నువ్వు రాకపోతే నీ దగ్గరకు నేనే వస్తా: టీడీపీ ఎమ్మెల్యే వార్నింగ్
శ్రీకాకుళం: స్థానిక ఎన్నికల వేళ ఓ టీడీపీ ఎమ్మెల్యే బెదిరింపులకు దిగారు. అది కూడా లైన్‌మన్‌ను బెదిరిస్తూ తన చేతుల్లో పెట్టుకోవడానికి యత్నించారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్.. సింగవలస గ్రామానికి చెందిన లైన్‌మన్ రోహిణీ కుమార్‌కు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ 10 రోజులు తాను చెప్పినట్లు వినకపోతే.. మిగతా 1100 రోజులు తనవి అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.ఇదేంటి అన్నా.. అని లైన్‌మన్ రోహిణి కుమార్ అడిగితే.. ‘ ఇది రాయి అన్న.. ఇది నాటు అన్న.. నాటు ఎమ్మెల్యే అన్న ఇది’ అంటూ హెచ్చరించారు. తాను ఇక్కడ లేనని లైన్‌మన్ చెప్పగా, తానే వస్తానంటూ సీరియస్ అయ్యారు. దాంతో ‘మీరు వద్దన్న.. నేను మీ దగ్గరకి వస్తా’ అంటూ ఆ లైన్‌మన్ చెప్పాడు. ‘ అయితే మరి రా’ అంటూ మరోసారి గట్టిగా హెచ్చరించారు ఎమ్మెల్యే గొండు శంకర్. ఎమ్మెల్యే గొండు శంకర్.. లైన్‌మన్ రోహిణీ కుమార్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఇది స్థానిక ఎన్నికల వేళ జరిగిన పరిణామం కాబట్టి.. ఇందులో ఏమైనా కుట్ర కోణం ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదీ చదవండి: స్థానిక ఎన్నికల్లో నీచానికి ఒడిగడుతున్నారు: పేర్నినాని
మాక్ పార్లమెంట్.. ఎస్ఐఆర్ను తక్షణమే నిలిపివేయాలన్న మల్లికార్జున ఖర్గే
సాక్షి,ఢిల్లీ: సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై ఇండియా కూటమి పీపుల్స్ ఇంపీచ్మెంట్ నిర్వహించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. మాజీ లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ అధ్యక్షతన మాక్ పార్లమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, సీఎం రేవంత్ సహా పలువురు ఎంపీలు, విపక్ష నేతలు పాల్గొన్నారు.ఇందులో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. దేశంలో ఓటు హక్కుకు తీవ్ర ముప్పు ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటు హక్కును కాపాడేందుకు ప్రతిపక్షాలన్నీ పోరాటం కొనసాగిస్తాయని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 కల్పించిన ఓటు హక్కును పరిరక్షించాల్సిన అవసరం అందరికీ ఉందన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకే ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ పనిచేస్తున్నారని ఖర్గే తీవ్రంగా ఆరోపించారు. ఆయనను సీఈసీ పదవి నుంచి తొలగించాలని ఏడు నెలల క్రితమే ఉభయ సభల్లో 193 మంది ప్రతిపక్ష ఎంపీలు నోటీసులు ఇచ్చినట్లు ఆయన గుర్తుచేశారు.ప్రతిపక్ష పార్టీల ఓటర్ల పేర్లను తొలగించి అధికారాన్ని మళ్లీ వాళ్లే కొనసాగించేందుకు కుట్ర జరుగుతోందని ఆయన విమర్శించారు. అంతేకాదు 145 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేసిన తర్వాతే సీఈసీకి సంబంధించిన చట్టాన్ని ఆమోదించారని ఖర్గే ఆరోపించారు.మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు 40 లక్షల మంది కొత్త ఓటర్లను చేర్చారని, ఎస్ఐఆర్ ప్రక్రియలో అంతకంటే ఐదు రెట్లు ఎక్కువ మంది ఓటర్ల పేర్లను తొలగించారని ఖర్గే పేర్కొన్నారు. ఓటర్లను చేర్చడం కంటే తొలగించడమే ఎస్ఐఆర్ లక్ష్యంగా మారిందని విమర్శిస్తూ, ఈ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.ఓట్ల చోరీకి వ్యతిరేకంగా నిరసన తెలిపిన ప్రతిపక్ష ఎంపీలను నిర్బంధించడం, జంతర్ మంతర్ వద్ద ఆందోళనలకు అనుమతి నిరాకరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. తమ నిరసనలను రామ్‌లీలా మైదాన్‌లో కొనసాగిస్తామని ప్రకటించారు.దళితులు, మహిళలు, పేదలు, అణగారిన వర్గాల ఓటు హక్కులను కాపాడటమే తమ పోరాట లక్ష్యమని ఖర్గే స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్ని వర్గాల ప్రజలు ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఇదీ చదవండి: ట్రంప్‌కు ఏమైంది? ర్యాలీలో కంటి సమస్య.. ఆరోగ్యంపై కలకలం
ఏపీలో 50 శాతం పోలింగ్ కేంద్రాల్లోనే సీసీ కెమెరాలు: ఎస్ఈసీ
విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా రేపు(ఆదివారం, నవంబర్ 1వ తేదీ) జరిగే పోలింగ్‌కు సంబంధించి యాభై శాతం పోలింగ్ కేంద్రాల్లోనే రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు, వీడియో రికార్డింగ్‌లు ఉండాలని ఒకవైపు సుప్రీంకోర్టు ఆదేశించగా, అన్ని పోలింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు కష్టమని అంటోంది ఎస్ఈసీ. వైఎస్సార్సీపీ న్యాయపోరాటంలో భాగంగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన కొద్ది వ్యవధిలోనే ఎస్ఈసీ మీడియా ద్వారా ఓ ప్రకటన విడుదల చేసింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు పెట్టలేమనే నిర్ణయాన్ని ఎస్ఈసీ అనిల్ చంద్ర పునెట స్పష్టం చేశారు. 5,737 పోలింగ్ స్టేషన్లలో 12 వేల కెమెరాలను ఏర్పాటు పెట్టినట్లు తెలిపారు. సీసీ కెమెరాల ఫుటేజ్‌ను భద్రపరుస్తామని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ‘స్థానిక’ ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ
స్థానిక ఎన్నికల్లో నీచానికి ఒడిగడుతున్నారు: పేర్నినాని
మచిలీపట్నం: పోలీస్ జులుంతో నీచానికి ఒడిగడుతున్నారని మాజీ మంత్రి పేర్నినాని చెప్పారు. ఎవరికీ ఊపిరి తీసుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఏప్రిల్, మే నెలలో ఎందుకు ఎన్నికలు పెట్టలేదని ఆయన నిలదీశారు. శనివారం మచిలీపట్నంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.‘‘అరాచకాలు, దుర్మార్గాలతో అన్ని ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. తప్పుడు మార్గాల్లో గెలిచి బలంగా ఉన్నామని చూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పైపై మేకప్‌లు ఎన్నాళ్లు ఉంటాయి? 2029లో ప్రజలు కచ్చితంగా చంద్రబాబు గాలి తీసేయడం ఖాయం. తప్పుడు మార్గాల్లో గెలిచి బలంగా ఉన్నామని చూపించుకునే ప్రయత్నాలు. చంద్రబాబు బుర్ర నిండా కుట్రలే. హైకోర్టు చంద్రబాబు ప్రభుత్వానికి గడ్డి పెట్టింది. గంట ముందే ఏజెంట్ నియామక పత్రాన్ని అందజేస్తే చాలని కోర్టు చెప్పింది.పోలింగ్ కేంద్రాలను ఆక్రమించుకునేందుకు పోలీసులను మోహరిస్తున్నారా? శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు వ్యవసాయం సర్వనాశనం అయ్యింది. కూటమి ప్రభుత్వం ఒక చెత్త ప్రభుత్వం. తుపాన్ వస్తుందని వారం ముందే హెచ్చరికలు వచ్చినా పట్టించుకోలేదు. ఇప్పటివరకు విద్యుత్‌ను పునరుద్ధరించలేదు. తప్పుడు పోకడలతో చంద్రబాబు ఎన్నికలకు వెళ్తున్నారు. చంద్రబాబు ఓటుకు రూ.2 వేలు పంపించారని టీడీపీ నేతలే చెబుతున్నారు.చిచ్చుపెట్టి చంద్రబాబు ఏం సాధిస్తారు?వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబంలో చిచ్చుపెట్టి చంద్రబాబు ఏం సాధిస్తారు? అని పేర్ని నాని అన్నారు. ‘‘యలహంక ఆస్తి వైఎస్ జగన్ అత్తగారు డాక్టర్ సుగుణమ్మది. 20 ఏళ్ల క్రితం జగన్ కంపెనీ ఆ స్థలాన్ని లీజుకు తీసుకుంది. కొనుగోలు వివరాలన్నీ డాక్యుమెంట్లో స్పష్టంగా ఉన్నాయి. ఈ నిర్మాణాల బిల్లులు, చార్జీలు కడుతున్నది జగన్ కంపెనీయే. లీజుకు తీసుకున్న స్థలంలో రెండు గెస్ట్ హౌస్‌లు కట్టారు. అధికారం కోసం ఎన్టీఆర్ ఇంట్లో చంద్రబాబు చిచ్చు పెట్టారు. వైఎస్ జగన్ కుటుంబంలో చిచ్చుపెట్టి చంద్రబాబు ఏం సాధిస్తారు? చంద్రబాబు తన తమ్ముడికి 10 పైసల వాటా అయినా ఇచ్చారా? చంద్రబాబు తన అక్కాచెల్లెళ్లకు ఏమైనా ఆస్తి ఇచ్చారా?’’ అని అన్నారు.యలహంక ఆస్తిపై విషప్రచారం స్థానిక ఎన్నికల్లో ప్రజలకు చెప్పుకోవడానికి చంద్రబాబు వద్ద ఏమీ లేదని పేర్ని నాని అన్నారు. ‘‘ప్రజల మద్దతూ ఆయనకు లేదు. ఒకవైపు ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే కుట్రలు. మరోవైపు వైఎస్ జగన్ విషప్రచారాల కోసం కుట్ర. నామినేషన్లు వేయనీయకుండా ప్రతిపక్షాన్ని అడ్డుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ప్రతిపక్ష ఏజెంట్లు కూడా లేకుండా కుట్ర చేస్తున్నారు. పోలీసులు నుంచి ఏజెంట్లు క్లియరెన్స్ తీసుకోవడం ఎప్పుడైనా విన్నామా? ఈ కుట్రల నుంచి డైవర్షన్ కోసమే యలహంక ఆస్తిపాస్తులపై విషప్రచారం. చంద్రబాబుకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు షర్మిల తెరపైకి వస్తున్నారు. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలు లక్ష్యంగా షర్మిల నడుచుకుంటున్నారు. చంద్రబాబు కుట్రలో భాగంగానే వైఎస్ జగన్‌పై తప్పుడు ప్రచారం. రేపు మున్సిపల్ ఎన్నికలున్నాయనగా, బెంగళూరు ఆస్తి తనదే అంటూ ట్వీట్ దీంట్లో భాగమే. భారతి తల్లిదండ్రులు గంగిరెడ్డి, సుగుణమ్మ ఇద్దరూ డాక్టర్లే. కడప, అనంతపురం జిల్లాలో మంచి పేరున్న డాక్టర్లు. ఆ రోజుల్లోనే వారికి మంచి ప్రాక్టీస్ ఉంది. తమ పిల్లలను అప్పట్లోనే బెంగళూరులో చదివించుకున్నారు. ఆ నేపథ్యంలోనే వాళ్లు బెంగళూరులో ప్రాపర్టీ కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లో చాలా స్పష్టంగా ఉంది. జగన్ కంపెనీ 20 ఏళ్ల కిందటే యలహంక స్థలాన్ని లీజుకు తీసుకుంది. లీజుకున్న తీసుకున్న స్థలంలో రెండు గెస్ట్‌హౌస్‌లు కట్టారు. షర్మిల బెంగళూరు వచ్చేటప్పుడు ఒక దాంట్లో ఉండమన్నారు. షర్మికు వైఎస్ జగన్ రాశారని చెప్తున్న MOUలో కూడా యలహంక ప్రాపర్టీ ప్రస్తావన లేదు కదా? తాజ్‌మహల్ చూసి నాదే అంటే ఇచ్చేస్తారా? భద్రతా కారణాలరీత్యా యలహంకలో పెళ్లి వేడుక వద్దని ముందే చెప్పారు. తన కుమార్తెల విషయంలో కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంటానని చెప్పారు. అలా చెప్పిన తర్వాత కూడా అక్కడే పెళ్లి అంటూ షర్మిల పెళ్లికార్డులు కొట్టించడం వెనుక అర్థం ఏమిటి? కుమార్తె పెళ్లి వేదికగా వివాదాలు నడపడం సరైనదేనా? ఆ తర్వాత కూడా జగన్ లేఖ రాశారు కదా? హైదరాబాద్‌లో లోటస్‌పాండ్ ఇంటిని వాడుకోవాలని చెప్పారు. మరి ఆ అవకాశాన్ని షర్మిల ఎందుకు వినియోగించుకోలేదు? చంద్రబాబుకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఏదోలా రచ్చ చేయడం, షర్మిలకు అలవాటుగా మారింది తద్వారా జగన్‌ను తగ్గించాలని చంద్రబాబు ప్రయత్నం. ముందుగా చంద్రబాబు తన గురించి తాను తెలుసుకోవాలి’’ అని పేర్ని నాని చెప్పారు.
ఆసీస్‌ను చిత్తు చేసిన సౌతాఫ్రికా.. 111 పరుగులకే ఆలౌట్
కిష్టాపూర్ కుర్రాడు.. క్రికెట్లో మెరిశాడు
నిధికి కాపు కాసే ‘కొరివి’ దెయ్యం.. గ్లింప్స్‌తో భయపెట్టారుగా!
ఇది అత్యంత ప్రమాదకరమైన సంప్రదాయానికి నాంది: వైఎస్ జగన్
బిడ్డ కూడా నాతోపాటే, మళ్లీ పెళ్లి చేస్కో : భార్య సూసైడ్ నోట్
ఇద్దరు పిల్లలకు ఉరి వేసి తల్లి ఆత్మహత్య
నా హృదయం హైదరాబాద్‌లోనే ఉంది.. త్వరలోనే వస్తా: రకుల్
తుఫాన్ బాధితులకు ఎస్బీఐ రూ. 5 కోట్ల విరాళం
ఆడబిడ్డ అని, బలవంతపు అబార్షన్, గర్భిణి మృతి
స్థానిక ఎన్నికల వేళ జనసేన భారీగా డబ్బుల పంపిణీ
ఓటమి భయం.. రంగంలోకి బాలకృష్ణ, వసుంధర!
...మన కార్యకర్తే సార్! పాతికేళ్ల తర్వాత వచ్చి కలుస్తానని వెళ్లిపోతున్నాడు!!
సాక్షి కార్టూన్: 30-10-2026
ఈ ఎన్నికల్లో ఈవీఎంలు లేవని కంగారుపడొద్దు సార్! సింపుల్‌గా రిగ్గింగ్ చేసుకోవచ్చు !
ఆస్ట్రేలియా ఓపెనర్ విధ్వంసం.. 9 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
'ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47' మూవీ రివ్యూ అండ్ రేటింగ్
‘ఆదర్శ కుటుంబం’ మూవీ ఫస్ట్ రివ్యూ
ఇంగ్లండ్ ఓపెనర్ ప్రపంచ రికార్డు
బిగ్‌బాస్ 10: సడన్ ఎలిమినేషన్.. రోహిత్ ఓవరాక్షన్
అర్ష్‌దీప్ సింగ్ ప్రపంచ రికార్డు
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. భారత జట్టులో కీలక మార్పు
దేశంలోని బిజినెస్ స్కూళ్లన్నీ మూసేయడం మంచిది!
సికందర్ రజా ప్రపంచ రికార్డు.. సరికొత్త చరిత్ర
ఓటీటీలో బ్యూటీఫుల్ సినిమా.. 'బత్తా' తెలుగు రివ్యూ
'ఆదర్శ కుటుంబం' ట్విటర్ రివ్యూ
శాకాహారులైన టెక్ దిగ్గజాలు.. నా బ్రేక్‌ఫాస్ట్ స్టీక్, ఎగ్స్: ఎలాన్ మస్క్
కివీస్‌తో వన్డేలు.. టీమిండియాకు భారీ షాక్!.. కీలక ఆటగాడు అవుట్!
జియో 98 రోజుల ప్లాన్.. అదనపు ప్రయోజనాలివే!
అందుకే శ్రీనిధి శెట్టి పాదాలకు దండం పెట్టా: త్రివిక్రమ్
టెన్త్ క్లాస్ బాలికను రంపంతో కోసిన ఉన్మాది
ఆసీస్‌ను చిత్తు చేసిన సౌతాఫ్రికా.. 111 పరుగులకే ఆలౌట్
కిష్టాపూర్ కుర్రాడు.. క్రికెట్లో మెరిశాడు
నిధికి కాపు కాసే ‘కొరివి’ దెయ్యం.. గ్లింప్స్‌తో భయపెట్టారుగా!
ఇది అత్యంత ప్రమాదకరమైన సంప్రదాయానికి నాంది: వైఎస్ జగన్
బిడ్డ కూడా నాతోపాటే, మళ్లీ పెళ్లి చేస్కో : భార్య సూసైడ్ నోట్
ఇద్దరు పిల్లలకు ఉరి వేసి తల్లి ఆత్మహత్య
నా హృదయం హైదరాబాద్‌లోనే ఉంది.. త్వరలోనే వస్తా: రకుల్
తుఫాన్ బాధితులకు ఎస్బీఐ రూ. 5 కోట్ల విరాళం
ఆడబిడ్డ అని, బలవంతపు అబార్షన్, గర్భిణి మృతి
స్థానిక ఎన్నికల వేళ జనసేన భారీగా డబ్బుల పంపిణీ
ఓటమి భయం.. రంగంలోకి బాలకృష్ణ, వసుంధర!
...మన కార్యకర్తే సార్! పాతికేళ్ల తర్వాత వచ్చి కలుస్తానని వెళ్లిపోతున్నాడు!!
సాక్షి కార్టూన్: 30-10-2026
ఈ ఎన్నికల్లో ఈవీఎంలు లేవని కంగారుపడొద్దు సార్! సింపుల్‌గా రిగ్గింగ్ చేసుకోవచ్చు !
ఆస్ట్రేలియా ఓపెనర్ విధ్వంసం.. 9 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
'ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47' మూవీ రివ్యూ అండ్ రేటింగ్
‘ఆదర్శ కుటుంబం’ మూవీ ఫస్ట్ రివ్యూ
ఇంగ్లండ్ ఓపెనర్ ప్రపంచ రికార్డు
బిగ్‌బాస్ 10: సడన్ ఎలిమినేషన్.. రోహిత్ ఓవరాక్షన్
అర్ష్‌దీప్ సింగ్ ప్రపంచ రికార్డు
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. భారత జట్టులో కీలక మార్పు
దేశంలోని బిజినెస్ స్కూళ్లన్నీ మూసేయడం మంచిది!
సికందర్ రజా ప్రపంచ రికార్డు.. సరికొత్త చరిత్ర
ఓటీటీలో బ్యూటీఫుల్ సినిమా.. 'బత్తా' తెలుగు రివ్యూ
'ఆదర్శ కుటుంబం' ట్విటర్ రివ్యూ
శాకాహారులైన టెక్ దిగ్గజాలు.. నా బ్రేక్‌ఫాస్ట్ స్టీక్, ఎగ్స్: ఎలాన్ మస్క్
కివీస్‌తో వన్డేలు.. టీమిండియాకు భారీ షాక్!.. కీలక ఆటగాడు అవుట్!
జియో 98 రోజుల ప్లాన్.. అదనపు ప్రయోజనాలివే!
అందుకే శ్రీనిధి శెట్టి పాదాలకు దండం పెట్టా: త్రివిక్రమ్
టెన్త్ క్లాస్ బాలికను రంపంతో కోసిన ఉన్మాది
ఫొటోలు
‘అక్క’ వెబ్‌సిరీస్ రిలీజ్... ట్రెండింగ్ హీరోయిన్ కీర్తి సురేశ్ (ఫోటోలు)
40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)
వరంగల్ : నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్–26 ప్రారంభం (ఫోటోలు)
‘ఆదర్శ కుటుంబం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
ఫెస్టివ్ మూడ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. (ఫోటోలు)
బ్లూ డ్రెస్‌లో నటి ప్రణవి గ్లామర్.. (ఫోటోలు)
కలర్‌ఫుల్ శారీలో శ్రద్ధాకపూర్ గ్లామర్.. (ఫోటోలు)
భర్తతో కాజల్ అగర్వాల్ కార్వా చౌత్ సెలబ్రేషన్స్.. (ఫోటోలు)
ధోనితో మంధాన ముచ్చట.. ఫొటోలు వైరల్
'ఆదర్శ కుటుంబం'మూవీ HD స్టిల్స్
సినిమా
ఓటీటీలోకి కీర్తి సురేశ్ ‘అక్క’ రివ్యూ..
కీర్తి సురేశ్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘అక్క’. యష్‌రాజ్ ఫిలింస్ సమర్పణలో ధర్మరాజ్ శెట్టి దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ అక్టోబరు 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మహిళల ఆధిపత్యం కొనసాగే ఓ ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. మరి ఐదు ఎపిసోడ్లతో వచ్చిన ఈ వెబ్‌సిరీస్ ఓటీటీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? కీర్తి, రాధికా తమ నటనతో మెప్పించారా? రివ్యూలో చూద్దాం.కథేంటి?1985ల కాలం నాటి ‘పెర్నూరు’ అనే కల్పిత ప్రాంతం అది. అక్కడ దాదాపు 800 ఏళ్లుగా మహిళలే అధికారాన్ని చెలాయిస్తుంటారు. తల్లి తర్వాత కూతురే పాలనా బాధ్యతలు చేపట్టడం అక్కడి సంప్రదాయం. అందుకే ఆ ప్రాంతంలో మగపిల్లాడి కంటే ఆడపిల్ల పుడితేనే వేడుకలు చేసుకుంటారు. 18 గ్రామాలతో కూడిన ఈ ప్రాంతంలో మహిళా నాయకుల మాటే శాసనం.అక్కడ భవానీ (కీర్తి సురేశ్) తన కుటుంబ వారసత్వాన్ని, అధికారాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంటుంది. మరోవైపు రుద్ర (రాధికా ఆప్టే) తన వ్యాపార కార్యకలాపాల కోసం బొంబాయి నుంచి పెర్నూరులోకి అడుగుపెడుతుంది. ఆమె రాకతో అక్కడి పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. అసలు రుద్ర పెర్నూరుకి ఎందుకు ఎంచుకుంది? ఆమె వెనుక ఉన్న లక్ష్యమేంటి? భవానీకి, రుద్రకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఈ పోరులో భవానీ తన అధికారాన్ని నిలబెట్టుకోగలిగిందా? అనేదే మిగతా కథ.(ఇదీ చదవండి: విశ్వక్ సేన్ '#కల్ట్' సినిమా రివ్యూ)ఎలా ఉందంటే?గ్యాంగ్‌స్టర్ కథలంటే సాధారణంగా పురుషుల మధ్య ఆధిపత్య పోరు, ప్రతీకారాలు, కుట్రలే గుర్తుకొస్తాయి. కానీ ‘అక్క’లో ఈ కోణాన్ని పూర్తిగా మార్చేశారు. ఇక్కడ మహిళలదే అధికారం. వారి నిర్ణయాలే శాసనాలు. పురుషుల కంటే మహిళలకే ఎక్కువ ప్రాధాన్యం ఉండే సమాజాన్ని కథాంశంగా ఎంచుకోవడం కొత్తగా అనిపిస్తుంది.దర్శకుడు ధర్మరాజ్ శెట్టి ఎంచుకున్న పాయింట్ బాగుంది.కానీ దాన్ని ఆసక్తికరంగా మలచడంలోనే తడపడ్డారు. ఆసక్తికరమైన థ్రిల్లర్ అంశాలను జోడించి ఉంటే సిరీస్ స్థాయి మరోలా ఉండేది. 800 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ వ్యవస్థను ప్రేక్షకులకు పరిచయం చేయడానికి కుటుంబాల మధ్య సంబంధాలు, వారసత్వ అంశాలపై ఎక్కువ సమయం కేటాయించారు. దీంతో తొలి రెండు ఎపిసోడ్లు కాస్త నెమ్మదిగా సాగుతాయి. కథలో వేగం పెరగడానికి కొంత సమయం పడుతుంది. అయితే మూడో ఎపిసోడ్ నుంచి ఆసక్తి మొదలవుతుంది.(ఇదీ చదవండి: ‘కిల్లర్’మూవీ రివ్యూ అండ్ రేటింగ్)తల్లి నుంచి కూతురికి అధికారం బదిలీ కావడం, మహిళలు పెళ్లి చేసుకోకుండానే తమకు నచ్చిన జీవితాన్ని ఎంచుకునే స్వేచ్ఛ వంటి అంశాలు ఆకట్టుకుంటాయి. అయితే ఇలాంటి విభిన్నమైన సమాజం శతాబ్దాలుగా ఎలా కొనసాగిందనే విషయాన్ని మరింత లోతుగా చూపించాల్సింది. మరోవైపు రుద్ర పాత్రను ఎలివేట్ చేసే క్రమంలో భవానీ వంటి బలమైన పాత్రకు కొన్ని సందర్భాల్లో తక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు అనిపిస్తుంది.అధికారం కోసం జరిగే పోరాటం, అవినీతి, పాత పగలు, నమ్మకద్రోహం వంటి అంశాలు కథలో ఉన్నప్పటికీ వాటిని మరింత బలంగా తెరకెక్కించాల్సింది. భవానీ ఎదుర్కొనే సమస్యలు ఒక్కొక్కటిగా పెరగడంతో కథలో ఉత్కంఠ మొదలవుతుంది. ముఖ్యంగా చివరి ఎపిసోడ్లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అయితే ఐదు ఎపిసోడ్లే ఉన్నప్పటికీ అక్కడక్కడా అనవసరమైన డ్రామా కథన వేగాన్ని తగ్గిస్తుంది.(ఇదీ చదవండి: 'ఆదర్శ కుటుంబం’ రివ్యూ అండ్ రేటింగ్)ఎవరెలా చేశారంటే?భవానీ పాత్రలో కీర్తి సురేశ్ బాగా నటించింది. ఒక ప్రాంతాన్ని పాలించే నాయకురాలిగా ఆమెలో ఉండాల్సిన ధైర్యం, అధికారం నిలబెట్టుకోవాలనే పట్టుదల కనిపిస్తాయి. అదే సమయంలో కుటుంబం విషయంలో ఆమె ఎదుర్కొనే భావోద్వేగ సంఘర్షణలను కూడా సహజంగా పలికించింది. ముఖ్యంగా ఎదుటివారితో మాట్లాడేటప్పుడు చూపించే కఠినత్వం, తనవారి దగ్గర బయటపడే భావోద్వేగాలు పాత్రకు బలాన్నిచ్చాయి.రుద్రగా రాధికా ఆప్టే తనదైన నటనతో ఆకట్టుకుంది. తన లక్ష్యాన్ని చేరుకోవడానికి చేసే సన్నివేశాలు మహిళగా అదరగొట్టింది. కీర్తి, రాధికా ఎదురెదురుగా కనిపించే సన్నివేశాలు కథలో ఆసక్తిని పెంచుతాయి. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే చేశారు. పెర్నూరు ప్రాంతాన్ని ఆవిష్కరించిన విధానం బాగుంది. సినిమాటోగ్రఫీ సిరీస్‌కు ప్రధాన బలంగా నిలుస్తుంది. అయితే విజువల్స్‌పై పెట్టిన శ్రద్ధ కథనం మీద కూడా పెట్టి ఉంటే ఫలితం మరింత మెరుగ్గా ఉండేది. కొన్ని సన్నివేశాల్లో నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. మొత్తంగా నిర్మాణ విలువలు బాగున్నాయి.చివరిగా..మహిళల ఆధిపత్యం, అధికారం కోసం జరిగే పోరాటం వంటి విభిన్నమైన కథాంశంతో రూపొందిన సిరీస్ ‘అక్క’. కీర్తి సురేశ్, రాధికా ఆప్టేల నటన, 1980ల నేపథ్యం, చివరి ఎపిసోడ్‌లోని యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. థ్రిల్లర్ లాంటి కథలను ఇష్టపడేవారు ఓసారి ప్రయత్నించవచ్చు.-ప్రశాంత్ కందా
రేపే రామ్ చరణ్ RC17 ముహూర్తం.. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే?
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ ఎట్టకేలకు పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని నవంబర్ 1న లాంఛనంగా ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో సినిమాను మొదలుపెట్టనున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ వెల్లడించారు. దీంతో చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ ప్రాజెక్టుపై మరోసారి సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.‘RC17’(వర్కింగ్ టైటిల్)ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని టీ-సిరీస్ సమర్పిస్తోంది. గతంలో సుకుమార్, రామ్ చరణ్ కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈసారి ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తారనే ఆసక్తి నెలకొంది.దేవిశ్రీ ప్లేస్‌లో అనిరుధ్?ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సుకుమార్ గత చిత్రాలకు సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ కాకుండా ఈసారి అనిరుధ్ బాధ్యతలు చేపట్టనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పూజా కార్యక్రమం రోజు హీరోయిన్‌తో పాటు సంగీత దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. (ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్లకు షాక్.. #RC17లో ఛాన్స్ ఈమెకా?)
స్టార్ హీరోయిన్లకు షాక్.. #RC17లో ఛాన్స్ ఈమెకా?
'ఆర్ఆర్ఆర్' లాంటి సూపర్ హిట్ తర్వాత దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకున్న రామ్ చరణ్.. 'గేమ్ ఛేంజర్' చేశాడు. ఇది దారుణంగా నిరాశపరిచింది. దీంతో మెగా అభిమానులు ఆశలన్నీ 'పెద్ది' మీద పెట్టుకున్నారు. కానీ ఇది కూడా పూర్తిగా మెప్పించలేకపోయింది. దీంతో ఇక సుకుమార్ సినిమాతో చరణ్ అదిరిపోయే రచ్చ చేస్తాడని ఫిక్స్ అవుతున్నారు. అందుకు తగ్గట్లే ఒక్కో అప్డేట్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: వివాదంలో ‘ఆదర్శ కుటుంబం’.. నిర్మాత ఆవేదన)రేపు అనగా ఆదివారం(నవంబర్ 01).. హైదరాబాద్‌లో #RC17 సినిమా లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఈ మూవీకి అనిరుధ్ సంగీతమందించనున్నాడని ఇప్పటికే ఓ లీకైంది. ఇప్పుడు హీరోయిన్ పేరు కూడా బయటకొచ్చేసింది. అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగమ్మాయి సాత్విక వీరవల్లి.. త్వరలో 'ఆకాశంలో ఒక తార' అనే తెలుగు సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పుడు ఈమెకే చరణ్ సరసన నటించే అవకాశం దక్కినట్లు తెలుస్తోంది.సాత్వికతో పాటే భాగ్యశ్రీ బోర్సే, 'ధురంధర్' ఫేమ్ సారా అర్జున్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరి వీళ్లలో ఎవరు ఫిక్స్ అయ్యారనేది లాంచింగ్ ఈవెంట్లో బయటపెడతారేమో చూడాలి? మైత్రీ మూవీ మేకర్స్ దీనిని నిర్మిస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ సినిమా.. క్రేజీ కాన్సెప్ట్)
ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ సినిమా.. క్రేజీ కాన్సెప్ట్
దుల్కర్ సల్మాన్ పేరుకే మలయాళ హీరో గానీ తెలుగులోనూ చాలామంది అభిమానులున్నారు. సీతారామం, మహానటి చిత్రాలతో హీరోగా హిట్స్ కొట్టాడు. ప్రస్తుతం ఆకాశంలో ఒక తార, శ్రీశ్రీ అనే టాలీవుడ్ మూవీస్ చేస్తున్నాడు. ఇవి రాబోయే మూడు నాలుగు నెలలో థియేటర్లలోకి రాబోతున్నాయి. ఇవలా ఉండగానే ఇతడు నటించిన మలయాళ ఫాంటసీ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ సినిమా)దుల్కర్ సల్మాన్, కాయదు లోహర్ హీరోహీరోయిన్లుగా చేసిన థ్రిల్లర్ 'ఐ యామ్ గేమ్'. నహాస్ హిదయత్ దర్శకుడు. గత నెల 03న థియేటర్లలోకి వచ్చింది. కాన్సెప్ట్ క్రేజీగానే ఉన్నప్పటికీ ఎందుకనో వర్కౌట్ కాలేదు. ఇప్పుడీ చిత్రం దాదాపు రెండు నెలల తర్వాత అంటే వచ్చే శుక్రవారం(నవంబర్ 06) నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.'ఐ యామ్ గేమ్' విషయానికొస్తే.. డ్యాన్ జాన్ (దుల్కర్ సల్మాన్) చదువు పూర్తి చేసి తండ్రి కోరిక మేరకు బిజినెస్ చేస్తుంటాడు. పనికన్నా గ్యాంబ్లింగ్ అంటేనే పిచ్చి. రూ.లక్షల్లో పోగొట్టుకున్నా అప్పు తెచ్చి మరీ జూదమాడుతుంటాడు. అప్పుల వాళ్ల చేతిలో తన్నులు తినడంతో తల్లి మెర్సీ (జయసుధ) తాను దాచుకున్న రూ.60 లక్షలు ఇతడికి ఇస్తుంది. వాటిని తీసుకెళ్లి క్రికెట్ బెట్టింగ్ ఆడి పోగొడతాడు. తన డబ్బులు ఇచ్చేయమని బెట్టింగ్ నిర్వాహకులను బెదిరించి వాటిని తీసుకుని కారులో పారిపోతుండగా యాక్సిడెంట్ అయి కుడి చేయి కోల్పోతాడు. దీంతో వైద్యులు డ్యాన్‌కు ఆపరేషన్ చేసి వేరొకరి చేయిని అతికిస్తారు. అక్కడే ఇషా(కాయదు లోహర్) పరిచయమవుతుంది.ఇకపోతే డ్యాన్ కుడి చేయి అతడి కంట్రోల్లో ఉండదు. అది చేయాలనుకున్న పనులు చేసేస్తూ ఉంటుంది. తొలుత కంగారు పడినా, డ్యాన్ నెమ్మదిగా కుడి చేయి చేసే పనులకు అలవాటు పడతాడు. ఒకరోజు ఓ బెట్టింగ్ సెంటర్‌కు వెళ్లి మద్యం సేవిస్తుండగా, అక్కడకు డేవిడ్ (మిస్కిన్) వస్తాడు. అతడిని చూడగానే కుడి చేయి కత్తి తీసుకుని డేవిడ్‌ను చంపడానికి ప్రయత్నిస్తుంది. దీన్ని డ్యాన్ కష్టమ్మీద అడ్డుకుంటాడు. ఇంతకీ డ్యాన్‌కు అమర్చిన కుడి చేయి ఎవరిది? దానికి అంత శక్తి ఎలా వచ్చింది? డేవిడ్‌ను ఎందుకు చంపాలనుకుంది? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలో బ్యూటీఫుల్ సినిమా.. 'బత్తా' తెలుగు రివ్యూ)The game is about to begin! Dulquer Salmaan's I'm Game streaming from November 6 on JioHotstar in Malayalam, Hindi, Tamil, Telugu & Kannada. @dulQuer @NAHASKh1 @11Lohar @DQsWayfarerFilm #ImGame #ImGameOnJioHotstar #DQ #JioHotstar https://t.co/BYLt5OHqU9— JioHotstar Malayalam (@JioHotstarMal) October 31, 2026
క్రీడలు
టీమిండియా ప్లేయర్ ఊచకోత.. 12 బంతుల్లో 50! అయినా తప్పని ఓటమి
హాంగ్ కాంగ్ సిక్సెస్-2026 టోర్నమెంట్లో భారత జట్టు హ్యాట్రిక్ ఓటములను చవిచూసింది. శనివారం మిషన్ రోడ్ గ్రౌండ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన బౌల్ గ్రూప్ సెమీఫైనల్-2లో 3 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. 125 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది.ఓపెనర్ నితీష్ రాణా కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత శశాంక్ సింగ్(9 బంతుల్లో 29), రాహుల్ త్రిపాఠి (14 బంతుల్లో 56, 7 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇంగ్లీష్ బౌలర్లపై విరుచుకుపడిన త్రిపాఠి కేవలం 12 బంతుల్లో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఆఖరిలో కెప్టెన్ కృనాల్ పాండ్యా (7 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 28) దూకుడుగా ఆడినప్పటికి జట్టును గెలిపించలేకపోయాడు.అంతకముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 6 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఓపెనర్ మార్టిన్ అండర్సన్ సంచలన బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డాడు. కేవలం 13 బంతుల్లో 392 స్ట్రైక్ రేట్‌తో 51 పరుగులు (3 ఫోర్లు, 6 సిక్సర్లు) సాధించి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అతడికి తోడుగా ఎడ్ బర్నార్డ్ (14 బంతుల్లో 35, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో త్రిపాఠీ, నితీష్ రాణా తలా వికెట్ సాధించారు. కాగా భారత్ ఇప్పటికే పాకిస్తాన్, యూఏఈ చేతిలో ఓడిపోయంది. కృనాల్ సేన తమ చివరి మ్యాచ్‌లో నవంబర్ 1న బంగ్లాదేశ్‌తో తలపడనుంది.చదవండి: సౌతాఫ్రికా పేసర్ వరల్డ్ రికార్డు.. సరికొత్త చరిత్ర
బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన వెస్టిండీస్
ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 272 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో షాద్మాన్ ఇస్లాం(105), తౌహిద్ హ్రిదోయ్(42) మినహా మిగితా అందరూ దారుణంగా విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో జోమెల్ వారికన్ 5 వికెట్లు తీసి బంగ్లాదేశ్‌ను దెబ్బతీశాడు. అనంతరం విండీస్ కూడా తమ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ సాధించలేకపోయింది. కరేబియన్ జట్టు 245 పరుగులకే ఆలౌటైంది. తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ (56 పరుగులు), జాన్ క్యాంప్‌బెల్ (54 పరుగులు) అర్ధసెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో స్పిన్నర్ నయీమ్ హసన్ 4 వికెట్లు తీశాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాకు 27 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో కూడా బంగ్లా బ్యాటర్ల ఆటతీరు ఏ మాత్రం మారలేదు. బంగ్లాదేశ్ జట్టు కేవలం 142 పరుగులకే ఆలౌటైంది.విండీస్ స్పిన్నర్లు చేజ్ 5 వికెట్లు, జోమెల్ వారికన్ 4 వికెట్లు పడగొట్టి బంగ్లా పతనాన్ని శాసించారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని జోడించి విండీస్ ముందు 170 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ఉంచింది. ఈ లక్ష్యాన్ని విండీస్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. బ్రాండెన్ కింగ్(81) అజేయంగా నిలిచి మ్యాచ్ ముగించాడు. ఇరు జట్ల మద్య రెండో టెస్టు నవంబర్ 5 నుంచి సిల్హెట్ వేదికగా ప్రారంభం కానుంది.చదవండి: సౌతాఫ్రికా పేసర్ వరల్డ్ రికార్డు.. సరికొత్త చరిత్ర
సౌతాఫ్రికా పేసర్ వరల్డ్ రికార్డు.. సరికొత్త చరిత్ర
సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం.. టెస్టు ఫార్మాట్లో ప్రపంచంలోనే అత్యంత దూకుడైన ఫాస్ట్‌బౌలర్ అతడే అనడంలో అతిశయోక్తి లేదు. రబాడ ప్రస్తుతం స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌తో బిజీగా ఉన్నాడు.1-1తో సమంగా కాగా సౌతాఫ్రికా సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతోంది. ఇప్పటికి రెండు మ్యాచ్‌లు పూర్తి కాగా ప్రొటిస్, కంగారూలు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి.ఈ క్రమంలో కేప్‌టౌన్ వేదికగా గురువారం సౌతాఫ్రికా- ఆసీస్ మధ్య మూడో టెస్టు మొదలైంది. న్యూలాండ్స్ మైదానంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌట్ అయింది.287 పరుగుల లక్ష్యంఇక ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 429 పరుగులు చేసింది. ఫలితంగా వంద పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్‌లో 387 పరుగులు చేసిన ప్రొటిస్ జట్టు.. ఆసీస్‌కు 287 పరుగుల లక్ష్యం విధించింది. అయితే, లక్ష్య ఛేదనలో కంగారూలకు కగిసో రబాడ చుక్కలు చూపించాడు.A FIERY START TO THE DAY FROM RABADA 🔥🔥 #SAvAUS https://t.co/wwmX6ma3j3— FanCode (@FanCode) October 31, 2026రబాడ ప్రపంచ రికార్డుటాపార్డర్లో ట్రవిస్ హెడ్ (14), మ్యాట్ రెన్షా (0), మార్నస్ లబుషేన్ (4)లను వరుస విరామాల్లో పెవిలియన్‌కు పంపాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో మాత్రం ఒకే ఒక్క వికెట్ తీయగలిగాడు. ఈ క్రమంలో టెస్టుల్లో 350 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు రబాడ. తద్వారా అతి తక్కువ బంతుల్లో ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా కగిసో రబాడ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.WICKET NUMBER 350 FOR RABADA 🥵 Australia in big trouble 😳 #SAvAUS https://t.co/g7FjLgKfwy— FanCode (@FanCode) October 31, 2026అతి తక్కువ బంతుల్లో టెస్టుల్లో 350 వికెట్లు పూర్తి చేసుకున్న బౌలర్లు👉కగిసో రబాడ (సౌతాఫ్రికా)- 13808 బంతుల్లో👉డేల్ స్టెయిన్ (సౌతాఫ్రికా)- 14719 బంతుల్లో👉వకార్ యూనిస్ (పాకిస్తాన్)- 14905 బంతుల్లో👉మాల్కమ్ మార్షల్ (వెస్టిండీస్)- 16285 బంతుల్లో👉మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా)- 16908 బంతుల్లో.ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా తరఫున 350కి పైగా వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గానూ రబాడ రికార్డులకెక్కాడు. డేల్ స్టెయిన్ 439 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. షాన్ పొలాక్ 421, మఖాయా ఎంతిని 390 వికెట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.ఇవీ చదవండి: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. భారత జట్టులో కీలక మార్పు
పబ్లిక్ హాలిడే ప్రకటించండి!.. పాక్ ప్రధానిపై సెటైర్లు
పాకిస్తాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి. గల్లీ మ్యాచ్‌లకు కూడా ఆనందపడటం ఏమిటో అంటూ నెటిజన్లు ఆయనపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. విజయానికి గుర్తుగా పబ్లిక్ హాలిడే ప్రకటించేయండి అంటూ సెటైర్లు వేస్తున్నారు.అసలేం జరిగిందంటే.. హాంకాంగ్ సిక్సెస్-2026 టోర్నీకి శుక్రవారం తెరలేచిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గ్రూప్-‘సి’లో ఉన్న పాక్ జట్టు తొలుత యూఏఈతో తలపడి వికెట్ తేడాతో ఓటమిపాలైంది. అనంతరం భారత్‌తో మ్యాచ్‌లో మాత్రం నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది.అభినందనలు అబ్బాయిలుఈ నేపథ్యంలో పాక్ ప్రధాన షెబాజ్ షరీఫ్ సోషల్ మీడియా వేదికగా తమ జట్టును అభినందించారు. ‘‘అభినందనలు అబ్బాయిలు. హాంకాంగ్ సిక్సెస్ 2026 ఓపెనింగ్ మ్యాచ్‌లో ఇండియాపై నాలుగు వికెట్ల తేడాతో గెలిచినందుకు కంగ్రాట్స్.పీసీబీ చైర్మన్ మోసిన్ నక్వీని కూడా అభినందిస్తున్నా. ఆటగాళ్లకు మద్దతుగా ఉంటూ.. అడుగడుగునా ప్రోత్సహించడం గొప్ప విషయం’’ అంటూ షెబాజ్ ప్రశంసలు కురిపించారు. నిజానికి పాక్ తొలి మ్యాచ్‌లో యూఏఈ చేతిలో ఓడిపోగా.. భారత్‌తో తమ జట్టు తొలి మ్యాచ్ ఆడి గెలిచిందని షెబాజ్ పప్పులో కాలేశారు.పబ్లిక్ హాలిడే ప్రకటించండి!ఈ నేపథ్యంలో నెటిజన్లు ఆయనపై తీవ్రస్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. ‘‘గల్లీ క్రికెట్ మాదిరి ఆరు ఓవర్ల ఆటలో గెలిచినందుకు ప్రధాని ఇంత సంబరపడిపోతున్నారా!.. ఇంకా నయం ఐసీసీ టోర్నీలో గనుక పాక్ జట్టు గెలుపొందితే ఇంకేం చేసేవారో!.. మీ జట్టు గల్లీ మ్యాచ్‌లో గెలిచినందుకు పబ్లిక్ హాలీడే ఇచ్చేయండి’’ అంటూ నెటిజన్లు షెబాజ్ షరీఫ్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఇదీ చదవండి: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. భారత జట్టులో కీలక మార్పు
న్యూస్ పాడ్‌కాస్ట్
నారా చంద్రబాబు పాలనలో ధరలు చూస్తే షాక్... ధరల పెంపుతో బాదుడే బాదుడు... వైఎస్ జగన్ మండిపాటు
రాక్షసుడితో పోరాడుతున్నాం... స్థానిక సంస్థల ఎన్నికల రోజు పోలింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి... వైఎస్ జగన్ సూచన
అర్నబ్ తుఫాన్ ధాటికి ఉత్తరాంధ్ర, కోస్తాజిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తం..
పోలింగ్ రోజు పులివెందులలోనే ఉంటా... ఎవరొస్తారో రండి... వెన్నుపోటు పార్టీకి వైఎస్ జగన్ సవాల్
బంగాళాఖాతంలో అతి తీవ్ర తుపానుగా బలపడిన అర్నబ్.. ఇవాళ, రేపు ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
ఏపీలో కూటమి పార్టీల మధ్య ఉత్తుత్తి పొత్తు... జనసేనకు కేటాయించిన స్థానాల్లోనూ పోటీలో నిలిచిన టీడీపీ అభ్యర్థులు
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లలో ‘పచ్చ’ నకిలీలు... అడ్డదారిలో గెలుపు కోసం కుట్రలు, కుతంత్రాలు
రావణకాష్టంగా మారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం... తిరగబడండి... ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి... రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ పిలుపు
ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎందాకైనా పోరాడదాం.... వైఎస్సార్సీపీ నాయకులకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం
ఏపీ స్థానిక ఎన్నికల్లో దౌర్జన్యం చేస్తుంటే చేతులు ముడుచుకుని కూర్చోలేం... పచ్చమూకల ఆగడాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
బిజినెస్
జియో లాభం జూమ్
న్యూఢిల్లీ: దేశీ టెలికం, డిజిటల్ సేవల దిగ్గజం జియో ప్లాట్‌ఫామ్స్ బ్లాక్‌బస్టర్ లిస్టింగ్లాగే బంపర్ ఫలితాలతో అదరగొట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (2026–27, క్యూ2)లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 13.7 శాతం జంప్ చేసి రూ. 8,389 కోట్లకు దూసుకెళ్లింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో లాభం రూ. 7,379 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం సైతం 11.4 శాతం వృద్ధితో రూ. 40,475 కోట్లకు చేరింది. కాగా, జియో స్టాక్ మార్కెట్ అరంగేట్రం తర్వాత ఇవి తొలి ఫలితాలు కావడం విశేషం. ఇష్యూ ధర రూ.1,119తో పోలిస్తే తాజాగా జియో 21.36 శాతం ప్రీమియంతో రూ.1,358 వద్ద లిస్టయిన సంగతి తెలిసిందే. దీంతో మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత మార్కెట్ విలువ పరంగా దేశంలో రెండో అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. ‘ఈ త్రైమాసిక ఫలితాలు మా 5జీ నెట్వర్క్ పటిష్టత, బ్రాడ్‌బ్యాండ్, డిజిటల్ సరీ్వసుల వృద్ధికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. శాటిలైట్ కమ్యూనికేషన్స్, 6జీ మేధో సంపత్తి, ఏఐ సరీ్వసులతో మా వాటాదారులకు నిరంతర విలువను చేకూరుస్తాం. మార్కెట్ అనిశి్చతుల్లోనూ జియో బ్లాక్‌బస్టర్ ఐపీఓ అన్ని ఇన్వెస్టర్ విభాగాల వ్యాప్తంగా రికార్డులు బ్రేక్ చేసింది. గడిచిన పదేళ్లలో మేము సాధించినదానికి మించి రాబోయే దశాబ్దంలో మరింత విలువను సృష్టిస్తాం’ అని జియో ప్లాట్‌ఫామ్స్ ఎండీ ఆకాశ్ అంబానీ పేర్కొన్నారు. ఏఆర్పీయూ దూకుడు... జియో ప్లాట్‌ఫామ్స్ క్యూ2 ఎబిటా 16.6 శాతం జంప్ చేసి రూ.21,879 కోట్లకు చేరింది. కాగా, సెపె్టంబర్ చివరి నాటికి జియో యూజర్ల సంఖ్య 54.2 కోట్లకు చేరింది. 30 కోట్ల మంది 5జీ యూజర్ల మైలురాయిని అధిగమించింది. గత 12 నెలల్లో 6.6 కోట్ల మంది 5జీ యూజర్లు జతయ్యారు. ఫిక్సిడ్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్ల సంఖ్య 3 కోట్లను అధిగమించగా, ఎయిర్‌ఫైబర్ కనెక్షన్లు 1.51 కోట్లకు చేరాయి. జియో సగటు యూజర్ ఆదాయం (ఏఆర్పీయూ) రూ.218.8కి ఎగసింది. గతేడాది క్యూ2లో ఇది రూ.211.4గా ఉంది. జియో స్టార్ ఆదాయం 10 శాతం వృద్ధితో రూ.6,806 కోట్లుగా నమోదైంది. సగటు నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 10 శాతం ఎగసి దాదాపు 44 కోట్లను తాకింది. కాగా, ఒక్కో యూజర్ సగటు నెలవారీ డేటా వినియోగం 14.2 శాతం పెరుగుదలతో 44.2 జీబీకి చేరింది. జియో షేరు ధర శుక్రవారం 0.68% లాభంతో రూ. 4,131 వద్ద క్లోజైంది. మార్కెట్ విలువ రూ.13.18 లక్షల కోట్లకు చేరింది. ట్రేడింగ్ ముగిశాక ఫలితాలు వచ్చాయి.
రిలయన్స్ అదుర్స్!
న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీన్ (ఆర్ఐఎల్) మరోసారి రికార్డు ఫలితాలతో సత్తా చాటింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్ (2026–27, క్యూ2)లో కంపెనీ రూ.29,550 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే క్వార్టర్లో రూ.22,092 కోట్లతో పోలిస్తే లాభం 33.8 శాతం ఎగబాకింది. కంపెనీ చరిత్రలో ఇది రికార్డు త్రైమాసిక లాభం కావడం గమనార్హం. గతంలో నమోదైన రూ.23,196 కోట్ల రికార్డును బ్రేక్ చేసింది. రిటైల్ వ్యాపారం పనితీరు మందకొడిగా ఉన్నప్పటికీ, పటిష్టమైన రిఫైనింగ్ మార్జిన్లు, డిజిటల్ వ్యాపారం దన్నుతో కంపెనీ మెరుగైన ఫలితాలను నమోదు చేయగలిగింది. కాగా, క్యూ2లో మొత్తం ఆదాయం సైతం 27.8 శాతం దూసుకెళ్లి రూ. 3,62,268 లక్షల కోట్లకు చేరింది. ‘తీవ్ర ఒడిదుడుకులు, ప్రపంచవ్యాప్తంగా సవాళ్లు నెలకొన్నప్పటికీ మా ఓ2సీ బిజినెస్ అత్యుత్తమ త్రైమాసిక పనితీరును సాధించింది. మా నిర్వహణ సత్తాకు ఇది నిదర్శనం’ అని ఆర్ఐఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ పేర్కొన్నారు. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలు... → ఆయిల్ టు కెమికల్స్ (ఓ2సీ) వ్యాపార ఎబిటా 67.9 శాతం పెరిగి రూ. 25,203 కోట్లుగా నమోదైంది. ఆదాయం 44.2 శాతం ఎగసి రూ. 2,31,601 కోట్లను తాకింది. → పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, హార్మూజ్ జలసంధిలో అడ్డంకులతో పాటు రష్యా రిఫైనరీలపై దాడుల నేపథ్యంలో స్థూల రిఫైనింగ్ మార్జిన్ 3–3.7 రెట్లు ఎగసింది. క్యూ2లో బ్రెంట్ క్రూడ్ సగటు బ్యారెల్ ధర 97 డాలర్లుగా నమోదైంది. గతేడాది క్యూ2తో పోలిస్తే ఇది 40.6% అధికం. → ఆయిల్, గ్యాస్ ఎబిటా 2 శాతం తగ్గి రూ.4,901 కోట్లుగా నమోదైంది. కేజీ డీ6లో ఉత్పత్తి తగ్గుదల, అధిక ప్రభుత్వ పన్నులు దీనికి కారణమయ్యాయి. రిటైల్ వీక్... రిలయన్స్ రిటైల్ క్యూ2 నికర లాభం 25.5 శాతం తగ్గుదలతో రూ.2,419 కోట్లుగా నమోదైంది. గతేడాది క్యూ2లో కంపెనీ నికర లాభం రూ.3,469 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం మాత్రం 6.5 శాతం వృద్ధితో రూ.91,716 కోట్లకు చేరింది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) ఆదాయం 5.78 శాతం పెరిగి రూ.80,220 కోట్లను తాకింది. కాగా, క్యూ2లో రిలయన్స్ రిటైల్ 303 కొత్త స్టోర్లను జత చేసింది. నికరంగా 222 స్టోర్లు తగ్గి 19,947కు చేరింది. వేగంగా వృద్ధి చెందుతున్న డిజిటల్ కామర్స్‌లో కొత్త మోడల్, బీ2బీ చానెళ్లు కంపెనీ ఆఫ్‌లైన్ వ్యాపార లాభాలతో నడుస్తుండటంతో పాటు వాటి నుంచి నిధులను అందిస్తున్నామని ఆర్ఆర్వీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ పేర్కొన్నారు. జియో రికార్డు ఐపీఓ, లిస్టింగ్‌తో రిలయన్స్ ఇన్వెస్టర్లకు విలువను చేకూర్చే జర్నీలో ఈ వారం చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. 22 రెట్ల సబ్‌్రస్కిప్షన్, మెరుగైన లిస్టింగ్ లాభాలతో ఈ ఇష్యూ పలు ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పింది. నిర్వహణపరమైన క్రమశిక్షణ, మా పోర్ట్‌ఫోలియోలో దేశీ ఫోకస్, మా సమగ్ర వ్యాపారాల్లో వైవిధ్యంతో విదేశీ అనిశి్చతులను రిలయన్స్ సమర్థంగా ఎదుర్కోగలిగింది. – ముకేశ్ అంబానీ, ఆర్ఐఎల్ సీఎండీబీఎస్ఈలో శుక్రవారం రిలయన్స్ షేరు స్వల్పంగా తగ్గి రూ. 1,165 వద్ద క్లోజయ్యింది. మార్కెట్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి.
రైతులకు డబ్బులొచ్చాయ్.. ‘పీఎం కిసాన్’ విడుదల
దేశవ్యాప్తంగా రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం 24వ విడత నిధులు విడుదలయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం (అక్టోబర్ 30) గుజరాత్‌లోని బనస్కాంతలో జరిగిన కార్యక్రమంలో ఈ నిధులను విడుదల చేశారు. మొత్తం 9.34 కోట్లకు పైగా అర్హులైన రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లోకి రూ.18,690 కోట్లకు పైగా నగదును నేరుగా బదిలీ చేశారు. ఒక్కో రైతు కుటుంబానికి రూ.2,000 చొప్పున డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) విధానంలో ఈ సాయం అందించారు.ఏడాదికి రూ.6,000 సాయంపీఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6,000 ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ మొత్తాన్ని రూ.2,000 చొప్పున మూడు విడతల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. వ్యవసాయ పెట్టుబడులు, విత్తనాలు, ఎరువుల కొనుగోలు వంటి అవసరాలకు ఈ సాయం ఉపయోగపడుతుంది. గత జూన్ 20న 23వ విడతగా 9.44 కోట్ల మంది రైతులకు రూ.18,880 కోట్లకు పైగా నిధులను ప్రభుత్వం బదిలీ చేసింది. తాజాగా 24వ విడత విడుదలతో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి రైతులకు అందించిన మొత్తం సాయం రూ.4.64 లక్షల కోట్లు దాటింది.పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయో లేదో ఇలా తెలుసుకోండి..(How to check PM Kisan status)రైతులు తమ ఖాతాల్లో రూ.2,000 జమ అయ్యాయో లేదో ఆన్లైన్లోనే తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఈ కింద చెప్పినట్లు చేయండి..పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ను (https://pmkisan.gov.in)ను సందర్శించాలి.ఫార్మర్స్ కార్నర్‌లోని 'Know Your Status' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.రిజిస్ట్రేషన్ నంబర్, క్యాప్చా వివరాలు నమోదు చేయాలి.అవసరమైతే మొబైల్‌కు వచ్చిన ఓటీపీతో ధ్రువీకరణ పూర్తి చేయాలి.అనంతరం చెల్లింపు వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, చెల్లింపు తేదీని పరిశీలించవచ్చు.ఇక లబ్ధిదారుల జాబితాలో పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే ఇదే వెబ్‌సైట్‌లోని 'Beneficiary List' ఆప్షన్‌ను ఎంచుకోవాలి. రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం వివరాలు నమోదు చేసి 'Get Report'పై క్లిక్ చేస్తే జాబితాలో పేరును చూసుకోవచ్చు.అయితే పీఎం కిసాన్ లబ్ధిదారులకు ఈ-కేవైసీ తప్పనిసరి. చెల్లింపులు నిలిచిపోకుండా ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతా, అర్హత వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో రైతులు తనిఖీ చేసుకోవాలి.ఇదీ చదవండి: జీఎస్టీలో కీలక మార్పులు.. నవంబర్ 1 నుంచి రీఫండ్లకు కొత్త విధానం!
ఢమాల్మన్న బంగారం, వెండి ధరలు.. ఇవే కారణాలు
బంగారం, వెండి ధరలు ఢమాల్మంటున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, అమెరికాలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం బంగారం, వెండి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వరుసగా అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో అక్టోబర్ 30న విలువైన లోహాల ధరలు మరోసారి పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర నాలుగు నెలల కనిష్ఠానికి చేరగా.. వెండి ధర కూడా ఔన్స్‌కు 50 డాలర్ల దిగువకు పడిపోయింది.ఎంసీఎక్స్‌లోనూ భారీగా తగ్గిన ధరలుదేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు నష్టాల్లో కొనసాగాయి. అక్టోబర్ 30న ఎంసీఎక్స్‌లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ఒక దశలో 10 గ్రాములకు రూ.1,41,263 వద్ద ట్రేడయ్యాయి. వెండి ఫ్యూచర్స్ కిలోకు రూ.1,84,245కు పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్‌కు 3,956 డాలర్లకు దిగజారగా.. వెండి 50 డాలర్ల దిగువకు చేరింది.అమెరికా ద్రవ్యోల్బణమే కారణమా?అమెరికాలో ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుతుండటం పసిడి, వెండి ధరలకు ప్రతికూలంగా మారింది. సెప్టెంబర్‌లో అమెరికా పర్సనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్స్ (పీసీఈ) ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 3.6 శాతానికి చేరింది. ఆగస్టులో ఇది 3.4 శాతంగా ఉంది. మరోవైపు, అమెరికా ఆర్థిక వ్యవస్థ మూడో త్రైమాసికంలో 3.4 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ గణాంకాలు అంచనాలను మించాయి.దీంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత కాలం అధిక స్థాయిలో కొనసాగించవచ్చనే అంచనాలు బలపడుతున్నాయి. డిసెంబర్లో మరోసారి వడ్డీ రేట్ల పెంపునకు అవకాశం ఉందన్న అభిప్రాయాలు కూడా మార్కెట్లో వినిపిస్తున్నాయి. వడ్డీ ఆదాయం అందించని బంగారం, వెండి వంటి పెట్టుబడులపై ఇటువంటి పరిణామాలు ఒత్తిడి పెంచుతాయి. దీనికి తోడు డాలర్ బలోపేతం కావడం కూడా పసిడి ధరల పతనానికి కారణమవుతోంది.చమురు ధరల ప్రభావంమరోవైపు అమెరికా-ఇరాన్ మధ్య భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు మార్కెట్లో అనిశ్చితిని పెంచుతున్నాయి. చమురు ధరల పెరుగుదల ఇంధన ఆధారిత ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చనే ఆందోళనలు నెలకొన్నాయి. సాధారణంగా యుద్ధాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతల సమయంలో సురక్షిత పెట్టుబడిగా బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. అయితే ఈసారి ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లపై ఆందోళనలు ఆ ప్రభావాన్ని అధిగమిస్తున్నాయి.మరింత తగ్గుతాయా?సాంకేతికంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి 3,950-3,970 డాలర్ల స్థాయి కీలక మద్దతుగా ఉంది. 4,000 డాలర్ల స్థాయిని తిరిగి అందుకోవడం పసిడికి కీలకం. వెండికి 48 డాలర్ల వద్ద మద్దతు ఉండగా.. 53 డాలర్ల స్థాయి నిరోధంగా పనిచేయవచ్చు. దేశీయ మార్కెట్లో ఎంసీఎక్స్ బంగారానికి రూ.1,41,500, రూ.1,40,000 స్థాయిలు కీలకం. వెండికి రూ.1,80,000, రూ.1,73,000 వద్ద మద్దతు లభించే అవకాశం ఉంది. అయితే అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, ఫెడరల్ రిజర్వ్ తదుపరి నిర్ణయాలు రానున్న రోజుల్లో ఈ లోహాల ధరల దిశను నిర్దేశించనున్నాయి.ఇదీ చదవండి: దేశంలోని బిజినెస్ స్కూళ్లన్నీ మూసేయడం మంచిది!దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలను ఈ కింద చూడవచ్చు..
ఫ్యామిలీ
స్టీమ్ రూమ్‌లో కొందరికి రక్తపోటు తగ్గతుంది ఎందుకు? నటి జాన్వీ కపూర్ కూడా..
ఇటీవల కాలంలో స్టీమ్ రూమ్‌లో సేద తీరడం ఒక ట్రెండ్‌గా మారింది. దీన్ని ఆవిరి స్నానం అని కూడా అంటారు. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కూడా. అయితే ఇదంతా ఎందుకంటే. కొందరికీ ఈ స్టీమ్ రూమ్ విశ్రాంతి లేదా సేద తీర్చే రూమ్‌గా కాకుండా ప్రాణాంతకంగా మారిపోతుంది. అంటే కొందరికి ఇందులో ఉంటే బీపీ అకస్మాత్తుగా పడిపోయి..స్పృహ కోల్పోతారట. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా తనకు ఇలానే జరుగుతుందని వివరించింది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది?, అందుకు గల కారణాలు?, వైద్యులు ఏం చెబుతున్నారు? తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!'కాఫీ విత్ కరణ్' సీజన్ 9 ఎపిసోడ్లో జాన్వీ కపూర్, వరుణ్ ధావన్ పాల్గొన్నారు.ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో, హోస్ట్ కరణ్ జోహార్ జాన్వీని, సారా అలీఖాన్, అనన్య పాండేలతో కలిసి సౌనాలో ఇరుక్కుపోతే ఏం చేస్తారు అని అడగగా.. స్టీమ్ లేదా సౌనాలో ఉన్నప్పుడు తనకు రక్తపోటు తగ్గిపోతుందని, స్పృహ కోల్పోతానని ఆమె వెల్లడించారు. నిజంగానే స్టీమ్ రూమ్‌లో ఉంటే ఇలా జరుగుతుందా అంటే..సౌనా లేదా స్టీమ్ రూమ్‌లో గడపడం కొందరికీ రిలాక్స్ మోడ్ అయినా మరికొందరికి శరీరంలోని ఉష్ణోగ్రతను, రక్తప్రసరణను నియంత్రించుకునే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీని వల్ల రక్తపోటు ఆకస్మికంగా పడిపోయి, తలతిరగడం, స్పృహ కోల్పోవడం కూడా జరగవచ్చు.సౌనా వల్ల రక్తపోటు ఎలా తగ్గుతుంది..ఒక వ్యక్తి సౌనాలోకి ప్రవేశించినప్పుడు, శరీరం చర్మానికి రక్త ప్రవాహాన్ని పెంచడం ద్వారా తనను తాను చల్లబరచుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ సమయంలో రక్తనాళాలు విస్తరిస్తాయి, ఈ ప్రక్రియను వాసోడైలేషన్ (రక్తనాళాల వ్యాకోచం) అంటారు, దీనిలో రక్తపోటు స్థాయిలు పడిపోవచ్చు. ఒకవేళ రక్తపోటు మరీ ఎక్కువగా పడిపోతే, మెదడుకు తాత్కాలికంగా తగినంత రక్తం అందకపోవచ్చు, దీని ఫలితంగా తల తిరగడం లేదా స్పృహ కోల్పోవడం జరగవచ్చు.రక్తపోటు తగ్గినప్పుడు ఏం జరుగుతుందంటే..రక్తపోటు అంటే రక్తనాళాల గోడలపై రక్తం కలిగించే ఒత్తిడి. దీనివల్ల మెదడుతో సహా శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్, పోషకాలు చేరతాయి. ఒక వ్యక్తి అధిక ఉష్ణోగ్రతలకు గురైనప్పుడు, చర్మానికి సమీపంలో ఉన్న రక్తనాళాలు అదనపు వేడిని విడుదల చేయడానికి వ్యాకోచిస్తాయి. ఇది చర్మం వైపు ఎక్కువ రక్తం ప్రవహించడానికి అనుమతిస్తుంది, తద్వారా శరీరం చల్లబడటానికి సహాయపడుతుంది. అయితే, రక్తనాళాలు విస్తరించడం వల్ల కూడా రక్తపోటు తగ్గవచ్చు.రక్తపోటు గణనీయంగా తగ్గితే, మెదడుకు రక్త ప్రసరణ తాత్కాలికంగా తగ్గవచ్చు. దీనివల్ల ఒక వ్యక్తికి తల తిరగడం, నీరసంగా ఉండటం లేదా మగతగా అనిపించడం జరగవచ్చు. కొన్ని సందర్భాల్లో, వారు కొద్దిసేపు స్పృహ కోల్పోవచ్చు. ఈ సమస్య ఎవరికి ఎక్కువ అంటే..సౌనాలో ఎవరికైనా రక్తపోటు తగ్గవచ్చు, అయితే, కొందరు వ్యక్తులు దీనికి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంది. వీరిలో వీరు ఉంటారుసహజంగానే తక్కువ రక్తపోటు ఉన్నవారుడీహైడ్రేషన్కు గురయ్యేవారుగుండె జబ్బులు ఉన్నవారుకొన్ని రకాల మందులు తీసుకుంటున్నవారువేడికి అలవాటు లేనివారుహెచ్చరిక సంకేతాలు ఏమిటి?స్పృహ కోల్పోవడం ఎల్లప్పుడూ అకస్మాత్తుగా జరగదు. రక్తపోటు తగ్గినప్పుడు లేదా వేడిని తట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు శరీరం కొన్ని హెచ్చరిక సంకేతాలను చూపవచ్చు. కొన్ని సాధారణ లక్షణాలు:తల తిరగడం లేదా మగతగా అనిపించడందృష్టి మసకబారడం లేదా నల్లటి మచ్చలు కనిపించడంఅధికంగా చెమట పట్టడంనీరసంగా లేదా అసాధారణంగా అలసిపోయినట్లు అనిపించడంవికారంతలనొప్పినిలబడినప్పుడు అస్థిరంగా అనిపించడంకొంతమందికి గుండె వేగంగా కొట్టుకోవడం లేదా స్పృహ కోల్పోతున్నట్లు అనిపించడం కూడా జరగవచ్చు. సౌనా లోపల ఈ లక్షణాలు కనిపిస్తే, వెంటనే బయటకు వచ్చి చల్లని ప్రదేశానికి వెళ్లడం ముఖ్యం. వేడిలో కూర్చోవడం కొనసాగిస్తే లక్షణాలు మరింత తీవ్రమవుతాయి.ఎలా నివారించవచ్చు?సౌనాలో గపడానికి ముందే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మేలు.శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోండిసమయాన్ని పరిమితం చేసుకోండిమద్యపానానికి దూరంగా ఉండండినెమ్మదిగా లేవండిఅనారోగ్యంగా ఉన్నప్పుడు దీనిని ఉపయోగించవద్దుతక్కువ రక్తపోటు లేదా కొన్ని రకాల గుండె జబ్బులు ఉన్నవారు సౌనాను ఉపయోగించే ముందు వైద్య సలహా తీసుకోవాలి.
డాక్టర్ అవసరం లేకుండానే కంటి పరీక్షలా? 17 ఏళ్ల కుర్రాడి అద్భుతం!
కంటిచూపు తగ్గినా.. కళ్లు మంటగా ఉన్నా.. చూపులో మార్పులు కనిపించినా వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించడం మంచిది. కానీ గ్రామీణ ్రపాంతాల్లో చాలామందికి కంటి పరీక్షలు చేయించుకునే అవకాశం ఉండదు. ఆర్థిక ఇబ్బందులు, వైద్య సదుపాయాల కొరత కూడా ఇందుకు కారణం.ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం ఓ 17 ఏళ్ల విద్యార్థి చేసిన ఆలోచనే ఓ కొత్త ఆవిష్కరణకు నాందిపలికింది. స్మార్ట్‌ఫోన్ సాయంతో వ్యాధులను ముందుగానే గుర్తించే ఏఐ యాప్‌ను రూపొందించాడు. ఎంతోమందికి కంటి పరీక్షలు చేస్తూ అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు.హరియాణాలోని గురుగ్రామ్‌కు చెందిన సిద్ధార్థ్ మనక్తాలా ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అతడి అమ్మమ్మ కొన్నేళ్లుగా డయాబెటిక్ రెటినోపతి సమస్యతో బాధపడుతోంది. ఇదే సిద్ధార్థ్‌ని కంటి ఆరోగ్యం గురించి ఆలోచించేలా చేసింది. చాల మంది కంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ.. ఆర్థిక ఇబ్బందులు, రవాణా సదుపాయం, దూరం వంటి కారణాల వల్ల వైద్య పరీక్షలకు దూరమవుతున్నారని తెలుసుకున్నాడు. దీంతో అందరికీ అందుబాటులో ఉండేలా కంటి పరీక్షలు నిర్వహించాలనుకున్నాడు.ఫోన్ తోనే ఏడు టెస్టులు!అలా సిద్ధార్థ్ రూపొందించిన యాప్ పేరు ‘ఐ స్పై’. కృత్రిమ మేధ సాయంతో పనిచేసే ఈ యాప్ స్మార్ట్‌ఫోన్ లో తీసిన చిత్రాలను విశ్లేషిస్తుంది. కంటి బయటి భాగంతో పాటు రెటీనాను పరిశీలిస్తుంది. కంటిశుక్లం, కండ్లకలక, గ్లాకోమా, డయాబెటిక్ రెటినోపతి వంటి ఏడు రకాల కంటి సమస్యలను గుర్తించేలా ఈ యాప్ పనిచేస్తుంది. సాధారణ ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ మూడు సెకన్లలోపు ఫలితాలను అందిస్తుంది. ఇంటర్నెట్ సదుపాయం లేకున్నా పనిచేయడం దీని మరో ప్రత్యేకత.విఫలమైనా.. వెనక్కి తగ్గలేదు!ఈ యాప్‌ని రూపొందించడంలో సిద్ధార్థ్‌కి ఎన్నో అవాంతరాలు వచ్చాయి. అయినా వైద్యులు, పరిశోధకుల సూచనలతో తిరిగి ప్రయత్నం చేస్తూ... ఆఖరికి ఐ స్పై యాప్‌ని రూపొందించాడు. సిద్ధార్థ్ ఈ యాప్ రూపకల్పనతోనే ఆగిపోకుండా గ్రామాలు, ప్రభుత్వ పాఠశాలలు, పరిశ్రమల్లో ఐ క్యాంప్‌లు నిర్వహిస్తున్నాడు. అంతేకాదు మందులు, అద్దాలు కొనుక్కోలేని వారికి క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేకరించిన డబ్బుతో సహాయం చేస్తున్నాడు.ఈ ఆవిష్కరణకు సిద్ధార్థ్‌కు జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు లభించింది. ఐరిస్, ఇన్ సెఫ్ జాతీయ సైన్స్ ఫెయిర్లలో సిల్వర్ మెడల్స్ సైతం అందుకున్నాడు. భవిష్యత్తులో మరిన్ని భారతీయ భాషల్లో యాప్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సిద్ధార్థ్ భావిస్తున్నాడు. చిన్నారుల్లో వచ్చే కంటి సమస్యలను ముందుగానే గుర్తించే ప్రత్యేక విభాగాన్ని కూడా రూపొందించాలనుకుంటున్నాడు.ఇదీ చదవండి: జెన్ జెడ్ కొత్త భాష ఇదే! ఈ గుర్తులకు పూర్తి అర్థమేంటో తెలుసా!
జెన్ జెడ్ కొత్త భాష ఇదే! ఈ గుర్తులకు పూర్తి అర్థమేంటో తెలుసా!
‘ఓకే’ అని ఒక సందేశం పంపితే అది అంగీకారమా? నిర్లక్ష్యమా? కోపమా? అన్న సందేహం రావచ్చు. అదే సందేశానికి ఓ నవ్వు బొమ్మ జతచేస్తే అర్థం వెంటనే మారిపోతుంది. ఓ హార్ట్ సింబల్ చేరిస్తే ప్రేమ కనిపిస్తుంది. కన్నీటి బొమ్మ పెడితే బాధతో చెప్తున్నారని అర్థం చేసుకోవచ్చు. ఇలా మాటల్లో దాగున్న మనసులోని ఆంతర్యాన్ని జోడిస్తున్నాయి ఈ చిన్ని గుర్తులు.ఎదురెదురుగా ఉండి మాట్లాడేటప్పుడు ఎదుటివారి ముఖ కవళికలు, గొంతులోని మార్పులు, నవ్వు మనకు ఎన్నో విషయాలు చెబుతాయి. కానీ ఫోన్ లో సందేశం పంపేటప్పుడు అవన్నీ కనిపించవు. ఆ లోటును పూరించేందుకు ఎమోజీలు ఉపయోగపడుతున్నాయి. చిన్న సందేశంలోనే మన మనసులో అనుకునే భావాలను వ్యక్తపరిచే సాధనాలుగా మారాయి.ప్రతి భావానికి ఒక రూపం..తెలుగు, హిందీ, ఇంగ్లిష్.. ఏ భాషలో మాట్లాడినా స్మైలీ సింబల్‌ని చాలామంది అర్థం చేసుకుంటారు. హార్ట్ సింబల్ ప్రేమను వ్యక్తం చేస్తున్నారని తెలుపుతుంది.ఫైర్ బొమ్మను సందర్భాన్ని బట్టి ఉత్సాహానికి, లేదా ఏదైనా అద్భుతంగా ఉందని చెప్పడానికి ఉపయోగిస్తారు. అందుకే ఎమోజీలను ప్రపంచ భాషగా భావిస్తున్నారు నేటితరం. వేర్వేరు భాషలు మాట్లాడే వ్యక్తుల మధ్య కూడా ఇవి కొంతవరకు సంభాషణకు వారధిగా నిలుస్తున్నాయి. మాటలను అనువదించాల్సిన అవసరం లేకుండానే భావాన్ని ఊహించే అవకాశం కల్పిస్తున్నాయి.సందర్భానికి తగినట్టు..ఎమోజీలతో సంభాషణ సులభమైనా.. కొన్నిసార్లు అపార్థాలకూ దారితీస్తాయి. రెండు చేతులు జోడించిన గుర్తునే తీసుకోండి. కొందరు దాన్ని ప్రార్థనకు, మరికొందరు కృతజ్ఞతలు చెప్పడానికి లేదా నమస్కారానికి ఉపయోగిస్తారు. ఇంకాకొన్ని సందర్భాల్లో ‘నీకో నమస్కారం’అంటూ కోపాన్ని, అసహనాన్ని వ్యక్తం చేసే అర్థంలోనూ వాడుతుంటారు.అలాగే నవ్వుతున్న బొమ్మ నిజమైన ఆనందాన్ని సూచించవచ్చు. మరికొన్ని సందర్భాల్లో వెటకారాన్ని లేదా అసహనాన్ని వ్యక్తపరచవచ్చు. అంతేకాకుండా మెసేజ్ చేసిన వ్యక్తి ఉద్దేశమేంటో తెలియకపోతే ఎదుటివారు వేరేలా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అందుకే ఎమోజీని మాత్రమే చూసి ఒకరి భావాలను పూర్తిగా అంచనా వేయడం సరికాదు. సందర్భం కూడా ముఖ్యమే.జెన్‌జీ కోడ్!జెన్ జెడ్, జెన్ ఆల్ఫా మాటల్లో ఎమోజీలకు ప్రత్యేక స్థానం ఉంది. మాటలతో పాటు బొమ్మలు, చిన్నచిన్న చిత్రాలు, మీమ్స్ కలిపి తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు. కొన్నిసార్లు ఒక్క ఎమోజీ గుర్తుతోనే చె΄్పాలనుకున్న విషయాన్నంతా చెప్పేస్తున్నారు. అయితే, ప్రతి సందర్భంలోనూ వాటి అర్థం ఒకేలా ఉంటుందని చెప్పలేం.ఉదాహరణకు, పుర్రె బొమ్మ కనిపిస్తే మరణాన్ని గుర్తు చేసుకోవడం సహజం. కానీ యూత్ దాని అర్థాన్ని మరోలా మార్చింది. ‘నవ్వలేక పోయాను’ అనే భావాన్ని సరదాగా వ్యక్తపరచడానికి కూడా ఈ గుర్తునే ఉపయోగిస్తున్నారు. అంటే ఎమోజీల అర్థాలు కాలంతో పాటు మారుతున్నాయి. కొత్త తరాలు వాటికి కొత్త అర్థాలు జోడిస్తున్నాయి. ప్రాంతాలు, సంస్కృతి, వయసు, సందర్భాన్ని బట్టి ఎమోజీల అర్థాలు మారుతుంటాయి. అందుకే ఎమోజీలను ఉపయోగించడంలోనూ ఒక ప్రత్యేకమైన అవగాహన అవసరం. సెన్సిటివ్ అంశాలు, బంధాల విషయంలో స్పష్టమైన మాటలే మంచిది.సంతోషం, బాధ, ప్రేమ, కోపం.. వంటి మనసులోని భావాలను చె΄్పాలంటే ఇంతకుముందు ఎన్నో మాటలు అవసరమయ్యేవి. కానీ ఇప్పుడు అన్ని భావాలను ఎమోజీలే పలికిస్తున్నాయి. కోపానికి ఎర్రని ముఖం, ప్రేమకు రెడ్ హార్ట్, సంతోషానికి నవ్వు బొమ్మ. ఇలా వాట్సాప్ సందేశాల నుంచి ఇన్స్టాగ్రామ్ కామెంట్ల వరకు ఎక్కడ చూసినా ఇవే సందడి చేస్తున్నాయి.ప్రాంతాలు వేరైనా, భాషలు వేరైనా భావాలను అర్థం చేసుకునేలా చేస్తున్నాయి. అక్షరాలతో.. వంద మాటలతో పనిలేకుండా ప్రపంచాన్ని పలకరిస్తున్న ఈ చిన్ని గుర్తులు నేటి డిజిటల్ యుగపు భావోద్వేగ రూపాలు. అందుకే ఇప్పుడివి సరికొత్త గ్లోబల్ డిజిటల్ భాషగా మారిపోయాయి. భాషా సరిహద్దులను చెరిపివేసాయి.ఇదీ చదవండి: గంటల ప్రయాణం.. ఒళ్లు అలసట.. దీనికి కారణమేంటో తెలుసా?
చీరకట్టుతోనే వర్కౌట్స్..!
నటి సంయుక్త హెగ్డే ఇటీవల చీర కట్టుతోనే గంటలో 106 పుల్అప్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. తాను జిమ్‌కి వెళ్లేది మగవారితో పోటీపడేందుకు కాదనీ.. తన ఆరోగ్యాన్ని, శరీరాన్ని దృఢంగా మార్చుకునేందుకేనంటూ సందేశాన్ని సైతం ఇచ్చింది. అయితే అందరూ ఇలాంటివే చేయాల్సిన అవసరం లేదు. శరీరాన్ని దృఢంగా, ఆరోగ్యంగా మార్చుకోవాలంటే వ్యాయామం తప్పనిసరిగా చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో వస్తే చాలు. చాలా మంది మహిళలను వేధించే సమస్య.. జిమ్‌కి వెళ్తే కండలు ఎక్కడ పెరిగిపోతాయో? శరీరాకృతి పురుషుల్లా మారిపోతుందో అనే భయం. కానీ ఇది ఒక అపోహ మాత్రమే. సరైన పద్ధతిలో చేస్తే కండరాలు బలంగా మారుతాయి. శరీరంలో అదనంగా పేరుకుపోయినటువంటి కొవ్వు కరుగుతుంది. అందుకే వర్కౌట్స్ అంటే భయపడకుండా.. ముందు వాటిని ఎలా చేయాలో తెలుసుకోవాలి.ఆరోగ్యానికి పెట్టుబడి!ఆడవారిలో వయసు పెరిగేకొద్దీ కండరాల బలం తగ్గుతుంది. ముఖ్యంగా మెనోపాజ్ దశలో ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయులు తగ్గి.. ఎముకలు బలహీనమయ్యే ప్రమాదం ఎక్కువ. అందువల్ల రోజూవారి వాకింగ్, జాగింగ్ వంటి వ్యాయామాలతోపాటు బరువులు ఎత్తేటువుంటి వర్కౌట్స్ కూడా చేయడం వల్ల కండరాలకు, ఎముకలకు తగిన వ్యాయామం అందుతుంది. దృఢంగా మారుతాయి. మెనోపాజ్ దశలో ఉన్న 4000 మంది మహిళలపై జరిపిన పరిశోధనల్లోనూ ఎముకల ఆరోగ్యానికి బరువులు ఎత్తేటువంటి వ్యాయామాలు మేలు చేస్తాయని తేలింది.ఇంటి పనులకూ అవసరమే!మెట్లు ఎక్కడం.. పిల్లలను ఎత్తుకోవడం.. నేలపై కూర్చుని లేవడం, బరువైన బ్యాగులను మోయడం.. ఇవన్నీ రోజూ చేసుకునే, చేయాల్సిన పనులే. అయితే కండరాలు బలంగా ఉంటేనే ఈ పనులను సులభంగా చేసుకోగలుగుతాం. అంతేకాదు .. వయసు పెరిగిన తర్వాత ఇతరులపై ఆధారపడకుండా ఉండేందుకు అవసరమైన శారీరక బలం కూడా పెరుగుతుంది. అంటే మనం చేసే వ్యాయామాలు.. ఈరోజు కోసమే కాదు.. భవిష్యత్కీ చేదోడుగా నిలుస్తాయి. మొదట్లోనే భారీ బరువులు వద్దు!అయితే జిమ్‌కి వెళ్లిన మొదటి రోజు నుంచే భారీ బరువులు ఎత్తాల్సిన అవసరం లేదు. సాధారణ వాటితో ప్రారంభించి శరీరం అలవాటుపడిన తరువాత క్రమంగా వ్యాయామ సమయాన్ని, వర్కౌట్స్‌ని పెంచుకోవాలి. ఇందుకోసం ముందుగా ఫిట్నెస్ ట్రైనర్ సలహా తీసుకోవడం మంచిది. అయితే సన్నగా ఉండటం మాత్రమే ఆరోగ్యానికి కొలమానం కాదు.. రోజంతా ఎంత చురుగ్గా ఉంటున్నాం.. పనులను ఎంత సులువుగా చేసుకోగలుగుతున్నాం అనేవి కూడా ఆరోగ్య సూచికలే! View this post on Instagram A post shared by Samyuktha Hegde (@samyuktha_hegde) ఇదీ చదవండి: పర్యావరణ హితమైన బ్యూటీ ప్రొడక్ట్స్‌నే ఉపయోగిద్దాం ఇలా..!
అంతర్జాతీయం
ఇరాన్‌తో యుద్ధం.. డబ్బు అంతా అక్కడి నుంచే.. ట్రంప్ సంచలన ప్రకటన
యుద్ధం చేస్తే ఖజానా ఖాళీ అవుతుందనుకుంటున్నారా.. కానీ ట్రంప్ లెక్కలు మాత్రం మరోలా ఉన్నాయి! ఇరాన్‌పై నెలల తరబడి సాగుతున్న పోరుకు అమెరికా పెడుతున్న ఖర్చంతా వెనిజులా చమురుతో వెనక్కి వచ్చేసిందట! అంతేకాదు.. పెట్టిన పెట్టుబడికి పది రెట్లు సంపాదించామని స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. యుద్ధానికి ఇప్పటివరకు 47 బిలియన్ డాలర్లు ఖర్చయినట్లు అంచనాలు వినిపిస్తున్న వేళ.. అసలు ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది? వెనిజులా చమురుకు, ఇరాన్ యుద్ధానికి లింకేంటి? యుద్ధం ముగించేందుకు తొందర లేదంటున్న ట్రంప్ అసలు వ్యూహమేంటి?.. దీనిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది.ఇరాన్‌తో యుద్ధం అమెరికా ఆర్థిక వ్యవస్థపై భారీ భారం మోపుతోందని చర్చ జరుగుతున్న వేళ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ఆసక్తి రేపుతున్నాయి. వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇరాన్ యుద్ధానికి అమెరికా పెద్దగా ఖర్చు చేయడం లేదని చెప్పారు. పైగా యుద్ధం కోసం పెట్టిన డబ్బును వెనిజువెలా ద్వారా ఇప్పటికే పదిరెట్లు సంపాదించామని ప్రకటించారు. అయితే ఈ లెక్కలకు సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఇటీవల వెనిజులా తమకు 10 లక్షల బ్యారెళ్ల చమురును బహుమతిగా ఇచ్చిందని ట్రంప్ చెప్పారు. ఇందుకోసం అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బు ఒక్క పైసా కూడా ఖర్చు కాలేదని పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో వెనిజువెలాలో అమెరికా సైనిక ఆపరేషన్ చేపట్టి అప్పటి అధ్యక్షుడు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆ పరిణామాల తర్వాత వెనిజులా చమురు సరఫరాలపై అమెరికా దృష్టి సారించింది. ఇప్పుడు అదే చమురు ఆదాయాన్ని ఇరాన్ యుద్ధ వ్యయంతో ముడిపెడుతూ ట్రంప్ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.యుద్ధం ఆపేందుకు తొందర లేదు.. మరోవైపు ఇరాన్ తీవ్ర అంతర్గత సమస్యలను ఎదుర్కొంటోందని ట్రంప్ చెబుతున్నారు. ఆ దేశం సైనికులకు, పోలీసులకు జీతాలు చెల్లించలేని పరిస్థితిలో ఉందని.. అందుకే అమెరికాతో చర్చలు జరిపేందుకు ఆసక్తి చూపుతోందని వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని, ఇరాన్ పదేపదే మాట్లాడేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. ఇప్పటికే ఏడు నెలలుగా యుద్ధం కొనసాగుతున్నా.. అమెరికాకు మాత్రం తొందర లేదని స్పష్టం చేశారు. కాగా, ట్రంప్ మాటల్లో చర్చల ప్రస్తావన ఉన్నప్పటికీ.. చేతల్లో మాత్రం సైనిక చర్యల హెచ్చరికలు కొనసాగుతున్నాయి. గతవారం మరోసారి 'ఎపిక్ ఫ్యూరీ' తరహా ఆపరేషన్ చేపట్టే అవకాశం ఉందని సంకేతాలిచ్చారు. మరోవైపు ఇరాన్‌తో పెద్ద ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయని కూడా చెబుతున్నారు. అంటే చర్చల తలుపులు తెరిచే ఉంచుతూనే.. సైనిక దాడుల అవకాశాన్నీ సజీవంగా ఉంచుతున్నారన్నమాట.BREAKING: TRUMP SAYS IRAN WAR COSTS DO NOT MATTER BECAUSE HE MADE SO MUCH MONEY LOOTING VENEZUELA “Any money we've spent in Iran, we've more than made up for with what we did in Venezuela, taking in hundreds of billions of dollars, many, many times.” https://t.co/i6vyC66iic— Sulaiman Ahmed (@ShaykhSulaiman) October 30, 2026పాకిస్థాన్, ఖతార్, టర్కీ.. ఎవరి ప్రయత్నాలు వారివే!యుద్ధానికి ముగింపు పలికేందుకు పలు దేశాలు మధ్యవర్తిత్వం చేస్తున్నాయి. పాకిస్థాన్ ప్రయత్నాలతో ఏప్రిల్ 8న రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటించారు. అనంతరం జూన్ 17న 14 అంశాలతో కూడిన అవగాహన ఒప్పందం కుదిరినట్లు కథనం పేర్కొంది. హార్మూజ్ జలసంధిలో నౌకాయానం, ఇరాన్ అణు, క్షిపణి కార్యక్రమాలు, ఆంక్షల తొలగింపు వంటి అంశాలపై చర్చలు జరిగినా.. శాశ్వత పరిష్కారం మాత్రం లభించలేదు. సెప్టెంబర్‌లో ఇరాన్ ఏడు రోజుల ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. అమెరికా దానిని తిరస్కరించింది. అక్టోబర్‌లో ఖతార్ మరో ప్రతిపాదనతో ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. తాజాగా టర్కీ కూడా అమెరికాతో చర్చలు జరిపి దౌత్య మార్గంలో సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది.అసలు పంతం చమురు కోసమేనా?ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడులు ప్రారంభించడంతో మొదలైన ఈ యుద్ధం పశ్చిమాసియాను తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. ఇరాన్ ప్రతిదాడులు, హార్మూజ్ జలసంధిలో ఆంక్షలతో ప్రపంచ ఇంధన మార్కెట్లు ఒడిదుడుకులకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో వెనిజులా చమురు ప్రస్తావనకు ట్రంప్ ఇస్తున్న ప్రాధాన్యం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు వెనిజులా చమురుతో యుద్ధ ఖర్చుకు పదిరెట్లు రాబడి వచ్చిందని ట్రంప్ చెబుతున్నారు. మరోవైపు ఇరాన్‌పై మళ్లీ దాడులు చేసే అవకాశాలను కూడా తెరిచే ఉంచుతున్నారు. అయితే ఆయన చెబుతున్న చమురు ఆదాయ లెక్కలకు ఇప్పటివరకు ఆధారాలు బయటపెట్టలేదు. చమురు సంపదతో యుద్ధ భారాన్ని తగ్గించుకున్నామని ట్రంప్ చెబుతున్నా.. ఈ పోరుకు ముగింపు ఎప్పుడు? అమెరికా ఖర్చు చేస్తున్న అసలు మూల్యం ఎంత? అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం లేదు.ఇదీ చదవండి: ఇజ్రాయెల్‌లో హై టెన్షన్.. నెతన్యాహు ఇంటి వద్ద ఉద్రిక్తత
సైనిక చర్యలతో సమస్యలు పరిష్కారం కావు: జైశంకర్
అట్లాంటా: అంతర్జాతీయ సమస్యలు సైనిక చర్యలతో పరిష్కారం కావని, వివాదాల పరిష్కారానికి దౌత్యానికి అవకాశం ఇవ్వాలని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు. అమెరికాలోని అట్లాంటాలో జరిగిన జీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వాణిజ్య నౌకలు, నావికులపై దాడులను నిలిపివేయాలని, సముద్ర ప్రయాణ స్వేచ్ఛను కాపాడాలని కోరారు.అంతర్జాతీయ చట్టాలు, ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టాల ఒప్పందం (యూఎన్సీఎల్ఓఎస్) ప్రకారం నౌకాయాన భద్రతను పరిరక్షించాలన్నారు. పశ్చిమాసియాలో ఘర్షణల కారణంగా 22 మంది భారతీయులు, వారిలో 14 మంది నావికులు మరణించినట్లు తెలిపారు.అభివృద్ధి చెందుతున్న దేశాల పారిశ్రామిక అభివృద్ధికి మార్కెట్ అడ్డంకులు, సరఫరా వ్యవస్థలపై ఆంక్షలు ఆటంకంగా మారుతున్నాయని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని తక్కువ అంచనా వేయకూడదని హెచ్చరించారు. ఈ సమావేశానికి అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అధ్యక్షత వహించారు. డిసెంబర్ 14, 15 తేదీల్లో మియామీలో జీ20 శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఇదీ చదవండి: Delhi: షూ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. నలుగురు మృతి
ఇజ్రాయెల్: నాలుగు స్తంభాలాట!
టెల్ అవీవ్: ఇజ్రాయెల్‌లో ఎన్నికలు ముగిశాయి. ఫలితాలూ వచ్చేశాయి. ఏ కూటమికీ నేరుగా అధికారం దక్కే పరిస్థితి లేకపోవడంతో ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు చర్చోపచర్చలు నడుస్తున్నాయి. అయితే... ప్రభుత్వ ఏర్పాటుకు మార్గాలేవి? మొత్తం 120 స్థానాలున్న ఇజ్రాయెలీ పార్లమెంటు నెసెట్‌లో నెతన్యాహూ కూటమికి 53, గాడి ఐసన్కోట్ కూటమికి 48 సీట్లు మాత్రమే దక్కాయి. అరబ్ పార్టీల కూటమికి 19 స్థానాలు దక్కాయి. అధికారం కావాలంటే 61 స్థానాలు అవసరమైన పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడ రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రభుత్వం ఏర్పడేందుకు అవకాశమున్న నాలుగు రకాల మార్గాలను పరిశీలిస్తే...1. అరబ్ పార్టీలతో ఐసన్కోట్ జట్టుఈ ఏర్పాటు వినేందుకు చాలా సులువుగా అనిపిస్తుంది. 48 + 19 = 67. అంతేగా అనవచ్చు కానీ.. ఐసన్కోట్కు మద్దతుగా యూదు పార్టీలు దీనికి అంగీకరించే అవకాశం లేదు. మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అరబ్ పార్టీలు బయటి నుంచి మద్దతిచ్చేలా చేసేందుకూ వీరు ఒప్పుకునే పరిస్థితులు లేవు. 1948లో యుద్ధం తరువాత ఇజ్రాయెల్‌లోనే ఉండిపోయిన పాలస్తీనీయుల మద్దతుతో అరబ్పార్టీలు 19 స్థానాలు దక్కించుకోవడం ఇందుకు కారణం. వివాదాస్పద గాజాప్రాంతంతోపాటు, వెస్ట్‌బ్యాంక్‌లోని వారితోనూ వీరికి సంబంధాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెలీ యూదుల్లో చాలామందికి వీరిపై అనుమానం ఎక్కువ. గతంలో ఒకే ఒక్కసారి అరబ్ పార్టీలు (2021) ప్రభుత్వంలో భాగంగా ఉన్నాయి. ఆ ప్రభుత్వం కాస్తా 18 నెలల్లో కూలిపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అరబ్ పార్టీలతో జట్టు కట్టవద్దరి నెతన్యాహూ ఇప్పటికే ఇతర కూటములను హెచ్చరించారు. 2. ఐక్య ప్రభుత్వం... ఇజ్రాయెల్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు నెతన్యాహూ నేరుగా ఐసన్కోట్ కూటమితో జట్టుకట్టడం ఒక మార్గం. ఈ ఏర్పాటుతో నెతన్యాహూకు నెసెట్‌లో మెజారిటీ లభిస్తుంది. అదే సమయంలో అరబ్ పార్టీలతోపాటు, కరడుకట్టిన యూదు భావజాలపు, అతివాద జాతీయవాద నేతలందరూ ప్రతిపక్షం అయిపోతారు. ఈ రకమైన కూటమి యూదులకు మిలటరీ సేవల మినహాయింపు వంటి సంక్లిష్టమైన అంశాలను సులువుగా పరిష్కరించగలదు. అయితే ఇందుకు ఐసన్కోట్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇచ్చిన వాగ్ధానాన్ని భంగం చేయాల్సి ఉంటుంది. నెతన్యాహూతో కలిసి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏర్పాటు చేయబోమని ఐసన్కోట్ కూటమి భాగస్వామ్య పార్టీలు గట్టి హామీ ఇచ్చాయి. 2023 అక్టోబర్ నాటి హమాస్ దాడికి నెతన్యాహూ బాధ్యతారాహిత్యమే కారణమని కూడా ఐసన్కోట్ కూటమి వాదించింది. నెతన్యాహూ కూడా ఇప్పటివరకూ అంటకాగిన అతివాద పార్టీలను వదులుకోవాల్సి ఉంటుంది.3. అయారాం, గయారాంలతో.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ఇంకోసారి అధికారంలోకి వచ్చేందుకు ఉన్న మరో మార్గం ప్రతిపక్షాలను చీల్చడం. గతంలో భాగస్వాములుగా ఉన్న పార్టీలు, నేతలు.. ఉదాహరణకు నఫ్తాలీ బెనెట్, అవిగ్దోర్ లైబర్మెన్ను తనవైపునకు తిప్పుకునే ప్రయత్నం చేయడం. వీరిద్దరూ వెస్ట్‌బ్యాంకులో సెటిల్మెంట్ల విస్తరణ వంటి జాతీయ వాద విధానాలకు మద్దతిచ్చేవారే. అదే సమయంలో అరబ్ పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం వీరికి అంతగా రుచించని అంశం. అయితే వీరిద్దరూ నెతన్యాహూతో విభేదించిన వారు కావడం గమనార్హం. ఏళ్లుగా వ్యక్తిగత స్థాయిలో నెతన్యాహూతో వీరికి భేదాభిప్రాయాలు ఉన్నాయి. అంతేకాకుండా నెతన్యాహూ కూటమి కలిసి ఉండేందుకు ప్రధాన కారణమైన అంశం... యూదులకు మిలటరీ సేవల మినహాయింపును బెనెట్, లైబర్మాన్లు వ్యతిరేకించారు. పైగా ఈ వర్గాల వారు నెతన్యాహూతో చాలాకాలంగా కలిసి ఉంటున్నారు.4. మళ్లీ ఎన్నికలు... ఇది ఆఖరి అస్త్రం. ఏ కూటమి కూడా అధికారానికి కావాల్సిన 61 స్థానాలను కూడగట్టుకోలేకపోతే మరోసారి ఎన్నికలు జరిగే అవకాశం ఏర్పడుతుంది. కాకపోతే ఇవి వచ్చే ఏడాది వరకూ సాధ్యం కావు. అప్పటివరకూ నెతన్యాహూనే ఆపద్ధర్మ ప్రభుత్వాధినేతగా కొనసాగుతారు. ప్రత్యర్థులకు ఈ ఏర్పాటు ప్రాణ సంకటం. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పుడు వీరు ముందంజలోనే ఉన్నారు. కానీ ఫలితాల నాటికి పరిస్థితిలో స్వల్ప తేడా వచ్చింది. విదేశాల నుంచి వచ్చి మరీ వేలాది మంది ఇజ్రాయెలీలు వీరికి ఓటేశారు. మళ్లీ ఎన్నికలంటే వీళ్లంతా మరోసారి ఇజ్రాయెల్‌కు వస్తారా? అన్నది అనుమానం. ఈ లోపు నెతన్యాహూ తన కూటమిని విస్తరించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది. పార్లమెంటులో స్థానానికి అవసరమైనన్ని ఓట్లు సంపాదించలేని చిన్న పార్టీలు మరోసారి ఎన్నికల బరిలో దిగే అవకాశాలు తక్కువ. అప్పుడు సహజంగానే నెతన్యాహూ కూటమి పార్టీలకు పడే ఓట్లు పెరుగుతాయి. లేదా... ఈ పార్టీల మద్దతుదారులు పెద్ద పార్టీలవైపు మళ్లవచ్చు. 2019లో దాదాపు ఇలాంటి పరిస్థితులే ఎదురుకాగా.. మూడున్నరేళ్లలో ఇజ్రాయెల్ ఐదుసార్లు ఎన్నికలు జరుపుకోవడం కొసమెరుపు!
ట్రంప్‌కు మధ్యంతర పరీక్ష
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజకీయాలకు అసలు పరీక్ష... మధ్యంతర ఎన్నికలకు రంగం సిద్ధమైంది. నవంబర్ మూడున జరిగే ఈ ఎన్నికల్లో రిపబ్లికన్లు ఏ మేరకు ఆధిక్యం సాధిస్తారన్న విషయంపై ట్రంప్ మిగిలిన రెండేళ్ల పదవీకాలం తీరుతెన్నులు నిర్ణయం కానున్నాయి. అమెరికా దేశీ రాజకీయాలే కాదు... వాణిజ్యం, సాంకేతికరంగం, వీసాలు, రక్షణ సంబంధాలు, వాతావరణ విధానాల వంటి అనేక అంశాలపై కూడా ఈ మధ్యంతర ఎన్నికల ప్రభావం ఉండనుంది. అమెరికాలో నాలుగేళ్లకు ఒకసారి అధ్యక్ష ఎన్నికలు జరిగితే ఆ తరువాత రెండేళ్లకు మధ్యంతర ఎన్నికలు జరుగుతాయి. ఇందులో ప్రతినిధుల సభకు 435 మందిని, సెనేట్‌లోని మొత్తం వంద స్థానాల్లో మూడోవంతు (ఈ సారి 35) స్థానాలకు, 36 రాష్ట్రాల గవర్నర్లు, వేల స్థానిక ప్రభుత్వ పదవులకు ప్రతినిధుల ఎన్నిక జరుగుతుంది. ప్రస్తుతం ట్రంప్ ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీకి ప్రతినిధుల సభలో 218 మంది సభ్యుల బలం ఉండగా, డెమోక్రాట్ పార్టీ సభ్యులు 214 మంది ఉన్నారు. అలాగే సెనేట్‌లో రిపబ్లికన్లు 53 మంది ఉండగా, డెమోక్రాట్ల సంఖ్య 47గా ఉంది. మధ్యంతర ఎన్నికల్లో ఒకవేళ డెమోక్రాట్లకు ఆధిక్యం లభిస్తే... రానున్న రెండేళ్లలో ట్రంప్ తనకు నచ్చిన విధంగా చట్టాలు చేసే అవకాశాలు బాగా తగ్గిపోతాయి. రిపబ్లికన్లు ఇరు సభల్లో ప్రస్తుతమున్న స్థానాలను నిలుపుకుంటూ మూడు స్థానాల్లో గెలిస్తే చాలు.. చట్టాలు చేసే కాంగ్రెస్ వారి చేతుల్లోకి వెళ్లిపోతుంది. కాంగ్రెస్ అధికార పక్షం చేతుల్లో కాకుండా ప్రతిపక్షమైన రిపబ్లికన్ల చేతుల్లోకి వెళితే ట్రంప్‌కు గడ్డుకాలమే. చట్టాల ఆమోదం మొదలుకొని బడ్జెట్ కేటాయింపులు, న్యాయమూర్తులు, అధికారుల నియామకాలు, పరిపాలన వంటివన్నీ కాంగ్రెస్ ద్వారానే జరుగుతాయి మరి. ఇలా కాకుండా.. డెమోక్రాట్లు ఏదో ఒక సభలో ఆధిక్యం సంపాదిస్తే... గుడ్డి కంటే మెల్ల మేలన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. ఈ ఎన్నికలు అమెరికన్లకు మాత్రమే కాకుండా.. భారత్ దృష్టిలోనూ చాలా ముఖ్యమైనవిగా చెప్పాలి. ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి రకరకాల టారిఫ్‌లతో ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే. చమురు కొనుగోళ్ల విషయంలో భారత్‌పై కఠిన చర్యలకు ఉపక్రమించిన నేపథ్యంలో మధ్యంతర ఎన్నికల ఫలితాలు మనకు కూడా ముఖ్యమవుతున్నాయి. హెచ్1–బీ వీసాలపై ఆంక్షలు, అక్రమ వలసదారులపై చర్యల పేరుతో కొనసాగుతున్న ఐస్ వేధింపుల వంటి వాటికి బ్రేకులు పడే అవకాశం ఉంటుంది. డెమోక్రాట్ల వైపే మొగ్గు? మధ్యంతర ఎన్నికలపై నిర్వహించిన తాజా పోల్స్‌లో డెమోక్రాట్లకు స్పష్టమైన మొగ్గు కనిపిస్తోంది. పీబీఎస్ న్యూస్, ఎన్పీఆర్ మారిస్ట్ సర్వేల్లో డెమోక్రాట్లకు దాదాపు 52 శాతం మంది, రిపబ్లికన్లకు 44 శాతం మంది మద్దతిచ్చినట్టుగా తెలుస్తోంది. రియల్ క్లియర్ పోలింగ్ సర్వేలో ఈ ఫలితాల్లో స్వల్ప తేడా నమోదైంది. ఇందులో డెమోక్రాట్లకు 51.4 శాతం, రిపబ్లికన్లకు 43.2 శాతం మంది సై అన్నారు. ఇన్సైడ్ ఎలక్షన్స్ అనే సంస్థ ప్రకారం పరిస్థితి డెమోక్రాట్లకు ఎంతో అనుకూలంగా ఉంది. ప్రతినిధుల సభలో 45. సెనేట్‌లో తొమ్మిది స్థానాలు ఎక్కువగా సాధించవచ్చునని ఈ సంస్థ అంచనా వేస్తోంది. సెనేట్‌లో ఆధిక్యానికి నికరంగా నాలుగు అదనపు స్థానాలు మాత్రమే అవసరమవుతాయి. రిపబ్లికన్లు మెయిన్, మిచిగాన్, టెక్సాస్, ఐయోవా, కాన్సాస్, నార్త్ కరోలినా, అలాస్కా వంటి రాష్ట్రాల్లో తమ స్థానాలను కాపాడుకోవాల్సి ఉంది. 2026 మధ్యంతర ఎన్నికల్లో ముందస్తు ఓటింగ్ అసాధారణంగా సాగుతోంది. ఇప్పటివరకూ దాదాపు 4.2 కోట్ల మంది ఓటు వేసినట్లు యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా ఎలక్షన్ ల్యాబ్ తెలిపింది. నార్త్ కరోలినాలో బుధవారం సాయంత్రం నాటికి 20 లక్షలకు పైగా ఓట్లు పడ్డాయి. 2022 ఎన్నికలతో పోలిస్తే ఇది 35 శాతం కంటే ఎక్కువ. నల్లజాతీయులు గత ఎన్నికలతో పోలిస్తే యాభై శాతం కంటే ఎక్కువ సంఖ్యలో ఓటు వేసినట్లు తెలిసింది. నల్లజాతీయుల్లో డెమోక్రాట్లకు మద్దతు తెలిపేవారు ఎక్కువ.
జాతీయం
ఢిల్లీ కాలుష్యం: 50 శాతం ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 5 నుంచి 20 వరకు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో 50 శాతం సిబ్బందికి మాత్రమే ప్రత్యక్షంగా పనిచేసేందుకు అనుమతించనున్నారు. మిగిలిన ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఢిల్లీతో పాటు గురుగ్రామ్, ఫరీదాబాద్, సోనిపట్, ఘజియాబాద్, నోయిడా జిల్లాల్లో ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (సీఏక్యూఎం) అక్టోబర్ 30న ఉత్తర్వులు జారీ చేసింది.నిర్మాణ, కూల్చివేత పనులపైనా కఠిన ఆంక్షలు విధించారు. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో దుమ్ము, ధూళి వెలువడే నిర్మాణ కార్యకలాపాలను నిలిపివేయనున్నారు. హైవేలు, రోడ్లు, ఫ్లైఓవర్లు, విద్యుత్ ప్రసార లైన్లు, పైప్లైన్లు, టెలికమ్యూనికేషన్ పనులకూ ఈ ఆంక్షలు వర్తిస్తాయి. అయితే రైల్వేలు, మెట్రో, విమానాశ్రయాలు, ఆసుపత్రులు, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, జాతీయ భద్రత, రక్షణ రంగానికి సంబంధించిన అత్యవసర ప్రాజెక్టులకు మినహాయింపు ఇచ్చారు. వర్క్ ఫ్రమ్ హోమ్ సాధ్యం కాని పారిశ్రామిక సంస్థలు, అత్యవసర సేవలకు కూడా వెసులుబాటు కల్పించారు.నవంబర్‌లో ఢిల్లీ-ఎన్సీఆర్లో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరే అవకాశముండటంతో ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యలు చేపట్టినట్లు సీఏక్యూఎం వెల్లడించింది. 2018 నుంచి 2025 మధ్య నమోదైన గణాంకాల ప్రకారం నవంబర్ మొదటి, రెండో వారాల్లో కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుతున్నట్లు గుర్తించారు. చలికాలం ప్రారంభమవడంతో గాలి వేగం తగ్గడం, వాహనాల పొగ, పరిశ్రమల ఉద్గారాలు, పంట వ్యర్థాల దహనం నుంచి వెలువడే పొగ వాతావరణంలోనే నిలిచిపోవడం కాలుష్య తీవ్రతకు కారణమవుతున్నాయి. ఇప్పటికే గురుగ్రామ్‌లో ఉదయం వేళల్లో పొగమంచు కనిపిస్తోంది.ఈ ఆంక్షల అమలును పర్యవేక్షించే బాధ్యతను ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా ప్రభుత్వాలకు అప్పగించారు. స్థానిక అధికారులు, పోలీసులు, కాలుష్య నియంత్రణ మండలి బృందాలు తనిఖీలు నిర్వహించనున్నాయి. నవంబర్ 5 నుంచి ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్లు రంగంలోకి దిగుతాయి. నిబంధనలు ఉల్లంఘించే నిర్మాణ సంస్థలు, కార్యాలయాలపై భారీ జరిమానాలు విధించనున్నారు. శీతాకాలంలో కాలుష్య ముప్పును ముందుగానే అడ్డుకోవడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశం. ఇదీ చదవండి: ఇండియా కూటమికి ఢిల్లీ పోలీసుల షాక్!
5 స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో షాక్ : ఇద్దరు విదేశీయులు దుర్మరణం
సాక్షి, బెంగళూరు: బెంగళూరులోని ఒక ప్రముఖ ఫైవ్-స్టార్ హోటల్లో జరిగిన విషాద ఘటన దిగ్భ్రాంతి రేపింది. విద్యుత్ షాక్ కారణంగా పూల్‌లో ఉన్న ఇద్దరు విదేశీయులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నగరంలోని 'కాన్రాడ్' (Conrad) అనే ఫైవ్-స్టార్ హోటల్లో శుక్రవారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.ఏం జరిగింది?నగరంలోని 24 అంతస్తుల లగ్జరీ హోటల్ 'కాన్రాడ్' (హిల్టన్ గ్రూప్‌కు చెందినది) మూడో అంతస్తులో ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో కొందరు ఈత కొడుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు విదేశీయులు ప్రాణాలు కోల్పోగా, వారిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.మృతుల్లో ఒకర్ని జర్మనీకి చెందిన అలెగ్జాండర్ మాక్సిమిలియన్ థిస్ (57)గా గుర్తించారు. ఈయన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌లో క్రూ మెంబర్‌గా పనిచేస్తున్నారు. మరొకరు స్లోవేకియా దేశస్థుడు యురాజ్ హోర్వాత్ (45). ఇతను ప్రముఖ ఐటీ సంస్థ ఐబీఎమ్ (IBM)లో ప్రాజెక్ట్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.లుఫ్తాన్సా విచారంమృతుల కుటుంబం, బంధువులు మరియు స్నేహితులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని, వారి గోప్యతకు గౌరవంగా ప్రమాదం లేదా మృతుడి గురించి వివరాలు వెల్లడించబోమని లుఫ్తాన్సా ప్రకటించింది.పూల్‌లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అమెరికాకు చెందిన మ్యాథ్యూ డిసాంటిస్ (41) అనే హోటల్ అతిథితో పాటు, రాహుల్ తివారీ (28) అనే హోటల్ పూల్ అటెండెంట్ వెంటనే స్పందించారు. అయితే ప్రయత్నంలో వారికి కూడా షాక్ తగిలి గాయపడ్డారు. వీరిద్దరినీ వెంటనే మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఏమీ లేదని, ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా విచారణ జరుపుతున్నారు. విద్యుత్ లీకేజీకి అసలు కారణాలేంటనే దానిపై ఆధారాలు సేకరిస్తున్నారు.హోటల్ యాజమాన్యం స్పందన?మరోవైపు, ఈ దారుణంపై హోటల్ యాజమాన్యం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, శనివారం ఉదయం హోటల్ వెబ్సైట్లో స్విమ్మింగ్ పూల్‌ను "అక్టోబర్ 31 నుండి నవంబర్ 30 వరకు నిర్వహణ (maintenance) కారణాల వల్ల మూసివేస్తున్నాం" అంటూ ఒక నోటీసు పెట్టారు.కాగా పాపులర్ హోటల్లో జరిగిన ఈ ఘటన యాజమాన్యం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది అంటూ తీవ్ర నిరసనలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో గదికి రోజుకు రూ. 25వేలకు పైనే ఛార్జ్ చేసే ఇటువంటి అంతర్జాతీయ ఫైవ్ స్టార్ హోటల్లో సురక్షతా ప్రమాణాల లోపాలపై విమర్శలు చెలరేగాయి.
ఇండియా కూటమికి ఢిల్లీ పోలీసుల షాక్!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడి అంతకంతకూ పెరుగుతోంది. నవంబర్ 1న రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న ఇండియా కూటమి భారీ బహిరంగ సభకు ఢిల్లీ పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే కనాట్ ప్లేస్–మింటో రోడ్ జంక్షన్ నుంచి రామ్‌లీలా మైదానం వరకు నిర్వహించాలనుకున్న పాదయాత్రకు మాత్రం అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. దీంతో సభకు అనుమతి లభించినప్పటికీ, పాదయాత్ర విషయంలో ఉత్కంఠ నెలకొంది.పాదయాత్రపై పోలీసుల అభ్యంతరం లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ కార్యక్రమంలో పాదయాత్ర వివరాలను వెల్లడించారు. మధ్యాహ్నం 12 గంటలకు మింటో రోడ్–కనాట్ ప్లేస్ నుంచి యాత్ర ప్రారంభమై రామ్‌లీలా మైదానానికి చేరుకుంటుందని ప్రకటించారు. అయితే ఈ యాత్రకు సంబంధించి తమకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. న్యూఢిల్లీ, సెంట్రల్ జిల్లా పోలీసులు కూడా అనుమతి కోరుతూ ఎలాంటి దరఖాస్తు అందుకోలేదని పేర్కొన్నాయి.ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా పోరునవంబర్ 1న నిర్వహించే భారీ సభలో వివాదాస్పద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను వెనక్కి తీసుకోవాలని ఇండియా కూటమి డిమాండ్ చేయనుంది. అలాగే కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కోరనుంది. ఈ కార్యక్రమానికి రాజకీయ పార్టీలతో పాటు సామాజిక సంస్థలు, పౌర సమాజ ప్రతినిధులు, జర్నలిస్టులు, ఇతర వర్గాల ప్రజలు హాజరుకావాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.కేంద్రంపై రాహుల్ విమర్శలు దేశ రాజధానికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే పార్టీ కార్యకర్తలు, సామాన్య ప్రజలను అడ్డుకునేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రయత్నిస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, తెలంగాణ, పంజాబ్ తదితర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి రావాలనుకునే వారిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. నరేంద్ర మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల సంఘంలోని వారి బృందం ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నారని ఆయన ఆరోపించారు.ర్యాలీ వాయిదా వేయాలంటున్న వ్యాపారులు మరోవైపు నవంబర్ 1న నిర్వహించనున్న సభను వాయిదా వేయాలని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) ఇండియా కూటమి నేతలకు లేఖ రాసింది. దీపావళి, ధన్తేరస్ పండుగల నేపథ్యంలో వ్యాపారాలు సాగాల్సిన సమయంలో భారీ ర్యాలీ నిర్వహిస్తే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. అఖిలేశ్ యాదవ్, మమతా బెనర్జీ, తేజస్వి యాదవ్, ఉద్ధవ్ ఠాక్రే తదితర నేతలకు ఈ విజ్ఞప్తి చేసింది.నవంబర్ 10 తర్వాత నిర్వహించాలని సూచన దీపావళి పండుగ ముగిసిన తర్వాత, ముఖ్యంగా నవంబర్ 10 లేదా 11 తర్వాత ర్యాలీ నిర్వహించేలా చూడాలని సీటీఐ కోరింది. అయితే రాహుల్ గాంధీ మాత్రం ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే సభ జరుగుతుందని స్పష్టం చేశారు. ఒకవైపు పోలీసుల అనుమతులపై స్పష్టత, మరోవైపు వ్యాపార సంఘాల అభ్యంతరాల మధ్య నవంబర్ 1న జరగనున్న ఇండియా కూటమి సభపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
దిల్జిత్ ‘కాక్రోచ్ పంచ్.. అభిజీత్ కౌంటర్!
న్యూఢిల్లీ: ప్రముఖ పంజాబీ గాయకుడు, నటుడు దిల్జిత్ దోసాంజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన సంగీత విభావరిలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. గతంలో తాను చేసిన ‘ఐయామ్ యాన్ ఆర్టిస్ట్ బ్రో’ వ్యాఖ్యలపై నెలకొన్న వివాదానికి పరోక్షంగా స్పందించారు. ‘పంజాబీలకు ఎలా పోరాడాలో నేర్పించకండి’ అంటూ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించాయి.పాత వ్యాఖ్యలతో మొదలైన వివాదంకొన్ని నెలల క్రితం ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో ఢిల్లీలో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనపై స్పందించాలని దిల్జిత్‌ను కోరినట్లు సమాచారం. దీనికి ఆయన ‘నన్ను నిరసనలు, రాజకీయాలకు దూరంగా ఉంచండి. నేను ఒక కళాకారుడిని, రాజకీయ నాయకుడిని కాదు’ అని బదులిచ్చినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ వ్యాఖ్యలపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం రాజధానిలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల చర్యలను దిల్జిత్ విమర్శించారు.వేదికపై దిల్జిత్ పరోక్ష వ్యాఖ్యలుశుక్రవారం ఢిల్లీ కచేరీలో అభిమానులను ఉద్దేశించి దిల్జిత్ మాట్లాడుతూ.. ‘నేను ఒక కళాకారుడిని బ్రో.. మీ అందరినీ ప్రేమిస్తున్నాను. నేను మౌనంగా ఉంటున్నాను కాబట్టి అలాగే ఉండనివ్వండి. మీ అందరికీ నా మద్దతు ఉంది. పంజాబీలకు ఎలా పోరాడాలో నేర్పించకండి’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఎవరినీ నేరుగా ప్రస్తావించకపోయినా, గత వివాదంపై పరోక్షంగా స్పందించినట్లు చర్చ జరుగుతోంది. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.‘చిన్న తమ్ముడిగా భావించి వదిలేయండి’దిల్జిత్ వ్యాఖ్యలపై అభిజీత్ దీప్కే ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు తనను కొంత బాధించాయని, అయినప్పటికీ గాయకుడిపై తనకున్న అభిమానం ఏమాత్రం తగ్గలేదని పేర్కొన్నారు. ఈ ఏడాది మేలో అమెరికాలోని చికాగోలో దిల్జిత్ కచేరీకి కూడా వెళ్లినట్లు గుర్తుచేశారు. ఆయన ధైర్యం, నిజాయతీ, భారతీయ సంగీతాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన తీరును ప్రశంసించారు. ఒక అభిప్రాయ భేదం వల్ల గౌరవం తగ్గదని చెబుతూ.. ‘చిన్న తమ్ముడిగా భావించి ఈ విషయాన్ని వదిలేయండి’ అంటూ ‘మిట్టీ పావో’ అని విజ్ఞప్తి చేశారు.ఇదీ చదవండి: ఇందిర 42వ వర్ధంతి: ఓ చిన్నారి లేఖకు స్ఫూర్తిదాయక సమాధానం!
ఎన్ఆర్ఐ
అమెరికాలో ఖమ్మం యువతి మృతి
ఖమ్మంఅర్బన్: కుటుంబానికి వేలాది మైళ్ల దూరాన ఉంటూ ఉన్నత చదువు పూర్తిచేయడమే కాక మంచి ఉద్యోగానికి ఎంపికైంది.. ఇన్నాళ్లు పడిన శ్రమకు ఫలితం దక్కుతోందని ఆ యువతితో పాటు తల్లిదండ్రులు ఆశపడ్డారు. కానీ ఆ విజయాన్ని ఆస్వాదించకుండానే యువతి గుండెపోటుతో కన్నుమూసింది. ఎంఎస్ పూర్తి చేసి, మూడు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికైన ఆమె నచ్చిన సంస్థలో త్వరలోనే చేరి జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాలిసిన తరుణాన మృతి చెందిందన్న సమాచారం తెలియడంతో కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. నాలుగేళ్ల క్రితం అమెరికాకు...తిరుమలాయపాలెం మండలం కొక్కిరేణి గ్రామానికి చెందిన నల్లమల ఆనంద్–కల్పన దంపతులు ఖమ్మం మమతారోడ్డులో స్థిరపడ్డారు. ఆనంద్ వ్యాపారం చేస్తూనే చాంబర్ ఆఫ్ కామర్స్ ఎగుమతుల విభాగం అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా, కల్పన విద్యుత్ శాఖలో ఉద్యోగం చేస్తున్నారు. వీరి కుమార్తె అక్షిత(26) నాలుగేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. ఆ తర్వాత ఆమె సోదరుడు అక్షయ్ కూడా వెళ్లడంతో న్యూయార్క్‌లోని ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇటీవలే ఎంఎస్ పూర్తి చేసిన అక్షిత తాజాగా మూడు కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికైంది. అందులో నచ్చిన సంస్థను ఎంచుకుని వారం రోజుల్లో విధుల్లో చేరేందుకు సిద్ధమవుతోంది. ఉద్యోగంలో స్థిరపడ్డాక మంచి సంబంధం చూసి వివాహం చేయాలని తల్లిదండ్రులు భావించారు.జిమ్ నుంచి వచ్చి కుప్పకూలి..అక్షిత శుక్రవారం తెల్లవారుజామున(భారత కాలమానం ప్రకారం) రోజులాగే వ్యాయామం కోసం జిమ్‌కు వెళ్లి తిరిగి గదికి వచ్చింది. అనంతరం సోదరుడు అక్షయ్‌తో కలిసి పాస్తా తిన్నాక ఆమె నివాస సముదాయం కింద వాకింగ్ చేస్తోంది. ఈక్రమాన ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో స్పందించిన సోదరుడు వైద్యులను పిలిపించి సీపీఆర్ చేయించినా ఫలితం దక్కలేదు. అప్పటికే ఆమె గుండెపోటుతో ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో సోదరుడు ఖమ్మంలోని తల్లిడండ్రులకు చెప్పగా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలుఅమెరికా నుంచి అక్షిత మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నాలు ప్రారంభించారు. అమెరికాలోని ‘తానా’ సహకారంతో పాటు మంత్రులను సంప్రదిస్తున్నట్లు తెలి పారు. పోస్టుమార్టం, ఇతర ప్రక్రియ పూర్తయ్యాక సోమవారం నాటికి మృతదేహం ఖమ్మం చేరే అవకాశముందని తెలిసింది. కాగా, అక్షిత మృతిపై రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆనంద్‌కు ఫోన్ చేసి పరామర్శించారు. అలాగే, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా ఓ ప్రకటనలో సంతాపం తెలిపారు. ఇదీ చదవండి: ప్రెగ్నెంట్ మైనర్ బాలికపై గ్యాంగ్‌రేప్ : డెలివరీ, శిశువు మృతి
సంగీతం, నృత్యంతో సేవ..
