప్రభుత్వ నిర్వాకం కారణంగానే ధాన్యం రైతుల దగ్గర్నుంచి ఆక్వా రైతుల వరకు అందరూ దయనీయ స్థితిలోకి జారిపోతున్నారు. విద్యుత్‌ బిల్లుల భారంతో వేలాది ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ పరిశ్రమలు మూతపడ్డాయి. ఇరవై వేలమంది ఉపాధి కోల్పోయారు.బాబు సర్కార్‌ మ్యాజిక్‌ చేయదలచుకున్న రెండో అంశం – సంక్షేమ రంగం. సంక్షేమం అంటేనే తెలుగుదేశం పార్టీ గుర్తు కొస్తుందని బహిరంగ సభల్లో చంద్రబాబు చెప్పుకొస్తున్నారు. ఎన్నికలకు ముందు కూటమి తరఫున ఆయన చేసిన వాగ్దానాల సంగతిని కాసేపు మరిచిపోదాం. అంతకుముందు జగన్‌ ప్రభుత్వం అమలుచేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలను చాప చుట్టేసి అటకెక్కించారు. ‘అమ్మ ఒడి’ ఆగిపోయింది. మహిళలకు ‘చేయూత’ అందడం లేదు. ‘వైఎస్సార్‌ బీమా’ కనుమరుగైంది. ‘మత్స్యకార భరోసా’ మాయమైంది. ‘కల్యాణమస్తు’ కనిపించడం లేదు. ఆటో డ్రైవర్లకు ‘చేదోడు’ లేదు. చిల్లర వర్తకులకు తోడుగా నిలిచిన రుణ సదుపాయం నిలిచిపోయింది. ఇవి కొన్ని మాత్రమే! చెప్పుకుంటూ పోతే సంక్షేమం కథ చాలా పెద్దది.ఇక మూడో ఇంద్రజాల ఇతివృత్తం – తనను తాను గొప్ప ప్రజాస్వామికవాదిగా ప్రచారం చేసుకోవడం. తన రాజకీయ జీవితంలో ఎన్నడూ హింసా రాజకీయాలు చేయలేదు. కక్షలూ కార్పణ్యాలకు పూనుకోలేదు. వ్యక్తిత్వ హననాలకు పాల్పడలేదని బాబు చాలా సందర్భాల్లో చెప్పుకుంటున్నారు. అనుబంధ మీడియా ఇంకో నాలుగడుగులు ముందుకెళ్లి ఆయన్ను ప్రమోట్‌ చేస్తున్నది. ఈ ప్రమోషన్‌కూ, వాస్తవ పరిస్థితికీ మధ్యన 180 డిగ్రీల దూరం ఉన్నదని పది నెలల కాలంలో జరిగిన అనేక ఘటనలు రుజువు చేశాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరావడంతోనే ప్రత్యర్థుల వేట మొదలుపెట్టింది. వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లను బహిరంగంగా నరికి చంపుతున్న భయానక దృశ్యాలను చూడవలసి వచ్చింది. పల్నాడు వంటి ప్రాంతాల్లో వేలాదిమంది ప్రజలు దాడులకు భయపడి ప్రవాస జీవితాలు గడపవలసి వచ్చింది. సోషల్‌ మీడియాలో విమర్శలు చేసేవారి మీద దారుణమైన సెక్షన్లతో కేసులు పెట్టారు. 50 పైచిలుకు మందిని అరెస్టు చేశారు. వందలాది మందిపై కేసులు నమోదయ్యాయి. బీఎన్‌ఎస్‌ 111 సెక్షన్‌ను దుర్వినియోగం చేస్తు న్నారని పోలీసులను పలుమార్లు ఉన్నత న్యాయస్థానం మంద లించవలసి వచ్చింది. ‘రెడ్‌బుక్‌’ గైడ్‌లైన్స్‌ ప్రకారం పనిచేయా లని పోలీసులను వారి ఉన్నతాధికారులే ఒత్తిడి చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో ఎన్నడూ ఎరుగని పరిణామాలివి.తనకు లేని ఘనతల్ని ఆపాదిస్తూ యెల్లో మీడియా తగిలించిన భుజకీర్తులను కాపాడుకోవడానికి చంద్రబాబు ఇప్పుడు మ్యాజిక్‌ షోలను ఆశ్రయించక తప్పడం లేదు. అమరావతి ప్రాంతంలో కొన్ని కృత్రిమ మెరుపుల్ని మెరిపించి, ‘అదిగో అభి వృద్ధి’ అని చెప్పుకోవాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అమరావతి పేరుతో 30 వేల కోట్ల అప్పులు ఇప్పటికే తీసు కొచ్చారు. రైల్వే స్టేషన్‌ ఎక్కడొస్తుందో ప్రకటించారు. బస్టాండ్‌ స్థలాన్ని గుర్తించడం జరిగింది. అద్భుతమైన స్టేడియం వస్తుందని ప్రచారం చేశారు. ఆకాశ హర్మ్యాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఐటీ పరిశ్రమను వేలు పట్టుకొని హైదరాబాద్‌కు తీసుకొచ్చిన తాను, అదే చందంగా ‘క్వాంటమ్‌ వ్యాలీ’ని అమ రావతికి పిలుచుకొస్తానని కూడా చంద్రబాబు పదేపదే ప్రక టిస్తున్నారు. ‘క్వాంటమ్‌ వ్యాలీ’ ఏర్పాటుకు అవసరమయ్యే భౌతిక, మే«ధాపరమైన పరిస్థితులు అమరావతిలోనే కాదు,ఆంధ్రప్రదేశ్‌లోనే లేవనేది నిపుణుల అభిప్రాయం. సమీప భవి ష్యత్తులో అటువంటి ఎకో సిస్టమ్‌ ఏర్పడే అవకాశాలు కూడా లేవని వారు చెబుతున్నారు.అయినా సరే, అమరావతి టైర్లలో గాలి నింపడానికి ఆయన ఇటువంటి అసంగతమైన సంగతులు ఇంకా ఎన్నయినా చెప్ప వచ్చు. అయినప్పటికీ అక్కడ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో కదలిక కనిపించడం లేదు. అక్కడ ప్లాట్లు కొనేందుకు జనం ఎగబడడం లేదు. చివరికి మొన్న అమరావతి కోర్‌ క్యాపిటల్‌ ప్రాంతంలో ఐదెకరాల పైచిలుకు విస్తీర్ణం (25 వేల చదరపు గజాలు)లో ఉన్న ప్లాట్‌లో స్వగృహ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. వెలగ పూడి గ్రామానికి చెందిన కంచర్ల కుటుంబం వారు తమ 29 ఎకరాల 51 సెంట్ల వ్యవసాయ భూమిని ల్యాండ్‌ పూలింగ్‌కు అప్పగించగా వారికి 25 వేల చదరపు గజాల ప్లాటు కోర్‌ క్యాపి టల్‌ ఏరియాలో లభించింది. 18 కోట్ల 75 లక్షల రూపాయలు వెచ్చించి ఈ భూమిని నారా బ్రాహ్మణి పేరుతో ఉన్న ట్రస్టు ద్వారా కొనుగోలు చేశారు. అంటే గజానికి 7,500 పడిందన్న మాట. కోర్‌ క్యాపిటల్‌ ప్రాంతంలో మరీ ఇంత తక్కువ రేటేమిటో?ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సీనియర్‌ మోస్ట్‌ రాజకీయవేత్త మిగిలిన సొమ్మును బ్లాక్‌లో చెల్లించి ఉంటారని అనుకోలేము కదా! అమరావతిలోని చాలా ప్రాంతాల్లో రిజిస్ట్రే షన్‌ విలువ గజానికి ఐదు వేలు మాత్రమే ఉందట! చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఇంత తక్కువ విలువ ఎక్కడా లేదు. ప్రపంచంలోని ఐదు పెద్ద నగరాల్లో ఒకటిగా నిలబెట్టాలని తలపోస్తున్న అమరావతిలో ఈ విలువేమిటో అర్థం కాదు. ప్రస్తుతం అమరావతి పట్నం ‘బ్లాక్‌’ ఈజ్‌ బ్యూటీ అని కలవరిస్తున్నది. పిలు స్తున్నది. కానీ ఆ బ్యూటీ మాత్రం అమరావతిని ఇంకా కరుణించడం లేదు. ఎప్పుడు కరుణిస్తుందో, రియల్‌ ఎస్టేట్‌ ఎప్పుడు పుంజుకుంటుందో, ఆకాశహర్మ్యాలకు పునాదులు ఎప్పుడు పడతాయో! అప్పటికీ తన మీద అభివృద్ధి ప్రదాత అనే స్టాంపు వేయించుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం చేయగలిగినంత మ్యాజిక్‌ను చేస్తూనే ఉన్నది.అభివృద్ధి ముద్ర కోసం అమరావతి ముసుగును వేసు కున్నట్టే... సంక్షేమం సర్టిఫికెట్‌ కోసం ఆయన ‘పీ–ఫోర్‌’ అనే దౌర్భాగ్య సిద్ధాంతాన్ని ముందుకు తెస్తున్నారు. పేదరిక నిర్మూలనకు కృషి చేయవలసిన ప్రభుత్వ బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేల మీద పుట్టిన ప్రతి జీవి ఈ దేశ సంపదలో హక్కుదారేనన్నది సహజ న్యాయం.ఆ సహజ న్యాయం రాజ్యాంగ హక్కుగా పౌరులందరికీ భరోసా నిచ్చింది. కానీ, దేశ సంపదను ప్రైవేటీకరించడంలో ఉత్సాహాన్ని ప్రదర్శించే చంద్రబాబు పేద ప్రజలను కూడా ప్రైవేటీకరించడానికి పూనుకున్నారు. తమ హక్కుల సాధన కోసం, తమ న్యాయమైన వాటా కోసం పిడికిళ్లు బిగించ వలసిన ప్రజలను మభ్యపెట్టి, తక్షణావసరాల కోసం సంప న్నుల ముందు సాగిలపడేట్టు ప్రోత్సహిస్తున్నారు. తన సంక్షేమ బాధ్యతల నుంచి తప్పుకొని తన అనుచరులకు సంపద సృష్టించే పథకాల గురించి ఆయన ఆలోచిస్తున్నారు. ‘పీ–ఫోర్‌’ మంత్రంతో పేదరికం పోదు. ఈ మ్యాజిక్‌ ఎక్కువ కాలం చెల్లదు. అనగనగా ఒక చిత్తకార్తె చతుష్పాద జీవి లాంటి వెధవొకడు టీడీపీకి అనుబంధ సోషల్‌ మీడియాలో కిరాయి సైనికుడు. వైసీపీ అగ్రనేత మీద సొల్లు వాగాడు. ఈ రకమైన వాగుడు, అటువంటి పోస్టింగులు అతడికి చిరకాలంగా అలవాటే! కానీ, మొన్నటి ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి ఖండించారు. అతడిని పార్టీ నుంచి తప్పిస్తున్నట్టు ప్రక టించారు. అరెస్ట్‌ చేశారు. స్వాగతించవలసిన విషయమే! కానీ, ఈ వ్యవహారంలో చిత్తశుద్ధి ఉండాలనేది సహజమైన ఆకాంక్ష. ఈ ఖండన వెలువడిన వెంటనే సిద్ధంగా ఉన్నట్టుగా యెల్లో మీడియా స్పందించింది. చంద్రబాబును ప్రశంసలతో ముంచె త్తింది. ఇమేజ్‌ మేకోవర్‌ ఎక్సర్‌సైజని అర్థమవుతూనే ఉన్నది. అదే బాధాకరం. రెడ్‌బుక్‌ రాజ్యాంగ పాలన జరుగుతున్నదని ఈ పది నెలల పాలనపై ఆరోపణలు వస్తున్నాయి. చిత్తశుద్ధి వుంటే దీన్ని సరిదిద్దుకోవాలి. కానీ హైకోర్టు హెచ్చరిస్తున్నా ఈ పాలనలో మార్పు రావడం లేదు. టీడీపీ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఐటీడీపీలో వందలాదిమంది సైకోల్లాంటి కిరాయి సైనికులు పనిచేస్తున్నారు. వారి జుగుప్సాకరమైన రాతలతో, వాగుడుతో ఎంతోమంది కలతచెందిన ఘటనలున్నాయి. ఎన్ని కలకు ముందు గుంటూరు జిల్లాలో గీతాంజలి అనే గృహిణి ఈ వేట కుక్కల దాడి తట్టుకోలేక, ఆత్మహత్య చేసుకున్నది. అప్పుడే ఖండించి ఉంటే, చర్యలు తీసుకొని ఉంటే పరిస్థితులు ఇలా దిగజారి ఉండేవా? విజయవాడలో జగన్‌ మామ గురించి ఆప్యాయంగా మాట్లాడిన ఓ పసిబిడ్డ మీద అవాకులు చవాకులు పేలినప్పుడైనా ఈ ఖండన రావాల్సింది. ఇటువంటి అను భవాలు కోకొల్లలు. ఎప్పుడూ స్పందించలేదు. పైపెచ్చు ప్రోత్సహించారని మొన్నటి సొల్లు వెధవే ఒక వెబ్‌ చానల్‌లో చెప్పుకొచ్చాడు. ఈ కారణాల రీత్యా, దిగజారి పోతున్న ప్రతిష్ఠను కాపాడుకోవడానికే ఇలా స్పందించారని భావించవలసి వస్తున్నది. మ్యాజిక్‌ షోలెప్పుడూ మ్యానిఫెస్టో అమలుకు ప్రత్యామ్నాయం కాబోవు. అలా భావిస్తే భంగపాటు తప్పదు!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

Russian Missile Strikes Indian Pharma Firm In Ukraine2
మాతో స్నేహం అంటూనే దాడి చేస్తారా?.. రష్యాపై భారత్‌ సీరియస్‌

కీవ్‌: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను టార్గెట్‌ చేసిన రష్యా దళాలు.. భీకర దాడులు చేశాయి. ఈ క్రమంలో భారతీయ ఔషధ కంపెనీ గోదాముపై రష్యా దాడి చేసింది. దీంతో, పేలుడు సంభవించి దట్టమైన మంటలు చెలరేగాయి. మరోవైపు.. రష్యా దాడులను భారత్‌ తీవ్రంగా ఖండించింది. భారత్‌తో స్నేహం ఉందని చెప్పే రష్యా కావాలనే ఇలా దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్‌ అంటూ ప్రశ్నించారు.వివరాల ప్రకారం.. కీవ్‌లోని భారతీయ ఔషధ కంపెనీ కుసుమ్‌ అనే కంపెనీకి చెందిన గోదాముపై శనివారం రష్యా దాడి చేసింది. రష్యాకు చెందిన డ్రోన్ల దాడిలో గోదాం పూర్తిగా ధ్వంసమైంది. ఈ మేరకు గోదాంపై దాడి జరిగిందని ఢిల్లీలోని ఉక్రెయిన్‌ రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈ సందర్భంగా ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ.. రష్యా కావాలనే భారతీయ కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించింది. పిల్లలు, వృద్ధుల కోసం ఔషధాలు నిల్వ చేసిన గోదాములపై ఇలా దాడులు చేస్తోందని విమర్శించింది. భారత్‌తో స్నేహం ఉందని చెప్పే రష్యా కావాలనే ఇలా దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్‌ అంటూ ప్రశ్నించింది.Breaking⚡️ : #Ukraine allege Indian pharmaceutical company godown hit by Russia leading to loss of medicines meant for children and distress people. Still to receive any statement from India or Moscow. #RussiaUkraineWar pic.twitter.com/VfpYND8PNq— Neeraj Rajput (@neeraj_rajput) April 12, 2025ఇక, అంతకుముందు ఉక్రెయిన్‌లోని బ్రిటన్‌ రాయబారి మార్టిన్‌ హారిస్‌ దాడిని ధ్రువీకరించారు. రష్యా డ్రోన్ల దాడిలో ఔషధాల గోదాము పూర్తిగా ధ్వంసమైందని తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్‌తోపాటు 29 దేశాల్లో తమ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని కుసుమ్‌ హెల్త్‌కేర్‌ వెబ్‌సైట్‌లో ఉంది. భారతీయ వ్యాపారవేత్త రాజీవ్ గుప్తా యాజమాన్యంలోని కుసుమ్, ఉక్రెయిన్‌లోని అతిపెద్ద ఫార్మా సంస్థలలో ఒకటి.

Chandrababu Naidu Another Grand Palace At Capital Amaravati3
చంద్రబాబు మరో మహా ప్యాలెస్‌

సాక్షి, అమరావతి: సువిశాల విస్తీర్ణంలో హైదరా­బాద్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో కళ్లు జిగేల్‌మ­నేలా రూ.వందల కోట్ల విలువైన అత్యంత విలాసవంతమైన రాజభవనం..! నిజాం నవాబు తరహాలో హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున కొండాపూర్‌లో హైటెక్‌ సిటీకి కూతవేటు దూరంలో ఊహకు అందని రీతిలో ఐదెకరాలలో ఓ భారీ ఫాంహౌస్‌..! వీటికి­తోడు అమరావతిలో రూ.వందల కోట్లతో.. మరో ఐదు ఎకరాల్లో ఇంకో రాజభవనాన్ని నిర్మించుకుంటున్నారు సీఎం చంద్రబాబు..! అత్యాధునిక హంగులు.. కనీవిని ఎరుగని అధునాతన రీతిలో.. రాజ­ధాని అమరావతి నడిబొడ్డున.. వెలగపూడిలో తాత్కా­లిక సచివాలయం సమీపంలో చేపట్టే ఈ ప్యాలెస్‌ నిర్మాణ పనులను తనకు అత్యంత సన్నిహితుడికి చెందిన సంస్థకు అప్పగించారు. దీనికి ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు భూమి పూజ చేశారు. కాగా, దీనికోసం వెలగపూడిలో సర్వే నంబర్‌ 111, 112, 113, 122, 150, 152, 239లలోని 5.16 ఎకరాలను (25 వేల చదరపు గజాలు) చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేశ్‌ భార్య నారా బ్రాహ్మణి పేరుతో రూ.18.75 కోట్లకు కొనుగోలు చేయడం గమనార్హం. అంటే గజం రూ.7,500 చొప్పు­న ఖరీదు చేశారు. కాగా, చంద్రబాబు అమరావతి ప్రాంతంలో చదరపు గజం రూ.60 వేలు పలుకుతోందని చెబుతుంటారు. ఈ ప్రకారం చూస్తే నాలుగు వైపులా రోడ్డు ఉన్న వెలగపూడిలోని స్థలం విలువ సుమారు రూ.150 కోట్ల వరకు ఉంటుంది. మరి రాజభవనం నిర్మాణానికి ఇంకెన్ని రూ.వందల కోట్లు వ్యయం చేస్తారోనని రాష్ట్ర ప్రజలు విస్తుపోతున్నారు. బాబుకు ఉన్నవి అన్నీ ప్యాలెస్‌లే..చంద్రబాబుకు ఇప్పటికే హైదరాబాద్‌లో అత్యంత సంపన్నులు ఉండే జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ సమీపంలో రూ.వందల కోట్లతో నిర్మించిన భారీ ప్యాలెస్‌ ఉంది. దీనిని పక్కనున్న భవనాలు, స్థలాలు కొనేసి సువిశాల విస్తీర్ణంలో నిర్మించడం గమనార్హం. 2014–19 మధ్య అధికారంలో ఉండగా దీని నిర్మాణానికి ప్రయత్నాలు ప్రారంభించారు. 2019 ఎన్నికలకు ముందు గృహ ప్రవేశం చేశారు. అంతకు­ముందే జూబ్లీహిల్స్‌లో చంద్రబాబుకు సువిశాల విస్తీర్ణంలో ప్యాలెస్‌ ఉండేది. దానిని కూల్చివేసి.. అధునాతన సాంకేతికత, అత్యాధునిక హంగులతో రాజభవనం నిర్మించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి అత్యంత ఖరీదైన ఉపకరణాలను దిగుమతి చేసుకుని నిర్మాణంలో వినియోగించారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో చంద్రబాబు ఇంద్రభవనం మదీనాగూడలో నిజాం నవాబును తలదన్నేలా..హైదరాబాద్‌లోని కొండాపూర్‌ ప్రాంతం హైటెక్‌ సిటీకి దగ్గరగా ఉంటుంది. చాలా ఖరీదైనదిగా పేరుగాంచింది. అక్కడికి సమీపంలోని మదీనాగూ­డలో చంద్రబాబుకు ఐదు ఎకరాల ఫాంహౌస్‌ ఉంది. దీని విలువ రూ.వందల కోట్లలోనే ఉంటుంది. నిజాం నవాబును తలపించే రీతిలో వైభోగం అన్న­మాట. మరోవైపు హైదరాబాద్‌లో సంపన్న ప్రాంత­మైన జూబ్లీహిల్స్‌లో రాజభవనం లాంటి నివాసం. బహుశా దేశంలో సంపన్నులు ఉండే ప్రాంతంలో రాజభవనం, ఫాంహౌస్‌ చంద్రబాబుకు ఒక్కరికే ఉందని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు.పదేళ్లుగా అక్రమ ప్యాలెస్‌లో విలాసంచంద్రబాబు.. పదేళ్లుగా ఉండవల్లి సమీపాన కృష్ణా నది కరకట్ట లోపల లింగమనేని రమేష్‌ అక్రమంగా నిర్మించిన విలాసవంతమైన బంగ్లాలో నివసిస్తున్నారు. రమేష్‌ అత్యాధునిక హంగులతో ఈ భారీ బంగ్లాని నిర్మించారు. కాగా, 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చంద్ర­బాబు ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు. ఆడియో టేపుల సాక్షిగా ఆయన బండారం బయటపడింది. అప్పటి తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ చర్యలు తీసుకుంటుందోనన్న భయంతో హైదరాబాద్‌ను ఉన్నపళంగా వదిలి వచ్చేశారు. లింగమనేని అక్రమ బంగ్లాను నివాసంగా ఎంచుకున్నారు. అప్పటినుంచి.. అంటే పదేళ్లుగా అందులోనే ఉంటున్నారు.ఉండవల్లిలో కృష్ణానది కరకట్ట వెంట చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ భవనం పార్టీ వారికీ ప్రవేశం లేదు..చంద్రబాబు తాజాగా వెలగపూడిలో తలపెట్టిన రాజభవన నిర్మాణం భూమి పూజకు టీడీపీ నేతలను సైతం ఆహ్వానించకపోవడడం గమనార్హం. ఇక జూబ్లీహిల్స్‌లోని రాజభవనం గృహ ప్రవేశ కార్యక్రమానికి పార్టీ నేతలను ఎవరినీ ఆహ్వానించలేదని టీడీపీ సీనియర్‌ నేతలు చెబుతుంటారు. అందులోకి ఇప్పటికీ తమ పార్టీ నేతలకు ప్రవేశం లేదని అంటుంటారు.కొత్త రాజభవనం.. నిర్మాణానికి ఇంకెన్ని కోట్లో..?చంద్రబాబు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో ఆరేళ్ల కిందట నిర్మించుకున్న రాజ భవనానికే రూ.వందల కోట్లు వ్యయం అయినట్లు చెబుతుంటారు. ఇప్పుడు అమరావతిలో తలపెట్టిన రాజభవనం మరింకెన్ని కోట్లు ఉంటుందోనని అంటున్నారు. భూమి కొనుగోలుకే రూ.18 కోట్లకు పైగా వ్యయం చేసిన నేపథ్యాన్ని గుర్తు చేస్తున్నారు. పైగా వెలగపూడిలో ఏకంగా 5.16 ఎకరాల్లో నిర్మాణం చేపట్టనుండడాన్ని ప్రస్తావిస్తున్నారు.అప్పుడు ఇప్పుడు అధికారంలో ఉండగానే..చంద్రబాబు జూబ్లీహిల్స్‌ రాజభవనం నిర్మా­ణాన్ని 2019కి ముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే చేపట్టి పూర్తి చేశారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉండగానే వెలగ­పూడిలో మరింత భారీఎత్తున రాజభవనం నిర్మాణం చేపట్టడం గమనార్హం.అద్దాల మేడల్లో ఉంటూ అవతలి వారిపై దుష్ప్రచారంతాను 5.16 ఎకరాల్లో రాజభవనం కట్టుకుంటూ పేదవాడిననే బిల్డప్‌లుపార్టీ కార్యాలయం లేకుండానే భారీ విస్తీర్ణంలో నిర్మాణానికి ప్రయత్నంవైఎస్‌ జగన్‌ 2 ఎకరాల్లో పార్టీ కార్యాలయం, ఇల్లు నిర్మించుకుంటే నిందలుతాడేపల్లి ప్యాలెస్‌ అంటూ తీవ్ర స్థాయిలో చంద్రబాబు దుష్ప్రచారంవిశాల విస్తీర్ణంలో జూబ్లీహిల్స్‌లో, మదీనాగూ­డలో రాజభవనాలు కలిగి.. ప్రస్తుతం అక్రమంగా కట్టిన విలాసవంతమైన భారీ బంగ్లాలో ఉంటూ.. కొత్తగా మరో భారీ రాజభవనం నిర్మాణా­నికి పూను­కున్న చంద్రబాబు తాను నిరుపేదను.. గుడిసె వాసిని అనే తరహాలో బీద అరుపులు అరుస్తుంటారు. అవతలివారిపై అకారణంగా నిందలు వేస్తుంటారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలో రెండు ఎకరాల విస్తీర్ణంలో ఇల్లు, పార్టీ కార్యాలయం నిర్మించుకున్నారు. వాటిని చూపుతూ తాడేపల్లి ప్యాలెస్‌ అంటూ తరచూ చంద్రబాబు, ఎల్లో మీడియా, పచ్చ దండు దుష్ప్రచారం చేస్తుంటారు. తాను ఉంటున్న ఇంద్ర భవనాలు మాత్రం పూరి గుడిసెలు అన్నట్లు ప్రజ­లను నమ్మించడానికి చంద్రబాబు ఎప్పటి­కప్పుడు కొత్త కొత్త ప్రచారాలు తెరపైకి తెస్తుంటారు.

Weekly Horoscope In Telugu From 13-04-2025 To 19-04-20254
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం....వీరికి అన్నింటా విజయాలే. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. కళారంగం వారికి కృషి ఫలిస్తుంది. వారం చివరిలో ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. నీలం, లేత గులాబీరంగులు. శ్రీ ఆదిత్య హృదయం పఠించండి.వృషభం..పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థిక లావాదేవీల్లో పురోగతి ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. బంధువుల రాకతో సంతోషంగా గడుపుతారు. వాహనయోగం. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు విస్తరించడంలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. రాజకీయవర్గాలకు మంచి గుర్తింపు రాగలదు. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. ఆకుపచ్చ, లేత నీలం రంగులు. శ్రీ మేధా దక్షిణామూర్తి స్తుతి మంచిది.మిథునం.... గతంలో నిలిచిపోయిన కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి సహాయం కోరతారు. ఆర్థిక విషయాలలో పురోగతి సాధిస్తారు. బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. భూవివాదాలు పరిష్కరించుకుంటారు. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలలో అడుగు ముందుకు వేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు సాధిస్తారు. కళారంగం వారికి అవకాశాలు పెరుగుతాయి. వారం ప్రారంభంలో మిత్రులతో కలహాలు. కుటుంబంలో ఒత్తిడులు. నీలం, ఆకుపచ్చ రంగులు. శ్రీ భువనేశ్వరీదేవి స్తోత్రాలు పఠించండి.కర్కాటకం...పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. ఆలోచనలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగాలు ఉత్సాహవంతంగా కొనసాగుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. శ్రీ కాలభైరవాష్టకం పఠించండి.సింహం...ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఒత్తిడులు, సమస్యలు మీ సహనాన్ని పరీక్షిస్తాయి, ఆత్మస్థైర్యంతో అడుగువేయండి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు ఏర్పడవచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిరుద్యోగుల ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఉద్యోగాలలో మార్పులు సంభవం. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. స్వల్ప ధనలాభం. ఎరుపు, పసుపు రంగులు. శ్రీవారాహీ స్తోత్రం పఠించండి..కన్య...ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆసక్తికర సమాచారం అందుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆర్థికంగా కొంత బలం చేకూరి రుణాలు తీరతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. వాహన, గృహయోగాలు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. పారిశ్రామికవర్గాల యత్నాలు సఫలం. వారం చివరిలో మిత్రులతో కలహాలు. శ్రమ పెరుగుతుంది. గులాబీ, తెలుపు రంగులు. శ్రీ గురుదత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.తుల...ఆర్థికంగా కొంత అనుకూలస్థితి ఉంటుంది. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. సోదరుల నుంచి పిలుపు అందుతుంది. వాహనయోగం. వ్యాపారాలలో చిక్కులు తొలగి లాభాల బాటలో పయనిస్తారు. ఉద్యోగాలలో మీకు ఎదురుండదు. కళారంగం వారికి సన్మానాలు జరుగుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, నేరేడు రంగులు. శ్రీ దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.వృశ్చికం...అనూహ్యమైన రీతిలో పనులు పూర్తి కాగలవు. అనుకున్న ఆశయాలు సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనయోగం. ముఖ్య విషయాలపై బంధువులతో చర్చిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో మానసిక ఆందోళన. బంధువులతో అకారణ వైరం. దూరప్రయాణాలు. .శ్రీ ఆంజనేయ దండకం పఠించండి.ధనుస్సు..కొన్ని పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. ఆప్తులతో సఖ్యత నెలకొంటుంది. ఆర్థికంగా బలం చే కూరుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. విహారాదియాత్రలు చేస్తారు. సంఘంలో పేరు గడిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. శుభకార్యాల నిర్వహణలో పాలుపంచుకుంటారు. విద్యార్థుల యత్నాలు సఫలీకృతమవుతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో వివాదాల నుంచి బయటపడతారు. పారిశ్రామికవేత్తలకు శుభవార్తలు. వారం చివరిలో ధనవ్యయం. విమర్శలు ఎదుర్కొంటారు. ఆరోగ్యసమస్యలు. లేత ఎరుపు, పసుపు రంగులు. శ్రీరామరక్షా స్తోత్రాలు పఠించండి.మకరం...చేపట్టిన వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. రుణబాధలు చాలావరకూ తీరతాయి. చిరకాల మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. బంధువుల ఆదరణ, ఆప్యాయత పొందుతారు. కాంట్రాక్టర్లకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు తథ్యం. రాజకీయవర్గాలకు పదవులు లభిస్తాయి. వారం ప్రారంభంలో శ్రమాధిక్యం. భూవివాదాలు. మనశ్శాంతి లోపిస్తుంది. నీలం, నేరేడు రంగులు. శ్రీ అన్నపూర్ణాదేవి స్తోత్రాలు పఠించండి.కుంభం..ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. బంధువుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. గతం గుర్తుకు తెచ్చుకుంటారు. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరణలో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. కళాకారులకు నూతనోత్సాహం, అవార్డులు. వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. ఆప్తుల నుండి సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు.. తెలుపు, నేరేడురంగులు. శ్రీవిష్ణుసహస్రనామ పారాయణ చేయండి.మీనం...మీమాటే శిరోధార్యంగా భావిస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు మరింత పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులు ప్రతిభ నిరూపించుకుంటారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుకుంటారు. వాహనాలు, భూములు కొంటారు. ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాలకు సత్కారాలు. వారం మధ్యలో వ్యయప్రయాసలు. స్వల్ప అనారోగ్యం. ఎరుపు, లేత పసుపు రంగులు. గణేశ్‌ను పూజించండి.

Green Card Holders and H-1B workers must carry ID at all times in US5
భారతీయులే లక్ష్యంగా ట్రంప్‌ మరో బాంబు 

అమెరికాలోని మనోళ్లపై తెంపరి ట్రంప్‌ మరో బాంబు పేల్చారు. గ్రీన్‌కార్డు, హెచ్‌1బీ వీసాలపై అక్కడ చట్టబద్ధంగా నివసిస్తున్న భారతీయులే లక్ష్యంగా మరో వేధింపుల పర్వానికి తెరతీశారు. వాళ్లు నిరంతరం తమ ఐడీ కార్డును విధిగా వెంట ఉంచుకోవాల్సిందేనని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు కఠిన నిబంధనను శుక్రవారం (ఏప్రిల్‌ 11) నుంచే అమల్లోకి తెచ్చింది. లేదంటే జరిమానాలతో పాటు కఠినచర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఇంకా ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోని అక్రమ వలసదారులను గుర్తించడంలో ప్రభుత్వానికి దోహదపడుతుందంటూ అక్కడి న్యాయస్థానం కూడా ఈ కఠిన నిబంధనకు పచ్చజెండా ఊపింది. అమెరికా పౌరసత్వంలేని 18 ఏళ్లు నిండిన వారంతా తమ చట్టబద్ధ నివాసానికి సంబంధించిన ఐడీ కార్డును 24 గంటలూ వెంట ఉంచుకోవాల్సిందేనని కొత్త నిబంధన సూచిస్తోంది. విదేశీయుల నమోదు చట్టం (1940)లోని ఈ విదేశీయుల నమోదు ఆవశ్యకత (ఏఆర్‌ఆర్‌) నిబంధనలు గతంలో ఉన్నవే. కానీ వాటిని ఏనాడూ అమలుచేయలేదు. కోర్టు అనుమతితో కోట్ల మంది అక్రమవలసదారులే లక్ష్యంగా ఈ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని ట్రంప్‌ సర్కారు నిర్ణయించింది. హోంల్యాండ్‌ సెక్యూరిటీ మంత్రి క్రిస్టీ నోయెమ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో ఈ మేరకు వెల్లడించారు. అమెరికాలో ప్రస్తుతం దాదాపు 54 లక్షల మంది భారతీయులున్నారు. 2022 గణాంకాల ప్రకారం 2.,2 లక్షల మంది భారతీయులు అక్కడ అక్రమంగా నివసిస్తున్నారు. అయితే మొత్తం అక్రమ వలసదారుల్లో వీరు కేవలం 2 శాతమేనని సమాచారం. ఏమిటీ నిబంధనలు ? అక్రమంగా వలస వచ్చిన విదేశీయులు, చాన్నాళ్లుగా అమెరికాలో అక్రమంగా ఉంటూ ఇప్పటిదాకా వివరాలు నమోదు చేసుకోని వలసదారులను గుర్తించి దేశం నుంచి బహిష్కరించడమే లక్ష్యంగా ఈ కఠిన నిబంధనలను తెచ్చారు. వాటి ప్రకారం అమెరికాకు వచ్చి 30 రోజులకు మించి ఉండాలనుకునే వాళ్లు తమ వీసా, ఐడీ కార్డులను కచి్చతంగా అనుక్షణం వెంట ఉంచుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో అధికారులు సోదాలు, తనిఖీల వేళ ప్రశ్నిస్తే వెంటనే వాటిని చూపించాలి. లేదంటే జరిమానాలు, ఇతర కఠిన చర్యలను ఎదుర్కోక తప్పదు. దీని ప్రకారం అమెరికా పౌరసత్వం లేని 18 ఏళ్లు నిండిన వాళ్లంతా ఐడీ కార్డును వెంటే ఉంచుకోవాలి. అమెరికా పౌరులు కాని 14 ఏళ్లు నిండిన టీనేజర్‌ వివరాలను విధిగా నమోదు చేయించుకోవాలి. 14వ పుట్టినరోజుకు ముందు నమోదు చేసినా మళ్లీ కొత్తగా నమోదు చేసుకుని మరోసారి వేలిముద్రల వంటివి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు టీనేజర్‌ 325ఆర్‌ దరఖాస్తు సమరి్పంచాలి. వారి తల్లిదండ్రులు సైతం 30 రోజుల్లోపు కచి్చతంగా నమోదు చేయించుకోవాలి. ..అయినా ఉండనివ్వరు మరోసారి నమోదు చేసుకున్నా వారిని అమెరికాలో ఉండనిచ్చే ప్రసక్తే లేదని ట్రంప్‌ సర్కారు స్పష్టం చేసింది. అక్రమవలసదారుల వాస్తవిక సంఖ్యను తేల్చడం, వారిని కనిపెట్టి వెళ్లగొట్టడమే రీ రిజి్రస్టేషన్‌ లక్ష్యమని హోంల్యాండ్‌ సెక్యూరిటీ అధికారులు చెప్పారు. తాజాగా నమోదు సమయంలో కొత్త అడ్రస్, వ్యక్తిగత, కుటుంబ వివరాలు తెలపాల్సి ఉంటుంది. వాటిని కావాలని మార్చి రాస్తే స్వదేశానికి బదులు జైలుకు పంపవచ్చని కూడా తెలుస్తోంది. కఠిన నిబంధనలు అమల్లోకి వచ్చాక కూడా పేర్లను నమోదు చేయనివారు సోదాలు, తనిఖీల్లో దొరికితే భారీ జరిమానా, ఆర్నెల్ల దాకా జైలుశిక్ష వేస్తారు. అడ్రస్‌ అప్‌డేట్‌ చేయకుంటే 5 వేల డాలర్ల జరిమానా గ్రీన్‌కార్డు, వీసాదారులు మరో చోటుకు మారితే కొత్త చిరునామాను ప్రభుత్వానికి కచ్చితంగా తెలియజేయాలి. 10 రోజుల్లోపు తెలపని పక్షంలో 5,000 డాలర్ల జరిమానా విధిస్తారు. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాక గ్రీన్‌కార్డు, హెచ్‌–1బీ వీసాదారులు తమ సమాచారాన్ని మరోసారి నమోదు చేయించుకోవాల్సిన పనిలేదు. కాకపోతే గ్రీన్‌కార్డ్, హెచ్‌1బీ ఐడీ కార్డును మాత్రం ఎప్పుడూ విధిగా వెంట ఉంచుకోవాల్సిందే. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

