రాయల తెలంగాణ అంటే ఉద్యమ బాటే.. It's impossible of rayala telangana formation | Sakshi
Sakshi News home page

రాయల తెలంగాణ అంటే ఉద్యమ బాటే..

Published Sat, Nov 9 2013 3:48 AM

It's impossible of rayala telangana formation

రాయల తెలంగాణలో ఇబ్బందే...
 ‘విధులను పక్కన పెట్టాం... జీతాల కోసం ఆలోచించలేదు. ఎమర్జెన్సీ పనులు ఆపలేదు. కానీ తెలంగాణ ఉద్యమంలో మా ఉద్యోగులు ముందున్నారు. అత్యంత ఎమర్జెన్సీ శాఖ అ యినప్పటికీ... తెలంగాణ ఉద్యమంలో సత్తా చాటాం. వి ద్యుత్ రంగంలో మేం తయారు చేసిన నివేదికలే ఈరోజు జీఎంఓ చర్చల్లో ఉన్నాయి. మేం ఇచ్చిన రిపోర్టులే అన్ని పా ర్టీలకు ఆధారమవుతున్నాయి. ఇప్పుడు రాయల తెలంగాణ అంటే విద్యుత్ వినియోగంలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కర్నూల్, అనంతపూర్‌లో ఒక్క విద్యుత్ ప్రాజెక్టు లేదు. శ్రీశైలం లెఫ్ట్ కెనాల్‌లో ఉత్పత్తి చేస్తున్నా... అది కేవలం కొన్ని రోజులకే పరిమితం. ఒక్క ప్రాజెక్టు కూడా లేని రెండు జిల్లాలను కలిపి రాయల తెలంగాణ అంటే ఒప్పుకోం.
 తెలంగాణలో విద్యుత్ లోటే ఉండదు...
 రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రాంతానికి విద్యుత్ లోటు ఉంటుందని కట్టుకథలు చెబుతున్నారు. వాస్తవంగా తెలంగాణలో ఉన్న అన్ని రకాల వనరులతో 13 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది. దీనికి కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తే చాలు. ప్రస్తుతం 8,300 మెగావాట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నాం. దీనిలో 2,500 నుంచి 3,000 ఎంయూల లోటు ఉంటోంది. కానీ... రామగుండంలో అల్ట్రా సూపర్ ప్రాజెక్టు నిర్మిస్తే... 4000 ఎంయూల విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చు. అదే విధంగా భూపాలపల్లి, నిజామాబాద్, ఖమ్మం ప్రాంతాల్లో కొత్త విద్యుత్ ప్లాంట్లను అందుబాటులోకి తీసుకురావచ్చు. వీటిని నిర్మిస్తే... ఇతర రాష్ట్రాలకు విద్యుత్‌ను విక్రయించవచ్చు. ఏటా వినియోగిస్తున్న విద్యుత్‌కు మరో ఏటా 8 నుంచి 10 శాతం ఎక్కువ వాడుకుంటాం. అలా వాడుకున్నా... లోటు అనేది ఉండదు.
 వ్యవసాయానికి ఢోకా లేదు...
 ప్రస్తుతం ఒక్కో యూనిట్ విద్యుత్‌కు రూ  6 నుంచి రూ 18 వరకు వెచ్చించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ... ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు ఇప్పటి వరకు ప్రతిపాదనల్లో ఉన్న ప్రాజెక్టులన్నీ నిర్మాణం చేస్తే... సరిపడా విద్యుత్ ఉంటుంది. అప్పుడు ఉత్పత్తి ధరలను బట్టి బిల్లులు తగ్గే అవకాశాలుంటాయి. ఇక వ్యవసాయ రంగానికి నిరంతరా యంగా విద్యుత్ సరఫరా చేసే అవకాశం ఉంది. ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిరంతరంగా వ్యవసాయానికి విద్యుత్ సప్లై చేయవచ్చు. సోలార్ విద్యుత్ ఉత్పత్తికి కూడా తెలంగాణ ప్రాంతంలో చాలా అవకాశాలున్నాయి. సరిపడా భూములున్నాయి. కేంద్రం తన వంతు సాయం చేస్తే చాలు.’

Advertisement
 
Advertisement
 
Advertisement