'ఆరేళ్ల నుంచి ఉదయ్ కిరణ్తో మాటలు లేవు' | No Financial difficulties to Actor Uday Kiran, says his father | Sakshi
Sakshi News home page

'ఆరేళ్ల నుంచి ఉదయ్ కిరణ్తో మాటలు లేవు'

Published Mon, Jan 6 2014 9:15 AM | Last Updated on Sat, Sep 2 2017 2:21 AM

'ఆరేళ్ల నుంచి ఉదయ్ కిరణ్తో మాటలు లేవు'

'ఆరేళ్ల నుంచి ఉదయ్ కిరణ్తో మాటలు లేవు'

హైదరాబాద్: తన కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని ఉదయ్ కిరణ్ తండ్రి వివికే మూర్తి అన్నారు. కుమారుడి మరణవార్త విని ఆయన దిగ్భాంతికి గురయ్యారు. ఉదయ్ కిరణ్ మరణవార్తను ఆయనకు 'సాక్షి' తెలియజేసింది. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య వెనుక ఏదో బలమైన కారణం ఉందన్నారు. హైదరాబాద్లో అతడికి కోట్ల రూపాయలు ఆస్తులున్నాయని తెలిపారు. చనిపోయి చేసేది ఏమీ లేదని బతికివుంటే ఎప్పటికైనా జీవితంలో పైకి రావొచ్చని అన్నారు.

అయితే ఆరేళ్ల నుంచి ఉదయ్ కిరణ్తో మాటలు లేవని మూర్తి వెల్లడించారు. అతడి ఆస్తిని దుర్వినియోగం చేస్తున్నాననే అనుమానంతో తనను దూరం పెట్టాడని తెలిపారు. అప్పటి నుంచి తనకు దూరంగా ఉంటున్నాడని చెప్పారు. పెళ్లి చేసుకున్నట్టే తనకు చెప్పలేదన్నారు. తనకు తెలినంతవరకు అతడికి ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదన్నారు. విదేశాల నుంచి తన కూతురు రాగానే ఉదయ్ కిరణ్ మృతదేహాన్ని చూడడానికి వెళతానని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement