'టీడీపీలో ఉన్నానో, లేనో తెలియడం లేదు' | no invitation for tdp meeting, says nandamuri harikrishna | Sakshi
Sakshi News home page

'టీడీపీలో ఉన్నానో, లేనో తెలియడం లేదు'

Published Mon, Feb 24 2014 4:18 PM | Last Updated on Fri, Aug 10 2018 8:01 PM

'టీడీపీలో ఉన్నానో, లేనో తెలియడం లేదు' - Sakshi

'టీడీపీలో ఉన్నానో, లేనో తెలియడం లేదు'

హైదరాబాద్: తాను టీడీపీలో ఉన్నానో, లేనో తెలియని అయోమయ పరిస్థితి నెలకొందని నందమూరి హరికృష్ణ వాపోయారు. ఎన్టీఆర్ భవన్లో ఈ రోజు జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి తనకు ఆహ్వానం అందలేదని తెలిపారు. సమైక్యాంధ్ర కోసం ఎంపీ పదవికి రాజీనామా చేసినందువల్లే తనను పార్టీ కార్యక్రమాలకు పిలవడంలేదన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. పార్టీకి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని మీడియా ద్వారా తెలుసుకోవాల్సిన దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవల పార్టీ నిర్వహించిన కార్యక్రమాలకు హరికృష్ణను ఆహ్వానించలేదు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినప్పటి నుంచి హరికృష్ణ, చంద్రబాబు నాయుడుకు మధ్య దూరం పెరిగింది. సమైక్యాంధ్ర కోసం ఎంపీ పదవిని వదులుకున్న హరికృష్ణకు మరోసారి రాజ్యసభకు వెళ్లే అవకాశం కల్పించకపోవడంతో ఉద్దేశపూర్వకంగా ఆయనను పక్కనపెట్టారని స్పష్టమయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement