
‘ఎవరినీ వదలిపెట్టం, అందరి భరతం పడతాం’
విశాఖపట్నం: అధికార అండతో టీడీపీ నాయకులు విచ్చలవిడిగా భూములు కబ్జా చేశారని వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ఆరోపించారు. వైఎస్సార్ సీపీ ‘సేవ్ విశాఖ’ పేరుతో గురువారం చేపట్టిన మహాధర్నాలో ఆయన మాట్లాడారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక భూకబ్జాదారులెవరినీ వదిలిపెట్టబోమని, అందరినీ జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.
పేదలను భూములను టీడీపీ నేతలు కొల్లగొట్టారని వైఎస్సార్ సీపీ నాయకుడు కరణం ధర్మశ్రీ ఆరోపించారు. పక్కా వ్యూహంతో ప్రకారం భూములు కబ్జా చేసి తమ బినామీలకు కట్టబెట్టారని అన్నారు. చోడవరం నియోజకవర్గంలోనూ కబ్జాలకు పాల్పడ్డారని తెలిపారు.
అధికార టీడీపీ నాయకులు లక్ష ఎకరాల భూములు చట్టవిరుద్ధంగా ఆక్రమించారని వైఎస్సార్ సీపీ నేత మల్లా విజయప్రసాద్ ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతామని హామీయిచ్చారు.