పి.నారాయణ
విజయనగరం: నీటిపన్ను సహా ఇతర చార్జీల పెంపుదలపై పురపాలక సంఘాలదే నిర్ణయం అని ఏపి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ చెప్పారు. దీనిలో ప్రభుత్వం జోక్యం ఉండదన్నారు. విజయనగరం జిల్లాలో ఎయిర్‌పోర్టు, గిరిజన విశ్వవిద్యాలయం, మరో రాష్ట్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
మున్సిపాలిటిలలోని ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధికి 50 వేల కోట్ల రూపాయల కేంద్రం నిధులు మంజూరైనట్లు తెలిపారు. రుణమాఫీపై స్పష్టమైన తేదీని ఇప్పుడే ప్రకటించలేమని మంత్రి నారాయణ చెప్పారు.