108 సిబ్బందితో జీవీకే చర్చలు సఫలం | GVK meetings success with108 employees | Sakshi
Sakshi News home page

108 సిబ్బందితో జీవీకే చర్చలు సఫలం

Published Fri, Aug 23 2013 6:49 AM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM

GVK meetings success with108 employees

సాక్షి, హైదరాబాద్: వేతనాలు పెంచాలని, 12 గంటల పని నుంచి ఎనిమిది గంటలకు కుదించాలని గత 35 రోజులుగా సమ్మె చేస్తున్న 108 కాంట్రాక్టు సిబ్బందితో జీవీకే- ఈఎంఆర్‌ఐ యాజమాన్యం జరిపిన చర్చలు ఎట్టకేలకు ఫలించాయి. కార్మిక శాఖ అదనపు కమిషనర్ సూర్యప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం ఇరువర్గాల మధ్య చర్చలు జరిగాయి.

 

సిబ్బంది డిమాండ్లలో పనిగంటల విషయంలో తామేమీ మాట్లాడలేమని, ఉద్యోగుల వేతనాలను మాత్రం ఏడాదికి రూ.కోటీ 20 లక్షలకు పెంచుతామని జీవీకే యాజమాన్యం అంగీకరించింది. దీని ప్రకారం ఒక్కో ఉద్యోగికి నెలకు దాదాపు రూ.300 మేర వేతనం పెరగనుంది. తొలగించిన 336 మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు, ఉద్యోగులపై పెట్టిన కేసులు ఎత్తి వేసేందుకు కూడా అంగీకరించడంతో 108 సిబ్బంది సమ్మె విరమిస్తున్నట్లు యూనియన్ నాయకులు ప్రకటించారు. 24 గంటల్లోగా విధుల్లో చేరాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement