Top Stories
ప్రధాన వార్తలు

ప్రజలకు అండగా నిలుద్దాం: వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, కడప: ‘‘ప్రజల మదిలో మనం చెరగని ముద్ర వేశాం... ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలనందించాం. విపక్ష పార్టీ నాయకులుగా ప్రజాపక్షమే ఏకైక అజెండాగా పని చేద్దాం. ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల హృదయాలను గెలుచుకుందాం..’’ అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా వైఎస్సార్సీపీ ఎప్పుడూ ప్రజాపక్షమే అనే విషయాన్ని గుర్తెరిగి పార్టీ నేతలంతా సమష్టిగా పని చేయాలని పిలుపునిచ్చారు.మంగళవారం పులివెందులలో ప్రజా దర్బార్ సందర్భంగా తొలుత ఇటీవల పార్టీ పదవులు పొందిన నాయకులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆయా నేతలను కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పరిచయం చేశారు. అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. పార్టీ పదవులు పొందిన నాయకులు ఎప్పటికప్పుడు ప్రభుత్వం చేపట్టే ప్రజêవ్యతిరేక చర్యలపై ఉద్యమించాలని.. స్థానిక సమస్యలపై ప్రజల గొంతుకగా పని చేయాలని సూచించారు.వైఎస్సార్ సీపీ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా గుర్తుండిపోయేలా పాలన అందించామన్నారు. అబద్ధాల హామీలతో టీడీపీ కూటమి నేతలు ప్రభుత్వ పగ్గాలు చేపట్టారన్నారు. చంద్రబాబు నయవంచకుడని తెలిసి కూడా ప్రజలు నమ్మి ఓటేశారని, అతి తక్కువ సమయంలోనే మోసపోయామని గ్రహిస్తున్నారని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. పులివెందులలో కోలాహలం..రెండు రోజుల పర్యటనలో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఉదయంతాడేపల్లి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు పులివెందుల చేరుకున్నారు. భాకరాపురంలోని తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశం అనంతరం కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ వారి విజ్ఞప్తులను స్వీకరించారు. అప్పటికప్పుడు పరిష్కారం అయ్యే సమస్యలను పరిష్కరిస్తూనే.. అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిన వాటిని నోట్ చేసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా పులివెందులలో సందడి వాతావరణం నెలకొంది. అభిమాన నేతను చూసేందుకు కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.నూతన జంటలకు ఆశీర్వాదం...పులివెందులలో ఇటీవల వివాహం జరిగిన నాలుగు నూతన జంటలను వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీర్వదించారు. నారాయణ కళాశాల సమీపంలో నివాసం ఉంటున్న వై.మహేశ్వరరెడ్డి కుమార్తె అనిలాదేవి, అల్లుడు విష్ణువర్ధన్‌రెడ్డికి వైఎస్ జగన్ ఆశీస్సులు అందజేశారు. అలాగే చెన్నారెడ్డి కాలనీలో నివసించే రవీంద్రనాథరెడ్డి కుమార్తె సాయిలహరి, అల్లుడు లిఖిత్‌లతోపాటు జి.మహేశ్వరరెడ్డి కుమార్తె సాహిత్య, అల్లుడు రామమనోహర్‌రెడ్డికి.. సుదర్శన్ కుమారుడు అనుదీప్‌కుమార్, కోడలు లాస్యశ్రీలకు వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన జంటల కుటుంబ సభ్యులతో మమేకమై వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.ఘనస్వాగతం...తాడేపల్లి నుంచి హెలికాఫ్టర్‌లో పులివెందుల చేరుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘనస్వాగతం లభించింది. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథరెడ్డి, డాక్టర్ సుధా, కడప మేయర్ సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు ఎస్.రఘురామిరెడ్డి, ఎస్బీ అంజాద్ బాషా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, పులివెందుల మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహరరెడ్డి, బీసీ సెల్ నేత బంగారు నాగయ్య, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిన్నప్ప పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.మండలశాఖ అధ్యక్షుడి కుటుంబానికి పరామర్శ...సింహాద్రిపురం మండలశాఖ అధ్యక్షుడు దేవిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి తల్లి లక్ష్మీ నరసమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. అప్పట్లో ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సాయంత్రం పులివెందులలో నివాసం ఉంటున్న శ్రీకాంత్‌రెడ్డి ఇంటికి వెళ్లి లక్ష్మీ నరసమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక నాయకులను కలుసుకున్నారు.మామను చూడాలని పాదయాత్ర!సాక్షి ప్రతినిధి, కడప: అభిమానానికి హద్దుండదు...! ఆత్మీయతకు వయసుతో నిమిత్తం లేదు!! వైఎస్ జగన్ పట్ల చిన్నారుల మక్కువ మరోమారు నిరూపితమైంది. పులివెందులకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండారెడ్డి కాలనీలో నివసించే బాలుడు మాబు షరీఫ్‌కు వైఎస్ జగన్ అంటే ఎనలేని ఇష్టం. వైఎస్ జగన్ పులివెందుల వస్తున్నట్లు తెలియడంతో ఎలాగైనా ఆయన్ను కలిసి ఫొటో దిగాలనే ఆరాటంతో తెల్లవారుజామున 5.30 గంటలకు చెప్పులు లేకుండా కాలినడకన ఇంటి నుంచి బయలుదేరాడు. హెలిప్యాడ్ వద్దకు చేరుకుని నిరీక్షించాడు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో అక్కడకు చేరుకున్న వైఎస్ జగన్ తన వద్దకు వచ్చిన బాలుడిని గమనించి ఆప్యాయంగా పలుకరించారు. కరచాలనం చేయడంతో ఆనంద బాష్పాలు రాల్చిన చిన్నారి కళ్ల నీళ్లు తుడిచి వివరాలు కనుక్కున్నారు. మామయ్య తనను దగ్గరకు తీసుకున్నారని బాలుడు ఎంతో సంబరంగా వైఎస్ జగన్‌తో ఓ ఫొటో దిగాడు. ఆ చిన్నారి అభిమానాన్ని చూసి వైఎస్ జగన్ చలించిపోయారు. అనంతరం ఆ బాలుడికి జాగ్రత్తలు చెప్పి క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యతను పార్టీ కార్యకర్తలకు అప్పగించారు.

అట్టుడికిన మండలి.. నిలదీసిన వైఎస్సార్సీపీ
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్ల బలవంతపు రాజీనామాల వ్యవహారం.. రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు.. 4 లక్షల ఉపాధి అవకాశాల అంశాలు మంగళవారం శాసన మండలిని కుదిపేశాయి. అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర చరిత్రలో ఇదివరకెన్నడూ లేని విధంగా ఒకేసారి 17 మంది వీసీలను బెదిరించి.. బలవంతంగా రాజీనామా చేయించారని, ఈ వ్యవహారంపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ సభ్యులు పట్టుపట్టారు. ఆధారాలు లేకుండా మాట్లాడటం సరికాదని, తామెవరినీ బెదిరించలేదని మంత్రి లోకేశ్ దబాయించబోయారు. ‘ఏ వీసీ అయినా ప్రెస్‌మీట్ పెట్టి చెప్పారా.. వాట్సాప్‌లో పంపించారా.. ఫలానా వాళ్లు రాజీనామా చేయమన్నారని చెప్పారా.. ఇలా ఏ ఆధారం లేకుండా ఆరోపణలు చేస్తారా.. ఆరోపణలను వెంటనే వెనక్కు తీసుకోవాలి’ అంటూ గుడ్లురమబోయారు. ‘వీసీలందరికి ఐఏఎస్ అధికారి సౌరబ్ గౌర్ ఫోన్ చేసి రాజీనామా చేయండని ఒత్తిడి చేశారు. కావాలంటే కాల్ లిస్ట్ చెక్ చేసుకోవచ్చు. వీసీలు తమ రాజీనామా పత్రంలో ‘ఉన్నత విద్యా మండలి అధికారుల ఆదేశాల మేరకు రాజీనామా చేస్తున్నాం’ అని పేర్కొన్నారు’ అని విపక్ష సభ్యులు ఆధారాలు చూపగా లోకేశ్ వెంటనే మాట మార్చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు.. 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఎక్కడ కల్పించాలో చూపాలన్న డిమాండ్‌కు సమాధానం చెప్పలేక మంత్రులు నీళ్లు నమిలారు. తర్జుమా చేయడంలో పొరపాటంటూ మంత్రి లోకేశ్ కవర్ చేసుకునేందుకు విఫల యత్నం చేశారు. సర్కారు ద్వంద్వ నీతిని నిరసిస్తూ వైఎస్సార్సీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. వీసీలతో బలవంతపు రాజీనామాలుసాక్షి, అమరావతి: ‘గవర్నర్ ప్రసంగంలో వీసీల నియామకం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వీసీల నియామకం అనేది రెగ్యులర్ ప్రొసెస్. ఏ ప్రభుత్వం అయినా వారి పదవీ కాలం ముగిసిన తర్వాతే సెర్చ్ కమిటీ వేసి నియామకాలు చేపడుతుంది. అయితే రాష్ట్రంలో 19 యూనివర్సిటీలుండగా, 17 వర్సిటీల వీసీలు కూటమి ప్రభుత్వం వచ్చాక ఒకేసారి రాజీనామా చేశారు. ఇలా ఇంత మంది రాజీనామాలు చేయడం చరిత్రలో ఎప్పుడూ ఏ ప్రభుత్వ హయాంలోనూ జరగలేదు. బెదిరించి, బలవంతంగా వారితో రాజీనామా చేయించారు. ఏపీపీఎస్సీ చైర్మన్‌తో కూడా బలవంతగా రాజీనామా చేయించడం నిజం కాదా.. ’ అని శాసన మండలి వేదికగా వైఎస్సార్సీపీ గళం విప్పింది. ఈ వ్యవహారంపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ జోక్యం చేసుకుంటూ.. ‘మేము బెదిరించాం.. భయపెట్టాం.. బయటకు పంపించాం.. అని వైఎస్సార్సీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు. విద్యాశాఖా మంత్రిగా అడుగుతున్నా.. ఆధారాలుంటే హౌస్‌లో పెట్టండి’ అని మంత్రి లోకేశ్ సవాల్ విసిరారు. దీనిపై ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డి బదులిస్తూ.. ‘నెల్లూరు విక్రమ సింహపురి యూనివర్సిటీలో గొడవలు చేసి, గందరగోళం సృష్టించి.. వీసీ రాజీనామా చేసి పోయేలా చేశారు. నేను అడుగుతున్నది ఒక్కటే.. ఇంత మంది ఒకేసారి రాజీనామా చేస్తే ఎందుకు విచారణ చేయడం లేదో చెప్పాలి’ అని నిలదీశారు. వెంటనే లోకేశ్ జోక్యం చేసుకుంటూ.. ‘ఏదో రాయి వేస్తాం.. మట్టి వేస్తాం.. కడుక్కోండి.. అంటే కుదరదు. మా ప్రభుత్వంలో ఎవరు బెదిరించారో.. ఏమని బెదిరించారో.. రాజీనామా చేసిన వీసీలు ప్రెస్‌మీట్ పెట్టి చెప్పమనండి.. వీసీ పోస్టుల కోసం 500 మంది అప్లై చేశారు. టాప్ యూనివర్సిటీల నుంచి ప్రొఫెసర్లను తీసుకొచ్చి వీసీలుగా నియమించాం. సామాజిక న్యాయం చేశాం. గత ప్రభుత్వం మాదిరిగా ఒక సామాజిక వర్గానికే ఇవ్వలేదు’ అని వ్యాఖ్యానించారు. దీనిపై వైఎస్సార్సీపీ సభ్యులు స్పందిస్తూ.. ‘దేశ చరిత్రలో ఓ రాష్ట్రంలో ఒకేసారి 17 మంది వీసీలు రాజీనామా చేయడం జరగలేదు. వారు ఎందుకు రాజీనామాలు చేయాల్సి వచ్చిందో జ్యూడిషియల్ విచారణకు ఆదేశించండి’ అని నిలదీశారు. ఏ ఒక్కరినీ వదిలిపెట్టం.. మంత్రి లోకేశ్ మళ్లీ జోక్యం చేసుకుంటూ.. ‘యూనివర్సిటీలకు ఛాన్సలర్ గవర్నర్. మీరు గవర్నర్‌ను కించ పరిచినట్టుగా ఆరోపణలు చేస్తున్నారు. లోకేశ్ ఫోన్ చేశాడా.. లేదా ఇక్కడున్న మా మంత్రులు ఎవరు ఫోన్ చేశారో చెప్పమనండి.. లేదా మా ఆఫీస్ నుంచి ఎవరైనా ఫోన్ చేసి బెదిరించారో చెప్పమంటే చెప్పకుండా ఆరోపణలు చేయడం సరికాదు. మీరు చేస్తున్న ఆరోపణల వల్ల విశ్వవిద్యాలయాలకు చెడ్డపేరు వస్తుంది. తక్షణమే బేషరతుగా మీ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. ఆధారాలుంటే బయట పెట్టండి. తప్పకుండా విచారణ జరిపిస్తాం.. ల్యాప్ ట్యాప్ నా దగ్గరే ఉంది.. ఇప్పుడే ఆర్డర్ ఇస్తా.. మాజీ వీసీలు ఎవరైనా మీకు ఫోన్ చేశారా? వాట్సాప్ మెసేజ్ చేశారా? వివరాలు ఇవ్వండి.. చర్యలు తీసుకుంటాం. వీసీల రాజీనామాల వ్యవహారమే కాదు.. 2019 నుంచి ఏం జరిగిందో అంతా బయటకు తీద్దాం. అన్నీ బయటకొస్తాయి. ఇప్పటికే ఒకరు జైల్లో ఉన్నారు. ఎవరినీ వదిలి పెట్టం. వెయిట్ అండ్ వాచ్.. టైమ్, డేట్ రాసుకోండి’ అని తీవ్ర స్వరంతో మంత్రి లోకేశ్ హెచ్చరించారు. ఈ దశలో టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ‘రాజీనామా చేసిన వీసీలంతా మీ నాయకుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బావమరుదులు, మేనత్తలే అని అన్నారు. వైఎస్ జగన్ ఓడిపోయారు కాబట్టి వారంతా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారన్నారు. ఈ వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో గందరగోళంతో చైర్మన్ కొద్దిసేపు సభను వాయిదా వేశారు.ఇవిగో ఆధారాలు..సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ.. ‘వీసీలందరికీ ఐఏఎస్ అధికారి సౌరబ్ గౌర్æ ఫోన్ చేసి రాజీనామా చేయాలని ఒత్తిడి చేశారు. ఆ మరుసటి రోజే వారంతా రాజీనామా చేశారు. కావాలంటే కాల్ లిస్ట్ చెక్ చేసుకోవచ్చు. అంతేకాదు.. వీసీలు తమ రాజీనామా పత్రంలో ఉన్నత విద్యా మండలి అధికారుల ఆదేశాల మేరకు రాజీనామా చేస్తున్నామని పేర్కొన్నారు. ఇంతకంటే ఆధారాలు ఇంకేం కావాలి? తక్షణమే విచారణ జరిపించాలి’ అని డిమాండ్ చేశారు. ఇదే విషయమై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. ‘ఏ విచారణ కావాలి.. జ్యుడీషియల్ విచారణా లేక డిపార్టుమెంటల్ విచారణా.. క్లారిటీ ఇవ్వండి‘ అని చైర్మన్ కోరగా, ‘మేము జ్యూడిషియల్ ఎంక్వైరీ కోరుతున్నాం.. వాళ్లు ఎంక్వైరీ వేసినా మాకు అభ్యంతరం లేదు. మంత్రి చెబుతున్నట్టు 2019 నుంచే కాదు.. కావాలంటే 2014 నుంచి ఎంక్వైరీ చేయండి. మాకు అభ్యంతరంలేదు. వాస్తవాలేమిటో ప్రజలకు తెలుస్తాయి’ అని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ దశలో మంత్రి లోకేశ్ మాట మార్చారు. ‘ప్రైమ్ ఆఫ్ ఎవిడెన్స్ ఇస్తే ఎంక్వైరీ వేస్తాం. ఏ ఆధారం లేకుండా కేసు పెట్టమంటే ఎలా?’ అని తప్పించుకొనే ప్రయత్నం చేశారు. ‘ముందు ఒకలా మాట్లాడుతున్నారు.. ఆధారాలు చూపాక మరొకలా మాట్లాడుతున్నారు. మీకు చిత్తశుద్ధి లేదు’ అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ వైఎస్సార్సీసీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.బెదిరిపోయేవాళ్లెవరూ లేరు: బొత్స మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ‘ఒకేసారి 17 మంది వీసీలు రాజీనామాలు ఎందుకు చేయాల్సి వచ్చిందో విచారణ జరపాలని మా సభ్యులు కోరుతున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. ఎంక్వైరీ వేయండి.. నిరూపిస్తాం.. నిరూపించకపోతే అప్పుడు మాట్లాడండి. అడిగిన దానికి బదులివ్వకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. మళ్లీ మళ్లీ చెబుతున్నాం. చట్ట ప్రకారం ఏం చేయదల్చుకున్నారో చేయండి. ఇక్కడ ఎవరూ బెదిరిపోయేవాళ్లు, అదిరిపోయే వాళ్లు లేరు. ఎవరు తప్పు చేస్తే వాళ్లు అనుభవిస్తారు. దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఎన్ని తప్పుడు కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి’ అని బొత్స సత్యనారాయణ... మంత్రి లోకేశ్‌కు దీటుగా స్పందించారు.

ఈ రాశి వారి శ్రమ ఫలిస్తుంది.. సంఘంలో గౌరవం
గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: బ.త్రయోదశి ఉ.9.48 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: శ్రవణం సా.4.38 వరకు, తదుపరి ధనిష్ఠ, వర్జ్యం: రా.8.33 నుండి 10.05 వరకు, దుర్ముహూర్తం: ఉ.11.52 నుండి 12.40 వరకు,అమృతఘడియలు: ఉ.6.16 నుండి 7.50 వరకు, తదుపరి తె.5.50 నుండి 7.24 వరకు (తెల్లవారితే గురువారం), మహాశివరాత్రి; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 6.25, సూర్యాస్తమయం: 6.01. మేషం.... చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.వృషభం.... కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఆస్తి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన.మిథునం.... ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ధనవ్యయం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఇంటాబయటా ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. విద్యార్థులకు శ్రమాధిక్యం. దైవదర్శనాలు.కర్కాటకం... కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. దైవదర్శనాలు.సింహం... ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో ఆదరణ. వ్యవహారాలలో విజయం. భూ, గృహయోగాలు. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.కన్య.... వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. వ్యయప్రయాసలు. ధనవ్యయం. శ్రమాధిక్యం. బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి.తుల.... ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. దూరప్రయాణాలు. అనారోగ్య సూచనలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశాజనకంగా ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు.వృశ్చికం..... శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. విందువినోదాలు. ఆస్తి వివాదాల పరిష్కారం.ధనుస్సు.. పనులు మందగిస్తాయి. మిత్రులతో మాటపట్టింపులు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. విద్యార్థులకు నిరుత్సాహం..మకరం....... కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలస్థితి ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు.కుంభం.. పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో వివాదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.మీనం..... కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. అనుకోని విధంగా ఆర్థిక లాభాలు ఉంటాయి. పనులలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

నేడు శివరాత్రి.. జనమనోహరుడు
శివరాత్రివేళ ఒక్కసారిగా పుణ్యనదులు, పుణ్యక్షేత్రాలు జనవాహినితో సందడిగా ఉంటాయి. ఒక సమైక్యతకీ, సమన్వయానికీ సంకేతమిది. భాషలు, ఆచార వ్యవహారాలు, కట్టూ బొట్టూ ఇలాంటి తేడాలు ఎన్ని ఉన్నా భారతీయులందరూ ఒకే శివభావంతో ఒక్కటిగా మసలే సుదినమిది. దేవదానవులు క్షీరసాగర మథనం చేసినప్పుడు ముందుగా పుట్టిన హాలాహలాన్ని ఉండలా చేసుకుని కంఠంలో ఉంచి కాపాడిన వాడు శివుడు. ఆ తరువాతపాలకడలిని మధించగా వచ్చిన అద్భుతమైన వస్తువులన్నింటినీ దేవదానవులే పంచుకున్నారు. అవేవీ శివుడు స్వీకరించలేదు. ఆశించలేదు. ఈ లీలద్వారా జగత్పాలకుడైన శివుడు,పాలకులు ఎలా ఉండాలో బోధించాడు.ఒకపాలకుడిగా ప్రజల ధనాలనీ, ప్రయోజనాలనీ తాను అనుభవించకుండా, సుఖాలను మాత్రం అందకి పంచి, కటువైన విషాన్ని తాను దిగమింగిన అమృతమూర్తి రుద్రుడు. భూమికోసం... తన పితరుల మోక్షం కోసం భగీరథుని ప్రార్థన మేరకు గంగను తన జటాజూటాల నుంచి దించిన వేల్పు శివుడు. లోకక్షేమంకోసం ఎంతటి భారాన్నైనా స్వీకరించి నిర్వహించే సమర్థత, సౌజన్యం శివుని సహజ స్వభావం. లోకకంటకులైన త్రిపురాసురాది దుష్టుల్ని నిగ్రహించి, తన పరాక్రమాన్ని, ప్రసన్నతనీ ప్రదర్శించిన పరమాత్ముడు. ‘శివం’ అంటే ‘మేలు, మంచి’. లోకాలకి మేలు చేసే స్వభావం కలవాడు కనుకనే శివుడు. ప్రాణికోటికి శుభాన్ని కోరేవాడు, శ్రేయస్సును కలిగించే వాడు శివుడు.రుద్రుడు – దుఃఖాన్నిపోగొట్టేవాడు;శంకరుడు – సుఖాన్నీ, శాంతినీ కలిగించేవాడు;శంభుడు – శాంతికిమూలమైన వాడు;సదాశివుడు – ఎల్లవేళలా శుభస్వరూపుడు.⇒ ఇలా శివుని నామాలన్నీ ఆయనలోని ‘మేలు’ గుణాల్ని చెబుతున్నాయి. ఈ స్వభావాలను మనలో పెంచుకునేలా చేసేదే శివభావన, శివారాధన.⇒ ‘శివుని పూజించడం – అంటే తపస్సునీ, జ్ఞానాన్నీ, త్యాగాన్నీ ఆరాధించడమే. భారతీయుల ఆదర్శాలివి. అందుకే నిరంతరం త΄ోరూపంలో ఉన్న శివుని ఆరాధిస్తున్నారు’’ అని స్వామి వివేకానందుల వాగ్భావన. ఈ సుదినాన శివ తత్త్వాన్ని అర్థం చేసుకుందాం.. చేతనైన మేరకు శివరాత్రిని జరుపుకుందాం. మన చిత్తాలను శుద్ధి చేసుకొని, పవిత్ర భావనతో అంతర్ముఖులమై మనలోని పరమాత్మని ధ్యానించడమే ముఖ్య శివారాధన. అంతర్ముఖత్వానికి సంకేతమే రాత్రి. సత్యాన్ని మరువకుండా జాగరూకతతో మెలగడమే జాగరణ. ఇంద్రియ చపలత్వాన్ని నిగ్రహించడమే ఉపవాసం. సద్భావనలతో పరమాత్మను ఆరాధించడమే అభిషేకం.– డి.వి.ఆర్.

పుతిన్ నియంత కాదు: ట్రంప్
వాషింగ్టన్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ‘నియంత’ అని పిలవడానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిరాకరించారు. ఓవల్ ఆఫీస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ‘పుతిన్‌ను నియంతగా భావిస్తున్నారా’ అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన పై సమాధానమిచ్చారు. తాను ఆ పదాలను అంత తేలికగా ఉపయోగించనని స్పష్టం చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ అనంతరం సోమవారం సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ తెలివిగా వ్యవహరిస్తే ఉక్రెయిన్‌లో యుద్ధం తొందరగా ముగిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.‘‘మనం స్మార్ట్ కాకపోతే అది కొనసాగుతూనే ఉంటుంది. లేదంటే ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. శాంతి ఒప్పందంలో భాగంగా ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యాకు అప్పగించాల్సి ఉంటుందా అనేది కీలక చర్చనీయాంశమైంది. దీనిపై ట్రంప్‌ను ప్రశ్నించగా.. ‘‘సంప్రదింపులు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. అయితే.. రష్యా ఆక్రమించిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడం అంత తేలికైన విషయం కాదు. అమెరికా, ఉక్రెయిన్ మధ్య ఖనిజాల ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉంది. ఈ ఒప్పందం సంతకం చేయడానికి త్వరలోనే జెలెన్స్కీ అమెరికా వస్తారని ఆశిస్తున్నా’’ అని ట్రంప్ పేర్కొన్నారు.ఏరోస్పేస్, వైద్య, సాంకేతిక పరిశ్రమలలో ఉపయోగించే కీలకమైన ఖనిజాలు ఉక్రెయిన్‌లో ఉన్నాయి. అయితే.. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి కీవ్‌కు అందించిన 180 బిలియన్ డాలర్ల అమెరికన్ సహాయంలో కొంత భాగాన్ని భర్తీ చేయడానికి ఖనిజాలపై ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. మరోవైపు రష్యా–ఉక్రెయిన్ శాంతి చర్చల అనంతరం పుతిన్‌ను కలుస్తానని ట్రంప్ తెలిపారు. శాంతి ఒప్పందానికి పుతిన్ అంగీకరిస్తారని, అతను మరింత యుద్ధాన్ని కోరుకోవడం లేదని ట్రంప్ చెప్పుకొచ్చారు. శాంతి అంటే ఉక్రెయిన్ లొంగిపోవడం కాదు: మాక్రాన్ అయితే.. ఉక్రెయిన్ సార్వబౌమత్వాన్ని పణంగా పెట్టి ఏ శాంతి ఒప్పందం జరగకూడదని మాక్రాన్ స్పష్టం చేశారు. ఏ శాంతి ఒప్పందంలోనైనా భద్రతా హామీలు ఉండాలని, శాంతి అంటే ఉక్రెయిన్ లొంగిపోవడం కాదని మాక్రాన్ హెచ్చరించారు. ఒప్పందం కుదిరితే ఉక్రెయిన్‌కు శాంతి పరిరక్షక దళాలను పంపే ప్రతిపాదనపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో కలిసి పనిచేస్తామని మాక్రాన్ తెలిపారు. సుస్థిరత్వాన్ని ఏర్పరచడానికి యూరప్ సిద్ధంగా ఉందని, ఆ శాశ్వత శాంతిని సాధించడానికి బలమైన అమెరికా జోక్యం అవసరమని మాక్రాన్ నొక్కి చెప్పారు. అట్లాంటిక్ విభేదాలున్నప్పటికీ అమెరికా అధ్యక్షుడితో చర్చలు ముందుకు సాగాయని మాక్రాన్ నొక్కి చెప్పారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక కొత్త దౌత్య అవకాశం లభించిందన్నారు.

చెప్పినట్లు చేసి తీరాల్సిందే!
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ కక్ష సాధింపు కుట్రలో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం మరింత బరి తెగిస్తోంది. న్యాయ ప్రక్రియను అపహాస్యం చేస్తూ ఏకంగా సీఆర్పీసీ 164 కింద అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించే కుట్రను వేగవంతం చేసింది. రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, సంస్థ ఉద్యోగి సత్యప్రసాద్‌లతో అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించడమే లక్ష్యంగా వేధింపులను తీవ్రతరం చేసింది. ప్రధానంగా వైఎస్సార్ సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డికి వ్యతిరేకంగా అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించి తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు పన్నాగం పన్నింది. ఉన్నతాధికారులపై ప్రభుత్వ పెద్దల ఆగ్రహం!చంద్రబాబు ప్రభుత్వం గతేడాది జూన్ 12న అధికారంలోకి రాగానే రెడ్‌బుక్ కక్ష సాధింపులకు తెరతీస్తూ వైఎస్సార్సీపీ హయాంలో మద్యం విధానంపై అదే నెల 24న అక్రమ కేసు నమోదు చేసింది. అప్పటి బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిని నిందితుడిగా చేర్చగా ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించి బెయిల్ పొందారు. దాంతో ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో సీఐడీ మరో అక్రమ కేసు నమోదు చేసింది. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా మార్గదర్శకత్వంలో సాగుతున్న ఈ కుట్రను ప్రస్తుతం పోలీసు శాఖను శాసిస్తున్న రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎఫ్ఐఆర్లో నిందితుల పేర్లను ఉద్దేశపూర్వకంగా పేర్కొనకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. తద్వారా ఈ కేసులో ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసేందుకు అవకాశం లేకుండా చేయాలన్నది అసలు పన్నాగం. కేసు దర్యాప్తు పేరిట వాసుదేవరెడ్డిని బెదిరించి అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించాలని ప్రభుత్వ పెద్దలు సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్‌కు విస్పష్టంగా ఆదేశించారు. అప్పటి నుంచి విచారణ పేరిట సీఐడీ బృందాలు వాసుదేవరెడ్డిని వేధిస్తూనే ఉన్నాయి. ఆయన్ను కొద్ది రోజుల పాటు అనధికారికంగా నిర్బంధించి బెదిరింపులకు పాల్పడ్డాయి. ప్రధానంగా వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్‌రెడ్డి చెప్పినట్లుగా నడుచుకున్నామని, మద్యం వ్యవహారాలను వారిద్దరే పూర్తిగా పర్యవేక్షించారంటూ అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. కానీ ఇప్పటి వరకు వాసుదేవరెడ్డి అబద్ధపు వాంగ్మూలం ఇవ్వక పోవడంతో ప్రభుత్వ పెద్దలు సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, ఘట్టమనేని శ్రీనివాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దాంతో ఈ కేసులో మరింతగా బరి తెగించేందుకు సీఐడీ సన్నద్ధమైంది. రప్పించి.. రహస్యంగా రికార్డింగ్!రెడ్ బుక్ కుట్రలో భాగంగా సీఐడీ పెద్దలు.. బెవరేజస్ కార్పొరేషన్ ఉద్యోగులు, డిస్టిలరీల ప్రతినిధులను రప్పించి మాట్లాడుతున్నారు. వారు వచ్చిన విషయాన్ని రహస్యంగా ఉంచుతామని నమ్మబలుకుతున్నారు. సాధారణ సంభాషణలు, పిచ్చాపాటి తరహాలో మాట్లాడుతున్నప్పటికీ కార్యాలయంలో రహస్యంగా ఏర్పాటు చేసిన కెమెరాల ద్వారా మొత్తం వ్యవహారాన్ని రికార్డింగ్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అనంతరం వారిని మరోసారి పిలిపించి వీడియో రికార్డింగులను చూపించి బెదిరిస్తున్నారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని లేదంటే అక్రమ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. సీఐడీ అదుపులో సత్యప్రసాద్...అబద్ధపు వాంగ్మూలం నమోదు కుట్రలో భాగంగా బెవరేజస్ కార్పొరేషన్ పూర్వపు ఉద్యోగి సత్య ప్రసాద్‌ను సీఐడీ అధికారులు తమ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆయన్ను విజయవాడకు తరలించి కొద్ది రోజులుగా తమదైన శైలిలో విచారించి బెంబేలెత్తిస్తున్నారు. సత్య ప్రసాద్ కుటుంబ సభ్యులను కూడా బెదిరిస్తూ అబద్ధపు వాంగ్మూలం ఇచ్చేలా తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. సీఐడీ అధికారుల బెదిరింపులు, వేధింపులు కొంత ప్రభావం చూపించినట్లు తెలుస్తోంది. వారు చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం నమోదు చేసేందుకు సత్య ప్రసాద్ సమ్మతించినట్టు సమాచారం! దీంతో ఆయనతో న్యాయస్థానంలో వాంగ్మూలం ఇప్పించేందుకు సీఐడీ అధికారులు రెండు రోజులుగా సన్నాహాలు వేగవంతం చేశారు. వాంగ్మూలం నమోదు చేయించగానే కుట్రలో తరువాత అంకానికి తెరతీయనున్నారు.ఇక టార్గెట్ రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి..!సత్య ప్రసాద్‌ను బెదిరించి దారికి తెచ్చుకున్న సీఐడీ అధికారులు గతంలో ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించిన రాజ్ కసిరెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. ఆయన ఆచూకీ కోసం కొద్ది రోజులుగా ఆరా తీస్తున్నారు. ఆయన ఎక్కడ ఉన్నారన్నది స్పష్టమైన సమాచారం అందగానే అరెస్ట్ చేయాలని భావిస్తున్నారు. అందుకోసం సీఐడీ అధికారుల బృందాలను ఇప్పటికే హైదరాబాద్ పంపారు. వాసుదేవరెడ్డిని కూడా అరెస్ట్ చేయాలన్నది సీఐడీ అధికారుల లక్ష్యం.అబద్ధపు వాంగ్మూలం ఇవ్వకుంటే అంతు చూస్తాం..!వాసుదేవరెడ్డితోపాటు బెవరేజస్ కార్పొరేషన్లో గతంలో పని చేసిన సత్య ప్రసాద్‌తో అబద్ధపు వాంగ్మూలం ఇప్పించే కుట్రను సీఐడీ వేగవంతం చేసింది. వారిద్దరినీ కొద్ది రోజులుగా తీవ్ర స్థాయిలో బెదిరిస్తున్న సీఐడీ అధికారులు.. ఈ వారంలో సీఆర్పీసీ 164 కింద అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాల్సిందేనని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇక నిరీక్షించే ఓపిక లేదని.. అంతు చూస్తామని బెదిరింపులకు దిగారు. ఈ మేరకు సీఐడీ అధికారులు ప్రభుత్వ న్యాయవాదుల ద్వారా వాంగ్మూల నమోదు ప్రక్రియ పనులు మొదలు పెట్టడం గమనార్హం.తనిఖీల పేరిట అబద్ధపు సాక్ష్యాలు!రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్‌తోపాటు పలువురి నివాసాలు, కార్యాలయాల్లో ఆకస్మిక సోదాలు నిర్వహించేందుకు సీఐడీ సన్నద్ధమవుతోంది. తనిఖీల పేరిట అబద్ధపు సాక్ష్యాలు సృష్టించాలనే కుతంత్రాన్ని రచిస్తోంది. సీఐడీ అధికారులు తాము కోరుకుంటున్న సమాచారాన్ని ముందుగానే పెన్ డ్రైవ్‌లు, సీడీలు, హార్డ్ డిస్క్‌లలో స్టోర్ చేస్తారు. అనంతరం వాటిని వెంటబెట్టుకుని తాము లక్ష్యంగా చేసుకున్న వ్యక్తుల నివాసాలు, కార్యాలయాలు, డిస్టిలరీల కార్యాలయాల్లో తనిఖీలకు బయలుదేరుతారు. అవన్నీ ఆ నివాసాలు, కార్యాలయాల్లో నిర్వహించిన సోదాల్లో లభించినట్లు ప్రకటిస్తారు. తద్వారా తప్పుడు సాక్ష్యాలు సృష్టించి అక్రమ కేసులతో వేధించాలని సీఐడీ పన్నాగం పన్నినట్లు తెలుస్తోంది!

నేడే ఆఖరి అమృత స్నానం
మహాకుంభ్ నగర్(యూపీ): కోట్లాది మంది భక్తుల శరణ ఘోష, ఆధ్యాత్మిక పరిమళాల మధ్య భక్త జన కోటి పుణ్య స్నానాలు, వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆనవాయితీకి కొనసాగింపుగా ‘మహా కుంభమేళా’గా వినతికెక్కిన మహత్తర ఆధ్యాత్మిక వేడుక ఎట్టకేలకు చిట్టచివరకు చేరుకుంది.గత 44 రోజులుగా త్రివేణి సంగమ క్షేత్రంలో అప్రతిహతంగా కొనసాగుతూ కోట్లాది మంది భక్తుల పవిత్ర స్నానాలతో కిక్కిరిసిన ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా ఘాట్లు బుధవారం తుదిఅంకంలో భాగంగా మహాశివరాత్రితో మరోసారి ఇసుకేస్తే రాలనంత జనసంద్రంగా మారనున్నాయి. నేడు మహా శివరాత్రిని పురస్కరించుకుని కోటి మంది భక్తులు చిట్టచివరిదైన ‘అమృత్ స్నాన్’ క్రతువులో పాలుపంచుకోనున్నారని ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఘాట్ల వద్దకు భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అంతటా వాహనాలను నిషేధించారు.‘నో వెహికల్ జోన్’గా ప్రకటించారు. ఇటీవల త్రివేణి సంగం ఘాట్‌లో తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు ప్రాణాలుకోల్పోయిన నేపథ్యంలో ప్రభుత్వం మరింతగా పోలీసు బలగాలను మొహరించింది. చిట్టచివరి రోజు కావడంతో భక్తులు తాకిడి అనూహ్యంగా ఉండొచ్చన్న అంచనాలతో ప్రభుత్వం అన్ని రకాలుగా సర్వసన్నద్ధమైంది. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో కుంభమేళా భక్తుల తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఘాట్ల వద్ద ఒకేచోట జనం పోగుబడకుండా ప్రత్యేక పర్యవేక్షణా బలగాలను రంగంలోకి దింపారు.

ఢిల్లీ అలవోకగా...
బెంగళూరు: ఈ సీజన్ మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్ నిలకడైన విజయాలతో దూసుకెళ్తోంది. మంగళవారం జరిగిన పోరులో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై ఘనవిజయం సాధించింది. ముందుగా గుజరాత్ నిర్ణీ త 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. భారతి ఫుల్మాలి (29 బంతుల్లో 40 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) జట్టును ఆదుకుంది.డాటిన్ (24 బంతుల్లో 26; 5 ఫోర్లు) మెరుగ్గా ఆడింది. మరిజాన్ కాప్, శిఖా పాండే, అనాబెల్ సదర్లాండ్ తలా 2 వికెట్లు తీశారు. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ 15.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెస్ జొనాసెన్ (32 బంతుల్లో 61 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), షఫాలీ వర్మ (27 బంతుల్లో 44; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగారు. ఆరంభంలోనే దెబ్బ... మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జట్టులో బ్యాటర్లు మూకుమ్మడిగా చేతులెత్తేశారు. నాలుగో ఓవర్లో హర్లీన్ (5), లిచ్‌ఫీల్డ్ (0)లను అవుట్ చేసిన మరిజాన్ కాప్ దెబ్బ తీసింది. మరుసటి ఓవర్లో శిఖాపాండే వరుస బంతుల్లో బెథ్ మూని (10), కాశ్వీ గౌతమ్ (0)లను అవుట్ చేయడంతో ఇరవై పరుగులకే 4 కీలక వికెట్లను కోల్పోయింది.కాసేపటికి కెప్టెన్ ఆష్లీ గార్డ్నర్ (3), డియాండ్ర డాటిన్‌లు స్వల్ప వ్యవధిలో నిష్క్రమించడంతో 60/6 వద్ద గుజరాత్ కుదేలైంది. ఈ దశలో లోయర్ ఆర్డర్ బ్యాటర్ భారతి, తనూజ (16) ఏడో వికెట్‌కు 51 పరుగులు జోడించడంతో స్కోరు 100 దాటింది. ధనాధన్... సులువైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ ఆరంభంలోనే కెప్టెన్ మెగ్‌లానింగ్ (3) వికెట్‌ను కోల్పోయింది. స్టార్ బ్యాటర్‌ను అవుట్ చేశామన్న ఆనందం గుజరాత్‌కు ఎంతోసేపు నిలువలేదు. ఓపెనర్ షఫాలీ వర్మ, వన్‌డౌన్ బ్యాటర్ జెస్ జొనాసెన్ ధాటిగా ఆడటంతో పరుగులు వేగంగా వచ్చాయి. జెస్ బౌండరీలతో అలరించగా, షఫాలీ భారీ సిక్సర్లతో అదరగొట్టింది. వీరిద్దరు 31 బంతుల్లోనే 74 పరుగులు జత చేశారు. షఫాలీ జోరుకు గార్డ్నర్ అడ్డుకట్ట వేయగా, జెమీమా (5), అనాబెల్ (1) స్వల్ప వ్యవధిలో నిష్క్రమించినా... 26 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్న జొనాసెన్ మిగతా లాంఛనాన్ని చకచకా పూర్తి చేసింది. నేడు జరిగే మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌తో ముంబై ఇండియన్స్ ఆడుతుంది. స్కోరు వివరాలు గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: బెత్ మూనీ (సి) నికీ (బి) శిఖా పాండే 10; హర్లీన్ డియోల్ (సి) బ్రైస్ (బి) మరిజాన్ కాప్ 5; లిచ్‌ఫీల్డ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) మరిజాన్ కాప్ 0; ఆష్లీ గార్డ్నర్ (బి) టిటాస్ సాధు 3; కాశ్వీ (సి) నికీ (బి) శిఖా పాండే 0; డియాండ్రా (బి) అనాబెల్ 26; తనూజ (రనౌట్) 16; భారతి (నాటౌట్) 36; సిమ్రన్ (సి) లానింగ్ (బి) అనాబెల్ 5; మేఘన (బి) జెస్ జొనాసెన్ 0; ప్రియా మిశ్రా (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 127. వికెట్ల పతనం: 1–16, 2–16, 3–20, 4–20, 5–41, 6–60, 7–111, 8–121, 9–122. బౌలింగ్: శిఖా పాండే 3–0–18–2, మరిజాన్ కాప్ 4–1–17–2, టిటాస్ సాధు 2–0–15–1, అనాబెల్ 4–0–20–2, మిన్ను మణి 4–0–21–0, జెస్ జొనాసెన్ 3–0–24–1. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: మెగ్ లానింగ్ (బి) కాశ్వీ 3; షఫాలీ వర్మ (ఎల్బీడబ్ల్యూ) (బి) గార్డ్నర్ 44; జెస్ జొనాసెన్ (నాటౌట్) 61; జెమీమా (సి) భారతి (బి) తనూజ 5; అనాబెల్ (సి) బెత్ మూనీ (బి) కాశ్వీ 1; మరిజాన్ కాప్ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (15.1 ఓవర్లలో 4 వికెట్లకు) 131. వికెట్ల పతనం: 1–14, 2–88, 3–114, 4–115. బౌలింగ్: డియాండ్ర 4–0–30–0, కాశ్వీ 4–0–26–2, ఆష్లీ గార్డ్నర్ 3–0–33–1, మేఘన 1–0–8–0, ప్రియా 1.1–0–18–0, తనూజ 2–0–13–1.

ఏఐపై నియంత్రణ ఎలా?
కృత్రిమ మేధ అభివృద్ధి వడివడిగా సాగుతోంది. రెండు మూడేళ్ల క్రితం మొదలైన ఛాట్ జీపీటీ వంటి లార్జ్ లాంగ్వేజ్ మోడళ్లకు డీప్‌సీక్ రూపంలో చైనా కంపెనీ సవాలు విసిరింది. ఇదే సమయంలో ఏఐ టెక్నాలజీలపై నియంత్రణ ఎలా అన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. ప్యారిస్‌లో ఇటీవలే ముగిసిన ఏఐ శిఖరాగ్ర సమావేశంలోనూ ఈ అంశం ప్రబలంగా వినిపించింది. దౌత్య వేత్తలు, రాజకీయనేతలు, టెక్ కంపెనీ సీఈవోలు పాల్గొన్న ఈ సమా వేశానికి భారత్, ఫ్రాన్స్ ఉమ్మడిగా అధ్యక్ష స్థానాన్ని వహించాయి. అయితే ఏఐ టెక్నాలజీల నియంత్రణ విషయంలో ఈ సమావేశం ఏకాభిప్రాయానికి రాకపోయింది సరికదా... అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తరువాత మారిన రాజకీయ పరిస్థితులకు అద్దంపట్టేలా బోలెడన్ని విభేదాలు బయటపడ్డాయి. ప్రభావరీత్యా చూస్తే గతంలో మనం సాధించిన టెక్నాలజీ ఘనతల కంటే ఏఐ భిన్నమైనది. అందుకే ప్రధాని మోదీ ఏఐ నియంత్రణకు అంతర్జాతీయ స్థాయిలో సమష్టి ప్రయత్నం జరగాలనీ, ప్రమాణాల నిర్ధారణతో పాటు, మానవీయ విలువల పతనం జర క్కుండా, ప్రమాదాలను నివారించేలా, నమ్మకం పెంచేలా చూడాలనీ పిలుపునిచ్చారు. పొంచివున్న ప్రమాదాలుఈ సమష్టి బాధ్యత కార్యాచరణలో తొలి అడుగుగా ఈ సమావేశం ‘ఇన్‌క్లూజివ్ అండ్ సస్టెయినబుల్ ఏఐ’ అనే దౌత్యపరమైన ప్రక టనను చేర్చింది. అయితే ఏఐ రంగంలో అగ్రగాములుగా ఉన్న రెండు దేశాలు యూఎస్, యూకే ఈ డిక్లరేషన్‌పై సంతకాలకు నిరాకరించాయి. ఏఐలో వినూత్న, సృజనాత్మక ఆవిష్కరణలకు సాయం చేసే అంతర్జాతీయ నియంత్రణ వ్యవస్థ అవసరమనీ, ఏఐని గొంతు నొక్కేది కాదనీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్స ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం. మరోవైపు ఆ ప్రకటన జాతీయ భద్రతపై ఏఐ ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోలేదని యూకే భావించింది. శిఖరాగ్ర సమావేశం ముగిసే సమయానికి ఏఐ భద్రత, నియంత్రణ విషయంలో ప్రపంచం రెండుగా విడిపోయింది!కృత్రిమ మేధ చాలా ఏళ్ల నుంచే మనకు పరిచయం. అయితే ఇటీవలి కాలంలో వచ్చిన మార్పులు జనరల్ పర్పస్ ఏఐ అందు బాటులోకి వచ్చేలా చేసింది. ఈ జనరల్ పర్పస్ ఏఐ టూల్స్ రక రకాల పనులు చేయగలవు. ఏఐ ఏజెంట్లు స్వతంత్రంగా కంప్యూ టర్లను ఉపయోగించుకుని ప్రాజెక్టులు పూర్తి చేయగలవని ప్యారిస్ లోనే విడుదలైన ఒక నిపుణుల నివేదిక స్పష్టం చేయడం గమనించాల్సిన అంశం. ఈ సామర్థ్యం ఒకరకంగా వరం, ఇంకో రకంగా శాపం. భారత్, ఇతర దేశాలకు చెందిన స్వతంత్ర టెక్నాలజీ నిపు ణులు ఈ నివేదికను సిద్ధం చేశారు. ఏఐతో వచ్చే ప్రమాదాలు కొన్నింటి గురించి మనకు ఇప్పటికే తెలుసు. స్కాములకు ఉపయోగపడటం వీటిల్లో ఒకటి. అనుమతు ల్లేకుండా సున్నితమైన విషయాల ఫొటోలు తీయడం, కొంతమంది ప్రజలు, లేదా అభిప్రాయాలకు వ్యతిరేకంగా వివక్ష, వ్యక్తిగత గోప్య తకు భంగం, విశ్వసనీయత వంటివి ఏఐ తీసుకొచ్చే ప్రమాదాల్లో కొన్ని మాత్రమే. ఉద్యోగాల కోత, ఏఐ ఆధారిత హ్యాకింగ్, బయలా జికల్ దాడులు కూడా సాధ్యమని ప్యారిస్‌లో విడుదలైన ‘ఏఐ సేఫ్టీ రిపోర్టు’ స్పష్టం చేసింది. కొన్ని ఏఐ మోడళ్లను పరీక్షించే క్రమంలో అవి జీవ, రసాయన ఆయుధాలను పునరుత్పత్తి చేయగలవనీ, సరికొత్త విష పదార్థాలను డిజైన్ చేసేందుకు సాయపడగలవనీ తెలిసింది.ఏఐ టెక్నాలజీలపై నియంత్రణ కావాలంటే... ముందుగా వాటితో వచ్చే ప్రమాదాలపై స్పష్టమైన అంచనా ఉండాలి. అలాగే ఆ ప్రమాదాలను అధిగమించేందుకు, పరిశీలించేందుకు ఉన్న మార్గాలూ తెలిసి ఉండాలి. ఇది చాలా పెద్ద పనే. ఈ వ్యవస్థలను అటు వైద్య పరికరాల్లో, ఇటు సాఫ్ట్వేర్ అభివృద్ధిలో, ఇంకోవైపు ఛాయాచిత్రాలను సృష్టించడంలో వాడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏఐ డెవలపర్లకు గానీ, వినియోగదారులకు గానీ ఈ ఏఐ వ్యవస్థలను పూర్తిస్థాయిలో ఎలా వాడుకోవచ్చో తెలిసే అవకాశాలు తక్కువ. ఫలితంగా ఏఐ టెక్నాలజీల నియంత్రణ ఒక సవాలుగా మారుతుంది. జనరల్ పర్పస్ ఏఐలో మార్పులు ఊహించలేనంత వేగంగా జరిగిపోతున్న నేపథ్యంలో విధాన రూపకర్తలు, నియంత్రణ చేసేవారికి కూడా ఏఐ ప్రమాదాలకు సంబంధించిన సాక్ష్యాలు వెతుక్కోవడమూ కష్టమవుతుందని ఏఐ సేఫ్టీ రిపోర్టు తెలిపింది. ఏతావతా, ఏఐ నియంత్రణను ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు ప్రస్తుతానికైతే లేవు. నియంత్రణా? సృజనా?ఏఐ ఇప్పుడు ఓ పాత చర్చను మళ్లీ లేవనెత్తింది. సృజన, నియంత్రణలో ఏది అవసరమన్న చర్చపై ప్యారిస్ సమావేశంలోనే అమెరికా తన వైఖరిని స్పష్టం చేసింది. సృజనను అడ్డుకుంటుందంటే ఏ టెక్నా లజీ నియంత్రణనూ తాము అనుమతించబోమని తెలిపింది. ఏఐ విషయంలో పోటీ పడుతున్న టెక్ కంపెనీల వైఖరి కూడా ఇదే. భారత్ కూడా చిన్న మార్పుతో విషయాన్ని అంగీకరించింది. ప్రధాని మోదీ ‘పాలన అంటే కేవలం ప్రమాదాలను మేనేజ్ చేయడం కాదు. సృజనాత్మకతను ప్రోత్సహించడం, దాన్ని విస్తృత ప్రయోజనాల కోసం ఉపయోగించడం’ అని అనడంలో ఈ తేడా స్పష్టమవుతోంది. ట్రంప్ అధ్యక్షతన మళ్లీ శిలాజ ఇంధనాల వైపు మళ్లే ఆలోచన చేస్తున్న అమెరికా... ప్యారిస్ సమావేశం సిద్ధం చేసిన సస్టెయినబిలిటీ స్టేట్ మెంట్‌పై సంతకం చేయలేదు. ఎందుకంటే ఏఐ అభివృద్ధికి చాలా విద్యుత్తు అవసరమవుతుంది. ఏఐ వ్యవస్థలను పెద్ద స్థాయిలో ఉపయోగించడం మొదలుపెడితే శిలాజ ఇంధనాలకు దూరంగా వెళ్లేందుకు ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాలకు గండిపడినట్లే! వాతావరణ మార్పులకూ, ఏఐకీ మధ్య సంబంధం ఏమిటంటే... ఇదేనని చెప్పాలి. టెక్నాలజీకీ, నియంత్రణకూ మధ్య ఉన్న సంబంధం కూడా చాలా పాతదే. గతంలో చాలా టెక్నాలజీల విషయంలో నియంత్రణ అవసరమైంది. స్టెమ్ సెల్ పరిశోధన, క్లోనింగ్, జీనో ట్రాన్స్సప్లాంటేషన్ (జంతు అవయవాలను మనుషులకు అమర్చడం), ఇంటర్నెట్, సోషల్ మీడియా వంటి అనేక టెక్నాలజీలకు నియంత్రణ అవస రమైంది. అయితే ఏఐ వీటన్నింటి కంటే భిన్నమైంది. ఇది ఒక టెక్నాలజీ కాదు. వేర్వేరు టెక్నాలజీలు, అప్లికేషన్ల సమ్మేళనం. కాబట్టి వీటిల్లో దేన్ని నియంత్రించాలన్నది ముందుగా నిర్ణయించుకోవాలి. రెండో కీలకమైన ప్రశ్న ఎవరిని నియంత్రించాలి అన్నది! టెక్నాలజీని అభివృద్ధి చేసే సంస్థనా? టెక్నాలజీ సాయంతో అప్లికేషన్లు అభివృద్ధి చేసేవారినా? వాటిని వాడే వారినా? ఇవన్నీ అస్పష్టమైన అంశాలు. ఇంటర్నెట్ ఆధారిత కంటెంట్‌కు సంబంధించి ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రశ్నలే ఏఐ విషయంలోనూ వస్తున్నాయి. మూడు సూత్రాలు1942లో ప్రసిద్ధ సైన్స్‌ఫిక్షన్ రచయిత ఐజాక్ అసిమోవ్ రోబోటిక్స్‌కు సంబంధించి మూడు సూత్రాలను ప్రతిపాదించారు. ‘మనిషిని రోబో గాయపరచకూడదు’ అన్నది తొలిసూత్రం. మనిషి ఇచ్చే ఆదేశాలను పాటించాల్సిందిగా రోబోలకు చెబుతూనే, తొలి సూత్రానికి విరుద్ధంగా ఉండే ఆదేశాలను పాటించవద్దని రెండో సూత్రం స్పష్టం చేస్తుంది. చివరిదైన మూడో సూత్రం ప్రకారం, ఒక రోబో తన అస్తిత్వాన్ని కాపాడుకోవాలి; ఎప్పటివరకూ అంటే, తొలి రెండు సూత్రాలకూ విరుద్ధం కానంత వరకు! ఈ మార్గదర్శక సూత్రాల ఆధారంగా ఏఐ టెక్నాలజీలకు వర్తించే కొన్ని విస్తృత సూత్రాలను నిర్ణయించడం, ఎప్పటికప్పుడు ఈ టెక్నా లజీ ద్వారా వచ్చే లాభాలు, ప్రమాదాలను బేరీజు వేస్తూండటం ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరం.దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్స అంశాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)

పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు
డీజీపీ పోస్టుపై మాకు ఉన్న గౌరవంతో ఆయన వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఇవ్వకుండానియంత్రించుకుంటున్నాం. సోషల్ మీడియా యాక్టివిస్ట్ బొసా రమణ అరెస్ట్ విషయంలో పోలీసులు వాస్తవాలను దాచిపెట్టి తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. రమణ అరెస్ట్ వ్యవహారంలో నివేదిక ఇవ్వాలని ఆదేశించినా ఇంతవరకు డీజీపీ నుంచి అందలేదు. కేసు సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకునే డీజీపీ నుంచి నివేదిక కోరాం. రాతపూర్వకంగా ఆదేశాలు ఇస్తేనే నివేదిక సమర్పించాలని డీజీపీ భావిస్తే ఆ మేరకు ఆదేశాలు జారీ చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. రమణ అరెస్ట్ విషయంలో విశాఖ పోలీస్ కమిషనర్, ప్రకాశం ఎస్పీ దాఖలు చేసిన నివేదికలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. – హైకోర్టు ధర్మాసనం సాక్షి, అమరావతి: డీజీపీ పోస్టుపై తమకు ఉన్న గౌరవంతో ఆయన వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఇవ్వకుండా నియంత్రించుకుంటున్నామని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్ బొసా రమణ అరెస్ట్ విషయంలో పోలీసులు వాస్తవాలను దాచిపెట్టి తప్పుల మీద తప్పులు చేస్తున్నారని ఆక్షేపించింది. రమణ అరెస్ట్ వ్యవహారంలో నివేదిక ఇవ్వాలని ఆదేశించినా ఇంతవరకు డీజీపీ నుంచి అందలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకునే డీజీపీ నుంచి నివేదిక కోరామని పేర్కొంది. రాతపూర్వకంగా ఆదేశాలు ఇస్తేనే నివేదిక సమర్పించాలని డీజీపీ భావిస్తే ఆ మేరకు ఆదేశాలు జారీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పింది. రమణ అరెస్ట్ విషయంలో విశాఖ పోలీస్ కమిషనర్, ప్రకాశం ఎస్పీ దాఖలు చేసిన నివేదికలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని తప్పుబట్టింది. ఈ కేసులో పూర్తి వివరాలు సమర్పించేందుకు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) అందుబాటులో లేనందున సహాయ న్యాయవాది అభ్యర్థన మేరకు విచారణను మార్చి 11వతేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రమణ అక్రమ నిర్బంధంపై పిటిషన్... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులను విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారంటూ విశాఖ జిల్లా మద్దిపాలెం, చైతన్యనగర్‌కి చెందిన బొసా రమణను పోలీసులు అరెస్ట్ చేశారు. తన భర్తను అక్రమంగా నిర్బంధించారని, ఆయన్ను కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రమణ భార్య బొసా లక్ష్మీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరుపుతున్న జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ పలు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. పరస్పర విరుద్ధంగా రెండు నివేదికలు... ధర్మాసనం ఆదేశాల మేరకు బొసా రమణ అరెస్ట్ విషయంలో విశాఖ పోలీస్ కమిషనర్, ప్రకాశం ఎస్పీ తమ నివేదికలను అందచేశారు. వాటిని పరిశీలించిన ధర్మాసనం, ఈ రెండు నివేదికల్లో అంశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. రమణను పొదిలి పోలీసులు విశాఖలోని ఆయన ఇంటి వద్ద అరెస్ట్ చేశారని కమిషనర్ చెబుతుండగా.. ప్రకాశం ఎస్పీ మాత్రం విశాఖ ఎంవీవీ పోలీస్‌స్టేషన్‌లో అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారని తెలిపింది. అరెస్ట్ విషయంలో వాస్తవాలను కోర్టు ముందుంచడం లేదని, అందువల్లే డీజీపీ నుంచి నివేదిక కోరామని స్పష్టం చేసింది. వర్రా అక్రమ నిర్బంధం కేసులో విద్యాసాగర్ నాయుడుకు నోటీసులుసోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రరెడ్డి అక్రమ నిర్బంధం వ్యవహారంలో వైఎస్సార్ కడప జిల్లా అప్పటి ఇన్చార్జ్ ఎస్పీ విద్యాసాగర్ నాయుడిని హైకోర్టు సుమోటోగా వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చింది. వర్రా రవీంద్రరెడ్డి నిర్బంధం విషయంలో వివరణ ఇవ్వాలని ఆయన్ను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 10కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాసాగర్‌పై నిర్దిష్ట ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆయన్ను ఈ వ్యాజ్యంలో వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేరుస్తున్నట్లు తెలిపింది. వాటికి బదులివ్వాల్సిన బాధ్యత ఆయనపై ఉందని స్పష్టం చేసింది. తన భర్త రవీంద్రరెడ్డిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆయన్ను కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలంటూ వర్రా కళ్యాణి గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
రూ.5,445 కోట్ల పెట్టుబడులు.. 9,800 ఉద్యోగాలు
రాబోయే రోగాలను ముందే గుర్తిస్తున్నాం
అమెరికా సుంకాలపై స్పష్టత లేదు
ఇదీ విజన్ అంటే!
ఏఐతో అందరికీ సమాన వైద్యం నా కల
అమెరికా సుంకాలపై స్పష్టత లేదు
1వ తేదీ జీతాలివ్వడమే కష్టంగా ఉంది
ఏఐతో అందరికీ సమాన వైద్యం
దశ, దిశ లేకుండా గవర్నర్ ప్రసంగం
మీ ఒత్తిడితోనే వీసీల రాజీనామా
భారత్‌ను ఓడించకపోతే నా పేరు షెహబాజ్ షరీఫే కాదు
Aus vs SA: కీలక మ్యాచ్‌కు వర్షం అడ్డంకి.. మ్యాచ్ రద్దు
మీకు 21 సీట్లు ఇచ్చినా హిమాలయాలకు వెళ్లిపోతారని సాక్షాత్తూ మోదీ గారే అంటున్నారు.. హోదా వాళ్లకిచ్చినా ప్రజల తరఫున మాట్లాడుతారు
అతి చేయొద్దు.. ఇలాంటి ప్రవర్తన సరికాదు: పాక్ దిగ్గజం ఆగ్రహం
ఓటీటీలోకి బోల్డ్ వెబ్ సిరీస్.. ఇప్పుడు తెలుగులో
‘అమ్మా.. డ్యాన్స్ ప్రాక్టీస్‌కు వెళ్తున్నా’
అయితే అన్నీ ఒక్కటేనన్నమాట!
NZ Vs BAN: చర్రిత సృష్టించిన రచిన్ రవీంద్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
'తండేల్' రామారావుకు రూ. 20 లక్షలు, ఇల్లు: మత్స్యకారులు
EPFO కీలక ప్రకటన: ఆ గడువు మార్చి 15 వరకు పొడిగింపు
రూ.5,445 కోట్ల పెట్టుబడులు.. 9,800 ఉద్యోగాలు
రాబోయే రోగాలను ముందే గుర్తిస్తున్నాం
అమెరికా సుంకాలపై స్పష్టత లేదు
ఇదీ విజన్ అంటే!
ఏఐతో అందరికీ సమాన వైద్యం నా కల
అమెరికా సుంకాలపై స్పష్టత లేదు
1వ తేదీ జీతాలివ్వడమే కష్టంగా ఉంది
ఏఐతో అందరికీ సమాన వైద్యం
దశ, దిశ లేకుండా గవర్నర్ ప్రసంగం
మీ ఒత్తిడితోనే వీసీల రాజీనామా
భారత్‌ను ఓడించకపోతే నా పేరు షెహబాజ్ షరీఫే కాదు
Aus vs SA: కీలక మ్యాచ్‌కు వర్షం అడ్డంకి.. మ్యాచ్ రద్దు
మీకు 21 సీట్లు ఇచ్చినా హిమాలయాలకు వెళ్లిపోతారని సాక్షాత్తూ మోదీ గారే అంటున్నారు.. హోదా వాళ్లకిచ్చినా ప్రజల తరఫున మాట్లాడుతారు
అతి చేయొద్దు.. ఇలాంటి ప్రవర్తన సరికాదు: పాక్ దిగ్గజం ఆగ్రహం
ఓటీటీలోకి బోల్డ్ వెబ్ సిరీస్.. ఇప్పుడు తెలుగులో
‘అమ్మా.. డ్యాన్స్ ప్రాక్టీస్‌కు వెళ్తున్నా’
అయితే అన్నీ ఒక్కటేనన్నమాట!
NZ Vs BAN: చర్రిత సృష్టించిన రచిన్ రవీంద్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
'తండేల్' రామారావుకు రూ. 20 లక్షలు, ఇల్లు: మత్స్యకారులు
EPFO కీలక ప్రకటన: ఆ గడువు మార్చి 15 వరకు పొడిగింపు
సినిమా

'గం గం.. గణేశా' సినిమా నిర్మాత మృతి
టాలీవుడ్ నిర్మాత కేదార్ సెలగంశెట్టి దుబాయ్‌లో మరణించారు. అయితే, ఆయన మరణానికి కారణాలు తెలియడం లేదు. తెలుగులో 'గం గం.. గణేశా' మూవీని కేదార్ నిర్మించారు. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రం గతేడాదిలో విడుదలైంది. అయితే, కేదార్ సెలగంశెట్టి మరణ వార్తను తెలుసుకున్న ఆయన మిత్రులు సంతాపం తెలుపుతున్నారు. కేదార్ సెలగంశెట్టికి ఇండస్ట్రీలో మంచి పరిచయాలు ఉన్నాయి. అల్లు అర్జున్, నిర్మాత బన్నీవాస్, విజయ్ దేవరకొండలకు ఆయన అత్యంత సన్నిహితుడు కావడం విశేషం.కేదార్ సెలగంశెట్టిని నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయం చేసింది అల్లు అర్జున్ అని తెలిసిందే. ఇప్పటికే చాలామంది స్నేహితులను ఇండస్ట్రీకి అల్లు అర్జున్ పరిచయం చేశారు. ఈ క్రమంలో కేదార్‌ను కూడా బన్నీనే సపోర్ట్ చేశారు. ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్‌పై పలు చిత్రాలను నిర్మించాలని కేదార్ సెలగంశెట్టి ప్లాన్ వేసుకున్నారు. ఈ క్రమంలో సుకుమార్- విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ఒక మూవీని కూడా వారు ప్రకటించారు. అయితే, ఇప్పుడు ఆయన హఠాత్తుగా మరణించారని వార్త తెలియడంతో ఇండస్ట్రీలోని ఆయన స్నేహితులు కూడా షాక్ అవుతున్నారు.

ఓటీటీలో 'మద్రాస్కారణ్' తెలుగు వర్షన్.. రొమాంటిక్ సాంగ్‌లో నిహారిక
మెగా డాటర్ నిహారిక కొణిదెల తమిళ సినిమా తెలుగులో ఓటీటీ వేదికగా విడుదల కానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 10న 'మద్రాస్కారణ్' చిత్రం కోలీవుడ్‌లో విడుదలైంది. ఈ మూవీలో షేన్ నిగమ్, కలైయరాసన్ హీరోలుగా నటించారు. థియేటర్లలోకి వచ్చి నెల రోజులు కూడా గడవకముందే తమిళ్ వర్షన్ ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఇప్పుడు తెలుగు వర్షన్‌ను మేకర్స్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.వాలిమోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బి.జగదీష్ నిర్మించారు. తమిళ్లో ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. విశాల్ మదగజరాజ మూవీ హిట్ టాక్ రావడంతో ఈ సినిమాకు కాస్త క్రేజ్ తగ్గింది. శివరాత్రి పండుగ కానుకగా ఫిబ్రవరి 26న 'ఆహా'లో 'మద్రాస్కారణ్' సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ కోసం సుమారు రూ. 5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. అయితే, కోటి లోపే వసూళ్లను రాబట్టడంతో నిర్మాతలకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది.ఏడేళ్ల తర్వాత రొమాంటిక్ పాత్రతో రీఎంట్రీసుమారు ఏడేళ్ల తర్వాత 'మద్రాస్కారణ్' సినిమాతో తమిళ్లో నిహారిక రీఎంట్రీ ఇచ్చింది. 2018లో విజయ్ సేతుపతి నటించిన ఒక సినిమాతో ఆమె కోలీవుడ్‌కు పరిచయం అయింది. అయితే, ఆమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఇప్పుడు మద్రాస్కారణ్ మూవీలో మీరా అనే యువతిగా గ్లామర్ రోల్లో నిహారిక కనిపించింది. ఒక రొమాంటిక్ సాంగ్‌లో కూడా ఆమె నటించింది. ఈ పాటలో అటు రొమాన్స్, ఇటు డ్యాన్సులో నిహారిక రెచ్చిపోయిందని చెప్పొచ్చు. తెలుగులో సినిమాల్లో నటించింది కానీ ఈ తరహా యాక్టింగ్ మాత్రం ఎప్పుడూ చేయలేదు. ఇందులోని సాంగ్ చూసి మెగా ఫ్యాన్స్ స్టన్ అయిపోయారు. ఎందుకంటే రొమాన్స్ .. ఆ రేంజులో ఉంది మరి! ఈ సినిమాతో హీరోయిన్గా హిట్టు కొట్టాలని నిహారిక ప్లాన్ చేసుకుంది. కానీ, ఫలితం మరోలా వచ్చింది.

జ్యోతిక గ్లామర్.. మంచులో బాపుబొమ్మ చిల్!
మంచులో చిల్ అవుతున్న హీరోయిన్ ప్రణీతగ్లామరస్ జ్యోతిక.. వయసు తగ్గించేస్తుందేమో!చీరలో చూడముచ్చటగా నటి ధన్య బాలకృష్ణస్టేడియం వీడియో షేర్ చేసి నేహా శర్మబీచ్ ఒడ్డున బికినీలో స్మైలీ పోజులతో హంస నందినిమెరుపు తీగలా నాజుగ్గా మెరిసిపోతున్న రాధికా ఆప్టేమోడ్రన్ డ్రస్సులో జిగేలుమనేలా షారుక్ కూతురు View this post on Instagram A post shared by Jyotika (@jyotika) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Suhana Khan (@suhanakhan2) View this post on Instagram A post shared by Payal Radhakrishna Shenoy (@payal_radhakrishna) View this post on Instagram A post shared by Fatima Sana Shaikh (@fatimasanashaikh) View this post on Instagram A post shared by Radhika (@radhikaofficial) View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) View this post on Instagram A post shared by Kamna Jethmalani (@kamana10) View this post on Instagram A post shared by Manjari Fadnnis 🇮🇳 (@manjarifadnis) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Megha Chowdhury (@megha.chowdhury) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Akanksha Sharma (@akanksharmaa) View this post on Instagram A post shared by Dhanya Balakrishna (@dhanyabalakrishna) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta)

ఓటీటీలోకి బోల్డ్ వెబ్ సిరీస్.. ఇప్పుడు తెలుగులో
థియేటర్లలో అంటే సెన్సార్ ఇబ్బందులు ఉంటాయి. కానీ ఓటీటీలో మాత్రం ఇబ్బందులు ఉండవు. దీంతో బోల్డ్, రియలస్టిక్ పేరిట బూతులు, రొమాన్స్ కాస్త గట్టిగానే చూపించేస్తుంటారు. అలా ఇప్పుడు ఓ రొమాంటిక్ కామెడీ సిరీస్ తెలుగులో స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. డేట్ ప్రకటించడంతో పాటు టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'తండేల్'.. ప్లాన్ మారిందా?)ఆహా ఓటీటీలో 2022లో తమిళంలో రిలీజైన వెబ్ సిరీస్ 'ఎమోజీ'. మహత్ రాఘవేంద్ర, మానస చౌదరి, దేవిక ప్రధాన పాత్రలు పోషించారు. తమిళంలో హిట్ అయిన ఈ సిరీస్ ని ఇప్పుడు తెలుగులో ఫిబ్రవరి 28 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు.లవ్ చేసుకున్న ఓ యువతీయువకుడు అనుకోని విధంగా విడిపోతారు. ఆ కుర్రాడి జీవితంలోకి మరో అమ్మాయి వస్తుంది. కొన్నిరోజులకు మాజీ లవర్ మళ్లీ ఇతడి జీవితంలోకి వస్తుంది. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ. టీజర్ చూస్తే మాత్రం బోల్డ్ డైలాగ్స్, రొమాంటిక్ సీన్స్ కూడా కనిపించాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?)Love, passion, and destiny. Will they find their way back? #Emoji Premiering February 28th, only on Aha#EmojionAha @Maanasa_chou @Devu_devika77 @Mahatofficial pic.twitter.com/XTqPqfAOPU— ahavideoin (@ahavideoIN) February 25, 2025
క్రీడలు

నెదర్లాండ్స్‌కు భారత్ షాక్
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్ భారత అంచె పోటీలను భారత మహిళల, పురుషుల జట్లు విజయంతో ముగించాయి. మంగళవారం జరిగిన మ్యాచ్‌ల్లో సలీమా టెటె సారథ్యంలోని భారత మహిళల జట్టు ‘షూటౌట్’లో 2–1 గోల్స్ తేడాతో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, ఒలింపిక్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ నెదర్లాండ్స్ జట్టు ను బోల్తా కొట్టించగా... హర్మన్‌ప్రీత్ సింగ్ కెప్టెన్సీలోని భారత పురుషుల జట్టు 2–1 గోల్స్ తేడాతో ఇంగ్లండ్ జట్టుపై గెలిచింది. నెదర్లాండ్స్ మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రెండు క్వార్టర్లు ముగిసేసరికి భారత జట్టు 0–2తో వెనుకబడింది. ఆ తర్వాత ఎనిమిది నిమిషాల వ్యవధిలో టీమిండియా రెండు గోల్స్ చేసి స్కోరును 2–2తో సమం చేసింది. భారత్ తరఫున దీపిక (35వ నిమిషంలో), బల్జీత్ కౌర్ (43వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. నెదర్లాండ్స్ జట్టుకు పియెన్ సాండర్స్ (17వ నిమిషంలో), వాన్‌డెర్ ఫే (28వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. నిర్ణీత సమయం ముగిశాక రెండు జట్లు సమంగా నిలువడంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ నిర్వహించారు. ‘షూటౌట్’లో భారత గోల్‌కీపర్ సవితా పూనియా అడ్డుగోడలా నిలబడి నలుగురు నెదర్లాండ్స్ క్రీడాకారిణుల షాట్లను నిలువరించింది. నెదర్లాండ్స్ తరఫున మరీన్ వీన్ మాత్రమే సఫలమైంది. భారత్ తరఫున దీపిక, ముంతాజ్ సఫలమవ్వగా... బ్యూటీ డుంగ్‌డుంగ్, బల్జీత్ కౌర్ విఫలమయ్యారు. నెదర్లాండ్స్ ఐదో షాట్ తర్వాత భారత విజయం ఖరారు కావడంతో టీమిండియా ఐదో షాట్‌ను తీసుకోలేదు. ఇంగ్లండ్ తో పోరులో భారత జట్టుకు హర్మన్‌ప్రీత్ (26వ, 32వ నిమిషంలో) రెండు గోల్స్ అందించాడు.

మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ జోడీపై యూకీ బాంబ్రీ విజయం
వారం రోజుల వ్యవధిలో భారత డబుల్స్ టెన్నిస్ స్టార్ యూకీ బాంబ్రీ మరోసారి ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ జోడీని బోల్తా కొట్టించాడు. దుబాయ్ ఓపెన్ చాంపియన్‌షిప్ ఏటీపీ–500 టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో యూకీ బాంబ్రీ (భారత్)–అలెక్సీ పాపిరిన్ (ఆ్రస్టేలియా) ద్వయం 4–6, 7–6 (7/1), 10–3తో ‘సూపర్ టైబ్రేక్’లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ మార్సెలో అరెవాలో (ఎల్ సాల్వడోర్)–మాట్ పావిక్ (క్రొయేషియా) జంటను ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. 86 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండో–ఆసీస్ జోడీ ఆరు ఏస్‌లు సంధించింది. తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసింది. గతవారం దోహా ఓపెన్–500 టోర్నీలో ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)తో కలిసి ఆడిన యూకీ క్వార్టర్ ఫైనల్లో అరెవాలో–పావిక్ జంటపై గెలిచింది. దుబాయ్ ఓపెన్లోనే ఆడుతున్న మరో భారత జోడీ జీవన్ నెడుంజెళియన్–విజయ్ సుందర్ ప్రశాంత్ తొలి రౌండ్లో 4–6, 6–7 (6/8)తో జేమీ ముర్రే (బ్రిటన్)–జాన్ పీర్స్ (ఆ్రస్టేలియా) ద్వయం చేతిలో ఓడిపోయింది.

ఒక్క బంతి పడకుండానే...
రావల్పిండి: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ‘బి’లో హోరాహోరీగా సాగాల్సిన మ్యాచ్‌పై వరుణుడు నీళ్లు చల్లాడు. దీంతో రావల్పిండిలో పసందైన క్రికెట్ విందును ఆస్వాదించాలని వచ్చిన ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. రెండు పటిష్ట జట్ల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగుతుందనుకున్న సమరం సర్వత్రా ఆసక్తిని రేపింది. గెలిచిన జట్టు సెమీఫైనల్ వైపు నడిచేది. కానీ వర్షం వల్ల ఈ మ్యాచ్ ఒక్క బంతికైనా నోచుకోలేకపోయింది. తెరిపినివ్వని వానతో మైదానమంతా చిత్తడిగా మారడంతో బ్యాట్లు, బంతులతో కుస్తీ చేయాల్సిన ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్లకే పరిమితమయ్యారు. చివరకు చేసేదేమీ లేక ఫీల్డ్ అంప్లైర్లు క్రిస్ గఫాని (ఆస్ట్రేలియా), రిచర్డ్ కెటిల్‌బొరొ (ఇంగ్లండ్)లు అవుట్‌ఫీల్డ్‌ను పరిశీలించి మ్యాచ్ నిర్వహణ అసాధ్యమని తేల్చారు. వెంటనే మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇరు జట్లకు ఒక్కో పాయింట్ కేటాయించారు. గ్రూప్ ‘బి’లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తమ తొలి మ్యాచ్‌ల్లో శుభారంభం చేశాయి. ఫలితమివ్వని ఈ మ్యాచ్ వల్ల గ్రూప్‌లోని ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్... అన్ని జట్లు ఇప్పుడు రేసులో నిలిచినట్లయ్యింది. ఎందుకంటే మూడేసి పాయింట్లతో ఉన్న దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలకు మిగిలింది ఒక్కటే మ్యాచ్ కాగా... పాయింట్ల పట్టికలో ఖాతా తెరువని ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్లకు రెండేసి మ్యాచ్‌లున్నాయి. చాంపియన్స్ ట్రోఫీలో నేడుఇంగ్లండ్ X అఫ్గానిస్తాన్వేదిక: లాహోర్, మధ్యాహ్నం గం. 2:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియోహాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

ఇంగ్లండ్‌తో సమరం.. సత్తా చాటిన భారత బౌలర్లు
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో (International Masters League-2025) భారత మాస్టర్స్ (Indian Masters) ఇవాళ (ఫిబ్రవరి 25) ఇంగ్లండ్ మాస్టర్స్‌తో (England Masters) తలపడుతున్నారు. ఈ మ్యాచ్‌లో ఇండియా మాస్టర్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నారు. భారత బౌలర్లు తలో చేయి వేయడంతో ఇంగ్లండ్ జట్టు స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ధవల్ కులకర్ణి 3, అభిమన్యు మిథున్, పవన్ నేగి తలో 2, వినయ్ కుమార్ ఓ వికెట్ పడగొట్టారు. ఒక ఓవర్ వేసిన స్టువర్ట్ బిన్నీ 15 పరుగులివ్వగా.. 4 ఓవర్లు వేసిన ఇర్ఫాన్ పఠాన్ వికెట్లేమీ లేకుండా 25 పరుగులు సమర్పించుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో డారెన్ మ్యాడీ (25) టాప్ స్కోరర్‌గా నిలువగా.. టిమ్ ఆంబ్రోస్ (23), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (14), టిమ్ బ్రేస్నన్ (16), క్రిస్ స్కోఫీల్డ్ (18 నాటౌట్), క్రిస్ ట్రెమ్లెట్ (16) రెండంకెల స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఫిల్ మస్టర్డ్ 8, మాస్కరెన్హాస్ 6, స్టీవ్ ఫిన్ ఒక్క పరుగుకు ఔటయ్యారు.కాగా, ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఈ సీజన్‌తోనే ప్రారంభమైంది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు దేశాలు (భారత్, వెస్టిండీస్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, ఆస్ట్రేలియా) పాల్గొంటున్నాయి. ఆయా దేశాలకు చెందిన మాజీలు, స్టార్ ఆటగాళ్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. ఈ సీజన్లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. తొలి మ్యాచ్‌లో భారత్.. శ్రీలంక మాస్టర్స్‌ను 4 పరుగుల తేడాతో చిత్తు చేసింది. రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను వెస్టిండీస్ మట్టికరిపించింది. తొలి మ్యాచ్‌లో భారత్ తరఫున స్టువర్ట్ బిన్నీ (68), యుసఫ్ పఠాన్ (56 నాటౌట్), ఇర్ఫాన్ పఠాన్ (4-0-39-3) సత్తా చాటారు. రెండో మ్యాచ్‌లో ఆసీస్ ఆటగాడు షేన్ వాట్సన్ చేసిన సెంచరీ వృధా అయ్యింది. లెండిల్ సిమన్స్ (94 నాటౌట్), డ్వేన్ స్మిత్ (51) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి విండీస్‌ను గెలిపించారు. ఈ టోర్నీలో భారత్‌కు సచిన్ టెండూల్కర్ సారథ్యం వహిస్తున్నాడు. భారత్ తరఫున అంబటి రాయుడు, యువరాజ్ సింగ్ లాంటి స్టార్లు ఆడుతున్నారు.భారత మాస్టర్స్ జట్టు..అంబటి రాయుడు (వికెట్‌కీపర్), సచిన్ టెండూల్కర్ (కెప్టెన్), గురుకీరత్ సింగ్ మన్, స్టువర్ట్ బిన్నీ, యువరాజ్ సింగ్, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, పవన్ నేగి, అభిమన్యు మిథున్, ధవల్ కులకర్ణి, వినయ్ కుమార్ఇంగ్లండ్ మాస్టర్స్ జట్టు..ఫిల్ మస్టర్డ్ (వికెట్‌కీపర్), టిమ్ ఆంబ్రోస్, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), డిమిత్రి మస్కరెన్హాస్, డారెన్ మాడీ, టిమ్ బ్రెస్నన్, క్రిస్ ట్రెమ్లెట్, మాంటీ పనేసర్, స్టీవెన్ ఫిన్, క్రిస్ స్కోఫీల్డ్, ర్యాన్ జే సైడ్బాటమ్ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో భారత మాస్టర్స్ ఇవాళ (ఫిబ్రవరి 25) ఇంగ్లండ్ మాస్టర్స్‌తో తలపడుతున్నారు. ఈ మ్యాచ్‌లో ఇండియా మాస్టర్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నారు. భారత బౌలర్లు తలో చేయి వేయడంతో ఇంగ్లండ్ జట్టు స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ధవల్ కులకర్ణి 3, అభిమన్యు మిథున్, పవన్ నేగి తలో 2, వినయ్ కుమార్ ఓ వికెట్ పడగొట్టారు. ఒక ఓవర్ వేసిన స్టువర్ట్ బిన్నీ 15 పరుగులివ్వగా.. 4 ఓవర్లు వేసిన ఇర్ఫాన్ పఠాన్ వికెట్లేమీ లేకుండా 25 పరుగులు సమర్పించుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో డారెన్ మ్యాడీ (25) టాప్ స్కోరర్‌గా నిలువగా.. టిమ్ ఆంబ్రోస్ (23), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (14), టిమ్ బ్రేస్నన్ (16), క్రిస్ స్కోఫీల్డ్ (18 నాటౌట్), క్రిస్ ట్రెమ్లెట్ (16) రెండంకెల స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఫిల్ మస్టర్డ్ 8, మాస్కరెన్హాస్ 6, స్టీవ్ ఫిన్ ఒక్క పరుగుకు ఔటయ్యారు.కాగా, ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఈ సీజన్‌తోనే ప్రారంభమైంది. ఈ లీగ్‌లో ఆరు దేశాలు (భారత్, వెస్టిండీస్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, ఆస్ట్రేలియా) పాల్గొంటున్నాయి. ఆయా దేశాలకు చెందిన మాజీలుచ, స్టార్ ఆటగాళ్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. ఈ సీజన్లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. తొలి మ్యాచ్‌లో భారత్.. శ్రీలంక మాస్టర్స్‌ను 4 పరుగుల తేడాతో చిత్తు చేసింది. రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను వెస్టిండీస్ మట్టికరిపించింది. తొలి మ్యాచ్‌లో భారత్ తరఫున స్టువర్ట్ బిన్నీ (68), యుసఫ్ పఠాన్ (56 నాటౌట్), ఇర్ఫాన్ పఠాన్ (4-0-39-3) సత్తా చాటారు. రెండో మ్యాచ్‌లో ఆసీస్ ఆటగాడు షేన్ వాట్సన్ చేసిన సెంచరీ వృధా అయ్యింది. లెండిల్ సిమన్స్ (94 నాటౌట్), డ్వేన్ స్మిత్ (51) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి విండీస్‌ను గెలిపించారు. ఈ టోర్నీలో భారత్‌కు సచిన్ టెండూల్కర్ సారథ్యం వహిస్తున్నాడు. భారత్ తరఫున అంబటి రాయుడు, యువరాజ్ సింగ్ లాంటి స్టార్లు ఆడుతున్నారు.భారత మాస్టర్స్ జట్టు..అంబటి రాయుడు (వికెట్‌కీపర్), సచిన్ టెండూల్కర్ (కెప్టెన్), గురుకీరత్ సింగ్ మన్, స్టువర్ట్ బిన్నీ, యువరాజ్ సింగ్, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, పవన్ నేగి, అభిమన్యు మిథున్, ధవల్ కులకర్ణి, వినయ్ కుమార్ఇంగ్లండ్ మాస్టర్స్ జట్టు..ఫిల్ మస్టర్డ్ (వికెట్‌కీపర్), టిమ్ ఆంబ్రోస్, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), డిమిత్రి మస్కరెన్హాస్, డారెన్ మాడీ, టిమ్ బ్రెస్నన్, క్రిస్ ట్రెమ్లెట్, మాంటీ పనేసర్, స్టీవెన్ ఫిన్, క్రిస్ స్కోఫీల్డ్, ర్యాన్ జే సైడ్‌బాటమ్
బిజినెస్

'ఐదు రోజులే పని.. వారాంతంలో నో ఈమెయిల్స్'
భారతదేశంలో పనిగంటలపై తీవ్రమైన చర్చలు జరుగుతూనే ఉన్నాయి. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి వారానికి 70 గంటలు పనిచేయాలని చెబితే.. 90 గంటలు పనిచేయాలని ఎల్ & టీ చైర్మన్ సుబ్రమణ్యన్ చెప్పారు. ఇప్పుడు తాజాగా క్యాప్‌జెమిని సీఈఓ 'అశ్విన్ యార్డి' (Ashwin Yardi) వారానికి 47.5 గంటల పని సరిపోతుందని అన్నారు.ఉన్నత స్థాయి అధికారులు పని గంటలు ఎక్కువ చేయాలని పిలుపునిస్తుండగా.. క్యాప్‌జెమిని సీఈఓ అశ్విన్ యార్డి వారానికి 47.5 గంటల పని సరిపోతుందని, వారాంతాల్లో ఉద్యోగులకు పనికి సంబంధించిన ఎటువంటి ఈమెయిల్‌లు పంపవద్దని పిలుపునిచ్చారు. రోజుకి 9:30 గంటలు, వారానికి ఐదు రోజులు (47:30 గంటలు) పని చేస్తే చాలని నాస్కామ్ టెక్నాలజీ అండ్ లీడర్షిప్ ఫోరంలో వెల్లడించారు.ఇదీ చదవండి: 'ఐదు రోజులే పని.. వారాంతంలో నో ఈమెయిల్స్': క్యాప్‌జెమిని సీఈఓనాలుగు సంవత్సరాలుగా ఇదే ఫార్ములా పాటిస్తున్నానని.. కొన్ని సార్లు తప్పనిసరి అయితే మాత్రమే తాను వారాంతంలో పనిచేసినట్లు చెప్పారు. అయితే వారాంతంలో నేను పనిచేసినప్పుడు కూడా ఉద్యోగులకు ఈమెయిల్స్ పంపనని అని అన్నారు. అశ్విన్ యార్డి మాటలతో.. నాస్కామ్ చైర్పర్సన్ సింధు గంగాధరన్ కూడా ఏకీభవించారు. పని గంటల కంటే ఫలితాలు ముఖ్యమని నొక్కి చెప్పారు. మారికో సీఈఓ సౌగత గుప్తా కూడా ఇదే అభిప్రాయాన్ని పంచుకున్నారు.. కానీ అప్పుడప్పుడు రాత్రి 11.00 గంటల వరకు ఈమెయిల్‌లు పంపినట్లు అంగీకరించారు.

పెళ్లి చేసుకుంటారా?.. ఉద్యోగం వదులుకుంటారా?: కంపెనీ వార్నింగ్
బ్యాచిలర్లకు మాత్రమే ఉద్యోగాలిచ్చే కంపెనీల గురించి విన్నాం. పెళ్లి చేసుకున్న వారికి జాబ్స్ ఇచ్చే కంపెనీలను చూసాం. కానీ పెళ్లి చేసుకోకపోతే ఉద్యోగం వదులుకోవాల్సి వస్తుంది అని అంటోంది ఓ సంస్థ. దీని గురించి మరిన్ని వివరాలు విపులంగా ఇక్కడ తెలుసుకుందాం.చైనాలోని 'షాన్డాంగ్ షుంటియన్ కెమికల్ గ్రూప్ కో. లిమిటెడ్' కంపెనీ ఒంటరిగా ఉన్న, విడాకులు తీసుకున్న ఉద్యోగులు సెప్టెంబర్ నాటికి వివాహం చేసుకోవాలి. లేకుంటే.. ఉద్యోగం వదులుకోవాల్సి వస్తుందని ఆదేశాలు జారీ చేసింది. అయితే వివాదాస్పద విధానాన్ని ప్రవేశపెట్టిన కంపెనీని అధికారులు మందలించారు.అధికారులు మందలించినప్పటికీ.. కంపెనీ మాత్రం తమ విధానాన్ని సమర్ధించుకుంది. దేశంలో వివాహ రేటు గణనీయంగా తగ్గుతోంది. వివాహ రేటును మెరుగుపరచాలనే ప్రభుత్వ పిలుపుకు మద్దతుగా ఈ ప్రకటన జారీ చేసినట్లు సంస్థ తెలిపింది. కానీ ఇది రాజ్యాంగ విరుద్ధమని న్యాయ నిపుణులు కూడా విమర్శించారు.ఇదీ చదవండి: రోజుకు రూ.27 కోట్లు విరాళం ఇచ్చిన వ్యక్తి.. ఈయన గురించి తెలుసా?కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం మీద.. పెకింగ్ యూనివర్సిటీ లా స్కూల్లో అసోసియేట్ ప్రొఫెసర్ 'యాన్ టియాన్' మాట్లాడుతూ.. చైనా కార్మిక చట్టాల ప్రకారం, కంపెనీలు ఉద్యోగ దరఖాస్తుదారులను వారి వివాహం లేదా పిల్లలు కనడానికి సంబంధించిన విషయాలను గురించి అడగడానికి అనుమతి లేదు. ఇది వారి స్వేచ్చకు భంగం కలిగించడం అవుతుందని అన్నారు. వివాదం ముదరడంతో.. కంపెనీ నోటీసును రద్దు చేస్తూ ఒక ఉత్తర్వు జారీ చేసింది.

అనుకున్నదానికంటే.. అద్భుతం: చాట్‌జీపీటీ రెజ్యూమె
అన్ని రంగాల్లోనూ చాట్‌జీపీటీ హవా కొనసాగుతోంది. ఏ ప్రశ్నకైనా తనదైన రీతిలో సమాధానం చెప్పే చాట్‌బాట్.. ఉద్యోగానికి అవసరమైన రెజ్యూమె (Resume) కూడా రూపొందింస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న రెజ్యూమెతో లెక్కలేనన్ని ఇంటర్వ్యూ కాల్స్ వస్తున్నాయని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి నేను చాట్‌జీపీటీని ఉపయోగించాను. నేను ఎలాంటి ఉద్యోగానికి అప్లై చేయాలనుకుంటున్నానో.. దానికి సరిపోయేలా చాట్‌జీపీటీ ద్వారా ఒక రెజ్యూమె రూపొందించుకున్నాను. మొత్తం మీద ఇంటర్వ్యూ చేసేవారిని ఆకట్టుకునేలా డిజైన్ చేసుకున్నాను. ఇది నేను అనుకున్న దాని కంటే చాలా అద్భుతంగా ఉంది.నా రెజ్యూమె చూసి.. చాలా ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూ కాల్స్ వస్తున్నాయి. నిజం చెప్పాలంటే నా స్థాయికంటే ఎక్కువ ఉద్యోగాలకు సంబంధించిన కాల్స్ వచ్చాయి. అయితే వచ్చిన సమస్య ఏమిటంటే.. నేను ఇంటర్వ్యూ అంటే భయపడతాను. అయితే ఇప్పుడు గందరగోళానికి గురయ్యాను అని పోస్టులో పేర్కొన్నాడు.ప్రస్తుతం ఈ పోస్టుపై పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. నేను కూడా చాట్‌జీపీటీ సాయంతో రెజ్యూమె క్రియేట్ చేసుకున్నాను అని ఒక వ్యక్తి అన్నారు. చాట్‌జీపీటీని మాత్రమే ఉపయోగించి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడం సాధ్యం కాదని నేను అనుకుంటున్నానని మరొక వ్యక్తి అన్నారు. అవసరమైన సమాచారం కోసం చాట్‌జీపీటీ చాలా ఉపయోగపడుతుందని మూడో వ్యక్తి అన్నారు.

రూ.21.78 లక్షల కొత్త డుకాటి బైక్ ఇదే..
డుకాటి భారతదేశంలో 'డెజర్ట్ఎక్స్ డిస్కవరీ'ని లాంచ్ చేసింది. దీని ధర రూ. 21.78 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది దాని మునుపటి అన్ని మోడల్స్ కంటే కూడా భిన్నంగా ఉంది. అయితే అడ్వెంచర్ చేయడానికి మాత్రం అద్భుతంగా ఉంది.ఈ బైక్ స్టాండర్డ్, ర్యాలీ వేరియంట్లలో కూడా అందుబాటులో ఉంది. స్టాండర్డ్ డెజర్ట్ఎక్స్ ధర రూ. 18.33 లక్షలు కాగా, డెజర్ట్ఎక్స్ ర్యాలీ ధర రూ. 23.70 లక్షలు. డెజర్ట్ఎక్స్ డిస్కవరీ.. పెద్ద విండ్‌షీల్డ్, ప్యానియర్‌లు, ఇంజిన్, బాడీవర్క్ ప్రొటెక్షన్, సమ్ గార్డ్, రేడియేటర్ గ్రిల్ పొందుతుంది. అంతే కాకుండా ఈ బైక్ హీటెడ్ గ్రిప్‌లు, సెంటర్ స్టాండ్ వంటివి కూడా పొందుతుంది.డుకాటి డెజర్ట్ఎక్స్ డిస్కవరీ.. 937 సీసీ ఎల్-ట్విన్ ఇంజిన్ పొందుతుంది. ఇది 9250 rpm వద్ద, 108 Bhp పవర్, 6500 rpm వద్ద 92 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి.. మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 21 లీటర్లు. కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది.ఇదీ చదవండి: తక్కువ ధర.. ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్: ఇదిగో బెస్ట్ కార్లు
ఫ్యామిలీ

బీపీ-హైబీపీకి మధ్య తేడా ఏంటి..? వంశపారపర్యంగా వస్తుందా..?
ఇంగ్లిష్‌లో బీపీ అని సంక్షిప్తంగా చెప్పే ఓ ఆరోగ్య సమస్య అసలు రూపం బ్లడ్ ప్రెషర్. కానీ నిజానికి దీన్ని హైబీపీగా చె΄్పాలి. అంటే ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఒత్తిడితో రక్తం ప్రవహించడమని అర్థం. తెలుగులో దీన్నే రక్తపోటు అంటారు. దీని నార్మల్ విలువ 140/90. ఉండాల్సిన విలువకంటే ఎక్కువ ఒత్తిడితోరక్తం ప్రవహిస్తే అది ఎన్నో ఆరోగ్య సమస్యలకు తావిస్తుంది. ఒకప్పుడు కాస్త పెద్ద వయసు వచ్చాకే బీపీ, డయాబెటిస్ కనిపించేవి. కానీ ఇప్పుడు మన దేశంలో అప్పుడే తమ కౌమార దశ దాటి అప్పుడప్పుడే యువకులు/యువతులుగా మారుతున్న వారిలోనూ హైబీపీ కనిపిస్తోంది. ఎన్నో అనర్థాలకు కారణమయ్యే ఈ హైబీపీ సమస్య గురించి విపులంగా తెలుసుకోవడం కోసమే ఈ కథనం. బీపీ కారణంగా పక్షవాతం, గుండెపోటు, మూత్రపిండాలు దెబ్బతినడం, కంటి చూపు కోల్పోవడం లాంటి అనర్థాలతోనూ, అలాగే కిడ్నీల వంటి ఎండ్ ఆర్గాన్స్ వైఫల్యంతో ఏటా ఎంతో మంది మరణిస్తున్నారు. ఇది ఉన్న విషయమే బయటకు తెలియకపోవడం, అది దెబ్బతీసే అవయవాలైన కిడ్నీ వంటివి పూర్తిగా చెడిపోయేవరకు వాటి లక్షణాలేమీ బయటకు కనిపించకపోవడంతో ఇది నిశ్శబ్దంగా అనర్థాలను తెచ్చిపెట్టి, కొన్నిసార్లు మరణాలకు కారణమవుతుంటుంది. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. హైబీపీ తెచ్చిపెట్టే సమస్యలేమిటి, ఎలా ఉంటాయి, వాటిని అధిగమించడం ఎలా వంటి అనేక విషయాలను తెలుసుకుందాం. హై–బీపీ అంటే ఏమిటి?కొంతమంది తాము అతిగా ఉద్రేకపడ్డా లేదా బాగా కోపం ఫీలయినప్పుడు తమకు బీపీ పెరిగిందంటుంటారు. అలాగే మరికొందరు తమకు బాగా తలనొప్పిగా ఉండటం, చెమటలు పడుతుండటం, నర్వస్‌గా ఉండటం, నిద్రపట్టకపోవడం, బాగా ఉద్వేగంగా/ఉద్రిక్తంగా ఫీలయినప్పుడు ఆ టైమ్‌లో బీపీ పెరిగిందని చెబుతుంటారు. అయితే అలా జరిగినప్పడు బీపీ పెరిగి ఉండవచ్చు. కానీ కొందరిలో బీపీ పెరిగాక అది అలాగే కంటిన్యూవస్‌గా ఉండటాన్నే హైబీపీగా చెప్పవచ్చు. ఇక కొంతమందిలో తాము హాస్పిటల్‌కు వెళ్లగానే, అక్కడి డాక్టర్లను చూడగానే బీపీ పెరుగుతుంది. ఇంటిదగ్గర రీడింగ్ తీసినప్పుడు నార్మల్‌గా ఉంటుంది. ఇలా తెల్లకోట్లలో ఉండే డాక్టర్లను చూసినప్పుడు రక్తపోటు పెరగడాన్ని ‘వైట్ కోట్ సిండ్రోమ్’ అంటారు. ఇలాంటి సందర్భాల్లో బీపీ పెరగడం, అలాగే తమలో భావోద్వేగాలు చెలరేగినప్పుడు రక్తపోటు కొంతమేరకు పెరగడం జరగవచ్చు. అయితే ఇలాంటి సందర్భాల్లో బీపీ పెరిగినప్పటికీ దాన్ని హైబీపీగా పరిగణించడం జరగదు. అయితే ఓ వ్యక్తిలో అనేక పర్యాయాలు రీడింగ్ తీశాక కూడా... రక్తపోటు (సిస్టోల్ / డయాస్టోల్) విలువలు 140/90 అనే కొలతకు మించి ఉంటే అప్పుడు మాత్రమే హైబీపీగా పరిగణిస్తారు. హైబీపీ ఎన్ని రకాలు... హైబీపీని రెండు రకాలుగా చెప్పవచ్చు. మొదటిది ఎసెన్షియల్ హైపర్‌టెన్షన్. అంటే ఇది మామూలుగా వచ్చే బీపీ అనుకోవచ్చు. ఇతరత్రా ఎలాంటి కారణం లేకుండా వచ్చే బీపీ ఇది. ఇది చాలా సాధారణంగా కనిపించే హైపర్‌టెన్షన్. ఇక రెండోదాన్ని సెకండరీ హైపర్‌టెన్షన్‌గా చెప్పవచ్చు. ఇది శరీరంలో ఏదో ఇతరత్రా కారణాల వల్ల వస్తుంది. అంటే బాధితులకు ఒంట్లో థైరాయిడ్ సమస్య ఉండటం వల్లనో, లేదా మూత్రపిండాల వ్యాధి వంటి ఇతర సమస్యల కారణంగా రక్త΄ోటు పెరిగిపోవడం జరుగుతుంది. అందుకే ఒంట్లో బీపీ ఎక్కువగా కనిపిస్తున్నప్పుడు థైరాయిడ్, కిడ్నీ వంటి ఇతరత్రా సమస్యలేమైనా ఉన్నాయా అంటూ చెక్ చేయించుకుని, వాటికి మందులు వాడాలి. ఈ సెకండరీ కారణాలు చక్కబడితే అప్పుడు బీపీ తగ్గుతుంది. కానీ మొదటిదైన ఎసెన్షియల్ హైపర్‌టెన్షన్ అలా కాదు. ఆ సమస్యకు డాక్టర్ల సూచన మేరకు బీపీని నియంత్రణలో ఉంచే మాత్రలు వాడటం అవసరం. చిన్నపిల్లల్లోనూ హైబీపీ ఉండవచ్చా?చిన్నపిల్లల్లో లేదా అప్పుడప్పుడే యుక్తవయసుకు వస్తున్న యువకుల్లో హైబీపీ ఉండక΄ోవచ్చని చాలామంది అనుకుంటుంటారు. కానీ వాళ్లలోనూ కొందరికి హైబీపీ (హైపర్‌టెన్షన్) ఉండే అవకాశం ఉంది. ఇటీవల చాలా చిన్నపిల్లలు.. అంటే 3 నుంచి 12 ఏళ్ల మధ్య వయసు వాళ్లలోనూ, కౌమారం (టీనేజ్)లో ఉన్న పిల్లలు... అంటే 13 నుంచి 19 ఏళ్ల మధ్యవారిలోనూ హైబీపీ కనిపిస్తోంది. అయితే చిన్నపిల్లల్లో హైబీపీ నిర్ధారణకు దాన్ని చాలా జాగ్రత్త (మెటిక్యులస్)గా కొలవాలి. పిల్లల్లో బీపీని తెలిపే చార్ట్‌ను ‘సెంటైల్ చార్ట్’ అంటారు. పిల్లల తాలూకు నార్మల్ విలువలు... వాళ్ల వయసునూ, జెండర్నూ, వాళ్ల ఎత్తును బట్టి మారుతుంటాయి. పెద్దవాళ్లలో నార్మల్స్ వాళ్లలో నార్మల్ విలువకు సమానం కాదు. ఉదాహరణకు వారిలో డయాస్టోల్ బీపీ కొలత 90 ఉంటే అది బీపీ ఉన్నట్లు కాదు. కొలత విలువ 95 పర్సంటైల్ లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే అది పిల్లల్లో హైబీపీ ఉన్నదనడానికి సూచన. ఆ రీడింగ్ 95–99 ఉంటే హైపర్‌టెన్షన్ స్టేజ్–1 అని చెప్పవచ్చు. 99 పర్సంటైల్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని స్టేజ్–2గా భావించాలి. ఈ దశలూ, తీవ్రతలను బట్టి ఆయా పిల్లలకు ఎలాంటి చికిత్స ఇవ్వాలన్నది డాక్టర్లు నిర్ణయిస్తారు.లక్షణాలేమీ లేకపోతే హైబీపీ లేనట్లేనా? లక్షణాలేమీ బయటకు కనిపించక΄ోయినప్పటికీ చాలామందికి హైబీపీ ఉండే అవకాశముంది. నిజానికి చాలామందిలోనూ తమకు హైబీపీ ఉన్న విషయమే తెలియకుండా చాలాకాలంగా వాళ్లలో హైబీపీ ఉండే అవకాశం ఉంది. ఇలా చాలాకాలంగా హైబీపీ ఉండటం వల్ల మానవ దేహంలో ఎండ్ ఆర్గాన్స్‌గా పిలిచే మెదడు, ఊపిరితిత్తులు, మూత్రపిండాల వంటి కీలక అవయవాలు దెబ్బతింటాయి. అవి పూర్తిగా పాడైపోయాకగానీ ఆ అవయవాలు దెబ్బతిన్నప్పుడు కనిపించే లక్షణాలు బయటపడవు. ఈలోపు జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగి΄ోవచ్చు. అందుకే దీన్ని ‘సైలెంట్ కిల్లర్’ అంటారు. కేవలం లక్షణాలు కనిపించనంత మాత్రాన హై–బీపీ లేదని అనుకోవడం సరికాదు. ఒకసారి డాక్టర్‌ను కలిసి, చెకప్ చేయించుకుని హైబీపీ లేదన్న నిర్ధారణ జరిగాకే నిశ్చింతగా ఉండాలి. హైబీపీ మందులు చాలాకాలంపాటు వాడుతుంటే, వాటికే అలవాటు పడి... ఇక మున్ముందు బీపీ తగ్గదేమో?ఒకసారి హై–బీపీ నిర్ధారణ అయ్యాక... దాన్ని అదుపులో ఉంచేందుకు డాక్టర్లు కొన్ని మందులను సూచిస్తుంటారు. వారిలోని బీపీ తీవ్రతను బట్టి కొందరికి రెండు, మరికొంతమందికి మూడు, ఇంకొందరిలో నాలుగు... ఇలా మందులను వాడాలంటూ డాక్టర్లు సూచిస్తారు. బీపీ కొలతలను తరచూ చూస్తూ... మందుల మోతాదును అడ్జెస్ట్ చేస్తుంటారు. జీవనశైలి మార్పులతో బీపీని అదుపులో పెడితే కేవలం రెండులోపు మాత్రలతోనే చాలాకాలం కొనసాగవచ్చు. కానీ బీపీ అదుపులో లేకపోతే మందుల సంఖ్యా, మోతాదులు పెరుగుతాయి. హైబీపీ మందులైనా, డయాబెటిస్ మందులైనా సుదీర్ఘకాలం వాడాల్సిందే. అది బాధితుల బీపీ కొలతలను బట్టి ఉంటాయి తప్ప... మందులకు అలవాటు పడి... బీపీ తగ్గినప్పటికీ వాటికే అలవాటు పడటం, మానకుండా ఉండలేకపోవడం అనే అంశాలకు ఆస్కారం లేదు. కొన్నాళ్ల తర్వాత బీపీ అదుపులోకి వచ్చాక మందులు మానేయవచ్చా?ఒకసారి హైబీపీ నిర్ధారణ జరిగి... మందులు మొదలుపెట్టాక వాటి ప్రభావంతో రక్తపోటు అదుపులోకి వస్తుంది. దాంతో బీపీ అదుపులోనే ఉంది కదా అని చాలామంది మందులు మానేస్తుంటారు. మళ్లీ బీపీ చెక్ చేయించుకోరు. దీని లక్షణాలు బయటకు కనిపించవు కాబట్టి అది పెరిగిన విషయం తెలియనే తెలియదు. అందుకే ఒకవేళ హై–బీపీ నియంత్రణలోకి వచ్చిందని మందులు ఆపేసినా... మళ్లీ తరచూ బీపీ చెక్ చేయించుకుంటూ ఉండాలి. బీపీ పెరిగినట్లు ఏమాత్రం అనుమానం వచ్చినా తక్షణం డాక్టర్‌ను సంప్రదించి, ఉన్న హై–బీపీ విలువకు తగినట్లుగా తగిన మోతాదు నిర్ణయించుకుని, మందులు మొదలుపెట్టాలి. అంతేకాదు... మందులు వాడుతున్నప్పటికీ తరచూ బీపీ చెక్ చేయించుకుంటూనే ఉండాలి. ఒకవేళ ఆ మోతాదు సరిపోక బీపీ పెరిగితే... డాక్టర్లు మందులు మార్చడమో లేదా సరైన మోతాదు కోసం మరో మాత్ర లేదా రెండు మాత్రలు పెంచడమో చేస్తారు. అందుకే బీపీ మందులు వాడుతున్నప్పుడు వాటిని మానేయకపోవడం మంచిది. అలాగే తరచూ బీపీ చెక్ చేయించుకుంటూ ఉండటం కూడా తప్పనిసరి. బీపీ పెరుగుతూ, తగ్గుతూ ఉండటం తరచూ జరగవచ్చంటారు కదా... కాబట్టి హైబీపీ లేకపోయినా, ఉన్నట్టుగా డాక్టర్లు పొరబడవచ్చు కదా?హైబీపీ వల్ల కొందరిలో తలనొప్పి, తలతిరగడం వంటివి కనిపించవచ్చు. కానీ ప్రతి తలనొప్పీ అధిక రక్తపోటు వల్లనే కాకపోవచ్చు. హై–బీపీ తాలూకు లక్షణాలు అని పేర్కొనే కండిషన్లు కనిపించినప్పుడు అసలు బీపీని కొలవకుండానే కేవలం లక్షణాలను బట్టే బీపీ ఉందని అనుకోవడం సరికాదు. డాక్టర్లు అలా పొరబడే అవకాశమే ఉండదు. ఎందుకంటే... రక్తపోటు పెరగడం వల్ల మెదడులోని రక్తనాళాల చివరల్లో రక్తం ఒత్తిడి పెరగడం వల్ల తలనొప్పి రావచ్చు. అలాగే కొందరిలో వారి బాడీ పోష్చర్ అకస్మాత్తుగా మారడం వల్ల రక్తపోటు తగ్గనూవచ్చు. దీన్ని ‘ఆర్థోస్టాటిక్ హై΄ోటెన్షన్’ అంటారు. అప్పుడు తల తిరగడం గానీ లేదా కొందరిలో ముందుకు తూలిపడిపోతామనే భావన కలగవచ్చు. బీపీ తగ్గిన ఇలాంటి సందర్భాల్లోనూ బీపీ పెరిగినప్పుడు కనిపించే గిడ్గీనెస్ వంటి లక్షణాలే కనిపిస్తాయి. అందువల్ల డాక్టర్లు కేవలం లక్షణాల ఆధారంగా కాకుండా... అనేక సందర్భాల్లో అనేక మార్లు అలాగే రకరకాల వేళల్లో కొలిచి చూశాకే... హైబీపీని నిర్ధారణ చేస్తారు. ఒక్కోసారి ఐదు రోజుల పాటు రోజుకు మూడు సార్ల చొప్పున కొలతలు తీశాకే నిర్ధారణ చేస్తారు. కేవలం ఒకటి లేదా రెండు కొలతలతో హైబీపీ నిర్ధారణ చేయరు కాబట్టి డాక్టర్లు పొరబడే అవకాశమే ఉండదు.హైబీపీకి బార్డర్‌లైన్‌లో ఉన్నవారికి మందులు అవసరం లేదు కదా?హైబీపీ వస్తున్న సూచనలు కనిపిస్తున్నవారు... అంటే హైబీపీ విలువలు మరీ ఎక్కువగా కాకుండా బార్డర్‌లైన్‌లో ఉన్నవాళ్లు మందులు వాడనక్కర్లేదనీ, వాళ్లు మంచి జీవనశైలి నియమాలు పాటిస్తూ ఉంటే చాలని చెబుతుంటారు. అంటే... క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, ఆరోగ్యకరమైన అలవాట్లతో బీపీని అదుపులో ఉంచుకోవాలంటూ డాక్టర్లు చెబుతారన్నది కొందరి వాదన. ఇక చాలామంది తాము మందులు వాడబోమనీ, మంచి క్రమశిక్షణతో వ్యాయామం, ఆహారనియమాలు పాటించడం వంటి జీవనశైలిని అనుసరిస్తూ, హైబీపీని అదుపు చేయగలమని మొదట్లో ప్రతిఒక్కరూ అనుకుంటుంటారు. అయితే ఒకటి రెండు రోజులు పాటించినప్పటికీ... చాలామంది ఈ జీవనశైలి నియమాలను సరిగా పాటించ(లే)రు. ఇలాంటి వాళ్లలో తమ కీలకమైన అవయవాలపైన హై–బీపీ తన దుష్ప్రభావం చూపినప్పుడు జరిగే నష్టం... అప్పుడు అవసరమైన వైద్యపరీక్షలకూ, చికిత్సకూ అవసరమైన ఆర్థికభారం, ఏదైనా ఎండ్ ఆర్గాన్ శాశ్వతంగా దెబ్బతింటే కలిగే నష్టం లాంటివి డిసీజ్ బర్డెన్ను విపరీతంగా పెంచుతాయి. అంతేకాదు... కుటుంబ సభ్యులపైనా ఆర్థిక, భావోద్వేగపరమైన ఒత్తిడీ చాలా ఎక్కువగా పడుతుంది. ఆ భారంతో పోలిస్తే... అసలు మనపై ఎలాంటి బరువూ పడకుండా చాలా చవగ్గా దొరికే మందుల్ని రోజూ ఒకపూట లేదా రెండు పూటలు తీసుకోవడం వల్ల చాలాకాలం పాటు కీలకమైన అవయవాలను సంరక్షించుకుంటూ హాయిగా జీవించవచ్చు. గుండెపోటు, పక్షవాతం, కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి ఎన్నో వేదనాభరితమైన జబ్బులను తప్పించుకోవచ్చు. పై అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు హైబీపీని ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం.హై–బీపీ ఉన్నవారు ఉప్పు పూర్తిగా మానేయాలా?హై–బీపీ ఉన్నవాళ్లలో ఉప్పు వల్ల రక్త΄ోటు మరింత పెరుగుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. అందుకే ముందుజాగ్రత్తగా ఉప్పు మానేసేవాళ్లు చాలామంది ఉంటారు. అయితే మానవ దేహంలోని కీలకమైన జీవక్రియలకు ఉప్పు / లవణాలు అవసరం. ఉదాహరణకు మెదడు నుంచి నాడుల (నర్వ్స్) ద్వారా కండరాలకు వచ్చే ఆదేశాలన్నీ ఉప్పు/ఇతర లవణాలలోని అయాన్ల ద్వారానే జరుగుతుంటాయి. ఉప్పు పూర్తిగా మానేస్తే హైపోనేట్రీమియా అనే కండిషన్ వచ్చి, ఒక్కోసారి అది ప్రాణాలకే ముప్పుగా మారవచ్చు. అందుకే ఉప్పును పూర్తిగా మానేయడం సరికాదు. దానికి బదులుగా ఇంతకుముందు వాడుతున్న మోతాదులో సగం లేదా సగానికంటే తక్కువగా వాడటం మంచిదని గుర్తుంచుకోవాలి. మనం వాడే రోజువారీ ఆహారాల్లో మనకు తెలియకుండానే ఉప్పు ఉంటుంది. మనం తీసుకునే చిప్స్ వంటివీ లేదా బేకరీ పదార్థాల్లో, ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో ఉప్పు చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఉప్పుకూ బీపీ పెరుగుదలకు నేరుగా సంబంధముంటుంది. అంతేకాదు... ఆకుకూరల్లోనూ లవణాల రూపంలో ఉప్పు ఉంటుంది. ఉప్పును చాలాపరిమితంగా తీసుకోవాలి. ఒక్కమాటలో చెప్పాలంటే హైబీపీ ఉన్నవాళ్లలో ఒక వ్యక్తికి కేవలం రోజుకు రెండు గ్రాముల ఉప్పు అనే మోతాదు సరిపోతుంది.మందులు వాడుతున్నా... బీపీ నియంత్రణలోకి రాలేదంటే... ఆ పేషెంట్ మందులకు రెసిస్టెన్స్ పెంచుకోవడం వల్లనేనా? కొంతమంది బీపీ నిర్ధారణ సమయంలో ... మొదటిసారి మాత్రమే డాక్టర్‌ను కలుస్తారు. అప్పుడు డాక్టర్ రాసిన మందులనే ఏళ్ల తరబడి వాడుతుంటారు. కానీ వాటితో బీపీ నిజంగానే అదుపులోకి వచ్చిందా... లేక ఆ డోస్ సరి΄ోతోందా, లేదా... ఇలాంటి విషయాలేమీ పట్టించుకోరు. మరికొందరు తొలిసారి మందులు వాడకం మొదలుపెట్టాక... రెండో వారంలోనో లేదా పది రోజుల తర్వాతనో మరోసారి బీపీ చూసుకుని, అది తగ్గడం లేదంటూ ఫిర్యాదు చేస్తారు. ఇవన్నీ సరికాదు. అలాగే మందుల ప్రభావం తగ్గిపోయిందనే అపోహ కూడా సరికాదు. ఒకసారి బీపీ మందులు మొదలుపెట్టాక అవి పనిచేయడం ప్రారంభించి హై–బీపీ అదుపులోకి రావడానికి కనీసం 3 – 4 వారాల సమయం పట్టవచ్చు. ఇవేవీ చూడకుండానే కొందరు తాము అనుకున్నదే వాస్తవం, అదే నిజమనే అభిప్రాయానికి వచ్చేస్తారు. ఇది కూడా సరికాదు. అందుకే బీపీ మందులు వాడుతున్న వారు డాక్టర్ నిర్దేశించిన ప్రకారం... ఆయా సమయాలకు ఫాలో అప్‌కు వెళ్తుండాలి. తరచూ పరీక్ష చేయిస్తూ తమలో రక్త΄ోటు అదుపులో ఉందా లేదా అన్నది తెలుసుకుంటూ, ఒకవేళ బీపీ ఇంకా పెరిగితే దాన్ని బట్టి మందులు మార్చడం లేదా మోతాదు మార్చడం జరుగుతుంది. బీపీ అకస్మాత్తుగా పెరిగిపోతే...బీపీ అకస్మాత్తుగా పెరగడం చాలా ప్రమాదమని గుర్తించాలి. వయసు పెరుగుతున్న కొద్దీ... బీపీ విలువ నార్మల్ కంటే ఎక్కువగానే ఉంటుంది కదా! ఈ అపోహ చాలామందిలో ఉంది. ఇది చాలాకాలం పాటు రాజ్యమేలింది కూడా. వయసు పెరుగుతున్న కొద్దీ బీపీ కొద్దిగా ఎక్కువే ఉండవచ్చని తొలుత అనుకున్నారు. (వయసు + 100) అంటూ ఓ సూత్రం కూడా ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఉదాహరణకు ఓ వ్యక్తి వయసు 60 ఏళ్లు అయితే అతడి పై కొలత 160 వరకు ఉన్నా పర్లేదని అనుకున్నారు. కానీ తాజాగా ఇప్పటి లెక్కలు వేరు. ఇప్పుడు తాజాగా... పద్దెనిమిది దాటిన ఏ వయసువారికైనా బీపీ 140/90 కి పైన ఉంటే అది హైబీపీ కిందే లెక్క. తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకూ హైబీపీ వస్తుందా?తల్లిదండ్రులకు హైబీపీ ఉంటే... పిల్లలకు అది తప్పనిసరిగా వచ్చేలాంటి జన్యుపరమైన సమస్య కాదు గానీ... తల్లిదండ్రులకూ, రక్తసంబంధీకులకూ, దగ్గరి బంధువులకు అధిక రక్తపోటు ఉన్నప్పుడు... వారి వారసులకు కూడావచ్చే అవకాశాలు కాస్త ఎక్కువే. (చదవండి:

స్టెప్ టు ఫిట్..
మనలో చాలా మంది ఫిట్‌గా ఉండాలంటే కిలోమీటర్ల కొద్దీ జాగింగ్ చేయడం, గంటల తరబడి జిమ్‌కి వెళ్లడం.. కసరత్తులు చేయడం, బరువులు ఎత్తడం లేదా ఈత కొట్టడం వంటివి అవసరమని నమ్ముతారు. అయితే ఫిట్‌గా ఉండటానికి కేవలం వ్యాయామాలు మాత్రమే కాదు.. ఫిట్నెస్ ఎక్సర్‌సైజులతో పాటు డ్యాన్స్ కూడా అదే స్థాయిలో సహాయపడుతుంది. అయితే డ్యాన్స్‌లలో చాలా రకాలు ఉన్నాయి.. ఏది మంచిది అనుకోకండి.. ఏ డ్యాన్స్ చేసినా ఒక్కటే.. మరైతే ఏదైనా డ్యాన్స్ క్లాసెస్‌లో చేరాలా? అనే సందేహం రావచ్చు.. అబ్బే అదేం అవసరంలేదు.. ఏ డ్యాన్స్ క్లాస్‌లోనూ చేరకుండానే కేవలం ఇంట్లో చేసే నృత్యం ద్వారా కూడా తగినంత ఫిట్నెస్ సాధించవచ్చని తాజా అధ్యయనం స్పష్టం చేస్తోంది. రోజంతా అలసిపోయేలా పని చేసిన తర్వాత, షూస్, ట్రాక్స్ వగైరాలు ధరించి జిమ్‌కి వెళ్లడం చాలా మందికి కష్టం అనిపిస్తుంది. దీంతో గత కొంత కాలంగా నగరవాసుల్లో కూడా ఇంట్లోనే డ్యాన్స్ చేసే అలవాటు క్రమంగా పెరుగుతోందని ప్రముఖ డ్యాన్స్, ఎరోబిక్స్ శిక్షకులు బాబీ చెప్పారు. రోజువారీ ఫిట్నెస్ లక్ష్యాలను సాధించడానికి చాలామంది సులభమైన ఎంపికగా నడక లేదా జాగింగ్‌కి బదులు.. హోమ్ డ్యాన్స్ ఎంచుకుంటున్నారు. ఇది సరైనదేనని, వంటచేసేటప్పుడు రోజుకు కేవలం 20 నిమిషాల పాటు వంటగదిలో డ్యాన్స్ చేసినా అది ఫిట్‌గా ఉండేందుకు సరిపోతుందని తాజా అధ్యయనంతేల్చంది. స్టడీ ఏం చెబుతోంది.. బోస్టన్లోని నార్త్ ఈస్టర్న్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు 18 నుంచి 83 సంవత్సరాల మధ్య వయసు గల వారిని ఎంచుకుని పరీక్షించారు. పరిశోధకులు వారు ఎంత ఆక్సిజన్ ఉపయోగిస్తున్నారు? వారి గుండెలు ఎంత వేగంగా కొట్టుకుంటున్నాయి? అనే రీతిలో పలురకాల టెస్టులు నిర్వహించారు. అనంతరం వ్యాయామ తీవ్రతను కూడా పరీక్షించారు. పాల్గొనే వారందరూ సహేతుకమైన ఆరోగ్యలాభాలు అందించే శారీరక శ్రమ స్థాయికి చేరుకున్నారని ఫలితాలు చూపించాయి. ఈ అధ్యయనానికి సారథ్యం వహించిన డాక్టర్ ఆస్టన్ మెక్కల్లౌగ్ మాట్లాడుతూ ‘తమంత తాము స్వేచ్ఛగా నృత్యం చేయడం ఆరోగ్యాన్ని మెరుగుపరిచే శారీరక శ్రమకు సరిపోతుందా అని పరీక్షిస్తే.. దీనికి అధ్యయనంలో ‘అవును’ అని సమాధానం వచి్చంది. ఏ తీవ్రతతో నృత్యం చేయాలో చెప్పకుండానే ఆరోగ్యాన్ని మెరుగుపరిచే స్థాయికి అందరూ చేయగలిగారు. వారు తమ సొంత సంగీతాన్ని ఆస్వాదించారు’ అని చెప్పారు.ఫిట్నెస్ రొటీన్లో భాగంగా.. నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రకారం, ఎక్కువసేపు కూర్చోవడం లేదా పడుకోవడం నివారించాలి. ప్రతి వారం 150 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. దీనిని రోజువారీగా విభజించి ప్రతిరోజూ ఏదో ఒక కార్యాచరణ చేయాలి.. దానిలో హోమ్ డ్యాన్స్‌ను కూడా చేర్చుకోవచ్చు. ఇష్టమైన ట్యూన్లను ఎంచుకుని చేసే హోమ్ డ్యాన్స్ ఆహ్లాదకరమైన ప్రభావవంతమైన వ్యాయామం ఇది. ఫిట్నెస్ రొటీన్లో సరదా వ్యాయామాన్ని చేర్చే అద్భుతమైన మార్గం. అన్ని వయసుల, ఫిట్నెస్ స్థాయిల వారికి అందుబాటులో ఉంటుంది. గణనీయమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది అంటున్నారు నిపుణులు. ఇంటి పనులతో సైతం.. ‘బాత్రూమ్ను ఎవరు శుభ్రం చేయాలి? వంటపని ఎవరు చేయాలి? వంటి విషయాలపై తర్జనభర్జనలు పడుతున్న జంటలకు పరిష్కారాలను చూపించే మార్గం అంటున్న ప్రముఖ సల్సా టీచర్ డానియెల్లా గోమ్స్ మాట్లాడుతూ.. ‘నృత్యాలతో పాటు ఇంటి పనులను చేయడం కూడా ఆహ్లాదకరమైన, ఆనందకరమైన మంచి అనుభవం’ అని చెబుతున్నారు. ఇంట్లో రిలాక్స్డ్గా కూర్చున్న సమయంతో మొదలుపెట్టి షవర్ బాత్ చేసే సమయం వరకూ.. నచి్చనట్టుగా రిథమిక్‌గా కాళ్లూ, చేతులూ కదుపుతూ ఇంటి నృత్యాన్ని అలవాటుగా మార్చుకోవచ్చని సూచిస్తున్నారు.ఒత్తిడికి సరైన పరిష్కారం..కేవలం ప్రొఫెషన్‌గా తీసుకునేవారికే అనుకోవడం సరైంది కాదు. ఆరోగ్యం, మానసికోల్లాసం కోరుకునే ప్రతి ఒక్కరికీ నృత్యం మంచి ఎంపిక. క్లాసెస్‌కు అటెండ్ అవ్వలేని సందర్భంలో మా విద్యార్థులకు ఇంట్లో కాసేపు నృత్యం చేయమని చెబుతాం. హోమ్ డ్యాన్స్ చేసేటప్పుడు సోఫాలు, టీపాయ్.. వంటివి అడ్డుగా లేకుండా చూసుకోవాలి. డ్యాన్స్ చేయడానికి కనీసం 5/5 అడుగుల స్థలం ఉండేలా చూసుకోవాలి. అలాగే 20 నిమిషాల నృత్యం చేయాలనుకుంటే కనీసం 2 నుంచి 3 నిమిషాల పాటు మెడ, భుజాలు, నడుము.. ప్రాంతాలపై ఒత్తిడి కలిగిస్తూ చేసే తేలికపాటి వార్మప్ వ్యాయామాలు చేయాలి. మ్యూజిక్ బీట్స్‌లో తీవ్రమైన మార్పు చేర్పులు ఉండే పాటలకన్నా ఒక రిథమిక్‌గా సాగే ట్యూన్స్ ఎంచుకోవడం మంచిది. నృత్యం పూర్తయిన తర్వాత 2 నిమిషాల పాటు కూల్ డవున్ స్ట్రెచ్ వ్యాయామాలు చేయగలిగితే బెటర్. – పృధ్వీ రామస్వామి, ఆరి్టస్టిక్ డైరెక్టర్, స్టెప్స్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఇవిగో ఇలా.. ⇒ బాలీవుడ్, జుంబా లేదా ఫ్రీస్టైల్ కదలికలు అయినా, హార్ట్ బీట్ రేటును పెంచి కేలరీలను బర్న్ చేస్తాయి. ఇవి కార్డియో వ్యాయామానికి సమానం. ⇒ డ్యాన్స్‌లోని విభిన్న కదలికలు కాళ్లు, కోర్, చేతులు.. వీపుతో సహా బహుళ కండరాల సమూహాలను చైతన్యవంతం చేస్తాయి. మజిల్స్ బలోపేతం, టోనింగ్‌కి ఉపకరిస్తుంది. విభిన్న అవయవాల మధ్య సమన్వయం, చురుకుదనాన్ని మెరుగుపరుస్తుంది. ⇒ శారీరక ప్రయోజనాలకు మించి డ్యాన్స్ ఒత్తిడిని తగ్గించి మానసిక స్థితిని గణనీయంగా మెరుగుపరుస్తుంది. ⇒ నచ్చిన పాటలకు మొదలుకుని, జుంబా, హిప్హాప్, సల్సా, బ్యాలె వరకూ విభిన్న నృత్య రీతులను ఎంచుకోవచ్చు. ⇒కదలికలను గైడ్ చేయడానికి ఆన్లైన్ డ్యాన్స్ తరగతులు లేదా వీడియో ట్యుటోరియల్స్ వినియోగించవచ్చు. ⇒ఇష్టమైన సంగీతాన్ని ప్లే చేస్తూ.. జతగా స్నేహితులను లేదా కుటుంబ సభ్యులను కలుపుకోవచ్చు. సాధారణ దశలతో ప్రారంభించి నైపుణ్యంతో పాటు తీవ్రత పెంచాలి. ⇒నట్టింటి నృత్యం ఎన్నో రకాల ఉ్రత్పేరకంగా ఉంటుంది, ఎందుకంటే ఇందులో నియమాలు ఉండవు. కేవలం కదలికలు తప్ప ఇది భావోద్వేగాలను వ్యక్తపరచడంలో సహాయపడుతుంది. ఫుట్ ఫ్లెక్స్, పాయింట్, పాస్, రోండ్డిజాంబే (కాలు చుట్టూ) చైన్స్ (మలుపులు) వంటి కొన్ని సమకాలీన ప్రాథమిక అంశాలతో దీనిని స్టార్ట్ చేయవచ్చు.

డ్రాగన్‌కు ఎండ దెబ్బా..?
డ్రాగన్ ఫ్రూట్ తోటలను ఎండ దెబ్బ(సన్ బర్న్) నుంచి కాపాడుకోవటం రైతులకు ఒక సవాలు వంటిదే. పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు దాటితే డ్రాగన్ ఫ్రూట్ చెట్లకు సన్ బర్న్ ముప్పు పొంచి ఉంటుంది. సాధారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ సమస్య వస్తుంది. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అనేక దక్షిణాది రాష్ట్రాల్లో అక్కడక్కడా 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో బెంగళూరులోని భారతీయ ఉద్యాన పంటల పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) సన్‌బర్న్ దెబ్బ నుంచి డ్రాగన్ పంటను కాపాడుకోవటానికి చేసిన సూచనలను తెలుసుకుందాం.. పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్షియస్ దాటితే రాత్రి–పగటి ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం కూడా పెరుగుతుంది. ఇది కూడా చెట్టును బలహీనపరుస్తుంది. ఆకు పచ్చగా నిగనిగలాడుతూ ఉండే డ్రాగన్ మొక్కల కాండాలు అధిక రేడియేషన్ వల్ల పత్రహరితాన్ని కోల్పోయి (బ్లీచ్డ్ అప్పియరెన్స్) తెల్లబోయి కాంతి హీనంగా కనిపిస్తాయి. అటువంటప్పుడు మొక్క పెరుగుదల మందగిస్తుంది. ఆ దశలో గనక రక్షక చర్యలు తీసుకోకపోతే డ్రాగన్ మొక్కలు చనిపోయే అవకాశం ఉంది. మొక్క పశ్చిమ భాగంలోని డ్రాగన్ కాండాలకు సన్ బర్న్ నష్ట తీవ్రత 10% నుంచి 50% వరకు ఉంటుంది. కాండం కుళ్లు సోకుతుంది. ఇది విజృంభిస్తే ఏకంగా తోటలో మొక్కలన్నీటినీ రైతు నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి, సన్‌బర్న్ సమస్యను రైతులు సకాలంలో గుర్తించి, తగిన జాగ్రత్తలు పాటిస్తే డ్రాగన్ ఫ్రూట్ తోటలను ఎండల తీవ్రత నుంచి రక్షించుకోవచ్చు.పిచికారీఎండ తీవ్రత వల్ల పత్ర రంధ్రాల్లో నుంచి నీటి తేమ ఎక్కువగా వాతావరణంలోకి విడుదలవుతుంటుంది. అటువంటప్పుడు మొక్కలో నీటి శాతం తగ్గిపోతుంది. ఈ ప్రక్రియను తగ్గించగలిగే యాంటీ–ట్రాన్స్‌పైరెంట్స్‌ను పిచికారీ చేస్తే ఉపయోగం ఉంటుంది. డ్రాగన్ తోటను సన్ బర్న్ నుంచి రక్షించుకోవటానికి కోలినైట్ (లీటరు నీటికి 50 గ్రాములు) + నీమ్ సోప్ (లీటరు నీటికి 4 గ్రాములు) తో పాటు సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ను, హ్యూమిక్ యాసిడ్ (లీటరు నీటికి 4 ఎం.ఎల్.) కలిపి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో పిచికారీ చేయాలని ఐఐహెచ్ఆర్ నిపుణులు రైతులకు సూచిస్తున్నారు. సన్ బర్న్ నష్ట తీవ్రతతో పాటు శిలీంధ్ర, బాక్టీరియా తెగుళ్ల బెడదను కూడా తగ్గిస్తుందని తెలిపారు. డ్రాగన్ ఫ్రూట్ తోటలో పోల్కి 8–10 లీటర్ల నీటిని డ్రిప్ ద్వారా ఇస్తే ఎండ తీవ్రతను తట్టుకోవటానికి అవకాశం కలుగుతుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఎలుకలు కొరికేస్తున్నాయ్!డ్రాగన్ ఫ్రూట్.. ఖరీదైనది, పోషకాలతో కూడినదే కాకుండా, దీన్ని సేంద్రియంగా సాగు చేయటం కూడా సులభం. గ్రామీణప్రాంతాలతో పాటు నగరాల పరిసరప్రాంతాల్లోనూ డ్రాగన్ ఫ్రూట్ తోటలు విస్తరిస్తున్నాయి. ఇంటిపంటలు, మిద్దె తోటల్లోనూ డ్రాగన్ సాగు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో డ్రాగన్ పంటకు ఎలుకల బెడద ఎదురవుతోందని కొల్లం (కేరళ) కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు గుర్తించారు. కొల్లం జిల్లాలోని అనేకప్రాంతాల్లో డ్రాగన్‌కు ఎలుకల బెడద ఎదురవుతున్నట్లు సమాచారం రావటంతో కేవీకే భవనంపైనే ప్రయోగాత్మకంగా ఫైబర్ డ్రమ్ముల్లో డ్రాగన్ మొక్కల్ని పెంచారు. తెల్లవారుజామున 4–5 గంటల మధ్య ఎలుకలు డ్రాగన్ మొక్కల కాండం లోపలి గుజ్జును కొరికి తింటున్నట్లు సీసీ కెమెరాల్లో నమోదైంది. శరీరం కన్నా తోక ఎక్కువ ΄÷డవున్న రకానికి చెందిన ఎలుకలు ఈ పని చేస్తున్నాయని గుర్తించారు. ఎలుకలు కొరికిన కాండం ద్వారా నీరు, పోషకాల సరఫరా తగ్గిపోతుంది. దీంతో, పూత రాకపోవచ్చు. పూత వచ్చిన తర్వాత ఎలుకలు కొరికితే.. పూత, పిందెలు రాలిపోవచ్చు. అంతిమంగా, దిగుబడి తగ్గిపోతుంది.

పత్తి మానుకొని.. సిరిధాన్యాల సాగు!
ప్రధాన వాణిజ్య పంట అయిన పత్తి సాగులో, అందునా విత్తనోత్పత్తిలో నైపుణ్యం సాధించిన సీనియర్ రైతు కందిమళ్ల వేణుబాబు(52) ఆరేళ్ల క్రితం తన దృష్టిని సిరిధాన్యాల వైపు మళ్లించారు. ప్రకాశం జిల్లాకు చెందిన వేణుబాబు మూడు దశాబ్దాల క్రితం కర్నూలు జిల్లాకు వలస వచ్చి స్థానికంగా దేవాలయ భూములను కౌలుకు తీసుకొని విత్తనోత్పత్తి లక్ష్యంగా పత్తి సాగు చేస్తుండేవారు. మరో 8 మంది రైతులతో కలసి ఆంధ్రప్రదేశ్ విత్తన రైతు సేవా సంఘాన్నిప్రారంభించారు. ఈ నేపథ్యంలో తన తల్లికి కేన్సర్ వ్యాధి సోకటంతో ఆరోగ్యదాయకమైన సిరిధాన్యాల గురించి ఆలోచించారు. కర్నూలులో డాక్టర్ ఖాదర్‌వలి సభకు హాజరై సిరిధాన్యాల ఆహారంలో ఔషధ గుణాల గురించి తెలుసుకున్నారు. అప్పటికే పత్తి విత్తన రంగంలో ఎదురవుతున్న సవాళ్ల దృష్ట్యా పత్తి సాగుకు స్వస్తి చెప్పి సిరిధాన్యాల సాగు వైపు పూర్తిగా దృష్టి మళ్లించారు.32 ఎకరాల్లో సిరిధాన్యాల సాగు 2019లో తొలిసారి ఏడు ఎకరాల్లో కొర్రలు, అండుకొర్రల సాగుకు శ్రీకారం చుట్టారు. క్రమంగా సాగు విస్తీర్ణాన్ని పెంచారు. కల్లూరు మండలం పందిపాడు గ్రామంలోఒకే చోట 25 ఎకరాల దేవాలయ భూములను కౌలుకు తీసుకొని వర్షాధారంగా ఖరీఫ్‌లో సిరిధాన్యాలతో పాటు అంతర పంటగా కంది సాగు చేస్తున్నారు. నీటి సదుపాయం గల మరో 7 ఎకరాల్లో ఖరీఫ్‌లో అండుకొర్ర పండిస్తున్నారు. రెండో పంటగా కంది, దోస సాగు చేస్తున్నారు. నల్లరేగడి నేలలో ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువు వేస్తారు. వేస్ట్ డీ కంపోజర్‌ను 4 సార్లు, పుల్ల మజ్జిగను రెండు సార్లు ట్రాక్టర్ స్ప్రేయర్‌తో పిచికారీ చేయిస్తారు. 8 క్వింటాళ్ల కొర్రలతో పాటు ఎకరానికి 5 క్వింటాళ్ల కంది దిగుబడి పొందుతున్నారు. కందులతో పాటు ఎకరానికి అరికలైతే 7 క్వింటాళ్లు, సామలు 3 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వస్తోందని వేణుబాబు తెలిపారు. మిషన్‌తో పంట కోయిస్తే ఎకరానికి రూ. 10 వేలు, కూలీలతో కోయిస్తే రూ. 15 వేల వరకు సాగు ఖర్చవుతుందని ఆయన తెలిపారు.సొంతప్రాసెసింగ్ సొంతప్రాసెసింగ్ యూనిట్యూనిట్సిరిధాన్యాలను పండించి టోకుగా అమ్మటం కన్నా బియ్యంగా మార్చి రిటైల్‌గా అమ్మటం ద్వారా అధికాదాయం వస్తుందని తొలిదశలోనే గుర్తించిన వేణుబాబు రూ. 15 లక్షలతో సొంతప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. తాను పండించిన సిరిధాన్యాలతో పాటు ఇతర రైతులు పండించినవి కూడా కొని, మరపట్టించి నేరుగా వినియోగదారులకు విక్రయిస్తున్నారు. పురుగుల బెడద లేకుండా వ్యాక్యూమ్ ΄్యాకింగ్ చేసి ఆంధ్రప్రదేశ్ విత్తన రైతు సేవా సంఘం బ్రాండ్ పేరుతో మార్కెటింగ్ చేస్తున్నారు. సుమారు 3 వేల మందికి నేరుగా సిరిధాన్యాల బియ్యం, రవ్వను అమ్ముతున్నారు. సాగు చేసి అమ్మటమే కాదు కుటుంబ సభ్యులంతా చిరుధాన్యాల ఆహారమే తీసుకుంటుండటం విశేషం. ఈ ఆహారంతో తాను బరువు తగ్గి చాలా ఆరోగ్యంగా ఉన్నానని వేణుబాబు సంతోషిస్తున్నారు. వినియోగ దారుల ఆదరాభి మానాలు పొందాలంటే రాళ్లు, ఇసుక రాకుండా సిరిధాన్యాల బియ్యం, రవ్వను అందించటం చాలా ముఖ్యమన్నారు.కలెక్టరేట్లో మిల్లెట్ కేఫ్చిరుధాన్యాల వినియోగాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో రెండేళ్ల క్రితం అప్పటి జిల్లా కలెక్టర్ సృజన కలెక్టరేట్ ఆవరణలో మిల్లెట్ కేఫ్ప్రారంభానికి వేణుబాబుకు అవకాశం ఇచ్చారు. సిరిధాన్యాల భోజనంతో పాటు జావ, లడ్డూలు, మురుకులు, బ్రెడ్ తదితర ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. తమ వద్ద రోజువారీగా సిరిధాన్యాల ఆహారం తినే వారిలో 60% మంది యువతేనని ఆయన చెబుతున్నారు. క్వింటా రూ.4 వేలకు ప్రభుత్వం కొనాలిసిరిధాన్యాలకు గత ఏడాది మంచి ధర రావటంతో సాగు ఈ ఏడాది 50% పెరిగింది. గత సంవత్సరం కొర్ర ధాన్యం క్వింటా రూ. 5–6 వేలు పలికితే, ఈ ఏడాది 2,500కి పడిపోయింది. అండుకొర్రలు గత ఏడాది క్వింటా రూ. 8 వేలు పలికితే ఈ ఏడాది రూ.3,500కి పడిపోయింది. ఏ రకం సిరిధాన్యమైనా క్వింటా రూ. 4 వేలైతేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది. సిరిధాన్యాల సాగు విస్తీర్ణం స్థిరంగా పెరగాలంటే ప్రభుత్వం రూ. 4 వేల చొప్పున కొనాలిæలేదా మార్కెటింగ్ సదుపాయం కల్పించాలి. దీంతో పాటు.. మినీ హార్వెస్టర్లను రైతులకు సబ్సిడీపై అందించాలి. వీటితో రైతులే స్వయంగా పంట కోసుకోవచ్చు. మహిళలు కూడా వీటిని ఉపయోగించగలుగుతారు. సిరిధాన్యాల వినియోగం కూడా క్రమంగా పెరుగుతోంది. మా దగ్గర ఇద్దరు ఆయుర్వేద వైద్యులు రోగులకు విధిగా సిరిధాన్యాల ఆహారాన్నే సూచిస్తున్నారు. వారి కోసం అర కేజీ ΄్యాకెట్ల కిట్లను అందిస్తున్నాం. సిరిధాన్యాల సాగుకు పెట్టుబడి తక్కువ.. నికరాదాయం ఎక్కువ. పూర్తి సంతృప్తి ఉంది. మా ఇంట్లోనూ సిరిధాన్యాలనే తింటూ ఆరోగ్యంగా ఉన్నాం. – కందిమళ్ల వేణుబాబు (94408 61443), చిరుధాన్యాల రైతు, కర్నూలు – గవిని శ్రీనివాసులు, సాక్షి, కర్నూలు
ఫొటోలు
International View all

దక్షిణ కొరియాలో కూలిన ఎలివేటెడ్ హైవే
సియోల్: దక్షిణ కొరియా రాజధాని సియోల్ సమీపంలో నిర్మాణంలో ఉన

పుతిన్ నియంత కాదు: ట్రంప్
వాషింగ్టన్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ‘నియంత’

ఇంటర్నెట్ షట్‌డౌన్.. టెన్షన్
ఇంటర్నెట్ షట్డౌన్లో ఇండియా వరుసగా ఆరో ఏడాది టాప్‌లో నిలిచింది.

దూకుడు ఫలితం.. ట్రంప్ క్రేజ్‌కు బీటలు..?
వాషింగ్టన్: రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత వరుస దూక

గవర్నర్ రేసు..వివేక్ రామస్వామికి ట్రంప్ మద్దతు
వాషింగ్టన్:భారత సంతతికి చెందిన బయోటెక్ బిలియనీర్ వివేక్ర
National View all

నేడే ఆఖరి అమృత స్నానం
మహాకుంభ్ నగర్(యూపీ): కోట్లాది మంది భక్తుల శరణ ఘోష, ఆధ్యాత్

అస్సాంలో నూతన శకం
గౌహతి: ఈశాన్య ప్రాంతంలోని పవిత్ర భూమి అస్సాంలో నూతన శకం ఆరంభ

హైప్ అవసరం లేదు.. ఏది అవసరమో అది చేయండి చాలు: మమతా బెనర్జీ
కోల్ కతా: మహా కుంభ మేళాను ‘మృత్య్ కుంభ్’గా ఆరోపించారంట

భాషా యుద్ధానికి మేం సిద్ధం: తమిళనాడు సీఎం వార్నింగ్
చెన్నై: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే త్రీ లాంగ్వేజ్ ప

ఫోన్‌కు పుణ్యస్నానం..భర్తకు ప్రేమతో!
ప్రయాగ్ రాజ్: ఇప్పుడు ఏదైనా ఆన్ లైనే. ఆనాడు ఓ కవి.. కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు..
NRI View all

Hong kong: హాంకాంగ్‌లో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
హాంకాంగ్ తెలుగు సమాఖ్య అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 2025ని ఘనంగా జరుపుకుంది.

తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నా భాషే నా శ్వాస” సదస్సు విజయవంతం
డాలస్ : ఉత్తరఅమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్యవిభాగం

డా. తాడేపల్లి లోకనాథశర్మ శాస్త్రీయ సంగీతంపై ప్రత్యేక భాషణం
శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ ఆధ్వర్యంలో సింగపూర్‌లో తెలుగువారి కోసం, గానకళానిధి కలైమామణి డాక్టర్ తాడేపల్లి లోకనాథశర్మ

Canada New Visa Rules : భారతీయ విద్యార్థులు, వర్కర్లకు పీడకల!
వలసదారుల విషయంలో డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా కఠిన చర్యలు ఆ

ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ లవ్‌స్టోరీ : అందంలోనే కాదు టాలెంట్‌లోనూ!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన మద్దతు ద
క్రైమ్

ఏడు అడుగులు.. ఏడేళ్ల వివాహేతర సంబంధం?
వరంగల్ క్రైం/ఖిలావరంగల్: వైద్యుడితో ఆమె ఏడడుగులు నడిచింది.. కానీ ఏడేళ్లనుంచి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఆ వివాహేతర సంబంధమే వారి కుటుంబంలో చిచ్చురేపింది. చివరికి భర్తను చంపేయాలన్న నిర్ణయానికి వచ్చింది. వరంగల్ మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 20వ తేదీ రాత్రి జరిగిన యువ వైద్యుడు గాదె సుమంత్‌రెడ్డిపై హత్యాయత్నం కేసును విచారిస్తున్న పో లీసులకు కేసు పూర్వాపరాలు ఓ సినిమా స్టోరీని తలపించినట్లు తెలిసింది. భార్య, ప్రియుడు సూత్రధారులుగా తేల్చి అదుపులోకి తీసుకున్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన సుమంత్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రేమ వివాహం..ఆపై వివాహేతర సంబంధం కాజీపేట మండలం ఫాతిమానగర్‌లోని ఓ చర్చిలో గాదె సుమంత్‌రెడ్డి, ఫ్లోరింజాలకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు. మూడుముళ్ల బంధంతో ఒక్కటై ఏడడుగులు వేసి జీవితాన్ని ప్రారంభించిన ఆ జంట మధ్య వివాహేతర సంబంధం సమస్యలను తెచ్చిపెట్టింది. ఫోరింజ 2019లో సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలలో ఇంగ్లిష్ లెక్చరర్‌గా ఉద్యోగం సాధించింది. దానికంటే ముందు సంగారెడ్డిలో డాక్టర్ సుమంత్‌రెడ్డి ఆస్పత్రి నిర్వహించే క్రమంలో జిమ్‌కు వెళ్లిన ఆమెకు అందులో ఉద్యోగం చేసే సామేల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధంగా మారింది. ఆ తర్వాత ఆస్పత్రిని కాజీపేటకు మార్చారు. అయినా ఏడేళ్లుగా ఫోరింజ, సామేల్ మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఇటీవల విషయం సుమంత్‌రెడ్డికి తెలియడంతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. దీంతో సామేల్ .. ఫ్లోరింజలు కలిసి డాక్టర్‌ను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశారు. దీనికి సంగారెడ్డిలో ప్లాన్ చేసి, భట్టుపల్లి దగ్గరలోని అమ్మవారిపేట వద్ద అమలు చేశారు. దాడి అనంతరం పారిపోయిన నిందితులను పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. కాగా, వీరు అనేకసార్లు డాక్టర్‌పై దాడి ప్రయత్నాలు చేసి విఫలమైనట్లు తెలిసింది. ఓసారి డాక్టర్‌ను నేరుగా బెదిరించి వదిలేసినట్లు తెలుస్తోంది. స్నేహితుడి కోసం వచ్చి..ప్రియురాలు ఫ్లోరింజ కోసం హత్య చేయడానికి సిద్ధమైన సామేల్ వెంట వచ్చిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ అడ్డంగా బుక్ అయ్యాడు. సుమంత్‌పై దాడి అనంతరం ఏఆర్ కానిస్టేబుల్‌ను హైదరాబాద్‌లో వదిలేసి సామేల్ బెంగళూరు పారిపోయాడు. కాల్ డేటా అధారంగా పోలీసులు నిందితులను త్వరగా పట్టుకోగలిగారు. ప్రాణాపాయ స్థితిలో వైద్యుడు సుమంత్ వైద్యుడు సుమంత్‌రెడ్డి ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మెడ, తలకు బలమైన గాయాలు కాగా, ప్రాణపాయ స్థితిలో ఉన్నట్లు సమాచారం. కోడలిపై అనుమానం.. ఫిర్యాదు..డాక్టర్ సుమంత్‌రెడ్డిపై దాడి జరిగిన వెంటనే తల్లిదండ్రులు కోడలు ఫ్లోరింజాపై అనుమా నం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె కాల్ డేటా వివరాలను పరిశీలించారు. అందులో కొన్ని నెలలుగా గంటల తరబడి మాట్లాడుతున్న ఫోన్ నంబర్, హత్యాయత్నం జరిగిన రోజు ఎక్కడ ఉంది అని చూశారు. హత్యాయత్నం జరిగిన సంఘటన స్థలానికి మ్యాచ్ అయినట్లు సమాచారం. దీంతో సూత్రధారి అయిన భార్యను అరెస్టు చేయకుండా ఫోన్‌నంబర్ అధారంగా పోలీసులు రెండు రోజులు బెంగళూర్‌లో గాలించి నిందితుడిని అదుపులోకి తీసుకొని వరంగల్‌కు తీసుకువచ్చారు. పోలీసుల విచారణలో నేరం అంగీకరించడంతో అసలు నిందితురాలిని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో అరెస్టు చూపే అవకాశం ఉంది.

యువతిపై లైంగిక దాడి.. నిందితుడిపై కేసు నమోదు
సనత్‌నగర్(హైదరాబాద్): ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన యువతి (19) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. కొన్నేళ్ల క్రితం ఆమెకు బేగంపేట ప్రకాష్ నగర్‌కు చెందిన ఆర్యతో ఇన్‌స్ట్రాగామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారిరువురు తరచూ వ్యక్తిగతంగా కలుసుకుని మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి సదరు యువతిని తన ఇంటికి తీసుకెళ్లిన ఆర్య ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో గర్భం దాల్చిన బాధితురాలు తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయగా ఆమెపై దాడికి పాల్పడ్డాడు. అంతేగాగా ఆమె వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు తీసిన అతను తనను విడిచిపెట్టి వెళ్లాలని, లేని పక్షంలో ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్నాడు. దీంతో బాధితురాలు సోమవారం బేగంపేట పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు నిందితుడిపై

రోహింగ్యాల వ్యవస్థీకృత వ్యభిచార దందా
సాక్షి, హైదరాబాద్: మయన్మార్ నుంచి అక్రమంగా నగరానికి వలస వచ్చిన రోహింగ్యాలు వ్యవస్థీకృతంగా వ్యభిచార దందా కొనసాగిస్తున్నారు. తమ జాతీయతను దాచి పెట్టడానికి నకిలీ ఆధార్ కార్డులు తయారు చేసుకున్నారు. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పాతబస్తీతో పాటు పలు ప్రాంతాల్లో సోమవారం మెరుపు దాడులు చేశారు. 18 మందిని అదుపులోకి తీసుకుని చాదర్‌ఘాట్ పోలీసులకు అప్పగించారు. మయన్మార్ నుంచి బంగ్లాదేశ్ మీదుగా అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చిన ఈ రోహింగ్యాలు కోల్‌కతాలో నకిలీ ఆధార్ కార్డులు సంపాదించారు. వీటిని తయారు చేసి ఇచ్చిన వ్యక్తులు వారిని వెస్ట్‌బెంగాల్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన వారిగా చూపించారు. ఈ ఆధార్ కార్డుల ఆధారంగా నగరానికి చేరుకున్న వీరు పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వీరిలో పురుషులు సెకండ్ హ్యాండ్ బైకులు కొనుగోలు చేసి వాటి ఆధారంగా ట్యాక్సీ డ్రైవర్లుగా పని చేస్తుండగా... మహిళలు, యువతులు వ్యభిచార వృత్తిలో దిగారు. పరిచయస్తులతోనే ఈ దందా చేస్తున్న వారిని సంబందీకులైన పురుషులే తమ వాహనాలపై తీసుకెళ్లి కస్టమర్ల వద్ద వదిలి వస్తున్నారు. కొన్నాళ్లుగా సాగుతున్న ఈ దందాపై దక్షిణ మండల టాస్‌్కఫోర్స్‌కు సమాచారం అందడంతో సోమవారం వివిధ ప్రాంతాల్లో వరుస దాడులు చేసిన ప్రత్యేక బృందాలు మొత్తం 18 మందిని పట్టుకున్నాయి. వారి నుంచి వాహనాలు, నకిలీ గుర్తింపుకార్డులతో పాటు ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రోహింగ్యాల్లో కొందరిని చాదర్‌ఘాట్ పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది.

డాక్టర్ సుమంత్ రెడ్డిపై హత్యాయత్నం.. దారి తప్పిన భార్య కథ
సాక్షి, హైదరాబాద్ : వాళ్లిద్దరూ భార్య భర్తలు. ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. దంపతులిద్దరూ సమాజంలో గౌరవప్రదమైన డాక్టర్, లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే, లెక్చరర్‌గా విద్యాబుద్ధులు నేర్పించే భార్య పక్కదారి పట్టింది. దారుణానికి ఒడిగట్టింది. తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చేందుకు ప్లాన్ చేసింది. హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ముందస్తు ప్లాన్ ప్రకారం, అనుకున్నట్లుగా భర్త చనిపోకపోవడంతో చివరికి పోలీసులకు పట్టుబడింది. దోషిగా కటకటాల్లోకి వెళ్లనుంది.రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వరంగల్ డాక్టర్ సుమంత్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో అసలు సూత్రధారి, పాత్రదారి బాధితుడి భార్య ఫ్లోరా మరియా అని తేలడం అందర్నీ షాక్‌కు గురి చేసింది. మంగళవారం నిందితులను పోలీసులు మీడియా ఎదుట హాజరు పరిచే అవకాశం ఉన్నట్లు సమాచారం.పోలీసుల వివరాల మేరకు, డాక్టర్ సుమంత్ రెడ్డి, ఫ్లోరా మరియాలు ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కాజీపేటలో సుమంత్ క్లినిక్‌ను నిర్వహిస్తుండగా, అతని భార్య ఫ్లోరా మరియా రంగశాయిపేటలో డిగ్రీ లెక్చరర్‌గా పనిచేస్తోంది. అయితే, క్లినిక్ ప్రారంభించకముందు ఓ ఆస్పత్రిలో డాక్టర్‌గా సుమంత్ పనిచేసేవారు. ఆ సమయంలో ఫ్లోరా మరియా ఓ జిమ్‌లో చేరింది. అక్కడే ఆమెకు సామెల్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం మొదలైంది. ఆ విషయం సుమంత్‌కు తెలిసిపోవడంతో భార్య ఫ్లోరాను మందలించాడు.అయినా, ఆమె వినిపించుకోలేదు. భర్తను వద్దనుకొని, ప్రియుడే కావాలని అనుకున్న ఆమె, చివరికి భర్తను అడ్డొదగొట్టాలని అనుకుంది. ఇందుకోసం ప్రియుడు సామెల్, అతని స్నేహితుడు ఏఆర్ కానిస్టేబుల్ రాజును ఆమె పురమాయించింది. నేరం చేస్తే మట్టికి అంటకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతో భర్తను ఎక్కడ, ఎలా హత్య చేయాలో ఫ్లోరా చెప్పింది.సుమంత్‌ను చంపి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు స్కెచ్ వేసింది. ప్లాన్ ప్రకారం, యాక్సిడెంట్ ప్లాన్ విఫలమయ్యాక, ప్లాన్ బీ ప్రకారం ఈ నెల 20న రాత్రి ఖాజీపేట నుండి బట్టుపల్లి బైపాస్ రహదారిలో సమంత్ కారును అడ్డగించి, అతడిపై ఐరన్ రాడ్లతో దాడి చేశారు. చనిపోయాడనుకున్న తర్వాత నిందితులు పరారయ్యారు. కానీ చావుబతుకుల మధ్య ఉన్న బాధితుణ్ని స్థానికులు అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సుమంత్‌పై జరిగిన హత్యాయత్నంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో కట్టుకున్న భార్య ఫ్లోరా మరియా, ఆమె ప్రియుడు సామెల్, సామెల్ స్నేహితుడు ఏఆర్ కానిస్టేబుల్ రాజు నిందితులని తేలింది. మంగళవారం నిందితులను పోలీసులు మీడియా ఎదుట హాజరుపరచి, హత్యయత్నానికి సంబంధించిన వివరాలను వెల్లడించనున్నారు.