అందుకే ఆయన సేవలో..!

Ramesh Kumar and His Daughter Sharanya Got Key Positions In Chandrababu Govt  - Sakshi

నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవి..

ఆయన కుమార్తెకు ఆర్థికాభివృద్ధి మండలిలో అసోసియేట్‌ డైరెక్టర్‌ హోదా

సాక్షి, అమరావతి: వడ్డించే వాళ్లు మనోళ్లైతే.. అన్నట్లుగా ఉంది చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో చేపట్టిన నియామకాలు చూస్తుంటే. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ స్థానిక ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేస్తూ ఆదివారం తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో.. రమేష్‌కుమార్‌కు, ఆయన కుమార్తెకూ చంద్రబాబు తన హయాంలో కీలక పదవులు కట్టబెట్టడం ఇప్పుడు తెరమీదకు వచ్చి అధికార వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఎందుకంటే..

- 2016లో నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించిన చంద్రబాబు.. ఆయన కుమార్తె శరణ్యను ఆర్థికాభివృద్ధి మండలిలో అసోసియేట్‌ డైరెక్టర్‌గా నియమించారు. 
ఈమెకు ఏకంగా నెలకు రూ.2 లక్షల వేతనం చెల్లించారు.
- ఆర్థికాభివృద్ధి మండలిలో ఉద్యోగం అంటేనే విలాసాలతో కూడుకున్నదని అందరూ అనుకుంటుంటారు.
అందుకు తగ్గట్టుగానే ఆమె కూడా తరచూ విదేశీ పర్యటనలకు వెళ్లడం, స్టార్‌ హోటళ్లలో బస చేయడం.. ఇష్టం వచ్చినప్పుడు ఆఫీసుకు రావడం.. ఆమె వ్యవహారశైలి చూసి అప్పట్లో సీనియర్‌ అధికారులు ముక్కున వేలేసుకునే వారు.
- నిమ్మగడ్డతో ఉన్న అనుబంధం కారణంగానే చంద్రబాబు ఇలా చేశారని ఇప్పుడు అన్ని వైపుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి.
ఇలా.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్, ఆయన కుమార్తెకు చంద్రబాబు మేలు చేయడంతో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బాబు చెప్పినట్లు ఆయన నడుచుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో శరణ్య రాజీనామా చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top