మనుగడ కోసం ‘మాఫీ’ రాగం! | Chandrababu Naidu trying to the cheat people with false statements | Sakshi
Sakshi News home page

మనుగడ కోసం ‘మాఫీ’ రాగం!

Published Tue, Jan 7 2014 1:41 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

మనుగడ కోసం ‘మాఫీ’ రాగం! - Sakshi

మనుగడ కోసం ‘మాఫీ’ రాగం!

  • విభజన వేడి పట్టించుకోని చంద్రబాబు
  •   వచ్చే ఎన్నికలను విషమ పరీక్షగా భావిస్తున్న టీడీపీ అధినేత
  •   ఎడాపెడా హామీలతో గద్దె దక్కించుకునేందుకు తపన
  •   రైతు, డ్వాక్రా రుణాల మాఫీ అంటూ మభ్యపుచ్చే ప్రయత్నం
  •   మహిళా సంక్షేమం జాడేలేని బాబు గత చరిత్ర
  •   అంగన్‌వాడీ మహిళలను గుర్రాలతో తొక్కించారు.. 
  •   మద్యనిషేధాన్ని నీరుగార్చారు.. బెల్టు షాపులు పెట్టారు..
  •   జీవోలు తెచ్చి మరీ పేదలను జైలు పాల్జేసింది ఆయనే...
  •  
     సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ‘విభజన’ వేడితో పాటు ఎన్నికల సంవత్సరం కావడంతో మరోవైపు రాజకీయ వేడీ పెరుగుతోంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికలు తన నాయుకత్వానికీ, తెలుగుదేశం పార్టీ వునుగడకూ విషవుపరీక్షగా ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. ఈసారీ ప్రజలు తనను తిరస్కరిస్తే తన రాజకీయ జీవితానికి తెరపడినట్లేనని ఆయన ఆందోళన చెందుతున్నట్టు ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే గత రెండు ఎన్నికల్లో ప్రతిపక్ష నేత పాత్రకే పరిమితమైన చంద్రబాబు ఈసారెలాగైనా అధికార పీఠాన్ని దక్కించుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు.
     
      రాష్ట్ర విభజనపై ఇప్పటికీ తన వైఖరేమిటో స్పష్టం చేయకపోవడంతో ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని తగ్గించేందుకు కూడా దోహదపడేలా ఎన్నికల హామీలు కురిపిస్తున్నారు. సందర్భమేదైనా ఎన్నికల సభను తలపిస్తూ.. అధికారమిస్తే ‘తొలి సంతకం’, ‘మలి సంతకం’ అనడంతోపాటు ముఖ్యంగా రైతులు, మహిళలపై దృష్టి పెట్టి వారిని మభ్య పెట్టేందుకు రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు పూర్తిగా రద్దు చేస్తాననీ నమ్మబలుకుతున్నారు. ఎన్నికలు సమీపించే కొద్దీ వురికొన్ని అస్త్రాలనూ బయుటికి తీసుకువచ్చే ఆలోచనలో టీడీపీ అధినేత ఉన్నారు. అయితే 2009 ఎన్నికల్లో బాబు ఇచ్చిన ఏయే హామీలనైతే ప్రజలు నమ్మకుండా ఆయన్ను తిరస్కరించారో.. వుళ్లీ అలాంటి హామీలనే ఆయన మళ్లీ ఇవ్వడం రాజకీయు పరిశీలకులను విస్మయపరుస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తాజా హామీలు, గతంలో వివిధ సంక్షేమ పథకాల విషయంలో ఆయన అనుసరించిన తీరు, ఆయన విశ్వసనీయుతపై విశ్లేషణలూ, చర్చలూ మొదలయ్యూరుు. 
     
     ఓట్ల కోసం డ్వాక్రా రాగం
     ‘పార్టీ విధానాన్ని ఎప్పటికప్పుడు అవసరాలకు అనుగుణంగా ఎలాపడితే అలా వూర్చేయుడం చంద్రబాబుకు అలవాటే. ఒక స్థిరవిధానానికి కట్టుబడి ఉండటం ఆయున నైజం కానేకాదు..’ అనే విమర్శలున్నారుు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపాదించిన ఉచిత కరెంటు  సాధ్యం కానే కాదని 2004లో కరాఖండిగా చెప్పిన చంద్రబాబే 2009కు వచ్చేసరికి తమ ఎన్నికల ప్రణాళికలో ఆ అంశాన్ని పొందుపరిచారు. అంతేకాదు అన్నీ ఉచితంగానే ఇస్తానంటూ (వివిధ పథకాల పేరిట) ఊదరగొట్టారు. తెలంగాణ అనే పదాన్నే మాట్లాడవద్దని పార్టీ నేతలను ఆదేశించిన సంగతి మరచినట్లుగా 2009లో టీఆర్‌ఎస్‌ను ఆలింగ నం చేసుకుని వుహా కూటమి కట్టారు. 2009లో నగదు బదిలీ అంటూ ఓటర్లను వల్లో వేసుకునేందుకు విఫలయత్నం చేశారు. తీరా యుూపీఏ ఆ పథకాన్ని ప్రారంభిస్తే అది సరికాదంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారు. తాజాగా రైతుల రుణాలను పూర్తిగా రద్దు చేస్తావునీ, డ్వాక్రా రుణాలను వూఫీ చేస్తావునీ చెబుతున్నారు.
     
      నిజానికి 2004కు ముందు ఆయన పాలన విధానాలను, పలు సంక్షేవు పథకాలకు ఆయున గండికొట్టిన తీరునూ ప్రత్యక్షంగా రుచిచూసిన ప్రజలు 2004లో వైఎస్‌కు బ్రహ్మరథం పట్టారు. అంతేకాదు 2009 ఎన్నికల్లోనూ ఆయన పాచికలు పారలేదు. అయినా సరే మరోసారి అలాంటి హామీలనే ఆయున నవుు్మకుంటున్నారు. బలమైన ఓటు బ్యాంకులుగా చెప్పుకునే రైతులపై, వుహిళలపై ఆయున దృష్టి పెట్టారు. కోటిమందిపైగా ఉన్న మహిళా సంఘాలకు సంబంధించిన రుణాలు రద్దు చేస్తానన్న హామీ ఆ వ్యూహంలో భాగమే. 
     
     నిజానికి రైతురుణాల వూఫీ ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా సాధ్యవునే ప్రశ్నకు ఆయున ఇప్పటికీ సంతృప్తికర సవూధానం ఇవ్వలేకపోయూరు. ఇప్పుడిక డ్వాక్రా రుణాల రద్దు అంటున్నారు. దాదాపు 20 వేల కోట్ల విలువైన డ్వాక్రా రుణాల వూఫీ సాంకేతికంగా, ఆర్థికంగా ఎలా సాధ్యవునే ప్రశ్న ఎలా ఉన్నా.. సంక్షేమ పథకాల ప్రకటనలు, అవులులో ఆయున గత చరిత్ర మాత్రం ఆయన తాజా హామీలకు విలువ లేకుండా చే స్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 
     
     వుహిళలపై ఎంత ‘ప్రేమో’
     వుహిళలపై ఇప్పుడు ప్రేవు ఒలకబోస్తున్న చంద్రబాబు నిజానికి తన పాలనకాలంలో వారి విషయంలో అవూనుష వైఖరినే ప్రదర్శించారు. వేతనాలు పెంచాలంటూ హైదరాబాద్‌లో ఆందోళన చేసిన అంగన్‌వాడీ మహిళలను గుర్రాలతో తొక్కించిన ఘటన రాష్ర్టవ్యాప్తంగా మహిళల మనస్సుల్లో చెరగని ముద్రవేసింది. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన వుద్యనిషేధాన్ని ఎత్తేసి, ఊరూరా వుద్యంప్రవాహానికి వీలుగా బెల్టు షాపులను ప్రారంభింపజేసిన బాబు ఘనతనూ మహిళలు మరిచిపోలేదు. రెండు రూపాయులకు కిలో బియ్యుం పథకం పేరుకే సార్థకత లేకుండా ఐదు రూపాయులకు పెంచిన వైనం మరో ఉదాహరణ. ఇక డ్వాక్రా రుణాలను రద్దు చేస్తానంటున్న బాబు త న హయూంలో వుహిళా సంఘాలకు ఇచ్చే రుణాలపై 14 నుంచి 16 శాతం వడ్డీని వసూలు చేశారు. 
     
     మహిళలు వడ్డీ చెల్లించలేని నిస్సహాయ పరిస్థితిలో ఉంటే వారి ఇళ్ల నుంచి వస్తువులను బలవంతంగా తీసుకెళ్లి వారితో కంటతడి పెట్టించిన సంఘటనలూ కోకొల్లలు! ఇక వితంతు, వృద్ధాప్య పింఛన్ల విషయుంలో.. గ్రావుంలో పింఛన్‌దారు ఎవరైనా వురణిస్తే తప్ప కొత్తవారికి ఇవ్వకపోవడవునే అవూనవీయు ధోరణిని ఆయున ప్రదర్శించారు. ఆ అరకొర పింఛన్లనూ ఏ 3 లేదా 4 నెలలకోసారి జరిగే గ్రావుసభల్లో ఇవ్వడవుూ, వుహిళలు కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూడటమూ సర్వసాధారణ ప్రక్రియగా సాగింది. కొన్ని లక్షల కొత్త దరఖాస్తులు ఆమోదం కోసం ఎదురుచూసేవి. పింఛన్ల కోసం ఏళ్లకొద్దీ ఎదురుతెన్నులు చూసిన మహిళలు తాజాగా బాబు ఇస్తున్న హామీలను గుర్తుతెచ్చుకొనక మానరని అంటున్నారు. 
     
     ఉచితానికి వ్యతిరేకం.. ఇదే బాబు అసలు సూత్రం
     అవసరాన్ని బట్టి చంద్రబాబు ఏ హామీ ఇచ్చినా.. చంద్రబాబు వలిక రాజకీయు సూత్రం వూత్రం ఉచితానికి వ్యతిరేకం! తను అధికారంలో ఉన్నప్పుడు అచ్చు ఓ ప్రపంచబ్యాంకు ప్రతినిధిలాగే వూట్లాడిన ఆయున రాష్ట్రంలోని పేదల వాస్తవ స్థితిగతులను ఎప్పుడూ పరిగణనలోకి తీసుకున్న దాఖలాలే లేవు. తన వలిక రాజకీయు సూత్రాలను పొందుపరుస్తూ ఆయున ‘వునసులో వూట’ పేరిట ఓ రాజ్యాంగాన్నే రచించుకున్నారు. దానిపై ఎన్ని వివుర్శలు వచ్చినా ఆ పుస్తకంలోని అంశాలను ఆయున ఎప్పుడూ ఖండించలేదు. ‘‘నేను గ్రామాల్లోకి వెళ్లి ప్రజలకు మళ్లీ మళ్లీ చెప్పాను. ఉచిత విద్యుత్తు కావాలో, నిరంతర విద్యుత్తు సరఫరా కావాలో ఎంచుకొమ్మని. వాళ్లు అర్ధం చేసుకున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా 13 రాష్ట్రాలు ప్రభుత్వ రవాణా రేట్లు పెంచాయి. 11 రాష్ట్రాలు విద్యుత్తు చార్జీలు పెంచాయి. ఉచిత విద్యుత్తును అందించిన కొన్ని ప్రభుత్వాలు ఓడిపోయాయి’’ అంటూ ఆ పుస్తకంలో రాసుకున్నారు. తన ప్రభుత్వ ఉచిత వ్యతిరేక విధానం సరైనదేనని ఘనంగా చెప్పుకొన్నారు. సబ్సిడీలు ఇవ్వటమంటే పులిమీద స్వారీ చేయటం లాంటిదేనని, ఉచిత సేవల కాలం పోయిందని- ప్రజల నుంచే డబ్బు సేకరించాలని, ప్రభుత్వోద్యోగుల జీతభత్యాల పెంపు, పింఛన్ల పెరుగుదల వల్ల ప్రభుత్వాలు అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితి వస్తుందని ఆయున చెప్పుకున్నారు. 
     
     పేదలను జైల్లో పెట్టిన దుర్మార్గపు జీవోలు!
     నిజానికి చంద్రబాబు తన పేదల వ్యతిరేక వైఖరిని ఎప్పుడూ దాచుకోలేదు. రైతులతో సహా వేలాది వుంది పేదలను జైలుపాలు చేసేలా ఆయనిచ్చిన రెండు జీవోలే దీనికి పక్కా ఉదాహరణ. చిన్నాచితకా కరెంటు చోరీ నేరాలకూ భారీ శిక్షలు విధించి, కటకటాల వెనక్కి నెట్టిన ఆ జీవోల నంబర్లు 89, 99. వీటిని కరెంటు చార్జీలను అడ్డగోలుగా పెంచేసిన 2000 సంవత్సరంలోనే తీసుకొచ్చారు. 
     
     కరెంటు అక్రవు వాడకంపై కనీసం మూడేళ్ల జైలు, గరిష్టంగా ఐదేళ్లు... 50 వేల వరకూ జరినామా వేసేలా ఆ ఉత్తర్వుల్లో పొందుపరిచారు. ఈ ఉత్తర్వులు అమలు చేయడానికి ప్రత్యేక కోర్టును సైతం ఏర్పాటు చేశారు. వీటి ఆధారంగా చంద్రబాబు హయాంలో దాదాపు 80 వేల మంది పేదలు, రైతులను జైలుపాల్జేశారు. సాగు గిట్టుబాటు కాని దుర్దినాలకు తోడు ఈ వే ధింపులు తోడై వేలాది వుంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే.... పరిహారాల కోసం ప్రాణాలు తీసుకుంటున్నారంటూ చంద్రబాబు పరిహాసమాడారు. అలాంటి బాబు ఇప్పుడు రైతులు, మహిళలపై ప్రేమ ఒలకబోస్తూ ఆచరణకు నోచని హామీలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement