టిడిపి చరిత్రాత్మక తప్పిదం
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ చరిత్రాత్మక తప్పిదం చేస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. తమతో పొత్తుకు ఎందుకు సిద్ధమయ్యారని ఆయన ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని ప్రశ్నించారు. తాము ఇప్పటి వరకు పొత్తు విషయమై ఏ పార్టీతో చర్చలు జరపలేదని చెప్పారు.
రాష్ట్రంలోని 42 లోక్సభ, 294 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. రేపు జరిగే రాష్ట్ర స్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ బిల్లుపై చర్చకు అందరూ సహకరించాలని కిషన్ రెడ్డి కోరారు.