Top Stories
ప్రధాన వార్తలు

లోకేష్.. ఇవిగో ఆధారాలు..!
తాడేపల్లి : యూనివర్శిటీలలో వైస్ చాన్సలర్లు(వీసీ)లను బెదిరించి రాజీనామాలు చేయించిన సాక్ష్యాలను వైఎస్సార్ సీపీ బయటపెట్టింది. దీనికి సంబంధించిన ఆధారాలను వైఎస్సార్ సీపీ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ద్వారా విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలోని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లను రాజీనామా చేయమని ఒత్తిడి తెచ్చారు. నారా లోకేష్ ఆదేశాలతో ఛైర్మన్ స్వయంగా వీసీలను పిలిచి రాజీనామా చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఒక వీసీ తన రాజీనామా లేఖలో మంత్రి లోకేష్ బెదిరించినట్లు స్పష్టంగా రాశారు.వీసీలు రాజీనామా చేయాలంటూ ఎందుకు ఒత్తిడి తెస్తున్నారని శాసనమండలిలో వైఎస్సార్ సీపీ ప్రశ్నించగా, లోకేష్ అడ్డంగా దొరికిపోయారు. వైస్ చాన్సలర్లు గవర్నర్ అధికారం కిందకు వస్తారంటూ లోకేష్ బుకాయించారు. వీసిలను బెదిరించినట్లు ఆధారాలు చూపితే విచారణకు ఆదేశిస్తామన్నారు. అయితే ‘ మీరే బెదిరించి.. మీరే విచారణ జరిపితే నిజాలు బయటకు వస్తాయా?’ అని ప్రశ్నిస్తే లోకేష్ కు మౌనమే సమాధానమైంది.ఇవిగో ఆధారాలు.. న్యాయబద్ధంగా విచారణ చేయించండినారా లోకేష్ ఒత్తిడితో రాజీనామా చేసినట్లు ఆధారాలను బయటపెడుతున్నామని, ఏ మాత్రం నిజాయితీ ఉన్నా వీసీల రాజీనామాపై లోకేష్ న్యాయబద్ధంగా విచారణ చేయించాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేస్తోంది. ఒకవేళ అలా కాకపోతే ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ లోకేస్ రాజీనామా చేయాలని పేర్కొంది. అప్పుడే వాస్తవాలు బయటకి వస్తాయని, న్యాయం గెలుస్తుందని వైఎస్సార్ సీపీ స్పష్టం చేసింది.💣 Truth Bomb 💣ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ద్వారా విద్యా శాఖ మంత్రి @naralokesh రాష్ట్రంలోని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లను రాజీనామా చేయమని ఒత్తిడి తెచ్చినట్లు ఆధారాలివిగో నారా లోకేష్ ఆదేశాలతో ఛైర్మన్ స్వయంగా వీసీలను పిలిచి రాజీనామా చేయాలని ఆదేశించారు. ఈ… pic.twitter.com/9MKjYOtlHL— YSR Congress Party (@YSRCParty) February 25, 2025

Champions Trophy 2025: భారత అభిమానిని స్టేడియంలో నుంచి ఈడ్చుకెళ్లిన పాక్ సిబ్బంది
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో కొత్త వివాదం తలెత్తింది. భారత జెండాను కలిగి ఉన్నాడన్న కారణంగా లాహోర్‌లోని గడాఫీ స్టేడియం నుండి ఓ వ్యక్తిని బయటకు ఈడ్చుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ వీడియోలో పాకిస్తాన్ భద్రతా సిబ్బంది భారత జెండాను లాక్కొని, జెండాను పట్టుకున్న వ్యక్తిని స్టేడియంలో నుండి బయటికి ఊడ్చుకెళ్లారు. ఫిబ్రవరి 22వ తేదీన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మ్యాచ్ సందర్భంగా ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Laughter Colours | Memes Only (@laughtercolours)ఈ వీడియో సోషల్‌మీడియాలో పోస్ట్ అయిన సెకెన్లలో వైరలైంది. భారత జెండా కలిగి ఉన్న వ్యక్తి పాకిస్తాన్ పౌరుడే అయినప్పటికీ భారత అభిమాని అని తెలుస్తుంది. సదరు వ్యక్తిని పాక్ భద్రతా సిబ్బంది కొట్టి అరెస్ట్ చేశారని ప్రచారం జరుగుతుంది. ఈ వీడియోపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) నుంచి ఎలాంటి స్పందన లేదు. భారత జెండా పట్టుకున్న వ్యక్తి పేరు, వివరాలు కూడా తెలియరాలేదు. ఈ వీడియో నిజమైతే మరెన్ని వివాదాలకు దారి తీస్తుందో వేచి చూడాలి. భద్రతా సిబ్బంది నిజంగానే భారత అభిమానిపై దాడి చేసుంటే పాక్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. భారత అభిమానులు ఈ వీడియోపై తీవ్రంగా స్పందిస్తున్నారు. క్రికెట్‌ను క్రికెట్ లాగే చూడాలి. క్రికెట్‌ను ఇతరత్రా విషయాలతో ముడి పెట్టకూడదని అంటున్నారు.ఇదిలా ఉంటే, 29 ఏళ్ల తర్వాత ఓ ఐసీసీ ఈవెంట్‌కు (ఛాంపియన్స్ ట్రోఫీ) ఆతిథ్యమిస్తున్న పాకిస్తాన్.. పట్టుమని 10 రోజులు కూడా టోర్నీలో నిలువలేకపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమైన ఆరు రోజుల్లోనే పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. నిన్నటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్ విజయం సాధించడంతో ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ కథ ముగిసింది. ఈ టోర్నీలో పాక్ వరుసగా న్యూజిలాండ్, భారత్ చేతుల్లో ఘోర పరాజయాలు ఎదుర్కొంది. న్యూజిలాండ్ చేతిలో ఓటమితో పాక్‌తో పాటు బంగ్లాదేశ్ కూడా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన భారత్, న్యూజిలాండ్ జట్లు గ్రూప్-ఏ నుంచి సెమీస్‌కు అర్హత సాధించాయి. ఈ టోర్నీలో పాక్ తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. గ్రూప్-ఏ నుంచి సెమీస్ బెర్తులు ఖరారు కావడంతో ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత లేదు. మరోవైపు ఈ టోర్నీలో భారత్, న్యూజిలాండ్ ప్రయాణం జోరుగా సాగుతుంది. ఇరు జట్లు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లను మట్టికరిపించాయి. ఈ రెండు జట్ల మధ్య నామమాత్రపు పోరు మార్చి 2న జరుగనుంది.గ్రూప్-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్‌లో ఇవాళ (ఫిబ్రవరి 25) జరగాల్సిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఫలితంగా ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఇప్పటివరకు సౌతాఫ్రికా, ఆసీస్ తలో మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఆసీస్‌తో పోలిస్తే సౌతాఫ్రికా మెరుగైన రన్‌రేట్ కలిగి ఉంది. ఈ గ్రూప్‌లో ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్ ఇంకా బోణీ కొట్టాల్సి ఉంది. ఈ రెండు జట్లు తమతమ తొలి మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చేతిలో ఓడాయి. సౌతాఫ్రికా ఆఫ్ఘనిస్తాన్‌ను.. ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌ను మట్టికరిపించాయి. టోర్నీలో రేపు ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్ తలపడనున్నాయి.

‘పోరాడేందుకు వైఎస్ జగన్ స్ఫూర్తినిచ్చారు’
ఢిల్లీ: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేష్, దేవినేని అవినాష్ సహా 24 మందికి సుప్రీంకోర్టులో ఊరట లభించిన సంగతి తెలిసిందే. ఈరోజు(మంగళవారం) విచారణలో భాగంగా పలువురు వైఎస్సార్ సీపీ నాయకులకు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. విచారణ జరిపిన జస్టిస్ సుధాంశు దులియా ధర్మాసనం.. షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.అనంతరం వైఎస్సార్ సీపీ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ తన కార్యకర్తలని, నాయకుల్ని కాపాడుకుంటున్నారు. టీడీపీ గెలిచిన నాటి నుంచి ఫ్రధాన ప్రతిపక్షానికి చెందిన నాయకులను వెంటాడి వేటాడి హింసిస్తున్నారు. మూడేళ్ల క్రితం జరిగిన దాడి.. ఇప్పుడు కొత్త కేసులు పెట్టి 128 మందిని ముద్దాయిలను చేసి హింసిస్తున్నారు. టిడిపి కార్యాలయం, చంద్రబాబు నివాసం పై దాడి కేసుల్లో సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. ప్రతి ఒక్కరిని కాపాడుకుంటాం, ఏ ఒక్కరూ భయపడాల్సిన అవసరం లేదు. దేవినేని అవినాష్, జోగి రమేష్ లతో పాటు పలువురికి ముందస్తు బెయిల్ వచ్చింది. మన కార్యకర్తలు, నాయకులు కోసం పోరాడాలని వైఎస్ జగన్ ఆదేశించారు. పోరాడేందుకు వైఎస్ జగన్ స్ఫూర్తినిచ్చారు. ఇందుకు ప్రతీ వైఎస్సార్సీపీ కార్యకర్త, నాయకులు గర్వించాలి. ఎవరికి బెయిల్ రాకుండా, ప్రభుత్వం తరఫున న్యాయవాదులు చివరి వరకు ప్రయత్నం చేశారు. పోలీసుల విచారణకు మా నాయకులు హాజరై సహకరిస్తారు’ అని పొన్నవోలు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ నేతలకు ఊరట

మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌కు జీవిత ఖైదు
న్యూఢిల్లీ: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో మాజీ ఎంపీ సజ్జన్ కుమార్(Sajjan Kumar)కు జీవితఖైదు పడింది. అల్లర్లలో తండ్రీకొడుకుల హత్య కేసులో ఆయన ప్రమేయాన్ని నిర్దారించిన ఢిల్లీ ప్రత్యేక న్యాయస్థానం.. ఇదివరకే దోషిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయనకు శిక్ష ఖరారు చేస్తూ స్పెషల్ జడ్జి కావేరీ భవేజా ఆదేశాలు జారీ చేశారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యానంతరం ఒక పెద్ద గంపు మారణాయుధాలతో విరుచుకుపడింది. సిక్కులను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున లూటీలు, గృహదహనాలకు పాల్పడింది. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల(Anti Sikh Riots)లో భాగంగా నవంబర్ 1న సరస్వతి విహార్ ప్రాంతంలో అల్లరిమూక.. జస్వంత్ సింగ్, ఆయన కుమారుడు తరుణ్ దీప్ సింగ్‌ను హతమార్చింది. ఆపై ఆ ఇంట దోపిడీకి పాల్పడింది. ప్రత్యక్ష సాక్షి, జస్వంత్ భార్య ఫిర్యాదుతో కేసు నమోదు అయ్యింది.సజ్జన్ కుమార్ కేవలం ఈ అల్లర్లలో పాల్పొనడమే కాకుండా ఆ గుంపునకు నాయకత్వం వహించాడని, ఇందుకు తగిన సాక్ష్యాలు లభించాయని పేర్కొంటూ ఫిబ్రవరి 12వ తేదీ స్పెషల్ కోర్టు ఆయన్ని దోషిగా తేల్చింది. సజ్జన్ కుమార్‌కు మరణశిక్ష విధించాలన్న జస్వంత్ భార్య పిటిషన్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఆయనకు జీవితఖైదు(Life Imprisonment) విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉంటే.. పంజాబీ బాఘ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. అయితే 2015లో అమిత్ షా(Amit Shah) చొరవతో అప్పట్లో ఈ కేసును సిట్ దర్యాప్తు చేసింది. మరోవైపు.. 2021, డిసెంబర్ 16వ తేదీన సజ్జన్ కుమార్‌పై కోర్టు అభియోగాలను నమోదు చేసింది. ఎవరీ సజ్జన్ కుమార్?ఢిల్లీలో ఓ బేకరీ ఓనర్ అయిన సజ్జన్ కుమార్‌కు.. సంజయ్ గాంధీతో దగ్గరి సంబంధాలు ఏర్పడ్డాయి. అలా ఢిల్లీ కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. 1980లో ఔటర్ ఢిల్లీ నుంచి లోక్‌సభకు తొలిసారి గెలిచారు. 1991, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున అదే స్థానానికి ఆయన ఎన్నికయ్యారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక ఓట్లు (8,55,543)పోలైన నేతగా రికార్డు సృష్టించారు. అయితే.. 2018లో సిక్కుల ఊచకోత కేసులో దోషిగా కోర్టు ప్రకటించడంతో ఆయన కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది.సజ్జన్‌కు శిక్ష-ఎప్పుడు ఏం జరిగిందంటే.. 1991: అల్లర్లలో జస్వంత్, తరుణ్ దీప్ సింగ్‌ల హత్యపై కేసు నమోదు1994: జులై 8 సరైన ఆధారాలు లేవని చెబుతూ సజ్జన్ కుమార్ విచారణకు ఢిల్లీ కోర్టు నిరాకరణ2015 ఫిబ్రవరి 12: సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం2016 నవంబర్ 21: మరింత దర్యాప్తు అవసరమని కోర్టుకు తెలిపిన సిట్2021 ఏప్రిల్ 06: సజ్జన్ కుమార్ అరెస్ట్2021 మే 5 : సజ్జన్‌పై పోలీసుల ఛార్జ్‌షీట్ నమోదు2021, జులై 26: ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం2021, అక్టోబర్ 1: కోర్టులో వాదనలు ప్రారంభం2021, డిసెంబర్ 16: సజ్జన్ కుమార్‌పై అభియోగాలు నమోదు చేసిన కోర్టుజనవరి 31, 2024: సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో తుది వాదనలు విన్న కోర్టు2024, నవంబర్ 8: వాదనలు పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ప్రత్యేక కోర్టు2025, ఫిబ్రవరి 12: సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సజ్జన్ కుమార్‌ను దోషిగా తేల్చిన ఢిల్లీ కోర్టు2025, ఫిబ్రవరి 25: సజ్జన్ కుమార్‌కు జీవితఖైదు ఖరారునానావతి కమిషన్ నివేదిక ప్రకారం.. 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో మొత్తం 2,733 మంది మరణించారు. మొత్తం 587 ఎఫ్ఐఆర్లలో కేవలం 28లో మాత్రమే 400 మందికి శిక్షలు పడ్డాయి. ఇప్పటికే యావజ్జీవంఇక ఢిల్లీ కంటోన్మెంట్(Delhi Cantonment)లో జరిగిన మరో సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో ఆయనకు గతంలోనే యావజ్జీవ కారాగార శిక్ష పడింది. 1984 సిక్కు అల్లర్ల కేసులో సజ్జన్ కుమార్‌ను దోషిగా నిర్దారిస్తూ 2018లో ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది . ఆయనకు యావజ్జీవ జైలుశిక్ష పడడంతో.. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు.

మిర్చి రైతుల్ని నిట్టనిలువునా మోసం చేస్తూ.. అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
సాక్షి, అమరావతి : మిర్చి రైతులను చంద్రబాబు ప్రభుత్వం నిట్టనిలువునా మోసం చేసింది. కేంద్రం మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయమన్నా.. చేయలేమని చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. వేరే రాష్ట్రాలనుంచి మిర్చి వస్తుంది కాబట్టి..మిర్చి విషయంలో మార్కెట్లో జోక్యం చేసుకోలేమని తేల్చేశారు. అదే సమయంలో ఇ-క్రాప్ ఆధారంగా రైతులవారీగా సబ్సిడీ ఆలోచన చేస్తామన్నారు. అదికూడా ఆలోచనలోనే ఉందన్నారు. అయితే, మరి అదే ఇ-క్రాప్ ఆధారంగా మార్కెట్లో జోక్యం ఎందుకు చేసుకోలేకపోతున్నారని, రైతుకు మంచి ధర ఎందుకు ఇవ్వలేకపోతున్నారని రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

EPFO కీలక ప్రకటన: ఆ గడువు మార్చి 15 వరకు పొడిగింపు
ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కటికీ ఈపీఎఫ్ఓ అకౌంట్ ఉంటుంది. వీరందరూ.. ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ELI) పథకం కింద ప్రయోజనాలను పొందడానికి, యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) యాక్టివేట్ చేయడానికి మాత్రమే కాకుండా.. మీ బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయాలి. దీనికి గడువును ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మార్చి 15, 2025 వరకు పొడిగించింది.ఈపీఎఫ్ఓ.. ఈఎల్ఐ స్కీమ్ కింద ప్రయోజనాలను పొందడానికి, యూఏఎన్ యాక్టివేషన్ & బ్యాంక్ ఖాతాలను ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి. దీనికోసం గడువును మార్చి 15కు పొడిగిస్తూ ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 21, 2025న జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొంది. ఈ గడువును ఇప్పటికే పలుమార్పు పొడిగించారు. కాగా ఇప్పుడు మరోమారు పొడిగించారు.యూఏఎన్ అంటే ఏమిటి?యూఏఎన్ అనేది.. అర్హత కలిగిన జీతం పొందే ఉద్యోగికి 'ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్' కేటాయించిన 12-అంకెల సంఖ్య. ఇది వారి కెరీర్ అంతటా వివిధ యజమానులలో వారి PF ఖాతాలను నిర్వహించడానికి ఒకే యాక్సెస్ పాయింట్‌గా పనిచేస్తుంది. ఒకే సంఖ్య కింద వారి ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్‌లను ట్రాక్ చేయడానికి, యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది.యూఏఎన్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే?➤ఈపీఎఫ్ఓ మెంబర్ మొదట అధికారిక ఈపీఎఫ్ఓ పోర్టల్ ఓపెన్ చేయాలి.➤అధికారిక పోర్టల్ ఓపెన్ చేసిన తరువాత సర్వీసెస్ సెలక్ట్ చేసి.. అందులో ఫర్ ఎంప్లాయీఎస్ ఆప్షన్ ఎంచుకోవాలి.➤తరువాత మెంబర్ యూఏఎన్ లేదా ఆన్లైన్ సర్వీసెస్ మీద క్లిక్ చేయాలి. ఆలా క్లిక్ చేసిన తరువాత ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.➤కొత్త పేజీలో.. కుడివైపు కింద భాగంలో ఇంపార్టెంట్ లింక్స్ విభాగంలో యాక్టివేట్ యువర్ యూఏఎన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.➤క్లిక్ చేయగానే.. ఒక ఫారమ్ వంటిది కనిపిస్తుంది. అందులో మీ పేరు, పుట్టిన తేదీ, ఫోన్ నెంబర్ వంటి అవసరమైన అన్ని వివరాలను ఫిల్ చేయాలి.➤అన్నీ ఫిల్ చేసిన తరువాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి, ధృవీకరించడానికి కింద కనిపించే బాక్స్ మీద క్లిక్ చేయాలి.➤తరువాత గెట్ ఆథరైజేషన్ పిన్ మీద క్లిక్ చేయాలి. ఇలా చేసిన తరువాత మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది.➤ఓటీపీ ఎంటర్ చేసిన తరువాత.. ఐ అగ్రీపై క్లిక్ చేయాలి.

మంత్రి నారా లోకేష్‌పై బొత్స ఆగ్రహం
సాక్షి, అమరావతి: గవర్నర్ ప్రసంగంపై చర్చలో వైఎస్సార్సీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాదోపవాదనలు జరిగాయి. ఎమ్మెల్సీ వరుద కళ్యాణి ప్రసంగాన్నిఅడ్డుకునేందుకు మంత్రులు ప్రయత్నించారు. ఆమె ప్రసంగాన్ని మంత్రి నారా లోకేష్ అడ్డుకున్నారు. నాలుగు లక్షల ఉద్యోగాలు చెప్పలేదంటూ మంత్రి నారా లోకేష్ వాదించారు. గవర్నర్ ప్రసంగంలో కల్పించినట్టు రాశారని వరుదు కళ్యాణి అన్నారు. తాము ఇంగ్లీష్ స్పీచ్‌లో ఉన్నదే చెప్తామంటూ మంత్రి లోకేష్ వితండ వాదం చేశారు.మంత్రులు మాటిమాటికీ అడ్డు తగలడంపై విపక్ష నేత బొత్స అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రుల తీరుపై బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఉద్యోగాలు ఇచ్చేశాం అని ఎలా చెప్తారంటూ బొత్స అభ్యంతరం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం టీడీపీ, జనసేన పై ఆధారపడి ఉన్నా ప్రత్యేక హోదా సాధించలేదన్న వరుదు కళ్యాణి వ్యాఖ్యల పట్ల మంత్రి నారా లోకేష్ మళ్లీ అభ్యంతరం తెలిపారు.మేం కేంద్రానికి బేషరతుగా మద్దతు ఇచ్చాం.. మా మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడిందని ఏనాడూ అనలేదంటూ మంత్రి లోకేష్ చెప్పుకొచ్చారు. మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కేంద్రంలో ఉన్నది వీళ్ల ఉమ్మడి ప్రభుత్వం కాదా..?. మా మీద ఆధారపడలేదని చెప్తారా..?. రాష్ట్ర ప్రయోజనాల కోసమన్నారు. అదే మా సభ్యురాలు చెప్తున్నది. 2014 నుండి 2019 మధ్యలో ప్యాకేజీ కోసం హోదాను వదిలేయలేదా..?’’ అంటూ విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.గవర్నర్ ప్రసంగం వాస్తవాలకు విరుద్ధంగా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. ‘‘చంద్రబాబు పాలన గొప్పలు చెప్పుకుంటున్నారు.. కానీ ఓటేసిన జనం చెప్పులతో కొట్టుకుంటున్నారు. తొమ్మిది నెలల్లో రైతులు, మహిళలు, పేదల జీవితాలు తలకిందులైపోయాయి. సూపర్ 6 పథకాలకు ఎగనామం పెట్టడం సుపరిపాలనా..?. ఉద్యోగులకు డీఏ, ఐ ఆర్, పీ ఆర్ సీ ఇవ్వకపోవడమే సుపరిపాలనా..?. అమ్మ ఒడి, రైతు భరోసా ఎగ్గొట్టడం సుపరిపాలన అవుతుందా.?’’ అంటూ వరుదు కల్యాణి నిలదీశారు.‘‘రూ.15 వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపారు. 60 శాతం నిత్యవసర వస్తువులు ధరలు పెంచారు. 4 లక్షలు ఉద్యోగాలు ఇచ్చేశాం అని చెప్పారు..ఎక్కడ ఇచ్చారు..? చూపించండి. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ జగన్ 6 నెలల్లో లక్షా 25 వేల ఉద్యోగాలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం.. తొలి సంతకం పెట్టిన మెగా డీఎస్సీని కూడా పూర్తి చేయలేదు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని కూడా ఇవ్వకుండా మోసం చేశారు. టీడీపీ పై ఆధారపడ్డ కేంద్ర ప్రభుత్వం ఉన్నా ప్రత్యేక హోదాను సాధించలేదు’’ అని వరుదు కల్యాణి దుయ్యబట్టారు.గవర్నర్ ప్రసంగంలో దశ లేదు, దిశలేదు .. మీడియాతో బొత్సగవర్నర్ ప్రసంగంలో దశ లేదు.. దిశలేదు.. ఓ క్లారిటీ లేదని విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. శాసనమండలి మీడియా పాయింట్లో బొత్స మీడియాతో మాట్లాడారు. గవర్నర్ చాలా శ్రమించి ప్రసంగం కొనసాగించారు. ఆయన ప్రసంగంలో దశలేదు.. దిశలేదు. ఓ క్లారిటీ లేదు. సుప్రీంకోర్టు జడ్జీగా పనిచేసిన వ్యక్తితో అబద్దాలు, అసత్యాలు చెప్పించారు.19 మంది వీసీలతో బలవంతంగా రాజీనామాలు చేయించారు. వీసీలు తమ రాజీనామాల లేఖలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, హయ్యర్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ నుండి ఫోన్స్ వచ్చాయని, అందుకే రాజీనామా చేశామని పేర్కొన్నారు. వీసీలు రాజీనామాలపై కమిటీ వేయాలని డిమాండ్ చేశాం.. వేస్తామన్నారు. తర్వాత మాట మార్చారు. 19 మంది వీసీల రాజీనామా లేఖల్ని బయట పెట్టాలి. ఒకేసారి అంతమంది వీసీలు ఎందుకు రాజీనామా చేశారో చెప్పాలి. ప్రభుత్వాలు వస్తుంటాయి.. మారుతుంటాయి. అది వ్యవస్థ.. దాన్ని మార్చితే ఎలా?ప్రజా వ్యతిరేక, ప్రజలకు మేలు చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. సందర్భం, సమయం కానీ అంశాలు సభలో మాట్లాడం సమంజసం కాదు. విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలాడుతున్నారు. మంత్రి లోకేష్ ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు. గ్రూప్ 2 మెయిన్స్‌పై లోకేష్ ట్వీట్ చేశారు.. మేం మా అభిప్రాయం చెప్పాం. వాకౌట్ చేయడానికి రెండు కారణాలు.ప్రసంగంలో దశ ,దిశ లేదు. గవర్నర్‌తో విధ్వంసం అనే మాట మాట్లాడించొచ్చా? మాట్లాడిన దాంట్లో కూడా అద్భుతాలు ఉన్నాయా అంటే అది లేదు.2047కి సూపర్ టెండర్ అంట..అంటే సూపర్ సిక్స్ పోయిందా?’ అని ప్రశ్నించారు.

ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీనే: సుబ్రహ్మణ్య స్వామి
అమరావతి, సాక్షి: ఏపీలో ప్రధాన ప్రతిపక్ష హోదా వైఎస్సార్సీపీకే దక్కాలని బీజేపీ ఫైర్‌బ్రాండ్, ప్రముఖ లాయర్ సుబ్రహ్మణ్య స్వామి (Subramanian Swamy) అంటున్నారు. ఇటీవల తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగిన హింసపై ఆయన కోర్టుకెక్కారు. ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే మీడియాకు వెల్లడించారు.‘‘తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక(Tirupati Deputy Mayor Election) సందర్భంగా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. చాలామందిని భయపెట్టి దాడులు చేశారు. ఎన్నికల సమయంలో హింసను నివారించేందుకు తీవ్రమైన చర్యలు తీసుకోవాలి అని పిల్ వేశా. నేను వేసిన పిల్ మార్చి 12వ తేదీన విచారణకు వస్తుంది’’ అని మీడియాకు తెలిపారాయన. తిరుపతి ఘటనలో కేవలం ఎఫ్ఐఆర్ మాత్రమే వేశారని, ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారాయన. ఈ విషయంపై కోర్టు చర్యలు తీసుకుంటే.. దేశవ్యాప్తంగా ఇదొక చట్టంగా మారుతుంది అని సుబ్రహ్మణ్య స్వామి అభిప్రాయడ్డారు.ప్రధాన ప్రతిపక్ష హోదా వైఎస్సార్‌సీపీదేఏపీలో ప్రతిపక్షంలో ఒక్క వైఎస్సార్సీపీ(YSRCP)నే ఉంది. కాబట్టి ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష(Principal Opposition) హోదా ఇవ్వడంలో ఎలాంటి తప్పులేదు. అసెంబ్లీలో తక్కువ మంది ఎమ్యెల్యేలు ఉన్నా వైఎస్సార్సీపీకి ఆ హోదా దక్కాల్సిందే అని స్పష్టం చేశారాయన. ఈ క్రమంలో ఆయన మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 👉తిరుపతి లడ్డూ అంశం(Tirupati Laddu Controversy) ముగిసిపోయింది. కల్తీలాంటి అంశాలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. తిరుపతి లడ్డూను కల్తీ చేయాలని నిజమైన భక్తులు ఎవరూ అనుకోరు. 👉మంచి విషయం ఎవరు చెప్పినా పార్టీలకతీతంగా అంగీకరించాలి. నా నిర్ణయాలను పార్టీ ఎన్నడూ వ్యతిరేకించలేదు అని అన్నారాయన. ఇదిలా ఉంటే.. ఏపీ కూటమి ప్రభుత్వం (AP Kutami Prabhutvam)లో బీజేపీ భాగమై ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారి తీసే అవకాశం లేకపోలేదు.

నాపై కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు.. సిగ్గనిపించడం లేదా: ప్రీతి జింటా
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, పంజాబ్ జట్టు యజమాని ప్రీతి జింటా (Preity Zinta) కాంగ్రెస్ (Congress) పార్టీపై భగ్గుమన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అంటూ ఆమె పేర్కొన్నారు. న్యూ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంక్ నుంచి ఆమె తీసుకున్న రూ.18 కోట్ల రుణాన్ని బీజేపీ మాపీ చేసిందని కేరళ కాంగ్రెస్ పార్టీ ఆరోపించిన విషయం తెలిసిందే. అందుకు గాను ఆమె తన సోషల్ మీడియా ఖాతాలను బీజేపీకి అప్పగించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. గత వారం ఆ బ్యాంకును మూసేయడంతో డిపాజిటర్లు రోడ్డునపడ్డారని ఆ పార్టీ పేర్కొంది. అయితే, ఇదే విషయంపై ప్రీతి జింటా ఫైర్ అయ్యారు.'నా సోషల్‌మీడియా అకౌంట్స్ అన్నీ సొంతంగానే నిర్వహించుకుంటాను. మరోకరికి అప్పగించలేదు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటుగా ఉంది. 10ఏళ్ల కిందటే ఆ బ్యాంకు నుంచి తీసుకొన్న రుణాన్ని తీర్చేశాను. ఇన్నేళ్ల తర్వాత ఈ అంశపై కాంగ్రెస్ పార్టీ చేసిన పోస్ట్ చూసి నేను ఆశ్చర్యపోయాను. నేను తీసుకున్న రుణాన్నీ ఎవరూ మాఫీ చేయలేదు. ఆ అవసరం నాకు లేదు. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయడం ఆపేయండి. పూర్తి విషయం తెలుసుకోకుండా అసత్య ప్రచారం చేయడం సిగ్గుచేటు. సాధారణంగా ఇలాంటి రూమర్స్‌కు నేను రియాక్ట్ అవను. కానీ, భవిష్యత్‌లో ఏమైనా ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో మాత్రమే వివరణ ఇస్తున్నాను.' అని ప్రీతి జింటా తెలిపారు.న్యూఇండియా కోఆపరేటివ్ ముంబై బ్రాంచ్‌లో ప్రితీ జింటా లోన్ తీసుకున్నట్లు తెలిపారు. అదే బ్యాంక్‌లో జనరల్ మేనేజర్, అకౌంట్స్ హెడ్‌గా పనిచేస్తున్న హితేష్ మెహతా రూ.122 కోట్ల స్కామ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఆయన్ను ముంబై పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రీతి జింటాపై కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఆరోపణలు చేసింది.

చంద్రబాబు జస్ట్ బిల్డప్ బాబాయ్ అంతే!
విపక్షంలో ఉన్నప్పుడు.. నోటికొచ్చిన ఆరోపణలు చేయడం, అధికారంలోకి వస్తే.. ఎక్కడా లేని నీతులు చెప్పడం అందరికీ సాధ్యమయ్యే పనికాదు. కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఈ విద్యలో ఆరితేరారు. దానికి బిల్డప్ బాబాయిలుగా పేరొందిన ఈనాడు, ఆంధ్రజ్యోతి.. లాంటి ఎల్లో మీడియా భజన ఎటూ ఉంటుంది. ఈమధ్య.. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) గుంటూరు మిర్చియార్డులో రైతులను పరామర్శించడానికి వెళ్లారు. గిట్టుబాటు ధరలు రాక రైతులు విలవిలలాడుతున్న తరుణంలో జగన్ అక్కడకు వెళితే.. ఆ పర్యటనను చంద్రబాబు తీవ్రంగా తప్పు పడుతున్నారు!. రైతులు కష్టాలలో ఉంటే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకాని, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాని పరామర్శ చేసి.. వారిని ఆదుకోవడానికి ఏ చర్యలు తీసుకునేది చెప్పలేదు. పైగా జగనే ఏదో తప్పు చేశాడని చంద్రబాబు పదే పదే అంటున్నారు. శాసనమండలి గ్రాడ్యుయేట్ల నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయట!. కోడ్ అమలులోకి వచ్చిందట!. అందుకే రైతులను ఎవరూ పలకరించి వారి కన్నీరు తుడవరాదట!. రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం నడుచుకోవాలట!. ఏమైనా అర్ధం ఉందా?.. అసలు మిర్చియార్డులో పడిగాపులు పడుతున్న రైతుల వద్దకు ఎవరూ వెళ్లరాదని ఎన్నికల కమిషన్ ఎక్కడైనా చెప్పిందా?. విచిత్రం ఏంటంటే.. ఇదే ఎన్నికల సంఘంపై ముఖ్యమంత్రిగా ఉండి 2019లో చంద్రబాబు(Chandrababu) ఎన్ని విమర్శలు చేశారో తెలియదా?. ఏకంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఛాంబర్‌కు వెళ్లి దబాయించి గొడవ చేశారు. మరి ఇప్పుడేమో సుద్దులు చెబుతున్నారు. కరోనా సమయంలో ర్యాలీల మాదిరి వెళ్లవద్దని, సభలు జరపవద్దని దేశ వ్యాప్తంగా నిబంధనలు వస్తేనే పట్టించుకోని పెద్దమనిషి చంద్రబాబు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు శాంతిభద్రత ల సమస్యలు వస్తాయని ,ఫలానా చోటకు వెళ్లవద్దని పోలీసులు వారించినా, వారిని తోసుకుని మరీ వెళ్లిన చరిత్ర చంద్రబాబుది. 👉అనపర్తి వద్ద అప్పట్లో ఏమి చేశారో గుర్తు లేదేమో!. మదనపల్లె సమీపంలోని అంగళ్లు వద్ద వైఎస్సార్సీపీవాళ్లను చూపిస్తూ.. తన్నండి.. అంటూ టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. అధికారంలోకి రాగానే ఫిర్యాదుదారుని బెదిరించి ఆ కేసు లేకుండా చేసుకోవడానికి ప్రయత్నించిన చంద్రబాబు చట్టం గురించి చెబుతున్నారు. 👉పుంగనూరు వద్ద తన సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు పోలీసుల వ్యాన్‌ను తగలబెట్టి, రాళ్లతో పోలీసులపై దాడి చేస్తే ఒక కానిస్టేబుల్ కన్నుపోయింది. ఆ ఘటనలో కనీసం సానుభూతి తెలపని చంద్రబాబు.. ముఖ్యమంత్రి కాగానే ఎక్కడాలేని చట్టాలు, నీతులు చెబుతుంటారు. పోనీ ఆయన ఏమైనా కోడ్ ఉందని ఏ కార్యక్రమం ప్రచారం చేయకుండా ఉంటున్నారా?. విజయవాడలో ఏకంగా మ్యూజిక్ నైట్ పెట్టుకుని ఎంజాయ్ చేశారే! అప్పుడు కోడ్ అడ్డం రాలేదా? రైతులను పరామర్శ చేస్తేనే కోడ్ వచ్చిందా?.. .. గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లినందుకు జగన్‌తో సహా ఎనిమిదిమందిపై కేసులు పెట్టారు. మరి అక్కడలేని మాజీ మంత్రి పేర్నినానిపై కూడా కేసు పెట్టాలని ఏ చట్టం చెబుతోంది?. మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ వెళితే భద్రత కల్పించడం ప్రభుత్వ కనీస బాధ్యత కాదా?. అయితే సీఎంగా ఉండి ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరించడమే కాకుండా.. ఎదురు ఆరోపణలు చేయడం చంద్రబాబుకే చెల్లుతుంది మరి. ఆయన మరికొన్ని చిత్రమైన ప్రకటనలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ రైతులకు ఏమీ చేయలేదట..! రైతులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదట. ఇంతకన్నా పచ్చి అబద్దాలు ఏమైనా ఉంటాయా?. రైతుల కోసం ప్రత్యేకంగా రైతు భరోసా కేంద్ర వ్యవస్థను తెచ్చి వాటి ద్వారా వాళ్లకు అవసరమైన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు అందించడంతో పాటు పంటల సలహలు, పంట కొనుగోళ్లు.. అన్నీ చేసిందే జగన్. అలాంటి నాయకుడిపై ఇలాంటి విమర్శ చేయడానికి చంద్రబాబు మనసు ఎలా వచ్చిందో అర్ధం కాదు. గతంలో ఎరువుల షాపుల వద్ద రైతులు తమ చెప్పులు క్యూలలో ఎట్టుకుని పడిగాపులు పడి ఉండవలసి వచ్చేది. ఆ పరిస్థితిని తప్పించి రైతులకు గౌరవం తెచ్చిన వ్యక్తి జగన్. దేశంలోనే మొదటిసారిగా రైతులకు పెట్టుబడి సాయం పధకాన్ని ప్రకటించిన రాజకీయ పార్టీ వైఎస్సార్సీపీ. అధికారంలోకి వచ్చాక అన్ని పార్టీల్లా హామీలను ఎగ్గొట్టకుండా.. దానిని అమలు చేసి చూపారాయన. ఏడాదికి రూ13,500 చొప్పున సాయం అందించడం ఒక ఎత్తు అయితే.. ఆయా పంటల ధరల స్థిరీకరణకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది జగన్ కాదా?టమోటా తదితర పంటలకు ధర తగ్గినప్పుడు వెంటనే జోక్యం చేసుకుని మార్కెట్ పెంచింది జగన్ ప్రభుత్వం కాదా?ఇప్పుడేమో కనీసం రైతులను పలకరించని చంద్రబాబేమో.. చాలా చేసేస్తున్నారని ఎల్లో మీడియా బిల్డప్ ఇస్తే సరిపోతుందా?పాపం!గత ఏడాది 21 వేల నుంచి 27 వేల రూపాయల వరకు మిర్చి ధర పలికితే ,ఈసారి అందులో సగం కూడా ఇప్పుడు రావడం లేదని రైతుల ఆక్రోశం. కేంద్రం కూడా దీనిపై తూతూమంత్రంగా వ్యవహరిస్తోంది. అయినా మిర్చి రైతులకు ఊరట అని ఈనాడు బిల్డప్. అవును డబ్బులు ఊరికే రావు.. అన్నట్లుగా ఈనాడుకు చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఆ స్థాయిలో లాభం ఉంటోంది కదా!👉కొందరు రైతులు ఇప్పుడు ఓపెన్‌గానే చెబుతున్నారు.. 20వేల రూపాయల పెట్టుబడిసాయం ఇస్తామని చంద్రబాబు వాగ్దానం చేస్తే నమ్మి ఓట్లు వేశామని.. తీరా చూస్తే ఇరవై రూపాయలు కూడా ఇవ్వలేదని ఆవేదన చెందుతున్నారు. యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు విజయ్ కేసరి చేసిన వీడియో ఆసక్తికరంగా ఉంది. 👉పవన్ కల్యాణ్ సినిమా టిక్కెట్ల రేట్లు పెంచుకోవడం కోసం ఎంతలా మాట్లాడారు?. సినిమా నిర్మాణానికి పెట్టుబడి ఎలా పెరిగింది?.. తదితర అంశాలపై ఆయన మాట్లాడారు. దానికి చంద్రబాబు కూడా మద్దతు ఇచ్చారు. ఈ పాయింట్‌నే విజయ్ కేసరి ప్రముఖంగా ప్రస్తావించారు 👉సినిమా టిక్కెట్ల ధరలు , మద్యం ధరలు పెంచుకోవడానికి చూపిన శ్రద్ద.. రైతుల ఉత్పత్తుల ధరలకు చూపరా? అని విజయ్ కేసరి ప్రశ్నించారు. అలాగే.. రైతులకు పెట్టుబడి వ్యయం పెరగలేదా? అని ఆయన అడిగారు. ఇవి వాస్తవాలు. 👉మిర్చి రైతుల విషయంలో ప్రభుత్వమే చొరవ తీసుకుని కొనుగోళ్లకు రంగంలో దిగాల్సింది. కానీ, ఆ పని చేయకపోగా.. జగన్ పైనే ఆరోపణలు చేస్తున్నారు. కేంద్రానికి ఆయన ఒక లేఖ రాసి చేతులు దులుపుకున్నారు. 👉చంద్రబాబు ప్రభుత్వం రైతుల పట్ల అనుసరిస్తున్న విధానాలను తప్పుపడుతూ జగన్ కూడా పలు వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 15న మ్యూజికల్ నైట్ జరుపుకోవడానికి కోడ్ అడ్డం కాలేదా? అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి వెళ్లి.. రైతుల సమస్యలపై వెళ్లినట్లు కలరింగ్ ఇవ్వడమేమిటని చంద్రబాబును జగన్ నిలదీశారు. 👉ధాన్యం కొనుగోళ్లకు తమ హయాంలో 65వేల కోట్లు వ్యయం చేశామని, ఇతర పంటలకు స్థిరీకరణ నిధి ద్వారా సుమారు రూ.7,800 కోట్ల వ్యయం చేశామని కూడా జగన్ చెప్పారు. మిర్చియార్డులో ఓట్ల ప్రస్తావన తేకపోయినా, మైక్ వాడకపోయినా,అసలు ఎన్నికలలో తమ పార్టీ పోటీచేయకపోయినా కేసులు పెట్టారని, దీనికి భయపడేది లేదని.. రైతుల తరపున పనిచేస్తామని జగన్ స్పష్టం చేశారు. గతంలో ఎప్పుడూ ఇలా రైతుల సమస్యలపై పనిచేసిన రాజకీయ పార్టీల నేతలపై కేసులు పెట్టిన సందర్భాలు లేవు. ఏదో ఒక వంకతో మాజీ సీఎంకు భద్రత కల్పించకపోవడం.. పైగా తప్పుడు కేసులు పెట్టడం అంతా రెడ్ బుక్ పిచ్చి కుక్క ప్రభావంగానే వైఎస్సార్సీపీ భావిస్తోంది. ఒక్కటి మాత్రం వాస్తవం. ఉమ్మడి ఏపీలో రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి చూపించింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అదే.. ఉచిత విద్యుత్ ఇవ్వడానికి వీలు లేదని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. రైతుల రుణాలు మాఫీ అవ్వడానికి రాజశేఖరరెడ్డి కృషి చేస్తే.. తాకట్టులో ఉన్న బంగారంతో సహా రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పి చేతులెత్తేసిన నేతగా చంద్రబాబు చరిత్రకెక్కారు. అలాగే.. రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న నేత జగన్. అదే.. రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఇరవైవేల రూపాయల సాయం చేస్తామని చెప్పి.. ఏడాది గడిచినా ఆ హామీని గాలికొదిలేసిన నేతగా చంద్రబాబు మిగిలిపోయారు. అయినా ఎల్లో మీడియా ద్వారా రైతన్నపై ఫోకస్ పెట్టారంటూ, మిర్చి రైతుకు ఊరట వచ్చేసిందంటూ బిల్డప్ ఇచ్చుకుని చంద్రబాబు అండ్ కో సంతోషపడవచ్చు. కాని దానివల్ల రైతులకు ఒరిగేది ఏమి ఉంటుంది?..:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
నెట్టింట వైరల్ అవుతున్న 'మంగ్లీ' సాంగ్
పెళ్లి చేసుకుంటారా?.. ఉద్యోగం వదులుకుంటారా?: కంపెనీ వార్నింగ్
ఆ ఊళ్లు.. ‘రెండు కళ్లు’
టీమిండియా స్టార్లపై ‘చీఫ్ సెలక్టర్’ ఆగ్రహం! అగార్కర్‌కు విన్నపం
మిర్చి రైతుల్ని నిట్టనిలువునా మోసం చేస్తూ.. అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
టీమిండియా వైస్ కెప్టెన్‌కు షాక్
‘సహాయక చర్యలకు ఆటంకం కలగకూడదనే..’
శివరాత్రికి జాగారమా? ఈ సినిమాలు చూస్తూ భక్తి పారవశ్యం
వైఎస్ జగన్,వైఎస్సార్సీపీ అంటే చంద్రబాబుకు భయం : కురసాల
అనుకున్నదానికంటే.. అద్భుతం: చాట్‌జీపీటీ రెజ్యూమె
భారత్‌ను ఓడించకపోతే నా పేరు షెహబాజ్ షరీఫే కాదు
Aus vs SA: కీలక మ్యాచ్‌కు వర్షం అడ్డంకి.. మ్యాచ్ రద్దు
మీకు 21 సీట్లు ఇచ్చినా హిమాలయాలకు వెళ్లిపోతారని సాక్షాత్తూ మోదీ గారే అంటున్నారు.. హోదా వాళ్లకిచ్చినా ప్రజల తరఫున మాట్లాడుతారు
అతి చేయొద్దు.. ఇలాంటి ప్రవర్తన సరికాదు: పాక్ దిగ్గజం ఆగ్రహం
అయితే అన్నీ ఒక్కటేనన్నమాట!
NZ Vs BAN: చర్రిత సృష్టించిన రచిన్ రవీంద్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
ఈ రాశి వారికి ఆస్తి వివాదాల పరిష్కారం.. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి
క్రికెట్ స్టేడియంలో ఊర్వశి ‘దబిడిదిబిడి’.. ‘ఓరీ’ఎంత పనిచేశావ్!
‘అమ్మా.. డ్యాన్స్ ప్రాక్టీస్‌కు వెళ్తున్నా’
షేన్ వాట్సన్ సెంచరీ వృథా.. ఆసీస్‌పై వెస్టిండీస్ ఘన విజయం
నెట్టింట వైరల్ అవుతున్న 'మంగ్లీ' సాంగ్
పెళ్లి చేసుకుంటారా?.. ఉద్యోగం వదులుకుంటారా?: కంపెనీ వార్నింగ్
ఆ ఊళ్లు.. ‘రెండు కళ్లు’
టీమిండియా స్టార్లపై ‘చీఫ్ సెలక్టర్’ ఆగ్రహం! అగార్కర్‌కు విన్నపం
మిర్చి రైతుల్ని నిట్టనిలువునా మోసం చేస్తూ.. అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
టీమిండియా వైస్ కెప్టెన్‌కు షాక్
‘సహాయక చర్యలకు ఆటంకం కలగకూడదనే..’
శివరాత్రికి జాగారమా? ఈ సినిమాలు చూస్తూ భక్తి పారవశ్యం
వైఎస్ జగన్,వైఎస్సార్సీపీ అంటే చంద్రబాబుకు భయం : కురసాల
అనుకున్నదానికంటే.. అద్భుతం: చాట్‌జీపీటీ రెజ్యూమె
భారత్‌ను ఓడించకపోతే నా పేరు షెహబాజ్ షరీఫే కాదు
Aus vs SA: కీలక మ్యాచ్‌కు వర్షం అడ్డంకి.. మ్యాచ్ రద్దు
మీకు 21 సీట్లు ఇచ్చినా హిమాలయాలకు వెళ్లిపోతారని సాక్షాత్తూ మోదీ గారే అంటున్నారు.. హోదా వాళ్లకిచ్చినా ప్రజల తరఫున మాట్లాడుతారు
అతి చేయొద్దు.. ఇలాంటి ప్రవర్తన సరికాదు: పాక్ దిగ్గజం ఆగ్రహం
అయితే అన్నీ ఒక్కటేనన్నమాట!
NZ Vs BAN: చర్రిత సృష్టించిన రచిన్ రవీంద్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
ఈ రాశి వారికి ఆస్తి వివాదాల పరిష్కారం.. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి
క్రికెట్ స్టేడియంలో ఊర్వశి ‘దబిడిదిబిడి’.. ‘ఓరీ’ఎంత పనిచేశావ్!
‘అమ్మా.. డ్యాన్స్ ప్రాక్టీస్‌కు వెళ్తున్నా’
షేన్ వాట్సన్ సెంచరీ వృథా.. ఆసీస్‌పై వెస్టిండీస్ ఘన విజయం
సినిమా

ఆ ఊరి పేరు 'ప్రభాస్'.. ఎక్కడో తెలుసా?
డార్లింగ్ ప్రభాస్ పేరు చెప్పగానే పాన్ ఇండియా సినిమాలు, వేల కోట్ల వసూళ్లు, ఇంటర్నేషనల్ క్రేజ్.. ఇలా చాలా గుర్తొస్తాయి. కానీ ప్రభాస్ పేరు మీద ఓ ఊరు ఉందని, అది కూడా మనకు పక్కనే ఉండే నేపాల్ లో అని మీలో ఎంతమందికి తెలుసు?రీసెంట్ టైంలో తెలుగు కుర్రాళ్లు చాలామంది యూట్యూబ్ వీడియోలు, మోటో వ్లాగింగ్ చేస్తున్నారు. అలా ఓ తెలుగు యువకుడు.. నేపాల్ లో పర్యటిస్తున్నాడు. అక్కడ అనుకోకుండా ప్రభాస్ పేరుతో ఉన్న ఓ ఊరి బోర్డ్ కనిపించింది. ఇంకేం వెంటనే ఓ వీడియో తీసి పోస్ట్ చేశాడు. ఇప్పుడది వైరల్ అయిపోయింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'తండేల్'.. ప్లాన్ మారిందా?)అయితే ఈ ఊరికి మొదటి నుంచి ప్రభాస్ పేరు ఉందని తెలుస్తోంది. ఏదేమైనా డార్లింగ్ హీరో ఫ్యాన్స్ మాత్రం తన అభిమాన హీరో పేరుపై ఏకంగా నేపాల్ లో ఊరు ఉందని తెగ మురిసిపోతున్నారు.ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ (వర్కింగ్ టైటిల్) సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. త్వరలో సందీప్ రెడ్డి వంగా తీయబోయే 'స్పిరిట్' చేస్తాడు. దీనిపై అంచనాలు గట్టిగానే ఉన్నాయండోయ్.(ఇదీ చదవండి: 38 ఏళ్ల బంధానికి ఎండ్ కార్డ్.. నటుడు గోవిందా విడాకులు!)

38 ఏళ్ల బంధానికి ఎండ్ కార్డ్.. నటుడు గోవిందా విడాకులు!
ఇండస్ట్రీలో పెళ్లి-విడాకులు అనేది చాలా కామన్. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం చాలా ఏళ్ల పాటు కలిసున్న కొందరు స్టార్ కపుల్స్ విడిపోతున్నారు. ఏఆర్ రెహమాన్, జీవీ ప్రకాశ్, హీరో జయం రవి.. ఇలా తదితరులు ఏళ్లకు ఏళ్ల బంధానికి ఎండ్ కార్డ్ వేశారు. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో సీనియర్ నటుడు చేరినట్లు తెలుస్తోంది.అప్పట్లో బాలీవుడ్ లో టాప్ హీరోగా పేరు తెచ్చుకున్న గోవిందా.. ప్రస్తుతం పెద్దగా లైమ్ లైట్ లో లేడు. ఇతడే తన 38 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికేందుకు సిద్ధమయ్యాడట. గోవిందా, ఇతడి భార్య సునీత అహుజా.. గత కొన్ని రోజుల నుంచి వేర్వురుగా ఉంటున్నారట.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'తండేల్'.. ప్లాన్ మారిందా?)కొంతకాలంగా గోవిందా దంపతుల మధ్య విబేధాలు నడుస్తున్నాయని, దీంతో ఇక విడాకులు తప్పనిసరి అనుకున్నారని తెలుస్తోంది. మరోవైపు గోవిందా.. ఓ మరాఠీ నటితో రిలేషన్ షిప్ లో ఉన్నాడని, భార్య నుంచి విడిగా ఉండటానికి ఇది కూడా ఓ కారణమని అంటున్నారు. ఇప్పటివరకైతే ఈ జంట.. విడాకుల అంశంపై స్పందించలేదు. కానీ మీడియాలో మాత్రం టాక్ గట్టిగా వినిపిస్తోంది.కొన్నాళ్ల క్రితం ఇంటర్వ్యూలో మాట్లాడిన సునీత కూడా.. భర్త గోవిందాతో మాట్లాడి చాలా రోజులైందని చెప్పింది. ప్రస్తుతం తన కూతురు, కొడుకుతో కలిసి మాత్రమే ఉంటున్నానని పేర్కొంది. ఈమె చెప్పిన దానిబట్టి చూస్తుంటే విడిగా ఉంటున్నారని అర్థమైంది. త్వరలో విడాకుల విషయాన్ని అధికారికంగ ప్రకటిస్తారేమో చూడాలి. 1987లో వీళ్లిద్దరూ పెళ్లిచేసుకోగా.. 1988లో కూతురు పుట్టిన తర్వాతే పెళ్లి విషయాన్ని బయటపెట్టారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?)

నాపై కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు.. సిగ్గనిపించడం లేదా: ప్రీతి జింటా
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, పంజాబ్ జట్టు యజమాని ప్రీతి జింటా (Preity Zinta) కాంగ్రెస్ (Congress) పార్టీపై భగ్గుమన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అంటూ ఆమె పేర్కొన్నారు. న్యూ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంక్ నుంచి ఆమె తీసుకున్న రూ.18 కోట్ల రుణాన్ని బీజేపీ మాపీ చేసిందని కేరళ కాంగ్రెస్ పార్టీ ఆరోపించిన విషయం తెలిసిందే. అందుకు గాను ఆమె తన సోషల్ మీడియా ఖాతాలను బీజేపీకి అప్పగించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. గత వారం ఆ బ్యాంకును మూసేయడంతో డిపాజిటర్లు రోడ్డునపడ్డారని ఆ పార్టీ పేర్కొంది. అయితే, ఇదే విషయంపై ప్రీతి జింటా ఫైర్ అయ్యారు.'నా సోషల్‌మీడియా అకౌంట్స్ అన్నీ సొంతంగానే నిర్వహించుకుంటాను. మరోకరికి అప్పగించలేదు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటుగా ఉంది. 10ఏళ్ల కిందటే ఆ బ్యాంకు నుంచి తీసుకొన్న రుణాన్ని తీర్చేశాను. ఇన్నేళ్ల తర్వాత ఈ అంశపై కాంగ్రెస్ పార్టీ చేసిన పోస్ట్ చూసి నేను ఆశ్చర్యపోయాను. నేను తీసుకున్న రుణాన్నీ ఎవరూ మాఫీ చేయలేదు. ఆ అవసరం నాకు లేదు. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయడం ఆపేయండి. పూర్తి విషయం తెలుసుకోకుండా అసత్య ప్రచారం చేయడం సిగ్గుచేటు. సాధారణంగా ఇలాంటి రూమర్స్‌కు నేను రియాక్ట్ అవను. కానీ, భవిష్యత్‌లో ఏమైనా ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో మాత్రమే వివరణ ఇస్తున్నాను.' అని ప్రీతి జింటా తెలిపారు.న్యూఇండియా కోఆపరేటివ్ ముంబై బ్రాంచ్‌లో ప్రితీ జింటా లోన్ తీసుకున్నట్లు తెలిపారు. అదే బ్యాంక్‌లో జనరల్ మేనేజర్, అకౌంట్స్ హెడ్‌గా పనిచేస్తున్న హితేష్ మెహతా రూ.122 కోట్ల స్కామ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఆయన్ను ముంబై పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రీతి జింటాపై కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఆరోపణలు చేసింది.

పరోటా మాస్టర్‌గా శిక్షణ తీసుకున్న విజయ్ సేతుపతి
కోలీవుడ్ నటుడు విజయ్‌సేతుపతి ఇటీవల నటించిన చిత్రం మహారాజా. ఈయన నటించిన 50వ చిత్రం ఇది. ఆ మధ్య తెరపైకి వచ్చిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. కాగా ప్రస్తుతం విజయ్‌సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలలో పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఒకటి విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఇందులో జాతీయ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ నిత్యామీనన్ ఆయనకు జోడీగా నటిస్తున్నారు. (సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ 10th ఎడిషన్: మీ అభిమాన తారలను నామినేట్ చేయండి)సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటుడు యోగిబాబు, సెంబన్ వినోద్ జోస్, దీపా శంకర్, శరవణన్, రోషిణి హరిప్రియన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కేక్ కట్ చేసిన ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు. ఇకపోతే ఇందులో నటుడు విజయ్‌సేతుపతి పరోటా మాస్టర్‌గా నటిస్తున్నట్లు తెలిసింది. అందుకోసం ఆయన కొంత శిక్షణ పొందినట్లు సమాచారం. కాగా ఇంతకు ముందు నటుడు సూర్య హీరోగా ఎదర్కుమ్ తుణిందవన్ (తెలుగులో ఈటీ ) చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు పాండిరాజా చిన్న గ్యాప్ తరువాత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇంకా పేరు నిర్ణయించలేదు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ఇకపోతే నటుడు విజయ్‌సేతుపతి ఈ చిత్రంతో పాటూ ఎస్, గాంధీ టాకీస్, మిష్కిన్ దర్శకత్వంలో ట్రైన్ మొదలగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
న్యూస్ పాడ్‌కాస్ట్

ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం కొనసాగించాలి... వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు

చంద్రబాబు మోసాలకు గ్రూపు-2 అభ్యర్థులే ప్రత్యక్ష నిదర్శనం... న్యాయం చేస్తానంటూ నట్టేట ముంచాడు... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్‌లో భూ దోపిడీకి ఇక రాజముద్ర... అమరావతిలో రైతుల నుంచి లాక్కున్న అసైన్డ్ భూములకు రిటర్నబుల్ ప్లాట్లు.. సీఆర్డీఏకు చంద్రబాబు ప్రభుత్వం ఆదేశం

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రతలో చంద్రబాబు ప్రభుత్వం కుట్ర... జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న నాయకుడి భద్రతపై ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం

‘మార్గదర్శి’ మోసాల కేసును మూసివేసే దిశగా అడుగులు... చంద్రబాబు డైరెక్షన్లో ప్లేటు ఫిరాయించిన ఆంధ్రప్రదేశ్ సీఐడీ

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ పాలనలో రైతు బతికే పరిస్థితి లేదు... ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం

తప్పు చేసినోళ్లు ఎక్కడున్నా వదలం. టీడీపీకి కొమ్ముకాసే పోలీసు అధికారులు, ఆ పార్టీ నేతలకు వైఎస్ జగన్ హెచ్చరిక. జైలులో ఉన్న వంశీని పరామర్శించిన వైఎస్ జగన్

తెలంగాణలో వెంటనే కొత్త రేషన్‌కార్డులు జారీ చేయాలి... అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం

మేము ఒక తప్పు చేయాలంటే, ఒకటేంటి సార్ మూడు చేద్దామంటున్నారు... అధికారుల వ్యవహార శైలిపై సంతోషంగా లేను... తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి నేతలకు కప్పం కడితేనే మైనింగ్... రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన గనుల తవ్వకాలు
క్రీడలు

IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా ఫోర్ టైమ్ వరల్డ్‌కప్ విన్నర్
ఐపీఎల్ 2025 (IPL) సీజన్ ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) కొత్త అసిస్టెంట్ కోచ్‌ను (Assistant Coach) నియమించుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన 51 ఏళ్ల మథ్యూ మాట్ (Matthew Mott) డీసీ కొత్త అసిస్టెంట్ కోచ్‌గా ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటరైన మాట్.. వివిధ జాతీయ జట్ల హెడ్ కోచ్‌గా పలు వరల్డ్‌కప్‌లు గెలిచాడు. 2022 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన ఇంగ్లండ్ పురుషుల జట్టుకు మాట్ హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. ఆస్ట్రేలియా మహిళల జట్టు హెడ్ కోచ్‌గా మాట్కు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. మాట్ 2015-2022 మధ్యలో ఆసీస్ మహిళా టీమ్‌కు చిరస్మరణీయ విజయాలు అందించాడు. ఈ మధ్యకాలంలో ఆసీస్ ఓసారి వన్డే వరల్డ్‌కప్.. రెండు సార్లు టీ20 వరల్డ్‌కప్ గెలిచింది. దీని తర్వాత మాట్ ఇంగ్లండ్ పురుషుల జట్టు వైట్‌బాల్ హెడ్ కోచ్‌గా ఎంపికయ్యాడు.మాట్ ఇంగ్లండ్‌ను 2022 టీ20 వరల్డ్‌కప్ గెలిపించినప్పటికీ.. అతని హయాంలో ఇంగ్లండ్ 2023 వన్డే వరల్డ్‌కప్, 2024 టీ20 వరల్డ్‌కప్‌ను నిలబెట్టుకోలేకపోయింది. ఫలితంగా మాట్ తన పదవీకాలం మధ్యలోనే ఇంగ్లండ్ హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేశాడు. ఇంగ్లండ్ హెడ్ కోచ్ పదవి నుంచి వైదొలిగిన అనంతరం మాట్ సిడ్నీ సిక్సర్స్ అసిస్టెంట్ కోచ్‌గా మూడేళ్లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.తదుపరి ఐపీఎల్ సీజన్లో మాట్ ఢిల్లీ క్యాపిటల్స్ నూతన హెడ్ కోచ్ హేమంగ్ బదానీతో కలిసి పని చేస్తాడు. డీసీ యాజమాన్యం బౌలింగ్ కోచ్‌గా వరల్డ్‌కప్ విన్నర్, భారత మాజీ పేసర్ అయిన మునాఫ్ పటేల్‌ను ఇటీవలే నియమించుకున్న విషయం తెలిసిందే. భారత మాజీ క్రికెటర్ వేణుగోపాల్ రావు డీసీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా వ్యవహరిస్తాడు.కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ ప్రారంభం నుంచి వేర్వేరు పేర్లతో లీగ్‌లో ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. తొలి రెండు సీజన్లలో సెమీస్‌కు చేరిన ఈ జట్టు.. 2020 సీజన్లో అత్యుత్తమంగా ఫైనల్స్‌కు చేరింది. ఆ సీజన్ ఫైనల్లో డీసీ ముంబై చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. గత మూడు సీజన్లలో ఢిల్లీ పేలవ ప్రదర్శన కనబర్చింది. మూడు సీజన్లలో లీగ్ దశలోనే నిష్క్రమించింది. తదుపరి సీజన్ కోసం ఢిల్లీ జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేసింది. పాత ఆటగాళ్లను దాదాపుగా వదిలించుకుని కొత్త ఆటగాళ్లను తీసుకుంది. మెగా వేలానికి ముందు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్‌ను రీటైన్ చేసుకుంది. కెప్టెన్ రిషబ్ పంత్ సహా ఆసీస్ స్టార్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్‌లను వదిలేసింది. మెగా వేలంలో కేఎల్ రాహుల్, మిచెల్ స్టార్క్, హ్యారీ బ్రూక్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, టి నటరాజన్, డుప్లెసిస్ లాంటి స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. వేలంలో డీసీ యాజమాన్యం అత్యధికంగా 14 కోట్లు వెచ్చింది కేఎల్ రాహుల్‌ను సొంతం చేసుకుంది. తదుపరి సీజన్ కోసం డీసీ మేనేజ్మెంట్ తమ కెప్టెన్‌ను ఇంకా ప్రకటించలేదు.2025 సీజన్ కోసం ఢిల్లీ జట్టు..కేఎల్ రాహుల్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, హ్యారీ బ్రూక్, అషుతోశ్ శర్మ, డుప్లెసిస్, సమీర్ రిజ్వి, కరుణ్ నాయర్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, డొనోవన్ ఫెరియెరా, అక్షర్ పటేల్, విప్రాజ్ నిగమ్, దర్శన్ నల్కండే, మాధవ్ తివారి, మన్వంత్ కుమార్, త్రిపురుణ విజయ్, అజయ్ మండల్, మిచెల్ స్టార్క్, టి నటరాజన్, ముకేశ్ కుమార్, మోహిత్ శర్మ, దుష్మంత చమీరా, కుల్దీప్ యాదవ్

పాకిస్తాన్‌పై గెలిచి విజయంతో ముగిస్తాం: బంగ్లాదేశ్ కెప్టెన్
‘‘ఎంతటి పటిష్ట జట్టునైనా ఓడించగల సత్తా మా జట్టుకు ఉంది. చాంపియన్స్ ట్రోఫీ గెలవడమే మా లక్ష్యం’’... ఐసీసీ టోర్నమెంట్ ఆరంభానికి ముందు బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుసేన్ షాంటో(Najmul Hossain Shanto) చేసిన వ్యాఖ్యలు ఇవి. అయితే, ఈ వన్డే ఈవెంట్ ఆరంభమైన ఆరు రోజుల్లోనే.. లీగ్ దశలోనే బంగ్లాదేశ్ ప్రయాణం ముగిసిపోయింది.గ్రూప్-‘ఎ’లో భాగంగా తొలుత టీమిండియా చేతిలో ఓడిన షాంటో బృందం.. సోమవారం నాటి మ్యాచ్‌లో న్యూజిలాండ్(Bangladesh Vs New Zealand) జట్టు చేతిలోనూ ఓటమిని చవిచూసింది. తద్వారా సెమీస్ కూడా చేరుకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ నజ్ముల్ హుసేన్ షాంటో మాట్లాడుతూ.. జట్టు ప్రదర్శన పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా బ్యాటర్ల వైఖరిని ఎండగట్టాడు.పదే పదే అవే తప్పులు..‘‘గతంలో చేసిన తప్పులను పునరావృతం చేయకూడదని పదే పదే చెప్పాను. కానీ మేము మళ్లీ అదే రిపీట్ చేస్తున్నాం. బ్యాటింగ్ విభాగంలో మేము మెరుగుపడాల్సి ఉంది. ఈ టోర్నమెంట్ తర్వాత కచ్చితంగా బ్యాటింగ్ యూనిట్లో మార్పులు ఉంటాయి.బ్యాటర్లు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది. కానీ గత రెండు మ్యాచ్‌లలోనూ అలా జరుగలేదు. ఓడిన ప్రతిసారీ సిబ్బందిపై వేటు వేయడం, మార్చడం చేయలేము. ఆటగాళ్లు కూడా తమ వైఖరిని మార్చుకోవాలి. ఓటమిని తేలికగానే అంగీకరిస్తున్నట్లుగా ఉందిఇప్పటికే చాలా మందికి చాలా అవకాశాలు ఇచ్చాము. అయినా.. ప్రతిసారి మేము ఓటమిని తేలికగానే అంగీకరిస్తున్నట్లు అనిపిస్తోంది. ఇకపై మేము మరింత జవాబుదారీగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది’’అని ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో నజ్ముల్ షాంటో పేర్కొన్నాడు.ఇక కివీస్ మ్యాచ్‌లో తమ ప్రదర్శన గురించి మాట్లాడుతూ.. ‘‘మాకు శుభారంభమే లభించింది. కానీ మిడిల్ ఓవర్లలో వరుస వికెట్లు కోల్పోయాం. మా బ్యాటింగ్ అస్సలు బాగాలేదు. నిజానికి పిచ్ బ్యాటింగ్‌కు సహకరించింది. అయినా.. భారీ భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమయ్యాం.పాక్‌పై గెలిచి విజయంతో ముగిస్తాంఅయితే, మా బౌలింగ్ పట్ల నేను సంతోషంగానే ఉన్నాను. గత రెండేళ్లుగా మా బౌలర్లు నిలకడగా రాణిస్తున్నారు. ఇక లీగ్ దశలో మాకు మరొక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. పాకిస్తాన్‌పై గెలిచి విజయంతో ఇంటిబాట పట్టాలని పట్టుదలగా ఉన్నాం. ఏదేమైనా మేమైతే బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో మెరుగుపడాల్సి ఉందని కచ్చితంగా చెప్పగలను’’ అని షాంటో అన్నాడు. కాగా రావల్పిండిలో సోమవారం కివీస్‌తో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.ఇక టీమిండియా, న్యూజిలాండ్‌లతో మ్యాచ్‌లలో బంగ్లా గట్టి పోటీనిచ్చిప్పటికీ.. దానిని విజయంగా మలచుకోలేకపోయింది. ఇక నజ్ముల్ షాంటో భారత్‌తో మ్యాచ్‌లో డకౌట్ కాగా.. కివీస్‌తో మ్యాచ్‌ల మాత్రం అర్ధ శతకం(77)తో రాణించాడు. మిగతా వాళ్లలో జాకిర్ అలీ(68, 46), తౌహీద్ హృదోయ్(భారత్‌పై శతకం) మాత్రమే మెరుగ్గా ఆడారు. కాగా గ్రూప్ దశలో ఆఖరిగా గురువారం(ఫిబ్రవరి 27) రావల్పిండి వేదికగా పాకిస్తాన్‌తో బంగ్లాదేశ్ తలపడుతుంది. బంగ్లా మాదిరే ఆడిన రెండు మ్యాచ్‌లలో ఓడి నిష్క్రమించిన పాక్.. ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలవాలని ఉవ్విళ్లూరుతోంది.చదవండి: Aus vs SA: కీలక మ్యాచ్‌కు వర్షం అడ్డంకి.. ఒకవేళ రద్దైతే..!

IPL 2025: కేకేఆర్ కెప్టెన్‌గా నేను రెడీ!
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)-2025 మెగా వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్ల జాబితాలో వెంకటేశ్ అయ్యర్(Venkatesh Iyer) మూడో స్థానంలో ఉన్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) తరఫున గతేడాది రాణించిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్‌ను.. వేలంపాటకు ముందు ఫ్రాంఛైజీ వదిలేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో రూ. 2 కోట్ల కనీస ధరతో ఆక్షన్‌లోకి వచ్చిన అతడి కోసం కేకేఆర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పోటీపడ్డాయి.ఈ క్రమంలో ఏకంగా రూ. 23.75 కోట్లకు కోల్‌కతా వెంకటేశ్ అయ్యర్‌ను తమ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో కేకేఆర్ కెప్టెన్సీ రేసులో ఈ మధ్యప్రదేశ్ క్రికెటర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌కు పగ్గాలు అప్పగించేందుకు యాజమాన్యం సుముఖంగా ఉందనే వార్తలు వస్తున్నాయి.కెప్టెన్ అనే ట్యాగ్ అవసరం లేదుఈ విషయంపై వెంకటేశ్ అయ్యర్ స్వయంగా స్పందించాడు. నాయకుడిగా బాధ్యతలు నిర్వర్తించేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ మనసులోని మాటను వెల్లడించాడు. కెప్టెన్‌గా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘కచ్చితంగా.. నేను వందశాతం సిద్ధంగా ఉన్నాను. నిజానికి కెప్టెన్సీ అనేది ఒక ట్యాగ్ మాత్రమే.నాయకుడిగా ఉండటం అనేది మాత్రం గొప్ప విషయం. డ్రెసింగ్‌రూమ్‌లో లీడర్ ఉండాలంటే కెప్టెన్ అనే ట్యాగ్ అవసరం లేదని నేను నమ్ముతాను. మన ప్రదర్శనతో సహచర ఆటగాళ్లకు స్ఫూర్తినివ్వాలి. మైదానం లోపలా, వెలుపలా రోల్ మోడల్లా ఉండాలి. మధ్యప్రదేశ్ జట్టులో నేను ప్రస్తుతం అదే పాత్ర పోషిస్తున్నాను.గళం విప్పే స్వేచ్ఛ ఉన్నపుడేమధ్యప్రదేశ్ జట్టుకు నేనేమీ కెప్టెన్‌ను కాదు. అయితే, నా అభిప్రాయాలకు, సూచనలకు అక్కడి నాయకత్వం విలువనిస్తుంది. నాకు అలాంటి వాతావరణం అంటే చాలా ఇష్టం. మనం జట్టులోకి కొత్తగా వచ్చామా.. మనల్ని వాళ్లు రూ. 20 లక్షలు లేదంటే రూ. 20 కోట్లు పెట్టి కొనుగోలు చేశారా అన్నది ముఖ్యం కాదు.. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా మన గళం విప్పే స్వేచ్ఛ ఉన్నపుడే అంతా బాగుంటుంది’’ అని వెంకటేశ్ అయ్యర్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో చెప్పుకొచ్చాడు.కాగా ఐపీఎల్-2021 సీజన్లో కేకేఆర్ తరఫున క్యాష్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చాడు వెంకటేశ్ అయ్యర్. మొదట కేకేఆర్ అతడిన రూ.20లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. అయితే, ఆ ఎడిషన్‌లో అద్బుతంగా రాణించడంతో 2022 వేలానికి ముందు రూ. 8 కోట్లకు అయ్యర్‌ను రిటైన్ చేసుకుంది. ఆ తర్వాత మరో రెండేళ్ల పాటు తమ జట్టుకే ప్రాతినిథ్యం వహించిన వెంకటేష్‌ను ఐపీఎల్-2025 వేలంలోకి విడిచిపెట్టి.. భారీ ధరకు తిరిగి జట్టులో చేర్చుకుంది. కాగా ఐపీఎల్లో వెంకటేష్ ఇప్పటివరకు ఆడిన 50 మ్యాచ్‌లలో 1326 పరుగులు చేశాడు.శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోఇదిలా ఉంటే.. గతేడాది శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో కేకేఆర్ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే, వేలానికి ముందు అతడు జట్టును వీడగా.. పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ. 26.75 కోట్లకు సొంతం చేసుకుంది. దీంతో కేకేఆర్ కెప్టెన్సీ పోస్టు ఖాళీ కాగా.. వెంకటేశ్ అయ్యర్‌తో పాటు అజింక్య రహానే కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మార్చి 22న ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్- ఆర్సీబీ మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్-2025 సీజన్‌కు తెరలేవనుంది. చదవండి: Ind vs NZ: ‘కివీస్‌తో మ్యాచ్‌లో అతడికి విశ్రాంతి ఇవ్వండి’

Aus vs SA: కీలక మ్యాచ్‌కు వర్షం అడ్డంకి.. మ్యాచ్ రద్దు
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో కీలక మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. గ్రూప్-‘బి’లో భాగంగా ఆస్ట్రేలియా- సౌతాఫ్రికా(Australia vs South Africa) మధ్య మంగళవారం మ్యాచ్ జరగాల్సి ఉండగా.. వరణుడి కారణంగా టాస్ ఆలస్యమైంది. రావల్పిండి(Rawalpindi)లో వర్షం కురుస్తున్న కారణంగా మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు.టాస్ సమయానికి(భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటలకు)మధ్యలో కాస్త తెరిపినివ్వగా కవర్లు తీయగా.. మళ్లీ కాసేపటికే చినుకులు పడ్డాయి. ఆకాశం మేఘావృతమై ఉంది. నల్లనిమబ్బులు కమ్ముకుని ఉండటంతో ఆసీస్- ప్రొటిస్ మ్యాచ్ సజావుగా సాగే సూచనలు కనిపించడం లేదు.ఇంగ్లండ్‌కు తలపోటుఒకవేళ వర్షం వల్ల ఈ మ్యాచ్ రద్దైతే మాత్రం ఇంగ్లండ్ సెమీస్ అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కాగా వన్డే టోర్నమెంట్లో గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పోటీపడుతున్నాయి.గ్రూప్-‘ఎ’ నుంచి రెండేసి విజయాలతో భారత్, న్యూజిలాండ్ ఇప్పటికే తమ సెమీస్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. మరోవైపు.. గ్రూప్-‘బి’లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చెరో విజయంతో పాయింట్ల పట్టికలో తొలి రెండుస్థానాల్లో కొనసాగుతున్నాయి.టాప్‌లో సౌతాఫ్రికాతమ ఆరంభ మ్యాచ్‌లో సౌతాఫ్రికా అఫ్గనిస్తాన్‌ను ఏకంగా 107 పరుగులతో చిత్తు చేసింది. ఇక ఆసీస్ ఇంగ్లండ్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఒక్కో విజయం ద్వారా ఈ రెండు జట్లకు చెరో రెండు పాయింట్లు లభించినప్పటికీ.. నెట్ రన్‌రేటు(+2.140) పరంగా సౌతాఫ్రికా ప్రథమ స్థానం ఆక్రమించింది.ఒకవేళ మంగళవారం నాటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైతే.. నిబంధనల ప్రకారం ఇరుజట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. అప్పుడు సౌతాఫ్రికా ఖాతాలో మూడు, ఆసీస్ ఖాతాలో మూడు పాయింట్లు చేరతాయి. ఇక ఇంగ్లండ్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన బట్లర్ బృందం.. తదుపరి అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికాలతో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌లలో గెలిస్తేనే ఇంగ్లండ్ సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.ఇందులో ఏ ఒక్కటి ఓడినా ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇక సౌతాఫ్రికా తమ తదుపరి మ్యాచ్‌లో నెగ్గితే మాత్రం నేరుగా సెమీ ఫైనల్‌కు దూసుకువెళ్తుంది. ఆస్ట్రేలియా మాత్రం ఇంగ్లండ్ మాదిరి ఇతర మ్యాచ్‌ల ఫలితాలు తేలేదాకా వేచి చూడాల్సి ఉంటుంది.నాడు సెమీ ఫైనల్లోఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా- సౌతాఫ్రికా చివరగా 2023లో ఐసీసీ(వన్డే) ఈవెంట్లో తలపడ్డాయి. భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో నాడు సెమీ ఫైనల్లో సౌతాఫ్రికాను 212 పరుగులకు కట్టడి చేసిన ఆస్ట్రేలియా.. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో మూడు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్ చేరింది. ఆఖరి పోరులో టీమిండియాపై విజయం సాధించి టైటిల్ విజేతగా అవతరించింది. కాగా చాంపియన్స్ ట్రోఫీలో ఒక మ్యాచ్‌లో విజయానికి రెండు పాయింట్లు లభిస్తాయి. మ్యాచ్ రద్దైతే ఇరుజట్లకు చెరో పాయింట్ వస్తుంది.చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆస్ట్రేలియా జట్టుస్టీవ్ స్మిత్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్, సీన్ అబాట్, ఆరోన్ హార్డీ, జేక్ ఫ్రేజర్ మెగర్క్, తన్వీర్ సంఘా.సౌతాఫ్రికా జట్టుర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), టెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, రాస్సీ వాన్ డెర్ డసెన్, ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, వియాన్ ముల్డర్, కేశవ్ మహారాజ్, కగిసో రబడ, లుంగీ ఎంగిడి, తబ్రేజ్ షంసీ, హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, కార్బిన్ బాష్.Update: వర్షం వల్ల టాస్ పడకుండానే ఆసీస్- సౌతాఫ్రికా మ్యాచ్ రద్దుచదవండి: అతి చేయొద్దు.. ఇలాంటి ప్రవర్తన సరికాదు: పాక్ దిగ్గజం ఆగ్రహం
బిజినెస్

యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ గురించి తెలుసా..?
సంప్రదాయ ఉద్యోగ ఆధారిత పథకాలను మించిన యూనివర్సల్ పెన్షన్ స్కీమ్‌ను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ పథకం మెరుగైన ఫలితాలు ఇస్తుందని, ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా దీన్ని రూపొందిస్తున్నట్లు కొన్ని సంస్థలు కథనాలు ప్రచురిస్తున్నాయి. అందులోని వివరాలు కింది విధంగా ఉన్నాయి.అసంఘటిత రంగాల్లోని కార్మికులు, వ్యాపారులు, 18 ఏళ్లు పైబడిన స్వయం ఉపాధి పొందుతున్న అన్ని వర్గాల వారికి ఈ పథకం వర్తిస్తుందని భావిస్తున్నారు. అలాగే ఈ పథకం ఏ నిర్దిష్ట ఉపాధితో ముడిపడి ఉండదని చెబుతున్నారు. వ్యక్తులు తమ పదవీ విరమణ తర్వాత పెన్షన్ పొందేలా దీన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ పెన్షన్ పథకంపై కార్మిక మంత్రిత్వ శాఖ చర్చలు ప్రారంభించిందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు.రెండు పథకాలను కలుపుతారా..?ఈ పథకానికి సంబంధించిన పూర్తి ఫ్రేమ్‌వర్క్‌ను ఖరారు చేసిన తర్వాత, ఇతర వివరాలను జోడించేందుకు, దాన్ని మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కీలక భాగస్వాముల నుంచి సూచనలు కోరుతుంది. ఇప్పటికే ఉన్న ప్రధాన మంత్రి-శ్రమ యోగి మాన్‌ధన్ స్కీమ్ (పీఎం-ఎస్వైఎం), నేషనల్ పెన్షన్ స్కీమ్ ఫర్ ట్రేడర్స్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ (ఎన్పీఎస్-ట్రేడర్స్) వంటి పెన్షన్ పథకాలను ఒకే వ్యవస్థ కింద క్రమబద్ధీకరించడం, వాటిని మరింత ప్రయోజనకరంగా, సులభంగా అందుబాటులో ఉంచడం ఈ పథకం లక్ష్యంగా భావిస్తున్నారు. ఈ రెండు పథకాలు స్వచ్ఛందంగా 60 ఏళ్ల తరువాత నెలకు రూ.3000 పెన్షన్ అందిస్తుంది. అందుకు వయసును అనుసరించి రూ.55 నుంచి రూ.200 వరకు కంట్రిబ్యూట్ చేయాలి.అటల్ పెన్షన్ యోజన పథకం కూడా కొత్త పథకంలో చేరే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు. బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ (బీవోసీడబ్ల్యూ) చట్టం కింద వసూలు చేసిన మొత్తాన్ని ఈ రంగంలోని కార్మికులకు పింఛన్ల కోసం ఉపయోగించే అవకాశం ఉందని భావిస్తున్నారు.ఇదీ చదవండి: ఐదేళ్లలో రిలయన్స్ రూ.50,000 కోట్ల పెట్టుబడులుఈ పథకం ఎందుకు అవసరం?భారతదేశంలో 60 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న సీనియర్ సిటిజన్ జనాభా 2036 నాటికి 22.7 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. వారికి ఎలాంటి ఆదాయం లేని సమయంలో సమగ్ర సామాజిక భద్రత లేదా పెన్షన్ పథకం అవసరం ఉంటుంది. అమెరికా, యూరప్, కెనడా, రష్యా, చైనా వంటి అనేక దేశాల్లో పింఛన్లు, ఆరోగ్యం, నిరుద్యోగం వంటి వాటికి సామాజిక బీమా వ్యవస్థలు ఉన్నాయి. భారతదేశంలో సామాజిక భద్రత అధికంగా ప్రావిడెంట్ ఫండ్ వ్యవస్థ, వృద్ధాప్య పింఛన్లు, ఆరోగ్య భీమాపై ఆధారపడి ఉంది. ఇది ప్రధానంగా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి ప్రయోజనం చేకూరుస్తుంది.

జీమెయిల్ లాగిన్ విధానంలో మార్పు!
వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విటర్) వంటి వాటిలో ఫీచర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు తాజాగా గూగుల్ 'జీమెయిల్' కోసం ఓ అప్డేట్ తీసుకొచ్చింది. యూజర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ అప్డేట్ చేసింది. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటి? దీనివల్ల ఉపయోగాలేంటి? అనే వివరాలు.. ఈ కథనంలో చూసేద్దాం.ఇప్పటి వరకు జీమెయిల్ లాగిన అయ్యే సమయంలో.. వినియోగదారు గుర్తింపును ధృవీకరించడానికి గూగుల్ ఆరు అంకెల అథెంటికేషన్ కోడ్లను ఎస్ఎమ్ఎస్ రూపంలో రిజిస్టర్ మొబైల్ నెంబరుకు పంపించేది. కానీ త్వరలో ఈ విధానానికి గూగుల్ స్వస్తి పలకనుంది. దీనికి బదులుగా క్యూఆర్ కోడ్‌ను తీసుకురానుంది. దీనిని వినియోగదారులు వివరాలను మరింత భద్రంగా ఉంచడానికి ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.క్యూఆర్ కోడ్ విధానం అమలులోకి వచ్చిన తరువాత.. మీకు ఆరు అంకెల అథెంటికేషన్ కోడ్ స్థానంలో క్యూఆర్ కోడ్ వస్తుంది. కాబట్టి మీరు మీ ఫోన్ కెమెరాతో ఆ కోడ్ స్కాన్ చేస్తే సరిపోతుంది. దీనివల్ల ఎస్ఎమ్ఎస్ ఆధారిత మోసాలు తగ్గుతాయి. సైబర్ నేరగాళ్లు పెరిగిపోతున్న తరుణంలో గూగుల్ ఈ నిరన్యం తీసుకుంది.జీమెయిల్ లాగిన్ విధానంలో మార్పు క్యూఆర్ కోడ్ రూపంలో వస్తుందని మాత్రం చెబుతున్నారు. కానీ ఇది ఎప్పుడు అమలులోకి వస్తుందనే వివరాలు మాత్రం అధికారికంగా వెల్లడికాలేదు. బహుశా వీలైనంత త్వరగానే ఈ అప్డేట్ రావొచ్చని సమాచారం.ఇదీ చదవండి: రోజుకు రూ.27 కోట్లు విరాళం ఇచ్చిన వ్యక్తి.. ఈయన గురించి తెలుసా?

ఐదేళ్లలో రిలయన్స్ రూ.50,000 కోట్ల పెట్టుబడులు
అస్సాం ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) వచ్చే ఐదేళ్లలో రూ.50,000 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. ‘అడ్వాంటేజ్ అస్సాం 2.0 ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్’ సందర్భంగా ఆర్ఐఎల్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఈమేరకు ప్రకటన చేశారు. టెక్నాలజీ, మౌలిక సదుపాయాలు, రిటైల్ విస్తరణ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కంపెనీ ప్రతిష్టాత్మక ప్రణాళికలను వివరించారు. 2018లో జరిగిన సదస్సులో రాష్ట్రంలో రూ.5,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ హామీ ఇచ్చిందని, కానీ దానిని రూ.12,000 కోట్లకు పెంచామని అంబానీ గుర్తు చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయం సహా వివిధ రంగాలకు ప్రయోజనం చేకూర్చేలా ఏఐను ఉపయోగించుకోవాలని ఈ సమ్మిట్ లక్ష్యంగా పెట్టుకుంది.కీలక పెట్టుబడి రంగాలుఏఐ డేటా సెంటర్: అస్సాంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-రెడీ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఆర్ఐఎల్ యోచిస్తోంది. కృత్రిమ మేధ సహాయంతో ఉపాధ్యాయులు, వైద్యులు, రైతులు అస్సాం నివాసితుల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని కంపెనీ ఆశిస్తున్నట్లు అంబానీ తెలిపారు.మెగా ఫుడ్ పార్క్: అస్సాంలో సమృద్ధిగా ఉన్న వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులకు విలువను జోడించడానికి మెగా ఫుడ్ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ చర్య రాష్ట్ర రైతులకు మద్దతు ఇస్తుంది. ఫుడ్ ప్రాసెసింగ్, పంపిణీకి కొత్త అవకాశాలను సృష్టించడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థను మెరుగవుతుంది.రిలయన్స్ రిటైల్ విస్తరణ: అస్సాంలో రిలయన్స్ రిటైల్ స్టోర్ల సంఖ్యను రెట్టింపు చేయాలని ఆర్ఐఎల్ యోచిస్తోంది. ఈ సంఖ్యను 400 నుంచి 800కు పెంచనుంది. ఈ విస్తరణ రిటైల్ ల్యాండ్ స్కేప్‌ను మెరుగుపరుస్తుంది. వినియోగదారులకు విస్తృత శ్రేణి ఉత్పత్తులను అందుబాటులో ఉంచేందుకు ఇది తోడ్పడుతుంది.క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ: అణు ఇంధనంతో సహా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీకి అస్సాంను హబ్‌గా మార్చడంపై కూడా రిలయన్స్ దృష్టి సారించనుంది. అస్సాంలో రెండు కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్లను ఆర్ఐఎల్ నిర్మించనుంది. ఇవి ఏటా 8 లక్షల టన్నుల క్లీన్ బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేస్తాయి. ప్రతిరోజూ రెండు లక్షల ప్యాసింజర్ వాహనాలకు ఇంధనం అందించేందుకు సరిపోతుంది.హై-ఎండ్ హాస్పిటాలిటీ: హై ఎండ్ హాస్పిటాలిటీ రంగాన్ని ప్రోత్సహించడానికి ఆర్ఐఎల్ అస్సాం నడిబొడ్డున విలాసవంతమైన సెవెన్ స్టార్ ఒబెరాయ్ హోటట్ను నిర్మించనుంది. పర్యాటకులను ఆకర్షించడం, రాష్ట్ర ఆతిథ్య ప్రమాణాలను పెంచడం ఈ అభివృద్ధి లక్ష్యం.ఇదీ చదవండి: లకారానికి దగ్గర్లో గోల్డ్రేటు.. ఈ దేశాల్లో చీప్‌గా కొనుగోలుఈ కార్యక్రమాలు అసోంలోని యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయని అంబానీ తెలిపారు. రిలయన్స్ ఫౌండేషన్ తన ‘స్వదేశ్’ స్టోర్ల ద్వారా గ్రీన్ గోల్డ్(వెదురు)ను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ అస్సాంతోపాటు ఈశాన్య రాష్ట్రాలను భారతదేశ అభివృద్ధిలో ప్రధానంగా నిలిపారని అంబానీ కొనియాడారు.

రూ.26 లక్షల కోట్ల నిల్వలపై మౌనం వీడిన వారెన్ బఫెట్
బెర్క్ షైర్ హాత్వే ఇన్వెస్ట్మెంట్ సంస్థ సీఈఓ వారెన్ బఫెట్ ఎట్టకేలకు కంపెనీ వద్ద పోగైన 321 బిలియన్ డాలర్ల(సుమారు రూ.26 లక్షల కోట్లు) నగదు నిల్వలకు సంబంధించిన విషయాలు పంచుకున్నారు. బఫెట్ తన పెట్టుబడి వ్యూహాన్ని, తాను లక్ష్యంగా పెట్టుకోవాలనుకుంటున్న రంగాలను వివరిస్తూ షేర్ హోల్డర్లకు తాజాగా వార్షిక లేఖ విడుదల చేశారు.బెర్క్ షైర్ హాత్వే నగదు, ట్రెజరీ బిల్లు హోల్డింగ్స్ ఆల్ టైమ్ గరిష్టానికి చేరాయి. ఇది బఫెట్ పెట్టుబడి వ్యూహం, మార్కెట్ దృక్పథంపై ప్రశ్నలను లేవనెత్తింది. గత కొన్ని త్రైమాసికాలుగా బెర్క్ షైర్ ఈక్విటీ సెక్యూరిటీలను బారీగా అమ్ముతూ వచ్చింది. దాంతో కంపెనీ వద్ద దాదాపు 321 బిలియన్ డాలర్ల(సుమారు రూ.26 లక్షల కోట్లు) మొత్తం సమకూరింది. టాప్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఇలా భారీగా అమ్మకాలు చేపట్టడం వెనుక గల కారణాలపై ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో అధిక వాల్యుయేషన్లు, ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాలను కనుగొనడం సవాలుగా మారాయని బఫెట్ స్పష్టత ఇచ్చారు.వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళికలుబెర్క్ షైర్ హాత్వే పెట్టుబడి విధానం ఎల్లప్పుడూ మంచి వ్యాపారాలను సరసమైన ధరలకు కొనుగోలు చేయడంపై కేంద్రీకృతమై ఉంటుందని బఫెడ్ తెలిపారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులతో సరైన అవకాశాల కోసం ఓపికగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. బెర్క్ షైర్ నగదు నిల్వలను ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్న కొన్ని విభాగాలు కింది విధంగా ఉన్నాయి.ఈక్విటీ పెట్టుబడులు: ఈ విభాగంలో ఇటీవల స్టాక్ అమ్మకాలు ఉన్నప్పటికీ బఫెట్ స్థిర ఆదాయ పెట్టుబడుల కంటే ఈక్విటీలపై నమ్మకంగా ఉన్నట్లు తెలిపారు. బెర్క్ షైర్ మెరుగైన నియంత్రిత యాజమాన్యంలోని వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టేందుకు ప్రాధాన్యత ఇస్తుందని నొక్కి చెప్పారు.జపాన్ మార్కెట్‌పై ఆసక్తి: సంస్థ వద్ద ఉన్న నగదులో కొంత బఫెట్ జపాన్‌లోని ఐదు అతిపెద్ద వాణిజ్య సంస్థలైన ఇటోచు, మరుబెని, మిత్సుబిషి, మిత్సుయి, సుమిటోమోల్లో పెట్టుబడి పెంచాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఆయా కంపెనీల్లో బెర్క్ షైర్ హాత్వే ఇన్వెస్ట్ చేసింది.అమెరికా కంపెనీలు: బఫెట్ అధిక వాల్యుయేషన్ల విషయంలో అప్రమత్తంగా ఉన్నప్పటికీ తన పెట్టుబడి ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న యూఎస్ కంపెనీలను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. బెర్క్ షైర్ డీర్, యునైటెడ్ పార్సిల్ సర్వీస్, సీవీఎస్ హెల్త్ వంటి కంపెనీల్లో కొనుగోళ్లను పరిగణిస్తున్నట్లు తెలిపింది.ట్రెజరీ బిల్లులు: బెర్క్ షైర్ స్టాక్ అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని యూఎస్ ట్రెజరీ బిల్లుల్లో తిరిగి పెట్టుబడి పెడుతోంది. ఈ వ్యూహం మరింత ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాల కోసం లిక్విడిటీ రాబడిని అందిస్తుంది.ఇదీ చదవండి: లకారానికి దగ్గర్లో గోల్డ్రేటు.. ఈ దేశాల్లో చీప్‌గా కొనుగోలుసహనం ప్రాముఖ్యతబఫెట్ ఇన్వెస్ట్మెంట్ విధానం పెట్టుబడిలో సహనం, క్రమశిక్షణ ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఓపిగ్గా వేచి చూస్తే తప్పకుండా మంచి రాబడులు అందుకోవచ్చని బఫెట్ నిరూపించారు. తక్కువ రిస్క్, గణనీయమైన రాబడిని అందించే అవకాశాల కోసం ఎదురుచూస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ వైఖరి చాలా సంవత్సరాలుగా బెర్క్ షైర్‌కు బాగా ఉపయోగపడింది. ఇది మార్కెట్ తిరోగమనాన్ని కూడా అవకాశంగా మలుచుకునేందుకు తోడ్పడింది.
ఫ్యామిలీ

డ్రాగన్‌కు ఎండ దెబ్బా..?
డ్రాగన్ ఫ్రూట్ తోటలను ఎండ దెబ్బ(సన్ బర్న్) నుంచి కాపాడుకోవటం రైతులకు ఒక సవాలు వంటిదే. పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు దాటితే డ్రాగన్ ఫ్రూట్ చెట్లకు సన్ బర్న్ ముప్పు పొంచి ఉంటుంది. సాధారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ సమస్య వస్తుంది. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అనేక దక్షిణాది రాష్ట్రాల్లో అక్కడక్కడా 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో బెంగళూరులోని భారతీయ ఉద్యాన పంటల పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) సన్‌బర్న్ దెబ్బ నుంచి డ్రాగన్ పంటను కాపాడుకోవటానికి చేసిన సూచనలను తెలుసుకుందాం.. పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్షియస్ దాటితే రాత్రి–పగటి ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం కూడా పెరుగుతుంది. ఇది కూడా చెట్టును బలహీనపరుస్తుంది. ఆకు పచ్చగా నిగనిగలాడుతూ ఉండే డ్రాగన్ మొక్కల కాండాలు అధిక రేడియేషన్ వల్ల పత్రహరితాన్ని కోల్పోయి (బ్లీచ్డ్ అప్పియరెన్స్) తెల్లబోయి కాంతి హీనంగా కనిపిస్తాయి. అటువంటప్పుడు మొక్క పెరుగుదల మందగిస్తుంది. ఆ దశలో గనక రక్షక చర్యలు తీసుకోకపోతే డ్రాగన్ మొక్కలు చనిపోయే అవకాశం ఉంది. మొక్క పశ్చిమ భాగంలోని డ్రాగన్ కాండాలకు సన్ బర్న్ నష్ట తీవ్రత 10% నుంచి 50% వరకు ఉంటుంది. కాండం కుళ్లు సోకుతుంది. ఇది విజృంభిస్తే ఏకంగా తోటలో మొక్కలన్నీటినీ రైతు నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి, సన్‌బర్న్ సమస్యను రైతులు సకాలంలో గుర్తించి, తగిన జాగ్రత్తలు పాటిస్తే డ్రాగన్ ఫ్రూట్ తోటలను ఎండల తీవ్రత నుంచి రక్షించుకోవచ్చు.పిచికారీఎండ తీవ్రత వల్ల పత్ర రంధ్రాల్లో నుంచి నీటి తేమ ఎక్కువగా వాతావరణంలోకి విడుదలవుతుంటుంది. అటువంటప్పుడు మొక్కలో నీటి శాతం తగ్గిపోతుంది. ఈ ప్రక్రియను తగ్గించగలిగే యాంటీ–ట్రాన్స్‌పైరెంట్స్‌ను పిచికారీ చేస్తే ఉపయోగం ఉంటుంది. డ్రాగన్ తోటను సన్ బర్న్ నుంచి రక్షించుకోవటానికి కోలినైట్ (లీటరు నీటికి 50 గ్రాములు) + నీమ్ సోప్ (లీటరు నీటికి 4 గ్రాములు) తో పాటు సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ను, హ్యూమిక్ యాసిడ్ (లీటరు నీటికి 4 ఎం.ఎల్.) కలిపి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో పిచికారీ చేయాలని ఐఐహెచ్ఆర్ నిపుణులు రైతులకు సూచిస్తున్నారు. సన్ బర్న్ నష్ట తీవ్రతతో పాటు శిలీంధ్ర, బాక్టీరియా తెగుళ్ల బెడదను కూడా తగ్గిస్తుందని తెలిపారు. డ్రాగన్ ఫ్రూట్ తోటలో పోల్కి 8–10 లీటర్ల నీటిని డ్రిప్ ద్వారా ఇస్తే ఎండ తీవ్రతను తట్టుకోవటానికి అవకాశం కలుగుతుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఎలుకలు కొరికేస్తున్నాయ్!డ్రాగన్ ఫ్రూట్.. ఖరీదైనది, పోషకాలతో కూడినదే కాకుండా, దీన్ని సేంద్రియంగా సాగు చేయటం కూడా సులభం. గ్రామీణప్రాంతాలతో పాటు నగరాల పరిసరప్రాంతాల్లోనూ డ్రాగన్ ఫ్రూట్ తోటలు విస్తరిస్తున్నాయి. ఇంటిపంటలు, మిద్దె తోటల్లోనూ డ్రాగన్ సాగు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో డ్రాగన్ పంటకు ఎలుకల బెడద ఎదురవుతోందని కొల్లం (కేరళ) కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు గుర్తించారు. కొల్లం జిల్లాలోని అనేకప్రాంతాల్లో డ్రాగన్‌కు ఎలుకల బెడద ఎదురవుతున్నట్లు సమాచారం రావటంతో కేవీకే భవనంపైనే ప్రయోగాత్మకంగా ఫైబర్ డ్రమ్ముల్లో డ్రాగన్ మొక్కల్ని పెంచారు. తెల్లవారుజామున 4–5 గంటల మధ్య ఎలుకలు డ్రాగన్ మొక్కల కాండం లోపలి గుజ్జును కొరికి తింటున్నట్లు సీసీ కెమెరాల్లో నమోదైంది. శరీరం కన్నా తోక ఎక్కువ ΄÷డవున్న రకానికి చెందిన ఎలుకలు ఈ పని చేస్తున్నాయని గుర్తించారు. ఎలుకలు కొరికిన కాండం ద్వారా నీరు, పోషకాల సరఫరా తగ్గిపోతుంది. దీంతో, పూత రాకపోవచ్చు. పూత వచ్చిన తర్వాత ఎలుకలు కొరికితే.. పూత, పిందెలు రాలిపోవచ్చు. అంతిమంగా, దిగుబడి తగ్గిపోతుంది.

పత్తి మానుకొని.. సిరిధాన్యాల సాగు!
ప్రధాన వాణిజ్య పంట అయిన పత్తి సాగులో, అందునా విత్తనోత్పత్తిలో నైపుణ్యం సాధించిన సీనియర్ రైతు కందిమళ్ల వేణుబాబు(52) ఆరేళ్ల క్రితం తన దృష్టిని సిరిధాన్యాల వైపు మళ్లించారు. ప్రకాశం జిల్లాకు చెందిన వేణుబాబు మూడు దశాబ్దాల క్రితం కర్నూలు జిల్లాకు వలస వచ్చి స్థానికంగా దేవాలయ భూములను కౌలుకు తీసుకొని విత్తనోత్పత్తి లక్ష్యంగా పత్తి సాగు చేస్తుండేవారు. మరో 8 మంది రైతులతో కలసి ఆంధ్రప్రదేశ్ విత్తన రైతు సేవా సంఘాన్నిప్రారంభించారు. ఈ నేపథ్యంలో తన తల్లికి కేన్సర్ వ్యాధి సోకటంతో ఆరోగ్యదాయకమైన సిరిధాన్యాల గురించి ఆలోచించారు. కర్నూలులో డాక్టర్ ఖాదర్‌వలి సభకు హాజరై సిరిధాన్యాల ఆహారంలో ఔషధ గుణాల గురించి తెలుసుకున్నారు. అప్పటికే పత్తి విత్తన రంగంలో ఎదురవుతున్న సవాళ్ల దృష్ట్యా పత్తి సాగుకు స్వస్తి చెప్పి సిరిధాన్యాల సాగు వైపు పూర్తిగా దృష్టి మళ్లించారు.32 ఎకరాల్లో సిరిధాన్యాల సాగు 2019లో తొలిసారి ఏడు ఎకరాల్లో కొర్రలు, అండుకొర్రల సాగుకు శ్రీకారం చుట్టారు. క్రమంగా సాగు విస్తీర్ణాన్ని పెంచారు. కల్లూరు మండలం పందిపాడు గ్రామంలోఒకే చోట 25 ఎకరాల దేవాలయ భూములను కౌలుకు తీసుకొని వర్షాధారంగా ఖరీఫ్‌లో సిరిధాన్యాలతో పాటు అంతర పంటగా కంది సాగు చేస్తున్నారు. నీటి సదుపాయం గల మరో 7 ఎకరాల్లో ఖరీఫ్‌లో అండుకొర్ర పండిస్తున్నారు. రెండో పంటగా కంది, దోస సాగు చేస్తున్నారు. నల్లరేగడి నేలలో ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువు వేస్తారు. వేస్ట్ డీ కంపోజర్‌ను 4 సార్లు, పుల్ల మజ్జిగను రెండు సార్లు ట్రాక్టర్ స్ప్రేయర్‌తో పిచికారీ చేయిస్తారు. 8 క్వింటాళ్ల కొర్రలతో పాటు ఎకరానికి 5 క్వింటాళ్ల కంది దిగుబడి పొందుతున్నారు. కందులతో పాటు ఎకరానికి అరికలైతే 7 క్వింటాళ్లు, సామలు 3 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వస్తోందని వేణుబాబు తెలిపారు. మిషన్‌తో పంట కోయిస్తే ఎకరానికి రూ. 10 వేలు, కూలీలతో కోయిస్తే రూ. 15 వేల వరకు సాగు ఖర్చవుతుందని ఆయన తెలిపారు.సొంతప్రాసెసింగ్ సొంతప్రాసెసింగ్ యూనిట్యూనిట్సిరిధాన్యాలను పండించి టోకుగా అమ్మటం కన్నా బియ్యంగా మార్చి రిటైల్‌గా అమ్మటం ద్వారా అధికాదాయం వస్తుందని తొలిదశలోనే గుర్తించిన వేణుబాబు రూ. 15 లక్షలతో సొంతప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. తాను పండించిన సిరిధాన్యాలతో పాటు ఇతర రైతులు పండించినవి కూడా కొని, మరపట్టించి నేరుగా వినియోగదారులకు విక్రయిస్తున్నారు. పురుగుల బెడద లేకుండా వ్యాక్యూమ్ ΄్యాకింగ్ చేసి ఆంధ్రప్రదేశ్ విత్తన రైతు సేవా సంఘం బ్రాండ్ పేరుతో మార్కెటింగ్ చేస్తున్నారు. సుమారు 3 వేల మందికి నేరుగా సిరిధాన్యాల బియ్యం, రవ్వను అమ్ముతున్నారు. సాగు చేసి అమ్మటమే కాదు కుటుంబ సభ్యులంతా చిరుధాన్యాల ఆహారమే తీసుకుంటుండటం విశేషం. ఈ ఆహారంతో తాను బరువు తగ్గి చాలా ఆరోగ్యంగా ఉన్నానని వేణుబాబు సంతోషిస్తున్నారు. వినియోగ దారుల ఆదరాభి మానాలు పొందాలంటే రాళ్లు, ఇసుక రాకుండా సిరిధాన్యాల బియ్యం, రవ్వను అందించటం చాలా ముఖ్యమన్నారు.కలెక్టరేట్లో మిల్లెట్ కేఫ్చిరుధాన్యాల వినియోగాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో రెండేళ్ల క్రితం అప్పటి జిల్లా కలెక్టర్ సృజన కలెక్టరేట్ ఆవరణలో మిల్లెట్ కేఫ్ప్రారంభానికి వేణుబాబుకు అవకాశం ఇచ్చారు. సిరిధాన్యాల భోజనంతో పాటు జావ, లడ్డూలు, మురుకులు, బ్రెడ్ తదితర ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. తమ వద్ద రోజువారీగా సిరిధాన్యాల ఆహారం తినే వారిలో 60% మంది యువతేనని ఆయన చెబుతున్నారు. క్వింటా రూ.4 వేలకు ప్రభుత్వం కొనాలిసిరిధాన్యాలకు గత ఏడాది మంచి ధర రావటంతో సాగు ఈ ఏడాది 50% పెరిగింది. గత సంవత్సరం కొర్ర ధాన్యం క్వింటా రూ. 5–6 వేలు పలికితే, ఈ ఏడాది 2,500కి పడిపోయింది. అండుకొర్రలు గత ఏడాది క్వింటా రూ. 8 వేలు పలికితే ఈ ఏడాది రూ.3,500కి పడిపోయింది. ఏ రకం సిరిధాన్యమైనా క్వింటా రూ. 4 వేలైతేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది. సిరిధాన్యాల సాగు విస్తీర్ణం స్థిరంగా పెరగాలంటే ప్రభుత్వం రూ. 4 వేల చొప్పున కొనాలిæలేదా మార్కెటింగ్ సదుపాయం కల్పించాలి. దీంతో పాటు.. మినీ హార్వెస్టర్లను రైతులకు సబ్సిడీపై అందించాలి. వీటితో రైతులే స్వయంగా పంట కోసుకోవచ్చు. మహిళలు కూడా వీటిని ఉపయోగించగలుగుతారు. సిరిధాన్యాల వినియోగం కూడా క్రమంగా పెరుగుతోంది. మా దగ్గర ఇద్దరు ఆయుర్వేద వైద్యులు రోగులకు విధిగా సిరిధాన్యాల ఆహారాన్నే సూచిస్తున్నారు. వారి కోసం అర కేజీ ΄్యాకెట్ల కిట్లను అందిస్తున్నాం. సిరిధాన్యాల సాగుకు పెట్టుబడి తక్కువ.. నికరాదాయం ఎక్కువ. పూర్తి సంతృప్తి ఉంది. మా ఇంట్లోనూ సిరిధాన్యాలనే తింటూ ఆరోగ్యంగా ఉన్నాం. – కందిమళ్ల వేణుబాబు (94408 61443), చిరుధాన్యాల రైతు, కర్నూలు – గవిని శ్రీనివాసులు, సాక్షి, కర్నూలు

తొలి మహిళా పెట్రోల్ బంక్: 'స్త్రీశక్తి... ఇంధనమై'..
‘పెట్రోల్ బంక్‌లో మహిళలు ఉద్యోగం చేయగలరా!’ అనే పురుషాధిపత్య అనుమానాన్ని పటాపంచలు చేస్తూ... ‘బ్రహ్మాండంగా చేయగలరు’ అని నిరూపించారు మహిళలు.ఇప్పుడు ఆ దారిలో మరో ముందడుగు... తొలి మహిళా పెట్రోల్ బంక్. ఇద్దరు కలెక్టర్ల చొరవ, కృషితో తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా కేంద్రంలోని సింగారం చౌరస్తాలో తొలిసారిగా జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు ఏర్పాటు అయింది...నారాయణపేట జిల్లాలో మహిళాసమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకును ఏర్పాటు చేయించాలనే ఆలోచన గత కలెక్టర్ కోయ శ్రీహర్షకు వచ్చింది. ‘మీరు ముందుకు వస్తే పెట్రోల్ బంకును ఏర్పాటు చేయిస్తాను’ అని హామీ ఇచ్చారాయన. దీంతో మహిళా సమాఖ్య సభ్యులు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. డీఆర్డీఏ కార్యాలయానికి అనుకొని ఉన్న ఆరు గుంటల ప్రభుత్వ భూమిని డీఆర్డీఏ, జడ్ఎంఎస్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించి బీపీసీఎల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కలెక్టర్ బదిలీపై వెళ్లడంతో ‘అయ్యో!’ అనుకున్నారు. పెట్రోల్ బంక్ కల సాధ్యం కాదు అనుకున్నారు.అయితే ప్రస్తుత కలెక్టర్ సిక్తాపట్నాయక్ ఫైల్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్లారు. రాష్ట్రంలోనే తొలి మహిళ పెట్రోల్ బంకు ఏర్పాటు చేయడంలో విజయం సాధించారు. 35 వేల లీటర్ల (పెట్రోల్, డిజిల్) నిల్వ సామర్థ్యం ఉండే ఈ బంకు 24 గంటలు పనిచేస్తుంది. బంకు నిర్వహణ ద్వారా వచ్చే కమిషన్ జిల్లా సమాఖ్యకు చేరుతుంది. దీనికి అదనంగా ప్రతి నెలా రూ.10 వేలు బీపీసీఎల్ మహిళా సమాఖ్యకు అందిస్తుంది. బంకు నిర్వహణ ద్వారా 10 మంది మహిళా సభ్యులకు ఉపాధి లభించనుంది. ఈ పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చిన ఒకాయన ఇలా అన్నాడు.... ‘ఎంతైనా ఆడవాళ్ల ఓపికే వేరు’ పెట్రోల్ బంక్‌ను విజయపథంలో నడిపించడంలో ఆ ఓపిక, ఉత్సాహం, శక్తిసామర్థ్యాలు వారికి ఇంధనంగా మారాయి.కలలో కూడా ఊహించలేదునారాయణపేటలో మహిళ సంఘం ద్వారా పెట్రోల్ బంకును ఏర్పాటు చేసుకుంటామని కలలో కూడా ఊహించలేదు. ఇది అయ్యే పని కాదనుకున్నాం. ప్రభుత్వ ప్రోత్సాహంతో బంకు ఏర్పాటు కావడం, అందులో సేల్స్ ఎగ్జిక్యూటిగా ఉద్యోగంలో చేరడం సంతోషంగా ఉంది. నెలకు రూ.11 వేల జీతం వస్తుంది. కుటుంబానికి ఎంతో అండగా ఉండేందుకు తోడ్పడుతుంది.– జగదీశ్వరి, సెల్స్ ఉమన్ , జడ్.ఎం.ఎస్. పెట్రోల్ బంకు మరింత మందికి ఉపాధినారాయణపేట జడ్ఎంఎస్ అధ్యక్షురాలిగా మూడేళ్ల నుంచి పనిచేస్తున్నా. జడ్ఎంఎస్కు వరి కొనుగోలు కేంద్రాల ద్వారా, స్త్రీనిధి కింద వచ్చే ఆదాయంతో నెట్టుకొచ్చేవాళ్లం. పెట్రోల్ బంక్ రూపంలో అదనపు ఆదాయం రావడంతో మరింత మంది ఉపాధి అవకాశాలకు వీలైంది.– చంద్రకళ, పెట్రోల్ బంకు మేనేజర్– కలాల్ ఆనంద్ కుమార్ గౌడ్, సాక్షి, నారాయణపేట

మెడిటేషన్‌కి అనుగుణంగా ఇంటిని మార్చేద్దాం ఇలా..!
ఎన్నో కారణాల వల్ల ఇంటా బయటా ఒత్తిడితో జీవనం సాగించే రోజులివి. ఒత్తిడి నుంచి ఉపశమనానికి ఎవరికి తోచిన సలహాలు వాళ్లు చెబుతుంటారు. కాని, ఇంట్లోనే సానుకూల వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే ప్రశాంతతతో పాటు ధ్యాన సాధనకూ అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న మార్పులతో ధ్యానానికి అనువుగా ఇంట్లోనే ఆహ్లాదభరిత వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంటి గదుల్లో ఏదైనా ఒక మూలన బుద్ధ ప్రతిమ లేదా క్యాండిల్స్, ఆర్టిఫియల్ ట్రీ లేలా ఇండోర్ ప్లాంట్ తీగలనూ డిజైన్ చేసుకోవచ్చు. ప్రశాంతతను కలిగించే సంగీతం వింటూ రోజూ ఈ ప్లేస్‌లో కాసేపు సేద దీరితే మనసు, శరీరం విశ్రాంతి పొందుతాయి.మట్టి కుండలు లేదా రాళ్లతో డిజైన్ చేసిన ఇండోర్ వాటర్ ఫౌంటైన్స్ లభిస్తాయి. వాటి అలంకరణతో జలపాతపు ఆహ్లాదాన్ని పొందవచ్చు. ధ్యానం చేయడానికి అనువైన ప్లేస్ అలంకరణకు బేబీ మాంక్స్ బొమ్మలు, బోన్సాయ్ మొక్కలు, స్టోన్ వర్క్‌తో డిజైన్ చేసిన వస్తువులను ఎంచుకోవచ్చు. వీటిని చూసినప్పుడు చికాకుగా ఉన్న మనసు కొంత కుదుటపడుతుంది. మనలోని ఏడు చక్రాలకు గుర్తుగా ఏడు రంగులు సూచికగా ఉంటాయి. వాటిని తలపించేలా కలర్ కాన్సెప్ట్‌తో చక్రా షెల్ఫ్ డిజైన్ చేసుకోవచ్చు. రెడీమేడ్‌గా లభించే వాటినీ అమర్చుకోవచ్చు. ఈ కలర్ చక్రా షెల్ఫ్‌ల రంగులను బట్టి ధ్యానాన్ని ఏకాగ్రతతో సాధన చేయవచ్చు. అలంకరణలో చక్రా షెల్ఫ్, వాల్ హ్యాంగింగ్, ఫొటో ఫ్రేమ్స్‌తో లివింగ్ రూమ్నీ అందంగా అలంకరించవచ్చు. (చదవండి: ఝుమైర్ నృత్యం అంటే..? ఈ వేడుకకు ప్రధాని మోదీ, జైశంకర్‌లు..)
ఫొటోలు


కుంభమేళాలో ఇషా అంబానీ దంపతుల పుణ్యస్నానాలు (ఫోటోలు)


హీరోయినే కానీ ఎప్పుడూ రూమర్స్, వివాదాలతోనే సావాసం (ఫొటోలు)


వైఎస్ జగన్ రాకతో పులకించిన పులివెందుల (ఫోటోలు)


మహాశివరాత్రి- ద్వాదశ జ్యోతిర్లింగాలు (ఫోటోలు)


షారుక్ ఖాన్ కూతురు సుహానా గ్లామరస్ (ఫోటోలు)


తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంచు విష్ణు, శివ బాలాజీ (ఫోటోలు)


కవ్వించే అందాలతో సంయుక్త మీనన్.. చీరకట్టులో మైమరిపిస్తోందిగా!


స్టైలిష్ లుక్‌లో సిమ్రాన్ శర్మ ఫొటోస్ .. డోస్ మీద డోస్


పెళ్లి వేడుకలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ దంపతులు.. ఫోటోలు షేర్ చేసిన నమ్రతా శిరోద్కర్ (ఫోటోలు)


ఫ్యామిలీతో కలిసి జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయంలో మన్మధుడు హీరోయిన్ అన్షు (ఫోటోలు)
National View all

మేం సిద్ధం: తమిళనాడు సీఎం వార్నింగ్
చెన్నై: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే త్రీ లాంగ్వేజ్ ప

ఫోన్‌కు పుణ్యస్నానం..భర్తకు ప్రేమతో!
ప్రయాగ్ రాజ్: ఇప్పుడు ఏదైనా ఆన్ లైనే. ఆనాడు ఓ కవి.. కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు..

బీజేపీ నాయకుడితో శశిథరూర్ సెల్ఫీ.. పార్టీ మారతారా?
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్.. బీజేపీకి దగ్గరవుతున్నట్టు కనబడుతోంది.

‘పోరాడేందుకు వైఎస్ జగన్ స్ఫూర్తినిచ్చారు’
ఢిల్లీ: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో తలశిల ర

అరగంటలో 350 కిలోమీటర్ల జర్నీ!
న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి జైపూర్(రాజస్థాన్) మధ్య దూరం 300 క
International View all

ఇంటర్నెట్ షట్‌డౌన్.. టెన్షన్
ఇంటర్నెట్ షట్డౌన్లో ఇండియా వరుసగా ఆరో ఏడాది టాప్‌లో నిలిచింది.

దూకుడు ఫలితం.. ట్రంప్ క్రేజ్‌కు బీటలు..?
వాషింగ్టన్: రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత వరుస దూక

గవర్నర్ రేసు..వివేక్ రామస్వామికి ట్రంప్ మద్దతు
వాషింగ్టన్:భారత సంతతికి చెందిన బయోటెక్ బిలియనీర్ వివేక్ర

వీడియో: చూస్తుండగానే ఘోరం.. కుప్పకూలిన బ్రిడ్జి
దక్షిణ కొరియాలో ఘోరం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జి కుప్పకూలిపోగా.. ఇద్దరు అక్కడికక్కడే మరణించారు.

బంగ్లాదేశ్‌కు జైశంకర్ సీరియస్ వార్నింగ్
న్యూఢిల్లీ:బంగ్లాదేశ్‌కు భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర
NRI View all

Hong kong: హాంకాంగ్‌లో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
హాంకాంగ్ తెలుగు సమాఖ్య అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 2025ని ఘనంగా జరుపుకుంది.

తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నా భాషే నా శ్వాస” సదస్సు విజయవంతం
డాలస్ : ఉత్తరఅమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్యవిభాగం

డా. తాడేపల్లి లోకనాథశర్మ శాస్త్రీయ సంగీతంపై ప్రత్యేక భాషణం
శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ ఆధ్వర్యంలో సింగపూర్‌లో తెలుగువారి కోసం, గానకళానిధి కలైమామణి డాక్టర్ తాడేపల్లి లోకనాథశర్మ

Canada New Visa Rules : భారతీయ విద్యార్థులు, వర్కర్లకు పీడకల!
వలసదారుల విషయంలో డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా కఠిన చర్యలు ఆ

ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ లవ్‌స్టోరీ : అందంలోనే కాదు టాలెంట్‌లోనూ!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన మద్దతు ద
క్రైమ్

ఏడు అడుగులు.. ఏడేళ్ల వివాహేతర సంబంధం?
వరంగల్ క్రైం/ఖిలావరంగల్: వైద్యుడితో ఆమె ఏడడుగులు నడిచింది.. కానీ ఏడేళ్లనుంచి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఆ వివాహేతర సంబంధమే వారి కుటుంబంలో చిచ్చురేపింది. చివరికి భర్తను చంపేయాలన్న నిర్ణయానికి వచ్చింది. వరంగల్ మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 20వ తేదీ రాత్రి జరిగిన యువ వైద్యుడు గాదె సుమంత్‌రెడ్డిపై హత్యాయత్నం కేసును విచారిస్తున్న పో లీసులకు కేసు పూర్వాపరాలు ఓ సినిమా స్టోరీని తలపించినట్లు తెలిసింది. భార్య, ప్రియుడు సూత్రధారులుగా తేల్చి అదుపులోకి తీసుకున్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన సుమంత్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రేమ వివాహం..ఆపై వివాహేతర సంబంధం కాజీపేట మండలం ఫాతిమానగర్‌లోని ఓ చర్చిలో గాదె సుమంత్‌రెడ్డి, ఫ్లోరింజాలకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు. మూడుముళ్ల బంధంతో ఒక్కటై ఏడడుగులు వేసి జీవితాన్ని ప్రారంభించిన ఆ జంట మధ్య వివాహేతర సంబంధం సమస్యలను తెచ్చిపెట్టింది. ఫోరింజ 2019లో సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలలో ఇంగ్లిష్ లెక్చరర్‌గా ఉద్యోగం సాధించింది. దానికంటే ముందు సంగారెడ్డిలో డాక్టర్ సుమంత్‌రెడ్డి ఆస్పత్రి నిర్వహించే క్రమంలో జిమ్‌కు వెళ్లిన ఆమెకు అందులో ఉద్యోగం చేసే సామేల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధంగా మారింది. ఆ తర్వాత ఆస్పత్రిని కాజీపేటకు మార్చారు. అయినా ఏడేళ్లుగా ఫోరింజ, సామేల్ మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఇటీవల విషయం సుమంత్‌రెడ్డికి తెలియడంతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. దీంతో సామేల్ .. ఫ్లోరింజలు కలిసి డాక్టర్‌ను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశారు. దీనికి సంగారెడ్డిలో ప్లాన్ చేసి, భట్టుపల్లి దగ్గరలోని అమ్మవారిపేట వద్ద అమలు చేశారు. దాడి అనంతరం పారిపోయిన నిందితులను పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. కాగా, వీరు అనేకసార్లు డాక్టర్‌పై దాడి ప్రయత్నాలు చేసి విఫలమైనట్లు తెలిసింది. ఓసారి డాక్టర్‌ను నేరుగా బెదిరించి వదిలేసినట్లు తెలుస్తోంది. స్నేహితుడి కోసం వచ్చి..ప్రియురాలు ఫ్లోరింజ కోసం హత్య చేయడానికి సిద్ధమైన సామేల్ వెంట వచ్చిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ అడ్డంగా బుక్ అయ్యాడు. సుమంత్‌పై దాడి అనంతరం ఏఆర్ కానిస్టేబుల్‌ను హైదరాబాద్‌లో వదిలేసి సామేల్ బెంగళూరు పారిపోయాడు. కాల్ డేటా అధారంగా పోలీసులు నిందితులను త్వరగా పట్టుకోగలిగారు. ప్రాణాపాయ స్థితిలో వైద్యుడు సుమంత్ వైద్యుడు సుమంత్‌రెడ్డి ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మెడ, తలకు బలమైన గాయాలు కాగా, ప్రాణపాయ స్థితిలో ఉన్నట్లు సమాచారం. కోడలిపై అనుమానం.. ఫిర్యాదు..డాక్టర్ సుమంత్‌రెడ్డిపై దాడి జరిగిన వెంటనే తల్లిదండ్రులు కోడలు ఫ్లోరింజాపై అనుమా నం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె కాల్ డేటా వివరాలను పరిశీలించారు. అందులో కొన్ని నెలలుగా గంటల తరబడి మాట్లాడుతున్న ఫోన్ నంబర్, హత్యాయత్నం జరిగిన రోజు ఎక్కడ ఉంది అని చూశారు. హత్యాయత్నం జరిగిన సంఘటన స్థలానికి మ్యాచ్ అయినట్లు సమాచారం. దీంతో సూత్రధారి అయిన భార్యను అరెస్టు చేయకుండా ఫోన్‌నంబర్ అధారంగా పోలీసులు రెండు రోజులు బెంగళూర్‌లో గాలించి నిందితుడిని అదుపులోకి తీసుకొని వరంగల్‌కు తీసుకువచ్చారు. పోలీసుల విచారణలో నేరం అంగీకరించడంతో అసలు నిందితురాలిని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో అరెస్టు చూపే అవకాశం ఉంది.

యువతిపై లైంగిక దాడి.. నిందితుడిపై కేసు నమోదు
సనత్‌నగర్(హైదరాబాద్): ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన యువతి (19) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. కొన్నేళ్ల క్రితం ఆమెకు బేగంపేట ప్రకాష్ నగర్‌కు చెందిన ఆర్యతో ఇన్‌స్ట్రాగామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారిరువురు తరచూ వ్యక్తిగతంగా కలుసుకుని మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి సదరు యువతిని తన ఇంటికి తీసుకెళ్లిన ఆర్య ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో గర్భం దాల్చిన బాధితురాలు తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయగా ఆమెపై దాడికి పాల్పడ్డాడు. అంతేగాగా ఆమె వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు తీసిన అతను తనను విడిచిపెట్టి వెళ్లాలని, లేని పక్షంలో ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్నాడు. దీంతో బాధితురాలు సోమవారం బేగంపేట పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు నిందితుడిపై

రోహింగ్యాల వ్యవస్థీకృత వ్యభిచార దందా
సాక్షి, హైదరాబాద్: మయన్మార్ నుంచి అక్రమంగా నగరానికి వలస వచ్చిన రోహింగ్యాలు వ్యవస్థీకృతంగా వ్యభిచార దందా కొనసాగిస్తున్నారు. తమ జాతీయతను దాచి పెట్టడానికి నకిలీ ఆధార్ కార్డులు తయారు చేసుకున్నారు. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పాతబస్తీతో పాటు పలు ప్రాంతాల్లో సోమవారం మెరుపు దాడులు చేశారు. 18 మందిని అదుపులోకి తీసుకుని చాదర్‌ఘాట్ పోలీసులకు అప్పగించారు. మయన్మార్ నుంచి బంగ్లాదేశ్ మీదుగా అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చిన ఈ రోహింగ్యాలు కోల్‌కతాలో నకిలీ ఆధార్ కార్డులు సంపాదించారు. వీటిని తయారు చేసి ఇచ్చిన వ్యక్తులు వారిని వెస్ట్‌బెంగాల్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన వారిగా చూపించారు. ఈ ఆధార్ కార్డుల ఆధారంగా నగరానికి చేరుకున్న వీరు పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వీరిలో పురుషులు సెకండ్ హ్యాండ్ బైకులు కొనుగోలు చేసి వాటి ఆధారంగా ట్యాక్సీ డ్రైవర్లుగా పని చేస్తుండగా... మహిళలు, యువతులు వ్యభిచార వృత్తిలో దిగారు. పరిచయస్తులతోనే ఈ దందా చేస్తున్న వారిని సంబందీకులైన పురుషులే తమ వాహనాలపై తీసుకెళ్లి కస్టమర్ల వద్ద వదిలి వస్తున్నారు. కొన్నాళ్లుగా సాగుతున్న ఈ దందాపై దక్షిణ మండల టాస్‌్కఫోర్స్‌కు సమాచారం అందడంతో సోమవారం వివిధ ప్రాంతాల్లో వరుస దాడులు చేసిన ప్రత్యేక బృందాలు మొత్తం 18 మందిని పట్టుకున్నాయి. వారి నుంచి వాహనాలు, నకిలీ గుర్తింపుకార్డులతో పాటు ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రోహింగ్యాల్లో కొందరిని చాదర్‌ఘాట్ పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది.

డాక్టర్ సుమంత్ రెడ్డిపై హత్యాయత్నం.. దారి తప్పిన భార్య కథ
సాక్షి, హైదరాబాద్ : వాళ్లిద్దరూ భార్య భర్తలు. ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. దంపతులిద్దరూ సమాజంలో గౌరవప్రదమైన డాక్టర్, లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే, లెక్చరర్‌గా విద్యాబుద్ధులు నేర్పించే భార్య పక్కదారి పట్టింది. దారుణానికి ఒడిగట్టింది. తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చేందుకు ప్లాన్ చేసింది. హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ముందస్తు ప్లాన్ ప్రకారం, అనుకున్నట్లుగా భర్త చనిపోకపోవడంతో చివరికి పోలీసులకు పట్టుబడింది. దోషిగా కటకటాల్లోకి వెళ్లనుంది.రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వరంగల్ డాక్టర్ సుమంత్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో అసలు సూత్రధారి, పాత్రదారి బాధితుడి భార్య ఫ్లోరా మరియా అని తేలడం అందర్నీ షాక్‌కు గురి చేసింది. మంగళవారం నిందితులను పోలీసులు మీడియా ఎదుట హాజరు పరిచే అవకాశం ఉన్నట్లు సమాచారం.పోలీసుల వివరాల మేరకు, డాక్టర్ సుమంత్ రెడ్డి, ఫ్లోరా మరియాలు ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కాజీపేటలో సుమంత్ క్లినిక్‌ను నిర్వహిస్తుండగా, అతని భార్య ఫ్లోరా మరియా రంగశాయిపేటలో డిగ్రీ లెక్చరర్‌గా పనిచేస్తోంది. అయితే, క్లినిక్ ప్రారంభించకముందు ఓ ఆస్పత్రిలో డాక్టర్‌గా సుమంత్ పనిచేసేవారు. ఆ సమయంలో ఫ్లోరా మరియా ఓ జిమ్‌లో చేరింది. అక్కడే ఆమెకు సామెల్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం మొదలైంది. ఆ విషయం సుమంత్‌కు తెలిసిపోవడంతో భార్య ఫ్లోరాను మందలించాడు.అయినా, ఆమె వినిపించుకోలేదు. భర్తను వద్దనుకొని, ప్రియుడే కావాలని అనుకున్న ఆమె, చివరికి భర్తను అడ్డొదగొట్టాలని అనుకుంది. ఇందుకోసం ప్రియుడు సామెల్, అతని స్నేహితుడు ఏఆర్ కానిస్టేబుల్ రాజును ఆమె పురమాయించింది. నేరం చేస్తే మట్టికి అంటకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతో భర్తను ఎక్కడ, ఎలా హత్య చేయాలో ఫ్లోరా చెప్పింది.సుమంత్‌ను చంపి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు స్కెచ్ వేసింది. ప్లాన్ ప్రకారం, యాక్సిడెంట్ ప్లాన్ విఫలమయ్యాక, ప్లాన్ బీ ప్రకారం ఈ నెల 20న రాత్రి ఖాజీపేట నుండి బట్టుపల్లి బైపాస్ రహదారిలో సమంత్ కారును అడ్డగించి, అతడిపై ఐరన్ రాడ్లతో దాడి చేశారు. చనిపోయాడనుకున్న తర్వాత నిందితులు పరారయ్యారు. కానీ చావుబతుకుల మధ్య ఉన్న బాధితుణ్ని స్థానికులు అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సుమంత్‌పై జరిగిన హత్యాయత్నంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో కట్టుకున్న భార్య ఫ్లోరా మరియా, ఆమె ప్రియుడు సామెల్, సామెల్ స్నేహితుడు ఏఆర్ కానిస్టేబుల్ రాజు నిందితులని తేలింది. మంగళవారం నిందితులను పోలీసులు మీడియా ఎదుట హాజరుపరచి, హత్యయత్నానికి సంబంధించిన వివరాలను వెల్లడించనున్నారు.
వీడియోలు


ప్రతీ YSRCP కార్యకర్త, నేతలు జగన్‌కు సెల్యూట్ చేయాల్సిన రోజు ఇది


ఎమ్మెల్సీ ఎన్నికల వేళ మరోసారి తెరపైకి ఫోన్ ట్యాపింగ్ కేసు


అంతర్ రాష్ట్ర చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా గుట్టురట్టు


బీజేపీపై కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు


లోకేష్ వ్యాఖ్యలకు బొత్స దిమ్మతిరిగే కౌంటర్


వైఎస్ఆర్ సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి: సుబ్రమణ్యస్వామి


కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించే అవకాశం బీజేపీకి ఇవ్వాలి: బండి సంజయ్


సుప్రీంకోర్టులో వైఎస్ఆర్ సీపీ నేతలకు ఊరట


మరోసారి తొక్కిసలాట తిరుమలలో తీవ్ర విషాదం..


వరుదు కల్యాణి మాస్ ర్యాగింగ్!