కర్నూలు లేదా దొనకొండను రాజధాని చేయాలి
హైదరాబాద్ : సిటిజన్స్ ఫోరం ప్రతినిధులు మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అన్ని ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలని వారు ఈ సందర్భంగా వైఎస్ జగన్కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సిటిజన్స్ ఫోరం ప్రతినిధులు వినతిపత్రం అందచేశారు.
భేటీ అనంతరం సిటిజన్స్ ఫోరం ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలుని, లేకుంటే ప్రకాశం జిల్లా దొనకొండను రాజధాని చేయాలన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా రాయలసీమ, కోస్తాంధ్ర అన్ని ప్రాంతాలకు ఆమోదయోగ్యమైన రాజధాని ఉండాలని నిన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఇదే అంశంపై కలిసి చర్చించామన్నారు. వైఎస్ జగన్తో ఇదే అంశాన్ని ప్రస్తావించామన్నారు. తమ డిమాండ్స్పై జగన్ సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు.