అప్పుడు మౌనం.. ఇప్పుడు రోదన.. ఎందుకిలా?
వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిత్వ హననమంటూ గతంలో కూటమి నేతలపై నిప్పులు చెరిగిన ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల.. ఇప్పుడు అదే కూటమి అధినేత చంద్రబాబుతో ఆత్మీయంగా మెలగడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. సాక్షి ‘చెట్టపట్టాల్’ అని రాస్తే.. ఏదో అసభ్య పదమన్నట్టు షర్మిల ఆవేదన వ్యక్తం చేయడం.. ఆమెకు మద్దతుగా కూటమి నేతలు చెలరేగిపోవడం.. ఇందంతా వైఎస్ జగన్‌పై బురద చల్లడానికి ఓ పెద్ద స్కెచ్‌లా కనిపిస్తోంది.ఇక్కడ గమనించవలసిన మరొక విషయం ఏమిటంటే.. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై టీడీపీకి చెందిన కార్యకర్తలు, యూట్యూబర్లు తరచుగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఎక్స్ స్పేస్ చర్చలో అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. అయితే, దీనిపై షర్మిల ఎందుకు స్పందించలేదు. కానీ, సాక్షిలో కేవలం ‘చెట్టపట్టాల్’ అనే పదం ఉపయోగించినందుకు నానాయాగీ చేస్తున్నారు. అసలు తెర వెనుక ఏం జరుగుతోంది? అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.మరో కోణం పరిశీలిస్తే.. రామోజీ ప్రజా సేవకుడు కాదు. ప్రజాప్రతినిధిగానూ పనిచేయలేదు. అయితే, రామోజీరావు జయంతిని కూటమి సర్కార్.. రాష్ట్ర అధికారిక కార్యక్రమంగా ప్రకటించడాన్ని ప్రజలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. తీవ్ర విమర్శలు వ్యక్తమవడంతో కంగుతిన్న చంద్రబాబు సర్కార్.. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే ఇలా ప్లాన్ చేశారనే వాదన కూడా వినిపిస్తోంది.గతాన్ని పరిశీలిస్తే.. అసలు లోకేశ్ మామ బాలకృష్ణ స్వయంగా మహిళలపై అత్యంత దుర్మార్గంగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘‘అమ్మాయి కనబడితే కడుపైనా చేయాలి.. లేదంటే ముద్దైనా పెట్టాలి’ అని బాలకృష్ణ వ్యాఖ్యానించినపుడు లోకేశ్ ఏమయ్యాడు? రాజకీయాలకు సంబంధం లేని సినీ ప్రముఖుల కుటుంబాలనూ పచ్చ మూకల సోషల్ మీడియా వేధింపులు వదలడం లేదు.ప్రముఖ నటుడు అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డిని, కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకర వీడియోలు, థంబ్‌నెయిల్స్ ప్రచారం చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులపైనా గతంలో ఇదే కూటమి సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు వెలుగుచూశాయి. ఇలాంటి సందర్భాల్లో మహిళల గౌరవం గురించి రాజకీయ నాయకుల నుంచి ఇదే తరహా బహిరంగ ఖండనలు లోకేశ్ ఎందుకు చేయలేదనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.ఇదీ చదవండి: ‘చెట్టపట్టాల్’కూ పెడర్థాలా..?
పసిడి ధర నేలచూపు.. వెండికీ తప్పని పతనం!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
ఇజ్రాయెల్ నెతన్యాహుకు భారీ షాక్
జెరూసలేం: ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు పార్లమెంట్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రత్యర్థి, మాజీ సైన్యాధిపతి గాడి ఐసెన్కాట్ వర్గానికి చెందిన మాటన్ కహానా ఇజ్రాయెల్ పార్లమెంట్ (నెస్సెట్) స్పీకర్‌గా ఎన్నికయ్యారు. 120 మంది సభ్యులున్న పార్లమెంట్లో కహానాకు 66 మంది మద్దతు పలకగా.. నెతన్యాహు పార్టీ అభ్యర్థి ఒఫిర్ కాట్జ్కు 52 ఓట్లు మాత్రమే వచ్చాయి.ఈ ఎన్నిక నెతన్యాహు రాజకీయ ఆధిపత్యానికి మరో సవాలుగా మారింది. ఇప్పటివరకు స్పీకర్‌గా కొనసాగిన అమీర్ ఓహానా నెతన్యాహు లికుడ్ పార్టీకి చెందినవారు. ఆయన స్థానంలో ఐసెన్కాట్ వర్గానికి చెందిన కహానా బాధ్యతలు చేపట్టడం పార్లమెంట్లో అధికార సమీకరణాలను మార్చే పరిణామంగా భావిస్తున్నారు. ముఖ్యంగా పార్లమెంట్లో ఏ అంశాలపై చర్చ జరగాలి? ఏ బిల్లులను ఓటింగ్‌కు తీసుకురావాలి? అనే విషయాల్లో స్పీకర్‌కు కీలక పాత్ర ఉంటుంది. దీంతో నెతన్యాహు ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే ప్రతిపక్ష కూటమికి పార్లమెంట్లో మరింత పట్టు లభించనుంది.నెతన్యాహు నిర్ణయాలకు బ్రేక్?నెతన్యాహు ప్రభుత్వం తీసుకొచ్చిన న్యాయవ్యవస్థ సంస్కరణలను రద్దు చేయడం ఐసెన్కాట్ కూటమి ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. న్యాయవ్యవస్థ స్వతంత్రతను తగ్గించేలా ఈ సంస్కరణలు ఉన్నాయంటూ గతంలో ఇజ్రాయెల్‌లో భారీ నిరసనలు జరిగాయి. వీటితో పాటు 2023 అక్టోబర్ 7న హమాస్ దాడులను అడ్డుకోవడంలో భద్రతా వైఫల్యాలపై స్వతంత్ర విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని ఐసెన్కాట్ కోరుతున్నారు. ప్రధానమంత్రి పదవికి కాలపరిమితి విధించే ప్రతిపాదన కూడా ఆయన ఎజెండాలో ఉంది. ఈ అంశాలపై బుధవారం నుంచే పార్లమెంట్లో చర్యలు ప్రారంభించే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠఅక్టోబర్ 27న జరిగిన ఎన్నికల్లో 120 స్థానాలున్న ఇజ్రాయెల్ పార్లమెంట్లో నెతన్యాహు కూటమికి 53 సీట్లు, ఐసెన్కాట్ నేతృత్వంలోని కూటమికి 48 సీట్లు వచ్చాయి. అరబ్ పార్టీలకు చెందిన రెండు కూటములు కలిపి 19 స్థానాలు గెలుచుకున్నాయి. దీంతో ఏ పక్షానికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 61 స్థానాల మెజారిటీ లభించలేదు. అరబ్ పార్టీల మద్దతుతోనే స్పీకర్ ఎన్నికలో ఐసెన్కాట్ వర్గం 66 ఓట్లు సాధించింది. ఇదిలా ఉంటే.. ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు ఐసెన్కాట్కు అవకాశం ఇచ్చారు. ఆయనకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 28 రోజుల గడువు ఉండగా, అవసరమైతే మరో 14 రోజులు పొడిగించవచ్చు. అయితే అరబ్ పార్టీల మద్దతును ప్రభుత్వ ఏర్పాటు వరకు కొనసాగించడం ఆయనకు కీలకం కానుంది.మరోవైపు కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు నెతన్యాహు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతారు. ఐసెన్కాట్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విఫలమైతే వచ్చే ఏడాది మరోసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్పీకర్ ఎన్నికలో ఎదురైన పరాజయం నెతన్యాహుకు రాజకీయంగా మరో ఎదురుదెబ్బగా మారింది.ఇదీ చదవండి: అమెరికా రాడార్‌పై ఇరాన్ గురి.. యూఎస్ ప్రతీకార మెరుపు దాడులు
ఈషా రెబ్బా-తరుణ్ భాస్కర్ రిలేషన్.. ఆఫీషియల్ ప్రకటన
'పెళ్లిచూపులు', 'ఈ నగరానికి ఏమైంది' తదితర సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్.. ప్రస్తుతం నటుడిగాను రాణిస్తున్నారు. తాజాగా ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 20న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్‌కు తరుణ్ భాస్కర్ మదర్ గీతా భాస్కర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె తరుణ్ భాస్కర్ పార్ట్నర్ ఎవరనే విషయంపై కామెంట్స్ చేశారు. ఆమెనే తరుణ్ సోల్‌మేట్ అంటూ అఫీషియల్‌గా ప్రకటించారు.ఈ రెండేళ్లలో తరుణ్ భాస్కర్ ఎన్నో ఒడుదొడుకులు చూశాడని ఆమె అన్నారు. కోర్టు కేసులు, ఇల్లు కట్టడం వంటి సమస్యలు ఎన్నో వచ్చి పడ్డాయని తెలిపారు. ఇంటికి రాని రోజులు కూడా చాలా ఉన్నాయన్నారు. ఇంటికి వచ్చినప్పుడు రాత్రి పూట 2 గంటలకి, 4 గంటలకి భోజనం పెట్టడానికి ఒక మంచి సోల్ మేట్ దొరికిందని తెలిపింది. ఆమె మరెవరో కాదు.. మనందరం ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈషానే అంటూ వెల్లడించారు. ఈషానే తరుణ్‌కు ఫ్రెండ్ మాత్రమే కాదు.. మంచి సోల్‌మేట్ అని ప్రకటించింది. ఈషా వల్లనే ఈ మూవీని పూర్తి చేయగలిగాడని కూడా పేర్కొన్నారు. ఈషా రూపంలో తరుణ్‌కి మంచి తోడు దొరికిందని సంతోషం వ్యక్తం చేసింది. దీంతో వీరిద్దరిపై వస్తున్న రూమర్స్‌కు ఇక తెరపడింది. త్వరలోనే ఈ జంట కూడా పెళ్లి చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
నాడు నిప్పులు.. నేడు ఆత్మీయ పలకరింపులు?
తీగ కాదు అమ్మాయి నడుమా?.. ‘బాయ్స్’ టైటిల్లోనే బిగ్ ట్విస్ట్!
గర్ల్స్ హాస్టల్లోకి పురుషులు.. లోపల బాగోతం వేరే!
మరో చిరు లీక్స్.. కాకాలో కీ రోల్ రివీల్..!
నువ్వేం ముఖ్యమంత్రివి.. నీది ఏం భాష?
డాక్టర్ పద్మజకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దు
సోనియా పుస్తకంపై శివసేన ఆగ్రహం.. నిషేధానికి డిమాండ్!
ఇటువంటి దొంగకు ఓటు వేయకండి!
రేపటి నుంచే ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీ
కవలల ప్రసవం తర్వాత కోలుకోవడంపై..ఉపాసన భావోద్వేగం!
మారింది ఇయర్ మాత్రమే.. మిగతాదంతా 'సేమ్ టు సేమ్'..!
మేం ఎప్పుడూ ఓ ‘పద్ధతి’ ప్రకారమే వెళ్తాం!!
ప్లీజ్.. ఇంకెప్పుడు ఇలా ఈవెంట్‌కి రావద్దు సార్: ధనుష్
మీరు చేసే ప్రతీ ఈవెంటూ తెగ నచ్చేస్తున్నాయట! టెక్నిక్స్ చెప్పమని ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు వచ్చాయ్ సార్!
రామోజాంధ్రప్రదేశ్గా మారిస్తే ఇంకా బావుంటుంది సార్!
గ్రాండ్‌గా హీరో తేజ సజ్జా నిశ్చితార్థం.. టాలీవుడ్ స్టార్స్ సందడి
తెలుగు రైతు బిడ్డ రూ.40 వేలకోట్ల వ్యాపారం
దశాబ్దాల నాటి విషాద గాథ
'అతడొక ఫేక్ బౌలర్.. సన్‌రైజర్స్‌ది చెత్త నిర్ణయం'
మజ్జి సిరి సహస్ర రిట్ అప్పీల్‌ను తిరస్కరించిన హైకోర్టు
‘నువ్వు నిజం.. అందుకే నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నా’
కెప్టెన్‌గా హెన్రిచ్ క్లాసెన్.. ప్రకటన విడుదల
నిజంగా వాళ్లు అద్భుతం.. అదే మా ఓటమిని శాసించింది: న్యూజిలాండ్ కెప్టెన్
ఏడాది కిందటి ధరకు వెండి
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం పెరుగుతుంది
సాక్షి కార్టూన్ 16-11-2026
IND vs NZ: షెడ్యూల్, మ్యాచ్ ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
‘ఆర్సీబీ’ కెప్టెన్ పాటిదార్ ప్రపంచ రికార్డు
అల్లు అర్జున్ అక్క ఈమెనే.. పరిచయం చేసిన అల్లు అరవింద్
తేజ సజ్జా నిశ్చితార్థం.. తెలంగాణ గవర్నర్ స్పెషల్ విషెస్
నాడు నిప్పులు.. నేడు ఆత్మీయ పలకరింపులు?
తీగ కాదు అమ్మాయి నడుమా?.. ‘బాయ్స్’ టైటిల్లోనే బిగ్ ట్విస్ట్!
గర్ల్స్ హాస్టల్లోకి పురుషులు.. లోపల బాగోతం వేరే!
మరో చిరు లీక్స్.. కాకాలో కీ రోల్ రివీల్..!
నువ్వేం ముఖ్యమంత్రివి.. నీది ఏం భాష?
డాక్టర్ పద్మజకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దు
సోనియా పుస్తకంపై శివసేన ఆగ్రహం.. నిషేధానికి డిమాండ్!
ఇటువంటి దొంగకు ఓటు వేయకండి!
రేపటి నుంచే ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీ
కవలల ప్రసవం తర్వాత కోలుకోవడంపై..ఉపాసన భావోద్వేగం!
మారింది ఇయర్ మాత్రమే.. మిగతాదంతా 'సేమ్ టు సేమ్'..!
మేం ఎప్పుడూ ఓ ‘పద్ధతి’ ప్రకారమే వెళ్తాం!!
ప్లీజ్.. ఇంకెప్పుడు ఇలా ఈవెంట్‌కి రావద్దు సార్: ధనుష్
మీరు చేసే ప్రతీ ఈవెంటూ తెగ నచ్చేస్తున్నాయట! టెక్నిక్స్ చెప్పమని ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు వచ్చాయ్ సార్!
రామోజాంధ్రప్రదేశ్గా మారిస్తే ఇంకా బావుంటుంది సార్!
గ్రాండ్‌గా హీరో తేజ సజ్జా నిశ్చితార్థం.. టాలీవుడ్ స్టార్స్ సందడి
తెలుగు రైతు బిడ్డ రూ.40 వేలకోట్ల వ్యాపారం
దశాబ్దాల నాటి విషాద గాథ
'అతడొక ఫేక్ బౌలర్.. సన్‌రైజర్స్‌ది చెత్త నిర్ణయం'
మజ్జి సిరి సహస్ర రిట్ అప్పీల్‌ను తిరస్కరించిన హైకోర్టు
‘నువ్వు నిజం.. అందుకే నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నా’
కెప్టెన్‌గా హెన్రిచ్ క్లాసెన్.. ప్రకటన విడుదల
నిజంగా వాళ్లు అద్భుతం.. అదే మా ఓటమిని శాసించింది: న్యూజిలాండ్ కెప్టెన్
ఏడాది కిందటి ధరకు వెండి
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం పెరుగుతుంది
సాక్షి కార్టూన్ 16-11-2026
IND vs NZ: షెడ్యూల్, మ్యాచ్ ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
‘ఆర్సీబీ’ కెప్టెన్ పాటిదార్ ప్రపంచ రికార్డు
అల్లు అర్జున్ అక్క ఈమెనే.. పరిచయం చేసిన అల్లు అరవింద్
తేజ సజ్జా నిశ్చితార్థం.. తెలంగాణ గవర్నర్ స్పెషల్ విషెస్
ఫొటోలు
అక్కా సిరీస్‌లో కీర్తి సురేశ్ స్టిల్స్.. (ఫోటోలు)
హీరోయిన్ సమంత సీమంతం వేడుక.. (ఫోటోలు)
ఇట్లు అర్జున మూవీ సక్సెస్ మీట్.. (ఫోటోలు)
తరుణ్ భాస్కర్‌తో రిలేషన్.. ట్రెండింగ్‌లో ఈషా రెబ్బా.. (ఫోటోలు)
'వ్యూ – ది పాయింట్ ఆఫ్ వ్యూ' మూవీ హీరోయిన్ శ్రీ పూజా రెడ్డి (ఫోటోలు)
ముంబై : ఎర్త్‌షాట్ ప్రైజ్ 2026 అవార్డ్స్...ప్రత్యేక ఆకర్షణగా బ్రిటన్ యువరాజు (ఫోటోలు)
ENE Repeat : సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
హైదరాబాద్ : కన్నుల పండుగగా కోటి దీపోత్సవం (ఫోటోలు)
త్వరలో టాలీవుడ్ ఎంట్రీ.. ధనశ్రీ వర్మ ధగధగలు (ఫొటోలు)
చక్కనైనా చుక్కనమ్మ.. పోజు అదిరింది (ఫొటోలు)
సినిమా
ప్రెగ్నెన్సీతో సమంత.. అత్తగారింట సీమంతం వేడుక
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఈ ఏడాది అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ బిడ్డకు జన్మనివ్వనుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అభిమానులతో టచ్‌లోనే ఉంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో వేడుక జరుపుకుంది. తన అత్తగారి ఫ్యామిలీతో కలిసి సీమంతం వేడుకను సెలబ్రేట్ చేసుకుంది.(ఇది చదవండి: ఇరుముడితో బ్లాక్‌బస్టర్.. అయ్యప్ప దీక్షలో డైరెక్టర్)కాగా.. సామ్.. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరును పెళ్లాడింది. వీరిద్దరు కలిసి వెబ్ సిరీస్‌ల్లో పని చేశారు. అదే సమయంలో ప్రేమ చిగురించింది. గతేడాది డిసెంబర్లో ఈ జంట పెళ్లి చేసుకున్నారు. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో వీరి పెళ్లి అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. ఈ ఏడాదిలోనే వీరిద్దరు తమ బిడ్డకు స్వాగతం పలకనున్నారు. మరోవైపు సమంత.. మా ఇంటి బంగారం మూవీతో సూపర్ హిట్ కొట్టింది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)
ఇరుముడితో బ్లాక్‌బస్టర్.. అయ్యప్ప దీక్షలో డైరెక్టర్
రవితేజ హీరోగా వచ్చిన మూవీ ఇరుముడి. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ కథాంశంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీకి టాలీవుడ్ డైరెక్టర్ శివనిర్వాణ దర్శకత్వం వహించారు. ఆగస్టులో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద రూ.250 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నిర్మించారు.తాజాగా ఈ మూవీ డైరెక్టర్ శివనిర్వాణ, నిర్మాత రవిశంకర్ అయ్యప్ప దీక్ష స్వీకరించారు. జూబ్లీహిల్స్ ఫిల్మ్‌నగర్‌లోని ప్రముఖ ఆలయంలో వీరిద్దరు దీక్షకు పూనుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఏడాది ఇరుముడి సూపర్ హిట్ కావడం.. డైరెక్టర్, నిర్మాత దీక్ష తీసుకోవడం టాలీవుడ్లో ఆసక్తి కలిగిస్తోంది. కాగా.. ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవాని శంకర్ కనిపించింది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు.(ఇది చదవండి: ప్రెగ్నెన్సీతో సమంత.. అత్తగారింట సీమంతం వేడుక) Irumudi Director @ShivaNirvana and Mythri Producer Y. Ravi Shankar took Ayyappa Deeksha today at Film Nagar Daiva Sannidhanam. Swamiye Saranam Ayyappa! 🙏 https://t.co/wwWAPtEJgq— Telugu Film Producers Council (@tfpcin) November 18, 2026
మూడో బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ నటి
ప్రముఖ స్టార్ నటి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. హాలీవుడ్‌కు చెందిన అన్నా హాత్వే లేటు వయసులో మూడో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్థానిక న్యూయార్క్ మీడియా వెల్లడించింది. ఈ ఏడాది జూన్‌లో ప్రెగ్నెన్సీ ప్రకటించిన ఆమె.. తాజాగా బిడ్డకు స్వాగతం పలికారు. ప్రస్తుతం ఆమె వయస్సు 44 ఏళ్లుగా తెలుస్తోంది.కాగా.. 2012లో అన్నా హాత్వే.. ఆడమ్ సుల్మాన్ను పెళ్లాడారు. వీరిద్దరికీ ఇప్పటికే 10 ఏళ్ల జొనాథన్, 6 ఏళ్ల జాక్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. నటి హాత్వే ఈ ఏడాది క్రిస్టోఫర్ నోలన్ తెరెకెక్కించిన ది ఓడిస్సీ మూవీలో కనిపించారు. ఈ మూవీలో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. జూలై 14న 'ది ఒడిస్సీ' న్యూయార్క్ ప్రీమియర్ షోలోనూ అన్నా హాత్ వే సందడి చేశారు. కాగా.. ఈ హాలీవుడ్ చిత్రం భారతదేశంలో అక్టోబర్ 2న విడుదలైంది. అంతేకాకుండా ఈ ఏడాది ఆమె వెరైటీ అనే మరో చిత్రంలోనూ నటించింది.
'తమన్ నీకు ప్రమాదముంది.. కొంచెం తగ్గించు'.. మెగాస్టార్ కామెంట్స్ వైరల్
మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి కాంబోలో వస్తోన్న మూవీ కాకా. వాల్తేరు వీరయ్య తర్వాత మరోసారి వీరిద్దరు ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చివరిదశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ మూవీ డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా కాకా గురించి మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ చేశారు. ఇట్లు అర్జున్ సక్సెస్ మీట్‌కు హాజరైన చిరంజీవి కాకాపై మాట్లాడారు.ఎక్కడికెళ్లినా తమన్ ఈ మధ్య ప్రధానంగా కాకా గురించే మాట్లాడుతున్నాడని మెగాస్టార్ సరదాగా అన్నారు. ఇక్కడ నీకు ఒక ప్రమాదం పొంచి ఉందంటూ తమన్‌కు షాకిచ్చాడు చిరంజీవి. ఏ ఈవెంట్‌కు వెళ్లినా వాళ్ల సినిమా గురించి చెప్పట్లేదని ఫీలవుతారని తమన్‌కు సూచించారు. మిగతావాళ్లు మా మూవీ గురించి చెప్పట్లేదు..కాకానే కేకనా అని అడుగుతున్నారని మెగాస్టార్ సరదాగా చెప్పారు. కానీ తమన్ చెప్పేదే వందశాతం కరెక్టే.. కాకాతో కచ్చితంగా కొడతాం అంటూ మెగాస్టార్ ధీమా వ్యక్తం చేశారు. ఇది చూసిన డైరెక్టర్ బాబీ.. కాకానే చెప్పేశాడుగా అంటూ పోస్ట్ చేశాడు. తాజాగా మెగాస్టార్ కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. Definitely కొడతాం 😎🔥 That’s the statement from our #KAAKA Megastar @KChiruTweets garu 💥 JAN 13th Sankranthi 2027❤️🔥 #KAAKAOnJan13 https://t.co/iREEOcE75Z— Kaaka (@KaakaMovie) November 17, 2026
క్రీడలు
ధోని రిటైర్మెంట్.. ఆ ముగ్గురే ఆల్ సీజన్ ప్లేయర్స్
ఐపీఎల్లో మహేంద్ర సింగ్ ధోని ఆటగాడిగా తన ప్రస్థానానికి ముగింపు పలికాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించి, వచ్చే సీజన్‌కు అదే ఫ్రాంచైజీ మెంటార్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.2008లో లీగ్ మొదలైన నాటినుంచి 2026 వరకు చెన్నై జట్టుతోనే కొనసాగిన ధోని, సీఎస్కేపై నిషేధం విధించిన రెండేళ్లలో (2016, 2017) రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ రెండు సీజన్లు మినహా మిగిలిన 17 సీజన్లలో అతడు సీఎస్కే కర్త, కర్మ, క్రియగా వ్యవహరించాడు.ఆటగాడిగా ధోని రిటైర్మెంట్ నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం మరోసారి తెరపైకి వచ్చింది. లీగ్ ప్రారంభం నుంచి ప్రతి సీజన్లో ప్రాతినిథ్యం దక్కించుకున్న నలుగురిలో నుంచి ధోని ఔటయ్యాడు. గత సీజన్లో ధోని ఒక్క మ్యాచ్ ఆడకపోయినా జట్టులో భాగంగా ఉన్నాడు. ధోని కాకుండా 19 సీజన్ల పాటు ప్రాతినిథ్యం దక్కించుకున్న వారు మరో ముగ్గురు ఉన్నారు. వారే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, మనీశ్ పాండే.ధోని రిటైర్మెంట్ తర్వాత ఈ ముగ్గురు సీజన్ నంబర్ 20 దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ ముగ్గురు 2027 సీజన్లో తమతమ ఫ్రాంచైజీల తరఫున జట్టులో కొనసాగుతున్నారు. ఆర్సీబీ కోహ్లిని, ముంబై ఇండియన్స్ రోహిత్‌ను, కేకేఆర్ మనీశ్‌ను తిరిగి రీటైన్ చేసుకున్నాయి. దీంతో వీరు ముగ్గురు ఐపీఎల్ ఆల్ సీజన్ ప్లేయర్స్‌గా గొప్ప ఖ్యాతిని దక్కించుకున్నారు. ఇదీ చదవండి: చెన్నై కింగ్ ఆట ముగించాడు
పాక్‌ను చిత్తు చేసి ఛాంపియన్‌గా అవతరించిన భారత్
దాయాదుల పోరులో భారత ఫుట్‌బాల్ జట్టు అదరగొట్టింది. పాకిస్తాన్‌తో జరిగిన హోరాహోరీ ఫైనల్లో 2-1తో విజయం సాధించి పదోసారి సాఫ్ (SAFF) ఛాంపియన్షిప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. మంగళవారం (నవంబర్ 17) ఢాకాలో జరిగిన ఈ మ్యాచ్‌లో చివరి వరకు ఉత్కంఠ కొనసాగింది. పాక్ ఆటగాడు జునైద్ షాకు రెండో అర్ధభాగంలో రెడ్ కార్డు రావడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది.తొలి అర్ధభాగంలో పాక్ ఆధిపత్యంమ్యాచ్ ఆరంభం నుంచి పాకిస్తాన్ ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. శారీరక సామర్థ్యంతో పాటు సాంకేతిక నైపుణ్యంలోనూ భారత ఆటగాళ్లపై ఆధిపత్యం ప్రదర్శించారు. ఇంజ్యూరీ టైమ్ తొలి నిమిషంలో పాక్‌కు ఆధిక్యం లభించింది. జునైద్ షా కుడివైపు నుంచి పంపిన క్రాస్‌ను అలంగీర్ ఘాజీ గోల్‌గా మలిచాడు. దీంతో తొలి అర్ధభాగం ముగిసే సమయానికి పాక్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.రెడ్ కార్డుతో మారిన మ్యాచ్రెండో అర్ధభాగంలో భారత జట్టు ఆటతీరును మార్చుకుంది. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన మాకార్టన్ నిక్సన్ భారత దాడులకు కీలకంగా మారాడు. విష్ణు పీవీకి రెండు మంచి అవకాశాలు సృష్టించినప్పటికీ వాటిని గోల్స్‌గా మలచలేకపోయారు.61వ నిమిషంలో మ్యాచ్ కీలక మలుపు తిరిగింది. భారత ఆటగాడు బ్రైసన్ ఫెర్నాండెజ్‌పై పాక్ ఆటగాడు జునైద్ షా ప్రమాదకరంగా టాకిల్ చేశాడు. బంతి నేలపై ఉండగా, జునైద్ తన బూట్ల స్టడ్స్‌తో బ్రైసన్ తొడ భాగాన్ని బలంగా తాకాడు. తొలుత రిఫరీ ఫ్రీకిక్ మాత్రమే ఇచ్చి ఎలాంటి కార్డు చూపించలేదు.అయితే వీడియో అసిస్టెంట్ రిఫరీ (VAR) జోక్యంతో ఘటనను పరిశీలించిన అనంతరం జునైద్‌కు రెడ్ కార్డు చూపించాడు. దీంతో పాక్ పది మంది ఆటగాళ్లతోనే ఆడాల్సి వచ్చింది.వరుసగా రెండు గోల్స్.. భారత్‌కు టైటిల్రెడ్ కార్డు ఘటన జరిగిన వెంటనే భారత్ స్కోరు సమం చేసింది. లుంగ్డిమ్ పంపిన క్రాస్ మాకార్టన్కు తగిలి సుహైల్ అహ్మద్ భట్ దగ్గరకు వెళ్లింది. అతడు ఏమాత్రం తడబడకుండా బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు. ఈ టోర్నీలో సుహైల్‌కు ఇది నాలుగో గోల్.ఆ తర్వాత భారత్ పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించింది. 88వ నిమిషంలో అబ్దుల్ రబీహ్ వేసిన కార్నర్‌ను సందీప్ మండీ అద్భుతమైన హెడర్‌తో గోల్‌గా మలిచాడు. దీంతో భారత్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.మిగిలిన సమయంలో పాకిస్తాన్‌కు మరో గోల్ చేసే అవకాశం ఇవ్వకుండా భారత ఆటగాళ్లు సమర్థంగా రక్షణ చేసుకున్నారు. చివరకు రిఫరీ పూర్తిస్థాయి విజిల్ ఇవ్వడంతో భారత శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి.పదోసారి సాఫ్ ఛాంపియన్‌గా భారత్ఈ విజయంతో భారత్ పదోసారి సాఫ్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలుచుకుంది. దాయాది పాకిస్తాన్‌పై ఫైనల్లో విజయం సాధించడంతో భారత ఫుట్‌బాల్ అభిమానులకు రెట్టింపు ఆనందం దక్కింది. తొలి అర్ధభాగంలో వెనుకబడినప్పటికీ పట్టుదలతో పోరాడి టైటిల్ సాధించడం భారత జట్టు సత్తాను చాటింది.ఇదీ చదవండి: భారత కెప్టెన్ పట్ల అనుచిత ప్రవర్తన
త్రిపురాన విజయ్ను రీటైన్ చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాకు చెందిన క్రికెట్ త్రిపురాన విజయ్ను ఢిల్లీ క్యాపిట ల్స్ రిటైన్ చేసుకుంది. విజయ్ను రూ.30 లక్షలకు రీటైన్ చేసుకుంటున్న ప్రకటించింది. దీంతో విజయ్‌తోపాటు వారి కుటుంబీకులు, జిల్లా క్రికెట్ సంఘం ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన అనధికారిక రెండు టెస్టు మ్యాచ్‌ల కోసం భారత–ఏ జట్టుకు ఎంపికైన విషయం తెలిసిందే. ఈ 24 ఏళ్ల యువ క్రికెటర్ దులిప్త్రోఫీలో సోత్జోన్కు ప్రాతినిధ్యం వహించడంతోపాటు భారత స్టార్ క్రికెటర్లు వైభవ్ సూర్యవంశీ, ఇషాన్కిషాన్ వంటి టాప్‌క్లాస్ బ్యాటర్లను ఔట్ చేశాడు. ఆల్‌రౌండర్‌గా కీర్తి గడించిన ఈ ఆఫ్ స్పిన్నర్ బ్యాటర్‌గానూ ఆకట్టుకుంటున్నాడు. వీటికితోడు బెస్ట్ ఫీల్డర్‌గా అనేక మ్యాచ్‌ల్లో రివార్డులు అందుకున్నాడు. దీంతో డీసీ విజయ్ను తన వద్దే అట్టిపెట్టుకుంది. గత రెండు సీజన్లలో పాల్గొన్న విజయ్‌కు రెండో సీజన్లో ఆడే అవకాశం లభించింది. ఇటీవల బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగిన ఎమర్జింగ్ పురుషుల క్రికెట్ టోర్నీ లో ఇండియా–బీ జట్టుకు ప్రాతినిధ్యం వహించి మెరిశాడు. విజయ్ కుటుంబం టెక్కలిలోని అయ్యప్పనగర్ కాలనీలో నివాసం ఉంటోంది.సంతోషంగా ఉంది.. ఐపీఎల్లో వరుసగా మూడో ఏడాది ఆడే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉంది. కేఎల్ రాహుల్, అక్షర్భాయ్, పంత్ వంటి క్రికెటర్లతో ఆడే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నాను. డీసీ తరఫున ఈ సీజన్లో ఆడే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. నాకు అన్ని విధాలగా సహకరిస్తున్న క్రికెట్ సంఘ పెద్దలు, కోచ్‌లు, నా తల్లిదండ్రులకు రుణపడి ఉంటాను. – త్రిపురాన విజయ్, క్రికెటర్
భారత కెప్టెన్ పట్ల అనుచిత ప్రవర్తన
ఏఎఫ్సీ అండర్-17 ఆసియా కప్ 2027 క్వాలిఫయర్స్‌లో భారత యువ ఫుట్‌బాల్ జట్టు అదరగొట్టింది. భారీ వర్షం, ప్రతికూల మైదాన పరిస్థితులను అధిగమించి పాలస్తీనాపై 4-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఫుట్‌బాల్ కంటే ఆటగాళ్ల అనుచిత ప్రవర్తనే చర్చనీయాంశంగా మారింది. భారత కెప్టెన్‌పై పాలస్తీనా ఆటగాడు అభ్యంతరకర సంజ్ఞ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే మరో ఆటగాడు ప్రమాదకర టాకిల్‌కు పాల్పడి రెడ్ కార్డు అందుకున్నాడు.Seriously?????? 😡😡😡 Palestine's No. 19 allegedly makes a racist gesture towards India U17 captain Gangte, yet the referee chooses to look the other way. The AFC cannot let this slide. An immediate investigation and strict action are needed!!!! https://t.co/9OgGqss2qc— The Khel India (@TheKhelIndia) November 17, 2026భారత కెప్టెన్‌పై వివాదాస్పద సంజ్ఞ..?మ్యాచ్ సందర్భంగా పాలస్తీనా ఆటగాడు భారత కెప్టెన్ గాంగ్టేను ఉద్దేశించి అభ్యంతరకరమైన సంజ్ఞ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై ఖేల్ ఇండియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. రిఫరీ ఈ విషయాన్ని పట్టించుకోలేదని, ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (AFC) వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.అయితే ఈ సంజ్ఞ జాతి వివక్షతో కూడుకున్నదా అనే విషయంపై అధికారిక నిర్ధారణ లేదు. దీనిపై ఏఎఫ్సీ నుంచి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.పాలస్తీనా ఆటగాడికి రెడ్ కార్డుమ్యాచ్లో మరో ఘటన తీవ్ర వివాదానికి దారితీసింది. భారత ఆటగాడిపై పాలస్తీనా ఫుట్‌బాలర్ ప్రమాదకరంగా టాకిల్ చేయడంతో పాటు, అతడి చేతిపై తొక్కి, తన్నినట్లు వీడియోల ద్వారా తెలుస్తోంది. ఈ ఘటనలో పాలస్తీనా ఆటగాడికి రిఫరీ రెడ్ కార్డు చూపించాడు.ఇదీ చదవండి: ధోని తమిళనాడు దత్తపుత్రుడు
న్యూస్ పాడ్‌కాస్ట్
ఏపీలో విద్యార్థుల ఫీజులపై పొంతన లేని లెక్కలు... సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
దూసుకొస్తున్న తుపాను అక్వాన్.. 19, 20 తేదీల్లో కోస్తాలో అతి భారీ వర్షాలు
పంచాయతీ ఎన్నికల్లోనూ పచ్చ అరాచకం.. వైఎస్సార్సీపీ బలంగా ఉన్న గ్రామాలే లక్ష్యంగా అడ్డగింతలు
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల్లోనూ అరాచకమే... సీఎం చంద్రబాబు డైరెక్షన్లో రెచ్చిపోతున్న పచ్చముఠాలు
ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశే కారణం... వైఎస్ జగన్ మండిపాటు
గొప్పలు తప్పితే.. ఆర్థిక అభివృద్ధి ఎక్కడ?... ఏపీ ప్రభుత్వ తీరుపై వైఎస్ జగన్ ధ్వజం
బాబు పీపీపీ స్కెచ్... ఇది పక్కా స్కామ్... ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలను తెగనమ్ముతున్నారు... ఏపీ సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం
డీఎస్సీ-2026పై అయోమయం.. రోస్టర్ ప్రకటించకుండా 2,721 పోస్టుల ప్రకటన
సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యంగ్యాస్త్రాలు
దేశవ్యాప్తంగా ఘనంగా దీపావళి సంబరాలు..
బిజినెస్
2 కంపెనీల లిస్టింగ్ బాట
న్యూఢిల్లీ: ప్రైమరీ మార్కెట్లకు దన్నుగా ఇటీవల జోరందుకున్న సెకండరీ మార్కెట్లు మరిన్ని కంపెనీల లిస్టింగ్‌కు దారి చూపుతున్నాయి. వెరసి తాజాగా రెండు కంపెనీలు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి అప్డేటెడ్, ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. తద్వారా ఇంటర్నెట్ కంపెనీ రెడిఫ్.కామ్, ఏఐ సంబంధిత సేవల సంస్థ మెగానెట్ టెక్ లిస్టింగ్ బాట పట్టాయి. వివరాలు చూద్దాం.. రూ. 600 కోట్లపై దృష్టి ఇంటర్నెట్ సేవల కంపెనీ రెడిఫ్.కామ్ ఇండియా పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 600 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా తాజా ఈక్విటీని జారీ చేసే ప్రణాళికల్లో ఉంది. ఇష్యూ నిధుల్లో రూ. 225 కోట్లు పెట్టుబడి వ్యయాలకు వెచ్చించనుంది. రెడిఫ్ వన్, రెడిఫ్ పే, రెడిఫ్ టీవీ ప్లాట్‌ఫామ్స్ అభివృద్ధి, విస్తరణకు ఈ నిధులు వినియోగించనుంది. మరో రూ. 183 కోట్లు మార్కెటింగ్, బ్రాండింగ్‌కు, మిగిలిన నిధులను ఇతర సంస్థల కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. కంపెనీ గోప్యతా మార్గంలో సెబీ నుంచి ఆగస్ట్‌లో అనుమతి పొందడంతో తాజాగా అప్డేటెడ్ ప్రాస్పెక్టస్‌ను సెబీకి అందించింది. కంపెనీ వివరాలివీ.. ఎవెన్యూస్‌ఏఐ లిమిటెడ్(గతంలో ఇనీ్ఫబీమ్ ఎవెన్యూస్)కు అనుబంధ సంస్థ రెడిఫ్.కామ్ ఇండియా 1996లో ఏర్పాటైంది. ఇంటర్నెట్ పోర్టల్, రెడిఫ్ న్యూస్ ద్వారా డిజిటల్ మీడియా సంస్థగా ప్రారంభమైంది. తదుపరి డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్ సీసీఎవెన్యూ, ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ ప్లాట్‌ఫామ్ బిల్డ్ఏబజార్ నిర్వాహక కంపెనీగా సేవలు విస్తరించింది. 1998లో ఉచిత ఈమెయిల్ సరీ్వస్ రెడిఫ్మెయిల్కు తెరతీసింది. 2007లో మనీవిజ్ ద్వారా వ్యక్తిగత ఫైనాన్స్ విభాగంలోకి ప్రవేశించింది. తదనంతర కాలంలో మొబైల్ అప్లికేషన్స్, ఎంటర్ప్రైజ్ ప్రొడక్టివిటీ టూల్స్, ఈకామర్స్ సరీ్వసులలో విస్తరించింది. ఆపై ఎంటర్ప్రైజ్ సేవలు రెడిఫ్ వన్ బ్రాండ్‌గా, బిల్డ్ఏబజార్.. రెడిఫ్ కామర్స్‌గా ఆవిర్భవించాయి. 2025 జూలైలో డిజిటల్ వీడియో, కంటెంట్ ప్లాట్‌ఫామ్.. రెడిఫ్ టీవీని ఆవిష్కరించింది. అదే ఏడాది డిసెంబర్లో ఎన్పీసీఐ అనుమతి పొందడంతో రెడిఫ్ పేకు తెరతీసింది. రూ. 740 కోట్లకు రెడీ హైఎండ్ కంప్యూటింగ్ సిస్టమ్స్, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ మెగానెట్ టెక్నాలజీస్ గ్లోబల్ లిమిటెడ్ రూ. 740 కోట్ల సమీకరణకు వీలుగా ఐపీవో బాట పట్టింది. దీనిలో భాగంగా రూ. 140 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 600 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 100 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, రూ. 11 కోట్లు రుణ చెల్లింపులకు, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ ఇలా మెగానెట్ టెక్నాలజీస్ గ్లోబల్ ప్రధానంగా ఏఐ సర్వర్లు, వర్క్స్టేషన్లు, డేటా సెంటర్ సొల్యూషన్లు, హైఎండ్ కంప్యూటింగ్ సిస్టమ్స్, స్టోరేజీ సొల్యూషన్లు, సాఫ్ట్వేర్, సంబంధిత సరీ్వసులు సమకూర్చుతోంది. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 2,600 కస్టమర్లకు సేవలు అందించింది. నవీముంబైలోని మహాపేలో వార్షికంగా 5,928 సర్వర్ల తయారీ సామర్థ్యం కలిగిన యూనిట్‌ను నిర్వహిస్తోంది. గతేడాది(2025–26) 2,621 సర్వర్లను రూపొందించింది. గతేడాది ఆదాయం రూ. 447 కోట్లకు బలపడగా.. నికర లాభం రూ. 38 కోట్లకు ఎగసింది. అంతక్రితం ఏడాది(2024–25) ఆదాయం రూ. 368 కోట్లుకాగా.. రూ. 30 కోట్ల నికర లాభం ఆర్జించింది. కంపెనీ కీలక కస్టమర్లలో బ్లాక్ బాక్స్, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్, ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్, వెస్టర్న్ డిజిటల్ టెక్నాలజీస్, యొట్ట డేటా సరీ్వసెస్ తదితరాలున్నాయి. ఫ్రాస్ట్ అండ్ సల్లివాన్ నివేదిక ప్రకారం ప్రస్తుత రూ. 45,510 కోట్ల విలువైన దేశీ ఏఐ సర్వర్ల మార్కెట్ 2032కల్లా రూ. 1,82,820 కోట్లకు జంప్‌చేయనున్నట్లు అంచనా. వెరసి వార్షికంగా 26 శాతం పురోగతిని సాధించనుంది.
టాప్ 40 సీహెచ్ఆర్వోల్లో రిలయన్స్ ఇరా బింద్రా
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా టాప్ 40 హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్స్ (సీహెచ్ఆర్వో) జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రెసిడెంట్ (పీపుల్ అండ్ టాలెంట్) ఇరా బింద్రా ర్యాంకు మరింత మెరుగుపడింది. గతేడాది 28వ ర్యాంకులో ఉండగా తాజాగా 19వ ర్యాంకు దక్కించుకున్నారు. అలాగే, ఈ గ్లోబల్ లిస్టులో వరుసగా రెండో ఏడాది భారత్ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ కావడం గనార్హం. అడ్వైజరీ సేవలందించే గ్లోబల్ సంస్థ ఎన్2గ్రోత్ ఏటా ఈ ర్యాంకులు ఇస్తుంది. తమ తమ సంస్థల పనితీరు, సిబ్బంది, వర్క్‌ప్లేస్ సంస్కృతిని సానుకూలంగా ప్రభావితం చేసిన టాప్ 40 మంది చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్లకు పురస్కారాలు ఇస్తుంది. ఈ ఏడాది ’స్పష్టత’ థీమ్ ఆధారంగా ర్యాంకులు ఇచ్చింది. అంతర్జాతీయ బిజినెస్, హ్యూమన్ రిసోర్సెస్ విభాగంలో బింద్రాకు 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. రిలయన్స్‌లో చేరడానికి ముందు ఆమె అమెరికాకు చెందిన మెడ్‌ట్రానిక్, జనరల్ ఎలక్ట్రిక్‌లో దాదాపు రెండు దశాబ్దాల పాటు సీనియర్ హోదాలో పని చేశారు.
ఏఐతో రెండేళ్లలోనే అందుబాటులోకి ఔషధాలు
న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఏఐ)తో ఔషధాలను అభివృద్ధి చేసే ప్రక్రియకు పట్టే సమయం గణనీయంగా తగ్గుతుందని బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా చెప్పారు. ప్రస్తుతం 5–7 ఏళ్లు పడుతుండగా, ఏఐని ఉపయోగించడం వల్ల కేవలం ఏడాది–రెండేళ్ల వ్యవధిలోనే ఔషధాలు ప్రయోగశాలల నుంచి పేషంట్లకు అందుబాటులోకి రాగలవని ఆమె తెలిపారు. దీనితో పేషంట్ల వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన ఔషధాలను కచ్చితత్వంతో రూపొందించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. బెంగళూరు టెక్ సదస్సు 2026 తొలి రోజున లైఫ్ సైన్సెస్‌లో ఏఐ పాత్ర గురించి ఆమె వివరించారు. ‘ఔషధాలను అభివృద్ధి చేయడమనేది కేవలం ల్యాబ్‌లకే పరిమితం కాదు. వాటిని సరైన పేషంట్లను ఎంచుకుని, క్లినికల్ ట్రయల్స్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షించాలి. ప్రస్తుతం ఒక మాలిక్యూల్‌ను ప్రయోగశాల నుంచి పేషంట్ల దగ్గరకు తీసుకెళ్లాలంటే దాదాపు ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకు సమయం పట్టేస్తోంది. ఏఐతో దాన్ని మనం ఏడాది లేదా రెండేళ్లకు తగ్గించగలమా? అలా జరిగితే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు‘ అని మజుందార్ షా తెలిపారు. ఔషధాలను కనుగొనడం, అభివృద్ధి చేయడం వేగవంతమవుతున్న నేపథ్యంలో నియంత్రణ నిబంధనలు కూడా దానికి తగ్గట్లుగా వేగవంతం కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఏఐతో జినోమిక్స్, న్యూరల్ నెట్వర్క్స్ మొదలైన వాటిని మేళవించడం ద్వారా కొత్త తరం ఔషధాలను, క్యాన్సర్ కణాల్లాంటి వాటిని ముందుగానే గుర్తించగలిగేలా వైద్యపరీక్షలను రూపొందించవచ్చని షా వివరించారు. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు జరిగే సదస్సులో వివిధ పరిశ్రమల నుంచి అంతర్జాతీయ ఎంట్రప్రెన్యూర్లు, ఆవిష్కర్తలు, ఇన్వెస్టర్లు తదితరులు పాల్గొంటున్నారు. ఇంజినీర్లకు సరికొత్తగా శిక్షణనివ్వాలి: క్రిస్ గోపాలకృష్ణన్ ప్రోగ్రామింగ్‌ను ఏఐ ఆటోమేట్ చేస్తోందని, అయితే ఈ టెక్నాలజీని ఇంకా పూర్తిగా విశ్వసించలేమని ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు ఎస్ గోపాలకృష్ణన్ తెలిపారు. ఈ నేపథ్యంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కో డింగ్‌కి పరిమితం కాకుండా ఏఐ రాసిన కోడ్‌ను సమీక్షించి, సరి్టఫై చేసే విధంగా వారికి కొత్త నైపుణ్యాల్లో శిక్షణనివ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐతో ప్రోడక్టులు, సరీ్వసులను రూపొందించేందుకు అనేకానేక కొత్త సంస్థలకు అవకాశాలు ఏర్పడినప్పటికీ రాబోయే మరికొంతకాలం పెద్ద కంపెనీలకు సంబంధించి ఐటీ సరీ్వసులు, ఔట్సోర్సింగ్ యథాప్రకారం కొనసాగవచ్చని టెక్ సమిట్‌లో పా ల్గొన్న సందర్భంగా వివరించారు. ‘ఏఐ వల్ల మిగతావాటిపై ప్రభావం పడుతుందనుకుంటే చిత్రంగా ప్రోగ్రామింగ్‌పైనే ముందుగా ప్రభావం చూపింది. అయితే, ఏఐని పూర్తిగా విశ్వసించలేము. అది తప్పులు చేయొచ్చు. కొన్ని సార్లు ఏదైనా కోడ్ లో కావాలనే బగ్‌ను చేర్చవచ్చు. ప్రస్తుతం ప్రో గ్రామర్లు ఏఐ కోడ్‌ను రివ్యూ చేయడం, సరి్టఫై చేయ డం తెలుసుకోవాల్సి ఉంటుంది. అది చేయాలంటే వారికి కోడ్‌పై అపారమైన పట్టు ఉండాలి. దీనికి మన సాఫ్ట్వేర్ ఇంజినీర్లు మళ్లీ సరికొత్తగా శిక్షణ పొందాల్సి ఉంటుంది‘ అని గోపాలకృష్ణన్ పే ర్కొన్నారు. ఔట్సోర్సింగ్ విషయానికొస్తే టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్‌లాంటి దిగ్గజాల అనుభవాన్ని వినియోగించుకోవాలని పరిశ్రమ కోరుకుంటుంది కాబట్టి.. ఔట్సోర్సింగ్ రాబోయే రోజుల్లో నూ కొనసాగవచ్చని వివరించారు. కన్సల్టింగ్, ఐటీ సరీ్వసుల కంపెనీలు కూడా యథాప్రకారంగానే ఉంటాయని పేర్కొన్నారు.
రెన్యూవబుల్స్‌పై అమెజాన్ ఫోకస్
న్యూఢిల్లీ: గ్లోబల్ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ దేశీయంగా భారీ పెట్టుబడులకు తెరతీస్తోంది. 2030కల్లా పునరుత్పాదక(రెన్యూవబుల్) ఇంధన ప్రాజెక్టులపై 7 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 67,000 కోట్లు) వెచ్చించే ప్రణాళికలు వేసింది. తద్వారా దేశీ శుద్ధ ఇంధన మార్కెట్లో మరింత విస్తరించాలని చూస్తోంది. కంపెనీ కార్యకలాపాలకు పెరుగుతున్న విద్యుత్ అవసరాల నేపథ్యంలో కర్బన ఉద్గారాలను తగ్గించుకునే లక్ష్యంతో అదనపు పెట్టుబడులకు తెరతీస్తున్నట్లు అమెజాన్ తాజాగా పేర్కొంది. దేశీయంగా ఇప్పటికే రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులపై 4 బిలియన్ డాలర్లు వెచ్చించిన కంపెనీ కర్బనరహిత ఇంధన కొనుగోలులో దేశీయంగా అతిపెద్ద కార్పొరేట్ దిగ్గజాలలో ఒకటిగా నిలవనుంది. మరోవైపు కొత్తగా నాలుగు భారీస్థాయి సోలార్, విండ్ ఎనర్జీ ప్రాజెక్టులను సైతం ప్రకటించింది. కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో ఏర్పాటు చేయనున్న వీటి ఉమ్మడి సామర్థ్యం 934 మెగావాట్లుకాగా.. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏలు) ద్వారా వీటికి తెరతీస్తోంది. ఇవి ప్రస్తుత 4 బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్ట్‌డ్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియోలో భాగంకావడం గమనార్హం! ఈ జాబితాలో కర్ణాటకలోని 234 మెగావాట్ల విండ్ ప్రాజెక్ట్, 200 మెగావాట్ల హైబ్రిడ్(సోలార్, విండ్) ప్రాజెక్ట్‌సహా మధ్యప్రదేశ్‌లోని 300 మెగావాట్ల సోలార్, రాజస్తాన్‌లోని 200 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులున్నాయి. ఇవన్నీ పూర్తయితే అమెజాన్ కాంటాక్ట్డ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టుల సామర్థ్యం 2 గిగావాట్లను మించనుంది. ఇది 3.5 మిలియన్ భారతీయ కుటుంబాల వార్షిక విద్యుత్ అవసరాలకు సమానమని అమెజాన్ పేర్కొంది.
ఫ్యామిలీ
వాల్‌స్ట్రీట్ వేదికపై మన ‘చిట్టి’ సైంటిస్ట్‌లు!
న్యూయార్క్ స్టాక్ ఎక్సే్ఛంజ్...దాని చారిత్రాత్మక బాల్కనీలో మన ముగ్గురు బాలికలు ఆనాటి ట్రేడింగ్ ముగింపు గంట మోగిస్తుంటే అందరూ మెచ్చుకోలుగా చప్పట్లు కొట్టారు. అమెరికాలోనే ప్రతిష్టాత్మకమైన ‘2026 3ఎం యంగ్ సైంటిస్ట్ ఛాలెంజ్’లో మొదటి మూడు స్థానాలను కైవసం చేసుకున్న భారత సంతతి బాలికలు రాజీ దోషి, ఆయిషా ఆసిఫ్, శార్వి మహాజన్ సాధించిన అరుదైన గౌరవం అది! పర్యావరణ సమస్యలకు తమ ప్రయోగశాలల్లో సమాధానాలు వెతకడం వల్లే వారికి ఈ గౌరవం.‘3ఎం ఎంగ్ సైంటిస్ట్ ఛాలెంజ్’.... అమెరికాలో పాఠశాల విద్యార్థుల కోసం నిర్వహించే ప్రతిష్టాత్మక సైన్స్ పోటీ. వేలమంది పాల్గొనే ఆ పోటీలో మన బాలికలు ‘పొగడరా నీ తల్లి భూమి భారతిని’ అన్నట్టుగా నిలిచారు. ఇన్నోవేషన్ దిగ్గజం 3ఎం నిర్వహించే ఈ పోటీలో 5 నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. రోజువారీ సమస్యలకు సైన్స్ ద్వారా పరిష్కారం చూపడం వీరు స్వీకరించే ఛాలెంజ్. అంటే ఇది చిన్న వయసులోనే సైంటిస్ట్లను బయటకు తీయడం. ఇలాంటి పోటీలో టాప్ 10గా నిలవడమే గొప్ప. అలంటింది అమెరికాలో స్థిరపడిన భారతీయ అమ్మాయిలకు ఈ సంవత్సరం మొదటి మూడు స్థానాలు దక్కాయి. మొదటి స్థానంలో నిలిచిన రాజీ దోషీకి 25 వేల డాలర్లు (21 లక్షలు) లభిస్తే, మిగిలిన ఇద్దరూ చెరో వెయ్యి డాలర్లు గెలుచుకున్నారు. వీరికి భవిష్యత్తులో సీనియర్ శాస్త్రవేత్తలతో పని చేసే వీలు లభిస్తుంది. దాని వల్ల వీరు ప్రపంచ స్థాయి ఆవిష్కర్తలుగా ఎదుగుతారు. ఇంతకూ మన పిల్లలు ఏం ఆవిష్కరించారు?పర్యావరణ ‘బంక’మనం రోజూ వాడే కెమికల్ గ్లూ గాలిలోకి విషపూరిత రసాయనాలను విడుదల చేస్తుందని, పైగా గ్లూ అతికించిన వస్తువులను విడదీయలేక పారేసి చెత్తను పెంచుతున్నామని ఫ్లోరిడాకు చెందిన 12 ఏళ్ల ఆయిషా ఆసిఫ్ గుర్తించింది. కృత్రిమ బంక కంటే సహజమైన బంక మంచిదని నిర్ణయించుకుంది. నత్తగుల్లల నుంచి ప్రకృతి నుంచి దొరికే పదార్థాలతో కాలుష్య రహిత ‘బయో–అడ్హెసివ్’ తయారు చేసింది. దీని ప్రత్యేకత ఏమిటంటే అవసరమైనప్పుడు గట్టిగా అతుక్కుని ఉంటుంది, మళ్లీ ఆ వస్తువును రిపేర్ చేయాలన్నా, రీసైకిల్ చేయాలన్నా సులభంగా విడదీయవచ్చు! ఈ వినూత్న ఆలోచన ఆయిషాకు జాతీయ స్థాయిలో రెండో స్థానాన్ని తెచ్చిపెట్టింది. ‘ప్రకృతే అన్నింటికి సమాధానం’ అంటోంది ఏడో తరగతి చదువుతున్న ఆయిషా.నిద్రమత్తును పసిగట్టే ‘స్మార్ట్ క్యాప్’కాలిఫోర్నియాకు చెందిన 14 ఏళ్ల శార్వి మహాజన్ కు చిన్నప్పటి నుంచీ మనిషి మెదడు పని తీరుపై విపరీతమైన ఆసక్తి. హైవేలపై డ్రైవర్లు నిద్రమత్తులోకి జారుకోవడం వల్ల జరుగుతున్న ఘోర ప్రమాదాలు ఆమెను ఆలోచింపజేశాయి. ఇందుకు విరుగుడుగా ఆమె తయారు చేసిందే ‘న్యూరోడ్రైవ్ అలర్ట్’ అనే స్మార్ట్ క్యాప్. మనం మామూలుగా పెట్టుకునే బేస్‌బాల్ క్యాప్‌లో అమర్చిన ఈఈజీ (ఉఉఎ) సెన్సార్లు డ్రైవర్ మెదడు తరంగాలను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ ఏమాత్రం నిద్రమత్తు కనిపించినా, వెంటనే స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా అలారం మోగించి డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ శార్వికి మూడో స్థానాన్ని అందించింది. ‘భవిష్యత్తులో న్యూరోసైన్స్, ఏఐలను కలిపి శారీరక వైకల్యం ఉన్నవారు నడిచే, మాట్లాడే వ్యవస్థ తయారు చేస్తాను’ అని శార్వి ఆత్మవిశ్వాసంతో చెబుతోంది.ఈ పిల్లలు అందరిలాంటి పిల్లలే. కాని ఆలోచన గొప్పగా చేశారు. అందుకు అవసరమైన ప్రయత్నం, ప్రయోగం చేశారు. విజయం సాధించారు. తరగతి గది పాఠాలను కేవలం పరీక్షల వరకే పరిమితం చేయకుండా, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని బాగుచేయ పూనుకున్నారు. రాజీ, ఆయిషా, శార్వి మన భారతీయ సంతతి అయినందుకు గర్వించాలి. ఎందుకంటే ఆడపిల్లలు తలుచుకుంటే సైన్స్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర రాయగలరని వాల్‌స్ట్రీట్ వేదిక సాక్షిగా వారు చాటి చెప్పారు. సముద్రపు కన్నీళ్లు తుడిచే ‘ఆల్కాకోర్’13 ఏళ్ల రాజీ దోషికి సముద్ర తీరంలో రంగురంగుల గవ్వలు ఏరుకోవడం ఇష్టం. కానీ వాతావరణ మార్పుల వల్ల సముద్రపు నీటిలో ఆమ్లగుణం పెరిగి గవ్వలు, వాటిలో ఉండే సూక్ష్మజీవులు కరిగిపోతున్నాయని ఆమె గ్రహించింది. పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కూడా తలలు పట్టుకుంటున్న ఈ సమస్యకు రాజీ పరిష్కారం ఆలోచించింది. సముద్రపు నాచు, అరగోనైట్ ఖనిజాలను కలిపి ‘ఆల్కాకోర్’ అనే సహజసిద్ధమైన పదార్థాన్ని రూపొందించింది. ఇది సముద్రపు నీటిలో కరిగి సముద్ర జీవులకు, సూక్ష్మజీవులకు రక్షణ కవచంలా నిలుస్తుందని నిరూపించింది. ఈ అద్భుత ఆవిష్కరణకు రాజీ ‘అమెరికాస్ టాప్ యంగ్ సైంటిస్ట్ 2026’ టైటిల్‌తో పాటు 25 వేల డాలర్ల (సుమారు రూ. 21 లక్షలు) బహుమతిని గెలుచుకుంది. ‘భవిష్యత్తులో నాసా ఇంజనీర్‌గా మారి, అంతరిక్షం నుంచే సముద్రాల ఆరోగ్యాన్ని పర్యవేక్షించే వ్యవస్థలను తయారు చేయాలన్నది నా కల‘ అని రాజీ తన ఆశయాన్ని పంచుకుంది.
క్షమించి..ఓడించడమే దీర్ఘాయువు..! బ్రయాన్ షాకింగ్ వ్యాఖ్యలు
ప్రముఖ అమెరికన్ టెక్నాలజీ పారిశ్రామికవేత్త, బయోహ్యాకర్ బ్రయాన్ జాన్సన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వృద్ధాప్యాన్ని తిప్పికొట్టి..దీర్ఘాయువుతో ఉండాలనే ప్రాజెక్టుతో వార్తల్లో నిలిచాడు. అందుకోసం తనపైనే పలు ప్రయోగాలు చేసుకుంటూ..చుట్టు వందలాది మంది డాక్టర్లతో కోట్లు వెచ్చించాడు. ఇప్పటికీ ఆ ప్రయోగాలతోనే సాగుతున్నా.. అతడు తాజాగా మన వేదాలు, భగవద్గీత, పురాణాలు ముక్తకంఠంతో నొక్కి చెప్పే సందేశాన్ని చెప్పి..అదే ‘దీర్ఘాయువు కళ’ అంటూ ఆశ్చర్యపర్చాడు. అతడి కారణంగా మరోసారి మన ఆధ్యాత్మికత గొప్పతనం వెలుగులోకి వచ్చింది. Longevity, Says Forgive Your Enemy: ఇదేంటి అనుకోకండి శత్రువుకి సైతం క్షమాభిక్ష పెట్టే దేశం మనది. వేద భూమి, కర్మభూమి. ఇక్కడ టెక్ మిలియనీర్ కూడా అదే అంశాన్ని ప్రస్తావించడంతో మన ఆధ్యాత్మిక శక్తి గొప్పతనం అఖండ జ్యోతిలా దశదిశలా వ్యాపిస్తూనే ఉందనడానికి తార్కణంగా నిలిచింది అతడి వ్యాఖ్యలు. ఇంతకీ బ్రయాన్ జాన్సన్ ఏమన్నారంటే..మీ శత్రువుని క్షమించండి. తద్వారా మీలో ఉన్న నెగిటివిటీ(ప్రతికూల శక్తిని)ని తొలగించుకోండి. అతడిపై ప్రతీకారం లేదా రియాక్షన్‌ని మీ లక్ష్యంపై లేదా దృఢ సంకల్పంపై పెట్టండి. తద్వారా అతడిని ఓడించండి అని పిలుపునిస్తున్నాడు. మనల్ని వ్యతిరేకించేవారికి ప్రతిస్పందన అంటే కీడు తలపెట్టడమో..రివైంజ్ తీర్చుకోవడమో కాదు. మన అభ్యున్నతి, బాగుండడమే అని చాలా చక్కగా చెప్పాడు. అదే దీర్ఘాయువుకి దోహదం చేస్తుందన్నాడు. అంతేగాదు ఆ విధానాన్ని దీర్ఘాయువు కళగా అభివర్ణించాడు. ‘క్షమించు, చర్య తీసుకో’ అనే నినాదాన్ని ప్రోత్సహిస్తున్నాడు. అంటే.. "క్షమించి సానుకూల శక్తిని ఆహ్వానించు. అది ఎదుగుదలపై ఏకాగ్రతతో ఫోకస్ పెట్టేలా చేసే చర్యగా మారుతుంది. అంతేతప్ప ప్రతికూలత భారాన్ని మోసి అనారోగ్యం పాలు కావొద్దని పిలుపునిస్తుండటం విశేషం.". ఇది మన వేదాలు, పురాణలు ఘోషించే చెప్పే ‘క్షమయే దైవం’ అన్న మాటను బ్రయాన్ ఇలా చెప్పాడని అధ్యాత్మిక వేత్తలు అనడం కొసమెరుపు.ఇదీ చదవండి: విడాకులు కూడా వివాహంలా వేడుకలు..! కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
విడాకులు కూడా వివాహంలా వేడుకలు..!
ఇటీవల కాలంలో పెళ్లిళ్లు మూణ్ణాళ్ల ముచ్చటలా ముగిసిపోతున్నాయి. కనీసం కొన్నేళ్లు కూడా సజావుగా సాగడం కష్టం అన్నట్లుగా ఉన్నాయి. కారణాలేమైనా ఆ తర్వాత జీవితం సాఫీగా సాగడం మహిళలకే కష్టంగా ఉంటుందన్నది జగమెరిగినా సత్యం. అయితే కొందరు ధీర వనితలు దాన్నే మార్చి తాము కూడా సంతోషంగా లైఫ్‌ని లీడ్ చేయగలమని చేసి చెబుతున్నారు. పైగాకొందరు మహిళామణులు అక్కడితో ఆగడం లేదు విడాకులు తీసుకున్న మహిళ కళంకిత కాదు అన్నట్లు తమదైన రీతిలో చెబుతున్నారు. కానీ ఇక్కడ ఈ మహిళ ఓ అడుగు ముందుకేసి..అందరు విస్తుపోయేలా వేడుకలు నిర్వహించింది. అది కూడా ఎలాగంటే..End of her marriage To Mark New Chapter: ఆ మహిళే 37 ఏళ్ల చో సియోంగ్-యోన్. తన అధికారిక విడాకులను పురస్కరించుకుని ఏకంగా వివాహం మాదిరిగా అట్టహాసంగా వేడుకలు నిర్వహించింది. అచ్చం పెళ్లిలో ధరించినట్లుగా తెల్లటి దుస్తుల ధరించి కేక్ కట్ చేసింది. అది కూడా బంధు మిత్రుల పరివార సమక్షంలో ఈ వేడుకలు జరుపుకోవడం విశేషం. అంతేగాదు అతిథులను ఉద్దేశిస్తూ చాలా భావోద్వేగంగా మాట్లాడింది. కన్నీళ్లు ఆపుకుంటూ .. వైవాహికం బంధ దూరమైనంత మాత్రన ఆమె గుర్తింపు లేని మనిషి కాదని, తనకు తాను తొలి.ప్రాధాన్యత ఇచ్చేలా చేసుకోవడానికి ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నట్లు పేర్కొంది. అంతేగాదు ప్రేమించబడటం కోసం తనని తాను తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే తనను తాను వదులుకోనంటూ..మనల్ని మనం ప్రేమించడం(సమున్నతంగా ఉంచడం) గురించి గుర్తు చేసిందామె. అంతే ఆమె మాట్లాడిన తీరుకి అక్కడున్న వారందరూ ఫిదా అవ్వడమే కాదు భావోద్వేగానికి లోనయ్యారు. తొలుత ఇదేంటి విడాకులు తీసుకుంటే వేడుకలు అని విమర్శించినా.. ఆమె వివరణ విన్నాక అంతా..వివాహబంధం ముగింపు అనేది జీవితానికే ఎండ్ కార్డు లాంటిది కాదని కొత్త ఆరంభమని చెప్పేలా ఆమె చేసుకున్న వేడుకను స్వాగతించారు, ప్రశంసించారు కూడా. నెటింట కూడా చాలామంది ఎంత గొప్ప ఆలోచన అంటూ మెచ్చుకొంటూ పోస్టులు పెట్టారు. అంతేగాదు విడాకులనేవి కూడా వివాహంలానే సాధరణమైనదే, అలాగని విడాకులను ప్రోత్సహించడం లేదు. కేవలం డైవర్స్ తర్వాత జీవితాన్ని చక్కగా ప్రారంభించడం గురించి అని ముక్తకంఠంతో నినదించడం విశేషం. అంతేగాదు నెటిజన్లు విడాకులు తీసుకుని కూడా ఎంతో హుందాగా ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నవారికి కచ్చితంగా మద్దతు ఉంటుందని అభిప్రాయ వ్యక్తం చేశారు కూడా. కాగా, దక్షిణ కొరియాలో విడాకులు తీసుకున్న మహిళలను చాలా అవహేళనగా చూస్తుంటారు. దాన్ని సవాలు చేస్తూ చో అనే మహిళ వివాహ వ్యవస్థకు అతితంగా తన గుర్తింపును తిరిగి పొందడం అని తనదైన రీతిలో చాటి చెప్పింది. పైగా వివాహ బంధం ముగియడాన్ని కష్టతరమైన అనుభవం కాదు..కొత్త జీవిత ప్రారంభం అంటూ తనలాంటి వాళ్లలో ఆశను కలిగించేలా ప్రేరణగా నిలిచింది. View this post on Instagram A post shared by 승연 | 이혼식 · 쌍둥이 싱글맘 (@aprilsycho) ఇదీ చదవండి: ‘అందరం సమానం’ అని కుమారుడి భలే నేర్పించాడు ఈ తండ్రి..! వీడియో వైరల్
చలికాలంలో కాలుష్యం: ఊపిరితిత్తులు జాగ్రత్త..!
ముప్పేటదాడి అనే మాట వినే ఉంటారు. మొన్ననే ముగిసిన టపాసుల నుంచి వెలువడిన రసాయన కాలుష్యాలు ఒకవైపు, ఇక నిత్యం మన వాహనాలు, పరిశ్రమలు, విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడుతూ గాలిలోకి కలిసిన కాలుష్యాలతో అమాంతం పెరిగిపోయిన ఏక్యూఐ (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) ఇంకోవైపు... ఇక మరోవైపున... ఈ సీజన్ కాస్తా చలికాలం కావడంతో గాలిలోని పొగ ప్లస్ మంచు కలిసి ఏర్పడే స్మాగ్‌లో ఇరుక్కుపోయి కాలుష్యాలన్నీ ఒకచోట పేరుకుపోయి ఈ మూడూ కలసి మన కళ్లమీదా, ఊపిరితిత్తుల మీదా, ఆరోగ్యం మీద ముప్పేట దాడి చేస్తున్నాయి. మనం పీల్చే గాలితో పాటు ఊపిరితిత్తుల్లోకి చేరే సూక్ష్మ కాలుష్య కణాలు శ్వాసకోశ వ్యవస్థతోపాటు గుండె, రక్తనాళాలపైనా ప్రభావం చూపుతూ... ముఖ్యంగా వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉండే పిల్లలు, వృద్ధులుపై ఎలాంటి ప్రభావాలు చూపుతాయో తెలుసుకుందాం.సాధారణంగా గాలి కదులుతూ ఉంటే కాలుష్య కారకాలు ఒకచోట పేరుకుపోకుండా ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తాయి. కానీ చలికాలంలో కొన్ని వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ప్రక్రియ మందగిస్తుంది. సాధారణ పరిస్థితుల్లో భూమికి దగ్గరగా ఉండే గాలి వేడెక్కి పైకి వెళుతుంది. దాంతో గాలి కదలికలు ఏర్పడి కాలుష్య కారకాలు కూడా కొంతవరకు పైకి వ్యాపిస్తాయి. అయితే చలికాలంలో కొన్ని సందర్భాల్లో దీనికి భిన్నమైన పరిస్థితి ఏర్పడుతుంది. దీనినే ‘టెంపరేచర్ ఇన్వర్షన్ అంటారు.ఈ పరిస్థితిలో భూమికి దగ్గరగా చల్లని గాలి, దాని పైన వెచ్చని గాలి పొర ఏర్పడతాయి. పైభాగంలోని వెచ్చని గాలి ఒక మూతలా పనిచేస్తూ కింద ఉన్న చల్లని గాలి పైకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. దీంతో భూమికి దగ్గరగా ఉన్న కాలుష్య కారకాలు కూడా అక్కడే చిక్కుకు΄ోతాయి. గాలి వేగం తక్కువగా ఉన్నప్పుడు పరిస్థితి మరింత తీవ్రమవుతుంది.వాహనాల పొగ, పరిశ్రమల నుంచి వెలువడే ఉద్గారాలు, నిర్మాణ పనుల దుమ్ము, చెత్తను కాల్చడం వంటి వాటి వల్ల ఇప్పటికే గాలిలో ఉన్న కాలుష్యం ఇలా ఒకేచోట పేరుకుపోతుంది. ఈ నేపథ్యంలో గాలి ఎటూ వెళ్లకుండా భూమికి దగ్గరే ఉన్న సమయంలో పొగ ప్లస్ మంచు (స్మోక్ ప్లస్ ఫాగ్) కలిసి ఏర్పడే స్మాగ్‌లో రసాయనాలూ, కాలుష్యాలూ చిక్కుకుపోయి నేలకు దగ్గరగా ఉంటూ ఆ కాలుష్యం నుంచి ప్రయాణం చేసేవారి ఆరోగ్యాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇక వర్షాకాలానికి ముందు వీచే బలమైన గాలులు, దుమ్ము తు΄ానులు కూడా కొన్ని ప్రాంతాల్లో గాలిలో పీఎమ్10 వంటి ధూళి కణాల మోతాదును పెంచుతాయి. అంటే కాలుష్యానికి మానవ కార్యకలాపాలతోపాటు కొన్ని సహజ వాతావరణ పరిస్థితులూ తోడవుతున్నాయి.మరో కాలుష్య కారకం... గ్రౌండ్ లెవల్ ఓజోన్వాహనాలు, విద్యుత్ కేంద్రాలు, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్య కారకాలు మరో ప్రమాదకరమైన వాయువును కూడా సృష్టిస్తాయి. అదే గ్రౌండ్ లెవల్ ఓజోన్ సాధారణంగా ఓజోన్ అనగానే మనకు భూమికి ఎగువన ఉండే ఓజోన్ పొర గుర్తుకొస్తుంది. ఆ పొర సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన అల్ట్రా వయొలెట్ కిరణాల నుంచి భూమిపై జీవరాశిని రక్షిస్తుంది. కానీ ఇలా భూమికి దగ్గరగా, మనం పీల్చే గాలిలో ఏర్పడే ఓజోన్ మాత్రం మనుషులకు హానిచేసే మరో రకమైన కాలుష్య కారకం.వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే నైట్రోజన్ ఆక్సైడ్స్, అస్థిర కర్బన సమ్మేళనాలు (వోలటైల్ ఆర్గానిక్ కాంపౌడ్స్–వీవోసీస్) సూర్యరశ్మి సమక్షంలో రసాయన చర్యలకు లోనైనప్పుడు ఈ ఓజోన్ ఏర్పడుతుంది. ఇది స్మాగ్లోని ప్రధానమైన భాగాల్లో ఒకటి. ఈ గ్రౌండ్ లెవల్ ఓజోన్ను పీల్చడం వల్ల దగ్గు, గొంతులో మంట, ఛాతీలో అసౌకర్యం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలగవచ్చు. ముఖ్యంగా ఆస్తమా, బ్రాంకైటిస్, ఎంఫిసీమా వంటి సమస్యలున్నవారిలో లక్షణాలు తీవ్రమయ్యే అవకాశం ఉంది. పిల్లలు, వృద్ధులు, బయట ఎక్కువసేపు శారీరక శ్రమ చేసే వారిపైనా దీని ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు.. టపాసుల పొగలో ఏముంటుంది?బాణసంచా కాల్చినప్పుడు వెలువడే పొగలో పీఎమ్ (పార్టికిల్ మ్యాటర్) 2.5 నుంచి పీఎమ్ 10 వరకు ధూళికణాలతో పాటు సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్, కార్బన్ మోనాక్సైడ్, వంటి ఆరోగ్యానికి చేటు చేసే వాయువలతో పాటు కొన్ని లోహాల కణాలు కూడా ఉండవచ్చు. బాణసంచాలో ఉపయోగించే రసాయనాలను బట్టి వాటి మోతాదులు మారుతుంటాయి.వీటిలో పీఎమ్10 కణాల పరిమాణం 10 మైక్రోమీటర్లు లేదా అంతకంటే తక్కువగా ఉంటుంది. పీఎమ్ 2.5 కణాల పరిమాణం మాత్రం 2.5 మైక్రోమీటర్లు లేదా అంతకంటే తక్కువ. మన వెంట్రుక మందంతో పోలిస్తే ఇవి చాలా సూక్ష్మమైనవి. అందుకే అవి మనం పీల్చినప్పుడు ముక్కు, గొంతు దగ్గరే ఆగిపోకుండా ఊపిరితిత్తుల్లోని లోతైన భాగాల వరకు చేరగలవు. పీఎమ్ 2.5 కణాల్లో కొన్ని ఊపిరితిత్తులను సైతం దాటి రక్తప్రవాహంలోకి కూడా ప్రవేశించగలవు.బాణాసంచా ప్రభావం ఇలా... టపాసుల పొగకు కొద్దిసేపు గురైనా కొందరిలో కళ్లు, ముక్కు, గొంతులో మంట, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇప్పటికే ఆస్తమా లేదా ఇతర ఊపిరితిత్తుల సమస్యలున్నవారిలో అవి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చిన తర్వాత గాలిలో సూక్ష్మ ధూళి కణాలు, కొన్ని లోహాల మోతాదులు గణనీయంగా పెరుగుతాయని పలు పరిశోధనలు కూడా గుర్తించాయి.కాలుష్యం నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి?వాయు కాలుష్యాన్ని పూర్తిగా నివారించడం ఒక్క వ్యక్తి చేతుల్లో ఉండదు. ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, పరిశ్రమలు, ప్రజల సంయుక్త కృషి అవసరం. అయితే... వ్యక్తిగతంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కాలుష్యానికి గురయ్యే అవకాశాల్ని తగ్గించుకోవచ్చు.1. ఏక్యూఐని గమనించడం: బయటకు వెళ్లే ముందు మీ ప్రాంతంలోని గాలి నాణ్యతను పరిశీలించండి. ఏక్యూ ఎక్కువగా ఉన్నప్పుడు ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గుండె లేదా ఊపిరితిత్తుల సమస్యలున్నవారు బయట ఎక్కువసేపు గడపకూడదు.2. వ్యాయామ సమయాన్ని మార్చుకోవడం: కాలుష్యం ఎక్కువగా ఉన్న రోజుల్లో బయట జాగింగ్, సైక్లింగ్, వేగంగా నడవడం వంటి వ్యాయామాలు తగ్గించాలి. అవసరమైతే ఇంట్లోనే వ్యాయామం చేసుకోవచ్చు. కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు లోతుగా, వేగంగా గాలి పీల్చడం వల్ల ఎక్కువ కాలుష్య కణాలు ఊపిరితిత్తుల్లోకి చేరే అవకాశం ఉంటుంది.3. అవసరమైతే ఎన్ 95 మాస్క్ వాడటం: కాలుష్యం అధికంగా ఉన్నప్పుడు బయటకు వెళ్లక తప్పని పరిస్థితుల్లో ముక్కు, నోటికి సరిగ్గా అమరే ఎన్ 95 లేదా ఎన్ 99 మాస్క్ వాడటం వల్ల పీఎమ్ 2.5, పీఎమ్ 10 వంటి సూక్ష్మ కణాల నుంచి కొంత రక్షణ లభిస్తుంది. సాధారణ గుడ్డ మాస్కులు, స్కార్ఫ్‌లు ఈ సూక్ష్మ కణాలను సమర్థంగా అడ్డుకోలేవు. ఎన్ 95 మాస్క్ కూడా ఓజోన్ , కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయు కాలుష్య కారకాల నుంచి రక్షణ ఇవ్వదు.4. ఇంటి లోపలి గాలినీ శుభ్రంగా ఉంచడం: బయట కాలుష్యం ఉందని ఇంట్లోకి వచ్చాక పూర్తిగా సురక్షితంగా ఉన్నట్లు కాదు. వంట పొగ, సిగరెట్ పొగ, అగరబత్తులు, దోమల నివారణ కోసం కాల్చే పదార్థాల పొగ కూడా ఇంటి లోపలి గాలిని కలుషితం చేయవచ్చు. వీలైనంత వరకు పొగకు దూరంగా ఉండాలి. అవసరమైనప్పుడు గాలి ప్రసరణకు అనుకూలమైన విధంగా కిటికీలు తెరవాలి. బయట కాలుష్యం తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రం కిటికీలు మూసి ఉంచడం మంచింది.5. వైద్యులు సూచించిన మందులు అందుబాటులో ఉంచుకోవడం: ఆస్తమా, సీవోపీడీ వంటి దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలున్నవారు వైద్యులు సూచించిన మందులు, ఇన్హేలర్లను క్రమం తప్పకుండా వాడాలి. కాలుష్యం పెరిగిన రోజుల్లో లక్షణాలు తీవ్రమవుతున్నాయా అని గమనించాలి. మందుల మోతాదును సొంతంగా మార్చుకోకూడదు.6. టీకాలు వేయించుకోవడం: ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులున్నవారు వైద్యుల సలహా మేరకు ఫ్లూ (ఇన్ఫ్లుయెంజా), న్యుమోకాకల్ టీకాలు వేయించుకోవాలి. ఇవి వాయు కాలుష్యం నుంచి రక్షించకపోయినా, కొన్ని శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల ముప్పును తగ్గించడంలో సహాయపడతాయి.7. లక్షణాలు పెరిగితే నిర్లక్ష్యం తగదు: దగ్గు, పిల్లికూతలు, ఆయాసం, ఛాతీలో బిగుతు వంటి లక్షణాలు సాధారణం కంటే ఎక్కువగా కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి. తీవ్రమైన శ్వాస ఇబ్బంది, ఛాతీనొప్పి లేదా పెదవులు నీలం రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అత్యవసర వైద్యసహాయం తీసుకోవాలి.ఊపిరితిత్తులపై ఎలాంటి ప్రభావం?మనం పీల్చే గాలిలోని కాలుష్య కణాలు శ్వాసనాళాల్లోకి చేరినప్పుడు అక్కడ వాపు ప్రక్రియ (ఇన్ఫ్లమేషన్), ఆక్సిడేటివ్ స్ట్రెస్‌కు దారితీయవచ్చు. దీనివల్ల శ్వాసనాళాల లోపలి పొరలు దెబ్బతినడం, కఫం పెరగడం, శ్వాసనాళాలు కుంచించుకు΄ోవడం వంటి పరిణామాలు సంభవించవచ్చు.ఇప్పటికే ఆస్తమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీవోపీడీ), ఇంటస్టీషియల్ లంగ్ డిసీజ్ (ఐఎల్‌డీ) వంటి సమస్యలున్నవారిలో దగ్గు, పిల్లికూతలు, ఆయాసం, ఛాతీలో బిగుతు వంటి లక్షణాలు పెరగవచ్చు. సీవోపీడీ బాధితుల్లో కాలుష్యానికి గురికావడం వల్ల వ్యాధి ఒక్కసారిగా తీవ్రమై ఊపిరి అందడం చాలా కష్టమయ్యే (అక్యూట్ ఎగ్జాసెర్బేషన్) పరిస్థితి ఏర్పడవచ్చు. దీనివల్ల అత్యవసర వైద్యసేవలు, తక్షణ ఆసుపత్రి చికిత్స అవసరమమ్యే ముప్పు ఉంటుంది.తీవ్రమైన వైరల్ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుంచి కోలుకుంటున్నవారిలోనూ కాలుష్యం వల్ల దగ్గు, శ్వాస ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది. పొగతాగే అలవాటున్నవారు, వృద్ధులు, చిన్నపిల్లలు కూడా మరింత జాగ్రత్తగా ఉండాలి.ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పు కూడా... వాయు కాలుష్యానికి దీర్ఘకాలం గురికావడం ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పును పెంచే అంశాల్లో ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (ఐఏఆర్సీ) ఆరుబయటి వాయు కాలుష్యాన్ని, అందులోని ధూళి కణాలను క్యాన్సర్ కారకాలుగా పేర్కొంది. అయితే ఒకటి రెండు రోజులు కాలుష్యానికి గురికావడం వల్ల వెంటనే క్యాన్సర్ వస్తుందని కాదు. దీర్ఘకాలం పాటు కాలుష్యానికి గురికావడం వల్ల ఈ ముప్పు పెరుగుతుంది. పొగతాగడం వంటి ఇతర ప్రమాద కారకాలతో కలిసినప్పుడు ఈ సమస్య మరింత తీవ్రం, త్వరితం అవుతుంది.డాక్టర్ రమణ ప్రసాద్, సీనియర్ స్లీప్ స్పెషలిస్ట్, పల్మునాలజిస్ట్ నిర్వహణ యాసీన్ఇదీ చదవండి: Smarter Money Decisions: డబ్బు నిలవాలంటే..ఈ జంట చెప్పే మనీ హ్యాక్స్ ఇవే..!
అంతర్జాతీయం
సహకారం బలోపేతం చేసుకుందాం
మనీలా: ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఫిలిప్పైన్స్‌లో సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్, థాయ్‌లాండ్ అనుటిన్ చార్న్విరాకుల్తో వేర్వేరుగా సమావేశమయ్యారు. ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఆయా దేశాలతో సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలపై సంప్రదింపులు జరిపారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. లారెన్స్ వాంగ్‌తో జరిగిన సమావేశంలో.. పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలు, సెమీకండక్టర్లు, అధునాతన తయారీ రంగాలపై చర్చించారు. ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై మాట్లాడుకున్నారు. సింగపూర్ ప్రధానితో ఫలప్రదమైన సమావేశం జరిగిందని మోదీ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ‘‘భారతదేశానికి సింగపూర్ ఒక విలువైన భాగస్వామి. రాబోయే కాలంలో మా సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఆశిస్తున్నాం’’అని వివరించారు. వచ్చే ఏడాది ‘ఆసియాన్’కు సింగపూర్ సారథ్యం వహించనున్న నేపథ్యంలో మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడంపై థాయ్‌లాండ్ ప్రధానితో మోదీ చర్చించారు. ‘‘భారత్, థాయిలాండ్‌లు సముద్ర సరిహద్దు పొరుగు దేశాలు. శతాబ్దాల ఉమ్మడి చరిత్ర, సంస్కృతి, ఆధ్యాతి్మక సంప్రదాయాలతో ముడిపడి ఉన్నాయి’’అని మోదీ పేర్కొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, అనుసంధానం, డిజిటల్ టెక్నాలజీ, ఫిన్‌టెక్, సంస్కృతి, పర్యాటకం, ప్రజల మధ్య సంబంధాలు వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై సంప్రదింపులు జరిగాయి. గురుద్వారాలో మోదీ ప్రార్థనలు మనీలా నగరంలో పురాతన గురుద్వారాను మోదీ మంగళవారం సందర్శించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గురుద్వారా పునరి్నర్మాణానికి పునాది రాయి వేశారు. శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన ‘గురుద్వారా ఖల్సా దివాన్’ను సందర్శించడం ఎంతో ఆనందం కలిగించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెనేటర్ ఫ్రాన్సిస్ జోసెఫ్ ఎసు్కడెరో, మనీలా మేయర్ ఫ్రాన్సిస్కో ఇస్కో మోరెనోతో సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గురుద్వారా ఖల్నా దివాన్ ఒక శతాబ్దానికి పైగా భారత్, ఫిలిప్పైన్స్ మధ్య సజీవ సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలకు నిదర్శనంగా నిలిచిందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ గురుద్వారాను మొదట 1901లో స్థాపించారు. 1924లో ఖల్సా దివాన్‌గా మారింది.
ఉక్రెయిన్ దాడిలో కెర్చ్ వంతెన ధ్వంసం
మాస్కో: ఆక్రమిత క్రిమియా దీవిని కలుపుతూ రష్యా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కెర్చ్ వారధిపై ఉక్రెయిన్ దాడికి పాల్పడింది. మిస్సైళ్లు, డ్రోన్లతో జరిపిన దాడిలో వంతెన కొంతభాగం ధ్వంసమైంది. దీంతో, రష్యా ప్రధాన భూభాగం నుంచి క్రిమియాకు వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. డ్రోన్లు, మిస్సైళ్లతో కెర్చ్ వంతెనను ధ్వంసం చేసినట్లు మంగళవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. రక్షణ వ్యవస్థలు, రాడార్లు, ఎల్రక్టానిక్ వార్ఫేర్ పరికరాలు, ఇతర లక్ష్యాలన్నిటినీ నిరీ్వర్యం చేస్తూ సోమవారం రాత్రి తుది దాడి చేపట్టామన్నారు. గత కొన్ని వారాలుగా ఈ ఆపరేషన్‌ను ఏడు దశల్లో అమలు చేశామన్నారు. దేశీయంగా అభివృద్ధి పరిచిన లాంగ్ రేంజ్ డ్రోన్లతో వంతెనలోని రోడ్డు సెక్షన్‌ను, నెప్ట్యూన్ మిస్సైళ్లు, ఇతర డ్రోన్లతో రైల్ సెక్షన్‌ను ఢీకొట్టామని, అనంతరం ఫ్లెమింగో గైడెడ్ మిస్సైళ్లతో ఆపరేషన్‌ను ముగించామన్నారు. చివరగా రష్యాను ఊహించని రీతిలో తిరుగులేని విధంగా దెబ్బ కొట్టామన్నారు. ఈ దాడిలో వంతెనలోని రోడ్డు భాగం కొంతమేర పూర్తిగా ధ్వంసం కావడంతో రోడ్డు లింకు తెగిపోయింది.
అమెరికా గడ్డపై ఇరాన్ డర్టీ బాంబు?
న్యూఢిల్లీ: అమెరికా రాజధాని వాషింగ్టన్‌పై ఇరాన్ డర్టీ బాంబు లేదా రసాయన బాంబుతో దాడి చేసే అవకాశముందని ఆ దేశ నిఘా వర్గాలు హెచ్చరించినట్లు వార్తా సంస్థ సీఎన్ఎన్ తెలిపింది. ట్రంప్ ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు ఎవరెవరిపై ఏ ఏ ప్రాంతాల్లో దాడులు జరగవచ్చో కూడా తమకు తెలుసునని అమెరికన్ అధికారులు చెబుతున్నట్లు సీఎన్ఎన్ తెలిపింది. నిఘా వర్గాలు అందించిన ఈ సమాచారంతో వైట్‌హౌస్ కూడా అప్రమత్తమైందని, అధికార ప్రతినిధి లారెన్ బిస్ ‘‘పరిస్థితిని సమీక్షిస్తున్నాం. కానీ ప్రస్తుతానికైతే అమెరికాకు విశ్వసనీయమైన ముప్పు ఏదీ లేదు’’అని ప్రకటించిన విషయాన్ని సీఎన్ఎన్ గుర్తు చేసింది. ఇరాన్ డర్డీ బాంబు దాడి సమాచారం వెనుక కొద్దో గొప్పో వాస్తవం లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు. మినాబ్ పాఠశాలపై దాడులకు ఆదేశాలిచ్చారన్న కారణంతో ఇద్దరు అమెరికా నావికాదళ అధికారులను ఇరాన్ ఇటీవలే బెదిరించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 123 మంది బాలికలు మరణించారు. అంతకుముందు అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ను ఇంటి నుంచి మిలిటరీ బేస్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ డర్టీ బాంబు లేదా రసాయన బాంబులతో అమెరికాపై దాడి చేసినా చేయవచ్చునని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ‘‘అయితే ఇరాన్ ఈ దాడులు కచ్చితంగా చేస్తుందా? లేదా? తగిన సిబ్బంది ఉన్నారా? అన్నది చర్చనీయాంశం’’అని అమెరికన్ అధికారిని ఉటంకిస్తూ సీఎన్ఎన్ తెలిపింది. గత వారం రోజుల్లో దాడులను తిప్పికొట్టడం అనే అంశంపై చర్చలు జరిగినట్లు రెండు వర్గాల నుంచి సమాచారం అందినట్లు తెలిపింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తోపాటు, విశ్రాంత అమెరికా అధికారుల హత్యకు ఇరాన్ ప్లాన్ చేస్తోందని, 2024లో ట్రంప్‌పై జరిగిన దాడి అందులో భాగమేనని నిఘా వర్గాల నివేదిక ఒకటి తెలిపింది. ఏమిటీ డర్టీ బాంబు... అమెరికా గడ్డపై ఇరాన్ ఏ రకమైన దాడి చేయగలిగినా అది ఆ దేశానికి పెద్ద విజయమే అవుతుంది. తాము తలచుకుంటే ఎంతదాకైనా వెళ్లగలమన్న సంకేతం ట్రంప్‌కు అందించినట్లు అవుతుంది. అయితే డర్టీ బాంబుల్లాంటి వాటితో సమస్య మరింత జటిలమవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇది అణ్వాయుధం కాదు. కానీ కొన్ని కిలోమీటర్ల దూరం వరకూ ప్రమాదకరమైన రేడియోధారి్మకతను వెదజల్లగలదు. అయితే రేడియో ధారి్మకతతో వెంటనే ప్రాణాలు పోకపోవచ్చు కానీ.. పేలుడు ధాటికి మరణాలు సంభవించే అవకాశాలు ఎక్కువ. పైగా డర్టీ బాంబు కోసం స్మగ్లింగ్ చేయాల్సిన పని లేదు. అమెరికాలో ఉన్న వారి సాయంతోనే అక్కడికక్కడ డర్టీ బాంబు తయారు చేయవచ్చు. బాంబు తయారీకి అవసరమైన పదార్థాలను అమెరికాలోనే సేకరించి ఉంచే అవకాశాలపై ఇరానియన్లు చర్చించుకున్నట్లు తెలిసిందని సీఎన్ఎన్ విశ్వసనీయ వర్గాలను ప్రస్తావిస్తూ తెలిపింది. డర్టీ బాంబుతో ప్రజలు అనారోగ్యం పాలు కావచ్చునని, కొన్ని ప్రాంతాల్లో నివసించే అవకాశం లేకుండా పోతుందని వారు చెబుతున్నారు. ఒకవేళ ఇరాన్ డర్టీ బాంబు స్థానంలో రసాయన బాంబును వాడితే అమెరికా దళాలు ఆ ప్రభావాన్ని ఎదుర్కొనే పరిస్థితి లేదని స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో రానున్న కొన్ని వారాలు అమెరికా భద్రతకు చాలా కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది.
‘సహకారం’తోనే భవిష్యత్తు
మనీలా: స్వేచ్ఛాయుతమైన, సమ్మిళితమైన, నియమాలపై ఆధారపడిన ఇండో–పసిఫిక్ ప్రాంతాన్ని భారత్ ఆకాంక్షిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దీని భవిష్యత్తు ‘పోటీపై కాకుండా, సహకారంపై’ఆధారపడి ఉంటుందని అన్నారు. ఇండో–పసిఫిక్‌లో ఆధిపత్యం చెలాయించేందుకు చైనా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మంగళవారం ఫిలిప్పీన్స్‌లో ఇండియా, ద అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్(ఆసియాన్) 23వ శిఖరాగ్ర సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తొమ్మిది కీలక ప్రతిపాదనలను తెరపైకి తీసుకొచ్చారు. అనుసంధానం పెంచడం, నావికుల భద్రత కోసం దీర్ఘకాలిక సముద్ర ప్రణాళిక, కూటమిలోని సభ్య దేశాల పర్యాటకులకు ఉచితంగా ఈ–వీసాలు, గనుల తవ్వకం, కీలక ఖనిజాలపై సహకారం, ఉమ్మడి సైబర్ ఫోరెన్సిక్స్ శిక్షణా కార్యక్రమం, పౌర అణుశక్తి రంగంలో సాంకేతిక మారి్పడుల కోసం ఫ్రేమ్‌వర్క్ ఏర్పాటు వంటివి ఇందులో ఉన్నాయి. ఆసియాన్‌తో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి భారత్ ఇస్తున్న ప్రాముఖ్యతను మోదీ వివరించారు. ఈ ప్రాంతంలో, వెలుపల కూడా శాంతి, స్థిరత్వం కోసం భాగస్వామ్య పక్షాలు కలిసి పనిచేయాలని పేర్కొన్నారు. ప్రపంచ అనిశి్చతుల నేపథ్యంలో ఈ భాగస్వామ్యం ఒక కొత్త కోణాన్ని సంతరించుకుందని వ్యాఖ్యానించారు. భారతదేశపు ‘యాక్ట్ ఈస్ట్’విధానం ఆసియాన్ దేశాలతో సంబంధాలకు కొత్త ఊపునిచ్చిందని తెలిపారు. సామర్థ్యం, ఉమ్మడి సంకల్పం ఉన్నాయి గత కొన్నేళ్లుగా ప్రపంచం వరుసగా సంక్షోభాలను ఎదుర్కొంటోందని ప్రధానమంత్రి గుర్తుచేశారు. నేడు ప్రపంచానికి శాంతి, స్థిరత్వం, ఊహించదగిన పరిస్థితులు అవసరమని అన్నారు. ఈ ఏడాది శిఖరాగ్ర సమావేశం ఇతివృత్తం ‘మన భవిష్యత్తును కలిసి నిర్మించుకుందాం’అనేది చాలా ప్రాముఖ్యతను కలిగి ఉందని వెల్లడించారు. భారత్, ఆసియాన్ కలిసి ప్రపంచ జనాభాలో దాదాపు నాలుగో వంతును కలిగి ఉన్నాయని, అందుకే పోటీతో కాకుండా సహకారంతో మన భవిష్యత్తు రూపుదిద్దుకోవాలని చెప్పారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. అనుకున్నది సాధించే సామర్థ్యం, ఉమ్మడి సంకల్పం మనకు ఉన్నాయని చెప్పారు. మన ప్రాంత భవిష్యత్తుకు నూతన దిశానిర్దేశం భారతదేశ వృద్ధి, ఆసియాన్ దేశాల శ్రేయస్సు ఒకదానితో ఒకటి లోతుగా ముడిపడి ఉన్నట్లు తాము గట్టిగా విశ్వసిస్తున్నామని మోదీ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ‘’ఆసియాన్ కమ్యూనిటీ విజన్–2045’, ‘వికసిత్ భారత్–2047’అనేవి మన ఉమ్మడి ఆకాంక్షలను సాకారం చేసుకోవడానికి తోడ్పడుతాయని ధీమా వ్యక్తంచేశారు. గత 12 ఏళ్లలో భారత్, ఆసియాన్‌లు తమ భాగస్వామ్యాన్ని పెంపొందించుకున్నాయని, ఇప్పడు మనం మన ప్రాంత భవిష్యత్తును తీర్చిదిద్దాలని అన్నారు. దీనికి కొత్త దిశానిర్దేశం చేయాలని చెప్పారు. 250 క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్టులు ఆసియాన్‌తో తమ భాగస్వామ్యం ఇప్పుడు ఉమ్మడి సంస్కృతి, వారసత్వానికి మాత్రమే కాకుండా.. డిజిటల్ టెక్నాలజీ, రక్షణ, అంతరిక్షం వంటి రంగాలకు విస్తరించిందని ప్రధానమంత్రి చెప్పారు. ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు 100కు పైగా కార్యక్రమాలను చేపట్టామని, సుమారు 250 క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్టులు (తక్షణ ప్రభావం చూపే ప్రాజెక్టులు) ప్రారంభించామని పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ధి కోసం 10,000కు పైగా స్కాలర్íÙప్‌లను అందించామని చెప్పారు. భారత్, తొమ్మిది ఆసియాన్ దేశాల మధ్య నేడు నడుస్తున్న ప్రత్యక్ష విమాన సరీ్వసులు, పెరుగుతున్న పర్యాటక రంగం మన సన్నిహిత సంబంధాలకు నిదర్శనమని స్పష్టంచేశారు. భారత్–ఆసియాన్ సంబంధాలకు 2027 ఒక ప్రత్యేకమైన సంవత్సరంగా నిలుస్తుందని అన్నారు. ఇరుపక్షాలు తమ సంబంధాలకు 35 ఏళ్లు, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఐదేళ్లు పూర్తి చేసుకుంటాయని తెలియజేశారు. ప్రజల మధ్య సంబంధాలను, యువత భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు, యువజన సదస్సు, యువ పార్లమెంటేరియన్ల మారి్పడి కార్యక్రమాలు, స్టార్టప్ హ్యాకథాన్లతో కూడిన ఇండియా–ఆసియాన్ యూత్ కనెక్ట్ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రధాని మోదీ సూచించారు. కీలక రంగాల్లో మరింత సహకారం ‘ఆసియాన్’లో ఇండోనేసియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, బ్రూనై, వియత్నాం, లావోస్, మయన్మార్, కాంబోడియా, తిమోర్–లెస్టీలు సభ్య దేశాలుగా ఉన్నాయి. అమెరికా, చైనా, జపాన్, ఆ్రస్టేలియాతో సహా మరికొన్ని దేశాలు సంభాషణ భాగస్వాములుగా కొనసాగుతున్నాయి. ఆసియాన్‌కు ప్రస్తుతం íఫిలిప్పీన్స్ సారథ్యం వహిస్తోంది. గత కొన్నేళ్లుగా భారత్, ఆసియాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాయి. 1992లో ఆసియాన్–భారత్ సంబంధాలు ప్రారంభమయ్యాయి. ఈ బంధం 1995 డిసెంబరులో పూర్తి స్థాయి భాగస్వామ్యంగా, 2002లో శిఖరాగ్ర స్థాయి భాగస్వామ్యంగా పరిణామం చెందింది. 2012లో ఈ సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరుకున్నాయి. మెరుగైన ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, ఉపగ్రహ, వాతావరణ సమాచారాన్ని పంచుకోవడం, ఉమ్మడి సన్నద్ధతా విన్యాసాలు, మానవతా సహాయాన్ని వేగంగా అందించడం వంటి అంశాలతో సహా విపత్తు నిర్వహణపై సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాలని తాజాగా ఇరుపక్షాలు నిర్ణయానికి వచ్చాయి.
జాతీయం
కశ్మీర్లో హైటెన్షన్.. లతీఫ్‌తో సైన్యం వీడియో కాల్
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో లష్కరే తోయిబా (LeT) టాప్ కమాండర్ లతీఫ్ భట్ కోసం భద్రతా దళాలు చేపట్టిన వేట ఉత్కంఠ రేపుతోంది. కుల్గాం జిల్లాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్ సందర్భంగా అతడిని ఓ మసీదులో చుట్టుముట్టాయి. ఈ క్రమంలో లతీఫ్‌తో వీడియోకాల్ ద్వారా మాట్లాడిన భద్రతా దళాలు లొంగిపోవాలని కోరాయి. అయితే అతడు చెప్పిన సమాధానం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది.ఆపరేషన్‌లో భాగంగా లతీఫ్‌తో వీడియోకాల్‌లో మాట్లాడిన ఓ అధికారి.. హమ్ తుమ్హారే సాథ్ హై (మేము నీకు అండగా ఉంటాం) అంటూ లొంగిపోవాలని నచ్చజెప్పారు. హాని తలపెట్టమని నచ్చజెప్పేందుకు యత్నించారు. అయితే అందుకు లతీఫ్ నిరాకరించాడు. తను దేవుడి వద్ద సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. దీంతో భద్రతా దళాలు ఆపరేషన్‌ను మరింత తీవ్రం చేశాయి. కుల్గాం జిల్లాలోని పలు గ్రామాల్లో తెల్లవారుజామున కాల్పులు వినిపించాయి.సీసీటీవీలో ఉగ్రవాదుల రెక్కీనవంబర్ 11న అఖ్రాన్లోని సీఆర్పీఎఫ్ చెక్‌పోస్టుపై జరిగిన దాడిలో లతీఫ్, అతడి అనుచరుడు ఉమర్ నిసార్ దార్ పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ముగ్గురు సీఆర్పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. దాడికి ముందు నవంబర్ 10న వీరిద్దరూ మీర్ బజార్, అఖ్రాన్, హబ్లిష్, కిలామ్ ప్రాంతాల్లో తిరుగుతూ రెక్కీ నిర్వహించినట్లు సీసీటీవీ దృశ్యాలు వెల్లడించాయి. దాడి తర్వాత అక్కడి నుంచి తప్పించుకున్న దృశ్యాలు కూడా పోలీసులకు లభించాయి.Security forces are trying to persuade Lashkar-e-Taiba (LeT) local commander Lateef Bhat to surrender through a video call. Bhat is hiding inside a mosque in Zangalpora, Kulgam, where security forces launched a cordon-and-search operation after receiving intelligence about his presence.— The Frustrated Indian (@FrustIndian) November 18, 2026500 మందికి పైగా అదుపులోకిఈ కేసు దర్యాప్తులో ఉమర్ నిసార్ దార్ గత ఆరు నెలలుగా లతీఫ్‌కు ఆశ్రయం కల్పించడంతో పాటు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సోమవారం కుల్గాంలో జరిగిన ఎన్కౌంటర్లో దార్ హతమయ్యాడు. మరోవైపు లతీఫ్ కోసం గాలింపులో భాగంగా పోలీసులు 500 మందికి పైగా వ్యక్తులను ప్రశ్నించేందుకు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. లతీఫ్‌కు గతంలోనూ పలు ఉగ్రదాడులతో సంబంధాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. జులై 22న అనంత్‌నాగ్‌లో పోలీసులపై జరిగిన దాడిలో ఓ కానిస్టేబుల్ హత్యకు, ఆగస్టు 1న కుల్గాంలో ఇద్దరు వలస కార్మికుల హత్యకు అతడే కారణమని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం మసీదులో అతడిని చుట్టుముట్టిన భద్రతా దళాలు ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.ఇదీ చదవండి: సీఆర్పీఎఫ్.. విధుల్లో ఉండగా సెల్ఫోన్లు వాడొద్దు
‘రావణుడు శూర్పణఖ భర్తను చంపడమేంటి?.. నిలదీసిన హిందూ సంఘం!
ముంబై: నటులు రణ్‌బీర్ కపూర్, యశ్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన రామాయణం సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన అందుకుంటున్నప్పటికీ.. వివాదాల్లోనూ చిక్కుకుంది. మహర్షి వాల్మీకి రచించిన అసలు రామాయణానికి విరుద్ధంగా సినిమాలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారంటూ హిందూ జనజాగృతి సమితి (హెచ్‌జేఎస్) అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమా పేరుతో ఇతిహాసాన్ని వక్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ హిందువులు ఈ చిత్రాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చింది.మంగళవారం ముంబైలో నిర్వహించిన మీడియా సమావేశంలో హిందూ సంఘాల ప్రతినిధులు నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సృజనాత్మకత పేరుతో అసలు కథలోని కీలక ఘట్టాలను మార్చేశారని ఆరోపించారు. రావణుడిని గొప్పగా చూపించారని, లక్ష్మణుడి పాత్రను తక్కువ చేసి చూపించారని విమర్శించారు. రాముడు, లక్ష్మణుల వీరత్వానికి భిన్నంగా వారి పాత్రలను చిత్రీకరించారని పేర్కొన్నారు.రామాయణం కోట్లాది హిందువులకు ఎంతో పవిత్రమైన ఇతిహాసమని హెచ్‌జేఎస్ తెలిపింది. అయితే ఈ సినిమా ద్వారా కమ్యూనిస్టు అజెండాను ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తోందని ఆరోపించింది. ఈ నేపథ్యంలో హిందువులు సినిమాను చూడకుండా బహిష్కరించాలని కోరింది.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) తీరుపైనా సంస్థ ప్రశ్నలు లేవనెత్తింది. హెచ్‌జెఎస్ రాష్ట్ర సమన్వయకర్త సునీల్ ఘన్వత్ మాట్లాడుతూ.. ఇతర మతాల మనోభావాలకు ప్రాధాన్యమిచ్చే సెన్సార్ బోర్డు హిందువుల భావాలను మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ‘మెసెంజర్ ఆఫ్ గాడ్’, ‘ది డావిన్సీ కోడ్’, ‘కమల్ ధమాల్ మలామాల్’ చిత్రాలను ఉదాహరణలుగా ప్రస్తావిస్తూ.. సినిమాల విషయంలో ఒకే విధమైన నిబంధనలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.రావణుడు పేదలకు బంగారు ఇళ్లు బహుమతిగా ఇచ్చినట్లు చూపించడం, రాముడు, లక్ష్మణుడు రావణుడి సైన్యాన్ని చూసి పారిపోతున్నట్లు చిత్రీకరించడం, సీత రాక్షసులతో పోరాడే సన్నివేశాలు అభ్యంతరకరమని హెచ్‌జేఎస్ తెలిపింది. అలాగే పనిమనిషిని వేధించాడనే ఆరోపణతో రావణుడు శూర్పణఖ భర్త విద్యుజ్జిహ్వను హతమార్చినట్లు చూపించడంపైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ తాజా ఆరోపణలపై సినిమా నిర్మాతలు ఇంకా స్పందించలేదు. గతంలో సీత రాక్షసులతో పోరాడే సన్నివేశంపై దర్శకుడు నితీశ్ తివారీ వివరణ ఇచ్చారు. వాల్మీకి రామాయణానికి మాత్రమే పరిమితం కాకుండా ఇతర ప్రాంతీయ, ప్రత్యామ్నాయ సాహిత్య సంప్రదాయాల ఆధారంగా ఆ సన్నివేశాన్ని రూపొందించినట్లు స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ‘ఈ20’పై రగడ: వారు సైన్స్ తెలియని మూర్ఖులు.. సురేశ్ గోపి ఫైర్!
‘ఈ20’పై రగడ: వారు సైన్స్ తెలియని మూర్ఖులు.. సురేశ్ గోపి ఫైర్!
న్యూఢిల్లీ: ఈ20 పెట్రోల్ విషయంలో వస్తున్న విమర్శలపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపి తీవ్రంగా స్పందించారు. ఈ ఇంధనంలో ఇథనాల్ కలపడాన్ని తప్పుబడుతున్నవారిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సైన్స్ గురించి తెలియని మూర్ఖులంటూ విమర్శకులపై విరుచుకుపడ్డారు. మంగళవారం తన పార్లమెంటరీ నియోజకవర్గమైన కేరళలోని త్రిస్సూర్‌లో నిర్వహించిన యువజన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ20 పెట్రోల్‌పై ఆరోపణలు చేస్తున్నవారి వెనుక వక్రీకరించిన రాజకీయ ఆలోచనలు ఉన్నాయని సురేశ్ గోపి అన్నారు. ఈ ఇంధనం వెనుక ఉన్న శాస్త్రీయ అంశాలు తెలియకుండానే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంధనంలో ఇథనాల్ శాతాన్ని పరీక్షిస్తున్నవారు క్యాన్లలో పెట్రోల్ కొనుగోలు చేసి, అందులో ఏవో పదార్థాలు కలిపి నమూనాలను పరీక్షలకు పంపే అవకాశం ఉందని ఆరోపించారు. ఇలాంటి ఆరోపణలపై విచారణ జరిపించేందుకు సీబీఐని కూడా రంగంలోకి దించాల్సి రావచ్చని మంత్రి వ్యాఖ్యానించారు. అప్పుడు ఈ వ్యక్తులు సీబీఐకి వ్యతిరేకంగా కూడా మాట్లాడతారని అన్నారు.పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని ఈ10 నుంచి ఈ20కి పెంచే నిర్ణయం ఆటోమొబైల్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఊఆర్ఏఐ) నిర్వహించిన పరిశోధనలు, పునఃపరిశోధనల తర్వాతే తీసుకున్నట్లు సురేశ్ గోపి వివరించారు. కాలానికి అనుగుణంగా మారని ఇంజిన్ల నుంచి వెలువడే పొగను నియంత్రించేందుకు ఇథనాల్ కలపడం ఒక్కటే సరైన మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. వాహనాల నుంచి వెలువడే పొగలో ఎలాంటి రసాయనాలు ఉంటున్నాయో అర్థం చేసుకోవాలని మంత్రి సూచించారు. వాతావరణంలోకి విడుదలయ్యే కాలుష్య ఉద్గారాలపై జెనీవా ఒప్పందాల ద్వారా కఠిన నిబంధనలు అమలవుతున్నాయని చెప్పారు. భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ నిబంధనలు పాటించాల్సిందేనని, ప్రపంచవ్యాప్తంగా పర్యావరణహిత ఇంధనాల అన్వేషణ జరుగుతోందని పేర్కొన్నారు.మరోవైపు పెట్రోల్‌లో ఇథనాల్ శాతం నిర్ణీత 20 శాతానికి మించుతోందా లేదా అన్నది తెలుసుకునేందుకు కేరళ ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తోంది. గతవారం కర్ణాటకలో చేపట్టిన పరీక్షల్లో కొన్ని పెట్రోల్ నమూనాల్లో ఇథనాల్ శాతం 31.2 వరకు ఉన్నట్లు వెల్లడైంది. అయితే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు సంయుక్త ప్రకటన విడుదల చేసి కర్ణాటక పరీక్షల ఫలితాలను ఖండించాయి. దీంతో ఈ20 ఇంధనంపై వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది.ఇదీ చదవండి: అకస్మాత్తుగా ఆగిన ఆపిల్ సేవలు.. యూజర్లకు షాక్!
కేదార్నాథ్: 73 టన్నుల చెత్త వదిలిన 19.33 లక్షల భక్తులు!
కేదార్నాథ్: ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌లో ఈ ఏడాది భక్తుల రాక సరికొత్త రికార్డు సృష్టించింది. మొత్తం 19.33 లక్షల మంది యాత్రికులు స్వామివారిని దర్శించుకోగా.. వారి రాకతో ఏకంగా 73 టన్నుల చెత్త పేరుకుపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 3.4 రెట్లు అధికం కావడం ఆందోళన కలిగిస్తోంది. బదరీనాథ్ ఆలయ ద్వారాలు సోమవారం శీతాకాలం దృష్ట్యా మూసివేయడంతో ఈ ఏడాది చార్ధామ్ యాత్ర ముగిసింది.కేదార్నాథ్ నగర పంచాయతీ గణాంకాల ప్రకారం.. మొత్తం 73 టన్నుల వ్యర్థాల్లో 51.5 టన్నులు పొడి చెత్త కాగా, మరో 22 టన్నులు సేంద్రియ వ్యర్థాలు ఉన్నాయి. 2025లో 21.40 టన్నులు, 2024లో 26.10 టన్నులు, 2023లో 32.58 టన్నుల చెత్త మాత్రమే నమోదైంది. ఈసారి వ్యర్థాల పరిమాణం గణనీయంగా పెరిగింది.పొడి చెత్తలో ప్లాస్టిక్ బాటిళ్లు, చిప్స్, ఇన్స్టంట్ నూడుల్స్ ప్యాకెట్లు, కార్డ్‌బోర్డులు, టెట్రా ప్యాకులు ఉన్నాయి. సేంద్రియ వ్యర్థాలను ల్యాండ్‌ఫిల్ ప్రాంతంలో పారవేస్తుండగా.. పొడి చెత్తను బేలింగ్ పద్ధతిలో ప్రాసెస్ చేస్తున్నారు. అనంతరం సోన్‌ప్రయాగ్‌కు తరలించి అక్కడి నుంచి రీసైక్లింగ్ ప్రక్రియకు పంపించనున్నారు.కేదార్‌నాథ్‌లో ఇప్పటికే ఒక వేస్ట్ బేలర్ యంత్రం అందుబాటులో ఉంది. వచ్చే ఏడాది యాత్ర ప్రారంభమయ్యేలోగా మరో యంత్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం అక్కడి ల్యాండ్‌ఫిల్ సామర్థ్యం 30 వేల చదరపు అడుగులు కాగా, అందులో 28 వేల చదరపు అడుగులు ఖాళీగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. గత ఐదేళ్లలో నాలుగు ల్యాండ్‌ఫిల్ ప్రాంతాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఇదిలా ఉంటే.. యాత్రికుల్లో పర్యావరణ స్పృహ పెంచేందుకు స్థానిక అధికారులు చేపట్టిన అవగాహన కార్యక్రమం కొంత ఫలితాన్నిచ్చింది. ఈ ఏడాది సేకరించిన చెత్తలో 14 టన్నులను యాత్రికులే స్వయంగా సేకరణ కేంద్రాలకు తీసుకొచ్చారు. మొత్తం 6 వేల మంది ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. జూన్ 1న ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భాగంగా ఒకటి నుంచి ఐదు కిలోల బరువున్న చెత్త ప్యాకెట్లను భక్తులు ఆలయానికి 1.5 కిలోమీటర్ల దిగువన ఉన్న సేకరణ కేంద్రానికి తీసుకొచ్చారు.ఇదీ చదవండి: అకస్మాత్తుగా ఆగిన ఆపిల్ సేవలు.. యూజర్లకు షాక్!
ఎన్ఆర్ఐ
డాలస్‌లో మహాత్మాగాంధీకి SBI ఛైర్మన్ ఘన నివాళి
డాలస్, టెక్సస్: అమెరికా పర్యటనలో ఉన్న స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఛైర్మన్ శ్రీనివాసులు శెట్టి అమెరికా దేశంలోనే అతి పెద్దదైన, డాలస్ పరిసర ప్రాంతంలో అర్వింగ్ నగరంలో నెలకొల్పిన మహాత్మాగాంధీ స్మారకస్థలిని శుక్రవారం సందర్శించి మహాత్మాగాంధీ విగ్రహానికి ఘన నివాళులర్పించారు. 18 ఎకరాల సువిశాలమైన పార్క్‌లో ప్రశాంత వాతావరణంలో ఏర్పాటుచేసిన ఈ విగ్రహం చూడ ముచ్చటగా ఉందన్నారు.విదేశాలలో ఇంత భారీ విగ్రహ నిర్మాణం సాకారం కావడానికి కృషిచేసిన మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర, కార్యవర్గ సభ్యుల కృషిని, ఇందులో భాగస్వాములైన వారందరికీ శ్రీనివాసులు శుభాకాంక్షలు తెలిపారు. వ్యవస్థాపక కార్యదర్శి రావు కల్వల, ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్ అధ్యక్షుడు మహేంద్ర రావు, డా. ప్రసాద్ తోటకూర లు ఛైర్మన్ శ్రీనివాసులు శెట్టికి ఆవరణ అంతా చూపించి, 12 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ స్మారకస్థలి కేవలం ప్రవాస భారతీయులకే గాక అమెరికన్లకు సైతం ఒక ముఖ్య యాత్రాస్థలం అయిందని వివరించారు. డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ఫ్రిస్కో నగరంలో ఇటీవలే SBIC Branch ను ప్రారంభించడం సంతోషకరం అన్నారు. ఎన్నో వ్యాపకాలతో తీరికలేని పనులలో ఉండి కూడా మహాత్మాగాంధీ మెమోరియల్ ను సందర్శించడానికి విచ్చేసిన ఛైర్మన్ శెట్టికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ, జోగులాంబ గద్వాల జిల్లాలోని ‘పెద్దపోతులపాడు’ గ్రామంలో జన్మించిన శ్రీనివాసులు శెట్టి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్యను అభ్యసించి, ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి వ్యవసాయ శాస్త్రంలో బి.ఎస్సీ పట్టా పొందారు. సాధారణ బ్యాంకు అధికారిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి, దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐకి ఛైర్మన్ స్థాయికి ఎదగడం ఎంతోమందికి స్పూర్తిదాయకం అన్నారు. బ్యాంకింగ్ రంగంలో 38 సంవత్సరాలకు పైగా అనుభవం గడించిన శ్రీనువాసులు 2024 ఆగస్టులో SBI 27వ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ పదవిలో ఈయన 2027 ఆగస్టు వరకు కొనసాగుతారు.
భారత సంతతి మహిళ హత్య, కీలక పరిణామం
కెనడాలోని టొరంటో నగరంలో పంజాబ్‌కు చెందిన నవ్‌నీత్ కౌర్ (26) అనే భారత సంతతి మహిళ దారుణ హత్యక కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నిందితుడు రాజ్ పాల్ (రాజత్ జస్వాల్) కోర్టుకు హాజరయ్యాడు. పశ్చిమ లండన్‌లోని హాన్స్స్లో (Hounslow) ప్రాంతంలోని చెర్ట్సే రోడ్లో ఉన్న నివాసంలో నవ్‌నీత్ కౌర్‌ను హత్య చేసిన ఆరోపణలపై 31 ఏళ్ల రాజత్ జస్వాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిపై హత్య కేసే కాకుండా, ప్రాణాలకు హాని కలిగించే ఉద్దేశ్యంతో తుపాకీని కలిగి ఉన్నారనే ఆరోపణలపై హెండన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు.కాగా నవంబర్ 4 మధ్యాహ్నం 'వెల్ఫేర్ చెక్' కోసం చెర్ట్సే రోడ్‌లోని ఇంటికి వెళ్లిన మెట్రోపాలిటన్ పోలీసులకు నవ్‌నీత్ కౌర్ తీవ్ర తుపాకీ గాయాలతో పడి ఉండటం కనిపించింది. ఆమె ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు నిర్ధారించారు. నవనీత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన డిటెక్టివ్ చీఫ్ ఇన్స్పెక్టర్ (డీసీఐ) సారా లీ (Sarah Lee) ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఏదైనా సమాచారం ఉన్నవారు, లేదా ఆ ప్రాంతంలోని డోర్‌బెల్ కెమెరా, డాష్‌క్యామ్ ఫుటేజ్ ఉన్నవారు పోలీసులకు అందించి దర్యాప్తులో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
శ్రీజ ఆచూకీ కోసం కోమటిరెడ్డి ప్రయత్నం
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో కనిపించకుండాపోయిన నల్లగొండ యువతి కోయ శ్రీజ (23) ఆచూకీ కనుగొనేందుకు తెలంగాణ రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రయత్నిస్తున్నారు. అమెరికాలోని సంబంధిత అధికారులు, ప్రవాస తెలుగువారితో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు. త్వరగా శ్రీజ ఆచూకీ కనుగొనాలని ఈ-మెయిల్ ద్వారా బోస్టన్ కాన్సులేట్ జనరల్, కేంద్ర విదేశాంగ శాఖ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ఆయన కోరారు. శ్రీజ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని.. ఆమె ఆచూకీ త్వరగా కనుక్కోవాలని బోస్టన్ కాన్సులేట్ జనరల్‌కు విజ్ఞప్తి చేశారు.ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) బోస్టన్ ప్రతినిధి కృష్ణప్రసాద్‌తో ఫోన్లో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు. స్థానిక పోలీసుల సహాయంతో శ్రీజ ఆచూకీ కనుగొనేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు కోమటిరెడ్డికి కృష్ణప్రసాద్ వివరించారు. శ్రీజ ఆచూకీ ప్రయత్నాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తున్నట్టు మంత్రి కోమటిరెడ్డి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, తమ కూతురు క్షేమంగా తిరిగి రావాలని శ్రీజ తల్లిదండ్రులు కోయ యాదగిరిరెడ్డి, రూప కోరుకుంటున్నారు.నల్లగొండ జిల్లా కనగల్ మండలం శాబ్దుల్లాపురం శ్రీజ సొంతూరు. బోస్టన్లోని డోర్చెస్టర్ ప్రాంతంలో నివాసముంటున్న ఆమె నవంబర్ 2న అదృశ్యమయ్యారు. ఎడిసన్ గ్రీన్ సమీపంలో చివరిసారిగా ఆమె కనిపించినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఇప్పటికీ వరకు ఆమె ఆచూకీ లభ్యంకాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. శ్రీజ జాడ కనిపెట్టేందుకు బోస్టన్ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇదీ చదవండి: అమెరికాలో నల్లగొండ విద్యార్థిని అదృశ్యం
ముక్కలుగా నరికి చెత్తబుట్టలో పడేశా : ఎన్ఆర్ఐ భర్త
భార్యను హత్య చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత సంతతికి చెందిన వ్యక్తి అమెరికాలోని వర్జీనియా కోర్టులో సంచలన వాంగ్మూలం ఇచ్చాడు. తన భార్య మరణించిన తర్వాత ఆమె మృతదేహాన్ని ముక్కలు చేసినట్లు ఒప్పుకున్న ఘటన కలకలం రేపింది. ఆమె కనిపించకుండా పోయిన రెండేళ్ల తర్వాత, విచారణ ప్రారంభమైన ఐదు వారాలకు ఈ సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. 2024లో 28 ఏళ్ల మమతా కఫ్లే భట్ అదృశ్యమైంది. చివరిసారిగా జూలై 29న వీడియో కాల్లో కనిపించింది. ఆ తర్వాత కనిపించకుండా పోయిన మమత హత్య, మృతదేహాన్ని దాచిపెట్టడం లాంటి ఆరోపణ లెదుర్కొంటున్నాడు భర్త నరేష్ భట్. అయితే ఈ ఆరోపణలను తొలుత అంగీకరించలేదు, తన భార్య మమతా కఫ్లే భట్ ఆత్మహత్య చేసుకుందని అందర్నీ నమ్మించాడు. చివరికి కోర్టు విచారణలో భార్య మృతదేహాన్ని ముక్కలు చేసి మాయం చేశానని కోర్టులో అంగీకరించాడు. ఇదీ చదవండి : దారుణం : భార్యను కుర్చీకి కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు! కోర్టులో సాక్ష్యంమమత 2024 ఆగస్టు 5న విధులకు హాజరు కాకపోవడంతో అనుమానాలు మొదలైనాయి. ఆ తర్వాత భర్త్ నరేష్ మిస్సింగ్ కేసు నమోదు చేశాడు.ఈ విచారణలో భాగంగా వారి ఇంటి బెడ్రూమ్, బాత్రూమ్లలో రక్తం మరకలను గుర్తించిన పోలీసులు, ఆగస్టు 22న అతడిని అరెస్ట్ చేశారు. తనిఖీల్లో వెండ్రుకలున్న పవర్ రంపాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.కోర్టులో నరేష్ సాక్ష్యం ప్రకారం జూలై 29న సాయంత్రం 8 గంటల ప్రాంతంలో తన చిన్నారి కూతురితో కలిసి నిద్రపోవడానికి వెళ్లానని, అయితే తన భార్య పైకి రాలేదని చెప్పారు. మరుసటి రోజు ఉదయం 4 గంటలకు టాయిలెట్‌కు వెళ్లేందుకు లేవగా, మంచం కింద మమత వెల్లకిలా పడి ఉండి, చుట్టూ వాంతులున్నాయని తెలిపాడు. ఆమె పక్కనే 'సెల్ఫోస్' (Celphos - అత్యంత విషపూరితమైన పురుగుల మందు) ప్యాకెట్ పడి ఉందన్నారు. ఈ సమయంలో ఆమెను కాపాడేందుకు సీపీఆర్ (CPR) చేసి ప్రయత్నించానని, ఇక ఆమె మరణించిందని నిర్ధారించుకున్నాక బాత్రూమ్లోకి తీసుకెళ్లానని భట్ వాంగ్మూలంలో పేర్కొన్నాడు. మొదట మృతదేహాన్ని పోటోమాక్ నదిలో పడేయాలని భావించాననీ, ఆ తరువాత శవాన్ని దాచడానికి ఏదైనా దొరుకుతుందేమోనని 'హోమ్ డిపో'కి వెళ్లినట్లు తెలిపాడు. చెత్తబుట్టలో ఆమె బాడీ సరిపోదని భావించి, రంపం సాయంతో మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి, ఆపై వాటిని ప్లాస్టిక్ కవర్లలో ఉంచి చెత్తలో పడేసానని తెలిపాడు. ఇదీ చదవండి: పండగవేళ పతంజలికి భారీ షాక్ : తుకారం ముండే దెబ్బఅనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాననీ, ఉరివేసుకునేందుకు కేబుల్స్ తెచ్చుకున్న ప్పటికీ, ఆ పని చేయలేకపోయానని అన్నాడు. మరి అంతటి క్లిష్ట పరిస్థితిలో పోలీసులకు (911) ఎందుకు ఫోన్ చేయలేదని అడిగినపుడు. ఫోన్ చేయడానికి ప్రయత్నించాను, కానీ భయందోళనకు గురయ్యాను. ఆ సమయంలో ఏం జరుగుతుందో అర్థం కాలేదంటూ చెప్పుకొచ్చాడు.అయితే హత్య కేసులో భట్‌కు జీవిత ఖైదు పడుడుతంది. ఇక మృతదేహాన్ని దాచిపెట్టడం లాంటి ఆరోపణల కింద కేవలం ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది క్రమంలోనే, నేరాన్ని ఒప్పుకోవడం ద్వారా తనకు పడే శిక్ష కాలాన్ని తగ్గించుకోవడానికి భట్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
క్రైమ్
పదో తరగతి పాస్ అవుతానో లేదని.. విద్యార్థిని ఆత్మహత్య
మహబూబాబాద్ రూరల్ : పాఠశాలలో నిర్వహిస్తున్న పరీక్షల్లో తనకు తక్కువ మార్కులు వస్తున్నాయని, దీంతో పదో తరగతి పాస్ అవతానో లేదో అని మనోవేదనకు గురైన ఓ విద్యార్థిని చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. టౌన్ సీఐ ఎల్.రఘుపతిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ సమీపంలో పాల వ్యాపారం చేసే నక్క స్వామి, సంధ్య దంపతుల చిన్న కూతురు సాయితేజస్విని (16) పట్టణంలోని ఓ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. కొన్ని రోజులుగా పాఠశాలలో నిర్వహిస్తున్న పరీక్షల్లో తనకు తక్కువ మార్కులు వస్తున్నాయని, దీంతో పదో తరగతి పాస్ అవుతానో లేదో అంటూ బాధపడుతూ ఉండేది. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పుకోగా వారు ఏమి కాదులే పాస్ అవుతావు అంటూ సర్ది చెప్పేవారు. మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లి స్థానిక నిజాం చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్ప డింది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి స్వామి ఫిర్యాదు మేరకు టౌన్ ఎస్సై మౌనిక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఇదీ చదవండి: ఫామ్‌హౌస్‌లో రెయిన్డ్యాన్స్లు చేసిన కానిస్టేబుళ్లు
పక్కనే ఉన్న వెంచర్‌కు తీసుకెళ్లి.. దారుణం
తిరుపతి రూరల్: అనుమానంతోనే తన ప్రియురాలుని బండరాయితో మోది హతమార్చిన హంతకుడిని పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. వివరాలు.. తిరుపతి రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సి.మల్లవరం గ్రామ సమీపంలోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్లో అక్టోబర్ 31న గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ముఖం గుర్తుపట్టలేని విధంగా బండరాయితో మోది హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో ఆధారాలు లభించకపోవడం, మృతురాలి వివరాలు తెలియకపోవడంతో కేసు దర్యాప్తు సవాలుగా మారింది. మృతదేహం ఫొటోలు, దుస్తులు, ఇతర ఆనవాళ్ల ఆధారంగా మృతురాలు చిత్తూరు జిల్లా రొంపిచెర్లకు చెందిన భాగ్యశ్రీగా ఆమె తల్లిదండ్రులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. భాగ్యశ్రీ ఓ బ్యాంక్‌కు సంబంధించిన క్రెడిట్ కార్డు కార్యాలయంలో పనిచేస్తున్నట్లు తెలుసుకున్నారు. కాల్ డేటాతో అరెస్ట్ తిరుపతితో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగి్నషన్(ఏఎన్పీఆర్) కెమెరాల ద్వారా అనుమానిత వాహనాల కదలికలను విశ్లేషించారు. కాల్ డేటా రికార్డులు (సీడీఆర్), మొబైల్ టవర్ లొకేషన్ల ఆధారంగా మృతురాలితో సంబంధం ఉన్న వ్యక్తులపై ఆరా తీశారు. ఈ క్రమంలో అన్ని ఆధారాలు పరిశీలించిన తరువాత షేక్ జమాలుల్లా బాషా అలియాస్ జమీల్ బాషా (38) హత్యకు పాల్పడినట్లు గుర్తించారు. అప్పటికే నిందితుడు పరారీలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించారు. ఈనెల 16న సోమవారం రాత్రి చిత్తూరు జిల్లా, రొంపిచెర్ల క్రాస్ వద్ద అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. హత్యకు ఉపయోగించిన ఆటో, రెండు సెల్ఫోన్లు, రూ.450 నగదును అతని వద్ద నుంచి స్వా«దీనం చేసుకున్నట్టు సీఐ మద్దయ్యాచారి తెలిపారు. అనంతరం నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు.అనుమానమే హత్యకు కారణం భాగ్యశ్రీ, జమీల్ బాషా ఇద్దరూ రొంపిచెర్లకు చెందినవారు. సమీప గృహాల్లో నివాసం ఉండడంతో వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అయితే తిరుపతిలోని క్రెడిట్ కార్డు కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్న భాగ్యశ్రీ సహచర ఉద్యోగులతో సన్నిహితంగా ఉండడాన్ని జమీల్ బాషా జీర్ణించుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో ఆమెను పలు మార్లు హెచ్చరించాడు. ఆ తరువాత హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఎప్పటిలాగానే తన ఆటోలో ఆమెను ఎక్కించుకుని సి.మల్లవరం జంక్షన్ సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న వెంచర్‌కు తీసుకెళ్లాడు. అక్కడ కొంత సేపు ఇద్దరూ గొడవపడగా ఆ వెంటనే బండరాయితో భాగ్యశ్రీ తలపై మోది దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కాగా ఎలాంటి ఆధారాలు లేని హత్య కేసును 17 రోజుల్లోనే ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసిన తిరుపతి రూరల్ పోలీసులను జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు, అడిషనల్ ఎస్పీ రవిమనోహరాచారి, చంద్రగిరి డీఎస్పీ పి.జగదీష్ నాయక్ అభినందించారు. ఇదీ చదవండి: భాగ్యశ్రీని బండరాయితో మోది.. కిరాతకంగా హత్య!
వెంటనే రావాలి.. లేదంటే ప్రాణాలు తీసుకుంటా!
విశాఖపట్నం: సహజీవనంలో ఉంటూ యువకుడు పెళ్లిని వాయిదా వేస్తుండటంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పీఎం పాలెం సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాలు.. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం దోనుబాయి గ్రామానికి చెందిన సవర త్రివేణి(26) బ్యూటీషియన్‌గా పనిచేస్తూ కొమ్మాది టీచర్స్ లేఔట్‌లోని టీజీఆర్ టవర్స్ ఫ్లాట్ నంబర్ 102లో ఆరు మాసాలుగా నివసిస్తోంది. తల్లిదండ్రులు గతంలోనే మరణించారు. ఆమె రమేష్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పటికీ, రమేష్ పెళ్లి విషయంలో దాటవేత ధోరణి అవలంబిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. వారం రోజుల క్రితం రమేష్ పనిమీద హైదరాబాద్‌కు వెళ్లడంతో, అప్పటినుంచి ఆమె ఫ్లాట్‌లో ఒంటరిగానే ఉంటోంది. ఇరువురి మధ్య వాట్సాప్ చాట్‌లో వాదనలు జరిగాయి. వెంటనే బయల్దేరి రాకపోతే చచ్చిపోతానంటూ త్రివేణి బెదిరించింది. అయినా రమేష్ పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన త్రివేణి, సోమవారం అర్ధరాత్రి తన గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మృతురాలి సోదరుడు వంశీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఇదీ చదవండి: ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్
రూ.50 వేల అప్పు.. కుక్కతో సహా జంట ఆత్మహత్య!
ఖిలా వరంగల్: ఆప్పులు..అవమానాలు, బెదిరింపులు వెంటాడాయి. దీంతో మానసిక వేదనతో దంపతులు తనువు చాలించారు. పెంపుడు కుక్కనూ తమవెంట పైలోకానికి తీసుకెళ్లారు. ఈ హృదయ విదారక ఘటన వరంగల్‌లోని రంగశాయిపేట ఎస్బీఐ బ్యాంకు లేన్‌లో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వరంగల్ 42వ డివిజన్ రంగశాయిపేటకు చెందిన నల్లపోగుల సంజయ్‌కుమార్ (60) ఆయన భార్య శోభ (55) అద్దె ఇంట్లో ఉంటున్నారు.సంజయ్‌కుమార్ తాత్కాలిక డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వారు కుక్కను పెంచుకుంటున్నారు. సంజయ్‌కుమార్ ఇటీవల అనారోగ్యానికి గురికావడంతోపాటు అప్పులిచ్చిన ఓ మహిళ వేధింపులకు గురిచేయడంతో మనస్తాపానికి గురయ్యారు. సూసైడ్ నోట్ రాసి కుక్కతోపాటు భార్యాభర్తలు సోమవారం అర్ధరాత్రి ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాల్ లిఫ్ట్ చేయడం లేదని ఇంటికి వెళ్లిన బంధువుకు దంపతులతోపాటు కుక్క కూడా వేలాడుతున్న దృశ్యాలు చూసి ఇరుగురుపొరుగు సాయంతో వారిని కిందకు దింపారు. అప్పటికే వారు చనిపోయారు. అప్పులే ఆ కుటుంబానికి శాపమయ్యాయి? సూసైడ్ నోట్లో పేర్కొన్న అంశాల ప్రకారం.. సంజయ్‌కుమార్ కుటుంబం కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. ఓ మహిళ దగ్గర రూ.50 వేలు ఆప్పుగా తీసుకున్నాడు. రూ.10వేలు ఆప్పు తీసుకుంటే వారానికి రూ.750 చొప్పున గిరిగిరి వడ్డీని 11 నెలలుగా కడుతున్నట్టు లేఖలో వివరించారు. అనారోగ్యంతో మూడు నెలలపాటు చెల్లింపులు నిలిచిపోవడంతో ఆ మహిళ నుంచి వేధింపులు మొదలయ్యాయని ఆరోపించారు. ఇంటికి మనుషులను పంపించి పరువు తీస్తామని బెదిరించారని పేర్కొన్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉండగా.. వారు ముంబైలో ఓ బట్టల షాపులో పనిచేస్తున్నట్టు సమాచారం. చిన్న కుమారుడు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.కుటుంబంలో అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు తోడవడంతో అప్పులు తీర్చడం భారంగా మారాయి. అప్పులు చెల్లించేందుకు సమయం ఇవ్వకుండా వేధిస్తున్నారని సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. తమ కష్టసుఖాల్లో కుక్క తోడుగా నిలిచిందని, దానిని పెంచుకునే పరిస్థితి కూడా లేదని, అందుకే తమవెంట తీసుకెళ్తున్నామని ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. తమతోపాటే ఆ పెంపుడు జంతువుకు కూడా అంత్యక్రియలు నిర్వహించాలని లేఖలో కోరారు. తమ అంత్యక్రియలు ప్రభుత్వమే నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. తమ అవయవాలు ఇతరులకు ఉపయోగపడే అవకాశం ఉంటే దానం చేయాలని అభ్యర్థించారు.
వీడియోలు
రష్యాలో ఘోర విమాన ప్రమాదం.. 19 మంది మృతి
నిన్ను బూతులు తిట్టించింది బాబే అని తెలిసి కూడా..!
ఏపీ తీరాన్ని వెంటాడుతున్న తుఫాన్ లు.. దీని వెనుక అసలు కారణమేంటి?
కొలంబియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ ప్రసంగంపై దుమారం
YS అవినాష్ రెడ్డి హౌస్ అరెస్ట్...?
ఎవడు తలకిందులుగా తపస్సు చేసిన 2029లో గెలిచింది YSRCPనే
టీడీపీ MLA రామకృష్ణను నిలదీసిన సొంత పార్టీ నేతలు
లోకేష్ నువ్వు కుళ్ళి.. కుళ్ళి... ఏడ్చేలా చేయకపోతే..! సతీష్ రెడ్డి స్వీట్ వార్నింగ్
పవన్ కళ్యాణ్ నీకు గూడు బాగోలేకపోతే ముంబాయి పోతావ్...
రాజమండ్రి జైలుకు లేళ్ల అప్పి రెడ్డి