శంకర నేత్రాలయం యూఎస్ఏ(SNUSA) సంస్థ మిచిగాన్‌లోని నోవైలో ఉన్న Sri Venkateswara Temple & Cultural Center లో “Music & Dance for Vision” కార్యక్రమాన్ని నిర్వహించింది. భారతీయ సంస్కృతి, సంగీతం, నృత్యం, సేవాభావం కలగలిసిన ఈ కార్యక్రమం ఒక అందమైన సాంస్కృతిక వేడుకగా నిలిచింది. కళాకారులు, కుటుంబాలు, వాలంటీర్లు, కమ్యూనిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని, కంటి చూపును కాపాడటం, తిరిగి చూపును అందించడం, భారతదేశంలోని అవసరమైన వారికి నాణ్యమైన కంటి వైద్య సేవలు అందించడం అనే SNUSA లక్ష్యానికి తమ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న నాలుగు నృత్య పాఠశాలలకు చెందిన సుమారు 40 మంది చిన్నారులు, టీనేజర్లు పాల్గొని కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శనలు ఇచ్చారు. భారతీయ శాస్త్రీయ నృత్య సంప్రదాయాలను ప్రతిబింబించిన ఈ ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. SNUSA Board of Trustees సభ్యుడు Ramana Mudeganti సంస్థ లక్ష్యాలను వివరిస్తూ, Mobile Eye Surgical Unit (MESU) కార్యక్రమం ద్వారా అందిస్తున్న కంటి వైద్య సేవల గురించి, దాని తాజా వివరాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. గ్రామీణ భారతదేశంలోని వైద్య సేవలు అందుబాటులో లేని ప్రజలకు కంటి వైద్యం అందించడంలో ప్రజల సహకారం, దాతల విరాళాలు ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయో ఆయన వివరించారు.ఇదీ చదవండి: దృష్టి కోసం సంగీత, నృత్య మహోత్సవం
పోర్ట్‌లాండ్‌లో ఘనంగా బతుకమ్మ, దసరా వేడుకలు
ఒరెగాన్ స్టేట్ పోర్ట్లాండ్ నగరంలో ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ (OTA) ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. R.A Brown Middle Schoolలో జరిగిన ఈ వేడుకలను OTA ప్రెసిడెంట్ శ్రీని అనుమాండ్ల జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ వేడుకలకి పోర్ట్లాండ్ మెట్రో సిటీస్ నుంచి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. ఈ వేడుకకి మహిళలు, చిన్నారులు తెలుగుదనం ఉట్టి పడేలా ముస్తాబై రంగు రంగుల బతుకమ్మలతో వచ్చి, ఆట పాటలతో సందడి చేశారు. ఆ తర్వాత బతుకమ్మ నిమజ్జనం అనతంరం ప్రసాద వితరణ చేశారు. అలాగే విజయదశమి పర్వదినం పురస్కరించుకుని జమ్మి చెట్టుకి పూజ చేసి జమ్మి (బంగారం) ఇచ్చి పుచ్చికొని అలయ్ బలాయ్ చేసుకున్నారు. కాగా, బతుకమ్మ రాఫెల్ డ్రా విజేతలకు టీడీఫ్ టీం బహుమతులని అందచేసింది.ఈ వేడుకలలో పాల్గొన్న వారందరికీ శ్రీని అనుమాండ్ల ఓటీఏ టీం తరుపున బతుకమ్మ దసరా పండుగల శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఈ పండుగని వైభవోపేతంగా జరగడానికి సహకరించిన మహిళలకు, సహకారం అందించిన స్పాన్సర్‌కి శ్రీని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వేడుకల్లో పాల్గొన్న పోర్ట్లాండ్ ఇండియన్ కమ్యూనిటికి, సహకరించిన మిత్రులకి, శ్రేయోభిలాషులకి ఓటీఏ టీమ్ తరుఫున అభినందనలు తెలిపారు.ఇదీ చదవండి: హాంకాంగ్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కన్నతల్లి చేతిలో చిన్నారి హత్య : కన్నీరుమున్నీరవుతున్న తండ్రి
న్యూయూర్క్లోని క్వీన్స్ (Queens) లోని రిచ్మండ్ హిల్లూ ప్రాంతంలో ఒక హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అక్టోబర్ 14వ తేదీ సాయంత్రం ఫ్రాన్సిస్ కెబెల్లో (32)అనే మహిళ పోలీసులకు ఫోన్ చేసి, " నా కూతుర్ని చంపేశాను" అని చెప్పిన ఘటన దిగ్బ్రాంతి రేపింది. అందరితో కలివిడిగా ఉండే ఫాబియానా కాబెల్లో అనే చిన్నారి మృతిని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. నా సర్వస్వం కోల్పోయాను అంటూ తండ్రి కన్నీరుమున్నీరవుతున్నారు.అసలేం జరిగిందంటే.. ది న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం 32 ఏళ్ల ఫ్రాన్సిస్ కాబెల్లో, "నేను నా కూతురిని చంపేశాను" అని పోలీసులకు చెప్పింది. నిజానికి ఫ్రాన్సిస్ కెబెల్లో తన బిడ్డ ‘ఫాబియానా’ ను ఎంతో అపురూరంగా చాలా భద్రంగా చూసుకునేది. పోలీసులు ఆమె ఇంటికి చేరుకునేసరికి ఐదేళ్ల చిన్నారి ఫాబియానా కెబెల్లో అపస్మారక స్థితిలోముక్కు నుండి రక్తం కారుతుండగా గమనించారు.వెంటనే ఆమెను జమైకా హాస్పిటల్ మెడికల్ సెంటర్‌కు తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.అయితే భర్త కుల్దీప్ సింగ్ పోలీసులకు అందించిన సమాచారం ప్రకారం ఫ్రాన్సిస్ కెబెల్లో గత కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతోంది. ప్రవర్తన కూడా వింతగా ఉండేది. ఆమె కొన్ని రోజులుగా మందులు మానేసిందని, అయితే ఆమె ఇంతటి ఘాతుకానికి పాల్పడుతుందని తాను ఊహించలేకపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫాబియానా ఎంతో ఆప్యాయంగా, ఉల్లాసంగా ఉండేదని ఆమె పెద్దనాన్న పున్రాజ్ సింగ్ గుర్తుచేసుకున్నారు. తన నానమ్మను, బంధువులను ఎంతో ప్రేమగా చూసుకునేదంటూ కంట తడిపెట్టుకున్నారు.పోలీసుల సమాచారం ప్రకారం చిన్నారి ముఖంపై గాయాలు ఉన్నాయని, అలాగే ఆమె కళ్ళు, గుండె, ఊపిరితిత్తులలో రక్తస్రావం వల్ల ఏర్పడిన చిన్న మచ్చలు (పెటెచియా) ఉన్నాయని పోస్ట్‌మార్టమ్‌లో తేలింది. ఇవి ఊపిరిసలపకపోవడానికి (అస్ఫిక్సియా) సంబంధించిన లక్షణాలుగా ఉన్నాయని ఫిర్యాదు పేర్కొంది.ఇదీ చదవండి: భార్యను కొట్టానని నిరూపిస్తారా? ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోఅంత్యక్రియల కోసం తండ్రి కష్టాలు ఫాబియానా తండ్రి తన కూతురు అంత్యక్రియల ఖర్చుల కోసం గోఫండ్‌మీ (GoFundMe) ద్వారా 18,000 డాలర్లు సేకరించేందుకు ప్రయత్నిస్తు న్నారు. నా బిడ్డను ఎంతగానో ప్రేమించాను, ఇపుడామె లేకపోవడం అంటే ప్రపంచాన్నే కోల్పోయినట్లుగా ఉంది. ప్రస్తుతం అంత్యక్రియల ఖర్చులు భరించే స్థితిలో లేను. అద్దె కారులో ఉబర్ డ్రైవర్‌గా పనిచేస్తూనే, ఈ కష్టసమయాన్ని ఎదుర్కొంటున్నాను అంటూ కుల్దీప్ ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురికి ఘనంగా అంత్యక్రియలు జరిపేందుకు సాయం చేయాలని ఆయన వేడుకున్నారు..ఇదీ చదవండి: ఆయుధపూజలో ఏకే-47తో ‘లేడీ సింగం’ వీడియో వైరల్
క్రైమ్
ఎల్కేజీ బాలికపై మూడవ తరగతి విద్యార్థి భీకర దాడి
సాక్షి,న్యూఢిల్లీ: హర్యానాలోని పంచకుల ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ పాఠశాల తరగతి గదిలో ఎనిమిదేళ్ల బాలుడు(మూడవ తరగతి విద్యార్థి) ఆరేళ్ల బాలిక(కిండర్‌గార్టెన్)పై రాళ్లు, పూలకుండీతో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో బాలిక తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉంది.అక్టోబర్ 28న సంస్కృతి మోడల్ స్కూల్లో ఈ ఘటన జరిగింది. పాఠశాలలోని సీసీటీవీ దృశ్యాల్లో పరిశీలించగా.. దాడి చేసిన బాలుడు ఆ బాలికను తరగతి గదిలోకి ఈడ్చుక్కెళ్లి, డెస్క్‌కు తల బాదడంతో పాటు కిందపడేసి విచక్షణారహితంగా బాలికను తన్నినట్లు కనిపించింది. అనంతరం రాళ్లు, పూలకుండీతో పలుమార్లు దాడి చేశాడు. దీంతో బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.🚨 Horrifying incident from Panchkula, Haryana! An 8-year-old boy brutally attacked a 6-year-old girl inside their classroom. He grabbed her by the hair, smashed her head against a desk, kicked her on the floor and repeatedly hit her with a brick. 💔 The little girl is seriously injured and undergoing treatment at PGIMER, Chandigarh. Both are school students. Just imagine the brutality inside a classroom. How did a brick become a weapon in a place where children are supposed to feel safe? The police are investigating. The school administration must answer for this shocking incident. https://t.co/fBGBU6I8pt— Samridhi (@samridhi_i) October 31, 2026అయితే అనంతరం ఆ బాలిక తల్లిదండ్రులు ఆమెను పాఠశాల నుండి తీసుకువెళ్లడానికి వచ్చినప్పుడు, నిందితుడైన బాలుడు వారిని ఆమె ఉన్న చోటికి తీసుకెళ్లి, "మీ అమ్మాయి ఇక్కడ పడి ఉంది" అని చెప్పినట్లు సమాచారం.అనంతరం బాలికను మొదట స్థానిక సివిల్ ఆసుపత్రికి తరలించారు. అయితే బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో చండీగఢ్‌లోని పీజీఐ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం.బాలుడు చేసిన పనులను టీచర్లకు ఫిర్యాదు చేస్తానని బాలిక చెప్పడంతోనే బాలుడు ఈ దాడికి పాల్పడినట్లు ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. గతంలోనూ బాలుడు దూకుడుగా ప్రవర్తించేవాడని, కుక్కలను కొట్టిన ఘటనల్లోనూ అతడిపై ఫిర్యాదులు ఉన్నాయని బాలిక మేనమామ తెలిపారు.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి బాలుడి తల్లిదండ్రులను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు హర్యానా విద్యాశాఖ మంత్రి మహిపాల్ ధండా విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. పిల్లల భద్రత విషయంలో నిర్లక్ష్యాన్ని సహించబోమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం ఆయన చేశారు.ఇదీ చదవండి: క్రిప్టో ప్రపంచంలో భారీ దోపిడీ.. ఉత్తర కొరియా హ్యాకర్లపై అనుమానాలు!
5 స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో షాక్ : ఇద్దరు విదేశీయులు దుర్మరణం
సాక్షి, బెంగళూరు: బెంగళూరులోని ఒక ప్రముఖ ఫైవ్-స్టార్ హోటల్లో జరిగిన విషాద ఘటన దిగ్భ్రాంతి రేపింది. విద్యుత్ షాక్ కారణంగా పూల్‌లో ఉన్న ఇద్దరు విదేశీయులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నగరంలోని 'కాన్రాడ్' (Conrad) అనే ఫైవ్-స్టార్ హోటల్లో శుక్రవారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.ఏం జరిగింది?నగరంలోని 24 అంతస్తుల లగ్జరీ హోటల్ 'కాన్రాడ్' (హిల్టన్ గ్రూప్‌కు చెందినది) మూడో అంతస్తులో ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో కొందరు ఈత కొడుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు విదేశీయులు ప్రాణాలు కోల్పోగా, వారిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.మృతుల్లో ఒకర్ని జర్మనీకి చెందిన అలెగ్జాండర్ మాక్సిమిలియన్ థిస్ (57)గా గుర్తించారు. ఈయన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌లో క్రూ మెంబర్‌గా పనిచేస్తున్నారు. మరొకరు స్లోవేకియా దేశస్థుడు యురాజ్ హోర్వాత్ (45). ఇతను ప్రముఖ ఐటీ సంస్థ ఐబీఎమ్ (IBM)లో ప్రాజెక్ట్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.లుఫ్తాన్సా విచారంమృతుల కుటుంబం, బంధువులు మరియు స్నేహితులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని, వారి గోప్యతకు గౌరవంగా ప్రమాదం లేదా మృతుడి గురించి వివరాలు వెల్లడించబోమని లుఫ్తాన్సా ప్రకటించింది.పూల్‌లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అమెరికాకు చెందిన మ్యాథ్యూ డిసాంటిస్ (41) అనే హోటల్ అతిథితో పాటు, రాహుల్ తివారీ (28) అనే హోటల్ పూల్ అటెండెంట్ వెంటనే స్పందించారు. అయితే ప్రయత్నంలో వారికి కూడా షాక్ తగిలి గాయపడ్డారు. వీరిద్దరినీ వెంటనే మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఏమీ లేదని, ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా విచారణ జరుపుతున్నారు. విద్యుత్ లీకేజీకి అసలు కారణాలేంటనే దానిపై ఆధారాలు సేకరిస్తున్నారు.హోటల్ యాజమాన్యం స్పందన?మరోవైపు, ఈ దారుణంపై హోటల్ యాజమాన్యం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, శనివారం ఉదయం హోటల్ వెబ్సైట్లో స్విమ్మింగ్ పూల్‌ను "అక్టోబర్ 31 నుండి నవంబర్ 30 వరకు నిర్వహణ (maintenance) కారణాల వల్ల మూసివేస్తున్నాం" అంటూ ఒక నోటీసు పెట్టారు.కాగా పాపులర్ హోటల్లో జరిగిన ఈ ఘటన యాజమాన్యం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది అంటూ తీవ్ర నిరసనలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో గదికి రోజుకు రూ. 25వేలకు పైనే ఛార్జ్ చేసే ఇటువంటి అంతర్జాతీయ ఫైవ్ స్టార్ హోటల్లో సురక్షతా ప్రమాణాల లోపాలపై విమర్శలు చెలరేగాయి.
చెంపలు వాచేలా కొట్టి.. గుండెలపై మోకాలితో తొక్కి!
ఏలూరు జిల్లా: భార్యాభర్తల మధ్య జరిగిన వివాదం చివరకు హత్యకు దారితీసిన విషాద సంఘటన నూజివీడు మండలం మీర్జాపురం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం జంగారెడ్డిగూడేనికి చెందిన శివరాత్రి దుర్గాప్రసాద్, జ్యోతి దంపతులు బంధువుల ఇంట్లో వివాహ వేడుక కోసం వారం రోజుల క్రితం మీర్జాపురం వచ్చారు. ఈ నెల 28న వివాహం, 29న రిసెప్షన్ పూర్తయ్యాయి. శుక్రవారం ఉదయం కొందరు బంధువులు వెళ్లిపోగా, అనారోగ్యంతో ఉన్న మరొక బంధువును పరామర్శించేందుకు కుటుంబసభ్యులంతా వేరే ఊరు వెళ్లారు. దీంతో ఇంట్లో దుర్గాప్రసాద్, జ్యోతి మాత్రమే ఉన్నారు. ఈ క్రమంలో ఉదయం ఇద్దరి మధ్య ఏ విషయంపై మనస్పర్థలు వచ్చాయో తెలియదు కానీ తీవ్ర గొడవ జరిగింది. ఆవేశానికి గురైన దుర్గాప్రసాద్ భార్య జ్యోతి చెంపలపై బాదుతూ, మోకాలితో గుండెలపై దారుణంగా దాడి చేశాడు. ఆమె కేకలు విని కాపాడేందుకు చుట్టుపక్కల వారు పరుగెత్తుకొచ్చినప్పటికీ అతడు ఆగకుండా కొట్టడంతో జ్యోతి స్పృహతప్పి కిందపడిపోయింది. తీవ్రంగా గాయపడి కదలకుండా ఉన్న ఆమెను వెంటనే సమీపంలోని ఆర్ఎంపీ వైద్యుడి వద్దకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. స్థానికులు 112కు సమాచారం అందించడంతో నూజివీడు రూరల్ సీఐ ఐవీ నాగేంద్రకుమార్, రూరల్ ఎస్సై జి.జ్యోతీబసు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కేసులో సీజ్ చేసిన సొత్తుతో కానిస్టేబుల్ నిర్వాకం.. మీర్పేట్లో ఘటన!
సాక్షి, హైదరాబాద్: ప్రజల సొమ్ముకు, కేసుల్లో సీజ్ చేసిన వస్తువులకు రక్షణగా ఉండాల్సిన పోలీసే అక్రమాలకు పాల్పడడం జరిగింది. కేసు దర్యాప్తులో భాగంగా స్వాధీనం చేసుకున్న ఫోన్ నుంచి డబ్బులు బదిలీ చేయడంతోపాటు, అదే కేసులో సీజ్ చేసిన బంగారాన్ని తాకట్టుపెట్టాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మీర్పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.పోలీసుల వివరాల ప్రకారం.. మీర్పేట్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రవణ్ ఈ వ్యవహారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఓ కేసులో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్ నుంచి రూ.1.70 లక్షలను తన బంధువుల ఖాతాలకు బదిలీ చేసినట్లు గుర్తించారు. అంతేకాకుండా, అదే కేసులో పోలీసులు సీజ్ చేసిన బంగారాన్ని కూడా కానిస్టేబుల్ శ్రవణ్ తాకట్టుపెట్టినట్లు వెలుగులోకి వచ్చింది.విధుల్లో ఉండి బాధ్యతగా వ్యవహరించాల్సిన పోలీసే ఇలా చేయడంతో ఈ ఘటన పోలీసు వర్గాల్లో విస్మయం కలిగించింది. ఈ వ్యవహారంపై అధికారులు విచారణ చేపట్టి, కానిస్టేబుల్ శ్రవణ్‌పై కేసు నమోదు చేశారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లుగా తెలుస్తోంది.ఇదీ చదవండి: 10 గంటలు నిర్బంధించి.. చిత్రహింసలు
వీడియోలు
మొదలైన అనిరుధ్-కావ్య పెళ్లి సందడి..
ప్రేమ పేరుతో బాలికను వేధిస్తున్న ఉన్మాది
దీక్షలో తెలిసి తెలిసి ఈ తప్పులు చేయకండి!
రెండేళ్లకే 12 తాళాలను తప్పుల్లేకుండా వాయిస్తున్న చిన్నారి.. వీడియో వైరల్
ఎన్నికల్లో అక్రమాలకు చెక్ పెట్టండి.. ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు..
నువ్వు వైరస్ లాంటోడివి చంద్రబాబు.. నీకు దిమ్మ తిరిగే వ్యాక్సిన్ వేస్తాం చూడు..
మార్కెట్ లోకి కొత్త ₹1000 నోటు? RBI కీలక ప్రకటన!
పంజాబ్ ఎన్నికల బరిలో సీఎం మాన్.. ఆప్ ఫస్ట్ లిస్ట్ విడుదల
పులివెందులలో టీడీపీ కుట్ర.. YSRCP నేతలు ఎక్కడిక్కడ అరెస్టులు
అంబానీ దీపావళి గిఫ్ట్ బాక్స్ లో క్యాష్ చూసి అంతా షాక్!

