దిగ్విజయ్ దిగజారి మాట్లాడుతున్నారు: అంబటి
హైదరాబాద్: వైఎస్ జగన్‌ను ఉద్దేశించి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు అన్నారు. జగన్ తన కొడుకులాంటి వాడన్న దిగ్విజయ్..16 నెలలు జగన్ జైల్లో ఉన్నప్పుడు ఏంచేశారని ప్రశ్నించారు. చంద్రబాబు, జగన్‌ను కలిపి ఒకే గాటన కట్టేయాలని దిగ్విజయ్ చేస్తున్న యత్నం అర్ధం లేనిదన్నారు.
తన స్థాయి దిగజారి దిగ్విజయ్ మాట్లాడుతున్నారని విమర్శించారు. జగన్‌పై కుట్రలు, కుమ్మక్కు రాజకీయాలు ఇన్నిరోజులు కనిపించలేదా అని సూటిగా ప్రశ్నించారు. జగన్ తనకు కొడుకులాంటివాడని దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖ రెడ్డితో తనకు స్నేహం ఉండేదని చెప్పారు.