NIA Custody Tahawwur Rana Demanded 3 Things6
ఎన్‌ఐఏ విచారణలో రాణా మూడు డిమాండ్లు

న్యూఢిల్లీ: మహానగరం ముంబై 26/11 దాడులకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(National Investigation Agency)(ఎన్‌ఐఏ) ప్రస్తుతం తమ కస్టడీలో ఉన్న కెనడా-పాకిస్తానీ పౌరుడు తహవ్వూర్ హుస్సేన్ రాణాను విచారిస్తోంది. ఈ నేపధ్యంలో పలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇంతలో తహవ్వూర్ హుస్సేన్ రాణా ఎన్‌ఐఏ ముందు కొన్ని డిమాండ్లు ఉంచినట్లు తెలుస్తోంది. ఇది అతని మానసిక స్థితిని తెలియజేసేదిగా ఉందని ఎన్‌ఐఏ పేర్కొంది.వివరాల్లోకి వెళితే ఎన్‌ఐఏ విచారణలో ఉన్న తహవ్వూర్ రాణా(Tahawwur Rana) ఎన్‌ఐఏ ముందు ఉంచిన డిమాండ్‌ పలు చర్చలకు దారితీస్తున్నాయి. కస్టడీలో ఉన్న రాణా తనకు ఖురాన్ (ఇస్లామిక్ పవిత్ర గ్రంథం), ఒక పెన్ను, 26/11 దాడుల గురించి అధికారికంగా ప్రశ్నించే అవకాశాన్ని కోరాడు. ఇవి అతని మానసిక స్థితిని, మతపరమైన నమ్మకాన్ని, ఈ కేసులో అతని పాత్ర గురించిన అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. రాణా ఖురాన్‌ను అడగడం అతని మతపరమైన అభిరుచులను సూచిస్తుండగా, పెన్ను కావాలనడం ఏదైనా ముఖ్యమైన రాతపూర్వక ప్రకటన లేదా నోట్స్ తీసుకుంటాడని తెలుస్తోంది. ఇక ముడవది.. అతి ముఖ్యమైనది 26/11 దాడుల(26/11 attacks) గురించి ప్రశ్నించే అవకాశం కోరడం.. దీనిని చూస్తుంటే రాణా ఈ ఘటనలో తన పాత్రను వివరించాలనుకుంటున్నాడో లేక మరేదైనా సమాచారాన్ని బహిర్గతం చేయాలనుకుంటున్నాడో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాణా పాకిస్తాన్ ఆధారిత టెరరిస్ట్ సంస్థ లష్కర్-ఎ-తోయిబా (ఎల్‌ఈటీ)తో సంబంధం కలిగి ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 2008లో 166 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న 26/11 ముంబై దాడులలో అతని పాత్రను తెలుసుకునేందుకు ఎన్‌ఐఏ కఠినమైన విచారణ కొనసాగిస్తున్నది. ఇది భారత్‌-పాకిస్తాన్ టెరరిజం, అంతర్జాతీయ క్రిమినల్ న్యాయ వ్యవస్థకు సంబంధించిన సంక్లిష్టమైన కేసుగా మారింది. అలాగే ఈ కేసు భారత్‌.. ఉగ్రవాదంపై సాగిస్తున్న పోరాటంలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలిచింది. ఎన్‌ఐఏ విచారణలో తహవ్వూర్ రాణా 26/11 ముంబై దాడులకు సంబంధించి ఏఏ విషయాలు వెల్లడించనున్నాడనేది ఆసక్తికరంగా మారింది.ఇది కూడా చదవండి: ఈ ఇద్దరు అధికారులే.. తహవ్వూర్ రాణా విచారణ సారధులు

Vasishta Father And Producer Satyanarayana Reddy Comments On Vishwambhara VFX Work7
విశ్వంభర గ్రాఫిక్స్‌ వర్క్‌పై 'బన్ని' నిర్మాత కామెంట్లు

చిరంజీవి- వశిష్ఠ సినిమా విశ్వంభర గ్లింప్స్‌ విడుదల సమయంలో గ్రాఫిక్స్‌ వర్క్స్‌పై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.. ఈ మూవీని యూవీ క్రియేషన్స్‌ సంస్థ భారీ ఖర్చుతో నిర్మిస్తోంది. దాదాపు రూ. 200 కోట్లకు పైగా ఖర్చు చేశారని సమాచారం. టీజర్‌ విడుదల తర్వాత గ్రాఫిక్స్ సరిగ్గా లేకపోవడంతో భారీగా ట్రోల్స్‌ వచ్చాయి. దీంతో ఈ సంక్రాంతికి రావాల్సిన సినిమా ఆలస్యం అవుతూ వస్తోంది. అయతే, తాజాగా విశ్వంభర గ్రాఫిక్స్‌ గురించి వశిష్ఠ తండ్రి సత్యనారాయణ రెడ్డి మల్లిడి పలు వ్యాఖ్యలు చేశారు.దర్శకుడు వశిష్ఠ అసలు పేరు మల్లిడి వెంకట నారాయణ రెడ్డి అని తెలిసిందే.. ఆయన తండ్రి నిర్మాతగా టాలీవుడ్‌లో ఢీ (మంచు విష్ణు), బన్ని (అల్లు అర్జున్‌), భగీరథ (రవితేజ) వంటి చిత్రాలు నిర్మించారు. అయితే, తాజాగా వశిష్ఠ తండ్రి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విశ్వంభర గ్రాఫిక్స్‌ వర్క్‌ గురించి ఇలా చెప్పుకొచ్చారు. 'విశ్వంభర సినిమా షూటింగ్‌ కొంత పూర్తి అయిన తర్వాత గ్రాఫిక్స్‌ కోసం ఫుటేజ్‌ ఇచ్చారు. వీఎఫ్‌ఎక్స్‌ టీమ్‌ వారు మూడు నెలల్లోనే పూర్తి చేసి ఇస్తాం అన్నారు. కానీ, పెద్ద సినిమా కావడంతో ఆరు నెలలు టైమ్‌ తీసుకోమని మేకర్స్‌ సూచించారు. అలా లెక్కలు వేసుకుని 2025 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు తేదీ ప్రకటించారు. కానీ, తొమ్మిది నెలలు గడిచినా వారు గ్రాఫిక్స్‌ పని పూర్తి చేయలేకపోయారు. విడుదల తేదీ దగ్గరకు రావడంతో అలా టీజర్‌ను వదిలారు. ఆర్టిఫిషయల్‌ టెక్నాలజీ ఉపయోగించుకుని టీజర్‌ను క్రియేట్‌ చేశారు. అది గ్రాఫిక్స్‌ వర్క్‌ ఏంత మాత్రం కాదు. ప్రేక్షకుల నుంచి విమర్శలు రావడంతో గ్రాఫిక్స్‌ టీమ్‌లో భయం మొదలైంది. తర్వాత VFX నాణ్యతలో ఎలాంటి ఇబ్బందులు రాలేదు. త్వరలో విశ్వంభర నుంచి మరో టీజర్‌తో పాటు ట్రైలర్‌ రావచ్చు. అందులో అసలైన వీఎఫ్‌ఎక్స్‌ పనితీరు ఎలా ఉందో మీరందరూ చూస్తారు. అందరికీ తప్పకుండా నచ్చుతుంది.' అని ఆయన అన్నారు.విశ్వంభర టీజర్‌ విడుదల కాగానే మెగాస్టార్‌ అభిమానులు కూడా.. VFX వర్క్‌ బాగాలేదని విమర్శించారు. హాలీవుడ్ చిత్రాల నుండి సన్నివేశాలను కాపీ చేశారనే ఆరోపణలు వచ్చాయి. దెయ్యాల కోట చూపిస్తున్నారా అంటూ.. పాన్‌ ఇండియా రేంజ్‌ సినిమా అంటే ఎలా ఉండాలని తప్పబట్టారు. నాసిరకమైన విజువల్స్, గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ అంటూ ట్రోలింగ్ చేశారు. దీంతో విశ్వంభర విడుదలను వాయిదా వేశారు. ఫ్యాన్స్‌ కూడా వాయిదా పడటమే బెటర్ అని అనుకున్నారు. ఆ తప్పులు అన్నీ సరిచేసుకుని జులై 24న థియేటర్లలోకి విశ్వంభర రానున్నట్లు సమాచారం."Whatever you saw in the Vishwambhara teaser was AI-generated graphics, not the original CG. It won't be in the movie."- Producer Satyanarayana Reddy #Chiranjeevi #Vishwambhara pic.twitter.com/mgnGgLFpBr— Whynot Cinemas (@whynotcinemass_) April 12, 2025

Sunrisers Hyderabad beat Punjab Kings by 8 wickets8
సిక్సర్ల అభి ‘ షేక్‌ ’

