
వైఎస్ఆర్ సీపీలో చేరిన గంగుల ప్రభాకర్ రెడ్డి
హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీలోకి వలసలు జోరందుకున్నాయి. బుధవారం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ టీడీపీ ఇంఛార్జ్ గంగుల ప్రభాకర్ రెడ్డి పార్టీలో చేరారు. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన తన అనుచరులతో కలసి పార్టీలో చేరారు. వైఎస్ జగన్ కండువా కప్పి గంగులను పార్టీలోకి ఆహ్వానించారు. కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ సీపీ బలోపేతానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొప్పన మోహన్ రావు మంగళవారం వైఎస్‌ఆర్ సీపీలో చేరిన సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ కండువా కప్పి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు.