తెనాలి- గన్నవరం మధ్య ఔటర్ రింగ్రోడ్డు
తెనాలి, ఇబ్రహీంపట్నం, విజయవాడ, గన్నవరం పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తామని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఇందుకు సుమారు 6 లక్షల ఎకరాల భూమి అవసరం అవుతుందన్నారు. రాజధాని సలహా కమిటీ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 22 నుంచి 26 వరకు సింగ్‌పూర్, పుత్రజయలో పర్యటిస్తామని, అలాగే వచ్చే నెల 5 నుంచి 9వరకు చైనాలోని కుజో, షాంజో నగరాల్లో పర్యటిస్తామని ఆయన తెలిపారు.
మన దేశంలోని చండీగఢ్, గాంధీనగర్, నయారాయ్‌పూర్‌లో పర్యటించామని, అన్ని ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారని నారాయణ చెప్పారు. ఏపీ రాజధాని నగరాన్ని కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోనే ఏర్పాటు చేస్తామని, దీనికి కనీసం 12,500 ఎకరాల భూమి అవసరమని అంచనా వేస్తున్నామని అన్నారు. భూములు గుర్తించాల్సిందిగా కృష్ణా-గుంటూరు జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని ఆయన తెలిపారు. ల్యాండ్ పూలింగ్‌లో రైతులకు ఎంత భూములివ్వాలో ఇంకా నిర్ణయించలేదన్నారు. రాజధానుల్లో చండీగఢ్ మోడల్ చాలా బాగుందని మంత్రి నారాయణ చెప్పారు.