తొలి ఐదు మ్యాచ్‌లలో కలిపి 51 పరుగులు...ఈ సీజన్‌లో అభిషేక్‌ శర్మ ప్రదర్శన ఇది. వరుస వైఫల్యాలతో విమర్శలు ఎదుర్కొంటున్న అతను తన గత ఏడాది ఆటను ఒక్కసారిగా గుర్తు తెచ్చుకున్న ట్లున్నాడు. పంజాబ్‌పై మ్యాచ్‌లో ఒక్కసారిగా తన కసినంతా ప్రదర్శిస్తూ వీర విధ్వంసం సృష్టించాడు. కేవలం బౌండరీలతోనే 116 పరుగులు బాది శతకనాదం చేశాడు. ఇది ఆరెంజ్‌ ఆర్మీ కోసం అంటూ రాసి ఉన్న కాగితాన్ని ప్రదర్శిస్తూ ఈ ఇన్నింగ్స్‌ విలువేమిటో చెప్పాడు. అభిషేక్‌కు హెడ్‌ మెరుపులు తోడవడంతో 246 పరుగుల లక్ష్యాన్ని కూడా మరో 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి సన్‌రైజర్స్‌ సంచలనం సృష్టించింది. మరో వైపు సమష్టి ప్రదర్శనతో 245 పరుగులు చేసి కూడా ఓటమిపాలైన పంజాబ్‌ కింగ్స్‌ తీవ్ర నిరాశకు లోనైంది. ఓవరాల్‌గా 492 పరుగులతో అభిమానులకు ఫుల్‌ జోష్‌ దక్కింది. సాక్షి, హైదరాబాద్‌: ఐపీఎల్‌ సీజన్‌ నాలుగు వరుస పరాజయాల తర్వాత నిస్తేజంగా కనిపించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఘనమైన రీతిలో కోలుకుంది. తమ అసలు ఆటను ప్రదర్శిస్తూ లీగ్‌లో తమను తక్కువగా అంచనా వేయవద్దనే సందేశాన్ని ఇచ్చింది. శనివారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 8 వికెట్ల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పంజాబ్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. శ్రేయస్‌ అయ్యర్‌ (36 బంతుల్లో 82; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు), ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (23 బంతుల్లో 42; 7 ఫోర్లు, 1 సిక్స్‌), ప్రియాన్‌‡్ష ఆర్య (13 బంతుల్లో 36; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) కీలక పరుగులు సాధించారు. అనంతరం సన్‌రైజర్స్‌ 18.3 ఓవర్లలో 2 వికెట్లకు 247 పరుగులు సాధించింది. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అభిషేక్‌ శర్మ (55 బంతుల్లో 141; 14 ఫోర్లు, 10 సిక్స్‌లు) ఐపీఎల్‌లో తన తొలి సెంచరీని నమోదు చేయగా, ట్రవిస్‌ హెడ్‌ (37 బంతుల్లో 66; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 75 బంతుల్లో 171 పరుగులు జోడించారు. మెరుపు బ్యాటింగ్‌...పవర్‌ప్లేలో 89 పరుగులు...10 ఓవర్లు ముగిసే సరికి 120. తర్వాతి 5 ఓవర్లలో 57 పరుగులు...ఆఖరి 5 ఓవర్లలో 68 పరుగులు... పంజాబ్‌ కింగ్స్‌ ఇలా దాదాపు అన్ని దశల్లోనూ ఒకే తరహాలో దూకుడుగా సాగింది. టాప్‌–7లో ఇద్దరు మినహా మిగతావారంతా చెలరేగిపోవడంతో భారీ స్కోరు సాధ్యమైంది. షమీ వేసిన తొలి ఓవర్లో ప్రభ్‌సిమ్రన్‌ వరుసగా 3 ఫోర్లతో మొదలు పెట్టగా, షమీ తర్వాతి ఓవర్లో ప్రియాన్ష్ వరుసగా 6, 6, 4 బాదాడు. కమిన్స్‌ తొలి ఓవర్లో కూడా 2 ఫోర్లు, సిక్స్‌తో పంజాబ్‌ 16 పరుగులు రాబట్టింది. అయితే తన తొలి రెండు ఓవర్లలో 28 పరుగులిచ్చిన హర్షల్‌...ప్రియాన్‌‡్షను అవుట్‌ చేయడంలో సఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన మలింగ తన తొలి వికెట్‌గా ప్రభ్‌సిమ్రన్‌ను వెనక్కి పంపించాడు. ఆ తర్వాత శ్రేయస్, నేహల్‌ వధేరా (22 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్‌) భాగస్వామ్యం కూడా జోరుగా సాగింది. వీరిద్దరు మూడో వికెట్‌కు 40 బంతుల్లోనే 73 పరుగులు జోడించారు. అన్సారీ ఓవర్లో 2 సిక్స్‌లు, ఫోర్‌ బాదిన శ్రేయస్‌ 22 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీని అందుకున్నాడు. శశాంక్‌ సింగ్‌ (2) విఫలం కాగా, మలింగ ఓవర్లో శ్రేయస్‌ 4 ఫోర్లతో చెలరేగాడు. అయితే రెండు బంతుల వ్యవధిలో మ్యాక్స్‌వెల్‌ (3), శ్రేయస్‌లను హర్షల్‌ అవుట్‌ చేయడంతో 18, 19 ఓవర్లలో కలిపి 13 పరుగులే వచ్చాయి. ఒకే ఓవర్లో 27 పరుగులు...షమీ వేసిన ఆఖరి ఓవర్లో కింగ్స్‌ పండగ చేసుకుంది. ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న స్టొయినిస్‌ ఈ ఓవర్లో చెలరేగిపోయాడు. చివరి 4 బంతుల్లో అతను వరుసగా 6, 6, 6, 6 బాదడంతో మొత్తం 27 పరుగులు లభించాయి. బౌండరీల వర్షం...అర్ష్ దీప్ వేసిన తొలి ఓవర్లో హెడ్‌ 2 ఫోర్లు కొట్టడంతో రైజర్స్‌ విధ్వంసం మొదలైంది. యాన్సెన్‌ ఓవర్లో అభిషేక్‌ నాలుగు ఫోర్లు కొట్టగా, అర్ష్ దీప్ తర్వాతి ఓవర్లో హెడ్‌ వరుసగా మూడు ఫోర్లు బాదాడు. ఆ తర్వాత యశ్‌ ఠాకూర్‌ ఓవర్లో 2 సిక్స్‌లు, ఫోర్‌తో చెలరేగిపోయాడు. పవర్‌ప్లేలో జట్టు 83 పరుగులు సాధించింది. 19 బంతుల్లోనే అభిషేక్‌ హాఫ్‌ సెంచరీని చేరుకున్నాడు. మరో వైపు మ్యాక్స్‌వెల్‌ ఓవర్లో రెండు భారీ సిక్స్‌లు బాదిన హెడ్‌ 31 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. యాన్సెన్‌ వేసిన ఓవర్లో మళ్లీ శివమెత్తిన అభిషేక్‌ 2 సిక్స్‌లు, 2 ఫోర్లు బాదాడు. చహల్‌ ఓవర్లో ఎట్టకేలకు హెడ్‌ వెనుదిరిగిన తర్వాత అదే ఓవర్‌ చివరి బంతికి సింగిల్‌ తీసి 40 బంతుల్లో అభిషేక్‌ సెంచరీ మార్క్‌ను చేరుకొని గర్జించాడు. ఆ తర్వాత చెలరేగి బౌండరీల వర్షం కురిపించిన అభిషేక్‌ జట్టును అలవోకగా విజయం దిశగా నడిపించాడు. సాహసవంతులకే అదృష్టం కలిసి వస్తుందన్నట్లు అభిషేక్‌కు రెండు లైఫ్‌లు లభించాయి. 28 వద్ద ఠాకూర్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ ఇవ్వగా అది నోబాల్‌గా తేలింది. ఆ తర్వాత 56 వద్ద చహల్‌ తన బౌలింగ్‌లోనే సునాయాస క్యాచ్‌ను వదిలేశాడు. దీనిని అతను బ్రహ్మండంగా వాడుకున్నాడు. స్కోరు వివరాలుపంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రియాన్ష్ (సి) నితీశ్‌ రెడ్డి (బి) హర్షల్‌ 36; ప్రభ్‌సిమ్రన్‌ (సి) కమిన్స్‌ (బి) మలింగ 42; శ్రేయస్‌ (సి) హెడ్‌ (బి) హర్షల్‌ 82; వధేరా (ఎల్బీ) (బి) మలింగ 27; శశాంక్‌ (ఎల్బీ) (బి) హర్షల్‌ 2; మ్యాక్స్‌వెల్‌ (బి) హర్షల్‌ 3; స్టొయినిస్‌ (నాటౌట్‌) 34; యాన్సెన్‌ (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 245. వికెట్ల పతనం: 1–66, 2–91, 3–164, 4–168, 5–205, 6–206. బౌలింగ్‌: మొహమ్మద్‌ షమీ 4–0–75–0, కమిన్స్‌ 4–0–40–0, హర్షల్‌ 4–0–42–4, ఇషాన్‌ మలింగ 4–0–45–2, అన్సారీ 4–0–41–0. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: హెడ్‌ (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) చహల్‌ 66; అభిషేక్‌ (సి) (సబ్‌) దూబే (బి) అర్‌‡్షదీప్‌ 141; క్లాసెన్‌ (నాటౌట్‌) 21; ఇషాన్‌ కిషన్‌ (నాటౌట్‌) 9; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (18.3 ఓవర్లలో 2 వికెట్లకు) 247. వికెట్ల పతనం: 1–171, 2–222. బౌలింగ్‌: అర్ష్ దీప్ 4–0–37–1, యాన్సెన్‌ 2–0–39–0, యశ్‌ ఠాకూర్‌ 2.3–0–40–0, మ్యాక్స్‌వెల్‌ 3–0–40–0, ఫెర్గూసన్‌ 0.2–0–1–0, స్టొయినిస్‌ 0.4–0–6–0, చహల్‌ 4–0–56–1, శశాంక్‌ 2–0–27–0.75 ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ల జాబితాలో షమీ రెండో స్థానంలో నిలిచాడు. అతను 75 పరుగులివ్వగా, ఇదే సీజన్‌లో రాజస్తాన్‌ బౌలర్‌ ఆర్చర్‌ 76 పరుగులు ఇచ్చాడు.1 ఐపీఎల్‌లో భారత బ్యాటర్‌ సాధించిన అత్యధిక స్కోరు ఇదే. కేఎల్‌ రాహుల్‌ (132) పేరిట ఉన్న రికార్డును అభిషేక్‌ శర్మ సవరించాడు.ఐపీఎల్‌లో నేడురాజస్తాన్‌ X బెంగళూరు వేదిక: జైపూర్‌మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి ఢిల్లీ X ముంబై వేదిక: ఢిల్లీ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

BlackRock Becomes Largest Investor In Adani Groups 750 Million Bond Issue9
అదానీ గ్రూప్‌లో రూ. 2,165 కోట్ల పెట్టుబడి

న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్‌ దిగ్గజం అదానీ గ్రూప్‌ చేపట్టిన బాండ్ల జారీలో గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజం బ్లాక్‌రాక్‌ భారీగా ఇన్వెస్ట్‌ చేసింది. అదానీ గ్రూప్‌ 75 కోట్ల డాలర్ల(రూ. 6,500 కోట్లు) విలువైన బాండ్ల జారీని చేపట్టగా.. 25 కోట్ల డాలర్ల(సుమారు రూ. 2,165 కోట్లు)తో సబ్‌స్క్రయిబ్‌ చేసినట్లు తెలుస్తోంది.సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం 3–5ఏళ్ల కాలపరిమితితో అదానీ గ్రూప్‌ ఈ బాండ్లు విడుదల చేసింది. కాగా.. గతేడాది నవంబర్‌లో లంచం ఆఫర్‌ చేసిన కేసు నమోదుకావడంతో అదానీ గ్రూప్‌పై యూఎస్‌ న్యాయశాఖ పరిశోధనకు తెరతీసింది. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్‌ బాండ్లలో బ్లాక్‌రాక్‌ పెట్టుబడులకు ప్రాధాన్యత ఏర్పడినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి.

Electronic voting systems vulnerable to hackers: US intelligence chief Tulsi Gabbard10
ఈవీఎంలను సులువుగా హ్యాక్‌ చేయొచ్చు

సాక్షి, అమరావతి: ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌ వ్యవ­స్థను సులువుగా హ్యాక్‌ చేయొచ్చని అమెరికా నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ తులసి గబ్బార్డ్‌ పేర్కొన్నారు. అందువల్ల దేశ (అమెరికా) వ్యాప్తంగా అన్ని ఎన్ని­కల్లో పేపర్‌ బ్యాలెట్‌లకు మారాలని పిలుపునిచ్చారు. దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హాజరైన క్యాబినెట్‌ సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె ఎల­క్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల భద్రతా లోపాలకు సంబంధించి పలు ఆధారాలను సమావేశం ముందుంచారు. 2020 ఎన్నికల సమ­యంలో మాజీ సైబర్‌ సెక్యూరిటీ చీఫ్‌ క్రిస్‌ క్రెబ్స్‌ చర్యలపై దర్యాప్తు చేయాలని జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ (డీవోజే)ని ఆదేశిస్తూ ట్రంప్‌ కార్యనిర్వాహక ఉత్తర్వు­లపై సంతకం చేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది.‘ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌ వ్యవస్థ చాలా కాలంగా హ్యాకర్లకు అందుబాటులో ఉంది. తద్వారా ఎలాంటి పరిణామాలు చోటుచేసు­కుంటాయో ఎన్నో ఉదాహరణలు మన ముందున్నాయి. ఈ విధానంలో ఫలితాలను తారుమారు చేయడా­నికి, దుర్వినియోగం చేసేందుకు అవకాశం ఉందని చెప్పేందుకు మా వద్ద పలు ఆధారాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పేపర్‌ బ్యాలెట్‌లను తీసుకురావాలనే మీ (ట్రంప్‌) ఆదేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. అప్పుడే ఓటర్లు ఎన్నికల సమగ్రతపై నమ్మకం కలిగి ఉంటారు’ అని గబ్బార్డ్‌ స్పష్టం చేసినట్లు ప్రముఖ జర్నలిస్ట్‌ స్మిత ప్రకాశ్‌ తెలిపారు. కాగా, గబ్బార్డ్‌ వ్యాఖ్యలు సోషల్‌ మీడి­యాలో విస్తృతంగా వైరల్‌ అయ్యాయి. యునైటెడ్‌ స్టేట్స్‌లో ఎన్నికల భద్రతపై ఈ వ్యాఖ్యలు భారీ చర్చకు దారితీశాయి.ఇదిలా ఉండగా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల గురించి ఇటీవల టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ సీఈఓ ఎలాన్‌ మస్క్‌ కూడా హెచ్చరించారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలపై ఆధార పడటం సరి­కాదని చెప్పారు. అవి హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమా­దం ఉందన్నారు. ‘ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను తొలగించాలి. ‘సాంకేతికత, ఏఐ ద్వారా హ్యాక్‌ అవ్వ­డా­నికి ఉన్న అవకాశం చిన్నదైనా, అది ఎంతో పెద్ద సమస్యకు దారితీస్తుంది’ అని మస్క్‌ తన సోషల్‌ మీడియా ఖాతా ఎక్స్‌ (మునుపటి ట్విట్టర్‌)­లో పోస్ట్‌ చేశారు. కాగా, తులసి గబ్బార్డ్‌ వ్యాఖ్యలపై మన దేశంలో కూడా చర్చ జరుగుతోంది. గత ఏడాది ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఈవీ­ఎంలపై పలు అనుమానాలు వ్యక్తం అయిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement