రైతును తొక్కి చంపిన ఏనుగులు | elephants attack on farmer | Sakshi
Sakshi News home page

రైతును తొక్కి చంపిన ఏనుగులు

Published Fri, Dec 19 2014 7:05 PM | Last Updated on Thu, Jul 11 2019 6:30 PM

రైతును తొక్కి చంపిన ఏనుగులు - Sakshi

రైతును తొక్కి చంపిన ఏనుగులు

చిత్తూరు:ఏనుగుల దాడిలో అటవీశాఖ లైన్‌వాచర్ మృతి చెందిన ఘటన మరువకముందే మరో దారుణం చోటు చేసుకుంది. వీ కోట మండలం కారగల్లు మరో రైతు శుక్రవారం మృత్యువాత పడ్డాడు. చంద్రానాయుడు అనే రైతు పొలంలోకి ఏనుగులను తరుముతుండగా ఈ విషాదం సంభవించింది.

(అటవీ ఉద్యోగిని చంపిన ఏనుగు)

గురువారం రామకుప్పం సమీపంలోని ననియూల అటవీ ప్రాంతంలో ఏనుగుల దాడిలో లైన్ వాచర్ మునెప్ప మృతిచెందిన విషయం తెలిసిందే. ననియాల గ్రామానినికి సమీపంలోని పొలం వద్దకు ఏనుగుల గుంపు రావడంతో ఒక్కసారిగా అవి జనంపై తిరగబడ్డాయి.
 అందరూ ఏనుగుల దగ్గరి నుంచి తప్పించుకుని బయటపడ్డా.. లైన్ వాచర్ మునెప్ప మాత్రం ఏనుగుల బారిన పడి మృతి చెందాడు.వరసుగా రెండు ఇదే తరహా ఘటనలు చోటు చేసుకోవడం జిల్లాలో ఆందోళన రేకెత్తిస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement