'నీతులు కాదు.. సమాధానం చెప్పండి' | Gowru Venkat Reddy, YSRCP MLA Isaia Condemn Nandyal TDP Attack | Sakshi
Sakshi News home page

'నీతులు కాదు.. సమాధానం చెప్పండి'

Published Thu, Aug 24 2017 4:42 PM | Last Updated on Tue, May 29 2018 3:48 PM

'నీతులు కాదు.. సమాధానం చెప్పండి' - Sakshi

'నీతులు కాదు.. సమాధానం చెప్పండి'

సాక్షి, కర్నూలు: నంద్యాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు టీడీపీ నేతలు ఎంతకైనా దిగజారుతున్నారని వైఎస్సార్‌ సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత నెల రోజులుగా నంద్యాలలో అధికార పార్టీ నాయకులు రౌడీ రాజ్యాన్ని తీసుకొచ్చారని దుయ్యబట్టారు. నంద్యాల ఉప ఎన్నికలో ఓటమిని తప్పించుకునేందుకు దాడులు చేస్తున్నారని ఆరోపించారు.

వేట కొడవళ్లతో దాడులకు దిగడం పిరికిపంద చర్య అని నందికొట్కూరు వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే  ఐజయ్య అన్నారు. రౌడీయిజం గురించి సీఎం చంద్రబాబు నీతులు చెబుతారని, నంద్యాల కాల్పుల ఘటనపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement