వంద కోట్లు సరే.. సదుపాయాలేవీ!
యూనివర్సిటీ క్యాంపస్: రాష్ట్రం నుంచి నోబెల్ బహుమతి సాధిస్తే.. ఆ శాస్త్రవేత్తకు రూ.100కోట్లు బహుమతిగా ఇస్తానంటూ ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనపై యువ శాస్త్రవేత్తలు పెదవి విరుస్తున్నారు. రూ.100కోట్లు కాదు.. ముందు ఆ మొత్తంతో ప్రయోగశాలలు, పరిశోధనా సంస్థల్లో కనీస సదుపాయాలు కల్పించాలన్నారు. సైన్స్ కాంగ్రెస్‌లో భాగంగా ఎస్వీయూలో ‘సైన్స్ అండ్ టెక్నాలజీ అచీవర్స్ మీట్’ జరిగింది. ఇస్కా జనరల్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ నారాయ ణరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఇక్రిశాట్ యువ శాస్త్రవేత్త, శాంతిస్వరూప్ భట్నాకర్ అవార్డు గ్రహీత డాక్టర్ రాజీవ్ కుమార్ వార్సిని మాట్లాడుతూ.. పరిశోధ నలు చేసేందుకు గానూ మెరుగైన ప్రయోగ శాలలు, పరిశోధనా సంస్థల్ని అందుబాటు లోకి తెస్తే నోబెల్ సాధించడం కష్టమేమీ కాదన్నారు. నోబెల్ విజేతలకు అందిస్తామన్న రూ.100 కోట్లను ఇందుకు వినియోగించాల న్నారు.
ప్రభుత్వ రంగాన్ని వదలివేసి ప్రైవేటు రంగాన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,835 మంది నోబెల్ బహుమతులు అందుకుంటే అందులో భారత సంతతికి చెందిన వారు ఐదుగురేనన్నారు. దేశం వ్యవ సాయంపై ఎక్కువగా ఆధారపడటం వల్ల పరిశోధనల్లో మన భాగస్వామ్యం తక్కువగా ఉందన్నారు. విద్యార్థులపై మార్కుల ఒత్తిడి ఎక్కువ ఉండటంతో వారు రిస్క్ తీసుకో వడం లేదన్నారు. భారత్‌లో శాస్త్ర సాంకేతిక రంగాలకు కేటాయించే నిధులు జీడీపీలో 0.8 శాతం మాత్రమేనన్నారు.